రేపు ఎస్వీయూ విద్యార్థులతో వైఎస్ జగన్ భేటీ
తిరుపతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశంకానున్నారు. ఎస్వీ యూనివర్సిటీలో సభకు అధికారులు అనుమతి నిరాకరించడంతో.. ఎయిర్ బైసాప్ రోడ్డులోని పీఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 10 గంటలకు వైఎస్ జగన్ విద్యార్థులతో సమావేశమవుతారు. ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్రాభివృద్దిపై విద్యార్థులతో చర్చించనున్నారు.
అనంతరం వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్జూర్ యూనియన్ రాష్ట్రస్థాయి సదస్సులో వైఎస్ జగన్ పాల్గొంటారు. తనపల్లి క్రాస్లోని పీఎల్ఆర్ గార్డెన్స్లో ఈ సదస్సు జరగనుంది.