Carlos Brathwaite
-
ఆ ప్లేయర్ ఎంట్రీ ఖాయమేనా?.. రెండో టెస్టుకు భారత్ తుది జట్టు!
మరికొద్ది గంటల్లో టీమిండియా, వెస్టిండీస్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ మొదలుకానుంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న రోహిత్ సేన సిరీస్ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. తొలి టెస్టులో కనీసం రెండు వందల పరుగుల మార్క్‌ను అందుకోవడంలో విఫలమైన విండీస్ కనీసం ఈసారైనా తన స్కోరును 200 దాటిస్తుందేమో చూడాలి. ఓపెనర్‌గా యశస్వి జైశ్వాల్ అరంగేట్రం టెస్టులోనే అదరగొట్టాడు. తాను ఆడుతున్న తొలి టెస్టులోనే సెంచరీతో మెరిసి ఎవరికి సాధ్యం కాని రికార్డులను అందుకున్నాడు. ఇక సిరీస్ డిసైడ్ చేసే రెండో టెస్టులో టీమ్ ఎలా ఉండబోతోంది? మరో ప్లేయర్ అరంగేట్రం ఖాయమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తొలి టెస్టులో యశస్వికి అవకాశం ఇచ్చినట్లే.. ఈ రెండో టెస్టులో పేస్ బౌలర్ ముకేశ్ కుమార్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. శార్దూల్ ఠాకూర్ స్థానంలో ముకేశ్ ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మిగతా జట్టులో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. గురువారం (జులై 20) నుంచి వెస్టిండీస్ తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. శార్దూల్ బ్యాట్ తోనూ రాణించే ప్లేయరే అయినా.. ఇప్పటికే జట్టులో జడేజా, అశ్విన్ లాంటి ఆల్ రౌండర్లు ఉండటంతో అతని స్థానంలో ముకేశ్ ను తీసుకునే స్వేచ్ఛ కెప్టెన్ రోహిత్ కు ఉంది. ఇక వికెట్ కీపర్ గా ఇషాన్ కిషన్ నే కొనసాగించనున్నారు. తొలి టెస్టుతోనే ఇషాన్ తన టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ లో బ్యాట్ తో తనను తాను నిరూపించుకునే అవకాశం అతనికి రాలేదు. అంతేకాదు మూడోస్థానంలో వచ్చిన శుభ్‌మన్ గిల్, చాలా రోజుల తర్వాత ఇండియన్ టీమ్ లోకి వచ్చిన అజింక్య రహానే కూడా విఫలమయ్యారు. వీళ్లు రెండో టెస్టులో రాణించాల్సి ఉంది. పేస్ బౌలింగ్ లో సిరాజ్, జైదేవ్ ఉనద్కట్ తుది జట్టులో కొనసాగనున్నారు. టీమిండియా తుది జట్టు అంచనా: రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అశ్విన్, శార్దూల్ ఠాకూర్/ముకేశ్ కుమార్, జైదేవ్ ఉనద్కట్, మహ్మద్ సిరాజ్ చదవండి: పాక్ ఘన విజయం; లంక గడ్డపై అత్యధిక విజయాలు అందుకున్న జట్టుగా Asia Cup 2023: జులై 23న భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్..! -
ఇంతకంటే దిగజారడం ఉండదు: విండీస్ మాజీ కెప్టెన్ ఘాటు వ్యాఖ్యలు
ICC Cricket World Cup Qualifiers 2023: ‘‘చాలా కాలంగా జట్టు వైఫల్యం కొనసాగుతోంది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 12 స్టేజ్ చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఇప్పుడిలా! పరిమిత ఓవర్ల క్రికెట్లో రోజురోజుకీ పరిస్థితి దారుణంగా మారుతోంది. ఇక ఇంతకంటే దిగజారడం ఇంకేమీ ఉండదేమో’’ అని వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కార్లోస్ బ్రాత్‌వైట్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. షాయీ హోప్ బృందం కనీసం వన్డే వరల్డ్‌కప్-2023 ప్రధాన పోటీకి అర్హత సాధించని నేపథ్యంలో జట్టు ఆట తీరును విమర్శించాడు. కాగా జింబాబ్వే వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో విండీస్ దారుణ వైఫల్యాలు మూటగట్టుకుంది. గ్రూప్ స్టేజిలో జింబాబ్వే, నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయింది. ఇక సూపర్ సిక్సెస్ దశలో స్కాట్లాండ్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఏవైనా అద్భుతాలు జరగాలని కోరుకోవడమే తప్ప విండీస్ చేతిలో ఇంకేమీ మిగల్లేదు. రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన కరేబియన్ జట్టుకు ఈ దుస్థితి పట్టడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కార్లోస్ బ్రాత్‌వైట్ ఐసీసీ షోలో మాట్లాడుతూ.. షాయీ హోప్ బృందంపై విమర్శలు గుప్పించాడు. ఆత్మపరిశీలన చేసుకోవాలి ఇక విండీస్ లెజండరీ పేసర్ ఇయాన్ బిషప్.. ‘‘మేటి జట్లపై మేము మెరుగ్గా ఆడి.. నిలకడైన ప్రదర్శన కనబరిచి దశాబ్దానికి పైగానే అయింది. కరేబియన్ జట్టు ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉంది. ఒకరో ఇద్దరో పోరాడితే సరిపోదు. అంతా కలిసి కట్టుగా ముందుకు రావాల్సి ఉంది’’ అంటూ విండీస్ క్రికెట్ బోర్డులో కుమ్ములాటలు, మ్యాచ్ ఫీజులపై పేచీలు తదితర అంశాలను పరోక్షంగా ప్రస్తావించాడు. ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో షోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉంటే.. జూలై 12 నుంచి సొంతగడ్డపై టీమిండియాతో విండీస్ టెస్టు సిరీస్ మొదలుపెట్టనుంది. చదవండి: వరల్డ్ కప్ ఆడేందుకు వెస్టిండీస్‌కు ఇంకా ఛాన్స్.. అది ఎలా అంటే? ఆరోజు నాకు అన్యాయం చేసి ధోనికి అవార్డు ఇచ్చారు! ఎందుకంత ఏడుపు.. -
Trending Pic: విండీస్ యోధుడి ముఖం చినబోయిన వేళ..!
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో నిన్న (జూన్ 26) జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో టూ టైమ్ వరల్డ్ ఛాంపియన్ వెస్టిండీస్‌పై పసికూన నెదర్లాండ్స్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓడిన విండీస్ సూపర్ సిక్స్‌కు చేరినప్పటికీ.. వరల్డ్‌కప్-2023కు అర్హత సాధించే అవకాశాలను మాత్రం సంక్లిష్టం చేసుకుంది. సూపర్ సిక్స్‌లో విండీస్ ఆడాల్సిన 3 మ్యాచ్‌ల్లో గెలిచినా వరల్డ్‌కప్‌కు అర్హత సాధించడ కష్టమే. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే జింబాబ్వే, శ్రీలంకలకు వరల్డ్‌కప్ బెర్త్ దొరకడం ఖాయమని తెలుస్తుంది. కాగా, నెదర్లాండ్స్ చేతిలో ఓటమి అనంతరం యావత్ వెస్టిండీస్ బృందంలో బాధ కొట్టొచ్చినట్లు స్పష్టంగా కనిపించింది. డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్ కార్ల్ హూపర్తో పాటు ఆటగాళ్లంతా దాదాపుగా కన్నీరు పెట్టుకున్నంత పని చేశారు. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన మాకు ఇదేం గతి అన్నట్లు వారు వ్యవహరించారు. వీరందరి బాధ కంటే ఓ విండీస్ యోధుడి ముఖంలో కనిపించిన నిరాశ, నిర్వేదం చూపరులకు చాలా బాధ కలిగించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ప్రజంటేషన్ సందర్భంగా విండీస్ మాజీ ప్లేయర్ కార్లోస్ బ్రాత్‌వైట్ ముఖంలో కనిపించిన ఎక్స్ప్రెషన్.. యావత్ విండీస్ అభిమానుల బాధను ప్రతిబింబించింది. లోగాన్ వాన్ బీక్కు అవార్డు బహుకరిస్తున్న సమయంలో బ్రాత్‌వైట్ ముఖం చాలా చిన్నబోయినట్లు కనిపించింది. అతని ముఖం విండీస్ ఓటమి తాలూక బాధ కొట్టొచ్చినట్లు కనపడింది. ఈ పిక్ ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. ఈ పిక్ చూసి క్రికెట్ అభిమానులు విండీస్‌పై జాలి చూపిస్తున్నారు. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన జట్టుకు ఈ దుస్థితి ఏంటని బాధపడుతున్నారు. కాగా, కార్లోస్ బ్రాత్‌వైట్ 2016లో విండీస్ రెండో సారి టీ20 వరల్డ్‌కప్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ టోర్నీ ఫైనల్లో బ్రాత్‌వైట్.. బెన్ స్టోక్స్ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాది విండీస్‌ను జగజ్జేతగా నిలబెట్టాడు. -
ILT20 2023: ఐఎల్ టీ20 తొలి విజేతగా అదానీ గ్రూప్ జట్టు.. అంబరాన్నంటిన సంబరాలు
International League T20, 2023 - Desert Vipers vs Gulf Giants: ఇంటర్నేషనల్ లీగ్ టీ20(ఐఎల్టీ20) మొదటి ఎడిషన్ విజేతగా గల్ఫ్ జెయింట్స్ అవతరించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో డెజెర్ట్ వైపర్స్‌ను చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడింది. గల్ఫ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన వెస్టిండీస్ ఆటగాడు కార్లోస్ బ్రాత్‌వైట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. నెల రోజుల పాటు సాగిన టోర్నీ ఈ ఏడాది ఆరంభంలో యూఏఈ దుబాయ్ క్యాపిటల్స్- అబుదాబి నైట్ రైడర్స్ మ్యాచ్‌తో జనవరి 13న ఐఎల్టీ20కి తెరలేచింది. ఈ రెండు జట్లతో పాటు ఎంఐ ఎమిరేట్స్, షార్జా వారియర్స్, డెజర్ట్ వైపర్స్ సహా గల్ఫ్ జెయింట్స్ ట్రోఫీ కోసం పోటీపడ్డాయి. ఈ క్రమంలో తుదిపోరుకు అర్హత సాధించిన డెజర్ట్ వైపర్స్- గల్ఫ్ జెయింట్స్ మధ్య ఆదివారం(ఫిబ్రవరి 12) ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో టాస్ గెలిచిన గల్ఫ్ జెయింట్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. చెలరేగిన బ్రాత్‌వైట్ ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన వైపర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 146 పరుగులు సాధించింది. గల్ఫ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కార్లోస్ బ్రాత్‌వైట్.. అద్భుతంగా రాణించాడు. 4 ఓవర్ల కోటాలో కేవలం 19 పరగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి వైపర్స్ పతనాన్ని శాసించాడు. ఇతరులలో గ్రాండ్‌హోం ఒకటి, కైస్ అహ్మద్ రెండు, క్రిస్ జోర్డాన్ ఒక వికెట్ తీశారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన గల్ఫ్ జట్టుకు ఓపెనర్ క్రిస్ లిన్(ఆస్ట్రేలియా) అదిరిపోయే ఆరంభం అందించాడు. క్రిస్ లిన్ అద్భుత ఇన్నింగ్స్ ఐదో స్థానంలో వచ్చిన షిమ్రన్ హెట్మెయిర్తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. లిన్ 50 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 72 పరుగులు చేయగా.. హెట్మెయిర్ 13 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 25 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శనతో 18.4 ఓవర్లలోనే గల్ఫ్ జెయింట్స్ టార్గెట్‌ను ఛేదించింది. 3 వికెట్లు నష్టపోయి 149 పరుగులతో జయకేతనం ఎగురవేసింది. డెజర్ట్ వైపర్స్‌ను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసి ఐఎల్టీ20 మొదటి చాంపియన్‌గా రికార్డులకెక్కింది. దీంతో జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. కాగా గల్ఫ్ జెయింట్స్ అదానీ స్పోర్ట్స్లైన్కు చెందిన జట్టు అన్న సంగతి తెలిసిందే. ఐఎల్టీ20 ఫైనల్: డెజర్ట్ వైపర్స్ వర్సెస్ గల్ఫ్ జెయింట్స్ మ్యాచ్ స్కోర్లు డెజర్ట్ వైపర్స్- 146/8 (20) గల్ఫ్ జెయింట్స్- 149/3 (18.4) చదవండి: Ind Vs Aus: ‘డూప్లికేట్’కు.. అసలుకు తేడా తెలిసిందా? ఈసారి జడ్డూ కోసమైతే: భారత మాజీ బ్యాటర్ Ind Vs Pak: ప్రపంచకప్‌లో పాక్‌పై ఇదే అత్యధిక ఛేదన.. మహిళా జట్టుపై కోహ్లి ప్రశంసలు 🎶 BRING IT ON! 🎶 Strength, challenge, & victory! Our anthem tells you all you need to know about us!🤩#GiantArmy, presenting to you the Gulf Giants anthem, written & performed by @salim_merchant @Sulaiman 💪#ALeagueApart #DPWorldILT20 #BringItOn @ilt20official @ilt20onzee pic.twitter.com/jJJbUHBxq6 — Gulf Giants 🦅 (@GulfGiants) January 15, 2023 -
'చేసిన పాపం ఊరికే పోదు'.. బౌలర్ తిక్క కుదిర్చిన అంపైర్
'చేసిన పాపం ఊరికే పోదంటారు'' పెద్దలు. తాజాగా విండీస్ స్టార్ క్రికెటర్ కార్లోస్ బ్రాత్‌వైట్ విషయంలో అదే జరిగింది. త్రో విసిరే సమయంలో బంతిని బ్యాటర్‌వైపు ఉద్దేశపూర్వకంగానే కొట్టినట్లు రుజువు కావడంతో బ్రాత్‌వైట్ జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తూ అంపైర్ నిర్ణయం తీసుకున్నాడు. విషయంలోకి వెళితే.. విటాలిటీ టి20 బ్లాస్ట్‌లో భాగంగా వార్విక్షైర్, డెర్బీషైర్ మధ్య మ్యాచ్ జరిగింది. డెర్బీషైర్ ఇన్నింగ్స్ 13వ ఓవర్ బ్రాత్‌వైట్ వేశాడు. 34 పరుగులతో క్రీజులో వేన్ మాడ్సన్ ఉన్నాడు. ఆ ఓవర్ మూడో బంతిని బ్రాత్‌వైట్ యార్కర్ వేయగా.. మాడ్సన్ బంతిని ముందుకు పుష్ చేశాడు. బంతిని అందుకున్న బ్రాత్‌వైట్ త్రో విసిరే ప్రయత్నం చేయగా.. బంతి మాడ్సన్ పాదానికి గట్టిగా తగిలింది. నాన్‌స్ట్రైకర్ కాల్ ఇవ్వడంతో సింగిల్ పూర్తి చేశారు. బ్రాత్‌వైట్ కూడా మాడ్సన్ను క్షమాపణ కోరాడు. ఇక్కడితో దీనికి ఫుల్స్టాప్ పడిందని అంతా భావించారు. కానీ ఇదంతా గమనించిన ఫీల్డ్ అంపైర్ బ్రాత్‌వైట్ చేసింది తప్పని.. అందుకు శిక్షగా ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తున్నట్లు తెలిపాడు. లెగ్ అంపైర్‌తో విషయం చర్చించాకా బంతిని కూడా డెడ్‌బాల్‌గా పరిగణిస్తూ.. ప్రత్యర్థి జట్టు తీసిన సింగిల్‌ను కూడా అంపైర్లు రద్దు చేశారు. దీంతో ప్రత్యర్థి జట్టుకు ఐదు పరుగులు అదనంగా వచ్చాయి. ఇక బ్రాత్‌వైట్ అనవసరంగా గెలుక్కొని మూల్యం చెల్లించుకున్నట్లు.. ఆ ఓవర్లో ఎనిమిది పరుగులు సహా ఐదు పెనాల్టీ పరుగులతో మొత్తంగా 13 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే డెర్బీషైర్ వార్విక్‌షైర్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వార్విక్ షైర్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన డెర్బీషైర్ 18.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. Not ideal for Carlos Brathwaite 😬 A 5-run penalty was given against the Bears after this incident...#Blast22 pic.twitter.com/pXZLGcEGYa — Vitality Blast (@VitalityBlast) June 19, 2022 చదవండి: అరుదైన సెంచరీల రికార్డు.. సచిన్ సర్‌తో పాటు నా పేరు కూడా: యశస్వి Cristiano Ronaldo: కోట్ల విలువైన కారుకు యాక్సిడెంట్.. రొనాల్డో క్షేమంగానే -
2016 టి20 ప్రపంచకప్ హీరోకు వింత అనుభవం..
వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ కార్లోస్ బ్రాత్వైట్కు వింత అనుభవం ఎదురైంది. గాయం కారణంగా జట్టుకు ఆరు నెలలపాటు దూరమైన బ్రాత్‌వైట్ మళ్లీ ఫామ్‌లోకి రావడానికి డొమొస్టిక్ క్రికెట్లో బిజీగా ఉన్నాడు. తాజాగా బ్రాత్‌వైట్ బర్మింగ్హమ్ డిస్ట్రిక్ట్ ప్రీమియర్ లీగ్‌లో నోల్ అండ్ డోరిడ్జ్ సీసీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆరు నెలల తర్వాత తొలి మ్యాచ్ ఆడుతున్న బ్రాత్వైట్కు నిరాశే ఎదురైంది. లీమింగ్టన్ సీసీతో మ్యాచ్‌లో బ్రాత్‌వైట్ తొలి బంతికే ఔటయ్యాడు. భారీషాట్‌కు యత్నించి క్యాచ్ ఇచ్చి గోల్డెన్‌డక్ అయ్యాడు.ఆ తర్వాత బౌలింగ్‌లోనూ బ్రాత్‌వైట్ పెద్దగా రాణించలేకపోయాడు. 4 ఓవర్లు వేసి 31 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అలా నిరాశజనక ప్రదర్శనతో రోజును ముగించే పనిలో ఉన్న బ్రాత్వైట్కు మరొక బిగ్‌షాక్ తగిలింది. తనకు ఎంతో ఇష్టమైన కారును కూడా ఎవరో దొంగలించారు. ఈ విషయం తెలుసుకున్న బ్రాత్‌వైట్ ట్విటర్లో తెగ బాధపడిపోయాడు. ''నిన్నటి రోజు నాకు పీడకల లాంటిది.. ఆరు నెలల తర్వాత మ్యాచ్ ఆడాను.. డకౌట్ అయ్యాడు.. బౌలింగ్ వేశాను.. అందులోనూ నిరాశే ఎదురైంది.. ఇక రోజు చివరలో నా కారును ఎవరో దొంగతనం చేశారు.. ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదు.. ఇన్ని చెత్త విషయాల మధ్య ఒక మంచి విషయం ఏంటో చెప్పనా.. మరుసటిరోజు తెల్లవారుజామునే సూర్యుడు మెరుస్తూ నాకు వెల్కమ్ చెప్పాడు.'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. కాగా బ్రాత్‌వైట్ అనగానే మొదటగా గుర్తుకువచ్చేది 2016 టి20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో ఆఖరి ఓవర్లో 19 పరుగులు చేయాల్సిన దశలో బ్రాత్‌వైట్ నాలుగు బంతుల్లో నాలుగు సిక్సర్లు బాది వెస్టిండీస్ రెండోసారి టి20 ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక బ్రాత్‌వైట్ విండీస్ తరపున 3 టెస్టులు, 44 వన్డేలు, 41 టి20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: BCCI: 'తెలియని దారుణాలు చాలానే.. బీసీసీఐ బయటపడనివ్వలేదు' Wasim Jaffer: 'ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకుంది'.. సీఎస్కే పరిస్థితి ఇదే What a day yesterday - First time bowling in a game after injury for six months 💩 - First ball duck from a long hop 😫 - Car stolen 🤬 But you know what , woke up this morning , Sun is shining and giving thanks 🙏🏾 — Carlos Brathwaite (@CRBrathwaite26) April 17, 2022 Carlos Braithwaite Golden Duck for Knowle & Dorridge today 😳 pic.twitter.com/92P8fIcpSm — Will (@Will27375624) April 16, 2022 -
'గుర్తుపెట్టుకోండి నా కూతురు పేరు'.. 2016 టి20 వరల్డ్‌కప్ హీరో
2016లో భారత గడ్డపై జరిగిన టి20 ప్రపంచకప్‌ను వెస్టిండీస్ గెలుచుకుంది. ఎవరు ఊహించని రీతిలో ఒకే ఒక్క ఓవర్లో ఆట మొత్తం మారిపోయింది. దానికి కారణం విండీస్ క్రికెటర్ కార్లోస్ బ్రాత్‌వైట్. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిచింది. బెన్‌స్టోక్స్ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్స్‌లు కొట్టి బ్రాత్‌వైట్ తన జట్టుకు టి20 ప్రపంచకప్ అందించాడు. అప్పటివరకు ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని బ్రాత్‌వైట్ పేరు మోర్మోగిపోయింది. ఆ మ్యాచ్‌లో బ్రాత్‌వైట్ 10 బంతుల్లో 4 సిక్సర్లు, ఒక ఫోర్ సాయంతో 34 పరుగులు చేశాడు. గుర్తుంచుకోండి నా పేరు కార్లోస్ బ్రాత్‌వైట్.. అని గర్వంగా చెప్పుకున్నాడు. అంతలా ఇంపాక్ట్ చూపించిన బ్రాత్‌వైట్ తమ దేశానికి ప్రపంచకప్ అందించిన భారత గడ్డపై ప్రత్యేక అభిమానాన్ని పెంచుకున్నాడు. ముఖ్యంగా ఈడెన్ గార్డెన్స్ అంటే తనకు చాలా ఇష్టమని పలు సందర్భాల్లో బ్రాత్‌వైట్ వివరించాడు. చదవండి:అదే ఆఖరు... 19 ఏళ్లకు పైగానే అయింది గెలిచి.. ఈసారి కూడా! తాజాగా ఈడెన్‌పై తనకున్న అభిమానానికి గుర్తుగా పుట్టిన బిడ్డకు 'ఈడెన్' వచ్చేలా పేరు పెట్టుకున్నాడు. ఫిబ్రవరి 6న కార్లోస్ బ్రాత్‌వైట్ దంపతులకు పండంటి ఆడబిడ్డ పుట్టింది. కాగా తన బిడ్డకు ఈడెన్ అని వచ్చేలా పేరు పెట్టినట్లు బ్రాత్‌వైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పుకొచ్చాడు. '' గుర్తుపెట్టుకోండి నా బిడ్డ పేరు.. ఈడెన్ రోస్ బ్రాత్‌వైట్. పుట్టిన తేదీ 2/6/22.ఈడెన్ గార్డెన్స్‌తో నాకు ప్రత్యేకమైన అనుబంధం. ఇక నా చిట్టితల్లికి ఒక మాట ఇస్తున్నా.. డాడీగా నిన్ను ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటా. థాంక్యూ జెస్సీపర్పుల్.. నా జీవితంలోకి నువ్వు రావడం అదృష్టం. కచ్చితంగా ఈడెన్ రోస్ బ్రాత్వైట్కు మంచి తల్లిగా ఉంటావని భావిస్తున్నా. అంటూ పోస్ట్ చేశాడు. ఇక కార్లోస్ బ్రాత్‌వైట్ ఒక్కడే కాదు.. ఇంతకముందు పలువురు విదేశీ క్రికెటర్లు తమ బిడ్డలకు భారతీయ పేరు వచ్చేలా పెట్టుకున్నారు. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ తన కూతురుకు ఇండియా జియాన్నే రోడ్స్ అని పేరు పెట్టాడు. భారతదేశం అన్ని మతాలతో కూడిన దేశం. ఇక్కడి ఆచారాలు, సంస్కృతి, వారసత్వం అంటే చాలా ఇష్టం. ప్రత్యేకమైన అభిమానంతోనే తన కూతురుకు ఇండియా జియన్నే పేరు పెట్టినట్లు రోడ్స్ గతంలో ఒక ఇంటర్య్వూలో పేర్కొన్నాడు. మరో దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ కూడా తన కూతురుకు ''తాజ్'' అని పేరు పెట్టాడు. ఇండియాలోని తాజ్‌మహల్ అంటే ఏబీకి చాలా ఇష్టం. ఇంకో విషయమేంటంటే.. ఏబీ తన గర్ల్‌ఫ్రెండ్.. ప్రస్తుత భార్యకు తాజ్‌మహల్ వేదికగానే లవ్‌ప్రపోజ్ చేశాడు. ఇక భారత్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉన్న ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు డేవిడ్ వార్నర్ తన చిన్న కూతురుకు ''ఇండీ'' అని పేరు పెట్టాడు. చదవండి: విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డు.. సచిన్, ధోని సరసన..! -
విండీస్ పవర్ హిట్టర్‌కు కరోనా..
లండన్: గత రెండేళ్లుగా వెస్టిండీస్ టీమ్‌కి దూరంగా ఉంటూ, విదేశీ టీ20 లీగ్స్‌లో బిజీగా గడుపుతున్న పవర్ హిట్టర్ కార్లోస్ బ్రాత్‌వైట్ కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో వార్విక్‌షైర్‌కు ప్రాతనిధ్యం వహిస్తున్న బ్రాత్వైట్కు.. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆ కౌంటీ యాజమాన్యం ప్రకటించింది. దీంతో నిన్న నాటింగ్హమ్షైర్తో జరిగిన మ్యాచ్‌కి అతని స్థానంలో రోబ్ యాట్స్‌ని తుది జట్టులోకి తీసుకున్నారు. టీ20 బ్లాస్ట్ టోర్నీ నిబంధనల ప్రకారం.. కరోనా పాజిటివ్‌గా తేలిన క్రికెటర్ 10 రోజులు ఐసోలేషన్‌లో ఉండాల్సి ఉంటుంది. దీంతో జులై 9న జరిగే మ్యాచ్‌కి కూడా ఈ స్టార్ పవర్ హిట్టర్ దూరంగా ఉంటాడని జట్టు యాజమాన్యం ప్రకటించింది. కాగా, ప్రస్తుత టోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడిన బ్రాత్‌వైట్.. 18 వికెట్లు పడగొట్టి, 104 పరుగులు చేశాడు. 2016 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో చివరి ఓవర్లో వరుసగా 4 సిక్సర్లు బాది వెస్టిండీస్‌ని గెలిపించిన కార్లోస్ బ్రాత్‌వైట్.. ఆ టోర్నీ తర్వాత కెప్టెన్‌గా కరీబియన్ జట్టును కూడా నడిపించాడు. అయితే, 2019 నుంచి అతని కెరీర్ గాడి తప్పిడంతో జాతీయ జట్టులో స్థానం కోల్పోయాడు. -
ఐదేళ్ల నాటి పగకు ప్రతీకారం తీర్చుకున్న బెన్ స్టోక్స్..
లండన్: ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్.. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కార్లోస్ బ్రాత్‌వైట్‌పై ప్రతీకారం తీర్చుకున్నాడు. 2016 టీ20 ప్రపంచకప్‌లో ఎదురైన ఘోర పరాభవానికి.. ఐదేళ్ల తర్వాత లెక్క అప్పజెప్పాడు. వివరాల్లోకి వెళితే.. భారత్ వేదికగా జరిగిన 2016 టీ20 ప్రపంచకప్ తుది పోరులో ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. జో రూట్(54), జోస్ బట్లర్(36), డేవిడ్ విల్లీ(21) పర్వాలేదనిపించాడు. విండీస్ బౌలర్లలో బ్రావో, బ్రాత్‌వైట్ తలో మూడు వికెట్లు తీశారు. Stokesy sends it into the stands 6⃣ Durham 41/2 after the powerplay. #ForTheNorth pic.twitter.com/a9fRAImyhg — Durham Cricket (@DurhamCricket) June 26, 2021 అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ మరో రెండు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుని రెండోసారి పొట్టి ఫార్మాట్లో ఛాంపియన్‌గా అవతరించింది. 12 బంతుల్లో 27 పరుగులు చేయాల్సిన తరుణంలో ఇంగ్లీష్ బౌలర్ క్రిస్ జోర్డాన్ వేసిన 19వ ఓవర్లో శాముల్స్, బ్రాత్‌వైట్‌లు తడబడ్డారు. దీంతో చివరి ఓవర్లో విండీస్ విజయానికి 19 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో స్టోక్స్ వేసిన చివరి ఓవర్లో వరుసగా నాలుగు బంతులను భారీ సిక్సర్లుగా మలిచిన బ్రాత్‌వైట్ విండీస్‌కు అపురూప విజయాన్ని అందించాడు. ఈ మెగా ఈవెంట్ తర్వాత స్టోక్స్, బ్రాత్‌వైట్ ప్రత్యర్థులుగా ఎక్కువగా ఎదురుపడలేదు. అయితే బ్రాత్‌వైట్‌పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం స్టోక్స్‌కు టీ20 బ్లాస్ట్ రూపంలో వచ్చింది. ఈ లీగ్‌లో భాగంగా డర్హమ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టోక్స్.. వార్విక్షైర్ ఆటగాడు, విండీస్ ఆల్‌రౌండర్ బ్రాత్‌వైట్ వేసిన ఒక ఓవర్లో వరుసగా 6,4,0,6 బాదేశాడు. ఐదేళ్ల క్రితం ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకున్నాడు. బ్రాత్వైట్లా వరుస సిక్స్‌లు బాదే అవకాశం రానప్పటికీ.. అతనిలానే భారీ షాట్లు ఆడుతూ ఒకే ఓవర్లో 16 పరుగులు పిండుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 20 బంతులను ఎదుర్కొన్న స్టోక్స్.. 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేయడంతో డర్హమ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం వార్విక్షైర్ 18.3 ఓవర్లలోనే 130 పరుగులకు ఆలౌటై పరాజయం పాలైంది. కాగా, ఐపీఎల్ 2021 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలో నిలిచిన స్టోక్స్.. చేతి వేలి గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. -
‘ఒక్కసారిగా మరో గేల్ అయిపోయా’
న్యూఢిల్లీ: నాలుగేళ్ల క్రితం జరిగిన టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ క్రికెట్ అభిమానులకు సుపరిచితమే. 2016లో వెస్టిండీస్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన ఆనాటి తుది పోరులో బ్రాత్‌వైట్ హీరోగా నిలిచాడు. ఆ ఫైనల్ మ్యాచ్‌లో వెస్టిండీస్ విజయానికి చివరి 6 బంతుల్లో 19 పరుగులు అవసరమవగా.. ఇంగ్లిష్ ఆల్ రౌండర్ బెన్‌స్టోక్స్ బౌలింగ్‌కి వచ్చాడు. ఆ సమయంలో కార్లోస్ బ్రాత్‌వైట్ క్రీజ్‌లో ఉన్నాడు. కానీ 19 పరుగుల ఛేదన బ్రాత్‌వైట్ వల్ల కాదనుకున్నారంతా. అప్పటికి 6 బంతుల్లో 10 పరుగులు చేసిన బ్రాత్‌వైట్.. చివరి ఓవర్‌ను మాత్రం ఉతికి ఆరేశాడు. వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టి విండీస్‌ను విశ్వవిజేతగా నిలిపాడు. దీనిపై బ్రాత్‌వైట్ తాజాగా మాట్లాడతూ.. ఆనాటి వరల్డ్‌కప్ తర్వాత భారత్‌లోని అభిమానులు క్రిస్‌గేల్ తరహాలో చూశారన్నాడు. తనను గేల్ తరహాలో అభిమానించారన్నాడు. (ఇప్పుడేం జరుగుతోందని... ఐపీఎల్ జరగడానికి! ) దేశంలో ఎక్కడికెళ్లినా తనకు బ్రహ్మరథం పట్టారన్నాడు. ‘ భారత్‌లో క్రికెట్ అనేది మతం. ఓసారి ఎయిర్పోర్ట్ నుంచి బయటికొస్తుంటే..గేల్ తరహాలో అభిమానులు నన్ను చుట్టుముట్టారు. ప్రపంచకప్ తర్వాత ఐపీఎల్లో ఢిల్లీ తరఫున ఆడేందుకు వచ్చినప్పడు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది’ అని బ్రాత్‌వైట్ చెప్పుకొచ్చాడు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ ఏప్రిల్ 15కి వాయిదాపడగా.. ఇప్పటికీ దేశంలో పరిస్థితులు అదుపులోకి రాకపోవడం, లాక్‌డౌన్‌ని కేంద్ర ప్రభుత్వం కొనసాగించే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో.. టోర్నీ జరగడం అనుమానంగా మారింది. ఒకవేళ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) యోచిస్తున్న ప్లాన్-బిని అమలు చేస్తే జూలై నెలలో ఈ లీగ్ ఆరంభమయ్యే అవకాశం ఉంది. (జడేజా.. ఇక గడ్డి కోసే పనిలో ఉండు..!) -
వెస్టిండీస్ మురిసే.. స్టోక్స్ ఏడిచే
లక్ష్యం 156 పరుగులు.. 107 పరుగులకే ఆరు వికెట్లు.. ఊరిస్తున్న లక్ష్యం..అడుగు దూరంలో ప్రపంచకప్.. బంతులా లేక బుల్లెట్లా అన్నట్లు ప్రత్యర్థి బౌలింగ్.. ఇది వెస్టిండీస్ పరిస్థితి. అయితే ఎవరూ ఊహించని విధంగా మహాఅద్భుతం జరిగింది. కాదు మహాద్భుతం జరిగేలా చేశాడు. అతడే కార్లోస్ బ్రాత్‌వైట్. ఆశలు చనిపోయిన స్థితి నుంచి ప్రతీ ఒక్క కరేబియన్ అభిమాని కాలర్ ఎగరేశాలా చేశాడు. అయితే బ్రాత్‌వైట్ ధాటికి బలైన బౌలర్ మాత్రం కొన్ని రోజులు నిద్రలేని రాత్రులు గడిపాడు. అతడే బెన్ స్టోక్స్. అభిమానులకు అసలు సిసలైన టీ20 మజాను అందించిన ఈ మ్యాచ్‌కు కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్ వేదికైంది. ఆ మహా సమరం జరిగింది ఇదే రోజు. ఈ సందర్భంగా టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించిన విశేషాలు మీకోసం.. సెమీఫైనల్లో టీమిండియాపై గెలిచి రెట్టింపు ఉత్సాహంతో ఫైనల్లో ఇంగ్లండ్ పోరుకు వెస్టిండీస్ సిద్దమైంది. టాస్ గెలిచిన విండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. జాసర్ రాయ్(0), అలెక్స్ హేల్స్(1), ఇయాన్ మోర్గాన్(5)లు ఘోరంగా నిరుత్సాహపరచడంతో బ్రిటీష్ జట్టు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో జోయ్ రూట్(54) బాధ్యతాయుతంగా ఆడాడు. రూట్‌కు తోడు బట్లర్(36) ఫర్వాలేదనిపించాడు. చివర్లో డేవిడ్ విల్లీ(21) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో బ్రావో, బ్రాత్‌వైట్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. బద్రీ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. శాముల్స్ ఒకేఒక్కడు.. ఇంగ్లండ్ విధించిన 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరేబియన్ జట్టుకు ఇంగ్లండ్ ఆదిలోనే షాక్ ఇచ్చింది. చార్లెస్(1), గేల్(4), సిమ్మన్స్(0) రస్సెల్(1), డారెన్ సామీ(2)లను వరుసగా పెవిలియన్‌కు పంపించి విండీస్‌ను పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే ఈ కష్టకాలంలో సీనియర్ బ్యాట్స్‌మన్ శాముల్స్(85నాటౌట్) ఒకే ఒక్కడు నిలబడ్డాడు. ఓ వైపు వరుసగా వికెట్లు పడుతున్నా మరోవైపు ఒంటిరి పోరాటం చేశాడు. శాముల్స్కు బ్రావో(25) చక్కటి సహకారం అందించినా చివరి వరకు నిలబడలేకపోయాడు. అయితే రన్‌రేట్ పెరిగిపోతుండటంతో విండీస్ గెలుపు ఆశలు సన్నగిల్లాయి. బ్రాత్‌వైట్ విధ్వంసం 12 బంతుల్లో 27 పరుగులు చేయాల్సిన సమయంలో క్రిస్ జోర్డాన్ వేసిన 19వ ఓవర్లో శాముల్స్, బ్రాత్‌వైట్‌లు తడబడ్డారు. దీంతో ఆ ఓవర్లో 8 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో చివరి ఓవర్లో విండీస్ విజయానికి 19 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో బెన్ స్టోక్స్ వేసిన చివరో ఓవర్లో బ్రాత్‌వైట్ విధ్వంసం సృష్టించాడు. వరుసగా నాలుగు బంతులను భారీ సిక్సర్లుగా మలచి విండీస్‌కు విజయాన్ని, ప్రపంచకప్‌ను అందించిపెట్టాడు. బ్రాత్‌వైట్(34 నాటౌట్) వరుసగా సిక్సర్లు కొట్టడంతో షాక్‌కు గురైన బెన్ స్టోక్స్ మైదానంలో కన్నీటిపర్యంతమయ్యాడు. ఇలా ఎన్నో విశేషాలు కలిగిన ఈ ప్రపంచకప్ ఫైనల్ జరిగింది ఇదే రోజు కావడంతో ఐసీసీ ట్వీట్ చేసింది. అంతేకాకుండా బ్రాత్‌వైట్ సిక్సర్లకు సంబంధించిన వీడియోనూ సైతం పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. #OnThisDay in 2016, West Indies became double @T20WorldCup champions! 🏆 They first beat 🇦🇺 by eight wickets in the women's final, before the men trumped 🏴 by four wickets in a finale which has been quoted many times since 👇 pic.twitter.com/qDW4WkpwtC — ICC (@ICC) April 2, 2020 చదవండి: ఆమెకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఏంటి నీ వేషాలు.. కోహ్లితో చెప్పాలా? -
విండీస్.. విజయంతోనే ఇంటికి
లీడ్స్ : ఇంగ్లండ్ వేదికగా జరగుతున్న ప్రపంచకప్‌లో వెస్టిండీస్ ప్రస్థానం విజయంతోనే ముగిసింది. గురువారం హెడింగ్లీ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో విండీస్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. కరేబియన్ జట్టు నిర్దేశించిన 312 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ నిర్ణీత ఓవర్లలో 288 పరుగులకు కుప్పకూలింది. అఫ్గాన్ ఆటగాళ్లలో ఇక్రామ్ అలీ(86; 93 బంతుల్లో, 8ఫోర్లు), రెహ్మత్ షా(62; 78 బంతుల్లో 10ఫోర్లు)అర్దసెంచరీలతో రాణించారు. అస్గర్ అఫ్గాన్(40), నజీబుల్లా(31) ఫర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్లలో బ్రాత్‌వైట్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. కీమర్ రోచ్ మూడు వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్ భారీ స్కోర్ సాధించడంలో సహకరించిన షాయ్ హోప్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఛేదనలో అఫ్గాన్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్, సారథి గుల్బాదిన్ నైబ్(5) తీవ్రంగా నిరాశ పరిచాడు. అనంతరం మరో ఓపెనర్ రెహ్మత్ షా ఇక్రామ్ అలీతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ అర్దసెంచరీలు పూర్తి చేసుకున్నారు. రెండో వికెట్‌కు 135 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన అనంతరం రెహ్మాత్ను బ్రాత్‌వైట్ ఔట్ చేసి విండీస్‌కు బ్రేక్ ఇస్తాడు. అనంతర వచ్చిన బ్యాట్స్‌మెన్ మెరుపు వేగంతో ఆడకపోవడంతో పాటు.. క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. భారీ స్కోర్ కావడం.. చివర్లో విండీస్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో అఫ్గాన్ ఓటమి చవిచూసింది. అంతకుముందు బ్యాట్స్‌మెన్ షాయ్ హోప్(77; 92బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), లూయిస్ (58; 78బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), పూరన్(58; 43 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలకు తోడు హెట్‌మైర్(39: 31 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), హోల్డర్(45; 34 బంతుల్లో ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపులు మెరిపించడంతో ఆఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో విండీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 311 పరుగుల భారీ స్కోరు చేసింది. అఫ్గాన్ బౌలర్లలో దవ్లత్ రెండు వికెట్లు పడగొట్టగా, షిర్జాద్, నబి, రషీద్ ఖాన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ప్చ్.. గేల్.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్‌కు శుభారంభం దక్కలేదు. కెరీర్లో చివరి వరల్డ్‌కప్ ఆడుతున్న కరేబియన్ వీరుడు క్రిస్ గేల్ (7) నిరాశపర్చాడు. దవ్లత్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ ఇక్రమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత నుంచి లూయిస్–హోప్ జోడీ రెండో వికెట్‌కు 88 పరుగులు జతచేసింది. లూయిస్‌ను ఔట్ చేయడం ద్వారా ఈ జోడీని రషీద్ ఖాన్ విడదీశాడు. ఆ తర్వాత హెట్‌మైర్‌తో కలసి హోప్ మరో ఉపయుక్త భాగస్వామ్యం(65) నెలకొల్పాడు. వీరిద్దరూ స్వల్పవ్యవధిలో ఔట్ కావడంతో విండీస్ స్కోరు కాసేపు మందగించింది. అయితే, ఆఖర్లో పూరన్–హోల్డర్ భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. ఈ జోడీ శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. చివర్లో బ్రాత్‌వైట్ (14 నాటౌట్) బ్యాట్ ఝుళిపించడంతో విండీస్ స్కోరు 300 దాటింది. -
అంపైర్‌తో వాగ్వాదం.. బ్రాత్వైట్కు జరిమానా
మాంచెస్టర్: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కార్లోస్ బ్రాత్వైట్కు జరిమానా పడింది. వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో మ్యాచ్ ఫీజులో 15శాతం కోత విధించారు. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8 నిబంధనను అతిక్రమించడంతో బ్రాత్వైట్కు పరిమానా విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా అతని ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ కూడా పడింది. ప్రస్తుతం అతని ఖాతాలో రెండు డీమెరీట్ పాయింట్లు ఉన్నాయి. భారత ఇన్నింగ్స్ 42వ ఓవర్లో తాను వేసిన ఓ బంతిని అంపైర్ వైడ్ ఇవ్వడంతో బ్రాత్‌వైట్ అంపైర్‌తో వాగ్వాదం చేశాడు. దీన్ని ఫీల్డ్ అంపైర్లతో పాటు థర్డ్ అంపైర్ మ్యాచ్ రిఫరీ క్రిస్బ్రాడ్కు రిపోర్ట్ చేశారు. తన తప్పును రిఫరీ ఎదుట బ్రాత్‌వైట్ అంగీకరించడంతో అతనిపై తదుపరి విచారణ లేకుండా జరిమానా విధించారు. -
బ్రాత్‌వైట్ సెంచరీతో పోరాడినా...
విండీస్ లక్ష్యం 292. స్కోరు 142/4గా ఉన్న దశలో కార్లోస్ బ్రాత్‌వైట్ క్రీజులోకి వచ్చాడు. ఇంకో మూడు ఓవర్లయ్యాక చూస్తే 164/7. ఇక జట్టు ఓటమికి మూడే అడుగుల దూరం. విజయానికి మాత్రం 128 పరుగుల సుదూర ప్రయాణం ఈ దశలో బ్రాత్‌వైట్ అద్భుత ఇన్నింగ్స్‌కు తెరలేపాడు. 9 బౌండరీలు, 5 భారీ సిక్సర్లతో ‘మ్యాచ్ సీన్’ మార్చేశాడు. టెయిలెండర్ల అండతో మెరుపు సెంచరీ సాధించాడు. ఇక 7 బంతుల్లో ఆరే పరుగులు కావాలి. ఆఖరి వికెట్ కావడం... అందునా అవతలి వైపు బ్యాట్స్‌మన్ లేకపోవడంతో సిక్స్‌తో ఆట ముగించేందుకు ప్రయత్నించాడు. అయితే అతడిని దురదృష్టం వెంటాడింది. లాంగాన్ బౌండరీ వద్ద బౌల్ట్ అద్భుత రీతిలో క్యాచ్ అందుకున్నాడు. కివీస్ ఊపిరిపీల్చుకోగా బ్రాత్‌వైట్ కుప్పకూలాడు. ప్రత్యర్థి ఆటగాళ్ల సాంత్వనతో తేరుకున్నాడు. మాంచెస్టర్: ప్రపంచకప్‌లో శనివారం జరిగిన రెండు మ్యాచ్‌లు రసవత్తరంగా ముగిశాయి. భారత్ పసికూన అఫ్గాన్‌పై గెలిచేందుకు ఆఖరిదాకా పోరాడితే... కివీస్‌ను ఓడించేందుకు విండీస్ శక్తిమేర శ్రమించింది. కానీ వెస్టిండీస్ 5 పరుగుల దూరంలో ఆలౌటైంది. బ్రాత్‌వైట్ (82 బంతుల్లో 101; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) వరల్డ్‌కప్‌లో చరిత్రకెక్కే సెంచరీ సాధించాడు. మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు గెలిచింది. పోరాటంతో బ్రాత్‌వైట్ కూడా గెలిచాడు. ఉత్కంఠభరిత మలుపులతో సాగిన ఈ మ్యాచ్‌లో మొదట కివీస్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 291 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్‌ను ఓపెనర్ గేల్ (84 బంతుల్లో 87; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు), మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ హెట్‌మైర్ (45 బంతుల్లో 54; 8 ఫోర్లు, 1 సిక్స్) నడిపించారు. కానీ కీలకమైన సమయంలో ఫెర్గుసన్ (3/59), బౌల్ట్ (4/30) విండీస్ ఇన్నింగ్స్‌ను దెబ్బమీద దెబ్బతీశారు. 164 పరుగులకే 7 వికెట్లను కోల్పోయిన కరీబియన్ జట్టు పరాజయానికి దగ్గరైంది. ఈ దశలో బ్రాత్‌వైట్, కీమర్ రోచ్ (31 బంతుల్లో 14; 1 సిక్స్)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 47 పరుగులు, కాట్రెల్‌కు జతగా తొమ్మిదో వికెట్‌కు 34 పరుగులు జోడించాడు. ఆఖరికి ఖాతా తెరవని థామస్ (0 నాటౌట్)ను కూడా కాచుకొని పదో వికెట్‌కు 41 పరుగులు జోడించాడు. 18 బంతుల్లో 33 పరుగులు అవసరమైన దశలో 48వ ఓవర్ వేసిన హెన్రీ బౌలింగ్‌లో బ్రాత్‌వైట్ జూలు విదిల్చాడు. 2, 6, 6, 6, 4, 1తో 25 పరుగులు పిండుకున్నాడు. ఇక 12 బంతుల్లో 8 పరుగులే కావాలి. నీషమ్ ఓవర్లో సింగిల్స్ తీయకుండా డాట్‌బాల్ ఆడిన బ్రాత్‌వైట్ నాలుగో బంతికి 2 పరుగులు తీసి 80 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖరి బంతిని సిక్సర్‌గా మలిచేందుకు యత్నించి బౌల్ట్ క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. గెలుపుతీరం దాకా తీసుకొచ్చి ఔటైన బ్రాత్‌వైట్ పిచ్‌పైనే కూలబడ్డాడు. కివీస్ ఆటగాళ్లు టేలర్, విలియమ్సన్ సçహా ప్రత్యర్థులంతా ఓదార్చారు. బరువెక్కిన హృదయంతో బ్రాత్‌వైట్ మైదానం వీడాడు. -
వెల్డన్ బ్రాత్‌వైట్.. బాగా ఆడావ్!
మాంచెస్టర్: కేన్ విలియమ్సన్ (148) భారీ శతకంతో అదరగొట్టడంతో వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్ మరో విజయం సాధించింది. శనివారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 291/8 స్కోరు చేసింది. కాట్రెల్ (4/56) కీలక వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో వెస్టిండీస్ జట్టు 49 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటై ఓడింది. బ్రాత్‌వైట్ అద్భుత సెంచరీ (82 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 101)తో చివరిదాకా పోరాడినా విండీస్‌ను గెలిపించలేకపోయాడు. 7 బంతుల్లో 6 పరుగులు కావాల్సిన తరుణంలో సిక్సర్‌కు ప్రయత్నించిన బ్రాత్‌వైట్ అవుటవడంతో విండీస్ ఆశలు వమ్మయ్యాయి. అయితే మ్యాచ్ తర్వాత బ్రాత్‌వైట్ పోరాట స్ఫూర్తిని కివీస్ కెప్టెన్ విలియమ్సన్ అభినందించాడు. ఇంకా ఓవర్ మిగిలి ఉన్నా మ్యాచ్‌ను గెలిపించలేకపోవడంతో నైరాశ్యంలో కూరుకుపోయిన బ్రాత్‌వైట్ పిచ్‌పైనే మోకాళ్లపై కాసేపు అలానే ఉండిపోయాడు. దాంతో బ్రాత్‌వైట్ వద్దకు చేరుకున్న విలియమ్సన్ ‘వెల్డన్.. వెల్ ప్లేయడ్’ అంటూ ఓదార్చాడు. విలియమ్సన్తో పాటు పలువురు కివీస్ సభ్యులు కూడా బ్రాత్‌వైట్‌ను ఓదార్చారు. దీనికి సంబంధించిన ఫొటో వైరల్ కావడంతో విలియమ్సన్తో పాటు కివీస్ సభ్యులపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. ‘ ఈ మ్యాచ్‌లో పరాజయం వెస్టిండీస్ గాయపరిస్తే.. నెట్టింట్లో హల్చల్ చేస్తున్న ఈ ఫొటో మా హృదయాల్ని దోచుకుంది’ అని ఒక అభిమాని పేర్కొనగా, ‘ ఇది క్రీడా స్ఫూర్తి అంటే’ అని మరొక అభిమాని ట్వీట్ చేశాడు. ఒక సెంచరీ వీరుడ్ని మరొక సెంచరీ వీరుడు ఓదార్చుతున్నాడు’ అని మరొకరు పేర్కొన్నారు. -
విలియమ్సన్ నిర్ణయమే కొంప ముంచిందా?
ముంబై : సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫైయర్-1 ఉత్కంఠ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ రెండు వికెట్లతో నెగ్గి ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. అయితే సన్‌రైజర్స్ ఓటమికి సారథి కేన్ విలియమ్సన్ నిర్ణయమే కారణమని సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. ఓ దశలో చెన్నై విజయానికి 18 బంతుల్లో 43 పరుగులు అవసరం కాగా.. క్రీజులో డుప్లెసిస్ మినహా మేటి బ్యాట్స్‌మన్ ఎవరు లేరు. పైగా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌లు భువనేశ్వర్, సిద్దార్థ్ కౌల్, సందీప్ శర్మలున్నారు. దీంతో సన్‌రైజర్స్ విజయం కాయం అని అందరు భావించారు. అందరు అనుకున్నట్లు జరిగితే అది ఐపీఎల్ ఎందుకు అవుతుందన్నట్లు.. 18 ఓవర్లో మ్యాచ్ స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. కెప్టెన్ విలియమ్సన్ డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌లకు కాకుండా బంతిని బ్రాత్ వైట్‌కు ఇచ్చాడు. ఇంకేముంది క్రీజులో పాతుకుపోయిన డుప్లెసిస్ మూడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 20 పరుగులు పిండుకొని మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. అయితే ఈ ఓవర్‌ను కౌల్, భువీ, సందీప్‌లో ఏ ఒక్కరు వేసి.. కట్టడి చేసినా.. మ్యాచ్ సన్ వశమయ్యేదని అభిమానులు, క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఓవర్ కట్టడైతే పరుగుల కోసం చెన్నై ఒత్తిడికి గురై వికెట్ల సమర్పించుకునేదని పేర్కొంటున్నారు. కనీసం 19వ ఓవరైనా భువీకిస్తే అవకాశం ఉండేదని వాపోతున్నారు. టోర్నీ ఆసాంతం అద్భుత కెప్టెన్సీతో రాణించిన విలియమ్సన్ కీలక మ్యాచ్‌లో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవ్వడాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. కొట్టాడు.. ఇచ్చాడు! సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో బ్యాట్స్‌మన్ అంతా విఫలమవ్వగా.. చివర్లో కార్లోస్ బ్రాత్‌వైట్ (29 బంతుల్లో 43 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. శార్ధుల్ ఠాకుర్ వేసిన 20వ ఓవర్లో బ్రాత్‌వైట్ రెండు సిక్స్‌లతో ఏకంగా 20 పరుగులు పిండుకున్నాడు. అదే బ్రాత్‌వైట్ చెన్నై ఇన్నింగ్స్‌లో 18 ఓవర్లో బంతితో అవే 20 పరుగులిచ్చి సన్‌రైజర్స్ ఓటమికి కారణమయ్యాడు. -
'నన్ను స్యామీ అభినందించాడు'
పోర్ట్ ఆఫ్ స్పెయిన్:వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ స్యామీతో తనకు ఎటువంటి విభేదాలు లేవని ఇటీవల టీ 20 కెప్టెన్‌గా ఎంపికైన కార్లోస్ బ్రాత్ వైట్ స్పష్టం చేశాడు. ప్రస్తుత వెస్టిండీస్ జట్టులో చెప్పుకోదగ్గ విభేదాలు కూడా ఏమీ లేవన్నాడు. విండీస్ టీ 20 జట్టుకు కెప్టెన్ గా ఎంపికైన అనంతరం తనను మొదటి అభినందించింది స్యామీయేనని బ్రాత్ వైట్ పేర్కొన్నాడు. 'నేను కెప్టెన్‌గా ఎంపికయ్యాక స్యామీతో మాట్లాడా. అతని నుంచి నాకు అభినందనలతో పాటు దీవెనలు కూడా లభించాయి. అదే కాకుండా త్వరలో భారత జట్టుతో ఆడబోయే టీ 20 సిరీస్ ఒక ఛాలెంజ్‌గా తీసుకోవాలని స్యామీ అన్నాడు. ఒక సీనియర్‌గా ఆటగాడిగా స్యామీ తగిన సూచనలు చేశాడు. స్యామీ ఇలా చెప్పడం నా కెప్టెన్సీ సమర్ధవంతంగా చేయడానికి ఉపయోగపడుతుంది'అని బ్రాత్ వైట్ అన్నాడు. కొన్నినెలల క్రితం భారత్‌లో జరిగిన టీ 20 వరల్డ్ కప్‌ను విండీస్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆ జట్టుకు స్యామీ కెప్టెన్ కాగా, బ్రాత్ వైట్ అప్పుడు జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. కాగా, విండీస్‌తో బోర్డుకు ఆటగాళ్లకు మధ్య చోటు చేసుకున్న విభేదాల కారణంగా కొంతమంది సీనియర్లు జట్టుకు దూరమయ్యారు. దాంతో పాటు స్యామీని టీ 20 కెప్టెన్సీ నుంచి తప్పించి బ్రాత్ వైట్‌కు అప్పగించారు. -
భారత్ ఎలా దాడి చేస్తుందో తెలుసు
సెయింట్ కిట్స్: స్పిన్ బాగా ఆడటంపైనే తమ జట్టు ఫోకస్ చేస్తోందని వెస్డిండీస్ ఆల్ రౌండర్ కార్లోస్ బ్రాత్‌వైట్ అంటున్నాడు. ఎందుకంటే భారత్ లోని స్డేడియాలు ఎలా ఉంటాయి.. అక్కడ తాము ఎలా ఆడామో అచ్చం అదేవిధంగా తమ సొంత మైదానాలలో ఆడతామని ధీమా వ్యక్తంచేశాడు. కరీబియన్ పిచ్‌లు దాదాపు భారత్ లోని పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయని, వీటి మధ్య భారీ వ్యత్యాసం లేదని అభిప్రాయపడ్డాడు. భారత్ లో ఆడిన అనుభవం తమకు ప్లస్ పాయింట్ అయినప్పటికీ, జట్టులో అనుభవం లేని ఆటగాళ్లు ఉండటం విండీస్‌కు కాస్త ప్రతికూలమంటున్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో స్పిన్నర్లు జడేజా, అశ్విన్ రాణించారు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో 2-0తేడాతో విండీస్ ఓటమిపాలైంది. బ్రాత్‌వైత్ ఆసీస్ పై మెల్ బోర్న్లో జరిగిన మ్యాచ్ లో 59 పరుగులు, సిడ్నీలోనూ 69 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆసీస్ లోని పరిస్థితులు తమ దేశంలో ఉండవని, భారత్‌తో కాస్త అనుకూలించే వాతావరణం ఉందన్నాడు. స్లో పిచ్ లపై టీమిండియా ప్రధానాస్త్రం స్పిన్ అని మాకు తెలుసు. స్పిన్నర్లు మా బ్యాట్స్మన్లపై ఎదురుదాడికి దిగుతారు. అయితే గతంతో పోల్చితే ఇప్పుడు పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయన్నాడు. కీమర్ రోచ్ కాస్త ఫిట్ నెస్ సమస్యలతో సతమతమవుతుండగా, మరో స్టార్ పేసర్ జేరోమ్ టేలర్ టెస్ట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. -
'మా విజయ రహస్యం అదే'
ఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9వ సీజన్లో తమ జట్టు సక్సెస్ వెనుక డ్రెసింగ్ రూమ్‌లో సానుకూల వాతావరణమే కారణమని ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడు కార్లోస్ బ్రాత్ వైట్ స్పష్టం చేశాడు. జట్టులోని ప్రతీ ఒక్క ఆటగాడు డ్రెస్సింగ్ రూమ్ లో సరదాగా, సాన్నిహిత్యంగా ఉంటున్నారన్నాడు. ఇదే ఢిల్లీ విజయాల బాట పట్టడానికి ప్రధాన కారణమని బ్రాత్ వైట్ అభిప్రాయపడ్డాడు. ' నేను గత మా ప్రదర్శన గురించి మాట్లాడదలుచుకోలేదు. గతేడాది జట్టులో నేను సభ్యుడిని కూడా కాను. ఈ సీజన్ లో మా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. అంతా కుటుంబంలా కలిసి చర్చిస్తున్నాం. ఇది మా విజయాలకు దోహదం చేస్తుంది'అని బ్రాత్ వైట్ తెలిపాడు. గత మ్యాచ్ లో కీలక స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ కు స్థానం దక్కకపోవడానికి నలుగురు విదేశీ ఆటగాళ్లు ఉండాలన్న నిబంధనే కారణమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో 11 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో చెలరేగిపోయిన బ్రాత్ వైట్.. అన్ని సార్లూ ఆ తరహా ప్రదర్శనతో ఆకట్టుకోవడం కష్టమన్నాడు.తన కంటే ముందు నాయర్,బిల్లింగ్స్ లు రాణించడంతోనే ఒత్తిడి తగ్గి స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపించానన్నాడు. బ్యాటింగ్ వచ్చిన ప్రతీసారి హిట్టింగ్ చేయాలంటే అది కష్టసాధ్యమన్నాడు. -
'అలా ఆడడం మామూలు విషయం కాదు'
న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాది జట్టుకు విజయాన్ని అందించిన వెస్టిండీస్ ఆల్ రౌండర్ కార్లోస్ బ్రాత్ వైట్ హీరోగా మారిపోయాడు. విధ్వంసకర బ్యాటింగ్ తో విండీస్ ను విజేతగా నిలిపిన బ్రాత్ వైట్ ఐపీఎల్ లో ప్రేక్షకులను స్టేడియంకు రప్పిస్తాడని ఢిల్లీ డేర్ డెవిల్స్ సీఈవో హేమంత్ దువా అన్నారు. తీవ్రమైన ఒత్తిడిలో అతడు ఆడిన ఇన్నింగ్స్ అద్భుతమని ప్రశంసించారు. క్లిష్టపరిస్థితుల్లో అసాధారణంగా ఆడడం మామూలు విషయం కాదన్నారు. ఇలాంటి ఇన్నింగ్స్ కోసమే ప్రేక్షకులు మైదానానికి వస్తారని తెలిపారు. ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున బ్రాత్ వైట్ ఆడనున్నాడు. ఈ ఏడాది నిర్వహించిన వేలంలో రూ.4.2 కోట్లకు అతడిని ఢిల్లీ టీమ్ దక్కించుకుంది. టీ20 వరల్డ్ కప్ లో బ్రాత్ వైట్ ఆటతీరు పట్ల హేమంత్ దువా సంతృప్తి వ్యక్తం చేశారు. -
బెన్ స్టోక్స్ గుండె పగిలింది!
ఆఖరి ఓవర్.. 6 బంతుల్లో 19 పరుగులు చేయాలి.. అందరిలో ఉత్కంఠ. కానీ ఆ ఉత్కంఠను పటాపంచలు చేస్తూ విండీస్ హిట్టర్ కార్లోస్ బ్రాత్‌వెయిట్ వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టాడు. బ్రాట్వెయిట్ సహా వెస్టిండీస్ ఆటగాళ్లంతా మైదానంలో ఆనంద పారవశ్యంలో మునిగిపోయారు. నృత్యాలు చేశారు. కానీ చివరి ఓవర్ వేసి ఊహించనిరీతిలో ఊచకోత ఎదుర్కొన్న బెన్ స్టోక్స్ మాత్రం షాక్ తిన్నాడు. కన్నీటిపర్యంతమవుతూ తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. ఆటలో గెలుపోటములు సహజమే అయినా అతడి పరిస్థితి చూసిన వారికి బాధేసింది. టీ20 వరల్డ్ కప్‌లో అత్యంత మెరుగ్గా బౌలింగ్ చేస్తూ ఇంగ్లండ్ జట్టుకు విజయాలు అందించిన బెన్ స్టోక్ ఫైనల్ లో మాత్రం ఆ మ్యాజిక్ చూపలేకపోయాడు. దీనిపై కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ.. 'ఇది సహజం. అతను పూర్తిగా ఛిన్నాభిన్నమయ్యాడు. ఈ ప్రభావం అతనిపై కొన్ని రోజులు ఉంటుంది. అతడి బాధను మేము కూడా పంచుకుంటున్నాం. అతని ఓదార్చి ఉండవచ్చని మీరు చెప్పవచ్చు. కానీ అది వినే స్థితిలో కూడా అతడు లేడు' అని అన్నాడు. క్రికెట్ అనేది అత్యంత క్రూరమైన ఆట అని, ఒకానొక దశలో విండీస్ జట్టును కట్టడి చేసినట్టు తాము భావించినప్పటికీ చివరికి వచ్చేసరికి ఊహించనిరీతిలో ఆ జట్టు విజయం సాధించిందని, క్రికెట్లో ఏదైనా జరుగడానికి ఆస్కారం ఉంటుందని చెప్పాడు. ఫైనల్లో పరాయజానికి బెన్ స్టోక్‌ను నిందించరాదని, ఫైనల్ వరకు తమ జట్టు వచ్చినందుకు తాను గర్విస్తున్నానని, తన జట్టు ఆటతీరు పట్ల కూడా తనకు గర్వంగా ఉందని చెప్పాడు.