Mithali Raj
-
ఆటలోనే కాదు.. స్టైల్లోనూ తగ్గేదేలే.. మిథాలీ రాజ్ స్టన్నింగ్ లుక్స్ (ఫొటోలు)
-
చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. వన్డేల్లో దిగ్గజ కెప్టెన్ మిథాలీ రాజ్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టింది. కాగా భారత మహిళా జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు ఆడింది. తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన గెలవగా.. రెండో వన్డేలో సోఫీ డివైన్ బృందం ఆతిథ్య జట్టుకు షాకిచ్చింది.భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేసి.. 76 పరుగుల తేడాతో ఓడించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య అహ్మాబాద్‌లో మంగళవారం సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డే జరిగింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. 49.5 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌట్ అయింది. 86 పరుగులతో బ్రూక్ హాలీడే కివీస్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచింది.వన్డేల్లో ఎనిమిదో సెంచరీఇక లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్ స్మృతి మంధాన శతకంతో మెరిసింది. తొలి రెండు వన్డేల్లో(5, 0) నిరాశపరిచిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. నరేంద్ర మోదీ స్టేడియంలో మాత్రం విశ్వరూపం ప్రదర్శించింది. 122 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకుంది. కాగా వన్డేల్లో స్మృతికి ఇది ఎనిమిదో సెంచరీ.ఈ క్రమంలో మిథాలీ రాజ్ రికార్డును స్మృతి బ్రేక్ చేసింది. వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన భారత మహిళా బ్యాటర్‌గా అవతరించింది. కాగా గతంలో మిథాలీ రాజ్ 211 వన్డే ఇన్నింగ్స్ ఆడి ఏడు శతకాలు బాదగా.. స్మృతి తన 88వ మ్యాచ్‌లోనే ఎనిమిదో సెంచరీ చేసింది. ఇక ఈ జాబితాలో భారత జట్టు ప్రస్తుత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆరు శతకాలతో మూడో స్థానంలో ఉంది.2-1తో సిరీస్ కైవసంఇక మ్యాచ్ విషయానికొస్తే.. స్మృతితో పాటు హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత ఇన్నింగ్స్(59 నాటౌట్) మెరిసింది. ఫలితంగా భారత్ న్యూజిలాండ్ విధించిన లక్ష్యాన్ని 44.2 ఓవర్లలోనే ఛేదించి ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. సొంతగడ్డపై కివీస్‌తో వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఇక మూడో వన్డేలో సెంచరీ బాదిన స్మృతికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా ఈ మ్యాచ్‌లో 100 పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత.. కివీస్ పేసర్ హన్నా రోవ్ బౌలింగ్‌లో స్మృతి బౌల్డ్ అయింది.వన్డేల్లో అత్యధిక శతకాలు సాధించిన భారత మహిళా క్రికెటర్లుస్మృతి మంధాన- 8*మిథాలీ రాజ్- 7హర్మన్‌ప్రీత్ కౌర్- 6*చదవండి: IPL 2025: అతడికి రూ. 18 కోట్లు.. గుజరాత్ టైటాన్స్ రిటైన్ చేసుకునేది వీరినే!That HUNDRED Feeling 💯🤗Live - https://t.co/pSVaIW4Deg#INDvNZ | @IDFCFIRSTBank | @mandhana_smriti pic.twitter.com/61zSBcOQ2H— BCCI Women (@BCCIWomen) October 29, 2024 -
W T20 WC: ‘హర్మన్‌పై వేటు! స్మృతి కాదు.. కొత్త కెప్టెన్‌గా ఆమెకే ఛాన్స్’
Mithali Raj on Women's T20 World Cup debacle: భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో జట్టు వైఫల్యంపై కీలక వ్యాఖ్యలు చేసింది. లీగ్ దశలోనే నిష్క్రమణకు ప్రధాన కారణం గత మూడేళ్లుగా జట్టులో పురోగతే లేదని నర్మగర్భంగా వ్యాఖ్యానించింది. దుబాయ్‌లో ఉన్న ఆమె ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బ్యాటింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలపై, క్రికెటర్లలో కొరవడిన పట్టుదలపై తన అభిప్రాయాలను పంచుకుంది.‘ప్రపంచకప్‌కు సన్నాహంగా ఆడిన ఆసియా కప్‌లో చిన్న జట్లతో ఆడేటప్పుడు రిజర్వ్ బెంచ్‌ను పటిష్టం చేసేందుకు వారికి అవకాశాలివ్వాలి. పురుషుల జట్టు చేస్తోంది అదే. మెగా ఈవెంట్లు, పెద్ద టోర్నీలకు ముందు ఈ కసరత్తు చాలా అవసరం. కానీ మన మహిళల జట్టు విషయంలో అలాంటిదేదీ ఉండదు. రిజర్వ్ ఆటగాళ్లకు అవకాశాలివ్వరు. ఇది జట్టు నిర్మాణానికి ఇబ్బందికరంగా పరిణమిస్తుంది’ అని వివరించింది.పలు ప్రశ్నలకు మిథాలీ ఇచ్చిన సమాధానాలు... టోర్నీలో టీమిండియా ప్రదర్శనపై మీ విశ్లేషణ? దీనిపై మాట్లాడాలంటే ముందుగా చెప్పుకోవాల్సింది ఆస్ట్రేలియాతో మ్యాచే గురించే! తప్పక గెలవాల్సిన పోరు అది. ఓ దశలో పటిష్ట స్థితిలో కనిపించినా... మళ్లీ కంగారే. మరో పాత కథే! గత రెండు, మూడేళ్లుగా జట్టు సాధించిన పురోగతి నాకైతే కనపించట్లేదు. గట్టి జట్లను ‘ఢీ’కొట్టేముందు చేసే కసరత్తు, ఆటలో ఎత్తుగడలేవీ మెప్పించడం లేదు. అంతర్జాతీయస్థాయిలో కొన్ని జట్లు క్రమంగా పుంజుకున్నాయి. దక్షిణాఫ్రికానే దానికి సరైన ఉదాహరణ.ఆస్ట్రేలియా కంటే కూడా న్యూజిలాండ్‌తో ఎదురైనా పరాజయమే భారత్ నిష్క్రమణకు కారణమని భావిస్తున్నారా? ఆశ్చర్యకర విషయం ఏమిటంటే మనం పరిస్థితులకు తగ్గట్లుగా వెంటనే మారకపోవడమే ఆ మ్యాచ్ ఓటమికి కారణం. మందకొడి వికెట్‌పై వన్డే ప్రపంచకప్‌లో అయితే ముందు నింపాదిగా ఆడి తర్వాత పుంజుకొని ఆడే సౌలభ్యం వుంటుంది. కానీ టీ20 ఫార్మాట్లో అలాంటి అవకాశం ఉండదు. త్వరితగతిన సందర్భాన్ని బట్టి ఆటతీరు మార్చుకోవాలి. సోఫీ డివైన్ చేసింది అదే. కానీ మనం మాత్రం అలా ఆడలేకపోయాం.తరుచూ బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చడం వల్ల ఆయా స్థానాల్లో స్పష్టత కొరవడిందా? జెమీమా, హర్మన్‌ప్రీత్‌లు తరచూ 3, 4 స్థానాలు మార్చుకోవడం కారణమని నేననుకోను. బ్యాటింగ్‌లో ఓపెనర్ల శుభారంభమే అత్యంత కీలకం. షఫాలీ వర్మ దూకుడుగా ఆడుతుందని అందరికీ తెలుసు కానీ అలా జరగలేదు. ఓపెనర్లిద్దరు బాగా ఆడిఉంటే మిడిల్ ఓవర్లలో యథేచ్ఛగా ఆడే అవకాశముంటుంది. మొదట పవర్ ప్లే, ఆఖర్లో డెత్ ఓవర్లు మంచి స్కోరుకు బాట వేస్తాయి. అయితే దురదృష్టవశాత్తూ ఈ టోర్నీలోని కీలక మ్యాచ్‌ల్లో అలాంటి శుభారంభాలు, చివర్లో దూకుడు కరువయ్యాయి. ఆసియా కప్‌లో కనిపించిన లోపాలపై దృష్టి పెట్టాల్సింది. కానీ అలా ఏమీ జరగలేదు. ప్రపంచకప్ ముంగిట ఫీల్డింగ్ విభాగంపై దృష్టి సారించకపోవడం పెద్ద తప్పిదమని మీరు అంగీకరిస్తారా? ఈ విషయంలో ఆస్ట్రేలితో జరిగిన మ్యాచ్ నన్ను తీవ్రంగా నిరుత్సాహపరిచింది. రాధా యాదవ్, జెమీమా రోడ్రిగ్స్ తప్ప 11 మందిలో మిగతా వారంతా మైదానంలో చురుగ్గా కనిపించలేదు. కీలకమైన మ్యాచ్‌లో ఇద్దరితో కట్టడి ఎలా సాధ్యమవుతుంది. ఫిట్నెస్ అతిముఖ్యం. దీనిపై మనం ఒక బెంచ్‌మార్క్‌ను పెట్టుకోవాల్సిందే. నిజాయితీగా అడుగుతున్నా ఏడాదంతా ఎంత మంది మన క్రికెటర్లు ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెడుతున్నారో చెప్పగలరా! ఆ శ్రద్ధలేకే మైదానంలో ఫీల్డింగ్ విభాగంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. హర్మన్‌ప్రీత్ 2018 నుంచి కెప్టెన్ ఉన్నా... ఫలితాలు మాత్రం రావడం లేదు. ఈ నేపథ్యంలో సారథ్య మార్పు అవసరమా? ఒకవేళ సెలక్టర్లు కెప్టెన్‌ను మార్చాలనుకుంటే మాత్రం నేను యువ క్రికెటర్‌కు పగ్గాలివ్వాలని కోరుకుంటాను. సారథ్య మార్పునకు ఇదే సరైన సమయం. ఇంకా ఆలస్యం చేస్తే... మనం ఇంకో ప్రపంచకప్‌కూ దూరమవుతాం. చేస్తే ఇప్పుడే కొత్త సారథిని ఎంపిక చేయాలి. మరీ ప్రపంచకప్ సమీపంలో చేస్తే ఒరిగే ప్రయోజనం కూడా ఉండదు.స్మృతి కాదు.. కొత్త కెప్టెన్‌గా ఆమెకు ఛాన్స్ ఇస్తేనే..వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అందుబాటులో ఉన్నప్పటికీ 24 ఏళ్ల జెమీమాకు పగ్గాలిస్తే మంచిదనిపిస్తుంది. ఆమెకు ఎక్కువకాలం సారథిగా కొనసాగే వీలుంటుంది. పైగా మైదానంలో చురుకుదనం, ఫీల్డింగ్‌లో అందరిలో ఉత్తేజం నింపే శక్తి ఆమెకుంది. ఈ టోర్నీ ఆసాంతం ఆమె కనబరిచిన చురుకుదనం నన్ను బాగా ఆకట్టుకుంది. అలాంటి జెమీమాకు పగ్గాలిస్తే జట్టులో కొత్త ఉత్తేజాన్ని నింపినట్లవుతుంది. చదవండి: W T20 WC: ఇంగ్లండ్ ఇంటికి...సెమీఫైనల్లో వెస్టిండీస్ -
యూఏఈలో ఆడటం సానుకూలాంశం
న్యూఢిల్లీ: మహిళల టి20 ప్రపంచకప్ టోర్నీ యూఏఈ వేదికపై జరగనుండటం భారత జట్టుకు కలిసొచ్చే అంశమని మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ పేర్కొంది. మిగతా జట్లకంటే షార్జా, దుబాయ్ వేదికలు భారత్‌కు సానుకూలమని ఆమె విశ్లేషించింది. అక్కడి స్థానిక వాతావరణ, పిచ్ పరిస్థితులు అందరికంటే భారత్‌కే ఎక్కువగా లాభిస్తాయని ఆమె చెప్పింది. ‘యూఏఈలోని పరిస్థితులు కాస్తా భిన్నంగా ఉండొచ్చేమో కానీ భారత్‌కు దగ్గరగానే ఉంటాయి. ఇది మెగా ఈవెంట్లో మన జట్టుకు బాగా ఉపకరించే అంశం. ఈ సానుకూలతతో జట్టు అక్కడి వాతావరణానికి ఇట్టే అలవాటు పడుతుంది’ అని మిథాలీ వివరించింది. అయితే జరగబోయేది మెగా ఈవెంట్ అన్న సంగతి మరవొద్దని ప్రతీ జట్టు ప్రపంచకప్ కోసం సన్నద్ధమయ్యే వస్తుందని తమ జట్టు వర్గాలను అప్రమత్తం చేసింది. ‘మెగా ఈవెంట్లో పాల్గొనే ప్రతి జట్టు అన్ని రంగాల్లో పూర్తిస్థాయిలో సిద్ధమయ్యే వస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు’ అని తెలిపింది. ఐసీసీ ప్రపంచకప్ టోరీ్నలో ఫైనల్ చేరిన సీనియర్ మహిళల జట్టు ఇంత వరకు టైటిల్‌ను మాత్రం గెలవలేకపోయింది. అండర్–19 ప్రపంచకప్‌లో మాత్రం యువ మహిళల జట్టు గతేడాది ఆరంభమైన తొలి మెగా ఈవెంట్‌ను గెలిచింది. ఈ ప్రపంచకప్‌లో భారత జట్టు రాణించాలని, కప్‌తో తిరిగి రావాలని బలంగా కోరుకుంటున్నట్లు మాజీ కెపె్టన్ చెప్పింది. వచ్చే నెల 3 నుంచి యూఏఈలో అమ్మాయిల టి20 ప్రపంచకప్ మొదలవుతుంది. దుబాయ్ వేదికగా 4వ తేదీన భారత్ తమ తొలి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడుతుంది. -
ధనాధన్ ఇన్నింగ్స్.. కెరీర్ బెస్ట్ స్కోర్! కానీ..
నేపాల్‌తో మ్యాచ్‌లో భారత మహిళా క్రికెటర్ షెఫాలీ వర్మ సూపర్ ఇన్నింగ్స్ ఆడింది. ఆది నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగుతూ పరుగుల వరద పారించింది. ఈ క్రమంలో తన టీ20 కెరీర్లోనే అత్యుత్తమ స్కోరు సాధించింది.కానీ శతకం చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. వుమెన్స్ ఆసియా కప్ టీ20- 2024లో భాగంగా భారత్- నేపాల్ మధ్య మంగళవారం మ్యాచ్ జరుగుతోంది. శ్రీలంకలోని డంబుల్లా వేదికగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది.ఈ క్రమంలో ఓపెనర్ షెఫాలీ వర్మ టీమిండియాకు శుభారంభం అందించింది. కేవలం 48 బంతుల్లోనే 81 పరుగులు సాధించింది. ఆమె ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. మరో ఓపెనర్ హేమలత(42 బంతుల్లో 47) కలిసి షెఫాలీ తొలి వికెట్‌కు 122 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.ఇక షెఫాలీ వర్మ అంతర్జాతీయ టీ20 కెరీర్లో ఇదే అత్యధిక స్కోరు(81) కావడం విశేషం. అంతేకాదు వుమెన్స్ టీ20 ఆసియా కప్‌లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రెండో క్రికెటర్‌గా షెఫాలీ నిలిచింది. 2018 నాటి టోర్నీలో 69 బంతుల్లో 97 పరుగులతో అజేయంగా నిలిచిన మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఈ జాబితాలో షెఫాలీ కంటే ముందు వరుసలో ఉంది.ఓవరాల్‌గా శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు(119 నాటౌట్) స్థానాన్ని మిథాలీ రాజ్, షెఫాలీ వర్మ ఆక్రమించారు. ఇక భారత్ తరఫున టీ20లలో షెఫాలీ సాధించిన పదో అర్ధ శతకం ఇదే. అంతేకాదు టీమిండియా తరఫున అతిపిన్న వయసులో ఈ ఘనత సాధించిన క్రికెటర్ కూడా షఫాలీ వర్మనే కావడం విశేషం. ఇరవై ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇప్పటి వరకు 79 అంతర్జాతీయ టీ20లు ఆడి 1906 పరుగులు చేసింది.ఇక నేపాల్‌తో మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 178 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన నేపాల్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఈ క్రమంలో సగం ఆట(10 ఓవర్లు) ముగిసేసరికి నేపాల్ మూడు వికెట్లు కోల్పోయి కేవలం 48 పరుగులు మాత్రమే చేసింది.ఇదిలా ఉంటే.. ఆసియా టీ20 కప్-2024లో భారత్ ఇప్పటికే సెమీస్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. పాకిస్తాన్, యూఏఈలపై గెలుపొందిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే నేరుగా సెమీ ఫైనల్లో అడుగుపెడుతుంది. -
చరిత్ర సృష్టించిన శ్రీలంక కెప్టెన్.. మిథాలీ రాజ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
మహిళల ఆసియాకప్-2024లో భాగంగా మలేషియాతో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్ చమరి అతపత్తు ఆజేయ సెంచరీతో చెలరేగింది. మలేషియా బౌలర్లకు అతపత్తు చుక్కలు చూపించింది. దంబుల్లా మైదానంలో ఆతపత్తు బౌండరీల వర్షం కురిపించింది. ఓవరాల్‌గా 69 బంతులు ఎదుర్కొన్న చమరి.. 14 ఫోర్లు, 7 సిక్స్‌లతో 119 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగుల భారీ స్కోర్ సాధించింది.లంక బ్యాటర్లలో చమరితో పాటు హర్షిత మాధవి(26), సంజీవని(31) పరుగులతో రాణించారు. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన ఆతపత్తు పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది.ఆతపత్తు సాధించిన రికార్డులు ఇవే..⇒మహిళల ఆసియాకప్ చరిత్రలో సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా ఆతపత్తు నిలిచింది. ఇప్పటివరకు మహిళల ఆసియాకప్‌లో ఎవరూ సెంచరీ సాధించలేకపోయారు.⇒అదే విధంగా మహిళల ఆసియాకప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన ప్లేయర్‌గా కూడా ఆతపత్తు రికార్డులకెక్కింది. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్(97) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో మిథాలీ ఆల్‌టైమ్ రికార్డును ఆతపత్తు బ్రేక్ చేసింది.⇒అంతర్జాతీయ టీ20ల్లో ఆతపత్తుకు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం. -
శిల్పకళావేదికలో మాదక ద్రవ్యా ల వ్యతిరేక దినోత్సవం కార్యక్రమం (ఫొటోలు)
-
మహిళా క్రికెట్లో ఓ అద్భుతం
సాక్షి, హైదరాబాద్ : సరిగ్గా 16 ఏళ్ల క్రితం మహిళా క్రికెట్లో ఓ అద్భుతం చోటుచేసుకుంది. ఓ 19 ఏళ్ల అమ్మాయి అసాధారణ బ్యాటింగ్‌తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంది. క్రికెట్ అంటే పడిచచ్చే భారత్‌లో మహిళా క్రికెట్‌పై కూడా ఆసక్తి పెరిగేలా తొలి బీజం వేసింది. భారత్ తరపున తొలి డబుల్ సెంచరీ సాధించడమే కాకుండా అప్పటికి మహిళా టెస్టు చరిత్రలో ఎవరూ అందుకోని ఘనతను అందుకొని శిఖరాన నిలిచింది. ఆమె ఎవరో కాదు.. రెండుసార్లు భారత మహిళా జట్టు ప్రపంచకప్ ఫైనల్‌కు చేర్చిన రథసారథి, మన హైదరాబాద్ క్వీన్ మిథాలీ రాజ్. ఆమె తన కెరీర్లో సాధించిన డబుల్ సెంచరీకి నేటికి సరిగ్గా 16 ఏళ్లు. ఈ డబుల్ సెంచరీని గుర్తు చేస్తూ మహిళా బీసీసీఐ ట్వీట్ చేసింది. 2002, ఆగస్టు 16న ఇంగ్లండ్‌తో జరిగిన టాంటన్ టెస్టులో 19 ఏళ్ల మిథాలీ రెచ్చిపోయింది. 407 బంతుల్లో 19 ఫోర్లతో 214 పరుగులు చేసి భారత్ తరపున తొలి డబుల్ సెంచరీ సాధించిన మహిళా క్రికెటర్‌గా.. ఓవరాల్‌గా ఐదో క్రికెటర్‌గా గుర్తింపు పొందింది. అప్పటికే వ్యక్తిగత అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్‌గా రికార్డు నమోదు చేసింది. ఆ తర్వాత 2004లో పాక్ మహిళా క్రికెటర్ కిరణ్ బలుచ్ వెస్టిండీస్ 242 పరుగులు సాధించి మిథాలీ రికార్డును బ్రేక్ చేసింది. ఈ ఇన్నింగ్స్ తర్వాతే భారత మహిళా క్రికెట్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. మిథాలీ స్పూర్తితో ఎంతో మంది యువతులు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు. చదవండి: ట్రోలింగ్‌కు మిథాలీ సూపర్ కౌంటర్! -
లంకపై భారత్ జయభేరి
కౌలాలంపూర్: గత మ్యాచ్‌లో ఎదురైన పరాజయం నుంచి త్వరగానే తేరుకున్న భారత మహిళల జట్టు ఆసియా కప్ టి20 టోర్నీ నాలుగో లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకపై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక... భారత బౌలర్ల ధాటికి 7 వికెట్ల నష్టానికి 107 పరుగులకే పరిమితమైంది. హసిని పెరీరా (43 బంతుల్లో 46 నాటౌట్; 4 ఫోర్లు) టాప్ స్కోరర్. ఏక్తా బిష్త్ (2/20), జులన్ గోస్వామి (1/20), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అనూజ పాటిల్ (1/19), పూనమ్ యాదవ్ (1/23) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆ జట్టులో ఏడుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం టాపార్డర్ సమష్టిగా రాణించడంతో భారత్ 18.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసి గెలిచింది. మిథాలీ రాజ్ (23), హర్మన్ ప్రీత్ కౌర్ (24), వేద కృష్ణమూర్తి (29 నాటౌట్; 4 ఫోర్లు) అనూజ పాటిల్ (19 నాటౌట్) తలా కొన్ని పరుగులు చేశారు. ఈ టోర్నీలో థాయ్‌లాండ్, మలేసియాలపై వరుస విజయాలు సాధించిన హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం గత మ్యాచ్‌లో బంగ్లా చేతిలో ఓడింది. మిథాలీ@ 2000... ఈ మ్యాచ్ ద్వారా భారత వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ టి20ల్లో భారత్ తరఫున 2 వేల పరుగులు పూర్తి చేసిన తొలి క్రీడాకారిణిగా ఆమె రికార్డు సృష్టించింది. 35 ఏళ్ల మిథాలీ 74 మ్యాచ్‌లు ఆడి 2015 పరుగులు చేసింది. మొత్తంగా ఈ మైలురాయిని దాటిన ఏడో మహిళా క్రికెటర్ మిథాలీ. ఇంగ్లండ్ స్టార్ ఎడ్వర్ట్స్ (2,605) అగ్రస్థానంలో ఉంది. టి20 గణాంకాల్లో పురుషుల జట్టు కెప్టెన్ కోహ్లి (1,983) కూడా మిథాలీ కంటే వెనుకే ఉండటం గమనార్హం. -
బీసీసీఐ పై అభిమానుల ఆగ్రహం
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా క్రికెటర్ల వార్షిక వేతనాలను భారీగా పెంచిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీతాల పెంపులో పురుష, మహిళా క్రికెటర్లకు వ్యత్యాసం చూపించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. భారత పురుషుల క్రికెటర్లకు కోట్లలో వార్షిక వేతనం ఉండగా.. మహిళా క్రికెటర్లకు లక్షల్లో ఉండటం ఏమిటని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా క్రికెటర్లుకు ఇచ్చిన కానుక ఇదేనా? అని నిలదీస్తున్నారు. దేశం తరుఫున ఇరు జట్లు అద్బుతంగా రాణిస్తున్నా జీతాల్లో ఇంత వ్యత్యాసం ఏమిటో ప్రశ్నించండి అని ఒకరంటే.. షేమ్ బీసీసీఐ.. మహిళా టాప్ క్రికెటర్ల జీతాలు పురుషుల సీ గ్రేడ్ ఆటగాళ్ల వేతనాల్లో సగం ఉండటం సిగ్గుచేటని మరోకరు ట్రోల్ చేస్తున్నారు. పురుషుల కెప్టెన్ విరాట్ కోహ్లికి రూ 7 కోట్లు వస్తే మహిళా జట్టు కెప్టెన్‌కు మరి రూ. 50 లక్షలా అని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక భారత పురుషుల క్రికెటర్ల జీతాలు ఏ+ గ్రేడ్- రూ. 7 కోట్లు, ఏ గ్రేడ్- రూ. 2 కోట్ల నుంచి 5 కోట్లు, బీ గ్రేడ్ - రూ.1 కోటి నుంచి 3 కోట్లు, సీ గ్రేడ్- రూ. 50 లక్షల నుంచి 1 కోటి మేర పెంచారు. ఇటీవల మహిళా క్రికెటర్ల అద్బుతంగా రాణించడంతో అభిమానుల నుంచి ఆదరణ పెరిగింది. ఈ నేపథ్యంలో వీరి జీతాలు కూడా భారీగా పెరుగుతాయని అందరు భావించారు. కానీ బీసీసీఐ మహిళా దినోత్సవం నాడే మహిళా క్రికెటర్లకు మొండి చెయ్యి చూపించింది. జీతాలు పెంచిన అవి పురుష క్రికెటర్లతో పోల్చితో చాలా తక్కువ. భారత మహిళా క్రికెటర్ల వార్షిక వేతనాలు.. గ్రేడ్ ఏ- 50 లక్షలు, గ్రేడ్ బీ- 30 లక్షలు, గ్రేడ్ సీ -10 లక్షలుగా ప్రకటించారు. ఈ వార్షిక వేతనాల వ్యత్యాసం మరీ ఇంతగా ఉండటం నెటిజన్లకు ఆగ్రహం కలిగిస్తోంది. नारी शशक्तिकरण की धज्जियाँ उड़ा रहा है @BCCI The pay gap b/w the male and female cricket players is so huge. How this gap will uplift the motivation of the women players @PMOIndia @Manekagandhibjp @NCWIndia please look into this @BJP4India @narendramodi @INCIndia @cpimspeak @IYC pic.twitter.com/xvClEyH0a7 — Sachin Dubey (@ISachinDubey) 8 March 2018 -
సఫారీ గడ్డపై నారీభేరి
దక్షిణాఫ్రికా పర్యటనలో భారత నారీమణుల జట్టు చరిత్రకెక్కే సిరీస్‌లను కైవసం చేసుకుంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో మొదట వన్డే సిరీస్‌ను, తాజాగా టి20 సిరీస్‌నూ కైవసం చేసుకొని ఇక్కడ రెండు ఫార్మాట్లలలో నెగ్గిన తొలి జట్టుగా ఘనత వహించింది. శనివారం జరిగిన ఆఖరి టి20లో బ్యాటింగ్‌లో మిథాలీ రాజ్, ముంబై టీనేజ్ సంచలనం జెమీమా రోడ్రిగ్స్... బౌలింగ్‌లో శిఖా పాండే, రుమేలీ ధర్, రాజేశ్వరి అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నారు. కేప్‌టౌన్: భారత మహిళల జట్టు సఫారీ పర్యటనను దిగ్విజయంగా ముగించింది. ఆఖరి టి20లో హర్మన్‌ప్రీత్ బృందం 54 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించింది. ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత మహిళల జట్టు 3–1తో కైవసం చేసుకుంది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మూడు వన్డేల సిరీస్‌ను 2–1తో చేజిక్కించుకున్న భారత్ వరుస సిరీస్‌లతో దక్షిణాఫ్రికా గడ్డపై చరిత్ర సృష్టించింది. శనివారం జరిగిన పోరులో మొదట బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. అనుభవజ్ఞురాలైన మిథాలీ రాజ్ (50 బంతుల్లో 62; 8 ఫోర్లు, 3 సిక్సర్లు)తో పాటు టీనేజ్ సంచలనం జెమీమా రోడ్రిగ్స్ (34 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (17 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్సర్లు) కూడా ధాటిగా ఆడింది. సఫారీ బౌలర్లలో మరిజనే కాప్, అయబొంగ కాకా, షబ్నిమ్ ఇస్మాయిల్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం దక్షిణాఫ్రికా జట్టు 18 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు శిఖా పాండే (3/16), రుమేలీ ధర్ (3/26), రాజేశ్వరి గైక్వాడ్ (3/26) సమష్టిగా విజృంభించడంతో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. మరిజనే కాప్ చేసిన 27 పరుగులే ప్రత్యర్థి ఇన్నింగ్స్ టాప్‌స్కోర్ కాగా... ట్రియాన్ 25 పరుగులు చేసింది. సిక్సర్లతో చెలరేగుతున్న కాప్ ఇన్నింగ్స్‌కు జెమీమా అద్భుతమైన క్యాచ్‌తో ముగింపు పలికింది. రుమేలీ బౌలింగ్‌లో మరిజనె కాప్ భారీ షాట్ బాదగా... బౌండరీ లైన్ దగ్గర జెమీమా కళ్లు చెదిరే క్యాచ్ అందుకోవడం మ్యాచ్‌లో హైలైట్. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ రెండూ మిథాలీకే లభించాయి. -
తొలి టి20లో భారత్ ఘన విజయం
పోట్చెఫ్స్ట్రూమ్: దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టి20లో భారత మహిళల జట్టు విజయం సాధించింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య టీమ్‌ను 7 వికెట్లు తేడాతో చిత్తుగా ఓడించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 18.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. మిథాలీరాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో విజయంలో కీలకపాత్ర పోషించింది. 48 బంతుల్లో 6 ఫోర్లు సిక్సర్‌తో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. రోడ్రిక్స్(37), వేద కృష్ణమూర్తి(37) రాణించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. వాన్ నీకెర్క్ 38, ట్రియన్ 32, డు ప్రీజ్ 31 రాణించారు. భారత బౌలర్లలో అనుజ పాటిల్ 2 వికెట్లు తీసింది. శిఖా పాండే, వస్త్రకార్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
దక్షిణాఫ్రికాపై భారత మహిళల ఘన విజయం
కింబర్లీ: ఐసీసీ మహిళల చాంపియన్ షిప్లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ మహిళలు సైతం అదరగొట్టారు. ఆతిథ్య జట్టుపై 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. ఇక 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టును 125 పరుగులకే కుప్పకూల్చారు. భారత మహిళల బౌలర్లలో సీనియర్ బౌలర్ జూలన్ గోస్వామి నాలుగు వికేట్లతో కదం తొక్కగా.. శిఖా పాండే మూడు , పూనమ్ యాదవ్‌లు రెండు వికెట్లు తీశారు. గైక్వాడ్‌కు ఓ వికెట్ దక్కింది. దీంతో ప్రొటీస్ మహిళా బ్యాట్స్ఉమెన్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. సఫారీ మహిళా బ్యాట్స్ఉమెన్లలో కెప్టెన్ వాన్ నీకెర్క్ (41), లారా వోల్వార్డ్(21), మరిజన్నే కాప్(23), సునే లూస్(18)లు మినహా మిగతా ఎవరూ రెండెంకల స్కోరు చేయలేదు. దీంతో ఆతిథ్య జట్టు 43.2 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌట్ అయింది. స్మృతి మెరుపులు.. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత మహిళలు నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 213 పరుగులు చేశారు. ఓపెనర్ స్మృతి మంధన 84 ( 98 బంతులు, 8 ఫోర్లు 1 సిక్సు)తో మెరవగా కెప్టెన్ మిథాలీ రాజ్ 45(70 బంతులు,2 ఫోర్లు) రాణించారు. మిగతా భారత బ్యాట్స్ఉమన్లు విఫలమయ్యారు. -
‘మొదటి’ మహిళలకు నేడు పురస్కారాలు
సాక్షి, న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో విశేష కృషి చేసి అరుదైన విజయాలు నమోదు చేసిన మహిళలను కేంద్రం పురస్కారాలతో సత్కరించనుంది. క్రీడా, వైద్య, ఆరోగ్య, రక్షణ, విమానయాన, పరిశ్రమ, సినీ రంగాల్లో సాధించిన విజయాలను గుర్తించి మొత్తం 112 మంది మహిళలను కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ అవార్డులకు ఎంపిక చేసింది. రాష్ట్రపతి భవన్లో శనివారం నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి చేతులమీదుగా వీరంతా అవార్డులను అందుకోనున్నారు. ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తొలి మహిళ పీవీ సింధు, ప్రపంచ టెన్నిస్ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానం సాధించిన మొదటి భారత క్రీడాకారిణి సానియా మిర్జా, ప్రపంచ మహిళా క్రికెట్లో తొలిసారిగా 6000 పరుగులు పూర్తిచేసిన తొలి మహిళా క్రికెటర్‌గా మిథాలీ రాజ్, ఒలింపిక్ పతకం గెలిచిన మొదటి భారత వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరీ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) తొలి మహిళా అధ్యక్షురాలు, శోభన కామినేని, బ్రిటీష్ పార్లమెంటు ద్వారా హౌస్ ఆఫ్ కామన్స్ గౌరవాన్ని పొందిన తొలి భారతీయ గాయకురాలు కేఎస్ చిత్ర, హైదరాబాద్‌కు చెందిన తొలి మహిళా మ్యూజిక్ టెక్నీషియన్ సాజిదా ఖాన్ పురస్కారాలు అందుకోనున్నారు. -
అలా అంటే ఒప్పుకోను.!
సాక్షి, హైదరాబాద్ : భారత్‌లో బాలీవుడ్ నటులతోనే క్రీడలు ప్రాచుర్యం పొందాయన్న వాదనను ఒప్పుకోనని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా స్పష్టం చేశారు. నగరంలో జరగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో భాగంగా బుధవారం ‘క్రీడా రంగంలో వ్యాపార విజయం’ అంశంపై మాస్టర్‌క్లాస్ సెషన్ జరిగింది. ఈ చర్చ కార్యక్రమానికి సమన్వయకర్తగా హర్షబోగ్లే వ్యవహరించగా.. టెన్నిస్ స్టార్ సానియ మీర్జా, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్, వన్ చాంపియన్‌షిప్ ఉపాధ్యక్షులు చాత్రి సిత్యోంద్టాంగ్‌లు పాల్గొన్నారు. బాలీవుడ్ నటుల ప్రచారంతో క్రీడలు ప్రాచుర్యం పొందాయన్న వాదనను సానియా మీర్జా తప్పుబట్టారు. క్రీడాకారులు రాణించడం వల్లనే ఆదరణ లభిస్తోందని స్పష్టంచేశారు. క్రీడల్లో మహిళలు కూడా రాణిస్తున్నారని, టెన్నిస్ క్రికెట్ లాంటి క్రీడల్లో మహిళలను మరింత ప్రోత్సాహించాలన్నారు. రాత్రికి రాత్రే ఎవరూ గొప్ప క్రీడాకారులు కాలేరని, పట్టుదల, కృషి ఎంతో అవసరమన్నారు. నిరంతర శ్రమ, పట్టుదలతోనే విజయాలు సాధ్యమవుతాయని, కొత్త క్రీడాకారులకు ప్రోత్సాహకం అందజేయాలని సానియా సూచించారు. ఆర్థికంగా బాగా ఉన్నవారే క్రీడలవైపు వస్తున్నారని, చాలా మంది గ్రామీణ క్రీడాకారులు వసతులు, ఆర్థిక లేమితో అక్కడే ఉండిపోతున్నారని మిథాలీ రాజ్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మంచి క్రీడా నైపుణ్యాలున్న వారున్నారని వారందరికీ చేయుతనివ్వాలని మిథాలీ సూచించారు. దేశ ప్రజలు క్రికెట్ నుంచి అన్ని క్రీడలవైపు మొగ్గు చూపుతున్నారని కోచ్ గోపిచంద్ అభిప్రాయపడ్డారు. టెన్నిస్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్ ఇలా అన్ని క్రీడలపై ఆసక్తి కనబరుస్తున్నారని, ముఖ్యంగా క్రీడల్లోకి రావడానికి మహిళలు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు. బ్యాడ్మింటన్‌లో క్రీడాకారులు బాగా రాణిస్తున్నారు. క్రీడాకారుడి నుంచి కామెంటేటర్ వరకు క్రీడారంగంలో చాలా అవకాశాలున్నాయని గోపిచంద్ పేర్కొన్నారు. -
మన సారథులు మళ్లీ నం.1
దుబాయ్: భారత క్రికెట్ కెప్టెన్లు విరాట్ కోహ్లి, మిథాలీ రాజ్ టాప్ లేపారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో పురుషులు, మహిళల కేటగిరీల్లో మనవాళ్లే అగ్రస్థానంలో ఉన్నారు. బ్యాటింగ్ సంచలనం విరాట్ కోహ్లి పది రోజుల వ్యవధిలోనే తిరిగి నంబర్ వన్ ర్యాంకుకు ఎగబాకాడు. ఈ క్రమంలో సచిన్ 19 ఏళ్ల క్రితంనాటి రేటింగ్ పాయింట్ల రికార్డును 28 ఏళ్ల ఈ భారత సారథి అధిగమించాడు. కివీస్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో 263 పరుగులు చేసిన కోహ్లి 889 రేటింగ్ పాయింట్లతో ఐసీసీ వన్డే బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. 1998లో సచిన్ పేరిట ఉన్న 887 రేటింగ్ పాయింట్ల రికార్డును చెరిపేశాడు. రోహిత్ శర్మ కూడా తన కెరీర్లోనే ఉత్తమ రేటింగ్ (799) పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నాడు. మాజీ కెప్టెన్ ధోని ఒక స్థానాన్ని మెరుగు పర్చుకొని 11వ ర్యాంకుకు చేరాడు. వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా కెరీర్ బెస్ట్ మూడో ర్యాంకుకు ఎగబాకాడు. కివీస్‌తో సిరీస్‌లో అతను 6 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్‌పై గెలిచినప్పటికీ భారత్ (119) 2 పాయింట్ల లోటుతో రెండో స్థానంలోనే ఉంది. దక్షిణాఫ్రికా (121) అగ్రస్థానంలో ఉంది. మహిళల్లో మిథాలీ... భారత మహిళల కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా అగ్రస్థానానికి చేరింది. తాజా వన్డే బ్యాట్స్ఉమెన్ ర్యాంకింగ్స్‌లో ఈ హైదరాబాదీ క్రికెటర్ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని 753 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. తదుపరి రెండు, మూడు ర్యాంకుల్లో ఎలైస్ పెర్రీ (ఆస్ట్రేలియా; 725), అమి శాటెర్త్‌వైట్ (న్యూజిలాండ్; 720) నిలిచారు. బౌలింగ్ విభాగంలో భారత వెటరన్ పేసర్ జులన్ గోస్వామి నిలకడగా రెండో స్థానంలోనే ఉంది. -
అమీర్‌ఖాన్‌కు ఆమె తెలియదా.?
సాక్షి, హైదరాబాద్: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ ఎవరు అని టీవీ వ్యాఖ్యాత అడిగిన ప్రశ్న బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్‌ను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఆమె పేరు నాకు తెలుసు కాకపోతే ఇప్పుడు గుర్తుకు రావడంలేదు’ అని అమీర్ బుకాయించాల్సిన పరిస్థితి హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ మైదానంలో చోటు చేసుకుంది. భారత్-ఆసీస్ మధ్య చివరి టీ20కి హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. కోహ్లి ఆహ్వానం మేరకు ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఉప్పల్‌కి వచ్చిన అమీర్‌ఖాన్.. జైరా వశీంతో కలిసి మైదానంలో సందడి చేశారు. ఈ సందర్భంగా టీవీ వ్యాఖ్యాత జతిన్ సప్రూ, వీరేంద్ర సెహ్వాగ్‌లు వీరిని కొన్ని ప్రశ్నలు అడిగారు. ట్రై బ్రేకర్ ప్రశ్న అంటూ ‘భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ ఎవరు’ అని ప్రశ్నించారు. దీనికి అమీర్, జైరా సమాధానం చెప్పలేకపోయారు. నాకు తెలుసు కానీ ఇప్పుడు గుర్తుకురావడంలేదు’ అని ఆమీర్ అన్నాడు. భారత మహిళా క్రికెట్ జట్టును రెండు సార్లు ప్రపంచ కప్ ఫైనల్‌కు చేర్చిన కెప్టెన్ మిథాలీ రాజ్, అమీర్‌కు తెలియకపోవడం ఏమిటని నెటిజన్లు విస్మయం చెందుతున్నారు. అప్పటికీ సప్రూ వారికి కొన్ని సూచనలు ఇస్తున్నా ఫలితం లేకపోయింది. అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో అంపైర్లు ఈ మ్యాచ్ రద్దు చేసిన విషయం తెలిసిందే. -
‘అమ్మాయిలు.. ఆటలాడండి’..
సాక్షి, న్యూఢిల్లీ: అమ్మాయిలు తమ కలలను నేరువేర్చుకోవాలంటే ఆటలవైపు మొగ్గు చూపాలని భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండ్కూలర్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా యూనిసెఫ్ నిర్వహించిన కార్యక్రమంలో సచిన్, మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌లు పాల్గొన్నారు. యూనిసెఫ్ ప్రచారకర్త అయిన సచిన్ మాట్లాడుతూ.. మా తల్లితండ్రుల స్పూర్తితోనే నేను ఇంతటి స్థాయికి వచ్చానని, చిన్నప్పుడే వారు నా నైపుణ్యాన్ని గుర్తించి మద్దతుగా నిలిచారన్నారు. మీరు కూడా మీ పిల్లల నైపుణ్యాన్ని గుర్తించి మద్దతుగా నిలవాలని తల్లితండ్రులకు సూచించారు. బాలికలను మీ ఆస్తిగా పరిగణించాలే తప్ప.. పెళ్లి చేయాల్సి వస్తదని భారంగా భావించొద్దన్నారు. ప్రభుత్వాలు కూడా అమ్మాయిల విద్య, వారి కలల సాకారం కోసం ప్రత్యేక పథకాలు రూపోందించాలని అభిప్రాయపడ్డారు. ఇక్కడ లింగ వివక్షకు తావులేదని, అబ్బాయిలు, అమ్మాయిలు సమానమమని, మనమంతా అమ్మాయిలకు పూర్తి స్వేచ్చను ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌లో బాల్యవివాహాలు, లింగ వివక్ష రూపుమాపాలంటే అది క్రీడలతోనే సాధ్యమన్నారు. అమ్మాయిలంతా క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. ♦ అమ్మాయిలు డౌన్ అవద్దు.. ‘అమ్మాయిలమని డౌన్ కావద్దు. ఒక క్రీడాకారిణిగా చెబుతున్నా.. జెండర్ అనేది సమస్యే కాదు. అమ్మాయిలంతా ఆటలాడండి. అవి మీ నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తాయి. మానసికంగా ధృడపరుస్తాయి. ఆరోగ్యంగా ఉంచడంతో పాటు జీవితంలోని ఛాలెంజ్‌లను ధైర్యంగా ఎదుర్కోనేలా సిద్దం చేస్తాయి.’ అని మీథాలీ రాజ్ అన్నారు. -
మిథాలీరాజ్‌గా...
అటు బాలీవుడ్‌లోనూ ఇటు దక్షిణాదిలోనూ బయోపిక్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పటికే క్రికెట్ దిగ్గజాలు అజహ రుద్దీన్, ధోనీ, సచిన్‌ల బయోపిక్‌లతో సినిమాలొచ్చాయి. తాజాగా భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్ రూపొందనుందట. ఈ చిత్రంలో మిథాలీ పాత్రలో సమంత నటించనున్నారని సమాచారం. ప్రియాంకా చోప్రాతో ‘మేరీకోమ్’ బయోపిక్‌ను నిర్మించిన వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ మిథాలీ బయోపిక్‌ను పలు భాషల్లో రూపొందించనుందట. మిథాలీ పాత్రకు సమంత న్యాయం చేయగలరని వయాకామ్ సంస్థ ఆమెతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. మరి.. మిథాలీ రాజ్ బయోపిక్ లో నటించేందుకు సమంత గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారా? వెయిట్ అండ్ సీ. -
మిథాలీ లైఫ్ సినిమాగా...
సాక్షి, సినిమా : మరో మహిళా క్రికెటర్ బయోపిక్కు రంగం సిద్ధమౌతోంది. టీమీండియా కెప్టెన్ మిథాలీరాజ్ సక్సెస్ జర్నీని సినిమాగా మలిచేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ మేరకు హక్కులు కొనుగోలు చేసి మిథాలీతో ఒప్పందం కూడా చేసుకున్నట్లు ముంబై మిర్రర్ ఓ కథనం ప్రచురించింది. వన్డేలో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా రికార్డుల్లోకెక్కిన మిథాలీ జీవితం ఎంతో మందికి ఆదర్శనీయం. అందుకే చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చాం అని వయాకమ్18 మోషన్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. శక్తివంతమైన మహిళలపై సినిమాలు తెరకెక్కించేందుకు మేము ఎప్పుడూ ముందుంటాం. ఈ క్రమంలోనే కహానీ, మేరీ కోమ్ లాంటి కథలను తీశాం. ఇప్పుడు మిథాలీ కథను చూపించబోతున్నాం అని వయాకమ్18 సీవోవో అజిత్ అందారే చెబుతున్నారు. మరోపక్క తన కథను సినిమాగా తెరకెక్కించబోతుండటంపై మిథాలీ సంతోషం వ్యక్తం చేస్తోంది. తన చిత్రం మరికొంత మంది అమ్మాయిలకు ప్రేరణగా నిలిస్తే చాలని 34 ఏళ్ల స్టార్ బ్యాట్స్ ఉమెన్ అంటోంది. అయితే మిథాలీ పాత్రలో మెరిసే నటి ఎవరో.. తదితర వివరాలు త్వరలో తెలియజేస్తామని వయాకమ్18 చెబుతోంది. ఇదిలా ఉంటే మహిళా క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర నెలకొల్పిన భారత ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి బయోపిక్ కూడా ఛక్ధా పేరుతో సిద్ధమౌతున్న విషయం తెలిసిందే. -
భారత మహిళల జోరు
‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై విజయం మెరిసిన మిథాలీ రాజ్, మోనా కొలంబో: లీగ్ దశలో అజేయంగా నిలిచిన భారత మహిళల క్రికెట్ జట్టు... ‘సూపర్ సిక్స్’ దశను కూడా విజయంతో మొదలుపెట్టింది. ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో టీమిండియా తమ ఖాతాలో వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసుకుంది. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో మిథాలీ రాజ్ బృందం 49 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 205 పరుగులు సాధించింది. మోనా మేష్రమ్ (85 బంతుల్లో 55; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ మిథాలీ రాజ్ (85 బంతుల్లో 64; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయడంతోపాటు రెండో వికెట్‌కు 96 పరుగులు జోడించారు. మిథాలీ, మోనా పెవిలియన్ చేరుకున్నాక... బ్యాట్స్‌విమెన్ వేద కృష్ణమూర్తి (28 బంతుల్లో 18; ఒక ఫోర్, ఒక సిక్స్), దేవిక వైద్య (21 బంతుల్లో 19; 2 ఫోర్లు), శిఖా పాండే (21 బంతుల్లో 21; 3 ఫోర్లు) దూకుడుగా ఆడే క్రమంలో త్వరగా అవుటయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మారిజెన్ కాప్, అయబోంగా ఖాక రెండేసి వికెట్లు పడగొట్టారు. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 46.4 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌటైంది. శిఖా పాండే (4/34), ఏక్తా బిష్త్ (3/22) దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశారు. దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, రాజేశ్వరిలకు ఒక్కో వికెట్ లభించింది. మిథాలీ రాజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం దక్కింది. ఇతర సూపర్ సిక్స్ మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్ ఏడు వికెట్లతో ఐర్లాండ్‌పై, శ్రీలంక 5 వికెట్లతో పాకిస్తాన్‌పై గెలిచాయి. శుక్రవారం జరిగే తమ రెండో సూపర్ సిక్స్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ ఆడుతుంది.