న్యూఢిల్లీ: ఎయిమ్స్ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై ఈ నెల 12వ తేదీన సమీక్ష జరగనుంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో పదవీ విరమణ వయసును 65 నుంచి 70కి పెంపు అంశంపై సమీక్ష జరుగుతుందని ఎయిమ్స్ వైద్యాధికారి ఒకరు శనివారం మీడియాకు తెలియజేశారు. కాగా ఎయిమ్స్ పరిపాలనా వ్యవహారాల్లో సుస్థిరతతోపాటు అభివృద్ధి పనులను చేపట్టేందుకు ఈ పెంపు దోహదపడుతుందని కొందరు వైద్యులు అంటుండగా, ురికొందరు దీనిని అక్రమమంటూ మరికొందరు ఖండించారు. సీనియర్ ఉద్యోగులను కొనసాగిస్తే కొత్తగా ఉద్యోగాల కోసం వచ్చే యువత పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
పదవీ విరమణ వయసు పెంపుపై 12న సమీక్ష
Published Sat, May 10 2014 10:33 PM | Last Updated on Sat, Sep 2 2017 7:11 AM
Advertisement
Advertisement