Employees State Insurance (ESI)
-
ఇక అన్ని జిల్లాల్లోనూ ఈఎస్ఐ సేవలు
న్యూఢిల్లీ: దేశంలో ఇకపై అన్ని జిల్లాల్లోనూ ఈఎస్ఐ సేవలు లభించనున్నాయి. భారత్‌లోని 735 జిల్లాల్లోనూ ఏప్రిల్ 1నుంచి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ఇన్సూర్డ్ పర్సన్స్‌కు వైద్యసేవలు అందుబాటులోకి తీసుకొని రానున్నట్లు అధికారులు బుధవారం తెలిపారు. ప్రస్తుతం ఈ సేవలు కేవలం 387 జిల్లాల్లో మాత్రమే పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండగా, మరో 187 జిల్లాల్లో పాక్షికంగా అందుబాటులో ఉన్నాయి. 161 జిల్లాల్లో మాత్రం అసలు ఈ సేవలే ఉండటం లేదు. ఈ నేపథ్యంలో ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా కేంద్రం ఈ సేవల ఏర్పాటుకు ముందడుగు వేసింది. దీనికి సంబంధించిన బిల్లుల ప్రక్రియను ఎసిక్ స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. -
పితాని మాజీ పీఎస్ సస్పెన్షన్..
సాక్షి, అమరావతి: ఈఎస్ఐ స్కామ్‌లో అరెస్టయిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ పీఎస్ మురళీమోహన్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. మందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ పీఎస్ మురళీమోహన్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. (మాజీమంత్రి పితాని పాత్రపైనా ఆరా) టీడీపీ హయాంలో జరిగిన ఈఎస్ఐ భారీ స్కామ్‌లో అప్పటి కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ పాత్ర ఎంత అనే దానిపైనా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆరా తీస్తోంది. కార్మిక శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు తర్వాత పితాని ఆ శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. టీడీపీ పాలనలో ఈఎస్ఐలో 988.77కోట్ల నిధులు ఖర్చుపెట్టారు. వీటిలో టెలీ హెల్త్ సర్వీసెస్, మందులు, ఫర్నీచర్, వైద్య సామాగ్రి కొనుగోళ్లతోపాటు అనేక లావాదేవీలు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయి. వీటిలో రూ.150 కోట్లకు పైగా అవినీతి, అక్రమాలు జరిగాయని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిగ్గు తేల్చింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఏసీబీ ఈ కుంభకోణంలో 19 మంది ప్రమేయం ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించి.. ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేసింది. -
మాజీ మంత్రి పితాని కుమారుడికి హైకోర్టు షాక్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణం కేసులో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు వెంకట సురేష్ సహా మరో ఇద్దరి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు సోమవారం తిరస్కరించింది. ఏ క్షణమైనా అరెస్టు చేస్తారనే భయంతో పితాని కుమారుడు వెంకట సురేష్, పితాని మాజీ పీఎస్ మురళీమోహన్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కాగా సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న మురళీమోహన్ను శుక్రవారం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.. (చక్రం తిప్పిన పితాని కుమారుడు?) తెలుగుదేశం ప్రభుత్వ హయంలో అచ్చెన్నాయుడు తర్వాత పితాని సత్యనారాయణ కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. అచ్చెన్నాయుడు హయాంలో మందుల కొనుగోలు, పరికరాల కొనుగోలులో పెద్ద ఎత్తున స్కాం జరిగింది. ఆ స్కాం పితాని సత్యనారాయణ హయాంలోనూ కొనసాగింది. పితాని మంత్రిగా ఉన్న సమయంలో కార్మికశాఖలో ఏ పని జరగాలన్నా మంత్రి కుమారుడు వెంకట్ కనుసన్నల్లోనే జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. ఏ కాంట్రాక్టు కావాలన్నా వెంకట్‌ను కలిసి పది శాతం చెల్లిస్తేనే పనులు జరిగినట్లుగా ప్రచారం జరిగింది. తమ పనుల కోసం కాంట్రాక్టర్లు పితాని స్వగ్రామం కొమ్ముచిక్కాలకు క్యూ కట్టేవారు. పితాని వెంకట్ చీటీపై టెండర్లు ఎవరికి కేటాయించాలో రాసిచ్చేవారని, దాని ఆధారంగానే పనులు జరిగేవని తెలుస్తోంది. -
చక్రం తిప్పిన పితాని కుమారుడు?
సాక్షి ప్రతినిధి, ఏలూరు(పశ్చిమగోదావరి): రాష్ట్రంలో ప్రకంపనలు పుట్టించిన ఈఎస్ఐ స్కాం మూలాలు జిల్లాలో బయటపడుతున్నాయి. తాజాగా ఈ కేసులో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పీఎస్ మురళీమోహన్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేయడం కలకలం రేపింది. పితాని కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుమారుడు ఈ వ్యవహారంలోచక్రం తిప్పినట్లు ఏసీబీ ఆధారాలు సంపాదించింది. ఏ క్షణమైనా అరెస్టు చేస్తారనే భయంతో పితాని కుమారుడు వెంకట్, పితాని పీఎస్ మురళీమోహన్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కాగా సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న మురళీమోహన్ను శుక్రవారం ఏసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 10 శాతం కమీషన్ చెల్లిస్తేనే పనులు? తెలుగుదేశం ప్రభుత్వ హయంలో అచ్చెన్నాయుడు తర్వాత పితాని సత్యనారాయణ కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. అచ్చెన్నాయుడు హయాంలో మందుల కొనుగోలు, పరికరాల కొనుగోలులో పెద్ద ఎత్తున స్కాం జరిగింది. ఆ స్కాం పితాని సత్యనారాయణ హయాంలోనూ కొనసాగింది. పితాని మంత్రిగా ఉన్న సమయంలో కార్మికశాఖలో ఏ పనిజరగాలన్నా మంత్రి కుమారుడు వెంకట్ కనుసన్నల్లోనే జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. ఏ కాంట్రాక్టు కావాలన్నా వెంకట్‌ను కలిసి పది శాతం చెల్లిస్తేనే పనులు జరిగినట్లుగా ప్రచారం జరిగింది. తమ పనుల కోసం కాంట్రాక్టర్లు పితాని స్వగ్రామం కొమ్ముచిక్కాలకు క్యూ కట్టేవారు. పితాని వెంకట్ చీటీపై టెండర్లు ఎవరికి కేటాయించాలో రాసిచ్చేవారని, దాని ఆధారంగానే పనులు జరిగేవని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మంత్రి పీఎస్ కూడా కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి ఆధారాలు సంపాదించిన ఏసీబీ పితాని పీఎస్ మురళీమోహన్ను శుక్రవారం అదుపులోకి తీసుకుంది. మురళీమోహన్ సచివాలయంలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. (ఎందుకు దాస్తున్నారు?) -
ఈఎస్ఐ స్కాంలో మరొకరి అరెస్ట్
-
ఈఎస్ఐ స్కాంలో మరొకరి అరెస్ట్
సాక్షి, విజయవాడ : ఈఎస్ఐ స్కాంలో ఏసీబీ తమ విచారణను మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెనాయుడు సహా పది మంది ఈ కేసులో అరెస్టైన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం ఏసీబీ అధికారులు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ వద్ద పీఎస్‌గా పనిచేసిన మురళీ మోహన్ అనే వ్యక్తిని సచివాలయంలో అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అచ్చెనాయుడు తర్వాత పితాని సత్యనారాయణ కార్మిక శాఖ మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం అధికారుల అదుపులో ఉన్న మురళీ మోహన్ ప్రస్తుతం సచివాలయంలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలలో విధులు నిర్వహిస్తున్నారు. ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టయి జైల్లో ఉన్న టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడితో సహా నిందితులందరి బెయిలు పిటిషన్లను కొట్టివేస్తూ ఏసీబీ కోర్టు గత శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. (అచ్చెన్నాయుడు లేఖతో సంబంధం లేదు) -
కార్మిక శాఖలో ప్రక్షాళన ప్రారంభమయ్యింది
-
అచ్చెన్న లీలలు ఇన్నన్ని కావయా...
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఈఎస్ఐలో మందులు, పరికరాల కొనుగోళ్ల స్కామ్ గురించి ఇప్పుడు రాష్ట్రమంతా గగ్గోలు పెడుతున్నారు.. దానిని మించిన ఎన్నో కుంభకోణాలు శ్రీకాకుళం జిల్లావాసులకు తెలుసు.. అచ్చెన్నాయుడు కన్నేస్తే కోట్లాది రూపాయలు హాంఫట్ కావలసిందే. ఆయన అవినీతికి రాగద్వేషాలు లేవు. అయ్యో పాపం కార్మికులని గానీ.. తిత్లీ తుపానులో తన జిల్లావాసులు సర్వం కోల్పోయారని గానీ ఆయనకు బాధ ఉండదు. ఎక్కడ దొరికితే అక్కడ స్వాహా చేయడమే ఆయన తత్వం. నీరు చెట్టు పథకం పేరుతో కోట్లు కొల్లగొట్టిన అనుభవాలు గానీ.. తిత్లీ తుఫాన్ పరిహారం పంపిణీలో అన్యాయమైపోయిన సామాన్యుల కన్నీటి గాథలు గానీ ఇవే చెబుతున్నాయి. ఈ రెండింటిలోనూ వందల కోట్ల అవినీతి జరిగింది. వీటిపై సమగ్ర విచారణ చేపడితే మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడితో పాటు ఎమ్మెల్యే బెందాళం అశోక్, నాటి టీడీపీ ఎమ్మెల్యేల బాగోతమంతా బయటపడుతుంది. ‘తిత్లీ‘ని మించిన ఉపద్రవం తిత్లీ తుఫాన్ సమయంలో గ్రామాల వారీగా కాగితాల్లో పంచేసుకుని పరిహారాన్ని కొట్టేశారు. గ్రామాల్లో ఉన్న భూములను తమకింత అని చూపించుకుని, ఫలానా చెట్లు పడిపోయాయని చెప్పి తిత్లీ పరిహారాన్ని నొక్కేశారు. ఏదో ఒక సర్వే నెంబర్‌తో భూమిని చూపించి, నచ్చినంత సంఖ్యలో చెట్లు పడిపోయినట్టు నమోదు చేయించుకుని కోట్లాది రూపాయల పరిహారాన్ని మింగేశారు. అచ్చెన్నాయుడు, అశోక్‌ల అడుగు జాడల్లో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు కూడా పరిహారాన్ని పట్టేశారు. నేతల కుటుంబసభ్యుల పేరున ఎటువంటి భూములు లేనప్పటికీ వారి పేరున నష్టపరిహారాన్ని లక్షల రూపాయల్లో అందుకొన్నారు. ఇవన్నీ అప్పట్లోనే వెలుగు చూశాయి. కాకపోతే వారి పార్టీ అధికారంలో ఉండటంతో విచారణ జోలికి పోలేదు. ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం రావడం, అక్రమాలపై లిఖితపూర్వక ఫిర్యాదులు రావడం, వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిహారాన్ని పెంచడంతో అక్రమాల డొంక కదిలింది. కాకపోతే, తిత్లీ తుఫాను పరిహారాన్ని అప్పనంగా కాజేసిన తెలుగు తమ్ముళ్లు దర్యాప్తులో బయటపడకుండా ఉండేందుకు వ్యూహాత్మక ఎత్తుగడలు వేశారు. భూముల్లేకపోయినప్పటికీ పరిహారం పొందిన వారు మ్యూటేషన్ చేయించి, పట్టాదారు పాసు పస్తకాలను తయారు చేయించారు. కంచిలి, కవిటి మండలాల్లో ఎక్కువగా ఈ రకమైన అక్రమాలు జరిగాయి. ఉదాహరణలివి.. ►కవిటి రెవెన్యూ ప్రగడపుట్టుగకు చెందిన బి.సంహిత పేరిట రూ.1,03,500 తిత్లీ తుఫాన్ నష్టపరిహారాల మంజూరులో పరిహారం నమోదైంది. ఒక సర్వే నెంబరులో 3.93 ఎకరాల భూమి ఉన్నట్టు జాబితాలో నమోదు చేశారు. వాస్తవానికి రెవెన్యూ రికార్డులలో ఈ భూమి యజమాని పేరు ప్రసాదరావుగా ఉంది. ►కవిటి రెవెన్యూలో డొంకపుట్టుగకు చెందిన మరో ఆసామీ డి.వల్లభరావుకు తిత్లీ తుఫాన్‌కు సంబంధించి కొబ్బరి నష్టపరిహారం రూ.1,56,000 అందించేందుకు జాబితాలో పేర్కొన్నారు. ఆయన పేరున 4.35 ఎకరాల భూమి ఉన్నట్టుగా పరిహారాల జాబితాలో చూపించారు. వాస్తవానికి ఆయనకు 0.34 సెంట్లు భూమి మాత్రమే ఉంది. ►ఎర్రగోవిందపుట్టుగలో నివసిస్తున్న రమణమూర్తికి తిత్లీ తుఫాన్లో తనకున్న 4.86 ఎకరాల భూమి నష్టపోయిందని జాబితాలో ప్రకటించారు. అయితే ఈ సర్వే నెంబరులో ఇతనికి రెవెన్యూ రికార్డుల ప్రకారం 1.36 ఎకరాలు మాత్రమే ఉందని రికార్డులు చెబుతున్నాయి. వేలాది మంది ఇదే రకంగా పరిహారాన్ని కొట్టేశారు. జిల్లా లో 52,164మంది కొబ్బరి రైతులు, 78,108మంది జీడి రైతులు తిత్లీ భీభత్సానికి నష్టపోయినట్టుగా పరిహారం జాబితాల్లో చూపించారు. ఎన్నికలకు ముందు దాదాపు రూ.297 కోట్ల వరకు పరిహారం కింద అందించారు. ఈ లెక్కన అనర్హులకు ఎన్ని కోట్లు వెళ్లాయో వారికే తెలియాలి. భూముల్లేని టీడీపీ సానుభూతి పరులకు భూములున్నట్టుగా చూపించి, తక్కువ భూమి ఉన్న టీడీపీ శ్రేణులకు ఎక్కువ భూమి ఉన్నట్టుగా నమోదు చేసి, పల్లం భూమిని మెట్ట భూమిగా నమోదు చేసి, పంచాయతీకి చెందని వ్యక్తులను స్థానికంగా చూపించి అప్పట్లో పరిహారం జాబితాలు తయారు చేశారు. నీరు చెట్టు.. అవినీతికి మెట్టు నీరు చెట్టు పనులైతే అవినీతి ఊట బావిలా పనికొచ్చాయి. రూ.5 లక్షల విలువ కన్నా ఎక్కువగా ఉండే పనుల కాంట్రాక్ట్‌లను తమ అనుయాయులకు నామినేటెడ్ పద్ధతిలో కట్టబెట్టారు. జిల్లాలో రూ.427.24 కోట్ల విలువైన 5696 పనుల్లో అత్యధికం అలా దక్కించుకున్నవే. వీటిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. పనులు సక్రమంగా సాగలేదు. మట్టి తవ్వకాల కింద క్యూబిక్ మీటర్‌కు రూ.29కు గాను రూ.82.80 చెల్లించారు. చెరువు గట్లపై మట్టిని గట్టి పరచకుండా, ఉన్న దాని కంటే అధికంగా నమోదు చేసి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు. నిబంధనల ప్రకారం 50 ఎకరాలు ఆయకట్టు పైబడిన చెరువుల్లో మాత్రమే నీరు చెట్టు పనులు చేపట్టాలి. కానీ అందుకు భిన్నంగా 50 ఎకరాలు కంటే తక్కువ ఉన్న చెరువుల్లో కూడా పనులు నిధులు దురి్వనియోగం చేశారు. గెడ్డ లేదా వాగు నీటి ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, ఎటువంటి డిజైన్ లేకుండా చెక్‌డ్యామ్‌లను నిర్మించారు. నాసిరకంగా కాంక్రీటు పనులు చేపట్టారు. 10 హెచ్ నిబంధనలకు విరుద్ధంగా మట్టి పని చేపట్టి లబి్ధపొందారు. తక్కువ కొలతలు కలిగిన రాళ్లను ఉపయోగించి గ్రోయిన్లను నిర్మించారు. ఇలా నీరుచెట్టులో అనేక అక్రమాలకు పాల్పడ్డారు. అచ్చెన్నాయుడి అక్రమ సంపాదనపై సీఎంకు లేఖ టెక్కలి: మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన అక్రమాలు, అవినీతి కార్యకలాపాలపై ఆధారాలతో సహా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేఖ అందజేస్తున్నామని వైఎస్సార్ సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ అన్నారు. సోమవారం టెక్కలి వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. కార్మిక శాఖ మంత్రిగా వ్యవహరించిన అచ్చెన్నాయుడు బినామీ కంపెనీల పేర్లతో ఈఎస్ఐ మందులు, కాస్మొటిక్స్ కొనుగోలులో రూ.975 కోట్ల అవినీతికి పాల్పడినట్లు విజిలెన్స్ దర్యాప్తులో వెల్లడైందన్నారు. గత ఐదేళ్ల కాలంలో జిల్లాలో గ్రానైట్, ఇసుక కుంభకోణాలు, బీసీ కార్పొరేషన్ రుణాల్లో అక్రమాలు, సింగిల్ టెండర్ విధానంతో సొంత అన్నకు టెండర్లు కట్టబెట్టడం, ధాన్యం రవాణాకు వచ్చిన కోట్లాది రూపాయలు సొంత ఖాతాలకు మళ్లించుకోవడం, మినుముల కుంభకోణంతో కోట్ల రూపాయలు సొంత ఖాతాలకు మళ్లించుకోవడం, టెక్కలిలో సింగిల్ టెండర్ విధానంతో తన బినామీ లాడి శ్రీనివాసరావుకు ఆర్టీసీ టెండర్లు కట్టబెట్టడం, కేశినేని, దివాకర్ ట్రావెల్స్‌కు అడ్డగోలుగా రవాణా లైసెన్సులు జారీ చేయడంతోపాటు వేలాది కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడిన అచ్చెన్నాయుడు ఈ రోజు నీతివంతుడిలా మాట్లాడాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేవలం 2 ఎకరాలు కలిగిన కింజరాపు కుటుంబ సభ్యులైన ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడు, హరిప్రసాద్, ప్రభాకర్‌కు ఈ రోజు వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని తిలక్ ప్రశ్నించారు. కింజరాపు కుటుంబ సభ్యుల అక్రమ ఆస్తులను ఆధారాలతో సహా బహిర్గతం చేయడానికి మార్చి 2న టెక్కలి అంబేడ్కర్ జంక్షన్ వద్ద బహిరంగ చర్చా వేదిక నిర్వహిస్తామని...అచ్చెన్నాయుడుకు దమ్ముంటే చర్చా వేదికకు వచ్చి తన నిజాయితీ నిరూపించుకోవాలని తిలక్ సవాల్ విసిరారు. -
ఆ మాజీ మంత్రుల ఆస్తులు జప్తు చేయాలి..
సాక్షి, విశాఖపట్నం: ఈఎస్ఐ ముందుల కొనుగోలు కుంభకోణంపై నిరసలు వెల్లువెత్తుతున్నాయి. కోట్ల రూపాయల స్కాం కి పాల్పడిన టీడీపీ మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణలపై చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. డొల్ల కంపెనీలు, నకిలీ బిల్లులతో జరిగిన కోట్ల రూపాయల అవినీతిపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుణదల ఈఎస్ఐ ఆసుపత్రి వద్ద సోమవారం సీఐటీయూ ఆందోళన చేపట్టింది. అక్రమార్కులు దోచుకున్న ప్రజాధనాన్ని రికవరీ చేయాలని సీఐటీయూ నేతలు డిమాండ్ చేశారు. అవినీతికి పాల్పడిన మాజీ మంత్రులు, చేతులు కలిపిన అధికారులను కూడా శిక్షించాలని పెద్ద ఎత్తున నినాదాల చేశారు. (ఈఎస్ఐ స్కామ్ : తవ్వేకొద్దీ బయటపడుతున్నభారీ అక్రమాలు) మాజీ మంత్రుల ఆస్తులు జప్తు చేసైనా కార్మికులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే గఫుర్ డిమాండ్ చేశారు. అవినీతికి పాల్పడి తప్పించుకునేందుకు బీసీ కార్డు వాడటం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. కార్మికుల్లో కూడా బీసీలు ఉన్నారన్నారు. కార్మిక శాఖకు బీసీలే మంత్రులుగా ఉంటారని.. అక్రమాలకు పాల్పడితే బీసీ మంత్రులని వదిలేయాలా అని ప్రశ్నించారు. టీడీపీ వాదన వింటుంటే విస్మయం కలుగుతోందని మాజీ ఎమ్మెల్యే గఫుర్ అన్నారు. -
వారికి శిక్ష తప్పదు..!
సాక్షి, విజయవాడ: ఈఎస్ఐ కుంభకోణం తమ దృష్టికి వచ్చిందని జాతీయ లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ జయప్రకాష్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈఎస్ఐలో జరిగిన అవినీతిని కేంద్ర కార్మిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు బృందంతో విచారణ జరపాలని కేంద్రమంత్రిని కోరతామని చెప్పారు. ఈఎస్ఐ అవినీతికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. అచ్చెన్నాయుడు ప్రధాని పేరును వాడుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈఎస్ఐలో ఎన్నో అవకతవకలు జరిగినట్లు సమాచారం ఉందని వెల్లడించారు. తెలంగాణలో అవినీతికి పాల్పడిన కంపెనీలే ఏపీలో కూడా అవినీతికి పాల్పడ్డాయని చెప్పారు. అవినీతి పాల్పడిన వారికి శిక్ష తప్పదని జయప్రకాష్ స్పష్టం చేశారు. (ఈఎస్ఐ స్కామ్ : తవ్వేకొద్దీ బయటపడుతున్నభారీ అక్రమాలు) -
అచ్చెనాయుడు వందలకోట్లు దోచుకున్నారు
-
ఈఎస్ఐ స్కామ్ తవ్వేకొద్ది అక్రమాలు
-
ఆ మాజీ మంత్రులు తప్పించుకోలేరు..!
సాక్షి, పోడూరు: ఈఎస్ఐ స్కాం లో టీడీపీ నేతలు జైలుకి వెళ్లడం ఖాయమని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం తూర్పుపాలెం వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. దోపిడీకి పాల్పడిన టీడీపీ నేతలు తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్ని కుట్రలు, రాజకీయాలు చేసినా టీడీపీ మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణలు.. అవినీతి విచారణ నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు. ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కీలక పాత్ర పోషించారని చెప్పారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తన కుమారుడి చేత కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.(ఆయనకు భయం పట్టుకుంది అందుకే..!) ఈఎస్ఐ స్కాం లో చంద్రబాబుకు కూడా వాటా ఉందని మంత్రి శ్రీరంగనాథ రాజు ఆరోపించారు. కార్మికుల్లో అధిక శాతం బీసీలే ఉంటారని అలాంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్మికులను టీడీపీ నేతలు దోచుకున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు డబ్బున్న బీసీలను మంత్రులను చేస్తే.. వైఎస్ జగన్ పేద బీసీలను మంత్రులను చేశారని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా 60 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు వైఎస్ జగన్ తన కేబినెట్లో అవకాశం కల్పించారని మంత్రి శ్రీరంగనాథ రాజు పేర్కొన్నారు. (ఈఎస్ఐ స్కామ్ : తవ్వేకొద్దీ బయటపడుతున్నభారీ అక్రమాలు) -
ఈఎస్ఐ స్కామ్ : బయటపడుతున్నభారీ అక్రమాలు
సాక్షి, విజయవాడ : వందల కోట్లు నొక్కేసిన ఈఎస్ఐ స్కామ్‌లో తవ్వుతున్న కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. ల్యాబ్ కిట్ల పేరుతో భారీ దోపిడీ జరిగినట్టు అధికారులు గుర్తించారు. మూడు కంపెనీలతో కుమ్మక్కైన గత మంత్రులు.. 237 కోట్ల ల్యాబ్ కిట్లు నామినేషన్ పద్ధతిలో కొనుగోళ్లు చేసినట్టు బట్టబయలయింది. ఓమ్నీ మెడి, అవెంతార్, లెజెండ్ కంపెనీలకు ల్యాబ్ కిట్ల కాంట్రాక్టులు ఇచ్చి.. 85 కోట్లు దోపిడీ చేసినట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. రూ. 90 విలువైన ర్యాపిడ్ టెస్ట్ కిట్‌కు రూ.190 చెల్లించారు. 25 రూపాయల థైరాయిడ్(1ఎంజీ) కిట్‌కి రూ.93 పెట్టి కొనుగోలు చేశారు. రూ.155 ధరగల షుగర్ టెస్ట్ కిట్‌కి రూ.330 చెల్లించారు. (చదవండి : ఏపీ ఈఎస్ఐలో భారీ కుంభకోణం) రూ.11 గ్లూకోజ్ ఎనలైజర్ స్ట్రిప్ రూ 62 కి కొనుగోలు చేశారు. సోడియం,పొటాషియం ఎలక్ట్రోల్ ధరలను భారీగా పెంచేసి రూ.44వేలు చొప్పును చెల్లింపులు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ సొమ్మంతా లెజెండ్ ,ఓమ్నీ మెడి, అవెంతార్‌లకే ధారాదత్తం చేసినట్లు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఓ నివేదిక విడుదల చేసింది. (చదవండి : కేసు నమోదవడం ఖాయం: ఎస్పీ వెంకట్‌రెడ్డి) ఆస్పత్రులకు వెళ్లకుండానే పలు బిల్లులు చెల్లించారు. సర్టిఫికేట్లు లేకుండానే బిల్లులపై డైరెక్టర్లు సంతకం చేశారు. రూ.85 కోట్లను మూడు కంపెనీలు కొల్లగొట్టాయని విజిలెన్స్ అధికారులు తేల్చిచెప్పారు. కరికి హెయిర్ ఆయిల్ పేరుతోనూ కోట్లు మింగేశారు. అవసరంలేని గ్లేన్‌మార్క్ ఆయిల్‌ను అధికారులు కొనుగోళ్లు చేశారు. మూడు నెలల్లో ఎక్స్పైర్ అయ్యే వాటిని తెచ్చి స్టోర్స్‌లో ఉంచారు. ఎక్స్పైర్ అయిపోయే ఆయిల్స్ పేరుతో రూ.40 కోట్లకు పైగా అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. టీడీపీ నేతలు జైలుకు వెళ్లడం ఖాయం : శంకర్ నారాయణ చంద్రబాబు నాయుడు హయాంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని మంత్రి శంకర్ నారాయణ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాలో మాట్లాడుతూ.. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. ఈ విషయం బయటపడడంతో చంద్రబాబు అండ్ కో ఉలిక్కిపడుతోందని విమర్శించారు. టీడీపీ నేతల అవినీతి బయటపడడంతో ప్రభుత్వం బీసీలపై కక్షకట్టిందంటూ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీసీలను అన్ని విధాల ఆదుకుంటున్న ఏకైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని అన్నారు. చంద్రబాబు అవినీతిపై సిట్ వేయడంతో ఆయన గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. సిట్ విచారణలో టీడీపీ నేతల అవినీతి రుజువై జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రి శంకర్ నారాయణ అన్నారు. -
ఈఎస్ఐ స్కామ్ : తవ్వేకొద్దీ బయటపడుతున్నభారీ అక్రమాలు
-
మాజీ మంత్రి అచ్చెనాయుడు ప్రధాన నిందితుడు
-
కేసు నమోదవడం ఖాయం
-
అవినీతిపరులను కఠినంగా శిక్షించాలి
-
ఈఎస్ఐ స్కాంలో వారి పాత్ర: ఎస్పీ వెంకట్‌రెడ్డి
సాక్షి, తిరుపతి : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈఎస్ఐ కుంభకోణంలో ఇద్దరు మాజీ మంత్రులకు ప్రమేయం ఉన్నట్లు తమకు ఆధారాలు లభించాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ వెంకట్‌రెడ్డి తెలిపారు. మందుల కొనుగోళ్లు, ల్యాబ్ కిట్స్, బయోమెట్రిక్ మెషీన్లు, టెలీహెల్త్ సర్వీసెస్ అంశాలలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయని పేర్కొన్నారు. టెలీసర్వీసెస్‌కు చెందిన కాల్‌లిస్ట్ ఏపీది కాకుండా తెలంగాణాది ఇచ్చారని.. ఆ కాల్‌లిస్టును పరిశీలించగా బోగస్ అని తేలిందన్నారు. పేషెంట్స్ ఫోన్లు చేయకున్నా చేసినట్లు బిల్లులు చూపించారని తెలిపారు. ఎస్పీ వెంకట్‌రెడ్డి శనివారం మాట్లాడుతూ.. సీవరేజ్ ప్లాంట్లను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఆదోనిలోని ఆస్పత్రిని మార్చినా.. పాత ఆస్పత్రిలోని ప్లాంట్ పేరుతోనే బిల్లులు పొందారని తెలిపారు. ఇందుకు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సిఫారసు చేశారని పేర్కొన్నారు.(ఏపీ ఈఎస్ఐలో భారీ కుంభకోణం) ‘నకిలీ కొటేషన్స్ పెట్టి కాంటాక్ట్ దక్కించుకున్నారు. అనవసర మందులు కొన్నారు. వాటిని వినియోగించలేదు. చాలా ఆసుపత్రుల్లో డ్రగ్స్ గోడౌన్స్‌కే పరిమితమయ్యాయి. అవసరానికి మించి మందులు కొనుగోలు చేశారు. చెల్లింపుల్లో కూడా నిబంధనలు ఉల్లంఘించారు. అవినీతికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించి మొత్తం నివేదికను ప్రభుత్వానికి పంపించాం. మూడు నెలల పాటు విచారణ జరిపాం. గత ఐదు సంవత్సరాలలో కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయి. ఇందులో ముగ్గురు డైరెక్టర్లు కీలక పాత్ర పోషించారు. ఓ మాజీ మంత్రి కుమారుడి పాత్ర కూడా ఉంది. అక్రమాలకు పాల్పడ్డ వారి మీద క్రిమినల్ కేసుల నమోదుకు సిఫారసు చేశాం. వారిపై కేసులు నమోదు కావడం ఖాయం’’ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. బీసీ అయితే మాత్రం.. ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి అచ్చెంనాయుడు ప్రధాన నిందితుడని సీనియర్ న్యాయవాది పొనక జనార్ధన్‌రెడ్డి అన్నారు. 2016 నవంబరు 25న టెలీ హెల్త్ సర్వీసెస్ ప్రై లిమిటెడ్‌కు వర్క్ ఆర్డర్స్ జారీ చేశారని పేర్కొన్నారు. అధికారులను నిబంధనలు పాటించాలని చెప్పాల్సిన మంత్రి.. ఏకంగా ఏంఓయూ చేసుకోవాలని అదేశాలు జారీ చేయడం విడ్డూరం అన్నారు. ‘టెలీహెల్త్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవాలని అచ్చెంనాయుడు ఆదేశాలు జారీ చేశారు. కుంభకోణాలు చేసే వారికి కుల, లింగ, ప్రాంత విచక్షణలు ఉండవు. అచ్చెంనాయుడు బీసీ అయితే స్కాంపై విచారణ చేయకూడదా? జూన్ 2, 2014 నుంచి జరిగిన ప్రభుత్వ ఒప్పందాలన్నింటిపై సిట్ విచారణ పరిధిలోకి వస్తాయి’ అని పేర్కొన్నారు. -
ఆ మాజీ మంత్రులను వదిలిపెట్టం..!
సాక్షి, విజయవాడ: ఏపీలో ఈఎస్ఐ స్కాం కి పాల్పడిన మాజీ మంత్రులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అధికారులపై టీడీపీ మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణ ఒత్తిడి తెచ్చినందుకే ఈ కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు.. వారు అధికారులపై బెదిరింపు చర్యలకు పాల్పడ్డారన్నారు. అక్రమాలకు పాల్పడి తప్పించుకునేందుకు బీసీ కార్డు వాడుకోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.(ఏపీ ఈఎస్ఐలో భారీ కుంభకోణం) నెలకు రూ.75 లక్షలు దోచుకునే ఉద్దేశ్యంతోనే అచ్చెన్నాయుడు టెలి మెడిసిన్ కంపెనీకి సిఫారసు లేఖ ఇచ్చారని జయరాం ఆరోపించారు. ప్రధాని మెరుగైన సేవలందించాలని చెబుతారని.. కానీ స్కాములు చేయమని చెబుతారా అని ప్రశ్నిస్తూ.. టీడీపీ నేతల వాదన వింటుంటే నవ్విపోదురుగాక మాకేంటి సిగ్గు అన్న చందంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. మందుల్లేవని కార్మికులు, చెల్లించాల్సిన బకాయిలున్నాయని కంపెనీలు తన దృష్టికి తీసుకువచ్చాయని.. తన పరిశీలనలో వచ్చిన అనుమానాలతోనే విచారణకు ఆదేశించానని మంత్రి జయరాం పేర్కొన్నారు. ‘అందుకే ఆ కుంభకోణం బయటపడింది’ -
‘అందుకే ఆ కుంభకోణం బయటపడింది’
సాక్షి, విజయవాడ: ఈఎస్ఐ స్కాంలో తెలంగాణలో దోషులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో.. ఏపీలో కూడా అలాంటి చర్యలే తీసుకోవాలని బీజేపీ జాతీయ మైనార్టీ నేత షేక్ బాజీ డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టే.. ఈఎస్ఐ స్కాం బయటపడిందన్నారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ స్కాం మరుగున పడిపోయేదన్నారు. అచ్చెన్నాయుడు ప్రమేయంతోనే అవినీతి జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయని ఆయన పేర్కొన్నారు.('అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లడం ఖాయం' ) అధిక ధరలకు మందులు,యంత్ర పరికరాలు ఎందుకు కొనుగోలు చేశారో సమాధానం చెప్పాలన్నారు. ఈఎస్ఐ కుంభకోణంలో కూడా చంద్రబాబు పాత్రపై విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబుకు ఈఎస్ఐ స్కాం లో వాటాలు వెళ్లే ఉంటాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈఎస్ఐ కుంభకోణంపై కేంద్ర ప్రభుత్వం కూడా విచారణ చేపట్టాలని బాజీ కోరారు. (ఏపీ ఈఎస్ఐలో భారీ కుంభకోణం) -
‘అచ్చెన్నాయుడుని వెంటనే అరెస్టు చేయాలి’
సాక్షి, తాడేపల్లి : కార్మికుల పొట్ట కొట్టిన అచ్చెన్నాయుడును వెంటనే అరెస్ట్ చేయాలని వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి అన్నారు. ఈఎస్ఐ కుంభకోణానికి మాజీ కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐలో వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోపిడీకి గురైన సొమ్మునంతా అవినీతి పరుల నుంచి రప్పించాలని పేర్కొన్నారు. (చదవండి : ఏపీ ఈఎస్ఐలో భారీ కుంభకోణం) ‘మేము గతంలోనే చెప్పాం ఈఎస్ఐ హాస్పిటల్స్‌లో అవినీతి జరుగుతోందని, ఇప్పుడు విజిలెన్స్ నివేదిక ద్వారా అదే నిజమైంది. అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా టీడీపీ మారింది. మంత్రిగా అచ్చెన్నాయుడు ఒత్తిడి మేరకే మూడు కంపెనీలకు నామినేషన్ పద్దతిలో కాంట్రాక్టు ఇచ్చారు. తెలంగాణలో ఎలా కాంట్రాక్టు ఇచ్చారో ఇక్కడ కూడా ఏపీలో కూడా అలానే ఇచ్చామని అచ్చెన్నాయుడు అంటున్నారు. తెలంగాణలో తప్పు జరిగింది కాబట్టి ఇక్కడ కూడా తప్పు జరిగినట్లు ఒప్పుకున్నట్టే కదా’అని మంత్రి గౌతమ్‌రెడ్డి అన్నారు. బండారం బయటపడింది.. సాక్షి, శ్రీకాకుళం: ఈఎస్ఐలో కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పై కేసునమోదు చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి అన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇష్టానుసారం అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ‘టెండర్ ప్రక్రియ లేకుండా టెలీహెల్త్ సర్వీసెస్‌కు కాంట్రాక్టులు కట్టబెట్టారంటే ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డారో అర్థమవుతుంది. అచ్చెన్నాయుడుపై చర్యలు తీసుకొని మోసానికి పాల్పడ్డ సొమ్ము రికవరీ చేయాలి. ఎటువంటి నియమాలు పాటించకుండా రెండు వందలు విలువచేసే ఈసీజీ కి రూ.480 చెల్లించారంటేనే అచ్చెన్నాయుడు అవినీతి బండారం బయటపడింది’అని కృపారాణి అన్నారు. -
'అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లడం ఖాయం'
-
'అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లడం ఖాయం'
సాక్షి, విజయవాడ : చంద్రబాబు హయాంలో భారీ స్థాయిలో ఈఎస్ఐ కుంభకోణం జరిగిందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖమంత్రి గుమ్మనూరు జయరాం ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం కార్మికులను కూడా నిలువునా దోచుకుందని దుయ్యబట్టారు. ఈఎస్ఐలో భారీ కుంభకోణం వెలుగు చూసిన నేపథ్యంలో మంత్రి స్పందించారు. ఈఐఎస్‌లో కుంభకోణంలో అక్రమాలకు పాల్పడినవారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. అక్రమాలు చేసినవారిపై చర్యలు తీసుకోవడానికి విజిలెన్స్ విచారణకు ఆదేశించామన్నారు. (ఏపీ ఈఎస్ఐలో భారీ కుంభకోణం) మాజీమంత్రి అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడ్డారనడానికి ఆయన రాసిన లేఖ సాక్ష్యమని చెప్పారు. అవినీతిపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. అక్రమంగా చెల్లించిన బిల్లుల సొమ్మును రికవరీ చేస్తామని, ఈ వ్యవహారంలో అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. కేవలం మూడు సంస్థలతో కుమ్మక్కై దోపిడీ చేశారని, మందుల ధరలను భారీగా పెంచేసే దోపిడీ చేశారని మంత్రి జయరాం మండిపడ్డారు. (చదవండి: వేలానికి సుజనా చౌదరి ఆస్తులు) -
ఏపీ ఈఎస్ఐలో భారీ కుంభకోణం
సాక్షి, విజయవాడ : తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈఎస్ఐలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. గత ఆరేళ్లుగా ఈఎస్ఐలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగినట్లు విజిలెన్సు అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. కొనుగోళ్లలో రూ.900 కోట్లకు పైగా భారీ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఓ నివేదికను విడుదల చేసింది. ఆరేళ్లుగా కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను స్వాహా చేసినట్లు విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. నకిలీ కొటేషన్లు సృష్టించి రేట్ కాంట్రాక్టులో లేని సంస్థలనుంచి మందులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం రూ. 89 కోట్లు చెల్లిస్తే, అందులో రేట్ కాంట్రాక్ట్ లో ఉన్న సంస్థలకు 38 కోట్లు చెల్లించినట్టు గుర్తించారు. మిగతా రూ. 51 కోట్లను దారి మళ్లించి రేట్ కాంట్రాక్ట్ లేని సంస్థలకు వాస్తవ ధర కంటే 132 శాతం అధనంగా అమ్మినట్లు ఆరోపణలు వచ్చాయి. (ఈఎస్ఐ స్కాం: తవ్వేకొద్దీ దేవికారాణి అక్రమాలు) తెలంగాణ ఈఎస్ఐ స్కాంలో ముఖ్యపాత్ర పోషించిన సరఫరాదారులే ఈ స్కాంలో కూడా ఉన్నట్లు తేలింది. అప్పటి డైరెక్టర్లు రవి కుమార్, రమేష్ కుమార్, విజయ్ కుమార్ లోపాటు, ఆరుగురు జాయింట్ డైరెక్టర్లు, ఫార్మసిస్టులు, సీనియర్ అసిస్టెంట్లు ముఖ్యపాత్ర పోషించారని అధికారులు వెల్లడించారు. వీరితో పాటు అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పాత్రపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. తన వాళ్లకు చెందిన టెలీ హెల్త్ సర్వీసెస్ కంపెనీకి కాంట్రాక్ట్ అప్పగించాలని ఈఎస్ఐ డైరెక్టర్లకు లేఖ రాసినట్లు తెలిసింది. మంత్రి చొరవతోనే సదరు డైరెక్టర్లు రూ. 975 కోట్ల మందుల కొనుగోలు చేసి, అందులో 100 కోట్లకు పైగా నకిలీ బిల్లులను సృష్టించినట్లు ఆరోపణలున్నాయి. అయితే మందుల కొనుగోలుకు ప్రభుత్వం రూ. 293 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే, 698 కోట్ల రూపాయలకు మందులను కొనుగోలు చేసినట్లు ప్రభుత్వానికి చూపి ఖజానాకు 404 కోట్ల రూపాయలు నష్టం కలిగించారు. (దేవికారాణి ఆస్తుల చిట్టా విడుదల) ఈఎస్ఐ స్కాంకు పాల్పడిన లెజెండ్ ఎంటర్ప్రైజెస్, ఓమ్ని మెడీ, ఎన్వెంటర్ పర్ఫామెన్స్ సంస్థలకు సదరు డైరక్టర్లు లాబ్ కిట్ల కొనుగోలు పేరుతో 85 కోట్లు చెల్లించారు. 2018-19 సంవత్సరానికి 18 కోట్ల విలువైన మందులు కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో ఉంటే , అందులో కేవలం రూ. 8 కోట్లు మాత్రమే వాస్తవ ధరగా ప్రకటించి మిగతా నిధులు స్వాహా చేశారు. అంతేగాక మందుల కొనుగోలు, ల్యాబ్ కిట్లు ,ఫర్నిచర్, ఈసీజీ సర్వీసులు బయోమెట్రిక్ యంత్రాల కొనుగోలు లో భారీగా అక్రమాలు జరిగినట్టుగా కూడా గుర్తించారు. వాస్తవానికి ఒక్కో బయోమెట్రిక్ మిషన్ ధర రూ.16,000 అయితే ఏకంగా రూ. 70 వేల చొప్పున నకిలీ ఇండెంట్లు సృషించి అక్రమాలకు పాల్పడినట్లు నివేదికలో తేలింది. (హెచ్ఐవీ, డయాబెటిస్ కిట్లలో చేతివాటం)