నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి బెదిరింపులు
డబ్బులు వసూలు ∙ఇద్దరు కి‘లేడీ’ల అరెస్ట్
అడ్డగుట్ట : వాహనదారులను లిఫ్ట్ అడిగి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు మహిళలను లాలాగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ రఘు బాబు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మల్కాజ్‌గిరి ప్రాంతానికి చెందిన భాగ్య, సఫీల్‌గూడకు చెందిన వెన్నెల బంధువులు. గత కొంతకాలంగా వీరు వాహనాలపై వెళ్తున్న వారిని లిఫ్ట్ అడిగి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. సదరు వాహనదారుడు డబ్బులివ్వకపోతే తమపై లైంగికదాడికి యతి్నంచాడని కేసు పెడతామని బెదిరించి డబ్బులు లాక్కునే వారు.
నవంబర్ 6న సాయంత్రంజెన్‌కోలో పని చేస్తున్న వ్యక్తి బైక్‌పై నాగారంలోని తన ఇంటికి వెళ్తున్నాడు. తార్నాక బస్టాండ్ వద్ద నిలుచుని ఉన్న భాగ్య అతడిని లిఫ్ట్ అడిగింది. లాలాపేటలోని జీహెచ్‌ఎంసీ గ్రౌండ్ వద్దకు తీసుకెళ్లి డబ్బులు డిమాండ్ చేసింది. అతను డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించగా తనను బలవంతం చేసి ఇక్కడికి తీసుకొచ్చావని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించి ఫోన్‌పే ద్వారా రూ. 95 వేలు బదిలీ చేయించుకుంది. అనంతరం అతడితో పాటు కుషాయిగూడకు వెళ్లి ఏటీఎం ద్వారా రూ. 55 వేలు విత్‌డ్రా చేయించి లాక్కుంది.
అంతే కాకుండా ఈ నెల 3న ఆమె తన బంధువు వెన్నెలతో సదరు వ్యక్తికి ఫోన్ చేయించి డీటీడీసీ కొరియర్ వచి్చందని, కుషాయిగూడ డీమార్ట్ వద్దకు వచ్చి తీసుకెళ్లమని కోరింది. ఆమె మాటలు నమ్మి అక్కడికి వెళ్లిన అతడిని వారిద్దరు మళ్లీ బెదిరించి రూ. 1.7లక్షలు వసూలు చేశారు. సదరు వ్యక్తిని టార్గెట్ చేసిన వీరు ఈ నెల 23న అతని ఇంటి వద్ద రెక్కీ నిర్వహిస్తుండగా గుర్తించిన బాధితుడు లాలాగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. వీరిపై ఇది వరకే పలు పోలీస్‌స్టేషన్లలో ఇదే తరహా కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment