general meeting
-
రాజకీయాల్లోకి తమిళ నటుడు విజయ్?
చెన్నై: తమిళ నటుడు దళపతి విజయ్ రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకుగాను త్వరలోనే కొత్తగా రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు. చెన్నైలో గురువారం జరిగిన విజయ్ అభిమానుల సంఘం ‘విజయ్ మక్కల్ ఇయక్కమ్’సర్వసభ్య సమావేశం ఇందుకు ఆమోదం తెలిపింది. విజయ్ అధ్యక్షతన ఏర్పాటయ్యే పార్టీకి నియమ నిబంధనలను ఖరారు చేసే అధికారం కూడా ఈ సమావేశం విజయ్‌కే వదిలేసింది. నెలలోగా పార్టీ నమోదు ప్రక్రియను పూర్తి చేస్తారని సమాచారం. తమిళనాడుతోపాటు కేరళలోనూ విజయ్‌కు భారీగా అభిమానులున్నారు. ఆయన పలు సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారు. స్థానిక ఎన్నికల్లోనూ విజయ్ అభిమానుల సంఘం పోటీ చేసింది. 2026 ఎన్నికల్లో రాజకీయాల్లోకి ప్రవేశిస్తానంటూ గతంలోనే ఆయన ప్రకటించారు. -
కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం
-
టీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్.. కేసీఆర్ రాజకీయ ప్రస్థానంలో మరో మలుపు..
Updates: తెలంగాణ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖితమైంది. 21 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో మలుపు చోటుచేసుకుంది. జాతీయ రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ ఆవిర్భావించింది. జాతీయ పార్టీకి సంబంధించిన పేపర్లపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్(భారత్ రాష్ట్ర సమితి)గా మారుస్తూ తీర్మానానికి సభ్యులు ఆమోదం తెలిపారు. పార్టీ పేరును బీఆర్ఎస్గా సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. నేటి నుంచి టీఆర్ఎస్ కనుమరుగు కానుంది. టీఆర్ఎస్ స్థానంలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావించింది. జాతీయ రాజకీయాలే లక్ష్యంగా బీఆర్ఎస్ అవతరించింది. ►టీఆర్ఎస్ పేరు మారుస్తూ ఈసీకి పార్టీ ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్చాలని టీఆర్ఎస్ కోరింది. ఈ మేరకు పార్టీ రాజ్యాంగంలో సవరణలు చేశారు. యథావిధిగా పార్టీ జెండా, గుర్తు కొనసాగనున్నాయి. ►జాతీయ పార్టీ కోసం టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ ఆరుగురు ఎమ్మెల్యేలు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జాతీయ పార్టీగా ఎందుకు మారుస్తున్నామో కేసీఆర్ వివరించారు. తెలంగాణ భవన్లో కీలక భేటి కొనసాగుతోంది. సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ముందుగా తెలంగాణలో భవన్లో ప్రొ.జయశంకర్ విగ్రహానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. సర్వసభ్య సమావేశంలో 283 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశానికి కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, వీసీకే పార్టీ(తమిళనాడు) అధినేత తిరుమావళవన్, జాతీయ రైతు సంఘాల నేతలు హాజరయ్యారు. చదవండి: టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ 'మరో ప్రస్థానం' టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ తీర్మానం చేయనున్నారు. మధ్యాహ్నం 1.19 గంటలకు జాతీయ పార్టీకి సంబంధించి పేపర్లపై ముహూర్తానికి సీఎం కేసీఆర్ సంతకం పెట్టనున్నారు. సమావేశం తర్వాత ప్రతినిధులు, అతిథులకు ప్రగతి భవన్లో లంచ్ ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. -
కాసేపట్లో టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం
-
భారత్‌లో పెట్టుబడులను తగ్గించట్లేదు: గౌతమ్ అదానీ
న్యూఢిల్లీ: దేశ అభివృద్ధితోనే తమ సంస్థల పురోగతి ముడిపడి ఉందని పారిశ్రామిక గ్రూప్ దిగ్గజం అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే భారత్‌లో పెట్టుబడులు పెట్టడాన్ని ఎన్నడూ తగ్గించలేదని, మరింతగా ఇన్వెస్ట్ చేస్తున్నామని స్పష్టం చేశారు. తమ 70 బిలియన్ డాలర్ల పెట్టుబడుల ఊతంతో భారత్.. ఆయిల్, గ్యాస్‌ను దిగుమతి చేసుకునే దేశం స్థాయి నుంచి పరిశుభ్రమైన ఇంధనాలను ఎగుమతి చేసే దేశంగా మారగలదని అదానీ ధీమా వ్యక్తం చేశారు. ‘భారత్‌లో ఇన్వెస్ట్ చేయడం నుంచి మేము ఎప్పుడూ తప్పుకోలేదు. మా పెట్టుబడులు ఎన్నడూ నెమ్మదించలేదు. మా వ్యాపారాల స్థాయి, పనితీరుతో ఎలాంటి మార్కెట్ పరిస్థితుల్లోనైనా నెగ్గుకురాగలమన్న ధీమా మాకు ఉంది’ అని గ్రూప్ కంపెనీల వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. చదవండి: యూజర్లకు షాక్, భారీగా పెరిగనున్న అమెజాన్ ప్రైమ్ ధరలు..ఎక్కడంటే -
అర్ధరాత్రి హైడ్రామా.. పన్నీర్ సెల్వంకు భారీ ఊరట
చెన్నై: అన్నాడీఎంకే పార్టీలో వర్గ పోరు పంచాయితీ మరోసారి న్యాయస్థానాన్ని చేరింది. అయితేసారి జరిగిన అర్ధరాత్రి హైడ్రామాలో పళనిస్వామికి ఝలక్ తగిలింది. అధికారం ఒక్కరి చేతుల్లోనే ఉండాలన్న తీర్మానంపై చర్చ మాత్రమే జరగొచ్చని అయితే.. ఆ తీర్మానంపై ఆమోదించడం లాంటి నిర్ణయం తీసుకోకూడదని డివిజన్ బెంచ్ ఆదేశించింది. దీంతో పన్నీర్‌సెల్వం వర్గానికి భారీ ఊరట లభించినట్లు అయ్యింది. జూన్ 23న(ఇవాళ) అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ భేటీ వెంకటాచలపతి ప్యాలెస్‌లో నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో.. సమావేశంలోనే అధికారం ఒక్కరి చేతిలోనే ఉండాలని మాజీ ముఖ్యమంత్రి, పార్టీ కో-కోఆర్డినేటర్ పళనిస్వామి(EPS) తీర్మానం చేయాలనుకున్నాడు. అయితే.. మాజీ డిప్యూటీ సీఎం.. పార్టీ కోఆర్డినేటర్ పన్నీరుసెల్వం ఆ నిర్ణయాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ జరపకుండా నిలువరించాలని పోలీసులకు ఫిర్యాదుతో పాటు కోర్టుకు చేరింది ఈ వర్గపోరు పంచాయితీ. అయితే.. మద్రాస్ హైకోర్టు భేటీని, తీర్మానాలు చేయకుండా ఆపేలా పార్టీని ఆదేశించలేమని, అది పూర్తిగా ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అయితే దీనిపై మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది పన్నీర్ సెల్వం వర్గం. జనరల్ కౌన్సిల్ సభ్యుడు షణ్ముగం అభ్యర్థనతో అర్ధరాత్రిపూట మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ న్యాయమూర్తి ఎం దురై స్వామి ఇంట్లో వాదనలు నడిచాయి. ఈ విచారణకు జస్టిస్ సుందర్ మోహన్ సైతం హాజరయ్యారు. వాదనల అనంతరం మద్రాస్ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తూ.. ముందుగా ప్రకటించిన 23 తీర్మానాలపై మాత్రం అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే ఇతర వ్యవహారాలపై చర్చ మాత్రమే జరగాలని పేర్కొంది. దీంతో ఇవాళ భేటీ జరుగుతుండగా.. ఒక్కరి చేతిలోనే అన్నాడీఎంకే పగ్గాలు ఉండాలన్న పళనిస్వామి తీర్మానానికి ఆమోదం లభించడం కుదరదనే చెప్పాలి. Chennai, Tamil Nadu | AIADMK workers, leaders gather at Shrivaaru Venkatachalapathy Palace, Vanagaram for party's General Council meeting to be held today. pic.twitter.com/9lnaL8OJvD — ANI (@ANI) June 23, 2022 చదవండి: ‘డమ్మీ రాష్ట్రపతి’గా ద్రౌపది ముర్ము.. తీవ్ర ఆరోపణలు -
ఒచ్చిర్రు.. కూసుర్రు.. పోయిర్రు..
సాక్షి, శామీర్‌పేట్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే మండల సాధారణ సర్వసభ్య సమావేశం సోమవారం తూతూమంత్రంగా జరిగింది. సభలో సమస్యల గురించి చర్చించి.. ఆ సమస్యల సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు బాధ్యతా రాహిత్యంగా కనిపించారు. వీరి తీరుపై పలువురు సభ్యులు అసహనం వ్యక్తం చేయడంతో సభ రసాబాసగా మారింది. పదవి అంటే అనుభవించడం కాదు అది ఒక బాధ్యత (దేశ సేవ) అని తెలుసుకున్న నాడే గ్రామాల అభివృద్ధి సాధ్యం అవుతుందనేది గమనించాలి. సభా దృష్టికి వచ్చిన విషయాలు.. మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు దాసరి యెళ్ళుబాయి అధ్యక్షతన సోమవారం శామీర్‌పేట మండల సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సభ్యులు పలు సమస్యలను సభా దృష్టికి తీసుకొచ్చారు. చదవండి: నాడు డెల్టా.. నేడు ఒమిక్రాన్.. వెంటాడుతున్న కరోనా వైరస్ గుబులు ♦ మజీద్‌పూర్ ప్రభుత్వ పాఠశాలలో రెండ్డు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని వెంటనే భర్తీ చేయాలని సర్పంచ్ మోహన్‌రెడ్డి సభా దృష్టికి తీసుకొచ్చారు. ♦ ప్రజయ్‌హోమ్స్‌లో మురుగుతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. సమస్యను గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎంపీటీసీ అశోక్‌రెడ్డి ఆరోపించారు. ♦ కరోనా రెండో డోస్ వేసుకోని వారు ముందుకొచ్చి వ్యాక్సిన్ తీసుకునేలా గ్రామాల్లో అవగాహన కల్పించాలని మండల వైద్యాధికారులు కోరారు. ♦ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారానికి నోచుకోవడం లేదని సభ్యులు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ♦ ప్రజల ఓటేస్తే గెలిచిన తాను ప్రజా సమస్యలు పరిష్కరించలేనప్పుడు ఈ ఎంపీటీసీ పదవి ఎందుకని అలియాబాద్ ఎంపీటీసీ కోడూరి అశోక్ సభలో ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, సర్పంచ్ల గైర్హాజరు... సోమవారం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సభ అధికారులు, పలువురు సభ్యులు ఆలస్యంగా రావడంతో సుమారు 35 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమయ్యింది. కొందరు మండల స్థాయి అధికారుల గైర్హాజరు అయ్యారు. శామీర్‌పేట మండలంలోని 10 మంది సర్పంచ్‌లలో నలుగురు సర్పంచ్‌లే హాజరవడం గమనార్హం. చదవండి:హైదరాబాద్: ఆరేళ్లలో కొట్టేసిన మొత్తం అక్షరాలా రూ.4,611 కోట్లు సెల్ఫోన్లతో అధికారుల కాలక్షేపం... సభ్యులు సభా దృష్టికి తీసుకొచ్చే సమస్యలను నోట్ చేసుకొని వాటి పరిష్కారానికి కృషి చే యాల్సిన అధికారులు సెల్ఫోన్లతో కాలక్షేపం చేశారు. బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శులు, అధికారులపై ఉన్నతస్థాయి అధికారులు క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని పలువురు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పదవీ అంటే పదవీ అంటే అనుభవించడమా.? దీనిని బట్టి ప్రజాసమస్యల పరిష్కారానికి వీళ్లు ఎంత మేరా కృషి చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సర్పంచ్ పదవి అంటే అనుభవించడమని వారు అనుకోవడం దురదృష్టకరం అని పలువురు సభ్యులు పేర్కొంటున్నారు. ప్రజా సమస్యలను సభా దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలనే సోయ ప్రజాప్రతినిధులకు లేనప్పుడు గ్రామాల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. -
జిల్లాపై కపట ప్రేమ
కర్నూలు(అర్బన్): ‘ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు జిల్లాపై కపట ప్రేమ చూపిస్తున్నారు. నీటి పారుదల విషయంలో అనంతపురం జిల్లాపైనే అమితమైన ప్రేమ కనబరుస్తున్నారు. దీనివల్ల జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. పక్కనే హంద్రీ–నీవా నీరు పోతున్నా, మన జిల్లాకు ఏడు టీఎంసీలు, అనంతపురం జిల్లాకు మాత్రం 40 టీఎంసీలు కేటాయించారు. ఇదేమి న్యాయం?’ అని వైఎస్సార్సీపీ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి నిలదీశారు. చేసిన అన్యాయం చాలక.. తాజాగా నందవరం మండలం నాగులదిన్నె నుంచి 20 టీఎంసీల తుంగభద్ర నీటిని అనంతపురం జిల్లాకు తరలించేందుకు సర్వే జరుగుతోందని, దీన్ని వెంటనే ఆపకపోతే భవిష్యత్తులో కర్నూలు తీవ్ర తాగు, సాగునీటి కష్టాలను ఎదుర్కొవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురానికి నీటిని తరలించేందుకు జారీ చేసిన జీఓ 277ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై జెడ్పీ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలని సభ్యులు కూడా మూకుమ్మడిగా డిమాండ్ చేశారు. అయినా చివరకు దీనిపై తీర్మానం చేయకపోవడం శోచనీయం. శనివారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ అధ్యక్షతన జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీలు గంగుల ప్రభాకర్‌రెడ్డి, వెన్నపూస గోపాల్‌రెడ్డి, కత్తి నరసింహారెడ్డి, కేఈ ప్రభాకర్, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, మణిగాంధీ, కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జెడ్పీ సీఈఓ ఎం.విశ్వేశ్వరనాయుడుతో పాటు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు హాజరయ్యారు. గుండ్రేవుల నిర్మాణం చేపట్టాలి: ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన విధంగా గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి డిమాండ్ చేశారు. సర్వేలంటూ కాలక్షేపం చేస్తున్నారే తప్ప ఇంతవరకు ఈ నిర్మాణానికి నయాపైసా విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీ కెనాల్ పూర్తిగా దెబ్బతిన్నా పట్టించుకునే వారే లేరన్నారు. శ్రీశైలం జలాశయం నీటి మట్టం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో దీనిపరిధిలోని రిజర్వాయర్లు, పంట కాలువలకు నీటిని ఎప్పుడు విడుదల చేస్తారో అధికారులు ముందుగానే రైతాంగానికి తెలియజేయాలని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి కోరారు. కేసీ కెనాల్‌కు విడుదల చేసే తుంగభద్ర నీరు నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాలకు చేరే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న ఈఎన్సీకి పోతిరెడ్డిపాడు పనులు చూసేందుకే సమయం సరిపోతున్నందున రాయలసీమకు అదనంగా ఈఎన్సీని నియమించాలన్నారు. తాగునీటిపై గళం కోడుమూరు మండలంలోని అనేక గ్రామాలు తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నాయని ఎంపీపీ రఘునాథరెడ్డి తెలిపారు. వెంటనే శాశ్వత పరిష్కారాన్ని చూపాలన్నారు. ప్యాపిలిలో 20 రోజుల నుంచి నీరు రావడం లేదని ఎంపీపీ సరస్వతి వాపోయారు. కౌతాళంలో తాగునీరు కలుషితమైందని జెడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మి, ఆస్పరి మండలం జోహరాపురంలో నీటి సమస్య కారణంగా వక్కిరేణికుంటపై ఆధారపడాల్సి వస్తోందని ఆ మండల జెడ్పీటీసీ సభ్యురాలు బొజ్జమ్మ సమావేశం దృష్టికి తెచ్చారు. ఐదు శాఖలపైనే చర్చ అజెండా ప్రకారం ఎనిమిది శాఖలపై చర్చ జరగాల్సి ఉండగా, కేవలం ఐదింటితోనే సరిపెట్టడంపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయం, నీటి పారుదల, గ్రామీణ నీటి సరఫరా – పారిశుద్ధ్యం, విద్యుత్, గృహ నిర్మాణం, పశు సంవర్ధకం, ప్రజా పంపిణీ, విద్యా శాఖలపై చర్చ సాగుతుందని ముందుగా అజెండా రూపొందించారు. అయితే.. గృహ నిర్మాణం, పశు సంవర్ధకం, ప్రజా పంపిణీ గురించి ఏ మాత్రమూ చర్చించ లేదు. విద్యుత్‌పై కూడా ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి కలుగజేసుకోవడంతో కొంత సేపు చర్చ సాగింది. కాగా.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కేడీసీసీ బ్యాంక్ అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి అసంబద్ధ వ్యాఖ్యలు చేయడంతో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆయనతో పాటు మరో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే గౌరు చరిత తదితరులు కేడీసీసీబీ అధ్యక్షుడి తీరును నిరసిస్తూ సమావేశంలోనే బైఠాయించారు. సభ్యులు ప్రస్తావించిన సమస్యలివీ.. ► మార్క్‌ఫెడ్ ద్వారా రైతుల నుంచి కొన్న కందులకు డబ్బు ఎప్పుడు చెల్లిస్తారని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రశ్నించారు. కలెక్టర్ స్పందిస్తూ 45 వేల మెట్రిక్ టన్నులను కొన్నామని, ఇప్పటికే రూ.265 కోట్లు చెల్లించామని, ఇంకా రూ.60 కోట్లను చెల్లించాల్సి ఉందని చెప్పారు. ► తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బేషరతుగా రైతులు, చేనేత కార్మికులు, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామన్నారని, ఎంత మంది రైతులకు రుణాలను మాఫీ చేసి.. బ్యాంకుల్లో ఉన్న వారి బంగారు ఆభరణాలు, డాక్యుమెంట్లను తిరిగి ఇప్పించారని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. ► ప్రొద్దుటూరు నుంచి చాగలమర్రి వరకు గతంలో ఉన్న విద్యుత్ లైన్ బ్రేక్ డౌన్ అయ్యిందని, దాన్ని పునరుద్ధరిస్తే భవిష్యత్‌లో ఉపయోగం ఉంటుందని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి సూచించారు. ► ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు పంపిన రూ.35 కోట్ల ప్రతిపాదనలు ఏమయ్యాయని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ప్రశ్నించారు. వర్క్ అడ్జెస్ట్మెంట్ కింద ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ► రైతురథం ట్రాక్టర్లు టీడీపీ వారికే దక్కాయని డోన్ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాములు ఆరోపించారు. అర్హులైన రైతులకు ట్రాక్టర్లు ఇవ్వలేదని, కాంట్రాక్టర్లు, వ్యాపారులకు ఇచ్చారని ఆయన దుయ్యబట్టారు. ► నాగులదిన్నె నుంచి అనంతపురానికి నీటిని తీసుకెళ్తే జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని జెడ్పీ వైస్ చైర్మన్ పుష్పావతి ఆందోళన వ్యక్తం చేశారు. ► బెళగల్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పైకప్పు పెచ్చులూడిపోయి కూలేందుకు సిద్ధంగా ఉందని, పాముల సంచారం కూడా అధికంగా ఉందని జెడ్పీటీసీ సభ్యుడు చంద్రశేఖర్ తెలిపారు. ► ప్యాపిలిలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జెడ్పీటీసీ సభ్యుడు దిలీప్ చక్రవర్తి డిమాండ్ చేశారు. ► కౌతాళం కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని జెడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మి తెలిపారు. అలాగే గ్రామంలోని నీటి ట్యాంకులను శుభ్రం చేయడం లేదన్నారు. -
బీసీసీఐ ఎస్జీఎం చెల్లదన్న సీఓఏ
ఉప్పు–నిప్పుగా తయారైన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), పరిపాలక కమిటీ (సీఓఏ)ల మధ్య మరో లేఖాస్త్రం వార్తల్లోకెక్కింది. ఈ నెల 22న బీసీసీఐ నిర్వహించిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) చెల్లదని సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ క్రికెట్ బోర్డుకు లేఖ రాశారు. అందులో తీసుకున్న విధాన నిర్ణయాలకు విలువలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. ఎస్‌జీఎంలో క్రికెటర్ల కొత్త కాంట్రాక్ట్‌లను ఆమోదించడంతో పాటు పలు కీలక నిర్ణయాలు బోర్డు ఆఫీస్ బేరర్లు తీసుకున్నారు. -
చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశంలో రసాభాస
-
నేడు బీసీసీఐ ప్రత్యేక భేటీ
-
అన్న క్యాంటీన్లపై రభస
సాక్షి, కడప కార్పొరేషన్ : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అన్న క్యాంటీన్లకు సంబంధించి పాలకవర్గ సభ్యులకు తెలియకుండానే కార్పొరేషన్ కార్యాలయంలో స్థల కేటాయింపు జరపడంపై రభస చెలరేగింది. మంగళవారం కార్పొరేషన్ కార్యాలయంలోని కౌన్సిల్ హాలులో మేయర్ సురేష్‌బాబు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 47వ డివిజన్ కార్పొరేటర్ పాకా సురేష్ ఈ అంశాన్ని లేవనెత్తుతూ కార్పొరేషన్ సాధారణ నిధుల నుంచి జన్మభూమి, నవనిర్మాణ దీక్షలకు ఖర్చు చేస్తున్నారని, అన్నక్యాంటీన్కు కార్పొరేషన్ స్థలాన్ని ఇస్తూ పాలకవర్గ సభ్యులకు ఎందుకు చెప్పలేదని నిలదీశారు. దీనికి కమిషనర్ లవన్న స్పందిస్తూ ప్రభుత్వం అత్యవసరంగా చేయాలని చెప్ప డం వల్లే చేశామని, ఆ స్థలం ఎవరికీ ఇవ్వలేదని, కార్పొరేషన్ ఆధీనంలో నే ఉందని చెప్పారు. ప్రభుత్వం చేసే మంచి పనిని తప్పుబట్టడం సరికాదని టీడీపీ ఫ్లోర్ లీడర్ విశ్వనాథరెడ్డి సూచించగా, తప్పుబట్టడం లేదని సభ్యులకు సమాచారం ఇవ్వలేదనే అడిగామని పాకా సురేష్ వివరణ ఇచ్చారు. ఈ దశలో కో–ఆప్షన్ సభ్యుడు ఎంపీ సురేష్ అన్న క్యాంటీన్ల పనులన్నీ వైఎస్ఆర్సీపీ వారే చేస్తున్నారని అనడంతో ఆ పార్టీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నీవు కో–ఆప్షన్ సభ్యుడివి ఎలా అయ్యావు’ అనడంతో టీడీపీ సభ్యుడు విశ్వనాథరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సభలో గందరగోళం చెలరేగింది. మేయర్ జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దారు. వీఎల్టీ ఫీజుల వసూలుపై ఆగ్రహం కార్పొరేషన్లో వీఎల్టీ పేరుతో 14 శాతం ఫీజు లు వసూలు చేయడంపై కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకవర్గానికి తెలియకుండా ప్రజలపై భారం వేసి చెడ్డపేరు తెస్తున్నారని బండిప్రసాద్, పాకా సురేష్, లక్ష్మయ్య మండిపడ్డారు. నగరపాలక సంస్థకు చెందిన స్థలాల వివరాలను అసెస్మెంట్ రిజిస్టర్లో పొందుపరచాలని సభ్యులు సూచించగా మేయర్ అంగీకరించారు. రోడ్ల విస్తరణ, బుగ్గవంక సుందరీకరణ, ట్రాఫిక్ అంశాలపై సమగ్ర చర్చ జరిగింది. ఎల్ఈడీ దీపాల నిర్వహణపై ఏది నిజం ఎల్ఈడీ దీపాల కోసం ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చామని చెబుతోంది, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వమూ ఇచ్చామని చెబుతోంది, ఇందులో ఏది నిజమని పాకా సురేష్, మగ్బూల్ బాషా ప్రశ్నించారు. అన్ని నిధులు కార్పొరేషన్ జనరల్ ఫండ్‌లోంచి ఇవ్వాలని తీర్మాణం ప్రవేశపెట్టారు, అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎల్ఈడీ దీపాలకు నిధులేమీ ఇవ్వలేదా అని సూటిగా ప్రశ్నించా రు. అగ్రిమెంట్ చేసేటప్పుడు సభ్యులకు తెలపకుండా బిల్లులు చెల్లించాల్సి వచ్చేసరికి తీర్మాణం పెట్టడం సరికాదన్నారు. సంవత్సరం నుంచి అడుగుతున్నా తమ డివిజన్లో వీధిదీపాలు వేయలేదని సభ్యులు లక్ష్మయ్య, ఎంఎల్ఎన్ సురేష్ సభ దృష్టికి తెచ్చారు. దీనిపై మేయర్ స్పందిస్తూ కార్పొరేటర్ల కమిటీ దీనిపై అధ్యయనం చేసి నిధుల విడుదలపై స్పష్టత ఇస్తుందని ప్రకటించా రు. కార్పొరేషన్లో ఒక్కొక్కరి వద్ద రూ.2లక్షలు తీసుకుంటూ ఔట్ సోర్సింగ్ కార్మికులుగా నియమిస్తున్నారని, ఇలా 29 మందిని నియమించారని పాకా సురేష్ ఆరోపించారు. వీరిని ఎవరి అనుమతితో తీసుకున్నారో చెప్పాలని అధికారులను ప్రశ్నించారు. దీనిపై మేయర్ స్పందిస్తూ 4 రోజు ల్లో నివేదిక ఇవ్వాలని కమీషనర్‌ను ఆదేశించారు. అమృత్ పథకానికీ మొండిచెయ్యేనా! అమృత్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం మొండిచెయ్యి చూపిందని సభ్యుడు పాకా సురేష్ విమర్శించారు. అమృత్ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా 20 శాతం భరించకపోవడం దారుణమని విచారం వ్యక్తం చేశారు. డిప్యూటీ మేయర్ బి.అరీఫుల్లా మాట్లాడుతూ మాచుపల్లె బస్టాండును చెత్తను తొలగించి ఆధునీకరించాలని కోరారు. మేయర్, ఎమ్మెల్యే కూ డా ఆ ప్రతిపాదనకు మద్దతు పలి కారు. కార్పొరేషన్ జనరల్ ఫండ్‌ను తమ డివిజన్లలో ఖర్చు పెట్టకుం డా అన్యాయం చేశారని ఎస్ఏ షంషీర్, జమ్మిరెడ్డి, హరూన్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో జనరల్ ఫండ్ ఏఏ డివిజన్లలో ఎంత ఖర్చు చేశారో జాబితా రూపొందించి, ఖర్చుపెట్టని డివి జన్లకు ఎక్కువ నిధులు ఇవ్వాలని కోరారు. అంతకుముందు ఇటీవల మృతి చెందిన 23వ డివిజన్ కార్పొరేటర్ జేసీబీ పీటర్స్ మృతికి సంతాపంగా సభ రెండు నిముషాలు మౌనం పాటించింది. ఎస్ఈ ఉమామహేశ్వరరావు, అదనపు కమీషనర్ నిరంజన్‌రెడ్డి, డిప్యూటీ కమీషనర్ సుశీలమ్మ, ఈఈ కేఎం దౌలా, ఇరిగేషన్ ఈఈ కొండారెడ్డి పాల్గొన్నారు. పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు– మేయర్ నగరంలో పారిశుద్ధ్యాన్ని మెరుగు పరిచేందు కు చర్యలు చేపడుతున్నట్లు మేయర్ సురేష్‌బాబు తెలిపారు. వేసవి కాలంలో తాగునీటి సమస్య రాకుండా గట్టెక్కామని, ఎల్ఈడీ వ్యవస్థ సక్రమంగా లేదన్నారు. ఉక్కాయపల్లె కంపోస్టు యార్డులో ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్న పనులను పాలకవర్గ సభ్యులతో కలిసి తనిఖీ చేస్తామని చెప్పారు. వారిపై కేసు నమోదు చేయాలి–ఎమ్మెల్యే కార్పొరేషన్‌కు సంబంధించిన గదిని అనధికారికంగా లీజుకు ఇచ్చి బాడుగ వసూలు చేసుకున్న వ్యక్తిపై కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే అంజద్‌బాషా డిమాండ్ చేశారు. రూ.1000లు పింఛన్ డబ్బు దుర్వినియోగం అయ్యిందని ఉద్యోగులను సస్పెండ్ చేశారని, అతనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని అధికారులను ప్రశ్నించారు. 29వ డివిజన్లో మేస్త్రిని మార్చడంపై కూడా ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అంధకారంలో ఉన్నా, కాలువలు లేక దుర్వాసన చచ్చిపోతున్నా జనరల్ ఫండ్ లేదని చెప్పే అధికారులు అన్నక్యాంటీన్లు, నవనిర్మాణ దీక్షలకు ఎలా ఖర్చుపెడుతున్నారని ప్రశ్నించారు. -
రసాభసగా కర్నూలు సర్వసభ్య సమావేశం
-
5 గంటలు.. 11 అంశాలు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం వాడివేడిగా సా గింది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తుందంటే అది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజ శేఖరరెడ్డి పుణ్యమేనని శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీ ర్ అలీ అన్నారు. జెడ్పీ చైర్మన్ దఫే దార్ రాజు అధ్యక్షత వహించారు. సుమారు ఐదు గంటల పాటు ఎజెండాలోని అంశాలు వరుస క్రమంలో కాకుండా, ఎంపిక చేసిన 11 అంశాలపై సభ్యు లు చర్చ జరిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, ఆకుల లలిత, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్ సింధే, నిజా మాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు ఎ.రవీందర్‌రెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు. విద్య.. విద్యాశాఖ పనితీరుపై సమీక్షతో సమావేశం ప్రారంభమైంది. డీఎస్సీపై మూడేళ్లుగా ఊరిస్తూనే ఉన్నారని కాంగ్రెస్ పార్టీ సభ్యులు విమర్శించారు. గాంధారి మండలంలో విద్యావలంటీర్ల నియామకం సక్రమంగా జరగలేదని సభ్యులు ఆరోపించారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన సరిగా సాగడం లేదన్నారు. అధికారుల తీరుపై మండిపడ్డారు. విద్యుత్.. పలు గ్రామాల్లో విద్యుత్ తీగలు కిందికి వేళ్లాడుతుండడంతో ప్రమాదాలు పొంచి జరుగుతున్నాయని, ఇంటర్ పోల్స్ ఏమయ్యాయో అర్థం కావడం లేదని సభ్యులు పేర్కొన్నారు. ట్రాన్స్ఫార్మర్ల ఏబీ స్విచ్‌లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య స్వల్ప వాదోపవాదాలు జరిగాయి. వ్యవసాయం.. మధ్యాహ్న భోజన విరామం అనంతరం వ్యవసాయశాఖపై సభ్యులు చర్చించారు. ఫసల్ బీమా యోజనపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వరికి ఎక్కువగా రుణం ఇస్తుండడంతో అందరూ వరి సాగు చేస్తున్నట్లు రికార్డుల్లో నమోదవుతోందని, తద్వారా పంట నష్టపోతే పరిహారం అందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. నందిపేట ఏవోను తొలగించాలని సభ్యులు కోరారు. ఆయన పనితీరులో నిర్లక్ష్యం వల్ల రైతులు నష్టపోతున్నారని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. గ్రామీణాభివృద్ధి.. ఇంకుడు గుంతలు నిర్మించుకుని మూడేళ్లవుతున్నా బిల్లులు ఇవ్వలేదని సభ్యులు పేర్కొన్నారు. సుమారు 50 వేల మంది లబ్ధిదారుల్లో 18 వేల మందికి బిల్లులు రావాల్సి ఉందని, వెంటనే ఇప్పించాలని కోరారు. ఉపాధి హామీ నిధులు.. ఈజీఎస్‌కు జిల్లాలో ఎంపీలాడ్స్, ఏసీడీపీ నిధుల మ్యాచింగ్ గ్రాంట్ విషయమై చర్చించారు. ఎంపీపీలు తీర్మానాలు చేయకపోవడంపై అభ్యంతరం తెలపగా, ఎంపీ, ఎమ్మెల్సీలు ఈజీఎస్ నిధులతో సంబం ధం లేకుండా పూర్తిగా నిధులు ఇవ్వాలని బాజిరెడ్డి సూచించారు. ఉద్యానవన శాఖ.. కూరగాయల విత్తన పంపిణీ నిలిచిపోవడంపై సభ్యులు అసంతృప్తి వ్యక్తంచేశారు. మండల సమావేశాలకు ఉద్యానవన అధికారులు హాజరుకాకపోవడంపై అభ్యంతరం తెలిపారు. అసలు ఉద్యానవన శాఖ ఉన్నట్లు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులకు సైతం తెలియడం లేదన్నారు. క్షేత్ర స్థాయి పర్యటనలు ఎందుకు చేయడంలేని ప్రశ్నించారు. 2015–16కు సంబంధించి సబ్సిడీ మొత్తాన్ని ఇప్పటికీ రైతుల ఖాతాల్లో జమ చేయలేదని సభ దృష్టికి తెచ్చారు. నీటి పారుదల.. సింగూరు నుంచి నిజాంసాగర్‌కు 8 టీఎంసీలు వదిలారని నీటి పారుదల అధికారులు పేర్కొన్నారు. అవి మిగులు జలాలేనని, మిగతా 9 టీఎంసీల నీటిని తీసుకునేందుకు అవకాశం ఉందని పలువురు సభ్యులు అభ్యంతరం తెలిపారు. మంచిప్ప రిజర్వాయర్‌కు రూ. 375 కోట్ల మంజూరుకు పరిపాలన అనుమతులు వచ్చాయని, అంచనాలు తయారు చేస్తున్నామని పేర్కొన్నారు. పంచాయతీరాజ్.. పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణంలో అలసత్వం వహించిన కాంట్రాక్టర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సభ్యులు పంచాయతీరాజ్ అధికారులను ప్రశ్నించారు. పిట్లం, భిక్కనూరు, ఆర్మూర్ తదితర మండలాల్లో మంజూరైన పనులను సకాలంలో పూర్తి చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు అంశాలపై తీర్మానాలు.. సమావేశంలో 26 అంశాలపై ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. ఇందులో ప్రధానంగా 417 సీసీ రోడ్ల నిర్మాణానికి ఉపాధి హామీ, సీడీపీ నిధులు కేటాయిస్తూ చేసిన తీర్మానాలున్నాయి. సుమారు 50 ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం చేపట్టాలని, ఇందుకోసం ఉపాధి హామీ నిధులకు విద్యాశాఖ నిధులను మ్యాచింగ్ గ్రాంటుగా ఇవ్వాలని నిర్ణయించారు. జిల్లాలో ఐదు పాఠశాలలను అప్‌గ్రేడ్ చేస్తూ తీర్మానించారు. మిషన్ భగీరథ... మిషన్ భగీరథ అధికారుల తీరుపై సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. కామారెడ్డి పట్టణానికి 15 రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయిందన్నారు. మున్సిపాలిటీ నుంచి నిర్వహణ ఖర్చులు రావడం లేదని అధికారులు సమాధానమివ్వడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం అధికారుల తీరుపై మండిపడ్డారు. డిసెంబర్ నాటికి సింగూరు గ్రిడ్ నుంచి తాగునీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. -
సాదాసీదాగా సర్వసభ్య సమావేశం
సీఎం, మంత్రి ఐకేరెడ్డి, రైల్వే మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం నిర్మల్ టౌన్ : ఆర్మూర్– నిర్మల్– ఆదిలాబాద్ రైల్వేలైన్ నను ఏర్పాటుచేసేందుకు సుముఖత వ్యక్తంచేసిన కేంద్ర రైల్వే మంత్రి సురేశ్‌ప్రభుకు, సీఎం కేసీఆర్‌కు, మంత్రి ఐకేరెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ మున్సిపల్ సర్వసభ్యసమావేశంలో సభ్యులు తీర్మానించారు. జిల్లాకేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలోని సమావేశమందిరంలో బుధవారం మున్సిపల్ సర్వసభ్యసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేశ్‌చక్రవర్తి మాట్లాడారు. నిర్మల్‌కు రైల్వేలైన్ రావడానికి మంత్రి ఐకేరెడ్డి కృషిచేశారని తెలిపారు. పట్టణ అభివృద్ధికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాకేంద్రంలో పూర్తిగా ఎల్ఈడీ లైట్లు బిగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. జిల్లాకేంద్రంలోని సోఫినగర్ నుంచి చించోలి(బి) వరకు డ్రెయినేజీ నిర్మించేందుకు రూ. 30లక్షలు వెచ్చించనున్నట్లు ఆయన తెలిపారు. తిరుమల టాకీస్ వద్ద ఉన్న మురుగుకాలువ పరిస్థితిపై మున్సిపల్ వైస్ చైర్మన్ అజీంబిన్ యాహియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చైర్మన్ మాట్లాడారు. తిరుమల టాకీస్ వద్ద ఉన్న మురుగుకాలువకు సంబంధించి ఇప్పటికే తాత్కాలిక చర్యలు తీసుకున్నామన్నారు. ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడి త్వరలోనే కల్వర్టు నిర్మించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. సమావేశానికి సగం మంది సభ్యులే హాజరుకావడంతో సమావేశం బోసిపోయింది. -
జిల్లా కేంద్రం అభివృద్ధికి కృషి చేద్దాం
నిర్మల్‌టౌన్ : జిల్లాకేంద్రం అభివృద్ధికి కృషి చేస్తానని మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి పేర్కొన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ సమావేశమందిరంలో శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సహకారంతో పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. పట్టణంలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా నాలుగు తాగునీటి ట్యాంక్‌లను నిర్మిస్తామని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నప్పటికీ సమస్యలను అధిగమిస్తామని తెలిపారు. పీఎంకేవీవైలో భాగంగా శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. లాజిస్టిక్స్, రిటైల్ విభాగాల్లో 400మంది విద్యార్థులను చేర్చుకోనున్నట్లు తెలిపారు. కౌన్సిల్ సభ్యులు దానికి సహకరించాలన్నారు. అనంతరం మున్సిపల్ సిబ్బంది, కౌన్సిల్ సభ్యులు కేక్ కట్ చేసి నూతన సంవత్సర సంబురాలు జరుపుకున్నారు. ఇందులో మున్సిపల్ కమిషనర్ త్రియంబకేశ్వర్‌రావు, పాల్గొన్నారు. -
మాటల యుద్ధం
మనూరు : మనూరులో మంగళవారం మండల సర్వసభ్య సమావేశం ముగింపులో మనూరు సర్పంచ్ మారుతిరెడ్డి లేచి పట్టపగలు విద్యుత్ దీపాలు వెలుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఏఈ మాణిక్యం మాట్లాడుతూ సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉందన్నారు. పంచాయతీ నిధులు వెచ్చిస్తే ప్రత్యేక లైన్ వేసేందుకు చర్యలు తీసుకుంటాన్నారు. ‘ప్రభుత్వం మెడలు వంచి విద్యుత్ బిల్లు తీసుకుంటోంది. మీరేం చేస్తున్నారు ’అని సర్పంచ్ పేర్కొనడంతో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి జోక్యం చేసుకున్నారు. విద్యుత్ బల్బుల సమస్య నేటిది కాదని గత ప్రభుత్వం నుంచి వస్తోందని అన్నారు. తమ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదనడంతో సర్పంచ్ మారుతిరెడ్డి మాట పెంచారు. ఎమ్మెల్యే, సర్పంచ్ల మధ్య మాటల యుద్ధ వాడివేడిగా సాగింది. బెల్లాపూర్ ఎంపీటీసీ రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో ప్రశ్నించకుండా ఇప్పు అగడమేంటని, కాంగ్రెస్ హయాంలో దోచుకున్నారని ఆరోపించారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. జెడ్పీటీసీ నిరంజన్, ఎంపీపీ లక్ష్మిగణపతి ఎంత జోక్యం చేసుకున్నా పరిస్థితి అదుపులోకి రాలేదు. పోలీసులు సమావేశ మందిరం వద్దకు వచ్చి పరిస్థితిని పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్పంచ్ మారుతిరెడ్డి మాట తీరు సరికాదన్నారు. అనవసరమైన మాటలతో అభివృద్ధిని ఆటంకపర్చరాదని అన్నారు. ఎంపీపీ ఉపాధ్యక్షుడు గడ్డె రమేశ్ జోక్యం చేసుకుని కాంగ్రెస్ నాయకులను విమర్శించడం సమంజసం కాదన్నారు. ఓ దశలో వ్యక్తిగత విమర్శలకు దారి తీసే పరిస్థితి వచ్చింది. సభలో తీవ్ర గందరగోళం, ఉత్కంట నెలకొంది. ఎంపీపీ జోక్యం చేసుకుని సర్పంచ్‌ను సముదాయిండంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. -
వాడివేడిగా సర్వసభ్య సమావేశం
మెదక్ మున్సిపాలిటీ: వార్డుల్లో నెలకొన్న నీటి సమస్య పరిష్కరించాలని ఇంజనీర్ చిరంజీవి దృష్టికి తీసుకెళ్తే నాకేం తెలియదు...మీ సమస్య ఏదైనా ఉంటే చైర్మన్‌కు చెప్పుకోవాలంటూ సమాధానం ఇస్తున్నారని, ఇప్పటి వరకు జరిగిన మున్సిపల్ సమావేశాల్లో చర్చించిన ఏ సమస్యను కూడా అధికారులు పరిష్కరించలేదని 23వ వార్డు కౌన్సిలర్ గోదల జ్యోతి ధ్వజమెత్తారు. మున్సిపల్ సర్వసభ్య సమావేశమంటే...చాయ్ బిస్కెట్ల సమావేశంగా మారింది...సభ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలేవి పరిష్కారం కావడం లేదని 1వ వార్డు కౌన్సిలర్ అనిల్‌కుమార్ ఎద్దేవాచేశారు. మంగళవారం మున్సిపల్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్‌గౌడ్ అధ్యక్షతన స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 1వ వార్డు కౌన్సిలర్ అనిల్‌కుమార్ మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కౌన్సిలర్లంటే మున్సిపల్ కార్యాలయంలో కనీస విలువ లేకుండా పోతుందన్నారు. దీనిపై స్పందించిన మున్సిపల్‌చైర్మన్ వ్యక్తిగత విషయాలను సభలో చర్చించవద్దన్నారు. నీటి సమస్య పరిష్కరించాలని కోరితే అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని 23వ వార్డు కౌన్సిలర్ గోదల జ్యోతి సభ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన చైర్మన్ మీ సమస్యలు ఏమున్నాయో చెప్పాలంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కౌన్సిల్ సభ్యులు మధుసూదన్‌రావు, అనిల్‌కుమార్ కలుగజేసుకుని ఆవేశం ఎందుకు అధ్యక్షా సమస్యలు సామరస్యంగా పరిష్కరించాలని కోరారు. చిన్న చిన్న విషయాలకు కూడా చైర్మన్‌కే చెప్పుకోవాలంటున్నారని మరో కౌన్సిలర్ రమణా పేర్కొన్నారు. కౌన్సిలర్లు పేర్కొన విషయాలు తనకు తెలియకుండా జరుగుతున్నాయని, ఇకపై అలా చేయవద్దని అధికారులకు సూచిస్తానని చైర్మన్ తెలిపారు. జీరో బ్యాలెన్స అకౌంట్ల విషయంలో కౌన్సిలర్లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని కౌన్సిల్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. సభ్యులకు కనీస మర్యాద ఇవ్వని కమిషనర్ మాకొద్దంటూ కౌన్సిలర్ అనిల్‌కుమార్ తెల్చిచెప్పారు. అలాగే జీఐఎస్ సర్వేలో చాలా తప్పులు జరిగాయని, ఇష్టారీతిగా సర్వేలు నిర్వహించారని మండిపడ్డారు. కౌన్సిలర్ మధుసూదన్‌రావు మాట్లాడుతూ పట్టణాభివృద్ధి కమిటీ ఏర్పాటుచేసి ప్రణాళిక బద్ధంగా ముందుకెళితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. పట్టణంలో అడ్డగోలుగా అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయని, వాటికి అనుమతులు ఇవ్వడం సరైన విధానం కాదని కౌన్సిలర్లు పేర్కొన్నారు. సంబంధిత శాఖ మంత్రి ఒకటి చెబితే, ఇక్కడ మరొకటి చేయడం సరికాదన్నారు. తాము ఎవరికి అనుమతులు ఇవ్వలేదని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వెంచర్లకు నోటీసులివ్వాలని చైర్మన్ అధికారులను ఆదేశించారు. జీఐఎస్ సర్వే ఆధారంగా పన్నుల శాతం పెరిగి మున్సిపల్‌కు రూ.35లక్షల ఆదాయం రానున్నట్లు చైర్మన్ తెలపగా,పెరిగిన ఆస్తి పన్నులు డిసెంబర్ 15 నుంచి అమలులోకి వస్తాయని మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు. జీఐఎస్ ఆన్లైన్ చేపట్టి 4300 మంది నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. సర్వేలో సమస్యలపై మున్సిపల్ మేనేజర్‌ను సంప్రదించాలని కమిషనర్ తెలిపారు. అలాగే పలుచోట్ల ప్రభుత్వం సీజ్‌చేసే ఇసుకను మున్సిపల్ అభివృద్ధి పనులకు వినియోగించేలా అధికారులు తహసీల్దార్‌కు లేఖ రాయాలని చైర్మన్ ఆదేశించారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి సహకారంతో గ్రేడ్-2గా ఉన్న మెదక్ మున్సిపాలిటీని గ్రేడ్-1లోకి తీసుకొస్తామన్నారు. అనంతరం వార్డుల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను కౌన్సిల్ సభ్యులు సభదృష్టికి తీసుకురాగా స్పందించిన చైర్మన్ ట్రాన్సకో డీఈకి ఫోన్ సమస్యను విన్నవించారు. ఈ సమావేశంలో వైస్‌చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు రబీన్ దివాకర్, ఆర్కె శ్రీనివాస్, చంద్రకళ, విజయలక్ష్మి, గాయత్రి, లక్ష్మి, గాయత్రి, సులోచన, గంగాధర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీడియాకు నో ఎంట్రీ మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి పాలకవర్గం మీడియాను అనుమతించలేదు. పలువురు పాత్రికేయులు ప్రశ్నించగా మున్సిపల్ చైర్మన్ ఒకింత అసహనం వ్యక్తంచేస్తూ....చాంబర్ మాకే సరిపోవడం లేదని మీరెక్కడ కూర్చుంటారని ఎదురు ప్రశ్నించారు. అనంతరం ఏమనుకున్నారో ఏమో మళ్లీ అందరిని లోపలకు అనుమతించారు. -
ఆత్మహత్య చేసుకోవాలని ఉంది..
ఎల్.ఎన్.పేట: మండలంలో అధికార పార్టీకి చెందిన నాయకుల వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకోవాలని ఉందంటూ ఇన్చార్జి తహశీల్దారు జి.వి.నారాయణమూర్తి మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ ఒమ్మి కృష్ణవేణి అధ్యక్షతన గురువారం జరిగిన సర్వసభ్య సమావేశంలో విలపించారు. రేషన్ కార్డులు, యూనిట్ల తొలగింపు విషయమై సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతున్న సమయంలో ముంగెన్నపాడు పంచాయతీ సర్పంచ్ యారబాటి రాంబాబు తన పంచాయతీలోని సమస్యలపై ఇన్చార్జి తహశీల్దారును ప్రశ్నించారు. ముంగెన్నపాడు కాలనీలో ఆక్రమణలు ఎందుకు తొలగించలేదంటూ నిలదీశారు. ఎమ్మెల్యే చెప్పినా జాప్యం చేస్తున్నారంటూ సర్పంచ్ మండిపడ్డారు. ఈ సమయంలో భావోద్వేగానికి గురైన నారాయణమూర్తి... ఆక్రమణల తొలగింపుపై అధికార పార్టీనేతలు ప్రతిరోజు వేధిస్తున్నారన్నారు. కార్యాలయంలో పనిచేసుకోనివ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్డీవో మాట్లాడి సెలవుపెట్టాలని అనుకుంటున్నానన్నారు. గతంలో ఆర్ఐగా ఇదే మండలంలో ఏడేళ్లపాటు విధులు నిర్వహించానని, ఇంతటి స్థాయిలో వేధింపులు ఎన్నడూ చూడలేదని కన్నీరుపెట్టారు. అధికారుల పని సక్రమంగా, న్యాయబద్ధంగా చేసుకోనివ్వకపోవడం బాధగా ఉందన్నారు. వేదికపై ఉన్న ఎంపీడీవో మోహన్‌ప్రసాద్, మండలప్రత్యేక ఆహ్వానితుడు ఒమ్మి ఆనందరావు కలుగ జేసుకుని సర్ది చెప్పడంతో శాంతించారు. -
‘సిక్కాలు’ కావాలి: టీసీఎస్ ఏజీఎంలో డిమాండ్
ముంబై: టాటా గ్రూప్ ఐటీ దిగ్గజం టీసీఎస్ నుంచి బోనస్ షేర్లను కోరుతూ ‘మాకు సిక్కాలు కావాలంటూ’ శుక్రవారంనాడిక్కడ జరిగిన కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో షేర్హోల్డర్లు డిమాండ్ చేశారు. సిక్కా అంటే నాణెం అని అర్థం. అలాగే టీసీఎస్ ప్రత్యర్థి ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ చీఫ్ పేరు కూడా విశాల్ సిక్కా. ఈ రెండూ కలిపి ధ్వనించేలా షేర్‌హోల్డర్ల నుంచి వచ్చిన డిమాండ్‌కు టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ బదులిస్తూ బోర్డు ఈ అంశాన్ని పరిశీలిస్తుందని చెప్పారు. కంపెనీ నగదు నిల్వలతో పోలిస్తే మూలధనం తక్కువగా వున్నందున పలువురు షేర్హోల్డర్లు బోనస్ షేర్లు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. తమిళనాడులో ఐటీ పరిశ్రమలో యూనియన్ల ఏర్పాటును అనుమతించడం వల్ల తమ కంపెనీపై ప్రభావం ఏదీ పడదని మరో ప్రశ్నకు మిస్త్రీ బదులిచ్చారు. -
నీరు-చెట్టుపై గరంగరం
♦ అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం ♦ ఆ పనులపై విచారణ చేస్తామన్న కలెక్టర్ ♦ ఇళ్ల ఎంపికలో కమిటీ సభ్యుల సంతకాలు లేకుండా తీర్మానంపై వాదోపవాదాలు ♦ జెడ్పీ సర్వసభ్య సమావేశాన్ని సజావుగా నడిపించిన కలెక్టర్ సాక్షి, కడప : జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిరసనలు, వాదోపవాదాలతో వాడీవేడిగా సాగింది. పండ్లతోటల నష్ట పరిహారంతోపాటు నీరు-చెట్టు పనులకు సంబంధించి అవకతవకలపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కొద్దిసేపు ప్రజాప్రతినిధుల మధ్య రగడ కొనసాగింది. శుక్రవారం కడపలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు జెడ్పీ చైర్మన్ గూడూరు రవి అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. కలెక్టర్ కేవీ సత్యనారాయణ హాజరుకాగా, జేసీ శ్వేత తెవతీయ జెడ్పీ సీఈఓ హోదాలో సభను నడిపించారు. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేలోపే టీడీపీ జెడ్పీటీసీ సభ్యులు అడ్డుతగలడంతో రచ్చ రాజుకుంది. పదేపదే తనకు మైకు ఇవ్వాలంటూ టీడీపీలో చేరిన వైఎస్సార్సీపీ సభ్యుడు పోరెడ్డి ప్రభాకర్ పట్టుబట్టిన వ్యవహారం జెడ్పీ చైర్మన్ గూడూరు రవి తీవ్రస్థాయిలో స్పందించారు. అరగంటపాటు వాదోపవాదాలు సాగినా అనంతరం ప్రశాంతంగా సమావేశం కొనసాగింది. నీరు-చెట్టు, ఇళ్ల మంజూరుపై వాగ్వాదం సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే వైఎస్సార్సీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ముందుగా పులివెందుల జెడ్పీటీసీ సభ్యుడు వెంగముని, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ వడగండ్ల వాన తో అరటితోపాటు ఇతర పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిని రైతులు నష్టపోయారన్నారు. 2010 నుంచి ఇప్పటివరకు పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం రైతులతో చెలగాటమాడుతోందని దుమ్మెత్తిపోశారు. దీంతో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌రెడ్డి ప్రభుత్వం బాగా పనిచేస్తోందని చెప్పబోగా వెంటనే అందుకున్న వైఎస్సార్సీపీ సభ్యులు రైతులు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను వివరించారు. ఈ నేపథ్యంలోనే వారి మధ్య కొంత వాగ్వాదం చోటుచేసుకుంది. ఇళ్ల మంజూరులో ఇదే ం పద్ధతి ఒంటిమిట్ట మండలంలోని మాధవరానికి 17 ఇళ్లు మంజూరుచేశారని, అయితే సర్పంచ్, సెక్రెటరీ లేకుండా సభ్యుల్లో ఇద్దరు మాత్రమే సంతకాలు చేసి తీర్మానం పంపారని దానిని ఎలా అమోదిస్తారంటూ జెడ్పీ వైస్‌చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. దానికి సమాధానం చెప్పాలని హౌసింగ్ అధికారులను కోర గా, మధ్యలో టీడీపీ నేతలు జోక్యం చేసుకోవడంతో మాటలయుద్ధం సాగింది. ఒంటిమిట్ట మండలంలో ఉపాధిలో చేసిన పనులపైనే నీరు-చెట్టులో మళ్లీ పనులు చేసి దోచుకుంటున్నారని ఆరోపించారు. స్పందించిన కలెక్టర్ విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సభను సజావుగా నడిపించిన కలెక్టర్ జెడ్పీ సర్వసభ్య సమావేశం ప్రారంభమైనప్పటి నుంచి కలెక్టర్ సత్యనారాయణ సజావుగా నడిపించారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు వాగ్వాదానికి దిగిన సందర్భంలో జోక్యం చేసుకుం టూ సమస్యను చక్కదిద్దుతూ వచ్చారు. జెడ్పీటీసీలు అడిగిన ప్రశ్నలకు కూడా స్వయంగా కలెక్టరే సమాధానాలు ఇవ్వడంతోపాటు పరి ష్కారానికి మార్గం చూపారు. పథకాలకు సం బంధించిన లబ్ధిదారుల విషయంలో ఖచ్చితం గా అర్హులకే అందాలని, ఎట్టి పరిస్థితుల్లో అనర్హులకు అందకూడదని, ఈ విషయంలో ఎవరినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నిధుల దుర్వినియోగంపై దద్దరిల్లిన జెడ్పీ కడప ఎడ్యుకేషన్: జిల్లాలో జరుగుతున్న నీరు చెట్టు పనుల్లో నిధులు దుర్వినియోగం అవుతున్నాయని సంబంధిత పనులపై విజిలెన్సు విచారణ జరిపించాలని జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సభలో చేసిన తీర్మానాన్ని మెజారిటీ సభ్యుల ఆమోదం తెలిపారు. శుక్రవారం జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశానికి ఇన్చార్జు సీఈఓ, జేసీ శ్వేతా అధ్యక్షతన జెడ్పీ చైర్మన్ గూడూరు రవి ఆధ్వర్యంలో జరిగింది. ముందుగా కలెక్టర్ కేవీ సత్యనారాయణ సభకు పరిచయం చేసుకున్నారు. అనంతరం ఈ ఏడాది పదవ తరగతిలో రాష్ట్రంలో కడప జిల్లాను మొదటి స్థానంలో నిలిపినందుకు డీఈఓ ప్రతాప్‌రెడ్డిని అభినందించారు. అనంతరం జరిగిన సమావేశంలో పలువురు మాట్లాడారు. పంటల బీమాను అందజేయాలి: ఎంపీ అవినాష్‌రెడ్డి జిల్లాలో 2013-14లో జరిగిన పంటనష్టం ఇన్సూరెన్సును ఇచ్చి రైతన్నలను ఆదుకోవాలని ఎంపీ అవినాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లావ్యాప్తంగా 55 వేలమంది రైతులకు పంటలనష్టబీమా రావాల్సి ఉండగా ఇందులో 29 వేలమందికి ఇన్స్యూరెన్సు వచ్చిందన్నారు. ఇటీవల మరో 11 వేలమందికి కూడా వచ్చిందని.. ఇంకా 16 వేలమందికి రావాల్సి ఉందన్నారు. వారికి సంబంధించిన పత్రాలో సమస్యలు ఉన్నాయని తెలిపారన్నారు. సంబంధిత విషయంలో కలెక్టర్ చోరవ తీసుకుని జాబితాను మళ్లీ పంపాలన్నారు. అలాగే అరటి పంటకు కూడా బీమాను వర్తింపచేయాలన్నారు. అరటికి పంటనష్ట జరిగితే హెక్టారుకు 24 వేలు ఇస్తున్నారని ఇది ఏమూలకు సరిపోదన్నారు. ప్రజాధనం దుర్వినియోగం: రాచమల్లు జిల్లాలో జరిగిన నీరుచెట్టు పనుల్లో అవినీతి రాజ్యమేలుతొందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ధ్వజమెత్తారు. చాలాచోట్ల వందకు పదిశాతం మేరకే పనులు చేశారని మిగతా సొమ్మంతా తెలుగుతమ్ముళ్ల జేబులు నింపేందుకేనన్నారు. ఇదంతా అధికారులకు తెలియదా అని నిలదీశారు. సంబంధిత పనులపై విజిలెన్స్‌తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విత్తనాలు తక్కువ ఇస్తే ఎలా: రవీంద్రనాథరెడ్డి ప్రభుత్వం సబ్సిడీతో ఇచ్చే వేరుశనక్కాయలు రైతులకు సరిపడవని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ రెడ్డి అన్నారు. ఎకరాకు 60 సేర్ల విత్తనాలు అవసరం అయితే మీరు ఇచ్చే ఒక బస్తా ఎలా సరిపోతాయన్నారు. రైతులకు సరిపడ విత్తనాలను ఇవ్వాలని అవికూడా నారాయణి రకం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మామిడికి గిట్టుబాటు ధరను కల్పించాలి: శ్రీకాంత్‌రెడ్డి రైతన్నలు పండించే మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి కోరారు. దీంతోపాటు రైతులకు సంబంధించి బ్యాంకుల్లో ఉన్న రుణాలను మొత్తం చెల్లించి మళ్లీ తీసుకొంటున్నారన్నారు. ఇలా చేయటం వల్ల రైతులు నష్టపోయి.. బయట బ్రోకర్లు బాగుపడుతున్నారని దీనిపై రైతులకు న్యాయం చేయాలన్నారు. స్పందించిన కలెక్టర్ పరిశీలిస్తామన్నారు. వెలిగళ్లు ప్రాజెక్టు నుంచి కాలువలకు నీరు ఇస్తే పంటల సాగుకు బాసటగా ఉంటుందన్నారు. నీరు-చెట్టులో అవినీతి జరగలేదంటే రాజీనామా చేస్తా: రఘురామిరెడ్డి ప్రభుత్వ తలపెట్టిన నీరు-చెట్టులో అవినీతి జరగలేదని అధికారులు నిరూపిస్తే తమ పదవికి రాజీనామా చేస్తానని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో విపరీతమైన కరువుతో రైతులు అల్లాడుతున్నారన్నారు. రైతులకు సరైన విత్తనాలు ఇవ్వలేదు, ఎరువులు లేవు. కానీ తెలుగు తమ్ముళ్ల జేబులు నింపేందుకే చంద్రబాబు నీరు-చెట్టును ప్రవేశ పెట్టారన్నారు. ఇది చంద్రబాబు సొమ్మా, పచ్చ చొక్కాల దోపిడీనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యాన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి: కొరముట్ల శ్రీనివాసులు కోడూరు ప్రాంతంలో ఉద్యాన పంటల సాగు అధికమని కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. గాలులకు, వర్షాలకు పంటన ష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఇంతవరకూ నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. పండ్ల తోటకు పంట ఇన్స్యూరెన్సు ఇస్తే బాగుంటుందని తెలిపారు. మండల కమిటీ ఆమోదం లేకుండానే పనులా: జెడ్పీ ఉపాధ్యక్షుడు ఇరిగేషన్ పనులకు సంబంధించి సర్పంచ్ రెజెల్యూషన్ లేకుండానే పనులను ఇస్తున్నారని జెడ్పీ ఉపాధ్యక్షుడు ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. కమిటీలో ఉన్న సభ్యలలో ఒకరిద్దరు మాత్రమే సంతకాలు తీసుకుని పనులను మంజూరు చేస్తున్నారన్నారు. ఒంటిమిట్ట మండలంలో హౌసింగ్‌కు సంబంధించి గ్రామసభ తీర్మాణం లేకుండానే 17 ఇళ్లను మంజూరు చే శారని వీటిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఐసైన్మెంట్ కమిటీలను ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్సీ గోవిందరెడ్డి జిల్లాలో అసైన్మెంట్ కమిటీలు లేక చాలా మంది రైతలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ గోవిందరెడ్డి అన్నారు. గత రెండేళ్ల నుంచి అసైన్ క మిటీ లేదన్నారు. అలాగే టీఎఫ్సీ , జనరల్ ఫండ్ కింద వచ్చిన పనులకు నిధులు రాలేదన్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించిన పనులకు కూడా నిధులు రాలేదన్నారు. దీనికి స్పందించిన కలెక్టర్ సంబంధిత పనుల్లో కొన్ని కోర్టులో ఉన్నాయని వాటి పరిధిలోని పనులకు మాత్రమే బిల్లులు ఇవ్వాలని వచ్చిందన్నారు. అలాగే అసంపూర్తిగా ఉన్న పనులకు బిల్లులు ఇచ్చే విషయమై పరిశీలిస్తామన్నారు. అక్రమ ఇసుక తరలింపును అరికట్టాలి: ఎమ్మెల్సీ దేవగుడి ప్రభుత్వం ఉచిత ఇసుక అని చెబుతుంది కానీ 99 శాతం అక్రమంగానే తరలిపోతుందని ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి అన్నారు. గ్రామానికి ఇద్దరు రౌడీలు జతై మామాళ్లు వసూలు చేస్తున్నారన్నారు. సంబంధిత క్వారీలను వెంటనే రద్దు చేయాలన్నారు. -
పిలుపు.. రాదాయె!
► మినీ మహానాడుకు అందని ఆహ్వానం ► అధినేతకు వలస ఎమ్మెల్యేల ఫిర్యాదు ► ప్రత్యేక సమావేశాల నిర్వహణకు బ్రేకులు ► పార్టీని ధిక్కరించి కార్యకర్తలతో భేటీ ► ఇన్‌చార్జీలకు, ఎమ్మెల్యేలకు మధ్య పెరుగుతున్న దూరం సాక్షి ప్రతినిధి, కర్నూలు: మినీ మహానాడు పేరుతో నిర్వహిస్తున్న కార్యకర్తల సర్వసభ్య సమావేశానికి తమకు కనీసం పిలుపు కూడా అందలేదని గోడదూకిన ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఈ మేరకు పార్టీ అధినేతను కలిసి ఫిర్యాదు కూడా చేసినట్టు తెలిసింది. తమ వెంట ఉన్న కార్యకర్తల ముందు తమ పరువు పోతోందని వాపోతున్నారు. మరోవైపు తమ కార్యకర్తలతో ప్రత్యేకంగా మినీ మహానాడులను నిర్వహించుకోవాలని మొదట్లో భావించిన ఈ గోడ దూకిన ఎమ్మెల్యేలు.. చివర్లో వెనక్కి తగ్గారు. ఈ విధంగా ప్రత్యేక భేటీలను నిర్వహిస్తే తమపై ఎక్కడ ఇన్చార్జీలు ఫిర్యాదు చేసి తమను కార్నర్ చేస్తారోననే ఆందోళనతో వీరు ప్రత్యేక మినీ మహానాడుల నిర్వహణ ప్రయత్నాలను విరమించుకున్నట్టు సమాచారం. మొత్తం మీద జిల్లాలో గోడదూకిన ఎమ్మెల్యేలకు, అధికార పార్టీ ఇన్‌చార్జీలకు మధ్య దూరం రోజురోజుకీ పెరుగుతోంది. అధినేతకు ఫిర్యాదు.. మినీ మహానాడులకు ఆహ్వానం అందని గోడదూకిన ఎమ్మెల్యేలంతా తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి నియోజకవర్గ ఇన్చార్జీల మీద ఫిర్యాదు చేసినట్టు సమాచారం. తమను అవమానాల పాలు చేస్తున్నారని ఈ సందర్భంగా వాపోయారని తెలిసింది. తమ వెంట ఉన్న కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పుకోవాలని అధినేత వద్ద రాగాలు తీశారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఇప్పటికే ప్రభుత్వ కార్యకలాపాల్లో పూర్తిగా ఇన్చార్జీల హవా కొనసాగుతోందని.. ఇక పార్టీలో కూడా వారిదే పెత్తనం అయితే తమకు ఏమి గౌరవం ఉంటుందని వాపోతున్నారు. ఇదే పద్ధతి కొనసాగితే తమ వెంట ఉన్న కార్యకర్తలకు సమాధానం చెప్పుకోలేని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని అధినేత ముందు తేటతెల్లం చేశారని సమాచారం. ప్రత్యేక మినీ మహానాడులపై వెనక్కి.. వాస్తవానికి గోడదూకిన ఎమ్మెల్యేలు ఎవరికి వారే ప్రత్యేకంగా మినీ మహానాడులను నిర్వహించుకోవాలని మొదట్లో భావించారు. అయితే, జిల్లా కమిటీ నిర్ణయానికి భిన్నంగా ప్రత్యేక భేటీలను ఏర్పాటు చేస్తే ఎక్కడ తమ మీద ఫిర్యాదు చేస్తారోననే ఆందోళనతో వీరు ప్రత్యేక భేటీ యత్నాలకు బ్రేకులు వేసుకున్నట్టు తెలిసింది. అయినప్పటికీ ప్రత్యేక మినీ మహానాడుల తరహాలో కాకుండా కార్యకర్తలతో సమావేశాల పేరిట కొద్ది మంది ఎమ్మెల్యేలు భేటీ కావడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అది కూడా పార్టీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా.. జిల్లా అధ్యక్షుడికి చెప్పకుండా సమావేశం కావడం పార్టీని ధిక్కరించడమేననే వాదన తెరమీదకు వచ్చింది. ఇదే విషయాన్ని పార్టీ అధినేత వద్ద నియోజకవర్గాల ఇన్చార్జీలు తీసుకెళ్లాలని భావిస్తున్నట్టు తెలిసింది. మొత్తం మీద అధికార పార్టీలో అటు గోడ దూకిన ఎమ్మెల్యేలు... ఇటు ఇన్చార్జీలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. కొసమెరుపు ఎమ్మెల్యే, ఇన్చార్జి మధ్య నెలకొన్న తీవ్ర వివాదాల నేపథ్యంలో కోడుమూరు నియోజకవర్గ మినీ మహానాడు ఏకంగా రద్దు కావడం గమనార్హం. -
రూ.15వేల కోట్ల సమీకరణకు మార్గం సుగమం
ఎస్బీఐ వాటాదారుల ఆమోదం ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.15,000 కోట్ల నిధుల సమీకరణ కోసం వాటాదారుల ఆమోదం పొందింది. ఈ నిధులను పబ్లిక్ ఇష్యూ ద్వారా కానీ, విదేశాల్లో షేర్ల జారీ ద్వారా కానీ సమీకరించనున్నట్లు ఎస్బీఐ తెలిపింది. శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు ఆమోదం పొందామని తెలియజేసింది. ప్రభుత్వ వాటా 52 శాతానికన్నా తగ్గకుండా ఉండేలా ఈ నిధులను సమీకరిస్తామని పేర్కొంది. వచ్చే ఏడాది మార్చి కల్లా రూ.15,000 కోట్ల నిధులు సమీకరించనున్నామని ఈ ఏడాది జనవరిలోనే ఎస్బీఐ వెల్లడించింది. బాసెల్-3 నిబంధనలకు పాటించడానికి అవసరమైన నిధులను ఇలా సమకూర్చుకోవాలని ఎస్బీఐ భావిస్తోంది. -
11న గ్రేటర్ తొలి సర్వసభ్య సమావేశం
⇒ అదే రోజు మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికలు.. త్వరలోనే జీవో జారీ ⇒ ఫిబ్రవరి 3న ఎన్నికల సిబ్బందికి ఆన్‌డ్యూటీ సౌకర్యం ⇒ గ్రేటర్ ఎన్నికల బ్యాలెట్లో ‘నోటా’ ఆప్షన్ లేనట్లే సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియ పూర్తికాకముందే తదనంతర కార్యక్రమాలకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ సర్వ సభ్య సమావేశం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక తదితర అంశాలపై గ్రేటర్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపిన దరిమిలా ఆ మేరకు జీవో కూడా జారీచేసేందుకు రంగం సిద్ధమైంది. 11న సర్వసభ్య సమావేశం జరిగే రోజునే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలను నిర్వహించనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 2న జీహెచ్ఎంసీ పోలింగ్, 5న ఫలితాలు వెల్లడికానున్న సంగతి తెలిసిందే. పోల్‌కు మరుసటిరోజు ఆన్‌డ్యూటీ.. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 2న జరగనుండగా.. ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి ఆ మరుసటి సెలవు ప్రకటించాలని ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞాపనపై సైతం రాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బంది ఆ మరుసటి రోజు విధులకు హాజరుకాకపోయిన ‘ఆన్‌డ్యూటీ’(ఓడీ)గా పరిగణించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు సైతం ఒకట్రేండు రోజుల్లో జారీ కానున్నాయి. నోటాకు నై.. ఎన్నికల బరిలో నిలబడ్డ అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ నచ్చకపోతే.. అభ్యర్థులందరినీ తిరస్కరించేందుకు జీహెచ్ఎంసీ ఓటర్లకు ‘నోటా’ హక్కు ఇక లేనట్లే. నోటా అమలుపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరుతూ లేఖ రాసింది. సాంకేతిక కారణాలతో ప్రస్తుత పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ‘నోటా’ అమలు సాధ్యం కాదని తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చింది. దీంతో నోటా అమలు లేనట్లేనని అధికారవర్గాలు తెలిపాయి. -
ఐఎఫ్సీఐ 22వ ఏజీఎం
ఐఎఫ్సీఐ (ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) 22వ వార్షిక సర్వసభ్య సాధారణ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. సుబ్రతో పార్క్, ఎయిర్‌ఫోర్స్ ఆడిటోరియంలో ఇటీవల జరిగిన ఈ సమావేశంలో సంస్థ మెజారిటీ షేర్హోల్డర్లు పాల్గొన్నారు. బోర్డ్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎస్వీ రంగనాథ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ మలై ముఖర్జీ, డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్ అచల్ కుమార్ గుప్తా, ప్రొఫెసర్ బాలకృష్ణన్, ప్రొఫెసర్ అరవింద్ సహాయ్ తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంస్థ కార్యకలాపాలపై సమావేశం చర్చించింది. -
ప్రజాప్రతినిధులు అభివృద్ధికి కృషిచేయాలి
అనంతపురం: సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు బాధ్యతాయుతంగా పనిచేసి అభివృద్ధికి తోడ్పడాలని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి సూచించారు. బుధవారం జరిగిన పెద్దవడుగూరు మండల సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ సహకరిస్తేనే అభివృద్ధిపనులు బాగా జరుగుతాయని, ప్రజలకు సేవ చేసి మంచిపేరు తెచ్చుకోవాలని కోరారు. -
పేద మహిళల పెన్నిధిగా ‘స్త్రీ నిధి’
స్త్రీనిధి బ్యాంక్ సర్వసభ్య సమావేశంలో కేటీఆర్ * సంఘటితంగా ఉంటే మరిన్ని అద్భుతాలు సృష్టించొచ్చు * వడ్డీలేని రుణాలు రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంపు సాక్షి, హైదరాబాద్: పేద మహిళల కోసం ఏర్పాటైన స్త్రీనిధి బ్యాంక్ మహిళల సార థ్యంలోనే సాగుతూ నాలుగేళ్లుగా అద్భుత ప్రగతిని సాధిస్తోందని, స్వయం సహాయక గ్రూపుల ద్వారా సత్వర రుణాలను అందిస్తూ పేద మహిళల పాలిట పెన్నిధిగా మారిందని పంచాయతీరాజ్ మంత్రి కె.తారక రామారావు అన్నారు. మహిళలు సంఘటితంగా ఉంటే అద్భుతాలు సృష్టించగలరనేందుకు స్త్రీనిధి బ్యాంక్ సాధించిన ప్రగతే నిదర్శనమన్నారు. ‘తెలంగాణ స్త్రీ నిధి బ్యాంక్’ తొలి వార్షిక సర్వసభ్య సమావేశం బుధవారం జేఎన్టీయూహెచ్ ఆడిటోరియంలో జరిగింది. సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కేటీఆర్.. రాష్ట్రంలో 470 మండల సమాఖ్యలు, 20 వేల గ్రామ సమాఖ్యలు, 4.20 లక్షల స్వయం సహాయక గ్రూపుల ద్వారా 60 లక్షల మంది పేద మహిళలకు ఆర్థిక సాయం అందిస్తున్న స్త్రీనిధి బ్యాంక్ యాజమాన్యాన్ని అభినందించారు. రూ.10 లక్షల వరకూ వడ్డీలేని రుణాలు.. రాష్ట్రవ్యాప్తంగా బాగా పనిచేస్తున్న స్వయం సహాయక గ్రూపులకు వడ్డీలేని రుణాలను రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తుందని, స్వయం సహాయక సంఘాల్లోని మహిళలందరికీ సురక్ష బీమా యోజన ద్వారా ప్రమాదబీమా సదుపాయాన్ని త్వరలోనే కల్పించబోతున్నామని కేటీఆర్ ప్రకటించారు. పేద మహిళలకు ఆర్థిక తోడ్పాటు అందిస్తున్న స్త్రీనిధి బ్యాంక్‌కు ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా దళారులను నియంత్రించేందుకు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది మహిళలకు రూ.1,005 కోట్లతో 25 వేల ఉత్పత్తి(పాడి పరిశ్రమ, మేకల, గొర్రెల పెంపకం తదితర) యూనిట్లను అందిస్తామన్నారు. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యుల భాగస్వామ్యం, యాజమాన్యంలోనే నడుస్తున్న స్త్రీనిధి బ్యాంక్ గతేడాది 68 శాతం వృద్ధిరేటు సాధించిందని బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ విద్యాసాగర్‌రెడ్డి తెలిపారు. బ్యాంకులు అందుబాటులో లేని గ్రామాల్లో గ్రామ సమాఖ్యల ద్వారా బ్యాంకింగ్ సేవలను స్త్రీనిధి బ్యాంక్ అందిస్తోందన్నారు. ప్రతిన బూనిన సంఘాలు ‘‘ప్రభుత్వంతో కలసి స్థాపించిన స్త్రీనిధి బ్యాంకు చక్కగా పనిచేసేందుకు, సంస్థ నుంచి సభ్యుల జీవనోపాధులకు, ఇతర అవసరాల నిమిత్తం సత్వర అప్పు ఇవ్వడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తాం. అందరి భాగస్వామ్యంతో స్త్రీనిధి బ్యాంకును మరింత పటిష్టం చేసి నిరుపేద మహిళలకు పెన్నిధిగా తయారు చేస్తాం’’ అని సర్వసభ్య సమావేశంలో సభ్యులంతా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం క్షేత్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు, ఉద్యోగులకు కేటీఆర్ బహుమతులు అందించారు. 2013-14 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటా ధనం కింద వచ్చిన డివిడెండ్ రూ.2,60,58,000 చెక్కును స్త్రీనిధి బ్యాంకు డెరైక్టర్లు మంత్రికి అందజేశారు. బ్యాంకు అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదించిన తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదిం చారు. కార్యక్రమంలో సెర్ప్ సీఈవో మురళి, స్త్రీనిధి బ్యాంకు అధ్యక్షురాలు గడ్డం సరోజ, కోశాధికారి బత్తిని స్వరూప, నాబార్డు మాజీ సీజీఎం మోహనయ్య, పలువురు డెరైక్టర్లు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, జిల్లా సమాఖ్యలు, మండల సమాఖ్యల ప్రతినిధులు పాల్గొన్నారు. -
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
పెద్దకొత్తపల్లి (మహబూబ్‌నగర్ జిల్లా) : విద్యుత్ అధికారుల పనితీరుపై పెద్దకొత్తపల్లి మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీలు, సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ వెంకటేశ్వర్రావు అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో సర్పంచ్‌లు సత్యం, సురేష్‌రావు, వెంకటస్వామి, సుల్తానమ్మ, సులోచనమ్మలు గ్రామాలలో విద్యుత్ స్తంభాలు విరిగిపోయి ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు విద్యుత్ స్తంభాలను సరఫరా చేయక పోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఈ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. గ్రామాలకు మంజూరైన స్తంభాలను సరఫరా చేసి కొత్తగా లైన్లు వేస్తామని తెలిపారు. కరువు మండలంగా ప్రకటించాలని సభ్యులంతా సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. పాఠశాలలో వంట గదుల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. వాటి నిర్మాణాలను వెంటనే చేపట్టాలని గంట్రావుపల్లి సర్పంచ్ సులోచనమ్మ సభ దృష్టికి తెచ్చారు. ముష్టిపల్లి గ్రామంలోని పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు గుడ్లు అందించకుండా అమ్ముకుంటున్నారని సర్పంచ్ సురేష్‌రావు సభ దృష్టికి తెచ్చారు. ఎంఈఓ శ్రీనివాసులు మాట్లాడుతూ.. పాఠశాలలో ఎస్ఎంసీ కమిటీ సమావేశం నిర్వహించి మధ్యాహ్న భోజనంపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉపాధి హామీ పథకంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించాలని సభ్యులు కోరగా టెక్నికల్ అసిస్టెంట్లతో మాట్లాడి చెల్లిస్తామని ఏపీఓ అలీమోద్దీన్ తెలిపారు. పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి నీటి సౌకర్యం లేక నిరుపయోగంగా ఉన్నాయి. జిల్లా పరిషత్ నిధుల నుంచి నిధులు మంజూరు చేయించాలని జడ్పీటీసీ వెంకటయ్యకు దేవల్‌తిర్మలాపూర్ సర్పంచ్ సత్యం సూచించారు. సమావేశంలో ఎంపీడీఓ విజయ్‌కుమార్‌శర్మ, తహశీల్దార్ అశోక్, వైస్ ఎంపీపీ రాముడు, ఏఓ మధుశేఖర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రసాభాసగా గుడ్లూరు సర్వసభ్య సమావేశం
- గుడ్లూరు ఎంపీపీని గదిలో నిర్బంధించిన టీడీపీ సభ్యులు - జెడ్పీటీసీ సభ్యుడిని బయటకు నెట్టిన తెలుగు తమ్ముళ్లు - వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులకు రక్షణ కరువు గుడ్లూరు : స్థానిక మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఆదివారం రసాభాసగా ముగిసింది. సమావేశం ప్రశాంతంగా ముగుస్తోందనుకుంటున్న సమయంలో టీడీపీ సభ్యులు మండల పరిషత్ నిధులపై చర్చ జరపాలని పట్టుబట్టడంతో వివాదం ప్రారంభమైంది. ఎంపీటీసీలతో చర్చించి నిధులు ఖర్చు పెడదామన్న ఎంపీపీ శ్రీనివాసులును హాలు నుంచి బయటకు రాకుండా టీడీపీ సభ్యులు నిర్బంధించారు. బయటకు వెళ్తున్న జెడ్పీటీసీ వెంకటరామిరెడ్డిపై దాడికి దిగారు. చొక్కా పట్టుకొని బయటకు లాగారు. ఇటీవల టీడీపీలో చేరిన వైస్ ఎంపీపీ పొట్టేళ్ల మురళి 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.18 లక్షలు, జనరల్ ఫండ్ రూ.9 లక్షలు ఖర్చు చేసేందుకు చర్చ జరగాలని కోరడంతో ఎంపీటీసీ సభ్యుల ఆమోదంతో రూ.10 లక్షలు ఖర్చు పెట్టేందుకు ఎంపీపీ అంగీకరించారు. ఆ నిధులతో మండల పరిషత్, తహశీల్దార్ కార్యాలయాల వద్ద సీసీ రోడ్లు వేద్దామని టీడీపీ సభ్యులు పట్టుపట్టడంతో ఆ నిధులను గ్రామాల్లో అంతర్గత రోడ్లుకు మాత్రమే ఉపమోగించాలని జెడ్పీటీసీ సభ్యుడు మాట్లాడటంతో వాగ్వాదం మొదలైంది. జెడ్పీటీసీ వెంకటరామిరెడ్డి సమావేశపు హాలు నుంచి బయటకు వెళ్తుండగా రావూరు సర్పంచ్ భర్త శ్రీనివాసులు ఆయన్ను హాలు నుంచి బయటకు నెట్టాడు. బయట ఉన్న సూర్యనారాయణ అనే వ్యక్తి చొక్కా పట్టుకొని జెడ్పీటీసీని నెట్టడంతో ఒక్క సారిగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. జెడ్పీటీసీపైదాడి చేయడం సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ మద్దతు సర్పంచ్‌లు నక్కల శ్రీనివాసులు, అద్దంకి నరసింహం, సుబ్బారావులు ధ్వజమెత్తారు. అదే సమయంలో ఎంపీపీ శ్రీనివాసులు కూడా సమావేశపు హాలు నుంచి బయటకు వస్తుండగా రావూరు శ్రీనివాసులు, టీడీపీ ఎంపీటీసీ సభ్యులు అడ్డుకొని తలుపులు వేశారు. దీంతో అక్కడ ఏమి జరుగుతుందో అర్థం కాక అధికారులు, సర్పంచ్‌లు భయాందోళనకు గురయ్యారు. అరగంట పాటు ఎంపీపీని, అధికారులను టీడీపీ కార్యకర్తలు లోపలే ఉంచారు. చివరకు ఎంపీడీఓ జోక్యం చేసుకోవడంతో ఘర్షణ వాతావరణం సద్దుమణిగింది. -
ప్రశ్నల వర్షం
ఆదిలాబాద్ అర్బన్ : జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజల ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చి ఎనిమిది మాసాలైనా మండల స్థాయిలో చేపడుతున్న వివిధ పథకాల ప్రగతి నివేదికలను మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలకు తెలుపకపోవడంపై మండిపడ్డారు. మండల స్థాయిలో నిర్వహించే కార్యక్రమాలకు ఆ స్థాయి అధికారులు హాజరుకాకపోవడంపై జెడ్పీటీసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సమావేశం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా గంట ఆలస్యంగా మొదలైంది. జెడ్పీ చైర్ పర్సన్ వల్లకొండ శోభారాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న, ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావు, రేఖాశ్యాంనాయక్,విఠల్‌రెడ్డి, దుర్గం చిన్నయ్య, జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, కలెక్టర్ ఎం.జగన్మోహన్, జెడ్పీ సీఈవో అనితాగ్రేస్, వివిధ శాఖల అధికారులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నా రు. సభలో చర్చించాల్సిన 45అంశాలకు గాను నాలుగు అంశాలు మాత్రమే చర్చించారు. ము ఖ్యంగా వ్యవసాయ, విద్యుత్, గ్రామీణ నీటి స రఫరా, డ్వామా శాఖలపై లోతుగా చర్చించిన వైద్య ఆరోగ్య, విద్యా శాఖ, సర్వశిక్షా అభియా న్, వయోజన విద్య, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, డీఆర్డీఏలపై అంతంత మాత్రంగానే సమీక్ష జరిపింది. సమీక్షలో భాగంగా మంత్రి రామన్న మాట్లాడుతూ.. సర్వసభ్య సమావేశానికి సంబంధించి ప్రగతి నివేదికలు ఎంపీడీవోలకు అందజేయకపోవడంపై ఎంపీడీవోల పనితీరు ఎలా ఉందో అర్థమవుతోందోనని ఫైర్ అయ్యారు. ఇలాంటివి పునరావృతం కాకూడదని జెడ్పీ సీఈవోకు సూచించారు. జిల్లా అధికారుల వద్ద ఇప్పటివరకు ఎంపీపీ, జెడ్పీటీసీల ఫోన్ నంబర్లు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి మండల అభివృద్ధి ప్రణాళిక తయారు చేయాలని, అప్పుడే బంగారు తెలంగాణ కల సాకారమవుతుందని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ మిషన్ కాకతీయలో భాగంగా వ్యవసాయ శాఖ కు కూడా బాధ్యతలు ఉన్నాయని, గ్రామాల్లో దీనిపై అవగాహన కల్పించి చెరువుల్లో నుంచి తీస్తున్న మట్టిని పంట పొలాల్లో వేయడం వల్ల కలిగే లాభాలను వివరించాలని ఆదేశాలు ఉన్నట్లు ఆ శాఖాధికారి రమేష్ పేర్కొన్నారు. ఇన్చార్జి ఏవో ఉండడంతో రైతులకు ఇబ్బందు లు తలెత్తుతున్నాయని, రెగ్యులర్ ఏవోని నియమించాలని కోటపల్లి జెడ్పీటీసీ పేర్కొన్నారు. ఆసిఫాబాద్ మండలంలో 1500 ఎకరాల్లో ఈ యేడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు నష్టపోగా, ఆ రైతులకు పరిహారం ఇప్పించాలని జెడ్పీటీసీ ఏమాజీ కోరారు. ఆన్లైన్లో భూమి రికార్డులు ఉన్నా కొన్నిచోట్ల పహనీలు ఇవ్వడం లేదని తెలిపారు. ఆత్మపై అసంతృప్తి.. వ్యవసాయ శాఖ పరిధిలోకి వచ్చే వ్యవసాయ సాంకేతిక అభివృద్ధి యాజమాన్య సంస్థ (ఆత్మ) పై చర్చించారు. మండలాల్లో సభ్యులు, ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకుండా కమిటీలు ఏర్పాటు చేశారని మంచిర్యాల జెడ్పీటీసీ పేర్కొన్నారు. ఆత్మ ద్వారా అమలవుతున్న వివిధ పథకాల ప్రగతిపై ఎందుకు సమాచారం ఉండడం లేదని మంత్రి జోగురామన్న పీడీ మనోహర్‌ను ప్రశ్నించారు. ఇకపై మండలస్థాయిలో చేపడుతున్న ప్రతీ కార్యక్రమాన్ని సభ్యులకు తెలియజేయాలన్నారు. లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యుత్‌పై గరం గరం.. విద్యుత్ శాఖపై సభ్యులు గరమయ్యారు. జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఇప్పటివరకు విద్యుత్ సౌకర్యం లేదంటే ఎలా అని మంత్రి రామన్న ప్రశ్నించారు. దాని బాధ్యత ట్రాన్స్‌కో ఎస్ఈపై ఉందని కలెక్టర్ జగన్మోహన్ పేర్కొన్నారు. ఆసిఫాబాద్ మండలం బూర్గుడలో సబ్ స్టేషన్ కోసం స్థలం ఉన్నా నిర్మాణంలో ఆలస్యమవుతోందని ఆ మండల జెడ్పీటీసీ వివరించారు. బెల్లంపల్లిలోని గుర్జాలలో విద్యుత్ లైన్లు వేసినా విద్యుత్ సరఫరా కావడం లేదని తెలిపారు. బె ల్లంపల్లి పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో బోర్లు వేసేందుకు పరిపాలన అనుమతి లభించినా.. ఇప్పటివరకు వచ్చిన నిధులు ఏమయ్యాయో ఎవరికీ తెలియదని ఆ మండల జెడ్పీటీసీ పేర్కొన్నారు. జన్నారం మండలంలో బుడగజంగాలకు విద్యుత్ ఇవ్వడం లేదని, బేలలోని చప్రాలలో ఇప్పటివరకు సబ్‌స్టేషన్ పనులు ప్రారంభంకాలేదని ఆయా జెడ్పీటీసీలు తెలిపారు. వేమనపల్లి మండలంలో అక్రమ కనెక్షన్లు ఉన్నా వాటిని ఎందుకు తొలగించడం లేదని, అక్రమ కనెక్షన్లు ఉన్న వారితో డీడీలు కట్టించి కనెక్షన్లను రెగ్యులరైజ్ చేయాలని, లేకుంటే వారిపై కేసులు నమోదు చేయాలని మంత్రి ఎస్ఈకు సూచిం చారు. ఖానాపూర్ మండలంలోని చాలా గ్రామా లు విద్యుత్ సౌకర్యం లేకుండా ఉన్నాయని ఎమ్మెల్యే రేఖానాయక్ సభ దృష్టికి తీసుకొచ్చా రు. బెల్లంపల్లిలో ఇందిర జలప్రభ కింద బోర్లు వేసినా కనెక్షన్ ఎందుకు ఇవ్వలేదని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రశ్నించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించేం దుకు ఐటీడీఏ నుంచి నిధులు మంజూరు చేస్తామని, ఇందుకు మంత్రి సహకరించాలని కలెక్టర్ కోరారు. ఇందిర జలప్రభ పథకం కింద ఎస్సీ, ఎస్టీ రైతుల వ్యవసాయ భూముల్లో ఇప్పటివరకు మొత్తం 2,400 బోర్లు వేయగా, 700 బోర్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు డబ్బులు చెల్లించగా, కేవలం 621 బోర్లకు మాత్రమే కనెక్షన్లు ఇచ్చారని, మిగితా వాటికి ఇంకెంత సమయం పడుతుందని మంత్రి ప్రశ్నించారు. ఈయేడాదిలో పూర్తి చేస్తామని ఎస్ఈ వివరించారు. నార్నూర్‌లోని జక్కెపల్లిలో త్రీఫేజ్ కరెంటు సౌకర్యం లేదని, అక్కడ మొత్తం కర్ర స్తంభాలతో విద్యుత్ సరఫరా చేస్తున్నారని ఆ మండల జెడ్పీటీసీ సభ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామీణ నీటి సరఫరా.. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామానికీ తాగునీటి సౌకర్యం కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి జోగురామన్న ఆదేశించారు. ఇందుకు నియోజకవర్గా ల వారీగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, జెడ్పీటీసీలు, అధికారులు సమావేశాలు నిర్వహించాల ని పేర్కొన్నారు. చర్చలో భాగంగా మంచిర్యాల లోని నస్పూర్‌లో ట్యాంక్ నిర్మాణాలకు సంబంధించి ఒక కాంట్రాక్టర్ దక్కించుకుంటే వేరే వ్యక్తి ఆ పనులు చేస్తున్నాడని, ఇది అధికారులకు తె లియదా అని ఆ మండల జెడ్పీటీసీ సభ దృష్టికి తీసుకొచ్చారు. దిలావర్పూర్లో నాలుగు మంచినీటి ట్యాంకులు ఉన్నా నీరు లేదని, ఇంద్రవెల్లిలోని భీంనగర్, మిలిన్నగర్లలో ట్యాంకుల మరమ్మతు చేయించాలని ఆయా మండలాల జెడ్పీటీసీలు కోరారు. చెన్నూర్ ప్రజలకు గోదావరి తాగునీరు అందించేందుకు పైపులైన్ పనులు ఎందుకు పూర్తి కావడం లేదని ఆ మండల జెడ్పీటీసీ పేర్కొన్నారు. గ్రామాలకు వెళ్లినప్పుడు ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య అధికంగా ఉందని, విద్యుత్ కనెక్షన్లు ఉన్నచోటా ట్యాంకులు పనిచేయడం లేదని, మంచినీటి ట్యాంకులు ఉన్నచోట విద్యుత్ కనెక్షన్లు లేవని, ఈ రెండు ఉన్న చోట పైపులైన్లు సరిగా లేక తాగునీరు రావడం లేదని ఎమ్మెల్యే రేఖానాయక్ సభ దృష్టికి తీసుకొచ్చారు. కుంటాలలో పైపులైన్ వేసేందుకు డబ్బులు చెల్లించారో లేదో వారికే స్పష్టత లేదని మంత్రి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యారోగ్య, విద్య శాఖలపై ప్రశ్నల వర్షం వైద్య, ఆరోగ్య, విద్యా శాఖల అధికారులపై సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు. బజార్హత్నూర్ మండలంలో ఉన్న 35 పాఠశాలలకు మరుగుదొడ్లు మంజూరు కాగా, ఏ పాఠశాలలో కూడా ప్రారంభం కాలేదన్నారు. రామకృష్ణపూర్‌లోని క్యాతన్‌పల్లి పాఠశాలలో ఒక్క మరుగుదొడ్డు కూడా లేదని పేర్కొన్నారు. కోటపల్లిలోని ఎసర్వాయి గ్రామంలో చెట్ల కింద పాఠాలు బోధిస్తున్నారని ఆయా మండలాల జెడ్పీటీసీలు సభ దృష్టికి తీసుకొచ్చారు. బేలలో మోడల్ స్కూల్ నిర్మాణానికి స్థలం ఉందని, అది కొంత దూరంలో ఉందని తెలిపారు. మంజూరైన వెంటనే నిర్మాణ పనులు చేపడతామని డీఈవో సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. రెబ్బెన పాఠశాలలో హెచ్ఎం సహకరించడం లేదని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆ మండల జెడ్పీటీసీ కోరారు. లక్ష్మణచాందలో వైద్యాధికారి లేడని అక్కడి జెడ్పీటీసీ సభ దృష్టికి తీసుకురాగా.. వైద్యాధికారి ఉన్నారని డీఎంహెచ్‌వో రుక్మిణమ్మ తెలిపారు. సర్వశిక్షా అభియాన్, స్త్రీ, శిశు సంక్షేమంపై.. అనంతరం సర్వశిక్షా అభియాన్, వయోజన విద్య, స్త్రీ, శిశు సంక్షేమ శాఖలపై అంతంత మాత్రంగానే సమీక్ష జరిగింది. లక్ష్మణచాంద మండలంలో 14 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆ మండల జెడ్పీటీసీ సభ దృష్టికి తీసుకువచ్చారు. కైలాస్‌నగర్‌లో రెండు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నా వాటితో ప్రయోజనం లేకుండాపోయిందని జెడ్పీటీసీలు తెలిపారు. కొన్ని మండలాల్లో వికలాంగులకు వైకల్య ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు అధికారులు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు లంచం తీసుకుంటున్నారని పలువురు ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టేందుకు ఉన్నతస్థాయి అధికారులను నియమించామని, విచారణ పూర్తి చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ జగన్మోహన్ వివరించారు. ఆటాడుకుందాం రా..! జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రజా సమస్యలను చర్చిస్తుండగా.. మరోపక్క కొందరు అధికారులు సెల్ఫోన్లలో గేమ్స్ ఆడుతూ కనిపించారు.. ఇంకొందరు సమావేశ హాల్లో సెల్ఫోన్లను శుభ్రం చేస్తూ కనిపించారు. రాష్ట్ర మంత్రి, కలెక్టర్, జెడ్పీ సీఈవోలు పలుమార్లు అధికారులకు చెప్పినా వీరు మాత్రం ఇలా ఆటలపైనే దృష్టి పెట్టారు. -
నగర వాసులపై పన్నుల భారం
నగరవాసులపై వివిధ రూపాల్లో పన్నుల భారం మోపేందుకు నెల్లూరు కార్పొరేషన్ రంగం సిద్ధం చేసింది. అందుకు ఈ నెల 31వ తేదీన నిర్వహించనున్న నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం నెల్లూరు, సిటీ: నెల్లూరు కార్పొరేషన్ కొత్త కౌన్సిల్ ఏర్పాటైన నాలుగు నెలల తరువాత ఈ నెల 31వ తేదీన రెండో సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కౌన్సిల్ ఆమోదాన్ని కార్పొరేషన్ అధికారులు తీసుకోనున్నారు. ఇందులో నగర వాసులపై పన్నుల భారం మోపే నిర్ణయాలతో పాటు అభివృద్ధికి సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. పాత భవనాల కూల్చివేతకు కౌన్సిల్ అనుమతి తీసుకోనున్నారు. పిల్లల పార్క్ నిర్వహణను బీఓటీ (బిల్ట్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్) పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ఒప్పందం, ఆయా డివిజన్ల పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు 70:30 పద్ధతిలో ఆయా ప్రాంత వాసుల నుంచి నిధుల సేకరణకు అనుమతి వంటి కీలక అంశాలు కూడా కౌన్సిల్లో చర్చకు రానున్నాయి. గతంలో జన్మభూమి కార్యక్రమంలో ఈ తరహా అభివృద్ధికి ప్రభుత్వం అనుమతించింది. అయితే ప్రజల భాగస్వామ్యం కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. మళ్లీ ఈ పద్ధతిలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కార్పొరేషన్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తంగా ఈ సమావేశంలో చర్చించేందుకు భారీ అజెండాను అధికారులు రూపొందించారు. పార్కింగ్ బాదుడు నగరంలోని కీలక ప్రాంతాల్లో ఇకపై వాహనాలు పార్కింగ్ చేసేందుకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఆ మేరకు గుర్తించిన ఎనిమిది ప్రాంతాల్లో సైకిళ్ల నుంచి నాలుగు చక్రాల వాహనాల వరకు పార్కింగ్ రుసుం వసూలు చేసేందుకు అనుమతి కోరనున్నారు. వేలం పాట ద్వారా పెయిడ్ పార్కింగ్ నిర్వహణకు కౌన్సిల్ ఆమోదం కోరనున్నారు. ఏసీ కూరగాయల మార్కెట్, ప్రకాశం పంతులు విగ్రహం, అర్చన థియేటర్, ఆత్మకూరు బాస్టాండ్, నర్తకీ, గాంధీబొమ్మ, మినీ బైపాస్ తదితర ప్రాంతాల్లో వాహనాలు నిలపాలంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కాగా నగరంలో భవన నిర్మాణాలకు సంబంధించి ఒక్క శాతం లేబర్ సెస్ వసూళ్లకు సంబంధించి కౌన్సిల్ నుంచి ఆమోదం తీసుకోనున్నారు. భవనాల నిర్మాణ వ్యయం భారీగా పెరిగిన పరిస్థితుల్లో లేబర్ సెస్ వసూళ్లు చేయాలని కార్పొరేషన్ నిర్ణయించడంతో నిర్మాణ వ్యయం మరింత పెరిగి ప్రజలకు భారం కానుంది. కొండాయపాళెం రోడ్డు వెడల్పు 60 అడుగులు చేయాలన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి డిమాండ్ మేరకు మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు కోరుతూ కార్పొరేషన్ అధికారులు అజెండాలో ప్రతిపాదించారు. నెల్లూరు చెరువు చుట్టూ నక్లెస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపేందుకు కౌన్సిల్ ఆమోదం కోరుతున్నారు. చెరువు చుట్టూ పార్క్‌లు, ఎంటర్టైన్మెంట్ జోన్లు, ఫుడ్ కోర్టుల అభివృద్ధికి పీ.పీ.పీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్) పద్ధతిన అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వివిధ విభాగాల్లో పని చేస్తున్న 1476 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించేందుకు అనుమతి కోరనున్నారు. అయితే నగరంలోని పలు మురుగు నీటి కాలువల్లో పూడిక తొలగింపునకు టెండర్లు పిలవనున్నారు. లక్షలాది రూపాయలు వ్యయం చేసే ఎలక్ట్రికల్ పరికరాల కొనుగోలుకు ఈ ప్రక్యూర్మెంట్ టెండర్లు పిలిచేందుకు అనుమతి తీసుకోనున్నారు. కార్పొరేషన్ నిర్వహణలోని పాత వాహనాల వేలం ద్వారా వచ్చే సొమ్ముతో కొత్త వాహనాలు కొనుగోలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆ మేరకు 15 ఏళ్లకు పైబడి, రెండున్నర లక్షల కిలోమీటర్లు నడిచిన పాత వాహనాలను 11 గుర్తించారు. వీటన్నింటినీ వేలం ద్వారా అమ్మకం చేసి వచ్చే నిధులతో మున్సిపల్ కమిషనర్‌కు కొత్త వాహనం కొనుగోలు చేసేందుకు కౌన్సిల్ అనుమతి తీసుకోనున్నారు. శతాబ్దం చరిత్ర కలిగిన పాత మున్సిపల్ కార్యాలయాన్ని కూల్చివేసి ఆ స్థానంలో ప్రజా ఉపయోగ భవనాల నిర్మాణానికి అనుమతి కోరనున్నారు. నగరంలో ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు, లాలీపాప్స్ తదితరాల నుంచి వచ్చే వ్యాపార ప్రకటనల లాభాలపై కూడా కార్పొరేషన్ దృష్టి సారించింది. మొత్తానికి పలు కీలక నిర్ణయాలు తీసుకోనుండడంతో ఈ సమావేశంపై ప్రజల్లో ఆసక్తి రేగుతోంది. -
జిల్లాపై వివక్ష
కడప ఎడ్యుకేషన్: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం పలు సమస్యలపై వాడివేడిగా సాగింది. ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం జిల్లాపై వివక్ష చూపుతోందంటూ పలువురు ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం దాదాపు 7 గంటల వరకు కొనసాగింది. జిల్లాలో తాగునీరు, విద్యుత్, వ్యవసాయం, హార్టికల్చరల్, డ్వామా,ఎస్సీ ఎస్టీ బీసీ సబ్‌ప్లాన్, పంచాయతీరాజ్ సమస్యలపై చర్చ జరిగింది. సమావేశానికి జెడ్పీ చైర్మన్ గూడూరు రవి అధ్యక్షత వహించారు. రైతులకు సంబంధించిన రుణమాఫీ ప్రకటించకుండానే ఇంత చేశాం అంతచేశాం అని చెప్పుకోవటం ఏమిటని సభలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించ కుండా ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రొద్దుటూరు నియోజక వర్గానికి ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదన్నారు. పదివేలు పెట్టి మంచినీటి సమస్యను కూడా తీర్చలేదన్నారు. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు తనపై కక్ష సాధింపులో భాగంగా తన స్వగ్రామమైన పైడిపాలెంలో రైతులు సాగు చేసిన భూములపై విచారణ మొదలు పెట్టించారన్నారు. ఈ విషయంలో రైతులకు అన్యాయం జరిగితే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. జిల్లాలో మంచినీటి సమస్య అధికంగా ఉందని పలువురు ఎమ్మెల్యేలు సభ దృష్టికి తెచ్చారు. జిల్లాలో సుండుపల్లి, రాయచోటి, పులివెందులతోపాటు ఇంకా చాలా మండలాల్లో మంచినీటి సమస్య ఉందని పలువురు జెడ్పీటీసీ సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. వీటితోపాటు చాలా మండలాల్లో మంచినీటిని సరఫరాచేసినందుకు ఇంతవరకూ నిధులు రాలేదని పలువురు సభ్యలు సభలో ఆర్‌డబ్లూఎస్ ఆధికారులపై ధ్వజమెత్తారు. ఇలీవల మంచినీటి పథకాలకు విద్యుత్తును తొలిగించడం వల్ల జిల్లాలో ప్రజలు 48 గంటలపాటు మంచినీటికి ఇబ్బందులు పడ్డారని మైదుకూరు ఎమ్మెల్యే రఘరామిరెడ్డి విద్యుత్తు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచినీటి పథకాలకు సంబంధించిన బిల్లులు గత ప్రభుత్వమే చెల్లిస్తే ఈప్రభుత్వం మాత్రం పంచాయితీ నిధుల నుంచి కట్టించుకోవాలనటం విడ్డూరంగా ఉందన్నారు. సంబంధిత బిల్లులు ప్రభుత్వమే చెల్లించే విధంగా సభ తీర్మానం చేయాలని కోరగా సభ్యులంతా బలపరిచారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ జిల్లాకు విద్యుత్ సబ్స్టేషన్లు మంజూరు చేయాలని కోరగా, ఎస్ఈ స్పందిస్తూ నియోజకవర్గానికి ఒక సబ్‌స్టేషన్ చొప్పున మంజూరు కోసం ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య మాట్లాడుతూ ప్రభుత్వం మధ్యాహ్న భోజనానికి నిధులు ఇచ్చినా చాలా పాఠశాలల్లో మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయలేదన్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ఏమైనట్లు? చంద్రబాబు అన్ని గ్రామాలకు మినరల్ వాటర్ అందిస్తామని చెప్పిన మాటలు ఏమయ్యాయని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘరామిరెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు చెప్పిన పథకంలో జిల్లాలో ఎన్ని గ్రామాలకు మినరల్ వాటర్ ఇస్తున్నారో చెప్పాలని ఆర్‌డబ్లూఎస్ ఆధికారులను నిలదీశారు. దీనికి ఆర్‌డబ్ల్యుఎస్ అధికారి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 613 యూనిట్లు గుర్తించామని, 63 యూనిట్లు మంజూరయ్యారని, 44 పూర్తయి మినరల్ వాటర్‌ను అందిస్తున్నాయన్నారు. దాతల సహకారంతో వాటిని నిర్వహిస్తున్నారని చెప్పడంతో సొమ్ము ఒకరిది... సోకకరిది అన్న రీతిలో వీటి నిర్వహణలో ఉందిన ఎమ్మెల్మేలు విమర్శించారు. మంచినీటి సమస్యపై ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో జరిగిన విజిలెన్స్ మానిటరింగ్ సమావేశంలో వేముల మండలంలో మంచినీటి సమస్య గురించి కలెక్టర్ దృష్టికి తెచ్చామని, ఇంతవరకు పరిష్కరించలేదని ఆయన అన్నారు. వీటితోపాటు సింహాద్రిపురం, లింగాల మండలంలోని సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను నింపాలని చెప్పినా పట్టించుకోలేదన్నారు. ఇసుక క్వారీలు రద్దు చేయాలి కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాలో ఇప్పటికే ఐదు ఇసుక క్వారీల మంజూరు చేసిందని, ఇది చాలదన్నట్లు మళ్లీ 15 క్వారీలకు అనుమతి ఇచ్చేందుకు సిద్ధమవుతోందన్నారు. ప్రభుత్వ చర్యల కారణంగా జిల్లాలో తీవ్ర తాగునీటి సమస్య ఎదురవుతోందన్నారు. దీంతోపాటు ఇసుకపై వచ్చే ఆదాయాన్ని జిల్లా అభివృద్ధికే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు బిల్లుల చెల్లింపు విషయంలో స్పష్టమైన హామి ఇవ్వాలన్నారు. గత ఏడాది గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేసిన బిల్లులు ఇంతవరకు ఇవ్వకపోతే పరిస్థితి ఏంటన్నారు. ఆక్రమణ నుంచి దుంపలగట్టు చెరువును కాపాడండి ఖాజీపేట మండలంలోని దుంపలగట్టు చెరువును కొంతమంది ఆక్రమించుకున్నారని, దీంతో 400 ఎకరాల ఆయకట్టు బీడుగా ఉందన్నారు. దీంతో రైతులు చాలామేర నష్టపోయారన్నారు. దుంపలగట్టుకు చెందిన ఓ రైతు చెరువు ఆక్రమణ భూమిలో బోరును వేసి అక్రమంగా విద్యుత్‌ను ఏర్పాటు చేసుకుని పంటలను సాగు చేసుకుంటున్నారన్నారు. దీంతోపాటు చెరువు అలుగును ఎవరో ధ్వంసం చేశారని, దీనిపై కేసీ అధికారులు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు. అలాగే రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ బొజ్జవారిపల్లె చెరువులో కొంతమంది భూమిని ఆక్రమించుకున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధిత విషయం గురించి గతంలో ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. స్టీల్ ప్లాంటును ఏర్పాటు చేయాలి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కలలుగన్న స్టీల్ ప్లాంటు ఏర్పాటు త్వరగా జరిగేటట్లు చూడాలని ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి కోరారు. దీనిపై సభలో తీర్మానం చేయాలని కోరారు. అలాగే కౌలు రైతులకు కూడా రైతు రుణమాఫీ వర్తించేలా చూడాలని కోరారు. పలువురు జెడ్పీటీసీ సభ్యులు తమ ప్రాంతంలో నెలకొన్న మంచినీటి సమ్యను పరిష్కరించాలని సభ దృష్టికి తెచ్చారు. మైదుకూరు జెడ్పీటీసీ తన మండలంలోని కొంతమంది పసుపు రైతులు కలుపు నివారణకు పిచికారి చేసిన మందుతో పంట మొత్తం దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వీరికి ప్రభుత్వమా లేక కంపెనీ ప్రతినిధులు నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారో చెప్పాలని నిలదీశారు. అలాగే ఎరువుల మంజూరులో కూడా కొంత అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆరోపించారు. గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, సుండుపల్లె జెడ్పీటీసీలు మాట్లాడుతూ తమ మండలాల్లో ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురయ్యాయని, వాటి స్థానంలో కొత్తవి మంజూరు చేయాలని విద్యుత్‌శాఖ ఎస్ఈని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎస్బి అంజాద్బాష, జయరాములు, ఎమ్మెల్సీలు బచ్చల పుల్లయ్య, బత్యాల చెంగల్రాయులు, జాయింట్ కలెక్టర్ రామారావు, జెడ్పీ సీఈఓ మాల్యాద్రి, వైస్ చైర్మన్ సుబ్బారెడ్దిలతోపాటు పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
రచ్చ.. రచ్చ
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రచ్చ రచ్చగా సాగింది. పాలక పక్షం రాజ్యాంగానికి.. చట్టానికి లోబడి వ్యవహరించక అధికారదర్పం ప్రదర్శించగా... నియంత్రించాల్సిన జిల్లా కలెక్టర్ ఏకపక్ష చర్యలకు పాల్పడుతున్నారు.. జెడ్పీకి సుప్రీం అయిన ఛైర్మన్‌ను కూడా నియంత్రించే దిశగా వ్యవహరిస్తున్నారు.. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ విషయంలో మోసపు మాటలు చెబుతున్నారు అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం జిల్లా పరిషత్ వైఎస్సార్ సమావేశం మందిరంలో ఛైర్మన్ గూడూరు రవి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం సభ్యులు వ్యవహరిస్తున్న తీరు, వారికి అధికారులు వంత పాడుతున్న వైనంపై సమావేశంలో తీవ్రస్థాయిలో దుమారం రేగింది. మధ్యాహ్నం 12 గంటలకు ఛైర్మన్ గూడూరు రవి సమావేశాన్ని అరగంట పాటు వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలో మళ్లీ తీవ్రస్థాయిలో గందరగోళం నెలకొనడంతో 2.30 గంటలకు మరోమారు వాయిదా వేశారు. ఆపై ప్రారంభమైన సభలో జిల్లా గ్రామీణాభివృద్ధిపై చర్చసాగింది. ఆర్‌డబ్ల్యుఎస్, ఎలక్ట్రిసిటీ మినహా ఇతర అధికారులు వెళ్లిపోవాలని ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ కేవీ రమణ తెలిపారు. వీడియోకాన్ఫరెన్స్ ఉన్నందున అధికారులంతా వెళ్లిపోవాలని కలెక్టర్ ఆదేశించారు. అధికారులు అలా వెళ్లవద్దని జెడ్పీ ఛైర్మన్ కోరుతున్నా వారు ఏ మాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీంతో సమావేశం అర్ధంతరంగా ముగిసింది. అధికారంలో ఉన్నాం... ఏమైనా చేయగలం: ఎంపీ రమేష్ మేము అధికారంలో ఉన్నాం.. తల్చుకుంటే ఏమైనా చేయగలం.. ఇకపై సమావేశానికే రాలేరు.. చెప్పినట్లు వినండి అంటూ ఓదశలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ హుంకరించారు. ఎమ్మెల్యేలు రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, అంజాద్బాష, రవీంద్రనాథరెడ్డితోపాటు జెడ్పీటీసీలు దీనిపై తీవ్రస్థాయిలో ప్రతిఘటించారు. ఇష్టసానుసారం మాట్లాడుతానంటే కుదురదని తే ల్చిచెప్పారు. తెలంగాణ ఓటరుగా నామినేషన్ అఫడవిట్లో ధ్రువీకరించిన సీఎం రమేష్ చట్టానికి అనుగుణంగా సభ్యుడైతే తనకు అభ్యంతరం లేదని ఎమ్మెల్యే రాచమల్లు తెలిపారు. సీఎం రమేష్ తనకు చిన్ననాటి స్నేహితుడని.. కలిసి చదువుకున్నామని.. అతనిపై ఎలాంటి వ్యక్తిగత కక్ష లేదని.. ఈ విషయాన్ని అధికారులు గుర్తించాలని రాచమల్లు కోరారు. జెడ్పీ సీఈఓ మాల్యాద్రి నారద పాత్రను విరమించుకోవాలని ధ్వజమెత్తారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి జోక్యం చేసుకుని తెలంగాణలో ఓటు లేదు.. పోట్లదుర్తిలోనే ఓటు ఉందని ఆత్మసాక్షిగా ఎంపీ రమేష్ ప్రకటిస్తే సభలో ఉండడానికి అభ్యంతరం లేదని తెలిపారు. లేదంటే ఆయన బెదిరింపులకు ‘పుచ్చకాయ’ కూడ బెదరదు అనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. మరోమారు నిర్వహించే సమావేశానికి అన్ని ఆధారాలు జెడ్పీకి అందజేస్తానని ఎంపీ రమేష్ ప్రకటించారు. ప్రజాప్రతినిధులు చట్టానికి లోబడి వ్యవహరించాలని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు హితవు పలికారు. సమావేశంలో విప్ మల్లికార్జునరెడ్డి, ఎంపీలు మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, సీఎం రమేష్ ఎమ్మెల్యేలు జయరాములు, కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయడు, జెడ్పీ వైస్ చైర్మన్ సుబ్బారెడ్డి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఛైర్మన్ పట్ల చిన్నచూపు.. జిల్లా ప్రథమ పౌరుడు, కేబినేట్ ర్యాంకు హోదా ఉన్న జెడ్పీ ఛైర్మన్ గూడూరు రవి పట్ల సాక్షాత్తు జిల్లా కలెక్టర్ కేవీ రమణ చిన్నచూపు ప్రదర్శించారు. తొలిత రాజ్యసభ సభ్యుడు రమేష్ అఫడవిట్ ధ్రువీకరణలో హైదరాబాద్ వాసిగా పొందుపర్చారు. జెడ్పీ ఛైర్మన్ అనుమతి ఏ మాత్రం లేకుండానే జెడ్పీ మీటింగ్‌కు అర్హత కల్గిన మెంబర్ అంటూ ఆర్డర్ ఇచ్చామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రజాప్రతినిధుల మధ్య వివాదం చెలరేగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కేవీ రమణ, సీఈఓ మాల్యాద్రి ఎమ్మెల్యేల వైపు వేళ్లు చూపిస్తూ ఆవేశంగా మాట్లాడారు. ఈ పరిణామాన్ని ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి తీవ్రస్థాయిలో ప్రతిఘటించారు. అధికారులు అన్న స్పృహను మర్చిపోవద్దని హెచ్చరించారు. ఆదే అభిప్రాయాన్ని ఎమ్మెల్యేలు రవీంద్రనాథరెడ్డి, రఘురామిరెడ్డి వ్యక్తం చేస్తూ, ఛైర్మన్‌ను నియంత్రించడం సరైంది కాదని తెలిపారు. చట్టాన్ని వివరించేంతవరకే మీరు.. నిర్ణయం తీసుకోవాల్సింది జెడ్పీ ఛైర్మన్ అని వివరించారు. ఈదశలో శాసనమండలి ప్రతిపక్ష నేత సి రామచంద్రయ్య కల్పించుకుని లెజిస్ట్రేచర్కు సెక్రెటరీ మాత్రమే అన్న విషయాన్ని గుర్తెరగాలని కలెక్టర్‌కు సూచించారు. జెడ్పీకి ఛైర్మన్ సుప్రీం అనే విషయాన్ని మరవద్దన్నారు. దీంతో కలెక్టర్, సీఈఓలు వెనక్కి తగ్గారు. సాయంత్రం సమావేశం ప్రారంభం అయ్యాక ఇప్పటికే ఆలస్యం అయింది.. వీడియో కాన్ఫరెన్స్ ఉంది.. అధికారులు వెళ్లిపోవాలంటూ కలెక్టర్ ఆదేశించడం మరో వివాదానికి దారి తీసింది. అధికారులంతా కూర్చోవాలని, సమావేశాన్ని కొనసాగించాలని ఛైర్మన్ రవి కోరుతుండగా అందుకు ప్రతిగా కలెక్టర్ అధికారులు వెళ్లిపోవాలంటూ మైకులో ఆదేశించారు. -
బీబీఎంపీ సమావేశంలో వాగ్వాదం
బెంగళూరు: బీబీఎంపీ సర్వసభ్య సమావేశంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. మీరు అవినీతికి పాల్పడ్డారంటూ ఒకరిపై ఒ కరు ఆరోపణలు చేసుకున్నారు. బుధవారం బీబీఎంపీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంలో బీజే పీ సీనియర్ కార్పొరేటర్లు మాట్లాడుతూ.. బీబీఎంపీ రాజరాజేశ్వరినగర ఉప విభాగంలోని అభివృద్ధి పనుల ఫైళ్లను తన ఇంటిలో ఉంచుకొని గోల్‌మాల్‌కు పాల్పడిన శాసన సభ్యుడు మునిరత్న వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని పట్టుబట్టారు. ఆ సమయంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. బీబీఎంపీలో జరిగి న అన్ని అభివృద్ధి పనుల్లో గోల్మాల్ జరిగిందని, ఈ మొత్తం వ్యవహారం సీబీఐతో దర్యాప్తు చేయించాలని డి మాండ్ చేశారు. అంతేకాని ఒక్క మునిరత్న మీద సీబీఐ దర్యాప్తు చేయించాలని చెప్పడం సిగ్గు చేటు అన్నారు. ఈ సందర్బంలో బీజేపీ కార్పొరేటర్లు ‘కాంగ్రెస్ డౌన్‌డౌన్... మునిరత్న రాజీనామా చేయాలి’ అని నినాదాలు చేస్తూ మేయర్ పోడియం దగ్గరకు దూసుకు వెళ్లారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు ‘బీజేపీ డౌన్‌డౌన్’ అంటూ నినాదాలు చేస్తు మేయర్ పోడియం దగ్గరకు వెళ్లారు. ఇరు పార్టీల నాయకులు పరస్పరం నినాదాలు చేసుకోవడంతో ఎవరు ఏమి మాట్లాడుతున్నారో అ ర్థం కాలేదు. మేయర్ శాంతకుమారి సభను పలుసార్లు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభం అయినా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంలో బీజేపీ కార్పొరేట ర్ (లగ్గేరి) లక్ష్మికాంతరెడ్డి మాట్లాడుతూ బీబీఎంపీ రా జరాజేశ్వరి నగర ఉప విభాగం కార్యాలయంలో ఉండవలసిన ఫైల్లు మునిరత్న భవనంలో ఎలా ఉన్నాయి అని కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పి తరువాత మాట్లాడాలని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ సందర్భంలో ఇరు పార్టీల సీనియర్ కార్పొరేటర్లు ఒకరి మీద ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. నాకు ఎలాంటి సంబంధం లేదు : మునిరత్న బుధవారం బీబీఎంపీ సమావేశానికి ఇక్కడి రాజరాజేశ్వరి నగర నియోజక వర్గం శాసన సభ్యుడు మునిరత్న హాజరైనాడు. గందరగోళం జరుగుతున్న సమయంలో తనకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలని మేయర్‌కు మనవి చేశారు. అయితే మునిరత్న మాట్లాడటానికి పాలికె సమావేశంలో అవకాశం చిక్కలేదు. తరువాత ఆ యన సభ నుంచి బయటకు వచ్చి పాలికె కార్యాలయం ఆవరణంలో మీడియాతో మాట్లాడారు. లోకాయుక్త అ ధికారులు స్వాధీనం చేసుకున్న ఫైల్లకు తనకు ఎలాం టి సంబంధం లేదని స్పష్టం చేశారు. జరిగిన వాస్తవం చెప్పడానికి తాను పాలికె సమావేశంలో ప్రయత్నిం చినా అవకాశం ఇవ్వలేదని, కావాలని తనను కేసులో ఇరికించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. -
సమస్యల తోరణాలు
కాకినాడ సిటీ/అమలాపురం :జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు అధ్యక్షతన శనివారం కాకినాడలోని జెడ్పీ సమావేశమందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశం ఆద్యంతం వాడిగా, వేడిగా సాగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల వాగ్వివాదాలు, వైఎస్సార్ సీపీ ప్రతినిధుల వాకౌట్ వంటి పరిణామాలు వాతావరణాన్ని వేడెక్కించాయి. విలీన మండలాల్లో సమస్యలు సహా పెక్కు ఇక్కట్లను ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు ఏకరువు పెట్టారు. పురుషుల కన్నా మహిళా సభ్యులు తమ ప్రాంత సమస్యలపై ఎలుగెత్తడం విశేషం. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి యనమల రామకృష్ణుడు ముఖ్యఅతిథులుగా హాజరైన సమావేశానికి తొలిసారి హాజరైన భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సమావేశంలో తొలుత యనమల మాట్లాడుతూ జెడ్పీకి మరో పోటీ కేంద్రం ఉండకూడదనే ఉద్దేశంతోనే డీఆర్సీని తమ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. రాజప్ప మాట్లాడుతూ నీటి ఎద్దడి దృష్ట్యా ముందస్తు సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయశాఖతోపాటు ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. అనంతరం జెడ్పీ చైర్మన్ నామన శాఖల వారీగా సమీక్షను చేపట్టారు. సుమారు 20 ఏళ్ల తరువాత సమావేశానికి వచ్చానన్న యనమల 20 నిమిషాలు కూడా ఉండకుండా వెళ్లిపోవడం గమనార్హం. నకిలీ విత్తనాలు, నీలం పరిహారం ఆలస్యం, హుద్‌హుద్ తుపాను నష్టం అంచనాలపై ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, తోట త్రిమూర్తులు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వేగుళ్ల జోగేశ్వరరావు వ్యవసాయశాఖ జేడీ విజయకుమార్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. రైతు రుణమాఫీపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు అధికారుల తీరును తప్పుబట్టారు. జిల్లాలో ఎందరు రైతులు రుణమాఫీకి అర్హులన్న సమాచారం కూడా లేదంటే మాఫీ అమలు ఏ విధంగా ఉందో తేటతెల్లమవుతోందన్నారు. తన ప్రాంతంలో రాజకీయ కక్షలతో ఆరుగురి పింఛన్లు రద్దు చేశారని జెడ్పీ ప్రతిపక్ష నాయకుడు జ్యోతుల నవీన్ అధికారులపై మండిపడ్డారు. ఎందుకు నిలిపివేశారో చెప్పాలని పట్టుబట్టారు. ఉపాధి హామీ పథకంలో అవకతవకలకు పాల్పడుతున్న ఫీల్డ్ అసిస్టెంట్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు డ్వామా పీడీ నాగేశ్వరరావును నిలదీశారు. ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని పలువురు సభ్యులు కోరారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పలుచోట్ల నిలిచిపోవడం దారుణమని సభ్యులు మండిపడ్డారు. అవినీతికి పాల్పడిన వారికి అవార్డులు ఇవ్వడం ఏమిటని ఎమ్మెల్యేలు రామకృష్ణారెడ్డి, వేగుళ్ల అధికారులను తప్పుబట్టారు. కొనసాగుతున్న ఇసుక మాఫియా ఆగడాలు ప్రభుత్వం ఇసుక తవ్వకాలు పాలసీ మార్చినా మాఫియా ఆగడాలు తగ్గలేదని వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్‌రాజు, జేసీ ముత్యాలరాజులకు ఫిర్యాదు చేశారు. ఇసుక రీచ్‌లను ఉదయం డ్వాక్రా సంఘాలు నిర్వహిస్తుంటే సాయంత్రం మాఫియాలు రంగప్రవేశం చేసి వందల లారీల ఇసుకను దొంగ బిల్లులు చూపి కొల్లగొట్టుకుపోతున్నారన్నారు. రావులపాలెం జెడ్పీటీసీ సాకా ప్రసన్నకుమార్ ‘సాక్షి’తోపాటు వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలు చూపుతూ వాటిపై ఎందుకు విచారణ చేయలేదని నిలదీశారు. పీడీ మాట్లాడుతూ జిల్లాలో 23 రీచ్‌ల ద్వారా ఇప్పటి వరకు రూ.15 కోట్ల ఆదాయం వచ్చిందని, దానిలో స్థానిక సంస్థలకు వచ్చేది రూ.90 లక్షలేననడంతో జెడ్పీటీసీలు మండిపడ్డారు. ప్రభుత్వ విధానాల వల్ల స్థానిక సంస్థల ఆదాయానికి గండి పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత గొంతు నొక్కుతారా? జెడ్పీ ప్రతిపక్ష నేత గొంతు నొక్కే యత్నాలను నిరసిస్తూ సమావేశం నుంచి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు వాకౌట్ చేశారు. వైఎస్సార్ సీపీ నుంచి ఎన్నికైనందున సమావేశంలో తనకు మాట్లాడేందుకు అవకాశం కల్పించకపోవడం లేదని జెడ్పీ ప్రతిపక్ష నేత జ్యోతుల నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రతిపక్ష నేత గొంతు నొక్కుతారా? మీ ఇసుక మాఫియా బాగోతాలు బయట పెడతానని భయపడుతున్నారా?’ అని మండిపడ్డారు. జెడ్పీ చైర్మన్ నామనతో వాగ్వివాదానికి దిగారు. ఆయనకు మద్దతుగా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు అధికారపార్టీ నాయకుల తీరుపై విరుచుకుపడ్డారు. సమావేశం నుంచి వాకౌట్ చేశారు. జరిగిన దానికి విచారణ వ్యక్తం చేస్తున్నానని నామన నచ్చజెప్పడంతో తిరిగి సమావేశానికి హాజరయ్యారు. మహిళా జెడ్పీటీసీలు తమ ప్రాంత సమస్యలుపై గళమెత్తడం సమావేశానికి హైలెట్‌గా నిలిచింది. అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని చెప్పడమే కాక, పరిపాలనాపరంగా ఎదురైన ఇబ్బందుల్ని అధికారులకు వివరించి వారి నుంచి హామీలను పొందారు. అంబేద్కర్‌కు నివాళి తొలుత అంబేద్కర్‌కు నివాళులర్పించిన సభ్యులు తరువాత దివంగత ఎన్టీఆర్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. వాకతిప్ప బాణా సంచా విస్ఫోటంలో, హుద్‌హుద్ తుపానులో మరణించిన వారి ఆత్మల శాంతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. సమావేశంలో ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, బలశాలి ఇందిర, ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, పిల్లి అనంతలక్ష్మి, అదనపు జేసీ మార్కండేయులు, జెడ్పీ సీఈఓ పద్మలు పాల్గొన్నారు. దమ్ముంటే సెజ్ భూములను పంచండి : జ్యోతుల సమావేశంలో రుణమాఫీపై అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య వాగ్వివాదం జరిగింది. రైతులకు మేలు చేసింది చంద్రబాబేనని పిఠాపురం ఎమ్మెల్యే వర్మ అనగా, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అభ్యంతరం తెలిపారు. అధికారంలోకి రాగానే కేఎస్ఈజెడ్ భూముల్ని రైతులకు పంచుతానన్న బాబు ఇంత వరకూ పట్టించుకోలేదన్నారు. దీనిపై వర్మ ఆ భూములు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరులవన్నట్టు మాట్లాడగా, జ్యోతులతోపాటు ఆ పార్టీ ఎమ్మెల్మేలు చిర్ల జగ్గిరెడ్డి, వరుపుల సుబ్బారావు, దాడి శెట్టి రాజా విరుచుకుపడ్డారు. ‘దమ్ముంటే ఆ భూములు స్వాధీనం చేసుకుని రైతులకు పంచండి’ అని సవాల్ విసిరారు. సవాల్‌కు స్పందించకుండా అధికార పార్టీ నాయకులు మూకుమ్మడిగా ఎదురుదాడికి యత్నించారు. ‘చాగల్నాడు ఎత్తిపోతలకు అనుమతి ఇవ్వనన్నందుకు ఎన్టీఆర్‌పై తిరుబాటు చేశాను. చంద్రబాబు ముఖంపై రాజీనామా పత్రం విసిరివచ్చాను. మీ పార్టీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులే సాక్షి. మీకు రైతులకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి ఉంటే మీరు రాజీనామకు సిద్ధపడండి’ అని జ్యోతుల అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు. -
సర్వసభ్య సమావేశం వద్దు
బార్ కౌన్సిల్‌కు హైకోర్టు ఆదేశం మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయం వాయిదా సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు ప్రత్యేక బార్‌కౌన్సిల్ ఏర్పాటుకోసం నిర్వహించ తలపెట్టిన సర్వసభ్యసమావేశం వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్‌తో సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా బార్ కౌన్సిల్ ఏర్పాటు చేసే విషయంలో వెంటనే తగిన చర్యలు ప్రారంభించాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇటీవల తీర్పు ఇచ్చిన నేపథ్యంలో శనివారం సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే దీనిని వాయిదా వేసుకోవాలని హైకోర్టు ధర్మాసనం శుక్రవారం రాష్ట్ర బార్ కౌన్సిల్‌ను ఆదేశించింది. సింగిల్ జడ్జి తీర్పును నిలుపు చేయాలా? వద్దా..? అన్న విషయంపై విచారణ జరుగుతున్న సమయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ బార్ కౌన్సిల్ ఏర్పాటు నిమిత్తం సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం వాటిని మరోసారి విచారించింది. బీసీఐ తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి, రిట్ పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఎస్.ఆర్.అశోక్, సరసాని సత్యంరెడ్డిలు తమ వాదనలను వినిపించారు. చట్ట సభల ద్వారా న్యాయవాదుల చట్టానికి సవరణలు చేసి, అందులో తెలంగాణ రాష్ట్రం పేరును చేర్చేంత వరకు ప్రస్తుతం ఉన్న బార్ కౌన్సిలే ఇరు రాష్ట్రాలకూ కొనసాగుతుందని ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం అపాయింటెడ్ డే అయిన జూన్ 2 నుంచే తెలంగాణకు బార్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాల్సి ఉందని అశోక్, సత్యంరెడ్డిలు వివరించారు. అలా కాకుండా ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్‌నే ఇరు రాష్ట్రాలకూ యథాతథంగా కొనసాగిస్తే, అది పునర్విభజన చట్ట నిబంధనలకు విరుద్ధమవుతుందన్నారు. ఈ సమయంలో ప్రకాశ్‌రెడ్డి జోక్యం చేసుకుని సింగిల్ జడ్జి తీర్పును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును కోరారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, మధ్యం తర ఉత్తర్వులు జారీ చేసే విషయంలో తమ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నామని, వచ్చేవారం నిర్ణయం వెలువరిస్తామని ప్రకటించింది. -
సర్వసభ్య సమావేశం అనుమానమే?
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ చివరి పాలకమండలి సమావేశం జరుగుతుందా? చివరి భేటీలో అధికారుల తీరును ఇరుకున పెట్టాలనుక్ను ప్రజాప్రతినిధుల ఆశలు అడియాలు కానున్నాయా? కీలక అంశాలు చర్చించకుండానే పాలక మండలి గడువు ముగియనుందా?ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి అధికార వర్గాలు. జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు వచ్చేనెల 3వ తేదీతో ముగుస్తోంది. ఆలోగా చివరి సర్వసభ్య సమావేశం నిర్వహించాలనుకున్నారు. నిబంధనల ప్రకారం అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు జీహెచ్ంఎసీ సర్వసభ్య సమావేశం నిర్వహించకూడదు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎక్స్అఫీషియో సభ్యులు సమావేశాలకు హాజరయ్యేందుకు వీలుగా ఈ నిబంధన రూపొందించారు. ప్రస్తుతం అసెంబ్లీ శీతాకాలపు సమావేశాలు జరుగుతున్నాయి. ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం ఈనెల 22 వరకే అసెంబ్లీ జరగాలి. దీంతో 29న జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశానికి మేయర్ తేదీని ఖరారు చేశారు. తాజాగా అసెంబ్లీ సమావేశాలు 29వ తేదీ వరకు జరిపేందుకు నిర్ణయించడంతో సర్వసభ్య సమావేశం జరిపేందుకు వీల్లేకుండా పోయింది. ఆ తర్వాతనైనా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలనుకుంటే.. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత పాలకమండలి గడువు ముగిసేలోగా సర్వసభ్య సమావేశాలు నిర్వహించేందుకు అవకాశం లేకుండా పోయిందని భావిస్తున్నారు. ప్రత్యేక అనుమతులతో తప్ప జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం జరిగే అవకాశం లేదు. చివరి సమావేశంలో తీవ్రంగా స్పందించాలని పలువురు ప్రజాప్రతినిధులు భావించా రు. ఆమేరకు ప్రణాళికలు సైతం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. మేయర్‌కు, కమిషనర్‌కు మధ్య అభిప్రాయభేదాలు బహిరంగం కావడంతో చివరి సర్వసభ్యసమావేశంలో అధికారులు-ప్రజాప్రతినిధుల మధ్య యుద్ధం జరగగలదనే చర్చ జరిగింది. తీరా సర్వసభ్య సమావేశమే జరగని పరిస్థితి ఎదురవడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటుండగా... ఎలాగైనా సమావేశాన్ని జరపాలనే యోచనలో కొందరు ఉన్నారు. అందుకు తగ్గ అవకాశాలేమైనా ఉన్నాయేమోననే ఆలోచనలో పడ్డారు. -
‘నక్కలగండి’పై రాజకీయ దుమారం
- మంత్రి, ఎంపీ గుత్తా మధ్య వాగ్వాదం - కింద కూర్చొని నిరసన తెలిపిన జెడ్పీటీసీలు - గత ప్రభుత్వ హయాంలోని మంత్రులు, ఎంపీల ఇళ్ల వద్ద ధర్నా చేయండి : మంత్రి - సభలో తీవ్ర గందరగోళం రాంనగర్ : బీఆర్జీఎఫ్ పనుల ఆమోదం కోసం బుధవారం ఉదయాధిత్య భవన్లో నిర్వహించిన జిల్లా పరిషత్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం రాజకీయ దుమారానికి వేదికైంది. నక్కలగండి ప్రాజెక్టుపై అధికార పక్షం, విపక్ష పార్టీల సభ్యులు సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకోవడంతో సమావేశంలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. సమావేశం ప్రారంభమైన అరగంటకు విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి వచ్చారు. నక్కలగండి ప్రాజెక్డు కోసం అప్పటికే మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు చెందిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు కింద కూర్చోని నిరసన తెలిపారు. ‘కింద ఎందుకు కూర్చున్నారు. సీట్లలో కూర్చోండి’ అని మంత్రి వారిని కోరారు. నక్కలగండి ప్రాజెక్టుపై స్పష్టమైన ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధర్నా చేయాలనుకుంటే గత ప్రభుత్వంలో పని చేసిన మంత్రులు, ఎంపీల ఇళ్ల వద్ద చేయాలన్నారు. ఇది ఎవరు చేయిస్తున్నారో తెలుసని, తమకూ రాజకీయం చేయడం వచ్చని అన్నారు. ‘అవసరమైతే మా వాళ్లూ వచ్చి కింద కూర్చుంటారు. మేమేమీ భయపడం’ అని మంత్రి ఘూటుగా మాట్లాడారు. ‘నక్కలగండి ప్రాజెక్టును సందర్శించి దాని చరిత్ర తీస్తాం, దానికి ఎవరు బాధ్యులో కూడా చెబుతాం’ అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వాఖ్యలకు ఎంపీ గుత్తా కూడా తీవ్రంగానే స్పందించారు. మీరు ఇటీవల దేవరకొండ ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పకపోవడం వల్లే ప్రజల్లో అపోహ నెలకొంది. మంత్రిగా ప్రాజెక్టుపై సవివరమైన సమధానం చెప్పాల్సిన బాధ్యత ఉందనే విషయం మరువరాదన్నారు. మంత్రి జోక్యం చేసుకుంటూ నక్కలగండి ప్రాజెక్టుపై తాను అనని మాటలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 60 ఏళ్లుగా జిల్లా అభివృద్ధికి పని చేయని వాళ్లు తమపై తప్పుడు ప్రచారం చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో ఎంపీ గుత్తా జోక్యం చేసుకుంటూ పదే పదే 60 ఏళ్లు అనడం, వాడు, వీడు అంటూ మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడడం తగదని హెచ్చరించారు. సభలో తీవ్రగందరగోళం చోటుచేసుకోవడంతో సభ్యులు కూర్చోవాలంటూ జెడ్పీ చైర్మన్ పదే పదే కోరారు. వాడు అని ఉంటే ఉపసంహరించుకోవడానికి అభ్యంతరం లేదని మంత్రి పేర్కొన్నారు. నక్కల గండిని రద్దు చేస్తానని తాను చెప్పలేదని తెలిపారు. ఎవరితో నిరసన చేయించాల్సిన అవసరం తమకు లేదని గుత్తా పేర్కొన్నారు. అందరం కలిసి జిల్లా సమగ్రభివృద్ధికి కలిసి కట్టుగా పని చేద్దామని ఇరువురు నాయకులు అనడంతో సమావేశంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. -
‘కాంగ్రెస్’ వాకౌట్
- రుణమాఫీ, పంట పరిహారంపై రగడ కరీంనగర్ : జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశం పంటనష్ట పరిహారం, రుణమాఫీ అంశంపై అట్టుడికింది. ఓ దశలో తీవ్ర వాగ్వాదం జరిగి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ సభ్యులంతా వాకౌట్ చేసే వరకూ వెళ్లింది. సమావేశం ప్రారంభం కాగానే జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా పంటనష్ట పరిహారం రూ.108 కోట్లు విడుదల కాగా, వ్యవసాయశాఖ అధికారులు కేవలం రూ.18 కోట్లు రైతులకు చెల్లించి చేతులు దులుపుకున్నారని, నిధులు పంపిణీ చేయడంలో నిర్లక్ష్యమెందుకని మండిపడ్డారు. రుణమాఫీపై రోజుకో ప్రకటన చేస్తున్నారని, టైటిల్-1బీ అంటూ బ్యాంకులు అభ్యంతరాలు చెబుతున్నాయని, సభకు మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టమైన సమాధానం చెప్పాలని జీవన్‌రెడ్డి పదేపదే కోరారు. ఎమ్మెల్యే పుట్ట మధు జోక్యం చేసుకుని రైతుల పట్ల ప్రభుత్వం కృతనిశ్చయం తో ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంథని ప్రాంతంలో నాయకులు దోచుకో... దాచుకో అన్న చందంగా ఖజానాను కొల్లగొట్టారని ఆరోపించారు. ఆదర్శరైతుల అవినీతికి అడ్డులేకుండా పోయిందని, ఎకరం భూమిపైనే నాలుగైదు పేర్లు రాసి ఆదర్శరైతులే డబ్బులు కాజేశారని, తన నియోజకవర్గంలోని గద్దలపల్లి ఆదర్శరైతు వ్యవహారంపై వివరించారు. జీవన్‌రెడ్డి జోక్యం చేసుకుని ప్రభుత్వం మీదే ఉందని, విచారణ చేయిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అనడంతో బెజ్జంకి జెడ్పీటీసీ తన్నీరు శరత్‌రావు, శంకరపట్నం జెడ్పీటీసీ పి.సంజీవరెడ్డి జోక్యం చేసుకున్నారు. బెజ్జంకి మండలంలో పరిహారం రూ.5 కోట్లు వస్తే రూ.3 కోట్లు కాంగ్రెస్ కార్యకర్తలకే వచ్చాయని విమర్శించారు. బెజ్జంకి వ్యవసాయాధికారిని సస్పెండ్ చేయాలని జేడీఏకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని అన్నారు. కాంగ్రెస్ హయాంలో చేసిన పనులను చక్కదిద్దేందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంటే జీవన్‌రెడ్డి టీఆర్ఎస్ను విమర్శించడం ఏంటని మండిపడ్డారు. దీంతో కాంగ్రెస్‌కు చెందిన కాటారం జెడ్పీటీసీ నారాయణరెడ్డి జోక్యం చేసుకుని సీనియర్ ఎమ్మెల్యే అయిన జీవన్‌రెడ్డిని అలా సంబోధించడం సరికాదని అనడంతో సభలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల పరస్పర విమర్శలు, అరుపులతో సభ దద్దరిల్లింది. గౌరవం లేని సభలో తాను ఉండబోనని జీవన్‌రెడ్డి పోడియం వద్దకు వచ్చి మంత్రి ఈటెల, చైర్పర్సన్ ఉమతో వాగ్వాదానికి దిగారు. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యేలు పుట్ట మధు, గంగుల కమలాకర్ జీవన్‌రెడ్డిని సముదాయించి సీట్లో కూర్చోబెట్టారు. చైర్పర్సన్ సభను నడిపించే ప్రయత్నం చేస్తుండగానే జీవన్‌రెడ్డి మరోసారి జోక్యం చేసుకుని, కాంగ్రెస్ సభ్యులతో కలిసి వాకౌట్ చేసి ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్, డీసీఎంఎస్ చైర్మన్ సురేందర్‌రెడ్డి, జెడ్పీటీసీలతో కలిసి ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు. జెడ్పీ భవనాన్ని టీఆర్ఎస్ కార్యాలయంగా మార్చుకుని అమర్యాదగా ప్రవర్తించారని, క్షమాపణ చెప్పే వరకు జెడ్పీలో అడుగుపెట్టేది లేదంటూ భీష్మించుకు కూర్చున్నారు. 20 నిమిషాల పాటు నిరసన తెలపగా ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పుట్ట మధు, సోమారపు సత్యనారాయణ, సతీశ్‌బాబు తదితరులు జీవన్‌రెడ్డితో మాట్లాడి సభలోకి రావాలని పదేపదే విజ్ఞప్తి చేయడంతో సభ్యులతో కలిసి ఆయన తిరిగివచ్చారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మనసు బాధకలిగితే క్షమించాలని బెజ్జంకి జెడ్పీటీసీ శరత్‌రావు కోరడంతో గొడవ సద్దుమణిగింది. -
అభివృద్ధిపై చర్చ హుళక్కేనా?
నేడు జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం స్టాండింగ్ కమిటీల ఏర్పాటుకే ప్రాధాన్యం అధికారులతో పరిచయ కార్యక్రమంతో సరి ఎన్నికల కోడ్ అడ్డంకి మచిలీపట్నం : జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఆదివారం జరుగనుంది. జెడ్పీకి నూతన పాలకవర్గం ఏర్పడిన తరువాత తొలి సమావేశం ఇదే కావడం గమనార్హం. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గద్దె అనూరాధ అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. పాలకవర్గం ఏర్పడిన 60 రోజుల్లోపు సమావేశం నిర్వహించడంతో పాటు స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలనే నిబంధన ఉంది. దీంతో ఆదివారం జెడ్పీ సర్వసభ్య సమా వేశాన్ని నిర్వహిం చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10గంటలకు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ప్రారంభమవుతుంది. తొలుత సమావేశం నిర్వహించి అనంతరం స్టాండింగ్ కమిటీలకు ఎన్నికలను నిర్వహిస్తారు. మధ్యాహ్నం అధికారులకు జెడ్పీటీసీ సభ్యులు, ఎమ్మెల్యేలతో పరిచయ కార్యక్రమం ఉంటుందని జెడ్పీ సీఈవో డి.సుదర్శనం తెలిపారు. నందిగామ ఉప ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దీంతో ఆదివారం జరిగే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో అభివృద్ధి కార్యక్రమాలపై ఎంత మేర చర్చ జరుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ పేరుతో కాకుండా అధికారులతో పరిచయ కార్యక్రమం, ఏయే శాఖలో ఏయే పనులు చేపట్టాలి, ఎంతెంత నిధులు అందుబాటులో ఉన్నాయనే అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్‌లతో పాటు శాసనసభ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలను ఈ సమావేశానికి ఆహ్వానించినట్లు జిల్లా పరిషత్ అధికారులు తెలిపారు. సమస్యలపై దృష్టి సారిస్తారా ... జిల్లా పరిషత్ సమావేశానికి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులంతా హాజరు కానున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ప్రజా ప్రతినిధులంతా ఒక చోట చేరి జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు దృష్టి సారిస్తారా లేదా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఆగస్టు నెల ముగిసినా శివారు ప్రాంతాలకు ఇంకా సాగునీరు చేరలేదు. ఈ ఏడాది డ్రెయిన్లకు కనీస మరమ్మతులు చేయకపోవడంతో కొద్దిపాటి వర్షానికే డ్రెయిన్లు పొంగి పొర్లుతున్నాయి. రైతుల రుణమాఫీతో పాటు డ్వాక్రా సంఘాల రుణమాఫీ ప్రధాన సమస్యగా మారింది. 2011 జూలై 22వ తేదీ నాటికి గత పాలకవర్గం పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి మూడేళ్ల పాటు ఎన్నికలు జరగకపోవడంతో జిల్లా పరిషత్ ప్రత్యేకాధికారుల పాలనలోనే కొనసాగింది. మూడేళ్ల అనంతరం తొలిసారిగా జెడ్పీ సర్వసభ్య సమావేశం జరగనుంది. జిల్లా పరిషత్ సమావేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను లేవనెత్తేందుకు, పాలకపక్షాన్ని నిలదీసేందుకు ప్రతిపక్ష సభ్యులు సంసిద్ధులుగానే ఉన్నారు. అయితే ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారడంతో ఈ సమావేశం సాదాసీదాగా జరుగుతుందా లేక చర్చకు దారి తీస్తుందా అనే అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. స్టాండింగ్ కమిటీల ఏర్పాటు జిల్లా పరిషత్‌లో ఆర్థిక ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య- వైద్యం, మహిళా సంక్షేమం, సాంఘిక సంక్షేమం, పనుల కమిటీలకు సంబంధించి స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 26వ తేదీన స్టాండింగ్ కమిటీలు దాదాపు ఖరారయినప్పటికీ, సభ్యుల పేర్లను ఆదివారం అధికారికంగా ప్రకటించనున్నారు. -
జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీలు ఖరారు ?
ఒక్కొక్క దానిలో ఏడుగురు సభ్యులు సభ్యులందరికీ ప్రాధాన్యం చిలకలపూడి (మచిలీపట్నం) : జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీల ఏర్పాటు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 31వ తేదీన నిర్వహించనున్న తొలి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఉదయం స్టాండింగ్ కమిటీల ఎన్నికలు నిర్వహిస్తారు. జెడ్పీటీసీ సభ్యులతో జిల్లా అధికారులకు పరిచయ కార్యక్రమాల అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దె అనూరాధ తెలిపారు. మొత్తం ఏడు స్థాయి సంఘాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆమె చెప్పారు. ప్రణాళిక, ఆర్థికం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య, వైద్యసేవలు, మహిళా సంక్షేమం, సాంఘిక సంక్షేమం పనుల కమిటీల్లో సభ్యులను నియమించినట్లు తెలుస్తోంది. ఒక్కొక్క కమిటీకి ఏడుగురు జెడ్పీటీసీలు చొప్పున 49మంది జెడ్పీటీసీలకు ప్రాధాన్యత కల్పించారు. అయితే ప్రణాళిక, ఆర్థికం, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యసేవలు పనుల కమిటీలకు జిల్లా పరిషత్ చైర్మన్ గద్దె అనూరాధ కమిటీ అధ్యక్షురాలిగా వ్యవహరించనున్నారు. వ్యవసాయ కమిటీకి వైస్‌చైర్మన్ శాయన పుష్పావతి అధ్యక్షురాలిగా, మహిళా సంక్షేమం కమిటీకి పామర్రు జెడ్పీటీసీ సభ్యులు పొట్లూరి శశి, సాంఘిక సంక్షేమ కమిటీకి బంటుమిల్లి జెడ్పీటీసీ దాసరి కరుణజ్యోతిని కమిటీ చైర్మన్లుగా నియమించినట్లు సమాచారం. ఈ కమిటీల నియామక ప్రక్రియ సర్వసభ్య సమావేశంలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. -
కౌన్సిల్ రగడ
- సమావేశం కోసం వైఎస్సార్సీపీ పట్టు - ససేమిరా అంటున్న అధికార పార్టీ - కమిషనర్ మౌనముద్ర - టీడీపీలో సర్దుబాట్ల కోసమేనా? సాక్షి, నెల్లూరు : కార్పొరేషన్ నూతన పాలకవర్గం ఏర్పడినా ఇంత వరకూ సర్వసభ్య సమావేశం నిర్వహించకపోవడం వివాదాస్పదంగా మారుతోంది. సమావేశం నిర్వహించాలని వైఎస్సార్సీపీకి చెందిన డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్‌తో పాటు 13 మంది సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వీరికి మేయర్ అజీజ్‌ను వ్యతిరేకిస్తున్న అధికారటీడీపీ సభ్యులు మద్దతు పలుకుతుండటం విశేషం. కార్పొరేషన్ సమావేశం నిర్వహించాలని కమిషనర్ జాన్శ్యాంసన్పై రోజురోజుకూ ఒత్తిడి పెరుగుతోంది. అయినా కమిషనర్ శ్యాంసన్ తనకేమీ పట్టనట్టు మౌనం పాటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఎలాగైనా సమావేశాన్ని వాయిదా వేసుకుంటూ నెట్టుకురావాలని మేయర్ అబ్దుల్అజీజ్ ఆధ్వర్యంలో అధికార పార్టీ నానా తంటాలు పడుతోంది. నిబంధనల మేరకు సెప్టెంబర్ 3 లోపు కార్పొరేషన్ సమావేశమై కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. ఆ తర్వాత మూడునెలల్లో జనరల్ బాడీ సమావేశం జరిగాల్సి ఉంది. ఇదే సమయంలో ప్రతి పదిమందికి ఒకరు చొప్పున స్టాండింగ్ కమిటీ సభ్యులను సైతం ఎన్నుకోవాల్సి ఉంది. ఏ ఒక్క సమావేశం నిర్వహించకపోవడంపై ఎన్నికైన సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్‌కు సాధారణ ఎన్నికలు జరిగినా జనరల్ బాడీ సమావేశం జరగక పోవడంతో అభివృద్ధి పనులు జరిగే అవకాశం కూడా లేదని సభ్యులు వాదిస్తున్నారు. ఏదీ జరపనప్పుడు ఎన్నికలు ఎందుకు నిర్వహించారని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సమావేశాలు నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మేయర్‌గా ఎన్నికైన అబ్దుల్అజీజ్ ఆ తర్వాత అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. మేయర్‌తో పాటు 12 మంది కార్పొరేటర్లు పార్టీ మారినా అధికార పార్టీ నుంచి ఎన్నికైన కార్పొరేటర్లు అజీజ్ ఏకపక్షంగా టీడీపీ తీర్థం పుచ్చుకోవడాన్ని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. ఇది మరింత ముదిరి జిల్లా టీడీపీలో వర్గవిభేదాలకు దారితీసింది. దీని నుంచి బయటపడలేక అజీజ్ సతమతమవుతున్నారు. మరోవైపు డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్‌తో కలిపి వైఎ్ససార్సీపీకి 13 మంది సభ్యులున్నారు. వీరికి అజీజ్‌ను వ్యతిరేకిస్తున్న టీడీపీ సభ్యుల మద్దతు ఉంది. సమావేశం కోసం వారు పట్టుబడుతున్నారు. ఈ సమయంలో సర్వసభ్య సమావేశం జరిగితే పరిస్థితి తమకు వ్యతిరేకంగా ఉంటుందని అధికార పార్టీకి చెందిన ఓ వర్గం ఆలోచనలో పడింది. ఈ నేపథ్యంలో తమవారికి నచ్చ చెప్పుకునేందుకు సమావేశం జరగకుండా వాయిదా వేసుకుం టూ వస్తున్నట్టు సమాచారం. మరోవైపు కార్పొరేషన్ సమావేశం నిర్వహించకపోవడంపై కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకటి రెండు రోజులు చూసి ఆందోళనకు దిగాలని కార్పొరేటర్లు సిద్ధమవుతున్నట్టు సమాచారం. -
ఆద్యంతం..జనపక్షం
సాక్షి ప్రతినిధి, కాకినాడ :జిల్లా పరిషత్ కొత్త పాలకవర్గ తొలి సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ నామన రాంబాబు అధ్యక్షతన ఆదివారం జరిగింది. అనుభవజ్ఞులైన సభ్యులతో సమానంగా కొత్త సభ్యులు, మహిళా జెడ్పీటీసీలు పోటాపోటీగా కురిపించిన ప్రశ్నల వర్షంతో అధికారులు ఉక్కిరిబిక్కిర య్యారు. కొందరైతే సమాధానాలు చెప్పలేక నీళ్లునమలాల్సి వచ్చింది. సమావేశంలో అధికారపక్షమే విపక్షపాత్ర పోషించడం కొసమెరుపు. స్థాయీ సంఘాల ఎన్నికలతో ఉదయం 11 గంటలకు మొదలైన సమావేశం మధ్యాహ్నం గంటపాటు భోజన విరామం మినహా రాత్రి ఏడు గంటల వరకు సాగింది. తొలి సమావేశాన్ని సమన్వయంతో నిర్వహించడంలో నామన కొంత తత్తరపడడం కనిపించింది. తెలంగాణ నుంచి విలీనమైన పోలవరం ముంపు మండలాల జెడ్పీటీసీ సభ్యులు సోయపు అరుణ (చింతూరు), ముత్యాల కుసుమాంబ (వరరామచంద్రపురం), ఎడవల్లి కన్యకాపరమేశ్వరి (కూనవరం) సభలో ప్రమాణం చేశారు. వీరి చేరికతో జెడ్పీటీసీ సభ్యుల సంఖ్య 61కి, మహిళల ప్రాతినిధ్యం 32కి పెరిగాయి. స్థాయీ సంఘాలకు నియమితులైన సభ్యులను సీఈఓ ఎం.సూర్యభగవాన్ ప్రకటించాక అజెండాను చేపట్టారు. నగరం పేలుడుపై విస్తృతచర్చ దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనానికి కారణమైన నగరం గ్యాస్ పైపులైన్ పేలుడులో బాధితులను విస్మరించిన విషయాన్ని ఐ.పోలవరం జెడ్పీటీసీ సభ్యుడు పేరాబత్తుల రాజశేఖర్ సభ దృష్టికి తీసుకువెళ్లాక రెండు నిమిషాలు మౌనం పాటించారు. గెయిల్, ఓఎన్జీసీ, జీఎస్పీసీ వంటి చమురు సంస్థల పైపులైన్లతో కోనసీమ ప్రజలకు భద్రత లేని విషయంపై అధికార, ప్రతిపక్షాలు విస్తృత చర్చ చేపట్టారు. భద్రతపై భరోసా ఇవ్వడం, చమురు సంస్థలతో ఇక ముందు నిర్వహించే భేటీలో పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులందరికీ భాగస్వామ్యం కల్పించడం, దీనిపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ తీర్మానించాలని కోనసీమ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు పట్టుబట్టారు. మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు చొరవతో ఆర్థిక సాయం అందిందని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎంపీ తోట నరసింహం చెపుతున్నప్పుడు, ప్రతిపక్ష నేతగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పార్టీ తరఫున కుటుంబానికి లక్ష ఇచ్చిన విషయాన్ని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సభ దృష్టికి తీసుకువచ్చారు. పూడ్చలేని నష్టం జరిగిందంటూ ప్రతిపక్షంతో పాటు అధికార పక్షం కూడా గొంతు కలిపింది. విపక్షనేతగా ఆకట్టుకున్న నవీన్ జెడ్పీ ప్రతిపక్షనేత జ్యోతుల నవీన్ పదునైన పదాలతో తొలి ప్రసంగంతోనే సభ దృష్టిని ఆకర్షించగలిగారు. సమయస్ఫూర్తితో స్పందించారు. సమావేశమందిరంలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాన్ని తొలగించేందుకు తీర్మానం చేయాలని ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి పట్టుబట్టినప్పుడు ‘వైఎస్ ప్రజానాయకుడు. ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేశారు. అలాంటి నేత ఫొటో తీసేయమంటారా, కావాలంటే తీర్మానం చేసుకోండి’ అంటూ నవీన్ తీవ్రంగా స్పందించడంతో.. చైర్పర్సన్ ఇది సమయం కాదంటూ చర్చకు అవకాశం ఇవ్వలేదు. నీలం పరిహారం, ఎస్సీ రుణాలకు బ్యాంకుల నిరాకరణ తదితర అంశాలపై అధికారపార్టీ సభ్యులు విపక్ష పాత్ర పోషించడంతో చైర్పర్సన్ నామన సమాధానం చెప్పలేక ఇబ్బంది పడాల్సి వచ్చింది. ‘చూస్తాం, చేస్తా’మంటున్న ఆయనను ‘అలా అనవద్దు, కనీసం వచ్చే సర్వసభ్య సమావేశానికైనా పరిష్కారాలు చూపిస్తారని అధికారుల నుంచి భరోసా కల్పించాలి’ అని అధికారపక్షానికే చెందిన ఎమ్మెల్యే పులపర్తి, జెడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్ సూటిగా అడగడంతో అధికారులతో సమాధానం చెప్పించడానికి తడబడాల్సి వచ్చింది. నెహ్రూకు అధికారపక్ష సభ్యుల మద్దతు వ్యక్తిగత మరుగుదొడ్ల లక్ష్యాల సాధనలో వైఫల్యాన్ని దాదాపు నేతలంతా ఎండగట్టారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు వినిపించిన పిట్టకథ సభలో నవ్వులు కురిపించింది. అవసరమైన అందరికీ మరుగుదొడ్లు నిర్మించేందుకు ప్రజాప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ నీతూకుమారి అభ్యర్థించారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యమవుతుందనే సాకుతో గోదావరిపై రెండు లిఫ్టుల ఏర్పాటు ప్రతిపాదనకు వ్యతిరేకంగా తీర్మానం కోసం పట్టుబట్టిన వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష ఉపనేత, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు అధికారపక్ష సభ్యులు మద్దతు ఇచ్చారు. ఇందుకు మరోసారి సమావేశమవుదామంటూ చైర్పర్సన్ దాటవేయడంపై సభ్యులు గుసగుసలాడుకోవడం వినిపించింది. తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకం అజెండాలో లేకపోవడంతో ఎంపీ తోట నరసింహం ఇరిగేషన్ అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పింఛన్లకు ఆధార్ అనుసంధానంతో అనర్హులకు చోటు లేకుండా పోయిందంటూ చెప్పిందే చెపుతున్న డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్‌రాజుపై జ్యోతుల నెహ్రూ అసహనం వ్యక్తం చేశారు. ‘రాజకీయ ఉపన్యాసాలు వద్దు. సమగ్ర సమాచారం ఉంటే చెప్పండి’ హితవు చెప్పారు. ఉపాధి హామీ పథకం ప్రగతిని ఇన్చార్జి పీడీ భవాని చెపుతుండగా అధికారపక్షం నుంచే ప్రతిఘటన ఎదురుకావడంతో వేదికపై ఉన్న ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కలెక్టర్ సర్దిచెప్పేందుకు తంటాలు పడాల్సి వచ్చింది. అధికారులను నిలదీసిన మహిళా సభ్యులు కొత్తగా ఎన్నికైనా ఏ మాత్రం తటపటాయింపు లేకుండా ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, జెడ్పీటీసీ సభ్యులు చిన్నం అపర్ణాదేవి, అధికారి వెంకటలక్ష్మి, సోయపు అరుణ, కోసూరి బుజ్జి చిన్నాలమ్మ తదితరులు వివిధ సమస్యలపై అధికారులను నిలదీశారు. కాగా, జెడ్పీటీసీ సభ్యులు ప్రజా సమస్యలతో పాటు తమ సొంత కోర్కెల చిట్టా కూడా విప్పారు. వారి డిమాండ్లకు ప్రతిపక్ష నేత నవీన్ మద్దతు పలికారు. మండల పరిషత్‌లలో ప్రత్యేక గది, టోల్గేట్లలో ఉచిత ప్రవేశం, జెడ్పీ సమావేశంలో మాట్లాడేందుకు అవకాశం కావాలన్న సభ్యులు అందుకోసం పట్టుబట్టి మరీ అవుననిపించుకున్నారు. అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు, ముమ్మిడివరం, కాకినాడ రూరల్ ఎమ్మెల్యేలు దాట్ల బుచ్చిబాబు, పిల్లి అనంతలక్ష్మి సభలో ఒక్క మాట మాట్లాడకుండా మధ్యలోనే వెళ్లిపోయారు. -
కరెంటెప్పుడత్తదో..
మంత్రికీ కరెంటు తిప్పలు మంత్రి కేటీఆర్ గురువారం గంభీరావుపేట మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొనగా రెండున్నర గంటల సమయంలో ఆరుసార్లు కరెంట్ వచ్చిపోయింది. ప్రజాప్రతినిధులు ఇచ్చిన అర్జీలను మంత్రి సెల్‌ఫోన్ టార్చిలైట్ల వెలుతురులో ఇలా పరిశీలించారు. ►ఇక రోజూ ఎదురుసూసుడే ►మిలియన్ యూనిట్ల కొరత ►జిల్లాలో పెరిగిన కరెంటు కోత ►పల్లెల్లో పొద్దంతా సరఫరా బంద్ ►ఎండుతున్న పంటలతో రైతుల ఆందోళన సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కరెంటు కోత వణుకు పుట్టిస్తోంది. పల్లెల్లో పట్టపగలు చీకట్లు కమ్ముకుంటున్నాయి. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపేస్తున్నారు. దీంతో పగటిపూట విద్యుత్‌పై ఆధారపడి జీవనం సాగించే చిన్న వ్యాపారాలు, దుకాణాలన్నీ మూతపడ్డాయి. వర్షాభావ పరిస్థితులు.. ఎండాకాలంలా మండుతున్న వాతావరణానికి తోడుగా మితిమీరిన కరెంటు కోతలు అన్నదాతలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కోతలు తప్పవని సర్కారు పదేపదే చెబుతున్నప్పటికీ ఖరీఫ్ పంటలు ఎండిపోయే పరిస్థితి ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దిక్కుతోచక విద్యుత్ సిబ్బందిపై తమ ఆగ్రహాందోళనలు వ్యక్తపరుస్తున్నారు. కరెంటు కోతలకు నిరసనగా గురువారం కమలాపూర్ మండలం ఉప్పల్‌లో రైతులు సబ్‌స్టేషన్‌ను ముట్టడించి ట్రాన్స్‌కో సిబ్బందిని నిర్భంధించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. కరెంటు కోతలు ఎత్తివేయాలని, తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. వేములవాడ మండలంలోని వెంకట్రాంపల్లి గ్రామ రైతులు చెక్కపల్లి సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. మెట్పల్లి మండలంలోని వెంకట్రావుపేటలో రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. రోజురోజుకు ఆందోళనలు పెరిగిపోతున్నాయి. అవసరానికి తగినంత విద్యుత్ ఉత్పత్తి లేకపోవడంతో కోతలు తప్పడం లేదని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో రోజుకు మొత్తం 12 మిలియన్ యూనిట్లు విద్యుత్ అవసరం కాగా ప్రస్తుతం 11 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉంది. ఉత్పత్తిలో కొరత కారణంగా ప్రస్తుత వ్యవసాయ సీజన్ పూర్తయ్యే వరకు విద్యుత్ కోతలు తప్పవని ఆ శాఖ ఎస్ఈ నారాయణ అభిప్రాయపడ్డారు. గృహావసరాల కంటే వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని తమకు ఆదేశాలున్నాయని.. అందుకే విద్యుత్ సరఫరా వేళలు ఎప్పటికప్పుడు మార్పులు చేయాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు. గురువారం నుంచి అన్ని కేటగిరీలకు కరెంటు కోత సమయాన్ని పెంచారు. జిల్లా కేంద్రంలో రోజుకు ఏడు గంటల పాటు కోత విధిస్తున్నారు. ఉదయం 5 నుంచి 8 వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. మున్సిపాలిటీలు, మండలకేంద్రా లు, సబ్స్టేషన్లు ఉన్న ప్రాంతాల్లో 9 గంటల కోతను అమలుచేస్తున్నారు. ఉదయం 7 నుంచి 11 వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా నిలిపేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పొద్దంతా కరెంటు ఉండడం లేదు. దీంతో పల్లె ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు భరించలేని ఉక్కపోత మరోవైపు విద్యుత్ కోతతో జనం నరకయాతన అనుభవిస్తున్నారు. అధికారికంగా వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెబుతున్న సర్కారు... లోటు విద్యుత్‌ను సర్దుబాటు చేసేందుకు అనధికారికంగా కోతలు విధిస్తోంది. అన్ని జిల్లాల్లో వ్యవసాయానికి నాలుగు అయిదు గంటలకు మించి సరఫరా చేయటం లేదు. లోడ్ రిలీఫ్ పేరుతో విద్యుత్‌శాఖ రైతులతో చెలగాటమాడుతోంది. ఇచ్చే కాసింత వ్యవధిలోనూ తరచూ ట్రిఫ్ అవడం, లోవోల్టేజీనే. చీటికి మాటికి కరెంటు వచ్చి పోతుండటంతోపాటు లోవోల్టేజీతో ట్రాన్స్ఫార్మర్లు, పంపుసెట్లు, మోటార్లు కాలిపోతున్నాయి. దీంతో రైతులకు అదనపు భారం తప్పటం లేదు. జిల్లాలో గత నెలలో సగటున రోజుకు 30 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. మరోవైపు నిర్ణీత వేళాపాళాలు లేకపోవటం రైతుల ప్రాణాలను బలి తీసుకుంటోంది. కరెంట్ ఎప్పుడు వస్తుందో... ఎప్పుడు పోతుందో తెలియడం లేదని, అర్ధరాత్రి వేళల్లో సరఫరా చేయడంతో రాత్రంతా పొలం వద్దే పడిగాపులు కాయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళ చీకట్లో వ్యవసాయ బావుల వద్దకు వెళుతున్న రైతులు విషపురుగుల బారిన పడి ప్రమాదాలకు గురవుతున్నారు. తెగిపడిన విద్యుత్ లైన్లు, ప్యూజులు తగిలి షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. గడిచిన రెండు నెలల్లో జిల్లాలో 16 మంది రైతులు విద్యుత్ షాక్‌తో చనిపోయారు. -
వేళపై గోల..
జిల్లా పరిషత్ : ‘మన జిల్లా.. మన ప్రణాళిక’ రూపకల్పనపై ఆదివారం నిర్వహించిన జెడ్పీ సర్వసభ్య సమావేశం వాడీవేడీగా ప్రారంభమైంది. సమయపాలన, ప్రొటోకాల్ అంశంపై కొందరు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 11.45 గంటలకు సమావేశం ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, కలెక్టర్ కిషన్, జేసీ పాసుమి బసు, జెడ్పీ ఇన్చార్జ్ సీఈఓ వాసం వెంకటేశ్వర్లు, మునిసిపల్ కమిషనర్ సువర్ణ పండాదాస్ వేదికపై కూర్చున్నారు. సమావేశం ఆరంభం కాగానే గౌరవ సభ్యుడు, ఎంపీ రాపోలు ఆనందభాస్కర్, డోర్నకల్, నర్సంపేట ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, దొంతి మాధవరెడ్డి లేచి.. అభ్యంతరం వ్యక్తం చేశారు. వాస్తవానికి సభ పదకొండింటికే ప్రారంభం కావాలి. అయితే, డిప్యూటీ సీఎం ఇతర కార్యక్రమాలు చూసుకుని జెడ్పీకి వచ్చేసరికి 45నిమిషాలు ఆలస్యమైంది. దీంతో సయమపాలన పాటించకపోవడంపై గౌరవ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. ఆలస్యానికి గల కారణాలపై సీఈఓను ప్రశ్నించారు. అనంతరం ప్రొటోకాల్ అంశాన్ని లేవనెత్తారు. వేదికపైకి వరంగల్ నగర కమిషనర్‌ను ఎలా ఆహ్వానిస్తారంటూ గౌరవసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కలెక్టర్ వివరణ ఇస్తున్న క్రమంలో ఎంపీ కడియ శ్రీహరి కల్పించుకుని మాట్లాడారు. జెడ్పీ సమావేశాలకు చైర్మన్ అధ్యక్షత వహిస్తారని, ప్రభుత్వ ప్రతినిధులుగా మంత్రులు, కలెక్టర్, సీఈఓ మాత్రమే వేదికపై కూర్చునే వీలుంటుందని, మరోసారి ఇలాంటి సమస్య ఉత్పనం కావద్దని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఇదిలా ఉండగా, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు యాకూబ్‌రెడ్డి సభకు హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. భోజన విరామ సమయం తర్వాత సజావుగా సాగిన సమావేశంలో పలువురు సభ్యులు మన జిల్లా.. మన ప్రణాళికకు పలు సూచనలు చేశారు. రెండు రోజుల పాటు ప్రతిపాదనలు స్వీకరించిన అనంతరం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు జెడ్పీ చైర్పర్సన్ పద్మ ప్రకటించారు. సమావేశంలో రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, మానుకోట ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్సీలు నాగపురి రాజలింగం, బోడకుంట్ల వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు చందూలాల్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డి, శంకర్‌నాయక్, జెడ్పీ కాంగ్రెస్, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్లు ఎం.వెంకన్న, ఎస్.శోభన్ పాల్గొన్నారు. సమావేశం ప్రారంభానికి ముందు తెలంగాణ అమరవీరులకు అంజలి ఘటించారు.