assembly seat
-
నీకు ఇక సినిమా షూటింగ్ లే.. పవన్ పై ఎమ్మెల్యే గ్రంధి సెటైర్లు
-
చంద్రబాబు పై నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు
-
టీడీపీలో టికెట్ పాలిటిక్స్.. నలుగురిలో సీటు ఎవరికి?
ప్రొద్దటూరు నియోజకవర్గం టికెట్ కోసం టీడీపీ నేతల మధ్య నాలుగు స్తంభాలాట నడుస్తోంది. ఒకే టికెట్ కోసం నలుగురు పోటీ పడుతున్నారు. ఎవరికి వారే టికెట్ తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారికే టిక్కెట్ ఇస్తారని కొందరు నమ్మకం పెట్టుకున్నారు. అయితే, డబ్బు కట్టలు ఎక్కువగా ఇచ్చిన వారికే బాబు టికెట్ ఇస్తారని మరి కొందరు ధీమాగా ఉన్నారు. ఇంతకీ ప్రొద్దటూరులో టీడీపీ కోసం కష్టపడుతున్నదెవరు? డబ్బు కట్టలతో సిద్ధంగా ఉన్నదెవరు?.. ప్రొద్దటూరులో టీడీపీ టికెట్ రేసులో నలుగురు నేతలు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులు రెడ్డి, లింగారెడ్డి టికెట్ తమదే అని ఘంటాపథంగా చెబుతున్నారు. నాలుగేళ్లుగా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి అయితే ప్రొద్దటూరు టికెట్ కోసం ఎవరూ పోటీ పడాల్సిన అవసరమే లేదని.. ఆ టికెట్ తనకు ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చేశారని ధీమాగా అంటున్నారు. నాలుగేళ్లుగా పార్టీ బలోపేతానికి చాలా కష్టపడ్డానని జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చిందని ప్రవీణ్ కుమార్ రెడ్డి అంటున్నారు. ఈ ముగ్గురూ చాలరన్నట్లు మాజీ టీడీపీ నేత ప్రస్తుత బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తన సోదరుడు సీఎం సురేష్‌కు ప్రొద్దటూరు టికెట్ ఇప్పించుకోడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ కోసం నలుగురి మధ్య తీవ్ర పోటీ ఉండడంతో టికెట్ ఎవరికి ఇస్తారోనని కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. సీనియర్ నేత అయిన వరదరాజులు రెడ్డి కొద్ది వారాల క్రితం బాగా యాక్టివ్ అయ్యారు. నియోజకవర్గం అంతా కలియతిరిగేస్తూ వచ్చే ఎన్నికల్లో తననే గెలిపించాలని.. టికెట్ తనకే వస్తోందని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడికి అత్యంత నమ్మకస్తుడిగా మెలిగిన సీఎం రమేష్ ఈ మధ్యనే తన సోదరుడు సీఎం సురేష్‌ను తీసుకెళ్లి హైదరాబాద్‌లో చంద్రబాబుతో భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ భేటీలోనే సురేష్‌కు టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారని సీఎం సురేష్ వర్గీయులు చెప్పుకుంటున్నారు. గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తామని.. అందుకోసం సర్వేలు చేయిస్తున్నామని చంద్రబాబు నాయుడు చెబుతున్నప్పటికీ.. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే చంద్రబాబు టికెట్ ఇస్తారని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఈ లెక్క కరెక్ట్ అయితే ఈ నలుగురిలో ఎక్కువ డబ్బు విసరగల సత్తా ఒక్క సీఎం రమేష్‌కే ఉందని నియోజక వర్గ పార్టీ నేతలే అంటున్నారు. సీఎం రమేష్‌ను మించి ఎక్కువ డబ్బులు ఇచ్చే సత్తా మిగతా ముగ్గురికీ లేదని వారంటున్నారు. చిత్రం ఏంటంటే టికెట్ ఎవరికి వచ్చినా వచ్చే ఎన్నికల్లోనూ ఇక్కడ టీడీపీకి గెలిచే అవకాశాలు లేనే లేవంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇక చంద్రబాబు ఎవరికి టికెట్ ఇస్తారన్నది చూడాలంటున్నారు విశ్లేషకులు. -
గుడివాడ అసెంబ్లీ సీటు నాదే... వచ్చే ఎన్నికల్లో నేనే పోటీచేస్తా..
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ‘గుడివాడ అసెంబ్లీ సీటు నాదే. వచ్చే ఎన్నికల్లో నేనే పోటీచేస్తా. ఇదే విషయాన్ని సార్‌కు నా మాటగా స్పష్టంగా చెప్పండి’ అని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తేల్చి చెప్పేయడంతో టీడీపీ రాష్ట అధ్యక్షుడు కె.అచ్చన్నాయుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర తమ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు పరిస్థితులను పూసగుచ్చినట్లు వివరించారు. తాము అనుకున్నదొకటి, అవుతున్నది మరొకటి అన్నరీతిలో పరిస్థితులు తల్లకిందులు అవుతుండటంతో చంద్రబాబు దీర్ఘాలోచనల్లో పడినట్లు తెలిసింది. కింకర్తవ్యం... తాత్కాలిక మౌనమే శ్రేయస్కరమనే ముఖ్యుల అభిప్రాయాలను అంగీకరించిన ఆయన గుడివాడలో కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపేయాలని, మళ్లీ చెప్పేవరకు అటువైపు వెళ్లవద్దని వెనిగండ్ల రాముకు సూచించారనేది సమాచారం. తానిక హైదరాబాద్‌కు పరిమితమవ్వాలా లేక అమెరికాకు పయనమవ్వాలా అనే మీమాంసలో ఉన్న రాము ఆఖరు ప్రయత్నంగా తనను ప్రోత్సహిస్తున్న లోకే‹Ùను కలిసి తుది నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనతో సోమవారం ఒంగోలుకు వెళ్లారు. పార్టీ వర్గాల అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు... సుమారు నెల రోజులుగా గుడివాడ టికెట్ అంశంపై టీడీపీలో అంతర్గత చర్చలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని)పై బలమైన అభ్యరి్థని రంగంలోకి దింపి ఎలాగైనా జెండా ఎగరేయాలనే యోచనతో ప్రవాసాంధ్రుడైన వెనిగండ్లను కొన్ని నెలలుగా చంద్రబాబు, లోకేష్ లు ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా లోకేష్ ఆశీస్సులే రాముకు మెండుగా ఉన్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. తగ్గేదేలేదన్న రావి మాజీ ఎమ్మెల్యేని పిలిపించి మాట్లాడాలని, భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని చంద్రబాబు పురమాయించడంతో మూడు వారాల కిందట అచ్చెన్నాయుడు రావిని విజయవాడకు ఆహ్వానించారు. బాబు అభిప్రాయాలను రావి వద్ద ప్రస్తావించడం.. అందుకు ససేమిరా అనడంతో పాటు తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టి ఈమారు తగ్గేదేలేదన్నారనేది సమాచారం. ‘డబ్బుల కట్టలతో వచ్చిన వారికి టికెట్ ఇచ్చేస్తాం. వారు పోటీచేస్తారు. మీరు పక్కకు తప్పుకోండి. ఇంకేదైనా పదవి ఇస్తామంటే కుదరదు’ గతంలో కూడా ఇలాగే జరిగింది. ఈ పర్యాయం అంగీకరించేది లేదు. ఖర్చు పెట్టుకోలేరు అంటున్నారు. నా స్థాయిలో నేను ఖర్చుకు సిద్ధం. తక్కినది పార్టీ భరించాల్సిందే. ఇన్నేళ్లుగా పార్టీ కార్యక్రమాలను కొనసాగించింది ఎవరు? ఇవన్నీ పార్టీ నాయకత్వానికి తెలియదా? అని నిలదీయడంతో కంగుతినడం పార్టీ రాష్ట్ర అ«ధ్యక్షుడి వంతైందని పారీ్టవర్గాలు అంటున్నాయి. తన అభిప్రాయాలన్నింటినీ అధినేతకు స్పష్టంగా వివరించాలనడంతో అచ్చెన్నాయుడు అదే చేశారనేది సమాచారం. మరో ప్రయత్నంగా రెండు వారాల కిందట మాజీమంత్రి, పొలిట్‌బ్యూరో సభ్యుడు అయిన కొల్లు రవీంద్రను గుడివాడలోని రావి వద్దకు అధిష్టానం రాయబారానికి పంపింది. అచ్చెన్నాయుడు వద్ద కన్నా ఇంకాస్త ఘాటుగానే స్వరం పెంచడంతో కొల్లు వెళ్లి రావి వైనాన్ని బాబుకు వివరించారని తెలిసింది. వెనిగండ్లనే కావాలంటే.. మీరే చేసుకోండి గుడివాడ నుంచి వెనిగండ్లనే పోటీ చేయించాలనుకుంటే ఎన్నికలు కూడా మీరే చేసుకోండని, తాము దూరంగా ఉంటామని అధిష్టానానికి నియోజకవర్గంలోని పలువురు మండల ముఖ్య నాయకులు తేల్చిచెప్పారని పార్టీ వర్గాలు అంటున్నాయి. వారితో పార్టీ మండల అధ్యక్షులు కూడా శ్రుతి కలపడం అధిష్టానాన్ని ఆలోచనల్లో పడేసినట్లయ్యింది. రావికి దన్నుగా... విజయవాడ లోక్‌సభ స్థానంతో పాటు ఉమ్మడి కృష్ణాలోని పలు నియోజకవర్గాల సీనియర్లకు టికెట్ ఉంటుందో, ఊడుతుందో అంతుబట్టడంలేదు. వెనిగండ్లలాంటి ప్రవాసాంధ్రులు, పారిశ్రామికవేత్తలు రంగంలోకి వస్తున్నారని, ఒకవేళ టీడీపీ జనసేన కలిసి పోటీచేస్తే ఎవరెవరి సీట్లకు ఎసరొస్తుందో దిక్కుతెలియక ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్లుగా పరస్పర అవగాహనతో వ్యవహరిస్తే ఎవరి స్థానాలను వారు కాపాడుకోవచ్చనే అంచనాకు వచ్చారని, ఆ దృష్ట్యానే రావి తన వాయిస్‌ను గట్టిగా వినిపించారంటున్నారు. ‘మాదగ్గర డబ్బులున్నాయి. మేం పోటీచేస్తాం. మీరు పక్కకు తప్పుకోండి’ అని వేషగాళ్ల మాదిరి ఎవరుపడితే వారొచ్చేస్తుంటే మనం ఎందుకు తప్పుకోవాలి. అవసరమైతే పిలువు గుడివాడకు వస్తా. నీకు అండగా నేను నిలుస్తా’ అని ఓ సీనియర్ నేత భుజం తట్టినందునే రావి అంత దన్నుగా ఉన్నారనేది విశ్లేషకుల అభిప్రాయం. -
టీడీపీలో ముసలం.. మాజీ ఎమ్మెల్యేకు సీటు దక్కేనా?
జీవీ ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే. రెండుసార్లు పచ్చ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచాడు. తెలుగుదేశంలో ఉమ్మడి గుంటూరు జిల్లా సీనియర్ నాయకుడు. అవినీతి తప్ప నియోజకవర్గంలో అభివృద్ది చేసిన దాఖలాలు లేవు. ప్రస్తుత ఎమ్మెల్యే నియోజకవర్గం రూపురేఖలు మార్చేస్తుంటే ప్రతి దానికి అడ్డుపడుతున్నారు. అభివృద్ది నిరోధకుడిగా మారిపోయాడు. చివరికి సొంత పార్టీలో కూడా ఆయనపై అసంతృప్తి తారాస్థాయికి చేరింది. ఈ ఇన్చార్జ్ మాకొద్దు బాబో.. అంటూ అధినేత వద్ద పచ్చపార్టీ క్యాడర్ గగ్గోలు పెడుతున్నారు. చేసింది శూన్యం.. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయారు ఆంజనేయులు. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా.. నియోజకవర్గంలో చేసిన అభివృద్ది చెప్పేందుకేమీ లేదు. సొంతూరుకే రోడ్డు వేయించుకోలేని పరిస్థితి జీవీ ఆంజనేయులుది. వైఎస్సార్ కాంగ్రెస్ నేత బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే అయిన తర్వాత వినుకొండ పట్టణ వాసులను 70 ఏళ్లుగా పీడిస్తున్న తాగునీటి ఎద్దడిని మూడు నెలల్లో పరిష్కరించారు. వినుకొండకు తాగునీరు అందించే చెరువును టీడీపీ నేత జీవీ అనుచరులు, బంధువులు కబ్జా చేశారు. ఈ సమస్యలన్నీ ప్రభుత్వం పరిష్కరించింది. చెరువు పునర్జీవనం ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కబ్జా కోరల్లో చిక్కుకున్న చెరువును పరిరక్షించి భారీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌గా ఏర్పాటు చేశారు. దీంతో వినుకొండవాసులకు తాగునీటి సమస్య తీరి పోయింది. పట్టణంలోని కొండపై ఉన్న రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని అభివృద్ది చెయ్యడానికి నడుం బిగించారు. దీంతోపాటుగా వినుకొండలో రోడ్డు విస్తరణ, షాపింగ్ కాంప్లెక్ నిర్మాణాలు మొదలయ్యాయి. ఓర్వలేక కుట్రలు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్దిని జీర్ణించుకోలేని జీవీ ఆంజనేయులు కుట్రలకు తెరతీశారు. కోర్టుకెళ్లడం, స్టేలు తీసుకురావడం వంటి చర్యలతో అభివృద్దిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు మీ నాయకుడు ఇలా చేస్తున్నాడని టీడీపీ కేడర్‌ను ప్రశ్నిస్తే.. తనను ఓడించిన జనంపై కక్ష పెంచుకున్నాడని.. అందుకే ప్రతి పనిలో అడ్డు తగులుతున్నాడని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఆదాయానికి అడ్డు పుల్ల వినుకొండ మున్సిపాలిటీకి ఆదాయం పెంచేందుకు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడానికి ప్రభుత్వం ప్రణాళిక రెడీ చేసింది. గతంలో టీడీపీ ప్రభుత్వం కూడా అదే ప్రాంతంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే వాటాల దగ్గర తేడా రావడంతో కాంప్లెక్స్ నిర్మాణాన్ని అప్పటి ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆపించేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కాంప్లెక్స్ నిర్మాణం చేయబోతుంటే.. కోర్టుకెళ్ళి అడ్డుకున్నాడు. ఇలా నియోజకవర్గంలో చేయబోతున్న ప్రతి పనినీ టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అడ్డుకోవడంతో ప్రజలు కూడా ఆయన్ను, పచ్చ పార్టీని చీదరించుకుంటున్నారు. వినుకొండకు విజిటింగ్ ఆఫీసర్ నియోజకవర్గం పార్టీ ఇన్చార్జ్ అయినప్పటికీ జీవీ ఆంజనేయులు వినుకొండలో ఉండడు. అప్పుడప్పుడు విజిటింగ్ ఆఫీసర్లాగా వచ్చి వెళుతుంటాడు. తనకు అనుకూలంగా ఉన్న మీడియాను పిలిచి రోజంతా హడావుడి చేసి మరుసటి రోజు మాయమైపోతాడు. కార్యకర్తలు తమ సమస్యలు చెప్పుకోవాలంటే ఎక్కడుంటాడో ఎవరికీ తెలియదు. ఆయన ఆఫీసులో కూడా సరైన సమాధానం చెప్పేవారుండరు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తల్లో ఆంజనేయులుపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత పెరుగుతోంది. ఇప్పటికే కొందరు నేతలు జీవీ ఆంజనేయులు మాకొద్దంటూ అధినేత దగ్గర ఫిర్యాదులు మీద ఫిర్యాదులు చేస్తున్నారట. అదేవిధంగా కొందరు సీనియర్ నేతలు సైతం ఈసారి వినుకొండ సీటు ఆంజనేయులుకు ఇస్తే మళ్ళీ ఆశలు వదులుకోవాల్సిందేనని తేల్చి చెబుతున్నారట. అందుకే ఆంజనేయులుకు ప్రత్యామ్నాయ నేత కోసం టీడీపీ నాయకత్వం వెతుకుతోందని వినుకొండ టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
బాన్సువాడ బరిలో స్పీకర్ తనయుడు!.. పోచారం కీలక వ్యాఖ్యలు
సాక్షి, కామారెడ్డి: వచ్చే ఎన్నికలలో బాన్సువాడ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారన్న ప్రచారానికి తెరపడింది. మళ్లీ తానే బరిలో నిలుస్తానని స్వయంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. సీఎం ఆదేశం, పార్టీ నాయకులు, కార్యకర్తల కోరిక మేరకు తానీ నిర్ణయం తీసుకున్నానన్నారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పీకర్ హోదాలో ఉండడంతో పార్టీ కార్యక్రమాలన్నీ ఆయన తనయుడు డీసీసీబీ చైర్మన్ అయిన పోచారం భాస్కర్‌రెడ్డి చూస్తున్నారు. నియోజకవర్గ నేతలు, అధికారులను సమన్వయం చేస్తూ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో భాస్కర్‌రెడ్డి పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. స్పీకర్ వయసు పైబడుతుండడంతో ఆయనకు బదులు కొడుకులు పోటీ దిగుతారని పార్టీ శ్రేణుల్లోనూ చర్చ జరిగింది. అయితే సీఎం కేసీఆర్ ఆదేశాలు, పార్టీ నేతల అభిప్రాయాల మేరకు తానే పోటీ చేస్తానని స్పీకర్ ప్రకటించడంతో ప్రచారానికి తెరపడినట్టయ్యింది. జనం మధ్యలో.. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల్లోనే ఎక్కువ సమయం గడుపుతు న్నారు. కొత్త పింఛన్ కార్డులు, సీఎం సహాయ నిధి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేస్తూ జనానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో ఊరిలో గంటల కొద్దీ సమయం కేటాయిస్తున్నారు. అభివృద్ధి పనుల ప్రారం¿ోత్సవాల్లో పాల్గొంటున్నారు. వీధులన్నీ తిరుగుతున్నారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. పనిలోపనిగా ఎవరైనా అనారోగ్యానికి గురైనా, మరణించినా వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా.... ఇటీవలి కాలంలో ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చేస్తున్న హడావుడిని చూస్తుంటే ఎన్నికలు వచ్చాయా అనిపిస్తోంది. ఓ రకంగా ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా అందరినీ కలుస్తున్నారు. ప్రజలు తమ గల్లీకి రావాలని కోరగానే అటు పరుగులు తీస్తున్నారు. అక్కడికక్కడే కొన్ని సమస్యలు పరిష్కారం చేస్తున్నారు. ఎన్నికలు వచ్చాయా అన్న రీతిలో వారి పర్యటనలు సాగుతున్నాయి. జనంతో మమేకమవుతూ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గం నుంచి మళ్లీ తానే ఎన్నికల బరి ఉంటానని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం బాన్సువాడ సరస్వతి ఆలయ కల్యాణ మండపంలో బీర్కూర్ మండలంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎల్లప్పుడు సమీక్ష అవసరమన్నారు. అప్పుడే లోటుపాట్లు బయటకి వస్తాయన్నారు. ఎవరు తప్పు చేసినా అది ప్రజలలో వ్యతిరేకతకు దారి తీస్తుందన్నారు. మంచి పనులు చేస్తే ప్రజలు బ్రహ్మరథం పడతారని, తప్పులు చేస్తే తరిమికొడతారని పేర్కొన్నారు. ఎవరైనా అనవసర విమర్శలు చేస్తే సమర్థవంతంగా తిప్పికొట్టాలన్నారు. బాన్సువాడ నియోజకవర్గానికి రాష్ట్రంలో మంచి పేరుందని, దానిని నిలబెట్టుకుందామని పేర్కొన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి పోచారం సురేందర్‌రెడ్డి, ఎంపీపీ రఘు, పార్టీ మండల అధ్యక్షుడు వీరేశం, ఏఎంసీ చైర్మన్ ద్రోణవల్లి అశోక్, మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్, నాయకులు శశికాంత్, నారాయణ, గంగారాం, సాయిలు తదితరులు పాల్గొన్నారు. సిట్టింగ్‌లకే టికెట్లన్న సీఎం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరు, సర్వేల ఆధారంగా టికెట్ల కేటాయింపు ఉంటుందని గతంలో ప్రచారం జరిగింది. అయితే ఇటీవల జరిగిన సమావేశంలో సిట్టింగులకే టికెట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సిట్టింగ్‌లకే అవకాశం ఇస్తామని, ఎవరి నియోజకవర్గంలో వారు కష్టపడాలని ఆదేశించారు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజక వర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలే పోటీ చేస్తారని భావిస్తున్నారు. బాన్సువాడనుంచి వచ్చే ఎన్నికల్లోనూ తానే పోటీ చేస్తానని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి బుధవారం ప్రకటించారు. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవ ర్గం నుంచి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎల్లారెడ్డిలో జాజాల సురేందర్, జుక్కల్‌లో హన్మంత్సింధేలకే అవకాశాలు దక్కనున్నాయి. -
రాజకీయం.. పరిగిడుతోంది!
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీలో ఎమ్మెల్యే టికెట్ల రేసు మొదలైంది. ఎన్నికలకు మరో తొమ్మిది నెలల సమయం మాత్రమే ఉండటంతో ఆశావహుల సంఖ్య అధికమవుతోంది. ప్రధానంగా పరిగి శాసనసభ టికెట్‌కు పోటీ తీవ్రమవుతోంది. టీఆర్ఎస్ జిల్లా రాజకీయాలన్నీ ప్రస్తుతం దీని చుట్టే తిరుగుతున్నాయి. టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అనారోగ్యానికి గురికావడంతో ఆయన కుమారుడు, రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న మహేశ్‌రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అధికార పార్టీ తరఫున గత ఎనిమిది నెలలుగా అన్ని బాధ్యతలు మోస్తూ వస్తున్నారు. ఇదే సమయంలో పక్క నియోజకవర్గాల నేతల కన్ను పరిగిపై పడింది. ఓ పక్క కొప్పుల కుటుంబానికి అనుయాయులుగా ఉంటూనే మరో వైపు టికెట్ రేసులో తాము సైతం ఉన్నామంటూ పావులు కదుపుతూ.. గులాబీ గూటిలో వేడి పుట్టిస్తున్నారు. పరిగి : అధికార పార్టీ తరఫున పరిగి అసెంబ్లీ టికెట్‌పై పలువురు నేతలు కన్నేశారు. నియోజకవర్గంలో ప్రస్తుతం మహేష్‌రెడ్డి టీఆర్ఎస్ బాధ్యతలు చూసుకుంటున్నారు. అయితే విద్యా మౌలిక వనరులు, అభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్మన్‌గా కొనసాగుతున్న నాగేందర్‌గౌడ్, కుల్కచర్ల జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బుయ్యని మనోహర్‌రెడ్డి, గండేడ్ మండలానికి చెందిన సీనియర్ జర్నలిస్టు శైలేశ్‌రెడ్డి తదితరులు పరిగి టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని యోచిస్తే.. ప్రస్తుత ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా ఈ స్థానాన్ని ఆశిస్తారని సమాచారం. ఇలా పరిగి టికెట్‌కు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ఉనికికోసం ప్రయత్నాలు... తమ ఉనికిని చాటుకోవడం కోసం ఆశావహులు తలోరకంగా ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ రేసులో ఉన్న నాగేందర్‌గౌడ్ తనకు సమయం చిక్కినప్పుడల్లా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఒకరిద్దరు స్థానిక బీసీ నేతలతో లోలోపల సత్సంబంధాలు నెరుపుతూ బీసీ కార్డుతో టికెట్ కోసం కృషి చేస్తున్నారు. తన సొంత నియోజకవర్గం చేవెళ్ల, ప్రస్తుతం నివాసముంటున్న వికారాబాద్ నియోజకవర్గాలు ఎస్సీలకు రిజర్వ్ కావడం, తాండూరులో మంత్రి పాగా వేయడం, కొడంగల్‌లో తనకెలాంటి పట్టు లేకపోవటం, అక్కడి నుంచి ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి సైతం టికెట్ ఆశిస్తుండటంతో నాగేందర్‌గౌడ్‌కు వేరే ప్రత్యామ్నాయం లేక పరిగిపై దృష్టి కేంద్రీకరించారు. ఇక కుల్కచర్ల జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మనోహర్‌రెడ్డి సైతం తనకు తెలిసిన వారితో అధిష్టానానికి దగ్గరయ్యే ప్రతయత్నం చూస్తూనే.. సేవా కార్యక్రమాల పేరుతో ఉనికి చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక సీనియర్ జర్నలిస్టు శైలేశ్‌రెడ్డి సైతం తనకు అధిష్టానం ఆశీస్సులున్నాయంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో నియోజకవర్గ గులాబీ గూటిలో వేడి రాజుకుంది. బలమైన కేడర్... అధికార టీఆర్ఎస్ పార్టీకి జిల్లాలో ఎక్కడా లేనివిధంగా పరిగిలో బలమైన కేడర్ ఉంది. గత ఎన్నికల్లో అనూహ్య రీతిలో కొప్పుల హరీశ్వర్‌రెడ్డి ఓటమిపాలైనా స్థానిక సంస్థల్లో విజయఢంకా మోగించారు. నియోజకవర్గంలో ఐదింటికి ఐదు జెడ్పీటీసీ స్థానాలు, ఐదింటిలో నాలుగు ఎంపీపీలు, అత్యధిక సర్పంచులు, పీఏసీఎస్‌లు, ఎంపీటీసీ స్థానాలను తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డిని రాజకీయంగా దీటుగా ఎదుర్కొంటూ వస్తున్నారు. మహేష్‌రెడ్డికే అవకాశం... టీఆర్ఎస్ అధిష్టానం, పార్టీ, ప్రభుత్వం తరఫున ఏ కార్యక్రమం నిర్వహించినా మహేశ్‌రెడ్డి పర్యవేక్షణలోనే కొనసాగుతోంది. పలువురు నేతలు టీఆర్ఎస్ పరిగి టికెట్ కోసం పావులు కదుపుతుండగా.. నియోజకవర్గంలోని కేడర్ మాత్రం హరీశ్వర్‌రెడ్డి కుటుంబానికే మద్దతుగా నిలుస్తోంది. ఆయన అనార్యోగానికి గురై.. మహేశ్‌రెడ్డి కీలకంగా వ్యవరించడానికి పట్టిన సంది కాలంలోనూ పార్టీ శ్రేణులు మాత్రం హరీశ్వర్‌రెడ్డికి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చాయి. ప్రస్తుతం వీరంతా టికెట్ రేసులో ముందున్న మహశ్రెడ్డిని అనుసరిస్తున్నారు. హరీశ్వర్‌రెడ్డి కోలుకున్నప్పటికీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం మాత్రం ఇతని తనయుడికే ఎక్కువగా ఉన్నాయి. రైతు సమన్వయ సమితి పగ్గాలు చేపట్టిన రోజు నుంచి మహేశ్‌రెడ్డి సైతం నియోజకవర్గంలో ముమ్మరంగా పర్యటిస్తున్నారు. ఒక్కో రోజు పదికి మించి కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు చేరువయ్యేందుకు శ్రమిస్తున్నారు. ఒకవేళ హరీశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిస్తే.. మంత్రివర్గం కూర్పులో మహేందర్‌రెడ్డికి పోటీ అయ్యే అవకాశం ఉంది. దీంతో హరీశ్వర్‌రెడ్డి కాకుండా.. మహేశ్‌రెడ్డి బరిలో నిలిస్తే.. మహేందర్‌రెడ్డి సైతం మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పరిగి నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా మహేష్‌రెడ్డికే ఉన్నాయనడంలో సందేహంలేదు. -
గెలుపు గుర్రం షిరహట్టి ...!
షిరహట్టి సీటును గెలుచుకున్న పార్టీనే కర్ణాటకలో సర్కార్‌ను ఏర్పాటు చేయడం ఒక సంప్రదాయంగా వస్తోంది. 1972 నుంచి కూడా ఇదే తీరు కొనసాగుతోంది. మొత్తం 224 సీట్లున్న కర్ణాటక అసెంబ్లీలో ఈ స్థానానికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. జనతాపార్టీ మొదలుకుని కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ వరకు గత 46 ఏళ్లుగా ఇక్కడి నుంచి గెలిచినవారు ఏ పార్టీలో ఉంటే అదే ప్రభుత్వం ఏర్పడుతూ వస్తోంది. ఒక్కో సందర్భంలో అధికారపార్టీకి చెందిన వారు ఓటమి పాలై ఇండిపెండెంట్ గెలిచినా, ఆ స్వతంత్ర ఎమ్మెల్యే చేరిన పార్టీనే అధికారానికి వస్తోంది. ఇదీ నియోజకవర్గం... ముంబై కర్ణాటకలోని గదగ్ జిల్లాలోని 65వ నంబర్ నియోజకవర్గం షిరహట్టి. దాదాపు 2 లక్షల ఓటర్లు. 2013లో 71.8 శాతం ఓటింగ్ నమోదైంది. 20–49 ఏళ్లలోపున్న ఓటర్లు దాదాపు 81 శాతం ఉన్నారు.. వీరిలో 20–29 ఏళ్లలోపున్నవారు 31 శాతం, 30–39 ఏళ్లలోపున్నవారు 32 శాతమున్నారు. మతసామరస్యానికి షిరిహట్టి ప్రతీకగా నిలుస్తోంది. 450 ఏళ్లకు పైగా హిందువులు,ముస్లింలకు ఆరాధ్యనీయమైన శ్రీజగద్గురు ఫకిరీశ్వర మఠం ఇక్కడే ఉంది. ఈ మఠం ప్రధాన పూజారి సూఫీ, భక్తి మార్గాలను బోధిస్తారు. ప్రధాన పూజారి మరణించాక హిందు, ఇస్లామ్ పద్ధతుల్లో అంతిమ సంస్కారాలు ఆచరిస్తారు. ఇదీ రికార్డ్... –1972లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి డబ్ల్యూవీ వదిరాజ్ఆచార్య గెలిచారు. అప్పుడు దేవరాజ్ అర్స్ నాయకత్వంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడింది.1983 వరకు ఈ సీటుపై పట్టును కాంగ్రెస్ కొనసాగించింది. –1983లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉపనల్ గులప్ప ఫకీరప్ప స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి జనతాపార్టీకి మద్దతు ప్రకటించారు. అప్పుడు రామకృష్ణ హెగ్డే నేతృత్వంలో జనతా ప్రభుత్వం ఏర్పడింది. 1985లోనూ జనతాపార్టీనే ఆ సీటును నిలుపుకోగా మళ్లీ హెగ్డే సీఎంగా ప్రమాణం చేశారు. –1989లో మళ్లీ ఆ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. వీరేంద్రపాటిల్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే ఆ రాష్ట్రంలో మతఘర్షణలు తలెత్తడంతో ఏఐసీసీ అధ్యక్షుడు రాజీవ్‌గాంధీ ఆయనను సీఎంగా తొలగించారు. ఆ తర్వాత ఇది కాంగ్రెస్ చేసిన అతిపెద్ద రాజకీయ తప్పిదంగా మిగిలిపోయింది. –1994లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి ఫకీరప్పను జనతాదళ్ టికెట్‌పై జీఎం మహంతషెట్టార్ ఓడించారు. దరిమిలా హేచ్‌డీ దేవెగౌడ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. –1999లో కాంగ్రెస్ మళ్లీ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఎస్ఎం కృష్ణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. –2004 ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. షిరహట్టి నియోజకవర్గాన్ని కాంగ్రెస్ దక్కించుకున్నా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించలేకపోయింది. ఈ పరిస్థితుల్లో జేడీ ఎస్తో జతకట్టి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే కొంత కాలానికి బీజేపీతో హేచ్‌డీ కుమారస్వామి చేతులు కలపడంతో ఈ సర్కార్ పతనమైంది. –2008లో బీజేపీ తొలిసారిగా షిరహట్టిపై పట్టుసాధించింది. దక్షిణ భారత్‌లోనే మొదటిసారిగా బీఎస్యడ్యూరప్ప నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. –2013లో కాంగ్రెస్ మళ్లీ ఈ స్థానాన్ని చేజిక్కించుకుంది. సిద్ధరామయ్య సీఎం అయ్యారు. –ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దొడ్డమని రామకృష్ణ షిడ్లింగప్పపై బీజేపీ అభ్యర్థి రామప్ప సోబెప్ప లామని పోటీ చేస్తున్నాడు. గత ఎన్నికల్లోనే ఈ రెండుపార్టీల తరఫునే వీరే బరిలో నిలిచారు. కేవలం 315 ఓట్ల అతి స్వల్ప మెజారిటీతో షిడ్లింగప్ప గెలుపొందారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఒకే కుటుంబానికి మూడు సీట్లా?!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సీటు విషయంలో టీజీ, ఎస్వీ వర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నిన్నటివరకు కేవలం టీజీ భరత్, ఎస్వీ మోహన్రెడ్టిలకే పరిమితమైంది. తాజాగా టీజీ వెంకటేష్ కూడా రంగంలోకి దిగారు. ఒకే కుటుంబానికి మూడు సీట్లు ఉన్నాయని, ఒక సీటు తగ్గినా నష్టం లేదులే అని టీజీ వ్యాఖ్యానించారు. ఒకవేళ తాను పత్తికొండలో పోటీ చేస్తానంటే కేఈ వాళ్లు తుంగభద్రలో పడేస్తారని, ఆళ్లగడ్డలో పోటీకి దిగితే కుటుంబ సభ్యులు ఇంట్లోకి కూడా రానివ్వరని ఎస్వీ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాజకీయంగా పునర్జన్మ ఇచ్చిన కర్నూలును వదిలిపెట్టిపోనని ఆయన మరోసారి స్పష్టం చేశారు. కర్నూలు నగరంలో నిర్వహించిన జన్మభూమి సభలో పాల్గొన్న సందర్భంగా గురువారం ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. వాస్తవానికి కొంతకాలంగా కర్నూలు సీటు విషయంలో అధికార పార్టీలో టీజీ భరత్, ఎస్వీ మోహన్‌రెడ్డి మధ్య రచ్చ జరుగుతోంది. కర్నూలు నుంచి తాను పోటీ చేస్తానని టీజీ భరత్ అంటుండగా... సిట్టింగ్ ఎమ్మెల్యేగా సీటు తనదేనని ఎస్వీ చెబుతున్నారు. మరోవైపు నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉందంటూ టీజీ వాతావరణాన్ని కొంత చల్లబరిచే ప్రయత్నం చేసినప్పటికీ.. కుటుంబంలో ముగ్గురికి ఎలా సీట్లు ఇస్తారనే కొత్త వాదనను మాత్రం తెరమీదకు తెచ్చారు. ఒకే వాహనంలో తిరుగుతూనే.. కర్నూలులోని ఎన్ఆర్ పేట నుంచి ఎస్.నాగప్ప స్ట్రీట్ వరకూ గురువారం జన్మభూమి సభలు జరిగాయి. ఈ సందర్భంగా టీజీ, ఎస్వీ ఇద్దరూ ఒకే వాహనంలో కలిసి తిరిగారు. వీరితో పాటు మునిసిపల్ కమిషనర్ కూడా ఉన్నారు. ఒకే వాహనంలో తిరుగుతున్నప్పటికీ కర్నూలు సీటు విషయానికి వచ్చేసరికి ఎవరికివారుగా వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం. పైగా ఇప్పటివరకు టీజీ భరత్, ఎస్వీకే పరిమితమైన మాటల యుద్ధం.. తాజాగా టీజీ వెంకటేష్, ఎస్వీ మధ్య మారినట్టు అర్థమవుతోంది. నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, అప్పుడు సీట్లకు ఇబ్బంది ఉండదని కూడా ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. అయితే, స్వయంగా టీజీ వెంకటేష్ రాజ్యసభలో వేసిన ప్రశ్నకు నియోజకవర్గాల పునర్విభజన లేదంటూ సమాధానం వచ్చింది. అయినప్పటికీ మాట వరుసకే ఆయన ఇలా అన్నారని తెలుస్తోంది. -
నంద్యాల సీటు ఎవరికిద్దాం!
ముఖ్యనేతలతో చర్చించిన లోకేష్? – తమ కుటుంబానికే ఇవ్వాలంటున్న భూమా వర్గం – తమకే ఇవ్వాలంటున్న శిల్పా వర్గం సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల అసెంబ్లీ సీటు ఎవ్వరికివ్వాలనే అంశంపై తెలుగుదేశం పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటి వరకు ఉప్పు–నిప్పుగా ఉన్న భూమా–శిల్పా వర్గాలు నంద్యాల అసెంబ్లీ సీటు విషయంలోనూ ఇదే తంతును కొనసాగిస్తున్నాయి. అభ్యర్థిత్వం తమదంటే తమదని వాదిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు కచ్చితంగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఈ పరిస్థితుల్లో సాధ్యమైనంత త్వరలో నంద్యాల అసెంబ్లీకి ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రెండు రోజుల క్రితం నంద్యాలలోని ఒక ప్రైవేటు హోటల్లో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జిల్లాలోని ముఖ్య నేతలతో చర్చించినట్టు సమాచారం. సమావేశంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో పాటు ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొనట్టు తెలిసింది. ప్రధానంగా ఈ సీటును తమకే ఇవ్వాలని భూమా కుటుంబీకులు కోరుతున్నట్టు తెలుస్తోంది. అయితే, గత ఎన్నికల్లో పోటీ చేసిన తమకే ఇవ్వాలని శిల్పా వర్గం కోరుతున్నట్లు చర్చ జరుగుతోంది. తమకంటే.. తమకని! నంద్యాల అసెంబ్లీ సీటుకు ఎన్నికలు జరిగితే ఇందులో తమకంటే తమకే పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఇరువర్గాలు కోరుతున్నట్టు తెలుస్తోంది. గతంలో పార్టీ తరపున పోటీ చేసింది కూడా శిల్పా మోహన్ రెడ్డి అని.. అందుకే ఆయనకే ఇవ్వాలనే వాదనను శిల్పా వర్గీయులు తెస్తున్నారు. అయితే, ఇందుకు భూమా వర్గం కౌంటర్ ఇస్తోంది. తమ కుటుంబానికి ఇస్తే పోటీ ఉండదని చెబుతోంది. ఇందులో భూమా రెండో కూతురు మౌనికతో పాటు అన్న కుమారుడు బ్రహ్మానంద రెడ్డి పేర్లు ప్రతిపాదనకు వస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఆ సీటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిందని కాబట్టి.. తమకే ఇవ్వాలని ఇప్పటికే ఆ పార్టీ వాదన తెరమీదకు తెచ్చింది. ఈ నేపథ్యంలో కుటుంబానికి సీటు ఇస్తే పోటీ ఉండదనే వాదన సరికాదని శిల్పా వర్గం పేర్కొంటున్నట్టు సమాచారం. ఆ సీటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది అవుతుందని.. అప్పుడు వారి తరపున ప్రకటించే అభ్యర్థిపై ఎలాంటి పోటీ లేకుండా అప్పగించాల్సి ఉంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మంత్రి పదవితోనే సరా...! వాస్తవానికి భూమా నాగిరెడ్డి మరణం తర్వాత అధికార తెలుగుదేశం పార్టీ వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ మారినప్పటికీ భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్లే ఆయన క్షోభతో మరణించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కూతురు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా విమర్శల జడి పెరగకుండా చూసుకోవాలని అధికారపార్టీ భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా కొన్ని ఫీలర్స్ కూడా వదిలింది. అయితే, ఇక అఖిలప్రియకు మంత్రి పదవి ఇస్తే.. నంద్యాల సీటు ఇవ్వకుండా మేనేజ్ చేయవచ్చుననేది తెలుగుదేశం పార్టీ పెద్దల ఆలోచనగా ఉన్నట్టు సమాచారం. దీనిపై కూడా విమర్శలు వచ్చే అవకాశం ఉందని.. ఈ విధంగా కూడా భూమా కుటుంబాన్ని మోసం చేశారన్న అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తమవుతుందని కూడా అధికార పార్టీ మదనపడుతోంది. మొత్తం మీద నంద్యాల అసెంబ్లీ సీటు వ్యవహారం అధికారపార్టీ పెద్దల బుర్రను హీట్ ఎక్కిస్తోంది. -
జిల్లాలో బీజేపీ బోణి
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ : జిల్లాలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బోణీ కొట్టింది. శుక్రవారం వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో తాడేపల్లిగూడెంలో ఆ పార్టీ అభ్యర్థి పైడికొండల మాణిక్యాలరావు విజయం సాధించారు. సామాన్య ఫొటోగ్రాఫర్‌గా జీవితాన్ని ప్రారంభించిన పైడికొండల మాణిక్యాలరావు కాషాయ పార్టీ జిల్లా తొలి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు. జిల్లాలో నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం పట్టణాల్లో మొదటి నుంచి ఉనికిలో ఉండేది. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న తరుణంలో జిల్లాలో ఆ పార్టీ బలం పుంజుకుంది. అప్పట్లో ఈ పార్టీ తరఫున కౌన్సిలర్లుగా కొందరు ఎన్నికయ్యారు. సినీనటుడు యూవీ కృష్ణంరాజు నరసాపురం పార్లమెంట్ సభ్యుడిగా విజయం సాధించి కేంద్ర మంత్రి పదవిని సైతం చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లా నుంచి ఆ పార్టీ ప్రాతినిధ్యం లేదు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే స్థానం ఆ పార్టీకి కేటాయించారు. ఇక్కడి నుంచి పోటీ చేసిన మాణిక్యాలరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట గోపిపై 14 వేల 73 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పోలైన ఓట్లలో మాణిక్యాలరావుకు 73,339 ఓట్లు రాగా గోపీకి 59,266 ఓట్లు దక్కాయి. దేశవ్యాప్తంగా వాజ్‌పేయ్ హవా కొనసాగుతున్న వేళ కృష్ణంరాజు గెలుపొందగా నేడు నరేంద్ర మోడీ గాలిలో మాణిక్యాలరావు గెలవడం విశేషం. రెండుసార్లూ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడం గమనార్హం. -
పురందేశ్వరి కోసం మడత పేచీ
ఆమె పోటీ టీడీపీ నిర్ణయంతో ముడి బీజేపీ, టీడీపీ మధ్య మళ్లీ సీట్లపై చర్చ సాక్షి, హైదరాబాద్: బీజేపీలో చేరిన మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి పోటీ చేయాల్సిన సీటు కోసం బీజేపీ, టీడీపీ మధ్య సీట్ల కేటాయింపు ఆఖరి నిమిషంలో మడత పేచీ పడింది. అరకు లోక్‌సభ బదులు ఒంగోలు లోక్‌సభ సీటు కావాలంటూ బీజేపీ పట్టుబట్టడంతో రెండు పార్టీల మధ్య తిరిగి మొదలైన సీట్ల పంచాయితీ మరికొన్ని సీట్ల విషయంలోనూ అస్పష్టత ఏర్పడే వరకు వెళ్లింది. దీంతో బీజేపీ పోటీ చేసే స్థానాలపై రెండు పార్టీల మధ్య చర్చలు మొదలయ్యాయి. బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు హరిబాబు, ఎన్నికల కమిటీ సంఘం కన్వీనర్ వీర్రాజులతో పాటు ఆ పార్టీ ముఖ్యనేతలు పలువురు హైదరాబాద్‌లో సమావేశమై.. పోటీ చేసే స్థానాల స్పష్టత కోసం టీడీపీ ఎంపీ సుజనా చౌదరితో చర్చించారు. నాలుగు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ సీట్ల విషయంలో రెండు పార్టీల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు వ్యక్తం కానట్టు సమాచారం. విశాఖపట్నం, నరసా పురం, తిరుపతి, రాజంపేట లోక్‌సభ సీట్లతో పాటు విశాఖ నార్త్, రాజమండ్రి సిటీ, తాడేపల్లిగూడెం, నరసరావుపేట, నెల్లూరు రూరల్, మదనపల్లి, పాడేరు, కడప, సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గాలలో బీజేపీ పోటీకి టీడీపీ ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అరకు లోక్‌సభ సీటును వదులుకునేందుకు బీజేపీ నేతలు సుముఖత వ్యక్తం చేస్తూనే, దాని బదులుగా టీడీపీ ఏ సీటును ప్రతిపాదిస్తుందన్న దానికోసం వేచిచూస్తున్నారు. అరకు లోక్‌సభ సీటుతో పాటు నరసన్నపేట, గజపతినగరం, రాజోలు, విజయవాడ సెంట్రల్, అనంతపురం, రాజంపేట అసెంబ్లీ స్థానాల మార్పిడిపై రెండు పార్టీల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. అరకు లోక్‌సభ సీటు తీసుకొని, బదులుగా ఒంగోలు లోక్‌సభ స్థానం కేటాయించాలని బీజేపీ పట్టుబడుతోంది. అయితే సుజనా చౌదరి మాత్రం అరకు కాకుండా విశాఖపట్నం టీడీపీకి ఇస్తే అందుకు బదులుగా కోరుకున్న సీటు ఇస్తామని ప్రతిపాదించడంతో కమలం నేతలు మిన్నకుండిపోయినట్టు సమాచారం. కాగా, పొత్తులో భాగంగా బీజేపీకి దక్కిన ఐదింటిలో నాలుగు లోక్‌సభ సీట్లలో బీజేపీ రాష్ట్ర నేతలు ప్రాథమికంగా అభ్యర్థులను ఖరారు చేసి ఢిల్లీకి పంపినట్టు సమాచారం. అరకు లోక్‌సభ స్థానం మార్పిడికి టీడీపీ అంగీకరించే దానిపై పురందేశ్వరి పోటీ చేసేదీ లేనిదీ ఆధారపడి ఉంది. -
రూటు మార్చిన రాములమ్మ
నియోజవర్గం మారబోనని బెట్టుచేసింది. అవసరమైతే పార్టీ మారడానికైనా రెడీ అయిపోయింది. తన పంతం నెగ్గించుకునేందుకు 'అన్న'ను సైతం ఎదిరించి కాంగ్రెస్ కండువా కప్పుకుంది. ఏమైతేనేం చెల్లెమ్మ మళ్లీ అదే స్థానం నుంచి టికెట్ సంపాదించింది. అన్న కూడా ఇక్కడి నుంచే బరిలోకి దిగుతున్నాడు. కాకపోతే చెల్లెమ్మ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రూటు మార్చింది. దీంతో ఇద్దరి మధ్య ముఖాముఖి పోరు తప్పింది. గత ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కలసిమెలసి పనిచేసిన అన్నాచెల్లెళ్లు ఈసారి'మెదక్మే సవాల్' అంటూ వైరి వర్గాలుగా తలపడుతున్నారు. రాజకీయమంటే ఇదే మరి! అభిమానులు రాములమ్మగా పిలుచుకునే విజయశాంతి కథ ఇది. గత లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున విజయశాంతి మెదక్ నుంచి పోటీ చేశారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయశాంతి విజయానికి కృషి చేశారు. మహబూబ్ నగర్ నుంచి కేసీఆర్ విజయం సాధించడంతో ఇద్దరూ పార్లమెంట్‌కు వెళ్లారు. రాములమ్మను సొంత చెల్లెలుగా ఆదరించిన కేసీఆర్ ఆమెకు పార్టీలో సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఐదేళ్లు తిరిగేసరికి పరిస్థితి మారిపోయింది. అన్నాచెల్లెళ్ల బంధం చెడింది. దీనికి కారణం మెదక్ పార్లమెంట్ సేటే! కేసీఆర్ తాజా ఎన్నికల్లో సొంత జిల్లా నుంచి పోటీ చేయాలని భావించడంతో రాములమ్మకు టిక్కెట్ హామీ లభించలేదట. దీంతో ఆమె నియోజకవర్గం మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తాను మెదక్ నుంచే పోటీ చేస్తానంటూ విజయశాంతి ధిక్కార స్వరం వినిపించింది. కాంగ్రెస్ పార్టీ గాలం వేయడంతో కారు దిగిపోయింది. మెదక్ టికెట్ కోసం కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి అదే చోట నుంచి అయితే బరిలో దిగుతున్నారు కానీ లోక్‌సభకు కాదు. ఈసారి ఆమె అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ జాబితాలో విజయశాంతి పేరును ప్రకటించారు. రాములమ్మ చివరకు ఢిల్లీ కంటే హైదరాబాదే బెటరనుకుందో లేక సర్దుకుపోయిందో? ఇక కేసీఆర్ కూడా ఈసారి సొంత జిల్లాకు మారారు. మెదక్ లోక్‌సభ నుంచి పోటీచేస్తున్నారు. దీంతో మెదక్ పోరు ఆసక్తికరంగా మారింది. అన్నాచెల్లెళ్లు నేరుగా తలపడకపోయినా ఒకే నియోజకవర్గం నుంచి వేర్వేరు చట్టసభలకు పోటీ చేస్తున్నారు. వైరి పక్షాలుగా మోహరించి మాటల తూటాలు పేల్చనున్నారు. విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి! -
ఎన్ని‘కల’ తీరేవేళ... అంతర్మథనం!
సాక్షి ప్రతినిధి, విజయనగరం:రాష్ట్ర విభజన నేపథ్యంలో నెలకొన్న పరిణామాలు ఆయన్ను పునరాలోచనలో పడేశాయా? పట్టుకోల్పోయి, దిగజారుతున్న పార్టీ పరిస్థితిని బేరీజు వేసుకుంటున్నారా? కేడర్‌లో ఆసక్తి కనిపించడం లేద న్న నిర్ణయానికొచ్చారా? బొత్స ప్రాబ ల్యం కోల్పోతున్న వేళ ఎన్నికల్లో గట్టెక్కలేమని అభిప్రాయపడుతున్నారా? ఎందుకొచ్చిన టెన్షన్ అని అంతర్మథనంలో పడ్డారా? విజయనగరం అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలని ఆరాట పడుతూ, లైన్ క్లియర్ చేసుకున్న యడ్ల రమణమూర్తిపై ప్రస్తుతం జరుగుతున్న చర్చిది. టిక్కెట్ దాదాపు ఖరారైనా ఆయన ప్రజల మధ్యకు వెళ్లడం లేదు. దీంతో అంతటా ఇదే చర్చ సాగుతోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ క్రియాశీలక నేతగా వ్యవహరించారు. కానీ, విజయనగరంలో టీడీపీ పెద్ద దిక్కుగా అశోక్ గజపతిరాజు ఉండడం, ఎమ్మెల్యేగా ఆయనను తప్ప మరొకర్ని ఆలోచించే పరి స్థితి లేకపోవడంతో యడ్ల రమణమూర్తి ఎదగలేకపోయారు. గజపతినగరం, నెల్లిమర్ల నియోజకవర్గాలకైనా వలసపోయి పోటీ చేద్దామని భావించినా అధిష్టానం అవకాశం కల్పించలేదు. ఇక, జిల్లా పరిషత్, ఎమ్మెల్సీ, నామినేటేడ్ పోస్టుల పందేరం జరిగినా సమీకరణాల ప్రభావంతో ఛాన్స్ రాకుండా పోయింది. చెప్పాలంటే కరివేపాకు మాదిరిగా ఆ పార్టీలో మిగిలిపోయారు. తన పాటి సీనియారిటీ ఉన్న నేతలంతా ఎమ్మెల్యేలు, మంత్రులు అవుతున్నా తానేమీ కాలేకపోయానన్న బాధ పడ్డ పరిస్థితులు ఉన్నాయి. కానీ, ఎప్పటికైనా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలనేది చిరకాల కోరిక. టీడీపీలో ఉంటే సాధ్యం కాదని, బంధుమిత్రులున్న పార్టీలోకి వెళ్లితే అవకాశం వస్తుందని, బొత్స సత్యనారాయణతో ఉన్న సాన్నిహిత్యంతో కోలగట్ల వీరభద్రస్వామి పక్కన పెట్టి టిక్కెట్ దక్కించుకోగలనని భావించి కాంగ్రెస్‌లో చేరారు. అనుకున్నట్టే అడ్డంకులు తొలగించుకున్నారు. కోలగట్ల వీరభద్రస్వామికి ఎమ్మెల్సీ కట్టబెట్టడం ద్వారా లైన్ క్లియర్ చేసుకున్నారు. అందుకు తగ్గట్టుగా టిక్కెట్ల ఎంపిక కోసం వచ్చిన ఏఐసీసీ పరిశీలకుల వద్ద తన పేరునే ప్రతిపాదించుకునేలా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ,కాంగ్రెస్ ప్రజా కంఠక పాలన, అండగా ఉండే బొత్స సత్యనారాయణ అనేక ఆరోపణలతో ప్రాబల్యం కోల్పోవడం, రాష్ట్ర విభజన నేపథ్యంలో పార్టీ పరిస్థితి దయనీయంగా మారడంతో యడ్ల రమణమూర్తి అయోమయంలో పడిపోయారు. దాదాపు ప్రతి నియోజకవర్గంలో నాయకులంతా ప్రచారంలో దూసుకుపోతున్నా యడ్ల మాత్రం కదల్లేకపోతున్నారు. టిక్కెట్ వస్తుందో రాదో తెలియని నేతలు కూడా ఎన్నికల జోష్‌తో పనిచేస్తుండగా తనకే టిక్కెట్ గ్యారంటీ అని తెలిసినా ప్రజల వద్దకు వెళ్లలేకపోతున్నారు. దీనికంతటికీ పార్టీపై ప్రజల్లో అసంతృప్తి, అసహన పరిస్థితులే కారణమని తెలుస్తోంది. కోలగట్లపై ఒత్తిడి ఎమ్మెల్యేగా పోటీ చేద్దామనుకున్న యడ్ల క్రియాశీలకంగా వ్యవహరించకపోవడంతో ఉన్నకాడికి పార్టీ శ్రేణులు డైలామాలో పడ్డాయి. పోటీ చేస్తే ఫలితమెలా వస్తుందో యడ్ల ముందే ఊహించి ఉంటారని, ఈ వయస్సులో అంత టెన్షన్ అవసరమా అని ఆలోచనకొచ్చేశారని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. పరిస్థితిని గమనించే మళ్లీ కోలగట్ల వీరభద్రస్వామినే పోటీ చేయమని కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నారు. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో సరికాదని, మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా లేనన్న సంకేతాలను కోలగట్ల ఇస్తున్నారు. దీంతో ఇతర పార్టీల్లోకి వలసపోగా మిగిలి ఉన్న నేతలంతా అయోమయంలో పడ్డారు. -
మాగుంట కుటుంబానికి ‘బాబు’ ఎర
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో ఒక అసెంబ్లీ సీటు మహిళలకు ఇస్తామని చెబుతున్న తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు ఆ సీటును కూడా కాంగ్రెస్ నుంచి వలస తెచ్చుకోవాలని భావిస్తున్నారు. ఆ సీటును మాగుంట కుటుంబ సభ్యులకు కేటాయించే వాతావరణం కనిపిస్తోంది. ధనబలం వున్న వారి కోసం వలలు విసిరి పార్టీలోకి ఆహ్వానిస్తున్న చంద్రబాబునాయుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి, మాగుంట పార్వతమ్మను పార్టీలోకి తీసుకురావడానికి తెర చాటుమంతనాల వేగం పెంచారు. ఇందులో భాగంగానే తమ దారెటో నిర్ణయించుకోవడానికి ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి నెల్లూరులోని తమ కార్యాలయంలో ఆదివారం మద్దతుదారుల సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధాటికి తట్టుకోవాలంటే వందలు, వేల కోట్లున్న ధనవంతులను పోటీకి దించడమే ఏకైక మార్గంగా టీడీపీ అధినేత భావిస్తున్నారు. ఇలాంటి వారికి ఎల్లో కార్పెట్ స్వాగతం పలికి వారు కోరిన సీట్లు కేటాయించడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. పదేళ్లుగా పార్టీని నమ్ముకుని పనిచేసిన వారి నుంచి తీవ్ర నిరసన ఎదురవుతున్నా అవసరమైతే అలాంటి వారినే వదులుకుని కొత్త వారికి టికెట్లు ఇచ్చేలా టీడీపీ అధినేత పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే ఆదాల ప్రభాకరరెడ్డి, ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి చంద్రబాబు టికెట్లు ఖరారు చేశారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రభావం చూపగల మాగుంట సుబ్బరామిరెడ్డి కుటుంబాన్ని ఎలాగైనా తమ వైపునకు లాక్కోవడానికి తమ పార్టీ ముఖ్య నేతలను ఆయన రంగంలోకి దించారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఒంగోలు ఎంపీగా గెలిచిన మాగుంట శ్రీనివాసులురెడ్డిని, ఆయన వదిన పార్వతమ్మను పార్టీలోకి రావాలంటూ వారి మీద ఒత్తిడి పెంచుతున్నారు. శ్రీనివాసులురెడ్డికి ఒంగోలు ఎంపీ, పార్వతమ్మకు ఉదయగిరి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని చంద్రబాబు తన సన్నిహిత నాయకుల ద్వారా మంతనాలు సాగిస్తున్నారని తెలిసింది. శ్రీనివాసులురెడ్డిని ఒంగోలు లోక్‌సభకు పోటీ చేయించడం ద్వారా ఆ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులకు పెద్ద ఎత్తున ధన సహాయం అందించి ఎన్నికల్లో వెయ్యి రూపాయల నోట్లు పారించే ఎత్తుగడకు తెర లేపారు. నెల్లూరు లోక్‌సభ పరిధిలోని ఉదయగిరి నియోజకవర్గం నుంచి పార్వతమ్మను పోటీ చేయించి అక్కడ కూడా విరివిగా ధన ప్రవాహం పారించాలనేది చంద్రబాబు ఎత్తుగడగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు ఉదయగిరి పార్టీ ఇన్చార్జిగా ఉన్న బొల్లినేని రామారావు పార్టీ హై కమాండ్ సూచించినంత డబ్బు ఖర్చు పెట్టే ధైర్యం చేయలేక వెనకడుగు వేస్తున్నారు. ఇదే సమయంలో ఆదాల ప్రభాకరరెడ్డి తన మద్దతు దారుడు ఒంటేరు వేణుగోపాలరెడ్డికి ఆ టికెట్ ఇప్పించే ప్రయత్నాలకు తెర లేపారు. అయితే చంద్రబాబు మాత్రం పార్వతమ్మను ఇక్కడి నుంచి పోటీచేయించే ఆలోచన చేస్తున్నారు. ఇతర పార్టీల నాయకులను ఒప్పించో, టికెట్లు ఎర వేసో తమ పార్టీలోకి లాక్కొచ్చే పనిచేస్తున్న ఇద్దరు టీడీపీ ముఖ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి మీద ఒత్తిడి పెంచారని తెలిసింది. టికెట్లు ఖరారు చేయాల్సిన సమయం దగ్గర పడుతున్నందువల్ల వెంటనే నిర్ణయం తెలియ చేయాలని వారు రకరకాల మార్గాల్లో మాగుంట కుటుంబాన్ని ఒత్తిడి చేయిస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగానే మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆదివారం నెల్లూరులోని తన కార్యాలయంలో మద్దతుదారులతో సమావేశమయ్యారు. తమకు వస్తున్న ఆఫర్ల గురించి వివరించి ఏ పార్టీలోకి వెళితే బాగుంటుందనే అభిప్రాయలు సేకరించారు. ఒకటి,రెండు రోజుల్లో ఒంగోలులో కూడా మద్దతుదారులతో సమావేశమై ఆ తర్వాత ఒక నిర్ణయానికి రావాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే తమ నాయకుడు ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదనీ, అనేక రకాల ఆలోచనల్లో మాత్రమే ఉన్నారని ఆదివారం నాటి సమావేశానికి హాజరైన ఒక నాయకుడు సాక్షి ప్రతినిధికి చెప్పారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వలస నాయకులను తీసుకుని వచ్చి టికెట్ల పందేరం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలపై ఆ పార్టీ సీనియర్ నేతలు మండిపడుతున్నారు. -
నేతల్లో గుబులు
నోటిఫికేషన్ వస్తే ప్రాణసంకటమే ఎమ్మెల్యే అభ్యర్థుల శిరోభారమే కొద్ది గంటల్లో తేలనున్న నిర్ణయం సాక్షి, మచిలీపట్నం/ విజయవాడ : మున్సిపల్ ఎన్నికలు రాజకీయ పార్టీల నేతల్లో గుబులు రేకెత్తిస్తున్నాయి. ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడితే తమకు ప్రాణసంకటమేనని వివిధ రాజకీయ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత వస్తాయని భావిస్తున్న మున్సిపల్ ఎన్నికలు సుప్రీంకోర్టు అక్షింతలతో ముందుకు జరిగాయి. సోమవారం మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. దీంతో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందే మున్సిపల్ ఎన్నికలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఓడితే అసెంబ్లీ సీటు పోవడమే కాకుండా గెలుపుపై కూడా అనుమానాలు ఏర్పడే అవకాశం ఉండటంతో వారిలో గుబులు మొదలైంది. డివిజన్ రిజర్వేషన్లు కూడా ప్రకటించడంతో తమ నియోజకవర్గాల పరిధిలోని డివిజన్లలో అభ్యర్థుల వేటలో పడ్డారు. రిజర్వేషన్ల ప్రకటనతో అప్పటి వరకూ డివిజన్ అధ్యక్షులుగా, అభ్యర్థులుగా రంగంలో ఉన్నవారి బదులు ఆయా రిజర్వేషన్ల ఆధారంగా కొత్త వారిని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సగం డివిజన్లు మహిళలకు రిజర్వు కావడంతో మహిళా అభ్యర్థుల కోసం వేట మొదలు పెట్టారు. కాంగ్రెస్ నేతల్లో అయోమయం... అధికార పక్ష ంలో పూర్తి అయోమయం నెలకొంది. అసలు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో ఉండాలా లేదా అన్న విషయం తేల్చుకోలేని స్థితిలో ఉండగా మున్సిపల్ ఎన్నికలు వారిపై మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది. వారు ఎటూ తేల్చుకోలేని స్థితిలో అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి డబ్బులు పోగొట్టుకోవడం తప్ప ప్రయోజనం లేదన్న ఉద్దేశంతో మాజీ కౌన్సిలర్లు కొందరు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించారు. రాజకీయ నాయకుల హడావుడి... పురపాలక సంఘాలకు రిజర్వేషన్లు ప్రకటించటంతో రాజకీయ నాయకుల్లో హడావుడి ప్రారంభమైంది. సాధారణ ఎన్నికల సమయంలో పురపాలక సంఘాల ఎన్నికలు జరుగుతాయా, జరిగితే ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై నాయకులు తమ అనునయులతో చర్చలు ప్రారంభించారు. ప్రస్తుతం శాసనసభకు, లోక్‌సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందే పురపాలక సంఘాల ఎన్నికలు వస్తే అన్ని రాజకీయ పార్టీల నాయకులకు తలనొప్పులు ఖాయం. కౌన్సిలర్లకు సీట్లు కేటాయించే సమయంలో సముచిత నిర్ణయం తీసుకోకుంటే సీటు ఆశించి భంగపడినవారు ఆయా పార్టీలకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం లేకపోలేదు. వీటన్నింటిని సరిదిద్దుకోవాలంటే నాయకులకు తలబొప్పి కట్టడం ఖాయం. రాష్ట్ర విభజనపై రాష్ట్రపతి సంతకం చేసిన అనంతరం పురపాలక సంఘాల ఎన్నికలు జరిగితే ప్రజలు ఏ పార్టీని ఆదరిస్తే తరువాత జరిగే అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో అదే పార్టీని ఆదరించే అవకాశం ఉందని, ఈ ప్రభావం కాంగ్రెస్ పార్టీపై కచ్చితంగా పడుతుందని ఆ పార్టీ నాయకులు మధనపడుతున్నారు. -
కామారెడ్డిపై ‘కమలం’ నజర్
కామారెడ్డి, న్యూస్‌లైన్: బీజేపీ అగ్రనేతలు కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంపై దృష్టి సారించారు. రాబోయే ఎన్నికల్లో ఈ నియోజక వర్గం నుంచి పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలన్న వ్యూహంతో అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ పార్టీల్లో వివిధ స్థాయిల్లో కొనసాగుతున్న నేతలకు బీజేపీ గాలం వేస్తోంది. కీలకమైన నేతలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చవచ్చని ఆ పార్టీ భా విస్తోంది. నియోజక వర్గంలో హిందుత్వవాదం బలం గా ఉండడంతో పాటు తెలంగాణ వాదం కూడా తోడు గా ఉన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో పార్టీని మరిం త బలోపేతం చేసుకోవచ్చని ఆ పార్టీ నేతలు వ్యూహం ప్రకారం వ్యవహరిస్తున్నారు. టీడీపీ నియోజక వర్గ ఇన్చార్జిగా పనిచేసిన నిట్టు వేణుగోపాల్‌రావును పార్టీలో చేర్చుకునే కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25న కామారెడ్డిలోని తాడూరి గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హాజరుకానున్నారు. కామారెడ్డి పట్టణంలో బీజేపీ బలంగా ఉండేది. మున్సిపాలిటీలో 8 మంది కౌన్సిలర్లు ఉండేవారు. పట్టణంలో ఆ పార్టీ బలం అలా ఉండేది. అయితే కొం దరు పార్టీని వీడిన తరువాత పార్టీ కొంత వెనక్కు వెళ్లి నా తెలంగాణ ఉద్యమం ఎగిసిపడ్డ తరువాత తిరిగి పుంజుకుంటోంది. టీఆర్ఎస్లో తరువాత టీడీపీలో కొంతకాలం పనిచేసిన పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు టి.విఠల్‌గుప్తా గతేడాది బీజేపీలో చేరారు. ఆయన నియోజక వర్గం అంతటా తిరుగుతున్నారు. రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ రేసులో ఉన్నారు. ఇటీవల నియోజక వర్గంలో ఆయన పాదయాత్ర కూడా చేపట్టారు. తాజాగా టీడీపీ నియోజక వర్గ ఇన్చార్జి నిట్టు వేణుగోపాల్‌రావు ఈ నెల 25న అధికారికంగా బీజేపీలో చేరనున్నారు. నిట్టు చేరికతో ఆ పార్టీ బలం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ఆయన కూడా రాబోయే ఎన్నికల్లో పార్టీ టిక్కెట్‌ను ఆశిస్తారు. అలాగే లెక్చరర్‌గా పనిచేస్తున్న ఏబీవీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు రంజిత్మోహన్తో పాటు ప్రైవేటు కళాశాల సీఈఓ హరిస్మరణ్‌రెడ్డి కూడా రాబోయే ఎన్నికల్లో కామారెడ్డి నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని ఆరాటపడుతున్నట్టు తెలుస్తోంది. ఇరువురూ తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. తమ శిష్యుల సమాచారాన్ని సేకరించి, రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ వస్తే వారిని ఎలా ఉపయోగించుకోవాలన్న అంశంపై ప్రణాళికలు రూపొందించుకుటున్నారు. జహీరాబాద్‌పై జెడ్పీ మాజీ చైర్మన్ కన్ను జడ్పీ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డి కూడా బీజేపీలో చేరే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఆయన జహీరాబాద్ ఎంపీ సీటు ఆశిస్తున్నట్టు సమాచారం. కామారెడ్డికి పొరుగు నియోజక వర్గమైన ఎల్లారెడ్డిలో ఆ పార్టీ నేత బాణాల లక్ష్మారెడ్డి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఇదే సమయంలో హిం దూత్వం, తెలంగాణ వాదాలు బలంగా ఉన్న కామారెడ్డి నియోజక వర్గంలోనూ పాగా వేసేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఎవరిని వరిస్తుందన్నది కాకుండా అందరూ పార్టీని విస్తరించేందుకు కృషి చేయాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం సూచించినట్టు తెలుస్తోంది. సభను విజయవంతం చేయాలి కామారెడ్డి మున్సిపాలిటీ : బీజేపీ భారీ బహిరంగను విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళధర్ గౌడ్ కోరారు. ఈసభను విజయవంతం చేయడానికి ఇంటింటి నుంచి ప్రతి ఒక్కరూ హాజరుకావాలన్నారు.