ఆఫీసు నాలుగో అంతస్తు పైనుంచి దూకి.. | Woman jumps off 4th floor cafe in office building, dies | Sakshi
Sakshi News home page

ఆఫీసు నాలుగో అంతస్తు పైనుంచి దూకి..

Published Fri, Jan 20 2017 5:27 PM | Last Updated on Tue, Sep 5 2017 1:42 AM

ఆఫీసు నాలుగో అంతస్తు పైనుంచి దూకి..

ఆఫీసు నాలుగో అంతస్తు పైనుంచి దూకి..

మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య

కె.ఆర్‌.పురం (బెంగళూరు): ఆఫీస్‌లోని నాలుగవ అంతస్తు పైనుంచి దూకి మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బెంగళూరు వైట్‌ఫీల్డ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం ఉదయం జరిగింది. కర్ణాటకలో మండ్య హులివాన గ్రామానికి చెందిన శోభా లక్ష్మీనారాయణ(30) రాజాజీనగర్‌లో తన తల్లితో నివాసముంటూ వైట్‌ఫీల్డ్‌లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తోంది.

గురువారం విధులకు హాజరైన ఆమె తన కంపెనీ భవనం నాలుగవ అంతస్తు పైకి వెళ్లి అక్కడ నుంచి కిందికి దూకింది. తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా స్వస్థలంలో బంధువులతో వీరికి ఆస్తి గొడవలు ఉండటంతో తరుచుగా శోభ మానసిక వేదనకు గురయ్యేదని ఆమె స్నేహితులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement