dow jones
-
కుప్పకూలుతున్న అదానీ: డౌ జోన్స్ నుంచి అదానీ ఎంటర్ప్రైజెస్ ఔట్
సాక్షి,ముంబై: హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత గౌతం అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ కంపెనీ షేర్ల తీరు నానాటికి తీసికట్టు అన్న చందంగా తయారైంది. దలాల్ స్ట్రీట్‌లో అదానీ స్టాక్‌ల తనం కారణంగా అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ సంపద దాదాపు సగం ఆవిరైపోయింది. ప్రస్తుతం ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ప్రస్తుతం అదానీ నికర విలువ 55.8 బిలియన్ డాలర్లకు చేరింది. గౌతమ్ అదానీకి చెందిన ఎనర్జీ-టు-పోర్ట్‌ల సామ్రాజ్యం నికర సంపద 10 రోజుల్లో సగం తుడిచి పెట్టుకు పోయింది. ఫలితంగా ప్రపంచంలో 2వ అత్యంత సంపన్న పౌరుడిగా ఎదిగిన బిలియనీర్ 108 బిలియన్ డాలర్లను కోల్పోయి బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో 21వ స్థానానికి పడిపోయాడు. ముఖ్యంగా అదానీ ఎంటర్ప్రైజెస్ 20వేల ఎఫ్‌పీవో రద్దు భారీ క్షీణతకు దారితీసింది. అటు హిండెన్‌బర్గ్ కంపెనీకి అదానీ గ్రూపు ఇచ్చిన సమాధానం కూడా పెట్టుబడి దారులకు భరోసా ఇవ్వడంలో విఫలమైంది. ఫలితంగా అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ టోటల్ గ్యాస్ , అదానీ గ్రీన్ ఎనర్జీ వాటి గరిష్ట స్థాయిల నుండి 70-75 శాతం క్షీణించగా, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్, అదానీ విల్మార్ తమ విలువలో 50-60 శాతం నష్టపోయాయి. ఇంకా ఏసీసీ అంబుజా సిమెంట్స్ ,ఎన్డీటీవీ షేర్లు కూడా భారీగా పడిపోయాయి. డౌ జోన్స్ నుంచి ఔట్ ఫిబ్రవరి 7వ తేదీ నుంచి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను డౌ జోన్స్ సస్టైనబిలిటీ ఇండెక్స్ నుండి తొలగించనున్నారు. ఈమేరకు S&P Dow Jones Indices ఒక నోట్ జారీ చేసింది. స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసం ఆరోపణలు, మీడియా, వాటాదారుల విశ్లేషణ తర్వాత అదానీ ఎంటర్ప్రైజెస్ సూచీల నుండి తొలగిస్తున్నట్టు ఈ నోట్ పేర్కొంది. ఈ సంక్షోభంతో ప్రపంచవృద్ధి ఇంజిన్‌గా, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు గమ్య స్థానంగా ఉన్న భారత విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతోందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అదానీ గ్రూపు మేనేజ్మెంట్ క్లారిటీ కోరనున్న ఎల్ఐసీ మరోవైపు అదానీలో కీలక పెట్టుబడిదారు ఎల్ఐసీ త్వరలోనే అదానీ గ్రూపు కీలక మేనేజ్మెంట్తో భేటీ కానుందట. ఎఫ్‌పీవో ఉపసంహరణ తరువాత ఇన్వెస్టర్లకు పెట్టుబడులను తిరిగి ఇచ్చే విషయంలో స్పష్టకోరనుందని సీఎన్‌బీసీ నివేదించింది. -
మహీంద్రా గ్రూప్ రికార్డ్! ఈ విషయంలో ఇండియాలో తొలి ఆటోమొబైల్ కంపెనీగా గుర్తింపు
పర్యావరణ అనుకూల విధానాలు అవలంభిస్తున్న కార్పోరేట్ సంస్థలకు డౌ జోన్స్ సుస్థిర విధనాల ప్రపంచ సూచీ ( సస్టైనబుల్ ఇండెక్స్) 2021లో మహీంద్రా గ్రూపుకి చెందిన రెండు సంస్థలకు స్థానం దక్కింది. ఈ ఏడాది ప్రకటించిన జాబితాలో ఇండియా నుంచి ఐదు సంస్థలు చోటు దక్కించుకోగా అందులో రెండు మహీంద్రా గ్రూపుకి చెందినవే ఉన్నాయి. గతంలో ఇండియా నుంచి తొలిసారిగా ఈ ఇండెక్స్‌లో చోటు దక్కించుకున్న టెక్ మహీంద్రా ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేసింది. కాగా ఇండియా నుంచి ఆటోమొబైల్ సెక్టార్ నుంచి ఈ జాబితాలో చోటు దక్కించుకుంది మహీంద్రా అండ్ మహీంద్రా. మహారాష్ట్రలోని ఇగత్‌పురిలో ఉన్న మహీంద్రా ఇంజన్ల తయారీ యూనిట్ కార్బన్ నూట్రల్ యూనిట్‌గా డౌ జోన్స్ నుంచి గుర్తింపు పొందింది. ఈ విషయాన్ని ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో షేర్ చేశారు. Good to begin the weekend with gratitude; gratitude to the team that has taken us to this milestone… https://t.co/ANJUpFvXKC — anand mahindra (@anandmahindra) November 27, 2021 చదవండి: మీరు బాగుండాలయ్యా.. ఆనంద్ మహీంద్రా నిర్ణయానికి నెటిజన్లు ఫిదా -
యూఎస్ మార్కెట్ల సరికొత్త రికార్డ్
న్యూయార్క్, సాక్షి: యూఎస్ కాంగ్రెస్‌లో డెమక్రాట్ల ఆధిపత్యం కారణంగా కొత్త ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్న జో బైడెన్‌పై అంచనాలు పెరిగాయి. దీంతో కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కొనే బాటలో ప్రభుత్వం ఇకపై భారీ సహాయక ప్యాకేజీలకు తెరతీయవచ్చన్న అంచనాలు పెరిగాయి. మరోపక్క ప్రస్తుత ప్రెసిడెంట్ ట్రంప్‌ను గడువుకంటే ముందే అధికారం నుంచి తప్పించేందుకు చర్యలు మొదలైనట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి గురువారం యూఎస్ స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను తాకాయి. డోజోన్స్ 212 పాయింట్లు(0.7 శాతం) ఎగసి 31,041 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 56 పాయింట్ల(1.5 శాతం) వృద్ధితో 3,804 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 327 పాయింట్లు(2.6 శాతం) జంప్‌చేసి 13,067 వద్ద స్థిరపడింది. ఇవి సరికొత్త గరిష్టాలుకావడం విశేషం! చదవండి: (మారిన ఐటీ కంపెనీల ఫోకస్) బాండ్ల ఈల్డ్స్ అప్ 10ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్ 10 నెలల గరిష్టం 1.081 శాతానికి ఎగశాయి. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 0.5 శాతం బలపడి 89.78ను తాకింది. మరోపక్క పసిడి ధరలు ఔన్స్ 0.3 శాతం నీరసించి 1914 డాలర్లకు చేరాయి. కాగా.. గత వారం నిరుద్యోగ క్లెయిములు అంచనాలకంటే తగ్గడంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు తెలియజేశారు. (ప్రపంచ కుబేరుడిగా ఎలన్ మస్క్?) టెస్లా జోరు ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా ఇంక్ 8 శాతం జంప్‌చేసి 816 డాలర్లను తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 773 బిలియన్ డాలర్లను అధిగమించింది. ఫలితంగా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ సంపద 188 బిలియన్ డాలర్లను తాకింది. టెస్లా ఇంక్‌లో మస్క్‌కు 20 శాతం వాటా ఉన్న సంగతి తెలిసిందే. ఫలితంగా ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా మస్క్ ఆవిర్భవించినట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా.. ఐఫోన్ల దిగ్గజం యాపిల్, ఇంటర్నెట్ దిగ్గజం అల్ఫాబెట్, ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్, ఎంటర్టైన్మెంట్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్, ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ 3.5-1 శాతం మధ్య జంప్‌చేశాయి. దీంతో ఎస్అండ్పీ, నాస్డాక్ భారీగా బలపడినట్లు నిపుణులు తెలియజేశారు. డీఎక్స్‌సీ టెక్నాలజీ కొనుగోలుకి ఫ్రాన్స్ ఐటీ కన్సల్టింగ్ గ్రూప్ అటోస్ ఎస్ఈ 10 బిలియన్ డాలర్ల ఆఫర్‌ను ప్రకటించడంతో డిక్సన్ షేరు 9 శాతం దూసుకెళ్లింది. -
ప్యాకేజీ ఆశలు- యూఎస్ మార్కెట్ల రికార్డ్స్
న్యూయార్క్: కొత్త ప్రెసిడెంట్‌గా జనవరిలో బాధ్యతలు స్వీకరించనున్న జో బైడెన్ ప్రభుత్వం సహాయక ప్యాకేజీకి తెరతీయనుందన్నఅంచనాలు వారాంతాన అమెరికా స్టాక్ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. ఇన్వెస్టర్లు ప్రధానంగా ఎయిర్‌లైన్స్, క్రూయిజర్, ఇంధన రంగ కౌంటర్లలో కొనుగోళ్లకు ఎగబడటంతో శుక్రవారం మార్కెట్లు సరికొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. డోజోన్స్ 249 పాయింట్లు(0.85 శాతం) ఎగసి 30,218 వద్ద నిలిచింది. ఎస్అండ్పీ 32 పాయింట్లు(0.9 శాతం) లాభపడి 3,699 వద్ద ముగిసింది. నాస్డాక్ సైతం 87 పాయింట్లు(0.7 శాతం) బలపడి 12,464 వద్ద స్థిరపడింది. ఎనర్జీ, మెటీరియల్స్, ఇండస్ట్రియల్స్ రంగాలకు కొనుగోళ్ల మద్దతు లభించినట్లు మార్కెట్ నిపుణులు తెలియజేశారు. ఉపాధి వీక్ నవంబర్‌లో వ్యవసాయేతర రంగంలో 2.45 లక్షల మందికి మాత్రమే ఉపాధి లభించినట్లు కార్మిక శాఖ గణాంకాలు వెల్లడించాయి. గత ఆరు నెలల్లో ఇది కనిష్టంకాగా.. 4.69 లక్షల మందికి ఉపాధి లభించగలదని విశ్లేషకులు వేసిన అంచనాలకు దెబ్బ తగిలింది. అక్టోబర్‌లో 6.1 లక్షల ఉద్యోగాల కల్పన జరగడం గమనార్హం! గత నెలలో ఉపాధి క్షీణించడానికితోడు.. సెకండ్‌వేవ్‌లో కేసులు పెరగడం, శీతల సమస్యల కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించనున్నట్లు కొత్త ప్రెసిడెంట్‌గా ఎంపికైన జో బైడెన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. దీంతో జీడీపీకి దన్నుగా కాంగ్రెస్ సాధ్యమైనంత త్వరగా సహాయక ప్యాకేజీని ఆమోదించవలసి ఉన్నట్లు డిమాండ్ చేశారు. ఉద్యోగ గణాంకాలు నిరాశపరచినప్పటికీ బైడెన్ వ్యాఖ్యలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. 5.4 శాతం అప్ ఇటీవల చమురు ధరలు బలపడుతుండటంతో ఎనర్జీ రంగం 5.4 శాతం ఎగసింది. డైమండ్‌బ్యాక్ ఎనర్జీ, ఆక్సిడెంటల్ పెట్రోలియం 13 శాతం చొప్పున దూసుకెళ్లాయి. షెవ్రాన్ కార్పొరేషన్ 4 శాతం పుంజుకోగా.. 787 డ్రీమ్‌లైనర్ విమానాల తయారీని తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో బోయింగ్ ఇంక్ 2 శాతం క్షీణించింది. ఇతర కౌంటర్లలో నార్వేజియన్ క్రూయిజ్ 3.3 శాతం, అమెరికన్ ఎయిర్‌లైన్స్ 2 శాతం చొప్పున లాభపడ్డాయి. -
డోజోన్స్ కొత్త రికార్డ్- ఎందుకీ స్పీడ్?
న్యూయార్క్, సాక్షి: మంగళవారం యూఎస్ స్టాక్ మార్కెట్లలో మరో కొత్త రికార్డ్ నమోదైంది. డోజోన్స్ 455 పాయింట్లు(1.55 శాతం) ఎగసి 30,046 వద్ద ముగిసింది. తద్వారా మార్కెట్ చరిత్రలో తొలిసారి 30,000 పాయింట్ల మైలురాయిని అందుకుంది. ఈ బాటలో ఎస్అండ్పీ 58 పాయింట్లు(1.6 శాతం) పురోగమించి 3,635 వద్ద నిలవగా.. నాస్డాక్ 156 పాయింట్లు(1.3 శాతం) బలపడి 12,037 వద్ద స్థిరపడింది. కాగా.. ఈ నెలలో ఇప్పటివరకూ డోజోన్స్ 13 శాతం దూసుకెళ్లింది. ఇంతక్రితం 1987 నవంబర్‌లో మాత్రమే ఈ స్థాయి లాభాలు ఆర్జించగా.. ఎస్అండ్పీ 11 శాతం, నాస్డాక్ 10.3 శాతం చొప్పున ర్యాలీ చేశాయి. తద్వారా ఈ ఏడాది ఏప్రిల్ తదుపరి గరిష్టంగా లాభపడ్డాయి. బ్లూచిప్స్ అండ మంగళవారం డోజోన్స్‌కు బలాన్నిచ్చిన కౌంటర్లలో షెవ్రాన్ 5 శాతం, జేపీ మోర్గాన్ చేజ్ 4.6 శాతం, గోల్డ్‌మన్ శాక్స్ 3.8 శాతం చొప్పున జంప్ చేశాయి. మార్కెట్లకు ప్రోత్సాహాన్నిచ్చిన ఇతర కౌంటర్లలో టెస్లా ఇంక్ 6.5 శాతం దూసుకెళ్లగా.. ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, గూగుల్, నెట్‌ఫ్లిక్స్, యాపిల్ 3-1 శాతం మధ్య ఎగశాయి. కాగా.. ఫార్మా దిగ్గజాలలో మోడర్నా ఇంక్ 2.5 శాతం, ఆస్ట్రాజెనెకా 2 శాతం చొప్పున క్షీణించాయి. జోరు ఎందుకంటే? ఇటీవల ఫార్మా దిగ్గజాలు ఫైజర్, మోడర్నా ఇంక్ కోవిడ్-19 కట్టడికి రూపొందించిన వ్యాక్సిన్లు 95 శాతం ఫలితాలనిచ్చినట్లు వెల్లడించడంతో సెంటిమెంటు బలపడింది. ఈ బాటలో బ్రిటిష్ కంపెనీ ఆస్ట్రాజెనెకా సైతం ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్‌ను విడుదల చేయగలమని భావిస్తున్నట్లు పేర్కొంది. ఇక మరోవైపు యూఎస్ కొత్త ప్రెసిడెంట్‌గా జో బైడెన్ బాధ్యతలు చేపట్టేందుకు అడ్డంకులు తొలగిపోవడంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. రాజకీయ అనిశ్చితులకు చెక్ పడటం ఇందుకు సహకరించింది. గతంలో కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్‌కు చైర్‌పర్సన్‌గా పనిచేసిన జానెట్ యెలెన్‌ను ఆర్థిక మంత్రిగా బైడెన్ ఎంపిక చేసుకునే వీలున్నట్లు వెలువడిన వార్తలు ఈ సానుకూల అంశాలకు జత కలసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మార్కెట్ల ఫ్రెండ్లీగా వ్యవహరించే యెలెన్ వడ్డీ రేట్లను నేలకు దించడం ద్వారా ఆర్థిక రికవరీకి పాటుపడినట్లు తెలియజేశారు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో మరోసారి ప్రభుత్వం భారీ సహాయక ప్యాకేజీకి రూపకల్పన చేసే అవకాశమున్నట్లు అంచనాలు బలపడ్డాయి. వెరసి మార్కెట్లు సరికొత్త రికార్డుల బాటలో పరుగు తీస్తున్నట్లు నిపుణులు వివరించారు. -
వ్యాక్సిన్ ఆశలు- యూఎస్ కొత్త రికార్డ్స్
న్యూయార్క్: కోవిడ్-19 సెకండ్ వేవ్‌తో వణుకుతున్న ప్రపంచ దేశాలకు తాజాగా మోడర్నా ఇంక్ వ్యాక్సిన్ ద్వారా అభయం ఇవ్వడంతో సోమవారం యూఎస్ మార్కెట్లకు హుషారొచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో డోజోన్స్ 479 పాయింట్లు(1.6 శాతం) జంప్‌చేసి 29,959 వద్ద ముగిసింది. ఈ బాటలో ఎస్అండ్పీ 42 పాయింట్లు(1.2 శాతం) ఎగసి 3,627 వద్ద నిలవగా.. నాస్డాక్ 95 పాయింట్లు(0.8 శాతం) పెరిగి 11,924 వద్ద స్థిరపడింది. వెరసి మార్కెట్లు లైఫ్‌టైమ్ గరిష్టాలకు చేరాయి. ఇంతక్రితం ఈ ఏడాది ఫిబ్రవరిలో మాత్రమే ప్రధాన ఇండెక్సులు మూడూ ఒకేరోజు చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ రసెల్-2000 సైతం ఆల్‌టైమ్ హైను తాకడం విశేషం! ఇప్పటికే తమ వ్యాక్సిన్ 90 శాతంపైగా సురక్షితమంటూ ఫార్మా దిగ్గజంఫైజర్ డేటాను విశ్లేషించిన విషయం విదితమే. దీంతో సెంటిమెంటు మరింత బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. చదవండి: (మరోసారి మార్కెట్లకు దివాలీ జోష్?!) ఫైజర్ డీలా కోవిడ్-19 కట్టడికి రూపొందించిన వ్యాక్సిన్ 94.5 శాతం సురక్షితమంటూ ప్రకటించిన మోడర్నా ఇంక్ షేరు 10 శాతం దూసుకెళ్లింది. అయితే ఇతర ఫార్మా కౌంటర్లలో ఫైజర్ ఇంక్ 3.3 శాతం, ఆస్ట్రాజెనెకా 2 శాతం చొప్పున డీలా పడ్డాయి. వ్యాక్సిన్ అంచనాలతో ఎయిర్‌లైన్, క్రూయిజర్ స్టాక్స్‌కు సైతం డిమాండ్ పెరిగింది. కార్నివాల్ గ్రూప్ 10 శాతం జంప్‌చేయగా. నార్వేజియన్ క్రూయిజ్లైన్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్, అమెరికన్ ఎయిర్‌లైన్స్, సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ 6-4 శాతం మధ్య పురోగమించాయి. ఈ బాటలో ప్రత్యర్థి సంస్థ టాబ్మెన్ సెంటర్స్ కొనుగోలు ధరను 80 శాతం తగ్గించిన వార్తలతో సైమన్ ప్రాపర్టీ గ్రూప్ షేరు దాదాపు 6 శాతం ఎగసింది. ఈ వారం రిటైల్ రంగ దిగ్గజాలు వాల్‌మార్ట్ ఇంక్, హోమ్ డిపో, టార్గెట్ కార్ప్, లోవ్స్ క్యూ3(జులై- సెప్టెంబర్) త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి. చదవండి: (సెన్సెక్స్‌ప్రెస్- 44,000 దాటేసింది!) -
వ్యాక్సిన్ బూస్ట్- టెక్ దిగ్గజాల షాక్
న్యూయార్క్: కోవిడ్-19 కట్టడికి రూపొందిస్తున్న వ్యాక్సిన్ చివరి దశ క్లినికల్ పరీక్షలలో 90 శాతంపైగా సఫలమైనట్లు ఫార్మా దిగ్గజం ఫైజర్ ఇంక్ ప్రకటించింది. జర్మన్ కంపెనీ బయోఎన్ టెక్ తో సంయుక్తంగా రూపొందించిన ఈ వ్యాక్సిన్ కు నవంబర్ చివరిలోగా యూఎస్ఎఫ్డీఏ నుంచి ఎమర్జెన్సీ ప్రాతిపదికన వినియోగానికి అనుమతి లభించే వీలున్నట్లు అంచనా వేసింది. ఫలితంగా సోమవారం యూఎస్ స్టాక్ మార్కెట్లకు వ్యాక్సిన్ బూస్ట్ లభించింది. డోజోన్స్ 835 పాయింట్లు(3 శాతం) జంప్ చేసి 29,158కు చేరగా.. ఎస్అండ్పీ 41 పాయంట్లు(1.2 శాతం) ఎగసి 3,551 వద్ద ముగిసింది. అయితే టెక్ దిగ్గజాలలో ట్రేడర్లు అమ్మకాలు చేపట్టడంతో నాస్డాక్ 181 పాయింట్లు(1.5 శాతం) పతనమై 11,714 వద్ద స్థిరపడింది. కార్నివాల్ జోరు వ్యాక్సిన్ ఆశలతో ఫైజర్, మోడర్నా ఇంక్ 7.5 శాతం చొప్పున జంప్ చేయగా.. ఆస్ట్రాజెనెకా 2.5 శాతం క్షీణించింది. అయితే కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్ రానుందన్న అంచనాలతో సోమవారం ఎంటర్ టైన్మెంట్ కంపెనీల షేర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. వెరసి ఏఎంసీ 50 శాతం, కార్నివాల్ కార్పొరేషన్ 39 శాతం, సిక్స్ ఫ్లాగ్స్ 18 శాతం చొప్పున దూసుకెళ్లాయి. ఈ బాటలో జెట్ బ్లూ ఎయిర్వేస్, స్పిరిట్ ఎయిర్ లైన్స్ 21 శాతం చొప్పున జంప్ చేశాయి. అయితే జూమ్ వీడియా కమ్యూనికేషన్స్ షేరు 17 శాతం పతనమైంది. కాగా.. అల్జీమర్స్ చికిత్సకు వినియోగించగల ఔషధానికి యూఎస్ఎఫ్డీఏ.. నో చెప్పడంతో బయోజెన్ 30 శాతం కుప్పకూలింది. ఫాంగ్ స్టాక్స్ డీలా ఫాంగ్ స్టాక్స్ గా పిలిచే దిగ్గజాలలో నెట్ ఫ్లిక్స్ 8.6 శాతం పతనంకాగా.. ఫేస్ బుక్ 5 శాతం, మైక్రోసాఫ్ట్ 2.4 శాతం, యాపిల్ 2 శాతం చొప్పున నష్టపోయాయి. ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా ఇంక్ 2 శాతం డీలాపడింది. ఈ ఏడాది భారీ లాభాలతో ర్యాలీ చేస్తున్న టెక్ దిగ్గజాలలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు తెరతీయడంతో నాస్డాక్ పతనమైనట్లు నిపుణులు పేర్కొన్నారు. -
యూఎస్ మార్కెట్లకు జో బైడెన్ జోష్
డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్‌కు కొన్ని కీలక రాష్ట్రాలలో ఆధిక్యం లభించనున్న అంచనాలతో మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. డోజోన్స్ 555 పాయింట్లు(2 శాతం) జంప్‌చేసి 27,480కు చేరగా.. ఎస్అండ్పీ 59 పాయింట్లు(1.8 శాతం) ఎగసి 3,369 వద్ద ముగిసింది. నాస్డాక్ సైతం 203 పాయింట్ల(1.9 శాతం) వృద్ధిచూపి 11,161 వద్ద స్థిరపడింది. బైడెన్ గెలిస్తే ఎన్నికలకు ముందు డెమొక్రాట్లు పట్టుపట్టిన 2.2 ట్రిలియన్ డాలర్ల సహాయక ప్యాకేజీకి ఆమోదముద్ర పడగలదన్న అంచనాలు ఇన్వెస్టర్లకు హుషారునిచ్చినట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా లక్షల మంది ప్రజలకు ఆరోగ్య సవాళ్లు విసురుతున్న కరోనా వైరస్ కట్టడిలో ప్రభుత్వం విఫలమైనట్లు ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. ఫెడ్‌పై కన్ను ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావం చూపగల కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల పాలసీ సమీక్షా సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 0.4 శాతం ఎగసింది. మళ్లీ 94 దిగువన 93.49కు చేరింది. ఇక పసిడి ఔన్స్ 1900 డాలర్లను అధిగమించింది. బీఎన్పీ పరిబాస్‌సహా బ్యాంకింగ్ దిగ్గజాల సానుకూల ఫలితాల కారణంగా మంగళవారం యూరోపియన్ మార్కెట్లు 2.5 శాతం జంప్‌చేశాయి. చమురు అప్ గత వారం పతన బాట పట్టిన ముడిచమురు ధరలు రెండు రోజులుగా బౌన్స్‌బ్యాక్ సాధిస్తున్నాయి. రష్యాసహా ఒపెక్ దేశాలు ఉత్పత్తిలో కోతలను మరికొంతకాలం కొనసాగించనున్న అంచనాలు ఇందుకు సహకరిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మంగళవారం లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ 3 శాతం జంప్‌చేయగా.. న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు 2.7 శాతం లాభపడింది. ప్రస్తుతం న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు బ్యారల్ 1.4 శాతం ఎగసి 38.18 డాలర్లకు చేరింది. ఈ బాటలో లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ సైతం 1.2 శాతం బలపడి 40.18 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. యాంట్‌కు చెక్ భారీ స్థాయిలో నిధుల సమీకరణకు సిద్ధపడుతున్న యాంట్ గ్రూప్ పబ్లిక్ ఇష్యూకి చైనీస్ ప్రభుత్వం చెక్ పెట్టడంతో మంగళవారం అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్ షేరు దాదాపు 10 శాతం కుప్పకూలింది. యాంట్ గ్రూప్‌లో అలీబాబాకు మూడో వంతు వాటా ఉండటం ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫాంగ్ స్టాక్స్ అప్ ఫాంగ్ స్టాక్స్‌గా పిలిచే టెక్ దిగ్గజాలలో మైక్రోసాఫ్ట్, యాపిల్, అమెజాన్, ఫేస్బుక్, అల్ఫాబెట్, నెట్‌ఫ్లిక్స్ 1.5-0.6 శాతం మధ్య ఎగశాయి. ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇంక్ సైతం దాదాపు 6 శాతం జంప్‌చేసింది. ఇతర బ్లూచిప్స్‌లో బోయింగ్ 3.5 శాతం, మోడర్నా ఇంక్ 3 శాతం చొప్పున లాభపడ్డాయి. -
యూఎస్ మార్కెట్స్- టెక్ దిగ్గజాల దెబ్బ
పలు దేశాలలో మళ్లీ కోవిడ్-19 కేసులు విజృంభిస్తుండటంతో శుక్రవారం యూఎస్ స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. ప్రధానంగా టెక్నాలజీ కౌంటర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో నాస్డాక్ 2.5 శాతం పతనమైంది. డోజోన్స్ 158 పాయింట్లు(0.6 శాతం) క్షీణించి 26,502కు చేరగా.. ఎస్అండ్పీ 40 పాయింట్లు(1.2 శాతం) నష్టంతో 3,270 వద్ద ముగిసింది. నాస్డాక్ మరింత అధికంగా 274 పాయింట్లు(2.5 శాతం) కోల్పోయి 10,912 వద్ద స్థిరపడింది. వెరసి గత వారం డోజోన్స్ 6.5 శాతం పతనంకాగా.. ఎస్అండ్పీ 5.6 శాతం, నాస్డాక్ 5.5 శాతం చొప్పున నీరసించాయి. ఫలితంగా ఈ సెప్టెంబర్ మొదట్లో నమోదైన సరికొత్త గరిష్టం నుంచి ఎస్అండ్పీ-500 ఇండెక్స్ 9 శాతం వెనకడుగు వేసినట్లయ్యింది. ఇక అక్టోబర్ నెలలో చూస్తే.. డోజోన్స్ 4.6 శాతం, ఎస్అండ్పీ 2.8 శాతం చొప్పున క్షీణించగా.. నాస్డాక్ 2.3 శాతం నష్టపోయింది. కోవిడ్-19 షాక్ కొద్ది రోజులుగా యూఎస్‌లో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటంతో కోవిడ్-19 బాధితుల సంఖ్య 90 లక్షలను మించింది. దీనికితోడు సెకండ్‌వేవ్‌లో భాగంగా బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ తదితర యూరోపియన్ దేశాలలో కోవిడ్-19 బాధితులు పెరుగుతుండటంతో సెంటిమెంటుకు దెబ్బ తగిలినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. తాజాగా బ్రిటన్, ఫ్రాన్స్‌లలో పూర్తిస్థాయి లాక్‌డవున్‌లకు తెరతీయగా.. పలు దేశాలు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. దీంతో మరోసారి ప్రపంచ ఆర్థిక వృద్ధి కుదేలయ్యే వీలున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దీంతో వారాంతాన యూరోపియన్, యూఎస్ మార్కెట్లు నీరసించినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇక మరోపక్క యూఎస్ అధ్యక్ష ఎన్నికల కారణంగా ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలియజేశారు. పతన బాటలో.. వారాంతాన మైక్రో బ్లాగింగ్ కంపెనీ ట్విటర్ ఇంక్ క్యూ3(జులై- సెప్టెంబర్)లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది, అంచనాలకంటే తక్కువగా యూజర్లు నమోదుకావడంతోపాటు.. యూఎస్ అధ్యక్ష ఎన్నికల కారణంగా ఆదాయం క్షీణించే వీలున్నట్లు అంచనా వేసింది. దీంతో ట్విటర్ షేరు 21 శాతంపైగా పడిపోయింది. ఈ బాటలో ఫాంగ్ స్టాక్స్‌గా పిలిచే టెక్ దిగ్గజాలలోనూ అమ్మకాలు పెరిగాయి. 2021లో కఠిన పరిస్థితులు ఎదురుకానున్నట్లు పేర్కొనడంతో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ 6.3 శాతం పతనమైంది. కోవిడ్-19 కారణంగా వ్యయాలు పెరగనున్న అంచనాలతో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ 5.5 శాతం నీరసించింది. క్యూ3లో గత రెండేళ్లలోలేని విధంగా ఐఫోన్ల అమ్మకాలు క్షీణించడంతో యాపిల్ ఇంక్ 5.6 శాతం నష్టపోయింది. 5జీ ఫోన్ల విడుదలలో జాప్యం ఐఫోన్ల అమ్మకాలపై ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. గూగుల్ అప్ త్రైమాసిక అమ్మకాలు పుంజుకోనున్నట్లు అంచనాలు ప్రకటించడంతో ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ ఇంక్ షేరు 3.5 శాతం ఎగసింది. ప్రకటనల ఆదాయం తిరిగి ఊపందుకోనుండటం ఈ కౌంటర్‌కు జోష్‌నిచ్చినట్లు నిపుణులు తెలియజేశారు. దీంతో టెక్ కౌంటర్లలో నెలకొన్న ట్రెండుకు ఎదురీదినట్లు పేర్కొన్నారు. కాగా.. ఇతర కౌంటర్లలో మీడియా దిగ్గజం నెట్‌ఫ్లిక్స్, ఫార్మా దిగ్గజం మోడర్నా ఇంక్, ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇంక్ సైతం 5.5 శాతం చొప్పున పడిపోయాయి. -
ప్యాకేజీపై ఆశలు- యూఎస్ మార్కెట్లు ఓకే
వారాంతాన అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఎస్అండ్పీ-500 ఇండెక్స్ 12 పాయింట్లు(0.35 శాతం) పుంజుకుని 3.465 వద్ద నిలవగా.. నాస్డాక్ 42 పాయింట్లు(0.4 శాతం) పెరిగి 11,548 వద్ద స్థిరపడింది. అయితే డోజోన్స్ నామమాత్రంగా 28 పాయింట్లు(0.1 శాతం) క్షీణించి 28,336 వద్ద ముగిసింది. కొద్ది వారాలుగా మార్కెట్లు ప్రభుత్వ ప్యాకేజీపై అంచనాలతో కదులుతున్నట్లు ఈ సందర్భంగా విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో ప్యాకేజీపై కొనసాగుతున్న అనిశ్చితి కారణంగా ఇటీవల మార్కెట్లు ఒడిదొడుకులను చవిచూస్తున్నట్లు తెలియజేశారు. శుక్రవారం(23)తో ముగిసిన గత వారం డోజోన్స్ 1 శాతం, ఎస్అండ్పీ 0.5 శాతం చొప్పున బలహీనపడగా.. నాస్డాక్ సైతం 1.1 శాతం క్షీణించింది. అనిశ్చితిలోనే ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ట్రంప్ ప్రతిపాదించిన ప్యాకేజీపై డెమొక్రాట్లకూ, రిపబ్లికన్లకూ మధ్య విభేధాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ప్యాకేజీకి కొన్ని సవరణలు సూచిండంతోపాటు. 2.2 ట్రిలియన్ డాలర్లకు పెంచమంటూ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ ప్రతిపాదించిన విషయం విదితమే. అయితే ఎన్నికలలోగా ప్యాకేజీపై ఒప్పందం కుదురుతుందని భావిస్తున్నట్లు పెలోసీ పేర్కొన్నారు. ఇక మరోవైపు అధ్యక్ష ఎన్నికలలో భాగంగా ప్రెసిడెంట్ ట్రంప్, ప్రత్యర్ధి జోబిడెన్ మధ్య వాడిగా, వేడిగా డిబేట్ నడిచింది. డిబేట్ తదుపరి ఎన్నికలను ప్రభావితం చేసే పలు రాష్ట్రాలలో పరిస్థితులను అంచనా వేయవలసి ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అమెక్స్ డౌన్ ఈ ఏడాది క్యూ3(జులై- సెప్టెంబర్)లో మార్జిన్లు బలహీనపడటంతో చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ కార్ప్ షేరు 10 శాతం కుప్పకూలింది. కోవిడ్-19 కారణంగా డిమాండ్ పడిపోవడంతో చిన్న సంస్థలు, వినియోగదారులు చౌక ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకి మళ్లినట్లు నిపుణులు తెలియజేశారు. మరోవైపు డేటా సెంటర్లపై ప్రభుత్వ వ్యయాలు తగ్గడం వంటి అంశాలు సైతం ప్రభావం చూపినట్లు వివరించారు. ఫలితంగా ఇంటెల్ లాభదాయకత నీరసించినట్లు అభిప్రాయపడ్డారు. కాగా.. క్యూ3లో ఫలితాలు అంచనాలను చేరకపోవడంతో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ షేరు 3.6 శాతం నష్టపోయింది. కోవిడ్-19 కారణంగా వినియోగం మందగించడంతోపాటు, చెల్లింపుల వైఫల్యాలను ఎదుర్కొనేందుకు కేటాయింపులు చేపట్టడం అమెక్స్ను దెబ్బతీసినట్లు విశ్లేషకులు తెలియజేశారు. గిలియడ్ ప్లస్ కోవిడ్-19 చికిత్సకు వినియోగిస్తున్న యాంటీవైరల్ ఔషధం రెమ్‌డెసివిర్‌కు యూఎస్ఎఫ్డీఏ ఆమోదముద్ర వేయడంతో గిలియడ్ సైన్సెస్ షేరు 0.2 శాతం బలపడింది. అత్యవసర చికిత్సలో భాగంగా ఇప్పటికే ఈ ఔషధాన్ని వినియోగిస్తున్న విషయం విదితమే. కాగా.. వచ్చే వారం ఫాంగ్ స్టాక్స్‌గా పిలిచే యాపిల్, అమెజాన్, అల్ఫాబెట్(గూగుల్), ఫేస్బుక్.. క్యూ3 ఫలితాలు విడుదల చేయనున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఈ కంపెనీల పనితీరుపై దృష్టిపెట్టనున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. -
యూఎస్ మార్కెట్లకు ప్యాకేజీ దెబ్బ
కోవిడ్-19 ప్రభావాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ ప్రతిపాదించిన 2.2 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీపై సందిగ్ధత కొనసాగుతుండటంతో సోమవారం యూఎస్ స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. డోజోన్స్ 411 పాయింట్లు(1.5 శాతం) క్షీణించి 28,195 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 57 పాయింట్ల(1.6 శాతం) నష్టంతో 3,427 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 193 పాయింట్లు(1.7 శాతం) కోల్పోయి 11,665 వద్ద స్థిరపడింది. ఆర్థిక మంత్రి స్టీవ్ ముచిన్‌తో నిర్వహిస్తున్న చర్చలపై మంగళవారంలోగా స్పష్టత వచ్చే వీలున్నట్లు నాన్సీ పెలోసీ తాజాగా పేర్కొన్నారు. తద్వారా ఎన్నికలలోగా ప్యాకేజీ అమలుకు వీలు కలగనున్నట్లు తెలియజేశారు. దీంతో నేడు మార్కెట్లు కోలుకునే వీలున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. కాగా.. అధ్యక్ష ఎన్నికలలో భాగంగా గురువారం ప్రెసిడెంట్ ట్రంప్, ప్రత్యర్థి జో బిడెన్ మధ్య చివరి దశ డిబేట్ జరగనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. 4 లక్షలు గత వారం కోవిడ్-19 కేసులు 13 శాతం పెరిగి 3.93 లక్షలుగా నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.అయితే మార్చి తదుపరి ఈ ఆదివారం తొలిసారి 10 లక్షల మందికిపైగా విమాన ప్రయాణికులకు స్క్రీనింగ్ చేసినట్లు భద్రతాధికారులు వెల్లడించడం గమనార్హం! ఈ నేపథ్యంలోనూ ప్రభుత్వ ప్యాకేజీపై సందేహాలతో రవాణా సంబంధ కౌంటర్లు డీలాపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫాంగ్ స్టాక్స్ బోర్లా కొద్ది నెలలుగా మార్కెట్లకు జోష్‌నిస్తున్న ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌లో సోమవారం అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో యాపిల్, అల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్బుక్ 2.6-2 శాతం మధ్య డీలా పడ్డాయి. ఈ బాటలో ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా ఇంక్ 2 శాతం నీరసించింది. కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్న ఫార్మా దిగ్గజాలలో మోడర్నా ఇంక్ 4 శాతం పతనంకాగా.. ఆస్ట్రాజెనెకా 1.2 శాతం, ఫైజర్ ఇంక్ 0.4 శాతం చొప్పున క్షీణించాయి. ఇతర కౌంటర్లలో కొనాకోఫిలిప్స్ 3.2 శాతం, షెవ్రాన్ కార్పొరేషన్ 2.2 శాతం చొప్పున నష్టపోయాయి. -
ఆటుపోట్లు- యూఎస్ మార్కెట్ల పతనం
తీవ్ర ఆటుపోట్ల మధ్య గురువారం అమెరికా స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. మూడు రోజుల భారీ నష్టాల నుంచి బుధవారం కోలుకున్పప్పటికీ తిరిగి ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌లో తలెత్తిన భారీ అమ్మకాలు మార్కెట్లను దెబ్బతీశాయి. దీంతో డోజోన్స్ 406 పాయింట్లు(1.5%) క్షీణించి 27,535 వద్ద నిలిచింది. ఎస్అండ్పీ 60 పాయింట్లు(1.8%) నష్టపోయి 3,339 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 222 పాయింట్లు(2%) పతనమై 10,920 వద్ద స్థిరపడింది. బుధవారం స్పీడును కొనసాగిస్తూ తొలుత డోజోన్స్ 300 పాయింట్లకుపైగా జంప్‌చేసింది. మిడ్‌సెషన్ నుంచీ అమ్మకాలు పెరగడంతో చివరికి డీలాపడింది. ఎందుకంటే? గత వారం నిరుద్యోగ క్లెయిములు అంచనాలను మించుతూ 8.84 లక్షలను తాకడం సెంటిమెంటును దెబ్బతీసినట్లు నిపుణులు పేర్కొన్నారు. కోవిడ్-19 ప్రభావంతో 8.5 లక్షల క్లెయిములను ఆర్థికవేత్తలు అంచనా వేశారు. దీనికితోడు టెక్నాలజీ కౌంటర్లలో కొద్ది రోజులుగా నెలకొన్న ర్యాలీ కారణంగా ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోపక్క యూరోపియన్ దేశాలలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నట్లు వెలువడిన వార్తలతో ఇన్వెస్టర్లు ఆందోళనలకు లోనైనట్లు తెలియజేశారు. నేలచూపులే.. ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే న్యూఏజ్ ఎకానమీ కౌంటర్లలో ఫేస్బుక్, యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్(అల్ఫాబెట్) 2-4 శాతం మధ్య వెనకడుగు వేశాయి. ఇక ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇంక్.. తొలుత 8 శాతం పతనమైనప్పటికీ చివర్లో కోలుకుని 1.4 శాతం లాభంతో ముగిసింది. కంప్యూటర్ చిప్స్ తయారీ దిగ్గజం ఏఎండీ 3.6 శాతం క్షీణించింది. కోవిడ్-19 చికిత్సకు బయోఎన్‌టెక్‌తో సంయుక్తంగా వ్యాక్సిన్ రూపొందిస్తున్న ఫైజర్ ఇంక్ 1.5 శాతం నష్టపోగా.. క్లినికల్ పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేసిన ఆస్ట్రాజెనెకా 1.1 శాతం నీరసించింది. వ్యాక్సిన్ రేసులో ఉన్న మరో ఫార్మా కంపెనీ మోడార్నా ఇంక్ 1.2 శాతం పుంజుకుంది. ఫార్మా దిగ్గజం సనోఫీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన మైఖేల్ మలెట్ను కెనడియన్ బిజినెస్ ఎండీగా ఎంపిక చేసుకున్నట్లు మోడర్నా పేర్కొంది. -
మూడో రోజూ యూఎస్ మార్కెట్లు.. బేర్ బేర్
వరుసగా మూడో రోజు మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రధానంగా ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే టెక్నాలజీ కౌంటర్లలో తలెత్తిన భారీ అమ్మకాలు మార్కెట్లను దెబ్బతీశాయి. వెరసి డోజోన్స్ 633 పాయింట్లు(2.25%) పతనమై 27,500 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 95 పాయింట్లు(2.78%) దిగజారి 3,332 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 465 పాయింట్లు(4.11%) పడిపోయి 10,848 వద్ద స్థిరపడింది. దీంతో కేవలం మూడు రోజుల్లోనే నాస్డాక్ ఇండెక్స్ 10 శాతం కోల్పోయింది. ఇది దిద్దుబాటు(కరెక్షన్)కు సంకేతమని సాంకేతిక విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఓవైపు ఆర్థిక వ్యవస్థలకు కోవిడ్-19.. సవాళ్లు విసురుతుండటం, మరోపక్క డీల్ కుదుర్చుకోకుండానే యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగనుందన్న(బ్రెగ్జిట్) అంచనాలు సెంటిమెంటును దెబ్బతీసినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో డాలరు ఇండెక్స్ నాలుగు వారాల గరిష్టానికి చేరగా.. ముడిచమురు ధరలు 8 శాతం పడిపోయాయి. పతన బాటలో ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే న్యూఏజ్ ఎకానమీ కౌంటర్లలో యాపిల్ 7 శాతం పతనమైంది. దీంతో ఒక్క రోజులోనే కంపెనీ మార్కెట్ విలువలో 140 బిలియన్ డాలర్లు ఆవిరైంది. 2008 అక్టోబర్ తదుపరి యాపిల్ షేరు 3 రోజుల్లోనే 14 శాతం క్షీణించింది. ఈ బాటలో ఆటో, టెక్నాలజీ కంపెనీ టెస్లా ఇంక్.. తొలిసారి ఒక్క రోజులోనే 21 శాతం కుప్పకూలింది. జనరల్ మోటార్స్ 2 బిలియన్ డాలర్లతో 11 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించడంతో టెస్లా ప్రత్యర్థి సంస్థ నికోలా కార్పొరేషన్ షేరు 41 శాతం దూసుకెళ్లింది. ఫాంగ్ స్టాక్స్ వీక్ టెక్నాలజీ, సోషల్ మీడియా, ఈకామర్స్ దిగ్గజాలలో మైక్రోసాఫ్ట్ 5.4 శాతం, ఫేస్బుక్ 4 శాతం, అమెజాన్ 4.4 శాతం, గూగుల్ 3.7 శాతం, నెట్‌ఫ్లిక్స్ 1.8 శాతం చొప్పున పతనమయ్యాయి. ఈ కౌంటర్లలో బిలియన్ల డాలర్లతో పొజిషన్లు తీసుకున్నట్లు వెలువడిన అంచనాల కారణంగా సాఫ్ట్‌బ్యాంక్ షేరు సైతం 7 శాతం పడిపోయింది. -
టెక్ షాక్- యూఎస్ మార్కెట్లు బోర్లా
వరుస రికార్డులతో హోరెత్తిస్తున్న అమెరికా స్టాక్ మార్కెట్లు గురువారం ఒక్కసారిగా కుప్పకూలాయి. ప్రధానంగా ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే న్యూఏజ్ ఎకానమీ కౌంటర్లలో తలెత్తిన భారీ అమ్మకాలు మార్కెట్లను దెబ్బతీశాయి. దీంతో డోజోన్స్ 808 పాయింట్లు(2.8%) పతనమై 28,293 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 126 పాయింట్లు(3.5%) పడిపోయి 3,455 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 598 పాయింట్లు(5%) దిగజారి 11,458 వద్ద స్థిరపడింది. యాపిల్, మైక్రోసాఫ్ట్, బోయింగ్ తదితర దిగ్గజాల వెనకడుగుతో తొలుత డోజోన్స్ 1,000 పాయింట్లకుపైగా పడిపోవడం గమనార్హం! పతన బాటలో కొద్ది నెలలుగా దూకుడు చూపుతూ అటు ఎస్అండ్పీ, ఇటు నాస్డాక్ కొత్త రికార్డులను చేరుకునేందుకు దోహదపడుతున్న టెక్ దిగ్గజాల కౌంటర్లలో ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి జూన్ తదుపరి ఒక్క రోజులోనే ఫాంగ్ స్టాక్స్ అన్నీ భారీగా పతనమయ్యాయి. ఐఫోన్ల దిగ్గజం యాపిల్ 8 శాతం, విండోస్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 6.2 శాతం చొప్పున కుప్పకూలగా.. అమెజాన్, ఫేస్బుక్, గూగుల్, నెట్‌ఫ్లిక్స్ 5 శాతం స్థాయిలో పతనమయ్యాయి. ఇతర కౌంటర్లలో జూమ్ 10 శాతం, టెస్లా 9 శాతం, ఎన్విడియా 9.3 శాతం చొప్పున బోర్లా పడ్డాయి. ఇక బ్లూచిప్స్ హెచ్‌పీ, బోయింగ్, డీరె 3 శాతం చొప్పున డీలా పడ్డాయి. అయితే పటిష్ట త్రైమాసిక ఫలితాల కారణంగా కాల్విన్ క్లెయిన్ బ్రాండ్ కంపెనీ పీవీహెచ్ కార్ప్ 3.3 శాతం ఎగసింది. లాభాల స్వీకరణ ఉన్నట్టుండి గురువారం వెల్లువెత్తిన అమ్మకాలకు ప్రధాన కారణం ట్రేడర్ల లాభాల స్వీకరణే అని విశ్లేషకులు చెబుతున్నారు. కోవిడ్-19 కారణంగా ఆర్థిక వ్యవస్థ అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ న్యూఏజ్ ఎకానమీ కౌంటర్లు నిరవధికంగా దూసుకెళుతున్నట్లు తెలియజేశారు. దీంతో సాంకేతికంగానూ మార్కెట్లు ఓవర్‌బాట్ స్థాయికి చేరుకున్నట్లు అభిప్రాయపడ్డారు. దీంతో ఒక్కసారిగా అమ్మకాలు ఊపందుకున్నట్లు వివరించారు. ఉదాహరణకు గురువారంనాటి పతనం తదుపరి కూడా యాపిల్ ఇంక్ షేరు 2020లో ఇప్పటివరకూ 65 శాతం ర్యాలీ చేయడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. బుధవారం రికార్డ్స్ పలు సానుకూల అంశాల నేపథ్యంలో బుధవారం ఎస్అండ్పీ 54 పాయింట్లు(1.5%) బలపడి 3,581కు చేరగా.. నాస్డాక్ 117 పాయింట్లు(1%) ఎగసి 12,056 వద్ద ముగిసింది. వెరసి 2020లో ఎస్అండ్పీ 22వసారి, నాస్డాక్ 43వ సారి సరికొత్త గరిష్టాలను అందుకున్న సంగతి తెలిసిందే. ఇక డోజోన్స్ 455 పాయింట్లు(1.6%) జంప్‌చేసి 29,100 వద్ద స్థిరపడింది. తద్వారా ఫిబ్రవరి గరిష్టానికి 1.5 శాతం చేరువలో నిలవడంతోపాటు.. 6 నెలల తదుపరి తిరిగి 29,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. -
వైరస్‌కు చెక్!- బ్యాంకింగ్ భేష్
ప్రధానంగా బ్యాంకింగ్ రంగ కౌంటర్లు లాభాల దుమ్ము రేపడంతో శుక్రవారం యూఎస్ స్టాక్ మార్కెట్లకు బలమొచ్చింది. మరోపక్క ఫార్మా దిగ్గజం గిలియడ్ సైన్సెస్ రూపొందిస్తున్న ఔషధం మరింత ప్రభావం చూపుతున్నట్లు వెలువడిన వార్తలు కరోనా వైరస్ కట్టడికి సహకరించగలవన్న అంచనాలు పెరిగాయి. ఫలితంగా వారాంతాన డోజోన్స్ 369 పాయింట్లు(1.5 శాతం) ఎగసి 26,075 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 33 పాయింట్లు(1 శాతం) పుంజుకుని 3,185 వద్ద ముగిసింది. నాస్డాక్ సైతం 70 పాయింట్లు(0.7 శాతం) లాభపడి 10,617 వద్ద స్థిరపడింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. గత ఏడు ట్రేడింగ్ సెషన్లలో నాస్డాక్ ఆరుసార్లు సరికొత్త రికార్డులను నెలకొల్పడం విశేషం! వెరసి గత వారం డోజోన్స్ 1 శాతం, ఎస్అండ్పీ దాదాపు 2 చొప్పున బలపడగా.. నాస్డాక్ మరింత అధికంగా 4 శాతం జంప్‌చేసింది. 1500 డాలర్లకు గత నెలలో కార్ల విక్రయాలు ఊపందుకోవడంతో ఆటో దిగ్గజం టెస్లా ఇంక్ జోరు కొనసాగుతోంది. వారాంతాన 7 శాతం జంప్‌చేసి 1503 డాలర్ల వద్ద ముగిసింది. తద్వారా కంపెనీ చరిత్రలో తొలిసారి 1500 డాలర్ల మార్క్‌ను తాకింది. ఈ ఏడాది(2020)లో ఇప్పటివరకూ టెస్లా షేరు 259 శాతం ర్యాలీ చేయగా.. ఈ నెలలోనే 39 శాతం లాభపడటం విశేషం! ఇక వచ్చే వారం క్యూ2 ఫలితాలు విడుదల చేయనున్న బ్యాంకింగ్ దిగ్గజాలు సిటీగ్రూప్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, జేపీ మోర్గాన్ చేజ్ 6.5-5.5 శాతం మధ్య జంప్‌చేశాయి. ఇతర బ్లూచిప్స్‌లో గోల్డ్‌మన్ శాక్స్ టార్గెట్ ధరను పెంచడంతో నెట్‌ఫ్లిక్స్ 8 శాతం దూసుకెళ్లింది. దశలవారీగా తిరిగి కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు వెల్లడించడంతో క్రూయిజ్‌ల కంపెనీ కార్నివాల్ కార్ప్ దాదాపు 11 శాతం పురోగమించింది. ఈ బాటలో యునైటెడ్, డెల్టా, అమెరికన్ ఎయిర్‌లైన్స్ కౌంటర్లు సైతం 5.5 శాతం చొప్పున ఎగశాయి. ఫార్మా ప్లస్ కోవిడ్-19 రోగులపై క్లినికల్ పరీక్షలలో రెమ్‌డెసివిర్ మరింత ప్రభావం చూపుతున్న వార్తలతో గిలియడ్ సైన్సెస్ షేరు 2.2 శాతం లాభపడింది. డిసెంబర్‌కల్లా కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్ సిద్ధంకావచ్చని వెల్లడించిన నేపథ్యంలో బయోఎన్‌టెక్ షేరు దాదాపు 5 శాతం జంప్‌చేసింది. -
1987-1999 తదుపరి బెస్ట్ క్వార్టర్
లాక్‌డవున్‌లకు మంగళం పాడుతున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా పుంజుకుంటుందన్న అంచనాలు యూఎస్ మార్కెట్లకు జోష్‌నిస్తున్నాయి. దీంతో వరుసగా రెండో రోజు మార్కెట్లు ఊపందుకున్నాయి. డోజోన్స్ 217 పాయింట్లు(0.85 శాతం) బలపడి 25,813 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 47 పాయింట్లు(1.55 శాతం) ఎగసి 3,100 వద్ద ముగిసింది. నాస్డాక్ మరింత అధికంగా 185 పాయింట్లు(1.9 శాతం) పురోగమించి 10,059 వద్ద స్థిరపడింది. అయితే ఫ్లోరిడా, కనెక్టికట్ తదితర ప్రాంతాలలో రెండో దశ కరోనా కేసులు తలెత్తుతున్న వార్తలతో ఇన్వెస్టర్లలో అంతర్గతంగా ఆందోళనలున్నట్లు మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికితోడు కోవిడ్-19 కారణంగా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర సవాళ్లు ఎదురవుతున్నట్లు మంగళవారం ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమీ పావెల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిటీ ముందు పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాగా.. అటు వైట్‌హౌస్, ఇటు ఫెడరల్ రిజర్వ్ భారీ సహాయక ప్యాకేజీలను అమలు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తున్నట్లు తెలియజేశారు. 33 ఏళ్ల తరువాత ఈ ఏడాది(2020) రెండోత్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో ఎస్అండ్పీ.. 20 శాతం ర్యాలీ చేసింది. తద్వారా 1998 జూన్ క్వార్టర్ తరువాత భారీగా పురోగమించింది. అయితే 2008 తొలి క్వార్టర్ తదుపరి ఈ జనవరి-మార్చిలో 20 శాతం పతనంకావడం గమనార్హం! ఇక క్యూ2(ఏప్రిల్-జూన్)లో డోజోన్స్ సైతం నికరంగా 18 శాతం ఎగసింది. తద్వారా 1987 తొలి క్వార్టర్ తదుపరి అత్యధిక లాభాలు ఆర్జించింది. 1987లో డోజోన్స్ 21 శాతం పుంజుకుంది. ఈ బాటలో రెండో క్వార్టర్లో నాస్డాక్ 31 శాతం జంప్‌చేసింది. వెరసి 1999 నాలుగో త్రైమాసికం తదుపరి మళ్లీ జోరందుకుంది. 1999లో నాస్డాక్ ఏకంగా 48 శాతం దూసుకెళ్లింది. బోయింగ్ వెనకడుగు 737 మ్యాక్స్ విమానాలకు గ్రీన్‌సిగ్నల్ లభించడంతో సోమవారం 15 శాతం దూసుకెళ్లిన బోయింగ్ ఇంక్ తాజాగా 6 శాతం పతనైంది. నార్వేజియన్ ఎయిర్ 97 విమానాల ఆర్డర్‌ను రద్దు చేసుకోవడం ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే ఈ అంశంపై నష్టపరిహారం కోరనున్నట్లు బోయింగ్ పేర్కొంది. ఇతర కౌంటర్లలో మైక్రాన్ టెక్నాలజీ 5 శాతం జంప్‌చేసింది. పవర్ నోట్‌బుక్స్, డేటా సెంటర్ల నుంచి చిప్‌లకు డిమాండ్ పెరగడంతో మైక్రాన్‌కు డిమాండ్ పెరిగింది. ఫుడ్ డెలివరీ యాప్ పోస్ట్మేట్స్ను కొనుగోలు చేయనున్న వార్తలతో ఉబర్ షేరు 5 శాతం పెరిగింది. -
యూఎస్ మార్కెట్లకు బ్యాంకింగ్ షాక్
స్ట్రెస్ టెస్ట్ నేపథ్యంలో నాలుగో త్రైమాసికం ముగిసేటంతవరకూ అధిక డివిడెండ్లు, షేర్ల బైబ్యాక్‌లను చేపట్టవద్దంటూ బ్యాంకులకు తాజాగా ఫెడరల్ రిజర్వ్ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర బ్యాంకు ఆదేశాల కారణంగా వారాంతాన బ్యాంకింగ్ కౌంటర్లు డీలా పడ్డాయి. ప్రధానంగా గోల్డ్‌మన్ శాక్స్ 8.6 శాతం, జేపీ మోర్గాన్ 5.5 శాతం, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ 4.5 శాతం చొప్పున వెనకడుగు వేశాయి. దీనికితోడు తిరిగి కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం అమెరికా స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. ఫ్లోరిడా, కరోలినా, ఆరిజోనా తదితర రాష్ట్రాలలో కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో మరోసారి లాక్‌డవున్ ఆవశ్యకత ఏర్పడవచ్చన్న ఆందోళనలు ఇన్వెస్టర్లలో తలెత్తాయి. ఫలితంగా అమ్మకాలు ఊపందుకున్నాయి. డోజోన్స్ 730 పాయింట్లు(2.8 శాతం) పడిపోయి 25,016 వద్ద నిలవగా..ఎస్అండ్పీ 75 పాయింట్ల(2.4 శాతం) వెనకడుగుతో 3,009 వద్ద స్థిరపడింది. నాస్డాక్ సైతం 260 పాయింట్లు(2.6 శాతం) పతనమై 9,757 వద్ద ముగిసింది. యూరోపియన్ మార్కెట్లలో జర్మనీ 0.7 శాతం నష్టపోగా.. ఫ్రాన్స్ 0.2 శాతం నీరసించింది, యూకే మాత్రం 0.2 శాతం బలపడింది. ఇక ఆసియాలో జపాన్, కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్, ఇండొనేసియా 1-0.2 శాతం మధ్య పుంజుకోగా..హాంకాంగ్ 1 శాతం క్షీణించింది. చైనా, తైవాన్ మార్కెట్లకు సెలవు. 3.3 శాతం డీలా గత వారం డోజోన్స్ నికరంగా 3.3 శాతం పడిపోగా.. ఎస్అండ్పీ దాదాపు 3 శాతం తిరోగమించింది. నాస్డాక్ సైతం 2 శాతం క్షీణించింది. ఎఫ్ఎంసీజీ దిగ్గజం యూనిలీవర్, టెలికం బ్లూచిప్ వెరిజాన్.. ప్రకటనలను నిలిపివేసేందుకు నిర్ణయించడంతో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ 8.5 శాతం పతనమైంది. హేట్ స్పీచ్‌ల కట్టడికి చర్యలు తీసుకోకపోవడంపై ఫేస్‌బుక్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్లు ఈ రెండు కంపెనీలూ పేర్కొన్నాయి. ఇతర కౌంటర్లలో ట్విటర్‌తోపాటు స్పోర్ట్స్‌వేర్ దిగ్గజం నైక్, కీకార్ప్ కౌంటర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో 9-5.5 శాతం మధ్య ఈ కౌంటర్లు కుప్పకూలాయి. కాగా.. రిటైలింగ్ కంపెనీ గ్యాప్ ఇంక్ 19 శాతం దూసుకెళ్లగా.. ఐటీ దిగ్గజం సిస్కో సిస్టమ్స్ 2.4 శాతం ఎగసింది. నేలచూపుల్లో అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన దేశీ స్టాక్స్ (ఏడీఆర్)లో వారాంతాన అత్యధిక శాతం నష్టాలతో ముగిశాయి. టాటా మోటార్స్(టీటీఎం) 5 శాతం పతనమై 6.6 డాలర్ల వద్ద నిలవగా.. ఐసీఐసీఐ బ్యాంక్(ఐబీఎన్) 3.5 శాతం క్షీణించి 9.05 డాలర్ల వద్ద స్థిరపడింది, వేదాంతా(వీఈడీఎల్) 3.8 శాతం నష్టంతో 5.77 డాలర్లను తాకగా.. డాక్టర్ రెడ్డీస్ 2 శాతం బలహీనపడి 52.19 డాలర్లకు చేరింది. ఇతర కౌంటర్లలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్(హెచ్డీబీ) 1.23 శాతం నీరసించి 45.09 డాలర్ల వద్ద స్థిరపడగా.. ఇన్ఫోసిస్ 2.6 శాతం జంప్‌చేసి 9.53 డాలర్ల వద్ద ముగిసింది. ఇక విప్రో లిమిటెడ్ 0.3 శాతం బలపడి 3.27 డాలర్ల వద్ద నిలిచింది. -
యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ రికార్డ్స్
ప్రధానంగా టెక్ దిగ్గజాలు అండగా నిలుస్తుండటంతో నాస్డాక్ సరికొత్త రికార్డులను సాధిస్తోంది. మంగళవారం ఫాంగ్(FAANG) స్టాక్స్ బలపడటంతో 75 పాయింట్లు(0.75 శాతం) పుంజుకుని 10,131 వద్ద ముగిసింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. గత 18 ట్రేడింగ్ సెషన్లలో 16సార్లు లాభాలతో నిలిచింది. ఇంతక్రితం 1999లో మాత్రమే ఈ ఫీట్ సాధించింది. ఈ ఏడాది ఇప్పటివరకూ నాస్డాక్ 21వసారి రికార్డ్ గరిష్టాన్ని సాధించడం విశేషం! ఇక డోజోన్స్ 130 పాయింట్లు(0.5 శాతం) ఎగసి 26,156 వద్ద స్థిరపడగా.. ఎస్అండ్పీ 13 పాయింట్లు(0.45 శాతం) బలపడి 3,131 వద్ద ముగిసింది. ఎస్అండ్పీ ఏప్రిల్ నుంచి ఇప్పటివరకూ 20 శాతం ర్యాలీ చేసింది. మే నెలలో గృహ విక్రయాలు దాదాపు 17 శాతం ఎగసి 6.76 లక్షలను తాకాయి. విశ్లేషకులు 6.4 లక్షల అమ్మకాలను అంచనా వేశారు. దీంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించినట్లు నిపుణులు పేర్కొన్నారు. రికార్డుల బాట.. ఐఫోన్ల దిగ్గజం యాపిల్ 2.15 శాతం లాభంతో 366 డాలర్లను అధిగమించగా.. అమెజాన్ 2 శాతం పుంజుకుని 2764 డాలర్లను దాటింది. ఇక మైక్రోసాఫ్ట్ కార్ప్ 1.35 శాతం వృద్ధితో 202 డాలర్లకు చేరింది. నెట్‌ఫ్లిక్స్ తొలుత 474 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకినప్పటికీ తదుపరి 466 డాలర్లకు నీరసించింది. తద్వారా యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, నెట్‌ఫ్లిక్స్ సరికొత్త గరిష్టాలను అందుకోగా.. ఫేస్బుక్, అల్ఫాబెట్ సైతం 0.7 శాతం చొప్పున బలపడటం గమనార్హం. బేయర్ అప్ కోవిడ్-19 చికిత్సకు వినియోగించగల ఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ తయారీలో సనోఫీ పాస్టెర్తో భాగస్వామ్యం కదుర్చుకున్నట్లు వెల్లడించడంతో థెరప్యూటిక్స్ కంపెనీ ట్రాన్స్‌లేట్ బయో కౌంటర్ ఏకంగా 47 శాతం దూసుకెళ్లింది. మోన్శాంటో కొనుగోలు తదుపరి వీడ్‌కిల్లర్ ప్రొడక్ట్‌పై తలెత్తిన సమస్యకు 8-10 బిలియన్ డాలర్లతో సెటిల్మెంట్ కుదుర్చుకోనున్న వార్తలతో బేయర్ ఏజీ 5 శాతం జంప్‌చేసింది. కాగా.. ఇతర కౌంటర్లలో బయోన్టెక్, అమెరికన్ ఎయిర్‌లైన్స్, వన్‌లైఫ్, క్లియర్ వే తదితరాలు 8-5 శాతం మధ్య పతనమయ్యాయి. -
యాపిల్ స్టోర్స్ బంద్- డోజోన్స్ డౌన్
మరోసారి కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం అమెరికా స్టాక్ మార్కెట్లు ఊగిసలాటకు లోనయ్యాయి. హెచ్చుతగ్గుల మధ్య అటూఇటుగా ముగిశాయి. డోజోన్స్ 209 పాయింట్లు(0.8 శాతం) క్షీణించి 25,871కు చేరగా..ఎస్అండ్పీ 18 పాయింట్లు(0.6 శాతం) వెనకడుగుతో 3,098 వద్ద స్థిరపడింది. అయితే నాస్డాక్ 3 పాయింట్ల నామమాత్ర లాభంతో 9,9436 వద్ద స్థిరపడింది. యూరోపియన్ మార్కెట్లలో జర్మనీ, ఫ్రాన్స్, యూకే 0.4-1 శాతం మధ్య బలపడ్డాయి. ఇక ఆసియాలో చైనా, హాంకాంగ్, జపాన్, కొరియా, ఇండొనేసియా 1-0.4 శాతం మధ్య పుంజుకోగా.. సింగపూర్ 1.2 శాతం, థాయ్‌లాండ్ 0.2 శాతం మధ్య బలహీనపడ్డాయి. తైవాన్ యథాతథంగా ముగిసింది. నాస్డాక్ జోరు గత వారం డోజోన్స్ నికరంగా 1 శాతం లాభపడగా.. ఎస్అండ్పీ దాదాపు 2 శాతం ఎగసింది. టెక్ దిగ్గజాల అండతో నాస్డాక్ మరింత అధికంగా 3.7 శాతం జంప్‌చేసింది. కాగా.. ఫిబ్రవరిలో సాధించిన చరిత్రాత్మక గరిష్టాలకు డోజోన్స్ 8.5 శాతం, ఎస్అండ్పీ 12.5 శాతం దూరంలో నిలవగా.. నాస్డాక్ 1.3 శాతం సమీపంలో ముగిసింది. యాపిల్ స్టోర్లు బంద్ ఇటీవల ఫ్లోరిడా, ఆరిజోనా, ఉత్తర, దక్షిణ కరోలినాలలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా కొన్ని ప్రాంతాలలో స్టోర్లను మూసివేస్తున్నట్లు ఐఫోన్ల దిగ్గజం యాపిల్ ఇంక్ పేర్కొంది. దీంతో యాపిల్ షేరు స్వల్పంగా 0.5 శాతం నీరసించింది. కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్న ఆందోళనలతో థియేటర్ల నిర్వాహక సంస్థ ఏఎంసీ ఎంటర్టైన్మెంట్ హోల్డింగ్స్ 2 శాతం క్షీణించింది. ఈ ఆందోళనలతో క్రూయిజర్ కంపెనీలు నార్వేజియన్, కార్నివాల్ 5 శాతం చొప్పున పతనంకాగా.. రాయల్ కరిబ్బియన్స్ 7 శాతం జారింది. ఈ బాటలో రిటైల్ దిగ్గజాలు, వియానయాన కంపెనీలు నార్డ్‌స్ట్రామ్, కోల్స్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్, డెల్టా 6-4 శాతం మధ్య తిరోగమించాయి. బ్యాంక్స్ ప్లస్ అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన దేశీ స్టాక్స్ (ఏడీఆర్)లో వారాంతాన అత్యధిక శాతం లాభాలతో ముగిశాయి. టాటా మోటార్స్(టీటీఎం)3.5 శాతం జంప్‌చేసి 6.6 డాలర్ల వద్ద నిలవగా.. ఐసీఐసీఐ బ్యాంక్(ఐబీఎన్) 2.5 శాతం ఎగసి 9.47 డాలర్ల వద్ద స్థిరపడింది, హెచ్డీఎఫ్సీ బ్యాంక్(హెచ్డీబీ) 2.15 శాతం పుంజుకుని 44.69 డాలర్లను తాకగా.. వేదాంతా(వీఈడీఎల్) 3.7 శాతం పతనమై 5.44 డాలర్ల వద్ద ముగిసింది. ఇతర కౌంటర్లలో విప్రో లిమిటెడ్ 1.2 శాతం నీరసించి 3.3 డాలర్లకు చేరగా.. ఇన్ఫోసిస్ 0.7 శాతం వెనకడుగుతో 9.16 డాలర్ల వద్ద స్థిరపడింది. ఈ బాటలో డాక్టర్ రెడ్డీస్ 0.2 శాతం బలహీనపడి 53.18 డాలర్ల వద్ద నిలిచింది. -
కుప్పకూలిన యూఎస్ మార్కెట్లు
పాలసీ సమీక్షలో భాగంగా అమెరికా కేంద్ర బ్యాంకు.. ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది దేశ జీడీపీ 6.5 శాతం క్షీణించవచ్చని అంచనా వేసింది. నిరుద్యోగ రేటు 9.3 శాతానికి పెరిగే వీలున్నట్లు పేర్కొంది. దీంతో ఒక్కసారిగా సెంటిమెంటుకు షాక్ తగిలింది. వెరసి గురువారం యూఎస్ మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. డోజోన్స్ 1862 పాయింట్లు(7 శాతం) కుప్పకూలి 25,128 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 188 పాయింట్లు(6 శాతం) పడిపోయి 3,002 వద్ద ముగిసింది. నాస్డాక్ సైతం 528 పాయింట్లు(5.3 శాతం) క్షీణించి 9,493 వద్ద స్థిరపడింది. తద్వారా మార్కెట్లు ఏప్రిల్ 16 తదుపరి ఒకే రోజులో అత్యధిక నష్టాలు చవిచూశాయి. కాగా.. యూరోపియన్ మార్కెట్లు సైతం గురువారం 4.5 శాతం స్థాయిలో పతనంకావడం గమనార్హం! మరోసారి లాక్‌డవున్ ఇప్పటికే 20 లక్షల మందికిపైగా సోకిన కరోనా వైరస్ మరోసారి విజృంభించవచ్చన్న అంచనాలు ఇటీవల తలెత్తుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫలితంగా మరోసారి లాక్‌డవున్ విధించవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చని కొంతమంది ఆర్థికవేత్తలు భావిస్తున్నట్లు తెలియజేశారు. దీనికితోడు అమెరికా జీడీపీ తీవ్ర మాంద్య పరిస్థితులను ఎదుర్కోనున్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమైనట్లు వివరించారు. కోవిడ్-19 కారణంగా సెప్టెంబర్‌కల్లా మరణాల సంఖ్య 2 లక్షలను దాటవచ్చన్న అంచనాలు సైతం సెంటిమెంటును దెబ్బతీసినట్లు పేర్కొన్నారు. బోయింగ్ పతనం వైమానిక రంగ దిగ్గజం బోయింగ్ ఇంక్ షేరు దాదాపు 17 శాతం కుప్పకూలగా.. క్రూయిజర్, ఎయిర్‌లైన్ కంపెనీల కౌంటర్లలో గురువారం మళ్లీ అమ్మకాలు ఊపందుకున్నాయి. రాయల్ కరిబ్బియన్, ఎస్పీ కామెయిర్ 14 శాతం చొప్పున పతనంకాగా.. నార్వేజియన్ క్రూయిజ్ లైన్ 16.5 శాతం పడిపోయింది. ఇతర బ్లూచిప్స్‌లో డోఇంక్, ఐబీఎం, గోల్డ్‌మన్ శాక్స్, కేటర్పిల్లర్, ఎక్సాన్ మొబిల్, జేపీ మోర్గాన్, సిస్కో, ఫైజర్, వాల్ట్‌డిస్నీ, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, నైక్, ఇంటెల్, కోక కోలా, మెర్క్, మైక్రోసాఫ్ట్, యాపిల్, జాన్సన్ అండ్ జాన్సన్ తదితరాలు 10-5 శాతం మధ్య పతనమయ్యాయంటే అమ్మకాల తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. -
కోవిడ్-19లోనూ కొత్త శిఖరానికి నాస్డాక్
లక్షల సంఖ్యలో ప్రజలకు కోవిడ్-19 ఆరోగ్య సమస్యలు సృష్టిస్తున్నప్పటికీ అమెరికా స్టాక్ ఇండెక్స్ నాస్డాక్ గురువారం సరికొత్త రికార్డును అందుకుంది. తొలుత 9,716ను అధిగమించడం ద్వారా ఈ ఫీట్‌ను సాధించింది. అయితే నిరుద్యోగ గణాంకాలు, వచ్చే వారం ఫెడరల్ రిజర్వ్ సమావేశాల నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో చివర్లో వెనకడుగు వేసింది. వెరసి 11 పాయింట్లు(0.7 శాతం) క్షీణించి 9,616 వద్ద ముగిసింది. ఇక డోజోన్స్ 11 పాయింట్లు(0.1 శాతం) బలపడి 26,282 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 42 పాయింట్లు(0.3 శాతం) నీరసించి 3,112 వద్ద స్థిరపడింది. గత వారం అంచనాలకంటే అధికంగా 1.85 మిలియన్లమంది నిరుద్యోగ భృతికి క్లెయిమ్ చేసుకున్నట్లు వెలువడిన వార్తలు కొంతమేర సెంటిమెంటును బలహీనపరచినట్లు నిపుణులు పేర్కొన్నారు. బౌన్స్‌బ్యాక్ ఇలా కరోనా వైరస్ భయాలతో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 23కల్లా 30 శాతం పతనమైన నాస్డాక్ ఇండెక్స్ ఆపై వేగంగా రికవర్అయ్యింది. ఫలితంగా కనిష్టాల నుంచి 43 శాతం ర్యాలీ చేసింది. వెరసి గురువారం ఇంట్రాడేలో చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. ఇందుకు అమెజాన్, పెప్సీకో, కాస్ట్కో, పేపాల్ తదితర కౌంటర్లు సహకరించినట్లు నిపుణులు పేర్కొన్నారు. మార్చి కనిష్టం నుంచి అమెజాన్ 30 శాతం, పెప్సీకో 24 శాతం చొప్పున జంప్‌చేయగా.. కాస్ట్కో 8 శాతం బలపడింది. పేపాల్ 81 శాతం ర్యాలీ చేసింది. కాగా.. రికార్డ్ గరిష్టాలకు ఎస్అండ్పీ, డోజోన్స్ 8-11 శాతం దూరంలో నిలవడం గమనార్హం! ఈసీబీ దన్ను ఆర్థికవేత్తలు అంచనా వేసినట్లుగానే యూరోపియన్ కేంద్ర బ్యాంకు(ఈసీబీ) సహాయక ప్యాకేజీను రెట్టింపునకు పెంచింది. 1.35 ట్రిలియన్ యూరోలతో బాండ్ల కొనుగోలు ద్వారా వ్యవస్థలోకి భారీగా నిధులను పంప్చేసేందుకు నిర్ణయించింది. తొలుత ఇందుకు 600 బిలియన్ యూరోలను మాత్రమే కేటాయించింది. 2021 జూన్‌వరకూ కొత్త ప్యాకేజీ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 96 స్థాయికి బలహీనపడగా.. యూరో 1.135కు బలపడింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ జూమ్ జులై నుంచి విమాన సర్వీసులను 55 శాతం పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించడంతో అమెరికన్ ఎయిర్‌లైన్స్ షేరు ఏకంగా 41 శాతం దూసుకెళ్లింది. ఇతర కౌంటర్లలో ఈబే ఇంక్ 6.3 శాతం జంప్‌చేయగా.. చార్లెస్ స్క్వాబ్ 5.5 శాతం, టీడీ అమెరిట్రేడ్ 9 శాతం చొప్పున ఎగశాయి. టీడీ కొనుగోలుకి చార్లెస్‌కు గ్రీన్‌సిగ్నల్ లభించడం ప్రభావం చూపింది. కాగా.. గురువారం ఫేస్బుక్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, అల్ఫాబెట్, యాపిల్ 1.6-0.6 శాతం మధ్య బలహీనపడటంతో మార్కెట్లు వెనకడుగు వేసినట్లు నిపుణులు తెలియజేశారు. ఇతర మార్కెట్లు గరువారం యూరోపియన్ మార్కెట్లలో యూకే, జర్మనీ, ఫ్రాన్స్ 0.6-0.2 శాతం మధ్య నీరసించగా.. ప్రస్తుతం ఆసియాలో సింగపూర్, తైవాన్, కొరియా 0.6 శాతం చొప్పున ఎగశాయి. ఇండొనేసియా 0.5 శాతం నష్టపోయింది. థాయ్‌లాండ్, హాంకాంగ్ నామమాత్ర లాభాలతో, చైనా యథాతథంగా కదులుతున్నాయి. -
నాస్డాక్ అప్- విప్రో ఏడీఆర్ జూమ్
కరోనా వైరస్‌కు కారణమైన చైనాను విమర్శిస్తున్న ప్రెసిడెంట్ ట్రంప్ తాజా ప్రెస్మీట్లో వాయిస్ తగ్గించడంతో ఇన్వెస్టర్లు ఊపిరి పీల్చుకున్నారు. వెరసి వారాంతాన అమెరికా స్టాక్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య అటూఇటుగా ముగిశాయి. ఇంట్రాడేలో 25,032 వద్ద కనిష్టాన్ని తాకిన డోజోన్స్ చివరికి 18 పాయింట్లు(0.1 శాతం) నీరసించి 25,383 వద్ద నిలిచింది. ఇక ఎస్అండ్పీ15 పాయింట్లు(0.5 శాతం) బలపడి 3,044 వద్ద స్థిరపడింది. అయితే నాస్డాక్ 121 పాయింట్లు(1.3 శాతం) జంప్‌చేసి 9,490 వద్ద ముగిసింది. కోవిడ్-19 కట్టడికి అమలు చేస్తున్న లాక్‌డవున్‌ను దశలవారీగా ఎత్తివేస్తున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకోనుందన్న అంచనాలు ఇటీవల మార్కెట్లకు జోష్‌నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ 3 శాతం, జేపీ మోర్గాన్ 2.5 శాతం చొప్పున క్షీణించడంతో శుక్రవారం డోజోన్స్ బలహీనపడగా.. సెమీకండక్టర్ తయారీ కంపెనీలు మార్వెల్ టెక్నాలజీస్ 9 శాతం, ఎన్విడియా 4.6 శాతం చొప్పున జంప్‌చేయడంతో నాస్డాక్ జోరందుకుంది. డోజోన్స్ భళా గత వారం డోజోన్స్ 3.8 శాతం లాభపడగా.. ఎస్అండ్పీ సైతం 3 శాతం ఎగసింది. నాస్డాక్ దాదాపు 2 శాతం పుంజుకుంది. ఈ నెలలో ఎస్అండ్పీ, డోజోన్స్ 4.5 శాతం స్థాయిలో జంప్‌చేయగా.. నాస్డాక్ మరింత అధికంగా 6.7 శాతం ఎగసింది. కాగా.. ఏప్రిల్‌లో వ్యక్తిగత వ్యయాలు 13.6 శాతం క్షీణించగా.. పొదుపు రేటు 33 శాతం ఎగసినట్లు గణాంకాలు వెల్లడించాయి. ట్రంప్ ఇలా వైట్‌హౌస్‌కు చెందిన రోజ్‌గార్డెన్‌లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన ట్రంప్ ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)తో తెగతెంపులు చేసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఈ సంస్థ పూర్తిగా చైనా నియంత్రణలో పనిచేస్తున్నదని విమర్శించారు. యూఎస్‌లో లిస్టయిన చైనా కంపెనీలు ఖాతాలను విభిన్నంగా నిర్వహించడంపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. హాంకాంగ్‌కు ఇస్తున్న ప్రత్యేక వాణిజ్య హోదాను రద్దు చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే చైనాతో వాణిజ్య వివాదాల జోలికి వెళ్లకపోవడం గమనార్హం. వేదాంతా అప్ అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన దేశీ స్టాక్స్ (ఏడీఆర్)లో వారాంతాన అత్యధిక శాతం లాభాలతో ముగిశాయి. అయితే టాటా మోటార్స్(టీటీఎం) 0.7 శాతం నష్టంతో 5.71 డాలర్ల వద్ద నిలిచింది. కొత్త సీఈవో ఎంపికతో విప్రో లిమిటెడ్ 8.2 శాతం దూసుకెళ్లి 3.31 డాలర్లను తాకగా.. డాక్టర్ రెడ్డీస్ 4 శాతం జంప్‌చేసి 53.44 డాలర్లకు చేరింది. ఈ బాటలో ఐసీఐసీఐ బ్యాంక్(ఐబీఎన్) 2.6 శాతం ఎగసి 8.7 డాలర్ల వద్ద, వేదాంతా(వీఈడీఎల్) 1.9 శాతం బలపడి 4.88 డాలర్ల వద్ద ముగిశాయి. ఇతర కౌంటర్లలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్(హెచ్డీబీ) 1.8 శాతం ఎగసి 41.83 డాలర్ల వద్ద నిలవగా.. ఇన్ఫోసిస్ 0.4 శాతం పుంజుకుని 9.10 డాలర్ల వద్ద స్థిరపడింది. -
బ్యాంకింగ్ దన్ను- డోజోన్స్‌కు జోష్
ప్రధానంగా బ్యాంకింగ్ స్టాక్స్‌కు డిమాండ్ పెరగడం, ఆర్థిక వ్యవస్థ పుంజుకోనుందన్న అంచనాలు బుధవారం యూఎస్ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. దీంతో డోజోన్స్ 553 పాయింట్లు(2.2 శాతం) జంప్‌చేసి 25,548 వద్ద ముగిసింది. ఎస్అండ్పీ ఇండెక్స్ 44 పాయింట్లు(1.5 శాతం) బలపడి 3,036 వద్ద నిలవగా.. నాస్డాక్ 72 పాయింట్లు(0.8 శాతం) పుంజుకుని 9,412 వద్ద స్థిరపడింది. మార్చి 5 తదుపరి ఎస్అండ్పీ 3,000 పాయింట్ల ఎగువన ముగియడం గమనార్హం! పలు రాష్ట్రాలలో లాక్‌డవున్ ఎత్తివేస్తున్న కారణంగా ఆర్థిక వ్యవస్థ తిరిగి పట్టాలెక్కనున్న అంచనాలు పెరిగినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు ఇటీవల కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్ అభివృద్ధిలో పలు కంపెనీలు ముందడుగు వేయడం కూడా సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు తెలియజేశారు. అయితే చైనాతో వాణిజ్య వివాదాలు ఇన్వెస్టర్లలో అంతర్గతంగా ఆందోళనలకు కారణమవుతున్నట్లు వివరించారు. జేపీ మోర్గాన్ ప్లస్ బ్యాంకింగ్ దిగ్గజాలలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్, గోల్డ్‌మన్ శాక్స్ 7 శాతం చొప్పున దూసుకెళ్లగా.. జేపీ మోర్గాన్ చేజ్ దాదాపు 6 శాతం జంప్‌చేసింది. రెండో క్వార్టర్లో క్రెడిట్ రిజర్వ్‌లను పెంచుకోనున్నట్లు బ్యాంక్ సీఈవో జేమీ డైమన్ పేర్కొనడంతో వరుసగా రెండో రోజు ఈ కౌంటర్ జోరందుకుంది. ఈ బాటలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్, గోల్డ్‌మన్ శాక్స్ సైతం పుంజుకోవడంతో బ్యాంకింగ్ ఇండెక్స్ రెండు రోజుల్లో 10 శాతం ఎగసింది. కాగా.. లాక్‌డవున్ ఎత్తివేయడంతో ఫ్లోరిడాలోని డిస్నీ వరల్డ్ థీమ్ పార్క్‌ను జులై 11 నుంచి దశల వారీగా ప్రారంభించనున్నట్లు వాల్ట్ డిస్నీ వెల్లడించింది. ఈ బాటలో లాస్‌వెగాస్‌లోని నాలుగు క్యాసినోలను జూన్ 4 నుంచీ తిరిగి తెరవనున్ననట్లు ఎంజీఎం రిసార్ట్స్ పేర్కొంది. దీంతో ఈ షేరు 2.6 శాతం పుంజుకుంది. ఎస్అండ్పీ ఇండెక్స్‌లో 7 షేర్లు 52 వారాల గరిష్టాలను తాకగా.. నాస్డాక్ కంపెనీలలో 41 కొత్త గరిష్టాలను అందుకున్నాయి. అయితే మరో 10 కంపెనీలు కొత్త కనిష్టాలకు చేరాయి. ఇతర కౌంటర్లూ లాక్‌డవున్ ఎత్తివేస్తున్న నేపథ్యంలో ఇటీవల అమ్మకాలతో దెబ్బతిన్న కౌంటర్లకు డిమాండ్ కనిపిస్తోంది. క్రూయిజ్ నిర్వాహక కంపెనీ కార్నివాల్ కార్ప్ 6 శాతం జంప్‌చేయగా.. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ 4 శాతం పుంజుకుంది. జీఈ లైటింగ్ బిజినెస్ విక్రయ నేపథ్యంలో జనరల్ ఎలక్ట్రిక్ 7 శాతం పెరిగింది. హెచ్‌బీవో మ్యాక్స్ సర్వీసులను ప్రారంభించడంతో ఏటీఅండ్‌టీ 4 శాతం ఎగసింది. ట్రాక్టర్ల కంపెనీ టీఎస్సీవో 8 శాతం జంప్‌చేయగా.. ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో ట్విటర్ మాత్రం 3 శాతం పతనమైంది. -
అమెరికా మార్కెట్లు ఢమాల్ : ట్రేడింగ్ నిలిపివేత
కోవిడ్-19 (కరోనా వైరస్) గ్లోబల్ మార్కెట్లను పట్టి పీడిస్తున్నాయి. తాజాగా అమెరికా మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజ్, ఎస్ అండ్ పీ 500 7 శాతం, నాస్డాక్ కంపోజిట్ 7.1 శాతం కుప్పకూలింది. బెంచ్ మార్క్ డౌజోన్స్ ఇండస్ట్రీయిల్ యావరేజ్ 2000 పాయింట్లకు పైగా (7.8శాతం) నష్టపోయింది. భారీ నష్టాల నేపథ్యంలో న్యూయార్క్ మార్కెట్ ట్రేడింగ్‌ను నిలిపివేశారు. 2008 ఆర్థిక సంక్షోభం తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఇదే అదిపెద్ద పతనంగా నిపుణులు తెలిపారు.15 నిమిషాలు పాటు ట్రేడింగ్ నిలిపివేయడంమంటేనే అమ్మకాల సెగ ఏ స్థాయిలో వుందో అంచనా వేయవచ్చు. 15 నిమిషాల తరువాత ట్రేడింగ్ తిరిగి ప్రారంభమైనా భారీ నష్టాలుకొనసాగుతున్నాయి. అటు చమురు ధరలు రికార్డు కనిష్టానికి చేరడంతో సోమవారం ఆసియా మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఇంట్రాడేలో 2450 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ చివరికి 1942 నష్టంతో ముగిసింది. జపాన్ నిక్కీ 225 సూచీ 5శాతం, క్షీణించగా, ఆస్ట్రేలియా మార్కెట్లు 7.3 శాతం కుప్పకూలాయి. చైనాలో, షాంఘై కాంపోజిట్ బెంచ్ మార్క్ 3శాతం, పడిపోగా, హాంగ్ సెంగ్ ఇండెక్స్ 4.2 శాతం క్షీణించింది. దీంతో మహా పతనంగా, బ్లాక్ మండేగా విశ్లేషకులు అభివర్ణించారు. వైరస్ భయాలకు తోడు సౌదీ అరేబియా, రష్యా ట్రేడ్ వార్ కారణంగా చమురు ధర సోమవారం దాదాపు 30 శాతం క్షీణించి 31.14 డాలర్లకు చేరుకుంది. ఇది 1991లో గల్ఫ్ యుద్ధం ప్రారంభం తరువాత ఇదే అతిపెద్ద సింగిల్-డే పతనం. ఇంతటి పతనాన్ని ఇటీవలి కాలంలోచూడలేదని సెవెన్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సహ వ్యవస్థాపకుడు జస్టిన్ ఉర్క్హార్ట్-స్టీవర్ట్ వ్యాఖ్యానించారు. చదవండి : రిలయన్స్‌కు చమురు షాక్ కోవిడ్‌కు ‘చమురు’ ఆజ్యం, మార్కెట్ కుదేలు -
ప్రపంచ పరిణామాలు కీలకం..!
న్యూఢిల్లీ: అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) వడ్డీ రేట్లను పావు శాతం పెంచడం, ప్రభుత్వ షట్‌డౌన్ వంటి ప్రతికూల పరిణామాలు గతవారంలో అంతర్జాతీయ మార్కెట్లను కుంగదీశాయి. డౌజోన్స్ ఇండస్ట్రీయల్ యావరేజ్ గతవారంలో 1,655 పాయింట్లు (6.8 శాతం) పతనంకాగా, నాస్డాక్ 8.3 శాతం మేర పడిపోయింది. ఈ నేపథ్యంలో దేశీ సూచీలు సైతం భారీ పతనాన్ని నమోదుచేశాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో నిఫ్టీ 198 పాయింట్లు నష్టపోయి 10,754 వద్ద ముగిసింది. 10,800 మార్కును కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఈవారం ప్రధాన సూచీలు ఏ దిశగా ప్రయాణం చేస్తాయనే అంశంపై మార్కెట్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వ పాలన మరోసారి పాక్షికంగా స్తంభించడం.. అక్కడి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించకుండా, మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం వెల్లడికాకుండానే కాంగ్రెస్ వాయి దా పడడం వంటి ప్రతికూలతలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసే విధంగా ఉన్నట్లు దలాల్ స్ట్రీట్ పండితులు చెబుతున్నారు. వృద్ధి రేటు మందగించవచ్చని కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పోవెల్ చేసిన వ్యాఖ్యలు, ట్రంప్‌కు కాంగ్రెస్‌కు మధ్య కొనసాగుతున్న విభేదాలు, అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలు కనిపించకపోవడం వంటి ప్రతికూలతలు ఈవారంలో ప్రభావం చూపనున్నట్లు భావిస్తున్నారు. ఇక గురువారం వెల్లడికానున్న నవంబర్ నెల గృహ నిర్మాణ, అమ్మకాల సమాచారం మరో కీలక అంశంగా ఉందని చెబుతున్నారు. కాగా, 25న(మంగళవారం) క్రిస్మస్ సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవు. సానుకూలంగా దేశీ పరిణామాలు అంతర్జాతీయ పరిణామాలు పూర్తి ప్రతికూలంగా ఉన్నప్పటికీ.. దేశీయంగా మాత్రం సానుకూల అంశాలు కొనసాగుతున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ అన్నారు. ‘ముడిచమురు ధరలు గతవారం 11 శాతం పతనం కావడం వల్ల కరెంట్ ఖాతా లోటు భారాన్ని తగ్గిస్తుంది. పారిశ్రామికోత్పత్తి ఊపందుకుంది. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచకుండా ఉండేందుకు సహకరిస్తోంది. ఈ పరిణామాలతో ఆర్బీఐ సైతం కఠిన వైఖరి నుంచి తటస్థ వైఖరికి మారింది. ఈ అంశాలు సూచీలకు సానుకూలంగా ఉన్నాయి.’ అని వ్యాఖ్యానించారు. క్రిస్మస్ కానుక కింద మధ్య తరగతి ప్రజలు వినియోగించే 23 వస్తు, సేవలపై పన్నును జీఎస్టీ మండలి తగ్గించడం మరో పాజిటివ్ అంశమన్నారాయన. అయితే, మరోవైపు డిసెంబర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఈ గురువారం ముగియనున్న కారణంగా అధిక ఒడిదుడుకులకు ఆస్కారం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 10,550 వద్ద కీలక మద్దతు.. ఈవారంలో నిఫ్టీకి 10,550 పాయింట్ల వద్ద కీలక మద్దతు స్థాయి ఉందని ప్రభుదాస్ లీలాధర్ టెక్నికల్ విశ్లేషకులు వైశాలి పరేఖ్ అన్నారు. ఈసూచీ కీలక నిరోధం 10,930 పాయింట్ల వద్ద ఉందని విశ్లేషించారు. ఎఫ్‌పీఐల నికర పెట్టుబడి రూ.4,000 కోట్లు డిసెంబర్ 3–21 మధ్యకాలంలో ఎఫ్‌పీఐలు రూ.3,884 కోట్లను నికరంగా పెట్టుబడి పెట్టినట్లు డిపాజిటరీల సమాచారం ద్వారా వెల్లడైంది. రూ.1,332 కోట్లను ఈక్విటీలో నికరంగా ఇన్వెస్ట్‌చేసిన వీరు రూ.2,552 కోట్లను డెట్ మార్కెట్లో పెట్టుబడిపెట్టినట్లు డేటా ద్వారా వెల్లడైంది. ముడి ధరలు తగ్గడం, డాలరుతో రూపాయి మారకం విలువ బలపడిన కారణంగా విదేశీ నిధుల ప్రవాహం పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలు ఇదే విధంగా కొనసాగితే, ఏడాది చివర్లో ఎఫ్‌పీఐ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.