Gandhinagar
-
మోడల్ సోలార్ సిటీగా అయోధ్య: ప్రధాని మోదీ
గాంధీనగర్: ప్రధాని మోదీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా గాంధీనగర్‌లో ‘పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ పథకం’ లబ్ధిదారులతో ఆయన సంభాషించారు. అలాగే ‘గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీటింగ్ అండ్ ఎగ్జిబిషన్’ (రీ-ఇన్వెస్ట్ 2024) నాలుగో ఎడిషన్‌ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ 140 కోట్ల జనాభా కలిగిన భారత దేశాన్ని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని అన్నారు. మూడవ సారి అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో వేగవంతమైన అభివృద్ధి దిశగా అడుగులు వేశామన్నారు. ప్రతి రంగంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రయత్నించామన్నారు. యూపీలోని అయోధ్యను మోడల్ సోలార్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు.భారతదేశంలో కనిపించే వైవిధ్యం, సామర్థ్యం, పనితీరు అన్నీ ప్రత్యేకమైనవేనని ప్రధాని మోదీ అన్నారు. అందుకే ‘ఇండియన్ సొల్యూషన్స్ ఫర్ గ్లోబల్ అప్లికేషన్స్’ అని అంటున్నానని, దీనిని ప్రపంచం కూడా అర్థం చేసుకుంటుందన్నారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలో పునరుత్పాదక ఇంధన రంగంలో గుజరాత్ అగ్రగామిగా నిలిచిందని, రాష్ట్ర పునరుత్పాదక ఇంధన విధానం, గ్రీన్ హైడ్రోజన్ విధానం హరిత భవిష్యత్తుపై రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయన్నారు. గుజరాత్లో పునరుత్పాదక శక్తి స్థాపిత సామర్థ్యం 50 వేల మెగావాట్లను దాటింది. సోలార్ ఎనర్జీ ఇన్‌స్టాలేషన్‌లో గుజరాత్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని పటేల్ అన్నారు.ఇది కూడా చదవండి: కౌన్ బనేగా ఢీల్లీ సీఎం? రేసులో వీళ్లే! -
34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ స్థానం బీజేపీకి కంచుకోట అని చెబుతారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి బరిలోకి దిగిన బీజేపీ సిట్టింగ్ ఎంపీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా రికార్డు స్థాయిలో 10 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధిస్తారని ఆ పార్టీ అంచనావేస్తోంది.గతంలో ఈ నియోజకవర్గానికి ఎల్‌కె అద్వానీ, అటల్ బిహారీ వాజ్‌పేయి తదితర దిగ్గజ నేతలు ప్రాతినిధ్యం వహించారు. 1989 నుంచి ఈ సీటు బీజేపీకి కంచుకోటగా ఉంది. కాంగ్రెస్ తరపున గతంలో ఎన్నికల బరిలోకి దిగిన టీఎన్ శేషన్, రాజేష్ ఖన్నాలు కూడా ఈ బీజేపీ కోటను చేధించలేకపోయారు.ఈసారి అమిత్‌షాపై గుజరాత్ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సోనాల్ పటేల్ పోటీకి దిగారు. 2019 ఎన్నికల్లో ఐదున్నర లక్షలకు పైగా ఓట్ల తేడాతో షా గెలిచారు. 10 లక్షలకు పైగా గెలుపు మార్జిన్‌ను పెంచడమే తమ పార్టీ లక్ష్యమని స్థానిక బీజేపీ నేతలు చెబుతున్నారు.గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో 21.5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. దీనిలో గాంధీనగర్ నార్త్, కలోల్, సనంద్, ఘట్లోడియా, వేజల్పూర్, నారన్‌పురా, సబర్మతి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అహ్మదాబాద్ ప్రాంతంలోని ఐదు అర్బన్ స్థానాలు (ఘట్లోడియా, వేజల్పూర్, నారన్‌పురా, సబర్మతి, సనంద్) సహా మొత్తం ఏడు స్థానాలను 2022 అసెంబ్లీ ఎన్నికలలో అధికార బీజేపీ గెలుచుకుంది.1999 సార్వత్రిక ఎన్నికలలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన టీఎన్ శేషన్ కాంగ్రెస్ తరపున బరిలోకి దిగారు. అదే సమయంలో అతనికి ప్రత్యర్థిగా బీజేపీ అద్వానీని రంగంలో నిలిపింది. ఆ ఎన్నికల్లో శేషన్ ఓటమి పాలైనా అద్వానీకి గట్టిపోటీ ఇవ్వడంలో విజయం సాధించారు. 1991 నుండి 2014 వరకు అద్వానీ గాంధీనగర్ నుండి ఆరుసార్లు గెలిచారు.1996 లో వాజ్‌పేయి ఈ స్థానంతో పాటు లక్నో నుంచి కూడా పోటీ చేశారు. ఈ రెండు స్థానాల్లో ఆయన విజయం సాధించారు. ఈ నేపధ్యంలో గాంధీనగర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీకి చెందిన విజయ్ పటేల్‌పై బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాను కాంగ్రెస్ పోటీకి నిలబెట్టింది. అయితే ఖన్నా ఓటమి పాలయ్యారు. 2019లో అద్వానీ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి అమిత్ షా పోటీ చేశారు. గుజరాత్లో మూడో విడత సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 26 లోక్‌సభ స్థానాలకు గాను 25 స్థానాలకు నేడు (మంగళవారం) పోలింగ్ జరగనుంది. -
గాంధీనగర్ లో గల్లంతైన మహిళ మృతి
-
తీవ్ర విషాదం.. నాలాలో పడి మహిళ గల్లంతు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా చెరువులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ విషాదకర ఘటన చోటుచేసుకుంది. గాంధీనగర్‌లో నాలాలో పడిపోయి ఓ మహిళ గల్లంతయ్యింది. వివరాల ప్రకారం.. వర్షాల నేపథ్యంలో గాంధీనగర్ నాలాలో పడిపోయి మహిళ గల్లంతయ్యింది. సదరు మహిళను లక్ష్మిగా గుర్తించారు. దీంతో, రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది గల్లంతైన మహిళ కోసం గాలిస్తున్నారు. నాలుగు బృందాలుగా విడిపోయి మూసీ నదిలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ గాలింపు చర్యల్లో 100 మంది డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొని మూసీని జల్లెడ పడుతున్నారు. పది కిలోమీటర్ల మేర డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె కూతురు మీడియాతో మాట్లాడుతూ.. నిన్న మధ్యాహ్నం రెండు గంటల నుంచి మా అమ్మ కనిపించడం లేదు. వర్షం కారణంగానే నాలా ఉప్పొంగి ప్రవహిస్తోంది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందన్నారు. నాలాను ఆనుకుని మేము గోడ కట్టుకుంటామని చెప్పినా అధికారులు అంగీకరించలేదన్నారు. తాము ఒక గోడ నిర్మించిన తర్వాతే.. మేము గోడ కట్టుకోవాలని సూచించినట్టు తెలిపారు. ఎన్నో రోజులుగా గోడ నిర్మిస్తామని చెప్పినా ఇప్పటి వరకు అది జరగలేదన్నారు. ఇది కూడా చదవండి: అనుమానాస్పద స్థితిలో ముంబై ఎయిర్ హోస్టెస్ మృతి -
'ఆయుష్మాన్ భారత్' అద్భుతం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్
గాంధీనగర్: గుజరాత్ లోని గాంధీనగర్‌లో జరిగిన జీ20 సదస్సు ఆరోగ్య శాఖ మంత్రల సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డా.టెడ్రోస్ అధనం ఘెబ్రేయేసుస్ భారత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కొనియాడారు. జీ20 సదస్సు ప్రారంభోత్సవం సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ సదస్సును ఇంతటి స్థాయిలో నిర్వహిస్తున్నందుకు ముందుగా భారత్‌కు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా ఆరోగ్యం విషయంలో భారత దేశం అనుసరిస్తోన్న విధానాలను కొనియాడుతూ ఆయుష్మాన్ భారత్ పథకంపై ప్రశంసలు కురిపించారు. నేనొక హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ కి వెళ్లాను. అక్కడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ద్వారా కనీసం వెయ్యి గృహాల వరకు సేవలందిస్తుండడం చూసి ఆశ్చర్యపోయాను. గుజరాత్ లోని టెలి మెడిసిన్ సౌకర్యం కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. వైద్య రంగంలో డిజిటల్ సేవలు ఒక విప్లవాత్మక మార్పని చెబుతూ జీ20 సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ కు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి మన్సుఖ్ మందవియా మాట్లాడుతూ ఈ సమావేశాలకు సుమారు 70 దేశాల నుండి ఆరోగ్యశాఖ మంత్రులు, ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. జీ20 ప్రెసిడెన్సీ సదస్సు ద్వారా భారత దేశంలో మేము అవలంబిస్తున్న ఆరోగ్య విధానాల గురించి ప్రజలకు తెలియజేశామని మోదీ ప్రభుత్వం ఆరోగ్యానికి ఏ స్థాయిలో ప్రాధాన్యతనిచ్చిందో చెప్పే ప్రయత్నం చేశారు. ఆగస్టు 17న మొదలైన ఈ సమావేశాలు ఈరోజు వరకు విజయవంతంగా జరిగాయి. ఈ సమావేశం ప్రధానంగా మూడు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. అత్యవసర ఆరోగ్యసమస్యలు నివారణ, యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్ ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి పరిస్థితుట్లకు తగట్టుగా స్పందించి సిద్దపడటం.. సురక్షితమైన, ప్రభావవంతమైన,నాణ్యమైన సేవలందించే విధంగా ఫార్మసీ రంగాన్ని బలోపేతం చేయడం గురించి ప్రస్తావించినట్లు తెలిపారు కేంద్ర మంత్రి. ఇది కూడా చదవండి: మూత్రం ఆపుకోలేని పిల్లాడిపై పోలీసుల ప్రతాపం.. జైలుకు తరలించి.. -
Semicon India 2023: సెమీకండక్టర్ తయారీ పరిశ్రమలకు 50 శాతం ఆర్థిక సాయం
గాంధీనగర్: దేశంలో సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలకు ఊతం ఇచ్చే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. స్థానికంగా సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలు నెలకొల్పే టెక్నాలజీ సంస్థలకు 50 శాతం ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు. ఇలాంటి పరిశ్రమలకు తమ ప్రభుత్వం రెడ్‌కార్పెట్ పరుస్తోందని అన్నారు. శుక్రవారం గుజరాత్ రాజధాని గాం«దీనగర్‌లో ‘సెమికాన్ ఇండియా–2023’ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం ప్రసంగించారు. ప్రపంచంలో వేర్వేరు కాలాల్లో ప్రజల ఆకాంక్షలు, అవసరాలే ప్రతి పారిశ్రామిక విప్లవాన్ని ముందుకు నడిపించాయని గుర్తుచేశారు. ఇప్పుడు నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని భారతీయుల ఆకాంక్షలే ముందుకు నడిపిస్తున్నాయని తాను నమ్ముతున్నానని తెలిపారు. భారత్‌లో సెమీకండక్టర్ పరిశ్రమ అభివృద్ధికి పూర్తి అనుకూల వాతావరణం ఉందన్నారు. ‘సెమికాన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా పరిశ్రమ వర్గాలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని వివరించారు. దీన్ని మరింత పెంచుతున్నామని, ఇకపై దేశంలో సెమికండర్టక్ తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేసే సంస్థలకు ఏకంగా 50 శాతం ఆర్థిక సాయం అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. 300 కాలేజీల్లో సెమికండక్టర్ డిజైన్ కోర్సులు భారత్‌లో సెమీకండక్టర్ పరిశ్రమ వృద్ధికి ఇక ఆకాశమే హద్దు అని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఏడాది క్రితం భారత్‌లో ఈ పరిశ్రమలో ఎందుకు పెట్టుబడులు పెట్టాలని ప్రశ్నించేవారని, ఇప్పుడు ఎందుకు పెట్టకూడదో చెప్పాలని అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ రంగంలో పెట్టుబడులకు భారత్ ‘గ్రాండ్ కండక్టర్’గా మారుతోందని హర్షం వ్యక్తం చేశారు. విశ్వసనీయమైన ‘చిప్ సప్లై చైన్’ అవసరం ప్రపంచానికి ఉందన్నారు. అతి తక్కువ కార్పొరేట్ ట్యాక్స్ ‘నేషనల్ క్వాంటన్ మిషన్’ను ఇటీవలే ఆమోదించామని, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నామని వెల్లడించారు. క్వాంటమ్ టెక్నాలజీలో శాస్త్రీయ పరిశోధనలు, అభివృద్ధి, నూతన ఆవిష్కరణలకు క్వాంటన్ మిషన్ దోహదపడుతుందన్నారు. సెమికండక్టర్ పరిశ్రమకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి పెట్టామని, దేశంలో పదేళ్లలో సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం 20 రెట్లు పెరిగిందని గుర్తుచేశారు. సోలార్ పీవీ, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రోలైజర్స్ విధానాల్లో కరెంటును ఉత్పత్తి చేయాలని నిర్ణయించామన్నారు. సదస్సులో పలు దేశాల పారిశ్రామికవేత్తలు, సెమికండక్టర్ రంగ నిపుణులు పాల్గొన్నారు. జీవ వైవిధ్య పరిరక్షణలో భారత్ ముందంజ చెన్నై: జీవ వైవిధ్య పునఃస్థాపన, పరిరక్షణ, అభివృద్ధికి చర్యలు చేపట్టడంలో భారత్ ముందంజలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన ‘జి–20 పర్యావరణ, వాతావరణ స్థిరత్వ మినిస్టీరియల్’ సదస్సులో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. గంగా నదిని శుభ్రపరిచేందుకు నమామి గంగ మిషన్ అమలు చేస్తున్నామన్నారు. ‘‘భారతీయులకు ప్రకృతే పెద్ద గురువు. భూమాత పరిరక్షణ అందరి బాధ్యత’’ అన్నారు. -
గుజరాత్ వరదల్లో కొట్టుకుపోయిన వందల సిలిండర్లు
గాంధీనగర్: గుజరాత్లో కురుస్తోన్న భారీ వర్షాలకు ఆ రాష్ట్రమంతా అతలాకుతలమైన సంగతి తెలిసిందే. అక్కడ ఇంకా వర్ష ఉధృతి తగ్గకపోవడంతో ఐఎండీ ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది. ఇక జునాగఢ్ జిల్లాలో అయితే భారీ సంఖ్యలో పార్కింగ్ కార్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఒక గ్యాస్ ఏజెన్సీ గోడౌన్లో నుండి వందలకొద్దీ గ్యాస్ సిలిండర్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. అసలే ఆకాశాన్నంటిన ధర కారణంగా గ్యాస్ సిలిండర్ సామాన్యుడికి అందనంత స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ ధర ఎప్పుడు తగ్గుతుందా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. ఒకపక్క సామాన్యుడి గోడు ఇలా ఉంటే మరోపక్క గుజరాత్ లో వర్షాల కారణంగా నవసరి పట్టణం జునాతనా ప్రాంతంలో ఉన్న జుమ్రు గ్యాస్ ఏజెన్సీ నుండి వందల కొద్దీ సిలిండర్లు వరదలో కొట్టుకుపోతూ కనిపించాయి. ఈ వీడియోని ఎవరో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దీనికి విశేష స్పందన లభించింది. మిగతా వారి సంగతెలా ఉన్నా కానీ సామాన్యులు మాత్రం సిలిండర్లు వరద ప్రవాహంలో పోతుంటే వాటి విలువ తెలిస్తే అంత నిర్లక్ష్యంగా వాటిని కొట్టుకుపోనిచ్చేవారు కాదని వాపోతున్నారు. Flood like situation in Navsari city Gas cylinders of Jhumru Gas Agency in Junathana area were also washed away in water#GujaratRain #navsari pic.twitter.com/Uk2gUvAFOg — Ishani Parikh (@ishaniparikh) July 22, 2023 ఇది కూడా చదవండి: పబ్జీ ప్రేమకథ: వాడెలా నచ్చాడు తల్లీ.. వాడిలో ఏముంది? -
అత్యాచార కేసులో ఆశారాం బాపునకు జీవిత ఖైదు
అహ్మదాబాద్: దశాబ్దకాలం నాటి అత్యాచారం కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక వేత్త ఆశారాం బాపూ దోషిగా తేలిన విషయం తెలిసిందే. 2013లో తన ఆశ్రమంలో నివసిస్తున్న మహిళపై లైంగికదాడి కేసులో గాంధీనగర్ సెషన్స్ కోర్టు సోమవారం ఆయన్ను దోషిగా తేల్చింది. ఈ కేసులో తీర్పును రిజర్వు చేసిన న్యాయమూర్తి.. తాజాగా నేడు (జనవరి31) అతనికి జీవిత ఖైదు శిక్ష విధిస్తున్నట్లు వెల్లడించారు. కాగా గుజరాత్ మోతేరాలోని ఆశారాం బాపూ ఆశ్రమంలో పనిచేస్తున్న సమయంలో 2001 నుంచి 2006 వరకు తనపై గురువు పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్టు ఓ మహిళ 2013లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సూరత్‌కు చెందిన మహిళ ఆశారాం బాపూతో సహా ఏడుగురిపై అత్యాచారం, అక్రమ నిర్బంధం కేసు పెట్టారు. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీనిపై విచారణ జరిపిన గాంధీనగర్‌లోని సెషన్స్ కోర్టు ఈ కేసులో ఆశారాంను దోషిగా తేల్చింది. ఇదే కేసులో సరైన ఆధారాలు లేనందున ఆశారాం భార్య, కుమార్తె, కుమారుడితో పాటు మరో నలుగురు మహిళలను నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆశారాంకు జీవిత ఖైదు విధించింది. కాగా 81 ఏళ్ల ఆశారం బాపూ ప్రస్తుతం మరో అత్యాచారం కేసులో జోధ్‌పూర్ జైలులో శిక్షననుభవిస్తున్నారు. జోధ్‌పూర్ ఆశ్రమంలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారన్న ఆరోపణలపై ఆయనపై కేసు నమోదవ్వగా..2018లో జోధ్‌పూర్ ట్రయల్ కోర్టు దోషిగా తేల్చింది. అతడిని ఇండోర్‌లో అరెస్టు చేసిన పోలీసులు అనంతరం జోధ్‌పూర్‌కు తరలించారు. 2013 నుంచి జోధ్‌పూర్ జైలులోనే ఉన్నారు. ప్రముఖ అధ్యాత్మిక గురువుగా దేశ విదేశాల్లో శిష్యులను సంపాదించుకున్న ఆశారం చివరకు ఇలా కటకటాలపాలయ్యారు. చదవండి: చైనా సంస్థ నుంచి డబ్బులు తీసుకొనే బీబీసీ తప్పుడు ప్రచారం' -
హీరాబెన్ అంత్యక్రియలు.. తల్లి పాడె మోసిన ప్రధాని మోదీ.. (ఫొటోలు)
-
గాంధీనగర్ లో హీరాబెన్ అంత్యక్రియలు
-
హ్యాట్సాఫ్ .. స్టేటస్
కుషాయిగూడ: తప్పిపోయిన ఇద్దరు చిన్నారుల ఆచూకీ ఓ అధికారి ఫోన్లో పెట్టిన స్టేటస్‌తో కనుగొన్న ఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మాలోరి లక్ష్మీరవి, సత్యమూర్తి దంపతులు కాప్రా, గాంధీనగర్ కాలనీలో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్నారు. వారికి శివ అశ్లేష (7), యామిని (4) ఇద్దరు కూతుళ్లు. అశ్లేష రెండో తరగతి చదువుతుండగా యామిని అంగన్వాడీ కేంద్రానికి వెళ్తుంది. శుక్రవారం రోజులానే వెళ్లిన ఇద్దరు చిన్నారులు సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో ఇల్లు మర్చిపోయి నేరేడ్మెట్ వైపు నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన ఎస్సై వేణుమాధవ్ చిన్నారుల ఫొటోలను తన సెల్‌ఫోన్ స్టేటస్‌లో పెట్టి ఆచూకి తెలిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు. పెట్రోలింగ్ పోలీసుల సాయంతో సుమారు గంట పాటుగా పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. అంతలోనే ఎస్సై స్టేటస్ చూసిన తెలిసిన వ్యక్తి పిల్లలు నేరేడ్మెట్ ప్రాంతంలో ఉన్నట్లు తెలిపాడు. వెంటనే అక్కడికెళ్లి పిల్లలను స్టేషన్‌కు తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్సై వేణుమాధవ్ సమయస్ఫూర్తిని స్థానికులు అభినందించారు. (చదవండి: ఆరోగ్యవంతమైన సమాజం కోసం యోగా అవసరం’) -
ఎద్దు ఢీకొని దెబ్బతిన్న వందే భారత్ రైలు.. నెలలో మూడో ఘటన
గాంధీనగర్: ముంబయి- గాంధీనగర్ మధ్య నడుస్తోన్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వరుస ప్రమాదాలకు గురవుతోంది. శనివారం ఉదయం ఎద్దును ఢీకొట్టడంతో మందుభాగం ఊడిపోయింది. నెల రోజుల్లోనే ఇలాంటి సంఘటనలు జరగటం ఇది మూడోసారి కావటం గమనార్హం. గుజరాత్‌లోని అతుల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉదయం 8.17 గంటలకు రైలును ఎద్దు ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ కోచ్ ముందుభాగం ఊడిపోయింది. దానిని బాగు చేసేందుకు 15 నిమిషాల పాటు రైలు ఆగిపోయింది. ఈ రైలు డ్రైవర్ బోగీ నోస్ కోన్ కవర్ ధ్వంసమైందని భారత రైల్వే శాఖ వెల్లడించింది. గాంధీనగర్-ముంబయి మధ్య వందే భారత్ సెమీ-హైస్పీడ్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే జెండా ఊపి ప్రారంభించారు. అక్టోబర్ 1 నుంచి ఈ రైలు సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. ప్రమాదాలు జరుగుతున్న క్రమంలో ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్. పశువులు ఢీ కొట్టే ఘటనలను తప్పించలేమని, రైలు డిజైనింగ్ సమయంలో వీటిని పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు. ఇదీ చదవండి: మొరాయించిన ‘వందే భారత్’ ట్రైన్.. వరుసగా మూడో రోజూ సమస్య..! -
గేదెలు ఢీకొట్టడంతో దెబ్బతిన్న వందే భారత్ రైలు.. 24 గంటల్లోనే..
ముంబై: గేదెలు ఢీకొట్టిన ప్రమాదంలో దెబ్బతిన్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును అధికారులు బాగుచేశారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే రైలుకు మరమత్తులు నిర్వహించారు. దెబ్బతిన్న రైలు ముందు భాగంలోని మెటల్ ప్లేట్‌ను ముంబై సెంట్రల్‌లోని కోచ్ కేర్ సెంటర్లో మార్చారు. దీనిని ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్(ఎఫ్ఆర్పీ)తో తయారు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోను అధికారులు ట్విటర్లో షేర్ చేశారు. కాగా ముంబై నుంచి గాంధీనగర్ వెళ్తుండగా గురువారం అహ్మదాబాద్ సమీపంలో పట్టాలపై వెళ్తుండగా గేదెలను ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ గాయాలు కాకపోయినా రైలు ముందు భాగం ధ్వంసమైంది. ఏకంగా ఇంజిన్ ముందు భాగం ఊడిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో రైలు గంటకు 100 కి.మీ. వేగంతో ఉంది. అయితే రైలు ప్యానెల్ లేకుండానే గాంధీనగర్ స్టేషన్, తిరిగి ముంబై సెంట్రల్‌కు సకాలంలో ప్రయాణించింది. గాంధీనగర్-ముంబై సెంట్రల్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను 2022, సెప్టెంబర్ 30న జెండా ఊపి ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ ట్రైన్ స్పీడును గరిష్ఠంగా 160 కిలోమీటర్లుగా ఉందని అధికారులు తెలిపారు. అయితే రైలు ప్రమాదానికి గురికావడంతో విపక్షాలు మోదీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టాయి. ప్రారంభించిన 6 రోజుల్లోనే బర్రెలు ఢీకొడితేనే రైలు పార్టులు ఊడిపోవటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చదవండి: ఇదెక్కడి గొడవరా బాబూ.. సీటు కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలు -
వారం కూడా కాలేదు.. ‘వందే భారత్’కు త్రుటిలో తప్పిన ప్రమాదం!
అహ్మదాబాద్: కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ముంబై సెంట్రల్- గాంధీనగర్ క్యాపిటల్ మధ్య ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం రైలు పట్టాలపైకి గేదేలు రావటంతో వాటిని ఢీకొట్టింది. దీంతో రైలు ఇంజిన్ ముందుభాగం పూర్తిగా దెబ్బతిన్నది. బట్వా, మనినగర్ స్టేషన్ల మధ్య గురువారం ఉదయం 11.15 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని, ట్రైన్‌ను బాగు చేసి గమ్యానికి చేర్చినట్లు పశ్చిమ రైల్వే జోన్ అధికారులు తెలిపారు. అనుకున్న సమయానికే గాంధీనగర్ క్యాపిటల్ నుంచి ముంబై సెంట్రల్ స్టేషన్‌కి చేరుకున్నట్లు చెప్పారు. గాంధీనగర్-ముంబై సెంట్రల్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను 2022, సెప్టెంబర్ 30న జెండా ఊపి ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ ట్రైన్ స్పీడును గరిష్ఠంగా 160 కిలోమీటర్లుగా ఉందని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: Ravan Dahan: బెడిసి కొట్టిన రావణ దహనం.. ఆపై ఎద్దు వీరంగం.. వీడియో వైరల్ -
దేశ భవితను తీర్చిదిద్దేది నగరాలే
అహ్మదాబాద్: భారత్ భవిష్యత్‌ను నగరాలే తీర్చిదిద్దుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వచ్చే 25 ఏళ్లలో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశాల సరసన చేర్చడానికి నగరాలే కీలకమని అభిప్రాయపడ్డారు. ప్రపంచ వాణిజ్య డిమాండ్‌కి అనుగుణంగా కొత్త నగరాలను దేశంలో నిర్మిస్తున్నామని చెప్పారు. గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి మహారాష్ట్రలో ముంబై మధ్య నడిచే సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్, అహ్మాదాబాద్ మెట్రో రైలు ఫేజ్–1ని శుక్రవారం ప్రారంభించిన అనంతరం అక్కడికి వచ్చిన జన సందోహాన్ని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. గాంధీనగర్–అహ్మదాబాద్ జంట నగరాలుగా మారి అద్భుతమైన అభివృద్ధిని సాధించాయన్నారు. ‘‘మారుతున్న కాలానికి తగ్గట్టుగా నగరాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దేశంలోని నగరాల్లో అధికంగా దృష్టి సారించి పెట్టుబడులు భారీగా పెడుతున్నాము. వచ్చే 25 ఏళ్లలో ఈ నగరాలే భారత్‌ను అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలుపుతాయి’’ అని మోదీ అన్నారు. నగరాల అభివృద్ధితో పాటు ఎంపిక చేసిన పట్టణాలను స్మార్ట్ సిటీలుగా రూపురేఖలు మార్చే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. గాంధీ నగర్లో ఉదయం 10.30 గంటలకి మోదీ పచ్చ జెండా ఊపి వందేభారత్ రైలుని ప్రారంభించారు. ఆ తర్వాత అదే రైల్లో నగరంలోని ఆహ్మదాబాద్‌లోని కాలూపూర్ రైల్వేస్టేషన్ వరకు మోదీ ప్రయాణించారు. ‘‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రధాని మోదీ ప్రయాణించారు. రైల్వే సిబ్బంది కుటుంబసభ్యులు, మహిళా వ్యాపారవేత్తలు, యువతీయువకులు ఆయన తోటి ప్రయాణికులుగా ఉన్నారు’’ అని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. దేశంలో ఇది మూడో వందేభారత్ రైలు. 2019లో మొట్టమొదటి రైలు న్యూఢిల్లీ–వారణాసి మధ్య ప్రారంభం కాగా, రెండో రైలు న్యూఢిల్లీ–శ్రీమాతా వైష్ణోదేవి కాట్రా మార్గంలో ప్రారంభమైంది. అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్‌కి ప్రధాని మోదీ తిరుగు ప్రయాణంలో ఒక అంబులెన్స్‌కి దారి ఇవ్వడానికి ఆయన కాన్వాయ్‌ని నిలిపివేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కవచ్ టెక్నాలజీతో భద్రతా వ్యవస్థ వందేభారత్ రైలులో రైళ్లు ఢీకొట్టుకునే ప్రమాదాన్ని నివారించడానికి దేశీయ కవచ్ టెక్నాలజీని వినియోగించారు. పూర్తి ఎయిర్ కండిషన్ సదుపాయంతో పాటు ఆటోమేటిక్ తలుపులు, ప్రతీ సీటు దగ్గర మొబైల్ చార్జింగ్ పాయింట్లు,అటెండెంట్‌ను పిలవడానికి కాల్ బటన్, బయో టాయిలెట్లు, సీసీ కెమెరాలున్నాయి. గంటకి 160 కి.మీ. గరిష్ట వేగంతో రైలు ప్రయాణించగలదు. శుక్రవారం ఈ రైలు అయిదున్నర గంటల్లో ముంబైకి చేరింది. -
వ్యాక్సినేషన్ సక్సెస్‌ను వదిలేసి.. నా ఫొటోపై పడ్డారు
గాంధీనగర్: కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌పై మోదీ ఫొటో ఎందుకంటూ ప్రతిపక్షాలు నిలదీయడంపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. కోవిడ్ వ్యాక్సిన్ లబ్ధిదారులకు తక్షణమే సర్టిఫికెట్‌ను అందజేసిన భారత్‌ను చూసి ప్రపంచమంతా చర్చించుకుంటుండగా, కొందరు మాత్రం ఆ సర్టిఫికెట్‌పై తన ఫొటో ఉండటంపై రాద్ధాంతం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గాంధీనగర్‌లో సోమవారం ఆయన డిజిటల్ ఇండియా వీక్–2022ను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ఆన్లైన్ చెల్లింపుల విధానం తీసుకురావద్దంటూ కొందరు పార్లమెంట్లో వాదించారని, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశంలో డిజిటల్ సాంకేతిక ప్రవేశంతో ప్రజల జీవితాలు మారిపోయాయని ప్రధాని చెప్పారు. యూపీఐ ఫలితంగా చిరు వ్యాపారులు కూడా తమ రోజువారీ కార్యకలాపాలను సాగిస్తున్నారన్నారు. బిహార్‌లోని ఓ వ్యక్తి డిజిటల్ విధానంలో కూడా తనకు దానం చేయవచ్చంటూ క్యూఆర్ కోడ్ ప్లకార్డును మెడలో కట్టుకుని బిచ్చమెత్తుకుంటున్న విషయం ప్రస్తావించారు. వివిధ రకాల సేవలు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాక ప్రజలు క్యూల్లో నిల్చోవాల్సిన బాధ తప్పిందన్నారు. ఆధునిక సాంకేతికతను భారత్ అందిపుచ్చుకోనట్లయితే ఇప్పటికీ వెనుబడి ఉండేదన్నారు. ‘పదేళ్ల క్రితం ప్రజలు బర్త్ సర్టిఫికెట్లు, బిల్లుల చెల్లింపు, పరీక్షల ఫలితాలు, ప్రవేశాల కోసం క్యూల్లో నిలబడేవారు. ఇప్పుడు అన్ని సేవలను ఆన్లైన్ చేసి క్యూలు లేకుండా చేశాం’ అని చెప్పారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం ఫలితంగా అన్ని రంగాల్లో దళారీ వ్యవస్థను అరికట్టగలిగినట్లు చెప్పారు. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి ప్రబలిన సమయంలో 80 కోట్ల మంది పేదలకు సులువుగా ఉచిత రేషన్ అందించామన్నారు. ఇలా ఉండగా, ప్రధాని మోదీ గురువారం సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సుమారు రూ.1,800 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని పీఎంవో తెలిపింది. -
యూత్ వింగ్ లీడర్ హల్చల్.. వీడియో వైరల్
గాంధీనగర్: పోలీసు కానిస్టేబుల్‌పై హత్యాయత్నం నేరం కింద ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరెస్ట్ అయ్యాడు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీ కింద జైలుకు తరలించారు. వివరాల ప్రకారం.. డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి చేసి, కానిస్టేబుల్‌ను తన కారు బానెట్‌పైకి లాగినందుకు గుజరాత్ ఆప్ యువజన విభాగం నాయకుడు యువరాజ్‌సింగ్ జడేజాను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, మంగళవారం కొందరు నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం గాంధీనగర్‌లోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వద్ద నిరసనలకు దిగారు. వారికి మద్దతు తెలిపేందుకు జడేజా అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు, జడేజా మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం అక్కడి నుంచే వెళ్లిపోయే క్రమంలో జడేజా.. వేగంగా తన కారు నడుపుతూ పోలీసులపైకి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో కారు ఓ కానిస్టేబుల్ పైకి దూసుకెళ్లగా.. అతను కారు బ్యానెట్‌పైకి ఎక్కి జాగ్రత్తపడ్డాడు. అనంతరం జడేజా అక్కడి నుంచే పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులపై హత్యాయత్నం కింద ఆప్ నేతపై కేసు నమోదు చేసినట్టు ఇన్స్పెక్టర్ జనరల్ (గాంధీనగర్ రేంజ్) అభయ్ తెలిపారు. Gujarat AAP youth wing leader Yuvrajsinh Jadeja held for attacking cops, dragging constable on his car's bonnet.#AAP #Gujarat #Politics pic.twitter.com/ap5INyGybd — My Vadodara (@MyVadodara) April 6, 2022 జడేజా అరెస్ట్‌పై ఆప్ నేత ప్రవీణ్ రామ్ స్పందిస్తూ.. బీజేపీ ప్రభుత్వం తమను(ఆప్) చూసి భయపడుతోందని ఆరోపించారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని అన్నారు. ప్రభుత్వ రిక్రూట్మెంట్ పరీక్షల్లో అక్రమాలను బయటపెట్టిన తర్వాత జడేజాను సర్కార్ టార్గెట్ చేసిందన్నారు. ఫారెస్ట్ గార్డుల రిక్రూట్మెంట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం కూడా లీక్ అయిందని జడేజా ఇటీవల పేర్కొన్నాడు. -
అదిరిపోయిన తొలి 3డీ గృహం.. 28 రోజుల్లోనే నిర్మాణం..!
ఇండియన్ ఆర్మీకి చెందిన మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్(ఎంఈఎస్) 3డీ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి రెండు ఇళ్లను నిర్మించింది. అవును! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల మాదిరిగానే 3డీ గృహాలు నిర్మించింది. 3డీ రాపిడ్ కనస్ట్రక్షన్ టెక్నాలజీని ఉపయోగించి ఈ ఇళ్లను నిర్మించినట్లు తన అధికారిక ప్రకటనలో తెలిపింది. గాంధీనగర్‌లోని నైరుతి ఎయిర్ కమాండ్ ఈ 3డీ గృహాలను దేశంలో మొట్టమొదటి సారిగా నిర్మించింది. ఈ గృహాలను నాలుగు వారాల వ్యవధిలోనే నిర్మించడం విశేషం. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను ఏఎన్ఐ మీడియా ట్విటర్ వేదికగా షేర్ చేసింది. ఈ భారత సాయుధ దళాల పెరుగుతున్న వసతి అవసరాలను వేగంగా తీర్చడానికి ఈ 3డీ గృహాలను నిర్మించాల్సి వస్తుంది అని రక్షణ దళాలు పేర్కొన్నాయి. చెన్నైకి చెందిన స్టార్టప్ త్వాస్తా సహకారంతో ఈ ఇళ్లను నిర్మించారు. ప్రతి ఇల్లు సుమారు 700 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ గృహాలను భూకంపాలు తట్టుకునే విధంగా నిర్మించినట్లు పేర్కొన్నారు. ఇంతకు ముందు ఎంఈఎస్ భారతదేశంలోని మొదటి 3డీ ప్రింటెడ్ శానిటరీ బ్లాక్‌లను జైసల్మేర్ వద్ద సుమారు 600 చదరపు అడుగుల స్థలంలో నిర్మించింది. #WATCH how the Indian Army’s Military Engineering Services constructed two houses within four weeks using the 3D Printing Technology in construction. (Source: Indian Army) pic.twitter.com/bMf3G3aO01 — ANI (@ANI) March 14, 2022 (చదవండి: బంగారం రుణం తీసుకునే వ్యాపారులకు భారత్ పే శుభవార్త..!) -
పోలీసులంటే ఇంకా భయమే
గాంధీనగర్: అంతర్గత భద్రతా వ్యవస్థను ఆధునీకరించేందుకు స్వాతంత్య్రానంతరం పెద్దగా ప్రయత్నాలే జరగలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘బ్రిటిష్ హయాంలో జనాలను భయభ్రాంతులను చేయడమే అంతర్గత భద్రతా వ్యవస్థ లక్ష్యంగా ఉండేది. ఇప్పటికీ ఈ విషయంలో పెద్దగా మార్పు రాలేదు. పోలీసులంటే ప్రజల్లో భయం, వారికి దూరంగా ఉండాలన్న భావనే కన్పిస్తున్నాయి’’ అని ఆవేదన వెలిబుచ్చారు. ఈ పరిస్థితిని మార్చేందుకు తక్షణం సంస్కరణలు రావాల్సిన అవసరముందన్నారు. ఆయన శనివారం గాంధీనగర్‌లోని రాష్ట్రీ య రక్షా యూనివర్సిటీ (ఆర్ఆర్యూ) తొలి స్నాతకోత్సవంలో ప్రసంగించారు. పోలీసు సిబ్బంది సంఖ్యను పెంచితే చాలదని, టెక్నాలజీ, జనం సైకాలజీ, యువతరం భావోద్వేగాలను అర్థం చేసుకునే నైపుణ్యమున్న శిక్షితులైన అధికారులు తక్షణావసరమని అన్నారు. ‘‘పోలీసులు సంఘ విద్రోహ శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించగలగాలి. ప్రజలతో సున్నితంగా వ్యవహరించి వారిలో స్నేహభావన, నమ్మకం పెంపొందించాలి. అంటే శిక్షణ పద్ధతుల్లోనే మార్పు రావాలి’’ అని అన్నారు. విపరీతమైన పనిభారం పోలీసు సిబ్బంది విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, పని భారంతో సతమతం అవుతున్నారని ప్రధాని అన్నారు. ‘‘వారికి ఆసరాగా నిలిచే ఉమ్మడి కుటుంబాల వంటి సంప్రదాయ వ్యవస్థలు క్షీణించడం పరిస్థితిని మరింత జటిలం చేసింది. పైగా నేటి పరిస్థితుల్లో భద్రతా సిబ్బంది కేవలం శారీరకంగా ఫిట్‌గా ఉంటే చాలదు. మానసికంగా కూడా దృఢంగా ఉండాలి. ఎందుకంటే శారీరక వైకల్యమున్నా మానసికంగా దృఢంగా సిబ్బంది భద్రతా వ్యవస్థలకు ఎంతగానో ఉపయోగపడగలరు. అందుకే ఒత్తిడిని దూరం చేసుకునేందుకు వారికి యోగ శిక్షణ, నిపుణుల మద్దతు వంటివి తప్పనిసరి’’ అని అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ సెక్యూరిటీ వ్యవస్థ, సంబంధిత స్టార్టప్‌ల విస్తరణను కూడా ప్రస్తావించారు. ఆర్ఆర్యూ విద్యార్థులు వాటిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. భద్రత, రక్షణ తదితర రంగాల్లో మహిళల రాక పెరుగుతుండటం శుభ పరిణామమన్నారు. 1,090 మంది ఆర్ఆర్యూ విద్యార్థులు ఈ సందర్భంగా పట్టాలు అందుకున్నారు. కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గుజరాత్గవర్నర్ ఆచార్య దేవవ్రత్, సీఎం భూపేంద్ర పటేల్ తదితరులు పాల్గొన్నారు. పోలీసులు, నేర న్యాయ వ్యవస్థల్లో సుశిక్షిత సిబ్బందిని అందించేందుకు 2020లో ఆర్ఆర్యూ స్థాపన జరిగింది. రెండు రోడ్ షోలు వచ్చే డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్లో ప్రధాని మోదీ శనివారం మరో రెండు రోడ్ షోలు చేశారు. ఉదయం గాంధీనగర్ జిల్లాలో దేగం నుంచి లవద్‌లోని రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ దాకా 12 కిలోమీటర్ల రోడ్ షో నిర్వహించారు. ఓపెన్ టాప్ జీప్‌లో ప్రజలకు అభివాదం చేస్తూ సాగారు. సాయంత్రం అహ్మదాబాద్‌లో ఇందిరా బ్రిడ్జి నుంచి సర్దార్ పటేల్ స్టేడియం దాకా 3.5 కిలోమీటర్ల మేర మామూలు జీప్‌లో రోడ్ షో చేశారు. అయితే పలుచోట్ల వాహనం దిగి, ‘మోదీ, మోదీ’ అని నినదిస్తున్న జనాన్ని పలకరిస్తూ సాగారు. గుజరాత్లో 1988 నుంచీ బీజేపీయే అధికారంలో ఉంది. -
ఆ పెళ్లి పత్రిక బరువు ఎంతో తెలుసా?
గాంధీనగర్: సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించుకోవాలనుకుంటారు. ఈ వివాహ కార్యక్రమాల కోసం ఎంత ఖర్చుపెట్టడానికైనా వెనుకాడరనే విషయం తెలిసిందే. పెళ్లికి ముందు ప్రీవెడ్డింగ్ షో నుంచి ప్రతివేడుక ప్రత్యేకంగా ఉండాలనుకొని ప్లాన్లు వేస్తుంటారు. పెళ్లి వేడుకలకు సంబంధించి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా రాజస్థాన్‌లో జరిగిన పెళ్లి వేడుక ప్రస్తుతం మరోసారి వార్తల్లోకి నిలిచింది. గుజరాత్‌కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త మౌలేష్బాయ్ ఉకానీ కుమారుడి వివాహం, సోనాల్బేన్ అనే యువతితో నిశ్చయమైంది. తాను.. బిజినెస్‌మ్యాన్ కావడంతో తన కొడుకు వివాహ వేడుక గ్రాండ్‌గా చేయాలనుకున్నాడు. తన కుమారుడి పెళ్లి కోసం జోధ్‌పూర్‌లోని ఉమెద్ భవన్ ప్యాలెస్‌ను బుక్ చేసుకున్నాడు. ఆ ప్యాలెస్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనాలలో ఒకటి. అక్కడ వేడుకలకు గాను.. ఒక రోజుకు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు చార్జ్ చేస్తారు. ఆ కల్యాణ మండపంలో ప్లేట్ మీల్స్ ఖరీదు 18 వేల రూపాయలు. అయితే, మౌలేష్ బాయ్ తన కుమారుడి వెడ్డింగ్ కార్డును ప్రత్యేకంగా ముద్రించాడు. అది నాలుగు కేజీల బరువును కలిగి ఒక పెద్ద బాక్సు మాదిరిగా ఉంది. దానిలో పెళ్లి పత్రికతోపాటు.. పెళ్లి వేడుకలో జరిగే కార్యక్రమాలు ముద్రించారు. దానిపై కృష్ణుడి ప్రతీమను కూడా ప్రత్యేకంగా ఉండేలా చూశారు. ఆ పెళ్లి పత్రికలో ప్రత్యేకంగా కొన్ని బాక్సులను ఏర్పాటు చేశారు. దానిలో అతిథుల కోసం ప్రత్యేకంగా, డ్రైఫ్రూట్స్, చాక్లెట్లు, స్వీట్లను ఏర్పాటు చేశారు. ఆ కార్డు ధర ఏడు వేల రూపాయలు, దాన్ని ప్రత్యేకంగా పింక్ కలర్లో ముద్రించారు. దీంతో ఆ పెళ్లి బాక్సు అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. కాగా, వివాహ వేడుక బంధువులు, స్నేహితుల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. గత నెలలోనే పెళ్లి జరిగిపోయినప్పటికీ ఈ వార్త మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. -
తల్లి లొంగలేదని కూతురిని బలిగొన్న కామాంధుడు
సూర్యాపేట రూరల్: అనారోగ్యంతో బాధపడుతున్న కూతుర్ని తీసుకొచ్చిన తల్లిపై కన్నేశాడు. తన కోరిక తీర్చడానికి ఆమె అంగీకరించలేదన్న అక్కసుతో బిడ్డకు పసరు తాగించి పొట్టన పెట్టుకున్నాడు. సూర్యాపేట పట్టణ శివారులోని దురాజ్‌పల్లి గ్రామానికి చెందిన పల్లపు దుర్గయ్య, రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కూలి పనులు చేసుకుంటూ కుమార్తెలను చదివిస్తున్నారు. చిన్న కుమార్తె శ్రావణి(18) కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయిస్తున్నారు. అయినా నయం కాకపోవడంతో శ్రావణిని ఆమె తల్లిదండ్రులు సోమవారం ఉదయం సూర్యాపేట మండలం గాంధీనగర్‌లోని దర్గా వద్ద నాటు వైద్యం చేసే జక్కిలి భిక్షపతి వద్దకు తీసుకొచ్చారు. భిక్షపతి శ్రావణిని చూసి.. ఆరోగ్యం నయం చేస్తానని, రెండు రోజులు అక్కడే ఉండాలని సూచించాడు. దీంతో వారు దర్గా వద్దే ఉండిపోయారు. సోమవారం అర్ధరాత్రి భిక్షపతి పాలల్లో పసరు కలిపి శ్రావణికి తాగించాడు. మంగళవారం ఉదయం ఎంత లేపినా శ్రావణి లేవకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది బంధువులు, కుటుంబ సభ్యులకు తెలిపారు. చదవండి: మహిళను నమ్మించి.. పది నిమిషాల్లో వస్తానని చెప్పి.. కోరిక తీర్చనందుకే.. భిక్షపతి తన కోరిక తీర్చాలని.. లేదంటే శ్రావణిని కాటికి పంపిస్తానని సోమవారం రాత్రి బెదిరించాడని యువతి తల్లి రాజేశ్వరి తెలిపింది. దీనికి నిరాకరించడంతో భిక్షపతి కోపంతో పాలల్లో పసరు కలిపి శ్రావణికి తాగించాడంది. అప్పటిదాకా బాగానే ఉన్న శ్రావణి పాలు తాగిన తర్వాతే మరణించిందని ఆమె బోరున విలపించింది. ఆదివారం రాత్రే ఇంటికి వెళ్తామని చెప్పినా.. వెళ్లనివ్వకుండా అడ్డుకున్నాడని విలపించింది. శ్రావణి (ఫైల్) భిక్షపతి విషయం తెలుసుకున్న దురాజ్‌పల్లి గ్రామస్తులు మంగళవారం దర్గా వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శ్రావణి మృతికి కారణమైన భిక్షపతిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. భిక్షపతిని రూరల్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. కాగా, భిక్షపతి కొన్నేళ్లుగా గాంధీనగర్ గ్రామ సమీపంలో దర్గా ఏర్పా టు చేసుకుని నాటు వైద్యం చేస్తున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. ఒంట్లో బాగోలేక తన వద్దకు వచ్చిన వారిని లైంగికంగా వేధిస్తున్నట్టు తెలిపారు. చదవండి: రియల్టర్ విజయ్‌భాస్కర్‌రెడ్డి హత్య కేసులో కొత్త కోణం..తుపాకీ ఎక్కడ? -
పాక్‌కు భారత రహస్యాలు చేరవేస్తున్న కానిస్టేబుల్ అరెస్టు
న్యూఢిల్లీ: దాయాది పాకిస్తాన్‌కు భారత్ భద్రత పరమైన విషయాలను చేరవేస్తున్న ఒక బీఎస్ఎఫ్ కానిస్టేబుల్‌ను గుజరాత్‌లోని గాంధీనగర్‌లో యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ (ఏటీఎస్)పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. కాగా, జమ్ముకశ్మీర్ రాజౌరీకి చెందిన మహమ్మద్ సజ్జద్ అనే వ్యక్తి బీఎస్ఎఫ్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కొంతకాలంగా భారత్ భద్రతపర రహస్యాలను ఫోన్ మెసెజ్ ద్వారా పాక్‌కు చేరవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుడు బీఎస్ఎఫ్లో చేరక ముందు 46 రోజులు పాక్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇతను డబ్బుల కోసం భారత్ సున్నిత అంశాలను దాయాది పాక్‌కు చేరవేస్తున్నాడని ఏటీఎస్ డిప్యూటి ఎస్పీ చవ్దా తెలిపారు. Gujarat: BSF constable Mohammad Sajjad held from Gandhinagar for allegedly passing sensitive information to Pakistan "A resident of J&K's Rajouri, he went to Pakistan& stayed there for 46 days before joining BSF. He used to send information on WhatsApp," says ATS Dy SP BM Chavda pic.twitter.com/3sUQIoVoNy — ANI (@ANI) October 25, 2021 చదవండి: భర్త పోస్టులకు మరో మహిళ లైక్‌లు .. చిర్రెత్తుకొచ్చిన ఆ భార్య.. -
ఇన్‌స్టాలో పరిచయం.. ఇంటికి పిలిచి మత్తుమందు కలిపి..
అహ్మదాబాద్: ఇది ఇంటర్నెట్ యుగం. ప్రపంచంలోని అనేక విషయాలు అర చేతిలోని ఫోన్లో ఇట్టే తెలుసుకోవచ్చు. సోషల్ మీడియా పుణ్యమా అని ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో తెలుస్తోంది. అయితే సోషల్ మీడియా ద్వారా ఏర్పడిన కొన్ని స్నేహాలు మోసాలకు దారితీస్తున్నాయి. తాజాగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ విద్యార్థి సోషల్ మీడియాలో పరిచయమైన ట్రెయినీ ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మత్తుమందు కలిపిన పానీయం తాగించి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చదవండి: తీహార్ జైల్లో కర్రలతో కొట్టి గ్యాంగ్‌స్టర్ గుజ్జర్ హత్య పోలీసుల వివరాల ప్రకారం.. గుజరాత్ రాష్ట్రం వేజల్పూర్ ప్రాంతానికి చెందిన త్రివేది (22)కి ఏడు నెలల కిందట ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతి (22) పరిచయమైంది. అనంతరం వారిద్దరూ తరచూ సోషల్ మీడియాలో చాటింగ్ చేసేవారు. ఈ క్రమంలో తమ ఫోన్ నంబర్లను ఇచ్చిపుచ్చుకున్నారు. కొన్నాళ్లకు వ్యక్తిగతంగా కలవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్‌లో త్రివేది తన ఇంటికి ఆ యువతిని పిలిచాడు. ఇంటికొచ్చిన అమ్మాయిపై మోజు పెరిగింది. దీంతో ఆమెపై కోరిక తీర్చుకోవాలని భావించి పానీయంతో మత్తు మందు కలిపి ఇచ్చాడు. అది తాగిన యువతి స్పృహ తప్పింది. అనంతరం అతడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా నిందితుడు ఆ దృశ్యాలను కెమెరాలో రికార్డు చేసి వాటిని చూపించి ఆ యువతిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఆ వీడియోలతో భయపడుతూ ఆమెపై తరచూ బలత్కారం చేస్తున్నాడు. అతడి తీరుతో విసిగిపోయిన ఆ యువతి ఎట్టకేలకు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు అజిత్ త్రివేదిని వేజల్పూర్లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. చదవండి: ఏడాదిన్నర క్రితం వివాహం, మొదట్లో బాగానే ఉన్నా.. తర్వాత ఆమెను.. -
నెల క్రితం భార్య హత్య.. చిక్కననుకున్నాడు.. కానీ..!
గాంధీనగర్: గుజరాత్‌లోని ఆంకలేశ్వర్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి దాంపత్య జీవితంలో గొడవల కారణంగా సైనైడ్ ఇంజెక్ట్ చేసి భార్యను హత్య చేశాడు. అయితే దాదాపు నెల రోజుల తర్వాత పోలీసులకు లభించిన ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా నిందితుడిని ఆదివారం అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ‘‘జిగ్నేష్ పటేల్ అనే వ్యక్తి ఏడు సంవత్సరాల క్రితం ఊర్మిళ వాసవ అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే వారి మధ్య విభేదాలు తలెత్తడంతో సంసారంలో గొడవలు మొదలయ్యాయి. కాగా దాదాపు నెల క్రితం జూలై 8న అతడి భార్యకు ఛాతి నొప్పి వచ్చింది. దీంతో గుజరాత్‌లోని ఆంకలేశ్వర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితురాలు చికిత్స పొందుతున్నప్పుడు, నిందితుడు దొంగతనంగా సైనైడ్ టాబ్లెట్‌తో ఓ ద్రావణాన్ని తయారు చేశాడు. తర్వాత వైద్యులు, ఇతర ఆసుపత్రి సిబ్బంది లేనప్పుడు సిరంజిని ఉపయోగించి ఆమెకు జత చేసిన డ్రిప్ బాటిల్లోకి ఆ ద్రావణాన్ని ఇంజెక్ట్ చేశాడు. అది శరీరంలోకి ప్రవేశించిన వెంటనే బాధితురాలు మరణించింది. ఆపై పోలీసులు ప్రమాదవశాత్తు మరణించినట్లు కేసు నమోదు చేశారు. కానీ ఎఫ్ఎస్ఎల్ నివేదిక ప్రకారం వాసవ శరీరంలోకి సైనైడ్ ఇంజెక్ట్ చేయడంతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిని ఆమె భర్త జిగ్నేశ్ పటేల్ ఆంక్లేశ్వరంలోని ఫ్యాక్టరీ నుంచి కొనుగోలు చేశాడు.’’ అని పోలీసు అధికారి తెలిపారు. -
అమానవీయం: మహిళకు లిఫ్ట్ ఇచ్చినందుకు.. ఎంత పనిచేశారు..
గాంధీనగర్: గుజరాత్లో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. తెలిసిన వ్యక్తి.. మోటర్ బైక్ ఎక్కినందుకు ఆ మహిళను సదరు గ్రామస్థులు సూటిపోటి మాటలతో వేధించారు. అంతటితో ఆగకుండా.. ఆమెకు లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కూడా అంటగట్టారు. ఈ సంఘటన సబర్కాంత జిల్లాలోని సాంచేరీ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. హిమ్మత్ నగర్ పట్టణానికి సమీపంలోని సాంచేరీ గ్రామంలో 30 ఏళ్ల మహిళ జీవిస్తోంది. ఆమెకు నలుగురు పిల్లలు. కాగా, ఆమె భర్త అనారోగ్యం కారణంగా మృతి చెందారు. దీంతో కుటుంబ భారాన్ని తానే మోస్తుంది. ఈ క్రమంలో ఆమె.. గత నెల జులై 30న హిమ్మత్‌నగర్ పట్టణానికి బ్యాంక్ పని మీద వెళ్లింది. ఆ తర్వాత సాయంత్రం తన గ్రామానికి వెళ్తుంది. ఆ సమయంలో ఆమెకు తెలిసిన ఒక వ్యక్తి.. తన మోటర్ బైక్ ఎక్కాల్సిందిగా కోరాడు. దీంతో ఆమె తెలిసిన వ్యక్తి అని ఎక్కింది. కాగా, వారిద్దరు కలిసి సాంచేరీ గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో కొంత మంది వారిద్దరిని చూసి దూశించారు. సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించారు. పాపం.. భర్త చనిపోయిన మహిళ అని కూడా జాలీలేకుండా విచక్షణ రహితంగా అవమానించారు. దీంతో బాధిత మహిళ తీవ్రంగా కుమిలిపోయింది. ఆరోపణలు చేసిన వారికి సరైన గుణపాఠం చెప్పాలనుకుంది. దీంతో ఆమె గ్రామంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అకారణంగా తనకు వివాహేతర సంబంధం అంటగట్టినందుకు వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో, స్థానిక పోలీసులు.. వేదాంశి చౌహన్, రాజుజీ చౌహన్, కలుసిన్హ్ చౌహన్, రాకేంన్షి చౌహన్, సురేఖ చౌహన్, సోనాల్ చౌహన్ లను అదుపులోనికి తీసుకున్నారు. నిందితులో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.