అంబేడ్కర్‌ను తిట్టొద్దు అన్నందుకు..
ముగ్గురు దళిత సోదరులపై ఇనుప రాడ్లతో దాడి
పాల్గర్: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని అన్నందుకు ముగ్గురు దళిత సోదరులపై దాడి చేసిన ఘటన మహారాష్ట్రలో పాల్గర్ జిల్లా ఎండీ నగరల్‌లో జరిగింది. ఆర్‌పీఐ కార్పొరేటర్ పాండురంగ ఇంగ్లే కుమారులు సాగర్ (25), జీత్(30), చేతన్(22)ను దుండగులు ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేసి గాయపరిచినట్టు పోలీసులు తెలిపారు.
ఆదివారం సాగర్ స్నేహితులతో మాట్లాడుతుండగా.. వారిలో మద్యం సేవించిన కొందరు అంబేడ్కర్‌ను దూషించారు. వారించిన సాగర్‌పై దాడిచేశారు. 30-40 మంది వారికి తోడై సాగర్‌ను కర్రలు, ఇనుప రాడ్లతో కొట్టడం మొదలుపెట్టారు. సోదరుడిని రక్షించేందుకు చేతన్, జీత్ అక్కడికి రాగా వారిపైనా దాడి చేశారు. అక్కడి నుంచి తప్పించుకున్న ముగ్గురు సోదరులు విరార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.