లంగర్‌హౌస్: కుటుంబానికి చేదోడుగా ఉంటానని ఓ మహిళను నాలుగో పెళ్లి చేసుకున్న ప్రబుద్ధుడు ఆమె కూతుళ్లను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. లంగర్‌హౌస్ ఇన్‌స్పెక్టర్ రఘుకుమార్ తెలిపిన మేరకు.. లంగర్‌హౌస్ ఎండీలైన్స్ లో నివాసముండే సయ్యద్ జుబేది(44) ఐటీ ఉద్యోగి. ఇతను గతంలో ఇద్దరు మహిళలను వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య చనిపోగా మరో భార్య విడాకులు తీసుకొని వెళ్లిపోయింది.
తరువాత మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత లంగర్‌హౌస్‌లో నివాసముండే ఇఫాతియా బేగంతో పరిచయం పెంచుకున్నాడు. ఆమె భర్త చనిపోగా ఆమెకు 18, 16 సంవత్సరాల వయసున్న ఇద్దరు కూతుళ్లున్నారు. కుటుంబానికి ఆసరాగా ఉంటానని నమ్మించి, మూడో భార్యను కూడా ఒప్పించి ఇఫాతియా బేగంను 2019లో పెళ్లి చేసుకున్నాడు. అయితే గురువారం రాత్రి బయటకు వెళ్లిన ఇఫాతియా ఇంటికి తిరిగి రాగా ఆ సమయంలో కూతుళ్లతో సయ్యద్ అసభ్యంగా ప్రవర్తిస్తుండటం గమనించి లంగర్‌హౌస్ పోలీసులను ఆశ్రయించింది.
పోలీసులు ఫిర్యాదు స్వీకరించి ఆమె కూతుళ్లను భరోసా కేంద్రానికి తరలించారు. వివరాలు సేకరించగా.. సయ్యద్ జుబేది గత కొద్ది నెలలుగా ఇద్దరు కూతుళ్లపై లైంగిక దాడిచేసినట్లు తెలిసింది. ఈ విషయం బయటకు చెబితే తల్లిని వదిలేస్తానని, మీరు రోడ్డున పడతారని బెదిరించేవాడని చెప్పారు. పోర్న్ వీడియోలు బలవంతంగా చూపిస్తూ తనతో అలా గడపాలని వేధించినట్లు విచారణలో తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment