Bajrang Dal
-
మధ్యప్రదేశ్‌లో హీటెక్కిన పాలి‘ట్రిక్స్’.. దిగ్విజయ్ హాట్ కామెంట్స్
భోపాల్: ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇక, మధ్యప్రదేశ్‌లో మరోసారి అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. వివరాల ప్రకారం.. మాజీ సీఎం కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ మధ్యప్రదేశ్ ఎన్నికల కమిటీలో భాగమైన దిగ్విజయ్ సింగ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారాన్ని చేపట్టిన తర్వాత భజరంగ్ దళ్‌ను నిషేధించబోమని స్పష్టం చేశారు. అయితే, రాష్ట్రంలో అల్లర్లను, హింసను ప్రేరేపించే వారిని మాత్రం విడిచిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు. ఇదేసమయంలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. భజరంగ్ దళ్‌లో కొంతమంది మంచివాళ్లు కూడా ఉన్నారని అన్నారు. రామ మందిరం ఉద్యమం సమయంలో ఏర్పాటైన బజరంగ్ దళ్ అనేది విశ్వహిందూ పరిషత్ కు యువజన విభాగం. నేను కూడా హిందువునే. హిందువుగానే ఉంటాను. నేను హిందు మతాన్ని అనుసరిస్తూనే సనాతన ధర్మాన్ని పాటిస్తానని తెలిపారు. భారతదేశం అన్ని మతాలకు చెందుతుంది. దేశంలో శాంతిని నెలకొల్పడమే కావాలి అంటూ కామెంట్స్ చేశారు. 'MP में बनी कांग्रेस सरकार तो नहीं लगेगा बजरंग दल पर बैन' ◆ बजरंग दल को लेकर दिग्विजय सिंह का बड़ा बयान#BajrangDal | #DigvijayaSingh | @digvijaya_28 pic.twitter.com/VEm9N6E3Sm — News24 (@news24tvchannel) August 16, 2023 ఇదిలా ఉండగా.. ఇటీవల జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల సందర్భంగా కర్నాటకలో కాంగ్రెస్ నేతలు తాము అధికారంలోకి వస్తే భజరంగ్ దళ్ వంటి సంస్థలను నిషేధిస్తామని వాగ్దానం చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది కూడా చదవండి: రక్షణ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘంలో రాహుల్ గాంధీ! -
ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేస్తే.. కాంగ్రెస్ బూడిదవుతుంది: బీజేపీ హెచ్చరిక
కర్ణాటకలో ఎన్నికలు ముగిసినా రాజకీయ రగడ మాత్రం చల్లారడం లేదు. తాము అధికారంలో వస్తే ఆర్ఎస్ఎస్, బజ్రంగ్ దళ్ సంస్థలను బ్యాన్ చేస్తామంటూ కాంగ్రెస్ తమ మెనిఫెస్టోలో ఇచ్చిన హామీ వివాదం నేటీకి కొనసాగుతోంది. నిజంగానే కర్ణాటక ప్రభుత్వం బజ్రంగ్ దళ్‌ని బ్యాన్ చేస్తుందా అనే దానిపై.. ఇటీవల కాంగ్రెస్ మంత్రి ప్రియాంక ఖర్గే మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తే ఏ సంస్థనైనా సహించేది లేదన్నారు. అది పీటీఐ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ అయినా సరే చర్యలు తప్పవన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఆ సంస్థల్ని నిషేధించడానికి కూడా వెనకాడమన్నారు. ఇదే విషయంపై ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దమ్ముంటే కాంగ్రెస్ బజరంగ్ దళ్‌ను బ్యాన్ చేయాలని సవాల్ విసురుతోంది కాషాయ పార్టీ. తాజాగా ఈ వివాదంపై కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ స్పందించారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొడితే ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేస్తామంటూ మంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేసేందుకు ప్రయత్నిస్తే కాంగ్రెస్‌ను బూడిద చేసేస్తామని హెచ్చరించారు. చదవండి: మీడియా ముందుకు ముగ్గురు సీఎంలు.. ఏమన్నారంటే? "ఆర్ఎస్ బ్యాన్ చేస్తామని ప్రియాంక్ ఖర్గే మాట్లాడారు. ప్రధాని నరేంర మోదీ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్త. ఇప్పుడు ఆయన కేంద్రంలో అత్యున్నత పదవిలో ఉన్నారు. మేమంతా ఆ స్వయం సేవక్ సంఘ్ నుంచి వచ్చిన వాళ్లమే. అప్పట్లో జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, పీవీ నర్సింహరావు ప్రభుత్వాలు కూడా ఆర్ఎస్ఎస్నుని బ్యాన్ చేయాలని చూశాయి. కానీ.. వాళ్ల వల్ల కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ అదే ప్రయత్నం చేస్తోంది. ఇదే జరిగితే కాంగ్రెస్‌ని కాల్చి బూడిద చేస్తాం. ప్రియాంక్ ఖర్గే ఈ దేశ చరిత్ర ఏంటో తెలుసుకుంటే మంచిది. తన నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి" అని నళిన్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు. #WATCH | When asked about RSS in the wake of Congress' stand on a ban on PFI and Bajrang Dal in the state, Karnataka Minister Priyank Kharge says, "Any organisation, either religious, political or social, who are going to sow seeds of discontent & disharmony in Karnataka will not… pic.twitter.com/a6H4pDSWIT — ANI (@ANI) May 25, 2023 -
మల్లికార్జున ఖర్గేకు షాక్.. పంజాబ్ కోర్టు సమన్లు
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంజాబ్ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. రూ.100 కోట్ల పరువు నష్టం కేసులో జులై 10 న న్యాయస్థానం ముందు హాజరు కావాలని సంగ్రూర్ కోర్టు ఖర్గేకు సమన్లు పంపింది. కాగా ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆర్ఎస్ఎస్ అనుబంధ విశ్వహిందూ పరిషత్ యువజన విభాగమైన బజరంగ్ దళ్‌ను బ్యాన్ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. బజరంగ్ దళ్ సంస్థను నిషేధిత ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)తో పోలుస్తూ వ్యాఖ్యలు చేయడంతో వివాదానికి దారితీసింది. దీనిపై బజరంగ్ దళ్ కోర్టును ఆశ్రయించింది. విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దల్ ఫౌండర్ హితేష్ భరద్వాజ్ సంగ్రూర్ కోర్టులో పిటిషన్ కేసు దాఖలు చేశారు. కర్ణాటక ఎన్నికల సందర్భంగా భజరంగ్‌దళ్‌ను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఖర్గేపై రూ.100 కోట్ల పరువు నష్టం కేసు వేశారు. దీనిపై సినీయర్ డివిజన్ బెంజ్ విచారణ చేపట్టింది. మల్లికార్జున ఖర్గేను జులై 10 న కోర్టుకు హాజరు కావాలని సివిల్ జడ్జి రమణదీప్ కౌర్ ఏఐసీసీ అధ్యక్షుడికి సమన్లు జారీ చేసింది. కాగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో భజరంగ్ దళ్‌ను దేశ వ్యతిరేక సంస్థలతో పోల్చిందని భరద్వాజ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కర్ణాటకలో తాము అధికారంలోకి వస్తే ఆ సంస్థను నిషేధిస్తామని కూడా హామీ ఇచ్చిందని తెలిపారు. చదవండి: కర్ణాటక సీఎం ఎవరు?.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు -
కాంగ్రెస్ తీరుపై భగ్గుమన్న భజరంగ్ దళ్
-
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వ్యూహాత్మక తప్పిదం
-
బజరంగ్ దళ్‌ను బ్యాన్ చేయలేం: మొయిలీ
బెంగళూరు: విశ్వహిందూ పరిషత్ యువ విభాగం బజరంగ్ దళ్.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తరుణంలో వార్తల్లోకి ఎక్కింది. తాము అధికారంలోకి వస్తే గనుక బజరంగ్ దళ్‌ను, పీఎఫ్ఐను నిషేధిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది కాంగ్రెస్. అయితే ఈ ప్రకటన చేసిన రెండు రోజులకే కాంగ్రెస్ స్వరం మార్చింది. అలాంటి ప్రతిపాదన ఆచరణకు వీలుపడదంటూ ఆ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ ప్రకటించారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ గురువారం ఉడిపిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. బజరంగ్ దళ్ నిషేధంపై ఆయన స్పందించారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో పాటు బజరంగ్ దళ్ గురించి మా మేనిఫెస్టోలో ప్రస్తావించాం. ఇది అన్ని రాడికల్ గ్రూప్‌లకు వర్తిస్తుందని చెప్పాం. కానీ, అలా నిషేధించడం ఒక రాష్ట్ర ప్రభుత్వంతో సాధ్యపడదని ఆయన పేర్కొన్నారు. కాబట్టి, కర్ణాటక ప్ఱభుత్వం బజరంగ్ దళ్‌ను బ్యాన్ చేయబోదని ఆయన స్పష్టం చేశారు. ‘‘ఈ విషయంపై కర్ణాటక బీజేపీ చీఫ్ డీకే శివకుమార్ మీకు (మీడియాను ఉద్దేశించి..) మరింత స్పష్టత ఇస్తారు. చివరకు సుప్రీం కోర్టు కూడా విద్వేష రాజకీయాలకు ముగింపు ఉండాలని తన తీర్పులో అభిప్రాయపడింది. కాబట్టి.. అలాంటి ప్రతిపాదనేం మేం చేయట్లేదు. కాంగ్రెస్ నేతగా ఈ విషయాన్నే మీకు స్పష్టం చేయదల్చుకున్నా’’ అని పేర్కొన్నారాయన. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోలో నిషేధం గురించి స్పష్టమైన వివరణ ఉంది. మైనారిటీ కమ్యూనిటీలతో పాటు ప్రజలందరి మధ్య శత్రుత్వాన్ని, విద్వేషాలను రగిలించే గ్రూపులను నిషేధించి తీరతామని పేర్కొంది. ఆ లిస్ట్‌లో బజరంగ్ దళ్, పీఎఫ్ఐ కూడా ఉన్నాయి. దీంతో.. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ఈ అంశంపై బీజేపీపై భగ్గుమంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా నేతలంతా కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ఈ తరుణంలో.. ఇప్పుడు కర్ణాటక ఆ ప్రకటనపై వెనక్కి మళ్లడం గమనార్హం. ఇదీ చదవండి: కర్ణాటక ఎన్నికల్లో ఇదో సిత్రం.. తనకు తానే కిడ్నాప్ చేసుకుని.. -
కాంగ్రెస్ ని గెలిపిస్తే వందేమాతరం,జై శ్రీరామ్ బ్యాన్ చేస్తారు...
-
హనుమపై అంత ద్వేషమా?
హొసపేటె/రాయచూరు రూరల్/సాక్షి, బళ్లారి: కర్ణాటకలో అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామన్న కాంగ్రెస్ ఎన్నికల హామీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం కర్ణాటకలోని విజయనగర జిల్లాలో ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ చరిత్రంతా ఉగ్రవాద, ఉగ్రవాదుల సంతుష్టీకరణమయం. ఉగ్రవాదులు హతమైతే కన్నీరు కారుస్తుంది. చివరికి సైనికులనూ అవమానిస్తుంది. సర్జికల్ దాడులకు రుజువులు డిమాండ్ చేస్తుంది. బాట్లా హౌస్ ఎన్కౌంటర్లో ఉగ్రవాదులు హతమయ్యారని విని కాంగ్రెస్ అత్యున్నత నేత కళ్ల వెంట బొటబొటా నీళ్లు రాలాయి! గతంలో వారికి రామునితో సమస్య. ఇప్పుడు జై బజరంగ బలీ అని నినదించే వాళ్లతో సమస్య. హనుమంతుడు పుట్టిన గడ్డకు వచ్చి ఆ రామభక్తునికి ప్రణామాలు సమర్పించే భాగ్యం నేడు నాకు దక్కింది. కానీ మన దేశ దౌర్భాగ్యం చూడండి! కాంగ్రెస్ వాళ్లు అప్పట్లో రామున్ని ఖైదు చేసినట్టే ఇప్పుడు హనుమాన్ భక్తులపైనా పడతామంటున్నారు. ఇటువంటి పనుల వల్లే ఆ పార్టీ ఇప్పుడు కేవలం మూడు రాష్ట్రాలకు పరిమితమైంది’’ అంటూ దుయ్యబట్టారు. కర్ణాటకను కాంగ్రెస్ ఉగ్రవాదుల అడ్డాగా మారిస్తే తాము వారి వెన్ను విరిచామన్నారు. అలాంటి కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. శ్రీకృష్ణదేవరాయలు పాలించిన విజయనగర సామ్రాజ్యానికి దేశ చరిత్రలో గర్వించదగ్గ స్థానముందన్నారు. ఆ సామ్రాజ్యంలో భాగమైన ఈ ప్రాంతాన్ని కిష్కింద క్షేత్రంగా కొందరు చరిత్రకారులు భావిస్తారు. ఇక్కడికి సమీపంలో హంపికి పక్కనే కొప్పల్ జిల్లాలో ఉన్న అంజనాద్రిని హనుమంతుని జన్మస్థలంగా స్థానికులు నమ్ముతారు. రాయలు చూపిన బాటలోనే దేశాన్ని కేంద్రం ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తోందని అన్నారు. రాయచూరు జిల్లా సింధనూరు ర్యాలీలో, చిత్రదుర్గ బహిరంగ సభలోనూ ఆయన మాట్లాడారు. బీజేపీని మళ్లీ గెలిపిస్తే కర్ణాటకను దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఖర్గేలకు ఓటుతో బదులివ్వండి పేదలకిచ్చిన ఏ హామీనీ నిలుపుకోని చరిత్ర కాంగ్రెస్‌దంటూ మోదీ ఎద్దేవా చేశారు. ఇప్పుడు సొంత అస్తత్వమే ప్రమాదంలో పడేసరికి మరోసారి కర్ణాటకలో హామీల పేరుతో ప్రజలను వంచించజూస్తోందని ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్‌ది ముగిసిన అధ్యాయమన్నారు. తనను విష సర్పం, పనికిరాని కొడుకు అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆయన కొడుకు ప్రియాంక్ చేసిన విమర్శలకు ఓటుతో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, జేడీ(ఎస్) దొందూ దొందేనంటూ మోదీ ఎద్దేవా చేశారు. బురదలో కూరుకుపోయిన మోదీ హెలికాప్టర్ ప్రధాని మోదీ హెలికాప్టర్ సింధనూర్ వద్ద భారీ వర్షం కారణంగా బురదలో కూరుకుపోయింది. సిబ్బంది ఎంతగానో శ్రమించి పొక్లెయిన్లు తదితరాల సాయంతో దాన్ని బయటికి లాగారు. సంబంధిత వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే అది మోదీ కోసం ఉంచిన స్పేర్ హెలికాప్టర్. అప్పటికే ఆయన మరో హెలికాప్టర్లో వెళ్లిపోయారు. రెచ్చగొట్టే యత్నం: కాంగ్రెస్ న్యూఢిల్లీ: హనుమాన్ను బజరంగ్ దళ్‌తో పోల్చడం సిగ్గుచేటంటూ కాంగ్రెస్ మండిపడింది. తద్వారా మత సెంటిమెంట్లను రగిల్చేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. కోట్లాది హనుమద్భక్తులను అవమానించినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. -
లవ్ జిహాద్‌ను వ్యతిరేకిస్తూ వీహెచ్‌పీ పోరు
న్యూఢిల్లీ: అక్రమ మతమార్పిడి, లవ్ జిహాద్‌లను తీవ్రంగా ఖండిస్తూ విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) కొత్త ప్రజా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అనైతిక మత మార్పిడి, లవ్ జిహాద్‌లను అంతం చేసేందుకు మహిళలు, అమ్మాయిలు, యువతతో ‘శక్తివంత సేన’ ఏర్పాటే లక్ష్యంగా నెల రోజులపాటు దేశవ్యాప్తంగా ‘జన్ జాగ్రణ్ అభియాన్’ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించింది. ఇందులోభాగంగా వీహెచ్‌పీ యువజన విభాగమైన బజ్రంగ్ దళ్ పదో తేదీ దాకా బ్లాక్ స్థాయిలో ‘శౌర్య యాత్ర’ కొనసాగించనుందని వీహెచ్‌పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ చెప్పారు. వీహెచ్‌పీ ఆధ్వర్యంలో డిసెంబర్ 21 నుంచి 31 దాకా ధర్మ రక్షా అభియాన్ నిర్వహిస్తారు. మతమార్పిడి వలలో పడకుండా అవగాహన కల్పించేందుకు వీహెచ్‌పీ మహిళా విభాగం దుర్గావాహిని సైతం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననుంది. ఈ సందర్భంగా జైన్ మాట్లాడారు. అక్రమ మతమార్పిడిని నిరోధించేలా కేంద్రం చట్టం తెచ్చేలా మద్దతు కూడగట్టేందుకు ఈ కార్యక్రమాన్ని వీహెచ్‌పీ ఉపయోగించుకోనుంది. -
భజరంగ్‌దళ్‌లోకి 50 లక్షల కొత్త సభ్యత్వాలు
న్యూఢిల్లీ: తమ యువజన విభాగం భజరంగ్‌దళ్‌లోకి కొత్తగా 50 లక్షల మందిని చేర్చుకునేందుకు విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆన్లైన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. ‘జాతీయస్థాయిలో భజరంగ్ దళ్ అభియాన్‌ను ప్రారంభించాం. ఇందుకు 15–35 ఏళ్ల యువత అర్హులు. సభ్యత్వం కోసం మా వెబ్సైట్ లింక్‌లో అందుబాటులోకి తెచ్చిన దరఖాస్తును నింపాలి’ అని గురువారం వీహెచ్‌పీ సెక్రటరీ జనరల్ మిలింద్ పరాండే మీడియాతో అన్నారు. కనీసం 50 లక్షల మంది యువతను చేర్చుకోవాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. వీరందరికీ శిక్షణనిచ్చి, తమ సంస్థలో చేరుకుంటామన్నారు. ఈ కార్యకర్తలకు వ్యక్తిత్వ వికాసంతోపాటు మతం, చరిత్ర, సంస్కృతి, ఆత్మరక్షణ విధానాలు, యోగ నేర్పిస్తామని చెప్పారు. నవంబర్ 6వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా శ్రేయోభిలాషులు (హృత్‌చింతక్) పేరుతో మరో భారీ కార్యక్రమం చేపట్టనున్నట్లు చెప్పారు. -
బజరంగ్ దళ్ కార్యకర్త హత్యతో ఉద్రిక్తత
ఢిల్లీ: దేశరాజధాని మరోసారి ఉద్రిక్త పరిస్థితులతో అట్టుడికిపోతోంది. సెంట్రల్ ఢిల్లీలో ఓ యువకుడి హత్యతో శాంతి భద్రతలు అదుపు తప్పే పరిస్థితికి చేరుకుంది. దీంతో పటేల్‌నగర్ ఏరియాలోని రంజిత్ నగర్ ప్రాంతంలో, బల్జీత్నగర్లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను మోహరించారు. మత కోణంలో ఈ దాడి జరిగిందనే ప్రచారం మొదలవ్వడంతో.. డీసీపీ శ్వేత చౌహాన్ దగ్గరుండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. చనిపోయింది బజరంగ్ దళ్ కార్యకర్త కావడం, అతనిపై కిరాతకంగా దాడి చేసింది ఉఫీజా, అద్నాన్, అబ్బాస్ కావడంతో.. మత కోణంలో చర్చ జరుగుతోంది అక్కడ. 13వ తారీఖు అర్ధరాత్రి యువకుడిపై దాడి జరగ్గా.. చికిత్స పొందుతూ అతను శనివారం సాయంత్రం మృతి చెందాడు. దీంతో ఆదివారం స్థానికులు రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు. పోలీసులు ఇంతవరకు నిందితులను అదుపులోకి తీసుకోలేదని వ్యతిరేక నినాదాలతో హెరెత్తించారు బజరంగ్ దళ్ ప్రతినిధులు. మరోవైపు కుటుంబ సభ్యులు సైతం తొలుత అంత్యక్రియలు నిర్వహించకుండా.. నిందితులను అరెస్ట్ చేయాలనే డిమాండ్‌తో పటేల్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర రోడ్డుపై బైఠాయించారు. చివరకు పోలీసుల హామీతో ఆందోళన విరమించి.. యువకుడి మృతదేహానికి అంత్యక్రియలు జరిగాయి. అక్టోబర్ 12వ తేదీ రాత్రి సమయంలో బల్జీత్ నగర్‌కు చెందిన నితేశ్(25) తన స్నేహితులు మాంటీ, అలోక్‌తో కలిసి ఉన్నాడు. ఆ సమయంలో బైక్‌పై దూసుకొచ్చిన ఓ వ్యక్తిని అడ్డగించి దాడి చేశారు. ఈ క్రమంలో దెబ్బలు తిన్న వ్యక్తి తన స్నేహితులను తీసుకొచ్చి.. నితేశ్, మాంటీ, అలోక్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఒకరినొకరు దుర్బాషలాడుకోవడంతో.. గొడవ పెద్దదైంది. అర్ధరాత్రి సమయంలో నితేష్ అతని స్నేహితులపై రంజిగ్ నగర్ దగ్గర కర్రలు, రాడ్లతో దాడి చేశారు నిందితులు. నితిశ్‌ను ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందాడు. మరో ఇద్దరు స్నేహితులకు సైతం గాయాలయ్యాయి. ‘‘దాడికి పాల్పడింది ఉఫిజా, అబ్బాస్, అద్నాన్లుగా గుర్తించాం. వారిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఇందులో మత కోణం ఏమీ లేదని.. చిన్నగొడవ చిలికి చిలికి గాలివానగా మారిందని, అనవసరంగా మతం రంగు పులుమొద్ద’’ని డీసీపీ శ్వేతా చౌహాన్ విజ్ఞప్తి చేస్తున్నారు. నితేష్ కుటుంబ సభ్యులు సైతం ఒకరినొకరు దుర్బాషలాడిన క్రమంలోనే దాడి జరిగిందని చెప్పడం గమనార్హం. అయితే.. స్థానికులు, బజరంగ్ దళ్ ప్రతినిధులు మాత్రం ఈ హత్యలో మత కోణం ఉందని వాదిస్తున్నారు. నితేశ్ ఈ మధ్యే బజరంగ్ దళ్‌లో చేరాడని, అందుకే అతన్ని టార్గెట్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. దగ్గర్లోని మసీదు దగ్గరి నుంచి కొందరు దూసుకొచ్చి నిందితులతో కలిసి దాడి చేశారని చెప్తున్నారు. అయితే.. పోలీసులు మాత్రం స్థానికులు చెప్పేదాంట్లో వాస్తవం లేదని అంటున్నారు. అంతేకాదు.. నితేశ్, అలోక్‌లపై ఇంతకు ముందు చాలా కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు. A 25-year-old youth named Nitesh died on Saturday night after he was assaulted on last wednesday night by some people in Ranjit Nagar locality of Patel Nagar area in Delhi. Accused are identified as Ufiza, Adnan and Abbas. pic.twitter.com/yk880kIHzP — Nikhil Choudhary (@NikhilCh_) October 16, 2022 ఇదీ చదవండి: ప్రాణస్నేహితుడిని చంపి డ్రైనేజీలో పడేశారు! -
Nupur Sharma: బజరంగ్ దళ్ కార్యకర్తపై దాడి
భోపాల్: బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మకు మద్దతు చెప్తున్న వాళ్లపై దాడులు కూడా పెరిగిపోతున్నాయి. ఉదయ్‌పూర్, అమరావతి దారుణ హత్యోదంతాల తర్వాత.. బీహార్‌లో ఓ యువకుడు వాట్సాప్ స్టేటస్‌గా నూపుర్ శర్మ వ్యాఖ్యల వీడియోను పెట్టుకున్నాడని దుండుగులు కత్తులతో గాయపరిచారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోనూ ఓ బజరంగ్ దళ్ కార్యకర్తపై కత్తులతో దాడి చేసింది ఓ మూక. బుధవారం అగర్-మాల్వాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నూపుర్ శర్మ కామెంట్లకు మద్దతు ప్రకటించిన ఓ వ్యక్తిని కత్తులతో పొడిచారు పదమూడు మంది. బాధితుడి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసుకుని.. ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ దాడితో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బజరంగ్ దళ్ స్థానిక కన్వీనర్ అయిన ఆయూష్ జడమ్(25).. స్థానిక మీడియాలో బహిరంగంగా నూపుర్ శర్మకు మద్దతు ఇస్తూ వ్యాఖ్యలు చేశాడు. బుధవారం ఉదయం స్థానిక టోల్ బూత్ నుంచి బైక్‌పై వెళ్తున్న సమయంలో అతనిపై దాడి చేసింది ఓ గ్రూప్. దీంతో బాధితుడిని చికిత్స కోసం ఉజ్జయిని ఆస్పత్రిని తరలించారు. దాడికి పాల్పడిందంతా స్థానికులేనని పోలీసులు నిర్ధారించారు. కాగా, ఈ ఘటనను నిరసిస్తూ నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఎస్పీ కార్యాలయం ఎదుట హిందూ సంఘాలు బైఠాయించి ఆందోళన చేపట్టాయి. मप्र के आगर मालवा में एक बजरंग दल कार्यकर्ता पर हमला हो गया,आरोप है कि #नुपुर_शर्मा का समर्थन करने की वजह से ये हमला हुआ है,मामले में 13 लोगों के खिलाफ मामला दर्ज किया गया है जिनमें से दो को गिरफ्तार कर लिया गया है, घटना के बाद शहर में तनाव की स्थिति बन गई है @ndtv @ndtvindia pic.twitter.com/wRD1vT39PH — Anurag Dwary (@Anurag_Dwary) July 20, 2022 ఇదీ చదవండి: నూపుర్ శర్మకు ప్రాణహాని ఉంది నిజమే- సుప్రీంకోర్టు -
భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్‌గా శివరాం
సాక్షి, హైదరాబాద్: భజరంగ్‌దళ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌గా శివరాం ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో జరుగుతున్న విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలలో భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్‌ను వీహెచ్‌పీ రాష్ట్ర కార్యదర్శి బండారి రమేష్ సమక్షంలో ఎన్నుకున్నారు. కో–కన్వీనర్లుగా వెంకట్, జీవన్ ఎన్నికయ్యారు. భజరంగ్ దళ్ బెంగళూరు క్షేత్ర శారీరక ప్రముఖ్‌గా కుమారస్వామి, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సహ కార్యదర్శిగా పండరినాథ్, ధర్మ ప్రసాద్, రాష్ట్ర సహ కార్యదర్శిగా సుభాష్ చందర్‌లను ఎన్నుకున్నట్టు విశ్వహిందూ పరిషత్ ప్రచార సహ ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి వెల్లడించారు. -
కోవిడ్ ఎఫెక్ట్: హనుమాన్ శోభాయాత్ర రద్దు
సాక్షి, హైదరాబాద్: హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఏటా నిర్వహించే ‘హనుమాన్ శోభాయాత్ర’ రద్దు అయింది. గౌలిగూడ నుంచి తాడ్‌బండ్ వరకు నిర్వహించే హనుమాన్ శోభాయాత్రను రద్దు చేసినట్లు భజరంగ్‌దళ్ ప్రకటించింది. కరోనా పెరగుతున్న నేపథ్యంలో శోభాయాత్రకు భారీగా భక్తులు తరలిరావటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. హనుమాన్ శోభాయాత్రకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. 21 మందితో మాత్రమే శోభాయాత్ర నిర్వహించాలని హైకోర్టు పేర్కొంది. శోభాయాత్రలో 21 మందికి మించి పాల్గొనకూడదని ఆదేశించింది. శోభాయాత్రను వీడియో తీసి నివేదిక సమర్పించాలని తెలిపింది. కోవిడ్ నిబంధనలు పాటించాలని వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే భక్తుల తాకిడి ఎక్కువ కావటం వల్ల శోభాయాత్రను రద్దు చేసినట్లు భజరంగ్‌దళ్ తెలిపింది. చదవండి: Kamareddy District: కరోనాతో ఎస్ఐ గణపతి మృతి -
వాలెంటైన్స్ డే: భజరంగ్‌దళ్ కార్యకర్తల బీభత్సం..!
-
వాలెంటైన్స్ డే: భజరంగ్‌దళ్ కార్యకర్తల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : వాలెంటెన్స్ డే సందర్భంగా మాదాపూర్, ఐటీ కారిడార్ పరిసరాల్లో ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవానికి వ్యతిరేకంగా ఆగ్రహంతో విధ్వంసం సృష్టించిన ఐదుగురు యువకులను మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో నాగోత్ అజయ్ సింగ్, వదిత్య అర్జున్, కొర్ర సంతోష్, గుడుపు పవన్ కుమార్, పొలారి తిరుపతి ఉన్నారు. ఫిబ్రవరి 14వ తేదీన సుమారు 10 నుంచి 15 మంది బజరంగ్ దళ్ కార్యకర్తలు కే పి హెచ్ బి నుంచి హైటెక్ సిటీ వెళ్లేదారిలో ద్విచక్ర వాహనాలపై వెళ్తూ వాలెంటైన్స్ డేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గచ్చిబౌలి, కొత్తగూడా, మాదాపూర్ తదితర ప్రాంతాలలోని వాణిజ్య సముదాయాలపై దాడులకు దిగారు. దారిలో కనపడిన ఓ ఐస్ క్రీమ్ షాప్ లో విధ్వంసం సృష్టించారు. ఇనార్బిట్ మాల్, బికనీర్ వాలా, ఏబీఎన్ శరత్ మాల్ తదితర చోట్ల దాడులకు దిగారు. సమాచారం మేరకు కాగా పోలీసులు ఇనార్బిట్ మాల్ కి చేరుకోగానే వారంతా అక్కడి నుంచి పారిపోయారు. కాగా షాపు యాజమాన్యాల ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లలో రెండు కేసులు నమోదయ్యాయి. సీసీటీవీ ఫుటేజీ లు పరిశీలించిన అనంతరం పోలీసులు ఐదుగురు భజరంగ్ దళ్ కార్యకర్తలను అరెస్టు చేశారు. వారిని జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించారు. కాగా మిగిలిన వారైన సుభాష్, కిరణ్, దత్త సాయి, సాయి రెడ్డి, వెంకట్ మరియు తదితరులు కోసం పోలీసులు గాలిస్తున్నారు. (చదవండి: వాలెంటైన్స్ డే.. ప్రేమికుల అవస్థలు) -
కత్తి మహేష్‌పై దాడి
ఖైరతాబాద్: సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై భజ్రంగ్దళ్ సభ్యులు దాడికి పాల్పడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే శుక్రవారం ఉదయం ఐమాక్స్‌లో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా చూసి కారులో బయటికి వస్తున్న కత్తి మహేష్‌పై ఐదుగురు భజ్రంగ్దళ్ సభ్యులు దాడిచేసి కారు అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడిన వారిని మాసబ్‌ట్యాంక్‌కు చెందిన బి.రాజ్‌కుమార్, ఖైరతాబాద్‌కు చెందిన వై.వెంకట్, జి.సాయిరాజ, ఎంఎస్‌మక్తాకు చెందిన డి.నాగరాజు, వారాసిగూడకు చెందిన దేవగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. -
దాండియా వేడుకలకు ఆధార్ చెక్ చేశాకే ఎంట్రీ..
సాక్షి, హైదరాబాద్ : దసరా ఉత్సవాల్లోకి హిందూయేతర వర్గాలకు చెందిన వారు ప్రవేశించకుండా ప్రవేశ ద్వారాల్లో ఆధార్ కార్డులు చెక్ చేయాలని గర్బా, దాండియా నిర్వాహకులకు బజరంగ్దళ్ సూచించింది. వేడుకలు జరిగే ప్రాంతాల్లో ఇతర మతస్తులు పాల్గొనకుండా ఆయా ఎంట్రీ పాయింట్లలో ఆధార్ కార్డులు తనిఖీ చేయాలని, ఈ వేడుకలకు హిందువేతరులను బౌన్సర్లుగా నియమించుకోరాదని బజరంగ్దళ్ మీడియా కన్వీనర్ ఎస్ కైలాష్ కోరారు. గత కొన్నేళ్లుగా దసరా వేడుకల్లో హిందూయేతర వర్గాలకు చెందిన కొందరు యువకులు చొరబడి, దాండియా, గర్బాలో పాల్గొనే మహిళల పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించిన ఘటనలు చోటుచేసుకున్నాయని, బాధితుల పక్షాన నిలిచిన పురుషులపైనా వారు దాడికి పాల్పడ్డారని చెప్పారు. హిందూయేతర బౌన్సర్లను నిర్వాహకులు నియమించుకోవడంతో దుండగులు ఈ కార్యక్రమాల్లోకి వచ్చేందుకు దోహదపడుతోందని గుర్తించామని అన్నారు. దసరా వేడుకలు జరిగే వేదికల వద్ద బజరంగ్ దళ్ కార్యకర్తలు ఉంటారని, ఇలాంటి ఉదంతాలు తమ దృష్టికి తీసుకువస్తే కార్యక్రమాలకు విఘాతం కలిగించే వారిని తక్షణమే అడ్డుకుంటామని చెప్పారు. -
‘కత్తి’ని తెలుగు రాష్ట్రాల నుంచి బహిష్కరించాలి!
సాక్షి, అనతపురం : హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడిపై అనుచిత వాఖ్యలు చేసి, హిందువుల మనోభావాలను దెబ్బతీసిన సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ను రెండు తెలుగు రాష్ట్రాల నుంచి బహిష్కరించాలని భజరంగదళ్ నాయకులు డిమాండ్ చేశారు. దీనిపై ఈ రోజు(మంగళవారం) రెవెన్యూ అధికారులకు వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మత విద్వేషాలను రెచ్చగొట్టే ఉద్దేశంతో మాట్లాడుతున్న కత్తి మహేష్ హిందువుల మనోభావాలను కించపరుస్తున్నారన్నారు. సీతారాముల చరిత్రను కించపరిచే విధంగా మాట్లాడుతున్న కత్తిపై కేసు నమోదు చేయాలన్నారు. హిందూ ధర్మగ్రహ యాత్రకు తెలంగాణలో అవకాశం కల్పించి, పరిపూర్ణానంద స్వామీజీకి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. చర్చావేదికలు పెట్టి మత విశ్వాసాలపై డిబెట్ పెడుతున్న టీవీ9 చానల్‌ను సైతం మూసివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భజరంగదళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కసాపురం రవి, సోమశేఖర్, రమేష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కత్తి మహేశ్‌పై హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే. వినతిపత్రం అందజేస్తున్న భజరంగదళ్ నాయకులు -
అల్లర్ల కేసు నిందితులను జైల్లో కలిసిన కేంద్ర మంత్రి
పట్నా : వ ముస్లిం వ్యక్తిని చంపిన కేసులో జైలుకు వెళ్లివచ్చిన వ్యక్తులకు ఘనస్వాగతం పలికి కేంద్రమంత్రి జయంత్ సిన్హా విమర్శలు ఎదుర్కొంటున్న వివాదం మరవకముందే మరో కేంద్ర మంత్రి వివాదంలో చిక్కుకున్నారు. అల్లర్ల కేసులో జైల్లో ఉన్న విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలను కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఆదివారం కలిశారు. బిహార్‌లోని నవడా జైలులో ఉన్న బజరంగ్ దళ్, వీహెచ్‌పీ కార్యకర్తలను కలిసిన ఆయన.. సుమారు 30 నిమిషాల పాటు వారితో ముచ్చటించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ కార్యకర్తలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. 'జీతూ జీ, కైలాష్ జీని అరెస్ట్ చేయడం దురదృష్టకరం. 2017లో శ్రీరామనవమి సందర్భంగా ఉద్రక్తతలు తలెత్తినప్పుడు వారు పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అక్బర్పూర్లో దుర్గామాత విగ్రహాన్ని విధ్వసం చేసినప్పుడు కూడా ఉద్రిక్తతలను తొలగించే ప్రయత్నమే చేశారు. అలాంటి వారిని అల్లరి మూకలు అని ఎలా నిందిస్తారు ’ అని నిందితులను సమర్థించారు. హిందువులను అణిచివేయడం ద్వారా మత సామరస్యాన్ని కాపాడగలమని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే అది దురదృష్టకరమని పేర్కొన్నారు. బిహార్‌లో జేడీయూ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ తరహా ధోరణిని విడనాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా అని గిరిరాజ్ అన్నారు. 2017 అల్లర్ల కేసులో బజరంగ్ దళ్ కన్వీనర్ జితేంద్ర ప్రతాప్‌ను ఈ నెల 3న అరెస్టు చేశారు. దీనిపై ఆ మరుసటి రోజే జితేంద్ర ప్రతాప్ మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగడంతో ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా గిరిరాజ్ ఆరోపణలను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తిప్పికొట్టారు. మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేవారిని ఉపేక్షించేది లేదన్నారు. అవినీతి, నేరాలు, మతోన్మాదం విషయాల్లో ప్రభుత్వం రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఏ ఒక్క నేరస్థునికి రక్షణ కల్పించదని పేర్కొన్నారు. -
వీహెచ్‌పీ, బజరంగ్ దళ్‌లకు సీఐఏ షాక్
న్యూయార్క్ : విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ), బజరంగ్ దళ్లను మత ఉగ్రవాద సంస్థలుగా అమెరికా ప్రభుత్వ నిఘా విభాగం సీఐఏ తన వరల్డ్ ఫ్యాక్ట్‌బుక్ తాజా సంచికలో పేర్కొంది. ఈ సంస్థలను రాజకీయ ఒత్తిడి గ్రూపుల విభాగంలో చేర్చింది. రాజకీయాల్లో జోక్యం చేసుకుంటూ రాజకీయ ఒత్తిళ్లను పెంచే ఈ సంస్థల నేతలు మాత్రం చట్టసభల్లో తలదూర్చరని వీటి స్వభావాన్ని నిర్వచిస్తూ సీఐఏ పేర్కొంది. భారత్‌లో రాజకీయ ప్రెజర్ గ్రూప్స్‌లో ఆరెస్సెస్, హురియత్ కాన్ఫరెన్స్, జమౌతే ఉలేమా ఇ హింద్ తదితర సంస్థలను సీఐఏ పొందుపరిచింది. అయితే ఆరెస్సెస్‌ను జాతీయవాద సంస్థగా నిర్వచించిన సీఐఏ హురియత్ కాన్ఫరేన్స్ను వేర్పాటువాద గ్రూపుగా, జమైతే ఉలేమా ఇ హింద్‌ను మత సంస్థగా పేర్కొంది. సీఐఏ ఏటా వరల్డ్ ఫ్యాక్ట్‌బుక్‌లో ప్రపంచ దేశాల్లో ప్రజలు, ప్రభుత్వం, సంస్థల వివరాలను ప్రచురిస్తుంది. అమెరికా విధాన రూపకర్తలకు, నిఘావర్గాలకు, దర్యాప్తు సంస్థలకు ఈ సమాచారం మెరుగైన వనరుగా భావిస్తారు. -
మా కార్యకర్తలను చంపించారు : బీజేపీ
మంగుళూరు, కర్ణాటక : సాధారణ ఎన్నికల ప్రచారం సందర్భంగా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) 23 మంది కార్యకర్తలను అధికార కాంగ్రెస్ చంపించిందంటూ సంచలన ఆరోపణలు చేసింది. వారి పేర్లను బహిరంగ సభల్లో వినిపించింది కూడా. అయితే, మృతుల్లో ఒకరైన అశోక్ పూజరి జీవించే ఉన్నారు. ఈ మేరకు జాతీయ మీడియా కథనం ప్రచురించింది. అశోక్ బజరంగ్ దళ్ కార్యకర్త. 2015లో మూడు మోటార్ సైకిల్స్‌పై వచ్చిన ఆరుగురు దుండగులు అశోక్‌ను తీవ్రంగా గాయపర్చారు. చావుబతుకులతో 15 రోజుల పాటు ఐసీయూలో పోరాడిన అశోక్ గట్టెక్కారు. ఎన్నికల ప్రచారంలో తన పేరు మృతుల లిస్టులో రావడంతో అశోక్ షాక్‌కు గురయ్యారు. వెంటనే బీజేపీ నాయకులను కలిశారు. పొరబాటున పేరు చేరిందని చెప్పారని, లిస్టు నుంచి పేరును తొలగిస్తామని చెప్పారని అశోకుడు వెల్లడించారు. కానీ, ఆ తర్వాత బహిరంగ సమావేశాల్లో కూడా బీజేపీ 23 మంది కార్యకర్తలు మరణించారంటూ ప్రచారం చేస్తూనే ఉందని చెప్పారు. సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీ కూడా రెండు డజన్ల మంది కార్యకర్తలు కాంగ్రెస్ దాడుల్లో మరణించారని పేర్కొన్నారు. మోదీ వ్యాఖ్యలపై స్పందించిన 23 మందిలో 14 మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. దీనిపై స్పందించిన మంగుళూరు వీహెచ్‌పీ నాయకుడు జగదీశ్ షెనవా బీజేపీ తప్పుడు ప్రచారాలు చేయదని చెప్పారు. మృతుల లిస్టులో పేర్కొన్న వారందరూ కచ్చితంగా చనిపోయి ఉంటారని అన్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో ‘పద్మావత్’ సెగ
సాక్షి, కరీంనగర్ : దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న చిత్రం పద్మావత్. ఎన్నో వివాదాల నడుమ ఈ చిత్రం నేడు (గురువారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈసినిమా విడుదలను వ్యతిరేకిస్తున్న కర్ణిసేన దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో సినిమా విడుదల అవుతున్న థియేటర్ల వద్ద భారీ భద్రత కల్పించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ‘పద్మావత్’ మార్నింగ్‌షోలు మొదలయ్యాయి. ఇప్పుడు ఆసెగ తెలుగు రాష్ట్రాలకు పాకింది. సినిమా విడుదలను అడ్డకుంటూ తెలంగాణలోని కరీంనగర్లో భజరంగ్‌దళ్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పద్మావతి చిత్ర యూనిట్‌కు శవయాత్ర నిర్వహించారు. అనంతరం సినిమా ప్రదర్శిస్తున్న ధియేటర్ వద్ద దిష్టి బొమ్మలను దగ్థం చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో పద్మావత్ చిత్రం భారీగానే విడుదలైంది. దాదాపు 400పైగా థియేటర్లలో రిలీజైంది. -
బీజేపీ, బజరంగ్ దళ్‌పై సిద్దూ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, మాదికేరి (కర్ణాటక): కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మరోసారి హిందూత్వ సంస్థలపై మండిపడ్డారు. బీజేపీ, ఆరెస్సెస్, బజరంగ్ దళ్‌లో ఉగ్రవాద శక్తులు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఆయన తేల్చిచెప్పారు. అతివాద ఎస్డీపీఐ అయినా, బజరంగ్ దళ్ అయినా శాంతిని భగ్నం చేస్తే విడిచిపెట్టబోమని హెచ్చరించారు. ఆదమరిచి నిద్రించిన సిద్దూ..! కర్ణాటక సీఎం సిద్దరామయ్య బుధవారం ఉదయం మదికేరిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వేదికపై ఆదమరిచి నిద్రిస్తూ మీడియా కంటికి చిక్కారు. ఓవైపు కార్యక్రమం జరుగుతున్నా.. అదేమి పట్టనట్టు ఆయన కునుకుతీశారు. ఆయన నిద్రిస్తున్న ఫొటోలు సోషల్ మీడియలో దర్శనమివ్వడంతో ఆయనపై నెటిజన్లు సెటైర్లు, జోకులు వేస్తూ.. పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. -
ప్రకాష్‌రాజ్‌కు వ్యతిరేకంగా ప్రకటన
సాక్షి, బెంగళూరు: ప్రతిష్టాత్మక ‘శివరామ్ కారంత్’ అవార్డును ఎట్టి పరిస్థితుల్లోనూ నటుడు ప్రకాష్‌రాజ్‌కు ఇవ్వరాదని భజరంగ్‌దళ్ డిమాండ్ చేసింది. ఈమేరకు ఆ సంస్థ కర్ణాటక దక్షిణ ప్రాంత విభాగం సహ సంచాలకులు రఘు సకలేశపుర పేరిట శనివారం ఒక పత్రికా ప్రకటన విడుదలైంది. ‘సంఘ్ పరివార్ గౌరి లంకేష్‌ను హత్య చేసిందంటూ ప్రకాష్‌రాజ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ ఏజెంట్లా వ్యవహరిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీపై ఆయన తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. కేవలం ప్రచారం కోసమే ఇలా దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు. కమ్యూనిస్ట్ పార్టీల వేదికపై ఆయన దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. అందువల్ల శివరామ్ కారంత్ వంటి ప్రతిష్టాత్మక అవార్డును అందుకునే అర్హత ప్రకాష్‌రాజ్‌కు లేద’ని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందికపోవడాన్ని ప్రకాష్‌రాజ్ ఇంతకుముందు తప్పుపట్టారు. మోదీ మౌనం తనను భయపెడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. మోదీ తన కంటే పెద్ద నటుడని పేర్కొన్నారు. అవసరమైన చోట తాను గళం ఎత్తుతూనే ఉంటానని ప్రకాష్‌రాజ్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేసినందుకు ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఆయనపై కేసు నమోదయింది.