పసికందు విక్రయానికి తల్లిదండ్రుల యత్నం
కొనేందుకు ప్రయత్నించిన భార్యాభర్తల అరెస్టు
రాంగోపాల్‌పేట్: ఉత్తరప్రదేశ్‌కు చెందిన భార్యాభర్తలు తమ 15 రోజుల కుమారుడిని అమ్మేందుకు హైదరాబాద్‌కు రాగా వారితో పాటు బాబును కొనేందుకు బేరం కుదుర్చుకున్న భార్యాభర్తలను గోపాలపురం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రజిని (30), చోటాకాన్ (31)లు భార్యాభర్తలు కార్మికులుగా పని చేస్తున్నారు. వీరికి గతంలో ముగ్గురు కుమారులు ఉండగా 15 రోజుల క్రితం మరో బాబు జన్మించాడు.
నగరంలోని నల్లకుంటకు చెందిన కృష్ణవేణి (26), మెడికల్ రిప్రెజెంటేటివ్‌గా పని చేసే రవికుమార్‌లు భార్యభర్తలు. కృష్ణవేణి దంపతులకు పిల్లలు పుట్టరని వైద్యులు చెప్పడంతో బాబును పెంచుకోవాలని ఆలోచించారు. ఫేస్‌బుక్ ద్వారా రజిని పరిచయం కావడంతో తమకు బాబును ఇస్తే రూ.4 లక్షలు ఇస్తామని చెప్పారు.
దీంతో ఈ నెల 21న లక్నో నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చారు. అక్కడ వేచి ఉన్నారు. అదే సమయంలో పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులకు అనుమానం వచ్చి వారిని ప్రశ్నించగా అసలు విషయం చెప్పారు. దీంతో ఈ దంపతులతో పాటు బాబును కొనుగోలు చేసేందుకు సిద్ధమైన దంపతులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చిన్నారిని అమీర్‌పేట్‌లోని శిశు విహార్‌కు తరలించారు.
మెడకు చున్నీ బిగుసుకుని బాలుడి మృత్యువాత
Comments
Please login to add a commentAdd a comment