European Film Festival
-
మానవ సంబంధాలు.. భావోద్వేగాలు
శ్రీనగర్‌కాలనీ: సినిమా అనేది సాధారణ ప్రజలకు అపురూపమైన ఎంటర్టైన్మెంట్. ఇది విజ్ఞానం, వినోదాల మేళవింపు. ఒక్కో భాషకు, ఒక్కో ప్రాంతానికి భిన్నమైన సంస్కృతీ సంప్రదాయాలు ఉంటాయి. ప్రపంచంలోని సినిమాలను చూసి పలు భిన్న కోణాలను తెలుసుకొవాలనే తపన సినీ అభిమానులకు ఉంటుంది. కానీ కొందరికి సినిమాలు చూసే ఓపిక, తీరికా ఉండదు. అంతేకాకుండా పలు చిత్రాలు సైతం చూడటానికి ఎక్కడా దొరకవు. ప్రపంచ సినిమాలను చూపిస్తూ, సినీ అభిమానుల మనోగతాన్ని తెలుసుకొని ఆ దిశగా హైదరాబాద్ ఫిలిం క్లబ్ పాటుపడుతోంది. విభిన్న సంస్కృతీ సంప్రదాయాలు, జీవన విధానంతో కూడిన యురోపియన్ దేశాల చిత్రాలు సినీప్రియుల మనసు దోచుకుంటున్నాయి. అమీర్‌పేటలోని సారథి స్టూడియోలో ది డెలిగేషన్ ఆఫ్ యురోపియన్ యూనియన్ టు ఇండియా– హైదరాబాద్ ఫిలిం క్లబ్– సారథి స్టూడియోస్ సంయుక్తాధ్వర్యంలో నిర్వహిస్తున్న యురోపియన్ దేశాల ఫిలిం ఫెస్టివల్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. యురోపియన్ చిత్రాల్లో భావోద్వేగాలు, మానవ సంబంధాలు, సుఖ దుఃఖాలు, కళాత్మక జీవనాన్ని, సృజనాత్మకతను ప్రస్తావిస్తూ వైవిధ్యమెన చిత్రాలను నిర్మించారు. ఇప్పటికీ ప్రపంచ సినిమాలో యురోపియన్ చిత్రాలను ప్రత్యేక స్థానం ఉంది. ఈ నెల 21న ప్రారంభమైన ఫిలిం ఫెస్టివల్ ఈ నెల 31 వరకు కొనసాగుతుంది. యురోపియన్ దేశాలకు చెందిన 22 చిత్రాలను ప్రదర్శించనున్నారు. విభిన్న జీవన విధానాలు.. సినీ అభిమానిగా యురోపియన్ ఫిలిం ఫెస్టివల్‌కు వచ్చాను. యురోపియన్ చిత్రాల ప్రదర్శించడం ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి ఫెస్టివల్స్‌తో సినిమాలపై పట్టు, అంతర్జాతీయ సంప్రదాయాలు, విజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. ఇలాంటి ఫిలిం ఫెస్టివల్స్ మరిన్ని రావాలి. హైదరాబాద్ ఫిలిం క్లబ్‌కు ప్రత్యేక అభినందనలు. కేవలం మనం, మన చుట్టుపక్కల గురించి తెలుసుకుంటే సరిపోదు. ప్రపంచంలోని భిన్నమతాలు, భిన్న సంస్కృతులు, జీవన విధానాలను తెలుసుకోవాలి. – శివబాబు తోట, నటుడు అనూహ్య స్పందన.. హైదరాబాద్ ఫిలిం క్లబ్– సారథి స్టూడియోస్ సంయుక్తాధ్వర్యంలో ప్రతి ఏడాది వివిధ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌ను ఘనంగా నిర్వహిస్తున్నాం. యురోపియన్ చిత్రాలకు ప్రపంచంలోనే ప్రత్యేక స్థానం ఉంది. ఫిలిం ఫెస్టివల్‌కు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. అకాడమీ అవార్డులు, విమర్శకుల ప్రశంశలు అందుకున్న చిత్రాలను ప్రదర్శిస్తున్నాం. భవిష్యత్‌లో తెలుగు ఫిలిం ఫెస్టివల్స్‌ను ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో నిర్వహిస్తాం. – ప్రకాష్‌రెడ్డి, క్లబ్ సెక్రటరీ -
యూరోపియన్ చిత్రం
‘ట్యూన్ ఇన్ టూది వాయిస్ ఆఫ్ యూత్’ పేరుతో అలయన్స్ ఫ్రాంచైజ్ ఆఫ్ హైదరాబాద్, గోతేజెంత్రమ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న 19వ యూరోపియన్ ఫిలిం ఫెస్టివల్ ప్రారంభమైంది. గోతే జెంత్రమ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అమిత్ షా ఈ ఫిలిం ఫెస్టివల్‌ని ప్రారంభించారు. ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్లో ‘స్నో బోర్డర్స్’ చిత్రంతో ప్రదర్శనలు మొదలయ్యాయి. 13 జూలై వరకు అలియన్స్ ఫ్రాంచైజ్ ఆఫ్ హైదరాబాద్, గోతే జెంత్రమ్ సెంటర్లలో వీటిని ప్రదర్శిస్తారు. యూకే, డెన్మార్క్, బెల్జియం, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, ఫిన్లాండ్, ఇటలీ, బల్గేరియా, ఆస్ట్రియా సహా పలు యూరోపియన్ దేశాల చిత్రాలు వీటిలో ఉన్నాయి. చివరి రోజున పోర్చుగల్, స్పెయిన్ చిత్రాలు ప్రదర్శిస్తారు. ‘గ్రీస్ ది బ్రైడ్స్’ చిత్రంతో యూరోపియన్ ఫిలిం ఫెస్టివల్ ముగియనుంది. యూరప్ దేశాల భాష, సంస్కృతి, అలవాట్లు తెలుసుకోవడానికి అక్కడి సినిమాలు చూడటం కన్నా సులభమైన మార్గం మరొకటి ఉండదేమో! * యువతకు సంబంధించిన అవార్డు విన్నింగ్ యూరోపియన్ సినిమాలు ఇందులో ప్రదర్శిస్తారు. * యువత కలలు, ఆసక్తులు, భయాలు, చికాకులు, ఫన్, జాయ్, తప్పిదాలు, గుర్తింపుల మేళవింపే ఈ సినిమాలు. * ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్ ఉంటాయి కాబట్టి భాష రాదన్న బాధక్కర్లేదు. విదేశీ చిత్రాలంటే మక్కువ ఉన్నవారు ఈ ఫెస్టివల్‌ని మిస్ చేసుకోకండి.