Aims employees
-
మోదీ.. ఒక్కరోజు వైద్యుడిగా ఉండండి
న్యూఢిల్లీ: ప్రభుత్వాస్పత్రుల్లో తాము పడే బాధలు తెలియాలంటే ఒక్కరోజు వైద్యుడిగా బాధ్యతలు నిర్వర్తించాలని ప్రధాని నరేంద్ర మోదీని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్యుల బృందం కోరింది. ఈ మేరకు ఎయిమ్స్ రెసిడెంట్స్ వైద్యుల బృందం అధ్యక్షుడు హర్జిత్సింగ్ భట్టి ప్రధానికి లేఖ రాశారు. ప్రభుత్వాస్పత్రుల్లో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవటం, అత్యవసర సమయాల్లో రోగి బంధువులు తమపై ప్రవర్తించే తీరు ఏ విధంగా ఉంటుందో తెలియాలంటే ప్రధాని ఒక్కరోజు వైద్యునిగా విధులు నిర్వర్తించాలని లేఖలో కోరారు. ‘‘మీ లాంటి చురుకైన వ్యక్తి ప్రధానిగా ఉండటం మా అదృష్టం. మా ఆప్రాన్ వేసుకుని ఒక్కరోజు వైద్యునిగా విధులు నిర్వర్తించేందుకు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం’’ అని లేఖలో పేర్కొన్నారు. -
పదవీ విరమణ వయసు పెంపుపై 12న సమీక్ష
న్యూఢిల్లీ: ఎయిమ్స్ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై ఈ నెల 12వ తేదీన సమీక్ష జరగనుంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో పదవీ విరమణ వయసును 65 నుంచి 70కి పెంపు అంశంపై సమీక్ష జరుగుతుందని ఎయిమ్స్ వైద్యాధికారి ఒకరు శనివారం మీడియాకు తెలియజేశారు. కాగా ఎయిమ్స్ పరిపాలనా వ్యవహారాల్లో సుస్థిరతతోపాటు అభివృద్ధి పనులను చేపట్టేందుకు ఈ పెంపు దోహదపడుతుందని కొందరు వైద్యులు అంటుండగా, ురికొందరు దీనిని అక్రమమంటూ మరికొందరు ఖండించారు. సీనియర్ ఉద్యోగులను కొనసాగిస్తే కొత్తగా ఉద్యోగాల కోసం వచ్చే యువత పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.