CLP Meeting
-
సీఎల్పీ భేటీకి బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ(సీఎల్పీ) సమావేశానికి హాజరయ్యారు.ఈ సమావేశానికి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పీఏసీ చైర్మన్‌గాంధీ, వ్యవసాయశాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సీఎల్పీ సమావేశం హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్లో ప్రారంభమైంది. ఎమ్మెల్యే లు ,ఎమ్మెల్సీలు ,ఎంపీలు హోటల్‌కు వచ్చారు.సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరుగుతోంది.లోకల్ బాడీ ఎన్నికలు,పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం,పార్టీ సభ్యత్వం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఇదీ చదవండి.. జమిలి ముసుగులో దేశాన్ని కబలించే కుట్ర -
అధికారులు మాట వినడం లేదట!.. టీపీసీసీ చీఫ్‌కు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: అధికారులు తమ మాట వినడం లేదంటూ కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. అధికారంలో ఉన్నామో.. ప్రతిపక్షంలో ఉన్నామో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అధికారుల వ్యవహారాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు మహేష్‌గౌడ్ అప్పగించారు. కాగా, రేపు సాయంత్రం 4 గంటలకు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మాదాపూర్ రాడియంట్ హోటల్లో సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో సీఎం కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. లోకల్ బాడీ ఎన్నికలు, పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.మరోవైపు, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ సమీక్షలు చేపడుతోంది. పీసీసీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మహేశ్‌కుమార్‌గౌడ్ నేతృత్వంలో శనివారం నుంచి జిల్లా స్థాయి సమీక్షలు ప్రారంభమయ్యాయి.ఇదీ చదవండి: జమిలి ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలుజిల్లాల వారీగా పార్టీ పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల స్థితిగతులు, క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన తీరు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ అంశాల ప్రాతిపదికగా ఈ సమీక్షలు జరుగుతాయని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశాల్లో పార్టీ అన్ని స్థాయిల నాయకులు పాల్గొననున్నారు. -
TG: సీఎల్పీ సమావేశం.. రేపు రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్వీ నామినేషన్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యకతన సీఎల్పీ సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. సమావేశంలో రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీని సీఎం రేవంత్ పరిచయం చేశారు.కాగా, తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా సీనియర్ కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ రేపు(సోమవారం) తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందుకోసం ఆయన ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు వచ్చారు. కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశానికి హాజరయ్యారు. అభిషేక్ సింఘ్వీ నామినేషన్ ప్రక్రియ, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. -
సీఎం రేవంత్ రెడ్డి తొలి భేటీ..
-
ఓవర్ టు ఢిల్లీ..!
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించినా.. ముఖ్యమంత్రిని ఎంపిక అంశం కొలిక్కి రాలేదు. సోమవారం పొద్దంతా భేటీలు, సమావేశాలు, చర్చలు, ఇంకాసేపట్లోనే ప్రమాణ స్వీకారమనే ప్రచారాల మధ్య ఈ వ్యవహారం ఢిల్లీకి చేరింది. పార్టీ శాసనసభాపక్షం (సీఎల్పీ) నాయకుడిని నిర్ణయించేందుకు సోమవారం హైదరాబాద్‌లోని ఎల్లా హోటల్లో సమావేశమైన కొత్త ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాన్ని వెల్లడించేందుకు మాత్రమే పరిమితమయ్యారు. వారి అభిప్రాయాలను ఢిల్లీకి పంపి, అధిష్టానం స్పందన కోసం ఎదురుచూసిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలోని పరిశీలకుల బృందం.. ఎలాంటి తుది నిర్ణయాన్ని ప్రకటించకుండానే హస్తిన బాట పట్టింది. మంగళవారం పార్టీ అధిష్టానం పెద్దలతో డీకే బృందం భేటీ కానుంది. అనంతరం సీఎం, మంత్రి పదవులు, ఇతర కీలక అంశాలపై తుది నిర్ణయం వెలువడనుందని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. అయితే తుది నిర్ణయాన్ని వెలువరించే ముందు అధిష్టానం పెద్దలు మరోసారి టీపీసీసీ ముఖ్యులతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని అంటున్నాయి. ఈ ప్రక్రియ ముగిసేందుకు రెండు రోజుల సమయం పడుతుందని పేర్కొంటున్నాయి. సీఎంతోపాటు డిప్యూటీ సీఎంలు, మంత్రివర్గ బెర్తులు ఖరారైన తర్వాతే ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించాలన్న అభిప్రాయాల నేపథ్యంలో.. ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు ఎప్పుడైనా కొత్త ప్రభుత్వం కొలువు దీరనుందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. ఏకవాక్య తీర్మానానికి ఆమోదం సోమవారం ఉదయం 11.30 గంటలకు ఎల్లా హోటల్ వేదికగా కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) సమావేశమైంది. కాంగ్రెస్ నుంచి తాజాగా గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు దీనికి హాజరయ్యారు. డీకే శివకుమార్ పర్యవేక్షణలో ఏఐసీసీ పరిశీలకులు కేజీ జార్జి, దీపాదాస్మున్షీ, అజయ్‌కుమార్, ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శులు కూడా పాల్గొన్నారు. తొలుత పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి డీకే శివకుమార్ మాట్లాడారు. గెలిచిన అభ్యర్థులకు అభినందనలు తెలిపి.. సీఎం ఎంపిక వ్యవహారంలో పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. తర్వాత సీఎం అభ్యర్థి ఎంపిక అధికారాన్ని ఏఐసీసీ అధ్యక్షుడికి కట్టబెడుతూ టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి ఏకవాక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సీఎల్పీ నేత భట్టి తీర్మానాన్ని సమరి్థంచగా.. మిగతా ఎమ్మెల్యేలంతా ఆమోదించారు. సీఎం ఎవరైతే బాగుంటుంది? ఏఐసీసీ పరిశీలకులు సీఎల్పీ సమావేశం తర్వాత ఎమ్మెల్యేలందరితో విడివిడిగా సమావేశమై.. సీఎం ఎవరైతే బాగుంటుందన్న అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో కొందరు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ పేరు చెప్పగా, మరికొందరు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల పేర్లు చెప్పారని, ఇంకొందరు మాత్రం ఏఐసీసీ ఎవరిని ఎంపిక చేసినా తమకు సమ్మతమేనని చెప్పినట్టు సమాచారం. డీకే బృందం ఈ అభిప్రాయాలను వెంటనే ఢిల్లీకి చేరవేసింది. వాటిని హైకమాండ్ పరిశీలించి ఏం చెప్తుందోనని సాయంత్రం వరకు ఎదురుచూసింది. కానీ డీకే బృందాన్ని ఢిల్లీ రావాల్సిందిగా అధిష్టానం నుంచి పిలుపువచ్చింది. దీంతో డీకే శివకుమార్, ఏఐసీసీ పరిశీలకులు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. మంగళవారం తెలంగాణ సీఎం ఎంపిక వ్యవహారంపై హైకమాండ్ పెద్దలతో చర్చించనున్నారు. సీఎం క్యాండిడేట్పై స్పష్టతకు వచ్చాక రాష్ట్రంలోని ముఖ్య నేతలతో చర్చించి, అవసరమైతే వారిని ఢిల్లీకి పిలిపించి మాట్లాడనున్నట్టు సమాచారం. తర్వాత సీల్డ్ కవర్లో సీఎం అభ్యర్థి పేరును హైదరాబాద్‌కు పంపి, సీఎల్పీ సమావేశంలో సదరు నేతను ఎన్నుకుంటారని తెలిసింది. గెలిచిన వారికి అభినందనలు ఢిల్లీలోని సోనియా నివాసంలో సోమవారం జరిగిన పార్లమెంటరీ స్ట్రాటజీ కమిటీ సమావేశం తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అభినందించింది. ఈ సమావేశంలో సీఎం ఎంపిక వ్యవహారంపై ఎలాంటి చర్చ జరగలేదని ఏఐసీసీ నేతలు జైరాం రమేశ్, మాణిక్యం ఠాగూర్ తెలిపారు. తెలంగాణ నుంచి ఢిల్లీకి వస్తున్న ఏఐసీసీ పరిశీలకులతో మాట్లాడాక హైకమాండ్ తుదినిర్ణయం తీసుకుంటుందన్నారు. సోమవారమే ప్రమాణమంటూ హడావుడి! సోమవారం మధ్యాహ్నం సీఎల్పీ సమావేశం ముగియకముందే కాంగ్రెస్ పక్షాన సీఎం ఎంపిక పూర్తయిందని, సాయంత్రమే రాజ్‌భవన్‌లో సీఎం, ఒకరిద్దరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారనే ప్రచారం జరిగింది. ఈ మేరకు రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ కొన్ని వీడియోలు కూడా బయటికి వచ్చాయి. గాం«దీభవన్ వర్గాల్లోనూ దీనిపై చర్చ జరిగింది. కానీ ఏఐసీసీ పెద్దలు డీకే టీమ్‌ను ఢిల్లీకి పిలిపించాక ఈ హడావుడి ఆగిపోయింది. హడావుడి వద్దు... ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి సీఎల్పీ సమావేశానికి ముందు హోటల్ పార్క్ హయత్‌లో కీలక సమావేశం జరిగింది. భట్టి, ఉత్తమ్, శ్రీధర్‌బాబు, ప్రేమ్‌సాగర్‌రావు, దామోదర రాజనర్సింహ, రాజగోపాల్‌రెడ్డి తదితరులు డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య వాడీవేడి చర్చ జరిగినట్టు తెలిసింది. ముఖ్యంగా సీఎం అభ్యర్థి ఎంపిక వ్యవహారం, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి జరుగుతున్న హడావుడి పార్టీకి నష్టం చేస్తుందని వారు డీకేతో పేర్కొన్నట్టు సమాచారం. ‘‘ఫలానా వారికి సీఎం పదవి ఇవ్వవద్దని మేమేమీ అనడం లేదు. కానీ అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకోవాలి. ఆ అభిప్రాయాలపై నిర్ణయం తీసుకునేందుకు అనంతరం జరిగే పరిణామాల గురించి ఆలోచించాలి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. మనం ఇప్పుడు ప్రజల్లోకి పంపాల్సింది ‘స్ట్రాంగ్’ మెసేజ్ కాదు.. ‘స్మార్ట్’ మెసేజ్. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ ఇచ్చిన హామీలను అమలుచేసి ఫలితాలు సాధించాల్సిన బాధ్యతను పరిగణనలోకి తీసుకోవాలి’’ అని వారు డీకేకు స్పష్టం చేసినట్టు సమాచారం. పార్టీ భవిష్యత్తును, పార్టీ పట్ల విధేయత, అనుభవాలను ఆచితూచి అంచనా వేసి నిర్ణయం తీసుకోవాలని.. ఇప్పటికిప్పుడే ఎమ్మెల్యేలకు వచ్చే ఇబ్బందేమీ ఉండదని వారు పేర్కొన్నట్టు తెలిసింది. -
కాంగ్రెస్ ప్రభుత్వం.. కేబినెట్లో వీరే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో విజయం సాధించింది. సోమవారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ సమావేశంలో కొనసాగుతోంది. ఈ మీటింగ్‌లో గెలుపొందిన 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సమావేశంలో సీఎల్పీ నేత ఎన్నిక, సీఎం అభ్యర్థిని ఎంపికపై నిర్ణయం తీసుకొనున్నుట్లు తెలుస్తోంది. అదే విధంగా కేబినెట్ స్థానాల గురించి కూడా సీఎల్సీ సమావేశంలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. కేబినెట్లో స్థానం దక్కే అవకాశం ఉన్నవారు.. అదిలాబాద్ జిల్లా : ► వివేక్ వెంకట్ స్వామీ (చెన్నూర్) ►ప్రేమ్ సాగర్ రావు (మంచిర్యాల) ►వెడ్మ బోజ్జు ( ఖానాపూర్) కరీంనగర్ : ►పొన్నం ప్రభాకర్ (హుస్నాబాద్) ►శ్రీధర్ బాబు (మంథని) ►అది శ్రీనివాస్ (వేములవాడ) మహబూబ్ నగర్ : ►రేవంత్ రెడ్డి..(కొడంగల్ ) ►జూపల్లి కృష్ణ రావు (కొల్లాపూర్) ►వంశీ కృష్ణ (అచ్చంపేట) ►వీర్లపల్లి శంకర్ (షాద్ నగర్ ) వరంగల్: ►సీతక్క (ములుగు) ►కొండ సురేఖ (వరంగల్ ఈస్ట్) ఖమ్మం: ►భట్టి విక్రమార్క (మధిర) ►తుమ్మల నాగేశ్వర రావు (ఖమ్మం) ►పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( పాలేరు) ► కునమనేని సాంబశివ రావు (కొత్తగూడెం) - పొత్తులో భాగంగా క్యాబినెట్ లోకి తీసుకుంటే నల్గొండ: ►ఉత్తమ్ లేదా పద్మావతి ►కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (నల్గొండ) మెదక్ : ►దామోదర్ రాజనర్సింహ (అందోల్ ) నిజామాబాద్ : ►సుదర్శన్ రెడ్డి ( బోధన్) ►షబ్బీర్ అలీ (ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి) రంగారెడ్డి : ►మల్ రెడ్డి రంగారెడ్డి ( ఇబ్రహీంపట్నం ) ►గడ్డం ప్రసాద్ (వికారాబాద్) ►రామ్ మోహన్ రెడ్డి (పరిగి) వారితో పాటు అవసరం అయితే కోదండరాంకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
హోటల్ ఎల్లాలో సీఎల్పీ సమావేశానికి హాజరైన కాంగ్రెస్ నేతలు (ఫొటోలు)
-
తెలంగాణ సీఎం ఎవరు?.. వెయిటింగ్!
Live Updates ఏఐసీసీ నిర్ణయం కోసం వెయిటింగ్ ►సీఎల్పీ భేటీ అనంతరం.. ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ చేపట్టిన డీకే శివకుమార్ ►ఒక్కో ఎమ్మెల్యేతో విడివిడిగా మాట్లాడిన డీకేఎస్ ►ముగిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ ►ఎమ్మెల్యేల అభిప్రాయలను ఏఐసీసీకి పంపిన డీకేఎస్ ►ఢిల్లీ నుంచి సీఎల్పీ నేత ఎంపిక సమాచారం కోసం వెయిటింగ్ ►కాంగ్రెస్ శ్రేణుల్లో సర్వత్రా ఉత్కంఠ ముగిసిన సీఎల్పీ సమావేశం.. ►మరో రెండు గంటల్లో సీఎల్పీ నేతను ఎన్నుకునే అవకాశం ►తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ సీఎల్పీ తీర్మానం. ఎన్నికల ప్రచారానికి వచ్చిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుతూ మరో తీర్మానం. ►సీఎల్పీ నేత ఎంపికపై ఎమ్మెల్యేల వ్యక్తిగత అభిప్రాయాలు కూడా తీసుకుంటామన్న డీకే శివకుమార్. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరితో మాట్లాడుతున్న డీకే, దీపాదాస్ మున్షి. ►సీఎల్పీ సమావేశం అనంతరం డీకే శివకుమార్ మాట్లాడుతూ.. సీఎల్పీ నేత ఎంపికను అధిష్టానానికి అప్పగించారు. సీఎల్పీ తీర్మానాన్ని రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. సీఎల్పీ నిర్మానాన్ని భట్టి విక్రమార్క, తుమ్మల బలపరిచారు. తీర్మానాన్ని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తున్నాం. అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటారు. ►హోటల్ ఎల్లాలో సీఎల్పీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సీఎం ఎంపికపై పరిశీలకులు ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్నారు. సీఎం ఎంపిక బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ ఏకవాఖ్య తీర్మానం చేశారు. ►ఏకవాఖ్య తీర్మానం ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి.. తీర్మానాన్ని బలపరిచిన తుమ్మల నాగేశ్వర రావు ►సీఎల్పీ సమావేశానికి కాంగ్రెస్‌లో గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు హాజరు. #WATCH | Telangana: Congress Legislature Party (CLP) meeting begins in Hyderabad. Karnataka Deputy CM DK Shivakumar, State Congress chief Revanth Reddy and other Congress MLAs are present in the meeting. pic.twitter.com/xsQ2AayKQW — ANI (@ANI) December 4, 2023 ►కాంగ్రెస్ సీఎల్పీ నేతల సమావేశం ప్రారంభమైంది. నగరంలోని హోటల్ ఎల్లాలో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు, సీఎం ఎంపిక, మంత్రులు ఎవరు? అనే అంశంపై చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ►సీఎం పదవి కోసం ముగ్గురు సీనియర్ నేతల లాబీయింగ్. ►ఢిల్లీ పెద్దలతో భట్టి విక్రమార్క్ మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. ఏకాభిప్రాయం కుదుర్చుకునేందకు అధిష్టానం ప్రయత్నాలు. ►సీతక్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తుంది. నా గెలుపు ములుగు ప్రజల విజయం, న్యాయం గెలిచింది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తాను. ►మల్లు రవి మాట్లాడుతూ.. ప్రజా పాలన కోసమే కాంగ్రెస్‌ను ప్రజలు ఎన్నుకున్నారు. అధిష్టానం నిర్ణయమే మాకు శిరోధార్యం. బీఆర్ఎస్ నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. కేబినెట్లో ఎవరు? ►వివేక్ వెంకటస్వామి, ప్రేమ్‌సాగర్ రావు, వెడ్మ బోజ్జు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, ఆది శ్రీనివాస్, రేవంత్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకర్, సీతక్క, కొండా సురేఖ, భట్టి విక్రమార్క్, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్, కూనంనేని సాంబశివరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదా పద్మావతి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, దామోదర రాజనర్సింహ, సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, మల్రెడ్డి రంగారెడ్డి, గడ్డం ప్రసాద్, రామ్ మోహన్ రెడ్డి. సీఎం ఎంపిక అధిష్టానం నిర్ణయం: భట్టి విక్రమార్క ►అంతకుముందు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటాం. సీఎల్పీ సమావేశంలో అందరి నిర్ణయం తీసుకుని పార్టీ అధిష్టానం సీఎంను ఎంపిక చేస్తుంది. నేను సీఎల్పీ నేతగా ఉన్నాను. పార్టీ అధికారంలోకి రావడం కోసం పాదయాత్ర చేశాను. ఉచిత కరెంట్ అనగానే దేశంలో గుర్తుకు వచ్చేది వైఎస్సార్. ఎన్నికల ముందే చెప్పారు ఉచిత కరెంట్ ఇస్తానని.. చెప్పడమే కాదు.. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం పెట్టారు. అది చేసి చూపించిన పేటెంట్ రైట్ కాంగ్రెస్ పార్టీదే. కాంగ్రెస్ అంటే కరెంట్.. కరెంట్ అంటే కాంగ్రెస్. కరెంట్‌ను ముట్టుకుంటే ఎలా మాడిపోతారో ఇప్పుడు ఫలితాలు చూశారు కదా. 70 స్థానాల్లో గెలవబోతున్నామని ముందే చెప్పాను. గెలిచి చూపించాం. మా అభ్యర్థులకు వచ్చిన మెజార్టీ చూస్తే తెలుస్తుంది. ఎంత బలంగా జనం ప్రజా ప్రభుత్వం తెచ్చుకోవాలని సిద్ధమయ్యారో. ప్రజాస్వామితంగా పాలన ఉండాలని కోరుకున్నారు. దొరల తెలంగాణ కాదు.. ప్రజల తెలంగాణ గెలవాలని కోరుకున్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఆదిలాబాద్ అడవుల్లో ఎవరూ తిరగని ప్రాంతాల్లోకి వెళ్లాను.. అక్కడే పడుకున్నాను. సింగరేణి ప్రాంతాల్లో కూడా తిరిగాను. మా పార్టీ అధికారంలోకి రాగానే ఏమీ చేస్తామన్నది క్లారిటీ ఇచ్చాం. ►పార్క్ హయత్‌లో డీకే శివకుమార్‌తో ఉత్తమ్, భట్టి, రాజగోపాల్ రెడ్డి భేటీ. సీఎల్పీ సమావేశం కంటే ముందే నేతల సమావేశంతో ఉత్కంఠ. ఈ సమావేశం తర్వాత హెటల్ ఎల్లాకు బయలుదేరనున్న నేతలు ►ఈ భేటీలో సీఎం ఎంపికపై కొత్త ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. ►మరోవైపు.. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులను రాజ్‌భవన్‌కు తీసుకువెళ్లేందుకు హెటల్ ఎల్లా వద్ద టీపీసీసీ బస్సులను సిద్ధం చేసింది. భేటీ తర్వాత అధిష్టానం పరిధిలోకి.. ►పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించాక సీఎం ఎంపిక, మంత్రివర్గ కూర్పు అంశం అధిష్టానం పెద్దల చేతికి వెళ్లనుంది. డీకే బృందం ఎమ్మెల్యేలతో భేటీ పూర్తికాగానే ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. అక్కడ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాందీలతో సమాలోచనలు జరిపి సీఎం ఎవరన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. తర్వాత సీఎం రేసులో ఉన్న ఇతర నేతలను ఢిల్లీకి పిలిపించి బుజ్జగించి, ఏకాభిప్రాయం సాధించే అవకాశం ఉందని తెలిసింది. తర్వాత మరోమారు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి లాంఛనంగా సీఎల్పీ నాయకుడి ఎంపికను పూర్తి చేయనున్నారు. ఈ నెల 9వ తేదీకల్లా ఈ ప్రక్రియ అంతా పూర్తిచేసి ఎల్బీ స్టేడియం వేదికగా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించవచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సోమ, మంగళవారాల్లోనే ప్రమాణ స్వీకారం? ►ఎక్కువ రోజులు పొడిగించకుండా సోమవారం లేదా మంగళవారమే సీఎంతోపాటు ఒకరిద్దరు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలు కూడా ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సోమవారం సీఎల్పీ భేటీ తర్వాత డీకే శివకుమార్, ఇతర పెద్దలు ఇక్కడి నుంచే ఢిల్లీ పెద్దలతో మాట్లాడి, నేరుగా గవర్నర్‌ను కలసి రాజ్‌భవన్‌లోనే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేస్తారనే చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే ఈనెల 9 నాటికి మంత్రివర్గాన్ని కూర్చి పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ సభలో మంత్రుల ప్రమాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
నేడు సీఎల్పీ భేటీ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. నూతన ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా సోమవారం పార్టీ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశాన్ని నిర్వహించనుంది. హైదరాబాద్‌లోని ఎల్లా హోటల్ వేదికగా ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీలో సీఎం ఎంపికపై కొత్త ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పర్యవేక్షణలో, ఇతర ఏఐసీసీ ముఖ్యుల సమక్షంలో ఈ సమావేశం జరగనుంది. దీనికోసం కాంగ్రెస్ కొత్త ఎమ్మెల్యేలంతా ఆదివారం రాత్రే హైదరాబాద్‌కు చేరుకున్నారు. భేటీ తర్వాత అధిష్టానం పరిధిలోకి.. పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించాక సీఎం ఎంపిక, మంత్రివర్గ కూర్పు అంశం అధిష్టానం పెద్దల చేతికి వెళ్లనుంది. డీకే బృందం ఎమ్మెల్యేలతో భేటీ పూర్తికాగానే ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. అక్కడ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాందీలతో సమాలోచనలు జరిపి సీఎం ఎవరన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. తర్వాత సీఎం రేసులో ఉన్న ఇతర నేతలను ఢిల్లీకి పిలిపించి బుజ్జగించి, ఏకాభిప్రాయం సాధించే అవకాశం ఉందని తెలిసింది. తర్వాత మరోమారు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి లాంఛనంగా సీఎల్పీ నాయకుడి ఎంపికను పూర్తి చేయనున్నారు. ఈ నెల 9వ తేదీకల్లా ఈ ప్రక్రియ అంతా పూర్తిచేసి ఎల్బీ స్టేడియం వేదికగా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించవచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సోమ, మంగళవారాల్లోనే ప్రమాణ స్వీకారం? ఎక్కువ రోజులు పొడిగించకుండా సోమవారం లేదా మంగళవారమే సీఎంతోపాటు ఒకరిద్దరు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలు కూడా ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సోమవారం సీఎల్పీ భేటీ తర్వాత డీకే శివకుమార్, ఇతర పెద్దలు ఇక్కడి నుంచే ఢిల్లీ పెద్దలతో మాట్లాడి, నేరుగా గవర్నర్‌ను కలసి రాజ్‌భవన్‌లోనే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేస్తారనే చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే ఈనెల 9 నాటికి మంత్రివర్గాన్ని కూర్చి పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ సభలో మంత్రుల ప్రమాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలీసుల పేరిట లేఖ ఫేక్ సీఎంగా రేవంత్‌రెడ్డి సోమవారం ప్రమాణస్వీకారం చేస్తారని, ఆ కార్యక్రమానికి రాహుల్, ప్రియాంక వచ్చే అవకాశం ఉందని, ఇందుకోసం తగిన భద్రత ఏర్పాటు చేయాలంటూ పోలీసు ఉన్నతాధికారుల పేరిట ఓ లేఖ వైరల్‌గా మారింది. అయితే అది ఫేక్ అని టీపీసీసీ వర్గాలు ప్రకటించాయి. గవర్నర్‌ను కలసిన కాంగ్రెస్ నేతలు ఫలితాల అనంతరం హైదరాబాద్‌లోని ఎల్లా హోటల్లో సమావేశమైన కాంగ్రెస్ నేతలు.. రాత్రి 9 గంటల సమయంలో రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ తమిళిసైను కలిశారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ పరిశీలకులు దీపాదాస్మున్షీ, కేజీ జార్జ్ తదితరులు రాజ్‌భవన్‌కు వెళ్లిన బృందంలో ఉన్నారు. తమకు 65 మంది సభ్యుల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ వారు గవర్నర్‌కు లేఖ అందజేశారు. తర్వాత రాజ్‌భవన్ ఎదుట డీకే శివకుమార్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. సీఎంపై సోమవారమే స్పష్టత: ఉత్తమ్ గవర్నర్‌ను కలవడానికి ముందు ఎల్లా హోటల్ వద్ద ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మా ట్లాడారు. సోమవారం సీఎల్పీ సమావేశం జరగనుందని, సీఎం ఎవరన్నదానిపై స్పష్టత వస్తుందని చెప్పారు. ఈ విషయంలో తన అభిప్రాయాన్ని సమావేశంలోనే వెల్లడిస్తానని, బయ ట చెప్పనని వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం ప్రజల విజయమని అభివర్ణించారు. -
కర్ణాటక కొత్త కేబినెట్‌కు ముహూర్తం ఖరారు..
బెంగళూరు: కర్ణాటక కొత్త కేబినెట్‌కు ముహూర్తం ఖరారైంది. మే 18న కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజున కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు. అదే విధంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా అన్ని భావసారూప్యత కలిగిన పార్టీలకు కాంగ్రెస్ ఆహ్వానం పంపింది. కాగా కర్ణాటకలో హంగ్ తప్పదనుకున్న ఊహాగానాలకు చెక్ పెడుతూ ఏకంగా 136 స్థానాలను హస్తం పార్టీ గెలుచుకుంది. గత ఎన్నికల కంటే 55 స్థానాలు ఎక్కువగా విజయం సాధించింది. 43 శాతం ఓట్ షేర్ రాబట్టింది. 2018 ఎన్నికల్లో 104 స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈసారి కేవలం 65 సీట్లకే పరిమితమైంది. 14 మంది మంత్రులు పరాజయం పాలయ్యారు. ఈ ఓటమితో దక్షిణాదిన ఏకైక రాష్టం కూడా బీజేపీ చేజారింది. ఇక జేడీఎస్ కేవలం 19 సీట్లతో కుదేలైంది. చదవండి: కర్ణాటక సీఎం రేసు.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు సీఎల్పీ భేటీ బెంగుళూరులో సీఎల్పీ సమావేశమైంది. షంగ్రిల్లా హోటల్‌కు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎంపికపై చర్చించారు. ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణకు పార్టీ హైకమాండ్ దూతలను పంపింది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సుశీల్ కుమార్ షిండే, దీపక్ బబారియా, జితేంద్ర సింగ్ అల్వార్‌లను కర్ణాటక సీఎల్పీ సమావేశ పరిశీలకులుగా నియమించింది. సీఎల్పీ నేతల ఎన్నిక ప్రక్రియలో పాల్గొన్న షిండే బృందం.. ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుంది. అధిష్టానమే సీఎంను ప్రకటించాలని తీర్మానంలో నిర్ణయించారు. డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఇళ్ల వద్ద హైడ్రామా బెంగళూరులో డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఇళ్ల వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. సిద్ధరామయ్య ఇంటి ముందు ‘కర్ణాటక తదుపరి సీఎం’ అంటూ ప్లెక్సీలు వెలిశాయి. ఇటు డీకే శివకుమార్ ఇంటి ముందు ‘కర్ణాటక కొత్త ముఖ్యమంత్రికి పుట్టిన రోజు శుభాకాంక్షాలు’ అంటూ ఆయన మద్దతుదారులు పోస్టర్లు అంటించారు. ఇరు నేతల మద్దతుదారుల తమ నేతను సీఎం చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 137కు చేరింది. ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారు. చదవండి: సీబీఐ నూతన డైరెక్టర్‌గా కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ -
సీఎల్పీ సమావేశంలో సీఎం అభ్యర్థిని ఖరారు చేసే ఛాన్స్
-
రాజస్థాన్ సీఎం పదవికి అశోక్ గహ్లోత్ రాజీనామా!
జైపూర్: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేయడానికి ముందే రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జైపూర్‌లోని అశోక్ గహ్లోత్ నివాసంలో ఆదివారం రాత్రి 7గంటలకు కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశం కానుంది. సీఎం మార్పు తథ్యమని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ భేటీ కీలకంగా మారింది. రాజస్థాన్ కాంగ్రెస్ శాసనసభాపక్షానికి కొత్త సారథిని నిర్ణయించే అధికారం అధ్యక్షురాలు సోనియా గాంధీకే వదిలేస్తూ ఈ సమావేశంలో తీర్మానం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే సచిన్ పైలట్‌ను నూతన సీఎం చేయడం గహ్లోత్‌కు ఇష్టం లేదు. ఈ విషయంపై ఎమ్మెల్యేలు కూడా మాట్లాడాలని ఆయన కోరుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సచిన్ పైలట్‌కు గాంధీల నుంచి హామీ వచ్చిందని, ఆయనే తదపరి సీఎం అని పార్టీ వర్గాలు చెప్పాయి. అంతేగాక తాను నామినేషన్ సమర్పించిన తర్వాతే రాజస్థాన్ కొత్త సీఎంపై నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు పేర్కొన్నాయి. జైపూర్‌లో జరిగే ఈ సమావేశానికి పరిశీలకుడిగా కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే, రాజస్థాన్ ఇన్‌ఛార్జ్‌గా అజయ్ మాకెన్ హాజరుకానున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఖర్గేను పరిశీలకుడిగా సోనియా గాంధీ నియమించారు. అక్టోబర్ 17న జరగనున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ సెప్టెంబర్ 24న మొదలై 30వరకు కొనసాగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 8 వరకు గడువుంది. ఎన్నికలు జరిగిన రెండో రోజు అంటే అక్టోబర్ 19న ఫలితాలు ప్రకటిస్తారు. చదవండి: ‘70 ఏళ్లలో ఏ నాడూ దేశం ఇలా కాలేదు’ -
తెలంగాణ కాంగ్రెస్‌లో పంచపాండవులు మిగిలారు: జీవన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో పంచపాండవులు మిగిలారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌరవుల పక్షాన చేరిన కర్ణుడని ఆయన అభివర్ణించారు. పాండవుల వెంట ఉంటే రాజ్యం ఇస్తామని చెప్పినా అనాడు కర్ణుడు విననట్లు.. ఇప్పుడు రాజగోపాల్ కూడా అలాగే చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే రాజీనామా చేయడమంటే చేతకానీతనమేనని జీవన్ రెడ్డి విమర్శించారు. రాజీనామాతో అభివృద్ధి అనేది సరైన వ్యూహం కాదని తెలిపారు. హుజురాబాద్‌కు, మునుగోడుకు సంబంధమే లేదని, రాజగోపాల్‌రెడ్డి ఇకపై అసెంబ్లీలో అడుగు పెట్టడని జోస్యం చెప్పారు. మునుగోడులో గెలిచేది తామేనని స్పష్టం చేశారు. పోరాడే అవకాశం ఇచ్చినా రాజగోపాల్ రెడ్డి ఉపయోగించుకోలేదని మండిపడ్డారు. గత మూడేళ్లలో రాజగోపాల్‌రెడ్డి ప్రజల కోసం చేసిన ఉద్యమం ఏదైనా ఉందా అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి ఫైట్ చేస్తామంటే కాంగ్రెస్ అడ్డుపడిందా అని నిలదీశారు. చదవండి: కోమటిరెడ్డి రాజీనామా ఆమోదం.. మనుగోడు ఉప ఎన్నికకు రంగం సిద్ధం రాజగోపాల్‌రెడ్డి రాజీనామాను ప్రజలు ఎలా చూస్తారనేది చూడాలన్నారు. కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచే అభ్యర్థిని పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. అయితే రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో టీ కాంగ్రెస్‌లో పంచపాండవులు మిగిలారని జీవన్ రెడ్డి వెల్లడించారు. సీఎల్పీనేత భట్టివిక్రమార్క.. ధర్మరాజు అయితే, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని భీముడని, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబును అర్జునుడిగా పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డిని కర్ణుడితో పోల్చారు. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో తెలంగాణ సీఎల్పీ అత్యవసర సమావేశమైంది. ఎమ్మెల్యేలు అందుబాటులో లేని కారణంగా జూమ్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ మీటింగ్‌లో రాజగోపాల్ రెడ్డి రాజీనామా, మునుగోడు ఉప ఎన్నిక, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. చదవండి: జాతిని చీల్చే కుట్రను అడ్డుకుందాం: సీఎం కేసీఆర్ -
ప్రజాసమస్యలే ‘ఎజెండా’
సాక్షి, హైదరాబాద్: ప్రజాసమస్యల పరిష్కారంలో విఫలమైన అధికార టీఆర్ఎస్ను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిలదీయాలని కాంగ్రెస్ శాసనసభాపక్షం(సీఎల్పీ) నిర్ణయించింది. ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికల వాగ్దానాల విస్మరణ, బడ్జెట్ అసమానతలు, అవినీతి, కరెంటు చార్జీల పెంపు, ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగభృతి, రైతు రుణమాఫీ, నకిలీ విత్తనాలతో రైతులకు నష్టం, అభయహస్తం, మహి ళలకు వడ్డీలేని రుణాలు, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల మళ్లింపు, దళితబంధు వంటి అంశాలపై ప్రభుతాన్ని ప్రశ్నించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నిర్ణయించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తాజ్‌దక్కన్‌లో సీఎల్పీనేత భట్టి అధ్యక్షతన దాదాపు ఆరున్నర గంటలపాటు సీఎల్పీ సమావేశం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్న సీఎల్పీ నేత భట్టి నేటి నుంచి జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారితో చర్చించారు. నీళ్లు, నిధులు, నియా మకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో నెరవేరని ప్రజల ఆకాంక్షల గురించి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిలదీస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోతే ప్రభుత్వ ప్రోగ్రెస్ రిపోర్టు ఎలా తెలుస్తుందని, ఇది సభ్యుల హక్కులను హరించడమేనని అన్నారు. కొత్త రాజ్యాంగం రాయాలంటున్న కేసీఆర్ ఇప్పుడు బడ్జెట్ సమావేశంలో గవర్నర్ ప్రసంగం లేకుండా రాజ్యాంగాన్ని చట్టవిరుద్ధంగా అమలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్: రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడు తూ కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే చివరి బడ్జెట్ ఇదేనని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది డిసెంబర్లో ప్రభుత్వం రద్దవుతుందని, మరో 12 నెలల్లో రాష్ట్రంలో సోనియా గాంధీ రాజ్యం వస్తుందని చెప్పారు. ప్రభు త్వ లోటుపాట్లను కాంగ్రెస్ నిలదీస్తుందనే దుర్మార్గపు ఆలోచనతోనే గవర్నర్ ప్రసంగం లేకుండా చేశారని ఆరోపించారు. అసెంబ్లీ లో తమ పార్టీ ఎమ్మెల్యేలను మాట్లాడకుం డా అడ్డుకుంటే రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగుతాయని హెచ్చరించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాల వంటివి దేశంలో ఎక్కడ అమలవుతున్నాయో చూపిస్తారా.. అని మంత్రి కేటీఆర్ చేసిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని, ఆయనకు 30 రోజుల సమయం ఇస్తున్నానని రేవంత్ చెప్పారు. నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసం గం లేకపోవడంపై పార్లమెంటులోనూ ప్రస్తావిస్తానని చెప్పారు. సమన్వయం ఏదీ : సంపత్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మాట్లాడు తూ పార్టీనేతల్లో సమన్వయం ఎక్కడుంద ని ప్రశ్నించారు. సీఎల్పీ సమావేశం పెట్టుకు ని పీసీసీ అధ్యక్షుడు వేరే జిల్లాలకు వెళ్లడమేంటని ప్రశ్నించిన సంపత్ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యాయత్నం ఘటనను పార్టీ పరంగా ఉపయోగించుకోలేకపోయా మని అభిప్రాయపడ్డారు. సమావేశానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి హాజ రు కాలేదు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తన నియోజకవర్గానికి వెళ్లి కూడా తనకు సమాచారం ఇవ్వలేదన్న కారణంతో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమావేశంలోంచి వెళ్లిపోయారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మె ల్యే ఈరవత్రి అనిల్ కూడా పార్టీ నేతల ఐక్యతపై మాట్లాడినట్టు సమాచారం. సమావేశానికి ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, పొదెం వీరయ్యలతో పాటు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, వి.హనుమంతరావు, చిన్నారెడ్డి, నాగం జనార్దనరెడ్డి, అంజన్‌కుమార్‌యాదవ్, డీసీసీ అధ్యక్షులు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ అనుబంధ సంఘాల చైర్మన్లు హాజరయ్యారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు: ఉత్తమ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జోస్యం చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సీఎల్పీ సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంతో పాటు మనకు కూడా ఎన్నికలు వస్తాయని చెప్పారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలందరూ హైదరాబాద్‌ను వదిలేసి నియోజకవర్గాలకు వెళ్లాలని, ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు. అయితే, రానున్న ఎన్నికల్లో తాను ఎక్కడ పోటీ చేసేది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేనని, తాను ఎక్కడ పోటీ చేయాలన్న విషయాన్ని సోనియాగాంధీ నిర్ణయిస్తారని ఉత్తమ్ అన్నారు. -
Jagga Reddy: కాంగ్రెస్‌లో సింగిల్ హీరో కుదరదు..
హైదరాబాద్: కాంగ్రెస్‌లో సింగిల్ హీరో కుదరదు.. ఒక్కడి ఇమేజ్ కోసం మిగతా వారిని తొక్కే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇది పార్టీనా లేదా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీనా? అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీలో చర్చించకుండా ముందే ప్రోగ్రాంలు ఫిక్స్ చేయడమేంటని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో అందరూ ఒకటే.. ఒక్కరే స్టార్ అనుకుంటే కుదరదని జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డికి పీసీసీ వస్తే .. నాకు సమాచారం ఇవ్వరా.. ఈ మాత్రం ప్రోటోకాల్ కూడా తెల్వదా అని ఎద్దేవా చేశారు. జగ్గారెడ్డికి , రేవంత్ రెడ్డికి విభేదాలు ఉన్నట్లు రేవంత్ పరోక్షంగా చెబుతున్నారా.. అని విమర్షించారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కాకముందు.. తాను మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యానని జగ్గారెడ్డి గుర్తు చేశారు. కాగా, సీఎల్పీ కార్యాలయంలో మరికొద్ది సేపట్లో కాంగ్రెస్ సభాపక్షం సమావేశంకానున్న నేపథ్యంలో ప్రస్తుత వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సీఏల్పీ నేత భట్టి విక్రమార్క ,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ,ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఇప్పటికే సీఎప్పీ కార్యాలయానికి చేరుకున్నారు. మీడియా పాయింట్ వద్ద.. రాజకీయాల్లో హీరోయిజం పనిచేయదు.. పార్టీలో జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తే సోషల్ మీడియా ద్వారా నాపై అసత్యప్రచారాలు చేస్తారా.. అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియా పాయింట్ దగ్గర మాట్లాడుతూ.. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యేను.. తనకు మాట్లాడటానికి అవకాశం ఎందుకు ఇవ్వలేదని గీతారెడ్డిని ప్రశ్నించారు. ఎవరి ఒత్తిడి మేరకు ఇలా ప్రవర్తించారో చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ మారాలంటే నాకు అడ్డు చెప్పేవారు ఎవరని అన్నారు. కాగా, ఎథిక్స్‌కి కట్టుబడి.. తాను కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీల నాయకత్వంలో పనిచేస్తున్నట్లు తెలిపారు. పార్టీలో నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలకు సరైన గౌరవంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే గ్రామస్థాయిలో వెళ్లి పనిచేయాలని అన్నారు. ఈ రాష్ట్రంలో నాకు అభిమానులున్నారు. కావాలంటే పార్టీ సపోర్ట్ లేకుండా 2 లక్షల మందితో సభ పెట్టి చూపిస్తానని జగ్గారెడ్డి సవాల్ విసిరారు. తప్పని పరిస్థితిలో మీడియా ముందు వచ్చి తన ఆవేదన వ్యక్తం చేస్తున్నానని జగ్గారెడ్డి అన్నారు. చదవండి: రెండోసారి ఢిల్లీకి సీఎం కేసీఆర్.. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ -
ప్రభుత్వ భూములు ఎవరూ కొనొద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమ్మేందుకు తలపెట్టిన ప్రభుత్వ భూములను కొనేందుకు ఎవరూ ముందుకు రావొద్దని కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఒకవేళ ఎవరైనా కొన్నా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత స్వాధీనం చేసుకుని పేదలకు ఇస్తామని చెప్పారు. ఓ వైపు ఇప్పటికే లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన సీఎం కేసీఆర్ ఇప్పుడు గత ప్రభుత్వాలు ఆస్తులుగా ఇచ్చిన ప్రభుత్వ భూములను కూడా అమ్మి రాష్ట్రాన్ని దివాళా తీయించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ భూముల అమ్మకాలపై చర్చించేందుకు ఆదివారం సీఎల్పీ అత్యవసరంగా సమావేశమైంది. జూమ్ ద్వారా వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు డి. శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సీతక్క, ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. అనారోగ్యం కారణంగా ఎమ్మెల్యే పొడెం వీరయ్య హాజరు కాలేదు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, భూముల అమ్మకాలపై సమావేశంలో చర్చించారు. ప్రభుత్వ భూములను అమ్మి నిధులను సమీకరించుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టిన సీఎల్పీ.. ఈ వ్యవహారంపై జిల్లాల వారీగా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించింది. ముందుగా గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయాలని, ఆ తర్వాత అమ్మాలని తలపెట్టిన భూములను సందర్శించి వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పాలని నిర్ణయించింది. అయినా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే వేలాన్ని అడ్డుకోవాలని నిర్ణయించింది. మనమే కాపాడుకోవాలి సీఎల్పీ సమావేశం అనంతరం భట్టి విక్రమార్క విలేకరులతో మాట్లాడుతూ ‘ఆస్తులు మనవి. రాష్ట్రం మనది. ఇక్కడి వనరులు ఇక్కడి ప్రజలకు ఉపయోగపడాలి కానీ అడ్డగోలుగా తెగనమ్ముకుంటుంటే చూస్తూ కూర్చోం. ఇక్కడి వనరులు ఇక్కడి ప్రజలకే చెందాలనే ఉద్దేశంతో సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో భూముల అమ్మకాలను వ్యతిరేకించిన కేసీఆర్ ఇప్పుడు భూములను అమ్మేందుకు యత్నిస్తున్నారు. అందుకే ఈ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ఒక ఉద్యమాన్ని చేపట్టబోతున్నాం’అని చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల కోట్లను అప్పుగా తెచ్చిందని, ఈ భారాన్ని భరించలేని స్థితిలో ఉండగా మళ్లీ ఆస్తులను అమ్మేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. అమ్మకానికి పెట్టిన భూములు, అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మియాపూర్ భూములు, నయీం అక్రమ భూములు ఎంత సురక్షితంగా ఉన్నాయో ప్రజలకు వివరించాలని కోరారు. నాది చిన్న పాత్ర టీపీసీసీ అధ్యక్ష ఎంపిక వ్యవహారంలో తనది చిన్న పాత్ర అని భట్టి అన్నారు. ఈ వ్యవహారాన్ని పూర్తిగా అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. సీఎల్పీ నాయకుడిగా తన పనితీరుపై సీనియర్ నేత వీహెచ్‌కు సొంత అభిప్రాయం ఉండడంలో తప్పేం లేదన్నారు. ఏదిఏమైనా అందరూ కాంగ్రెస్ జెండా కింద సోనియా, రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేయాల్సిందేనని స్పష్టంచేశారు. చదవండి: 290 కోట్ల భారీ కుంభకోణం.. 9 మంది అరెస్ట్ -
సీఎం అశోక్ గహ్లోత్ కీలక వ్యాఖ్యలు
-
‘అవసరమైతే రాష్ట్రపతి భవన్ ముందు ధర్నా’
జైపూర్: రాజస్తాన్‌లో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది. బల పరీక్ష నిరూపణ కోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిందిగా ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తన మద్దతుదారులతో కలిసి రాజ్‌భవన్ బయట ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే సమావేశాల నిర్వహణపై గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో శనివారం సీఎం నివాసంలో మరోసారి రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయ్యింది. అసెంబ్లీనిర్వహణకు సంబంధించిన అజెండాపై మంత్రులు చర్చించారు. శాసనసభ సమావేశాలు జరపాలని గవర్నర్‌కు కేబినెట్ విజ్ఞప్తి చేసింది. అంతకుముందు జైపూర్ ఫైర్‌మౌంట్ హోటల్లో సీఎల్పీ భేటీ నిర్వహించారు. ఎమ్మెల్యేలంతా ఐకమత్యంగా ఉండాలని గహ్లోత్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అవసరమైతే రాష్ట్రపతి భవన్ ముందు ధర్నాకు సిద్ధమన్నారు. ప్రభుత్వాన్ని కూల్చడంలో బీజేపీ సక్సెస్ అయితే.. తాము ప్రధాని కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. తమ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని.. ధైర్యంగా ఉండాలని శాసనసభ్యులకు తెలిపారు. 3 వారాలపాటు క్యాంప్‌లో ఉండాల్సి రావచ్చని అన్నారు. గవర్నర్‌తో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ భేటీ రెండోసారి వాయిదాపడింది. (రాజస్తాన్ సంక్షోభం : గెహ్లాత్‌కు చుక్కెదురు) -
‘మీ పోరాటాన్ని యావత్ భారత్ గమనిస్తోంది’
జైపూర్/ఢిల్లీ: ఎప్పటికైనా సత్యమే జయిస్తుందని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ వ్యాఖ్యానించారు. తమ ఎమ్మెల్యేలు పోరాడుతున్న తీరును యావత్ భారత్ గమనిస్తోందని చెప్పారు. తన ప్రభుత్వానికి మద్దతిస్తున్న ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మంగళవారం మరోసారి కాంగ్రెస్ శాసన సభా పక్ష (సీఎల్పీ) భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సత్యమే దైవం, దైవమే సత్యం. సత్యం మనతో ఉంది. అసమ్మతి వాదుల కుట్రల నుంచి ప్రభుత్వాన్ని, దాంతోపాటు ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు మీరు చేస్తున్న పోరాటాన్ని దేశ ప్రజలందరూ గౌరవిస్తున్నారు. మనమంతా సర్వశక్తిమంతంగా ఉన్నాం’అని పేర్కొన్నారు. ‘మీపై ఉన్నగౌరవం ఎన్నో రెట్లు పెరిగింది. ఇది సాదారణ విషయం కాదు. అసెంబ్లీని రద్దు చేసి, ఎన్నికలు జరగాలని కాంగ్రెస్ గానీ, బీజేపీ గానీ కోరుకోలేదు. కొందరి కుట్రల వల్లే ఈ పరిస్థితులు తలెత్తాయి. అయినప్పటికీ పోరాడి విజయం సాధిద్దాం’ అని అన్నారు. ఇదిలాఉండగా.. హోటల్లో తమను నిర్బంధిచారని భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) ఎమ్మెల్యే ఒకరు వారం క్రితం చెప్పడంతో గహ్లోత్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, బీటీపీ తర్వాత గహ్లోత్ ప్రభుత్వానికి స్పష్టమైన మద్దతు ప్రకటించడంతో ఆ విషయం అంతటితో ముగిసిపోయింది. ఈనేపథ్యంలోనే గహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలు అంత్యాక్షరీ ఆడినవి, యోగా ఫొటోలు, వంటలు నేర్చుకుంటున్న వీడియోలను విడుదల చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రజలు కరోనా వైరస్‌తో పోరాడుతుంటే సీఎం, ఎమ్మెల్యేలు పార్టీలు చేసుకుంటున్నారని బీజేపీ విమర్శలు చేస్తోంది. ఇక అసమ్మతి ఎమ్మెల్యేల అనర్హతపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు రాజస్తాన్ స్పీకర్‌ను నేడు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై వచ్చే శుక్రవారం (జులై 24) హైకోర్టు తీర్పు వెలువరించనుంది. (చదవండి: రాజస్తాన్: సచిన్ పైలట్‌కు హైకోర్టులో ఊరట) (అసమర్థుడు.. పనికిరాని వాడు! ) -
వీడని ఉత్కంఠ..
-
రాజస్తాన్: సచిన్ పైలట్ కీలక డిమాండ్
జైపూర్/ఢిల్లీ: రాజస్తాన్‌లో రాజకీయ ఉత్కంఠ వీడటం లేదు. అధిష్టానం విశ్వప్రయత్నాలు చేసినా ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పీసీసీ చీఫ్ సచిన్ పైలట్ పంతం వదలడం లేదు. మంగళవారం ఉదయం జరిగిన రెండో దఫా కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) భేటీకీ సచిన్ పైలట్, ఆయన వర్గం ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ నేతృత్వంలో పనిచేయలేమని, సీఎం పదవి మార్పు జరగాల్సిందేనని సచిన్ పైలట్ కీలక డిమాండ్ చేసినట్టు సమాచారం. ఇక సీఎం అశోక్ గహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలు బస చేస్తున్న జైపూర్‌లోని ఫైర్మంట్ హోటల్లోనే నేడు మరోసారి సీఎల్పీ సమావేశం జరిగింది. (చదవండి: ఎమ్మెల్యేల బలం చూపిస్తూ సచిన్ వీడియో!) అయితే, సీఎం క్యాంపులో 109 మంది ఎమ్మెల్యేలు లేరని, వారిలో 22 మంది మిస్సింగ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలోనే అశోక్ గహ్లోత్ వెంట 87 మంది మాత్రమే ఉన్నారని పైలట్ వర్గం నేతలు చెప్తున్నారు. గహ్లోత్ ప్రభుత్వంలో మైనారిటీలో ఉందని అంటున్నారు. అశోక్ గహ్లోత్‌కు బానిసత్వం చేయలేమని, సీఎంగా ఆయన తప్ప వేరేవరైనా సరేనని సచిన్ పైలట్ వర్గం నేతలు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ఇక ఆదివారం నాటి వాట్సాప్ మెసేజ్‌లో 30 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉందని చెప్పిన పైలట్ సోమవారం రాత్రి ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. గురుగ్రామ్‌లోని మానెసర్ హోటల్లో ఉన్న పైలట్ టీమ్‌లో దాదాపు 16 మంది ఎమ్మెల్యేలు కనిపించారు. (గహ్లోత్ గట్టెక్కినట్టే!) -
ఎమ్మెల్యేల బలం చూపిస్తూ సచిన్ వీడియో!
-
ఎమ్మెల్యేల బలం చూపిస్తూ సచిన్ వీడియో!
జైపూర్/ఢిల్లీ: అగ్రనేతల బుజ్జగింపులతో సచిన్ పైలట్ మెత్తబడ్డాడనే వార్తల్లో నిజమెంతో గానీ, అతని వెంట మాత్రం 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈమేరకు సచిన్ పైలట్ అధికారిక వాట్సాప్ గ్రూప్ నుంచి విడుదలైన వీడియో ద్వారా స్పష్టమవుతోంది. సోమవారం రాత్రి ఉన్న పైలట్ వర్గం గురుగ్రామ్‌లోని మానెసర్ హోటల్లో తమ క్యాంపు వీడియోను ట్విటర్లో పోస్టు చేసింది. 10 సెకండ్ల నిడివి గల ఈ వీడియోలో 16 మంది ఎమ్మెల్యేలు కనిపిస్తున్నారు. ఎమ్మెల్యేల్లో ఇంద్రా గుర్జార్, ముఖేష్ భాకర్, హరీష్ మీనా, పీఆర్ మీనాను గుర్తించొచ్చు. అయితే, సచిన్ వీడియోలో కనిపించలేదు. టూరిజం మినిస్టర్ విశ్వేంద్ర సింగ్ ఈ వీడియోను ట్వీట్ చేశారు. ఫ్యామిలీ అని క్యాప్షన్ పెట్టారు. లాదూన్ ఎమ్మెల్యే ముఖేష్ భాకర్ ట్వీట్ చేస్తూ.. ‘కాంగ్రెస్‌లో విధేయత అంటే అశోక్ గహ్లోత్ బానిసత్వంఅన్ని అన్నారు. అది మాకు ఆమోదయోగ్యం కాదు’అని పేర్కొన్నారు. ఇక సోమవారం మధ్యాహ్నం జరిగిన కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) భేటీకి సచిన్ పైలట్ వర్గం హాజరుకాని సంగతి తెలిసిందే. మరోవైపు సీఎల్పీ భేటీలో 106 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని కాంగ్రెస్ ప్రకటించగా.. దానిని పైలట్ వర్గం నేతలు తప్పుబట్టారు. మెజారిటీని అసెంబ్లీలో నిరూపించుకోవాలని, ఇంట్లో కాదని వ్యాఖ్యానించారు. అలాగే, పైలట్ బీజేపీలో చేరబోవడం లేదని వారు స్పష్టం చేశారు. 106 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే.. ఎమ్మెల్యేలను గవర్నర్ వద్దకు తీసుకువెళ్లాలి కానీ, రిసార్ట్‌కు కాదని పైలట్ వర్గం నేతలు ఎద్దేవా చేశారు. (చదవండి: గహ్లోత్ గట్టెక్కినట్టే!) నేడు మళ్లీ సీఎల్పీ.. సచిన్‌కు ఆహ్వానం కాంగ్రెస్ శాసనసభాపక్షం నేడు మరోసారి భేటీ కానుంది. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న హోటల్లోనే ఆ సమావేశం జరుగుతుందని సీనియర్‌నేత సూర్జెవాలా వెల్లడించారు. ఆ భేటీకి రావాలని, అన్ని అంశాలపై అక్కడ స్వేచ్ఛగా చర్చించుకోవచ్చని తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌కు సూచించారు. భేటీకి ఆహ్వానిస్తూ పైలట్‌కు, అసంతృప్త ఎమ్మెల్యేలకు లేఖలు పంపించామన్నారు. -
గహ్లోత్ గట్టెక్కినట్టే!
జైపూర్/న్యూఢిల్లీ: రాజస్తాన్ రాజకీయ సంక్షోభాన్ని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తట్టుకుని నిలిచినట్లే కనిపిస్తోంది. సోమవారం వేగంగా జరిగిన పరిణామాల్లో... గహ్లోత్ వెనక చాలినంత మంది ఎమ్మెల్యేలుండటం... సచిన్ పైలట్‌కు బాసటనిచ్చిన వారి సంఖ్య పలచనైపోవటం వంటివి కనిపించాయి. దీంతో అశోక్ గహ్లోత్ కాసింత కులాసాగా కనిపించారు. సీఎల్పీ సమావేశానంతరం ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలిస్తూ విజయ చిహ్నాన్ని కూడా చూపించారు. మరోవంక.. తిరుగుబాటు బావుటా ఎగరేసిన పీసీసీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ కూడా మెత్తబడ్డారని సమాచారం. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో పాటు పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా పైలట్‌తో చర్చించారని... గహ్లోత్‌పై ఫిర్యాదులేమైనా ఉంటే.. సానుకూలంగా పరిష్కరిస్తామని ఆయనకు హామీ ఇచ్చారని సమాచారం. సీనియర్ నేతలు చిదంబరం, అహ్మద్ పటేల్, కేసీ వేణు గోపాల్ కూడా పైలట్‌తో మాట్లాడటంతో ఆయన కాస్త మెత్తబడ్డారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎల్పీ భేటీకి 106 మంది? రాజస్తాన్‌లో ప్రభుత్వాన్ని కూల్చే కుట్రకు సంబంధించి స్టేట్మెంట్ కావాలంటూ రాజస్తాన్ పోలీస్ విభాగం తనకు నోటీసులివ్వటంతో పైలట్ ఆగ్రహం చెంది సీఎం గహ్లోత్‌పై తిరుగుబాటు చేయడం తెలిసిందే. తదనంతర పరిణామాల్లో తన వెంట 30 మంది ఎమ్మెల్యేలున్నారని కూడా ప్రకటించారాయన. ఈ నేపథ్యంలో ఉదయం జైపూర్‌లో కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్పీ) భేటీ అయింది. దీనికి ఎందరు హాజరయ్యారన్నది స్పష్టంగా తెలియకపోయినా... 106 మంది వరకూ వచ్చినట్లు సీఎల్పీ ప్రకటించింది. అంటే ఒక్క సచిన్ పైలట్ మినహా అందరూ తమతోనే ఉన్నారనే సంకేతాలిచ్చే ప్రయత్నం చేసింది. అయితే దీనికి హాజరైన వారిలో కాంగ్రెస్ సభ్యులే కాక సర్కారుకు మద్దతిస్తున్న ఇతర పార్టీల వారూ ఉన్నట్లు సీఎల్పీ వర్గాలు చెప్పాయి. మొత్తానికి ఈ భేటీకి హాజరైన ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రి గహ్లోత్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాక ప్రభుత్వాన్ని, పార్టీని బలహీన పర్చేందుకు ప్రయత్నించే సీఎల్పీ సభ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. పైలట్ పేరును ప్రస్తావించకుండా.. ఓ తీర్మానాన్ని సైతం ఆమోదించారు. ‘సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంపై సీఎల్పీ సంపూర్ణ విశ్వాసం ప్రకటిస్తోంది. ముఖ్యమంత్రిగా గహ్లోత్ నాయకత్వాన్ని ఏకగ్రీవంగా సమర్ధిస్తోంది’అని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందంటూ బీజేపీపై ఆ తీర్మానంలో ధ్వజమెత్తారు. అనంతరం, ఎమ్మెల్యేలను అక్కడి నుంచి నేరుగా జైపూర్ దగ్గర్లోని ఫెయిర్మాంట్ రిసార్ట్‌కు తరలించారు. వారితో పాటు సీఎం గహ్లోత్ కూడా అక్కడికి వెళ్లారు. తన ప్రభుత్వానికి ఢోకా లేదని, మెజారిటీ ఎమ్మెల్యేలు తన వైపే ఉన్నారని ఈ సందర్భంగా గహ్లోత్ చెప్పారు. విశ్వాసం కోల్పోయింది రాజస్తాన్‌లో అశోక్ గహ్లోత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోయిందని, ఆ పార్టీ ఇక అధికారంలో కొనసాగకూడదని బీజేపీ డిమాండ్ చేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా సచిన్ పైలట్‌కు బయటి నుంచి మద్దతు ఇస్తారా? అని రాజస్తాన్ బీజేపీ చీఫ్ సతీశ్ పూనియాను ప్రశ్నించగా.. అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని, స్థానిక పరిస్థితులను బేరీజు వేస్తూ.. పార్టీ కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్‌లో సమర్ధులైన యువ నాయకులను ఎప్పుడూ నిర్లక్ష్యం చేస్తుంటారని వ్యాఖ్యానించారు. మెజారిటీని చూపాల్సింది అసెంబ్లీలో.. ఇంట్లో కాదు! సీఎల్పీ భేటీ నిర్వహించి, మెజారిటీ సభ్యుల మద్దతుందని సీఎం గహ్లోత్ పేర్కొనడంపై పైలట్ వర్గం స్పందించింది. మెజారిటీని అసెంబ్లీలో నిరూపించుకోవాలని, ఇంట్లో కాదని వ్యాఖ్యానించింది. అలాగే, పైలట్ బీజేపీలో చేరబోవడం లేదని స్పష్టం చేసింది. 106 మంది ఎమ్మెల్యేల మద్దతుందని గహ్లోత్ వర్గ నేతలు చెప్పడాన్ని పైలట్‌కు సన్నిహితులైన పార్టీ నేతలు తప్పుబట్టారు. మెజారిటీ ఉంటే.. ఎమ్మెల్యేలను గవర్నర్ వద్దకు తీసుకువెళ్లాలి కానీ, రిసార్ట్‌కు కాదని ఎద్దేవా చేశారు. నేడు మళ్లీ సీఎల్పీ కాంగ్రెస్ శాసనసభాపక్షం నేడు మరోసారి భేటీ కానుంది. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న హోటల్లోనే ఆ సమావేశం జరుగుతుందని సీనియర్‌నేత సూర్జెవాలా వెల్లడించారు. ఆ భేటీకి రావాలని, అన్ని అంశాలపై అక్కడ స్వేచ్ఛగా చర్చించుకోవచ్చని తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌కు సూచించారు. భేటీకి ఆహ్వానిస్తూ పైలట్‌కు, అసంతృప్త ఎమ్మెల్యేలకు లేఖలు పంపించామన్నారు. పైలట్ వెనుక ఎందరు? 200 మంది సభ్యులున్న రాజస్తాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ సొంత బలం 107. స్వతంత్రులు 13 మంది, సీపీఎం–2 కలిపితే ఇప్పటిదాకా 122 మంది మద్దతుంది. 72 మంది సభ్యులున్న బీజేపీకి ఆరెల్పీ, ఆరెల్డీ నుంచి నలుగురి మద్దతుంది. ఇద్దరు బీటీపీ ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి తటస్థంగా ఉన్నారు. సోమవారం నాటి సమావేశానికి సచిన్ పైలట్‌తో పాటు ఆయనకు సన్నిహితులైన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. అయితే వీరి సంఖ్య 10 కూడా ఉండదని, కాబట్టి గహ్లోత్ సర్కారుకు ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదని సీఎల్పీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు జైపూర్‌లో సీఎల్పీ భేటీకి కొన్ని గంటల ముందు కాంగ్రెస్ నేతలు రాజీవ్ అరోరా, ధర్మేంద్ర రాథోడ్‌లకు సంబంధమున్న పలు వాణిజ్య సంస్థలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. జైపూర్, ఢిల్లీ, ముంబై, కోట నగరాల్లోని ఆయా సంస్థల కార్యాలయాల్లో పన్ను ఎగవేత కేసులకు సంబంధించి ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. జైపూర్‌లోని ఆమ్రపాలి జ్యువెలర్స్ షోరూమ్‌లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సంస్థ రాజస్తాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాజీవ్ అరోరాకు చెందినదిగా తెలుస్తోంది. ఇదంతా బీజేపీ కుట్ర అని కాంగ్రెస్ ఆరోపించింది. ఐటీ, ఈడీ, సీబీఐ బీజేపీ అనుబంధ విభాగాలుగా మారాయని రణ్‌దీప్ సూర్జేవాలా విమర్శించారు. -
రాజస్తాన్: సీఎల్పీ భేటీకి ఎమ్మెల్యేలు
జైపూర్/ఢిల్లీ: రాజస్తాన్‌లో రాజకీయం రసకందాయంలో పడింది. జైపూర్‌లో జరిగే కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) భేటీలో పాల్గొనేది లేదని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పీసీసీ చీఫ్ సచిన్ పైలట్ మరోసారి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ మాటలు అబద్ధమని అన్నారు. తన వెంట 25 మంది ఎమ్మెల్యేలు ఉంటే.. గహ్లోత్‌కు 102 ఎమ్మెల్యేల మద్దతు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. గహ్లోత్ ప్రభుత్వం మైనారిటీలో ఉందని సచిన్ వెల్లడించారు. అంతకుముందు సీఎల్పీ భేటీలో పాల్గొనేందుకు 102 మంది ఎమ్మెల్యేలు సీఎం అశోక్ గహ్లోత్ నివాసానికి చేరుకున్నారని కాంగ్రెస్ తెలిపింది. రాజస్తాన్‌లో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రణదీప్ సుర్జేవాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి కాలం పాలన సాగిస్తుందని ఆకాక్షించారు. కాషాయదళం ఎత్తులు సాగనీయమని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో విభేదాలు తలెత్తితో అంతర్గతంగా చర్చించి పరిష్కరించుకోవాలని సుర్జేవాలా సూచించారు. సచిన్ పైలట్‌కు కాంగ్రెస్‌లో ఇప్పటికీ ద్వారాలు తెరిచే ఉన్నాయని, ఆయన వెనక్కి తిరిగి రావాలని కోరారు. కాగా, తొలుత సోమవారం ఉదయం 10.30 గంటలకు అనుకున్న సీఎల్పీ భేటీని మధ్యాహ్నానానికి వాయిదా వేశారు. కాగా, 200 మంది సభ్యులున్న రాజస్తాన్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ప్రస్తుతం 107 మంది, బీజేపీకి 72 మంది సభ్యులున్నారు. రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతిస్తున్నారు. 13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నారు. అయితే, సీఎల్పీ భేటీ అనంతరం రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. (చదవండి: ‘సచిన్ పైలట్ కార్యాలయం మూసివేత)