Allari Naresh
-
అల్లరి నరేశ్ బచ్చలమల్లి.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది
టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ నటిస్తోన్న తాజా చిత్రం బచ్చలమల్లి. ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మూవీ ప్రమోషన్స్ ప్రారంభించారు.తాజాగా ఈ మూవీ నుంచి అదేనేను.. అసలు నేను అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటను టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. ఎస్పీ చరణ్, రమ్య బెహరా ఆలపించారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరితేజ, ప్రవీణ్, ‘వైవా’ హర్ష కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబరు 20న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.Good luck team ❤️#AdeNenuAsaluLenu from #BachhalaMalli beautifully captures the feeling TholiPrema. So happy to launch this soulful composition 🤗I am sure you all will like this one.▶️ https://t.co/NLtZcIlq8gA wonderful melody by @Composer_Vishal and brilliantly sung by…— thaman S (@MusicThaman) November 22, 2024 -
మీకు తెలిసినోడి కథ
‘అల్లరి’ నరేశ్ టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘బచ్చల మల్లి’. ఈ చిత్రానికి ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్గా నటించగా, రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరితేజ, ప్రవీణ్, ‘వైవా’ హర్ష ఇతర కీలకపాత్రలుపోషించారు. ‘బచ్చలమల్లి’ సినిమాను డిసెంబరు 20న రిలీజ్ చేస్తున్నట్లుగా వెల్లడించి, ఈ సినిమా కొత్తపోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఇది మీ కథ... లేకపోతే మీకు తెలిసినోడి కథ’ అని ఈ సినిమాను ఉద్దేశించి, ‘ఎక్స్’లో పేర్కొన్నారు ‘అల్లరి’ నరేశ్. ఈ సినిమాకు సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: రిచర్డ్ ఎమ్. నాథన్. -
‘కాళీ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
టాలీవుడ్ ముందుకు... కథలు వెనక్కి..!
తెలుగు సినిమా వెయ్యి కోట్ల వసూళ్లతో ముందు ముందుకెళుతోంది. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్, కల్కి’ వంటి చిత్రాలు ఇందుకు నిదర్శనం. ఇలా వసూళ్ల పరంగా ముందుకు వెళుతున్న టాలీవుడ్ కథల పరంగా వెనక్కి వెళుతోంది. అవును... ఇప్పుడు పలువురు స్టార్ హీరోలు పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో పదికి పైగా పీరియాడికల్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. 20వ శతాబ్దపు కథలతో రూపొందుతున్న ఆ చిత్రాల్లో నటిస్తున్న హీరోల గురించి తెలుసుకుందాం.ఓ వైపు రాజాసాబ్...మరోవైపు ఫౌజీ యుద్ధానికి సరికొత్త నిర్వచనం ఇవ్వనున్నారు ప్రభాస్. ఇందుకోసం ఈ హీరో దాదాపు 80 ఏళ్లు వెనక్కి వెళ్లనున్నారు. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్గా నటించనున్నారు. 1940 నేపథ్యంలో సాగే ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది చివర్లోప్రారంభం కానుంది. కాగా ఈ చిత్రం పోస్టర్‌పై కనిపించిన ‘ఆజాద్ హింద్ ఫౌజ్’, ‘హైదరాబాద్ చార్మినార్’, ‘ఆపరేషన్ జెడ్’, ‘పవిత్రాణాయ సాధూనాం’ వంటి అంశాలు సినిమాపై ఆడియన్స్‌లో ఆసక్తి కలిగేలా చేస్తున్నాయి. కొన్ని వాస్తవ ఘటనలకు కొంత కాల్పనికతను జోడించి ఈ సినిమా కథ తయారు చేశారట హను రాఘవపూడి. మాతృభూమి కోసం పోరాడే ఓ యోధుడి నేపథ్యంలో సాగే సినిమా అనే ప్రచారం కూడా జరుగుతోంది. ‘ఆధిపత్యం కోసమే యుద్ధాలు జరుగుతున్న సమయం అది. అలాంటప్పుడు ఆ యుద్ధానికి సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చాడు ఓ యోధుడు’’ అంటూ ఈ సినిమా కథ గురించి ఇటీవల పేర్కొన్నారు హను రాఘవపూడి. జయప్రద, మిధున్ చక్రవర్తి కీలక పాత్రల్లో నటించనున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం 2026ప్రారంభంలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘రాజాసాబ్’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా 1990 నాటి కథేనని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్‌ను చూపించ నున్నట్లుగా చిత్రయూనిట్ చెబుతోంది. ఇందులో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిద్ధీ కుమార్ మరో హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలిసింది. మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ‘రాజా సాబ్’ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది.ఇటు డ్రాగన్... అటు దేవరఎన్టీఆర్ను ‘డ్రాగన్’గా మార్చారట ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆగస్టు 8న ఈ సినిమాప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా విడుదలైన ఈ సినిమా పోస్టర్ ఆసక్తికరంగా మారింది. పోస్టర్‌పై 1969, గోల్డెన్ ట్రయాంగిల్, చైనా, భూటాన్, కోల్‌కతా అని పేర్కొంది చిత్రయూనిట్.దీంతో 1969 నేపథ్యంలోనే ఈ సినిమా కథనం ఉంటుందని, ఆ సమయంలో జరిగిన ఓ వాస్తవ ఘటనకు కల్పిత అంశాలను జోడించి, ఈ సినిమాను ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. అంతేకాదు... ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణప్రారంభం కానుంది. ఇటీవల జిమ్‌లో కసరత్తులు చేస్తూ ఎన్టీఆర్ చేతికి గాయమైన సంగతి తెలిసిందే. ఈ గాయం నుంచి కోలుకున్న తర్వాత ఈ సినిమా సెట్స్‌లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యే చాన్సెస్ ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై కల్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, కె. హరికృష్ణ నిర్మించనున్న ఈ సినిమా 2026 జనవరి 9న రిలీజ్ కానుంది. అలాగే ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్న మరో చిత్రం ‘దేవర’. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దేశంలో విస్మరణకు గురైన తీరప్రాంతాల నేపథ్యంలో ఈ సినిమాను కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపిస్తారు. రెండు భాగాలుగా ‘దేవర’ రిలీజ్ కానుంది. తొలి భాగం సెప్టెంబరు 27న విడుదల కానుంది.పెద్ది!రామ్‌చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్ అనుకుంటున్నారని, ఇందులో అన్నదమ్ముల్లా రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా మేకోవర్ పనుల్లో బిజీగా ఉన్నారు రామ్‌చరణ్. కొంచెం బరువు పెరగాలనుకుంటున్నారు. రా అండ్ రస్టిక్‌గా ఆయన లుక్ ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాదిలోనేప్రారంభం కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం విశేషం.రాయలసీమ నేపథ్యంలో...హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో 2018లో వచ్చిన ‘టాక్సీవాలా’ హిట్ మూవీగా నిలిచింది. దాదాపు ఐదేళ్ల తర్వాత విజయ్, రాహుల్‌ల కాంబినేషన్లో మరో సినిమా రానుంది. రాయలసీమ నేపథ్యంలో 1854–1878 మధ్య కాలంలో జరిగే కథగా ఈ చిత్రం రానుంది. ఈ పీరియాడికల్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ చిత్రంలో తండ్రీ కొడుకుగా విజయ్ దేవరకొండ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారని, ఈ ఏడాదిలోనే ఈ సినిమా చిత్రీకరణప్రారంభం కానుందని ఫిల్మ్‌నగర్ టాక్. అలాగే విజయ్ హీరోగా రవికిరణ్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు ఓ సినిమా నిర్మించనున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే పీరియాడికల్ ఫిల్మ్‌గా ఈ చిత్రం ఉంటుందని తెలిసింది.అసాధారణ ప్రయాణంఓ సాధారణ వ్యక్తి జీవితంలో జరిగిన అసాధారణ ఘటనల నేపథ్యంలో రూపొందిన సినిమా ‘లక్కీ భాస్కర్’. ‘మహానటి’, ‘సీతారామం’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్లో నటించిన సినిమా ఇది. 1980 నేపథ్యంలో ‘లక్కీ భాస్కర్’ సినిమా ఉంటుంది. ఇందులో ఓ బ్యాంక్ క్యాషియర్‌గా దుల్కర్ సల్మాన్ కనిపిస్తారు. మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా అక్టోబరు 31న రిలీజ్ కానుంది.క.. సస్పెన్స్కిరణ్ అబ్బవరం నటించిన పీరియాడికల్ యాక్షన్ అండ్ సస్పెన్స్ డ్రామా ‘క’. దర్శకత్వ ద్వయం సుజిత్– సందీప్ తెరకెక్కిస్తున్నారు. కృష్ణగిరి పట్టణం, అక్కడ ఉన్న ఓ పోస్ట్‌మేన్, అతని జీవితంలోని మిస్టరీ ఎపిసోడ్ అంశాల నేపథ్యంలో ‘క’ సినిమా కథనం ఉంటుంది. చింతా గోపాలకృష్ణా రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ కూడా ఉంటాయనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ‘క’ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. ఈ చిత్రాలతో పాటు మరికొన్ని సినిమాలు కూడా పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్నాయి.బచ్చల మల్లి ‘బచ్చల మల్లి’గా మారిపోయారు ‘అల్లరి’ నరేశ్. ఆయన టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా యాక్షన్ చిత్రం ‘బచ్చల మల్లి’. ఈ చిత్రంలో అమృతా అయ్యర్ కథానాయికగా నటిస్తున్నారు. సుబ్బు మంగాదేవి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 1990 నేపథ్యంలో సాగే ఈ సినిమా కథ ఓ ఊరి చుట్టూ ఉంటుందని తెలిసింది. ఇందులో ట్రాక్టర్ డ్రైవర్ మల్లి పాత్రలో కనిపిస్తారు ‘అల్లరి’ నరేశ్. రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది.ఎదురు చూపు ఓప్రాంతం ఒకతని కోసం ఎదురు చూస్తోంది. అతని పేరు సాయి దుర్గాతేజ్. 1940 నేపథ్యంలో సాగే ఓ పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్‌లో సాయి దుర్గాతేజ్ హీరోగా నటిస్తున్నారు. ‘హను–మాన్’ నిర్మాతలు చైతన్య, నిరంజన్‌రెడ్డి దాదాపు 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రోహిత్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కష్టాలు పడుతున్న ఓప్రాంత వాసుల జీవితాలు ఓ వ్యక్తి రాకతో ఎలా మారతాయి? అనే కోణంలో ఈ సినిమా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.24 సంవత్సరాలు హీరో వరుణ్ తేజ్ నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో నటిస్తున్న పీరియాడికల్ ఫిల్మ్ ‘మట్కా’. ఈ చిత్రంలో నోరా ఫతేహి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఓ వాస్తవ ఘటన ఆధారంగా వైజాగ్ నేపథ్యంలో గ్యాంబ్లింగ్ అంశాలతో ‘మట్కా’ సినిమా కథనం ఉంటుందని తెలిసింది. 1958 నుంచి 1982... అంటే ఇరవై నాలుగు సంవత్సరాల టైమ్ పీరియడ్‌లో ‘మట్కా’ సినిమా కథనం ఉంటుంది. ‘పలాస 1978’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
సరికొత్తగా...
‘అల్లరి’ నరేశ్ కొత్త చిత్రానికి శ్రీకారం జరిగింది. ‘అల్లరి’ నరేశ్ హీరోగా రచయిత–దర్శకుడు మెహర్ తేజ్ ఓ సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇందులో రుహానీ శర్మ హీరోయిన్. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా శనివారం ఆరంభమైంది. మరో వారం రోజుల్లో రెగ్యులర్ షూటింగ్‌ను ఆరంభించ నున్నారు. ‘‘సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొం దించనున్నాం’’ అన్నారు మేకర్స్. ఈ సినిమాకు సంగీతం: జిబ్రాన్, సహ–నిర్మాత: వెంకట్ ఉప్పుటూరి. -
కాటుక కళ్లతో సైగే చేసే చిన్నది
‘మా ఊరి జాతరలో కాటుక కళ్లతో చాటుగా రమ్మని సైగే చేసే చిన్నది...’ అంటూ మొదలయ్యే ఫోక్ మెలోడీ సాంగ్ ‘బచ్చల మల్లి’ సినిమాలోనిది. ‘అల్లరి’ నరేశ్ టైటిల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో అమృతా అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్నారు. సుబ్బు మంగదేవి దర్శకత్వంలో రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబరులో విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘మా ఊరి జాతరలో..’ పాట లిరికల్ వీడియోను చిత్రయూనిట్ మంగళవారం విడుదల చేసింది. ‘రాములోరు పేర్చిన రాళ్లు ఏరి తీయనా... ఏటి నీటి పైనే నీకు కోటే కట్టెయ్యనా...’ అంటూ ఈ పాట సాగుతుంది. చిత్రసంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ స్వరపరచిన ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించారు. సింధూరీ విశాల్‌తో కలిసి ‘హను–మాన్’ ఫేమ్ కంపోజర్ గౌరా హరి ఈ పాటను పాడారు. ‘‘హీరో హీరోయిన్లు ఒకరినొకరు ఎంత ప్రేమించుకుంటారో తెలియజేసే పాట ఇది. హీరో తన భార్యకు ఏదో ఒక ప్రత్యేకమైన బహుమతిని ఇస్తానంటుండగా, అవేవీ వద్దు తనతో ఉంటే చాలు అన్నట్లుగా హీరోయిన్ చెప్పే క్రమంలో ఈ పాట వస్తుంది’’ అని యూనిట్ పేర్కొంది. -
డబ్బింగ్ ఆరంభం
‘అల్లరి’ నరేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బచ్చల మల్లి’ డబ్బింగ్ పనులు ఆరంభమయ్యాయి. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అమృతా అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై ‘సామజవరగమన, ఊరుపేరు భైరవకోన’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించిన రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్న ‘బచ్చల మల్లి’ సెప్టెంబర్‌లో విడుదల కానుంది.కాగా తాజాగా ఈ సినిమా డబ్బింగ్‌ని ప్రారంభించారు మేకర్స్. ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘బచ్చల మల్లి’. ఈ మూవీలో గతంలో ఎన్నడూ చూడని మాస్ క్యారెక్టర్లో నరేష్‌ని చూపించనున్నారు డైరెక్టర్ సుబ్బు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: రిచర్డ్ ఎం.నాథన్. -
వర్సటైల్ యాక్టర్ అల్లరి నరేశ్‌ను ఇలా ఎప్పుడైనా చూశారా? (ఫోటోలు)
-
బచ్చలమల్లి గ్లింప్స్: ఎవడి కోసం తగ్గాలి? ఎందుకు తగ్గాలి?
అల్లరి నరేశ్ ఇటీవల 'ఆ ఒక్కటీ అడక్కు' అనే కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హిట్టవుతుందని ఆశించిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడీ హీరో మాస్ లుక్‌లో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. అల్లరి నరేశ్ టైటిల్ రోల్ చేస్తున్న మూవీ బచ్చల మల్లి. ఇందులో మల్లి అనేది హీరో పేరు కాగా బచ్చల ఇంటి పేరు. 1990 నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో ట్రాక్టర్ డ్రైవర్‌గా కనిపించనున్నాడు. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. అమృతా అయ్యర్ కథానాయిక.నేడు (జూన్ 30) అల్లరి నరేశ్ బర్త్‌డే సందర్భంగా బచ్చల మల్లి సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో హీరో.. తెల్లవారుజామున తన నిద్రను చెడగొడుతూ మోగుతున్న మైకును కోపంతో నేలకు విసిరేశాడు. తర్వాత ఓ సీన్లో ఎవడి కోసం తగ్గాలి? ఎందుకు తగ్గాలి? అంటూ మందు తాగి తన చుట్టూ ఉన్నవారిని చితబాదాడు. ఈ గ్లింప్స్‌లో మల్లి గడ్డం, జుట్టుపెంచుకుని ఊరమాస్ లుక్‌లో కనిపించాడు. ఈ మూవీ సెప్టెంబర్‌లో విడుదల కానుంది. చదవండి: ‘కల్కి 2898 ఏడీ’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ‘ఐతోలు’ బిడ్డె! -
సస్పెన్స్ థ్రిల్లర్
సుగి విజయ్, మౌనిక మగులూరి జంటగా నటించిన హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘రా.. రాజా’. బి. శివప్రసాద్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ మూవీ టీజర్‌ను హీరో ‘అల్లరి’ నరేశ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘రా..రాజా’ టీజర్ చాలా ఆసక్తిగా ఉంది.ఈ సినిమాలో నటించిన 24మంది పాత్రల ముఖాలు కనిపించవు. కృత్రిమ మేథస్సును వినియోగిస్తున్న ఈ జనరేషన్ లో కూడా ఇలాంటి చిత్రం చేయడం ఓ కొత్త ప్రయోగమే. ఈ సినిమా కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందనిపిస్తోంది’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: రాహుల్ శ్రీవాత్సవ్. -
ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలు ఏమొచ్చాయా అని చూస్తుంటాం. అయితే ఈ వారం థియేటర్లలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గం గం గణేశా, భజే వాయువేగం మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. మరోవైపు ఓటీటీలో మాత్రం మరి అంత కాకపోయినా కొన్ని ఇంట్రెస్టింగ్ చిత్రాలు-వెబ్ సిరీసులు అయితే వచ్చేశాయి. వీటిలో కొన్ని ముందే ప్రకటించారు. ఓ తెలుగు మూవీ మాత్రం ఎలాంటి ప్రకటన లేకుండా సైలెంట్‌గా అందుబాటులోకి తీసుకొచ్చేశారు.(ఇదీ చదవండి: విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్విట్టర్ రివ్యూ)అల్లరి నరేశ్ కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ గత కొన్నేళ్ల నుంచి సీరియస్ సినిమాలు, స్టార్ హీరోల మూవీస్‌లో కీలక పాత్రలు పోషిస్తూ వచ్చాడు. మళ్లీ చాన్నాళ్ల తర్వాత తన బలమైన కామెడీ కథతో తీసిన మూవీ 'ఆ ఒక్కటి అడక్కు'. పెళ్లి కానీ కుర్రాడిగా అల్లరి నరేశ్ నటించాడు. మే 3న థియేటర్లలో ఈ చిత్రం రిలీజైంది. మరీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోనప్పటికీ ఓ మాదిరి వసూళ్లు సాధించింది.ఇప్పుడు నెల కూడా తిరక్కుండానే ఎలాండి హడావుడి లేకుండా 'ఆ ఒక్కటి అడక్కు' స్ట్రీమింగ్ అయిపోతుంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ప్రస్తుతం తెలుగులో అందుబాటులో ఉంది. వీకెండ్ టైమ్ పాస్ చేయాలనుకునే ప్రేక్షకులకు ఈ మూవీ ఎంటర్టైన్ చేస్తుంది. మరి ఇంకెందుకు లేటు. టైమ్ చూసుకుని 'ఆ ఒక్కటి అడక్కు' చూసేయండి.(ఇదీ చదవండి: ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్!) -
Allari Naresh-Virupa: తొమ్మిదవ పెళ్లి రోజు.. అల్లరి నరేశ్ భార్యను చూశారా? (ఫోటోలు)
-
మాస్ మల్లి
సిగరెట్ కాల్చుతూ రిక్షాలో మాస్‌గా కూర్చొన్న అతని పేరు మల్లి. ఇంటిపేరు బచ్చల. చేసేది ట్రాక్టర్ డ్రైవర్‌గా... ఇంకా అతని పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకునేవారు థియేటర్స్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ‘అల్లరి’ నరేశ్ టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘బచ్చల మల్లి’. 1990 నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.మంగళవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు ‘అల్లరి’ నరేశ్. ‘‘ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ బచ్చల మల్లి చాలా రోజులు గుర్తిండిపోతాడు. నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. అమృతా అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో రోహిణి, రావు రమేశ్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరితేజ, ప్రవీణ్, వైవా హర్ష ముఖ్య పాత్రధారులు. ఈ సినిమాకు సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: రిచర్డ్ ఎం. నాథన్. -
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
అల్లరి నరేశ్ చాలారోజుల తర్వాత చేసిన కామెడీ సినిమా 'ఆ ఒక్కటి అడక్కు'. తండ్రి ఈవీవీ సత్యనారాయణ తీసిన మూవీ టైటిల్ కావడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే రెండు రోజుల్లో కలెక్షన్స్ బాగానే వచ్చాయి. చెప్పాలంటే తొలిరోజు కంటే రెండో రోజు ఎక్కువగానే వసూళ్లు రావడం విశేషం.(ఇదీ చదవండి: సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య)అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన సినిమా 'ఆ ఒక్కటి అడక్కు'. పెళ్లి కాని అబ్బాయిల్ని.. మ్యాట్రిమోనీ వాళ్లు ఎలా మోసం చేస్తున్నారనే కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రంలో కామెడీ కంటే సీరియస్‌నెస్ ఎక్కువైంది. దీంతో మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా సరే తొలిరోజు రూ.1.62 కోట్లు గ్రాస్ వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించారు.ఇక రెండో రోజు శనివారం.. వీకెండ్ అడ్వాంటేజ్ కావడంతో బాగానే వసూళ్లు వచ్చాయి. ఓవరాల్‌గా రెండు రోజుల్లో రూ.3.34 కోట్ల గ్రాస్ సొంతం చేసుకున్నట్లు మరో పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలేం కాబట్టి 'ఆ ఒక్కటి అడక్కు' చిత్రానికి వసూళ్లు పరంగా ఏమైనా ప్లస్ అవుతుందేమో అనేది చూడాలి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)Silencing the hot summer with a COOL TREAT ❤️🔥#AaOkkatiAdakku collects 3.34CR Worldwide Gross in 2 days 🤘🏻And it’s DAY 2 >>> Day 1 of Laughter madness ❤️🔥https://t.co/zbg0yxIPZx#SummerFunBlockbusterAOA@allarinaresh @fariaabdullah2 #VennelaKishore @harshachemudu… pic.twitter.com/0wx0dSmR1C— Ramesh Bala (@rameshlaus) May 5, 2024 -
ఆ.. ఒక్కటి అడక్కు మూవీ రివ్యూ
టైటిల్: ఆ.. ఒక్కటి అడక్కునటీనటులు: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, జెమీ లివర్, వెన్నెల కిషోర్, హర్ష చెముడు, గౌతమి, మురళీ శర్మ, రవికృష్ణ, అజయ్ తదితరులునిర్మాత: రాజీవ్ చిలకరచన-దర్శకత్వం: మల్లి అంకంసంగీతం: గోపీ సుందర్సినిమాటోగ్రఫీ:సూర్యవిడుదల తేది: మే 3, 2024కథేంటంటే..గణ అలియాస్ గణేష్(అల్లరి నరేశ్) ప్రభుత్వ ఉద్యోగి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో పని చేస్తుంటాడు. జీవితంలో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే ఆయన ఫ్యామిలీ సెటిల్ అయ్యేలోపు 30 ఏళ్ల వయసుకు వస్తాడు. తమ్ముడికి(రవి కృష్ణ) ముందే పెళ్లి అవ్వడం.. వయసు ఎక్కువ ఉండడం చేత గణకి పెళ్లి సంబంధాలు దొరకవు. చివరకు హ్యాపీ మాట్రీమోనీలో పేరు నమోదు చేసుకుంటాడు. దాని ద్వారా సిద్ధి(ఫరియా అబ్దుల్లా) పరిచయం అవుతుంది. ఆమెను చూసిన వెంటనే పెళ్లికి ఓకే చెప్పేస్తాడు. కానీ సిద్ధి మాత్రం నో చెబుతుంది. అలా అని అతనికి దూరంగా ఉండదు. గణ తన తల్లిని సంతోష పెట్టేందుకు సిద్ధి తన ప్రియురాలు అని పరిచయం చేస్తాడు. ఆ మరుసటి రోజే సిద్ధికి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వస్తుంది. పెళ్లి పేరుతో కుర్రాళ్లను మోసం చేస్తుందనే విషయం తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? సిద్ధి నిజంగానే మోసం చేసిందా? పెళ్లి సాకుతో హ్యాపీ మాట్రీమోనీ సంస్థ చేస్తున్న మోసాలేంటి? వాటిని గణ ఎలా బయటకు తీశాడు. చివరకు గణ పెళ్లి జరిగిందా లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే..హీరోకి ఓ మంచి ఉద్యోగం..కానీ పెళ్లి కాదు. వయసు పెరిగిపోవడంతో పిల్ల దొరకదు. హీరోయిన్‌తో ప్రేమ..ఆమెకో ఫ్లాష్‌బ్యాక్.. క్లైమాక్స్‌లో ఇద్దరికి పెళ్లి..ఇది వెంకటేశ్ హీరోగా నటించిన ‘మల్లేశ్వరి’మూవీ స్టోరి. కథగా చూస్తే ఇది చాలా సింపుల్ కానీ.. త్రివిక్రమ్ రాసిన పంచులు..కామెడీ సీన్లు ఫ్రెష్ ఫీలింగ్‌ని కలిగించాయి. ఆ ఒక్కటి అడక్కు మూవీ కథ కూడా దాదాపు ఇదే. కానీ మల్లేశ్వరిలో వర్కౌట్ అయిన కామెడీ ఇందులో కాలేదు. పైగా సినిమాకు కామెడీ టైటిల్ పెట్టి..కథంతా సీరియస్‌గా నడిపించారు. కామెడీ కోసం పెట్టిన సన్నివేశాలు అంతగా పేలలేదు. కానీ మ్యాట్రిమోసీ సంస్థలు చేసే మోసాలు.. పెళ్లి కానీ యువతీయువకుల మనోభావాలతో సదరు సంస్థలు ఎలా ఆడుకుంటున్నాయి? అనే అంశాలను ఈ చిత్రంలో చక్కగా చూపించారు. సీరియస్ ఇష్యూని కామెడీ వేలో చూపించేందుకు ప్రయత్నించాడు దర్శకుడు మల్లి అంకం. అయితే ఆ ప్రయత్నంలో పూర్తిగా సఫలం కాలేదు. కథను అటు కామెడీగాను.. ఇటు సీరియస్‌గాను నడిపించలేకపోయాడు. ఎలా ఉందంటే..హీరోకి ఓ మంచి ఉద్యోగం..కానీ పెళ్లి కాదు. వయసు పెరిగిపోవడంతో పిల్ల దొరకదు. హీరోయిన్‌తో ప్రేమ..ఆమెకో ఫ్లాష్‌బ్యాక్.. క్లైమాక్స్‌లో ఇద్దరికి పెళ్లి..ఇది వెంకటేశ్ హీరోగా నటించిన ‘మల్లేశ్వరి’మూవీ స్టోరి. కథగా చూస్తే ఇది చాలా సింపుల్ కానీ.. త్రివిక్రమ్ రాసిన పంచులు..కామెడీ సీన్లు ఫ్రెష్ ఫీలింగ్‌ని కలిగించాయి. ఆ ఒక్కటి అడక్కు మూవీ కథ కూడా దాదాపు ఇదే. కానీ మల్లేశ్వరిలో వర్కౌట్ అయిన కామెడీ ఇందులో కాలేదు. పైగా సినిమాకు కామెడీ టైటిల్ పెట్టి..కథంతా సీరియస్‌గా నడిపించారు. కామెడీ కోసం పెట్టిన సన్నివేశాలు అంతగా పేలలేదు. కానీ మ్యాట్రిమోసీ సంస్థలు చేసే మోసాలు.. పెళ్లి కానీ యువతీయువకుల మనోభావాలతో సదరు సంస్థలు ఎలా ఆడుకుంటున్నాయి? అనే అంశాలను ఈ చిత్రంలో చక్కగా చూపించారు. సీరియస్ ఇష్యూని కామెడీ వేలో చూపించేందుకు ప్రయత్నించాడు దర్శకుడు మల్లి అంకం. అయితే ఆ ప్రయత్నంలో పూర్తిగా సఫలం కాలేదు. కథను అటు కామెడీగాను.. ఇటు సీరియస్‌గాను నడిపించలేకఓ యాక్షన్ సీన్‌తో హీరోని పరిచయం చేస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. మాస్ హీరో రేంజ్లో బిల్డప్ ఇప్పించి.. కాసేపటికే రౌడీలతో కామెడీ చేయించారు. ఆ కామెడీలో కొత్తదనం కనిపించదు. బావకు పెళ్లి చేయాలనే తపనతో మరదలు(తమ్ముడు భార్య) చేసే హంగామా నవ్వులు పూయిస్తుంది. సిద్దిగా పరియా అబ్దుల్లా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథలో వేగం పుంజుకుంటుంది. బీచ్‌లో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలన్నీ రొటీన్‌గానే అనిపిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థం కథంతా ఎక్కువగా సీరియస్ మూడ్‌లోనే సాగుతుంది. సిద్ధి పాత్రకు సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడం.. మ్యాట్రిమోనీ సంస్థ చేసే మోసాలను బయటపడడం.. ఇవన్నీ కథపై ఆసక్తిని పెంచేలా చేస్తాయి. ఫేక్ పెళ్లి కూతురు అనే కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తుంది. కానీ కొన్ని కామెడీ సీన్స్ మాత్రం నవ్వులు తెప్పించకపోగా.. చిరాకు కలిగిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగి అయిన హీరో ఈజీగా మోసపోవడం.. పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం కన్విన్సింగ్‌గా అనిపించదు. కొన్ని చోట్ల కామెడీ పండించడానికి స్కోప్ ఉన్నా.. డైరెక్టర్ సరిగా వాడుకోలేకపోడు. క్లైమాక్స్‌లో ఇచ్చిన సందేశం ఆలోచింపజేస్తుంది. ఎవరెలా చేశారంటే..అల్లరి నరేశ్‌కు కామెడీ పాత్రల్లో నటించడం వెన్నతో పెట్టిన విద్య. ఆయన కామెడీ టైమింగ్ అదిరిపోతుంది. ఇందులో గణ పాత్రలో చక్కగా నటించాడు. కాకపోతే దర్శకుడు మల్లి నరేశ్‌ని సరిగా వాడుకోలేకపోయాడు. సిద్ధిగా ఫరియా తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. బావకు పెళ్లి చేయాలని తపన పడే మరదలిగా జెమీ లివర్ పండించిన కామెడీ నవ్వులు పూయిస్తుంది. వెన్నెల కిశోర్, హర్షల కామెడీ బాగుంది. పృథ్వి, మురళీ శర్మ, గౌతమితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా బాగుంది. గోపీసుందర్ పాటలు, నేపథ్య సంగీతం బాగుంది. సూర్య సినిమాటోగ్రఫీ పర్వాలేదు.అబ్బూరి రవి సంభాషణలు కొన్ని చోట్ల ఆలోచింపజేస్తాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
ఆ ఒక్కటీ అడక్కు చూసి నవ్వుకుందాం: అడివి శేష్
‘‘నా తొలి సినిమా ఆడియో లాంచ్‌కి నరేశ్‌గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఇప్పుడు ఆయన నటించిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకి నేను రావడం హ్యాపీగా ఉంది. ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాని మనమంతా థియేటర్లో చూసి హాయిగా నవ్వుకుందాం’’ అని హీరో అడివి శేష్ అన్నారు.‘అల్లరి’ నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా మల్లి అంకం దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. చిలకప్రోడక్షన్స్పై రాజీవ్ చిలక నిర్మించిన ఈ సినిమా నేడు విడుదల అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ– ‘నేను ఇన్నేళ్ల పాటు పరిశ్రమలో ఉండటానికి, ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం మా నాన్న ఈవీవీ సత్యనారాయణగారు. ‘ఆ ఒక్కటీ అడక్కు’ డైరెక్టర్ మల్లి అంకంతో కలిపి ఇప్పటివరకూ దాదాపు 30 మంది కొత్త దర్శకులని పరిచయం చేశాను.ఈ మండు వేసవిలో మీ బాధలు మర్చిపోయి రెండు గంటలు హాయిగా మా సినిమాతో ఎంజాయ్ చేయండి’ అన్నారు. ‘‘మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు మల్లి అంకం. ‘‘ఆ ఒక్కటీ అడక్కు’ లాంటి మంచి మూవీ చేయడం మా అదృష్టం’’ అన్నారు రాజీవ్ చిలక. ఈ వేడుకలో సహ నిర్మాత భరత్, దర్శకులు విజయ్ కనకమేడల, విజయ్ బిన్నీ, దేవా కట్టా, రచయితలు బీవీఎస్ రవి, అబ్బూరి రవి, నటి జామి లివర్ మాట్లాడారు. -
అల్లరి నరేశ్ 'ఆ ఒక్కటీ అడక్కు' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన తాజా చిత్రం 'ఆ ఒక్కటీ అడక్కు'. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. అబ్బూరి రవి చిత్రానికి డైలాగ్స్ అందించారు. అల్లరి నరేశ్ చాలా రోజుల తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమాకు సంబంధించి అల్లరి నరేశ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మళ్లీ కామెడీ వైపు మళ్లడంపై ఆయన స్పందించారు. నరేశ్ మాట్లాడుతూ..'అన్నీ సమాంతరంగా చేయాలనే అలోచనతోనే ఉన్నా. నాంది, మారేడుమిల్లి, ఉగ్రం, నా సామిరంగా భిన్నమైన సినిమాలు. కామెడీ కథలు బాగా నచ్చితేనే చేయాలని భావించా. ప్రేక్షుకుల అభిరుచి కూడా మారింది. కథలో కామెడీ ఉంటేనే ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. ఇలాంటి సమయంలో మల్లి ఇలాంటి కథతో వచ్చారు. నాకు చాలా నచ్చింది. పెళ్లిని ఇప్పటివరకూ ఫన్‌తో చూపించారు. పెళ్లి చుట్టూ జరుగుతున్న కోట్ల వ్యాపారంను వినోదాత్మకంగా చూపిస్తూనే మంచి సందేశం వుంటుంది. నిజజీవితంలో జరిగిన చాలా సంఘటనలని పరిశోధించే ఈ కథని తయారు చేశారు. ప్రస్తుతం పెళ్లి చుట్టూ ఎలాంటి స్కామ్స్ జరుగుతున్నాయనేది ఇందులో చూపించిన తీరు ప్రేక్షకులని ఆలోచింపచేసేలా ఉంటుంది' అన్నారు. చాలా రోజుల తర్వాత కామెడీ సినిమా చేయడంపై మాట్లాడుతూ..' కామెడీ చేసి నవ్వించడం చాలా కష్టం. మళ్లీ కామెడీ చేయడం చాలా హ్యాపీగా వుంది. కామెడీకి ఆదరణ ఇంకా పెరిగింది. సామజవరగమన, డీజే టిల్లు లాంటి సినిమాలు బాగా వర్కవుట్ అవుతున్నాయి. కంటెంట్ ఉంటే ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తున్నారు. ప్రస్తుతం నా దృష్టి నటనపైనే. దర్శకత్వం చేసే ఆలోచనలు ప్రస్తుతానికి లేవు. అందరూ సుడిగాడు- 2 కోసం అడుగుతున్నారు. మనం అన్ని రకాల సినిమాలు చేయాలి. ప్రేక్షకులు ఇప్పుడు కథలో నుంచి పుట్టిన కామెడినే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలాంటి కథలపై దృష్టి పెడుతున్నా. అలాగే 'పుష్పక విమానం' లాంటి సినిమా చేయాలని ఉంది. వెంకటేశ్‌తో కలిసి పని చేయాలని ఉంది. మేమిద్దరం కామెడీ సినిమా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నా. అలాగే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది' అని తెలిపారు. కాగా.. ఆ ఒక్కటీ అడక్కు మే 3న థియేటర్లలో సందడి చేయనుంది. -
ఫరియా కామెడీ టైమింగ్ చూసి షాక్ అయ్యా.. మ్యారేజీ వల్ల ఎన్ని మోసాలు జరుగుతున్నాయి అంటే.. ఫరియా రాప్ సాంగ్‌కి ఫిదా అయిన అల్లరి నరేష్
-
'ఆ ఒక్కటీ అడక్కు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఏ క్వశ్చన్ మిమల్ని అడిగితే మీకు చీరెత్తుకొస్తుంది
-
ఈ అమ్మాయి నా మీద వేసిన జోక్ అర్థం అవ్వటానికి మూడు రోజులు పట్టింది
-
ఈ అమ్మాయి మిమిక్రితో సుమతోనే కేరింతలు కొట్టించింది
-
నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం మరి ఆయనతో పెళ్ళంటే..!
-
మేలో ఆ ఒక్కటీ అడక్కు
మండే వేసవిలో థియేటర్లలో నవ్వుల జల్లులు కురిపించేందుకు ‘అల్లరి’ నరేశ్ సిద్ధమయ్యారు. ఆయన హీరోగా మల్లి అంకం దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్. రాజీవ్ చిలక నిర్మించారు. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాని వేసవి సెలవులను పురస్కరించుకుని మే 3న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన థియేట్రికల్ రిలీజ్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ పొందింది. ‘‘పూర్తి స్థాయి వినోదాత్మకంగా రూపొందిన చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. చాలా కాలంగా నన్ను పూర్తిగా ఫన్ రోల్లో చూడాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అది ఈ సినిమాతో కుదిరింది’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్.