న్యూఢిల్లీ: ప్రభుత్వాస్పత్రుల్లో తాము పడే బాధలు తెలియాలంటే ఒక్కరోజు వైద్యుడిగా బాధ్యతలు నిర్వర్తించాలని ప్రధాని నరేంద్ర మోదీని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్యుల బృందం కోరింది. ఈ మేరకు ఎయిమ్స్ రెసిడెంట్స్ వైద్యుల బృందం అధ్యక్షుడు హర్జిత్‌సింగ్ భట్టి ప్రధానికి లేఖ రాశారు. ప్రభుత్వాస్పత్రుల్లో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవటం, అత్యవసర సమయాల్లో రోగి బంధువులు తమపై ప్రవర్తించే తీరు ఏ విధంగా ఉంటుందో తెలియాలంటే ప్రధాని ఒక్కరోజు వైద్యునిగా విధులు నిర్వర్తించాలని లేఖలో కోరారు. ‘‘మీ లాంటి చురుకైన వ్యక్తి ప్రధానిగా ఉండటం మా అదృష్టం. మా ఆప్రాన్ వేసుకుని ఒక్కరోజు వైద్యునిగా విధులు నిర్వర్తించేందుకు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం’’ అని లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment