హ్యూమన్ జూ
సాధారణంగా పిల్లల సంతోషం కోసం వారాంతాల్లో వారిని సరదాగా జూకు తీసుకెళుతుంటాం కదా! అక్కడున్న జంతువులను చూసి పిల్లలు సంబర పడిపోతుంటే మనకూ సంతోషంగా ఉంటుంది. సరిగ్గా అలాంటి తరహా జూనే 20వ శతాబ్దం ప్రారంభంలో కూడా ఉండేది. ఈ ఫొటోల్లో కనిపించేది అలాంటి ఒక జంతు ప్రదర్శన ప్రదేశమే. మరి జంతువులు లేకుండా జూ ఏంటి అనుకుంటున్నారా? ఎన్‌క్లోజర్లలలో కనిపిస్తున్న ఈ నల్ల జాతీయులే ఇక్కడి జంతువులు.
తెల్లజాతీయులకు ఇదొక జంతు ప్రదర్శన స్థలం. దీనిని వారు ‘హ్యూమన్ జూ’ అని పిలుస్తారు. నల్ల జాతీయులు, ఆసియా ప్రజలను అత్యంత క్రూరంగా ఆ జూలో బంధించి, వారిని పర్యాటకులకు ప్రదర్శించేవారు. అంతేకాదు ఈ విధంగా నల్ల జాతీయులను జూలలో పెట్టడం అనాదిగా వస్తున్న సంప్రదాయంగా తెల్లజాతీయులు భావించేవారు. ఎంతోమంది అమెరికన్లు, యూరప్‌వాసులు ఈ జూలను సందర్శించి రాక్షాసానందం పొందేవారు. అప్పట్లోని రెండు భిన్న సంస్కృతులకు ఉన్న వైరుధ్యాన్ని ఈ చిత్రాలు చెప్పకనే చెబుతున్నాయి.