Daksha Nagarkar
-
శ్రీ విష్ణు ‘స్వాగ్’ మూవీ సక్సెస్ మీట్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
శ్రీ విష్ణు 'స్వాగ్' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
బ్లాక్ చీరలో కుర్రకారు మతిపోగొడుతున్న నటి దక్ష నాగర్కర్ (ఫొటోలు)
-
శ్రీముఖి క్లాస్ లుక్.. చీరలో మౌనీ రాయ్ ధగధగ!
ఫుల్ ఆనందంగా 'మిస్టర్ బచ్చన్' బ్యూటీ భాగ్యశ్రీఈఫిల్ టవర్ దగ్గర దక్ష నగర్కర్ అందాల ఆరబోతవైట్ డ్రస్ లో మరింత క్యూట్‌గా ప్రియాభవానీ శంకర్చిట్టి హ్యాండ్ బ్యాగ్‌తో నాజుగ్గా మెరిసిపోతున్న తాప్సీఓరకంట అలా చూస్తూ మైమరిచిపోయిన శ్రద్ధా దాస్క్లాస్ ఔట్ఫిట్లో హాట్‌గా కనిపిస్తున్న శ్రీముఖిటర్కీలో గ్లామర్ హీట్ పెంచేస్తున్న హీరోయిన్ శాన్వీ శ్రీవత్సవ View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Nikita Dutta (@nikifying) View this post on Instagram A post shared by Pujiitaa Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Shanvi Srivastava (@shanvisri) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) -
హాట్ బ్యూటీ బర్త్‌డే.. ఒంపుసొంపులు చూస్తే మతిపోవడం పక్కా! (ఫొటోలు)
-
'బంగార్రాజు' బ్యూటీ కిల్లింగ్ లుక్స్.. చూస్తే అంతే! (ఫొటోలు)
-
ఆస్పత్రిలో హీరోయిన్.. మత్తు మందు.. బాధ తట్టుకోలేకపోతున్నా!
దక్ష నగార్కర్.. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తొమ్మిది సంవత్సరాలపైనే అవుతోంది. ఇన్నేళ్లలో ఐదు సినిమాలు మాత్రమే చేసింది. అవన్నీ తెలుగు చిత్రాలు మాత్రమే కావడం గమనార్హం. ఇంతకాలంగా టాలీవుడ్‌నే అంటిపెట్టుకుని ఉన్నా భారీ స్థాయిలో ఒక్క హిట్ కూడా పడలేదు. హుషారు, జాంబి రెడ్డి, రావణాసుర చిత్రాలతో అంతో ఇంతో గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ బంగార్రాజు సినిమాలో ఓ పాటలో అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది.సర్జరీ గదిలోఅయితే తరచూ ఏదో ఒక ఈవెంట్లో మెరుస్తున్న బ్యూటీ.. తాజాగా ఆస్పత్రిపాలైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. 'గడిచిన కొద్ది రోజులు నాకెంతో క్లిష్టమైనవి.. ఎవరో తెలియని వ్యక్తుల మధ్య సర్జరీ గదిలో పడి ఉండటం కష్టంగా ఉంది. ఇప్పటికే వెన్నెముకకు రెండుసార్లు మత్తు మందు(అనస్థీషియా) సూదులు గుచ్చారు.ప్రేమ, కేరింగ్దాన్నుంచి కోలుకోవడం కష్టంగా ఉంది. నా ఎమోషన్స్‌ను అదుపులో పెట్టుకోవడానికి చాలా ప్రయత్నించాను. నన్ను ప్రేమించే వ్యక్తులు నాకు అండగా నిలబడ్డారు. ఇలాంటి సమయంలో ఎలా ప్రేమించాలో చూపించారు. ప్రేమ, కేరింగ్‌కు కనిపించని గాయాలను నయం చేసే శక్తి ఉంది. నా ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు. మీరు బాధపడకూడదు మీ ఆరోగ్యంపై మీరు శ్రద్ధ వహించండి. నా గురించి సంతోషకరమైన విషయాలనే పోస్ట్ చేస్తున్నాను.. ఎందుకంటే మీరు బాధపడకూడదు కాబట్టి!' అని రాసుకొచ్చింది. తనకు ఏ సర్జరీ అయిందన్నది మాత్రం చెప్పలేదు. ఇది చూసిన జనాలు.. ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) -
మెగాకోడలు క్యూట్‌నెస్.. చీరలో స్టార్ హీరో కూతురు అలా!
చీరలో మరింత క్యూట్‌గా మెగా కోడలు లావణ్య నాభి అందాల చూపిస్తున్న 'బంగార్రాజు' బ్యూటీ రోజురోజుకీ అందంగా 'బిగ్‌బాస్' ప్రియాంక జైన్ అప్పుడు-ఇప్పుడు ఫొటోల్లో జబర్దస్త్ కమెడియన్ రోహిణి నడుము ఒంపుసొంపులు చూపిస్తున్న శివాత్మిక రాజశేఖర్ కలర్ఫుల్గా కనిపిస్తున్న బిగ్‌బాస్ ఫేమ్ రతికా రోజ్ వయ్యారాలు ఒలకబోస్తూ కాక రేపుతున్న హీరోయిన్ వేదిక View this post on Instagram A post shared by Lavanya tripathi konidela (@itsmelavanya) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Rohini (@actressrohini) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Rathika (@rathikarose_official) View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) View this post on Instagram A post shared by Sakshi Chaudharry (@isakshi_chaudhary) View this post on Instagram A post shared by M.g Abhinaya (@abhinaya_official) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
Daksha Nagarkar Photos: కూకట్‌పల్లిలో సందడి చేసిన దక్ష నగార్కర్ (ఫోటోలు)
-
నెటిజన్ నుంచి అలాంటి ప్రశ్న.. వడలు బాగా తింటానని షాకిచ్చిన హీరోయిన్
హీరోయిన్ ధక్ష నగర్కర్ హోరాహోరి,హుషారు,రావణాసుర, జాంబీ రెడ్డి వంటి సినిమాల్లో నటించినా ఈ అమ్మడికి అంతగా గుర్తింపు రాలేదు. కానీ నాగా చైతన్య బంగార్రాజు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగచైతన్య-దక్ష మధ్య జరిగిన క్యూట్ వీడియో ఎంతగా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరూ సైగలతో మాట్లాడుకోవడంతో ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ అప్పట్లో వార్తలు పుట్టుకుచ్చాయి. అలా ఈ బ్యూటీ పాపులర్ అయింది. అమ్మాయిలందరి క్రష్ నాగ చైతన్య అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పి మరింత వైరల్ అయింది ఈ బ్యూటీ. దక్ష నాగర్కర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ తన అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. అప్పుడప్పుడు తన అభిమానులతో వీడియో కాల్ ద్వారా ముచ్చటిస్తుంది కూడా.. ఆ సమయంలో అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ అందరినీ ఫిదా చేస్తుంది. నిత్యం హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు దగ్గరైన దక్ష తాజాగా ఫ్యాన్స్‌తో తన ఇన్‌స్టాగ్రామ్‌లో క్వశ్చన్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. అందులో భాగంగా ఒక తుంటరి అభిమాని మీ 'థైస్'కు పెద్ద అభిమానిని అంటూనే.. ఆ సీక్రెట్ ఏంటో చెప్పాలని కోరుతాడు. దీంతో నెటిజన్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది ఈ బ్యూటీ. తానూ ఎప్పుడూ మసాలా వడలు తింటానని అందుకే తన 'థైస్' అలా ఉంటాయని ఆమె చెప్పుకొచ్చింది. అలాంటి ప్రశ్ననను కూడా ధక్ష సీరియస్‌గా తీసుకోకుండా ఎంతో స్పోర్టివ్‌గా తీసుకుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. 😹 pic.twitter.com/m3N4UeuYCY — Attipanduthatha (@attipanduthatha) February 5, 2024 View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) -
'బంగార్రాజు' హీరోయిన్ క్రేజీ పోజు.. పెళ్లికి ముందు కృతి చిల్ మోడ్!
చీరలో మరింత క్యూట్‌గా సురేఖావాణి కూతురు సుప్రీత షార్ట్ డ్రస్‌లో అందాలు ఒలకబోస్తున్న యాంకర్ దీపిక పిల్లి కశ్మీర్లో చిల్ అవుతున్న హీరోయిన్ ఆకాంక్ష సింగ్ బీచ్ ఒడ్డున బికినీలో కేక పుట్టిస్తున్న కృతి కర్బందా మత్తెక్కించేలా ఒయ్యరంగా కూర్చుని పోజిచ్చిన మడోన్నా బ్యాక్ పోజులతో మెంటలెక్కిస్తున్న హీరోయిన్ దక్షా నగర్కర్ విచిత్రమైన ఔట్ఫిట్తో కనిపించిన సోనాల్ చౌహాన్ ఉల్లిపొర లాంటి చీరలో నాభి అందాలతో మాళవిక మోహన్ View this post on Instagram A post shared by Bandaru Supritha Naidu (@_supritha_9) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Aakanksha Singh (@aakankshasingh30) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Wedding Vows Magazine (@weddingvows.in) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Soundarya Sharma (@iamsoundaryasharma) -
Daksha Nagarkar: పుస్తకం కాదు అబ్బాయిల మైండ్ చదివేస్తోంది! లుక్స్‌తో చంపేస్తోంది (ఫోటోలు)
-
విచిత్రమైన డ్రస్‌లో రష్మిక.. బిగ్‌బాస్ బ్యూటీని ఇలా చూస్తే!
డిఫరెంట్ డ్రస్‌లో విచిత్రమైన పోజులో రష్మిక చీరలో మహాలక్ష్మిలా కనిపిస్తున్న మృణాల్ ఠాకుర్ తెలుగమ్మాయిలా చీరలో హీరోయిన్ అదితీ రావు హైదరీ 'కాంతార' బ్యూటీ చీరలో మరింత అందంగా కనిపిస్తూ 'లియో' నటి క్యూట్ పోజులు.. చూస్తే ఫిదా గ్యారంటీ గోవాలో చిల్ అవుతున్న బిగ్‌బాస్ 7 బ్యూటీ శుభశ్రీ అలాంటి డ్రస్‌లో 'బిగ్‌బాస్' స్రవంతి రొమాంటిక్ స్టిల్స్ 'టైగర్ నాగేశ్వరరావు' బ్యూటీ అందాల విందు కేక పుట్టించేలా పోజులిచ్చి రెచ్చగొడుతున్న దక్ష View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Sapthami Gowda 🧿 (@sapthami_gowda) View this post on Instagram A post shared by janany (@janany_kj) View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru) View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) View this post on Instagram A post shared by Ashwini Sri (@ashwinii_sree) -
అనసూయ విచిత్రమైన షర్ట్.. సెగలు రేపుతున్న దక్ష
పింక్ కలర్ ఔట్ఫిట్లో అదితి వయ్యారాలు విచిత్రమైన షర్ట్‌తో కనిపించిన అనసూయ డిమ్ లైట్ వెలుగులో టెంప్ట్ చేస్తున్న శ్రీలీల అందాల విందు చేస్తున్న 'బంగార్రాజు' బ్యూటీ దక్ష తమిళ పాటకు అనుపమ క్యూట్ స్టెప్పులు సోయగాలతో సెగలు పుట్టిస్తున్న సుప్రీత సెల్ఫీతో కేక పుట్టిస్తున్న 'చిరుత' హీరోయిన్ నడిరోడ్డుపై హీరోయిన్ నభా నటేశ్ పోజులు View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Bandaru Supritha Naidu (@_supritha_9) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) -
బీ న్యూ మొబైల్స్ స్టోర్‌లో రెడ్మీ 12సి సిరీస్ ఫోన్లు
హైదరాబాద్: ప్రముఖ రిటైల్ చైన్ బీ న్యూ మొబైల్ స్టోర్ రెడ్మీ 12సీ, 12 సిరీస్ స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చింది. సినీ నటి దక్ష నాగర్కర్ గురువారం రెడ్మీ 12సీ స్మార్ట్‌ఫోన్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ‘‘బీ న్యూ స్టోర్స్ అద్భుతమైన ఆఫర్లతో రెడ్ మీ 12సీ స్మార్ట్ఫోన్లను తక్కువ ధరకే అందిస్తుంది. కస్టమర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి’’ అని నాగర్కర్ కోరారు. ఆవిష్కరణ కార్యక్రమంలో కంపెనీ సీఎండీ బాలాజీ చౌదరి, సీఈఓ సాయి నిఖిలేశ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి నితేశ్తో పాటు రెడ్మీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రతి అమ్మాయి చై లాంటి అబ్బాయిని కోరుకుంటుంది: హీరోయిన్
హీరోయిన్ ధక్ష నగర్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. హోరాహోరి,హుషారు వంటి సినిమాల్లో నటించినా ఈ అమ్మడికి అంతగా గుర్తింపు రాలేదు. కానీ బంగార్రాజు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగచైతన్య-దక్ష మధ్య జరిగిన క్యూట్ వీడియో ఎంతగా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరూ సైగలతో మాట్లాడుకోవడంతో ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ అప్పట్లో వార్తలు పుట్టుకుచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దక్ష నాగచైతన్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'చైతూ చాలా స్వీట్ పర్సన్. చై లాంటి అబ్బాయిని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అమ్మాయిలందరి క్రష్ అని చెప్పొచ్చు. చాలా కేరింగ్‌గా చూసుకుంటాడు. అమ్మాయిలను చాలా గౌరవిస్తాడు. బంగర్రాజు సినిమా షూటింగ్ టైంలో నన్ను హగ్ చేసుకోవడానికి, ముద్దు పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఆ సీన్స్ చిత్రీకరించాక వచ్చి నాకు సారీ చెప్పాడు..అంత స్వీట్ అబ్బాయి అతను అంటూ చై పై తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీ రవితేజ సరసన రావణాసుర అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. • Men Will Be Men 😜#NagaChaitanya || #Bangarraju #BangarrajuOnJan14th pic.twitter.com/J6xaQf9GZT — ChayAkkineni ™ 🏹 (@MassChayCults) January 10, 2022 -
హీరోయిన్ దక్షా నగార్కర్ లేటెస్ట్ ఫోటోలు
-
అన్ని రకాల పాత్రలు చేయాలనుంది
‘‘నా ప్రతి సినిమాలో ఎప్పుడూ కొత్తగా చేయాలని ప్రయత్నిస్తాను. నా గత చిత్రాలు ‘హోరాహోరి, హుషారు, జాంబిరెడ్డి’ కూడా వేటికవే ప్రత్యేకమైన జోనర్. ‘రావణాసుర’ కూడా చాలా వైవిధ్యమైన సినిమా. ఇందులో నా పాత్ర చూసి ప్రేక్షకులు సర్ప్రైజ్ అవుతారు’’ అని హీరోయిన్ దక్షా నగార్కర్ అన్నారు. రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘రావణాసుర’. అభిషేక్ నామా, రవితేజ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఓ హీరోయిన్గా నటించిన దక్షా నగార్కర్ మాట్లాడుతూ..‘‘రావణాసుర’ కోసం అభిషేక్‌గారు నన్ను సంప్రదించారు. ఆ తర్వాత సుధీర్ వర్మగారు నా పాత్ర, లుక్ గురించి చెప్పగానే ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. ఈ మూవీలో నలుగురు హీరోయిన్లు ఉన్నప్పటికీ నా పాత్రకి ఎంత న్యాయం చేయగలను అనే దానిపైనే దృష్టి పెట్టాను. నటనకి ఆస్కారం ఉన్న పాత్ర చేశాను. ఒక నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలని, అందరి హీరోలతో కలిసి నటించాలని ఉంది. కొత్తగా రెండు సినిమాలు ఒప్పుకున్నాను’’ అన్నారు. -
రవితేజ ‘రావణాసుర’ థీమ్ సాంగ్ విన్నారా?
రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రావణాసుర’. అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సుశాంత్ కీలక పాత్ర చేస్తున్నారు. అభిషేక్ నామా, రవితేజ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ‘రావణా..’ అంటూ సాగే థీమ్ సాంగ్‌ని విడుదల చేశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ థీమ్ సాంగ్‌ని కంపోజ్ చేయగా, పాపులర్ మ్యూజిక్ వేదిక్ బ్యాండ్ శాంతి పీపుల్, నోలిక్ ఈ థీమ్ సాంగ్‌ని ఆలపించారు. ‘‘హై ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’. రవితేజను లాయర్ పాత్రలో చూపిస్తున్నారు సుధీర్ వర్మ. కథలో ఊహించని మలుపులుంటాయి. ఏప్రిల్ 7న మా సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాతలు. -
చైతూని కొంటెగా కవ్వించిన దక్ష బ్యూటిఫుల్ ఫొటోలు
-
చై-దక్షల వీడియోపై షాకింగ్ కామెంట్స్, చై బంగారం, ఇదంతా హీరోయిన్ వల్లే..
నాగార్జున, నాగ చైతన్య మల్టీస్టారర్లుగా నటిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’ ఈవెంట్లో నాగచైతన్య, నటి దక్ష వీడయో నెట్టింట చర్చనీయాంశమైంది. స్టేజ్‌పై నాగార్జున మాట్లాడుతుంటే చై, హీరోయిన్ దక్ష వైపు చూడగా.. ఆమె కొట్టెగా కనుబొమ్మలు ఎగిరేయడంతో చై సిగ్గుపడిపోయాడు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తూ వైరల్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. బంగార్రాజు మూవీ విడుదలై మంచి విజయం సాధించింది. ఈ క్రమంలో మూవీ సెక్సెస్ మీట్లో దర్శకడు కల్యాణ్ కృష్ణ ఈ వీడియోపై స్పందించాడు. చదవండి: ఆహాతో నాకు సంబంధం లేదు, గమనించగలరు: అల్లు శిరీష్ ట్వీట్ వైరల్ సెట్లో నాగచైతన్య ఎలా ఉండేవాడు, స్వభావం గురించి వివరిస్తూ ఈ వైరల్ వీడియోపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇదంతా దక్ష వల్లనే జరిగిందంటూ నటివైపు చూస్తూ అన్నాడు దర్శకుడు కల్యాణ్ కృష్ణ. ‘బెసిగ్గా నాగచైతన్య చాలా సిగ్గు, మోహమటస్తుడు. అతడికి ఎంతటి సిగ్గు అంటే దానికి ఉదహరణ ఇటీవల వైరల్ అయిన వీడియోను ఉదాహరణ. నాగ్ సార్ మాట్లాడుతుంటే ఏదో సౌండ్ వినిపంచడంతో వెనక్కి తిరిగాడు. దీంతో దక్ష అతడి చూసి కళ్లు ఎగిరేసింది. దానికే చై సిగ్గుపడ్డాడు. ఆయన స్వభావమే అంతా. దేనికైన సిగ్గు పడతాడు. ఇదంతా దక్ష వల్లే జరిగింది. చైతన్యది ఏం లేదు, అంతా నువ్వే చేశావు’ అంటూ హీరోయిన్ వైపు చూస్తూ అన్నాడు. చదవండి: జూనియర్ ఎన్టీఆర్ సరసన చాన్స్ కొట్టేసిన రష్మిక! ఇలా చై, దక్షల వైరల్ వీడియోపై దర్శకడు కల్యాణ్ కృష్ణ క్లారిటీ ఇచ్చాడు. అలాగే ఈ సందర్భంగ కల్యాణ్ కృష్ణ, నాగ చైతన్యపై ప్రశంసలు కురిపించాడు. ‘చై బంగారం. చైతూని అందరూ బంగారం ఎందుకు అని అంటారో ఆయనతో పని చేశాక తెలుస్తుంది. రారండోయ్ వేడుక చూద్దాం సినిమాను చేశాను. ఇప్పుడు బంగార్రాజు చేశాను. 24 కారెట్స్ కాస్త 48 కారెట్స్ అయింది. ఈ నాలుగేళ్లలో అతనిలో చాలా మార్పులు వచ్చాయి. మాట్లాడే పద్దతి, నటన, మెచ్యూరిటీలో మార్పులు వచ్చాయి. చైలో ఉన్న క్లారిటీ మనకు పది శాతం ఉంటే.. హ్యాపీగా బతికేయోచ్చు. ఈ సినిమా వల్ల ప్రతీ రోజు సెట్లో కలిశాం. చై సైలెంట్ అని అనిపిస్తుంది. కానీ అంత సైలెంట్ కాదు. ఓపెన్ అప్ ఎంజాయ్ చేస్తే నవ్వు ఎంతో ప్లెజెంట్‌గా ఉంటుంది. ఇంత వరకు రాముడి పాత్రలు చేస్తే ఇప్పుడు చేసింది కృష్ణుడు కారెక్టర్. • Men Will Be Men 😜#NagaChaitanya || #Bangarraju #BangarrajuOnJan14th pic.twitter.com/J6xaQf9GZT — ChayAkkineni ™ 🏹 (@massChayCults) January 10, 2022 చదవండి: నా జిమ్ ట్రైనర్ టార్చర్ చేస్తుంటాడు, నేను ఆ చాన్స్ మిస్సయ్యా: రష్మిక -
హీరోయిన్ కొంటె నవ్వు.. సిగ్గుపడిపోయిన నాగ చైతన్య
Naga Chaitanya And Daksha Cute Expressions Video In Bangarraju Event: నాగార్జున, నాగ చైతన్య మల్టీస్టారర్లుగా నటిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. 'సోగ్గాడే చిన్నినాయనా' కి సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్ర బృందం గత రాత్రి(సోమవారం) మ్యూజికల్ నైట్స్ అనే ఈవెంట్‌ని నిర్వహించింది. ఈ సందర్భంగా స్టేజ్‌పై నాగార్జున మాట్లాడుతుండగా ఓ ఫన్నీ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. మ్యూజిక్ గురించి అనూప్ రూబెన్స్‌ని నాగార్జున ప్రశంసిస్తుంటే.. సడెన్‌గా నాగ చైతన్య వెనక్కి తిరిగి హీరోయిన్ దక్ష నాగర్కర్ వైపు చూశాడు. దీంతో ఆమె కూడా కనుబొమ్మలు ఎగరేస్తూ కొంటెగా నవ్వింది. దీంతో చైతూ కూడా సిగ్గుపడిపోయాడు. దీనికి సంబంధించిన క్యూట్ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఒక్కోసారి సడెన్ ఇన్సిడెంట్స్ కూడా క్యూట్‌గా ఉంటాయి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతిశెట్టిలతో పాటు 8మంది హీరోయిన్లు సందడి చేయనున్న విషయం తెలిసిందే. • Men Will Be Men 😜#NagaChaitanya || #Bangarraju #BangarrajuOnJan14th pic.twitter.com/J6xaQf9GZT — ChayAkkineni ™ 🏹 (@massChayCults) January 10, 2022 -
లాయర్‌గా రవితేజ సందడి.. విలన్‌గా అందాల తార ఢీ
Daksha Nagarkar As Vilain In Raviteja Ravanasura Movie: చిన్న చిన్న పాత్రలు చేస్తూ అంచలంచెలుగా ఎదిగి మాస్ మాహారాజాగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు రవితేజ. 'ఇడియట్'గా అమ్మాయిల మనసుల్లోకి దూరి ఓటమి ఎదురైనా సరే విజయం కోసం పట్టువదలని 'విక్రమార్కుడు'గా తానేంటో నిరూపించుకుని విమర్శకులతో సైతం 'రాజా ది గ్రేట్' అనిపించుకున్న 'వెంకీ'.. తనకు సినిమాపై ఉన్న 'క్రాక్'తో మరోసారి హిట్ ట్రాక్‌లోకి వచ్చాడు. ఇక వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ తర్వాత రవితేజ 70వ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా రావణాసుర. ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్వకత్వం వహిస్తున్నారు. అయితే ఇంతటి పవర్ఫుల్ టైటిల్ పెట్టడంతో ప్రేక్షకులు, అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇదీ చదవండి: ఆ పాత్ర కోసం ఎంతో రీసెర్చ్ చేశా: పూజా హెగ్డె అందుకు తగినట్లే మూవీ క్యాస్టింగ్‌ను ఎంపిక చేసే పనిలో పడింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో రవితేజ కోసం ఒక శక్తిమంతవమైన లేడీ విలన్ రోల్‌ను తీర్చిదిద్దనున్నారట. ఈ పాత్ర కోసం హుషారు, జాంబీరెడ్డి ఫేమ్ దక్షా నాగర్కర్ను సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ఈ పాత్రకు దక్షా కూడా ఓకే చెప్పిందని ప్రచారం జరుగుతోంది. జాంబీ రెడ్డి, హుషారు, హోరాహోరీ చిత్రాల్లో తన అందచందాలతో ఆకట్టుకున్న దక్షా ఈ సినిమాలో లాయర్‌గా సందడి చేయనున్న రవితేజను ఎలా ఢీకొట్టనుందో అని అభిమానుల్లో ఆసక్తిరేకెత్తిస్తోంది ఈ ముంబై భామ. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన 'రావణాసుర' చిత్రం జనవరి 14న పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఇదీ చదవండి: రవితేజ 'రావణాసుర'కు ముహుర్తం ఫిక్స్.. త్వరలో -
'జాంబీ రెడ్డి' సినిమా రివ్యూ
టైటిల్ : జాంబీ రెడ్డి జానర్ : జాంబీ నటీనటులు : తేజ సజ్జ, ఆనంది, దక్ష నగార్కర్, పృథ్వీ రాజ్, గెటప్ శ్రీను, అన్నపూర్ణమ్మ, కిరీటి, హరితేజ, రఘుబాబు దర్శకుడు : ప్రశాంత్ వర్మ నిర్మాత : రాజశేఖర్ వర్మ సంగీతం : మార్క్ కె. రాబిన్ సినిమాటోగ్రఫి: అనిత్ విడుదల తేది : 5 ఫిబ్రవరి 2021 మెగాస్టార్ చిరంజీవి 'ఇంద్ర' సహా ఎన్నో సినిమాల్లో బాల నటుడిగా కనిపించాడు తేజ సజ్జ. సమంత 'ఓ బేబీ'లో ఓ పాత్ర చేసిన అతడు 'జాంబీ రెడ్డి' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. జాంబీ జానర్లో కథ ఎంచుకుని తొలి సినిమాతోనే ప్రయోగానికి సిద్ధమయ్యాడంటే ఆయన గుండె ధైర్యాన్ని మెచ్చుకుని తీరాల్సిందే. అ, కల్కి వంటి ప్రయోగాత్మక సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ జాంబీలకు కమర్షియల్ టచ్ ఇస్తూ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. మరి జాంబీలు జనాలను భయపెట్టాయా? ఈ ప్రయోగం విజయవంతం అయిందా? ఈ కాన్సెప్ట్ తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందా? లేదా? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఈ రివ్యూ చదవాల్సిందే. కథ: ప్రధాని నరేంద్ర మోదీ లాక్డౌన్ ప్రకటించిన సన్నివేశంతో కథ మొదలవుతుంది. అయితే లాక్‌డౌన్‌ను పెద్దగా ఖాతరు చేయని గేమ్ డిజైనర్, హీరో తేజ సజ్జ తన గ్యాంగ్.. దక్ష నగార్కర్, కిరీటితో కలిసి రాయలసీమలో స్నేహితుడు ఆర్జే హేమంత్ పెళ్లికి వెళ్తారు. ఈ ప్రయాణంలో వారికి అనుకోని సంఘటన ఎదురవుతుంది. కానీ ఇది వారి జీవితాలనే కాదు, వాళ్లని కూడా మార్చేస్తుందనేది హీరో గ్యాంగ్‌కు అప్పుడు అర్థం కాదు. కానీ తీరా పెళ్లికి వెళ్లాక గ్యాంగ్‌లోని కిరీటి జాంబీగా మారిపోతాడు. అతడు ఒక్కడే కాదు ఆ ఊర్లోని వాళ్లంతా జాంబీలుగా మారుతుంటారు. తేజ, ఆనంది, దక్షా, గెటప్ శ్రీను, ఆర్జే హేమంత్ తప్ప! మరి ఈ ఐదుగురు ఊర్లో వాళ్లను తిరిగి మామూలు మనుషులను చేయగలిగారా? లేదంటే వీళ్లు కూడా జాంబీలుగా మారిపోయారా? కనీసం ప్రాణాలతో అక్కడ నుంచి బయటపడ్డారా? అన్నది థియేటర్లలో చూసి తెలుసుకోవాల్సిందే! విశ్లేషణ: తెలుగులో ఇంతవరకు ఏ దర్శకనిర్మాత టచ్ చేయని జానర్ జాంబీ. దీంతో ఆ కాన్సెప్ట్‌తో వస్తున్న తొలి సినిమా కావడంతో ప్రేక్షకులు దీన్ని ఎలా స్వీకరిస్తారు? వారికి ఎంతమేరకు ఎక్కుతుంది? అనేది మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉంది. కానీ ఇక్కడే దర్శకుడు ఈ హారర్ సినిమాకు కమర్షియల్ టచ్ ఇస్తూ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్చేసి ప్రేక్షకులను సీటుకు కట్టిపడేసే ప్రయత్నం చేశాడు. పైగా వల్గర్ కామెడీ జోలికి పోకుండా కరోనా జోకులను వాడుకోవడం విశేషం. ఇక సినిమా స్టార్ట్ అవగానే జాంబీలు కనిపించరు. కరోనా అంటూ, దాని మీద పాట కడుతూ కొంత భాగం సాగదీస్తూ ఏదో మమ అనిపించారు. తర్వాత నెమ్మదిగా జాంబీలను పరిచయం చేస్తాడు ప్రశాంత్ వర్మ. ఇంటర్వెల్లో మాంచి కిక్ ఇచ్చే ట్విస్ట్ ఇవ్వడంతో నెక్స్ట్ ఏంటి? అన్న ఆతృత ప్రేక్షకుడిలో కనిపించక మానదు. సెకండాఫ్ ప్రారంభంలో గెటప్ శ్రీను కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. అతడికి, అన్నపూర్ణమ్మకి మధ్య ఉండే కామెడీ సన్నివేశాలు బాగా పండాయి. ఆ తర్వాత ముగింపు వరకు ట్విస్టుల మీద ట్విస్టులతో ప్రేక్షకులకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తూ జనాలను సినిమాలో లీనం చేశాడు డైరెక్టర్. కానీ క్లైమాక్స్ లాజిక్ అందరికీ నచ్చకపోవచ్చు. (చదవండి: అల్లుడు అదుర్స్ మూవీ రివ్యూ) ఎలా ఉందంటే.. మొత్తానికి ప్రశాంత్ వర్మ తన విలక్షణతకు పదును పెడుతూ వెండితెరపై జాంబీలను భయంకరంగా చూపించాడు. జాంబీల మేకప్, నడిచే తీరు, దాడి చేసే విధానం అన్నీ హాలీవుడ్ రేంజ్లో ఉంటాయి. జాంబీలతో పోరాడే యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకే హెలైట్. విజువల్స్, మేకింగ్ అన్నీ సరిగ్గా సరిపోయాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరో లెవల్లో ఉంది. పాటల విషయానికొస్తే కొన్ని బాగున్నాయి, మరికొన్ని పర్వాలేదనిపించాయి. కానీ జాంబీలు చేసే పైశాచిక విన్యాసాలు కొంత రోత పుట్టిస్తున్నాయి. సినిమా పూర్తయ్యాక అందరూ సెకండాఫ్ గురించే మాట్లాడుకుంటారు. ఫస్టాఫ్‌ను కూడా అదే రేంజ్లో తీయాల్సింది. కానీ దర్శకుడు ఫస్టాఫ్‌ను పెద్దగా ఖాతరు చేసినట్లు కనిపించలేదు. అలా మొదటి పార్ట్‌ను కాస్త గాలికొదిలేయకుండా ఏవైనా రెండు, మూడు కీలక సన్నివేశాలను రాసుకొని ఉండుంటే మరింత పస ఉండేది. ఎడిటింగ్ విషయానికి వస్తే సాయిబాబుకు బోలెడంత పని ఇంకా మిగిలే ఉంది. కథనంపై ఇంకాస్త దృష్టి పెట్టుంటే జాంబీ రెడ్డి విజృంభించేంది. సాగదీతతో ఫస్టాఫ్ తేలిపోయినప్పటికీ సెకండాఫ్ ఇచ్చిన బూస్ట్‌తో సినిమా పర్వాలేనిపించింది. (చదవండి: హీరోగా నాకిది సరైన లాంచ్) నటన: ఇక ఈ సినిమా తన కెరీర్‌ను మారుస్తుందన్న తేజ మాట అక్షరాలా నిజమయ్యే అవకాశం ఉంది. జాంబి రెడ్డిలో అద్భుతంగా నటించిన అతడికి ప్రశంసలు దక్కడం ఖాయం. అతడి సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా బాగా నటించి పాత్రలకు తమ వంతు న్యాయం చేశారు. ఆన్ స్క్రీన్ మీద ఉన్న నటీనటులు ఎలా బెస్ట్ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నారో అలాగే టెక్నికల్ టీమ్ కూడా ది బెస్ట్ ఇచ్చి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఓవరాల్‌గా ప్రేక్షకులు కొత్త ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. కానీ మితిమీరిన హింసతో చెలరేగిపోయిన ఈ జాంబీరెడ్డి సినిమాను ఫ్యామిలీతో చూడటం కొంత కష్టమే. (చదవండి: మిస్టర్... టార్గెట్ మిస్!) -
'జాంబీ రెడ్డి'కి బెదిరింపులు: దర్శకుడు
‘‘లాక్ డౌన్ తర్వాత ఆరంభించిన ఫస్ట్ చిత్రం మా ‘జాంబిరెడ్డి’. మొదట్లో ఇద్దరు ముగ్గురుతో ఉన్న సీన్స్ చేశాం.. ఒక్కో వారం గ్యాప్ తీసుకొని చేయడం వల్లే సినిమా ఇంత ఆలస్యం అయ్యింది.. లేదంటే మా సినిమా ఎప్పుడో విడుదలవ్వాల్సింది’’ అన్నారు ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా హీరోగా, ఆనంది, దక్షా నగార్కర్ హీరోయిన్లుగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబిరెడ్డి’. రాజ్‌శేఖర్ వర్మ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం మన సినిమాల్లో లవ్ జానర్ ఎలానో జాంబీ కూడా ఒక జానర్. మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథ అల్లుకుని ఈ సినిమా తీశా. హాలీవుడ్లో ఇప్పటికే జాంబీ సినిమాలు తీసినవాళ్లకి కూడా ఇది కొత్తగా అనిపిస్తుంది. ఎనిమిదేళ్ల క్రితమే ఈ సినిమా అనుకున్నాను. కుదరలేదు.. ఇప్పుడు కుదిరింది. ఒక తెలియని విషయాన్ని మనకు తెలిసిన విషయానికి కనెక్ట్ చేసి చెప్తే సులభంగా అర్థమవుతుంది. త్రివిక్రమ్‌గారు ఈ విధంగా చేస్తుంటారు. మహాభారతం, భాగవతంతో కలిపి తన సినిమాల్లో చెబుతుంటారాయన. అలా నేను కూడా ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేద్దామనుకొని జాంబీ కాన్సెప్ట్‌కి ఫ్యాక్షన్ యాడ్ చేశాను. ‘జాంబిరెడ్డి’ టైటిల్ పెట్టినప్పుడు చాలానే బెదిరింపులు వచ్చాయి. రాయలసీమ బ్యాక్‌డ్రాప్ కాబట్టి ఆ టైటిల్ పెట్టాం. ఇండస్ట్రీలో భిన్నమైన స్వరాలు వినిపించాయి. ‘ఇలాంటి జానర్ మేం చేద్దాం అనుకున్నాం.. కానీ ప్రేక్షకులకు అర్థం కాదేమో అని వదిలేశాం’ అని కొందరు.. ‘మంచి ఐడియా’ అని మరికొందరు అన్నారు. అయితే ట్రైలర్ విడుదలయ్యాక ‘నువ్వు సాధించావ్’ అన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. ఈ చిత్రంలో పెద్ద హీరో అయితే మార్కెట్ పరిధి బాగుండేది. కానీ సినిమా తీయడానికి రెండేళ్లు పట్టేదేమో? త్వరగా సినిమా చెయ్యాలనుకున్నాను.. తేజ సరిపోతాడనిపించి తీశాను. మా చిత్రం టీజర్ రిలీజ్ అయ్యాక హిందీ రీమేక్‌కి అవకాశాలొచ్చాయి. సమంతగారికి చెప్పింది ‘జాంబిరెడ్డి’ కథ కాదు.. వేరేది. మేమిద్దరం ఆ స్క్రిప్ట్‌ని నమ్మాం.. కానీ నిర్మాత దొరకలేదు. నా దగ్గర ప్యాన్ ఇండియా కథలు కూడా ఉన్నాయ్. ‘జాంబిరెడ్డి’ విజయం సాధించి మంచి పేరు వస్తే, సీక్వెల్‌ని ప్యాన్ ఇండియా స్థాయిలో తీస్తాం’’ అన్నారు.