authority department
-
‘పరిధి’ మార్చి మా అధికారాల్లోకి తలదూర్చొద్దు
కోల్‌కతా: దేశ సరిహద్దు వెంట రాష్ట్ర భూభాగాలపై సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) అజమాయిషీ పరిధిని కేంద్రం పెంచిన అంశాన్ని ఢిల్లీలో తేల్చుకుంటానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ స్పష్టంచేశారు. హస్తిన పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం ఆమె ఢిల్లీకి చేరుకున్నారు. సరిహద్దు వెంట 15 కి.మీ.లకు బదులుగా 50 కి.మీ.ల పరిధి వరకూ సోదాలు, అరెస్ట్‌లకు బీఎస్ఎఫ్కు అధికారాలు కట్టబెడుతూ తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని మోదీతో భేటీలో లేవనెత్తుతానని మమత చెప్పారు. ‘ బీఎస్ఎఫ్ పరిధిని పెంచి మోదీ సర్కార్ సరిహద్దు రాష్ట్రాలపై తమ అధికారం, ఆధిపత్యాన్ని చెలాయించాలని చూస్తోంది’ అని మమత ఆరోపించారు. త్రిపురలో హింసాకాండ, బెంగాల్లో తృణమూల్ పార్టీ కార్యకర్తలపై బీజేపీ వర్గాల దాడుల అంశాలనూ ప్రధానితో చర్చిస్తానని ఆమె పేర్కొన్నారు. ‘ త్రిపురలో హింసపై మానవహక్కుల సంస్థలు, వామపక్ష సంఘాలు ఇంతవరకూ నోరు మెదపకపోవడం నాకు ఆశ్చర్యం కల్గిస్తోంది’ అని మమత వ్యాఖ్యానించారు. -
‘ఓటు’పై పాఠం...
- పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశపెట్టేందుకు నిర్ణయం - కమిటీని నియమించిన సాధారణ పరిపాలన శాఖ సాక్షి, హైదరాబాద్ : ఓటు హక్కు, వినియోగంతో పాటు ఓటుకు సంబంధించి విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే అవగాహన కలిగించేందుకు ఎన్నికల సంఘం నడుం బిగించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఎలక్టోరల్ లిటరసీ’ని పాఠ్యాంశంగా చేర్చేందుకు చర్యలు చేపట్టింది. కళాశాలల్లోనూ దీనిని ప్రవేశపెడతారు. దీనికోసం వివిధ శాఖల ఉన్నతాధికారులతో కమిటీని నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ బుధవారం జీఓ విడుదల చేసింది. ఈ కమిటీలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ చైర్మన్‌గా, పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి, డెరైక్టర్, ఇంటర్మీడియెట్‌బోర్డు కార్యదర్శి, ఎన్సీఈఆర్టీ డెరైక్టర్, అకడమిక్ నిపుణులు సభ్యులుగా ఉంటారు. అదనపు ముఖ్య ఎన్నికల అధికారి మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం స్కూళ్లు, కాలేజీల్లో ఉన్న పౌర, సాంఘిక శాస్త్రంలోని అంశాలను పరిశీలించి ఎలక్టోరల్ లిటరసీని ఏవిధంగా పాఠ్యాంశాలుగా చేర్చాలో సూచనలను కమిటీ మూడునెలల్లో నివేదిక రూపంలో అందించనుంది.