యూరోపియన్ చిత్రం
‘ట్యూన్ ఇన్ టూది వాయిస్ ఆఫ్ యూత్’ పేరుతో అలయన్స్ ఫ్రాంచైజ్ ఆఫ్ హైదరాబాద్, గోతేజెంత్రమ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న 19వ యూరోపియన్ ఫిలిం ఫెస్టివల్ ప్రారంభమైంది. గోతే జెంత్రమ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అమిత్ షా ఈ ఫిలిం ఫెస్టివల్‌ని ప్రారంభించారు. ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో ‘స్నో బోర్డర్స్’ చిత్రంతో ప్రదర్శనలు మొదలయ్యాయి. 13 జూలై వరకు అలియన్స్ ఫ్రాంచైజ్ ఆఫ్ హైదరాబాద్, గోతే జెంత్రమ్ సెంటర్‌లలో వీటిని ప్రదర్శిస్తారు.
యూకే, డెన్మార్క్, బెల్జియం, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, ఫిన్‌లాండ్, ఇటలీ, బల్గేరియా, ఆస్ట్రియా సహా పలు యూరోపియన్ దేశాల చిత్రాలు వీటిలో ఉన్నాయి. చివరి రోజున పోర్చుగల్, స్పెయిన్ చిత్రాలు ప్రదర్శిస్తారు. ‘గ్రీస్ ది బ్రైడ్స్’ చిత్రంతో యూరోపియన్ ఫిలిం ఫెస్టివల్ ముగియనుంది. యూరప్ దేశాల భాష, సంస్కృతి, అలవాట్లు తెలుసుకోవడానికి అక్కడి సినిమాలు చూడటం కన్నా సులభమైన మార్గం మరొకటి ఉండదేమో!
* యువతకు సంబంధించిన అవార్డు విన్నింగ్ యూరోపియన్ సినిమాలు ఇందులో ప్రదర్శిస్తారు.
* యువత కలలు, ఆసక్తులు, భయాలు, చికాకులు, ఫన్, జాయ్, తప్పిదాలు, గుర్తింపుల మేళవింపే ఈ సినిమాలు.
* ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్ ఉంటాయి కాబట్టి భాష రాదన్న బాధక్కర్లేదు.
విదేశీ చిత్రాలంటే మక్కువ ఉన్నవారు ఈ ఫెస్టివల్‌ని మిస్ చేసుకోకండి.