ప్రాణాల మీదకు తెచ్చిన సెల్ఫీ ప్రయత్నం | youth tries for a selfie on train, gets electric shock | Sakshi
Sakshi News home page

ప్రాణాల మీదకు తెచ్చిన సెల్ఫీ ప్రయత్నం

Published Tue, Jun 23 2015 5:30 PM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM

ప్రాణాల మీదకు తెచ్చిన సెల్ఫీ ప్రయత్నం - Sakshi

ప్రాణాల మీదకు తెచ్చిన సెల్ఫీ ప్రయత్నం

రైలు ఎక్కి.. దాని పైన సెల్ఫీ తీసుకోడానికి చేసిన ప్రయత్నం ఓ బీటెక్ విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రైల్వేస్టేషన్లో జరిగింది. విశాఖపట్నానికి చెందిన సంతోష్ కుమార్ అనే బీటెక్ విద్యార్థి రాజమండ్రిలో రైలు ఎక్కి.. దాని పైకప్పు మీదకు వెళ్లాడు. అక్కడ ఓ సెల్ఫీ తీసుకోడానికి ప్రయత్నం చేస్తుండగా, అక్కడున్న హైటెన్షన్ విద్యుత్ లైను అతడికి తగిలింది.

వెంటనే తీవ్ర విద్యుత్ షాక్తో అతడి ఒళ్లంతా కాలిపోయింది. అక్కడకు సమీపంలోనే ఉన్న అతడి తల్లిదండ్రులు, బంధువులు వెంటనే సంతోష్ కుమార్ను 108 వాహనంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతడు చికిత్స పొందుతున్నాడు. అయితే సంతోష్ పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యవర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement