అధినేతకు ఆత్మీయ స్వాగతం
- బెంగళూరు నుంచి పులివెందుల వెళ్లిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
- అడుగడుగునా ఘనస్వాగతం పలికిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు
చిలమత్తూరు / గోరంట్ల / కదిరి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సాయంత్రం బెంగళూరు నుంచి పులివెందులకు వెళ్లారు. ఈక్రమంలో ఆయా కూడళ్లలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధినేతకు ఆత్మీయ స్వాగతం పలికారు. తొలుత చిలమత్తూరు మండలం కొడికొండ టోల్‌గేట్, కోడూరు తోపులోకి జగన్ కాన్వాయ్ రాగానే భారీగా ప్రజలు తరలివచ్చి ఘనస్వాగతం పలికారు. మండల కన్వీనర్ ఎం.సదాశివారెడ్డి, కోడూరు సింగిల్ విండో అ««ధ్యక్షుడు నరసింహారెడ్డి, నాయకులు వాసు, రఫిక్, నరేష్, నంజుండ, మహ్మద్, జనార్దన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, జింక సజ్జప్ప, సురేంద్రరెడ్డి, రాజు, శివారెడ్డి, నరేష్, సుధాకర్, వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు.
అలాగే గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లి క్రాస్ వద్దకు కాన్వాయ్ చేరుకోగానే నాయకులు, కార్యకర్తలు కేరింతలు కొట్టారు. వాహనం నుంచి జగన్ కిందకు దిగి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కరచాలనం చేశారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ఫకృద్దీన్, నాయకులు గంపల రమణారెడ్డి, ప్రభాకర్‌రావు, సుదర్శన్‌శర్మ, రంగారెడ్డి, సుకుమార్ గుప్తా, సమర, చాంద్‌బాషా, డాక్టర్‌బాషా, వీరనారాయణరెడ్డి, జక్కల రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. అలాగే కదిరిలోని వేమారెడ్డి కూడలిలో వైఎస్ జగన్‌హన్‌రెడ్డికి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సిద్దారెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి వజ్రభాస్కర్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. జగన్ రాక సమాచారం తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున వేమారెడ్డి కూడలికి చేరుకున్నారు. తమ అధినేతతో కరచాలనం కోసం ఎగబడ్డారు. అనంతరం సమన్వయకర్త సిద్దారెడ్డిని తన వాహనంలో ఎక్కించుకుని వెళ్లిపోయారు.