hawala money
-
భారీగా పట్టుబడ్డ టీడీపీ, జనసేన డబ్బు..!
-
సినిమా లెవల్ లో చంద్రబాబు హవాలా మనీ..
-
వాషింగ్ మెషీన్లలో నోట్ల కట్టలు.. భారీగా హవాలా నగదు పట్టివేత
సాక్షి, విశాఖపట్నం: వాషింగ్ మెషీన్లలో తరలిస్తున్న రూ.1.30 కోట్లు హవాలా డబ్బు గుట్టు రట్టయ్యింది. విశాఖ నుంచి విజయవాడకు ఆటోలో తరలిస్తుండగా ఎన్ఏడీ జంక్షన్ దగ్గర పోలీసులు పట్టుకున్నారు. హవాలా నగదుగా అనుమానిస్తున్న విశాఖ పోలీసులు.. నగదుకు సరైన ఆధారాలు లేకపోవడంతో కేసు నమోదు చేశారు. డబ్బు ఎవరిదానే దానిపై పోసులు ఆరా తీస్తున్నారు. ఓ ప్రముఖ కంపెనీ నుంచి తరలిస్తున్నట్లు గుర్తించారు. చదవండి: బతుకమ్మలను చూసేందుకు వెళ్తూ.. -
బంజారాహిల్స్ లో 3.35 కోట్ల హవాలా నగదు పట్టివేత
-
చంద్రబాబుకు హవాలా డబ్బు..మధ్యలో ఇరుక్కున్న లోకేష్..
-
‘మమ్మల్ని గోకితే రిజల్ట్ ఇలానే ఉంటుంది’
సాక్షి, కృష్ణా: సాయి ధరమ్ తేజ్-పవన్ కల్యాణ్ నటించిన బ్రో సినిమా వివాదంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి స్పందించారు. విజయవాడలో బుధవారం ఆయన సాక్షిటీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా బ్రో చిత్ర నిర్మాత విశ్వప్రసాద్‌కు, హీరో సాయి ధరమ్ తేజ్‌కు.. పనిలోపనిగా పవన్‌కు ఆయన చురకలు అంటించారు. ‘‘నేను చేసినవి ఆరోపణలే అయితే.. వాస్తవాలు దాచాల్సిన అవసరం ఏముంది?. పవన్ రెమ్యునరేషన్ ఎంత? సినిమాకు పెట్టుబడి ఎంత? కలెక్షన్స్ ఎంత?. వాస్తవాలు చెప్పడానికి భయపడుతున్నాడా? లేదంటే దాస్తున్నాడా?. నిజాలు దాస్తున్నారంటే ఏదో ఉందనేగా అర్థం అని అంబటి అనుమానం వ్యక్తం చేశారు. దానకర్ణుడు, సమాజశ్రేయస్సు కోరే వ్యక్తి అని చెప్పే పవన్ ఎందుకు వాస్తవాలు దాస్తున్నాడు. తన నీతి, నిజాయితీ నిరూపించుకోవాలంటే సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్.. కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ ఎంతో చెప్పాల్సిన అవసరం పవన్‌కు కచ్చితంగా ఉంది అని అంబటి డిమాండ్ చేశారు. బ్రో సినిమానే ఒక స్కాం నూటికి నూరు శాతం బ్రో విషయంలో చాలా పెద్ద వ్యవహారం ఉంది. చంద్రబాబు ప్యాకేజ్ విశ్వప్రసాద్ ద్వారా అందింది. ఒక స్కామ్ మాదిరిగా ఈ ప్యాకేజ్ వ్యవహారం జరుగుతోంది. ఇదంతా వాళ్లు ఆడే గేమ్ ప్లాన్. అంకెలు చెబితే దొరికిపోతామని భయపడుతున్నారు. అందుకే చెప్పడం లేదు అని అంబటి ఆరోపించారు. మమ్మల్ని గోకితే ఇలాగే ఉంటుంది సినిమాను సినిమాలాగే చూడాలంటున్నాడు ఈ చిత్ర హీరో సాయి ధరమ్ తేజ్. సినిమాలను సినిమాగానే తీయండి. మధ్యలో మమ్మల్ని గోకడమెందుకు?. మమ్మల్ని గోకితే .. ఇలానే ఉంటుంది. నా మీద పుంఖాను పుంఖాలుగా వెబ్ సిరీస్ తీసుకోండి.. నాకేం అభ్యంతరం లేదు. అందులో సాయిధరమ్ తేజ్ , పవన్ కళ్యాణ్ ను పెట్టి.. విశ్వప్రసాద్ తో తీయించండి. పవన్ కల్యాణ్ అన్ని సినిమాల గురించి నేను పట్టించుకోలేదు. మీ సినిమాలు మీరు తీసుకుంటే ఏమీ ఉండదు. మమ్మల్ని గోకితే ఇలానే ఉంటుంది. ఇదే ఈ కథలో నీతి అని తెలిపారాయన. ఇక అంబటి ఢిల్లీ పర్యటన గురించి, దానికి బ్రో చిత్ర వివాదానికి ఏమైనా సంబంధం ఉందా? అనే ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘‘ నేను ఢిల్లీ ఎందుకు వెళ్తున్నానో చెప్పను. ముఖ్యమైన అంశం మీద వెళ్తున్నా. అక్కడ మా పార్టీ ఎంపీలను కలుస్తా’’ అని సమాధానం ఇచ్చారు. -
రెజిమెంటల్ బజార్ అగ్నిప్రమాదంలో కొత్త ట్విస్ట్.. రూ.1.65 కోట్ల నగదు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఓ వ్యక్తి ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంతో రూ.1.65 కోట్ల నగదు బయటపడిన ఘటన గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి జరిగింది. ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. రెజిమెంటల్ బజార్లో నివసించే భైరి శ్రీనివాస్ అభిజిత్ ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లు ఉత్పత్తి చేసే కంపెనీలో డీజీఎంగా పని చేస్తున్నారు. శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఆయన ఇంట్లోని గ్రౌండ్ ఫ్లోర్లో అగ్ని ప్రమాదం జరిగింది. అదే సమయంలో శ్రీనివాస్‌తో పాటు కుటుంబ సభ్యులు విశాఖపట్టణంలో ఉన్నారు. స్థానికులు వెంటనే గోపాలపురం పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలను ఆరి్పవేశారు. గ్రౌండ్ ప్లోర్లోని గదిలో ఉండే పనికిరాని వస్తువులు, కొంత చెక్క సామగ్రి మంటల్లో కాలిపోయాయి. మంటలు పూర్తిగా ఆరిపోయిన తర్వాత రాత్రి 12 గంటల సమయంలో గోపాలపురం పోలీసులకు ఇదే ఇంట్లో కోట్ల రూపాయల నగదు ఉందనే సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్ ఉన్నతాధికారులకు సమాచారం అందించి ఇంటిని స్థానికులు, పోలీసులతో పాటు బంధువుల సమక్షంలో తెరిచారు. మొదటి అంతస్తులోని బెడ్రూంలో గాలించారు. మంచం కింద, అల్మారా తదితర ప్రాంతాల్లో గాలించగా రూ.1.65 కోట్ల నగదు లభించింది. ఇందులో 50 మాత్రమే రూ.2 వేల కరెన్సీ నోట్లు ఉండగా.. మిగతావి రూ.500, రూ.200 నోట్లు ఉన్నాయి. పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు, వెండి సామగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాత్రి 2 గంటల సమయంలో నగదును, ఆభరణాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. హవాలా నగదేనా? పోలీసులు స్వా«దీనం చేసుకున్న నగదు హవాలా మార్గంలో తరలించేందుకు ఉన్నదేననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఓ కంపెనీలో డీజీఎంగా పనిచేసే వ్యక్తి ఇలా ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో నగదు ఇలా ఉంచుకుంటారా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. సాధారణంగా డబ్బు ఇంట్లో ఉండే చాలా భద్రంగా దాచుకుంటారు కానీ.. కేవలం బ్యాగుల్లో, అల్మారాలో నిర్లక్ష్యంగా దాచి ఉంచడంతో ఇవి ఎక్కడికైనా తరలించేందుకు దాచిపెట్టి ఉంటారని, తరచుగా ఇలా డబ్బు తరలించే వాళ్లే ఇలా ఉంచుతారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు భైరి శ్రీనివాస్‌కు ఫోన్ చేస్తే దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు తన వద్ద ఉన్నాయని వచి్చన తర్వాత అన్నీ చూపిస్తానని ముక్తసరిగా జవాబిచ్చారు. నగదును ఆదాయ పన్ను శాఖ అధికారులకు స్వా«దీనం చేస్తామని, అన్ని రకాల పత్రాలు పరిశీలించిన తర్వాత సక్రమంగా సంపాదించినది అని తేలితే వారికి అప్పగిస్తారని ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్ తెలిపారు. ఆది నుంచీ అనుమానాలే.. భైరి శ్రీనివాస్ 10 ఏళ్లుగా ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. గత 6 ఏళ్ల క్రితం తాను ఉండే ఇంటితో పాటు పక్కనే ఉండే మరో ఇల్లు కొనుగోలు చేశారు. ఈ రెండు ఇళ్లు సుమారు రూ.3 కోట్ల విలువ చేస్తాయి. శ్రీనివాస్ స్వస్థలం అయిన వైజాగ్‌లో కూడా గత కొద్ది రోజుల క్రితమే విలువైన ఇల్లు నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. అనతికాలంలోనే కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఎలా సంపాదించారని స్థానికులు సందేహాలు వెలిబుచ్చుతున్నారు. హవాలా వ్యాపారం చేస్తున్నారా? అనే అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. చదవండి: సెల్ నెంబరే కీలకం! -
నేను ఛాట్ చేసింది కవితక్కతోనే: సుఖేష్ మరో లేఖ
ఢిల్లీ: తీహార్ జైలు నుంచి ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ మరో లేఖ విడుదల చేశాడు. తాను ఛాట్ చేసింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతోనే నంటూ స్పష్టం చేస్తూ తాజా లేఖలో పేర్కొన్నాడు. సుఖేష్ ఎవరో తనకు తెలియదంటూ కల్వకుంట్ల కవిత ట్విటర్ ద్వారా స్పందించిన నేపథ్యంలో.. ఆమెకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ సుఖేష్ ఐదు పేజీల లేఖలో కవితపై విమర్శలు చేశాడు. నేను చాట్ చేసింది ఎమ్మెల్సీ కవితక్కతోనే. ఆమె నెంబర్లు ఇవే అంటూ లేఖ ద్వారా స్క్రీన్‌షాట్‌ను విడుదల చేశాడు సుఖేష్. ఆ నెంబర్లు 6209999999, 8985699999గా ఉన్నాయి. అలాగే ఇంకో ఛాట్‌లో సత్యేంద్ర జైన్ వ్యక్తిగత ఫోన్ నెంబర్ 919810154102గా లెటర్లో పేర్కొన్నాడు సుఖేష్. అంతేకాదు.. కవిత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ‘తీహార్ క్లబ్’కు వస్తున్నారంటూ వెల్కమ్ చెబుతూ రాశాడు. ‘‘కేజ్రీవాల్ తర్వాత నీ వంతే అంటూ కవితను ఉద్దేశించాడు సుఖేష్. కవితను తాను కవితక్క అని పిలుస్తానని, ఆమెను తన పెద్దక్కగా భావించానని సుఖేష్ తెలిపాడు. ట్విటర్ ద్వారా సమాధానలు ఇవ్వొద్దని, అవన్నీ పాత ట్రిక్కులనీ, పని చేయవంటూ లేఖలో కవితను ఉద్దేశించి పేర్కొన్నాడు సుఖేష్. నన్ను దొంగ, ఆర్థిక నేరగాడని విమర్శించారు. మీరు కూడా అందులో భాగస్వాములే. దేశ ప్రయోజనాల రీత్యా సత్యం మాట్లాడాలి. ధైర్యం ఉంటే సరైన రీతిలో, సక్రమంగా విచారణ జరిగేలా సహకరించాలంటూ కవితకు లేఖ ద్వారా సవాల్ విసిరాడు సుఖేష్ చంద్రశేఖర్. అతి త్వరలో కేజ్రీవాల్‌తో చేసిన ఛాటింగ్‌ను సైతం రిలీజ్ చేస్తా అంటూ లేఖ ద్వారా పేర్కొన్నాడు. కోర్టు ధ్రువీకరణతో ఎవిడెన్స్ చట్టం 65 బి కింద తాను స్క్రీన్ షాట్లను విడుదల చేశానని వెల్లడించిన సుఖేష్.. కవితక్క కు రూ. 15 కోట్ల డెలివరీ తర్వాత ఫేస్ టైం లో కేజ్రీవాల్, సత్యెంద్ర జైన్ తోనూ మాట్లాడిన స్క్రీన్ షాట్లను విడుదల చేస్తానంటూ తెలిపాడు. తనను రాజకీయంగా ప్రభావితం చేస్తున్నారన్న విమర్శలు అర్థరహితమన్న సుఖేష్.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా నంటూ లేఖలో పేర్కొనడం గమనార్హం. -
ఎన్నికల వేళ కర్ణాటకలో హవాలా డబ్బు కలకలం
-
అక్కా.. ఇచ్చేశా..
సాక్షి, న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మరో సంచలన లేఖ విడుదల చేశారు. హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయంలో ఏపీ అనే వ్యక్తికి రూ.15 కోట్లు అందజేశానంటూ గతంలో లేఖ రాయగా.. తాజాగా నేరుగా పేర్లను ప్రస్తావిస్తూ మరో లేఖను, వాట్సాప్ చాటింగ్‌ల స్క్రీన్ షాట్లను విడుదల చేశారు. ఆ సొమ్ము అందజేసే క్రమంలో ఎమ్మెల్సీ కవితతో పలుసార్లు కోడ్ పేర్లతో వాట్సాప్ చాటింగ్ చేశానని లేఖలో పేర్కొన్నారు. అంతేగాకుండా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆప్ నేతలకు, ఎమ్మెల్సీ కవితకు మధ్య ఆర్థిక సంబంధాలకు సంబంధించి తాను బయటపెట్టే అంశాల ఆధారంగా.. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయని వెల్లడించారు. తన దగ్గరున్న 703 వాట్సాప్ స్క్రీన్ షాట్లలో.. రెండింటిని విడుదల చేస్తున్నానని.. వీటిపై దర్యాప్తు చేయాలని సుప్రీం సీజే, కేంద్ర హోంమంత్రి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, సీబీఐ, ఈడీ డైరెక్టర్లను కోరారు. సుకేశ్ లేఖలో పేర్కొన్న అంశాలివీ.. ‘‘ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన, అధికారంలో ఉన్న వ్యక్తులతోపాటు అవినీతిపై పలు ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్న వ్యక్తులకు మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్‌ల స్క్రీన్షాట్లను మీ దృష్టికి తీసుకొచ్చాను. నేను విజిల్ బ్లోయర్‌గా ఉండి ఇప్పటికే స్టేట్మెంట్లు ఇచ్చాను. నా దగ్గరున్న 703 వాట్సాప్ స్క్రీన్షాట్ల నుంచి రెండింటిని అందిస్తున్నా. దీనిపై లోతుగా దర్యాప్తు చేయాలని కోరుతున్నా. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, మాజీ మంత్రులు సత్యేంద్ర జైన్, మనీశ్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, కైలాశ్ గెహ్లోత్‌లతో 2015 నుంచీ పలు లావాదేవీల్లో భాగస్వామిని అయ్యాను. దర్యాప్తు చేయదగిన పత్రాల్లో నేను చెప్తున్న అంశాలు కూడా కీలకమైనవే. అరవింద్ కేజ్రీవాల్, ఆయన సహచరులు.. సౌత్ గ్రూపు, ఇండోస్పిరిట్స్ సంస్థ యజమానులు అరుణ్ పిళ్లై, ఎమ్మెల్సీ కవితలతో చురుకుగా సంప్రదింపులు చేసినట్టు స్పష్టమవుతోంది. 2020లో కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ల సూచన మేరకు హైదరాబాద్‌లోని నా సిబ్బంది ద్వారా బీఆర్ఎస్కు చెందిన కవితకు డెలివరీ చేసిన లావాదేవీ చాటింగ్‌లు ఇవి. సత్యేంద్ర జైన్‌తో నా చాట్ వివరాలు జత చేశాను. కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ల సూచన మేరకు ఎమ్మెల్సీ కవితకు హైదరాబాద్‌లో రూ.15 కోట్లు ఇచ్చిన దానికి చెందిన చాటింగ్‌లు ఇవి. ఢిల్లీ మద్యం లైసెన్సుల నిమిత్తం కేజ్రీవాల్‌తో కవిత ఆర్థిక లావాదేవీలు జరిగాయి. కిక్‌బ్యాక్ అయిన మొత్తం హైదరాబాద్ నుంచి హవాలా రూపంలో పలు ఆసియా దేశాలకు (ఆప్‌కు అనుకూలంగా ఉన్న) పంపారు. ఢిల్లీ నుంచి ఎలాంటి లావాదేవీలు నిర్వహించరాదని కేజ్రీవాల్ ప్రత్యేకంగా పేర్కొన్నారు. దీంతో అన్ని క్యాష్ లావాదేవీలు కరోనా కాలంలో హైదరాబాద్ నుంచి చేపట్టారు’’ అని సుకేశ్ తన లేఖలో పేర్కొన్నారు. నాపై ఒత్తిడి ఉంది.. వెంటనే దర్యాప్తు చేయాలి.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ల నుంచి తనపై, తన కుటుంబంపై తీవ్ర ఒత్తిడి ఉందని.. అందువల్ల తాను వెల్లడించిన అంశాలపై వెంటనే దర్యాప్తు చేయాలని సుకేశ్ లేఖలో కోరారు. దర్యాప్తునకు తాను పూర్తిగా సహకరిస్తానన్నారు. తనకు, ఆమ్ఆద్మీ పార్టీ, అర్వింద్ కేజ్రీవాల్‌కు మధ్య అనేక రకాల ఒప్పందాలు, వ్యాపార లావాదేవీలు ఉన్నాయన్నారు. ఢిల్లీ మద్యం విధానంపై దర్యాప్తు కొనసాగుతున్నందున.. అందులో ప్రమేయమున్న ఆప్, కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత మధ్య సంబంధాలను ఈ చాటింగ్ వివరిస్తుందని.. దర్యాప్తునకు తోడ్పడుతుందని వివరించారు. ఆప్ సీనియర్ నేతలతో జరిపిన అన్ని లావాదేవీల వాయిస్ రికార్డులు, ఇతర చాటింగ్‌లను అందించడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా సొంతంగానే చాటింగ్‌ల వివరాలు అందిస్తునన్నాని.. దీనిపై జోక్యం చేసుకోవాలని సీజేఐ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్ర హోంమంత్రి, సీబీఐ, ఈడీ డైరెక్టర్లకు విజ్ఞప్తి చేశారు. కవితతో సుకేశ్ చాటింగ్‌గా పేర్కొన్న సంభాషణ ఇదీ సుకేశ్: అక్కా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నా.. కొన్ని వివరాలు కావాలి. – హాయ్.. ఇపుడే మెసేజ్ చూశాను సుకేశ్: ఇబ్బందేమీ లేదు అక్కా.. ఏకే ప్యాకేజీని మీకు ఇవ్వాల్సి ఉంది. నా దగ్గర సిద్ధంగా ఉంది. – ఎస్.. ఓకే సుకేశ్: దీన్ని జేహెచ్ ఇంటికి పంపించనా? – వద్దు వద్దు. అరుణ్‌కు నేను ఫోన్ చేసి నీతో మాట్లాడుమని చెప్తా. దీన్ని ఆఫీస్‌కు పంపాల్సి ఉంటుంది. సుకేశ్: ఓకే అక్కా.. మీరు చెప్పినట్లే చేస్తా.. – అతను కొద్దిసేపట్లో ఫోన్ చేస్తాడు. సుకేశ్: సరే అక్కా.. ఎస్జే బ్రదర్ ఈ రోజే మీకు అందజేయాలని చెప్పారు. – ఎస్ సుకేశ్: నేను కో–ఆర్డినేట్ చేసుకుంటా అక్కా. – మీ వైపు నుంచి అంతా ఓకే కదా.. మీ డాడీకి ఆరోగ్యం ఎలా ఉంది? సుకేశ్: డాడీ గురించి అడిగినందుకు కృతజ్ఞతలు అక్కా.. ప్రస్తుతం కెమో థెరపీ చేస్తున్నారు. – ఆయన త్వరగా కోలుకుని రావాలని కోరుకుంటున్నా.. సుకేశ్: ఎస్ అక్కా.. దేవుడు కూడా అదే చేస్తాడని అనుకుంటున్నా.. – టేక్ కేర్.. నేను మళ్లీ మాట్లాడుతా.. సుకేశ్: ఒకే అక్కా మీ ఇష్టం ఎప్పుడైనా చేయండి. కేసీఆర్ గారిని అడిగినట్టు చెప్పండి – నమస్తే (ఎమోజీ) సుకేశ్: అక్కా డెలివరీ చేసేశాను – ఓకే సుకేశ్: అక్కా.. ఏకే గారికి లేదా ఎస్జేకు ఇన్ఫార్మ్ చేయండి – మనీష్‌తో మాట్లాడాను సుకేశ్: ఓకే అక్కా.. థ్యాంక్స్ సత్యేంద్ర జైన్‌తో సుకేశ్ చాటింగ్‌గా పేర్కొన్న సంభాషణ ఇదీ – బోలో సుకేశ్: బ్రదర్ ఇంకో నంబర్ సరిగ్గా పనిచేయడం లేదు – బ్యాటరీ లో సుకేశ్: ఓకే బ్రో.. బ్రో నెయ్యి టిన్ రెడీ – ఫుల్ కదా సుకేశ్: ఎస్ బ్రో.. 15 కేజీలు – దాన్ని హైదరాబాద్ సిస్టర్‌కు పంపించు సుకేశ్: బ్రో ఢిల్లీలో కాదా? – కాదు కాదు హైదరాబాద్‌లో.. సుకేశ్: ఓకే బ్రో.. పంపిస్తా.. – టైమ్? సుకేశ్: రెండు గంటలు టైమ్ ఇవ్వండి – సాయంత్రం ఐదు గంటలకల్లా ఇవ్వాలి సుకేశ్: ఓకే బ్రో.. మరి బిగ్ బ్రోకు కూడా ఇన్ఫార్మ్ చేయండి.. లేదా నన్నే చేయమంటారా? – ఏకే భాయ్‌కు తెలుసు.. ఆయన ఫేస్ టైమ్‌లో 3 గంటలకు మాట్లాడతారు సుకేశ్: ఓకే మై బ్రో.. సుకేశ్ చాటింగ్‌లలో పేర్కొన్న కోడ్ల పేర్లు చాట్–1లో.. ఏకే బ్రో: అరవింద్ కేజ్రీవాల్ ఎస్జే బ్రో: సత్యేంద్ర జైన్ మనీశ్: మనీశ్ సిసోడియా అరుణ్: అరుణ్ పిళ్లై జేహెచ్: జూబ్లీహిల్స్‌లోని కవిత నివాసం ఆఫీస్: బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం ప్యాకేజీ: రూ.15 కోట్ల నగదు చాట్–2లో.. బ్రో: సత్యేంద్ర జైన్ 15 కేజీల నెయ్యి: రూ.15 కోట్ల క్యాష్ 25 కేజీల నెయ్యి: రూ.25 కోట్ల క్యాష్ హెచ్‌వైడీ: హైదరాబాద్ సిస్టర్: కవిత ఏకే భాయ్: అరవింద్ కేజ్రీవాల్ -
హైదరాబాద్‌లో భారీగా హవాలా సొమ్ము స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీగా హవాలా సొమ్ము పట్టుబడింది. పాతబస్తీలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా కారులో అక్రమంగా తరలిస్తున్న కోటి 10 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. హవాలా నగదును తరలిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో కారు, నగదు స్వాధీనం చేసుకున్నారు. షాహినాత్‌గంజ్‌కు చెందిన కమలేశ్, అశోక్ కుమార్, రతన్‌సింగ్, గోషామహల్‌కు చెందిన రాహుల్ అగర్వాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే డబ్బు ఎవరి ఆదేశాలతో ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయాలు తెలియాల్సి ఉంది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ హవాలా సొమ్ముతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. చదవండి: డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యపై అనుమానాలెన్నో.. ఆ పనిచేసిందెవరు? -
హైదరాబాద్ లో భారీగా హవాలా సొమ్ము స్వాధీనం
-
హైదరాబాద్ లో భారీగా హవాలా నగదు పట్టివేత
-
గాంధీనగర్ పీఎస్ పరిధిలో భారీగా హవాలా నగదు పట్టివేత
-
Hyderabad: చెత్త వ్యాపారి వద్ద రూ.1.24 కోట్లు.. అంత డబ్బు ఎక్కడిది?
సాక్షి, హైదరాబాద్: జల్పల్లికి చెందిన ఓ స్క్రాప్ వ్యాపారి వద్ద సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రూ.1.24 కోట్లు స్వాధీనం చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న తన సమీప బంధువు ఆదేశాల మేరకు ఈ మొత్తాన్ని ఒకరి నుంచి తీసుకున్న ఇతగాడు మరో నలుగురికి అందించేందుకు ప్రయత్నించాడని ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు గురువారం వెల్లడించారు. మీరట్ నుంచి నగరానికి వలసవచ్చిన షోయబ్ మాలిక్ మాసబ్‌ట్యాంక్‌లో ఉంటున్నాడు. గతేడాది ఫిబ్రవరి నుంచి జల్పల్లిలో బిస్మిల్లా ట్రేడర్స్ పేరుతో స్క్రాప్ వ్యాపారం చేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్‌లో ఉంటున్న ఇతడి సమీప బంధువు కమిల్ మాలిక్ గుజరాతీ గల్లీ ప్రాంతానికి చెందిన వ్యాపారి భరత్ నుంచి రూ.1.24 కోట్లు తీసుకోమని చెప్పాడు. దీంతో గురువారం తన వద్ద పని చేసే ఉద్యోగి అక్లాక్‌ను పంపి డబ్బు తీసుకున్నాడు. ఆ మొత్తాన్ని కమిల్ ఆదేశాల మేరకు నగరానికే చెందిన సంభవ్, ఆదిల్, మినాజ్, షఫీలకు అందించాలని భావించాడు. సీజ్ చేసిన డబ్బు దీనిపై మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందడంతో ఇన్స్పెక్టర్ ఆర్.రఘునాథ్ నేతృత్వంలో ఎస్సై ఎస్.సాయికిరణ్ నేతృత్వంలోని బృందం దాడి చేసి అదుపులోకి తీసుకుంది. షోయబ్ సహా అతడి నుంచి స్వాధీనం చేసుకున్న రూ.1.24 కోట్ల నగదును హుమాయున్‌నగర్ పోలీసులకు అప్పగించారు. ఈ మొత్తం వ్యవహారం హవాలా దందాగా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీనిపై ఆదాయపుపన్ను శాఖకు సమాచారం ఇస్తున్నారు. -
చికోటి వ్యవహారంలో వెలుగులోకి అజ్ఞాత వ్యక్తులు
-
‘స్కిల్’ మాఫియా.. హవాలా మార్గంలో కొల్లగొట్టిన టీడీపీ పెద్దలు
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ ఎస్ఎస్డీసీ) కుంభకోణం తీగ లాగితే దేశవ్యాప్తంగా డొంక కదులుతోంది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నిహితుల పన్నాగంతో సాగిన ఈ కుంభకోణం కేవలం మన రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాలేదనే విషయం సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. షెల్ కంపెనీల ద్వారా కర్ణాటక, గుజరాత్, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వైనం తాజాగా వెలుగు చూసింది. మరోవైపు ఏపీ ఎస్ఎస్డీసీ నిధులను నిబంధనలకు విరుద్ధంగా సింగపూర్‌కు తరలించి దారి మళ్లించినట్టు వెల్లడైంది. దర్యాప్తులో వెలుగు చూసిన ఈ అంశాలను సం బంధిత రాష్ట్రాలతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి నివేదించాలని రాష్ట్ర సీఐడీ విభాగం నిర్ణయించింది. సీఐడీ దర్యాప్తులో బహిర్గతమైన అంశాలిలా ఉన్నాయి. చదవండి: దశాబ్దాల దందాలకు కళ్లెం దేశవ్యాప్త కుంభకోణమిది యువతకు ఉపాధి కల్పనా నైపుణ్యాల శిక్షణ పేరిట సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ముసుగులో అప్పటి ప్రభుత్వ పెద్దలు రూ.371 కోట్లు కొల్లగొట్టారు. అందుకోసం స్కిల్లర్, తదితర షెల్ కంపెనీలు సృష్టించి నిధులు దారి మళ్లించారు. అదే రీతిలో సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలు కర్ణాటక, గుజరాత్, జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలతోనూ ఉపాధి కల్పనా నైపుణ్యాల శిక్షణ పేరిట ఒప్పందం చేసుకున్నాయి. అక్కడా షెల్ కంపెనీలకు నిధులను మళ్లించి దోపిడీకి పాల్పడ్డాయి. టీచింగ్ మెటీరియల్స్, మేథో హక్కులు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు, హై–ఎండ్ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ మెటీరియల్ పేరిట స్కిల్లర్ అనే షెల్ కంపెనీకి భారీగా నిధులు కట్టబెట్టారు. ఈ కేసులో సీఐడీ అరెస్ట్ చేసిన షెల్ కంపెనీల ప్రతినిధులను విచారించగా మొత్తం బాగోతం బట్టబయలైంది. ఈ విషయాన్ని కర్ణాటక, గుజరాత్, జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదించాలని సీఐడీ నిర్ణయించింది. ఈ ముఠా దేశవ్యాప్తంగా కుంభకోణానికి పాల్పడినట్టు కూడా సీఐడీ గుర్తించింది. దాంతో సీఐడీ ఈ విషయాన్ని ఈడీ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. నకిలీ ఇన్వాయిస్లతో.. ఒప్పందం ప్రకారం సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలు 90 శాతం వాటాను చెల్లించకపోయినా ప్రభుత్వం మాత్రం తన వాటా 10 శాతం రూ.371 కోట్లను ఆ సంస్థలకు చెల్లించేసింది. అందులో రూ.241 కోట్లను నకిలీ ఇన్వాయిస్లతో స్కిల్లర్ కంపెనీకి మళ్లించారు. కాగా స్కిల్లర్ కంపెనీ కేంద్ర ఫెమా చట్టాలకు విరుద్ధంగా నిధులను సింగపూర్‌లోని ఓ సంస్థకు తరలించింది. ఈ విషయాన్సి యాక్సిస్ బ్యాంక్ అధికారులు ధ్రువీకరించారు. మరో షెల్ కంపెనీ అలైడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) ప్రతినిధి శిరీష్‌చంద్ర షాను అరెస్ట్ చేసి విచారించడం ద్వారా సీఐడీ అధికారులు మరిన్ని కీలకాంశాలను రాబట్టారు. నిబంధనలకు విరుద్ధంగా బ్యాంక్ అకౌంట్ల ద్వారా నిధులను దారి మళ్లించారని అతడు అంగీకరించాడు. అంటే ఏపీ ఎస్ఎస్డీసీ కుంభకోణం నిధులను హవాలా ద్వారా కొల్లగొట్టారని తేలింది. -
APSSDC Scam: హవాలా దారిలో ‘పెద్దలకు’
సాక్షి, అమరావతి: రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణంలో కొల్లగొట్టిన రూ.242 కోట్ల చిక్కుముడి వీడుతోంది. గత సర్కారు హయాంలో వర్సిటీలు, కాలేజీలకు పరికరాలు సరఫరా చేసినందుకు నిధులు చెల్లించామన్న వాదన కట్టుకథేనని తేటతెల్లమవుతోంది. చంద్రబాబు సర్కారు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా నిబంధనలకు విరుద్ధంగా చెల్లించిన రూ.242 కోట్లు హవాలా మార్గంలో తిరిగి ‘పెద్దలకే’ చేరాయని స్పష్టమైంది. 2018లో కేంద్ర జీఎస్టీ అధికారులు వ్యక్తం చేసిన సందేహాలు నిజమేనని సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. చదవండి: ‘స్కిల్’ స్కామ్‌లో షెల్.. షా హవాలా దారిలో రూ.242 కోట్లు కాంట్రాక్టు నిబంధనలను పాటించకున్నా గత ప్రభుత్వం డిజైన్‌టెక్ కంపెనీకి పూర్తి సానుకూలంగా వ్యవహరించింది. నిబంధనల ప్రకారం సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలు 90% నిధులు సమకూర్చాలి. అయితే ఒక్క శాతం కూడా వెచ్చించకున్నా టీడీపీ సర్కారు తన వాటాగా రూ.371 కోట్లు డిజైన్ టెక్ కంపెనీకి చెల్లించింది. అందులో రూ.242 కోట్లను డిజైన్ టెక్ బోగస్ కంపెనీ స్కిల్లర్కు చెల్లించింది. స్కిల్లర్ ఆ నిధులను ఏసీఐ అనే మరో షెల్ కంపెనీకి మళ్లించింది. నకిలీ ఇన్వాయిస్లతో బురిడీ కొట్టించిన ఏసీఐ కంపెనీ రూ.242 కోట్లను మళ్లీ డిజైన్ టెక్ ఖాతాలోనే వేసింది. ఆ నిధులను డిజైన్ టెక్ కంపెనీ ప్రతినిధులు విత్‌డ్రా చేశారని సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. అంత మొత్తాన్ని విత్‌డ్రా చేసినప్పటికీ కంపెనీ రికార్డుల్లో ఎలాంటి ఎంట్రీలు లేకపోవడం గమనార్హం. రూ.242 కోట్లను హవాలా మార్గంలో కొందరు ప్రైవేట్ వ్యక్తులకు డిజైన్ టెక్ ప్రతినిధులు చేరవేసినట్లు స్పష్టమైంది. అందుకే వాటికి సంబంధించి రికార్డుల్లో ఎలాంటి ఎంట్రీలు లేవు. ఇలా ఈ నిధులు గత సర్కారు పెద్దల జేబుల్లోకి చేరిపోయాయి. ఆనాడే గుర్తించిన కేంద్ర జీఎస్టీ... కేంద్ర జీఎస్టీ అధికారులు 2018లో పుణెలోని షెల్ కంపెనీలపై దాడులు నిర్వహించినప్పుడే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఏఐసీ, స్కిల్లర్ తదితర కంపెనీలు సమర్పించిన ఇన్వాయిస్లన్నీ నకిలీవేనని జీఎస్టీ అధికారుల దాడుల్లో నిర్ధారణ అయ్యింది. తాము ఏపీఎస్ఎస్డీసీకి ఎలాంటి హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ సరఫరా చేయలేదని ఆ రెండు కంపెనీ ప్రతినిధులు అంగీకరించారు. తమ రికార్డుల్లో చూపిస్తున్న రూ.242 కోట్ల లావాదేవీలన్నీ కల్పితాలేనని వెల్లడించారు. కేంద్ర జీఎస్టీ అధికారులు ఇదే విషయాన్ని 2018లోనే టీడీపీ సర్కారు దృష్టికి తెచ్చారు. రూ.242 కోట్లు దారి మళ్లాయని స్పష్టం చేశారు. దీనిపై గత సర్కారు ఉద్దేశపూర్వకంగానే మౌనం దాల్చింది. తాజాగా సీఐడీ అధికారుల దర్యాప్తులో ఆ అవినీతి బండారం బట్టబయలైంది. షా అరెస్టుతో టీడీపీ నేతల్లో గుబులు.. ముంబైకి చెందిన షెల్ కంపెనీల సృష్టికర్త శిరీష్ చంద్రకాంత్ షా అరెస్టుతో టీడీపీ పెద్దల్లో ఆందోళన మొదలైంది. రూ.242 కోట్లు హవాలా మార్గంలో తరలించిన ఉదంతంలో తమ పేరు వెలుగులోకి వస్తోందని కలవరం చెందుతున్నారు. చంద్రకాంత్ షా సృష్టించిన షెల్ కంపెనీల ద్వారానే ఏపీఎస్ఎస్డీసీతోపాటు మరికొన్ని శాఖల్లో కుంభకోణాల నిధులను పక్కాగా దారి మళ్లించినట్టు తెలుస్తోంది. -
హవాలా లావాదేవీలపై టాస్క్ ఫోర్స్ కొరడా
సాక్షి, విజయవాడ : హవాలా లావాదేవీలపై టాస్క్ ఫోర్స్ కొరడా విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కొరడా ఝుళిపించారు. హవాలా మార్గంలో విజయవాడ నుంచి గంతకల్లుకి డబ్బులు తరలిస్తుండగా ఓ ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు. ఇద్దరి వ్యక్తులను అరెస్ట్ చేసి కోటి రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. హవాలా మూలాలపైటాస్క్ఫోర్స్ ఏడీసీపీ శ్రీనివాసులు కూపీ లాగుతున్నారు. -
కారులో భారీగా నగదు పట్టివేత
సాక్షి, కృష్ణా : జిల్లాలోని గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద హవాలా డబ్బు కలకలం రేపింది. వాహనాలు తనిఖీలు చేపట్టిన పోలీసులకు.. ఓ కారులో భారీ మొత్తంలో నగదు గుర్తించారు. ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.80 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హవాలా డబ్బును సికింద్రాబాద్ నుంచి కోల్‌కతాకు తరలిస్తున్నట్లుగా గుర్తించారు. గోల్డ్ వ్యాపారి మహ్మద్ భాషాను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పట్టుబడ్డ నగదును ఐటీ అధికారులకు అప్పగించారు. హవాలా రాకెట్ అసలు సూత్రదారులకోసం అరా తీస్తున్నారు. (చదవండి : ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ స్వాధీనం) -
రూ. కోటితో చిక్కిన రఘునందన్ బావమరిది
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం ముగియడానికి కొన్ని గంటల ముందు ఆ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎం.రఘునందన్ రావు బావమరిది సురభి శ్రీనివాసరావు రూ.కోటి నగదుతో చిక్కారు. పెద్దపల్లి మాజీ ఎంపీకి చెందిన, బేగంపేటలోని విశాఖ ఇండ స్ట్రీస్ నుంచి ఈ నగదును తీసుకున్న శ్రీనివాస రావు దుబ్బాకకు తరలించే ప్రయత్నాల్లో ఉండగా పట్టుకున్నామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఆది వారం ప్రకటించారు. ఈ డబ్బుకు, దుబ్బాక ఉప ఎన్నికకు మధ్య సంబంధం ఉన్నట్లు ఆధారాలు సైతం లభించాయని ఆయన స్పష్టం చేశారు. టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావుతో కలసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంజనీకుమార్ వివరాలు వెల్లడించారు. సీపీ తెలిపిన వివరాలు... సిద్దిపేటకు చెందిన శ్రీనివాసరావు పటాన్చెరులో దాదాపు పదేళ్లుగా ఏ టు జెడ్ సొల్యూషన్స్ పేరుతో టెక్నికల్, మ్యాన్‌పవర్ సరఫరా వ్యాపారం చేస్తున్నారు. ఈయన ఆదివారం మధ్యా హ్నం తన కారు డ్రైవర్ టి.రవికుమార్‌తో కలిసి బేగంపేటకు వచ్చారు. విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ మేనేజర్ నుంచి రూ.కోటి తీసుకున్నారు. ఈ మొత్తాన్ని తన కారులో పెట్టుకుని దుబ్బాకకు తీసుకువెళ్లడానికి సిద్ధమయ్యారు. ఈ విషయంపై పోలీసులకు ఉప్పందింది. దీంతో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్కు కె.నాగేశ్వరరావు నేతృత్వంలో ఎస్సై థక్రుద్దీన్‌తో కూడిన బృందం రంగంలోకి దిగింది. బేగంపేట ప్రాంతంలో శ్రీనివాస రావు ప్రయాణిస్తున్న కారును ఆపింది. అందులో ఉన్న రూ.కోటి నగదుతోపాటు ఆయన ఫోన్‌ను స్వాధీనం చేసుకుంది. ఈ ఫోన్లో లభించిన ఫేస్‌టైమ్ కాల్స్ వివరాలు, వాట్సాప్‌లో ఉన్న సందేశాలు, ఇతర అంశాలు పరిశీలించిన నేపథ్యంలో ఈ నగదు రఘునందన్‌రావు సూచనల మేరకు దుబ్బాకకు తీసుకువెళ్తున్నారని, అక్కడ ఓటర్లకు పంచిపెట్టడానికి పథకం వేశారని అనుమానిస్తున్నామని అంజనీకుమార్ పేర్కొన్నారు. నిందితుడు తమ అదుపులో ఉండగా అనేకసార్లు రఘునందర్రావు నుంచి అతడి ఫోన్‌కు కాల్స్ వచ్చాయని చెప్పారు. ఈ కేసును బేగంపేట పోలీసులు ప్రత్యేక ఏజెన్సీ సహకారంతో దర్యాప్తు చేస్తారని తెలిపారు. పదిరోజుల్లో రూ.2.34 కోట్లు స్వాధీనం ఎన్నికల సంఘం ఆదేశాలు, సూచనల మేరకు స్వేచ్ఛాయుత వాతావరణంలో, ప్రలోభాలకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించడానికి పోలీసు విభాగం కట్టుబడి ఉంది. గత కొన్ని రోజులుగా నగరవ్యాప్తంగా హవాలా దందాపై నిఘా ముమ్మరం చేశాం. ఫలితంగా పది రోజుల వ్యవధిలో రూ.2.34 కోట్లు స్వాధీనం చేసుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నాం. దీనికి ప్రజలిచ్చిన సహకారం, సమాచారమే కీలకంగా మారింది. ఇంకా ఇలాంటి లావాదేవీలపై సమాచారం ఉన్నవారు పోలీసులకు తెలపాలి. – అంజనీకుమార్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ -
రఘునందన్‌రావు బావమరిది అరెస్ట్
-
రఘునందన్‌రావు బావమరిది అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : నగరంలో పెద్ద మొత్తంలో పట్టుకున్న హవాలా నగదుకు సంబంధించి ఇద్దరు వక్తులను అరెస్ట్ చేసినట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఇన్నోవా కారుతో పాటు రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘పట్టుబడ్డ నగదు దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బావమరిది సురభి శ్రీనివాస్‌రావుది గుర్తించాం. శ్రీనివాస్‌రావుతో పాటు కారు డ్రైవర్ రవి కుమార్‌ను అరెస్ట్ చేశాం. బేగంపేట ఫ్లైఓవర్ సమీపంలో ఈ నగదును పట్టుకున్నాం. స్వాధీనం చేసుకున్న ఫోన్లో చాలా కీలక సమాచారం సేకరించాం. కాల్ లిస్ట్‌లో రఘనందన్‌రావుకు నేరుగా శ్రీనివాస్ ఫోన్ చేశాడు. కోటి రూపాయిలకు పైగా హవాలా నగదును పట్టుకున్నాం. ఈ నగదును విశాక ఇండస్ట్రీ నుంచి దుబ్బాకకు వెళుతున్నట్లు గుర్తించాం. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసులు ఎప్పుడు కృత నిశ్చయంతో ఉంటారు’ అని సీపీ అంజనీకుమార్ తెలిపారు. (దుబ్బాక రాజకీయం.. నోట్లకట్టల లొల్లి) కాగా దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగియనుంది. కాగా దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగియనుంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలో ప్రచార వేగం పెంచాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతో పాటు ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికలు ఈ నెల 3న జరగనున్న దృష్ట్యా పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేర మేరకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వెయ్యిమంది ఓటర్లను ప్రమాణికంగా తీసుకుని అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. -
బంజారాహిల్స్‌లో గుట్టలుగా హవాలా సొమ్ము
-
బంజారాహిల్స్‌లో గుట్టలుగా కరెన్సీ కట్టలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో భారీగా హవాలా సొమ్ము పట్టుబడింది. 3 కోట్ల 75 లక్షల హవాలా డబ్బును టాస్క్ ఫోర్స్ పోలీసులు బంజారాహిల్స్‌లో మంగళవారం పట్టుకున్నారు. వెస్ట్‌జోన్‌లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఓ కారులో నలుగురు వ్యక్తులు డబ్బులను తరలిస్తుండగా పట్టుకున్నామని హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఈశ్వర్ దిలీప్ జీ, హరీష్ రామ్ బాయ్, అజిత్ సింగ్, రాథోడ్ అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని వెల్లడించారు. ఈ డబ్బులు ఎక్కడ నుండి తీసుకొచ్చారు, ఎక్కడ ఇవ్వాలని అనుకుంటున్నారు అనేది దర్యాప్తు చేస్తున్నామన్నారు. హవాలా డబ్బు తో పాటు నిందితులను ఆదాయపన్ను శాఖ కు అప్పగిస్తున్నామని చెప్పారు. ఆదాయపు పన్ను అధికారుల విచారణలో మరిన్ని విషయాలు బయట పడే అవకాశం ఉందని సీపీ తెలిపారు. (చదవండి: ఎస్ఐ.. మై హీరో ఆఫ్ ది డే)