బార్బుడా: కరేబియన్ దీవిపైకి ఉగ్రరూపంతో దూసుకొస్తున్న మరో తుఫాన్ 'ఇర్మా' శక్తి సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఓ ప్రత్యేక వాతావరణ పరిశీలక విమానాన్ని పంపించగా భయకంపితులను చేసే దృశ్యాలు కనిపించాయి. నేషనల్ ఓసియానిక్ అండ్ అట్మాస్పెరిక్ అడ్మినిస్ట్రేషన్ వియానం ఎన్‌వోఏఏ42 విమానం సమర్థంగా అందులో ప్రయాణించి డేటాను, వీడియోలను పంపించింది. అది పంపించిన వివరాల ప్రకారం ఇర్మా గంటకు 295కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది.
ఫ్లోరిడా తీరానికి ఇది ఈ శనివారం చేరుకోనుంది. ఇప్పటికే అతలాకుతలం చేసి వెళ్లిన హార్వీ తుఫానుకంటే బలమైనదిగా ఇర్మాను అంచనా వేస్తున్నారు. తీర ప్రాంత ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని, ఇర్మాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఫ్లోరిడా, ఫ్యురిటో రికో, వర్జిన్ ఐలాండ్ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించారు. 460 తుఫాను బాధిత ఆశ్రయాలు ఏర్పాటు చేశారు.
Video of a flight through the eye of #Irma on #NOAA42. Flights on both the WP-3D Orion and G-IV #NOAA49 continue. Credit Nick Underwood/NOAA pic.twitter.com/9ini4bOnYF
— NOAAHurricaneHunters (@NOAA_HurrHunter) 5 September 2017