Comptroller and Auditor General of India
-
సామాజికరంగ వ్యయం రూ.3.06 లక్షల కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం సామాజిక రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) అకౌంట్స్ నివేదిక–2022–23 స్పష్టం చేసింది. గత నాలుగేళ్ల నుంచి ఏటా సామాజిక రంగ వ్యయం పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనమని వెల్లడించింది. గత నాలుగేళ్లలో సామాజిక రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.3.06 లక్షల కోట్లు వ్యయం చేసినట్లు పేర్కొంది. విద్య, వైద్య ఆరోగ్య– కుటుంబ సంక్షేమం, తాగునీరు, పారిశుధ్యం, గృహనిర్మాణం, పట్టణాభివృద్ది, కార్మిక ఉపాధి, సంక్షేమం, సామాజిక భద్రతలను సామాజిక రంగంగా పరిగణిస్తారు. విద్య, వైద్య రంగాలకు, పౌష్టికాహారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో ఆ రంగాలపై ఎక్కువ ఖర్చు చేసినట్టు కాగ్ అకౌంట్స్ నివేదిక తెలిపింది. మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు ఇతర వర్గాల్లోని పేదల సంక్షేమానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో సామాజిక రంగం వ్యయం ఏటా పెరుగుతున్నట్లు నివేదిక వెల్లడించింది. అలాగే కార్మికుల సంక్షేమంతో పాటు తాగునీటి సరఫరాకు గత నాలుగేళ్లుగా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. -
CBN: ఆర్థిక అరాచకం.. స్వయంకృతాపరాధం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి కాగ్ ( కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ) ఇచ్చిన నివేదిక వాస్తవ పరిస్థితికి దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. గత తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సృష్టించిన ఆర్ధిక అరాచకమే అమరావతి అని అర్దం అవుతుంది. లక్షల కోట్ల రూపాయలు ఒకే చోట గుమ్మరించడంపై రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లోనే వ్యతిరేకత వచ్చింది. దాని ఫలితమే 2019 శాసనసభ ఎన్నికలలో టీడీపీ ఘోర ఓటమి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం.. ఈ పరిస్థితిని మొత్తం సమీక్షించుకుని, జరిగిన అక్రమాలను గమనంలోకి తీసుకుని ఇక్కడే లక్షల కోట్లు వ్యయం చేసి, మిగిలిన ప్రాంతానికి అన్యాయం చేయలేమని భావించింది. ఇదే పాయింట్‌ను కాగ్ కూడా వెల్లడిస్తూ.. గత ప్రభుత్వంలో రాజధాని పేరుతో ఆర్ధిక అగాధాన్ని సృష్టించుకుంటున్నారని వ్యాఖ్యానించడం విశేషం. అందుకే మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రస్తుత ప్రభుత్వం తెరమీదకు తెచ్చింది. కానీ, దానిని ముందుకు సాగనివ్వకుండా ప్రతిపక్ష టీడీపీ న్యాయ వ్యవస్థ ద్వారా అడుగడుగునా అడ్డుపడింది. అయినా జగన్ పట్టు వీడక విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు దిశగా సాగుతున్నారు. అదే సమయంలో అమరావతిని శాసన రాజధానిగా కొనసాగించాలని తలపెట్టారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు విషయంపై స్పష్టతతో ఉన్నప్పటికీ.. ఇంకా పలు అవరోధాలు అధిగమనించవలసి ఉంటుంది. జగన్ విశాఖను పాలన రాజధానిగా చేయాలని తీసుకున్న నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ కు కనీసం లక్ష కోట్ల రూపాయల ఆదా అయినట్లు లెక్కవేసుకోవచ్చు. అదెలాగంటే.. ✍️టీడీపీ ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ప్రకారం అయితే అమరావతి ప్రాంతంలో వివిధ మౌలిక సదుపాయాలకు లక్ష తొమ్మిదివేల కోట్లు అవసరమవుతాయి. ఇది తొలిదశకు మాత్రమే. ఆ మేరకు కేంద్రం నిధులు మంజూరు చేయాలని ఆనాటి సీఎం చంద్రబాబు లేఖ కూడా రాశారు. కేంద్రం ఆ లేఖను పక్కన పెట్టేసింది.అప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1,500 కోట్ల రూపాయల డబ్బు ఎలా ఖర్చు పెట్టారో కూడా టీడీపీ ప్రభుత్వం వివరించలేదు. అప్పులు తెచ్చి తాత్కాలిక భవనాలు నిర్మించింది. బాండ్లు విడుదల చేసి వేల కోట్ల రూపాయలను వెచ్చించడానికి సన్నద్దమై సుమారు 33 వేల కోట్ల రూపాయల విలువైన టెండర్లు పిలిచింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో అప్పట్లో నిరసన వచ్చింది. కేవలం ఒక వర్గం ప్రయోజనాల కోసం చంద్రబాబు ఇలా చేస్తున్నారని మెజార్టీ ప్రజలు భావించారు.ప్రజాభిప్రాయానికి తగినట్లే ఇప్పుడు కాగ్ నివేదికలోని అంశాలు ఉన్నాయని అనిపిస్తుంది. ✍️అమరావతి రాజధాని నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఆర్దిక భారం మోపుతుందని కాగ్ పేర్కొంది. రెండు దశాబ్దాల క్రితం దేశంలో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. అవి జార్ఖండ్, చత్తీస్ గడ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు. వీటిలో ఎక్కడా ఈ రకంగా 55 వేల ఎకరాలలో రాజధాని ప్రతిపాదించలేదు. రైతుల నుంచి 33 వేల ఎకరాలను తీసుకోలేదు.కేవలం రాజధానికి అవసరమైన రెండువేలు లేదా మూడు వేల ఎకరాలలో మాత్రమే నిర్మాణాలు చేసుకున్నారు. మంచి నగరాన్ని ఎంపిక చేసుకుని పాలన సాగించారు తప్ప ఇలా కొత్త రాజధాని నగర నిర్మాణమే చేస్తామంటూ ఎవరూ ఎచ్చులకు పోలేదు. ఛత్తీస్గడ్ రాజధాని రాయపూర్ వద్ద నయారాయయపూర్ పేరిట తీసుకున్న భూమిలోనే పూర్తి స్థాయి నిర్మాణాలు జరగలేదట. అలాంటిది ఇక్కడ అమరావతిలో ఇన్నివేల ఎకరాల భూమిని తీసుకుని మొత్తం ప్రాజెక్టును రియల్ ఎస్టేట్ వెంచర్ మాదిరి చేసి, ధరలను హైప్ చేసి, ఇన్ సైడ్ ట్రేడింగ్ కు పాల్పడి, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లను తమకు కావల్సిన విధంగా మార్చుకుని ఓ భారీ స్కామ్ గా మార్చారు. జగన్ వచ్చాక ఈ ప్రాంతంలో ఏదైనా కార్యక్రమం చేపడదామన్నా ఏదో రకంగా అడ్డుపుల్ల వేయడం అలవాటుగా మార్చుకున్నారు. ఆందోళనలు, నిరసనల పేరుతో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగేలా టిడిపి వ్యవహరించింది. సింగపూర్ కు చెందిన కొన్ని కంపెనీలకు రియల్ ఎస్టేట్ వ్యాపారం నిమిత్తం 1600 ఎకరాలు కట్టబెట్టిన తీరు, ప్రభుత్వ వ్యయంతో వారి వెంచర్ కు రోడ్లు ,తదితర మౌలిక సదుపాయాల నిమిత్తం ఐదువేల కోట్లు వ్యయం చేయడానికి చంద్రబాబు సిద్దపడ్డారు. సింగపూర్ లో మంత్రిగా పనిచేసిన ఈశ్వరన్ తో చంద్రబాబుకు ఉన్న సంబంధాలు ఏమిటో కాని, ఆయన ద్వారానే పలు లావాదేవీలు నడిపించే యత్నం చేశారు. తీరా చూస్తే ఈశ్వరన్ తాజాగా సింగపూర్ లో అవినీతి కేసులో చిక్కి అరెస్టు కావల్సి వచ్చింది.ఇక్కడ ఒక విషయం గుర్తు చేయాలి. సింగపూర్ కంపెనీల పేరుతో సాగే ఇలాంటి కార్యకలాపాలన్ని ఆయా దేశాలకు నష్టదాయకమని కొన్ని అనుభవాలు చెబుతున్నాయి. ✍️ఉదాహరణకు చైనాలో షెంజెన్ అనే ప్రాంతంలో సింగపూర్ కంపెనీలు నిర్మించిన పారిశ్రామికవాడ పెద్ద వివాదంగా మారి,చివరికి చైనా ప్రభుత్వం వారిని అక్కడ నుంచి పంపించవలసి వచ్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. రాధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ సిఫారస్ లను గత టిడిపి ప్రభుత్వం పట్టించుకోని విషయాన్ని కూడా కాగ్ నివేదిక ప్రస్తావించింది.నిజానికి పలువురు నిపుణులు విజయవాడ,గుంటూరు మద్య పంట పొలాలలో రాజదాని నిర్మాణం చేయవద్దని స్పష్టంగా చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు. తనకు కావల్సిన వ్యాపారవేత్తలతో,రాజకీయనేతలతో ఒక కమిటీని వేసుకుని తాను అనుకున్నదే జరిగేలా ప్రయత్నించారు. ఇక్కడ భూమి భారీ నిర్మాణాలకు అనువైనది కాదని తెలిసినా, కేవలం పునాదులకే వందల కోట్ల వ్యయం అవుతుందని అంచనాలు వచ్చినా, వాటిని పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం నిర్ణయాలు చేయడం ఏపీకి శాపంగా మారింది. అమరావతి రైతులు త్యాగాలు చేశారంటూ విస్తృతంగా ప్రచారం చేశారు. నిజానికి వారికి అభివృద్ది చేసిన ప్లాట్లు ఇవ్వడం అంటే అదే పెద్ద లాభం. దానికి తోడు ఎకరాకు ఏబై వేల రూపాయల చొప్పున కౌలు చెల్లిస్తున్నారు. మరి ఇందులో వీరు చేసిన త్యాగం ఏమిటో తెలియదు. శుభ్రంగా పొలం పనులు చేసుకునేవారిని చెడగొట్టి వారికి ఉత్తపుణ్యానికి కౌలు చెల్లించవలసిరావడం సరైనదేనా అన్న చర్చ ఉంది.పైగా అవసరానికి మించి ఉన్న భూములను వెనక్కి ఇవ్వడానికి వీలు లేకుండా ఆనాటి ప్రభుత్వం పొలం గట్టన్నిటిని దున్నేసింది. ✍️ఇలా అనేక రకాలుగా తప్పులు చేసిన ఫలితంగా అమరావతి రాజధాని అన్నది ఒక భ్రమగానే మిగిలింది. చంద్రబాబు ప్రభుత్వం ప్రతిదీ ఊహాజనిత ఫోటోలతో బాహుబలి సెట్టింగ్ ల గ్రాఫిక్ వీడియోలతో జనాన్ని మాయ చేయాలని విఫల యత్నం చేసింది. చివరికి స్కాముల రాజధానిగా అమరావతి మారడం దురదృష్టం. షాపూర్ పల్లోంజి సంస్థ ఆద్వర్యంలో నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం వంటి భవనాలలో జరిగిన అవినీతి బహిర్గతమైంది. చివరికి కేంద్ర ఆదాయపన్ను శాఖే చంద్రబాబునాయుడుకు నోటీసులు పంపించి రూ. 118 కోట్ల నల్లధనానికి లెక్కలు అడిగింది. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ ను వెలికితీసి చంద్రబాబు తన కంపెనీ హెరిటేజ్ కొన్న భూములకు, లింగమనేని రమేష్ కు ఉన్న 350 ఎకరాల భూమికి లబ్ది చేకూర్చేలా రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్చారన్న అభియోగంపై కేసు పెట్టింది. అందులో కూడా చంద్రబాబు,ఆయన కుమారుడు లోకేష్ లు నిందితులుగా ఉన్నారు.అస్సైన్ మెంట్ లాండ్ కేసు కూడా వీరికి చుట్టుకుంటోంది. జగన్ ప్రభుత్వం చేసిన వాదనలను ఒకరకంగా కాగ్ కూడా బలపరిచిందని అనుకోవచ్చు. ఏది ఏమైనా అలివికాని పనులు చేస్తామంటూ బీరాలు పోవడం, దానిని కుంభకోణాల మయం చేయడం ,చివరికి అవినీతి కేసులలో చిక్కుకోవడం.. ఇదంతా చంద్రబాబు స్వయంకృతాపరాధం. 2014లో చేతికి వచ్చిన మహదవకాశాన్ని చంద్రబాబు ఇలా కాలదన్నుకుని ఇప్పుడు జైలుపాలయ్యారు. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
అమరావతితో ఆంధ్రప్రదేశ్‌పై భారీ ఆర్థిక భారం.. ‘కాగ్’ నివేదిక.. ఇంకా ఇతర అప్డేట్స్
-
అమరావతి నిర్మాణంపై కాగ్ సంచలన నివేదిక
అమరావతి: గత చంద్రబాబు ప్రభుత్వంలో చేపట్టిన అమరావతి రాజధాని నిర్మాణంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) సంచలన నివేదిక వెల్లడించింది. సీఆర్డీఏతో రాష్ట్రంపై భారీ ఆర్థిక భార పడనుందని, ప్రస్తుతంతో పాటు భవిష్యత్‌లో కూడా ఆర్థిక భారం పడనుందని పేర్కొంది. అమరావతి నిర్మాణానికి సంబంధించి నిపుణల కమిటీ సిఫార్సులను అప్పటి చంద్రబాబు సర్కారు పరిగణలోకి తీసుకోలేదని స్పష్టం చేసింది. మాస్టర్ ప్లాన్ తయారీ కాంట్రాక్ట్‌లను నామినేషన్ పద్ధతిలో ఇచ్చేశారని తెలిపింది. సలహాదారు సంస్థలకు నామినేషన్లపై రూ. 28 కోట్లు ఇవ్వడాన్ని కాగ్ తప్పుబట్టింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రజా వేదిక నిర్మాణం జరిగిందని పేర్కొంది. -
కరెంటును కమ్మేసిన ‘బాబు’ అవినీతి
సాక్షి, అమరావతి: చంద్రబాబు సీఎంగా ఉన్నన్ని రోజులూ విద్యుత్ శాఖను అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా దోచుకున్నారు. వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. ఇందుకు నిదర్శనం ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు). అనవసర పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లతో పాటు అధిక బిడ్డింగ్, నాణ్యతలేని బొగ్గు సేకరణ, విదేశీ బొగ్గు కొనుగోలు వరకూ దేనినీ వదిలిపెట్టలేదు. వీటిలో అవినీతిని సాక్షాత్తూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్)నే వెల్లడించింది. ముడుపుల కోసం విద్యుత్ రంగాన్ని కకావికలం చేసి, డిస్కంలను అప్పులపాలు చేసి, విద్యుత్ వ్యవస్థను కుంగదీసి భారీ అవినీతిని పెంచి పోషించిన ‘బాబు’ను అరెస్ట్ చేయడం ఏమాత్రం తప్పు కాదని ఇంధన రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవినీతి చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే అవసరం లేకపోయినా ఏకంగా 2 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్ళకు ఆర్డర్లు ఇచ్చారు. 2014 మే నుంచి 2015 అక్టోబరు వరకు దాదాపు ఏడాదిన్నరలోనే 13,180 మిలియన్ యూనిట్ల ప్రైవేటు విద్యుత్ కొన్నారు. దీని విలువ రూ.8,286 కోట్లకు పైనే. ఇందులో కొంత విద్యుత్‌ను ఎక్కడా లేని విధంగా యూనిట్ రూ.10కు కొన్నారు. జెన్కో విద్యుత్ యూనిట్ రూ.4.50 మాత్రమే ఉంది. అయితే జెన్కో ఉత్పత్తి పెంచకుండా చంద్రబాబు ఎంత డబ్బు ఖర్చు చేసైనా ప్రైవేటు కొనుగోళ్ళకే ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో రూ. 15 వేల కోట్ల అవకతవకలు జరిగినట్లు ఆరోపణ. ఇందులో ప్రైవేటు ఉత్పత్తిదారుల నుంచి అప్పటి ప్రభుత్వ పెద్దలకు దాదాపు రూ.4 వేల కోట్లు ముడుపులుగా అందినట్లు అంచనా. దేశంలోనే అతిపెద్ద విద్యుత్ ట్రేడింగ్ కార్పొరేషన్ అయిన ఇండియన్ ఎనర్జీ ఎక్సే్ఛంజ్ (ఐఈఎక్స్) ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి రాసిన లేఖలో చంద్రబాబు ప్రభుత్వం తక్కువ ధరకు విద్యుత్ దొరుకుతున్నా అధిక ధరలకు ప్రైవేటు నుంచి కొంటున్న విషయాన్ని బయటపెట్టింది. మూసేస్తే రూ.675.69 కోట్లు నష్టం చంద్రబాబు హయాంలో బొగ్గు కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్వాకాలను కాగ్ కడిగిపారేసింది. ఇష్టారాజ్యంగా బొగ్గు కొనుగోళ్లు, థర్మల్ విద్యుత్ కేంద్రాలను బలవంతంగా మూసివేయడం వల్ల ఏపీ జెన్కోకు భారీ నష్టం వాటిల్లిన వైనాన్ని ఎండగట్టింది. నాసిరకం బొగ్గును అధిక ధరకు కొన్న ప్రభుత్వ పెద్దల తీరును తప్పుబట్టింది. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎన్టీటీపీఎస్), రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం (ఆర్టీపీపీ) 2011–12లో 22.235 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశాయి. కానీ 2015–16 నాటికి విద్యుదుత్పత్తి 19.359 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. దీని వల్ల విద్యుదుత్పత్తి ధర యూనిట్‌కు రూ.2.94 నుంచి రూ.4.34కు పెరిగింది. బలవంతంగా మూసివేయడం వల్ల ఆ రెండు విద్యుత్ కేంద్రాలకు రూ.675.69 కోట్లు నష్టం వాటిల్లింది. అధిక ధరకు నాణ్యత లేని బొగ్గు మహానది కోల్ లిమిటెడ్ (ఎంసీఎల్) బొగ్గు సరఫరా చేయడంలేదనే సాకు చూపి 2014 జూలైలో 26.61 లక్షల మిలియన్ టన్నుల బొగ్గును, 2015–16లో ఎలాంటి అవగాహన ఒప్పందం కుదుర్చుకోకుండానే 63.5 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్ నుంచి ప్రీమియం ధరకు టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. 2014 నుంచి 2016 వరకూ కోల్ ఎనాలిసిస్ నివేదికలు, కోల్ ఇన్వాయిస్లను సమీక్షిస్తే జెన్కో కొన్న బొగ్గు నాణ్యతలో భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు తేలింది. నాణ్యత లేని రూ.3,179.32 కోట్ల విలువైన 86.02 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును అధిక ధరకు కొనడం వల్ల జెన్కోకు రూ.918.61 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కాగ్ సైతం తేల్చింది. విదేశీ బొగ్గునూ నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరకు కొన్నారు. ఇందులో ప్రభుత్వ సంస్థలను ముందు పెట్టి తెర వెనుక కోల్ మాఫియా చక్రం తిప్పింది. రూ.500 కోట్లకు పైగా ప్రజాధనం వృథా అయ్యింది. ఇందులో రూ.200 కోట్లు బాబు అండ్ కోకు ముడుపులుగా వెళ్లాయనే ఆరోపణలున్నాయి. -
మిగులు నుంచి లోటుకు.. తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదిక
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ రాష్ట్రం 2018–19 వరకు రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉంది. కానీ ఆ తర్వాత క్రమంగా రెవెన్యూ లోటు నమోదయింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.9,335 కోట్ల రెవెన్యూ లోటు, రూ.46,639 కోట్ల ద్రవ్యలోటు ఏర్పడింది. మిగులు నుంచి లోటుకు వెళ్లినా అంతకుముందు ఏడాదితో పోలిస్తే రెవెన్యూ, ద్రవ్యలోటు పరిమాణం కాస్త తగ్గింది. 2020–21లో రెవెన్యూ లోటు రూ.22,298 కోట్లు కాగా, ద్రవ్యలోటు రూ.49,038 కోట్లుగా ఉంది. 2021–22లో నమోదైన రెవెన్యూ లోటు జీఎస్డీపీలో 0.81 శాతం కాగా, ద్రవ్యలోటు 4.06 శాతంగా నమోదయింది. అదే రెవెన్యూ రాబడులతో పోలిస్తే 27 శాతం ద్రవ్యలోటు ఏర్పడింది..’అని కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను అకౌంట్ల నిర్వహణకు సంబంధించిన పరిశీలన అనంతరం కాగ్ రూపొందించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం.. వర్షాకాల సమావేశాల చివరిరోజు ఆదివారం శాసనసభ, మండలి ముందు ఉంచింది. ఈ నివేదికలో వివిధ ప్రభుత్వ శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులు, వేజ్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్‌లకు వెళ్లి ప్రభుత్వం తెచ్చుకున్న అడ్వాన్సులు, పద్దుల వారీగా చూపెట్టాల్సిన ఖర్చుల్లో తేడాలు, చూపెట్టిన నగదు నిల్వ, ఖర్చుల్లో తేడాలు, రెవెన్యూ రాబడులు, ప్రభుత్వ అప్పుల గణాంకాలను వెల్లడించింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరానికి గాను వివిధ ప్రభుత్వ శాఖల ఆర్థిక పారదర్శకతపై ఆడిట్ నిర్వహించి కాగ్ రూపొందించిన నివేదిక అందుబాటులో ఉన్నప్పటికీ ప్రభుత్వం సభ ముందుంచకపోవడం గమనార్హం. 2021–22 అకౌంట్ల నిర్వహణలో కాగ్ గుర్తించిన ముఖ్యాంశాలు ► 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి అడ్వాన్సులు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో కనీస నగదు నిల్వ ఉంచింది 76 రోజులు. స్పెషల్ డ్రాయింగ్ సౌకర్యం (ఎస్డీఎఫ్) వినియోగించుకుంది 30 రోజులు. వేజ్ అండ్ మీన్స్కు వెళ్లింది 159 రోజులు. ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లింది 100 రోజులు. ► అడ్వాన్సులు తీసుకున్న 289 రోజుల్లో (ఎస్డీఎఫ్ 30, వేజ్ అండ్ మీన్స్ 159, ఓడీ 100 రోజులు కలిపి) ఎస్డీఎఫ్ కింద రూ.9,636 కోట్లు, వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్సుల రూపంలో రూ.34,969 కోట్లు వినియోగించుకుంది. ఓడీ కింద రూ.22,669 కోట్లు తెచ్చుకుంది. ► 2021–22 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అప్పుల రూపంలో తెచ్చిన రూ.42,936 కోట్లు, ప్రజాపద్దు కింద వినియోగించాల్సిన రూ.3,773 కోట్లను ద్రవ్యలోటు కింద చూపెట్టారు. ► ఆర్థిక జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్ఆర్బీఎం) కింద 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం మూడు లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఇందులో రెవెన్యూ మిగులుతో ఖజానా నిర్వహించాలనేది మొదటి లక్ష్యం కాగా, రూ.9,335 కోట్లు రెవెన్యూ లోటు ఏర్పడింది. జీఎస్డీపీలో 3 శాతానికి మించకుండా ద్రవ్యలోటు ఉండాలనేది రెండోలక్ష్యం కాగా, అది 4.06 శాతంగా నమోదైంది. నికర అప్పులు జీఎస్డీపీలో 25 శాతం మించవద్దనే మూడో లక్ష్యం కూడా నెరవేరలేదు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి జీఎస్డీపీలో 27.40 శాతం అప్పులు మిగిలాయి. ► రెవెన్యూ రాబడుల కింద వచ్చిన రూ.1,27,468 కోట్లలో దాదాపు 50 శాతం అనివార్య వ్యయం కిందనే ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇందులో రూ.30,375 కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలకు, రూ.19,161 కోట్లు వడ్డీ చెల్లింపులు, రూ.14,025 కోట్లు పింఛన్ల కింద ఖర్చు పెట్టారు. ► ఏప్రిల్ 1, 2021 నాటికి రాష్ట్ర ప్రభుత్వ నికర అప్పులు రూ.2,78,017.64 కోట్లు. ఆ ఏడాదిలో తీసుకున్న అప్పులు రూ.43,593.94 కోట్లు. 2022 మార్చి 31 నాటికి నికర అప్పులు రూ.3,21,611.58 కోట్లు. ► పలు కార్పొరేషన్లు, సంస్థలకు రుణాలు తీసుకునేందుకు గాను రూ.40,449 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం గార్యంటీ ఇచ్చింది. దీంతో 2022 మార్చి 31 నాటికి ప్రభుత్వ నికర గ్యారంటీల మొత్తం రూ.1,35,283 కోట్లకు చేరింది. ► మొత్తం అప్పుల్లో రూ.28,883 కోట్లు మూలధన వ్యయం కింద, రూ.8,469 కోట్లు రుణాలు, అడ్వాన్సుల చెల్లింపులకు వెచ్చించారు. జీఎస్డీపీకి సమాంతరంగా మూలధన వ్యయం లేదు. జీఎస్డీపీలో 2.51 శాతం మాత్రమే మూలధన పద్దు కింద వెచ్చించారు. ► వివిధ మేజర్ పద్దులను ఆడిట్ చేయగా, ఉండాల్సిన నగదు నిల్వ కంటే తక్కువ ఉంది. ► 2021–22 ఆర్థిక సంవత్సరంలో వివిధ ప్రభుత్వ పథకాల అమలుకు గాను కేంద్రం నేరుగా ఇచ్చిన రూ.18,392 కోట్లు ప్రభుత్వ అకౌంట్లలో కనిపించలేదు. తెలంగాణ లైవ్‌స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ, తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లకు పలు పథకాల అమలు కోసం ఈ నిధులను కేంద్రం ఇచ్చింది. ► హౌసింగ్, పరిశ్రమల శాఖలకు బడ్జెట్లో కేటాయించిన మొత్తం కంటే చాలా తక్కువ ఖర్చు పెట్టారు. బడ్జెట్ అంచనాల రూపకల్పనలో ఆయా శాఖలకు స్పష్టత లేని కారణంగానే ఇది జరిగింది. ► ఇక ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కంట్రిబ్యూటరీ పింఛన్ పథకం కోసం ప్రతి నెలా వసూలు చేసే మొత్తంలో రూ.2,074.22 కోట్లు మాత్రమే నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్)కు జమ చేసింది. మరో రూ.313.72 కోట్లు జమ చేయాల్సి ఉంది. -
నీళ్లలా ఇంత ఖర్చా?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై తీవ్ర అభ్యంతరాలతో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించినట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టు ఆర్థిక సుస్థిరత, భవిష్యత్తు మనుగడపై కాగ్ తీవ్ర సందేహాలను వ్యక్తం చేసినట్లు నీటిపారుదల శాఖ వర్గాల ద్వారా తెలియవచ్చింది. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌లో భాగంగా ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చడం ద్వారా అనవసర భారం పడినట్లు ఆక్షేపించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుపై రెండేళ్లపాటు సుదీర్ఘ ఆడిట్ నిర్వహించిన తర్వాత కాగ్ ఈ మేరకు ప్రాథమిక నివేదికను రూపొందించింది. ముఖ్యంగా ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న రుణాలకు వడ్డీలతో కలపి చెల్లింపులకు ఏటా రూ. 13 వేల కోట్లు, ప్రాజెక్టు విద్యుత్ చార్జీలకు ఏటా మరో రూ. 12 వేల కోట్లు, ప్రాజెక్టు నిర్వహణ, మరమ్మతులకు రూ. 270 కోట్లు కలిపి ఏటా సుమారు రూ. 25 వేల కోట్ల వ్యయం కానుందని కాగ్ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎకరం ఆయకట్టు సాగుకు కాళేశ్వరం పెట్టుబడి వ్యయం రూ. 6.4 లక్షలు కానుందని స్పష్టం చేసినట్లు తెలియవచ్చింది. ప్రాజెక్టు 12 శాతమే పూర్తి... కాళేశ్వరం ప్రాజెక్టులోని 56 పనుల్లో ఇప్పటివరకు 12 మాత్రమే పూర్తయ్యాయని, మరో 40 పనులు 3 శాతం నుంచి 99 శాతం వరకు, మిగిలిన 4 పనులు ఇంకా ప్రారంభం కాలేదని నివేదికలో కాగ్ వివరించినట్లు తెలిసింది. ప్రాజెక్టు భూసేకరణ కోసం 98,110 ఎకరాలకుగాను 63,972 ఎకరాలనే సేకరించారని తప్పుబట్టింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం సేకరించిన అప్పుల్లో రూ. 1,700 కోట్లను ఇతర అవసరాలకు దారి మళ్లించినట్లు ఆరోపించింది. ఉన్నతాధికారుల భేటీ... కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈ మేరకు కాగ్ తీవ్ర సందేహాలు, అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వివరణలు ఇచ్చేందుకు రాష్ట్ర నీటిపారు దల శాఖ మల్లగుల్లాలు పడుతోంది. కాగ్ ని వేదికపై బుధవారం ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లు చర్చించారు. దీనిపై ప్రభుత్వం నుంచి వివరణలను తీసుకున్నాక తుది నివేదిక సమర్పించే అవకాశం ఉంది. రుణాలు, వడ్డీల భారం.. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 6 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కలిపి 15 భారీ రుణాల రూపంలో మొత్తం రూ. 97,449 కోట్ల రుణాలను రాష్ట్ర ప్రభు త్వం తీసుకుంది. వార్షిక వడ్డీ రేట్లు 8.25 శాతం నుంచి 10.9 శాతం వరకు ఉన్నాయి. 2023–24 నుంచి 2034–35 మధ్యకాలంలో ఏటా రూ. 13 వేల కోట్లను వడ్డీలతో సహా రుణాల తిరిగి చెల్లింపుల కోసం కట్టాల్సి ఉండనుంది. ఇప్పటివరకు పొందిన రుణాల తిరిగి చెల్లింపులు 2039–40 వరకు కొనసాగనున్నాయి. దీని నిర్మాణానికి ఇప్పటివరకు రూ. 85 వేల కోట్లకుపైగా ఖర్చు చేయగా నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం రూ. 1.50 లక్షల కోట్లకు ఎగబాకనుందని కాగ్ అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు కింద ఎకరా ఆయకట్టు సాగుకు రూ. లక్ష వరకు కరెంట్ బిల్లు కానుందని ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. -
సామాజిక రంగంపై వ్యయం.. అభివృద్ధికి సంకేతం
సాక్షి, అమరావతి: సామాజిక రంగంపై వెచ్చించే వ్యయం అభివృద్ధికి తార్కాణంగా నిలుస్తుంది. సామాజిక బాధ్యతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిగా నిర్వహించాలి. మొక్కుబడిగా కాకుండా ఎంత బాగా నెరవేరుస్తున్నారో చెప్పేందుకు సామాజిక రంగంపై వెచ్చించే వ్యయమే కొలమానం. సామాజిక రంగంపై వ్యయంలో దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలవడం ప్రభుత్వ దృక్పథానికి నిదర్శనంగా నిలుస్తోంది. 2022 –23 ఆర్థిక ఏడాదికి సంబంధించి జనవరి వరకు రాష్ట్రాల వారీగా సామాజిక రంగంలో వ్యయాలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గణాంకాలను రూపొందించింది. వాస్తవ వ్యయాలను కాగ్ ప్రతి నెలా గణాంకాల రూపంలో పొందుపరుస్తుంది. విద్య, వైద్యం, పట్టణ, గ్రామీణాభివృద్ధి, పౌష్టికాహారం, నీటి సరఫరా, పారిశుద్ధ్యం నిర్వహణకు చేసే ఖర్చును సామాజిక రంగాలపై వ్యయంగా పరిగణిస్తారు. ఆ మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు సామాజిక రంగంపై రూ.82,229.70 కోట్లను ఏపీ ప్రభుత్వం వ్యయం చేసింది. ► ప్రజారోగ్యం, విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరచడంతోపాటు రికార్డు స్థాయిలో వైద్య పోస్టులను భర్తీ చేసి ప్రజలకు మెరుగైన చికిత్సను అందిస్తున్న విషయం తెలిసిందే. కొత్త మెడికల్ కాలేజీలతో పాటు ప్రస్తుతం ఉన్న కాలేజీలు, ఆస్పత్రుల రూపు రేఖలు మార్చేందుకు రూ.16,222.85 కోట్లను వెచ్చిస్తోంది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఖరీదైన చికిత్సలు ఉచితంగా అందించడంతోపాటు కొత్త వాహనాలను సమకూర్చడం ద్వారా 108, 104 వ్యవస్థను బలోపేతం చేసింది. ► ప్రాథమిక విద్యతో పాటు సెకండరీ, ఉన్నత విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. మన బడి నాడు–నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలను మార్చేసి ఇంగ్లిష్ మీడియంలో చక్కగా చదువుకునే వాతావరణాన్ని కల్పిస్తోంది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో 11 రకాల వసతుల కల్పనకు రూ.16,450 కోట్లను వ్యయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తొలిదశ కింద 15,715 స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనను పూర్తి చేయడమే కాకుండా రెండో దశలో మరో 22,344 స్కూళ్లలో పనులను చేపట్టింది. మరోపక్క పిల్లలకు జగనన్న గోరుముద్ద కింద పౌష్టికాహారం అందిస్తున్న విషయం తెలిసిందే. మధ్యాహ్న భోజనానికి గత టీడీపీ హయాంలో బడ్జెట్లో రూ.600 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.1908 కోట్లు వ్యయం చేస్తోంది. గర్భిణులు, పిల్లలకు అంగన్ వాడీల్లో పౌష్టికాహారం సరఫరాకు ప్రాధాన్యం ఇస్తూ వ్యయాన్ని భారీగా పెంచింది. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ అమలు చేస్తోంది. పట్టణాలు, గ్రామాల అభివృద్ధితో పాటు ప్రజలకు సురక్షిత మంచినీటి సరఫరాకు పెద్ద ఎత్తున వ్యయం చేస్తోంది. పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తోంది. ► వేతన సవరణను అమలు చేయడంతో పాటు అవసరమైన రంగాల్లో కొత్త పోస్టులను భర్తీ చేయడంతో ఉద్యోగుల జీతాల వ్యయం భారీగా పెరిగింది. గత ఆర్థిక ఏడాదిలో జనవరి వరకు ఉద్యోగుల వేతనాల రూపంలో రూ.34,593 కోట్లు చెల్లించగా ప్రస్తుత ఆర్థిక ఏడాది జనవరి వరకు రూ.41,270 కోట్లు వ్యయం చేసినట్లు కాగ్ గణాంకాలు వెల్లడించాయి. -
AP: 2021-22లో భారీగా తగ్గిన అప్పులు.. కాగ్ నివేదిక చెప్పింది ఇదే..
సాక్షి, అమరావతి: 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర అప్పులు భారీగా తగ్గాయి. దీంతో ఆ ఏడాది ద్రవ్య లోటు అదుపులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ ఖరారు చేసిన అకౌంట్స్ ప్రకారం.. 2021–22 ఆర్థిక ఏడాదిలో ద్రవ్య లోటు రూ.25,011 కోట్లుగా ఉందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గురువారం అసెంబ్లీలో 2023–24 వార్షిక బడ్జెట్ సమర్పణ సందర్భంగా వెల్లడించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఇది 2.08 శాతంగా ఉందని మంత్రి తెలిపారు. అంతేకాక.. ఇది ఎఫ్ఆర్బీఎం నిబంధనల కన్నా తక్కువన్నారు. వాస్తవానికి.. ఆ ఏడాది బడ్జెట్ అంచనాల్లో ద్రవ్యలోటు రూ.37,029 కోట్లుగా ప్రతిపాదించారు. అలాగే, 2021–22 ఆర్థిక ఏడాది రెవెన్యూ లోటు రూ.8,610 కోట్లుగా కాగ్ ఖరారు చేసిందని, ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 0.72 శాతంగా ఉందని మంత్రి వివరించారు. మరోవైపు.. ద్రవ్య లోటు, రెవెన్యూ లోటును తగ్గించేందుకు 2023–24 ఆర్థిక ఏడాది బడ్జెట్లో గట్టి ప్రయత్నమే చేశారు. 2023–24 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్ర అప్పులు రూ.4,83,008.96 కోట్లకు చేరుతాయని, ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 33.32 శాతంగా ఉంటుందని బడ్జెట్ పత్రాల్లో ప్రభుత్వం స్పష్టంచేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) ముగిసే నాటికి రాష్ట్ర అప్పులు రూ.4,26,233.92 కోట్లుగా ఉంటాయని పేర్కొంది. చదవండి: అక్కచెల్లెమ్మలకు అగ్రపీఠం -
అభివృద్ధిలో ‘బ్లూ ఎకానమీ’ కీలకపాత్ర
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ పురోగతిలో ‘బ్లూ ఎకానమీ’ కీలక పాత్ర పోషించనుందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) గిరీష్ చంద్ర (జీసీ) ముర్ము విశ్లేషించారు. సుస్థిర వృద్ధి, సామాజిక, ఆర్థిక సంక్షేమం వంటి అంశాల విసృత ప్రాతిపదికన ఎకానమీ పురోగతికి సంబంధించి మున్ముందు బ్లూ ఎకానమీ కీలకం కానుందని ఆయన అన్నారు. బ్లూ ఎకానమీ ఇస్తున్న అవకాశాలు, సవాళ్లు అన్న అంశంపై ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు.. ► భారత్ 7,517 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతాన్ని కలిగి ఉంది. ఇది తొమ్మిది తీరప్రాంత రాష్ట్రాలు, 1,382 ద్వీపాలను కలుపుతోంది. సముద్ర తీవ్ర ప్రాంత ఆర్థిక వ్యవస్థ 40 లక్షలకు పైగా మత్స్యకారులకు, ఇతర తీర ప్రాంత వర్గాలకు చక్కటి ఆర్థిక అవకాశాలను అందిస్తోంది. ► ఇక దాదాపు 199 ఓడరేవులు ఉన్నాయి, వీటిలో 12 ప్రధాన ఓడరేవులు ప్రతి సంవత్సరం సుమారు 1,400 మిలియన్ టన్నుల సరుకు రవాణాకు దోహదపడుతూ, దేశ పురోగతిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. ► రెండు మిలియన్ చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న భారతదేశ ప్రత్యేక ఆర్థిక మండలి క్రూడ్, సహజవాయువులుసహా విస్తారమైన వనరులను కలిగిఉంది. ► సుస్థిర అభివృద్ధి లక్ష్యం (ఎస్డీజీ) సాధనకు బ్లూ ఎకానమీ కీలక భూమికను పోషించనుంది. బ్లూ ఎకనమీ అంటే.. ప్రపంచ బ్యాంకు నిర్వచనం ప్రకారం క్లుప్తంగా బ్లూ ఎకానమీ అర్థాన్ని పరిశీలిస్తే... ఇది సము ద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ. సముద్ర పర్యావరణ వ్యవస్థను పరిరక్షించుకుంటూ ఇందుకు అనుగుణమైన ఆర్థిక వృద్ధి, మెరుగైన జీవనోపాధి, ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడం దీని లక్ష్యం. ఉపాధి కల్పన మెరుగుదలకు సముద్ర వనరుల ను స్థిరంగా, పటిష్ట స్థాయిలో వినియోగించుకోవడాన్ని ఇది సూచిస్తుంది. ‘‘సముద్రాలు, సముద్ర తీరాలకు సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలే బ్లూ ఎకానమీ’’ అని యూరోపియన్ కమిషన్ నిర్వచించింది. 2022–2023లో భారతదేశం జీ20 అధ్యక్ష పదవిని చేపట్టడంతో, ఈ సందర్భంగా బ్లూ ఎకానమీకి సంబంధించి జరుగుతున్న ఎస్ఏఐ20 సదస్సు బాధ్యతలను కాగ్ నిర్వహిస్తున్నారు. బ్లూ ఎకానమీపై అధ్యయనంపై ఈ సదస్సు దృష్టి పెట్టనుంది. సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన అభివృద్ధికి ప్రభుత్వాలు తమ ప్రయత్నాలను, విధానాలను ఎలా రూపొందించవచ్చు, అమలుచేయవచ్చు వంటి అంశాలపై ఎస్ఏఐ20 అధ్యయనం చేస్తుంది. -
బడ్జెట్ అంచనా 53 వేల కోట్లు.. వచ్చింది 11వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆశించిన ఆర్థిక సహకారం అందడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ నాటికి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన మొత్తం నిధుల్లో కేవలం 20 శాతం మాత్రమే వచ్చాయి. 2022–23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దుల కింద రూ.53 వేల కోట్లకుపైగా వస్తాయని రాష్ట్రం అంచనా వేయగా, ఇప్పటివరకు కేవలం రూ.11 వేల కోట్లే రావడం గమనార్హం. మరో ఐదు నెలలు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో ఇంకా 80శాతం నిధులు రావాల్సి ఉండగా, అందులో సగం రావడం కూడా అనుమానమేనని రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దుపై వివక్ష వాస్తవానికి, కేంద్రం నుంచి రెండు పద్దుల రూపంలో రాష్ట్రాలకు ఆర్థిక ఆసరా అందుతుంది. ఇందులో రాష్ట్రానికి చట్టబద్ధంగా రావాల్సిన పన్నుల్లో వాటా ఒకటైతే, వివిధ పథకాల అమలుకు ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ మరొకటి. ఈ రెండు పద్దులను పరిశీలిస్తే కేంద్ర పన్నుల్లో వాటా కింద గత ఏడు నెలల్లో రాష్ట్రానికి రూ.5,911.06 కోట్లు (47.64 శాతం) వచ్చాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది పన్నుల్లో వాటా కింద రూ. 12,407.64 కోట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక, గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దు అయితే పూర్తిగా వివక్షకు గురవుతోంది. ఈ పద్దు కింద 2022–23 ఆర్థిక సంవత్సరానికి రూ.41,001.73 కోట్లు వస్తాయని రాష్ట్రం అంచనా వేయగా.. అందులో కేవలం 13.64 శాతం అంటే... రూ. 5,592.66 కోట్లు మాత్రమే వచ్చాయని కాగ్ గణాంకాలు పేర్కొంటున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలకు కొదవే లేదు తెలంగాణకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దులో కోత పెడుతున్న కేంద్రం బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రం విచ్చలవిడిగా మంజూరు చేస్తోంది. రాష్ట్రాలు చిన్నవైనా, పెద్దవైనా, వాటి వార్షిక బడ్జెట్ పద్దు ఎంత అన్న దానితో సంబంధం లేకుండా 35 నుంచి 80 శాతం వరకు నిధులు ఇప్పటికే మంజూరు చేసింది. ఇందులో గుజరాత్‌కు అయితే దాదాపు 80 శాతం నిధులు ఇచ్చేసింది. కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హరియాణా, ఒడిశా, త్రిపుర... ఇలా ఆ పార్టీ అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి తెలంగాణ కంటే ఎక్కువగానే గ్రాంట్ ఇన్ ఎయిడ్ సాయం అందడం గమనార్హం. పన్నుల్లో వాటా కింద కూడా ఈ రాష్ట్రాలకు కేంద్రం.. ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువే పంపిందని కాగ్ లెక్కలు వెల్లడిస్తున్నాయి. -
సీఎం చెప్పినవన్నీ అక్షర సత్యాలే
సాక్షి, అమరావతి : రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో చెప్పినవన్నీ అక్షరసత్యాలేనని ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టంచేశారు. వీటిని జీర్ణించుకోలేకే టీడీపీ నేత, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రివిలేజ్ నోటీసు ఇవ్వాలంటూ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారని బుగ్గన మండిపడ్డారు. ప్రభుత్వం చేసిన లావాదేవీలను కాగ్ అసలు ప్రశ్నించలేదని, కేవలం విధానపరమైన అభ్యంతరాలనే వ్యక్తంచేసిందని బుగ్గన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏం తెలిపారంటే.. నివేదికలో తొలి నాలుగేళ్లు టీడీపీ పాలనపైనే.. టీడీపీ హయాంలో జరిగిందేమిటో.. గత మూడున్నర ఏళ్లలో ఆర్థిక నిర్వహణ ఎలా ఉందో అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ సీఎం వివరించారు. కాగ్ తన నివేదికలో 2020–21 సంవత్సరపు ఆర్థిక పరిస్థితిపైనా, అంతకుముందు 2015–16 నుంచి 2020–21 సంబంధించిన ఆర్థిక అంశాలపైనా వ్యాఖ్యానించింది. నివేదికలోని అంశాల్లో తొలి నాలుగేళ్ల టీడీపీ పరిపాలనలోని ఆర్థిక వ్యవహారాలపైనే అనేది గ్రహించాలి. ఇందులో టీడీపీ పాలనలో జరిగిన ఆర్థిక ఉల్లంఘనలు, అవకతవకలున్నాయి. టీడీపీ పాలనలో ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు విరుద్ధంగా సుమారు రూ.17వేల కోట్లు అదనంగా అప్పుచేస్తే దానిని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గుర్తించి తీవ్రంగా తప్పుబట్టింది. టీడీపీ పాలనలో అతిక్రమించి చేసిన అదనపు అప్పులను కారణంగా చూపి, ఇప్పుడు మా పాలనలో అప్పులు చేయరాదని నిర్దేశించింది. ఎఫ్ఆర్బీఎంను ఉల్లంఘించి అప్పులు ఎక్కువగా ఎవరు చేశారనేది ప్రజలు గ్రహించ లేరనుకుంటున్నారా? కాగ్ నివేదికలో ప్రధానంగా పేర్కొన్న అంశం.. లావాదేవీల సర్దుబాట్లకు సంబంధించినది. ప్రత్యేక బిల్లులపై ఆర్థికమంత్రి హోదాలో నేను గతంలోనే దీనిపై వివరంగా సమాధానం చెప్పాను. ప్రత్యేక బిల్లులు యనమల సమయంలోనూ జరిగాయి.. సీఎఫ్ఎంఎస్ రిపోర్టింగ్ విధానంలో బుక్ అడ్జస్ట్మెంట్ లావాదేవీలను గుర్తించేందుకు మాత్రమే ప్రత్యేక బిల్లులు అంటారు. ఈ వ్యవహారంలో ఎలాంటి నగదు లావాదేవీలు జరగవని యనమలకు బాగా తెలుసు. కానీ, ఆయన ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు, లేనిపోని అభాండాలు వేస్తున్నారు. 2018–19లో టీడీపీ ప్రభుత్వం ఇదే విధంగా 98,049 బుక్ అడ్జస్ట్మెంట్స్ లావాదేవీలను ప్రత్యేక బిల్లులుగా చూపిన విషయం మర్చిపోయారా? అప్పుడు ఆర్థికమంత్రి మీరే కదా? యనమల పేర్కొంటున్న రూ.26,839 కోట్ల ప్రత్యేక బిల్లులు నగదు లావాదేవీలు కావు. అవి కేవలం బుక్ అడ్జస్ట్మెంట్ మాత్రమే. ఈ లావాదేవీల సర్దుబాట్లకు కారణం సీఎఫ్ఎంఎస్లో సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ మాడ్యూల్ లేకపోవడమే. లావాదేవీల నిబద్ధతను కాగ్ ప్రశ్నించలేదు.. ఇక మా ప్రభుత్వం చేసిన లావాదేవీల నిబద్ధతను కాగ్ ప్రశ్నించనేలేదు. కేవలం విధానపరమైన విషయంలో మాత్రమే వారు అభ్యంతరం లేవ నెత్తారు. ఈ సమస్యలన్నీ కూడా సీఎఫ్ఎంఎస్ వ్యవస్థను పటిష్టంగా రూపొందించకపోవడంవల్లే. ఈ కారణంగానే 2020–21లో ప్రత్యేక బిల్లుల ప్రక్రియను వినియోగించాం. దానిని సరిదిద్ది, గత 9 నెలలుగా కాగ్ సలహాల మేరకు స్పెషల్ బిల్లుల విధానం అనేది లేకుండా ‘నిల్ అడ్జస్ట్మెంట్ బిల్లుల’ పద్ధతిలో జమా ఖర్చుల నిర్వహణ జరుగుతోంది. ఇలా రూ 9,124.57 కోట్లకు సంబంధించిన 16,688 బుక్ అడ్జస్ట్మెంట్ లావాదేవీలు జరిగాయి. యనమల తీరుకు చింతిస్తున్నా.. 16,672 లావాదేవీల సర్దుబాట్లు ఒక పీడీ ఖాతా నుంచి మరో పీడీ ఖాతాలోకి మార్చేటపుడు తలెత్తిన లోపాలు మాత్రమే. ఏపీ ఫైనాన్స్ కోడ్ 271 (4) ఆర్టికల్ ప్రకారం.. ఆర్థిక సంవత్సరం ముగిసే సమయంలో ఆయా పీడీ అకౌంట్లలో ఖర్చుకాకుండా మిగిలిన నిధులను ఈ బుక్ అడ్జస్ట్మెంట్ లావాదేవీల ద్వారా ట్రెజరీ అధికారులు పూర్తిగా మురిగిపోయేటట్లుగా చేస్తారు. దీనికి సంబంధించి పదేపదే నేను వివరణలు ఇస్తున్నా అది విజ్ఞులైన యనమల ముందు బధిర శంఖారావంలా మారిపోయిందని చెప్పడానికి చింతిస్తున్నాను. కోవిడ్వల్లే వృద్ధి తగ్గింది ఇక 2020–21లో అతి తక్కువ వృద్ధిరేటు నమోదైందని కాగ్ వెల్లడించినట్లు యనమల చెప్పారు. కరోనాతో ఆ ఆర్థిక సంవత్సరం దేశమంతా అతలాకుతలమైంది. ఇది ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం చూపిందనే విషయాన్ని యనమల కావాలనే విస్మరించడం సబబేనా? అలాగే, కాగ్ నివేదికలో ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు మన రాష్ట్రంలో బాగాలేదని, సరిచేసుకోవాల్సిన అవసరముందని వ్యాఖ్యానించింది. నిజానికి.. రాష్ట్ర విభజన, అనంతర టీడీపీ ఆర్థిక అస్తవ్యస్త పాలన, కోవిడ్ మహమ్మారి విలయతాండవం వంటి కారణాలవల్ల మన ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతిన్నది. అయినా మా ప్రభుత్వం మెరుగైన ఆర్థిక నిర్వహణ చేస్తూ ఇబ్బందులను చక్కదిద్దుతోంది. 2020–21 సంవత్సరానికి రెవెన్యూ వ్యయం 11 శాతం, రెవెన్యూ లోటు 34 శాతంగా ఉందని కాగ్ నివేదిక పేర్కొంది. ఆ సమయంలో కరోనా విలయతాండవం గురించి రాష్ట్ర ప్రజలకు తెలియని అంశంకాదు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో సుమారు రూ.8 వేల కోట్లు తగ్గింది. ఆ సమయంలో మహమ్మారి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.7,130 కోట్లు వ్యయంచేసింది. యనమల అప్రజాస్వామికవాది.. సభను ఏకపక్షంగా నిర్వహిస్తున్నామని యనమల విమర్శించడం విడ్డూరంగా ఉంది. యనమలా.. మీకు రాజకీయ భిక్షపెట్టి, ఒక తండ్రిగా, ఒక గురువుగా చేరదీసిన ఎన్టీ రామారావుకే మీరు స్పీకర్‌గా ఉంటూ నామం పెట్టిన మహానుభావులు. ఎన్టీ రామారావుపై చెప్పులు వేయించిన చంద్రబాబు పార్టీకి దొడ్డిదారిన సహకరించిన అప్రజాస్వామికవాది మీరు. అలాంటి మీరు కూడా ప్రజాస్వామ్యం గురించి, చట్టసభల ఔన్నత్యాన్ని గురించి మాట్లాడే వారే! మీ పాలన పుణ్యమే.. యనమలా.. మీ పాలన పుణ్యమా అని స్థానిక సంస్థలు చాలా కాలంగా డిస్కంలకు (విద్యుత్ సంస్థలకు) కరెంటు బిల్లులు చెల్లించడంలేదు. ఆ బకాయిలు ఇంచుమించు రూ.5,000 కోట్లకు చేరాయి. ఫలితంగా డిస్కంలు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తున్నాయి. ఈ బకాయిలవల్ల డిస్కంలు స్థానిక సంస్థలకు కరెంటు సరఫరా నిలిపేస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆ బకాయీలన్నింటినీ 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి చెల్లించింది. కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన 14వ ఆర్థిక సంఘం మార్గదర్శకాల్లో ఉన్న సౌలభ్యాన్నే ఇందుకు వాడుకున్నాం. ఈ చెల్లింపులనూ యనమల రాద్ధాంతం చేస్తున్నారు. అయితే, మేం తీసుకున్న చర్యలను సమర్థిస్తూ అలా చేయడం సబబేనని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ బకాయిలు చెల్లించకపోతే కాగ్ తీవ్రంగా విమర్శించి ఉండేది. ప్రజల ఖాతాల్లోకి రూ.57,512 కోట్లు జమ ఆ కష్టకాలంలో రెక్కాడితే గాని డొక్కాడని ప్రజలందరూ ఉపాధి కోల్పోయి సురక్షితంగా ఉండటానికి తాపత్రయపడ్డారు. ఈ తరుణంలో వారందరి ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై పడింది. ఓ వైపు ఆదాయ వనరులు పడిపోతున్నా ఏమాత్రం జంకకుండా డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) ద్వారా ప్రజల ఖాతాల్లోకి నేరుగా రూ 57,512 కోట్లు జమచేసి వారిని ఆదుకున్నాం. ఇంత మొత్తంలో ఓ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఖాతాల్లో జమచేసిన సందర్భం కోవిడ్ సమయంలో ఎక్కడాలేదు. -
ప్రభుత్వ ఇన్సూరెన్స్ ప్రీమియం ధరల్ని పెంచాల్సిందే.. పోటీ పడాల్సిందే!
న్యూఢిల్లీ: జీవిత బీమా కంపెనీలు జూలై మాసంలో వ్యాపార పరంగా మంచి వృద్ధిని చూశాయి. నూతన పాలసీల రూపంలో ప్రీమియం ఆదాయం 91 శాతం పెరిగి రూ.39,079 కోట్లు వసూలైంది. 2021 జూలైలో ఎల్ఐసీ సహా 24 జీవిత బీమా సంస్థలు నూతన పాలసీల రూపంలో సంపాదించిన ప్రీమియం ఆదాయం రూ.20,435 కోట్లుగా ఉండడం గమనించాలి. ఈ ఏడాది జూలైలో ఎల్ఐసీ నూతన పాలసీ ప్రీమియం రెండు రెట్లకు పైగా వృద్ధి చెందింది. గతేడాది జూలైలో రూ.12,031 కోట్ల ఆదాయం వసూలు కాగా, ఈ ఏడాది ఇదే నెలలో రూ.29,117 కోట్లకు దూసుకుపోయింది. 19 శాతం పెరిగిన ప్రీమియం ఆదాయం జీవిత బీమా మార్కెట్లో ఎల్ఐసీ వాటా 68.6 శాతంగా ఉంది. మిగిలిన 23 ప్రైవేటు జీవిత బీమా సంస్థలకు నూతన పాలసీల ప్రీమియం ఆదాయం 19 శాతం పెరిగి రూ.9,962 కోట్లుగా ఉంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలుగు నెలల్లో 24 జీవిత బీమా సంస్థలకు కొత్త పాలసీల రూపంలో వచ్చిన ప్రీమియం ఆదాయం రూ.1,12,753 కోట్లుగా ఉంది. ఇది అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.73,160 కోట్లుగా ఉంది. ఒక్క ఎల్ఐసీ వరకే చూస్తే ఈ నాలుగు నెలల్లో నూతన ప్రీమియం ఆదాయం 62 శాతం వృద్ధితో రూ.77,318 కోట్లు వసూలైంది. ప్రీమియం పెంచాల్సిందే.. పోటీ పడాల్సిందే! ప్రభుత్వరంగంలోని నాలుగు సాధారణ బీమా సంస్థలు.. ప్రైవేటు సంస్థలతో పోటీ పడాలంటే ప్రీమియం పెంచాల్సిందేనని, వాటి ఐటీ వ్యవస్థలను మెరుగుపరుచుకోక తప్పదని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన నివేదికలో ప్రస్తావించింది. గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో 2016–17 నుంచి 2020–21 మధ్య.. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్ రూ.26,334 కోట్లు నష్టపోయినట్టు తెలిపింది. ఈ సంస్థలకు ఆరోగ్య బీమా రెండో అతిపెద్ద వ్యాపారంగా ఉందంటూ.. సంబంధిత ఐదు సంవత్సరాల్లో రూ.1,16,551 కోట్ల స్థూల ప్రీమియం ఆదాయం వచ్చినట్టు పేర్కొంది. ఆరోగ్య బీమా మార్కెట్లో ఇవి క్రమంగా తమ వాటాను ప్రైవేటు సంస్థలకు కోల్పోతున్నట్టు ప్రస్తావించింది. బీమా వ్యాపారానికి సంబంధించి నిర్ధేశిత అండర్ రైటింగ్ (క్లెయిమ్‌లకు సంబంధించి) నిబంధనలను ఇవి అనుసరించడం లేదని కాగ్ గుర్తించింది. ‘‘స్టాండలోన్ గ్రూప్ పాలసీలకు కంబైన్డ్ రేషియో 95 శాతం మించకూడదు. క్రాస్ సబ్సిడీ ఉన్న గ్రూపు పాలసీలకు 100 శాతం మించకూడదు. కానీ, గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్‌ల కంబైన్డ్ రేషియో 125–165 శాతం మధ్య ఉంది. ఈ సంస్థల్లోని ఐటీ వ్యవస్థల నుంచి సరైన తనిఖీలు, నియంత్రణలు లోపించాయి’’అని వెల్లడించింది. -
AP: తగ్గిన రాష్ట్ర ఆదాయం
సాక్షి, అమరావతి: గత రెండు ఆర్థికసంవత్సరాల్లో రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అకౌంట్స్ నివేదిక స్పష్టం చేసింది. 2020–21 ఆర్థిక సంవత్సరం కాగ్ నివేదికను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం అసెంబ్లీకి సమర్పించారు. ఆ నివేదిక ప్రకారం.. 2018–19 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయం కంటే 2019–20, 2020–21 సంవత్సరాల్లో కేంద్రం నుంచి వచ్చే ఆదాయంతో పాటు రాష్ట్ర ఆదాయమూ తగ్గిపోయిందని వెల్లడించింది. కోవిడ్–19 ప్రభావం, లాక్ డౌన్, ఆంక్షల కారణంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాతో పాటు రాష్ట్ర సొంత ఆదాయం కూడా తగ్గిపోయింది. ముఖ్యంగా కేంద్ర పన్నుల వాటా రూపంలో వచ్చే ఆదాయం భారీగా తగ్గింది. 2018–19తో పోలిస్తే 2019–20లో రూ.4,545 కోట్లు తగ్గింది. 2020–21లో ఏకంగా రూ. 8,326 కోట్లు తగ్గింది. రాష్ట్ర వస్తు సేవల పన్నుతో పాటు అమ్మకం పన్ను, రవాణా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తదితర రంగాల ద్వారా వచ్చే ఆదాయం కూడాఆ రెండేళ్లలో తగ్గిపోయినట్లు తెలిపింది. బాగా పెరిగిన తప్పనిసరి వ్యయం రాష్ట్ర ప్రభుత్వ తప్పనిసరి వ్యయం బాగా పెరిగిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది. ప్రధానంగా వడ్డీ చెల్లింపులు, ఉద్యోగుల జీతాలు, పింఛన్లు భారీగా పెరిగినట్లు తెలిపింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి కాగ్ నివేదికను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం అసెంబ్లీకి సమర్పించారు. 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020–21లో వడ్డీ చెల్లింపుల వ్యయం ఏకంగా 13 శాతం పెరిగిందని కాగ్ పేర్కొంది. గతంలో చేసిన అప్పులకు ఇప్పుడు వడ్డీలు పెరిగిపోతున్నట్లు తెలిపింది. అలాగే ఉద్యోగుల వేతనాల వ్యయం కూడా 2019–20తో పోలిస్తే 2020–21లో ఏకంగా 13 శాతం పెరిగినట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు మధ్యంతర భృతి 27 శాతం ఇవ్వడం, కొత్తగా ఉద్యోగాలను భర్తీ చేయడంతో వేతనాల వ్యయం భారీగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల పింఛన్ల వ్యయం కూడా 2019–20తో పోలిస్తే 2020–21లో 0.48 శాతం మేర పెరిగినట్లు తెలిపింది. -
లోటు ఉన్నా రుణాల చెల్లింపు
సాక్షి, అమరావతి: రెవెన్యూ లోటు భారీగా ఉన్నప్పటికీ రుణ భారాన్ని తగ్గించుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. మరోపక్క, తెచ్చిన అప్పులతో ఆస్తుల కల్పనకూ ప్రాధాన్యతనిస్తోంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. సాధారణంగా ప్రభుత్వాలు మిగులు రెవెన్యూ ఉన్నప్పుడు రుణాలు చెల్లిస్తాయని, కానీ రాష్ట్ర ప్రభుత్వం భారీ రెవెన్యూ లోటు ఉన్నప్పటికీ అప్పులు తీరుస్తోందని తెలిపింది. 2020–21లో రూ.35,540 కోట్ల రెవెన్యూ లోటు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రూ.13,735 కోట్ల ప్రభుత్వ రుణాలు చెల్లించినట్లు ఆ నివేదికలో పేర్కొంది. వడ్డీలతో కలిపి మొత్తం రూ.20,018 కోట్లు రుణ చెల్లింపులకు రాష్ట్ర ప్రభుత్వం వినియోగించిందని తెలిపింది. ఆస్తుల కల్పనకు ప్రాధాన్యత ఒక పక్క కోవిడ్‌తో ఆదాయం తగ్గిపోతున్నప్పటికీ ఆస్తుల కల్పనకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని కాగ్ వెల్లడించింది. 2020–21లో రూ.57,436 కోట్ల రుణాలు తీసుకోగా, ఇందులో రూ.20,690 కోట్లు ఆస్తుల కల్పనలో భాగంగా మూలధన వ్యయానికి వినియోగించినట్లు పేర్కొంది. ఇందులో రూ.1,715 కోట్లు రుణ చెల్లింపులకు పోగా నికరంగా రూ.18,975 కోట్లు ఆస్తుల కల్పనకు వినియోగించింది. ఇందులో రూ.3,969 కోట్లు జలవనరుల ప్రాజెక్టులకు, ప్రభుత్వ భవనాల నిర్మాణానికి రూ.591 కోట్లు, రహదారుల నిర్మాణానికి రూ.738 కోట్లు, గ్రామీణ నీటి సరఫరా పథకాలకు రూ.509 కోట్లు వినియోగించినట్లు పేర్కొంది. ఇతర ఆస్తుల కల్పనకు రూ.13,133 కోట్లు వ్యయం చేసినట్లు తెలిపింది. గడిచిన ఐదేళ్లతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం సాధారణ, సామాజిక సేవల రంగంలో మూలధన వ్యయం భారీగా పెంచినట్లు కాగ్ స్పష్టం చేసింది. గత ప్రభుత్వం హయాంలో సాధారణ సేవల రంగంలో మూలధన వ్యయం రూ.300 కోట్ల లోపు ఉంటే ఇప్పుడది రూ.6,498 కోట్లకు పెరిగింది. సామాజిక సేవల రంగంలో మూలధన వ్యయం గత ప్రభుత్వ హయాంలో రూ.2,890 కోట్ల లోపు ఉంటే అది ఇప్పుడు రూ.5,206 కోట్లు వ్యయం చేసింది. -
AP: అదుపులోనే అప్పులు.. ఇతర రాష్ట్రాలతో పోల్చితే..
సాక్షి, అమరావతి: దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే అప్పులు చేస్తున్నట్లు ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా ఊదరగొడుతున్న ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో తేటతెల్లమైంది. కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో కేంద్ర, రాష్ట్రాల ఆదాయాలు గణనీయంగా తగ్గిపోయాయి. మరో పక్క కోవిడ్ నియంత్రణ, నివారణ వ్యయం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. చదవండి: మీ ఆనందమే నా తపన: సీఎం జగన్ ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు అదనపు అప్పులకు అనుమతిచ్చింది. అయినప్పటికీ గత ఆర్థిక ఏడాది అంటే 2020–21లో ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాల కన్నా పరిమితికి లోబడే అప్పులు చేసింది. ఈ విషయం కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ (కాగ్) ప్రాథమిక అకౌంట్ల పరిశీలనలో వెల్లడైంది. తమిళనాడు గత ఆర్థిక ఏడాది బడ్జెట్ అంచనాలకు మించి ఏకంగా 55.54 శాతం మేర అప్పు చేసింది. బిహార్ 47.69 శాతం, కర్ణాటక 40.12 శాతం, తెలంగాణ 37.50 శాతం, పంజాబ్ 24.22 శాతం బడ్జెట్ అంచనాకు మించి అప్పు చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంచనాకు మించి కేవలం 14.23 శాతమే అప్పు చేసింది. ఆదాయం తగ్గినప్పటికీ.. ఏపీ ప్రభుత్వం కోవిడ్ సంక్షోభంలోనూ సంక్షేమ, అభివృద్ధి పథకాలను నిలుపుదల చేయకుండా కొనసాగించింది. కోవిడ్ సంక్షోభం, లాక్డౌన్ల నేపథ్యంలో 2019–20లో రూ.8 వేల కోట్లు, 2020–21లో ఏకంగా రూ.14 వేల కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయింది. మరో వైపు కోవిడ్ నియంత్రణ, నివారణ చర్యలకు ఏకంగా రూ.8 వేల కోట్లు వ్యయం చేసింది. మొత్తం మీద రూ.30 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడింది. ఈ నేపథ్యంలో కేంద్రం అనుమతించిన మేరకు పరిమితికి లోబడే అప్పులు చేసింది. అయినప్పటికీ ప్రతిపక్షంతో పాటు ఎల్లో మీడియా రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లిపోయిందంటూ దుష్ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయి. 2020–21 ఆర్థిక ఏడాదిలో కాగ్ ప్రాథమిక అకౌంట్ల మేరకు వివిధ రాష్ట్రాల బడ్జెట్ అంచనాలు, వాస్తవంగా చేసిన అప్పుల వివరాలు ఇలా ఉన్నాయి. మిగతా రాష్ట్రాల కంటే తక్కువే విభజన సమయం నుంచి ఏపీకి తప్పనిసరి రెవెన్యూ వ్యయం పెరుగుతూనే ఉంది. ఇప్పుడు కోవిడ్ సమయంలో మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలకు అదనపు రుణాలకు అనుమతించింది. అయితే ఇటీవల కొంత మంది ఏపీ ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేస్తోందని తరుచూ ప్రస్తావిస్తున్నారు. 2014 రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీ ఆర్థికంగా బలహీనంగా ఉంది. కోవిడ్ సంక్షోభంతో పాటు మరో పక్క రెవెన్యూ రాబడికి మించి తప్పసరి వ్యయాలు చేయాల్సి వస్తోంది. ఆస్తుల కల్పనకు సంబంధించి ఇరిగేషన్, విద్యుత్ వంటి ప్రాజెక్టులపై వ్యయం చేస్తున్నప్పటికీ వాటి ద్వారా వచ్చే రాబడి వాటి నిర్వహణకు సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో అప్పులు చేసి తప్పనిసరి ఖర్చులు చేయాల్సి వస్తోంది. అయినప్పటికీ మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఏపీ ప్రభుత్వం 2020–21లో చేసిన అప్పులు అదుపులోనే ఉన్నాయి. – ఎం.ప్రసాదరావు, రిటైర్డ్ ఎకనమిక్ ప్రొఫెసర్, ఆంధ్రా విశ్వ విద్యాలయం -
AP: వివిధ పథకాలకు గ్రాంటుగా రూ.38 వేల కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.వెయ్యి కోట్లు పైబడి ఉన్న వివిధ ప్రధాన పథకాలకు మొత్తం రూ.38,014.57 కోట్లను గ్రాంటు రూపంలో ఇచ్చినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన తాజా నివేదికలో వెల్లడించింది. ఇదే ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంఘాలకు ఆర్థిక సహకారంగా రూ.9,155.81 కోట్లను గ్రాంటుగా ఇచ్చినట్లు ఆ నివేదికలో తెలిపింది. అలాగే, వైఎస్సార్ రైతుభరోసా కోసం రూ.3,615 కోట్లు ఇచ్చినట్లు కాగ్ పేర్కొంది. -
‘కాగ్ నివేదికపై మాట్లాడే ధైర్యముందా బాబు?’
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ క్రమంలో సోమవారం ఆయన ‘ప్రచారం మీద బతికే అసమర్థుడికి ఎల్లో మీడియా పాలనాదక్షుడు అనే ఎలివేషన్ ఇచ్చింది. దిగిపోయే ముందు ఆఖరి సంత్సరంలో 250 రోజులు ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లి వడ్డీ కింద 108 కోట్ల ప్రజా ధనాన్ని చెల్లించాడు. అడ్మినిస్ట్రేటర్ అయితే ఇలా చేస్తాడా.. కాగ్ నివేదికపై మాట్లాడే ధైర్యముందా బాబ’ ట్విట్టర్ వేదికగా విజయ్ సాయి రెడ్డి సవాలు చేశారు. (చదవండి: ‘బాబులో వణుకు మొదలైంది’) -
కాగ్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. కాగ్ ఆఫీసులో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. -
మాకొద్దీ బీసీసీఐ బాధ్యతలు...
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అపెక్స్ కౌన్సిల్ నుంచి తమ ప్రతినిధిని తప్పించాలని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. బోర్డు ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించేందుకు సుప్రీం కోర్టు ఒక స్వతంత్ర ప్రతినిధిని అపెక్స్ బృందంలో నియమించింది. ‘కాగ్’ తరఫున అల్కా రెహాని భరద్వాజ్ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నెల 17న జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి ‘అర్హులైన’ వ్యక్తులు మాత్రమే హాజరయ్యేలా చూ డాలని గత శనివారం అల్కా భరద్వాజ్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఆమె నేరుగా ఎవరి పేరూ చెప్పకపోయినా బోర్డు కార్యదర్శి జై షాను ఉద్దేశించే ఇలా చేసినట్లు తెలుస్తోంది. కొత్త నియమావళి ప్రకారం బోర్డులో గానీ, రాష్ట్ర సంఘంలో గానీ కలిపి వరుసగా ఆరేళ్లు ఆఫీస్ బేరర్‌గా పని చేసిన వ్యక్తులు తమ పదవుల్లో కొనసాగడానికి అనర్హులు. ఇలాంటి స్థితిలో బీసీసీఐలో భాగంగా ఉంటూ పని చేయలేమని ‘కాగ్’ సుప్రీంను అభ్యర్థించింది. జోహ్రి నిష్క్రమణ బీసీసీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ జోహ్రి తన పదవినుంచి అర్ధాంతరంగా తప్పుకున్నారు. మూడు నెలల క్రితం ఆయన ఇచ్చిన రాజీనామాను ఆమోదిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. గతంలోనే ఆయన తన పదవిని వీడేందుకు సిద్ధమైనా... అందుకు బోర్డు అంగీకరించలేదు. జోహ్రి పదవీ కాలం 2021 వరకు ఉండగా, అప్పుడే ఆయన రాజీనామా చేయడం విశేషం. దీనికి బోర్డు అధికారులు ఎలాంటి కారణం చూపలేదు. అయితే జోహ్రి ఇటీవల కావాలనే బోర్డు అంతర్గత ఇ–మెయిల్స్‌ను బయటపెట్టారని, బోర్డు ఆయనపై నమ్మకం కోల్పోయిందని తెలుస్తోంది. -
కూలీ నంబర్ 1.. ఫైవ్‌స్టార్ హోటళ్లలో బస
సాక్షి, అమరావతి : పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడంలో దిట్ట.. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడంలో ఆయన స్టైలే వేరు.. కళ్లార్పకుండా కమిట్మెంట్తో అబద్ధాలు చెప్పడంలో తనకు తానే సాటి.. బ్రిటిషర్లతో పోరాడానని బీరాలు పలికినా.. బాహుబలి సినిమాకు ఆస్కార్ ఇప్పిస్తానని నమ్మబలికినా.. రాజధానికి 7 శంకుస్థాపనలు చేసినా.. విదేశీ పర్యటనలకు కోట్లు ఖర్చు చేసినా.. ఆయనకే చెల్లింది. కూలీ నెంబర్ 1నని చెప్పుకుంటూ.. ఫైవ్‌స్టార్ హోటళ్లలో నివాసముండే ఘనాపాటి.. ఎవరి ఘనతనైనా తన ఖాతాలో వేసుకోవడం ఆయన సహజ నైజం.. తిమ్మిని బమ్మిని చేస్తూ.. మసిపూసి మారేడు కాయగా మారుస్తూ... పరనింద.. ఆత్మస్తుతితో ప్రచారాన్ని తారస్థాయికి తీసుకెళ్లగలిగే నేర్పరి.. నదుల అనుసంధానం, కరువుపై రెయిన్‌గన్, దోమలపై దండయాత్ర, ప్రాజెక్టుల నిద్ర, నవనిర్మాణ దీక్ష, నీరూ– చెట్టూ అంటూ.. పాలనను ఈవెంట్ మేనేజ్‌మెంట్‌గా మార్చేసిన ఓ ప్రచార మేఘం.. మొత్తంగా ఆయనో ఈవెంట్ మేనేజర్.. ఆయనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఒక పక్క రాష్ట్రం రెవెన్యూ లోటును ఎదుర్కొంటూ ఆర్థిక కష్టాల్లో ఉందంటూనే.. మరోవైపు అనవసర ఆర్భాటాలకు, సొంత ప్రచారాలకు భారీఎత్తున ప్రజాధనం దుబారాకు పాల్పడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు. గత 58 నెలల్లో ప్రచార ఆర్భాటాలకు, తాత్కాలిక నిర్మాణాలకు కలిపి మొత్తం రూ.3,628.17కోట్ల ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశారు. గత ఐదేళ్లుగా ప్రచారమే పరమావధిగా పాలన సాగిస్తున్నారు. సమస్యల్ని పక్కదారి పట్టిస్తూ.. పాలనలో వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు అనుసరిస్తున్న మార్గం ఈవెంట్ల నిర్వహణ. ప్రజల దృష్టి మరల్చేందుకు రోజుకో మార్గం ఎంచుకుంటున్నారు. కళ్లార్పకుండా అబద్ధాలు చెబుతూ అవే నిజమని నమ్మించేలా పదేపదే వల్లె వేయడం ఆయనకు రివాజుగా మారింది. గోదావరి, కృష్ణా పుష్కరాలు మొదలు.. రాజధాని శంకుస్థాపనలు, విదేశీ పర్యటనలు, నదుల అనుసంధానం, కరవుపై యుద్ధం, దోమలపై దండయాత్ర, ప్రాజెక్టుల నిద్ర, నవ నిర్మాణ దీక్ష, హ్యాపీ సండే, భాగస్వామ్య సదస్సులు.. ఇలా ప్రతి కార్యక్రమాన్ని ఈవెంట్ మాదిరిగా నిర్వహించి ఆ తర్వాత పట్టించుకోలేదు. కేవలం ఈవెంట్ మేనేజ్మెంట్ కోసం కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ప్రచారమే ప్రభుత్వంగా నాలుగున్నరేళ్ల కాలం గడిపారు. తానేం చేసినా.. ‘ఇది ఒక చరిత్ర’ అంటూ సొంతడబ్బాతో ప్రచారాన్ని తారస్థాయికి తీసుకెళ్లడం పరిపాటిగా మారింది. దేశంలో సీఎంలలో తానే సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు.. మొదట్నుంచీ ప్రచారం కోసం తప్ప, ప్రజలకు మేలు చేసే ఒక్క కార్యక్రమాన్ని నిర్వహించలేదు. ప్రజల సొమ్మును నీళ్లలా ఖర్చు చేస్తూ.. సొమ్మొకరిది సోకొకరిది అనే మాటను నిజం చేశారు. రాజధాని తెరపై సింగపూర్ సినిమా రాజధాని శంకుస్థాపనలకు తొలుత రూ.250 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. ఆ తరువాత పరిపాలన భవనం, సీడ్ కేపిటల్, రహదారుల శంకుస్థాపనల పేరుతో మరో రూ.100 కోట్ల వ్యయం చేసింది. ఇప్పటివరకు రాజధానిలో శాశ్వత భవనం ఒక్కటి కూడా నిర్మాణం చేపట్టలేదు. రాజధాని పేరుతో ఇన్నాళ్లు వర్షం వస్తే నీరు లోపలకు వచ్చేసే తాత్కాలిక నిర్మాణాలతో చంద్రబాబు సర్కారు కాలక్షేపం చేసింది. ఎన్నికల ముందు రాజధాని తెరపై సింగపూర్ సినిమా చూపించేందుకు రంగం సిద్ధం చేసింది. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో వెల్కమ్ గ్యాలరీ అంటూ కొత్త ఎగ్జిబిషన్‌ను తెరమీదకు తీసుకువచ్చి రూ.44.50 కోట్లు వృథా చేస్తున్నారు. వాస్తవంగా ఈ వెల్కమ్ గ్యాలరీ అంతా సెట్టింగులతో మినీ రాజధాని ఊహా చిత్రాన్ని చూపించడమే తప్ప మరొకటి కాదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రాజధాని నిర్మాణానికి డబ్బుల్లేవంటూ ప్రజల నుంచి విరాళాలు.. డబ్బుల రూపంలోను, ఇటుకలను స్వీకరించారు. అక్కడ నిర్మించిన తాత్కాలిక భవనాలు చూపించడానికి, పునాదులను ప్రజలకు చూపించడానికి కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నారు. రాజధాని అమరావతి సినిమాను చూపించేందుకు ఏకంగా రూ. 39.88 కోట్లు ఖర్చు చేస్తున్నారు. విదేశీ పర్యటనలకు వంద కోట్లు చంద్రబాబు రెగ్యులర్ విమానాల్లో వెళ్లడం ఎప్పుడో మానేశారు. ఏ సీఎం చేయని విధంగా జిల్లాలకు వెళ్లినా, ఢిల్లీకి వెళ్లినా రెగ్యులర్ విమానాల్లో కాకుండా.. ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తిరగడానికి ఐదేళ్లలో రూ.100 కోట్లు ఖర్చు అయింది. భాగస్వామ్య సదస్సుల పేరుతో రూ.150 కోట్లు నీళ్లలా ఖర్చుపెట్టారు. మందీ మార్బలంతో హంగూ ఆర్భాటాలతో.. సింగపూర్‌కు నాలుగుసార్లు, ప్రపంచ ఆర్థిక సదస్సుకు మూడుసార్లు, జపాన్, బ్రిటన్, చైనా, రష్యా, అమెరికా పర్యటనలకు వెళ్లి వచ్చారు. రాష్ట్రానికి పెట్టుబడులు పేరుతో, విదేశీ యాత్రల పేరుతో చంద్రబాబు బృందం ఏకంగా వంద కోట్ల రూపాయలను వ్యయం చేసింది. మంత్రులు, అధికారులు విహార యాత్రలతో ఎంజాయ్ చేశారు. కానీ ఒక్క కంపెనీ తెచ్చిందిలేదు. పైసా పెట్టుబడి వచ్చింది లేదు. పుష్కరాల ప్రచారానికి రూ.160 కోట్లు గోదావరి పుష్కరాల ప్రచారం కోసం 110 కోట్ల రూపాయలను.. కృష్ణా పుష్కరాల ప్రచారం కోసం రూ.47 కోట్లు వ్యయం చేశారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్నానం ఖరీదు 2.41 కోట్ల రూపాయలవడం విశేషం. ఇవి కాకుండా గోదావరి, కృష్ణా పుష్కరాలకు అవసరమైన మౌలిక వసతులకు రూ.3వేల కోట్లు ఖర్చు చేశారు. పుష్కరాల సమయంలో వేసిన రోడ్లు నామినేషన్ విధానంలో అస్మదీయులకు కట్టబెట్టగా..పనులన్నీ నాసిరకంగానే జరిగాయి. ఇదిలా ఉంటే గోదావరి పుష్కరాల సందర్భంగా చంద్రబాబు ప్రచార కండూతి కారణంగా తొక్కిసలాట జరిగి 29 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తాత్కాలిక సోకులకు వందల కోట్లు హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయం భవనాలకు కోట్ల రూపాయల వ్యయంతో సోకులు చేశారు. ఓటుకు కోట్లు కేసుతో ఆ భవనాలను వదిలేసి విజయవాడకు తరలి వచ్చేశారు. క్యాంపు కార్యాలయాలకు, ఉండవల్లిలోని అక్రమ నిర్మాణంలో సీఎం ఉంటున్న ఇంటికి సోకుల పేరుతో కోట్లు వెచ్చించారు. మరో పక్క రాజధానిలో తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక భవనాల పేరుతో వందల కోట్ల రూపాయలను వ్యయం చేశారు. జన్మభూమి అంటూ రూ.150 కోట్లు ఖర్చు జన్మభూమి అంటూ ఆరుసార్లు నిర్వహించి అందుకోసం ఇప్పటివరకు రూ.150 కోట్లు వ్యయం చేశారు. జన్మభూమి కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా బాబు ప్రచారానికి వినియోగించుకున్నారు. కృష్ణా–గోదావరి నదుల అనుసంధానం పేరుతో ఈవెంట్లను నిర్వహించి పెద్ద ఎత్తున ఖర్చుచేశారు. నవ నిర్మాణ దీక్ష పేరుతో ఏటా రూ.20 కోట్లను వ్యయం చేశారు. వీటివల్ల ప్రచారం తప్ప ఎటువంటి ఫలితం కనిపించలేదు. హ్యాపీ సిటీ సదస్సును తెరమీదకు తెచ్చి రూ.100 కోట్లు ఖర్చు చేశారు. రియల్ టైమ్ గవర్నెన్స్ పేరిట వందల కోట్లు రియల్‌టైమ్ గవర్నెన్స్ పేరుతో వందల కోట్ల రూపాయలను నీళ్లలా ఖర్చు చేస్తూ ప్రచారానికి వినియోగించారు. ఈ దుబారా, ఆర్భాటపు ప్రచారాల వల్ల ప్రజాధనం పెద్ద ఎత్తున దుర్వినియోగమైంది. నాలుగున్నరేళ్ల పాటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అంటకాగినప్పుడు నవ నిర్మాణ దీక్షల పేరుతో భారీగా వ్యయం చేశారు. బీజేపీ నుంచి బయటకు వచ్చేసిన నాటి నుంచి ధర్మపోరాట దీక్షల పేరుతో ప్రభుత్వం భారీగా వెచ్చించింది. ఢిల్లీలో ఒక రోజు పది కోట్లు వెచ్చించి రాజకీయ సభలను ఏర్పాటు చేసింది. సొంత మీడియా సంస్థలకు భారీఎత్తున ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తూ.. తక్కిన మీడియా పట్ల చంద్రబాబు ప్రభుత్వం వివక్ష చూపిందని కాగ్ తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు ప్రచారానికి రూ.582 కోట్లు ఎన్నికల ముందు ప్రజాధనాన్ని ఇష్టానుసారం సొంత ప్రచారం కోసం వాడుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎత్తువేశారు. ఎన్నికల ముందు బాబు ప్రచారానికి రూ.528 కోట్ల అదనపు బడ్జెట్‌కు సమాచార శాఖ ప్రతిపాదించింది. ఇందులో ముఖ్యమంత్రి సూచనతో సమాచార శాఖ ఈ ఏడాది మార్చిలోగా ఔట్‌డోర్, ఇన్డోర్ పేరుతో ప్రచారానికి ఏకంగా రూ.482 కోట్ల ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఇప్పటికే ఈ ఏడాది బడ్జెట్లో సమాచార శాఖ ప్రచారం కోసం కేటాయించిన రూ.121.72 కోట్ల వ్యయం చేసేశామని తెలిపింది. చెల్లించాల్సిన బకాయిలు రూ.100 కోట్లతోపాటు మార్చి నెలాఖరు వరకు ప్రచారానికి రూ.482 కోట్లు కలిపి.. మొత్తం రూ.582 కోట్లను అదనంగా కేటాయించాల్సిందిగా సమాచార శాఖ.. ఆర్థిక శాఖకు ప్రతిపాదనలను పంపించింది. పోలవరంలో రూ.273.81 కోట్లు దుబారా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకుండానే.. ఏదో అయిపోతున్నట్లు విహారయాత్రల పేరుతో ఏకంగా రూ.121.81 కోట్లు వ్యయం చేశారు. అది కాకుండా ముఖ్యమంత్రి నిర్వహించిన ఈవెంట్లు, సమీక్షలకు మరో రూ.152 కోట్ల ఖర్చయింది. ఈ మొత్తం ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరుగా మారిందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు సినిమా చూపించేందుకు కోట్ల రూపాయలు వ్యయం చేయడంపై అధికార వర్గాల్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తీవ్రంగా తప్పు పట్టిన కాగ్ సుప్రీంకోర్టు నిబంధనలకు తూట్లు పొడుస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత ఇమేజ్ పెంచుకోవడానికి రూ.13.76 కోట్లు ప్రజాధనం వృథా చేయడాన్ని కాగ్ తీవ్రంగా తప్పుపట్టింది. ప్రభుత్వ ధనాన్ని రాజకీయంగా వ్యక్తిగత ఇమేజ్ పెంచడానికి వ్యయం చేయడాన్ని కాగ్ ఎత్తి చూపింది. ఇది ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడమేనని పేర్కొంది. చంద్రబాబు ఆర్భాటపు వ్యయాల వివరాలు (రూ. కోట్లలో) ప్రత్యేక విమానాల ప్రయాణం 100 హైదరాబాద్‌లో సీఎం కార్యాలయానికి (ఎస్ బ్లాకు) 14.63 హైదరాబాద్‌లో తొలుత సీఎం కార్యాలయం హెచ్ బ్లాకుకు 6.29 లేక్‌వ్యూ గెస్ట్ హౌస్ (హైదరాబాద్) 9.47 సీఎం కార్యాలయ ఫర్నిచర్ 10 మదీనాగూడ ఫాం హౌస్, జూబ్లీహిల్స్ అద్దె ఇంటికి 4.37 ఇరిగేషన్ గెస్ట్ హౌస్, సీఎం క్యాంపు ఆఫీస్ విజయవాడ 42 సీఎం ప్రత్యేక బస్సు 5.50 రాజధాని నిర్మాణానికి ప్రధాన శంకుస్థాపన 250 ఆ తరువాత మూడు శంకుస్థాపనలకు 100 రాజధాని కన్సల్టెంట్లు 300 తాత్కాలిక సచివాలయం ఇతర మరమ్మతులు 1,100 రాజధాని మాస్టర్ ప్లాన్ కోసం 115 జన్మభూమి కార్యక్రమాలకు 150 నవ నిర్మాణ దీక్షల కోసం (రూ. కోట్లలో) 80 విదేశీ పర్యటనలు (అందరూ కలిసి) 120 పోలవరం బస్సు యాత్ర 121.81 పోలవరం ఈవెంట్ల కోసం 152 గోదావరి పుష్కరాల ప్రచారానికి -110 కృష్ణా పుష్కరాల ప్రచారానికి 47 రాజధాని బస్సుయాత్రలకు 39.88 రాజధానిలో సింగపూర్ సెట్టింగులకు 44.50 ఎన్నికల ముందు బాబు ప్రచారానికి 582 హ్యాపీ సిటీస్ సదస్సుల కోసం 100 బాబు పాల్గొన్న గుంటూరు జిల్లాలో ఈవెంట్ల వ్యయం 23.72 బాబు ఆర్భాటాలకు అయిన మొత్తం వ్యయం 3,628.17 - సీహెచ్. మాణిక్యాలరావు, సాక్షి, అమరావతి -
కాగ్ నివేదిక
పదవీకాలం పూర్తికావస్తున్న లోక్‌సభ ఆఖరి సమావేశాల్లో ప్రవేశపెట్టిన కాగ్ నివేదిక ప్రభుత్వ వైఖ రికి అనుకూలంగా ఒక వ్యాఖ్య చేయడమైనా... కనీసం అలా చేసిందని ప్రభుత్వం ప్రకటించుకునేందుకు వీలు కల్పించినా అది నెత్తిన పాలుబోయడమే. త్వరలో సార్వత్రిక ఎన్నికల సందడి మొదలు కానున్న తరుణంలో ఆ అదృష్టం ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కింది. 2007లో యూపీఏ ప్రభుత్వం రఫేల్ యుద్ధ విమానాల కోసం ఖరారు చేసుకున్న ధరతో పోలిస్తే రెండేళ్లక్రితం ఎన్డీఏ సర్కారు కుదుర్చుకున్న ఒప్పందంలోని ధర 2.86 శాతం తక్కువని కాగ్ నివేదిక నిర్ధారించింది. నిజానికిది తుది నివేదిక కాదు. కాగ్ పరిశీలించాల్సిన అంశాలు మరికొన్ని ఉన్నాయి. అందులో ఆఫ్సెట్ భాగ స్వామి ఎంపిక ఒకటి. ఇలాంటి మరో పది అంశాలకు సంబంధించిన ఆడిటింగ్ జరగాల్సి ఉన్నదని కాగ్ నివేదిక వివరించింది. ఒప్పందంలో వచ్చి చేరిన ఆఫ్సెట్ భాగస్వామికి సంబంధించిన అంశమే ప్రస్తుతం రాజకీయంగా పెనుదుమారం లేపుతోంది. అనిల్ అంబానీకి లబ్ధి చేకూర్చేందుకే ఎలాంటి అనుభవమూ లేని ఆయన సంస్థను ఆఫ్సెట్ భాగస్వామిగా చేర్చారని విపక్షాలు ఆరోపి స్తున్నాయి. అయితే అది రఫేల్ ఉత్పత్తిదారు డసో స్వీయ నిర్ణయమని ప్రభుత్వం బదులిస్తోంది. అంతటి కీలకమైన అంశంపై కాగ్ తన మనోగతాన్ని వెల్లడించి ఉంటే భిన్నంగా ఉండేది. అలా లేక పోబట్టే తాజా నివేదికపై కాంగ్రెస్ నిప్పులు కక్కితే, బీజేపీ పండగ చేసుకుంటోంది. 2014లో కాంగ్రెస్ స్థితి దీనికి విరుద్ధం. కామన్వెల్త్ క్రీడలతో మొదలెట్టి అన్నిటా ఆ పార్టీ నేతృత్వంలోని యూపీఏ సర్కారుకు ప్రతికూలతలే ఎదురయ్యాయి. 2జీ స్కాం, బొగ్గు కుంభకోణం వగైరాలు దేనికవి యూపీఏ సర్కారును ఉతికారేశాయి. ముఖ్యంగా 2జీ స్కాంలో కాగ్ లెక్కలు ఊహాజనిత మైనవని, అందులో కాస్తయినా వాస్తవం లేదని కాంగ్రెస్ నేతలు ఆక్రోశించినా ఫలితం లేకపో యింది. ఆ నివేదికలే ఆనాటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ప్రధాన ప్రచారాస్త్రాలు అయ్యాయి. వేల కోట్ల రూపాయల వ్యయమయ్యే ఏ భారీ కాంట్రాక్టుపైన అయినా ఆరోపణలు రావడం సహజమే. వాటిల్లో అనేకం కాగ్ నివేదికల్లో నిర్ధారణవుతుంటాయి కూడా. అయితే ఆరోపణలు చేసే వారిలో సత్తా లేకపోతే, దాన్ని బలంగా జనం ముందుకు తీసుకెళ్లలేకపోతే కాగ్ నిర్ధారించినా ఫలితం ఉండదు. తాజా కాగ్ నివేదికను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఘాటుగా విమర్శిం చారు. ఆ నివేదికకు అది అచ్చయిన కాగితాలంత విలువ కూడా లేదన్నారు. నివేదికలో ప్రభుత్వా నికి అనుకూలమైన అభిప్రాయాలుండటం అందుకు కారణం కావొచ్చు. అలాగని కాగ్ గంపగుత్తగా కేంద్రానికి క్లీన్చిట్ ఇవ్వలేదు. ముఖ్యంగా ఒప్పందంలో ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి సురక్షితమైన పూచీకత్తు తీసుకోకుండా, ఏమాత్రం చట్టబద్ధత లేని ‘లెటర్ ఆఫ్ కంఫర్ట్’తో ఎందుకు సరిపెట్టాల్సి వచ్చిందని నిలదీసింది. 2007 నాటి అవగాహనలో ముందస్తు చెల్లింపులకు 15 శాతం బ్యాంకు పూచీకత్తు ఉన్న సంగతిని ఎత్తిచూపింది. ఆ తరహా పూచీకత్తు ఉంటే డసో ముందూ మునుపూ ఒప్పందాన్ని ఉల్లంఘించినప్పుడు ఆ డబ్బును ఫ్రాన్స్ సర్కారునుంచి వెంటనే రాబట్టుకునే అవకాశ ముంటుందని వివరించింది. తాజా ఒప్పందం ప్రకారం ఇతరత్రా ప్రయత్నాలు విఫలమయ్యాకే ఆ పని చేయగలుగుతామని చెప్పింది. అలాగే అప్పటి పూచీకత్తులో ప్రదర్శన, వారంటీలకు సైతం 5 శాతం చొప్పున పూచీ ఉన్న అంశాన్ని ప్రస్తావించింది. ధరవరల్లో మార్పులు గురించి కూడా నివేదిక వివరాలిచ్చింది. మొత్తం 11 అంశాలకు సంబంధించి ఈ వివరాలున్నాయి. యూపీఏ ప్రభుత్వం కుదుర్చుకున్న అవగాహనతో పోలిస్తే తాజా ఒప్పందం వల్ల విమానాల సేవలు, నిర్వహణ అంశంలో 4.77 శాతం మేర, మన వైమానిక దళ అవసరాలకు అనుగుణంగా చేసే మార్పులకు అయ్యే ఖర్చు 17.08 శాతం మేర, ఆయుధ ప్యాకేజీలో 1.05 శాతం తక్కువని కాగ్ చెప్పిన అంశం వాస్తవమే అయినా...నాలుగు అంశాల్లో–పైలెట్, సాంకేతిక నిపుణుల శిక్షణకు 2.68 శాతం, ఇంజ నీరింగ్ పరమైన సాయానికి 6.54శాతం, లాజిస్టిక్స్‌లో 6.54శాతం మేర ధరలు పెరిగాయని తెలి పింది. అలాగే ఆడిట్ నివేదిక ప్రక్రియ ముగింపు దశలో ఉన్నదని, ఇతర అంశాలన్నీ అందులో పొందుపరుస్తామని వివరించింది. బహుశా నివేదికను క్షుణ్ణంగా చదివుంటే రాహుల్ వేరే విధంగా వ్యాఖ్యానించేవారేమో! లోక్‌సభ చివరి సమావేశాలనాటికైనా పూర్తి నివేదిక సమర్పించనందుకు కాగ్‌ను తప్పుబట్టి ఉంటే వేరుగా ఉండేది. అటు ప్రభుత్వం సహజంగానే ఈ నివేదికను తమకొచ్చిన క్లీన్ చిట్‌గా చెబుతోంది. ముఖ్యంగా యూపీఏ హయాంనాటి ధరవరలతో పోల్చి తమ ఒప్పందం వల్ల విమానాల ఖర్చు 2.86 శాతం మేర తగ్గిందన్నది ప్రభుత్వ పెద్దలు ప్రముఖంగా చూపుతున్నారు. కానీ ఇతరత్రా అంశాల్లో వ్యయం పెరగడాన్ని కాగ్ ఎత్తిచూపింది. అలాగే 2007నాటి అవగాహనలో రఫేల్ యుద్ధ విమానాల్లో 18 విమానాలను వెంటనే అందిస్తామని, మిగిలినవన్నీ భారత్‌లో ఉత్పత్తి చేయడానికి సహకరిస్తామని హామీ ఇచ్చింది. కానీ 2016నాటి ఒప్పందంలో ఈ 36 యుద్ధ విమానాలనూ ఫ్రాన్స్‌లో తయారు చేసి పంపుతామని చెప్పింది. అయితే ఒప్పంద వ్యయం రూ. 59,000 కోట్లలో కొంత శాతాన్ని భారత్‌లోనే ఖర్చు చేస్తామని హామీ ఇచ్చింది. అది ఎంత మొత్తమన్న అంశంలో భిన్నాభిప్రాయా లున్నా మిలిటరీ ఎయిరోనాటిక్స్ పరిశోధన, రఫేల్‌కు అవసరమైన విడిభాగాల ఉత్పత్తి ఆ ‘కొంత శాతం’లో ఉంటాయి. పబ్లిక్ రంగ సంస్థ హెచ్ఏఎల్ను కాదని అంబానీ సంస్థను ఎన్నుకున్నది వాటికోసమే. ఎయిరోస్పేస్, రక్షణ విడిభాగాల తయారీలో ఏమాత్రం అనుభవంలేని సంస్థకు తోడ్పాటునీయడం ఏమిటన్నది విపక్షాల ప్రశ్న. ఇది సబబేనా, ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఉందా లేదా అన్న అంశాన్ని తుది నివేదికలో కాగ్ చెబుతుంది. అయితే దేశ రక్షణతో ముడిపడిన అంశాల్లో ఇలా తరచు వివాదాలు తలెత్తడం విచారకరం. పాలకులు పారదర్శకంగా వ్యవహరిస్తే, విపక్షాలు దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే తప్ప ఈ ధోరణికి అడ్డుకట్ట పడదు. -
ఇదీ రఫేల్‌పై కాగ్ నివేదిక
రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తన నివేదికను బుధవారం పార్లమెంట్ ముందుకు తెచ్చింది. ఏడాదిన్నరకు పైగా కాలంపాటు కాగ్ రఫేల్ ఒప్పందాన్ని పరిశీలించి నివేదికను సిద్ధం చేశారు. విమానాల ధర, విక్రేతల ప్రతిపాదనల పరిశీలనతోపాటు ప్రపంచ వ్యాప్తంగా జెట్ యుద్ధ విమానాల ధరలను కూడా కాగ్ పరిశీలించారు. రక్షణ శాఖ ఐదేళ్లుగా జరిపిన లావాదేవీలపై కాగ్ నివేదిక వచ్చింది. ముసాయిదా నివేదిక ఇప్పటికే ప్రభుత్వానికి చేరింది. అయితే, ఎన్నికలకు ముందు ఈ నివేదిక ఖరారు కాకపోవచ్చు. రఫేల్ ఒప్పందంలోని ధర, సరఫరా, పూచీకత్తు తదితర పలు అంశాలను కాగ్ నివేదిక చర్చించింది. అందులోని ముఖ్యాంశాలు: ధర: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందంలో పేర్కొన్న ధర అంతకు ముందు ఒప్పందంలోని సమీకృత ధర(మొత్తం ధర) కంటే 2.86 శాతం తక్కువ. 2007లో (యూపీఏ హయాం) కుదుర్చుకున్న ఒప్పందంలోని 36 విమానాల కొనుగోలు ధర కంటే 2016 నాటి ఎన్డీఏ ఒప్పందంలోని ధర 9 శాతం తక్కువంటూ రక్షణ శాఖ చేసిన వాదనను కాగ్ తోసిపుచ్చింది. ఒప్పందంలో మొత్తం 14 ఐటెమ్‌లతో కూడిన ఆరు వేర్వేరు ప్యాకేజీలు ఉన్నాయి. వీటిలో ఏడు ఐటెమ్‌ల ధర సమీకృత ధర కంటే చాలా ఎక్కువగా ఉంది. బేసిక్ విమానం సహా మూడు ఐటెమ్‌లను సమీకృత ధరకే కొన్నారు. 4 ఐటెమ్‌లను సమీకృత ధరకంటే తక్కువకు కొన్నారు. సరఫరా: పాత ఒప్పందంతో పోలిస్తే కొత్త ఒప్పందంలో పేర్కొన్న గడువు ప్రకారం యుద్ద విమానం ఒక నెల ముందే సరఫరా అవుతుంది. 2007 ఒప్పందం ప్రకారం నిర్దేశిత ప్రమాణాల మేరకు యుద్ధ విమానాలను ఒప్పందం నాటి నుంచి 72 నెలల్లోపు సరఫరా చేయాల్సి ఉండగా. 2016 ఒప్పందంలో ఈ గడువు 71 నెలలుగా పేర్కొన్నారు. 2007 ఒప్పందం ప్రకారం ఒప్పందపు నెల నుంచి 50 నెలల్లోగా 18 విమానాలను సరఫరా చేయాల్సి ఉంటుంది. మిగతా 18 విమానాలను హెచ్ఏఎల్లో తయారు చేయాలి. వీటిని 49–72 నెలల్లోపు అందజేయాల్సి ఉంటుంది. 2016 ఒప్పందం ప్రకారం మొదటి విడత విమానాలను(18) ఒప్పందపు నెల నుంచి 36–53 నెలల మధ్య సరఫరా చేయాలి. మిగతా వాటిని 67 నెలల్లో అందజేయాల్సి ఉంటుంది. గ్యారెంటీ: న్యాయ మంత్రిత్వ శాఖ సలహా మేరకు ఈ ఒప్పందానికి సంబంధించి సార్వభౌమత్వ హామీ(ప్రభుత్వమే హామీ ఉండటం) ఇవ్వాల్సిందిగా రక్షణ మంత్రిత్వశాఖ ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని కోరింది. అయితే, ఆ ప్రభుత్వం కేవలం లెటర్ ఆఫ్ కంఫర్ట్ ను మాత్రమే ఇచ్చింది. ముందు జాగ్రత్త చర్యగా ఈ ఒప్పందానికి సంబంధించిన చెల్లింపుల కోసం ఎస్క్రో ఖాతా తెరవాలని రక్షణ మంత్రిత్వ శాఖ చేసిన విజ్ఞప్తికి ఫ్రాన్స్ ప్రభుత్వం అంగీకరించలేదు. 2007నాటి ఒప్పందంలో విమానాల తయారీ సంస్థ డసో ఏవియేషన్ ‘పనితీరు, ఆర్థిక హామీ(పెర్ఫార్మెన్స్ అండ్ ఫైనాన్షియల్) ఇచ్చింది. మొత్తం కాంట్రాక్టు విలువలో 25 శాతం మేరకు ఈ హామీ ఇచ్చింది. 2007నాటి ఒప్పందంలో అమ్మకందారు(డసో)ఈ హామీ విలువను బిడ్‌లో చేర్చారు. అయితే, 2016 ఒప్పందంలో ఇలాంటి హామీలు ఏమీ లేవు. దీనివల్ల డసో సంస్థకు బోలెడు ఆదా అయింది. -
ధర 2.86 శాతం తక్కువే
న్యూఢిల్లీ: నిత్యం వివాదాలతో వార్తల్లో ఉంటున్న రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై ఎట్టకేలకు కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక బుధవారం పార్లమెంటుకు చేరింది. రఫేల్ విమానాల కోసం 2007లో నాటి యూపీఏ ప్రభుత్వం ఖరారు చేసిన ధర కన్నా ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వం కుదుర్చుకున్న ధర 2.86 శాతం తక్కువగానే ఉందని కాగ్ నివేదిక వెల్లడించింది. అయితే రఫేల్ వ్యవహారంలో ప్రధాన ఆరోపణలు ఉన్న ‘భారత్‌లో ఆఫ్సెట్ భాగస్వామి ఎంపిక’ అంశాన్ని కాగ్ ఈ నివేదికలో కనీసం ప్రస్తావించలేదు. యుద్ధ విమానాల పూర్తి, స్పష్టమైన ధరలను కూడా కాగ్ తన నివేదికలో పేర్కొనలేదు. కాంగ్రెస్ కుదుర్చుకున్న ధర కన్నా తమ ప్రభుత్వం రఫేల్ విమానాలను కొంటున్న ధర 9 శాతం తక్కువగా ఉందంటూ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో ప్రకటించగా, తాజాగా కాగ్ మాత్రం అది 2.86 శాతమే తక్కువని స్పష్టం చేయడం గమనార్హం. ఆ ప్యాకేజీకి 6.54 శాతం ఎక్కువ ధర రఫేల్ ధరల వివరాలను సంపూర్ణంగా బయటపెట్టకపోయినప్పటికీ, ఇంజనీరింగ్ సహాయక ప్యాకేజీ, వాయుసేనకు పనితీరు ఆధారిత లాజిస్టిక్స్ వరకు చూస్తే ప్రస్తుత ధర గతం కన్నా 6.54 శాతం ఎక్కువగా ఉందని కాగ్ నివేదిక వెల్లడించింది. 2007లో కుదుర్చుకున్న ధరలతో పోలిస్తే శిక్షణా వ్యయం కూడా ప్రస్తుతం 2.68 శాతం పెరిగిందంది. రఫేల్ విమానాల్లో భారత్ కోరిన సౌకర్యాలు తదితరాల్లో మాత్రం యూపీఏ ధర కన్నా ఎన్డీయే ధరలు 17.08 శాతం తక్కువగా ఉన్నాయంది. ఆయుధాల ప్యాకేజీ కూడా గతం కన్నా ప్రస్తుతం 1.05 శాతం తక్కువకే వచ్చిందని తన 157 పేజీల నివేదికలో కాగ్ వెల్లడించారు. మొత్తంగా చూస్తే యూపీఏ కన్నా ఏన్డీయే కుదుర్చుకున్న ధర 2.86 శాతం తక్కువగా ఉందన్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం తాము ఒక్కో విమానాన్ని రూ. 520 కోట్లకు కొనేందుకు ఒప్పందం కుదుర్చుకుంటే ప్రస్తుతం మోదీ ప్రభుత్వం ఒక్కో విమానానికి రూ.1,600 కోట్లు ఖర్చు చేస్తోందని గతం నుంచీ ఆరోపిస్తోంది. డసో పోటీ సంస్థ యూరోపియన్ ఏరోనాటిక్ డిఫెన్స్ అండ్ స్పేస్ కంపెనీ (ఈఏడీఎస్) విమానాల ధరపై 20 శాతం తగ్గింపు ఇస్తామనడంపై ప్రభుత్వ స్పందనను కూడా కాగ్ రాజీవ్ మహర్షి ఈ నివేదికలో ప్రస్తావించారు. 20 శాతం తగ్గింపును ఆ కంపెనీ భారత్ అడగకుండానే ఇచ్చిందనీ, అలాగే ఈఏడీఎస్ ప్రతిపాదనల్లో వాస్తవిక వ్యత్యాసాలు ఉన్నాయి కాబట్టి ఆ కంపెనీని ఎంపిక చేయలేదని రక్షణ మంత్రిత్వ శాఖ చెప్పినట్లు కాగ్ నివేదిక తెలిపింది. లెటర్ ఆఫ్ కంఫర్ట్తోనా? ఎన్డీయే ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలోని లోపాలనూ కాగ్ తన నివేదికలో ప్రస్తావించారు. ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి హామీ/పూచీ తీసుకోకుండా కేవలం లెటర్ ఆఫ్ కంఫర్ట్తోనే మోదీ ప్రభుత్వం సరిపెట్టుకుందనీ, దీనివల్ల రఫేల్ విమానాల తయారీ సంస్థ డసో ఏవియేషన్‌కు లబ్ధి చేకూరిందని కాగ్ తెలిపారు. 2007లో కుదిరిన ఒప్పందం ప్రకారమైతే ముందస్తు చెల్లింపులకు 15 శాతం బ్యాంకు గ్యారంటీ కూడా ఉందనీ, ప్రస్తుత ఒప్పందంలో అలాంటిదేమీ లేదని కాగ్ నివేదిక వెల్లడించింది. ‘ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి పూచీకత్తు లేకుండా లెటర్ ఆఫ్ కంఫర్ట్‌తో సరిపెట్టుకోవడం వల్ల ఒకవేళ భవిష్యత్తులో డసో ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే భారత్‌కు తలనొప్పి తప్పదు. ఒప్పంద ఉల్లంఘన జరిగితే ముందుగా భారత్ మధ్యవర్తిత్వం ద్వారా డసోతోనే చర్చలు జరపాలి. ఈ చర్చల ఫలితం భారత్‌కు అనుకూలంగా ఉంటే, ఇందులో వచ్చిన తీర్పును/పరిష్కారాన్ని అనుసరించేందుకు కూడా డసో విముఖత చూపితే భారత్ మళ్లీ అందుబాటులో ఉన్న అన్ని న్యాయ పరిష్కారాలనూ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే డసో తరఫున ఫ్రాన్స్ ప్రభుత్వం భారత్‌కు డబ్బు తిరిగి చెల్లిస్తుంది’ అని నివేదిక వివరించింది. అబద్ధాలని తేలిపోయింది: జైట్లీ కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలు రఫేల్‌పై చెబుతన్నవన్నీ అబద్ధాలేనని కాగ్ నివేదికతో తేటతెల్లమైందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఆఫ్సెట్ భాగస్వామి ప్రస్తావనే లేని నివేదిక రఫేల్ వివాదంలో కాంగ్రెస్ ప్రధాన ఆరోపణ ఆఫ్ ఎంపిక గురించే. డసో భారత్‌లో తనకు ఆఫ్సెట్ భాగస్వామిగా ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)ను కాకుండా రిలయన్స్ డిఫెన్స్‌ను ఎంపిక చేసుకుందనీ, ఈ రంగంలో ఏ అనుభవం లేని కొత్త కంపెనీ రిలయన్స్ డిఫెన్స్‌కు ఈ అవకాశం దక్కడానికి మోదీ ప్రభుత్వ అవినీతే కారణమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే కాగ్ నివేదికలో మాత్రం ఆఫ్సెట్ భాగస్వామి ఎంపిక అంశం గురించి కనీసం ప్రస్తావన కూడా లేదు. ఆ కాగితమంత విలువ కూడా లేదు: రాహుల్ రఫేల్ ఒప్పందం కుదుర్చుకునేందుకు జరిపిన చర్చల సమయంలో వచ్చిన అసమ్మతి గురించి అసలు ఈ నివేదికలో కాగ్ ప్రస్తావించలేదంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగ్ నివేదికను ముద్రించిన కాగితాలకు ఉన్నంత విలువ కూడా అందులో పేర్కొన్న అంశాలకు లేదని విమర్శించారు. ‘కొత్త ఒప్పందం కుదుర్చుకోవడానికి మోదీ ప్రభుత్వం చెబుతున్న కారణాలు ధర, మరింత వేగంగా సరఫరా. కానీ ఈ ఆ రెండు వాదనలూ అవాస్తవాలేనని ద హిందూ పత్రిక తాజా కథనంతో తేలిపోయింది. కేవలం రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకీ రూ. 30 వేల కోట్లు అక్రమంగా ఇచ్చేందుకే ఈ కొత్త ఒప్పందం జరిగింది’ అని రాహుల్ మరోసారి ఆరోపించారు. రఫేల్ అంశంపై మాజీ ప్రధాని మన్మోహన్, రాహుల్, సోనియా తదితరులు పార్లమెంటు భవనం వద్ద నిరసన చేపట్టారు. -
పోలవరంపై కాగ్ కీలక రిపోర్ట్
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టుపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్ ) కీలక రిపోర్ట్ ఇచ్చింది. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. మందకొడిగా పనులు జరుగుతున్నా.. కాంట్రాక్టర్లలపై చర్యలు తీసుకోలేదని కాగ్ పేర్కొంది. కాంట్రాక్టర్లలకు రూ.1853కోట్లు రాయితీలిచ్చినా హెడ్‌వర్క్స్ పూర్తి చేయలేదని తెలిపింది. అటవీ పర్యావరణ అనుమతులకు సంబంధించిన నిబంధనలు అమలు కాలేదని చెప్పింది. భూసేకరణ, పునరావాసంపై పెట్టిన ఖర్చు వివరాలు ప్రభుత్వం సమర్పించలేదని పేర్కొంది. 12ఏళ్లలో నాలుగు శాతం మాత్రమే పునరావాసం కల్పించారని తెల్చేసింది. థర్ట్‌పార్టీ క్వాలిటీ కంట్రోల్, నాణ్యత ఆడిట్లను ఏర్పాటు చేయలేదని, పోలవరంపై కేంద్ర, రాష్ట్రాల మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకోలేదని కాగ్ వెల్లడించింది. ముంపు గ్రామాల గుర్తింపులో లోపాలు ఉన్నట్లు పేర్కొంది. నాలుగేళ్లైనా డ్యాం పనుల డిజైన్లు ఇంకా ఖరారు చేయలేదంటూ ప్రభుత్వాన్ని కడిగేసింది. కాంట్రక్టర్లకు ఇచ్చిన రాయితీలను రికవరీ చేయాలని చెప్పింది. డీపీఆర్ తయారి సమయంలో అంతా కచ్చితంగా లేదని కాగ్ వెల్లడించింది.