cm camp office
-
Yogi Vemana: సీఎం జగన్ పుష్పాంజలి
సాక్షి, గుంటూరు: సమాజంలో రుగ్మతలను చీల్చి చెండాడిన సంఘసంస్కర్త, కవి మహాయోగి వేమన. ఇవాళ ఆయన జయంతి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. -
సంబరంగా సంక్రాంతి వేడుక
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సంప్రదాయ పంచెకట్టుతో సతీసమేతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గంగిరెద్దులకు సారెను సమర్పించడం, భోగిమంటలు, గోశాలలోని గోవులకు ప్రత్యేక పూజలు, హరిదాసుల కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల సంక్రాంతి నృత్యాలతో వేడుకలు కన్నులపండువగా జరిగాయి. సీఎం క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న గోశాలను చక్కగా పల్లెటూరు వాతావరణం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. నవరత్నాలతో ముఖ్యమంత్రి ప్రతిఇంటికీ సంక్షేమ ఫలాలను అందించిన నేపథ్యంలో గ్రామ సచివాలయం, రైతుభరోసా కేంద్రం, మెడికల్ కాలేజీ, నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా తీర్చిదిద్ధిన స్కూల్ భవనం, పాల కేంద్రం నమూనాలు వంటి ప్రభుత్వ ప్రాధాన్యతలను తెలియజేస్తూ.. ముత్యాల ముగ్గులు, రంగురంగుల రంగవల్లులు, గొబ్బెమ్మలు, గాలిపటాలు, ధాన్యాగారాలు, గడ్డివాములు, ఎడ్లబండ్లు ఇలా అచ్చం అసలు సిసలైన గ్రామీణ వాతావరణ ప్రతిబింబించేలా, మన సంస్కృతి సంప్రదాయాలు వెల్లివిరిసేలా.. ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి నేతృత్వంలో గ్రామ స్వరాజ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. సీఎం దంపతులను మంత్రముగ్థుల్ని చేసేలా ఆ ప్రాంతం శోభాయమానంగా అలంకరించారు. ప్రాంగణంలోకి ప్రవేశించే ముందు ఏర్పాటుచేసిన శిలాతోరణం అందరినీ ఆకట్టుకుంది. సీఎం క్యాంపు కార్యాలయంలో భోగి మంటలు వెలిగిస్తున్న సీఎం వైఎస్ జగన్ దంపతులు ఆద్యంతం ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. ఇక ఈ కార్యక్రమానికి సంప్రదాయ దుస్తులతో హాజరైన సీఎం జగన్ దంపతులను వేదపండితులు నుదుట తిలకం దిద్ది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం.. వారిరువురూ భోగి మంటలను వెలిగించి సంక్రాంతి సంబరాలను లాంఛనంగా ప్రారంభించారు. హరిదాసుకు స్వయంపాకం, సారె సమర్పించారు. అలాగే, గోశాలలోని గోవులకు పూజచేసి వాటిని నిమురుతూ కొద్దిసేపు అక్కడ గడిపారు. గంగిరెద్దులకు, తులసి చెట్టుకు పూజలు చేశారు. గ్రామీణ సంక్రాంతి వేడుకల్లో ప్రధానంగా కనిపించే వివిధ కళాకారులను సీఎం ఆప్యాయంగా పలకరించారు. అంతేకాక.. తెలుగింటి సంక్రాంతి పిండివంటలను ముఖ్యమంత్రి దంపతులు రుచి చూశారు. అనంతరం.. కలియుగ దైవమైన శ్రీహరికి పూజలు నిర్వహించటం, సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించేందుకు ఏర్పాటుచేసిన వందేళ్ల క్రితం నాటి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ నమూనా ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. అక్కడ వైఎస్సార్ విగ్రహానికి సీఎం జగన్ దంపతులు పూలమాల వేసి నివాళులరి్పంచారు. అనంతరం.. అక్కడున్న మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులను పలకరిస్తూ ముందుకు కదిలారు. తొలుత.. కాణిపాక వినాయక విగ్రహానికి సీఎం జగన్ దంపతులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. తర్వాత.. కనకదుర్గమ్మకు.. అనంతరం శ్రీ వేంకటేశ్వరుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, వేదపండితుల ఆశీర్వాదం స్వీకరించారు. ఈ సందర్భంగా వేదపండితులు సీఎంకు కంకణం కట్టగా.. వేదపండితులు అందించిన మరో కంకణాన్ని భారతమ్మకు ముఖ్యమంత్రి జగన్ కట్టారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు.. ప్రముఖ సినీ నేపథ్యగాయని గోపిక పూర్ణిమ, ప్రముఖ గాయని శ్రీలలిత పాటల కార్యక్రమం శ్రవణపేయంగా సాగింది. అలాగే, సినీ రంగానికి చెందిన ప్రముఖ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ రాఘవ, కౌండిన్య, మెహర్, మానస్, చందు, రమేష్, హరేరాము, మహేష్, భాను తదితరుల లైవ్ పెర్ఫామెన్స్.. ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారులు రిత్విక్ వెంకట్, చార్మి, చిన్నారి కేతనరెడ్డి నాట్య ప్రదర్శన.. నీలకంఠం మిమిక్రీ, ప్రముఖ కొరియోగ్రాఫర్ ఉదయ్ బృందంచే సంక్రాంతి ప్రత్యేక గీతాల నృత్యం, మాస్టర్ భువనేష్ ప్రత్యేక గీతాలు.. వీటితో పాటు ప్రముఖ సినీగేయ రచయిత, సంగీత దర్శకులు విశ్వ.. ప్రముఖ సినీ మరియు ప్రజా గేయ రచయిత మిట్టపల్లి సురేందర్, ప్రజా రచయితలు మానుకోట ప్రసాద్, మాట్ల తిరుపతి, గాయకులు గద్దర్ నర్సిరెడ్డి, తేలు విజయల కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కృష్ణవేణి మల్లావఝుల వ్యవహరించారు. చివర్లో వీరందరిని సీఎం జగన్ దంపతులు సత్కరించి, మెమొంటోలు అందజేశారు. అంతేకాక.. ప్రాంగణంలో ఉన్న అందరితో సీఎం జగన్ దంపతులు ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు కొట్టు సత్యనారాయణ, నారాయణ స్వామి, మంత్రి ఆదిమూలపు సురేష్, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చెవిరెడ్డికి సీఎం అభినందనలు.. ఇదిలా ఉంటే.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రతిబింబించేలా.. తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలా.. చక్కని ఏర్పాట్లతో, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో సంక్రాంతి సంబరాలు నిర్వహించిన ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డిని సీఎం జగన్ ప్రత్యేకంగా అభినందించారు. విజయానందాలతో అడుగులు ముందుకేయాలి.. సీఎం జగన్ ట్వీట్ ఊరూ వాడా ఒక్కటై.. బంధుమిత్రులు ఏకమై.. అంబరమంత సంబరంగా జరుపుకునే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. భోగి మంటల సాక్షిగా చెడును దహనం చేసి.. సంతోషాల కాంతిని ఇంటి నిండా నింపుకుని.. సుఖ సంతోషాలతో.. విజయానందాలతో ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అంటూ ఆదివారం ‘ఎక్స్’ (ట్విట్టర్)లో తెలిపారు. -
సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో సంక్రాంతి వేడుకలు
-
తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్‌గా ఎంసీఆర్హెచ్ఆర్డీ?
సాక్షి, హైదరాబాద్: ఎంసీఆర్హెచ్ఆర్డీ భవనం త్వరలో తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్‌గా మారనున్నట్లు సమాచారం. ఎంసీఆర్హెచ్ఆర్డీకి సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా వెళ్లి పరిశీలించారు. సీఎం అధికారిక భవనంగా ఉన్న ప్రగతి భవన్‌ను ప్రజా భవన్‌గా మార్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నివాసంలోనే ఉంటున్నారు. ప్రగతి భవన్నుప్రజాభవన్గా మారుస్తున్నట్లు, అక్కడే ప్రజాదర్బార్ నిర్వహించనున్నట్లు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రజాభవన్‌గా మారిన ప్రగతి భవన్ ఎదుట సుదీర్ఘకాలంగా ఉన్న ఇనుప కంచెను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో ఈ చర్యలు తీసుకున్నారు. -
కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్
-
విశాఖలో సీఎం క్యాంపు ఆఫీసు భవనాలు గుర్తింపు
సాక్షి, అమరావతి: విశాఖలో సీఎం క్యాంపు ఆఫీసు కోసం గుర్తించిన వివిధ భవనాల వివరాలను అధికారుల కమిటీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తెలిపింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి పర్యవేక్షణ, సమీక్ష సమావేశాల నిర్వహణకు విశాఖలో క్యాంపు కార్యాలయం చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో విశాఖలో గుర్తించిన భవనాల వివరాలను సీఎం వైఎస్ జగన్‌కు కమిటీ వివరించింది. రాష్ట్ర ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు సహా, ఇతర అధికారులు తమ కార్యకలాపాలు నిర్వహించడానికి అవసరమైన భవనాలను కూడా గుర్తించామని అధికారుల కమిటీ సీఎంకు తెలిపింది. విశాఖలో ఇప్పటికే వివిధ ప్రభుత్వ విభాగాలు, వాటి కార్యాలయాలు 2,27,287 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయని కమిటీ గుర్తించింది. వీటిలో సీనియర్ అధికారులకు అవసరమైన క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. వారి వసతికి కూడా ఆయా విభాగాల పరిధిలో ఉన్నవాటిని వినియోగించుకోవచ్చని వెల్లడించింది. ఐటీ హిల్‌పై ఉన్న మిలీనియం టవర్‌లో అందుబాటులో ఉన్న 1,75,516 అడుగుల విస్తీర్ణంలో మిగిలిన సీనియర్ అధికారులు క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొంది. ఇంకా కొంతమంది అధికారుల కోసం, వారి కార్యాలయాల కోసం మరికొన్ని ప్రైవేటు భవనాలను గుర్తించామని సీఎం వైఎస్ జగన్‌కు వివరించింది. ఈ మేరకు 3,98,600 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని గుర్తించామని తెలిపింది. ప్రభుత్వంలోని సీనియర్ అధికారుల కార్యకలాపాలు, వారి వసతి కోసం ప్రభుత్వ భవనాలు, ప్రైవేటు భవనాల్లో మొత్తం 8,01,403 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని గుర్తించామని చెప్పింది. ముఖ్యమంత్రి కోసం ఐదు రకాల భవనాలు.. కాగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, వసతి కోసం ఐదు రకాల భవనాలను గుర్తించినట్టు కమిటీ వెల్లడించింది. ఆంధ్రా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఓపెన్ వర్సిటీ బ్లాకులు, సిరిపురంలోని వీఎంఆర్డీఏ భవనాలు, మిలీనియం ఎ–టవర్, మిలీనియం బి–టవర్, రుషికొండలోని టూరిజం రిసార్టులను గుర్తించామని వివరించింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, వసతి, అధికారులతో సమావేశాల కోసం సరిపడా గదులు, భద్రతా సిబ్బంది ఉండేందుకు సదుపాయాలు, ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని కమిటీ తెలిపింది. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా, పౌరులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా, ముఖ్యమంత్రికి భద్రత తదితర అంశాలను పరిగణన లోకి తీసుకుంటున్నామని స్పష్టం చేసింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి రాకపోకల సమయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ట్రాఫిక్ సమస్య లేకుండా చూశామని తెలిపింది. అదే సమయంలో సౌలభ్యతను కూడా దృష్టిలో ఉంచుకున్నామని చెప్పింది. రుషికొండ రిసార్టులు అనుకూలం.. ట్రాఫిక్ దృష్ట్యా, యూనివర్సిటీ అకడమిక్ కార్యకలాపాలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో యూనివర్సిటీ భవనాలను పరిగణనలోకి తీసుకోలేదని కమిటీ వెల్లడించింది. అలాగే వీఎంఆర్డీఏ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున రద్దీ ఉంటుందని, చుట్టూ పెద్ద ఎత్తున వ్యాపార సంస్థలు ఉన్నందున భద్రతాపరంగా ఇబ్బంది ఉందని తెలిపింది. సీఎం క్యాంపు కార్యాలయం ఇక్కడ పెడితే వారందరికీ ఇబ్బందులు వస్తాయని, అధికారులకు సరైన వసతి కూడా దీనికి సమీపంలో లేదని వెల్లడించింది. అలాగే మిలీనియం టవర్‌లో ఒక దాంట్లో ఇప్పటికే కొన్ని కంపెనీలు నడుస్తున్నాయని, రెండో టవర్ కూడా ఆఫీసుకు సరిపోయినా, సీఎం వసతికి సరిపోదని, భద్రతా కారణాల వల్ల కూడా అంత అనుకూలత లేదని తేల్చింది. రుషికొండ వద్ద నిర్మించిన రిసార్టుల కోసం నిర్మించిన భవనాలు సీఎం క్యాంపు కార్యాలయం కోసం అత్యంత అనుకూలంగా ఉన్నాయని అధికారుల కమిటీ నిర్ధారించింది. వీఐపీల రాకపోకల వల్ల పౌరులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా, నగరంలో ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఈ భవనాలు ఉన్నాయని, పార్కింగ్, ఆఫీసు, వసతి, భద్రతా సిబ్బందికి, సీఎం సెక్రటరీల కార్యకలాపాలకు, ఈ భవనాలు సరిపోతాయని సూచించింది. అలాగే హెలిప్యాడ్ కూడా సమీపంలోనే ఉందని, దీనివల్ల నగరంలో ట్రాఫిక్‌కు, పౌరులకు కూడా ఎలాంటి ఇబ్బందిలేకుండా ఉంటుందని వెల్లడించింది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని నివేదికను ఖరారుచేస్తున్నామని అధికారుల కమిటీ తెలిపింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు శ్రీలక్ష్మి, షంషేర్‌సింగ్ రావత్, జీఏడీ సర్విసులు, హెచ్ఆర్ సెక్రటరీ పోలా భాస్కర్, సీఎంఓ అధికారులు.. పూనం మాలకొండయ్య, ధనుంజయరెడ్డి, ముత్యాలరాజు పాల్గొన్నారు. -
కొబ్బరి నీళ్లు పంచినా అభ్యంతరమేనట!?
హైదరాబాద్: ఎన్నికల సంఘం అధికారులు డబ్బులు పట్టుకుంటున్నారు.. నగలు పట్టుకుంటున్నారు.. బంగారం పట్టుకుంటున్నారు.. తాజాగా ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి నిస్సహాయులకు, రోడ్లపై విధులు నిర్వర్తించే పోలీసులకు కొబ్బరి నీళ్లు పంచుతుండగా అభ్యంతరం చెప్పిన ఘటన చర్చనీయాంశమైంది. రహదారులపై విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల దప్పిక తీర్చడం కూడా తప్పేనా? ఇవేం రూల్స్ అంటూ ఆ మహిళా ప్రతినిధి నిట్టూరుస్తూ వెళ్లిపోవడం గమనార్హం. వివరాలు ఇలా ఉన్నాయి. సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద శుక్రవారం ఉదయం 11.30 గంటల సమయంలో లయన్స్ క్లబ్ ప్రతినిధి డాక్టర్ విజయలక్ష్మి రోడ్లపై విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు కొబ్బరినీళ్ల సీసాలను అందిస్తున్నారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఫ్లయింగ్ స్క్వాడ్ ఎన్నికల అధికారులు ఆమె వాహనాన్ని ఆపి ‘ఏం పంపిణీ చేస్తున్నారు’? అని ప్రశ్నించారు. ఆమె చెప్పిన జవాబు విన్న అధికారులు ఎన్నికల సమయంలో అవేవీ కుదరవమ్మా అంటూ హితవు పలి కారు. మంచినీళ్లు ఇవ్వాలన్నా, అన్నదానాలు చేయాలన్నా, కొబ్బరినీళ్లు పంచాలన్నా ఎన్నికల సంఘం నుంచి అనుమతులు తీసుకోవాలంటూ చెప్పడంతో ఆమె అవాక్కయ్యారు. తాను 15 ఏళ్ల నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని.. ఇవేం దిక్కుమాలిన రూల్స్ అంటూ కారెక్కి వెళ్లిపోయారు. -
విశాఖలోనూ సీఎం క్యాంపు కార్యాలయం
సాక్షి, అమరావతి: విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన ఎప్పుడు మొదలవుతుందనే అంశంపై కొంత కాలంగా సాగుతున్న చర్చకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెరదించారు. విశాఖపట్నంలోనూ సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసి, దసరా నుంచి పరిపాలన ప్రారంభిద్దామని మంత్రులకు స్పష్టం చేశారు. సీఎం కార్యాలయం మొదలు వివిధ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలను గుర్తించేందుకు అధికారులతో ఒక కమిటీ వేస్తామని చెప్పారు. ఇక్కడి నుంచి విశాఖపట్నంకు కార్యాలయాల తరలింపునకు అధికారులతో మరో కమిటీ వేస్తామన్నారు. దసరాలోగా కార్యాలయాలను తరలించి.. పండుగ రోజునే విశాఖ కేంద్రంగా పరిపాలన మొదలు పెడతామని చెప్పారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో బుధవారం సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. అజెండాలోని అంశాలపై చర్చ ముగిశాక సమావేశం నుంచి అధికారులు నిష్క్రమించారు. ఆ తర్వాత మంత్రులతో సీఎం వైఎస్ జగన్ సమకాలీన రాజకీయ పరిస్థితులపై చర్చించారు. దసరా పండుగను విశాఖపట్నంలోనే జరుపుకుందామని మంత్రులతో సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఆ రోజు నుంచి విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన మొదలు పెడతామనడంతో మంత్రులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. చంద్రబాబు అక్రమాలను సాక్ష్యాధారాలతో వివరిద్దాం స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్టు చేయడంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. గురువారం నుంచి నిర్వహిస్తున్న శాసనసభ సమావేశాలను సీరియస్‌గా తీసుకోవాలని మంత్రులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. శాసనసభ వేదికగా అవసరమైతే టీడీపీ సర్కార్ హయాంలో చంద్రబాబు పాల్పడిన అక్రమాలపై.. స్కిల్ స్కామ్ నుంచి ఫైబర్ గ్రిడ్ కుంభకోణం వరకు అన్నింటిపై చర్చిద్దామన్నారు. టీడీపీ సభ్యులు శాసనసభ సమావేశాలకు హాజరవుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వ అక్రమాలను సాక్ష్యాధారాలతోసహా ప్రజలకు వివరించడానికి సమావేశాలను ఉపయోగించుకుందామని ఉద్భోదించారు. కేంద్ర ప్రభుత్వం కొంత కాలంగా ప్రతిపాదిస్తున్న వన్ నేషన్.. వన్ ఎలక్షన్ విధానాన్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి మంత్రులు తీసుకెళ్లగా.. జమిలి ఎన్నికలపై కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దామన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చిన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందామని పిలుపునిచ్చారు. ఎన్నికలకు మరో ఐదు నెలలు మాత్రమే సమయం ఉందనే అంశాన్ని మంత్రులకు సీఎం గుర్తు చేస్తూ.. ప్రజల్లో విస్తృతంగా తిరగాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ 52 నెలలుగా మనం చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించాలని.. అదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు పాల్పడిన అక్రమాలను కళ్లకు కట్టినట్లు వివరించి.. ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలన్నారు. సీఎం ఎక్కడి నుంచి పాలిస్తే అదే రాజధాని దసరా నుంచి విశాఖపట్నం నుంచి పరిపాలన మొదలు పెడదామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. సీఎం ఎక్కడి నుంచి పరిపాలిస్తే అదే రాజధాని. వికేంద్రీకరణతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమన్నది మా విధానం. విశాఖపట్నంలో సీఎం కార్యాలయం నుంచి వివిధ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు తగిన భవనాలను గుర్తించేందుకు అధికారులతో కమిటీ వేస్తామని సీఎం చెప్పారు. దసరా నుంచి విశాఖే పరిపాలన రాజధాని. – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల శాఖ మంత్రి. -
పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం
-
ఫ్యామిలీ డాక్టర్‌తో కోటి మందికిపైగా సేవలు
సాక్షి, గుంటూరు: వైద్య, ఆరోగ్యశాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి విడదల రజిని, ఉన్నతాధికారులు, పలువురు ఆయా విభాగాల అధికారులు హాజరయ్యారు. సమీక్ష సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ► ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవినీతికి చోటు ఉండకూడదు. ఫిర్యాదు చేయడానికి టెలిఫోన్ నంబర్ ప్రతిచోటా ఉంచాలి. అలాగే సమర్థవంతమైన ఎస్ఓపీలను పెట్టాలి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలి. పీహెచ్‌సీలు, విలేజ్ క్లినిక్‌ల పనితీరు ఇందులో కీలకం. ప్రివెంటివ్ కేర్‌లో మనం ఆశించిన లక్ష్యాలను అప్పుడే సాధించగలం. ► వైద్య ఆరోగ్యశాఖలో రిక్రూట్మెంట్ వ్యవస్ధ సమర్థవంతంగా పనిచేయాలి. ఒక ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీచేయాలి. ఎక్కడా కూడా సిబ్బంది కొరత అన్నది ఉండకూడదు. నాలుగు వారాలకు మించి.. ఎక్కడా ఏ ఖాళీ కూడా ఉండకూడదు. అధికారుల వివరణ ► కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చాం. ఫస్ట్‌ఎయిడ్, స్నేక్ బైట్, ఐవీ ఇన్ఫ్యూజన్, ఇంజక్షన్, వూండ్ కేర్, డ్రస్సింగ్, బేసిక్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ లాంటి అంశాల్లో వారికి శిక్షణ పూర్తయ్యింది. ► అక్టోబరు22న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకూ 1,39,97,189 మందికి సేవలు అందించాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా సేవలందుకున్నవారిలో 35,79,569 మంది హైపర్ టెన్షన్‌తో, 24,31,934 డయాబెటిస్తో బాధపడతున్నట్టు గుర్తింపు. ► వాళ్లందరికి మంచి వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. పేషెంట్‌కు చికిత్స అందించడంతోపాటు.. వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాలన్నారు. విలేజ్ క్లినిక్ స్ధాయిలో కంటి పరీక్షలు క్రమం తప్పకుండా కూడా చేయాలన్నారు. సికిల్ సెల్ ఎనీమియాను నివారించే కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష సికిల్ సెల్ ఎనీమియా నివారణ కార్యక్రమంలో భాగంగా.. ఈ ఏడాది 6.68 లక్షలమందికి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు సీఎం జగన్ వద్ద ప్రస్తావించారు. ఈ నెలలోనే అల్లూరిసీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పరీక్షలు ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. ఓరల్ హెల్త్‌లో భాగంగా ప్రతినెలా కూడా దంత వైద్యులు పీహెచ్‌సీలను సందర్శించేలా చర్యలు తీసుకున్నామన్నారు అధికారులు. ► టీబీ నివారణపైనా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు వెల్లడించిన అధికారులు. ప్రస్తుతం లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయిస్తున్నామని వెల్లడి. అందరికీ పరీక్షలు చేయడంద్వారా బాధితుల్ని గుర్తించి.. వారికి మంచి చికిత్స అందించే చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేయాలని సీఎం జగన్ అధికారులతో చెప్పారు. ► ప్రతి కుటుంబంలో పుట్టే బిడ్డ దగ్గరనుంచి ప్రతి ఒక్కరికీ కూడా ఆరోగ్యశ్రీకార్డు ఇవ్వాలని సీఎం జగన్ అధికారుల్ని ఆదేశించారు. క్యూ ఆర్ కోడ్ ఉన్న ఈ కార్డు ద్వారా వారి ఆరోగ్యవివరాలను నమోదు చేయాలన్నారు. మెడికల్ కాలేజీలపైనా సీఎం సమీక్ష. ఈ విద్యాసంవత్సంలోనే ప్రారంభం కానున్న కొత్త మెడికల్ కాలేజీల్లో మౌలికసదుపాయాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. మెడికల్ కాలేజీలు చరిత్రలో నిలిచిపోయే నిర్మాణాలని, ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కొత్త మెడికల్ కాలేజీల్లో ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి. అలాగే.. పాడేరు, పులివెందుల, ఆదోని కొత్త మెడికల్ కాలేజీల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు మొదలవుతాయి. మిగిలిన కాలేజీల్లో కూడా పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించిన అధికారులు. -
స్కూళ్లకు వచ్చే విద్యార్ధులపై నిరంతరం ట్రాకింగ్ ఉండాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ ఎంవీ శేషగిరిబాబు, పాఠశాల విద్యాశాఖ (మౌలికవసతులు) కమిషనర్ కాటమనేని భాస్కర్ సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. స్కూళ్లుకు వచ్చే విద్యార్ధులపై నిరంతరం ట్రాకింగ్ ఉండాలి సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థతో క్షేత్రస్ధాయిలో విద్యాశాఖ ఇప్పటికే సినర్జీతో ఉంది దీన్ని మరింత సమర్ధవంతంగా వాడుకోవాలి పిల్లలు పాఠశాలకు రాని పక్షంలో తల్లిదండ్రులకు మెసేజ్ వెళ్తుంది అయినా పిల్లలు బడికి రాని పక్షంలో తల్లిదండ్రులను ఆరా తీస్తున్నారు పిల్లలను బడికి పంపేలా అమ్మ ఒడిని అందిస్తున్నాం ఇంటర్మీడియట్ వరకూ అమ్మ ఒడి వర్తిస్తుంది ఆ తర్వాత కూడా విద్యాదీవెన, వసతి దీవెన ఉన్నాయి ఇలా ప్రతి దశలోనూ చదువులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది ఇలా ప్రతి విద్యార్థిని కూడా ట్రాక్ చేస్తున్నాం –అందుకే డ్రాప్‌అవుట్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాకుండా అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్నాం దీనిపై ఎప్పటికప్పుడు సమర్థవంతమైన పర్యవేక్షణ జరగాలి వచ్చే విద్యాసంవత్సరంలో విద్యాకానుకపై సీఎం సమీక్ష విద్యార్థులకు పంపిణీచేయాల్సిన పుస్తకాల ముద్రణ ముందుగానే పూర్తిచేయాలని సీఎం ఆదేశాలు మే 15 నాటికి అన్నిరకాలుగా సిద్ధమవుతున్నామన్న అధికారులు సబ్జెక్టు టీచర్ల పైనా సీఎం సమీక్ష పిల్లలకు ప్రతి సబ్జెక్టులోనూ పట్టుకోసం ఈ విధానాన్ని తీసుకు వచ్చామన్న సీఎం దీనివల్ల చక్కటి పునాది ఏర్పడుతుందని, పిల్లల్లో నైపుణ్యాలు మెరుగుపడుతాయన్న సీఎం గతంలో సబ్జెక్టు టీచర్లకు మంచి శిక్షణ ఇవ్వాలని సీఎం ఆదేశాల నేపథ్యంలో సబ్జెక్టు టీచర్లకు బోధనా పద్ధతులపై ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ కోర్సులు ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో బోధనా పద్ధతుల్లో నైపుణ్యాలను పెంచేలా కోర్సు వచ్చే రెండేళ్లపాటు ఈ సర్టిఫికెట్ కోర్సు కొనసాగుతుందన్న అధికారులు 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఈ వేసవిలో శిక్షణా తరగతులు పిల్లల సంఖ్యకు తగినట్టుగా సమీక్ష చేసుకుని వారి అవసరాలకు అనుగుణంగా టీచర్లను నియమించాలని సీఎం ఆదేశం ఇక ప్రతిఏటా కూడా దీనిపై సమీక్ష చేసుకోవాలన్న సీఎం. ఆ మేరకు మార్పులు, చేర్పులు చేసుకోవాలన్న సీఎం పిల్లలకు ఎక్కడా కూడా టీచర్లు సరిపోలేదన్న మాట రాకూడదన్న సీఎం ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ) ఏర్పాటుపై సీఎం సమీక్ష ►సీఎం ఆదేశాల మేరకు జూన్ నాటికి తరగతి గదుల్లో ఐఎఫ్‌పీలు ఏర్పాటు చేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్టు అధికారుల వెల్లడి ►స్కూలు పిల్లలకు టోఫెల్ సర్టిఫికేట్ పరీక్షలపై సీఎం సమీక్ష ►3 నుంచి 5గ్రేడ్ల ప్రైమరీ విద్యార్థులకు టోఫెల్ పరీక్షలు ►ఉత్తీర్ణులైన వారికి టోఫెల్ ప్రైమరీ సర్టిఫికెట్ ►6 నుంచి 10 గ్రేడ్ల వారికి జూనియర్ టోఫెల్ పరీక్షలు ►వీరికి జూనియర్ స్టాండర్డ్ టోఫెల్ పరీక్షలు ►మొత్తం మూడు దశల్లో వీరికి టోఫెల్ పరీక్ష ►ప్రైమరీ స్థాయిలో లిజనింగ్, రీడింగ్ నైపుణ్యాల పరీక్ష ►జూనియర్ స్టాండర్డ్ స్ధాయిలో లిజనింగ్, రీడింగ్, స్పీకింగ్ నైపుణ్యాల పరీక్ష ►ఈ పరీక్షలకోసం విద్యార్థులను, టీచర్లను సన్నద్ధం చేసేలా ఇ– కంటెంట్ రూపొందించాలని సీఎం ఆదేశం. ►విద్యార్థులకు ట్యాబుల పంపిణీ, వారు వినియోగస్తున్న తీరుపై సీఎంకు వివరాలు అందించిన అధికారులు ►ట్యాబులు ఎక్కడ రిపేరు వచ్చినా వెంటనే దానికి మరమ్మతు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం ►దీనికి సంబంధించి ఇప్పటికే ఎస్ఓపీ తయారుచేశామన్న అధికారులు. ►ట్యాబులకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా.. వెంటనే ఫిర్యాదు చేయడానికి వీలుగా ఒక ఫిర్యాదు నంబరును స్కూల్లో ఉంచాలన్న సీఎం. ►ఏ సమస్య వచ్చినా, రెండు మూడు రోజుల్లో పరిష్కరించి తిరిగి విద్యార్థులకు అప్పగిస్తున్నామన్న అధికారులు. ►సీఎం ఆదేశాల మేరకు పదోతరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామన్న అధికారులు ►గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నామన్న అధికారులు. ►ఎక్కడా ప్రశ్నపత్రాల లీకేజీలకు ఆస్కారం లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నామన్న అధికారులు. ►నో మొబైల్ జోన్స్‌గా పరీక్ష కేంద్రాలను మార్చామని, ఎవ్వరికీ కూడా మొబైల్ అనుమతిలేదని తేల్చిచెప్పిన అధికారులు. ►ప్రశ్న ప్రత్రాల్లో క్యూ ఆర్ కోడ్ ప్రతీ ప్రశ్నకూ ఇచ్చామన్న అధికారులు. ►దీనివల్ల ఎక్కడ నుంచి, ఏ సెంటర్ నుంచి, ఏ విద్యార్థికి సంబంధించిన ప్రశ్నపత్రం లీక్ అయ్యిందో సులభంగా తెలుసుకునే అవకాశం ఉందని తెలిపిన అధికారులు. ►ఈ చర్యలు కారణంగా ఎలాంటి సమస్యలు లేకుండా పరీక్షలు జరుగుతున్నాయన్న అధికారులు. ►ఇంటర్మీడియట్ పరీక్షల్లో కూడా ఇలాంటి చర్యలే తీసుకున్నామన్న అధికారులు. ►ప్రతి పరీక్షా గదిలో కూడా సీసీ కెమెరాలు పెట్టామన్న అధికారులు. ►మధ్యాహ్న భోజనం నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగాలని సీఎం ఆదేశం. ►ప్రభుత్వ పాఠశాలలకు సీబీఎస్ఈ అఫిలియేషన్ పూర్తిస్థాయిలో చేయాలన్న సీఎం. ►ఇప్పటికే వేయి ప్రభుత్వ స్కూళ్లు అఫిలియేట్ అయ్యాయని, మిగిలిన స్కూళ్లు కూడా చేసేందుకు అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు. ►ప్రభుత్వ పాఠశాలల్లో రెండో దశ నాడు – నేడు కింద పనులపైనా సమీక్షించిన సీఎం. ►ప్రాధాన్యతా క్రమంలో పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామన్న అధికారులు. చదవండి: తిరుపతి-హైదరాబాద్ ‘వందేభారత్’ హౌస్‌ఫుల్.. రైలులో ప్రయాణించిన సీఎస్ -
సీఎం క్యాంప్ ఆఫీస్ లో SLBC మీటింగ్
-
సామాజిక న్యాయానికి ప్రతిరూపం సీఎం జగన్
సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సామాజిక న్యాయానికి ప్రతిరూపమని ఎమ్మెల్సీ అభ్యర్థులు చెప్పారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపికైన వారు సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యం ఎమ్మెల్సీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం జగన్ ప్రాధాన్యతనిచ్చారు. 2014–19 మధ్య టీడీపీ శాసన మండలికి 48 మందిని పంపితే వారిలో ఓసీలే 30 మంది ఉన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 18 మంది మాత్రమే. – కవురు శ్రీనివాస్ బాబుకి, సీఎం జగన్‌కు మధ్య తేడా ఇదే చంద్రబాబు 2014 19 మధ్యకాలంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 37.5 శాతం పదవులే ఇచ్చారు. దీనికి భిన్నంగా సీఎం వైఎస్ జగన్ 68.18 శాతం కేటాయించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సాధికారత పట్ల సీఎం జగన్‌కు ఉన్న చిత్తశుద్ధిని ఇది నిరూపిస్తోంది. ఇద్దరి మధ్య ఈ తేడాను అందరూ గుర్తించాలి. – వంకా రవీంద్రనాథ్ కుప్పంలో చంద్రబాబును ఓడిస్తాం రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలకు రాజ్యాధికారంలో భాగం కల్పిస్తూ సీఎం జగన్ సామాజికన్యాయానికి ప్రతిరూపంగా నిలుస్తున్నారు. బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించిన సీఎం జగన్ అభినవ పూలేగా చరిత్రలో ఉండిపోతారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడిస్తాం. – సిపాయి సుబ్రమణ్యం టీడీపీ పని అయిపోయింది సీఎం జగన్ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ఎమ్మెల్సీగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తా. టీడీపీ పని అయిపోయింది. 2024 ఎన్నికల్లో సీఎం జగన్ చేతిలో మరోసారి చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ ఘోరంగా ఓడిపోవడం ఖాయం. – పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి సమస్యల పరిష్కారానికి కృషి శెట్టి బలిజ సామాజికవర్గంలో 36 సంచార జాతులున్నాయి. వెనుకబాటుకు గురైన వీరందరికీ న్యాయం చేస్తా. తూర్పు గోదావరి జిల్లాలో ఈసారీ వైఎస్సార్సీపీ విజయ దుందుభి మోగించేందుకు కృషి చేస్తా. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తా. – కుడుపూడి సూర్యనారాయణ ధైర్యం చెప్పారు నేను ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు నిరాశ చెందొద్దని సీఎం జగన్ ధైర్యం చెప్పారు. పార్టీ కోసం పనిచేయి, న్యాయం చేస్తానని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే అడగకుండానే ఎమ్మెల్సీని చేశారు. అత్యధిక జనాభా ఉన్న వడ్డెరల అభివృద్ధికి కృషి చేస్తా. – చంద్రగిరి యేసురత్నం ఇంత ప్రాధాన్యం ఇదే తొలిసారి మా జిల్లాలో మాదిగలకు ఇంత పెద్ద రాజకీయ గుర్తింపు ఇవ్వడం ఇదే తొలిసారి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పెద్దల సభకు మాదిగలు వెళ్లటం ఇదే మొదటిసారి. ఇది ఒక్క సీఎం జగన్ వల్లే సాధ్యమైంది. – బొమ్మి ఇజ్రాయిల్ సామాజిక, రాజకీయ విప్లవానికి నాంది పరిపాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు, మహిళలకు పెద్దపీట వేయడం ద్వారా సీఎం జగన్ ఆ వర్గాల సాధికారతకు బాటలు వేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను శాసన మండలికి ఎంపిక చేసి సామాజిక, రాజకీయ విప్లవానికి నాంది పలికారు. – పోతుల సునీత ఎస్టీలకు పెద్ద పీట వేస్తున్న ముఖ్యమంత్రి జగన్ జగన్ ప్రభుత్వం బడ్జెట్లో ఎస్టీల అభివృద్ధికి సబ్ ప్లాన్‌లో ఈ ఏడాదిలోనే రూ.6,822.65 కోట్లు కేటాయించింది. ఎస్టీ సబ్ ప్లాన్ లో భాగంగా 2019 జూన్ నుంచి 2022 డిసెంబర్ దాకా రూ.15,589.38 కోట్లు ఖర్చు చేసింది. 2024లో జగన్‌ను సీఎంగా చేసేందుకు గిరిజనులు సిద్ధంగా ఉన్నారు. – కుంభా రవిబాబు చంద్రబాబును బీసీలంతా నిలదీస్తారు సీఎం జగన్.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అనేక పదవులిస్తూ పాలనలో ప్రముఖ స్థానం కల్పిస్తున్నారు. చంద్రబాబు హయాంలో చాలా తక్కువ మందికే ఈ అవకాశం దక్కేది. ఈసారి ఎన్నికల్లో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు వైఎస్ జగన్‌కే మద్దతిస్తారు. – నర్తు రామారావు పార్టీ విజయం కోసం పనిచేస్తా.. చట్ట సభలో అడుగుపెట్టే గొప్ప అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. స్థానిక ప్రజా ప్రతినిధులను కలుపుకొని ముందుకు వెళ్తా. వైఎస్సార్సీపీ విజయం కోసం పని చేస్తా. – డాక్టర్ ఎ.మధుసూదన్ ప్రజల గుండెల్లో.. సీఎం సీఎం జగన్ ప్రజల గుండెల్లో ఏనాడో స్టిక్కర్ వేసుకున్నారు. ఎంత మంది ఏకమైనా దాన్ని చెరపలేరు. మాట తప్పని, మడమ తిప్పని గుణం వైఎస్ కుటుంబానిది. – మర్రి రాజశేఖర్ ఆయన స్ఫూర్తితో ముందుకు సాగుతాం సీఎం జగన్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగారు. అనేక సంక్షేమ పథకాలను ప్రజల చెంతకు చేర్చిన వ్యక్తి ఆయన. కులాలను చీల్చే విధంగా కాకుండా స్ఫూర్తిదాయక విధానాలతో పరిపాలన సాగిస్తున్నారు. ఆయన స్ఫూర్తితో మేమందరం ముందుకు నడుస్తాం. – పెన్మత్స సూర్యనారాయణరాజు బీసీ అంటే బ్యాక్‌బోన్ బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదని, బ్యాక్‌బోన్ క్లాస్‌గా సీఎం జగన్ గుర్తించారు. బీసీలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు. స్పీకర్‌గా బీసీకి అవకాశమిచ్చారు. సీఎం జగన్‌కు బీసీలంతా రుణపడి ఉంటారు. – కోలా గురువులు చంద్రబాబు నాకు ద్రోహం చేశారు టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాకు ద్రోహం చేశారు. ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశారు. కానీ ఏ హమీ ఇవ్వకుండానే సీఎం జగన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. వైఎస్సార్సీపీ విజయానికి కృషి చేస్తాను. – జయమంగళ వెంకటరమణ ఇలాంటి సీఎం దేశంలోనే లేరు పేదలకు ఇంతగా మంచి చేసిన సీఎం దేశంలోనే లేరు. మహిళలకు అన్నింటా అగ్రతాంబూలమే. ఏ ప్రభుత్వం చేయని మేలు చేస్తున్నారు. బీసీలు సీఎంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇంతగా మేలు జరగటంలేదు. – కర్రి పద్మశ్రీ చాలా ఆనందంగా ఉంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం జగన్ గుర్తు పెట్టుకొని మరీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. పదవులు బాధ్యతగా తీసుకోవాలని సీఎం జగన్ చెబుతారు. ఆయన చెప్పిన మాటలను శిరసావహిస్తూ బాధ్యతతో పని చేస్తా. – మేరుగ మురళీధర్ ఇలాంటి సీఎంను జన్మలో చూడలేను బీసీలకు ఇంతలా చేసిన సీఎంను ఈ జన్మలో చూడలేను. బీసీ, ఎస్సీ, ఎస్సీ, మైనార్టీలంతా సీఎం జగన్ వెంటే ఉంటారు. ఇప్పటికైనా చంద్రబాబు పునరాలోచన చేసుకుని సీఎం జగన్ పథకాలకు జై కొట్టాలి. – ఎస్.మంగమ్మ జగనన్నతోనే న్యాయం జగనన్నతోనే బీసీలకు పూర్తి న్యాయం జరుగుతోంది. బడుగు, బలహీనవర్గాల దేవుడు.. జగనన్న. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు తలెత్తుకు తిరిగేలా పరిపాలన సాగిస్తున్నారు. కొత్తగా ప్రకటించిన 18 ఎమ్మెల్సీ పదవుల్లో ఏకంగా 11 బీసీలకే కట్టబెట్టారు. అలాగే 25 మంది మంత్రుల్లో 11 మంది బీసీలే. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కూడా కలుపుకుంటే మొత్తం 17 మంది మంత్రులు ఉన్నారు. అలాగే 9 మందికి రాజ్యసభ సభ్యులుగా అవకాశమిస్తే వారిలో నలుగురు బీసీలే. టీడీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కలిపి శాసనమండలిలో కేవలం 37 శాతం మందికి మాత్రమే ప్రాతినిధ్యం దక్కింది. – వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని -
ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సీఎం జగన్ భేటీ
-
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సీఎం జగన్ భేటీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సోమవారం పార్టీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, జగనన్న సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు (జేసీఎస్) రాష్ట్ర కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో–ఆర్డినేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశానికి ఆహ్వానితులు అందరూ విధిగా హాజరుకావాలని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా పార్టీ నిర్దేశిత ఫార్మాట్లో ‘గృహ సారథులు’గా నియమితులైన వారి తుది జాబితాను హార్డ్ కాపీ (పెన్ డ్రైవ్‌లో) లేదా సాఫ్ట్ కాపీని ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఈ సమావేశంలో తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది. -
AP: సంబరంలా సంక్రాంతి
సాక్షి, అమరావతి: సీఎం క్యాంపు కార్యాలయంలో శనివారం సంక్రాంతి సంబరాలు నేత్రపర్వంగా జరిగాయి. సంప్రదాయ పంచెకట్టుతో సతీసమేతంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు అంతా మంచి జరగాలని, దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి చిహ్నానికి గుర్తుగా తెల్లని పావురాలను ఎగురవేశారు. సీఎం జగన్ దంపతుల మాటామంతీ గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా.. అంతకుముందు.. సీఎం క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న గోశాలను చక్కగా పల్లెటూరు వాతావరణం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. గ్రామ సచివాలయం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్, రైతుభరోసా కేంద్రాలు, పాఠశాలల నాడు–నేడు వంటి ప్రభుత్వ ప్రాధాన్యతలను తెలియజేస్తూ రంగవల్లులు, గొబ్బెమ్మలు, గాలిపటాలు, ధాన్యాగారాలు, గడ్డివాములు, ఎడ్లబండ్లు ఇలా అసలుసిసలైన పల్లె వాతావరణం ప్రతిబింబించేలా ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పర్యవేక్షణలో గ్రామ స్వరాజ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆద్యంతం ఉల్లాసంగా ఉత్సాహంగా.. ఇక ఈ కార్యక్రమానికి సంప్రదాయ దుస్తులతో హాజరైన సీఎం దంపతులను వేదపండితులు నుదుట తిలకం దిద్ది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారిరువురూ జ్యోతి ప్రజ్వలన చేసి సంక్రాంతి సంబరాలను లాంఛనంగా ప్రారంభించారు. గోశాలలోని గోవులకు పూజచేసి దండలు వేసి వాటిని నిమిరుతూ కొద్దిసేపు సంతోషంగా అక్కడ గడిపిన అనంతరం తులసి మొక్కకు నీళ్లుపోసి నమస్కరించుకున్నారు. అక్కడి వినాయకుడి గుడిలోనూ పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన భోగిమంటను కాగడాతో వెలిగించారు. హరిదాసుకు బియ్యం పోయడంతోపాటు పండ్లు కూరగాయలతో కూడిన స్వయంపాకాన్ని సమర్పించారు. గ్రామీణ సంక్రాంతి వేడుకల్లో ప్రధానంగా కనిపించే వివిధ కళాకారులను సీఎం ఆప్యాయంగా పలకరించారు. అంతేకాక.. తెలుగింటి సంక్రాంతి పిండివంటలను ముఖ్యమంత్రి దంపతులు రుచి చూశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పర్ణశాలలో సీఎం దంపతులు ఆశీనులయ్యారు. హరిదాసుకు బియ్యం సమర్పిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుడు ఆనంద్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన ‘శ్రీనివాస కల్యాణం’ నృత్య రూపకాన్ని సీఎం వైఎస్ జగన్ దంపతులు ఆద్యంతం ఆస్వాదించారు. నవరత్నాలతో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందించిన నేపథ్యంలో గ్రామ సచివాలయం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్, రైతుభరోసా కేంద్రాలు తదితర సేవల ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని సాక్షాత్కారం చేసిన తీరును కళ్ల కట్టినట్లు చూపించారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమ్మా ఉయ్యాల కోన జంపాల.. పాట పాడిన గాయని ప్రకృతిరెడ్డి, అదే సినిమాలో ఎత్తర జెండా.. పాట పాడిన హారిక నారాయణ్, ప్రముఖ జానపద గాయని కనకవ్వ తదితర కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎక్కడో తెలంగాణ మారుమూల గ్రామంలో ఉన్న నన్ను గుర్తించి పిలిపించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దీర్ఘకాలం సీఎంగా ఉండాలంటూ ఆశీర్వదించారు. అనంతరం.. శాంతి చిహ్నానికి ప్రతీకగా సీఎం దంపతులు తెల్ల పావురాలను ఎగురవేశారు. ఈ సంబరాల్లో పాల్గొన్న వివిధ కళాకారులను ముఖ్యమంత్రి ఆప్యాయంగా పలకరించడంతో పాటు వారితో ఫొటోలు దిగుతూ వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రి జోగి రమేష్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానులతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
స్వామి వివేకానందకు సీఎం ఘన నివాళి
సాక్షి, అమరావతి: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఆ మహనీయునికి ఘన నివాళులర్పించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు పాల్గొన్నారు. వివేకానందుని మాటలు స్ఫూర్తిదాయకం.. యువతకు సీఎం వైఎస్ జగన్ యువజనోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘యువత దేశానికి వెన్నెముక, వారు సాధించలేనిది ఏదీ లేదు’ అన్న స్వామి వివేకానంద మాటలను స్ఫూర్తిగా తీసుకుని లక్ష్య సాధనలో అంకిత భావంతో మనమందరం ముందడుగులు వేయాలి. జాతీయ యువజనోత్సవం సందర్భంగా యువత అందరికీ శుభాకాంక్షలు’ అంటూ సీఎం గురువారం ట్వీట్ చేశారు. -
సీఎం క్యాంప్ ఆఫీస్‌లో జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన వైఎస్ జగన్ (ఫొటోలు)
-
ఇళ్ల నిర్మాణంపై నిరంతరం పర్యవేక్షణ నిర్వహించాలని ఆదేశాలు
-
ఇళ్ల నిర్మాణం అనుకున్న సమయానికల్లా పూర్తి కావాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: గృహనిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్షా సమావేశం చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో జగనన్న కాలనీలు, టిడ్కో హౌసింగ్ పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఇళ్లులేని వారందరికీ ఇళ్లు ఇవ్వడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ. 5,655 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. ఇళ్ల నిర్మాణంపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. లే అవుట్లలో పర్యటన వల్ల ఇళ్ల నిర్మాణ ప్రగతిపై సమీక్షించి ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. లే అవుట్లను సందర్శించినట్టుగా ఫొటోలను కూడా అప్లోడ్ చేయాలని తెలిపారు. ప్రతి శనివారం హౌసింగ్‌డేగా నిర్వహిస్తున్నామని.. ఆ రోజు తప్పనిసరిగా అధికారులు లే అవుట్లను సందర్శిస్తున్నారని అధికారులు సీఎంకు వెల్లడించారు. సీఎం జగన్ ఇంకా మాట్లాడుతూ.. ► ఇళ్ల నిర్మాణం అనుకున్న సమయానికల్లా పూర్తి కావాలి. ► ఆప్షన్–3 ని ఎంపిక చేసుకున్న లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణంపై దృష్టిపెట్టాలి. ► లే అవుట్ల వారీగా ప్రాధాన్యత పరంగా పనులను గుర్తించి.. అనుకున్న సమయానికి ఆ పని పూర్తయ్యేలా చూడాలి. ► దీనివల్ల ఇళ్ల నిర్మాణంలో చెప్పుకోదగ్గ ప్రగతి కనిపిస్తుంది. ► ఇళ్ల నిర్మాణం నాణ్యతలో ఎలాంటి రాజీ వద్దు. ► ప్రతి దశలోనూ నాణ్యతా నిర్ధారణ పరీక్షలు జరగాలి. ► ఇళ్ల నిర్మాణంలో క్వాలిటీని నిరంతరం పాటించడానికి ఎస్ఓపీలను అందుబాటులో ఉంచాలి. ► గ్రామ సచివాలయాల్లో ఉన్న ఇంజినీరింగ్ అసిస్టెంట్ సేవలను విస్తృతంగా వాడుకోవాలి. ► ఇళ్ల నిర్మాణంలో క్వాలిటీ ప్రమాణాలు పాటించే విషయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ భాగస్వామ్యం తీసుకోవాలి. ► ఇళ్లు పూర్తయ్యే సరికి మూడు రకాల మౌలిక సదుపాయాలు ఉండాలి. ► విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలి. ► మిగిలిన మౌలిక సదుపాయాలనూ వృద్ధిచేసుకుంటూ ముందుకు సాగాలి. ► ఈ పనులకు సంబంధించి ఇప్పటికే డీపీఆర్‌లు సిద్ధం అయ్యాయని అధికారులు తెలిపారు. ప్రాధాన్యతాక్రమంలో చేసుకుంటూ వెళ్తున్నామన్నారు. ఈ సమీక్షా సమావేశంలో గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ సమీర్ శర్మ, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ దవులూరి దొరబాబు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ కె విజయానంద్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి ఇంతియాజ్, గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: (వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల జాబితా ఇదే..) -
అధైర్య పడొద్దు.. అన్ని విధాల ఆదుకుంటాం
లబ్బీపేట(విజయవాడతూర్పు): తన కుమార్తె వైద్య ఖర్చుల కోసం ఏనాడు ప్రభుత్వాన్ని సాయం కోరలేదని, ముఖ్యమంత్రిని కలవలేక పోతున్నాననే ఆవేదన, క్షణికావేశంలో మాత్రమే చేతికి గాయం చేసుకున్నట్లు కాకినాడ రూరల్ మండలం రాయుడుపాలేనికి చెందిన ఆరుద్ర తనను కలిసిన ఉన్నతాధికారులకు తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం సమీపాన తన చేతికి గాయం చేసుకుని విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజులపూడి ఆరుద్రను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గురువారం ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి ఎం.హరికృష్ణ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు, సీపీ కాంతి రాణా టాటా పరామర్శించారు. ఆరుద్ర, ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం న్యాయం చేస్తుందని ధైర్యంగా ఉండాలని సీఎం చెప్పారని, ఆయన ఆదేశాల మేరకే తాము వచ్చినట్లు తెలిపారు. కాగా నిస్సహాయురాలైన ఓ మహిళ తన సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడంకోసం ప్రయత్నిస్తే ఆ ఉదంతాన్ని కూడా రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ఎల్లో మీడియా ప్రయత్నించడం చూసి జనం విస్తుపోతున్నారు. ఆరుద్రను కలసిన అనంతరం కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పారు. ఆరుద్ర కుమార్తె సాయి లక్ష్మికి మూడు నెలల వయసులోనే స్పైనల్ వ్యాధికి ఆపరేషన్ జరిగిందని, కొంతకాలం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నా, తర్వాత తిరిగి అనారోగ్యానికి గురవడంతో వెల్లూరు, లక్నో వంటి అనేక ప్రాంతాల్లో వైద్యం చేసినా మెరుగుపడలేదన్నారు. అమెరికాలో అధునాతన వైద్యం చేయిస్తే కోలుకోవచ్చని కొందరు వైద్యులు చెప్పినట్లు తెలిపారు. కుమార్తె వైద్య ఖర్చుల కోసం అమలాపురంలో ఉన్న తమ ఆస్తులను రూ.62 లక్షలకు విక్రయించినట్లు ఆరుద్ర చెప్పారని కలెక్టర్ పేర్కొన్నారు. శంఖవరం మండలం అన్నవరంలోని తన ఇంటిని అమ్మడానికి ప్రయత్నిస్తే ఇరువైపులా ఉన్న కానిస్టేబుళ్లు శివయ్య, కన్నయ్య, ముత్యాలరావులు అడ్డుపడటమే కాకుండా, న్యాయపరమైన చిక్కులు సృష్టించారని, వారిపై 2020లో జిల్లా ఎస్పీకి, ఆ తర్వాత కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, చర్యలు తీసుకున్నారని తెలిపినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో తన కుమార్తెకు విదేశాల్లో వైద్యం అందించలేక పోతున్నాననే బాధతో సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావాలని ప్రయత్నించినట్లు ఆరుద్ర తెలిపారని పేర్కొన్నారు. గత నెల 31న ఎ–కన్వెన్షన్ హాలు వద్ద సీఎంను కలిసేందుకు ప్రయత్నించగా, భద్రతా కారణాల వలన పోలీసులు అనుమతించలేదన్నారు. ఈ నెల 2న కుమార్తెతో కలిసి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుని అధికారులను కలవగా, సమస్య కోర్టు పరిధిలో ఉందని, పౌర సమస్యలను స్థానికంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారని ఆమె తెలిపినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని కలవలేక పోయాననే మనస్తాపంతోనే ఆవేశంలో చేతికి గాయం చేసుకున్నానని ఆరుద్ర వివరించిందని తెలిపారు. కుమార్తె అనారోగ్యం వల్ల 2018లో గ్రూప్–2 ఉద్యోగానికి ఎంపికైనా చేరలేక పోయానని, తన ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మానవతా దృక్ఫథంతో మరొకసారి అవకాశం కల్పించాలని ఆరుద్ర కోరినట్లు కలెక్టర్ తెలిపారు. -
92 శాతం ప్రజలకు పథకాలు అందుతున్నాయ్: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: మనకు ఓటు వేయకపోయినా.. అర్హులకు మంచి చేశాం. అలాంటప్పుడు వాళ్లు మనల్ని ఎందుకు ఆదరించారు?. కచ్చితంగా ఆదరించి తీరతారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండపేట కార్యకర్తలతో తాడేపల్లిలో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మండపేట ప్రజలకు 946 కోట్ల రూపాయలను డీబిటీ(డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్జాక్షన్) ద్వారా నేరుగా లబ్ధి చేకూర్చాం. ఎక్కడా లంచాలు, వివక్షకు తావు లేకుండా పనిచేశాం. గ్రామాల్లో వచ్చిన మార్పును మనం జనంలోకి తీసుకెళ్లాలి. ఒక మిషన్ ద్వారా దీన్ని జనంలోకి తీసుకెళ్లాలి. మండపేట నియోజకవర్గంలో 96,469 ఇళ్లకు గాను 92 శాతం ఇళ్లకు పథకాలు చేరాయి. ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుంటే 92 శాతం మంచి పనులు చేయగలిగాము. ఆ మంచిని వివరిస్తూ గడపగడపకు వెళ్లేలా ప్లాన్ చేశాం. అలా వెళ్ళినప్పుడు అక్క చెల్లెమ్మలు మనకు స్వాగతం పలుకుతున్నారు. అలాంటప్పుడు వచ్చే ఎన్నికలలో 175కు 175 సీట్లు ఎందుకు రావు?. ప్రజల్లో మార్పు కనిపిస్తోంది. అర్హత ఉంటే చాలు.. అందరికీ మేలు చేశాం. మనకు ఓటు వేయకపోయినా మంచి చేస్తే వారి మనసు కరుగుతుందని మేలు చేశాం. కలిసికట్టుగా అందరూ పనిచేసి ఎన్నికలలో పార్టీని గెలిపించాలి’ అని సీఎం జగన్ కార్యకర్తలను ఉద్దేశించి దిశానిర్దేశం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. మిమ్నల్ని కలవడానికి ఇక్కడికి రమ్మని చెప్పడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి. ఒకటి కలిసి చాలారోజులైంది. కలిసినట్టు ఉంటుందన్నది ప్రధాన కారణమైతే... రెండోది మరో 18 నెలల్లో రానున్న ఎన్నికలకు సన్నద్దం కావాల్సి ఉంది. 18 నెలలు అంటే చాలా దూరం ఉంది అనుకోవచ్చు. దానికి సంబందించి ఇప్పుడే ఈ కార్యక్రమం ఇప్పుడే మొదలు పెట్టాలా ? అని అనుకోవచ్చు. 18 నెలలు ఉన్నప్పటికీ ఆ దిశగా మనం అడుగులు ఎందుకు వేయాలన్నది చెప్పడానికే మిమ్నల్ని రమ్మన్నాం. ► ఎన్నికలప్పుడు ప్రజల దగ్గరకి వెళ్లడం, ప్రజలను ఆశీర్వదించమని కోరడం సర్వసహజంగా జరుగుతాయి. కానీ మొట్టమొదటి సారిగా గత ప్రభుత్వాలలో ఎప్పుడూ, ఎక్కడా చూడనట్టుగా ఈ రోజు రాష్ట్రంలో మార్పులు జరుగుతున్నాయి. మొట్టమొదటిసారిగా సచివాలయ వ్యవస్ద ప్రతి 2వేల జనాభాకు 12 మంది అక్కడే కూర్చుని పనిచేసేటట్టుగా ఏర్పాటు చేశాం. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌తో అనుసంధానం చేసి, ప్రతి గడప, ప్రతి కుటుంబం కూడా అర్హత ఉండి రాని పరిస్థితులు ఉండకూడదని తాపత్రయపడుతున్నాం. పారదర్శకతతో అందరికీ అన్ని పథకాలు రావాలని ఎప్పుడూ జరగని విధంగా సాచ్యురేషన్ విధానంలో అడుగులు వేశాం. ► ఒక్క మండపేట నియోజకవర్గంలోనే రూ.946 కోట్లు ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో కేవలం బటన్ నొక్కి ప్రతి ఇంటికి అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టాం. వైయస్సార్ పెన్షన్ కానుక, రైతు భరోసా, అమ్మఒడి, ఆసరా మొదలుకుని క్రాప్ ఇన్సూరెన్స్, చేయూత, విద్యాదీవెన వరకు రకరకాల పథకాలు డీబీటీ ద్వారా ఆధార్ కార్డు సహా ఎవరికి ఎంతిచ్చామో, ఎవరికి ఏ రకంగా మేలు జరిగిందన్నది ఆధారాలతో సహా పారదర్శకంగా ఎక్కడా లంచాలు, వివక్షకు తావులేకుండా అర్హుడైన ఏ ఒక్కరు మిస్ కాకుండా దేవుడి దయతో అడుగులు వేయగలిగాం. ఇటువంటి మార్పు గతంలో ఎప్పుడూ జరగలేదు. అలాంటి మార్పు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తోంది. ఇంత మార్పు జరుగుతున్నప్పుడు దాన్ని మనం ప్రజలదగ్గరకు తీసుకుని వెళ్లి...వారికి ఇవన్నీ గుర్తు చేసి.. ప్రజల ఆశీస్సులు మనం తీసుకుని అడుగులు ఇంకా ఎఫెక్టివ్‌గా వేసేదానికి మిమ్నల్ని భాగస్వామ్యులను చేస్తున్నాం. ► మొట్టమొదటిసారిగా గడప గడప అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమం చేపట్టి దాదాపు నాలుగు నెలలు కావస్తోంది. గడప గడప కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే.. మన ఎమ్మెల్యే కానీ, మన ఎమ్మెల్యే అభ్యర్ధి కానీ... గ్రామానికి వెళ్లినప్పుడు ఆ గ్రామంలో సచివాలయ వ్యవస్ధ, మండల స్ధాయి అధికారులు, గ్రామంలో సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ మమేకమై ప్రతి గడపనూ తట్టి, ప్రతి గడపలోనూ జరిగిన మంచిని వివరిస్తూ వాళ్ల ఆశీర్వాదాలు తీసుకుంటూ మరోవైపు పొరపాటున ఎవరైనా ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే... అటువంటి వారు కూడా మిగిలిపోకూడదనే తపన, తాపత్రయంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి సచివాలయానికి రూ.20 లక్షలు డబ్బులు కూడా కేటాయించాం. ఆ సచివాలయానికి వెళ్లినప్పుడు ఆ సచివాలయ పరిధిలో అత్యంత ప్రాధాన్యత ఉన్న పనులు చేపట్టాలి. సచివాలయానికి రూ.20 లక్షలుఅంటే నియోజకవర్గానికి దాదాపు రూ.20 కోట్లు కేటాయించినట్లవుతుంది. ఆ సచివాలయంలో రెండు రోజుల పాటు ఉండాలి. ఒక్కోరోజు కనీసం 6 గంటలు ఆ సచివాలయంలో ఉండాలి. ఆ తర్వాత ఆ గ్రామంలో ప్రాధాన్యత ఉన్న పనులు చేపట్టాలి. ► మీ నియోజకవర్గంలో 96,469 ఇళ్లు ఉన్నాయి. ఇందులో మన పథకాలు చేరిన ఇళ్లు 91.96 శాతం. అంటే సుమారు 92 శాతం ఇళ్లలో ఆ అక్కచెల్లెమ్మల పేర్లతో ఏ పథకం చేరింది, ఎన్ని పథకాలు చేరాయి అని ఏకంగా ఆథార్ కార్డు డీటైల్స్‌తో సహా చెప్పగలికే పరిస్థితుల్లో సహాయం చేయగలిగాం. ► గ్రామమే ఒక యూనిట్‌గా తీసుకుంటే ఆ గ్రామంలో 92 శాతం ఇళ్లకు.. ప్రతి ఇంట్లో మనం మంచి చేశామని సగర్వంగా తలెత్తుకుని చెప్పుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ జరిగిన మంచిని వివరిస్తూ మనం గడప, గడపకూ కార్యక్రమం చేస్తున్నప్పుడు అవునన్నా పథకాలు అందాయి అని చల్లని ఆశీస్సులు ఆ అక్కచెల్లెమ్మలు మనమీద చూపించినప్పుడు ఆగ్రామంలో మనం గెలుస్తాం. ► గ్రామం గెల్చినప్పుడు నియోజకవర్గం గెలుస్తాం. గ్రామం, నియోజకవర్గం గెల్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 175 కి 175 ఎందుకు రావు ?. ఒక్క మండపేట నియోజకవర్గంలో మండపేట మున్సిపాల్టీతో సహా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు లెక్క తీసుకుంటే.. మున్సిపాల్టీలో 30 కి 23 వైయస్సార్సీపీ, జడ్పీటీసీలు మూడింటికి మూడు, ఎంపీపీలు మూడింటికి మూడు ఏ లెక్కలు తీసుకున్నా గతంలో రానివి ఇప్పుడు వచ్చాయి. కుప్పం నియోజకవర్గంలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాల్టీ అన్నీ క్లీన్‌స్వీప్ చేశాం. ప్రజల దీవెనలు మనవైపు కనిపిస్తున్నాయి. కారణం పాలన పారదర్శకంగా జరుగుతుంది. ఎక్కడా లంచాలు అవసరం లేదు. వివక్ష చూపించడం లేదు. మనకు ఓటు వేయని వారైనా సరే అర్హత ఉండి రావాల్సింది రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే కచ్చితంగా వచ్చేటట్టు చేస్తాం. మనం చేసిన మంచిని చూసి మార్పు వస్తుంది. ► సోషల్ ఆడిట్లో జాబితాలు ప్రదర్శిస్తున్నాం. ఇవన్నీ జరుగుతుండగానే మారుతున్న గ్రామాలు కనిపిస్తున్నాయి. గ్రామంలోకి అడుగుపెడుతూనే సచివాలయం కనిపిస్తుంది. వాలంటీర్ వ్యవస్ధ కనిపిస్తుంది. ఆర్బీకేల ద్వారా రైతన్నను చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమం జరుగుతుంది. ఇంగ్లిషు మీడియం స్కూళ్లు, విలేజ్ క్లీనిక్కులు కనిపస్తాయి. శరవేగంగా డిజిటల్ లైబ్రరీలు కట్టే కార్యక్రమం కూడా మొదలుపెడుతున్నాం. ఇవన్నీ గతంలో లేనివి. ఇవన్నీ గ్రామాల రూపురేఖలు మారుస్తున్నాయి. గతంలో పిల్లలు చదువుకునే వయస్సుకు వచ్చేసరికి తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం గ్రామాలు వదిలిపెట్టే పరిస్థితి. ఆ పరిస్థితి పోయి ఇంగ్లిషు మీడియం బడులు మన గ్రామాల్లో వస్తున్నాయి. వైద్యం అన్నది విలేజ్ క్లీనిక్కుల ద్వారా మన గ్రామంలోనే ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంతా ఒకేచోట ఉంటూ.. 24 గంటలపాటు అందుబాటులో ఉంటారు. 67 రకాల మందులు, 14 రకాల పరీక్షలు చేసేటట్టుగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ క్రియేట్ చేసి ఊర్లోనే వైద్యం అందిస్తున్న పరిస్థితి. ఇంత మార్పు గతంలో జరగలేదు. ► డీసెంట్రలైజేషన్ ఈ స్ధాయిలోకి వెళ్లి మంచి చేయాలన్న ఆరాటం గతంలో లేదు. ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్న నేపధ్యంలో కచ్చితంగా ఈ నియోజకవర్గంలో కూడా మార్పు రావాలి. వై నాట్ 175. కచ్చితంగా జరుగుతుంది. మీరు నేను ఒక్కటైనప్పుడు ఇది జరుగుతుంది. ఇది నా ఒక్కడి వలన జరిగేది కాదు. నేను చేయాల్సింది నేను చేయాలి. మీరు చేయాల్సింది మీరు చేయాలి. ఇద్దరం కలిసికట్టుగా చేయాలి. నేను బటన్ సరిగ్గా నొక్కాలి. అక్కడ పొరపాట్లు జరగకూడదు. నా ధర్మం నేను చేయాలి. మీరు అంతా కలిసి ప్రతి గ్రామంలో మనం చేస్తున్న మంచిని ప్రతి ఇంటికి తీసుకునిపోవడమే కాకుండా, వారికి అర్ధమయ్యేటట్టు చెప్పాలి. వాళ్ల చల్లని ఆశీస్సులు తీసుకోవాలి. ఆ ఆశీస్సులను మనకు అనుకూలంగా మార్చుకోవాలి. ఇద్దరం కలిస్తే సాధ్యం కాకుండా ఉండే ప్రసక్తే లేదు. ఇది చేయడం కోసం మీ అందరి మద్దతు కూడా ఈ దిశగా కూడగట్టేందుకు ఈ రోజు మిమ్నల్ని ఇక్కడికి ఆహ్వానించాం అని సీఎం జగన్ ప్రసంగించారు. టార్గెట్ 175లో భాగంగా.. కొన్ని నియోజకవర్గాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యకర్తలతో బుధవారం సీఎం జగన్ సమావేశం అయ్యారు. సీఎం వైఎస్ జగన్‌తో వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, రాజ్యసభసభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ హాజరయ్యారు. -
భూవివాదాలు, భూతగాదాలు లేని గ్రామాలు సాక్షాత్కారం కావాలి: సీఎం జగన్
-
రీసర్వే పేరుతో మహాయజ్ఞం చేస్తున్నాం.. ఫలాలు ప్రజలకు అందాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష కార్యక్రమంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో మంగళవారం సమీక్ష చేపట్టారు. ఈ సమీక్ష సందర్భంగా భూ వివాదాలు, భూ తగాదాలు లేని గ్రామాలు సాక్షాత్కారం కావాలని అధికారులను ఆదేశించారు. అలాగే, ప్రజలను పూర్తిస్థాయిలో సంతృప్తి పరిచేలా, వారి భూ సమస్యలకు పూర్తిస్థాయి పరిష్కారాలు చూపేలా రీసర్వే ఉండాలని స్పష్టం చేశారు. సమీక్ష సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కీలక ఆదేశాలు ఇవే.. రీసర్వేలో నాణ్యత చాలా ముఖ్యం.. – ఒక గ్రామంలో రీసర్వే చేసిన తర్వాత అన్నిరకాలుగా ఈ ప్రక్రియను ముగించాలి. – ఆ గ్రామంలో మనదైన ముద్ర కనిపించాలి. – భూ వివాదాలు, భూ తగాదాలు లేని గ్రామాలు సాక్షాత్కారం కావాలి. – రీసర్వే పేరుతో మహాయజ్ఞం చేస్తున్నాం.. వాటి ఫలాలు ప్రజలకు అందాలి. – క్వాలిటీ అనేది కచ్చితంగా ఉండాలి. ఎక్కడా కూడా సర్వే అసంపూర్తిగా మిగిలిపోయిందన్న మాట రాకూడదు. – మొబైల్ ట్రిబ్యూనల్స్, సరిహద్దులు, సబ్డివిజన్లు.. ఇవన్నీకూడా చాలా క్రమ పద్ధతిలో ముందుకు సాగాలి. – రీసర్వే చేస్తున్నప్పుడు ఉత్పన్నమైన సమస్యలను అత్యంత ప్రణాళికా బద్ధంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలి. – ప్రజలను పూర్తిస్థాయిలో సంతృప్తి పరిచేలా, వారి భూ సమస్యలకు పూర్తిస్థాయి పరిష్కారాలు చూపేలా రీసర్వే ఉండాలి. – ఈ సర్వే ద్వారా రెవెన్యూ వ్యవస్థ పూర్తిస్థాయిలో ప్రక్షాళన అవుతుంది. – రికార్డులు, డేటా అంతా కూడా స్వచ్ఛీకరణ జరుగుతుంది. – ఈ అంశాలను అధికారులు దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలి. – రీ సర్వే ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే కారణంతో చాలామంది ఈ కార్యక్రమంపై దుష్ప్రచారం చేస్తున్నారు. అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. – 100 ఏళ్ల తర్వాత సర్వే చేస్తున్నాం, దీనికోసం కొన్ని వేల మందిని రిక్రూట్ చేసుకున్నాం. అత్యాధునిక పరికరాలను కోట్లాది రూపాయలు ఖర్చుచేసి కొనుగోలు చేశాము. – దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎవ్వరూ కూడా వేలెత్తి చూపని విధంగా సర్వే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. – దోషాలతో, తప్పులతో ఒక్క హక్కు పత్రం కూడా రైతులకు వెళ్లకూడదు. – సంబంధిత గ్రామ సచివాలయంలో సర్వే పూర్తికాగానే అక్కడే రిజిస్ట్రేషన్ కార్యాలయం కూడా ఏర్పాటయ్యేలా చూడాలి. – సర్వే పూర్తైన తర్వాత ప్రతీ గ్రామంలో ఆర్డీఓలు, జేసీలు హక్కుపత్రాలను తనిఖీలు చేయాలి. – ఉన్నతాధికారులు గ్రామాల్లో సందర్శించడం వల్ల అందరూ కూడా బాధ్యతాయుతంగా తమ పనులు నిర్వర్తిస్తారు. అలాగే సిబ్బందిలో జవాబుదారీతనం కూడా వస్తుంది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మార్గదర్శకాలు రూపొందించుకుంటాము.. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు తప్పులు, పొరపాట్లు లేని విధంగా హక్కు పత్రాలు జారీచేస్తామని అధికారులు వెల్లడించారు. అలాగే, భూ సర్వే ప్రక్రియలో ఏ దశలో అభ్యంతరాలు వ్యక్తమైనా వాటిని పరిష్కరించే వ్యవస్థలను బలోపేతం చేస్తామన్నారు. ఈ సర్వే పూర్తిచేయడం ద్వారా భూ యజమానుల హక్కులను తరతరాలపాటు కాపాడుగలుగుతామని, ఆక్రమణలు, కబ్జాలు, రికార్డుల్లో అవకతవకలు ఇలాంటి వాటికి పూర్తిస్థాయిలో చెక్ పడుతుందని వెల్లడించారు. కేవలం ఐదు సెంటీమీటర్ల వ్యత్యాసంతో కచ్చితమైన పద్ధతుల్లో సర్వే జరుగుతుందని అధికారులు తెలిపారు. భూ యజమానులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా, వారిని పూర్తిస్థాయిలో సంతృప్తపరిచే పద్ధతుల్లో సర్వే జరుగుతోందని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకూ 6,037 గ్రామాల్లో డ్రోన్లను ఎగురవేశామని, ఇందులో 1,545 గ్రామాల్లో రెవెన్యూ రికార్డులు కూడా ఖరారయ్యాయని అన్నారు. ప్రతీనెలా 13,335 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని లక్ష్యంగా చేసుకుని సర్వే చేస్తున్నామన్న అధికారులు తెలిపారు. డ్రోన్లు ఎగురవేయడానికి అనువుగాలేని ప్రాంతాల్లో విమానాలు, హెలికాప్టర్ల ద్వారా సర్వే చేయడానికి అన్ని రకాలుగా సిద్ధమయ్యామని స్పష్టం చేశారు. నవంబర్ మొదటివారంలో తొలివిడత గ్రామాల్లో హక్కుపత్రాలను అందిస్తామని, ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. అర్బన్ ప్రాంతాల్లోనూ సర్వే.. అలాగే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. 123 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని 15,02,392 ఎకరాల్లో సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వే పూర్తైన తర్వాత ఇక్కడ కూడా పత్రాలను అధికారులు తనిఖీ చేయాలన్నారు. ఈ సందర్భంగా అధికారులు.. వచ్చే జనవరిలో సర్వే ప్రక్రియ ప్రారంభించి మే నెల నుంచి హక్కుపత్రాల పంపిణీ ప్రారంభమయ్యేలా ముందుకుసాగుతామన్నారు. ఆగస్టు 2023 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించుకున్నామని స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో విద్యుత్, అటవీ, పర్యావరణ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ముఖ్యమంత్రి ముఖ్యసలహాదారు అజేయ కల్లాం, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి.సాయి ప్రసాద్, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రెవెన్యూశాఖ (సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్) కమిషనర్ సిద్దార్ధ జైన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, సీసీఎల్ఏ కార్యదర్శి ఏ ఎండీ ఇంతియాజ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఐజీ వి రామకృష్ణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
శిక్షణ పూర్తైన ఐపీఎస్‌లకు సీఎం జగన్ విషెస్
సాక్షి, తాడేపల్లి: ఇటీవలె శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్‌లు.. మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంకు వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా.. సీఎం జగన్ వాళ్లకు ఆల్ ది వెరీ బెస్ట్ తెలియజేశారు. విధి నిర్వహణలో సమర్ధవంతంగా పనిచేస్తూ ఆధునికమైన, ప్రభావవంతమైన పోలీస్ వ్యవస్ధను నిర్మించాల్సిన అతి పెద్ద బాధ్యత మీపై ఉంది అంటూ ఈ సందర్భంగా ఆయన యువ ఐపీఎస్‌లకు మార్గనిర్ధేశం చేశారు. సీఎం జగన్‌ను కలిసిన వాళ్లలో యువ ఐపీఎస్‌లు ధీరజ్ కునుబిల్లి, జగదీష్ అడహళ్ళి, సునీల్ షెరాన్, రాహుల్ మీనా ఉన్నారు.