inter state thief
-
ఓసారి బ్రిజా, మరోసారి డిజైర్, ఇంకోసారి క్రెటా...
సాక్షి, హైదరాబాద్: ఓసారి బ్రిజా, మరోసారి డిజైర్, ఇంకోసారి క్రెటా... ఇలా ఖరీదైన కార్లలో హైదరాబాద్ నుంచి బయలుదేరి బెంగళూరు వెళ్తూ.. అనువైన ఇళ్లను టార్గెట్‌గా చేసి వరుస చోరీలు చేస్తాడు... ఇలా రెచ్చిపోతున్న ఘరానా దొంగ బస్వరాజ్ ప్రకాష్ అలియాస్ విజయ్‌కుమార్ అలియాస్ జంగ్లీని బెంగళూరులోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్‌లో పట్టుకుని తీసుకెళ్లిన పోలీసులు ఇతడి నుంచి 1.3 కేజీల బంగారం సహా రూ.80 లక్షల విలువైన సొత్తు రికవరీ చేశారు. బెంగళూరులోని రామనగరకు చెందిన ప్రకాష్ ప్రస్తుతం హైదరాబాద్ నగర శివార్లలోని మేడ్చల్‌లో నివసిస్తున్నాడు. వ్యవసాయ కుటుంబం నుంచి వచి్చన ఇతగాడు 2012లో ప్రేమ వివాహం చేసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. రామనగరలో బేకరీ ఏర్పాటు చేయగా..తీవ్ర నష్టాలు వచ్చాయి. దీంతో దాన్ని వదిలేసి ఏడాది కుమార్తెతో భార్యాభర్తలు 2014లో బెంగళూరు చేరుకున్నారు. అక్కడి యశ్వంత్‌పూర్ రైల్వేస్టేషన్లో ఆవాసం ఏర్పాటు చేసుకున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రకాష్‌కు ఉద్యోగం దొరకలేదు. ఓ దశలో తమ కుమార్తెకు పాలు కొనడానికి కూడా డబ్బులు లేకపోవడంతో తొలిసారిగా ఆ రైల్వేస్టేషన్ సమీపంలోని ఇంట్లో రూ.900 చోరీ చేశాడు. అప్పటి నుంచి కర్ణాటకతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో వరుస చోరీలు చేస్తూ ఇప్పటి వరకు 11 సార్లు అరెస్టయ్యాడు. ఇలా అరెస్టు అవుతూ ఏడాదిలో ఆరు నెలలు జైల్లోనే ఉంటున్న ఇతడిని భార్య వదిలేసి కుమార్తెతో వెళ్లిపోయింది. అప్పటి నుంచి మేడ్చల్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. చిరు వ్యాపారిగా యజమానికి పరిచయం చేసుకున్నాడు. ఖరీదైన.. ప్రధానంగా ఎస్యూవీ కార్లంటే ప్రకాష్‌కు మక్కువ ఎక్కువ. దీంతో సెకండ్ హ్యాండ్ కారు ఖరీదు చేసి..దానిపైనే చోరీ చేసే చోటుకు వెళ్తాడు. తాళం వేసి ఉన్న.. ప్రధాన ద్వారం వేసి ఉండని ఇళ్లను గుర్తించి చోరీ చేస్తాడు. ఎక్కడా షెల్టర్ తీసుకోకుండా అక్కడ నుంచి తన వాహనంపై తిరిగి బయలుదేరుతాడు. నేరుగా మేడ్చల్‌లోని ఇంటికి రాకుండా తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తాడు. కొన్ని రోజులు అక్కడ తలదాచుకుని, చోరీ సొత్తును విక్రయించడంతో పాటు మరో నేరం చేసి తిరిగి వస్తాడు. ఇలా నాలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 100కు పైగా కేసులు ఇతడిపై నమోదై ఉన్నాయి. ఇలా గతేడాది కాలంలో బెంగళూరులోనే 11 నేరాలు చేశాడు. తొలినేరం చేసినప్పుడు సీసీబీ ఇన్స్పెక్టర్ హజారీష్ ఖలీందర్ నేతృత్వంలో ఓ ప్రత్యేక బృందం ఏర్పాటైంది. వీళ్ల గాలింపు కొనసాగుతుండగానే మరో పది చోరీలు చేసేశాడు. ఆఖరుగా గత నెల్లో పంజా విసిరాడు. వేట ముమ్మరం చేసిన హజారీష్ నేతృత్వంలోని బృందం మంగళవారం మేడ్చల్‌లో ప్రకాష్‌ను పట్టుకుని తీసుకువెళ్లింది. బెయిల్‌పై వచ్చి పరారయ్యాడు ఇతడిపై హైదరాబాద్‌లోనూ కేసులు ఉండటంతో గతేడాది అరెస్టయ్యాడు. మేము వెళ్లేలోపే బెయిల్‌పై వచ్చి పరారయ్యాడు. చోరీ చేయడానికి వెళ్లేప్పుడు తన వెంట సెల్‌ఫోన్ తీసుకెళ్లడు. కారునూ దూరంగా పార్క్ చేసి వస్తాడు. మేడ్చల్‌లో శాశ్వత షెల్టర్ ఉన్నప్పటికీ.. ప్రతి ఆరు నెలలకోసారి కొన్ని రోజులు మరోచోట తలదాచుకుంటాడు. వాహనాన్నీ మార్చేస్తూ పోలీసు నిఘా నుంచి తప్పించుకుంటాడు. ఈ కారణంగానే అతడి కోసం ఏడాది గాలించాల్సి వచి్చంది – ‘సాక్షి’తో సీసీబీ ఇన్స్పెక్టర్ హజారీష్ ఖలీందర్ -
ఇదో రకం చీటింగ్: కొనక ముందు పుత్తడి.. కొన్నాక ఇత్తడి
సాక్షి, సిటీబ్యూరో: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన ముగ్గురితో ఏర్పడిన అంతరాష్ట్ర ముఠా ఇత్తడిని పుత్తడిగా నమ్మించి అంటగట్టడం మొదలెట్టింది. ట్రావెల్ ఏజెంట్లు, వ్యాపారుల విజిటింగ్ కార్డ్స్ ఆధారంగా వాళ్లకు ఫోన్లు చేసి ఎర వేస్తోంది. పాతబస్తీకి చెందిన ఓ ట్రావెల్ ఏజెంట్ నుంచి రూ.17 లక్షలు కాజేసింది. ఈ ముఠా కోసం రంగంలోకి దిగిన చాంద్రాయణగుట్ట పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. వీరి నుంచి రూ.15 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. హోటళ్లు, రెస్టారెంట్లు, ట్రావెల్ ఏజెంట్స్‌తో పరిచయం...తరువాత ► కర్ణాటక, ఏపీలోని సరిహద్దు ప్రాంతాలకు చెందిన శివయ్య (డ్రైవర్), తిరుపతయ్య (రైతు), బి.ఇంద్రాజు (డ్రైవర్) ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఈ ముగ్గురూ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటారు. ప్రధానంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ట్రావెల్ ఏజెంట్స్‌తో పరిచయం ఏర్పరుచుకుని వారి నుంచి విజిటింగ్ కార్డ్స్ తీసుకుంటారు. ఆపై వారికి ఫోన్లు చేసి తమకు దొరికిన బంగారం తక్కువ ధరకు విక్రయిస్తామంటూ ఎర వేస్తారు. ► చాంద్రాయణగుట్ట పరిధిలోని రాజీవ్ గాంధీనగర్‌కు చెందిన విజయ్‌కుమార్ కేఎల్ఏ లాజిస్టిక్స్ అండ్ బస్ టిక్కెట్స్ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నాడు. గత నెలలో ఈయన వద్దకు వచ్చిన ఈ త్రయం విమాన టిక్కెట్ బుక్ చేసుకున్నారు. ఆ తర్వాతి రోజు మరోసారి వచ్చి ఆ టిక్కెట్ కేన్సిల్ చేసుకున్నారు. అలా ఆయనతో పరిచయం పెంచుకుని విజిటింగ్ కార్డు తీసుకున్నారు. గత నెల 9న విజయ్‌కుమార్‌కు కాల్ చేసిన ఈ ముఠా సభ్యులు తమకు బంగారం దొరికిందన్నారు. ► మైసూర్ ప్రాంతంలో ఉన్న తమ పొలంలో తవ్వకాలు జరుపుతుండగా బంగారు ఆభరణాలతో కూడిన లంకె బిందెలు దొరికాయని, ఆ పసిడిని కేజీ రూ.17 లక్షలకు విక్రయించడానికి సిద్ధంగా ఉన్నామంటూ పేర్కొన్నారు. కావాలంటే మచ్చుకు కొంత ఇస్తామన్నారు.. ఇది జరిగిన నాలుగు రోజులకు బండ్లగూడ ప్రాంతంలో విజయకుమార్‌ను కలిసిన వాళ్లు ఇత్తడితో చేసి, పుత్తడి కోటింగ్ వేసిన ఆభరణం చూపించి నమ్మించారు. పథకం ప్రకారం ముందుగా వాటిలో ఉంచిన అసలు బంగారం ముక్కల్ని తీసి ఇచ్చారు. ► వీటిని బంగారం దుకాణానికి తీసుకువెళ్లిన విజయ్‌కుమార్ పరీక్ష చేయించారు. ఆ సందర్భంలో ఇది నిజమైన బంగారమే అని తేలడంతో ఆయన పూర్తిగా నమ్మారు. ఆపై రూ.17 లక్షలు ఆ ముగ్గురికీ చెల్లించి కేజీ ‘బంగారం’ ఖరీదు చేశారు. ► పది రోజుల తర్వాత కొత్తగా ఆభరణాలు చేయించుకోవడానికి వీటిని తీసుకుని బంగారం దుకాణానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో అది పుత్తడి కాదని, ఇత్తడని తేలడంతో తాను మోసపోయానని బాధితుడు గుర్తించాడు. ► దీంతో ఆయన చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కేఎన్ ప్రసాద్ వర్మ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగి ముగ్గురు నిందితులను గుర్తించి వారి నుంచి రూ.15 లక్షలు రికవరీ చేశారు. ( చదవండి: శ్వేతను బతికించండి ) -
40కి పైగా చోరీలు
అమీర్‌పేట: ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడుతున్న పేరుమోసిన అంతర్రాష్ట్ర దొంగ విజయ్ కాంబ్లేను ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. చోరీలు చేసి ఏడుసార్లు జైలుకు వెళ్లి వచ్చినా పద్ధ తి మార్చుకోకుండా మళ్లీ మళ్లీ చోరీలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న అతడిని క్రైం పోలీసులు పట్టుకున్నారు. సోమవారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పశ్చిమ మండలం డీసీపీ ఎ.ఆర్.శ్రీనివాస్ వివరాలను వెళ్లడించారు. కర్నాటక రాష్ట్రం బీదర్ జిల్లా, ఔరాద్ తాలూక, శాంతాపూర్‌కు చెందిన 36 ఏళ్ల విజయ్ కాంబ్లే అలియాస్ లక్ష్మణ్ సోంబా కాంబ్లే మహా రాష్ట్రలోని లాతూర్‌లోని నాందేడ్ రోడ్ గణేష్‌నగర్‌లో ఉంటూ హెయిర్ కటింగ్ షాపు నిర్వహించేవాడు. ఈజీ మనీకి అలవాటుపడ్డాడు. ఉదయం పూట ఆయా ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రి పూట పక్కా ప్రణాళికతో తాళాలు పగులగొట్టి ఇళ్లలోకి చొరబడతాడు. బీరువాల్లోంచి బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు చోరీ చేసేవాడు. మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 40కి పైగా చోరీలు చేసి కిలోల కొద్దీ ఆభరణాలు ఎత్తుకుపోయాడు. వివిధ పోలీస్స్టేషన్లలో నమోదైన కేసుల ఆధారంగా ఏడుసార్లు జైలుకు పంపారు. జైలు నుంచి వచ్చి మళ్లీ చోరీలు కొనసాగిస్తున్నాడు. ఎస్ఆర్నగర్, జగిత్యాల్, కోరుట్ల, భైంసా, గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో 8 చోరీలకు పాల్పడి రూ.40 లక్షలు విలువచేసే బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. భైంసాలో టీఆర్ఎస్ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి ఇంట్లో చోరీ చేసిన కాంబ్లే 60 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు విజయ కాంబ్లేపై పీడీ యాక్ట్ చట్టం కింద కేసు నమోదు చేసి విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఆర్నగర్ క్రైం డీఐ వై.అజయ్‌కుమార్, ఇతర సిబ్బంది నిఘాపెట్టి పట్టుకున్నారు. ప్రస్తుతం విజయ్ కాంబ్లేను పీడీ యాక్ట్ కింద రిమాండ్‌కు తరలించారు. ఆయా ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన ఘటనల నేపథ్యంలో పీటీ వారెంట్ల ఆధారంగా నింధితుడి వద్ద నుంచి సొత్తు రికవరీ కోసం ఆయా పోలీస్స్టేషన్లకు అప్పగించే వీలుందని డీసీపీ తెలిపారు. సమావేశంలో పంజగుట్ట ఏసీపీ తిరుపతన్న, ఇన్స్పెక్టర్లు మురళీకృష్ణ, వై.అజయ్‌కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. -
చేయిపడితే షెట్టర్ లేవాల్సిందే..!
అతడి చేయిపడితే ఎలాంటి షాపు షెట్టర్ అయినా పైకి లేవాల్సిందే. తను చోరీ చేయాలనుకున్న షాపును పగలు చూసి రాత్రి అక్కడికి చేరుకుంటాడు. చిన్న రాడ్డు సాయంతో అవలీలగా షాపు షెట్టర్‌ను పైకి ఎత్తి షాపులో ఉన్న సొమ్ముతో ఉడాయిస్తాడు. దాదాపు 20 ఏళ్ల వయసులోనే 22 చోరీలు చేశాడంటే అతడు చోర కళలో ఎంత నైపుణ్యం సంపాదించాడో అర్థం చేసుకోవచ్చు. బనగానపల్లె: అంతర్ జిల్లా దొంగ, కర్నూలులోని స్వామిరెడ్డి నగర్‌కు చెందిన ఈడిగ శివశంకర్గౌడ్ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ రాకేష్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. మూడు రోజులుగా పట్టణంలోని హిందుస్థాన్ హోటల్ పక్కభాగంలోని పాన్బీడాల దుకాణం, ప్రభుత్వాస్పత్రి ఎదురుగా ఉన్న వెంకటేశ్వర మెడికల్ షాపు, చంద్ర టీ స్టాల్ సమీపంలోని దుకాణంలో షెట్టర్లకు ఉన్న తాళాలను తొలగించి అందులో రూ.20 వేల నగదు చోరీకి గురైంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యనకండ్ల సమీపంలో మంగళవారం సాయంత్రం ఎస్ఐ రాకేష్, సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా బేతంచర్ల నుంచి ఆటోలో వస్తున్న శివశంకర్‌గౌడ్ అనుమానాస్పదంగా వ్యవహరించడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. పట్టణంలో జరిగిన చోరీలను తానే చేసినట్లు దొంగ అంగీకరించాడు. ఈసందర్భంగా అతడి నుంచి రూ.20 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. దొంగను పట్టుకోవడంలో నైపుణ్యం ప్రదర్శించిన సిబ్బంది సూర్యనారాయణ, సుబ్బరాయుడు, నాగేంద్రగౌడ్, వీర రామరాజులకు సీఐ ప్రోత్సాహక నగదు అందజేశారు. రివార్డుల కోసం జిల్లా ఎస్పీ ప్రతిపాదనలు పంపుతామని సీఐ పేర్కొన్నారు. -
అంతర్ జిల్లాల దొంగ అరెస్టు
కోడూరు (అవనిగడ్డ) : పగటిపూట అంతర్ జిల్లాల్లో చోరీలకు పాల్పడే దొంగను కోడూరు పోలీసులు శుక్రవారం చాకచక్యంగా పట్టుకున్నారు. వివరాలను అవనిగడ్డ డీఎస్పీ డి.పోతురాజు స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరులకు వెల్లడించారు. మచిలీపట్నం మండలం ముస్తాన్ఖాన్పేటకు చెందిన పంపన సాయి రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో వరస చోరీలకు పాల్పడ్డాడు. తన అనుచరులైన దేవునితోటకు చెందిన పొన్నూరు అంజయ్య, గుంటూరు జిల్లా పిరాట్లంకకు చెందిన మొచ్చా చినఅంకుడుతో కలిసి తణుకు, పాలకొల్లు, కూచిపూడి, రేపల్లె, అవనిగడ్డ, పామర్రు, కంకిపాడు, హంసలదీవి తదితర ప్రాంతాల్లో పగటిపూట చోరీలు చేశాడు. ఆయా ప్రాంతాల్లో నిందితుడు రూ.12 లక్షల విలువ చేసే 400 గ్రాముల బంగారంతో పాటు రూ.లక్షల విలువ చేసే 2.6 కేజీల వెండిని అపహరించాడు. దొంగతనం చేసిన పలు అభరణాలను జ్యూయలరీ షాపుల్లో విక్రయించడంతో పాటు మరికొన్ని ఆభరణాలను కొందరి వద్ద తాకట్టు పెట్టాడు. హంసలదీవిలో పగటిపూట జరిగిన చోరీని దర్యాప్తు చేస్తున్న సమయంలో సాయిపై అనుమానంతో ముందుకు సాగగా ఈ వివరాలు బయటపడినట్లు డీఎస్పీ చెప్పారు. గతంలో కూడా అనేక చోరీలు.. నిందితుడు సాయి గతంలో కూడా అనేక ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు డీఎస్పీ తెలిపారు. బందరు, చల్లపల్లి, కైకలూరు, విజయవాడ ప్రాంతాల్లో జరిగిన చోరీల్లో సాయిపై కేసు రుజువు కావడంతో రాజమండ్రిలోని సెంట్రల్ జైలులో శిక్ష కూడా అనుభవించినట్లు తెలిపారు. గతంలో నిందితుడిపై చల్లపల్లి స్టేషన్లో డీసీ షీట్ కూడా తెరిచినట్లు వెల్లడించారు. ఇటీవల సాయి కోడూరుకు చెందిన ఓ మహిళను వివాహం చేసుకొని ఇక్కడే నివాసముంటున్నాడని, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. నిందితుడు దొంగిలించిన రూ.13 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను రికవరీ చేసినట్లు తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంతో పాటు ఆభరణాల రికవరీకి కోడూరు ఎస్ఐ ప్రియకుమార్ తన సిబ్బందితో ఎంతో శ్రమించారన్నారు. ఎస్ఐతో పాటు సిబ్బంది శ్రీమన్నారాయణ, సుబ్బారావు, వేణుగోపాల్, శివాజి, గంగరాజు, కిరణ్‌లను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ట్రైనీ డీఎస్పీ రాజ్‌కమల్ పాల్గొన్నారు. -
అంతరాష్ట్ర దొంగ అరెస్ట్: రూ.17 లక్షల సొత్తు స్వాధీనం
సాక్షి, తిరుమల: తిరుమలలో అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్టు చేశారు. మందలపు రాజు అలియాస్ శివ పోలీసులకు పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి 10 లాప్‌టాప్‌లు, 400 గ్రాముల బంగారు ఆభరణాలు, 500 గ్రాముల వెండి, రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం సొత్తు విలువ రూ.17 లక్షల 50 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. -
అంతరాష్ట్ర దొంగ అరెస్టు
గుత్తి: అనంతపురం, కర్నూల్ , కడప జిల్లాల పోలీసులను ముప్పతిప్పలు పెడుతూ ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అగ్రహారం రంగస్వామి అనే అంతరాష్ట్ర దొంగను ఎట్టకేలకు గుత్తి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 23 తులాల బంగారు ఆభరణాలు, 40 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని సీఐ కార్యాలయంలో సీఐ ప్రభాకర్ గౌడ్ విలేఖరుల సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు. కర్నూల్ జిల్లా తుగ్గలి మండలం రాంపల్లి గ్రామానికి చెందిన అగ్రహారం రంగస్వామి అనే 23 సంవత్సరాల యువకుడు గత రెండు, మూడు సంవత్సరాలుగా చోరీలకు పాల్పడుతున్నాడు. అనంతపురం, కర్నూల్, కడప జిల్లాల పరిధిలో పలు చోట్ల తాళాలు వేసిన ఇళ్లలోకి ప్రవేశించి దొంగతనాలకు పాల్పడుతుండేవాడు. గుత్తి మున్సిపాలిటీతో పాటు బాచుపల్లి, ధర్మాపురం గ్రామాల్లో కూడా చోరీలకు పాల్పడ్డాడు. మూడు జిల్లాల పోలీసులు ఆ దొంగను పట్టుకోవడానికి శత విధాల ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ఈ క్రమంలో సదరు దొంగ గుత్తిలోని గుంతకల్లు రోడ్డులో ఉన్నట్లు సీఐకు సమాచారం వచ్చింది. దీంతో ఆయన వెంటనే సిబ్బందిని వెంట బెట్టుకుని దొంగను పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయితే పోలీసుల రాకను పసిగట్టిన దొంగ పరుగు తీశాడు. ఎస్ఐ చాంద్‌బాషా, కానిస్టేబుళ్లు రవి, మోహన్, ఆదిలు సుమారు కిలో మీటరు వెంట పడి దొంగను పట్టుకున్నారు. అనంతరం అరెస్టు చేసి అతని వద్ద ఉన్న బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దొంగను కోర్టులో హాజరు పరిచారు. జడ్జి రిమాండ్‌కు ఆదేశించారు. దొంగను పట్టుకోవడంలో ధైర్యసాహసాలు చూపిన ఎస్ఐ, కానిస్టేబుళ్లను సీఐ అభినందించి నగదు బహుమతులు అందజేశారు. -
ప్రియురాలి కోసం దొంగ అవతారం
- ఎట్టకేలకు పట్టుబడిన అంతర్రాష్ట్ర దొంగ - 51 బైక్‌లు స్వాధీనం - నిందితుడు గోరంట్ల మండల వాసి ఎంతటి వాడైనా కాంతదాసుడే అంటారు. నిజమే. ప్రేమించిన అమ్మాయి కోర్కెలు తీర్చేందుకు ఓ యువకుడు దొంగ అవతారం ఎత్తాడు. అతని కాలంలోనే అంతర్రాష్ట్ర దొంగగా ఎదిగిపోయాడు. చివరకు పోలీసుల వలకు చిక్కి కటకటాలు లెక్కిస్తున్నాడు. చేజేతులా భవిష్యత్తును నాశనం చేసుకున్నాడు. బెంగళూరు : అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పెట్లకుంటపల్లికి చెందిన మనోహర్ అలియాస్ మను అనే అంతర్రాష్ట్ర దొంగను బెంగళూరు పోలీసులు ఎట్టకేలకు వలపన్ని అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. అతని నుంచి 51 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు పోలీస్ అదనపు కమిషనర్ హేమంత్ నింబాళ్కర్ నిందితుడ్ని మీడియా ముందు శనివారం హాజరుపరిచారు. వాటి వివరాలను వివరించారు. పరిచయం.. ప్రేమ.. సహజీవనం... బెంగళూరులోని హొంగసంద్ర నాయుడు లేఔట్‌కు చెందిన మనోహర్ బొమ్మనహళ్లిలోని ఓ గార్మెంట్స్‌లో టైలర్‌గా పని చేసేవాడు. గోరంట్ల ప్రాంతానికి చెందిన ఓ యువతి కూడా అక్కడే మరో గార్మెంట్స్‌లో పని చేసేది. ఇద్దరిదీ ఒకే ప్రాంతం కావడంతో పరిచయం ప్రేమకు దారితీసింది. ఈ నేపథ్యంలో అనారోగ్యం కారణంగా సదరు యువతి సొంత ఊరికి వెళ్లిపోయింది. తిరిగి బెంగళూరు రావాలని ఆమెను మనోహర్ తరచూ ఫోన్లో కోరేవాడు. అద్దె ఇంటిని తీసుకుంటే వస్తానంటూ ఆమె షరతు పెట్టింది. చివరకు ఆమె చెప్పినట్లే హొంగసంద్రలో ఓ అద్దె గదిని తీసుకుని ప్రియురాలితో సహజీవనం చేయసాగాడు. అదే సమయంలో వచ్చే జీతంతో సంసారం సాగించడం కష్టమని భావించిన మనోహర్ మరోసారి దొంగ అవతారం ఎత్తాడు. కన్నుపడితే మాయం చేసేవాడు బైక్‌ల అపహరణలో ఆరితేరిన మనోహర్ బెంగళూరు రాకముందు హిందూపురం, కదిరి ప్రాంతాల్లో బైక్‌లు చోరీ చేసేవాడు. అతనిపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. మడివాళ, బేగూరు, బొమ్మనహళ్లి, మధుగిరి, కొరటెగెరె, మిడగేసి, బాగేపల్లి, గుడిబండ తదితర ప్రాంతాల్లో బైక్‌లను చోరీ చేసిన కేసులు నమోదై ఉన్నాయి. కన్నుపడితే చాలు క్షణాల్లోఆ బైక్‌ను అపహరించడం మనోహర్‌కు వెన్నతో పెట్టిన విద్య. అయితే అతను పోలీసులకు చిక్కకుండా చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు. దీంతో పోలీసులకు సవాల్‌గా మారాడు. పోలీసుల వలకు చిక్కిందిలా.. కదిరి, గుడిబండ గ్యాంగ్‌ల కోసం గాలింపు చర్యలు చేపట్టిన బెంగళూరు పోలీసులు.. పాత బైక్‌లు కొంటామంటూ ప్రకటన ఇచ్చారు. దీంతో పోలీసులు ఇచ్చిన ఫోన్ నెంబర్‌కు మనోహర్ పలుమార్లు ఫోన్లు చేసి సంప్రదించాడు. బొమ్మనహళ్లి పోలీసులు మారువేషంలో బైక్‌ల కొనుగోలు నెపంతో నాయుడు లేఔట్‌కు శనివారం వెళ్లి మనోహర్‌ను పట్టుకున్నారు. అతని వద్దనున్న 51 బైక్‌లను చూసి విస్తుపోయారు. వాటి విలువ సుమారు రూ.25 లక్షలు ఉంటుందని అంచనా. మనోహర్‌ను వెంటనే అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారణ చేపట్టగా.. ప్రియురాలి కోసమే బైక్‌ల చోరీకి పాల్పడుతున్నట్లు అంగీకరించాడు. అయితే దొంగతనాలు చేసి ప్రియుడు తనను పోషిస్తున్నట్లు ఆ అమాయకురాలికి తెలియదు. డీసీపీ బోరలింగయ్య, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగ దొరికాడు!
అనంతపురం సెంట్రల్ : ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతన్న అంతర్ రాష్ట్ర దొంగ ఎట్టకేలకు పోలీసుల వలకు చిక్కాడు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు రూరల్ ఆల్పనహళ్లికి చెందిన రియాజ్ అనే దొంగను శనివారం అరెస్టు చేసినట్లు అనంతపురం డీఎస్పీ మల్లికార్జునవర్మ, సీఐ రాఘవన్ విలేకరులకు తెలిపారు. అనంతపురం వేణుగోపాల్‌నగర్‌లో జయచంద్రాచారి అనే వ్యక్తి ఇంట్లో గత ఫిబ్రవరి 21న చోరీ జరిగిందన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా.. చోరీ చేసింది పైన పేర్కొన్న రియాజ్‌గా తేలిందన్నారు. అతని నుంచి 30 తులాల బంగారు, రెండు కిలోల వెండి ఆభరణాలతో పాటు ఒక టీవీనీ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. వాటి విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని చెప్పారు. ఇదే కేసులో మరో నిందితుడు నల్లబోతుల నాగప్ప పరారీలో ఉన్నాడన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
సాక్షి, బళ్లారి : మహిళల మెడలలో చాకచక్యంగా బంగారు గొలుసులను అపహరిస్తున్న అంతరాష్ట్ర దొంగను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ ఆర్.చేతన్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన బళ్లారి నగరంలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.బళ్లారి నగరంలో గత రెండు సంవత్సరాలుగా మహిళల మెడలలో బంగారు గొలుసులను దొంగలిస్తూ నగర వాసులను భయాందోళనలకు గురి చేసిన దొంగను అరెస్ట్ చేసేందుకు బళ్లారి గ్రామీణ డీఎస్పీ సురేష్, సీఐ ప్రసాద్ గోఖలేలు బృందంగా ఏర్పడి గాలింపు చేపట్టారన్నారు. ఈ క్రమంలోఅనంతపురం జిల్లా గంతకల్లు పట్టణంలోని బీరప్ప గుడి సమీపంలో నివాసం ఉంటున్న షేక్ జాఫర్ అలియాస్ యూసఫ్ అలియాస్ గిడ్డు అనే వ్యక్తి బళ్లారిలో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా చోరీ చేసినట్లు అంగీకరించాడన్నారు. దీంతో అతన్ని అరెస్ట్ చేసి రూ.6 లక్షల విలువైన 185 గ్రాముల బంగారు ఆభరణాలు, డిస్కవరీ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారన్నారు. సమావేశంలో ఏఎస్పీ విజయ డంబళ్, డీఎస్పీ సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
గుంతకల్లు టౌన్: తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడే కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన అంతర్రాష్ట్ర దొంగ సురేష్ గౌడ్‌ను ఎట్టకేలకు ఒన్‌టౌన్ పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.2.70 లక్షలు విలువచేసే 13.5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. రూరల్ సీఐ గురునాథ బాబు, ఒన్‌టౌన్ ఎస్సై నగేష్‌బాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉదయం రైల్వే క్యాంటీన్ సమీపంలో నిందితుడు అనుమానాస్సదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. ఎనిమిది నెలల కిందట హంపయ్య కాలనీ, రెండు నెలల కిందట హనుమేష్‌నగర్‌లో తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడినట్లు నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు వారు తెలిపారు. దొంగను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై నగేష్, కానిస్టేబుల్ రామాంజనేయులు, నారాయణమూర్తిలను సీఐ అభినందించారు.