bookfest
-
కాలక్షేపానికి పుస్తకాలు చదివేవారు లేరు
సీరియస్ వ్యాసంగంగా పుస్తక పఠనం స్వీయ, జీవిత చరిత్రలపై నేటి తరం ఆసక్తి ఎమెస్కో అధినేత విజయకుమార్ రాజమమేంద్రవరం కల్చరల్ : ‘నేటి సమాజంలో కాలక్షేపానికి పుస్తకాలు చదివేవారు కనుమరుగవుతున్నారు... పుస్తక పఠనాన్ని సీరియస్ వ్యాసంగంగా నేటి తరం తీసుకుంటోంది... ఇది మంచిపరిణామమే' అన్నారు పుస్తక ప్రచురణ రంగంలో ఎనిమిది దశాబ్దాలకు పైగా సేవలందిస్తోన్న ఎమెస్కో సంస్థ అధినేత విజయకుమార్. ‘పుస్తక సంబరాలు’ పేరిట నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో భాగంగా మంగళవారం నిర్వహించిన పుస్తక ప్రియుల పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎమెస్కో పేరు ఎలావచ్చిందంటే.. సుమారు 82 సంవత్సరాలకు మునుపే ఎం.శేషాచలం అండ్ కో పుస్తక ప్రచురణ వ్యాపారాన్ని ప్రారంభించింది. ఇంగ్లిష్‌లో ఎంఎస్ కో అని రాసేవారు. ప్రజల నానుడిలో అది కాస్తా ఎమెస్కో అయి కూర్చుంది. 1988–89లో నేను సంస్థను టేకోవర్ చేశాను. నవలలకు ఆదరణ తగ్గింది నవలలకు 1960 ప్రాంతంలో ప్రజల్లో మంచి ఆదరణ ఉండేది. యద్దనపూడి సులోచనారాణి నవల 'సెక్రటరీ' సుమారు 80 ముద్రణలు పొందింది. నేటి తరం స్వీయ చరిత్రలు, జీవిత చరిత్రల విషయంలో ఆసక్తి చూపుతున్నారు. అయితే క్లాసికల్ నవలలకు నేడు ఆదరణ పెరిగింది. పిలకాగణపతి శాస్త్రి విశాలనేత్రాలు వెయ్యిపుస్తకాలు అమ్ముడవటానికి నాడు చాలా కాలం పట్టింది. ఇటీవల జరిగిన పునర్ముద్రణ పాఠకుల ఆదరణ చూరగొంటోంది. తిరుపతి వేంకట కవులోల ఒకరయిన చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి 'కథలు–గాథలు' పునర్ముద్రించాం. సాహితీ దిగ్గజాలు నోరి నరసింహశాస్త్రి, వేదం వేంకట్రాయశాస్త్రి రచనలు వెలుగులోకి తెస్తాం. స్వీయచరిత్రలు సమకాలీన సమాజం, నాటి వ్యక్తులను గురించి సాధికారికంగా చెప్పగలుగుతాయి. కేవలం గొప్పవారి చరిత్రలే అక్కర లేదు–సామాన్యుడి జీవిత చరిత్రలు కూడా కొన్ని సందర్భాల్లో పనికి వస్తాయి. కొమ్మూరి వేణుగోపాలరావు డిటెక్టివ్ నవలలను ముద్రించి, హైదరాబాద్‌లో ఓ పుస్తక ప్రదర్శనశాలలో ‘యుగంధర్ మళ్ళీ వచ్చాడు’ అన్న బ్యానర్ ఏర్పాటు చేశాం. ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. కొత్త పదాలను చేర్చి, శబ్దరత్నాకరాన్ని ముద్రించాం. అంతర్జాతీయ ప్రమాణాలలో బాలసాహిత్యాన్ని వెలుగులోకి తెస్తాం. పుస్తకాలపై ఆసక్తి లేకపోలేదు హైదరాబాద్‌లోని కూకట్పల్లి నుంచి 87 ఏళ్ల వృద్ధుడు బంజారాహిల్స్‌లోని మా కార్యాలయానికి ‘కొవ్వలి’ నవల కావాలని వచ్చారు. పుస్తకాలపై ఆసక్తి లేదనడం తొందరపాటే -
కాలక్షేపానికి పుస్తకాలు చదివేవారు లేరు
సీరియస్ వ్యాసంగంగా పుస్తక పఠనం స్వీయ, జీవిత చరిత్రలపై నేటి తరం ఆసక్తి ఎమెస్కో అధినేత విజయకుమార్ రాజమమేంద్రవరం కల్చరల్ : ‘నేటి సమాజంలో కాలక్షేపానికి పుస్తకాలు చదివేవారు కనుమరుగవుతున్నారు... పుస్తక పఠనాన్ని సీరియస్ వ్యాసంగంగా నేటి తరం తీసుకుంటోంది... ఇది మంచిపరిణామమే' అన్నారు పుస్తక ప్రచురణ రంగంలో ఎనిమిది దశాబ్దాలకు పైగా సేవలందిస్తోన్న ఎమెస్కో సంస్థ అధినేత విజయకుమార్. ‘పుస్తక సంబరాలు’ పేరిట నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో భాగంగా మంగళవారం నిర్వహించిన పుస్తక ప్రియుల పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎమెస్కో పేరు ఎలావచ్చిందంటే.. సుమారు 82 సంవత్సరాలకు మునుపే ఎం.శేషాచలం అండ్ కో పుస్తక ప్రచురణ వ్యాపారాన్ని ప్రారంభించింది. ఇంగ్లిష్‌లో ఎంఎస్ కో అని రాసేవారు. ప్రజల నానుడిలో అది కాస్తా ఎమెస్కో అయి కూర్చుంది. 1988–89లో నేను సంస్థను టేకోవర్ చేశాను. నవలలకు ఆదరణ తగ్గింది నవలలకు 1960 ప్రాంతంలో ప్రజల్లో మంచి ఆదరణ ఉండేది. యద్దనపూడి సులోచనారాణి నవల 'సెక్రటరీ' సుమారు 80 ముద్రణలు పొందింది. నేటి తరం స్వీయ చరిత్రలు, జీవిత చరిత్రల విషయంలో ఆసక్తి చూపుతున్నారు. అయితే క్లాసికల్ నవలలకు నేడు ఆదరణ పెరిగింది. పిలకాగణపతి శాస్త్రి విశాలనేత్రాలు వెయ్యిపుస్తకాలు అమ్ముడవటానికి నాడు చాలా కాలం పట్టింది. ఇటీవల జరిగిన పునర్ముద్రణ పాఠకుల ఆదరణ చూరగొంటోంది. తిరుపతి వేంకట కవులోల ఒకరయిన చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి 'కథలు–గాథలు' పునర్ముద్రించాం. సాహితీ దిగ్గజాలు నోరి నరసింహశాస్త్రి, వేదం వేంకట్రాయశాస్త్రి రచనలు వెలుగులోకి తెస్తాం. స్వీయచరిత్రలు సమకాలీన సమాజం, నాటి వ్యక్తులను గురించి సాధికారికంగా చెప్పగలుగుతాయి. కేవలం గొప్పవారి చరిత్రలే అక్కర లేదు–సామాన్యుడి జీవిత చరిత్రలు కూడా కొన్ని సందర్భాల్లో పనికి వస్తాయి. కొమ్మూరి వేణుగోపాలరావు డిటెక్టివ్ నవలలను ముద్రించి, హైదరాబాద్‌లో ఓ పుస్తక ప్రదర్శనశాలలో ‘యుగంధర్ మళ్ళీ వచ్చాడు’ అన్న బ్యానర్ ఏర్పాటు చేశాం. ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. కొత్త పదాలను చేర్చి, శబ్దరత్నాకరాన్ని ముద్రించాం. అంతర్జాతీయ ప్రమాణాలలో బాలసాహిత్యాన్ని వెలుగులోకి తెస్తాం. పుస్తకాలపై ఆసక్తి లేకపోలేదు హైదరాబాద్‌లోని కూకట్పల్లి నుంచి 87 ఏళ్ల వృద్ధుడు బంజారాహిల్స్‌లోని మా కార్యాలయానికి ‘కొవ్వలి’ నవల కావాలని వచ్చారు. పుస్తకాలపై ఆసక్తి లేదనడం తొందరపాటే. -
విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచాలి
ప్రతి ఏటా పుస్తక ప్రదర్శనలు నన్నయ వర్సిటీ వీసీ ముత్యాలునాయుడు నగరంలో పుస్తక ప్రియుల పాదయాత్ర రాజమహేంద్రవరం కల్చరల్ : విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడానికి ఇకపై ఏటా పుస్తక ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ఎం.ముత్యాలునాయుడు తెలిపారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ, ఎన్టీఆర్ ట్రస్టు, నన్నయ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవ్యాంధ్ర పుస్తక సంబరాలలో భాగంగా మంగళవారం పుస్తక ప్రియుల పాదయాత్ర నిర్వహించారు. ప్రభుత్వ అటానమస్ కళాశాల ప్రాంగణం నుంచి పాదయాత్రను వీసీ ప్రారంభించారు. విద్యార్థుల్లో పుస్తకాలు చదవడం తగ్గిపోయిందని, చదవాల్సిన పుస్తకాలు చదవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్ర వై.జంక్షన్ వరకూ వెళ్లి తిరిగి కళాశాల ప్రాంగణానికి చేరుకుంది. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమెస్కో అధినేత విజయకుమార్, కన్వీనర్ డాక్టర్ టి.సత్యనారాయణ, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డేవిడ్ కుమార్, ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పి.శ్రీరామ్మూర్తి, విద్యార్థులు పాల్గొన్నారు. సాహితీవేత్తలు ఏరీ? తెలుగువారి సాంస్కృతిక రాజధానిలో సాహితీ వేత్తలకు లోటు లేదు. మంగళవారం జరిగిన పుస్తకప్రియుల పాదయాత్రలో సాహితీవేత్తలు కనపడలేదు. తమకు ఆహ్వానాలు రాలేదని రచయితలు చెబుతుండగా, పంపామని నిర్వాహకులు తెలుపుతున్నారు. పుస్తక సంబరాల ప్రారంభానికి నాందిగా నిర్వహించవలసిన పాదయాత్ర,ను మూడు నాలుగు రోజులకు నిర్వహించడం సరికాదని పలువురు పుస్తక విక్రేతలు వ్యాఖ్యానించారు. -
మంచి పుస్తకం.. మస్తక పోషకం
రాజమహేంద్రవరంలో ‘నవ్యాంధ్ర పుస్తక సంబరాలు ఆర్ట్స్ కాలేజీలో ఈ నెల 27 వరకూ నిర్వహణ 99 స్టాళ్లలో అందుబాటులో లక్షలాది పుస్తకాలు నీతికథల నుంచి ఆత్మకథల వరకూ లభ్యం కొనుగోళ్లపై 10 నుంచి 30 వరకూ రాయితీ పూలరేకుల్లోని వన్నెలకూ, అవి వెదజల్లే సుగంధాలకూ నేల పొరలలోని సారమే మూలం. తిండిగింజలలోని పోషక విలువలకూ, పండ్లలోని చవులూరించే మాధుర్యానికీ కూడా ఆ సారమే మూలం. మనుగడకు వివిధ దినుసులూ, కాయలూ, ఖనిజాలకు మూలం మట్టిలోని సారమైనట్టే.. గుహావాసాల దశ నుంచి గ్రహాంతరవాసాల ప్రతిపాదనల వరకూ మానవ ప్రస్థాన పురోగతికి జ్ఞానమే మూలం. సారాన్ని నిక్షిప్తం చేసుకున్న నేలపొరల్లాగే..జ్ఞానసారాన్ని తమలో పొదువుకున్న పుస్తకాలు కూడా. ప్రాణవాయువు నెత్తురును శుద్ధి చేసినట్టు పుస్తకాలు.. కలుషిత చిత్తాన్ని ప్రక్షాళన చేస్తాయి. అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చిన సాధనాలతో ‘అచ్చు’ పుస్తకానికి కాలం చెల్లిందన్న అభిప్రాయం ఉంది. అయితే.. ఆ సాధనాల ఆవిష్కరణకు మూలం.. తరతరాల మానవులు పుటల నడుమ కూడబెట్టిన పెన్నిధేనన్నది ‘అక్షర’ సత్యం. రాజమహేంద్రవరంలో తొలిసారిగా నవ్యాంధ్ర పుస్తక సంబరాలు నిర్వహిస్తున్నారు. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లోని నన్నయ్య ప్రాంగణంలో ఈ నెల 19న ప్రారంభమైన ఈ వేడుక ఈ నెల 27 వరకు కొనసాగనుంది. సాక్షి, రాజమహేంద్రవరం/ కల్చరల్ : ‘పుస్తకం హస్తభూషణం’ అన్నారు ఒకనాడు. ‘స్మార్ట్‌ఫోన్ లేని కరము కరమే కాదు’ అంటున్నారు నేడు. అయినా.. ఏనాడైనా పుస్తకం హస్తభూషణమే కాదు మస్తకానికి ఔషధం అన్నది ‘అచ్చులే భాషకు ప్రాణసమం’ అన్నంత పరమసత్యం. తెలుగు గడ్డకు సాంస్కృతిక రాజధానిగా, ఆదికావ్యం జాలువారిన గడ్డగా గణుతికెక్కిన రాజమహేంద్రవరంలో తొలిసారిగా భారీస్థాయిలో పుస్తకోత్సవం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగువారి ‘పుస్తక ప్రేమ’ను గురించి అలనాటి గురజాడ నుంచి నిన్నటి ముళ్ళపూడి వెంకట రమణ వరకు చేసిన వ్యాఖ్యలను సరదాగా గుర్తు చేసుకుందాం. శతాబ్దికి ముందే మహాకవి గురజాడ ‘కన్యాశుల్కం’ నాటకానికి ముందుమాటలో ఇలా పేర్కొన్నారు.. 'తెలుగుదేశంలో గ్రంథకర్త అయినవాడు తన పుస్తకాలు తానే అచ్చొత్తించుకోవాలి. తానే అమ్ముకోవాలి'.. మరో యాభై ఏళ్ల తరువాత జయంతి çపబ్లికేషన్స్ ఆధ్వర్యంలో ప్రచురించిన గురజాడ ‘కన్యాశుల్కం’ మలిముద్రణలలో మహాకవి శ్రీశ్రీ తన ముందుమాటలో ' ఆ నాటి మహాకవి అన్నమాట ఈ నాటికీ యథార్థంగానే ఉంది' అన్నారు. శ్రీశ్రీ వ్యాఖ్యలు నాడే కాదు, నేటికీ ఆ మాట ప్రాధాన్యతను కోల్పోలేదు. కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధానులు పుస్తకాలు కొనడానికి ఒక్క దమ్మిడీ ఇవ్వనని చెబుతూనే 'నేను వేదం యాభైరెండు పన్నాలూ ఒహ దమ్మిడీ ఖర్చు లేకుండా చదువుకున్నాను' అని ఖండితంగా చెపుతాడు. ముళ్ళపూడి వెంకట రమణ ‘గిరీశం లెక్చర్ల’లో గిరీశం ఇలా అంటాడు..‘పుస్తకాలు కొనడమా! బార్బేరియస్, వర్స్ దేన్ సెల్లింగ్ గర్ల్స్’. అవన్నీ అలా ఉంటే.. ‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో–దాని జేబుల్లో డబ్బులుంటే మంచి పుస్తకం కొనుక్కో’ అన్న వజ్రపు తునకలాంటి పలుకూ ఉంది. ప్రముఖ ప్రచురణ సంస్థల భాగస్వామ్యం పాఠకులకు తమకు కావలసిన పుస్తకం ఎక్కడ లభ్యమవుతుందో తెలిపే వ్యవస్థ, ప్రచురణ కర్తకు తాను ముద్రించే పుస్తకాన్ని కొనుగోలు చేసే పాఠకులెవరో తెలిపే వ్యవస్థ నేటికీ రూపు దిద్దుకోలేదు. ఈ నేపథ్యంలో అడపాతడపా జరిగే పుస్తక ప్రదర్శనలు విశేష ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రాజమహేంద్రవరంలో జరుగుతున్న నవ్యాంధ్ర పుస్తక సంబరాలలో 99 స్టాళ్లు ఏర్పాటు చేశారు. అన్ని ప్రముఖ ప్రచురణ సంస్థలు స్టాళ్లు ఏర్పాటు చేశాయి. విశాలాంధ్ర, ప్రజాశక్తి, నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా, తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్ వంటి సంస్థలు లక్షలాది పుస్తకాలను అందుబాటులో ఉంచాయి. సాహిత్యం, నీతి కథలు, బొమ్మల కథలు, యండమూరి వీరేంద్రనాథ్, యద్దనపూడి సులోచనా రాణి, మాదిరెడ్డి సులోచనారాణి, షేక్స్పియర్ వంటి ప్రముఖులు రచించిన తెలుగు, ఇంగ్లిష్ నవలలు, అలనాటి సాహితీ వేత్తల ఆత్మకథలు, రాజకీయపరమైన పుస్తకాలు, ప్రముఖ జర్నలిస్టులు, రాజకీయ నేతలు, శాస్త్రవేత్తల ఆత్మకథలు ఇక్కడ అందుబాటులో ఉంచారు. కొనుగోలుదారులకు అన్ని రకాల పుస్తకాలపై 10 శాతం రాయితీ ఇస్తున్నారు. ఎంపిక చేసిన కొన్ని పుస్తకాలకు 30 శాతం రాయితీ కల్పించారు. పిల్లలు స్కెచ్ పెన్నులతో సులువుగా బొమ్మలు వేసేందుకు అవసరమైన బ్లోపెన్, మేజిక్ మిర్రర్ స్టాళ్లను ఏర్పాటు చేశారు. క్రాఫ్ట్ బజార్లు, ఇంట్లోనే కంప్యూటర్ నేర్చుకునేందుకు అవసరమైన సీడీల స్టాళ్లు ఏర్పాటు చేశారు. పుస్తకాల పైనా పెద్దనోట్ల రద్దు నీడ.. పాత రూ.వెయ్యి, రూ. 500 నోట్ల రద్దు ప్రభావం పుస్తక ప్రదర్శనపై కూడా పడింది. రాజమహేంద్రవరంలో మొదటిసారి పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేసినా గత మూడు రోజులుగా స్టాళ్ల యజమానులు ఆశించిన మేర అమ్మకాలు జరగలేదు. అదేవిధంగా పుస్తక ప్రదర్శన ఏర్పాటుపై ప్రచార లేమి కూడాకొనుగోళ్లు తగ్గిపోవడానికి ఓ కారణం. పిల్లల కోసం పుస్తకాలు కొన్నా.. పిల్లలను తీర్చిదిద్దడానికి పుస్తకాలు ఎంతో అవసరం. స్కూళ్లో పాఠాలతోపాటు నీతి కథలు చెబితే వారికి సమాజంపై అవగాహన ఉంటుంది. అందుకే వారికి అవసరమైన పుస్తకాలనే ఎక్కువగా కొన్నాను. – పోసమ్మ, క్రాఫ్ట్ టీచర్, తంటికొండ ఒకే చోట దొరకడం సౌలభ్యం ఇంటర్నెట్లో సమస్త సమాచారం ఉన్నా పుస్తక పఠనం ఎంతో అవసరం. ఏదైనా పుస్తకం కావాలంటే అనేక దుకాణాలు తిరగాలి. ఇలాంటి ప్రదర్శన వల్ల అన్ని పుస్తకాలు ఒకే చోట లభించడం సౌలభ్యంగా ఉంది. – పద్మలత, టీచర్, రాజమహేంద్రవరం లక్కీ డ్రా విజేతలకు బహుమతులు ప్రదర్శనలో కొనుగోలుదారులకు లక్కీ డ్రా ద్వారా ప్రత్యేక గిఫ్ట్‌లు ఇస్తున్నాం. ఇద్దరికి రూ.2000, మరో ముగ్గురికి రూ.1000, ఐదుగురికి రూ. 500 చొప్పన విలువైన పుస్తకాలిస్తాం. వారికి నచ్చిన పుస్తకాలు ఎంపిక చేసుకోవచ్చు. – అనిరుథ్, ఎమెస్కో బుక్స్ ప్రతినిధి