family disputes
-
AP Police: వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం..రక్షించిన పోలీసులు
హనుమాన్‌జంక్షన్ రూరల్: కుటుంబ వివాదాల కారణంగా ఇంటి నుంచి ఎవ్వరికీ చెప్పకుండా బయటకు వెళ్లి ఆత్మహత్యకు యత్నించిన వృద్ధ దంపతులను కృష్ణాజిల్లా వీరవల్లి పోలీసులు కాపాడారు. పశ్చిమ గోదావరిజిల్లా నరసాపురానికి చెందిన వృద్ధ దంపతులు గురువారం అర్ధరాత్రి సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయారన్న సమాచారం తెలుసుకున్న తెలంగాణలోని నిజామాబాద్‌లో నివసిస్తున్న కుమారుడు ఆందోళన చెందాడు. క్షణికావేశంలో వారు ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడతారోనని భయపడ్డాడు. ఆ అర్ధరాత్రి సమయంలోనే కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయూమ్ అస్మీకి ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. వృద్ధ దంపతుల ఆచూకీని కనిపెట్టి, వారిని తీసుకొచ్చే బాధ్యతను స్పెషల్ బ్రాంచ్ సీఐ జేవీ రమణ, వీరవల్లి ఎస్ఐ ఎం.చిరంజీవిలకు ఎస్పీ అప్పగించారు. ఎస్ఐ చిరంజీవి రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు. కృష్ణా నదిలోకి దూకబోతున్న వీరిని నిలువరించి, వారికి నచ్చజెప్పి వీరవల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. కుటుంబ, అనారోగ్య సమస్యల వల్ల ఎవ్వరికీ భారం కాకూడదన్న ఉద్దేశంతోనే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనతో ఇంటి నుంచి బయటికి వెళ్లినట్టు ఎస్ఐకి వారు వివరించారు. వృద్ధ దంపతులను క్షేమంగా కాపాడి, ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కాగా, మాజీ సైనికుడు అయిన ఆ వృద్ధ దంపతుల కుమారుడు ఏపీ పోలీసుల పనితీరుకు ముగ్ధుడయ్యారు. వెంటనే స్పందించిన కృష్ణా జిల్లా ఎస్పీ, వీరవల్లి ఎస్ఐ చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. -
Karnataka: ఇంటి పెద్ద అత్తా? కోడలా?.. ఇంటింటా ‘గృహలక్ష్మి’ కలహాలు!
కర్నాటక ప్రభుత్వం ‘గృహలక్ష్మి’ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద రూ. 2000 మొత్తాన్ని ప్రతీనెలా ఇంటిలోని పెద్దకు ఇవ్వనున్నారు. ఈ పథకానికి సంబంధించిన ప్రకటన వెలువడగానే చాలా ఇళ్లలో అత్తాకోడళ్ల మధ్య గొడవలు పెరిగాయనే వార్తలు వస్తున్నాయి. ఇందుకు పలు ఉదాహరణలు కూడా కనిపిస్తున్నాయి. ఈ పథకం కింద వచ్చే మెత్తం ఎవరు తీసుకోవాలనే దానిపై చాలా కుటుంబాలు తమలో తాము గొడవలు పడుతున్నాయి. చాలా కుటుంబాలలో అత్తాకోడళ్లు కలిసి ఉండటం లేదు. అటువంటప్పుడు ఈ మొత్తాన్ని ఎవరికి ఇస్తారని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తం అత్తలకే చెందాలని కొందరు అంటుండగా, కోడళ్లకే దక్కాలని మరికొందరు అంటున్నారు. అయితే సఖ్యతగా ఉన్న కొన్ని కుటుంబాలలోని అత్తాకోడళ్లు ఆ మొత్తాన్ని చెరిసగం పంచుకుంటామని చెబుతున్నారు. దీని గురించి కర్నాటక శిశు, మహిళా శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బల్కర్ మాట్లాడుతూ ‘గృహలక్ష్మి’ పథకం కింద అందించే మొత్తాన్ని పంచుకోవడంతో కుటుంబ సభ్యులదే అంతిమ నిర్ణయం అని అన్నారు. అయితే ఇంటిపెద్దగా అత్తకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఆమె ఇవ్వాలనుకుంటే కోడలికి ఈ మొత్తాన్ని అందించవచ్చన్నారు. పీడబ్ల్యుడీ మంత్రి సతీష్ జార్కీహోలీ మాట్లాడుతూ ‘గృహలక్ష్మి’ పథకం మొత్తం అత్తకే చెందాలని అన్నారు. ఆమెనే ఇంటిపెద్ద అని అన్నారు. ఈ విషయంలో అత్తాకోడళ్లు సయోధ్యతో మెలగాలని సూచించారు. -
‘కింగ్‌మేకర్’ కలలు భగ్నం.. జేడీఎస్‌ను ఆ తప్పులే దెబ్బ తీశాయా?
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రాంతీయ పార్టీ అయిన జేడీ(ఎస్)ను పూర్తిగా నిరాశపరిచాయి. ఆ పార్టీ కేవలం 19 సీట్లు గెలుచుకుంది. మరోసారి ‘కింగ్‌మేకర్’ అవ్వాలన్న జేడీ(ఎస్) కలలు భగ్నమయ్యాయి. కర్ణాటకలో 2004, 2018లో హంగ్ ప్రభుత్వాలు ఏర్పడి జేడీ(ఎస్) అధికారంలోకి వచి్చంది. హంగ్ వచి్చన ప్రతిసారీ ఆ పార్టీ కింగ్‌మేకర్ అవతారం ఎత్తుతూ వచి్చంది. 2004లో బీజేపీతో, 2018లో కాంగ్రెస్‌తో జతకట్టింది. కంచుకోటలో ప్రభావం అంతంతే 2018 ఎన్నికల్లో 37 స్థానాల్లో గెలుపొందిన జేడీ(ఎస్) ఈసారి మాత్రం 19 సీట్లకే పరిమితం అయింది. తమ కంచుకోటగా భావించే పాత మైసూరు ప్రాంతంలోనూ జేడీ(ఎస్) పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఎన్నికల ముందు ‘పంచరత్న రథయాత్ర’ పేరిట జేడీ(ఎస్) నేత, మాజీ సీఎం కుమారస్వామి చేసిన రాష్ట్రవ్యాప్తంగా చేసిన బస్సు యాత్ర సత్ఫలితాన్ని ఇవ్వలేదు. 87 ఏళ్ల రాజకీయ దురంధరుడు హెచ్డీ దేవెగౌడ వృద్ధాప్యాన్ని సైతం లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారంలో విరివిగా పాల్గొన్నారు. అధికారం అప్పగిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రజలను వేడుకున్నారు. అయినా ఉపయోగం కనిపించలేదు. రాష్ట్రంలో జేడీ(ఎస్) ఓట్ల శాతం క్రమంగా పడిపోతోంది. 2004లో ఆ పారీ్టకి 20.8 శాతం, 2018లో 18 శాతం, ఈసారి దాదాపు 13 శాతం ఓట్లు లభించాయి. నిఖిల్ గౌడ పరాజయం దేవెగౌడ కుటుంబంలోని లుకలుకలు కూడా ఈ ఎన్నికల్లో జేడీ(ఎస్)ను దెబ్బతీశాయి. దేవెగౌడ పెద్ద కోడలు భవానీ రేవణ్ణ.. హాసన్ అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ స్థానాన్ని తన వదినకు ఇచ్చేందుకు కుమారస్వామి సానుకూలంగా లేకపోవడంతో కుటుంబంలోని విభేదాలు బహిర్గతమయ్యాయి. ఇలా కుటుంబంలో వివాదాలు, పారీ్టలో కుటుంబ పెత్తనం అనే అపవాదులు జేడీ(ఎస్)ను దెబ్బతీశాయి. దేవెగౌడ కుటుంబం నుంచి ముగ్గురు పోటీ చేయగా, ఇద్దరు గెలిచారు. కుమారస్వామి కుమారుడు నిఖిల్∙రామనగరలో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. 2019 లోకసభ ఎన్నికల్లో ఓటమిని పరాజయం పాలైన నిఖిల్ తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓడిపోవడం గమనార్హం. హాసన్‌లో దేవెగౌడ కుటుంబాన్ని సవాలు చేసిన బీజేపీ అభ్యర్థి ప్రీతం గౌడ తన ప్రత్యర్థి హెచ్‌పీ స్వరూప్‌ను ఓడించారు. చెన్నపట్టణలో కుమారస్వామి స్వల్ప మెజారిటీతో గట్టెక్కడం జేడీ(ఎస్) కొంతలో కొంత ఊరట కలిగించింది. హోలెనరసిపురలో దేవెగౌడ పెద్ద కుమారుడు హెచ్డీ రేవణ్ణ గెలుపొందారు. చదవండి: శభాష్ రాహుల్.. మహాత్మా గాంధీలా ప్రజల మనసులు గెలుచుకున్నావ్.. కమల్ ప్రశంసల వర్షం.. -
కుటుంబ వివాదాలకు సత్వర పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక సమీకృత కోర్టుల ద్వారా కుటుంబ వివాదాల కేసులు త్వరగా పరిష్కారం అవుతాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ చెప్పారు. కొన్నికేసుల విచారణ సాగుతున్నప్పుడు కక్షిదారుల కంటే న్యాయవాదులే ఎక్కువ ఉత్సాహం చూపిస్తుంటారని, అది సరికాదన్నారు. ఆయన శనివారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ పి.నవీన్‌రావులతో కలసి హైదరాబాద్‌లో కుటుంబ వివాదాల సమీకృత కోర్టుల సముదాయాన్ని ప్రారంభించారు. జస్టిస్ రామసుబ్రమణియన్ మాట్లా డుతూ‘‘దేశంలో దాదాపు 11.4 లక్షల కుటుంబ వివాదాలు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. కుటుంబ వివాదాల ప్రత్యేక కోర్టులు లేని రాష్ట్రాల్లో వీటి సంఖ్య ఎక్కువగా ఉంది. కల్పవృక్షం మనం ఏది అడిగితే అది ఇస్తుంది. అలాగే కల్పతరువుగా పేరు పెట్టుకున్న ఈ కోర్టులు కూడా కక్షిదారులు విడాకులు, మధ్యవర్తిత్వం ఇలా వారు ఏది కోరితే అది ఇస్తుంది. కానీ ఏది కోరుకున్నా అది వారి భవిష్య త్‌పై ప్రభావం చూపుతుందని మరవద్దు. కుటుంబ వివాదాలు పిల్లల మనసులపై తీవ్ర ప్రభావం చూపుతాయన్న విషయం పెద్దలు గుర్తించాలి. మనోవికాసం కక్షిదారులకు మాత్రమే కాదు. బుద్ధి సరిగా లేని వారందరికీ అవసరమే. న్యాయమూర్తులు, న్యాయవాదులు కేసులను చట్టాల ఆధారంగానే కాకుండా మనసుతో ఆలోచించి పరిష్కరించాలి’’అని రామసుబ్రమణియన్ సూచించారు. ఇక ‘‘తల్లిదండ్రుల వివాదాల కారణంగా పిల్లలు చిన్న వయసులో కుంగుబాటుకు గురవుతున్నారు. ఎంతోమంది కోర్టు తమ సమస్యలకు పరిష్కారం చూపుతుందని వస్తారు. తొలుత మధ్యవర్తిత్వ కేంద్రం ద్వారా వారి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి’’అని జస్టిస్ నరసింహ పేర్కొన్నారు. ‘‘1970లోనే కుటుంబ వివాదాలకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చింది. 1980 తర్వాత అది కార్యరూపం దాల్చి కోర్టుల ఏర్పాటు ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 535 ఫ్యామిలీ కోర్టులు ఉండగా, అందులో 16 మాత్రమే తెలంగాణలో ఉన్నాయి’’అని జస్టిస్ సంజయ్‌కుమార్ వివరించారు. కక్షిదారులకు ఉపయుక్తం జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ‘‘హైదరాబాద్‌లోని అన్ని ఫ్యామిలీ కోర్టులు ఒకే భవన సముదాయంలో ఉండటం కక్షిదారులకు ఉపయుక్తం. కోర్టులకు వచ్చే వారికి వాటిని చూడగానే సాధారణంగా వ్యతిరేక భావన కలుగుతుంది. అయితే మెడిటేషన్ రూం, ప్లే ఏరియా, మీడియేషన్ రూం ఇలా ఈ కోర్టును చూస్తే సానుకూల దృక్పథం ఏర్పడుతుంది’’అని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ చెప్పారు. దాదాపు 5,900 కేసులు ఈ కోర్టులకు బదిలీ కానున్నాయని జస్టిస్ నవీన్‌రావు వెల్లడించారు. కార్యక్రమంలో ఇతర హైకోర్టుల న్యాయమూర్తులతోపాటు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, హెచ్‌సీఏఏ అధ్యక్షుడు రఘునాథ్, నల్సార్ యూనివర్సిటీ వీసీ శ్రీకృష్ణదేవరావు, తెలంగాణ లీగల్ సర్విసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఉన్మాదిగా మారిన భర్త..డంబెల్‌తో భార్య తలను..
సాక్షి, కృష్ణరాజపురం: కుటుంబ గొడవలతో ఇనుప డంబెల్‌తో భార్యను కొట్టి చంపాడో కిరాతక భర్త. జీవితాంతం తోడు నీడగా చూసుకుంటానన్న పెళ్లినాటి ప్రమాణాలను తుంగలో తొక్కి దారుణంగా బలిగొన్నాడు. ఈ సంఘటన నగరంలోని కృష్ణరాజపురం పరిధిలోని రామ్మూర్తినగరలో ఉన్న హొయ్సళ స్ట్రీట్‌లో గురువారం చోటు చేసుకుంది. లిడియా (44) భర్త చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్న అభాగ్యురాలు. వివరాలు.. మోరిస్, లిడియాలకు 15 ఏళ్ల కిందట పెళ్లయింది. వీరికి ముగ్గురు కొడుకులు ఉన్నారు. మోరిస్ ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు. ఉదయం ముగ్గురు పిల్లలు స్కూల్‌కు వెళ్లిన తరువాత భార్యభర్త గొడవపడ్డారు. ఈ సమయంలో ఉన్మాదిగా మారిన మోరిస్ ఇనుప డంబెల్‌ను తీసుకుని భార్య తలను నుజ్జు చేశాడు. రక్తపుమడుగులో ఆమె శవమైంది. ఇరుగుపొరుగు సమాచారం అందించడంతో రామ్మూర్తినగర పోలీసులు వచ్చి నిందితున్ని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తల్లి మరణం, తండ్రి జైలుపాలు కావడంతో పిల్లలు అనాథల్లా మారారు. (చదవండి: బెంగళూరులో దారుణం.. వేధింపులు తాళలేక వైద్యురాలు ప్రియాంశి మృతి) -
కంటిరెప్ప ఆగ్రహం, కనుపాపలు దూరం
సాక్షి, బళ్లారి: కన్నపిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లి కుటుంబ కలహాలతో ఆవేదన చెందింది. తానొక్కటే ప్రాణాలు తీసుకుంటే పిల్లలు అనాథలవుతారని అనుకుని, ముందు వారిని నీటిలోకి పడేసి తరువాత తాను దూకింది. ఈ విషాద ఘటన శనివారం రాత్రి విజయపుర జిల్లా తికోటా తాలూకా జాలిగేర గ్రామ సమీపంలోని విఠలవాడి తండాలో జరిగింది. తరచూ కుటుంబ కలహాలు వివరాలు... తండాకు చెందిన రాముచౌహాన్కు సింధగి తాలూకాకు చెందిన గీత (32)తో 8 సంవత్సరాల క్రితం వివాహమైది. వీరికి సృష్టి (6), కిషన్ (3), సమర్థ (4) అనే పిల్లలున్నారు. కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి కూడా దంపతులు గొడవ పడ్డారు. ఈ పరిణామాలతో ఆగ్రహించిన గీత ముగ్గురు పిల్లలను సంప్‌లోకి తోసి ఆమె కూడా దూకింది. కొద్ది సేపటికి ఇరుగుపొరుగు గమనించేటప్పటికీ నలుగురు విగతజీవులుగా కనిపించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో తికోట పోలీసులు వచ్చి మృతదేహాలను వెలికితీసి కేసు నమోదు చేశారు. (చదవండి: భార్యను హత్య చేసి ఢిల్లీకి పరార్..విచారణలో అతడు..) -
భార్యతో మీద కోపంతో.. రెండేళ్ల కొడుకును భవనంపై నుంచి పడేసి..
న్యూఢిల్లీ: ఒక వ్యక్తి రెండేళ్ల కొడుకుని మూడు అంతస్తుల బాల్కనీ నుంచి తోసేసి తాను దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. ఈ ఘటన ఢిల్లీలోని కల్కాజీ వద్ద ఉన్న స్లమ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. తీవ్రగాయాలపాలైన తండ్రి కొడుకులిదర్నీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్)కి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...మన్సింగ్ అతడి భార్య పూజా కుటంబ కలహలతో గత కొన్ని నెలలుగా వేర్వేరుగా నివశిస్తున్నారు. ప్రస్తుతం పూజ తన ఇద్దరు పిల్లలతో కల్కాజీలో ఉంటున్న తన నానమ్మ వద్దే ఉంటోంది. గత రాత్రి మన్సింగ్ తన భార్య పూజ వద్దకు వచ్చి గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకోవడంతో మన్సింగ్ కోపంతో.. తన రెండేళ్ల కొడుకుని 21 అడుగుల ఎత్తులో ఉన్న బాల్కనీ నుంచి పడేసి..ఆ తర్వాత అతను దూకేశాడు. ఈ మేరకు పోలీసులు మనసింగ్పై హత్యానేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతడు ఆ సమయంలో తాగి ఉన్నాడని పూజ నానమ్మ చెబుతున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: అది అత్యంత ముఖ్యమైనది: తొలి ట్రాన్స్ జెండర్ జడ్జి) -
కన్న తల్లే కర్కశంగా..చిన్నారులపై పెట్రోల్ పోసి..
సాక్షి, కోలారు: ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా కష్టం తెలియకుండా ఆదుకోవాల్సిన తల్లే నిప్పంటిస్తే చిన్నారుల ప్రాణాలు విలవిలలాడాయి. ముళబాగిలు వద్ద అంజనాద్రి కొండపై బుధవారం తెల్లవారుజామున ఇద్దరు కూతుళ్లపై తల్లి పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటనలో మరో కూతురు కూడా ఆస్పత్రిలో మరణించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా రామసముద్రానికి చెందిన తల్లి జ్యోతి కుటుంబ కలహాలతో ఈ అఘాయిత్యానికి పాల్పడడం తెలిసిందే. తల్లికి కస్టడీ, తండ్రికి విచారణ తల్లి ఇప్పుడు కోలారు జైలులో జ్యుషియల్ కస్టడీలో ఉంది. మంటల్లో పెద్ద కుమార్తె అక్షయ అక్కడికక్కడే మరణించగా చిన్న కుమార్తె ఉదయశ్రీ బెంగుళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం చనిపోయినట్లు ముళబాగిలు ఎస్ఐ మంజునాథ్ తెలిపారు. ఘటనలో ఉదయశ్రీ కి 60 శాతం కాలిన గాయాలు అయ్యాయి. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాలిక చివరకు ప్రాణాలు విడిచింది. కాగా జ్యోతి భర్త తిరుమలేశును విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. (చదవండి: తొందరగా వెళ్లాలని పట్టాలు దాటుతోంది..సడెన్‌గా ట్రైయిన్ రావడంతో..) -
పండుగపూట విషాదం.. ప్రేమించి పెళ్లి.. చిన్నచిన్న గొడవలకే
సాక్షి, రామగుండం(కరీంనగర్): పండుగపూట ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం పాలకుర్తి మండలం కుక్కలగూడుర్ గ్రామంలో విషాదం నింపింది. బసంత్‌నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కందుల శంకరయ్య– కళావతి దంపతుల కూతురు అనూష (24), అదే గ్రామానికి చెందిన మేడం బాపు కుమారుడు మేడం రాకేశ్ ప్రేమించుకుని ఎనిమిది నెలల క్రితం పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో తన తల్లిగారింట్లో ఉన్న అనూషను శనివారం రాత్రి రాకేశ్ వారి ఇంటికి తీసుకెళ్లాడు. రాత్రి సమయంలో ఎప్పుడో పురుగుల మందు తాగిన అనూష ఆదివారం వేకువజామున బాత్రూంకు వెళ్లి కిందపడిపోయింది. నోటివెంట నురుగులు రావడాన్ని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ధర్మారంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందిందని వైద్యులు తెలిపారు. బసంత్‌నగర్ ఎస్సై మహేందర్‌యాదవ్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లి కళావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: బతుకమ్మ పండగ వేళ విషాదం.. మరొకరితో సహజీవనం చేస్తోందని.. గ్రామంలో విషాదం ఎంగిలిపూల బతుకమ్మ పండుగ రోజున జరిగిన ఈ ఘటనతో కుక్కలగూడుర్ గ్రామంలో విషాదం నెలకొంది. మృతురాలు అనూష తండ్రి కందుల శంకరయ్య ఏడాదిక్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం కోమాలో ఉన్నాడు. ప్రస్తుతం అనూష ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. -
ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): కుటుంబ కలహాల కారణంగానే ఎక్కువగా ఆత్మహత్యలు జరుగుతున్నాయని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. భార్యాభర్తలను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చేలా ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో కౌన్సెలింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పోలీస్ శాఖ, మానసిక వైద్యుల సంఘం రాష్ట్ర శాఖ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా బెంజిసర్కిల్ నుంచి ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం వరకూ విద్యార్థులు, పోలీస్ సిబ్బందితో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. తొలుత బెంజిసర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మానసిక వైద్యుల సంఘం రూపొందించిన పోస్టర్‌ను డీజీపీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ కుటుంబ కలహాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో పిల్లలు అనాథలుగా మారే అవకాశం ఉందన్నారు. ఆరి్థక ఇబ్బందులు, అనారోగ్యాలతో కూడా కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని డీజీపీ ఆవేదన వ్యక్తం చేశారు. చదువుల విషయంలో తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి తీసుకు రావొద్దని సూచించారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఒత్తిడిలేని విద్యా విధానమే లక్ష్యంగా ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రక్షాళన చేస్తోందన్నారు. అనంతరం ‘సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదు.. మేం ఆత్మహత్య చేసుకోం’ అని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ టీకే రాణా, మానసిక వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.ప్రభాకర్, కార్యదర్శి డాక్టర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
భార్య వేధింపులు తాళలేక...
యశవంతపుర: భార్య వేధింపులను తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన చిక్కమగళూరు జిల్లా కొప్ప తాలూకా జయపుర గ్రామంలో జరిగింది. అరవింద్ (42) తన తోటలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు డెత్‌నోట్ రాసి తన మరణానికి భార్య, ఆమె బంధువులు, పోలీసుల పేర్లు రాశాడు. 12 ఏళ్ల క్రితం అరవింద్‌తో రేఖనిచ్చి వివాహం చేశారు. రోజు ఏదో విషయంపై గొడవ పడేవారు. ఇద్దరి మధ్య గొడవలు జరగటంతో రేఖ బంధువులు ఇటీవల జయపుర స్టేషన్‌కు పిలిపించి విచారించారు. దీంతో విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకున్నాడు. జయపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భర్త చేతిలో భార్య హతం : కుటుంబ కలహాలతో భర్త భార్యను హత్య చేసిన ఘటన హాసన జిల్లా బేలూరు తాలూకా చీకనహళ్లి గ్రామంలో మంగళవారం జరిగింది. ఇంద్రమ్మ (48)ను ఆమె భర్త చంద్రేగౌడ నలుగురితో కలిసి హత్య చేసి పరారయ్యాడు. అడ్డుపడిన మహిళలపై కూడా నిందితులు దాడి చేశాడు. ఆరు నెలల క్రితం చంద్రమ్మను హత్య చేయటానికి పథకం వేయగా ఆమె తప్పించుకుంది. పుట్టినిల్లు చీకనహళ్లిలో ఉంటూ కూలీ పనులకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. (చదవండి: హెలికాప్టర్ సర్వీస్ రూ. 17 వేలు టోపి) -
ఎంత పని చేశావు తల్లీ..
అమ్మా.. నవమాసాలు మోసి మాకు జన్మనిచ్చావు. అల్లారుముద్దుగా పెంచావు. గోరుముద్దలు తినిపించావు. ఏ చిన్న జబ్బు చేసినా నీవు తల్లడిల్లి పోయావు. నీవే కొండంత అండ అని భావించాము. నీళ్లు చూస్తుంటే భయమేసింది.. అయినా నువ్వున్నావన్న ధైర్యంతో నీవెంటే నడిచాము. నీటిలో ఊపిరి ఆడలేదు. బయటకు తీయమ్మా... అని వేడుకున్నాం. కానీ అప్పటికే అంతా అయిపోవడంతో చిన్నారులు తల్లితో పాటు ప్రాణాలు విడిచారు. శింగనమల: కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. వారి మృతదేహాలు బుధవారం శింగనమల రంగరాయల చెరువులో బయటపడ్డాయి. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. జిల్లాలోని పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు గ్రామానికి చెందిన బి.రామాంజినేయులుకు పదేళ్ల క్రితం పామిడి మండలం ఎదురూరు గ్రామానికి చెందిన కవిత(27)తో వివాహమైంది. వీరికి సంతోష్ (7), భార్గవి (3) సంతానం. గ్రామంలోనే కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. అయితే..నాలుగు నెలల క్రితం తాడిపత్రి పట్టణానికి మకాం మార్చారు. రామాంజినేయులు గుజిరీ షాపులో పనికి వెళుతుండగా.. భార్య ఇంటి వద్దే ఉంటూ పిల్లలను చూసుకునేది. రామాంజనేయులు మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయమై రోజూ దంపతులు రోజూ గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కూడా వాదులాడుకున్నారు. భర్త ప్రవర్తనలో మార్పు కనిపించకపోవడంతో జీవితంపై విరక్తి చెందింది. మంగళవారం ఉదయం 11 గంటల తరువాత పుట్టింటికి వెళుతున్నానని భర్తకు చెప్పిన కవిత కుమారుడు, కుమార్తెను తీసుకుని ఇంటి నుంచి వచ్చింది. బస్సులో బయల్దేరి శింగనమల క్రాస్ వద్ద దిగింది. అక్కడి నుంచి పిల్లలతో కలిసి రంగరాయల చెరువు మరవకట్టపైకి నడుచుకుంటూ వెళ్లింది. జీవితం నరకప్రాయంగా అనిపించడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. పిల్లలు దిక్కులేని వారు కాకూడదని.. వారినీ తనవెంటే తోడు తీసుకెళ్లాలని నిర్ణయించుకుని చెరువులోకి దూకారు. బుధవారం మధ్యాహ్నం ముగ్గురి మృతదేహాలు నీటిలో తేలియాడుతూ కనిపించాయి. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న అనంతపురం ఇన్చార్జ్ డీఎస్పీ శ్రీనివాసులు, శింగనమల సీఐ అస్రార్ బాషా, ఎస్ఐ వంశీకృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను చెరువులో నుంచి బయటకు తీయించి..పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భార్య, పిల్లలు చనిపోయినా భర్త సంఘటన స్థలం వద్దకు రాలేదు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. (చదవండి: ఉడేగోళంలో విషాదం... అన్నదమ్ములని బలిగిన్న కరెంట్) -
తెగని పంచాయితీ.. అత్తవారింటికి వచ్చిన అల్లుడు.. ఇదే అదనుగా..
శాలిగౌరారం (నల్గొండ): కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ భర్తను దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన శాలిగౌరారం మండలంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామానికి చెందిన ప్రస్తుత సర్పంచ్ మామిడికాయల జయమ్మ కుమార్తె సారికను నకిరేకల్ మండలం మండలాపురం గ్రామానికి చెందిన మాచర్ల కిరణ్(35)కు ఇచ్చి 2011లో వివాహం జరిపించారు. వీరికి కుమారుడు(10), కుమార్తె(7) ఉన్నారు. వివాహం జరిగినప్పటి నుంచి వీరు హైదరాబాద్‌లో జీవనం సాగిస్తున్నారు. సారిక ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేయగా, కిరణ్ ఎమ్మార్పీఎస్ ఆర్గనైజేషన్‌లో పనిచేసేవాడు. ఈ క్రమంలో రోజురోజుకూ పోషణ ఖర్చులు పెరుగుతుండటంతో కుటుంబంలో ఆర్థిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఇద్దరి మధ్య నాలుగేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగం మానేసిన సారిక ఆరు నెలల క్రితం కుమారుడు, కుమార్తెను వెంటపెట్టుకొని చిత్తలూరులోని తల్లిగారింటికి వచ్చి ఇక్కడే ఉంటోంది. ఈ క్రమంలో పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు నిర్వహించారు. కానీ భార్యభర్తల మధ్య బేదాభిప్రాయాలు తగ్గకపోవడంతో విడివిడిగా ఉంటున్నారు. వ్యభిచార కూపాలు.. విచ్చలవిడిగా సాగుతున్న దందా భర్తపై పోలీసులకు ఫిర్యాదు ఈనేపథ్యంలో భర్త కాపురానికి తీసుకుపోవడంలేదని 20రోజుల క్రితం సారిక శాలిగౌరారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కిరణ్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిచి పోలీసులు భార్యాభర్తలకు కలిసి ఉండాలని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అక్కడనుంచి కిరణ్ హైదరాబాద్‌కు పోగా, సారిక చిత్తలూరులో ఉంటోంది. ఈక్రమంలో సోమవారం మధ్యాహ్నం 3గంటలకు కిరణ్ చిత్తలూరు గ్రామానికి వచ్చాడు. సాయంత్రం కిరణ్ మద్యం ఇంటికి తెప్పించుకొని తాగాడు. భోజనం తర్వాతా ఆర్థికపరమైన విషయాలతో దంపతుల మధ్య వాదనలు జరిగాయి. కొంతసమయం తర్వాత కిరణ్ ఇంట్లో నేలపై నిద్రించాడు. ఇదే అదునుగా భావించిన సారిక రాత్రి 11 గంటల సమయంలో నిద్రలో ఉన్న కిరణ్ తలపై బండరాయితో మోదడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే సారిక అక్కడనుంచి బయటకు వెళ్లి వంగమర్తిమీదుగా సూర్యాపేట జిల్లా అర్వపల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించి లొంగిపోయింది. దీంతో అర్వపల్లి పోలీసులు సంఘటన గురించి శాలిగౌరారం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మంగళవారం హతుడి కుటుంబ సభ్యులు, బంధువులు చిత్తలూరుకు చేరుకోవడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సంఘటన స్థలాన్ని సీఐ రాఘవరావు సందర్శించి మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం తరలింపు అడ్డగింత మాచర్ల కిరణ్ హత్యలో భార్య సారికతో పాటు మరికొంతమంది ప్రమేయం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పాటు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నారు. నిందితులను గుర్తించి కేసు నమోదుచేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమనిగింది. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మృతదేహాన్ని నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హతుడి తమ్ముడు మాచర్ల కిశోర్ సారికతో పాటు మరో నలుగురి వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కిశోర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. హత్యలో ఐదుగురి పాత్ర? మాచర్ల కిరణ్ హత్యలో భార్య సారికతో పాటు మరో నలుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు హతుడి కుటింబికులు ఆరోపిస్తున్నారు. వారిలో సారికతో పాటూ చిత్తలూరుకు చెందిన ఆమె అక్క బండారు నాగమ్మ, ఆమె కుమారుడు బండారు శివప్రసాద్, యాదాద్రి భువనగిరిజిల్లా అడ్డగూడూరు మండలం వెల్దేవికి చెందిన ఓ వ్యక్తి, నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన మరో వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో! తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇద్దరు పిల్లలతో కలిసి.. -
అత్త సూటిపోటి మాటలు.. వేధింపులు భరించలేక అల్లుడు..
సాక్షి,హుబ్లీ (కర్ణాటక): అత్త వేధింపులకు అల్లుడు బలయ్యాడు. ఈ ఘటన హుబ్లీ తాలూకా బ్యాహట్టి గ్రామంలో చోటు చేసుకుంది. మహమ్మద్‌రఫిక్ నదాఫ్ అనే వ్యక్తి భార్య అసామతో కలిసి గ్రామంలోనే తన అత్త సాహెబీ ఇంటి ఎదుటనే నివాసం ఉంటున్నాడు. అత్తతోపాటు పొరుగింటిలో ఉంటున్న ముదుకప్ప, మాంత్యలు సూటిపోటి మాటలతో వేధిస్తుండటంతో మహమ్మద్‌రఫిక్ నదాఫ్ మనో వేదనకు గురై సోమవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హుబ్లీ రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఏఎస్ఐకు 20 ఏళ్ల జైలుశిక్ష మైసూరు: ఆపదలో ఉన్నవారిని రక్షించాల్సిన పోలీస్ అధికారి అయి ఉండి మతిస్థిమితం లేని యువతిని చెరబట్టిన కామాంధునికి కోర్టు కఠిన శిక్ష విధించింది. తుమకూరు నగరం అంతర సనహళ్ళి వద్ద యువతిపై ఏఎస్ఐ ఉమేశయ్య అత్యాచారం చేసినట్లు నేరం రుజువు కావడంతో అతనికి 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. లక్ష జరిమానాను విధిస్తూ జిల్లా 2వ సెషన్స్ కోర్టు జడ్జి హెచ్.ఎస్.మల్లిఖార్జునస్వామి మంగళవారం తీర్పు వెలువరించారు. ఒంటరి యువతిని చూసి.. 2017న జనవరి 14వ తేదీన రాత్రి ఒంటరిగా ఉన్న మతిస్థిమితం లేని యువతిని ఉమేశయ్య గస్తీకి వెళ్లినప్పుడు చూశాడు. కొంతసేపటికి కారులో వచ్చి యువతిని బెదిరించి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. మరుసటిరోజును ఈ దారుణం తెలిసి యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఉమేశయ్యను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ఉమేశయ్య నేరం చేసినట్లు కోర్టులో రుజువు కావడంతో శిక్ష తప్పలేదు. ప్రభుత్వ న్యాయవాది కవిత పకడ్బందీగా వాదనలు వినిపించారు. రూ. లక్ష జరిమానాను బాధితురాలిగా అందజేయాలని దోషిని ఆదేశించారు. కాగా ఉమేశయ్య జీపు డ్రైవర్‌పై నేరం నిరూపణ కాకపోవడంతో అతనికి విముక్తి కల్పించారు. ఈ తీర్పుపై ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. కామాంధులకు గుణపాఠం కావాలని పేర్కొన్నాయి. చదవండిః కేంద్రం కీలక సంస్కరణ.. దేశంలో ఏకరీతిగా భూ రిజిస్ట్రేషన్..! -
హైదరాబాద్: కుటుంబ కలహాలు.. ఇద్దరు పిల్లలతో తల్లి..
సాక్షి, చిలకలగూడ: కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు చిన్నారులతో కలిసి తల్లి అదృశ్యమైన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. అడ్మిన్ ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా మాధవనగర్‌కు చెందిన సెంట్రింగ్ కార్మికుడైన ముస్తాల రవి, నాగలక్ష్మి భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు. కొంతకాలం క్రితం నగరానికి వలస వచ్చి పార్శిగుట్టలో నివసిస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈనెల 20న నాగలక్ష్మి (24) తన కుమార్తెలు రిత్విక(4), రెండున్నరేళ్ల సిరిని వెంటతీసుకుని బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. స్వగ్రామంతోపాటు సన్నిహితులు, బంధు మిత్రులను వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో భర్త రవి సోమవారం పోలీసులను ఆశ్రయించాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని అడ్మిన్ ఎస్ఐ తెలిపారు. చదవండి: విష సర్పాన్ని ముద్దాడి.. మృత్యువుతో పోరాటం! -
పుట్టింటికి వెళ్లిన భార్య.. అత్త చెవి కోసిన అల్లుడు..
సాక్షి, ఆదోని(కర్నూలు): తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి అత్తపై కత్తితో దాడి చేసి చెవి కోశాడు. అడ్డు వచ్చిన భార్యనూ గాయపర్చాడు. ఈ ఘటన మంగళవారం ఆదోనిలో చోటు చేసుకుంది. వన్ టౌన్ సీఐ చంద్రశేఖర్ వివరాల మేరకు.. పట్టణంలోని మరాఠగేరికి చెందిన మాధవి.. నిజాముద్దీన్ కాలనీకి చెందిన నరేష్ కుమార్ ఎనిమిది నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత తాగుడుకు బానిస అయిన భర్త డబ్బు కోసం ఆమెను వేధించేవాడు. భరించలేక ఇటీవలే మాధవి తన భర్తను వదిలి తల్లి సావిత్రమ్మ వద్దకు వెళ్లింది. భార్య పుట్టింటికి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేని నరేష్కుమార్ అత్త ఇంటికెళ్లి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సావిత్రమ్మ ఎడమ చెవి సగం తెగిపోయింది. అడ్డు వచ్చిన భార్యపై కూడా దాడికి పాల్పడ్డాడు. బాధితుల ఏడుపు విని ఇరుగుపొరుగు వారు రావడంతో నరేష్కుమార్ అక్కడి నుంచి పరారయ్యాడు. జరిగిన ఘటనపై మాధవి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. తనను బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకోవడమే కాక వివాహ సమయంలో తీసుకెళ్లిన రూ.8 లక్షలు, 20 తులాల బంగారం తాగుడుకు ఖర్చు చేసి మళ్లీ ఇప్పుడు డబ్బు కోసం వేధిస్తున్నాడని మాధవి విలపించారు. చదవండి: భర్త మెడకు చున్నీ బిగించి హత్య చేసిన ఇల్లాలు -
భర్తను కడతేర్చిన భార్య.. అసలు ఏంజరిగిందంటే
సాక్షి, చిన్నకోడూరు(మెదక్): కుటుంబాన్ని పోషించాల్సిన భర్త ఇంటిని పట్టించుకోకపోవడం, వేధింపులకు గురి చేస్తుండటంతో విసిగిన భార్య తాళి కట్టిన భర్తనే కడతేర్చింది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం విఠలాపూర్‌లో జరిగింది ఈ విషాదక ఘటన. పోలీసులు, గ్రామస్తుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన దంపతులు మర్కంటి ఎల్లయ్య(55)కు భార్య నర్సవ్వ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కూతురు రేణుకకు 2014లో అదే గ్రామానికి చెందిన ఇప్ప మహేందర్‌తో వివాహం జరిపించారు. కాగా ఎల్లయ్య, నర్సవ్వ మధ్య కుటుంబతగాధాలతో తరచూ గొడవ పడుతుండేవారు. దీనిపై కుల పెద్దల సమక్షమంలో ఎల్లయ్యను మందలించినా మార్పు రాలేదు. మంగళవారం రాత్రి ఎల్లయ్య భార్యతో గొడవ పడి కర్రతో దాడి చేసి గాయపర్చాడు. దీంతో ఎల్లయ్య పడుకున్నాక తెల్లవారు జామున 5 గంటల సమయంలో నర్సవ్వ ఇంట్లో ఉన్న గొడ్డలితో భర్త ఎల్లయ్య మెడను నరికింది. బలమైన గాయాలు కావడంతో ఎల్లయ్య అక్కడిక్కడే మృతి చెందాడు. సిద్దిపేట రూరల్ సీఐ సురేందర్ రెడ్డి, ఎస్సై రాజేశ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి కూతురు రేణుక ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. -
భర్త ఇంటి ముందు 40 రోజుల పోరాటం విషాదాంతం
సాక్షి, హుజూరాబాద్(కరీంనగర్): కట్టుకున్నవాడు కాపురానికి తీసుకెళ్లడం లేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వివాహిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. పోలీసులు, మృతురాలి సోదరుడు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూరాబాద్ పట్టణానికి చెందిన నరహరి సుజిత్‌రెడ్డి కడప జిల్లాకు చెందిన సుహాసిని రెడ్డి (32)కి 2011లో ఆన్లైన్లో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. పెళ్లి ప్రస్తావన రాగానే పలుమార్లు సుజిత్ దూరం పెట్టడంతో సుహాసిని ఒత్తిడి తెచ్చింది. దీంతో 2020 నవంబర్‌లో హైదరాబాద్‌లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత సిటీలో కొంతకాలం కాపురం చేశాడు. తల్లిదండ్రులను ఒప్పించి తీసుకెళ్తానని ఊరికెళ్లాడు. ఆ తర్వాత ఎంతకూ తాను రాకపోవడంతో సుహాసిని హుజూరాబాద్ వెళ్లి భర్త ఇంటి ముందు 40 రోజులు ఒంటరి పోరాటం చేసింది. అయినా భర్త, అత్తమామల మనసు కరగలేదు. మరోవైపు సుజిత్ మరో యువతిని వివాహం చేసుకున్నాడని తెలిసి మనస్తాపం చెంది బుధవారం భర్త ఇంటి ఎదుట గడ్డి మందుతాగి ఆత్మహత్యాయత్నం చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచింది. సుజిత్ మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో సుహాసిని పేర్కొంది. తన చావుకు కారణమైన వాళ్లను కఠినంగా శిక్షించి తన అవయవాలను దానం చేయాలని చెప్పింది. మృతురాలు సోదరుడు శివారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య కోసం ఇద్దరు భర్తల లొల్లి.. మీడియా సమావేశం పెట్టి మరీ..
సాక్షి, హైదరాబాద్: ఓ భర్త కోసం ఇద్దరు పెళ్లాలు గొడవ పడటం చాలా చూశాం. కానీ ఓ భార్య కోసం ఇద్దరు భర్తలు తగువులాడుకోవడం ఎక్కడైనా చూశారా.. తాజాగా హైదరాబాద్‌లో ముద్దుల భార్య కోసం ఇద్దరు భర్తలు ఎంతకైనా తెగించేందుకు సిద్దమయ్యారు. ఆమెను దక్కించుకునేందుకు పోరాడుతూ.. రోడ్డు మీదకు వచ్చి మరీ కొట్లాడుకున్నారు. చివరకు ఈ ఇద్దరు భర్తల ముద్దుల పెళ్లాం పంచాయితీ మీడియా ముందుకు చేరింది. వివరాల్లోకి వెళితే.. వరంగల్‌కు చెందిన శశికాంత్‌కు మొదటి భార్య చనిపోవడంతో ఆమె సోదరి దుర్గకు ఇచ్చి రెండో పెళ్లి చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. కొన్నాళ్లు వీరి దాంపత్యం సాఫీగానే సాగింది. ఇటీవల ఫేస్బుక్లో సత్య ప్రసాద్ అనే వ్యక్తితో దుర్గకు పరిచయం ఏర్పడింది. వీరి ఇద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో భర్తను వదిలేసి ప్రియుడితో పారిపోయింది. అనంతరం ప్రియుడిని పెళ్లి చేసుకొని అతనితోనే ఉంటుంది. అయితే భార్య కనిపించడం లేదని మొదటి భర్త శశికాంత్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల విచారణలో దుర్గ- సత్య ప్రసాద్‌తో కలిసి హైదరాబాద్‌లో ఉన్నట్లు తేలింది. దీంతో కేసును ఎస్ఆర్ నగర్ పోలీసులకు బదిలీ చేశారు. పోలీసులు సత్యప్రసాద్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే తాను దుర్గను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, గతంలో ఆమెకు పెళ్లైన విషయం తెలియదని సత్యప్రసాద్ పోలీసులకు తెలిపాడు. చదవండి: కుటుంబం ఆత్మహత్య కేసు.. సూసైడ్ నోట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడి పేరు? దీంతో పోలీసులు దుర్గను కూడా విచారించాలనుకోగా.. మూడు నెలల కిందట కనిపించకుండా పోయి మహిళ పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమైంది. ఆమె మాట్లాడుతూ.. తనకు శశికాంత్‌తో పెళ్లి జరగలేదని సత్యప్రసాద్‌నే పెళ్లి చేసుకున్నానని తెలిపింది. తనకు పిల్లలు లేరంటూ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది. అంతేగాక భర్తతో కలిసి మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి దుర్గ మొదటి భర్తతోపాటు పిల్లలు, తల్లిదండ్రులు, అత్తమామలు అందరూ వచ్చారు. దుర్గను ఇంటికి రమ్మని అడిగారు. అయితే వాళ్లేవరో తనకు తెలియదంటూ దుర్గ తిట్టిపోసింది. మీడియా ముందే ఆమె ఇద్దరు భర్తలు దుర్గ తనదంటే తనదేనని వాగ్వాదానికి దిగారు. చివరికి. ప్రియుడు సత్య ప్రసాద్తోనే ఉంటానని దుర్గ తేల్చి చెప్పింది. ఇక ఈ కేసును పరిష్కరించడం పోలీసులకు తలనొప్పిగా మారింది. చదవండి: బండి సంజయ్‌కు రిమాండ్.. కరీంనగర్ జైలుకు తరలింపు -
భార్యభర్తల మధ్య గొడవ.. భర్త అదృశ్యం
సాక్షి, మీర్‌పేట(రంగారెడ్డి): భార్య కేసు పెట్టిందని మనస్తాపం చెందిన వ్యక్తి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఏఎస్ఐ తిరుపతయ్య ప్రకారం.. మీర్‌పేట జనప్రియా మహానగర్‌కు చెందిన టి.రవీందర్ (45), వృత్తి రీత్యా ప్రైవేటు ఉద్యోగి. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాలతో కొంత కాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో రవీందర్‌పై గతంలో భార్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కోర్టులో కేసు నడుస్తోంది. దీంతో మనస్తాపం చెందిన రవీందర్ కొన్ని రోజుల క్రితం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అమానుషం: భర్త కంట్లో కారం చల్లి.. కుమారుడితో కలిసి..
సాక్షి, మరిపెడ(వరంగల్): ఆస్తికోసం దారుణం చోటు చేసుకుంది. కుమారుడితో కలిసి భర్తపై భార్య దాడిచేసింది. చితకబాది ఎడమచెవిని కోశారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చింతలగడ్డ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని రూప్‌సింగ్‌తండాలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు.. రూప్‌సింగ్‌తండాకు చెందిన గుగులోతు కోట్యా వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతని పేరుమీద ఉన్న మూడెకరాల భూమిని తమ పేరున చేయాలని భార్య విజయ, కుమారుడు పవన్ కొంత కాలంగా ఒత్తిడి చేస్తున్నారు. వీరిమధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. శనివారం కుమారుడి సహాయంతో భర్త కంట్లో కారం కొట్టి కత్తి, కర్రలతో దాడి చేసింది. ఎడమ చెవును కోశారు. కోట్యా భయంతో బయటకు పరుగుతీసి ప్రాణాన్ని కాపాడుకున్నాడు. ఈ విషయంపై మరిపెడ పోలీస్‌స్టేషన్‌లో భార్య, కుమారుడిపై ఫిర్యాదు చేయగా కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: కారాగారంలో కర్మాగారం -
అక్కను హతమార్చిన తమ్ముడు
సాక్షి, గుంటూరు: తోబుట్టువును సోదరుడే హతమార్చిన ఘటన నగరంలో ఆదివారం చోటుచేసుకుంది. పట్టాభిపురం ఎస్హెచ్ఓ రాజశేఖరరెడ్డి కథనం ప్రకారం మారుతీనగర్‌కు చెందిన కొవ్వూరి యేసు నగరంలో ఆటో నడుపుకుని జీవనం సాగిస్తాడు. 30 సంవత్సరాల క్రితం తన అక్క సీతామహాలక్ష్మి కుమార్తె దానమ్మను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇరువురు పిల్లలు. అయితే రెండు నెలల క్రితం యేసు ప్రమాదవశాత్తు గాయపడ్డాడు. అనంతర కాలంలో భార్యతో తరచూ గొడవలు పడుతుండేవాడు. శనివారం భార్యాభర్తలు తారాస్థాయిలో గొడవపడడంతో సీతామహాలక్ష్మి ఇరువురికీ సర్దిచెప్పే ప్రయత్నం చేసి అక్కడే నిద్రకు ఉపక్రమించింది. దీంతో కోపం పెంచుకున్న యేసు తెల్లవారు జామున ముందు గదిలో నిద్రిస్తున్న అక్క సీతా మహాలక్ష్మమ్మను పలుగుతో మెడపై నొక్కి హత్యచేశాడు. అనంతరం మరోగదిలో నిద్రిస్తున్న భార్య దానమ్మను హతమార్చేందుకు యత్నించాడు. దానమ్మ పెనుగులాడడంతో అలికిడికి పెద్ద కుమారుడు ఆదిసురేష్ నిద్రలేచి తండ్రిని అడ్డుకున్నాడు. తల్లీ, కుమారుడు ఇరువురు మరోగదిలోకి వెళ్లి తలుపులు వేసుకోని కేకలు వేయడంతో యేసు పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. చదవండి: ఎంఐఎం ఎమ్మెల్యే జులుం.. సలాం చేయలేదని చెంపదెబ్బకొట్టాడు -
భార్యతో గొడవ.. ‘కొడుకా’ అని నచ్చచెప్పేందుకు వెళ్తే..
సాక్షి, దేవరకొండ (నల్లగొండ): భార్యతో గొడవెందుకు కొడుకా అని నచ్చచెప్పేందుకు ప్రయత్నించిన వృద్ధురాలిపై దాడికి తెగబడ్డాడు. పండుటాకు అనే కనికరం కూడా లేకుండా ఉన్మాదిలా వ్యవహరిస్తూ ఛాతి ఎడమ భాగంలో పొడవడంతో అక్కడికక్కడే కూప్పకూలి ప్రాణాలొదిలింది. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లి మండల పరిధి లోని చింతచెట్టుతండా గ్రామపంచాయతీ జేత్యతండాకు చెందిన మూఢావత్ రవి వ్యవసాయం చేసుకుంటూ భార్య విజయ, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. మద్యానికి బానిసై.. రవి కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం కూడా మద్యం విషయంలోనే దంపతులు గొడవ పడ్డారు. తనను మద్యం తాగనీయకుంటే చస్తానని, కత్తి తీసుకుని ప్రాణం తీసుకుంటానని భార్యను బెదిరించాడు. పెద్దపెట్టున అరుస్తుండడంతో భర్త తీరుకు విసుగుచెందిన విజయ పిల్లలను తీసుకుని తండాలోనే బంధువు ఇంటికి వెళ్లింది. గొడవ పెట్టుకోవద్దని అన్నందుకు.. కాగా, మూఢావత్ రవి ఇంటి ఎదురుగానే ఇస్లావత్ బంగారి(60), భర్త చందుతో కలిసి జీవనం సాగి స్తోంది. వీరికి కుమారుడు, కుమార్తెకు వివాహాలు కావడంతో హైదరాబాద్‌లోనే కూలిపనులు చేసుకుని జీవిస్తున్నారు. అయితే, రవి తన భార్యతో గొ డవ పెట్టుకుండుడం విన్న బంగారి నచ్చచెప్పేందుకు అతడి ఇంటికి వెళ్లింది. భార్యతో గొడవపెట్టుకోవద్దని, బాగా జీవించాలని చెప్పి ంది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న రవి కత్తితో ఆమెపై పాశవికంగా దాడి చేశాడు. బంగారి ఛాతి ఎడమ భాగంలో బలంగా కత్తితో పొడవడంతో నిల్చున్న చోటే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. తాళ్లతో బంధించి.. రవి ఘాతుకానికి ఎదురుగా అరుగుపై కూర్చున్న బంగారి భర్తతో పాటు మరికొందరు హతాశులయ్యారు. వెంటనే వారు అక్కడికి వెళ్లే సరికి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడి బంగారి ప్రాణాలు వది లింది. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన మరికొందరు తండావాసులు నిందితుడు రవిని తాళ్లతో బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చా రు. బంగారి మృతదేహాన్ని రవి ఇంటి ఎదుట ఉంచి మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బంధువులు ఆందోళన చేపట్టారు. బంగారి మృతి వార్త తెలుసుకున్న బంధువులు తండాకు చేరుకొని బోరున విలపించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ భాస్కర్‌రెడ్డి తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. .తండాలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కొండమల్లేపల్లి, గుడిపల్లి, గుర్రపోండు ఎస్ఐలు భాస్కర్‌రెడ్డి, వీరబాబు, శ్రీనయ్య బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
సంసార విషయంలో గొడవ .. భర్త ఆత్మహత్య
సాక్షి, పటాన్చెరు(మెదక్): సంసార విషయంలో జరిగిన గొడవ భర్త ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైంది. ఈ సంఘటన పటాన్చెరు పోలీసు స్టేషన్‌పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం తాలూక అంబాజీ పేటకు చెందిన శ్రీనివాస్(46) భార్య వరలక్ష్మి పిల్లలతో కలసి బతుకుదెరువు కోసం 18 ఏళ్ల క్రితం పటాన్చెరు పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఓ ప్రైవేట్ పరిశ్రమలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఇంట్లో సరుకులు లేవని భార్య వరలక్ష్మి భర్తతో గొడవపడి ఇద్దరు కూతుర్లు సాయిప్రసన్న, శ్రీదేవిలను తీసుకొని మార్కెట్‌కు వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి బెడ్రూంలో చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని విగతజీవిగా కనిపించాడు. వెంటనే కిందకు దించి ఆటోలో పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కుటుంబ కలహాలు.. భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందనే కోపంతో..
న్యూఢిల్లీ: సాధారణంగా వైవాహిక జీవితంలో కొన్ని ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహలు ఉండటం సహజమే. అయితే, ఈ మధ్యకాలంలో భార్యభర్తలు క్షణికావేశంలో ఒకర్నిమరోకరు హతమార్చుకుంటున్నసంఘటలను తరచుగా వార్తల్లో చూస్తునే ఉంటాం. తాజాగా, ఇలాంటి సంఘటన ఒకటి ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. అమిత్ కుమార్, మిక్కి ఇద్దరు భార్య భర్తలు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అమిత్ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. వీరు సమయ్‌పూర బడ్లీలోని ఒక అపార్ట్మెంట్లో ఉండేవారు. ఇతని సోదరుడు కూడా ఇదే అపార్ట్మెంట్లో ఉండేవాడు. కాగా, అమిత్ కుమార్‌కు.. మిక్కికి మధ్య కలహలు చోటుచేసుకున్నాయి. దీంతో భార్య ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆ తర్వాత మూడు రోజులకు తిరిగి వచ్చింది. అప్పటి నుంచి వీరి మధ్య గొడవలు ఇంకా ఎక్కువయ్యాయి. దీంతో భర్త.. గత సోమవారం భార్య, ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తాను.. కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, సోదరుడు ఈరోజు (మంగళవారం) వెళ్లి సోదరుడికి ఫోన్ చేశాడు. ఎంతసేపటికి కాల్ ఆన్సర్ చేయకపోవడంతో షాక్‌కు గురయ్యారు. ఆతర్వాత.. అతని ఇంటి తలుపుని తట్టారు. ఎంతసేపటికి ఎలాంటి చప్పుడు రాకపోవడంతో.. పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకుని అమిత్ ఇంటి తలుపును పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అక్కడ.. అమిత్, మిక్కి, ఇద్దరు పిల్లలు.. విగత జీవులుగా పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. వారిని పరిశీలించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.