free accommodation
-
పిల్లులంటే ఇష్టమా?.. అయితే ఈ వార్త చదవాల్సిందే!
వీలైతే ప్రేమించండి... మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ప్రేమించడానికి మనుషులే అవసరం లేదు. కొందరు జంతువుల్ని కూడా ప్రేమిస్తారు. జంతు ప్రేమికులు, ప్రకృతి ప్రేమికులు ఇలా ఎంతో మంది ఉన్నారు. అయితే జంతు ప్రేమికులకు ఓ శుభవార్త.. అందులోనూ పిల్లులను ఇష్టపడే వ్యక్తులకు మరింత పనికొచ్చే వార్త. జోన్ బోవెల్ 2010 నుంచి పిల్లుల్ని పెంచుతూ ఉంది. డెన్మార్క్‌కు చెందిన ఈమె ఓ యాభై పిల్లుల్ని పెంచుతూ తన ఇంటినే సాంక్చుయరీలా మార్చేసింది. అయితే తన ఆరోగ్యరిత్యా వేరేచోటుకు మారాల్సివచ్చింది. అయితే తను లేకపోతే సాంక్చుయరీ ఏమైపోతుందో అని బాధపడుతూ.. ఆ పిల్లుల్ని చూసుకోవడానికి ఓ మనిషి కావాలంటూ.. ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ‘ఎవరికైనా పిల్లులంటే ఇష్టముంటే, జంతు ప్రేమికులైతే.. మమల్ని సంపద్రించండి. ఇది సరదా కోసం చేసింది కాదు. మా సాంక్చుయరీని రక్షిస్తూ.. ఇక్కడ ఉండే పిల్లుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. దీనికి గానూ ఉండడానికి ఇళ్లు, జీతం ఇస్తామం’టూ ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. అయితే దీనికి గాను కొన్ని నిబంధనలు కూడా పెట్టింది. వయసు 45 ఏళ్లకు పైబడి ఉంటే బాగుంటుందని, మొదటి ఆరు నెలలు వాలంటీర్‌గా పనిచేయాలని తెలిపారు. ఆసక్తి గలవారు joanbowell@yahoo.com ఈ అడ్రస్‌కు అప్లికేషన్‌తో పాటు ఫోటోను జతచేసి పంపాలని పేర్కొన్నారు. వచ్చిన అప్లికేషన్స్‌లో నచ్చిన వాటిని తీసుకుని ఆగస్టు చివరికల్లా స్కైప్‌లో కాల్ చేసి మాట్లాడతామని తెలిపారు. -
పురుష ఉద్యోగుల మానసిక క్షోభ
ఊరిస్తున్న ఆరు నెలల ఉచిత వసతి సౌకర్యం ఒక వైపు.. అష్టకష్టాలు పడి వెతుక్కున్న అద్దె ఇళ్లు, అడ్వాన్స్ వదులుకోలేని పరిస్థితి మరో వైపు తాత్కాలిక సచివాలయంలో పనిచేస్తున్న పురుష ఉద్యోగులను మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి. గత అక్టోబర్‌లో ‘హైదరాబాద్ నుంచి ఉద్యోగులంతా అమరావతికి రావాల్సిందే’ అని హుకూం జారీ చేసిన ప్రభుత్వం కొత్త ప్రాంతంలో వారి ఇబ్బందులను ఏ మాత్రం పట్టించుకోలేదు. గుంటూరు, విజయవాడ నగరాల్లో రోడ్ల వెంట తిరిగి.. తిరిగి అద్దె ఇళ్లు వెతుక్కొని, అడ్వాన్స్‌లు చెల్లించి మూడు నెలలుగా నివాసముంటున్నారు. ఇప్పటికి కానీ పాలకులు కళ్లు తెరవలేదు. ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తాం.. వస్తారా? అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అమరావతి : వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో పనిచేసే పురుష ఉద్యోగులకు ప్రభుత్వం కల్పించే ఉచిత నివాస వసతి సౌకర్యంపై కొంత ఇష్టం.. కొంత కష్టం అన్న పరిస్థితి కొనసాగుతోంది. హైదరాబాద్ నుంచి మూడు నెలల క్రితమే తరలివచ్చి అద్దె నివాసాల వెతుక్కొనేందుకు పురుష ఉద్యోగులు పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. తీరా ఇళ్లు వెతుక్కొని మూడు నెలలు ఇంటి అద్దెలు అడ్వాన్స్ రూపంలో చెల్లించి ఉంటున్నారు. ఇంత కాలానికి ప్రభుత్వం ఆరు నెలల ఉచిత నివాస సౌకర్యం కల్పిస్తామని చెప్పడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. అదేదో ఉద్యోగులు వచ్చే సమయంలో ఉచిత వసతి సౌకర్యం కల్పించి ఉంటే అద్దె ఇళ్లు వెతుకులాట తప్పేదని వారు వాపోతున్నారు. మూడు నెలలుగా కనీస వసతి సౌకర్యాలు కల్పించకుండా ఉద్యోగుల జీవితాలతో ఆడుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగులపై ప్రేమ పుట్టికొచ్చి ఆరు నెలలు ఉచిత వసతి కల్పిస్తామని చెప్పడంపై వారు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ఒకవేళ అడ్వాన్స్ నగదు వదులు కొని ప్రభుత్వం కల్పించే వసతికి వెళ్లితే ఆరు నెలల తరువాత తమ నివాస పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. అక్టోబర్‌లో వస్తే.. వెలగపూడి తాత్కాలిక సచివాలయంలోకి ఉద్యోగులు అందరూ తరలిరావాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ మొదటి వారంలో అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగులు పెట్టేబేడా సర్దుకొని అమరావతి రాజధాని ప్రాంతంలోకి తరలివచ్చారు. çసచివాలయంలోని అన్ని విభాగాల్లో పనిచేసే సుమారు 8 వందల మంది ఉద్యోగులు విజయవాడ, గుంటూరు పరిధిలో అద్దె ఇళ్లు వెతుక్కొని మూడు నెలలుగా వసతి ఏర్పాటు చేసుకున్నారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో అద్దె ఇళ్లకు డిమాండ్ బాగా ఉండడంతో యజమానులు అద్దెలు కూడా పెంచేశారు. డబుల్ బెడ్ రూం ఇల్లు రూ.12 వేలకు పైమాటే ఈ క్రమంలో ఇళ్లు దొరకడం కష్టంగా ఉండడంతో అద్దె ఎక్కువయినా తప్పని పరిస్థితుల్లో మూడు నెలలు అడ్వాన్స్ చెల్లించి తీసుకున్నారు. మూడు నెలలుగా ఉద్యోగుల వసతి గుర్తుకురాని ప్రభుత్వం తాజాగా ఆరు నెలలు ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తామని చెప్పడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వసతి ఏర్పాటు ముందుగా చేస్తే ఈ అవస్థలు తప్పేవికదా? అంటున్నారు. ఆరు నెలల తరువాత అద్దె ఇళ్లు దొరుకుతాయా..? రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ఉచిత వసతి సౌకర్యం కల్పించడం మంచిదే అయినా ఆరు నెలల తరువాత అప్పటికప్పుడు అద్దె ఇళ్లు మళ్లీ దొరకుతాయా? అనేది ప్రశ్నార్థకరంగా మారింది. అద్దె ఇళ్లు డిమాండ్ నేపథ్యంలో నివాసముంటున్న ఇళ్లు ఖాళీ చేస్తే ఆ తరువాత మళ్లీ వెతుక్కోవటం కష్టంగా ఉంటుందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అద్దె ఇళ్లకు అడ్వాన్స్ రూపంలో చెల్లించిన మూడు నెలల నగదు యజమానులు ఇస్తారా..? లేదా? అనే సందేహం ఉద్యోగుల్లో నెలకొంది. బస్ పాసుల విషయంలో.. సచివాలయ ఉద్యోగులకు బస్సు పాసుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. హైదరాబాద్‌లో నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు నగరంలో రాయితీ పాసులు ఇచ్చేవారు. అదే తరహాలో సీఆర్డీఏ పరిధిలో బస్సు పాసులు ఇస్తారని మూడు నెలలుగా ఉద్యోగులు ఎదురుచూశారు. అయితే ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఉద్యోగులందరూ తమ కష్టాలను ఆర్థిక శాఖ కార్యదర్శి సునీత దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆమె ఆర్టీసీ ఎండీ మాలకొండయ్యతో మాట్లాడి ఉద్యోగులకు బస్సు పాసులు ఇప్పించేలా చేశారు. ఉచిత వసతి ఏడాదికి ఇవ్వాలి ప్రభుత్వం ఆరు నెలల పాటు ఉచిత వసతి కల్పించడం ఆనందమే. కానీ మూడు నెలల క్రితమే అద్దె ఇళ్లకు మూడు నెలల అడ్వాన్స్ చెల్లించి తీసుకున్నాం. ఇంటి యజమాని అడ్వాన్స్ తిరిగి ఇస్తాడన్న నమ్మకం లేదు. ఒకవేళ అద్దె ఇంటిని వదులుకొని వస్తే ఆరు నెలల తరువాత మా పరిస్థితి ఏమిటి?. మహిళా ఉద్యోగులకు ఇచ్చినట్లు వసతి సౌకర్యం ముందే కల్పించి ఉంటే బావుండేది. ప్రభుత్వం ఉచిత వసతి సౌకర్యం ఏడాదికి పెంచాలి. – కె.రాఘవయ్య, ఇండస్ట్రీస్ విభాగాధికారి, సచివాలయం -
‘ఆదర్శ’ విద్య.. వసతి మిథ్య
సాక్షి, రంగారెడ్డి జిల్లా : రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ పథకంలో భాగంగా తలపెట్టిన ఆదర్శ పాఠశాలల లక్ష్యం గాడి తప్పింది. ఆంగ్ల మాధ్యమంలో ఉచిత వసతితో కూడిన బోధన అందించడం ఈ పాఠశాలల ముఖ్యోద్దేశం. ఇవి ప్రారంభమై ఐదేళ్లు కావస్తున్నా.. విద్యార్థులకు మాత్రం వసతి కల్పించకుండా.. కేవలం రోజువారీగా పాఠ్యాంశ బోధన (డే స్కాలర్)తో సరిపెడుతున్నారు. జూన్ రెండో వారంలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థుల వసతిపై సర్కారు ఇప్పటివరకూ ఊసెత్తలేదు. దీంతో ఈ ఏడాది కూడా విద్యార్థులకు హాస్టల్ వసతి మిథ్యేనని తెలుస్తోంది. పన్నెండు పాఠశాలలే.. విద్యాపరంగా వెనకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వం మండలానికో ఆదర్శ పాఠశాలను మంజూరు చేసింది. రెండు విడతల్లో 25 పాఠశాలలు మంజూరయ్యాయి. ఇందులో తొలివిడతగా 19 పాఠశాలలు మంజూరు కాగా.. అందులోనూ కేవలం 12 పాఠశాలలు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, శంషాబాద్, చేవెళ్ల, మర్పల్లి, బంట్వారం, నవాబుపేట్, గండేడ్, కుల్కచర్ల, పూడూరు మండలాల్లో ఈ పాఠశాలలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. వీటిలో రోజువారీగా విద్యార్థులు తర గతులకు హాజరవుతున్నారు. వాస్తవానికి వసతితో కూడిన విద్యనందించేలా వీటి స్థాపన జరిగినప్పటికీ.. హాస్టల్ భవన నిర్మాణాలు సైతం ఇప్పటికీ పూర్తికాలేదు. దీంతో ఆదర్శ పాఠశాలలు లక్ష్యం కుదేలయింది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. విద్యార్థులకు శాపం పాఠశాల భవనాలు నిర్మిస్తున్న కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. ‘ఆదర్శ’ విద్యార్థులకు శాపంగా మారింది. పాఠశాలల నిర్మాణం మొదలై ఐదేళ్లు పూర్తయింది. కానీ ఆ భవనాల నిర్మాణాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తం 19 పాఠశాలలకుగాను 12 పాఠశాలలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇందులో ఇప్పటివరకు ఐదు పాఠశాలల్లోనే హాస్టల్ భవనాలు పూర్తి చేసినట్లు టీఎస్ఈడబ్ల్యూఐడీసీ ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, శంషాబాద్ మండలాల్లోని ఆదర్శ పాఠశాలల్లో వసతి గృహాల నిర్మాణ పనులు కొలిక్కివచ్చాయి. మిగతా ఏడు పాఠశాలల్లో నిర్మాణాలు ఇప్పటికిప్పుడు పూర్తయ్యేలా లేవు.కేవలం భవన నిర్మాణాల పూర్తితో హాస్టళ్లు కొనసాగించే వీలు లేదు. హాస్టళ్లలో వార్డెన్‌తో సహా ఇతర కేటగిరీలకు సంబంధించి ఉద్యోగులను నియమించాలి. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఈ వసతిగృహాల అంశాన్ని ప్రస్తావించడం లేదు. మరోవైపు ఆర్‌ఎమ్‌ఎస్‌ఏ పథకంపై కేంద్ర సర్కారు చేతులెత్తేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా నిర్వహించాల్సి ఉంది. కానీ సర్కారు వసతిగృహాల నిర్వహణపై నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ ఏడాది ఆదర్శ విద్యార్థులకు వసతి కలగానే మిగలనుంది. -
నిజాం రుబాత్ వివాదానికి తెర
జెడ్డాలో రుబాత్ ఆర్గనైజర్‌తో డిప్యూటీ సీఎం చర్చలు సాక్షి, హైదరాబాద్: సౌదీ అరేబియాలోని మక్కా నిజాం రుబాత్ భవనంలో రాష్ట్ర హజ్ యాత్రికుల ఉచిత వసతి వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. సోమవారం అక్కడి జెడ్డా పట్టణంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, అక్కడి భారత రాయబారి ముబారక్‌తో కలిసి రుబాత్ కార్యనిర్వాహకుడు హుస్సేన్ మహ్మద్ అల్ షరీఫ్‌తో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా హజ్-2015లో 600 మంది యాత్రికులకు రుబాత్‌లో ఉచిత వసతి కల్పించేందుకు అంగీకారం కుదిరింది. ఈ యాత్రికులను ఎంపిక చేసేందుకు హైదరాబాద్‌కు రావాలని హుస్సేన్ మహ్మద్‌ను మహమూద్ అలీ కోరగా.. ఆయన అంగీకరించారు. ఈ మేరకు ఈ నెల 22న లేదా 23న రాష్ర్ట హజ్ హౌస్‌లో జరిగే లక్కీడ్రా కార్యక్రమానికి ఆయన హాజరవుతారు. ఏమిటీ వివాదం: హైదరాబాద్ సంస్థానం నుంచి హజ్ యాత్రకు వెళ్లే యాత్రికుల కోసం 1857లో నిజాం నవాబు మక్కాలో 14 ధర్మసత్రాలు నిర్మించారు. అందులో 13 సత్రాలు అన్యాక్రాంతమయ్యాయి. మిగిలిన దానినే నిజాం రుబాత్‌గా పిలుస్తుంటారు. హైదరాబాద్‌లోని నిజాం నవాబు ధార్మిక కమిటీ ఆ రుబాత్ నిర్వహణ బాధ్యతలను చూసేది. ఆ పనుల నిమిత్తం మక్కాకు ప్రత్యేకంగా ఉద్యోగులను పంపేది. అలా చివరగా వెళ్లిన ఉద్యోగి ఒకరు సౌదీ పౌరసత్వాన్ని తీసుకుని, అక్కడే ఉండిపోయారు. ఆయన కుమారుడు హుస్సేన్ మహ్మద్ అల్ షరీఫ్ ప్రస్తుతం నిజాం రుబాత్‌కు కార్యనిర్వాహకుడిగా ఉన్నారు. అయితే తొలి నుంచి డీజీపీ, మతపెద్దలతో కూడి కమిటీ.. రాష్ట్రం నుంచి హజ్‌కు వెళ్లేవారిలో కొందరిని లాటరీ ద్వారా రుబాత్‌లో ఉచిత వసతి కోసం ఎంపిక చేసేది. కానీ మూడేళ్లుగా రుబాత్ నిర్వాహకుడే నేరుగా ఎంపిక చేయడం వివాదానికి కారణమైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ జోక్యంతో ఈ వివాదం ఒక కొలిక్కి వచ్చింది.