శస్త్రచికిత్స చేయకుండానే గుండెకు కవాటం అమర్చవచ్చు | Without surgery Heart valve can be set | Sakshi
Sakshi News home page

శస్త్రచికిత్స చేయకుండానే గుండెకు కవాటం అమర్చవచ్చు

Published Mon, Apr 7 2014 12:43 AM | Last Updated on Thu, Apr 4 2019 3:20 PM

శస్త్రచికిత్స చేయకుండానే గుండెకు కవాటం అమర్చవచ్చు - Sakshi

శస్త్రచికిత్స చేయకుండానే గుండెకు కవాటం అమర్చవచ్చు

 వాషింగ్టన్: శస్త్రచికిత్స అవసరం లేకుండానే గుండెలో కృత్రియ పరికరాన్ని అమర్చే కొత్తవిధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు రూపొందించారు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) అనుమతించిన ఈ పరికరాన్ని ‘మెడ్రోనిక్ కోర్ వాల్వ్ సిస్టమ్’గా పిలుస్తారు. క్లినికల్ టెస్ట్‌లు చేయకుండానే మార్చి 28న లయోలా యూనివర్సిటీ మెడికల్ సెంటర్.. ఇల్లినాయిస్ ఆసుపత్రిలోని రోగికి ఈ పరికరాన్ని విజయవంతంగా అమర్చారు.
 
 మానవుడి మొలభాగం( గజ్జ) నుంచి ధమనులు ద్వారా ఈ కృత్రిమ కవాటాన్ని గుండెకు తీసుకెళ్లి బిగించవచ్చు. సంప్రదాయ శస్త్రచికిత్స కంటే చాలా సులభంగా, ఏలాంటి గాట్లు లేకుండా ఈ విధానంలో కృత్రిమ కవాటాన్ని అమర్చవచ్చు. గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సల్లో ఈ విధానం విప్లవాత్మకమైనదని లయోలా వర్సిటీ ప్రొఫెసర్ ఫ్రెడ్‌లెయా పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement