heartly welcome
-
పశ్చిమాసియాతో బంధం కీలకం
న్యూఢిల్లీ/రమల్లా/ అమాన్: నాలుగు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం జోర్డాన్ చేరుకున్నారు. జోర్డాన్ రాజధాని అమాన్‌లో మోదీకి ఆ దేశ ప్రధాని హని అల్– ముల్కి ఘన స్వాగతం పలికి, ఆయన్ని రాజప్రాసాదానికి తీసుకెళ్లారు. అక్కడ మోదీకి రాజు అబ్దుల్లా–2 సాదర స్వాగతం పలికారు. ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చలు జరిపారు. రాజు అబ్దుల్లా–2తో చర్చలు ఫలప్రదంగా ముగిశాయని తర్వాత మోదీ అన్నారు. భారత విదేశీ సంబంధాల్లో పశ్చిమాసియాకు కీలక స్థానం ఉందని తెలిపారు. శనివారం పాలస్తీనా వెళ్లనున్న మోదీ ఆ దేశ ప్రధాని మహ్మద్ అబ్బాస్‌తో భేటీ అవుతారు. భారత్ ప్రధాని ఒకరు పాలస్తీనాలో పర్యటించటం ఇదే ప్రథమం. అక్కడి నుంచి యూఏఈ వెళతారు. ఆ దేశ పాలకుడు, ప్రధానితోపాటు, అక్కడి భారతీయ వాణిజ్యవేత్తలతో సమావేశమవుతారు. ఇంధన భద్రత, మౌలికరంగాల్లో యూఏఈ సుమారు 11 మిలియన్ డాలర్ల మేర భారత్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. దుబాయ్‌లో నిర్మించిన హిందూ దేవాలయం ప్రారంభోత్సవంలో ఆదివారం పాల్గొన్న అనంతరం వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌లో పాల్గొని కీలక ఉపన్యాసం చేస్తారు. అక్కడి నుంచి పర్యటనలో చివరిగా ఒమన్ చేరుకుంటారు. ఒమన్ సుల్తాన్‌తోపాటు ముఖ్యనేతలతో పాటు అక్కడి ముఖ్య వ్యాపారవేత్తలతో భేటీ అయి పలు వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటారు. భారత్ పాత్ర కీలకం: అబ్బాస్ పశ్చిమాసియా శాంతి చర్చల్లో భారత్ కీలకపాత్ర పోషించాలని పాలస్తీనా ప్రధాని మహ్మద్ అబ్బాస్ ఆకాంక్షించారు. ప్రధాని మోదీ చారిత్రక పర్యటన సందర్భంగా ఈ విషయమై చర్చిస్తామని వివరించారు. ఇజ్రాయెల్‌తో తుది ఒప్పందం కుదిరేలా అన్ని వర్గాలతో కలిపి ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలనే విషయంపైనా మోదీతో మాట్లాడుతానన్నారు. బడ్జెట్‌ను ప్రజలకు వివరించండి! కేంద్ర బడ్జెట్లో పేర్కొన్న పేదలు, రైతుల అనుకూల సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ ఎంపీలకు మోదీ సూచించారు. క్షేత్రస్థాయిలో ఈ పథకాలను వివరించటంలో ఎంపీలు ప్రయత్నంపైనే వచ్చే ఎన్నికల్లో పార్టీ ప్రదర్శన ఆధారపడి ఉంటుందన్నారు. శుక్రవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నేతలనుద్దేశించి మోదీ మాట్లాడారు. బూత్ స్థాయిలో సమావేశాలు నిర్వహించి ప్రజలకు వివరించాలని.. వీటిని మరింత విస్తృతం చేసేందుకు ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని ఎంపీలకు సూచించారు. -
అడుగడుగునా ఆత్మీయ స్వాగతం
- కొనసాగుతున్న మేలుకొలుపుయాత్ర - పద్మావతితో తమగోడును వెల్లబోసుకుంటున్న జనం శింగనమల : ‘మీరు ఎన్నికల్లోనూ తిరిగారు, ఇప్పడు మా సమస్యలు నెరవేర్చడానికి తిరుగుతున్నారు. మా ఓట్లు మీకేవేస్తాం... శింగనమల చెరువుకు నీరు విడిపించి మమ్మల్ని ఆదుకోండి.. ఇప్పడున్న ఎమ్మెల్యే యామినీబాల మాదిరి మోసం చేయొద్దు ’ అని శింగనమలోని బోయవీధికి చెందిన మహిళలు మేలుకొలుపు పాదయాత్రకు వచ్చిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతికి విన్నవించుకున్నారు. ఆరో రోజు పాదయాత్రలో భాగంగా బుధవారం కొర్రపాడు నుంచి మొదలైన పాదయాత్ర మరువకొమ్మ క్రాస్, శింగనమల, గోవిందరాయునిపేట క్రాస్, సోదనపల్లి, ఈస్ట్ నరసాపురం గ్రామం వరకు సాగింది. ఈ యాత్రలో వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి తరిమెల శరత్‌చంద్రారెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకులేడు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. గ్రామ గ్రామానా జొన్నలగడ్డ పద్మావతికి జనం ఘన స్వాగతం పలికారు. పద్మావతి దృష్టికి సమస్యలు కొర్రపాడు – శింగనమల మరువకొమ్మక్రాస్ మధ్యలో ఉపాధి హమీ పనులు చేస్తున్న శివపురం కూలీలను పద్మావతి పలకరించారు. కూలీ సక్రమంగా వస్తోందా అని కూలీలను పద్మావతి ప్రశ్నిచంగా రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎండిపోయిన శింగనమల చెరువును పరిశీలించి , మత్స్యకారులతో వారి సాధకబాధలను విన్నారు. శింగనమల చెరువుకు నీళ్లు విడిపించి ఆదుకోవాలని వారు వినతిపత్రం సమర్పించారు. అక్కడే చిన్నజలాపురానికి చెందిన బండి శ్రీనివాసులు కుమార్తె సాయివర్షిణి బర్త్‌డే సందర్భంగా కేక్ కట్‌చేయించారు. శింగనమలలో ఎమ్మార్వో కార్యాలయం కాలనీలో తాగునీరురాక ఇబ్బంది పడుతున్నామని మహిళలు వాపోయారు. సోదనపల్లి, ఈస్ట్ నరసాపురం గ్రామాల్లోనూ మహిళలు, ప్రజలు పద్మావతికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ చెన్నకేశవులు, నాయకులు బొమ్మన శ్రీరామిరెడ్డి, మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ అంజన్‌రెడ్డి, సర్పంచ్‌లు వెంకటప్ప, ఈశ్వరమ్మ, ఆంజినేయులు, ఆదినారాయణ, వెంకటరమణ, డేగల ఓబిలేసు, మదన్‌మోహన్‌రెడ్డి, మహిళ విభాగం నాయకురాలు శకుంతలమ్మ, చెన్నమ్మలు పాల్గొన్నారు. -
అధినేతకు ఆత్మీయ స్వాగతం
- బెంగళూరు నుంచి పులివెందుల వెళ్లిన వైఎస్ జగన్మోహన్రెడ్డి - అడుగడుగునా ఘనస్వాగతం పలికిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు చిలమత్తూరు / గోరంట్ల / కదిరి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సాయంత్రం బెంగళూరు నుంచి పులివెందులకు వెళ్లారు. ఈక్రమంలో ఆయా కూడళ్లలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధినేతకు ఆత్మీయ స్వాగతం పలికారు. తొలుత చిలమత్తూరు మండలం కొడికొండ టోల్గేట్, కోడూరు తోపులోకి జగన్ కాన్వాయ్ రాగానే భారీగా ప్రజలు తరలివచ్చి ఘనస్వాగతం పలికారు. మండల కన్వీనర్ ఎం.సదాశివారెడ్డి, కోడూరు సింగిల్ విండో అ««ధ్యక్షుడు నరసింహారెడ్డి, నాయకులు వాసు, రఫిక్, నరేష్, నంజుండ, మహ్మద్, జనార్దన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, జింక సజ్జప్ప, సురేంద్రరెడ్డి, రాజు, శివారెడ్డి, నరేష్, సుధాకర్, వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు. అలాగే గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లి క్రాస్ వద్దకు కాన్వాయ్ చేరుకోగానే నాయకులు, కార్యకర్తలు కేరింతలు కొట్టారు. వాహనం నుంచి జగన్ కిందకు దిగి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కరచాలనం చేశారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఫకృద్దీన్, నాయకులు గంపల రమణారెడ్డి, ప్రభాకర్‌రావు, సుదర్శన్‌శర్మ, రంగారెడ్డి, సుకుమార్ గుప్తా, సమర, చాంద్‌బాషా, డాక్టర్బాషా, వీరనారాయణరెడ్డి, జక్కల రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. అలాగే కదిరిలోని వేమారెడ్డి కూడలిలో వైఎస్ జగన్‌హన్‌రెడ్డికి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సిద్దారెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి వజ్రభాస్కర్రెడ్డితో పాటు పలువురు నాయకులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. జగన్ రాక సమాచారం తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున వేమారెడ్డి కూడలికి చేరుకున్నారు. తమ అధినేతతో కరచాలనం కోసం ఎగబడ్డారు. అనంతరం సమన్వయకర్త సిద్దారెడ్డిని తన వాహనంలో ఎక్కించుకుని వెళ్లిపోయారు.