మానవ సంబంధాలు.. భావోద్వేగాలు | European film festival in Hyderabad | Sakshi
Sakshi News home page

మానవ సంబంధాలు.. భావోద్వేగాలు

Published Mon, Aug 26 2019 9:11 AM | Last Updated on Mon, Aug 26 2019 9:11 AM

European film festival in Hyderabad - Sakshi

శ్రీనగర్‌కాలనీ: సినిమా అనేది సాధారణ ప్రజలకు అపురూపమైన ఎంటర్‌టైన్‌మెంట్‌. ఇది విజ్ఞానం, వినోదాల మేళవింపు. ఒక్కో భాషకు, ఒక్కో ప్రాంతానికి భిన్నమైన సంస్కృతీ సంప్రదాయాలు ఉంటాయి. ప్రపంచంలోని సినిమాలను చూసి పలు భిన్న కోణాలను తెలుసుకొవాలనే తపన సినీ అభిమానులకు ఉంటుంది. కానీ కొందరికి సినిమాలు చూసే ఓపిక, తీరికా ఉండదు. అంతేకాకుండా పలు చిత్రాలు సైతం చూడటానికి ఎక్కడా దొరకవు. ప్రపంచ సినిమాలను చూపిస్తూ, సినీ అభిమానుల మనోగతాన్ని తెలుసుకొని ఆ దిశగా హైదరాబాద్‌ ఫిలిం క్లబ్‌ పాటుపడుతోంది. విభిన్న సంస్కృతీ సంప్రదాయాలు, జీవన విధానంతో కూడిన యురోపియన్‌ దేశాల చిత్రాలు సినీప్రియుల మనసు దోచుకుంటున్నాయి.  

అమీర్‌పేటలోని సారథి స్టూడియోలో ది డెలిగేషన్‌ ఆఫ్‌ యురోపియన్‌ యూనియన్‌ టు ఇండియా– హైదరాబాద్‌ ఫిలిం క్లబ్‌– సారథి స్టూడియోస్‌ సంయుక్తాధ్వర్యంలో నిర్వహిస్తున్న యురోపియన్‌ దేశాల ఫిలిం ఫెస్టివల్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. యురోపియన్‌ చిత్రాల్లో భావోద్వేగాలు, మానవ సంబంధాలు, సుఖ దుఃఖాలు, కళాత్మక జీవనాన్ని, సృజనాత్మకతను ప్రస్తావిస్తూ వైవిధ్యమెన చిత్రాలను నిర్మించారు. ఇప్పటికీ ప్రపంచ సినిమాలో యురోపియన్‌ చిత్రాలను ప్రత్యేక స్థానం ఉంది. ఈ నెల 21న ప్రారంభమైన ఫిలిం ఫెస్టివల్‌ ఈ నెల 31 వరకు కొనసాగుతుంది. యురోపియన్‌ దేశాలకు చెందిన 22 చిత్రాలను ప్రదర్శించనున్నారు.  

విభిన్న జీవన విధానాలు..

సినీ అభిమానిగా యురోపియన్‌ ఫిలిం ఫెస్టివల్‌కు వచ్చాను. యురోపియన్‌ చిత్రాల ప్రదర్శించడం ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి ఫెస్టివల్స్‌తో సినిమాలపై పట్టు, అంతర్జాతీయ సంప్రదాయాలు, విజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. ఇలాంటి ఫిలిం ఫెస్టివల్స్‌ మరిన్ని రావాలి.  హైదరాబాద్‌ ఫిలిం క్లబ్‌కు ప్రత్యేక అభినందనలు. కేవలం మనం, మన చుట్టుపక్కల గురించి తెలుసుకుంటే సరిపోదు. ప్రపంచంలోని భిన్నమతాలు, భిన్న సంస్కృతులు, జీవన విధానాలను తెలుసుకోవాలి.     – శివబాబు తోట, నటుడు

అనూహ్య స్పందన..
హైదరాబాద్‌ ఫిలిం క్లబ్‌– సారథి స్టూడియోస్‌ సంయుక్తాధ్వర్యంలో ప్రతి ఏడాది వివిధ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌ను ఘనంగా నిర్వహిస్తున్నాం. యురోపియన్‌ చిత్రాలకు ప్రపంచంలోనే ప్రత్యేక స్థానం ఉంది. ఫిలిం ఫెస్టివల్‌కు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. అకాడమీ అవార్డులు, విమర్శకుల ప్రశంశలు అందుకున్న చిత్రాలను ప్రదర్శిస్తున్నాం.  భవిష్యత్‌లో తెలుగు ఫిలిం ఫెస్టివల్స్‌ను ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో నిర్వహిస్తాం.     – ప్రకాష్‌రెడ్డి, క్లబ్‌ సెక్రటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement