పది కేసుల్లో ఐదుగురి అరెస్ట్
ఏలూరు (వన్‌టౌన్) : నరసాపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని భీమవరం వన్‌టౌన్, టూటౌన్, పాలకోడేరు పోలీస్ స్టేషన్ల పరిధిలో తుపాకీతో బెదిరింపు కేసు, తొమ్మిది చోరీ కేసుల్లో ఒక మహిళ సహా ఐదుగురిని అరెస్ట్ చేసి, వారి నుంచి బంగారం, వెండి, నగదుతో సహా రూ. 12.50 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి చెప్పారు. బుధవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కేసుల వివరాలను వెల్లడించారు. తుపాకీతో బెదిరించిన కేసులో : భీమవరంలో ఈ నెల 15న సుప్రభాత్ హోట ల్‌లో జరిగిన ఘర్షణ నేపథ్యంలో మానూరి రాం బాబు అనే వ్యక్తిని తుపాకీతో బెదిరించిన కేసులో భీమవరానికి చెందిన సీహెచ్.సత్యనారాయణ అలియాస్ శ్రీను, గంధం జగ్గారావు అలియాస్ నాని అనే వారిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి బోర్ రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
మూడు చోరీ కేసుల్లో : పాలకోడేరు మండలం కుమదవల్లిలోని ఓ ఇంట్లో ఆగస్టులో జరిగిన చోరీ కేసులో విశాఖపట్నం జిల్లా గాజువాకకు చెందిన భూలా నాగసాయిను అరెస్ట్ చేసి, 4 కాసుల బంగారు ఆభర ణాలు, 20 తులాల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం యలమంచిలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మరో చోరీ కేసులో కూడా నాగసాయి నిందితుడు. ఈ కేసులో ఇతడి నుంచి 21 కాసుల బంగారు ఆభరణాలు, 2 కేజీల వెండి వస్తువులు స్వాధీ నం చేసుకున్నారు. ఒంగోలు పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఒక చోరీ కేసులోనూ నాగసాయి నిందితుడు. అక్కడ రూ.30వేల విలువగల వెండి వస్తువులు దొంగిలించినట్టు అతను అంగీకరించాడన్నారు.
రెండు చోరీ కేసుల్లో మహిళ..
మూడి ంటిలో మరో యువకుడు
భీమవరం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన రెండు చోరీ కేసుల్లో ఆకివీడు గ్రామానికి చెందిన తెలగపాముల కులానికి చెందిన నక్కా పార్వతిని అరెస్ట్‌చేసి సుమారు రూ.4 లక్షల విలువైన 20 కాసుల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సెప్టెంబర్‌లో టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జేపీ రోడ్డులో యూనియన్ బ్యాంక్ ఎదురుగా మోటార్‌సైకిల్‌కు తగిలించిన క్యాష్ బ్యాగ్ చోరీ కేసులో తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి రేవు గ్రామానికి చెందిన ఓలేటి విజయకుమార్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.లక్షా70 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆకివీడులో జరిగిన మరో మూడు చోరీ కేసులలో కూడా ఇతడు నిందితుడు. ఈ కేసులలో యువకుడి నుంచి కాసు బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు. విలేకరుల సమావేశంలో అడిషినల్ ఎస్పీ ఎన్.చంద్రశేఖర్, డీఎస్పీలు కె.రఘువీరారెడ్డి, కేజీవీ సరిత, భీమవరం వన్‌టౌన్ సీఐ జి.కెనడీ, రూరల్ సీఐ ఆర్‌జీ జయసూర్య పాల్గొన్నారు. ఈ కేసులలో ప్రతిభ కనబరిచిన పలువురు పోలీసులను ఎస్పీ ప్రశంసించి రివార్డులు అందజేశారు.