Bullying case
-
బ్రిటన్ ఉప ప్రధాని రాజీనామా
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు అక్కడ ఎదురు గాలి వీస్తోంది. బ్రిటన్ ఉప ప్రధాని, న్యాయశాఖ మంత్రి డొమినిక్ రాబ్ తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. న్యాయశాఖలో పాటు వైట్హాల్ విభాగాల్లో ఆయన సిబ్బందిపై వేధింపులకు పాల్పడ్డారంటూ గత కొంతకాలంగా ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు కమిటీ రిపోర్ట్ గురువారం ప్రధాని సునాక్‌కు చేరింది. ఈ నేపథ్యంలో శుక్రవారం డొమినిక్ రాబ్ తన పదవులకు రాజీనామా ప్రకటించారు. ఈ సీనియర్ కన్జర్వేటివ్ ఎంపీ తన పేషీలో పని చేసే సిబ్బందిని వేధించినట్లు, అవమానించినట్లు, ఏడ్పించినట్లు.. సిబ్బంది ఫిర్యాదులు చేశారు. ఈ విషయాన్ని బ్రిటిష్ టాబ్లాయిడ్ గార్డియన్ తొలుత బయటపెట్టింది. అయితే.. ఆరోపణలను డొమినిక్ రాబ్ ఖండిస్తూ వస్తున్నప్పటికీ, ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాల్సిందిగా సీనియర్ న్యాయవాది అడమ్ టోలీని కిందటి ఏడాది నవంబర్‌లో నియమించారు ప్రధాని సునాక్. రెండు ఫిర్యాదుల మీద మొదలైన ఈ వ్యవహారంలో దర్యాప్తు.. మలుపులు తీసుకుంటూ ఎక్కడికో పోయింది. రాబ్‌కు వ్యతిరేకంగా ఆధారాలను సేకరించుకుంటూ పోయింది అడమ్ టీం. రాబ్ దగ్గర పని చేసే సిబ్బంది నుంచి వాంగ్మూలం సేకరించి.. నివేదికను సిద్ధం చేసింది. గురువారం ఆ నివేదికను రిషి సునాక్‌కు సమర్పించారు అడమ్ టోలీ. ఆ నివేదిక ఇంకా బహిర్గతం కావాల్సి ఉంది. ఈ లోపే రాబ్ అనూహ్యాంగా రాజీనామా ప్రకటించారు. My resignation statement.👇 pic.twitter.com/DLjBfChlFq — Dominic Raab (@DominicRaab) April 21, 2023 అయితే.. తీవ్ర ఆరోపణలు, రాబ్‌పై దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ సునాక్‌ను.. మంత్రిగా కొనసాగించడంపై ప్రధాని రిషి సునాక్ రాజకీయపరంగా విమర్శలు ఎదుర్కొనే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు కిందటి ఏడాది అక్టోబర్‌లో రిషి సునాక్ యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టగా.. ఈ ఆరు నెలల కాలంలో ముగ్గురు కేబినెట్ మంత్రులు వ్యక్తిగత ప్రవర్తన కారణంగానే పదవుల నుంచి వైదొలగాల్సి రావడం గమనార్హం. -
మహిళలతో చనువుగా ఫోన్ చేయించి అర్ధనగ్న ఫొటోలు..
కర్నూలు: ‘నీవు నాకు బాగా తెలుసు... అందంగా ఉంటావు.. చాలాసార్లు మాట్లాడాలని ప్రయత్నించా.. కుదర్లేదు. నీకు పరిచయమున్న వ్యక్తి నీ ఫోన్ నంబర్ ఇచ్చాడు. అందుకే ఫోన్ చేస్తున్నా. ఓసారి ఇంటికి రా మాట్లాడుకుందాం’... అంటూ మహిళతో చనువుగా ఫోన్ చేయించి ఇంటికి పిలిపించుకుని అర్ధనగ్న ఫొటోలు తీసి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను పోలీసులు నిఘా వేసి పట్టుకుని కటకటాలలోకి పంపారు. కర్నూలు నగరం బంగారుపేటకు చెందిన వంట మాస్టర్ శకుంతల, ఆటో డ్రైవర్ కిశోర్, ఫ్లంబర్ రాజు అలియాస్ నాగరాజు, బీడీ బంకు ద్వారా జీవనం సాగిస్తున్న అంజనమ్మను 4వ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి ఎదుట హాజరు పరిచారు. చదవండి: ప్రేమ ఒకరితో.. పెళ్లి మరొకరితో.. పెళ్లి దుస్తుల్లోనే.. సోమవారం మధ్యాహ్నం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఐదుగురు ముఠాగా ఏర్పడి సులువుగా డబ్బు సంపాదించేందుకు వక్ర మార్గాన్ని ఎంచుకున్నారు. కర్నూలు మండలం రేమట గ్రామానికి చెందిన గిడ్డయ్య నిర్మల్ నగర్లో ఉంటాడు. మరో వ్యక్తి దాసుతో కలిసి బాగా డబ్బు ఉన్న వారి ఫోన్ నంబర్లను సేకరించి శకుంతల, అంజనమ్మల ద్వారా తియ్యనైన మాటలతో ముగ్గులోకి దింపి ఇంటికి రప్పించుకుని అమ్మాయిలతో కలిసి ఉన్నప్పుడు అర్ధనగ్న ఫొటోలు తీసి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. 20 రోజుల క్రితం లేబర్ కాలనీకి చెందిన ఒక వ్యక్తికి తియ్యనైన మాటలతో ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకుని ట్రాప్‌లో పడేసి బెదిరించి అతని వద్ద రూ. 1.20 లక్షలు నగదు తీసుకున్నారు. అలాగే ఈ నెల 9వ తేదీన రాంరహీమ్‌నగర్‌కు చెందిన మరో వ్యక్తిని కూడా ఇంటికి పిలిపించుకుని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి రూ. 4 లక్షలు విలువ చేసే రెండు ప్రామిసరీ నోట్లు, మరో రూ. 4 లక్షలు విలువ చేసే రెండు చెక్కులను తీసుకున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 4వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి పక్కా ఆధారాలతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండుకు పంపినట్లు ఎస్పీ వెల్లడించారు. చదవండి: డీజీపీని కలిసిన రమ్య కుటుంబ సభ్యులు -
వేధింపులతో కుమిలి.. గుండె చెదిరి..
మంచిర్యాల క్రైం: అత్తింటి వేధింపులతో ఓ మహిళ తన నాలుగేళ్ల కూతురుకు ఉరేసి, ఆపై తానూ ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. గుండెల్ని పిండేసే ఈ దారుణ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. మంచిర్యాల పట్టణంలోని కాలేజీ రోడ్లో గల మిమ్స్ హైస్కూల్ సమీపంలో నివాసం ఉంటున్న కేసిరెడ్డి విజ్జూలతారెడ్డి(26) తన కూతురు క్రిషికరెడ్డి(4)కి ఇంట్లోని ఓ గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసింది. బాలిక చనిపోయిన తర్వాత ఆమె మరో గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుంది. ఉదయమే భర్త పెట్రోల్‌బంక్‌లో విధులకు వెళ్లగా, అత్తమామలు హైదరాబాద్ వెళ్లిన సమయంలో ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఈ ఘటనకు ముందు విజ్జూలత తన భర్త రామకృష్ణారెడ్డికి ఫోన్‌చేసి మన కూతురును చంపేసి.. నేనూ ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పింది. దీంతో వెంటనే రామకృష్ణారెడ్డి ఇంటికి వచ్చే సరికి అప్పటికే భార్య, కూతురు వేర్వేరు గదుల్లో ఫ్యాన్లకు శవాలై వేలాడుతున్నారు. ఈ సమాచారం అందుకున్న ఏసీపీ గౌస్‌బాబా, ఎస్సై సతీశ్ సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఐదేళ్ల క్రితం వివాహం.. మంచిర్యాలకు చెందిన కేసిరెడ్డి మోహన్‌రెడ్డి–పద్మ దంపతుల కుమారుడు రామకృష్ణారెడ్డితో ఊరు శ్రీరాంపూర్‌కు చెందిన పాగాల రాంరెడ్డి–అరుణ దంపతుల కూతురు విజ్జూలత వివాహం 2012 ఆగస్టు 8న జరిగింది. అపుడు రూ.15 లక్షల కట్నం, ఇతర లాంఛనాలు ఇచ్చారు. మోహన్‌రెడ్డి తండ్రికి ఊరు శ్రీరాంపూర్ సమీపంలో ఐఓసీ పెట్రోల్‌బంక్ ఉంది. ఇందులోనే రామకృష్ణారెడ్డి పనిచేస్తున్నాడు. నెల ఖర్చులకు రూ.7 వేల జీతం తీసుకుంటాడు. కాగా, వివాహం జరిగిన ఏడాదికి వీరికి కూతురు క్రిషికరెడ్డి జన్మించింది. ప్రస్తుతం ఆ బాలిక ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతోంది. కూతురు పుట్టిన ఏడాది నుంచి విజ్జూలతకు అత్తమామలు, ఆడపడుచు నుంచి అదనపు కట్నం వేధింపులతోపాటు ఇంటి విషయాల్లో సూటిపోటి మాటలు మొదలైనట్లు మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. మామ మోహన్‌రెడ్డి వేధింపులు రోజురోజుకూ అధికం కావడంతో ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపింది. గతంలో పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగాయి. తిరిగి పదిరోజుల క్రితం పెద్దల సమక్షంలో పంచాయితీ చేయించి విజ్జూలతను అత్తారింటికి పంపించారు. ఆ తర్వాత వేధింపులు మరింత అధికం కావడంతో మనస్తాపం చెందిన విజ్జూలత తన కూతురుకు ఉరివేసి, తానూ తనువు చాలించింది. సూసైడ్ నోట్లో ఏముంది.. బీటెక్ చదువుకున్న విజ్జూలత తాను చనిపోయే ముందు రాసిన సూసైడ్ నోట్లో అత్తింటి వేధింపులను స్పష్టంగా రాసింది. తాను లేకపోతే తన కూతురు తల్లిలేని పిల్ల అవుతుందనే చిన్నారిని కూడా చంపుతున్నట్లు ఎంతో ఆవేదనతో పేర్కొంది. ‘‘బావా.. మీ అమ్మానాన్నలకు నేనంటే ఇష్టంలేదు. నీకు మీ అమ్మానాన్నే కావాలి. కనీసం భార్యని మీ అమ్మా నాన్న అనే మాటలేవీ పట్టించుకోవు. నీకు మీ వాళ్లు ఒక కోటీశ్వరుల అమ్మాయితో పెళ్లి చేస్తారు. చేసుకో. అది కూడా మీ అక్కకు ఇష్టమైన సంబంధం చేసుకో. ఆమెకు ఇష్టం లేకపోతే వచ్చేదాన్ని కూడా ఇలాగే టార్చర్ చేస్తారు. నిన్ను కూడా టార్చర్ చేస్తారు. నేను ఒక పెద్ద తప్పు చేశాను. అది నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ కావడం. ఇది కూడా మీ అమ్మకు ఇష్టం లేదు. ఆమెకు ఎన్ని పనులు చేసినా అంతే.. గిన్నెలు కడగకపోతే పోలీస్ ఆంటీ ఇంటికి పోయి చెప్పుతుంది. అన్ని పనులూ చేసి ఒకనాడు కడుపునొస్తుందని కూర్చున్న. ఆ ఒక్కరోజే గిన్నెలు కడగలేదు. నువ్వు మీ అమ్మ మాట దాటకు సరే. కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం బావా. మీ నాన్నకేమో ఇంకా కట్నం కావాలని ఉంది. మీ అమ్మానాన్నలకు మా నాన్నంటే ఇష్టం లేదు. అందుకే నా మీద పగ తీర్చుకుంటున్నారు. నా కూతురు తల్లిలేని పిల్ల కావద్దనే ఆమెను కూడా చంపేస్తున్నా. నువ్వు మీ అమ్మానాన్నలతో.. ముఖ్యంగా మీ అక్కతో సంతోషంగా ఉండు. మ్యారేజీ అయినప్పటి నుంచి నీవు రూ.7 వేలు శాలరీ కింద పనిచేస్తున్నావు. నేను చనిపోగానే.. నీకు మీ అమ్మ నాన్న, అక్క శాలరీ పెంచుతారు’’. -
పది కేసుల్లో ఐదుగురి అరెస్ట్
ఏలూరు (వన్‌టౌన్) : నరసాపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని భీమవరం వన్‌టౌన్, టూటౌన్, పాలకోడేరు పోలీస్ స్టేషన్ల పరిధిలో తుపాకీతో బెదిరింపు కేసు, తొమ్మిది చోరీ కేసుల్లో ఒక మహిళ సహా ఐదుగురిని అరెస్ట్ చేసి, వారి నుంచి బంగారం, వెండి, నగదుతో సహా రూ. 12.50 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి చెప్పారు. బుధవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కేసుల వివరాలను వెల్లడించారు. తుపాకీతో బెదిరించిన కేసులో : భీమవరంలో ఈ నెల 15న సుప్రభాత్ హోట ల్లో జరిగిన ఘర్షణ నేపథ్యంలో మానూరి రాం బాబు అనే వ్యక్తిని తుపాకీతో బెదిరించిన కేసులో భీమవరానికి చెందిన సీహెచ్.సత్యనారాయణ అలియాస్ శ్రీను, గంధం జగ్గారావు అలియాస్ నాని అనే వారిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి బోర్ రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. మూడు చోరీ కేసుల్లో : పాలకోడేరు మండలం కుమదవల్లిలోని ఓ ఇంట్లో ఆగస్టులో జరిగిన చోరీ కేసులో విశాఖపట్నం జిల్లా గాజువాకకు చెందిన భూలా నాగసాయిను అరెస్ట్ చేసి, 4 కాసుల బంగారు ఆభర ణాలు, 20 తులాల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం యలమంచిలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మరో చోరీ కేసులో కూడా నాగసాయి నిందితుడు. ఈ కేసులో ఇతడి నుంచి 21 కాసుల బంగారు ఆభరణాలు, 2 కేజీల వెండి వస్తువులు స్వాధీ నం చేసుకున్నారు. ఒంగోలు పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఒక చోరీ కేసులోనూ నాగసాయి నిందితుడు. అక్కడ రూ.30వేల విలువగల వెండి వస్తువులు దొంగిలించినట్టు అతను అంగీకరించాడన్నారు. రెండు చోరీ కేసుల్లో మహిళ.. మూడి ంటిలో మరో యువకుడు భీమవరం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన రెండు చోరీ కేసుల్లో ఆకివీడు గ్రామానికి చెందిన తెలగపాముల కులానికి చెందిన నక్కా పార్వతిని అరెస్ట్‌చేసి సుమారు రూ.4 లక్షల విలువైన 20 కాసుల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సెప్టెంబర్‌లో టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జేపీ రోడ్డులో యూనియన్ బ్యాంక్ ఎదురుగా మోటార్‌సైకిల్‌కు తగిలించిన క్యాష్ బ్యాగ్ చోరీ కేసులో తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి రేవు గ్రామానికి చెందిన ఓలేటి విజయకుమార్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.లక్షా70 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆకివీడులో జరిగిన మరో మూడు చోరీ కేసులలో కూడా ఇతడు నిందితుడు. ఈ కేసులలో యువకుడి నుంచి కాసు బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు. విలేకరుల సమావేశంలో అడిషినల్ ఎస్పీ ఎన్.చంద్రశేఖర్, డీఎస్పీలు కె.రఘువీరారెడ్డి, కేజీవీ సరిత, భీమవరం వన్‌టౌన్ సీఐ జి.కెనడీ, రూరల్ సీఐ ఆర్జీ జయసూర్య పాల్గొన్నారు. ఈ కేసులలో ప్రతిభ కనబరిచిన పలువురు పోలీసులను ఎస్పీ ప్రశంసించి రివార్డులు అందజేశారు. -
దానంపై భూ ఆక్రమణ కేసు
హైదరాబాద్: మాజీ మంత్రి దానం నాగేందర్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో భూ ఆక్రమణ, బెదిరింపు కేసు లు నమోదయ్యాయి. తన స్థలాన్ని నాగేందర్ కాజేయడానికి యత్నిస్తున్నాడంటూ జూబ్లీహిల్స్‌కు చెందిన కొండపల్లి హైమావతి అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్-2లోని ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ ఆస్పత్రిని ఆనుకొని కొండపల్లి హైమావతి అనే మహిళకు 889 గజాల స్థలం ఉంది. వారం క్రితం ఈ స్థలంలో రూమ్ కట్టేందుకు ఆమె అల్లుడు జయేందర్‌రెడ్డి ప్రయత్నిస్తుండగా దానం ప్రధాన అనుచరుడు సూరి, హేమా చౌదరి అనే వురో మహిళ, సోమాజిగూడ కార్పొరేటర్ ఎలిగల మహేష్ యాదవ్ వచ్చి ఈ స్థలం అన్నదని, ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరించారు. దానం ఇంటికి వచ్చి సెటిల్మెంట్ చేసుకోవాలని హెచ్చరించారు. మరోమారు సూరి, ఆయన అనుచరులు స్థలం వద్దకు వచ్చి అన్న మాట్లాడతారంటూ ఫోన్ కలిపి ఇచ్చారు. ఫోన్లోనే జయేందర్రెడ్డిని దానం హెచ్చరించాడు. అసభ్యకరంగా దూషించారు. ఖాళీ చేసి వెళ్లకపోతే ఖతం చేస్తానంటూ బెదిరించారు. ఈ స్థలంలో నిర్మాణం ఎలా కడతావో చూస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుసటి రోజు ఉదయం ఇంటికి వచ్చి మ్యాటర్ సెటిల్ చేసుకోకపోతే అంతు చూస్తానంటూ బెదిరించాడు. దీంతో బాధితులు తనకు నాగేందర్ నుంచి ప్రాణహాని ఉందంటూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో వెంటనే నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డిని ఆశ్రయించారు. ఆయన ఆదేశాల మేరకు బంజారాహిల్స్ పోలీసులు దానంతోపాటు సోమాజిగూడ కార్పొరేటర్ మహేష్ యాదవ్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదైన మరుసటి రోజు కూడా నాగేందర్ మరోసారి జయేందర్రెడ్డికి ఫోన్ చేసి నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా అంటూ హెచ్చరించారు. ఈ వ్యవహారం కోర్టులు, పోలీసులతో కాదని కేవలం తనతో సెటిల్మెంట్ చేసుకుంటేనే కొంతవరకు లాభపడతావంటూ హితవు పలికారు. ఇదిలా ఉండగా బాధిత మహిళ కొండపల్లి హైమావతి పీపుల్స్ వార్ అగ్ర నాయకుడు కొండపల్లి సీతారామయ్యకు స్వయానా మరదలు, ఏపీ డైరీ మాజీ చైర్మన్ చంద్రమౌళి రెడ్డి భార్య కావడం విశేషం.