Aswaraopeta
-
అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ (38) మృతి చెందారు. ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ గత ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. అప్పటి నుంచి హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఆదివారం తెల్లవారుజామున చనిపోయారు. ఇక, ఈ ఘటనపై ఇప్పటికే సీఐ జితేందర్‌రెడ్డి, పోలీసు కానిస్టేబుళ్లు సన్యాసినాయుడు, సుభాని, శేఖర్, శివనాగరాజుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ భార్య కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడికి ఏడేళ్ల వయసున్న కుమార్తె, ఐదేళ్ల వయసున్న కుమారుడు ఉన్నారు. ఎస్సై శ్రీను స్వగ్రామం నారక్కపేట. కాగా, శ్రీనివాస్ ఆత్మహత్య నేపథ్యంలో సీఐ జితేందర్ రెడ్డిపై ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో జితేందర్ రెడ్డి సతీమణి శైలజ ఒక వీడియో సందేశం పంపించారు. వీడియోలో ఆమె మాట్లాడుతూ..‘జితేందర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయడం అన్యాయం. ఎస్సీ మాదిగ కులానికి చెందిన నన్ను ఆయన తొమ్మిదేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలాంటి మంచి వ్యక్తి నా భర్త. ఎస్ఐ శ్రీనివాస్‌ను ఎలాంటి వేధింపులకు గురిచేయలేదు. కుల సంఘాలు ఆలోచన చేసి వాస్తవాలను గుర్తించి న్యాయం చేయాలి. జితేందర్ రెడ్డిపై ఆరోపణలను విరమించుకోవాలని విజ్ఞప్తి’ చేశారు. -
అశ్వారావుపేట SI ఆత్మహత్యాయత్నం
-
కాంగ్రెస్‌లోకి చేరికల తుపాన్ రాబోతోంది: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పోడు భూములకు పట్టాలిస్తానని ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక పోడు భూముల రైతుల్ని మర్చిపోయాడని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, కర్కంగూడెం జడ్పీటీసీ సభ్యుడు కాంతారావు శుక్రవారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. 'పోడు భూమి రైతులకు పట్టాలిచ్చి వారిని యజమానులను చేసింది కాంగ్రెస్ పార్టీ. వందల మంది ఆదివాసీల పైన కేసులు పెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసీలను చిన్న చూపు చూస్తుంది. హరితహారం పేరు మీద దాడులు చేస్తున్నారు. గిరిజన భూములు లాక్కుని లే అవుట్లు వేస్తున్నారు. 11నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. పోడు భూముల సమస్య పరిష్కారం అవుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం పోవాలి. పేదల ప్రభుత్వం రావాలి. తొందరలోనే అశ్వారావు పేటలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. కాంగ్రెస్‌లోకి చేరికల తుపాన్ రాబోతోందని' టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ చేరిక సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 'రుణమాఫీ హామీ ని గాలికొదిలేసారు. ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. హైదరాబాద్‌లో ఫ్లైఓవర్లు నిర్మిస్తే అయిపోద్దా.. ఏజెన్సీ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరణి వల్ల ప్రతి రైతు ఇబ్బంది పడుతున్నాడు. వైఎస్ రాజశేఖరరెడ్డి భధ్రాచలం వచ్చి పోడు భూమి రైతులకు పట్టాలిచ్చారు. మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే.. గిరిజనులకు న్యాయం జరుగుతుంది' అని తాటి వెంకటేశ్వర్లు అన్నారు. చదవండి: (Hyderabad: అరోరా కాలేజీలో జరగాల్సిన జేఈఈ పరీక్ష వాయిదా) -
మేమేం తక్కువ?.. అధికార టీఆర్ఎస్లో తారాస్థాయికి విభేదాలు
సాక్షి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఇప్పుడిప్పుడే బయట పడుతోంది. ఇటీవల మంత్రి కేటీఆర్ జిల్లాకు వచ్చినప్పుడు అంతర్గత విభేదాలను పరిష్కరించే ప్రయత్నం చేస్తూ.. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని హితబోధ చేశారు. అయినా పార్టీలో తమకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని కొందరు నేతలు రగిలిపోతున్నారు. ఇప్పటి వరకు పలువురు నేతలు పరోక్ష విమర్శలకే పరిమితం కాగా.. తాజాగా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అధిష్టానంపైనే తిరుగుబావుటా ఎగుర వేశారు. తనకు ప్రాధాన్యత ఇవ్వకపోతే పార్టీ మారుతానని అల్టిమేటం జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయన బాటలోనే మరికొందరు అసంతృప్తి వెల్లగక్కేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. చదవండి: కేటీఆర్ కంటే నేనే సీనియర్: తాటి ఆది నుంచీ అదే తీరు ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్లో ఆది నుంచీ ఇదే పరిస్థితి నెలకొంది. మొదటి నుంచీ ఉన్న ఉద్యమ నాయకులు.. ఆ తర్వాత చేరిన నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరగా.. అప్పటికే పార్టీలో ఉన్న నేతల నడుమ అంతరం పెరగడంతో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహారం కొనసాగుతోంది. 2014, 2018 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్కు ఆశించిన ఫలితాలు రాలేదు. రెండు ఎన్నికల్లోనూ ఒక్కో అసెంబ్లీ స్థానం మాత్రమే గెలుచుకోగలిగింది. 2018 తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ మంచి విజయాలనే నమోదు చేసింది. అయినా నేతల నడుమ విభేదాలు అలాగే ఉండిపోయాయి. ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ నేతల నడుమ పొరపొచ్చాలు ఉండగా.. పాలేరు, వైరా, అశ్వారావుపేట, కొత్తగూడెం, పినపాక నియోజకవర్గాల్లో వర్గ పోరు తీవ్రమవుతుండడం గమనార్హం. కేటీఆర్ హితబోధ చేసినా.. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఈసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాపై టీఆర్ఎస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో ఈనెల 11న ఖమ్మం వచ్చిన మంత్రి కేటీఆర్.. నాయకులతో మాట్లాడారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, ఈసారి మంచి ఫలితాలు సాధించేలా సమష్టిగా కృషిచేయాలని నచ్చజెప్పా రు. ఈ అంతర్గత సమావేశం తర్వాత కూడా కొందరు నేతల నడుమ సమన్వయం కుదరకపోగా, టీఆర్ఎస్లో తమ రాజకీయ భవిష్యత్ ఏమిటనే అంశంపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గళం విప్పుతున్న నేతలు సుదీర్ఘకాలంగా పార్టీలో పని చేస్తున్నా సరైన అవకాశాలు రావడం లేదనే భావనలో పలు వురు టీఆర్ఎస్ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో ప్రాధాన్యత తగ్గుతోందని, కనీస గౌరవం కూడా దక్కడం లేదని కొందరు నేతలు తమ అనుచరుల వద్ద వాపోతున్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్ ఖమ్మం వచ్చిన సమయాన పీకే సర్వే నివేదికలు, పనితీరు ప్రామాణికంగానే వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. దీంతో తమను నమ్ముకున్న అనుచరులు, కార్యకర్తలకు న్యాయం చేయడమెలా అని కొందరు చర్చలు చేస్తుండగా.. పార్టీలో గుర్తింపు లేకపోతే తమ పరిస్థితి ఏమిటనే ఉద్దేశంతో నేరుగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అధిష్టానంపై ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. తాడో పేడో తేల్చుకునే క్రమంలో పార్టీ మారేందుకు కూడా వెనుకాడేది లేదని ఆయన హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతుండగా.. అదే బాటలో ఇంకొందరు అసంతృప్త నేతలు కూడా ఉన్నట్లు సమాచారం. -
ఆర్టీసీ బస్సులో ప్రేమజంట ఆత్మహత్య
-
తెలంగాణ ఆర్టీసీ బస్సులో ప్రేమజంట ఆత్మహత్య
అశ్వారావుపేట రూరల్/చండ్రుగొండ: పాఠశాలకని వెళ్లిన బాలిక అదృశ్యమై రెండురోజుల తర్వాత విగతజీవిగా కనిపించింది. ఆమెతోపాటు ఆటోడ్రైవర్ కూడా బలవన్మరణానికి పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. అప్పటికే పెళ్లి అయి ఇద్దరు పిల్లలున్న ఆటోడ్రైవర్, ఆ బాలికను ప్రేమపేరిట మభ్యపెట్టినట్లు తెలుస్తోంది. భద్రాద్రికొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం సీతాయిగూడెంకి చెందిన మాయర సర్వేష్ – కృష్ణవేణి దంపతుల పెద్ద కుమార్తె అనూష(14) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన పోరల్ల జగ్గారావు(28) ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. గ్రామానికి చెందిన పలువురితో కలసి అనూష కూడా జగ్గారావు ఆటోలో పాఠశాలకు వెళ్లివచ్చేది. ఈ క్రమంలోనే అతడు ప్రేమపేరిట మాయమాటలు చెప్పి ఆమెను వశపర్చుకున్నట్లు సమాచారం. సోమవారం రోజులాగే పాఠశాలకు వచ్చిన ఆమె మధ్యాహ్న భోజన సమయంలో బయటకు వెళ్లి తిరిగిరాలేదు. అయితే, అప్పటికే పాఠశాల బయట వేచి ఉన్న జగ్గారావు ఆమెను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో వారు అశ్వారావుపేట ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చి కొత్తగూడెం డిపో బస్సు ఎక్కి కూర్చున్నారు. కొద్దిసేపటి తర్వాత వారిద్దరూ పురుగుల మందు తాగి వాంతులు చేసుకుంటూ కనిపించడంతో బస్సు డ్రైవర్, కండక్టర్ వెంటనే పోలీసులు, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ రాక ఆలస్యం కావడంతో బస్సులోనే వారిద్దరిని అశ్వారావుపేట ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న క్రమంలోనే పరిస్థితి విషమించి ఇద్దరూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఇదేం ఐడియా సామీ.. పంట చేలో కార్తీకదీపం ఫేమ్ వంటలక్క!
కార్తీకదీపం వంటలక్క ఫేమ్ ఇంటికే పరిమితం కాలేదు. ఇప్పుడు పంట చేల దాకా పాకింది. పంటలను కాపాడుకునేందుకు రైతులు చేలలో దిష్టి బొమ్మలు పెడతాం. వీటికి బదులు హీరోయిన్ల ఫ్లెక్సీలు పెట్టడం ఇటీవలి ట్రెండ్ అయింది. అంతకుమించి అభిమానాన్ని చూపించాడో వ్యక్తి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పాపిడిగూడెం గ్రామంలో ఓ రైతు... వేరుశనగ చేనులో కార్తీక దీపం సీరియల్ ఫేమ్ వంటలక్క దీప ఫొటోతో ఫ్లెక్సీ ఏర్పాటుచేశాడు. ఆ దారి గుండా వెళ్లే వారు ఫ్లెక్సీని ఆసక్తిగా చూస్తున్నారు. ఆ రైతు క్రియేటివిటీకి ఆశ్చర్యపోతున్నారు. – అశ్వారావుపేట రూరల్ చదవండి: ఇదేం ఐడియా సామీ.. పంట చేలో కార్తీకదీపం ఫేమ్ వంటలక్క! -
బాలికపై లైంగిక దాడి.. వీడియో తీసిన మరో యువకుడు
సాక్షి, అశ్వారావుపేట: మైనర్‌పై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడగా, మరో యువకుడు సెల్ఫోన్లో వీడియో చిత్రీకరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అశ్వారావుపేట ఎస్సై చల్లా అరుణ బుధవారం రాత్రి వివరాలు వెల్లడించారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(15) గత నెల 30వ తేదీన చర్చికి వెళ్లి రాత్రి 10గంటల సమయంలో తిరిగి ఒంటరిగా ఇంటికి బయలుదేరింది. అదే గ్రామానికి చెందిన ఇరవై ఏళ్ల యువకుడు ఆమెను బలవంతంగా సమీపంలోని పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. చదవండి: వివాహేతర సంబంధం.. సమీప బంధువుని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి.. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారు. కాగా, మైనర్ బాలికపై లైంగిక దాడి పాల్పడుతున్న సమయంలో అదే గ్రామానికి మరో యువకుడు తన సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు బుధవారం రాత్రి చేసిన లిఖిత పూర్వక ఫిర్యాదు చేయగా, ఇద్దరు యువకులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చదవండి: బంజారాహిల్స్‌లో దారుణం బాలికను పిన్ని ఇంటికి తీసుకెళ్లి.. రోదిస్తున్న తల్లి, కుటుంబ సభ్యులు నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి జూలూరుపాడు: నీటి తొట్టిలో పడి 13 నెలల బాలుడు మృతి చెందాడు. ఈ విషాద సంఘటన మండల పరిధిలోని పాపకొల్లు గ్రామ పంచాయతీ భీమ్లాతండాలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. భీమ్లాతండాకు చెందిన గుగులోత్ శ్రీనివాసరావు, హరిత దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు చేతన్ భార్గవ్, చిన్న కుమారుడు రిషిత్ నాయక్(13 నెలలు)లను ఇంట్లో నాయనమ్మ దేవి వద్ద ఉంచి తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లారు. నాయనమ్మ వద్ద ఉన్న రిషిత్ ఆడుకుంటూ వెళ్లి ఇంటి ప్రాంగణంలో ఉన్న నీటి తొట్టిలో పడిపోయాడు. ఇంటి పనిలో నిమగ్నమైన నాయనమ్మ దేవి, పెద్దమ్మ దుర్గ కొంత సేపటికి తర్వాత పిల్లవాడు కనిపించకపోవడంతో ఆందోళన చెందుతూ వెతకగా నీటితొట్టిలో పడి ఉన్నాడు. బయటకు తీసి స్థానిక వైద్యుడి వద్ద తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకుని ఇంటికొచ్చిన రిషిత్ తల్లిదండ్రులు మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించారు. తల్లిదండ్రులు, కుటుంబీకులు విలపిస్తున్న తీరు గ్రామస్తులను సైతం కంటతడి పెట్టించింది. మృతదేహాన్ని ఎంపీపీ లావుడ్యా సోని, సర్పంచ్ బాదావత్ లక్ష్మి దంపతులు, టీఆర్ఎస్ నాయకులు రాంశెట్టి రాంబాబులు సందర్శించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ట్రైనీ ఎస్సై కార్తీక్ సంఘటనా స్థలాన్ని సందర్శించి, వివరాలు సేకరించారు. చోరీ జరిగిన వైన్స్ ఇదే... -
రొయ్యల వ్యాపారి దారుణ హత్య
సాక్షి, పశ్చిమగోదావరి: నాలుగు రోజుల క్రితం కిడ్నాపైనా రొయ్యల వ్యాపారి కోదండ రామారావు దారుణ హత్యకు గురయ్యారు. భీమవరం బలుసుమూడికి చెందిన రామారావును ఖమ్మం జిల్లా అశ్వరావుపేట అటవీ ప్రాంతంలో దారుణంగా హత్య చేశారు. నగదు లావాదేవీలే హత్యకు గల కారణాలుగా పోలీసులు భావిస్తున్నారు. కాళ్ల మండలం దొడ్డనపూడికి చెందిన వీరాస్వామి, కోదండ రామారావుల మధ్య రొయ్యల వ్యాపారం విషయంలో కొద్ది రోజులుగా వివాదాలు నడుస్తున్నాయని సమాచారం. వీరస్వామి, గుమస్తా మోహన్‌లపై మృతుడి బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. చదవండి: బంపరాఫర్.. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ విషాదం: దోశ పిండి నీలాగే ఉందనడంతో -
అనుమానంతో భార్యను హతమార్చిన భర్త
సాక్షి, అశ్వారావుపేట(ఖమ్మం): ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అనుమానంతో హతమార్చాడు. ఈ సంఘటన అశ్వారావుపేట మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక దొంతికుంటకు చెందిన పచ్చనీల మంగారావు, స్వరూప(25) పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు ఆడ పిల్లలు. ఏడేళ్ల నందిని, ఐదేళ్ల మనోజ్ఞి, నాలుగేళ్ల హని ఉన్నారు. కాగా గడిచిన కొద్ది నెలలుగా మంగారావు భార్యను అనుమానించడంతో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దంపతుల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. తరచూ కలహాలు చోటుచేసుకుంటున్నాయి. ఆదివారం మధ్యాహ్నం కూడా ఇంట్లోనే ఇద్దరి మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది. దీంతో కోప్రోదిక్తుడైన మంగారావు ఆమెను తలపై కొట్టాడు. గొంతు నులిమి హతమార్చాడు. అనంతరం నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. స్థానిక సీఐ ఎం. అబ్బయ్య, ఎస్ఐ మధుప్రసాద్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం నెరుపుతోందనే అనుమానంతో.. వారం రోజుల క్రితం మంగారావు ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబీకులు అతని అశ్వారావుపేటలో ఓ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. దీంతో ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు. ఆ అనుమానమే ఆదివారం కూడా గొడవకు దారితీసి హత్యకు పురికొల్పింది. -
సెలవొస్తే.. ‘సాగు’కే..!
సాక్షి, అశ్వారావుపేట(ఖమ్మం) : ఆ అమ్మాయికి వ్యవ‘సాయం’ అంటే మక్కువ. పేద తల్లిదండ్రులకు తనవంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఉన్నత విద్యను అభ్యసించే ఓ విద్యార్థిని అరక పట్టి ఇలా దున్నుతోంది. ప్రస్తుత రోజుల్లో ఏమాత్రం సమరం దొరికినా ఫేస్బుక్, వాటాప్స్, టిక్టిక్లతో కాలక్షేపం చేస్తున్న యువతీ యువకులకు భిన్నంగా ఈమె సాగు పనులు చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన అడపా ఝాన్సీ. వెంకటప్పయ్య, లక్ష్మీ దంపతుల కూతురు ఝాన్నీ స్థానికంగా ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. వారికున్న నాలుగెకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. తండ్రికి కళ్లు సరిగా కనిపించకపోవడంతో కళాశాలకు సెలవు రోజున ఝాన్సీ నాగలి పట్టి దుక్కులు దున్నడం, విత్తనాలు వేయడం, తడి పెట్టడం, ఎరువులు చల్లడం వంటి పనులు చేస్తోంది. -
ఆర్ఎస్ నుంచి వెళ్లిపోతా...!
అశ్వారావుపేట: ‘‘టీఆర్ఎస్ పార్టీలోకి ఆయన వస్తే... నేను వెళ్లిపోతా’’ అని, ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన నారాయణపురం సొసైటీ చైర్మన్ నల్లపు లీలాప్రసాద్ వెళ్లారు. ఆయన తిరిగి టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్టు ఆదివారం సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇది, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జ్ తాటి వెం కటేశ్వర్లు దృష్టికి వెళ్లింది. దమ్మపేట మండలం గట్టుగూడెంలో ఆదివారం జరిగిన టీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ‘‘అతను (లీలాప్రసాద్) వస్తే నేను బయటకైనా వెళ్లిపోతా’’ అని, లాలా ప్రసాద్ పేరు ప్రస్తావించకుండా మాట్లాడారు. ఇది, నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. ఈ సమావేశంలో తాటి ఏమన్నారో, వ్యక్తం చేసిన ఆవేదన ఎలాంటిదో ఆయన మాటల్లోనే చదువుదాం... ‘‘నేనొకటి మనవి చేస్తున్నా...! ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. మీరేమనుకున్నా ఫర్వాలేదు. టీఆర్ఎస్ పార్టీలో ఈ నాలుగు సంవత్సరాలున్న వ్యక్తులు ఒకరిద్దరు... మొన్నటి ఎన్నికల్లో పార్టీ గెలుపునకు పనిచేయలేదు. నేను వాళ్లతో మంచిగానే ఉం టున్నా. నాతో పని చేయించుకున్నారు. నన్ను చివరి వరకు నమ్మించారు. చివరి నిమిషంలో, నా ప్రత్యర్థికి మద్దతు తెలి పా రు. నా ముందు నిలుచుని, నా ప్రత్యర్థి తరఫున ప్రచారం చేశా రు. ఎన్నికల్లో ఏజెంటుగా ఉన్నారు. ఇంత నష్టం చేసి, మళ్లీ మన పార్టీలోకి వస్తారట. ఏదో ఆశించి, మళ్లీ లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిని నేను వ్యతిరేకిస్తున్నాను. వారు ఇక్క డికి (టీఆర్ఎస్లోకి) ఒకరొస్తే... ఇక్కడి నుంచి (టీఆర్ఎస్ నుంచి) పదిమంది బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాంటి వారికి అవకాశమిస్తే నష్టం జరగడంతోపా టు, మా మీద అపనింద పడుతుంది. దయచేసి ఆ అపనిందకు తావివ్వకుండి. నేను హృదయపూర్వకంగా పనిచేస్తున్నాను. మీ రెక్కడికి పిలిస్తే అక్కడికొచ్చాను. నేను నాలుగున్నరేళ్లుగా ఎమ్మెల్యే గా ఉండి పిచ్చోడిలా తిరిగాను. చావు, దినం, పెళ్లి, అధికార కార్యక్రమాలు... అనేక రకాలుగా తిరిగాను. ఇంటవద్ద ఒక పూ ట భోజనం చేసేందుకు సమయం లేకుండా వర్కర్‌లాగా తిరి గాను. మీతో (కార్యకర్తలతో) ఏనాడూ నాయకుడిగా లేను. నామా నాగేశ్వరరావు నుంచి ఏదో లబ్ధి దొరుకుతుందని, దో చుకుందామని ఆశపడుతున్నారు. అం దుకే మన పార్టీలోకి మళ్లీ వద్దామనుకుంటున్నారు. వారికి ఆ అవకాశం ఇవ్వవద్దని మనవి చేస్తున్నా. మన పార్టీలో చేరిన వెంటనే, గులాబీ కండువా తీసేసి ఇంకో కండువా కప్పుకుంటారు. అలాంటి చేరికలు ఇప్పుడేమీ అవసరం లేదు. మీ ఇష్టం... చేర్చుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు. ఫలానా వ్యక్తిని తీసుకొస్తున్నా నని ఓ నాయకుడు చెబితే... నాకు అవసరం లేదని చెప్పాను. ఓ రౌడీషీటర్ ఉన్నాడు. 2014లో వైఎస్సార్ సీపీ నుంచి నేను ఎ మ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నా తరఫున ఆయన పని చేయలేదు. కొన్ని నెలల తర్వాత నా వద్దకు వచ్చాడు. పార్టీలో చేరాడు. వచ్చిన రెండు నెలలకే 90 శాతం సబ్సిడీపై అతడికి ట్రాక్టర్ ఇప్పించాను. అడవిలో ఉన్న ఎనిమిది ఎకరాల వ్యవసా య భూమి పోతుందంటే... ఎంతో పోరాడి కాపాడాను. భూ మి, ట్రాక్టర్, కరెంటు... అన్నీ ఇప్పించాను. ఆయనపై రౌడీషీట్ ఎత్తేయాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చాను. ఇన్ని పనులు చే యించుకున్న అతడి ఇంటికి (ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలప్పుడు) నేను రెండుసార్లు వెళ్లాను, ఫోన్లు చేశాను. ‘అమ్మా నేను తాటి వెంకటేశ్వర్లును వచ్చానమ్మా’ అని, వాళ్ల ఇంట్లో వాళ్లకు చెప్పాను. ఒకసారి ఫోన్లో మాట్లాడాను. ‘నేను మాల వేసుకున్నాను. పార్టీ మారను. నీకే పనిచేస్తా’ అని మాటిచ్చాడు. ఆ తరువాత మాట తప్పాడు. అతడు పుట్టగతులు కూడా లేకుండా పోతాడు. అతనొస్తే నేను మాత్రం సహించను. నన్ను తప్పుకోమన్నా తప్పుకుంటాను. నామా నాగేశ్వరావును గెలిపించుకోవడానికి ఇప్పడున్న వారు చాలు. ‘అలాంటి’ వారు అవసరం లేదు. నా తప్పులేవయినా ఉంటే ఎత్తి చూపండి... వాటికి సమాధానం చెప్పుకుంటా...’’. తాటి వెంకటేశ్వర్లు ఉపన్యాసం ఇలా సాగింది. తాటి వద్దన్న ఆ వ్యక్తులు ఆదివారం వరకు టీఆర్ఎస్లో చేరలేదు. -
అన్నపురెడ్డిపల్లి ఎంపీపీ ఏర్పాటు
సాక్షి, అన్నపురెడ్డిపల్లి: ఉమ్మడి చండ్రుగొండ మండలం నుంచి విడిపోయిన అన్నపురెడ్డిపల్లి మండలంలో ఒక జెడ్పీటీసీ, ఆరు ఎంపీటీసీ స్థానాలతో మండల ప్రజాపరిషత్ (ఎంపీపీ) ఏర్పాటవుతుం ది. వీటికి రిజర్వేషన్లు కూడా ఖరార య్యా యి. 2016లో నూతన జిల్లాలతోపాటు నూతన మం డలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానిలో భాగంగా, చండ్రుగొండ మండలం నుంచి అన్నపురెడ్డిపల్లి మండలం ఆవిర్భవించింది. అప్పుడు తహసీల్దార్, పోలీస్ స్టేషన్, వ్యవసాయాధికారి, ఐకేపీ కార్యాలయాలు మాత్రమే ఏర్పాట య్యాయి. ఎంపీడీఓ, ఎంపీపీ కార్యాలయాలు ఉమ్మడి చండ్రుగొండ మండల కేంద్రంగానే కొనసాగాయి. మండల, జిల్లాపరిషత్ ఎన్నికలు త్వ రలో జరగనున్నాయి. ఇప్పటికే రిజర్వేషన్లు పూర్తయ్యాయి. తగ్గిన ఎంపీటీసీ స్థానం గతంలో అన్నపురెడ్డిపల్లి మండలంలో మొత్తం ఏడు ఎంపీటీసీ స్థానాలు ఉండేవి. మండల జనా భా ప్రాదిపదికన వీటిని కేటాయిచారు. మండలానికి ఆరు ఎంపీటీసీ స్థానాలను అధికారులు కేటాయించారు. గతంలో పెద్దిరెడ్డిగూడెం–1, పెద్దిరెడ్డిగూడెం–2 స్థానాలు ఉండేవి. తాజాగా, పెద్దిరెడ్డిగూడెం–2 ఎంపీటీసీ స్థానాన్ని అధికారులు రద్దు చేశారు. మండల మొత్తం జనాభా 21130 మంది. 2011 జనాభా లెక్కల ప్రకారంగా ప్రతి 3500 జనాభాకు ఒక ఎంపీటీసీ ఏర్పాటు చేయటంతో మండలంలో ఒక ఎంపీటీసీ స్థానం తగ్గింది. దీంతో, అన్నపురెడ్డిపల్లి మండలం ఆరు ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలతో మండల పరిషత్గా ఏర్పడనుంది. రిజర్వేషన్లు ఇలా.. ఈ మండల పరిషత్, పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. అందుకే, మొత్తం స్థానాల్లో ఎసీకి సగం, జనరల్‌కు సగం కేటాయించారు. అన్నపురెడ్డిపల్లి–1(జనరల్), అన్నపురెడ్డిపల్లి–2(ఎస్టీ జనరల్), పెంట్లం –జనరల్(మహిళ), నర్సాపురం–ఎస్టీ(మహిళ),గుంపెన–జనరల్, పెద్దిరెడ్డిగూడెం–ఎస్టీ(మహిళ) కు రిజర్వయ్యాయి. మండల పరిషత్ ప్రెసిడెంట్(ఎంపీపీ)–ఎస్టీ (జనరల్), జెడ్పీటీసీ మెంబర్–జనరల్(మహిళ)కు కేటాయించారు. ఆ స్థానంపై అందరి దృష్టి మొత్తం ఆరు ఎంపీటీసీ స్థానాలకుగాను అన్నపురెడ్డిపల్లిలోనే రెండు ఉన్నాయి. అన్నపురెడ్డిపల్లి–2 ఎస్టీ జనరల్. ఇక్కడి నుంచి గెలుపొందిన వారికి ఎంపీపీ పీఠంపై కూర్చునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న చర్చ సాగుతోంది. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు కొందరు తీవ్రంగా ప్రయ త్నిస్తున్నారు. ఇక్కడి నుంచి తన సతీమణిని బరి లోకి దింపడం ద్వారా, ఎంపీపీ పీఠాన్ని చేజిక్కిం చుకునేందుకు ఉపాధ్యాయుడొకరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. -
స్థానిక సమరం.. గరం గరం
సాక్షి, దమ్మపేట: పంచాయతీ పోరు మరవక ముందే స్థానిక సమరం మొదలవనుంది. మండల, జిల్లా పరిషత్‌లకు రిజర్వేషన్ ప్రక్రియను అధికారులు ఎట్టకేలకు పూర్తి చేశారు. మండల, జిల్లా ప్రాదేశిక సభ్యులు, ఎంపీపీ, జిల్లాపరిషత్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు చేయడంతో రాజకీయం వేడెక్కింది. రిజర్వేషన్లు త్వరగా ఖరారవడంతో మండల, జిల్లాపరిషత్ ఎన్నికల వైపు అందరి దృష్టి మళ్లింది. 2011 జనాభా లెక్కలు, కొత్తగా ఏర్పాటు చేసిన మండలాలు, గ్రామ పంచాయతీలు కలిసొచ్చేలా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను ఖరారు చేశారు. నియోజకవర్గంలో కొన్ని చోట్ల మాత్రమే ఎంపీటీసీ స్థానాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. నియోజకవర్గంలో 58 ఎంపీటీసీ స్థానాలు అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి, చంద్రుగొండ మండలాల్లో మొత్తం 58 ఎంపీటీసీ స్థానాలున్నాయి. వీటిలో మండలాల పునర్విభజన, కొత్త పంచాయతీల ఏర్పాటు జరిగింది. దీనిలో భాగంగా చండ్రుగొండ మండలం నుంచి అన్నపురెడ్డిపల్లిని విభజించి మండలంగా ఏర్పాటు చేశారు. దమ్మపేట మండలం జమేదార్ బంజర్ ఎంపీటీసీ స్థానాన్ని లింగాలపల్లి కేంద్రంగా చేశారు. అశ్వారావుపేట మండలంలోని బచ్చువారిగూడెం ఎంపీటీసీ స్థానంలో గాండ్లగూడెం పంచాయతీని కలపవద్దని అక్కడ గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్నపురెడ్డిపల్లి మండలంలోని పెద్దిరెడ్డిగూడెంలోని ఒక ఎంపీటీసీ స్థానాన్ని తొలగించి రాజాపురంలో కలపాలని అధికారులు ప్రతిపాదనలు చేశారు. దాన్ని ఆ స్థానం పరిధిలోని ఊటుపల్లి గ్రామస్తులు వ్యతిరేకిస్తూ అభ్యంతరం వ్యక్తం చేశారు. తొలగించిన స్థానాన్ని గుంపెనలో కలపాలని ఊటుపల్లి వాసులు కోరారు. ఆ రెండక అభ్యంతరాలు మాత్రమే అధికారులకు అందాయి. ఎస్సీ, బీసీలకు దక్కని రిజర్వేషన్లు ఈసారి ఎంపీటీసీల రిజర్వేషన్లలో ఎస్సీలు, బీసీలకు ఎక్కడా అవకాశం కల్పించలేదు. దీంతో వారి గొంతు మండల పరిషత్ సమావేశాల్లో వినపడదు. దీంతో ఆయా సామాజిక వర్గాలకు చెందినవారు జనరల్ స్థానాల్లో పోటీ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అశ్వారావుపేట మండలంలో ఒక్క స్థానం మాత్రమే ఎస్సీలకు రిజర్వయింది. ఎంపీటీసీల రిజర్వేషన్ల విషయంలో తమకు జరిగిన అన్యాయంపై ఆందోళనకు దళిత, బీసీ సంఘాలు సిద్ధమవుతున్నాయి. కొందరికి ఖేదం.. మరికొందరికి మోదం మండల, జిల్లా ప్రాదేశిక సభ్యులు, ఎంపీపీల రిజర్వేషన్ల ఖరారుతో ఆశావహుల్లో కొందరికి అనుకూలం, మరికొందరికి ప్రతికూలంగా మారాయి. ఇప్పటికే ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలపై గంపెడాశతో ఉన్న నాయకులకు ఈ రిజర్వేషన్లు నిరాశపరిచాయి. 58 ఎంపీటీసీ స్థానాలకుగాను జనరల్‌కు 29 కేటాయించారు. ఎస్టీలకు 28 స్థానాలు రిజర్వయ్యాయి. అశ్వారావుపేట మండలంలో ఒక స్థానం మాత్రమే ఎస్సీలకు రిజర్వయింది. ఎంపీపీ రిజర్వేషన్ల విషయానికొస్తే అశ్వారావుపేట మాత్రమే జనరల్‌కు వెళ్లింది. దమ్మపేట, అన్నపురెడ్డిపల్లి మండలాలు ఎస్టీ జనరల్‌కు, ములకలపల్లి, చంద్రుగొండ మండలాలు ఎస్టీ మహిళలకు రిజర్వయ్యాయి. జడ్పీటీసీల విషయంలో ఎస్టీలకు ములకలపల్లి స్థానం రిజర్వయింది. దమ్మపేట, చంద్రుగొండ మండలాలు జనరల్‌కు వెళ్లాయి. అశ్వారావుపేట, అన్నపురెడ్డిపల్లి మండలాలకు జనరల్ మహిళలకు కేటాయించారు. జనరల్‌కు కేటాయించిన జడ్పీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్లో పోటీ తీవ్రంగా ఉంది. నియోజకవర్గంలోని ఎంపీటీసీ స్థానాలు ఇవే.. అశ్వారావుపేట 17 దమ్మపేట 17 ములకలపల్లి 10 చంద్రుగొండ 08 అన్నపురెడ్డిపల్లి 06 -
సర్పంచ్ టు ఎమ్మెల్యే
దమ్మపేట: అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు రాజకీయ ప్రస్థానం గ్రామ పంచాయతీల నుంచే ప్రారంభమైంది. మెచ్చా నాగేశ్వరరావు 1995లో దమ్మపేట మండలం మొద్దులగూడెం సర్పంచ్‌గా తొలిసారిగా ఎన్నికైయ్యారు. తర్వాత 2001లో జరిగిన ఎన్నికల్లో అదే పంచాయతీ నుంచి ఆయ ఏకగ్రీవమయ్యారు. దాదాపు పదేళ్లపాటు ఆయన మొద్దులగూడెం సర్పంచ్‌గా ఆయన పనిచేశారు. 2014లో అశ్వారావుపేట ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్లతేడాతో ఓటమి పాలయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు 1981లో వేలేరుపాడు మండలం తాట్కూరుగొమ్ము పంచాయతీ నుంచి సీపీఐ బలపర్చిన అభ్యర్థిగా బరిలో దిగి సర్పంచ్‌గా విజయం సాధించారు. 1999లో తాటి టీడీపీలో చేరి.. బూర్గంపాడు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2014లో అశ్వారావుపేట నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
అశ్వారావుపేటరూరల్ (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా): కారును లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అశ్వారావుపేట మండలంలో ఆదివారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన పేకేటి సీతారామరెడ్డి(47), ఆయన భార్య అనిత, పెద్ద కుమార్తె నవీన, చిన్న కుమార్తె హైందవి, అనిత పెద్దమ్మ పెద్దింటి పిచ్చమ్మ(70) కలిసి భద్రాచలంలోని బంధువుల ఇంట్లో (కర్మ) కార్యానికి హాజరయ్యారు. తమ కారులో స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. అశ్వారావుపేట మండలంలోని ఆసుపాక–నందిపాడు మధ్యలోగల గండి ముత్యాలమ్మ ఆలయం సమీపంలోని మూల మలుపు వద్ద, వీరి కారు–అశ్వారావుపేట నుంచి కుక్కునూరు వైపు వెళ్తున్న లారీ ఢీకొన్నాయి. దాంతో కారు నడుపుతున్న సీతారామరెడ్డి, వెనుక సీటులో కూర్చున్న పిచ్చమ్మ అక్కడికక్కడే మృతిచెందారు. అనిత తలకు తీవ్ర గాయాలయ్యాయి. కాలు విరిగింది. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఈమె పరిస్థితి విషమంగా ఉంది. కుమార్తెలు నవీన, హైందవి కూడా తీవ్రంగా గాయపడ్డారు. కారు డ్రైవింగ్ సీటులో ఇరుక్కుపోయిన సీతారామరెడ్డి మృతదేహాన్ని స్థానికులు బయటకు తీశారు. ఏపీలోని తణుకు సమీపంలోగల పేరవలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా సీతారామరెడ్డి పనిచేస్తున్నారు. క్షతగాత్రులను అశ్వారావుపేట ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి స్థానికులు తరలించారు. కారు ముందు భాగం నుజ్జు నుజ్జయింది. ప్రమాద స్థలాన్ని సీఐ అబ్బయ్య, ఎస్ఐ వేల్పుల వెంకటేశ్వరరావు పరిశీలించారు. మృతదేహాలను మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మరో హైవే..
ఖమ్మంఅర్బన్: వాణిజ్యపరంగా దూసుకుపోతున్న ఖమ్మం నగరం చుట్టూ జాతీయ రహదారులు విస్తరిస్తున్నాయి. నగరాన్ని ఆనుకుంటూ మరో నేషనల్ హైవే వెల్లబోతోంది. ఇప్పటికే సూర్యాపేట–ఖమ్మం–అశ్వారావు పేట జాతీయ రహదారికి సంబంధించిన నిధులు మంజూరై.. భూ సేకరణ పనులు దాదాపు పూర్తికాగా.. తాజాగా వరంగల్–ఖమ్మం నగరాలను కలుపుతూ ఇంకో నేషనల్ హైవే రాబోతోంది. సూర్యాపేట–అశ్వారావుపేట రహదారికి అనుసంధానం చేసే విధంగా నిర్మించే వరంగల్–ఖమ్మం నేషనల్ హైవేకు సంబంధించి.. ఒడిశాకు చెందిన ఎస్ఎం కన్సల్టెన్సీ ఏజెన్సీ బృందం మంగళవారం ప్రాథమిక సర్వే చేసింది. ఖమ్మం నగరం, రఘునాథపాలెం మండలాల సరిహద్దున ఉన్న పొలాల్లో సర్వే కొనసాగింది. గూగుల్ మ్యాప్ అధారంగా సర్వే చేశారు. వరంగల్ నుంచి ఖమ్మం వరకు సుమారు 112 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మాణం కోసం సర్వే చేస్తున్నారు. ఇప్పటివరకు 60 కిలో మీటర్ల మేర సర్వే పూర్తయినట్లు బృందం సభ్యులు తెలిపారు. వరంగల్ నుంచి ఖమ్మం రూరల్ మండలం మీదుగా రఘునాథపాలెం, ఖమ్మం నగరాన్ని కలుపుతూ.. కొణిజర్ల మండలం తనికెళ్ల వద్ద ఉన్న ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో.. సూర్యాపేట–అశ్వారావుపేట జాతీయ రహదారికి అనుసంధానం చేసే విధంగా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. మరో 10 రోజుల్లో సర్వే పూర్తవుతుందని సర్వే బృందంలోని సభ్యుడు ఒకరు తెలిపారు. రెండు నేషనల్ హైవేలు, ఔటర్ రింగురోడ్డు నిర్మాణాలు పూర్తయితే ఖమ్మం పరిసర ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకోనుంది. జిల్లాలోని ప్రధాన పరిశ్రమగా ఉన్న గ్రానైట్ వ్యాపారానికి ఎంతో ప్రయోజనం చేకూరనుంది. మార్కెటింగ్ పరంగా ముడి సరుకుల ఎగుమతి, దిగుమతులకు అనుకూలం కానుంది. ఔటర్ రింగ్‌రోడ్డు.. సూర్యాపేట–అశ్వారావుపేట, వరంగల్–ఖమ్మం జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ.. ఖమ్మం నగరం చుట్టూ ఔటర్ రింగ్‌రోడ్డు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అధికారులు సర్వే కూడా చేశారు. సుమారు 35 నుంచి 40 కిలోమీటర్ల మేర రోడ్డు కోసం ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది. రింగ్ రోడ్డు కోసం ప్రభుత్వం రూ.200కోట్లు కేటాయించినట్లు ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుతోపాటు జాతీయ రహదారుల నిర్మాణంతో ఖమ్మం చుట్టూ రవాణాపరంగా సమస్యలు తొలగనున్నాయి. ప్రధానంగా ట్రాఫిక్ సమస్య చాలా వరకు తీరనుంది. -
చేతబడి నెపంతో తండ్రీకొడుకులపై దాడి
ములకలపల్లి(అశ్వారావుపేట): చేతబడి నెపంతో మండలంలోని మొగరాళ్ళగుప్ప గ్రామంలో గురువారం తండ్రీకొడుకులపై దాడి జరిగింది. మొగరాళ్ళగుప్ప గ్రామానికి చెందిన గుండు రమేష్–సీత దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె గుండు అశ్విని, ఖమ్మంలోని బాలికల గురుకుల పాఠశాలలో రెండేళ్లపాటు చదివింది. ఇంటిలో ఆర్థిక ఇబ్బంది కారణంగా ఈ ఏడాది చదువు ఆపేసింది. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. థైరాయిడ్ ఎక్కువగా ఉందని వైద్యులు చెప్పారు. మందులు వాడినప్పటికీ ఇది తగ్గలేదు. తనను ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారని, అందుకే తనకు ఇలా జరుగుతున్నదని ఆమె తన తల్లిదండ్రులతో చెప్పింది. ఆమె గురువారం ఉదయం మృతిచెందింది. మృతదేహాన్ని చూసేందుకు గ్రామస్తులు వచ్చారు. వారిలో కీసరి రామచంద్రం ఉన్నాడు. ఆయనను చూసి న అశ్విని కుటుంబీకులు... ‘చేతబడి చేసి చంపావు’ అంటూ కర్రలతో దాడికి దిగారు. ఈ విషయం తెలుసుకుని, కాపాడేందుకు వెళ్లిన రామచంద్రం కుమారుడు శ్రీనును కొట్టారు. వారిని పాల్వంచ ఆస్పత్రికి ఎస్సై రామ్‌చరణ్ తరలించారు. దాడికి దిగిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
మిత్రసేన భౌతికకాయానికి ప్రముఖుల నివాళి
అశ్వారావుపేట : ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన మృతదేహానికి ప్రముఖులు ఆదివారం నివాళులు అర్పించారు. మండలంలోని సున్నంబట్టిలో ఉంచిన మిత్రసేన భౌతికకాయాన్ని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పీసీసీ కార్వనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, సున్నంరాజయ్య, తాటి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అయితా సత్యం, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తదితరులు సందర్శించి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అనారోగ్యంతో శనివారం తెల్లవారుజామున మిత్రసేన కిమ్స్‌లో మృతిచెందిన విషయం తెలిసిందే. -
మాజీ ఎమ్మెల్యే మిత్రసేన మృతి
హైదరాబాద్: గిరిజన కంఠం మూగబోయింది. పోడు భూములపై హక్కులు, గిరిపుత్రుల మనుగడ కోసం ఏర్పాటైన 1/70 చట్టం అమలు తదితర పోరాటాల్లో తనదైన పాత్రపోశించిన ఖమ్మంజిల్లా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన(45) ఇకలేరు. కిడ్నీ సంబంధిత వ్యాధికి గురై హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం సాయంత్రం 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. మిత్రసేనకు భార్య పోలమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మిత్రసేన మృతితో ఆయన స్వగ్రామం సున్నంబట్టిలో విషాదఛాయలు అలముకన్నాయి. గిరిజనులకు పోడు భూములపై హక్కును కల్పిస్తూ మహానేత వైఎస్సార్ హయాంలో రూపొందించిన అటవీహక్కు చట్టం, అటవీహక్కు పత్రాల పంపిణీని. సగానికిపైగా ఎస్టీ రిజర్వుడ్ స్థానాలున్న ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభించడంతో వగ్గెల మిత్రసేనది కీలకపాత్ర. ప్రజల మనిషిగా పేరున్న ఆయన స్వగ్రామం సున్నంబట్టికి సర్పంచ్ గా ఎన్నికవావడం ద్వారా తన రాజకీయప్రస్థానాన్ని ప్రారంభించారు. కొంతకాలం అశ్వాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ గానూ పనిచేశారు. 2009లో కొత్తగా ఏర్పడిన అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. 2014లోనూ అదే స్థానం నుంచి పోటీచేసి వైఎస్సార్ సీపీ అభ్యర్థి చేతిలో పరాజయంపొందారు. మిత్రసేన మృతికి పలువురు సంతాపం తెలిపారు. -
నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం
అశ్వరావుపేట (ఖమ్మం) : ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై ఓ పదిహేనేళ్ల బాలుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అభం శుభం తెలియని చిన్నారిపై లైంగిక దాడి చేయడంతో.. చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం అచ్యుతాపురం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో అదే గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలుడు.. పాపను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక పరిస్థితి విషమంగా మారింది. ఇది గుర్తించిన స్థానికులు బాలికను ఆస్పత్రికి తరలించి నిందితుడిని పోలీసులకు అప్పగించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ కవిత నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
అశ్వారావుపేట (ఖమ్మం) : ఇటుకల లోడ్‌తో వెళుతున్న టాటా మ్యాజిక్ వాహనాన్ని ఓ లారీ ఢీకొనగా వ్యాపారి దుర్మరణం పాలయ్యాడు. ఖమ్మం జిల్లా ములకలపల్లి మండలం రాజాపురం వద్ద మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. మణుగూరు నుంచి ఓ వ్యాపారి ఇటుకలను తీసుకుని పశ్చిమగోదావరి జిల్లా విజయరాయికి వెళుతున్నాడు. రాజాపురం వద్ద ఓ లారీ టాటా మ్యాజిక్ వాహనాన్ని ఢీకొంది. దీంతో వాహనం నడుపుతున్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడగా... వ్యాపారి గోలెపు పొచ్చయ్య (30) తీవ్ర గాయాలతో వాహనంలోనే ఇరుక్కుపోయి ప్రాణాలు విడిచాడు. -
ట్రాలీ ఆటో బోల్తా: 15 మందికి తీవ్రగాయాలు
అశ్వారావుపేట (ఖమ్మం జిల్లా): దైవ దర్శనానికి వెళుతుండగా ట్రాలీ ఆటో బోల్తా పడి 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన ఆదివారం ఉదయం అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం వద్ద జరిగింది. ఖమ్మం సరిహద్దులో ఉన్న గుబ్బల గంగమ్మ దేవతను దర్శించుకునేందుకు ఎరుపాళెం గ్రామానికి చెందిన 20 మంది ట్రాలీ ఆటోలో బయలుదేరారు. ఆటో నారంవారిగూడెం వద్దకు రాగానే బోల్తాపడింది. ఈ సంఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
అశ్వారావుపేటలో రైతుల ఆందోళన
అశ్వారావుపేట : ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీ వద్ద రైతులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు మంగళవారం ఫ్యాక్టరీ గేటు ఎదుట పామాయిల్ గెలలకు నిప్పుపెట్టారు. అనంతరం మద్దతు ధర ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే రైతులకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్ పార్టీల నేతలు పాల్గొన్నారు. -
పెద్దవాగుకు పోటెత్తిన వరద
అశ్వారావుపేట (ఖమ్మం జిల్లా) : ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి గ్రామం వద్ద ఉన్న పెద్దవాగుకు వరద నీరు విపరీతంగా చేరుతోంది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద నీరు పోటెత్తడంతో ఆదివారం ఉదయం పెద్దవాగుకు చెందిన ఒకటవ నంబరు గేటు ఎత్తివేసి 2,820 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. ఇంజనీర్లు పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు ఎక్కువైతే మళ్లీ గేటు తెరిచి నీటిని కిందికి వదలాలని నిర్ణయించారు.