davos tour
-
చంద్రబాబుపై కాకాని గోవెర్దన్ రెడ్డి కామెంట్స్
-
భారతీయులు గ్లోబల్ లీడర్లుగా ఎదగాలి: సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: భారతీయులు ముఖ్యంగా తెలుగువారు గ్లోబల్ లీడర్లుగా ఎదగాలని సీఎం చంద్రబాబు చెప్పారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడానికి జ్యూరిచ్ వచ్చిన చంద్రబాబు సోమవారం అక్కడి ప్రవాసాంధ్రులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. భారతీయులను గ్లోబల్ లీడర్లుగా ప్రమోట్ చేయడానికి ఒక ఫోరం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. గతంలో తాను బిల్‌గేట్స్‌తో మాట్లాడి హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ తీసుకురావడం వల్లే తెలుగువాడైన సత్య నాదెళ్ల ఇప్పుడు ఆ కంపెనీ సీఈవోగా ఎదిగాడని చెప్పారు. ఎలివేషన్, స్పిరిట్ అంటే ఇలాగే ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను వర్క్ ఫ్రం హోమ్ హబ్‌గా తీర్చిదిద్దుతానని, ఇందుకు ప్రవాసాంధ్రులు సహకరించాలని కోరారు. వర్క్ ఫ్రం హోమ్ ద్వారా రాష్ట్రంలోని గృహిణులకు అవకాశం వస్తే వారు మీకన్నా ఎక్కువ సంపాదిస్తారన్నారు. ప్రభుత్వమే లైసెన్స్ ఫీజులు చెల్లించి ఏఐ, చాట్‌జీపీటీ వంటివాటిని రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా అందించే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి 12 దేశాల నుంచి తెలుగువారు వచ్చారని, ఇందులో అత్యధికంగా తెలుగుదేశం కార్యకర్తలే ఉన్నారని అన్నారు. తనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలగువారు నిరసన ప్రకటించి, తనకు మద్దతు ప్రకటించారని, ఎవరైనా చనిపోయిన తర్వాత పేర్లు గుర్తుపెట్టుకుంటారు కానీ, బతికుండగానే పేరు గుర్తుపెట్టుకున్నందుకు గర్వంగా ఉందన్నారు. అనంతరం సీఎం రోడ్డు మార్గం ద్వారా దావోస్‌కు వెళ్లారు.సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనదావోలో చంద్రబాబు సోమవారం తొలిరోజు పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించారు. ముందుగా స్విట్జర్లాండ్‌లోని భారత అంబాసిడర్ మృధుల్ కుమార్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి స్విట్జర్లాండ్ నుంచి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫార్మాస్యుటికల్స్, మెడికల్ డివైజ్‌లు, టెక్స్టైల్స్, రైల్ కాంపోనెంట్ వంటి తయారీ రంగంలో విస్తృతంగా అవకాశాలు ఉన్నాయని సీఎం తెలిపారు. ఏపీలో ఏర్పాటు చేస్తున్న స్కిల్లింగ్, ఏఐ యూనివర్సిటీతో స్విట్జర్లాండ్ యూనివర్సిటీలు కలిసి పనిచేసేలా చూడాలని కోరారు. అనంతరం మృధుల్ కుమార్ స్విట్జర్లాండ్‌కు చెందిన నాలుగు ప్రముఖ సంస్థల సీఈవోలు, ఇతర ముఖ్యులను సీఎం చంద్రబాబుతో సమావేశపరిచారు. ‘స్విస్‌మెన్’ సెక్రటరీ జనరల్ రౌల్ కెల్లర్, ‘ఓర్లికాన్’ సీఈవో మార్కస్ టకే, ‘ఆంగ్సŠట్ ఫిస్టర్’ సీఈవో ఎరిచ్ స్మిడ్, ‘స్విస్ టెక్స్టైల్స్’ హెడ్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ ఎక్స్టెర్నల్ ఎఫైర్స్ జార్న్ వాన్ డెర్ క్రోన్‌కు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను సీఎం వివరించారు. చంద్రబాబు, రేవంత్ భేటీజ్యూరిచ్ విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనుకోకుండా కలుసుకున్నారు. ఒకరికి ఒకరు ఎదురుపడటంతో కాసేపు ఇరువురు కూర్చుని మాట్లాడుకున్నారు. రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడులపై వారి మధ్య చర్చ జరిగింది. -
దావోస్ వెళ్దాం.. పబ్లిసిటీ బారెడు.. దక్కేది చెంచాడు!
ఉందిలే మంచి కాలం ముందుముందునా.. అందరూ సుఖపడాలి నందనందనా అంటూ ఎగురుతున్నాడు అప్పన్న.. ఏమైందిరా అని అడిగాడు సింహాచలం. అయినా సరే అప్పన్న నిలవలేకపోతున్నాడు.. మరి పర్లేదు ఈ నాల్రోజులు గడిస్తే నాకు నా కొడుక్కి.. నా కూతురికి ఉద్యోగాలు.. మేమంతా హాయిగా ఇంటిల్లిపాదీ ఉద్యోగాలు చేస్తాం.. అందరికీ ఉద్యోగాలు.. నాలుగు జీతాలు.. చేతినిండా డబ్బులు.. మంచి బ్రాండ్లు తాగొచ్చు అనుకుంటూ ఊగిపోతున్నాడు.ఏందిరా అప్పిగా ఏంది నీ గొల్లు.. ఏదీ చెప్పకుండా ఎగురుతున్నావ్.. మెంటల్ గానీ ఎక్కిందేట్రా అన్నాడు సింహాచలం.. మరేట్లేదు.. ముందు ముందు అంతా అదిరిపోతోంది.. ఊళ్లన్నీ ఉద్యోగాలు.. నా కొడుక్కు ఒక మంచి జాబ్.. పాతికవేలు జీతం.. ఇక మా డబ్బులు దాచావుకొవడానికి బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయాలి.. రెండు జీతాలు ఖర్చుపెట్టుకుని ఒక జీతం దాచుకోవాలి అనుకుంటూ ఊగుతున్నాడు. చీప్ లిక్కర్ తాగి పిచ్చిగా వాగుతున్నావా?.. ఎదవా.. అసలు ఏమైంది చెప్పురా అని అప్పన్న టెంకిమీద ఒకటిచ్చాడు సింహాచలం.. టెంకి మీద దెబ్బతో మామూలు పరిస్థితికి వచ్చిన అప్పన్న తుపుక్కున బీడీ పడేసి.. విషయం నీకు తెలీదా.. ఐతే రా చెబుతా అని రాయి మీద కూర్చున్నాడు.మా వోడు.. కొడుకూ కలిపి ఇమానంలో ఎల్లారా.. ఇక పదిరోజుల్లో వచ్చేత్తారు.. రాగానే బోలెడు కంపెనీలు తెచ్చేస్తారు.. ఇక మనకు ఉద్యోగాల జాతరే అన్నాడు అప్పన్న.. ఒరేయ్ అడ్డదిడ్డంగా కూస్తే పీక కొస్తా అని సింహాచలం చెప్పడంతో.. లైన్లోకి వచ్చిన అప్పన్న.. మరేటి లేదురా.. పెదబాబు.. చినబాబు దావోస్ వెళ్లారు. వస్తూనే సంచుల్లో కంపెనీలు తేవడం.. ఉద్యోగాలు ఇవ్వడం.. ఇక ఏపీ ఎలిగిపోవడం.. తథ్యం అన్నాడు. ఇప్పటికే ఇంగ్లీష్ చానెల్లకు డబ్బులు కూడా ఇచ్చేశాం తెలుసా.. పబ్లిషిటీ కోసం అన్నాడు.. అప్పన్న.ఒరేయ్ తాగుబోతోడా.. మీ బాబులు ఇది ఎన్నోసారి దావోస్ వెళ్లడం.. అని అడిగాడు సింహాచలం.. ఎయ్యే ఎన్నోసార్లు వెళ్ళాడు.. మరి ఏమైంది అన్నాడు సింహాచలం.. వెళ్ళాడు అప్పట్లో కర్రీ పాయింట్ పెట్టి.. పాల కూర పప్పు కూడా అందరికి వడ్డించాడు తెలుసా.. గర్వంగా అన్నాడు అప్పన్న. సరే.. కర్రీపాయింట్ కాకుండా ఇంకేం జరిగింది.. అడిగాడు సింహాచలం. ఏమోరా అన్నాడు అప్పన్న. సరే నేను చెబుతా విను.. అంటూ సింహాచలం మొదలెట్టాడు. అప్పట్లో బిల్ గేట్స్ తో ఫోటో దిగాడు.. మరి ఆంధ్రకు మైక్రోసాఫ్ట్ వచ్చిందా.. రాలేదు.. డెలాయిట్ అన్నారు వచ్చిందా.. రాలేదు.. జనరల్ అట్లాంటిక్ అన్నారు వచ్చిందా.. రాలేదు.. ఇంటర్నేషనల్ ఆస్పత్రి అన్నారు.. ఫోటోలు దిగారు.. వచ్చిందా.. రాలేదు.అలాగే, గూగుల్, యాక్సెంజర్ డేటా సెంటర్లు అన్నారు.. వచ్చాయా.. రాలేదు.. పైగా సిస్టమ్స్ అన్నారు వచ్చిందా.. రాలేదు.. మరి ఏమీ రానిదానికి అప్పట్లో ఏ స్థాయి బిల్డప్ ఇచ్చారు గుర్తుంది కదా.. అవునవును యాదొచ్చింది అన్నాడు అప్పన్న.. మరి అప్పుడు రాని కంపెనీలు ఇప్పుడు ఎలా వస్తాయిరా అప్పిగా.. మెల్లగా చురకేశాడు సింహాచలం.. అవునురోయి.. నేను హిస్టరీ మర్చిపోయాను.. అప్పుడు రానివి ఇప్పుడెలా వస్తాయి.. మారేలా అన్నాడు అప్పన్న. ఏమీ లేదు.. మళ్ళీ మన డబ్బుతో తండ్రీ కొడుకులు షికారు వెళ్లి వస్తారు అంతే అంటూ జ్ఞానోదయం చేశాడు సింహాచలం. అయితే మరెలా అన్నాడు బాధపడుతూ అప్పన్న.. ఏమీ లేదు మీ తండ్రీ కొడుకులు ఆటో నడుపుకోండి.. అని సలహా ఇచ్చి అక్కణ్ణుంచి కదిలాడు సింహాచలం. -సిమ్మాదిరప్పన్న. -
చంద్రబాబు దావోస్ పర్యటన..బాహుబలికి మించి ఎల్లో మీడియా ఎలివేషన్స్
-
‘దావోస్‌లో బాబు.. 2014-19 మధ్య ఒప్పందాల సంగతేంటి?’
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) దావోస్ వెళ్లారు కాబట్టి రేపటి నుంచి ఎల్లోమీడియాలో ప్రచారం పీక్ లెవల్‌కి వెళ్తుందన్నారు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి. 2014-19 మధ్యలో కూడా చంద్రబాబు నాలుగుసార్లు దావోస్(Davos) వెళ్లి ఏం సాధించారు?. ఎన్ని కంపెనీలు వచ్చాయి? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో టీడీపీ వారే చెప్పాలి అని డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ(YSRCP) అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘పారిశ్రామిక వేత్తలు ఏపీలో వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్టు టీడీపీ నేతలు ప్రకటించారు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు?. ఆంధ్రాకి అలీబాబా, హైస్పీడ్ రైళ్ల కర్మాగారం, ఏపీకి ఎయిర్ బస్, కుమియుమి 20 బిలియన్ డాలర్లు పెట్టుబడి, రాష్ట్రానికి సౌదీ ఆరాంకో, మైక్రోసాఫ్ట్ సంస్థ హైబ్రిడ్ క్లౌడ్.. అంటూ ఎల్లోమీడియాలో తెగ ప్రచారం చేశారు. చివరికి హీరోహోండా కంపెనీకి శంకుస్థాపన చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో జిందాల్ ఫ్యాక్టరీ పెడుతున్నట్టు ప్రకటించారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కంపెనీలు వచ్చేసినట్టే ఎల్లోమీడియాలో భజన చేశారు.కానీ, ఒక్కటంటే ఒక్క కంపెనీ కూడా ఏపీకి రాలేదు. దీనికితోడు నేషనల్ మీడియాలో దండోరా చేయించడానికి కోట్లాది రూపాయలు దోచిపెట్టారు. కానీ, ఏ కంపెనీని తీసుకురాలేకోయారు. వైఎస్ జగన్ తన హయాంలో ఎలాంటి ప్రచారం లేకుండా దావోస్ వెళ్లారు. అదానీ గ్రూపు గ్రీన్ ఎనర్జీ ప్లాంటుకు ఒప్పందం చేసుకున్నారు. ఆ పనులు వేగంగా జరుగుతున్నాయి.ఓర్వకల్లు దగ్గర గ్రీన్కో ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పందం చేసుకుని వేగంగా పనులు కొనసాగుతున్నాయి. దీన్ని పవన్ కూడా మెచ్చుకున్నారు. వైఎస్ జగన్ హయాంలో లక్షా 26 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నారు. అవన్నీ నిర్మాణంలో ఉండగా ఉత్పత్తులు ప్రారంభించాయి. అదీ వైఎస్ జగన్ గొప్పతనం. చంద్రబాబు ప్రస్తుతం దావోస్ వెళ్లారు కాబట్టి రేపట్నించి ఎల్లోమీడియాలో ప్రచారం పీక్ లెవల్‌కు చేరుకుంటుంది. ఆ ఎలివేషన్‌కు ముందు 2014-19 నాటి ఒప్పందాల వివరాలు కూడా చెప్పాలి’ అని వ్యాఖ్యలు చేశారు. -
రాజధానిలో కొత్త ఐటీ పార్క్
-
బాబూ.. ఇందులో ఒక్కటైనా వచ్చిందా?
-
దావోస్ టూర్ కు భారీ పబ్లిసిటీకి చంద్రబాబు ఆదేశాలు
-
దావోస్ టూర్..బాబు పబ్లిసిటీకి భారీ ఖర్చు
సాక్షి,విజయవాడ:సీఎం చంద్రబాబు దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం(WEF) టూర్ పబ్లిసిటీ కోసం కూటమి ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. దావోస్ టూర్‌కు భారీ ప్రచారానికి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. డబ్బులిచ్చి మరీ పబ్లిసిటీ చేయించుకోవాలని బాబు సర్కారు నిర్ణయించింది. జాతీయ బిజినెస్ టీవీ చానల్ సీఎన్‌బీసీ(CNBC) ద్వారా పబ్లిసిటీ కోసం రూ.కోటి 15 లక్షల రూపాయిలు కేటాయిస్తూ పరిపాలన అనుమతుల జీవోను ప్రభుత్వం శనివారం(జనవరి18) జారీ చేసింది.ఇప్పటికే ఎన్డీటీవి ద్వారా పబ్లిసిటీ రూ.74లక్షలు,డిజిటల్ మీడియాలో పబ్లిసిటీ కోసం బిజినెస్ టుడేకు రూ.60 లక్షల దాకా మంజూరు చేశారు.రెండు ఛానళ్ల ద్వారా దావోస్‌లో చంద్రబాబు పబ్లిసిటీ కోసం సర్కారు రూ.2 కోట్లకుపైగా దుబారా చేస్తోంది. పెట్టుబడుల విషయంలో కేవలం చంద్రబాబును పొగడడం కోసమే ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.గతంలో టీడీపీ(TDP) ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో సహా చంద్రబాబు దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు వెళ్లారు. ప్రభుత్వం తరపున సీఎం, మంత్రులు వెళ్లాల్సిన సదస్సుకు కుటుంబ సభ్యులు అది కూడా ప్రత్యేక విమానం వేసుకుని వెళ్లడమేంటన్న విమర్శలు వచ్చాయి. దావోస్ సమావేశాల్లో పాల్గొనేందుకు చంద్రబాబు శనివారం రాత్రి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నెల 20 నుంచి ఐదురోజుల పాటు దావోస్‌లో జరిగే సమావేశాల్లో పాల్గొంటారు. దావోస్‌కు వెళ్లేందుకు చంద్రబాబు మంత్రులు లోకేష్, టీజీ భరత్ మరో ఐదుగురు ఉన్నతాధికారులు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. వీరందరికి సహాయకులుగా మరో 15 మంది దాకా దావోస్‌కు వెళ్లనున్నారు.ఇదీ చదవండి: స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలను అవమానించిన బీజేపీ నేత -
పెట్టుబడులకు 'ఎనర్జీ'
సీఎంతో సీఐఐ ప్రతినిధులు భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తెలంగాణ అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రానికి చెందిన పలు పరిశ్రమల సీఈవోలు బుధవారం దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబులతో భేటీ అయ్యారు. పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వ ప్రయత్నాలను కొనియాడారు. పారిశ్రామికాభివృద్ధి కోసం తీసుకునే అన్నిరకాల నిర్ణయాలకు సీఐఐ పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. సాక్షి, హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) 54వ వార్షిక సదస్సులో భాగంగా.. రెండో రోజు బుధవారం పలు దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ బృందం.. పలు సంస్థల అధినేతలతో వరుస భేటీలు నిర్వహించి, ఒప్పందాలపై సంతకాలు చేసినట్టు సీఎం కార్యాలయం వెల్లడించింది. మొత్తంగా రూ.37,800 కోట్ల పెట్టుబడులకు సంబంధించి పలు ఒప్పందాలు కుదిరినట్టు, కీలక ప్రకటనలు వెలువడినట్టు తెలిపింది. సీఎంవో తెలిపిన వివరాల మేరకు.. రాష్ట్రంలో రూ.12,400 కోట్ల పెట్టుబడులకు సంబంధించి అదానీ గ్రూప్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఏరోస్పేస్–డిఫెన్స్ విభాగం సీఈఓ ఆశిశ్ రాజ్‌వంశీ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. గ్రీన్ ఎనర్జీ.. స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్.. అదానీ గ్రూప్‌తో ఒప్పందాల్లో భాగంగా రూ.5వేల కోట్ల పెట్టుబడితో 1,350 మెగావాట్ల సామర్థ్యంతో రెండు గ్రీన్ ఎనర్జీ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను తెలంగాణలో ఏర్పాటు చేస్తారు. అనుబంధ సంస్థ అదానీ కొనెక్స్ మరో రూ.5వేల కోట్లతో 100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ క్యాంపస్‌ను చందన్‌పల్లిలో ఏర్పాటు చేస్తుంది. ఇక అంబుజా సిమెంట్స్ సంస్థ ద్వారా ఏటా 6 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యమున్న సిమెంట్ గ్రైండింగ్ యూనిట్‌ను రూ.1,400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరింది. అదానీ ఏరోస్పేస్, డిఫెన్స్ పార్క్‌లో కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, క్షిపణి అభివృద్ధి తయారీ కేంద్రాల ఏర్పాటుకు రూ.1,000 కోట్లను పెట్టుబడి పెట్టనున్నారు. తెలంగాణలో పెట్టుబడులతోపాటు యువతలో నైపుణ్యాలు (స్కిల్స్) పెంపొందించేందుకు త్వరలోనే అత్యాధునిక సౌకర్యాలతో కూడిన సమీకృత నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటుకు రేవంత్‌తో భేటీ సందర్భంగా అదానీ సంసిద్ధత వ్యక్తం చేశారు. ► తెలంగాణలో రూ.9వేల కోట్లతో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ అనుబంధ సంస్థ ‘జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ’ సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనిపై ‘జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ’తో రాష్ట్ర ప్రభుత్వం పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 1,500 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్‌తో సీఎం రేవంత్ చర్చించారు. ► రాష్ట్రంలో రూ.8వేల కోట్ల పెట్టుబడితో 12.5 జీడబ్ల్యూహెచ్ (గిగావాట్ ఫర్ అవర్) సామర్థ్యముండే బ్యాటరీ సెల్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటించింది. వచ్చే ఐదేళ్లలో తెలంగాణలో లిథియం, సోడియం అయాన్ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానంపై పరిశోధన, అభివృద్ధి కేంద్రంతోపాటు, గిగాస్కేల్ బ్యాటరీ సెల్ తయారీ కేంద్రం ఏర్పాటవుతుంది. ప్రాజెక్ట్ మొదటి దశలో 6వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. మొదటి దశలో 2.5 గిగావాట్ల సామర్థ్యముండే సెల్ అసెంబ్లింగ్ లైన్ తయారు చేసి.. రెండో దశలో 10 గిగావాట్లకు విస్తరిస్తారు. ► డేటా సెంటర్ల నిర్వహణలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఐరన్ మౌంటేన్ అనుబంధ సంస్థ వెబ్ వెర్క్స్ తెలంగాణలో రూ.5,200 కోట్లతో డేటా సెంటర్లను నెలకొల్పేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఐరన్ మౌంటేన్ సీఈవో విలియం మీనీ, వెబ్ వెర్క్స్ సీఈవో నిఖిల్ రాఠీలతో సీఎం రేవంత్ భేటీలో రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటు, నిర్వహణపై చర్చించారు. హైదరాబాద్‌లో 10 మెగావాట్ల నెట్వర్కింగ్–హెవీ డేటా సెంటర్లో ఇప్పటికే ఈ కంపెనీ రూ.1,200 కోట్లు పెట్టుబడి పెడుతోంది. దీనికి అదనంగా రూ.4,000 కోట్లకుపైగా పెట్టుబడులతో భవిష్యత్తులో గ్రీన్‌ఫీల్డ్ హైపర్ స్కేల్ డేటా సెంటర్‌ను విస్తరించేందుకు ఈ ఒప్పందం చేసుకుంది. ► రాష్ట్రంలో ఆయిల్‌పామ్ మిషన్‌లో ఇప్పటికే భాగస్వామిగా ఉన్న గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఖమ్మంలో తొలిదశలో రూ.270 కోట్లతో దేశంలోనే అతిపెద్ద సమీకృత ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఖమ్మంలో దేశంలోనే మొట్టమొదటి ఆయిల్‌పామ్ సీడ్ గార్డెన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ కొత్త సీడ్ గార్డెన్ ద్వారా ఏటా 70లక్షల మొక్కలను సరఫరా చేయడం ద్వారా పది లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగును చేపట్టవచ్చని పేర్కొంది. దీంతోపాటు రూ.వెయ్యి కోట్లతో కెమికల్ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేస్తామని గోద్రెజ్ సంస్థ ప్రకటించింది. నైపుణ్య శిక్షణ, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, పాడి పరిశ్రమ విస్తరణ వంటి అంశాలపైనా గోద్రెజ్ సీఎండీ నాదిర్ గోద్రెజ్‌తో సీఎం చర్చించారు. ► రాష్ట్రంలోని మల్లాపూర్‌లో ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న ‘ఆరాజెన్ లైఫ్ సైన్సెస్’ సంస్థ రూ.2వేల కోట్ల పెట్టుబడులు, 1,500 మందికి కొత్త ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కార్యకలాపాలను విస్తరించనుంది. సీఎం రేవంత్‌తో ఆరాజెన్ సీఈఓ మణి కంటిపూడి భేటీ సందర్భంగా దీనిపై ఒప్పందం కుదిరింది. ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ విస్తరణతో హైదరాబాద్ దేశంలోనే కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హబ్‌గా మారనుందని ఆ సంస్థ పేర్కొంది. ► దావోస్ రెండోరోజు పర్యటనలో భాగంగా రేవంత్ బుధవారం హెయిన్కెన్ ఇంటర్నేషనల్ సీఈఓ డాల్ఫ్ వాన్‌డెన్ బ్రింక్, టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్, విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషబ్ ప్రేమ్‌జీ తదితరులతోనూ భేటీ అయ్యారు. వరంగల్‌లో ఐటీ కార్యకలాపాల విస్తరణకు సంబంధించి రిషబ్ ప్రేమ్‌జీతో చర్చించారు. ఈ భేటీల్లో ఐటీ–పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పెట్టుబడుల ప్రోత్సాహక విభాగం ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దావోస్ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్.. ట్వీట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు భారీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్(స్విట్జర్లాండ్)లో పర్యటిస్తున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా ఆయన దావోస్‌కు వెళ్లిన సీఎం.. 19వ తేదీ వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 54వ సమావేశంలో పాల్గొననున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సు నుంచి ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ ప్రచారాన్ని మొదలు పెట్టామని సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. ఐటీ, జీవవైవిధ్య రంగంలో తెలంగాణ ప్రాధాన్యత, అనుకూలతలను ప్రముఖులతో చర్చించామని పేర్కొన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గ్ బ్రెండెతో సమావేశం జరిగిందన్నారు. ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు కలసికట్టుగా పనిచేస్తే ప్రజలు సంపన్నులుగా మారతారని రేవంత్ అన్నారు. తెలంగాణ పారిశ్రామిక విధానంపై ఇథియోపియా ఉప ప్రధానితో చర్చ జరిగిందని, రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కోసం చేపట్టవలసిన కార్యక్రమాలపై నాస్కామ్ ప్రతినిధులతో చర్చలు జరిగాయని సీఎం రేవంత్ వివరించారు. Met @wef President Mr @borgebrende at #Davos, Switzerland at #WEF2024. Discussed on how governments, businesses and other stakeholders can work together to improve human conditions for a better and prosperous life and make planet more sustainable.@InvTelangana… pic.twitter.com/UYK4z4RJG1 — Revanth Reddy (@revanth_anumula) January 16, 2024 -
బాబు.. దావోస్.. అబద్ధపు రాతలు
సాక్షి, అమరావతి: ఒక తప్పు చేసి అడ్డంగా దొరికిపోతే.. వెంటనే అటువంటి తప్పు మరోసారి చేయడానికి ఎవరూ సాహసించరు. కానీ, పచ్చ పత్రికలు చేస్తాయి. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై అవి రాస్తున్న విషపు రాతలే ఇందుకు నిదర్శనం. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆహ్వానం రాలేదంటూ పచ్చ మీడియా అబద్ధపు ప్రచారం చేసింది. అయితే, ఆ సదస్సుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానిస్తూ నవంబర్ 25నే లేఖ వచ్చిందన్న విషయం సాక్ష్యాధారాలతో బట్టబయలు కావడంతో కంగుతిన్న ఆ మీడియా మరో తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దావోస్ పర్యటన ద్వారా లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ తప్పుడు ప్రచారం మొదలు పెట్టింది. ఇది కూడా శుద్ధ తప్పు అని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. 2016 నుంచి 2019 మధ్య చంద్రబాబు దావోస్ పర్యటనకు రూ.50.43 కోట్లు ఖర్చు చేయగా కనీసం ఆ మొత్తం కూడా పెట్టుబడిగా రాలేదన్న విషయాన్ని గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. 2018లో ఆర్టీజీఎస్లో ఈ గవర్నెన్స్ అమలుకు సంబంధించి హిటాచీ ఇండియాతో కుదుర్చుకున్న ఒప్పందం అమల్లోకి రాలేదు. అలాగే సిస్టర్ కాంటన్ ఆఫ్ జురిచ్తో కుదుర్చుకున్న సిస్టర్ సిటీ ఒప్పందం కూడా వాస్తవ రూపం దాల్చలేదు. 2019లో ఫిన్‌టెక్ ఎకో సిస్టమ్ గురంచి సీఐఐతో, హిటాచీతో ఏపీఈడీబీ కుదుర్చుకున్న ఒప్పందాలు, ఏఎంటీజెడ్‌లో టెక్నాలజీ సేవలు అందించే యూరో ఫైనాన్స్ ఒప్పందాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. అంటే చంద్రబాబు దావోస్ పర్యటనల వల్ల ఒక్క రూపాయి పెట్టుబడి కూడా వాస్తవ రూపం దాల్చలేదన్నది స్పష్టమవుతోంది. రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులు కోవిడ్ కారణంగా తొలి రెండు సంవత్సరాలు దావోస్ పర్యటనకు వెళ్లలేకపోయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2022లో తొలిసారి ఆ సమావేశాలకు హాజరయ్యారు. ఈ పర్యటన కోసం రూ.12.90 కోట్లు ఖర్చయింది. అక్కడ గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.1.26 లక్షల కోట్ల విలువైన నాలుగు పెట్టుబడుల ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చు కుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ, అరబిందో రియల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్కో గ్రూపు, ఏస్ అర్బన్ డెవలపర్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలు అమలు దశలో ఉన్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఇది వాస్తవం. ఇవేవీ పట్టని ఆ పత్రికలు నిత్యం ఉషోదయంతో విషం చిమ్ముతూనే ఉన్నాయి. -
సృష్టికి తానే కారణమని చెప్పుకునే వ్యక్తి చంద్రబాబు: అమర్నాథ్
-
‘ఐదుసార్లు దావోస్ వెళ్లి చంద్రబాబు ఏం తెచ్చారు?’
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అసత్య ప్రచారాలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్ అయ్యారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నంబర్ వన్‌గా ఉందన్నారు. కాగా, మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆహ్వానం అందలేదని టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. నవంబర్ 25నే వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి ఆహ్వానం అందింది. దీనిపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. విశాఖలో సదస్సు ఏర్పాటు చేస్తున్నందున దావోస్ వెళ్లలేదు. ఐదుసార్లు దావోస్ వెళ్లి చంద్రబాబు ఏం తెచ్చారు?. గతంలో బిల్డప్ బాబును చూసి జనం ఆశ్చర్యపోయారు’ అంటూ కామెంట్స్ చేశారు. -
చంద్రబాబు దావోస్ వెళ్లి మార్కెట్ చేసింది ఏమిటంటే..!!
-
సీఎం జగన్‌కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: ఇటీవల దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2022 వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొని చూపిన చొరవపై వరల్డ్ ఎకనామిక్ ఫోరం మంగళవారం కృతజ్ఞతలు తెలిపింది. ‘చరిత్రలో మలువు, ప్రభుత్వ విధానాలు, వ్యాపార వ్యూహాలు’ అనే ఇతివృత్తంపై నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొన్న సంగతి తెలిసిందే. దశాబ్దాలుగా అత్యంత సవాల్‌గా ఉన్న భౌగోళిక, రాజకీయ, ఆర్థిక నేపథ్యాల్లో సమావేశం జరిగిందని, ప్రపంచానికి ఈ క్లిష్ట సమయాన దావోస్‌లో వ్యూహాత్మక సంభాషణల్లో మీ (సీఎం జగన్) సహకారం చాలా ముఖ్యమైనదని ఫోరం అధ్యక్షుడు బోర్జ్ బ్రెండే ముఖ్యమంత్రి జగన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. వాతావరణ మార్పు వంటి సమస్యలపై సమిష్టి చర్యలను వేగవంతం చేయడానికి అంతర్జాతీయ సమాజాన్ని సమీకరించడం, శాంతి, ఆర్థిక పునరుద్ధరణను కాపాడటంపై సదస్సులో చర్చించినట్లు పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రభుత్వ, వ్యాపార, ఇతర వర్గాలకు చెందిన 2,500 మందిని ఈ సమావేశం ఒకచోట చేర్చిందన్నారు. వార్షిక సమావేశంలో బలమైన స్వరంతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించినందుకు సీఎం జగన్‌కు ఫోరం ధన్యవాదాలు తెలిపింది. దావోస్‌లో మీ (సీఎం జగన్) అనుభవం ఫలవంతమైందని లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మీ నిరంతర సహకారం కోసం ఫోరం ఎదురుచూస్తుందని తెలిపింది. గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్స్, ఫోరం మూవింగ్ ఇండియాతో అనుసంధానమైందని, గ్రీన్ మొబిలిటీకి పరివర్తనను వేగవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ చొరవ ఎంతో దోహదపడుతుందని ఫోరం తెలిపింది. -
విశాఖ ఇమేజ్ను దెబ్బతీయొద్దు
సాక్షి, విశాఖపట్నం: వరదలొస్తే విశాఖపట్నం మునిగిపోతుందని ఇటీవల జరిగిన దావోస్ సదస్సులో ఓ సంస్థ ప్రతినిధి ప్రశ్నిస్తే ఆశ్చర్యపోయానని, ఆ సమయంలో నా కళ్లలో నీళ్లు తిరిగాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ భావోద్వేగానికి గురయ్యారు. ప్రతిపక్ష పార్టీకి మేలు చేయాలనే లక్ష్యంతో రాష్ట్రంలో ఓ వర్గం మీడియా విశాఖపై విషం చిమ్ముతోందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. తాను పుట్టిన ప్రాంతమైన ఈ నగరంపై ఇంత విషప్రచారం చేస్తున్న వారికి రెండు చేతులు జోడించి దండం పెడతాను.. దయచేసి విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ని దెబ్బతీసేలా అవాస్తవాలు ప్రచురించొద్దని వేడుకున్నారు. విశాఖ ఇమేజ్ను దెబ్బతీస్తే తాను సహించలేకపోయానని.. సదరు ప్రతినిధికి ఇక్కడి వాస్తవ పరిస్థితులను వివరించడంతోపాటు ఇలాంటి దుష్ప్రచారాలను నమ్మొద్దని.. దయచేసి ఎవరికీ చెప్పొద్దని కోరానని ఆయన వెల్లడించారు. ఇక్కడి సర్క్యూట్ హాస్‌లో మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. రాజకీయాలు ఎన్ని ఉన్నా.. రాష్ట్రాభివృద్ధి విషయంలో అందరూ కలిసి రావాలి. రాజకీయ స్వార్థం కోసం ఎవరూ రాష్ట్రాన్ని, ప్రాంతాన్ని పణంగా పెట్టకూడదు. గత పాలకుల మాదిరిగా అదిగో లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని, మేం అబద్ధాలు చెప్పం. వాస్తవాలనే ప్రజల ముందు ఉంచుతాం. అందుకే దావోస్ పర్యటన అనంతరం రాష్ట్రానికి పెట్టుబడులు తదితర అంశాలు ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచాం. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం దాదాపుగా లక్ష ఎకరాలు అందుబాటులో ఉంచాం. ఇందులో ఇప్పటికే 40–50 వేల ఎకరాల్లో ఆయా పరిశ్రమలకు సంబంధించిన పనులు జరగుతున్నాయి. రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు దావోస్ పర్యటనలో వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సమావేశాల్లో రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు మరిన్ని నిర్మాణాత్మక పునాదులు పడ్డాయి. కోవిడ్ తర్వాత తొలిసారిగా నిర్వహించిన ఈ సదస్సులో.. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అత్యంత శక్తివంతంగా నిలిపేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో చక్కటి ఫలితాలు సాధించాం. అత్యధిక తీర ప్రాంతం కల్గిన రాష్ట్రంగా ఉన్న ఏపీలో అభివృద్ధిని, పర్యావరణ హితాన్ని సమతుల్యం చేసుకుంటున్నట్లు చెప్పేందుకు దావోస్‌లో ఏపీ పెవిలియన్‌ను ఏర్పాటుచేశాం. దేశంలో ఉన్న వివిధ పారిశ్రామికవేత్తలతో పాటు దాదాపు 50 బహుళజాతి కంపెనీల ప్రతినిధులు, కొత్త పారిశ్రామికవేత్తలతోనూ భేటి అయ్యాం. ఈ సందర్భంగా వారందరికీ ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకుగల వనరులు, స్థితిగతులను వివరించాం. ఇక ఈ సదస్సు ద్వారా ఏపీకి రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. కర్బన ఉద్గారాల్లేని ఆర్థిక వ్యవస్థ దిశగా.. పారిశ్రామికీకరణకు ప్రధాన కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చాలన్న లక్ష్యంతో గ్రీన్ఎనర్జీకి సంబంధించిన పెట్టుబడులపై అదానీ, గ్రీన్కో, అరబిందోలతో ఒప్పందం కుదుర్చుకున్నాం. స్వయంగా ప్రపంచ ప్రసిద్ధ కంపెనీ (ఆర్సిలర్ మిట్టల్ గ్రీన్ ఎనర్జీ) సీఈఓ ఆదిత్య మిట్టల్ ఏపీలో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణ, ఉజ్వల భవిష్యత్తు కోసం కర్బన ఉద్గారాల రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు వేస్తున్నాం. రాష్ట్రంలో దాదాపు 33వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుదుత్పత్తికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాం. ఏపీలో దానికి అవసరమైన అన్ని వనరలున్నాయి. వాటిని వినియోగించుకోవాలని కోరాం. ఇక ఈ సదస్సులో నీతిఅయోగ్ సీఈఓ అమితాబ్ కాం™త్Œ సైతం డీకార్బనైజ్డ్ ఎకనామిలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని కితాబు ఇచ్చారు. డీకార్బనైజ్డ్ మెకానిజంలో ఏపీ ఐకాన్‌గా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అత్యాధునిక సదుపాయాలున్న కార్పొరేట్ ఆసుపత్రులు ఏపీలో లేకున్నా కోవిడ్‌ని సమర్థవంతంగా ఎదుర్కొన్న విషయాన్ని.. రాష్ట్రంలో సీఎం జగన్ ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ విధానం అక్కడ అందర్నీ ఆకట్టుకుంది. యూనికార్న్ హబ్‌గా విశాఖ మరోవైపు.. విశాఖను హై అండ్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దనున్నాం. ఇందుకు టెక్ మహింద్రా సీఈఓ గుర్నాని అంగీకారం తెలిపారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కోసం స్కిల్ వర్సిటీతో పాటు 30 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, 175 స్కిల్ హబ్స్ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. అదేవిధంగా విశాఖను యూనికార్న్ స్టార్టప్ (సుమారు రూ.7,700 కోట్ల విలువగల) హబ్‌గా తీర్చిదిద్దేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దేశ, ప్రపంచ స్థాయి వ్యవస్థాపకులు, సీఈఓలతో యూనికార్న్ స్టార్టప్స్‌కు వేదికగా విశాఖపట్టణాన్ని తీర్చిదిద్దడానికి అంగీకారం తెలిపాం. అంతేకాక.. ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి, రవాణ రంగానికి చేయూతనిచ్చేందుకు ఈజ్ మై ట్రిప్ కూడా అంగీకారం తెలిపింది. అలాగే, ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్ సంస్థలను ఆహ్వానించాం. -
గ్రీన్ ఎనర్జీ.. ఏపీ ఒక దిక్సూచి కాబోతుంది: మంత్రి అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను దావోస్ సదస్సులో వివరించామని పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. పలు సంస్థల ప్రతినిధులతో చర్చించామని తెలిపారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, స్టార్టప్ కంపెనీలతో ప్రత్యేక మీటప్ నిర్వహించామన్నారు. ప్రపంచస్థాయి వేదికలపై సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన రాష్ట్ర ప్రగతిని ఫోకస్ చేశామన్నారు. ఐదు రోజుల సదస్సుకు సంబంధించి ఒక పెవిలియన్ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. చదవండి: 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరివి: మంత్రి పెద్దిరెడ్డి గీన్ ఎనర్జీపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీలో దేశానికి ఏపీని ఆదర్శంగా మారుస్తున్నామన్నారు. గ్రీన్ ఎనర్జీ విషయంలో ఏపీ ఒక దిక్సూచి కాబోతుందన్నారు. 30 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఏపీలో అవకాశాలు ఉన్నాయన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలతో ఎంవోయూలు చేసుకున్నామని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు. -
‘హైదరాబాద్‌లో మరింతగా విస్తరిస్తాం’
గ్లాస్‌లైన్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరింగ్ సెక్టార్లో తమ సేవలను మరింతగా విస్తరిస్తామని జీఎంఎం ఫాడ్లర్ ప్రకటించింది. ఈ సంస్థకు ఇప్పటికే హైదరాబాద్‌లో ఒక ఫెసిలిటీ సెంటర్ ఉంది. దీని విస్తరణకు మరో 10 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసేందుకు రెడీగా ఉన్నామని జీఎంఎం ఫాడ్లర్ ప్రతినిధులు తెలిపారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు సందర్భంగా మంత్రి కేటీఆర్‌తో సమావేశం అయిన తర్వాత ఫాడ్లర్ ఈ నిర్ణయం తెలిపింది. జీఎంఎం ఫాడ్లర్ సంస్థ గ్లాస్‌లైన్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరింగ్‌తో పాటు కరోషన్ రెసిస్టెంట్ టెక్నాలజీ, కెమికల్ సిస్టమ్స్ సర్వీసెస్, ఫార్మా, ఫుడ్ అండ్ ఎనర్జీ సెక్టార్లలో సేవలు అందిస్తోంది. ఆ సంస్థ సీఈవో థామస్ కేల్ మంత్రి కేటీఆర్‌తో సమావేశం అయ్యారు. చదవండి: తెలంగాణతో జట్టు కట్టిన మాస్టర్ కార్డ్స్ -
దావోస్ WEF సదస్సులో ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పీచ్
-
6 అంశాల్లో సహకారంపై WEF - రాష్ట్ర ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం
-
దావోస్‌లో సీఎం జగన్‌కు ఘన స్వాగతం
సాక్షి, అమరావతి: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఆదివారం (నేటి) నుంచి 26వ తేదీ వరకు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శనివారం సాయంత్రం దావోస్ చేరుకున్నారు. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో దావోస్‌కు వెళ్లారు. జ్యూరిక్ ఎయిర్‌పోర్టులో స్విట్జర్లాండ్‌లో ఉంటున్న తెలుగు ప్రజలు, రాష్ట్ర అధికారులు, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆరోఖ్యరాజ్ తదితరులు సీఎంకు సాదర స్వాగతం పలికారు. స్విట్జర్లాండ్‌లో భారత ఎంబసీ రెండో కార్యదర్శి రాజీవ్‌కుమార్, ఎంబసీలో మరొక రెండవ కార్యదర్శి బిజు జోసెఫ్ తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా స్థానిక తెలుగు ప్రజలతో ముఖ్యమంత్రి కాసేపు ముచ్చటించి కారులో దావోస్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఏపీఐఐసీ చైర్మన్ మెట్టుగోవిందరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కృష్ణగిరి, పలువురు అధికారులు స్వాగతం పలికారు. సీఎం వైఎస్ జగన్‌కు స్వాగతం పలుకుతున్న మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ మిథున్‌రెడ్డి ఎయిర్ ట్రాఫిక్ రద్దీతో ప్రయాణం ఆలస్యం శుక్రవారం విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలస్యంగా శనివారం సాయంత్రానికి దావోస్ చేరుకున్నారు. వాస్తవంగా శుక్రవారం రాత్రికే దావోస్‌కు చేరుకోవాల్సి ఉన్నా, ఎయిర్ ట్రాఫిక్ రద్దీ వల్ల ఇస్తాంబుల్‌లో ఇంధన నింపుకోవడం ఆలస్యమైంది. దీనివల్ల లండన్ ఎయిర్‌పోర్టుకు చేరుకోవడం మరింత ఆలస్యం అయ్యింది. లండన్‌లో కూడా ఎయిర్ ట్రాఫిక్ విపరీతంగా ఉండటంతో జ్యూరిక్‌లో ల్యాండ్ అవడానికి ప్రయాణ షెడ్యూల్ సమయం రాత్రి 10 గంటలు దాటిపోయింది. జ్యూరిక్‌లో రాత్రి 10 గంటల తర్వాత విమానాల ల్యాండింగ్‌పై నిషేధం ఉంది. దీంతో స్విట్జర్లాండ్‌లోని భారత ఎంబసీ అధికారులతో సహా రాష్ట్ర అధికారులు ప్రత్యేక ల్యాండింగ్ కోసం మరో మారు రిక్వెస్ట్ చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఇదే విషయాన్ని స్విట్జర్లాండ్‌లోని భారత ఎంబసీ అధికారులు, లండన్‌లోని భారత దౌత్య అధికారులకు సమాచారం అందించి ముఖ్యమంత్రితో పాటు ఉన్న అధికారులతో చర్చించి ఆ రాత్రికి లండన్‌లోనే బస ఏర్పాటు చేశారు. తెల్లవారుజామునే జ్యూరిక్ నుంచి బయలుదేరడానికి సీఎం సిద్ధంగా ఉన్నప్పటికీ డీజీసీఏ నిబంధనలు అడ్డంకిగా మారాయి. విజయవాడ నుంచి పైలట్లు శుక్రవారమంతా ప్రయాణంలో ఉన్నందున నిర్ణీత గంటలు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది. డీజీసీఏ నిర్ణీత సమయం ప్రకారం పైలట్ల విశ్రాంతి సమయం పూర్తయ్యాక సీఎం బయలు దేరి శనివారం సాయంత్రానికి జ్యూరిక్ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి దావోస్ వెళ్లారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతున్న మెట్టు గోవిందరెడ్డి, కృష్ణగిరి దావోస్‌లో నేటి కార్యక్రమాలు ► ఆదివారం ఉదయం డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ క్లాజ్ ష్వాప్‌తో ఏపీ ఒప్పందం కుదుర్చుకోనుంది. తద్వారా డబ్ల్యూఈఎఫ్ నిర్వహించే అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టులతో రాష్ట్రానికి మంచి అనుసంధానం ఏర్పడుతుంది. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, పరిశ్రమలకు అవసరమైన, నాణ్యమైన మానవ వనరుల తయారీ, రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ వ్యవస్థ ఏర్పాటు, డేటా షేరింగ్, ఉత్పత్తులకు విలువ జోడించడం వంటి ఆరు అంశాల్లో ఈ ఒప్పందం ద్వారా వరల్డ్ ఎకనామిక్ ఫోరం రాష్ట్రానికి మార్గనిర్దేశం చేస్తుంది. ► డబ్ల్యూఈఎఫ్ ‘హెల్త్‌కేర్– హెల్త్’ విభాగం అధిపతి, డాక్టర్ శ్యాం బిషేన్‌తో కూడా సీఎం సమావేశమవుతారు. మ«ధ్యాహ్నం బీసీజీ గ్లోబల్ చైర్మన్ హన్స్పాల్ బర్కనర్‌తో ముఖ్యమంత్రి ఏపీ లాంజ్‌లో సమావేశమవుతారు. ► సాయంత్రం డబ్ల్యూఈఎఫ్ కాంగ్రెస్ వేదికలో జరిగే వెల్కమ్ రిసెప్షన్లో సీఎం పాల్గొంటారు. -
సీఎం జగన్‌కు పేరు, ప్రఖ్యాతలు వస్తుంటే బాబు తట్టుకోలేకపోతున్నారు
-
పాలన సంస్కరణలతోనే పురోగతి
సాక్షి, హైదరాబాద్: విప్లవాత్మకమైన పాలన సంస్కరణల ద్వారానే ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడి పురోగతి సాధించగలదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. అత్యధిక సంఖ్యలో యువ జనాభాను కలిగి ఉన్న భారత్ అగ్రశ్రేణి దేశంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. యూకే పర్యటనలో భాగంగా శుక్రవారం లండన్‌లోని భారత హైకమిషనర్ కార్యాలయం నెహ్రూ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. బ్రిటన్‌కు చెందిన పలువురు కీలక వ్యాపారవేత్తలు, భారతీయ సంతతి ప్రముఖులు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా డిప్యూటీ హై కమిషనర్ సుజిత్ జా య్ ఘోష్ , నెహ్రూ సెంటర్ డైరెక్టర్ అమిష్ త్రిపా ఠి ఆధ్వర్యంలో జరిగిన చర్చాగోష్టిలో మంత్రి అనే క అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్‌తో మంత్రి కేటీఆర్ దేశానికి రోల్ మోడల్‌గా తెలంగాణ ‘ఒకవైపు పాలనా సంస్కరణలు, పెట్టుబడులకు అనుకూలమైన స్నేహపూర్వక వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా దేశాన్ని ముందుకు తీసుకుపోయేందుకు అవకాశం ఉంటుంది. ఇదే స్ఫూర్తి తో తెలంగాణ పురోగమిస్తూ భారతదేశానికి ఒక రోల్ మోడల్‌గా నిలుస్తోంది. తెలంగాణ అవతరణ సమయంలో నెలకొని ఉన్న సంక్షోభ పరిస్థితులను అధిగమించి ఈ రోజు ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలకు పెట్టుబడుల గమ్యస్థానంగా రాష్ట్రం మారింది. దీనికి పరిపాలనా సంస్కరణలే ప్రధాన కారణం..’అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ విజయాలు ప్రపంచానికి చాటాలి ‘ప్రజలకు అవసరమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నాం. ప్రపంచంలోనే అతిపెద్దదైన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును అత్యంత తక్కువ సమయంలో నిర్మించాం. తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలు తెలంగాణకు మాత్రమే పరిమితం కాదు. వీటిని భారతదేశ విజయాలుగా పరిగణించి ప్రపంచానికి చాటాల్సిన అవసరముంది. వివిధ దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు మాతృదేశం సాధిస్తున్న విజ యాలను ప్రపంచానికి చాటేందుకు కృషి చేయాలి..’అని మంత్రి పిలుపునిచ్చారు. విద్య, ఉపాధి, ఆరి ్థకాభివృద్ధి, దేశంలోని రాజకీయ పరిణామాలు.. తదితర అంశాలపై సమావేశానికి హాజరైనవారు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు ఇచ్చారు. వేదాంత గ్రూప్ చైర్మన్‌తో భేటీ వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ వేద్‌తో కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలపై చర్చించడంతో పాటు హైదరాబాద్‌కు రావాల్సిందిగా ఆయనకు కేటీఆర్ ఆహ్వానం పలికారు. -
దావోస్‌లో ఏపీ తరపున పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నాం: మంత్రి అమరనాథ్
సాక్షి, విశాఖపట్నం: దావోస్ సదస్సు ద్వారా ఏపీకి ఉన్న ప్రత్యేకతలు, ప్రాధాన్యతలు వివరించడం ద్వారా రాష్ట్రానికి మరింత మేలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ఈనెల 22న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి సదస్సులో ఏపీకి చెందిన ప్రతినిధులు హాజరవుతారని అన్నారు. 18 అంశాలపై దావోస్‌లో చర్చ జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం లాగా మేము లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని అబద్ధాలు చెప్పమన్నారు. ఈ మేరకు విశాఖలో ఐటీ మంత్రి మీడియాతో మాట్లాడారు. దాదాపు 2000 మంది ప్రతినిధులు హాజరయ్యే ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వివిధ అంశాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. దావోస్ సదస్సు జరిగే ప్రాంతంలో ఏపీ తరఫున పెవిలియన్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు హయాంలో ఇలాంటి సదస్సులను బ్లాక్ మనీని వైట్ చేసుకోడానికి ఉపయోగించుకున్నారని ఆరోపించారు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యతలు వివరించడం ద్వారా పెట్టుబడులు ఆకర్షించడానికి అవకాశం ఉండే సదస్సుగా మంత్రి గుడివాడ అమర్నాథ్ అభివర్ణించారు. చదవండి: (Hyderabad: నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్)