Carribean
-
HAITI: హైతీ ప్రధాని రాజీనామా
పోర్ట్ ఆవ్ ప్రిన్స్: హైతీ ప్రధాని ఏరియెల్ హెన్రీ తన పదవికి రాజీనామా చేశారు. హెన్రీ రాజీనామాను ఆమోదించినట్లు చైర్ ఆఫ్ ద కరేబియన్ కమ్యూనిటీ ఇర్ఫాన్ అలీ ప్రకటించారు. హెన్రీ హైతీకి చేసిన సేవలకుగాను ఈ సందర్భంగా అలీ ధన్యవాదాలు తెలిపారు. దేశంలో తిరుగుబాటు చేసిన సాయుధ గ్యాంగులతో పోరాటంలో సహకరించాల్సిందిగా ఐక్యరాజ్యసమితి(యూఎన్) ఇంటర్నేషనల్ సెక్యూరిటీ మిషన్‌ను కోరేందుకు గత నెల హెన్రీ కెన్యా వెళ్లారు. సరిగ్గా ఈ సమయంలో రాజధాని పోర్ట్ ఆవ్ ప్రిన్స్లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున హింస చెలరేగింది. దీంతో హెన్రీ దేశం బయటే అమెరికాకు చెందిన పూర్టో రికో ప్రాంతంలో ఉండిపోవాల్సి వచ్చింది. సాయుధ గ్యాంగులు హెన్రీ దిగిపోవాల్సిందే అని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో హైతీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సోమవారం జమైకాలో ప్రాంతీయ నేతల సమావేశం జరిగింది. ఇంతలోనే హెన్రీ తన రాజీనామా సమర్పించారు. 2021లో అప్పటి దేశాధ్యక్షుడు మొయిస్ హత్య తర్వాత హెన్రీ హైతీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. హైతీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు వేగవంతం చేయాలని అమెరికా కూడా ఇప్పటికే కోరింది. హెన్రీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారని, ఎన్నికలు జరగకుండా వాయిదా వేస్తున్నారని దేశంలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత పెరిగింది. హైతీలో తొలుత శాంతి భద్రతలు పునరుద్ధరించాలని, స్వేచ్ఛాయుత ఎన్నికలు జరిగేందుకు కావాల్సిన వాతావరణాన్ని కల్పించాలని అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ కోరారు. 2016 నుంచి హైతీలో ఎన్నికలు జరగలేదు. ఇదీ చదవండి.. అమెరికాలో టిక్‌టాక్ పాలిటిక్స్.. ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్ -
దూసుకొస్తున్న ఇర్మా.. 'దేవుడు రక్షిస్తాడు'
బార్బుడా: ఇప్పటికే అమెరికాలోని పలు ప్రాంతాలను అతలాకుతలం చేసి హార్వీ తుఫాను వెళ్లిపోగా మరో పెను తుఫాను వాయువేగంతో దూసుకొస్తోంది. అది కూడా హార్వీని మించిన రీతిలో ఐదో కేటగిరికి చెందిన తుఫాను ఉధృతంగా ప్రతాపం చూపించనుంది. బుధవారంనాటికి కరేబియన్ దీవుల్లోని ఈశాన్య భాగంలోకి వ్యాపించిన ఇర్మా.. ప్యూరిటో రికో, డొమినికన్ రిపబ్లిక్, హైతీ, క్యూబా గుండా వారంతంలోగా ఫ్లోరిడాను చుట్టుముట్టనుంది. ఇప్పటికే దీని తీవ్రతను పరీక్షించిన వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలంతా తగిన జాగ్రత్తలతో సిద్ధంగా ఉండాలని, ప్రభుత్వం ఏర్పాటుచేసిన రక్షణ స్థావరాల్లోకి చేరుకోవాలని చెబుతున్నారు. అంతేకాకుండా.. 'దేవుడు మనందరినీ ఇర్మా బారీ నుంచి రక్షించునుగాక' అంటూ కూడా ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మియామిలోని అమెరికా జాతీయ తుఫాను హెచ్చిరికా కేంద్రం నమోదు చేసిన వివరాల ప్రకారం ఈ తుఫాను కేంద్రం చుట్టూ గంటకు 295కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్న గాలులు ఉన్నాయి. ఇప్పటికే కరేబియన్ దీవుల్లో అడుగుపెట్టిన ఇర్మా కారణంగా స్థానిక ఫోన్ లైన్లు దెబ్బతిన్నాయని, రేడియోలు ఆగిపోయాయని పలు శిధిలాలు ఆకాశంలో పక్షుల మాదిరిగా ఎగురుతున్నాయని తెలుస్తోంది. సరిగ్గా 1.47గంటల ప్రాంతంలో బార్బుడాను ఇర్మా దాటిందని ఫ్లోరిడా వైపు పరుగెడుతోందట. -
తుఫానులో విమానం.. భయంకర వీడియో
బార్బుడా: కరేబియన్ దీవిపైకి ఉగ్రరూపంతో దూసుకొస్తున్న మరో తుఫాన్ 'ఇర్మా' శక్తి సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఓ ప్రత్యేక వాతావరణ పరిశీలక విమానాన్ని పంపించగా భయకంపితులను చేసే దృశ్యాలు కనిపించాయి. నేషనల్ ఓసియానిక్ అండ్ అట్మాస్పెరిక్ అడ్మినిస్ట్రేషన్ వియానం ఎన్వోఏఏ42 విమానం సమర్థంగా అందులో ప్రయాణించి డేటాను, వీడియోలను పంపించింది. అది పంపించిన వివరాల ప్రకారం ఇర్మా గంటకు 295కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. ఫ్లోరిడా తీరానికి ఇది ఈ శనివారం చేరుకోనుంది. ఇప్పటికే అతలాకుతలం చేసి వెళ్లిన హార్వీ తుఫానుకంటే బలమైనదిగా ఇర్మాను అంచనా వేస్తున్నారు. తీర ప్రాంత ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని, ఇర్మాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఫ్లోరిడా, ఫ్యురిటో రికో, వర్జిన్ ఐలాండ్ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించారు. 460 తుఫాను బాధిత ఆశ్రయాలు ఏర్పాటు చేశారు. Video of a flight through the eye of #Irma on #NOAA42. Flights on both the WP-3D Orion and G-IV #NOAA49 continue. Credit Nick Underwood/NOAA pic.twitter.com/9ini4bOnYF — NOAAHurricaneHunters (@NOAA_HurrHunter) 5 September 2017