Jayaprakasnarayana
-
సమగ్ర ఆరోగ్య విధానం అమలు చేయాలి
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: రాష్ట్రంలో సమగ్ర ఆరోగ్య విధానం అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ డిమాండ్ చేశారు. పైసా ఖర్చు లేకుండా ప్రజలందరికీ వైద్యం అందించడం ప్రభుత్వాల బాధ్యత అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ లోక్‌సత్తా పార్టీ ఆధ్వర్యంలో ‘అందరికి వైద్యం హక్కుగా వైద్య సేవలు’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జేపీ మాట్లాడుతూ.... ప్రాధమిక దశలో ఫ్యామిలీ ఫిజీషియన్ వ్యవస్థాను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భవ వంటి పథకాలను ద్వితీయ, తృతీయ స్థాయిల్లో అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో రూ.1900 కోట్లు అదనంగా కేటాయిస్తే బాగుంటుందన్నారు. ప్రస్తుతం అందుతున్న వైద్య సేవలు బాగానే ఉన్నా అవి ఎంతమాత్రం సరిపోవని, వైద్య సేవలు మరింతగా మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం అందుతున్న వైద్య సదుపాయాలన్నీ విడిగా ఉన్నాయని వాటన్నింటినీ అనుసంధానం చేసి సమగ్ర ఆరోగ్య విధానం అమలు చేయాలన్నారు. స్వాతంత్య్రం అనంతరం నుంచి ఇప్పటివరకు ప్రజారోగ్యం పట్ల పాలకులు పెద్దగా శ్రద్ధగా చూపలేదని ఇప్పటికీ అయినా సమయం మించిపోలేదు. ఆరోగ్య వ్యవస్థ పట్ల దృష్టిని సారించాలని కోరారు. తెలంగాణ లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మనపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ ఆకుల నరేష్‌బాబు, డాక్టర్ చింతల రాజేందర్, వర్కింగ్ ప్రసిడెంట్ సత్యప్రకాష్, కటారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మాట తప్పటం సరికాదు: జేపీ
హైదరాబాద్: దేవుడి పెళ్లికి అందరం పెద్దలమేనని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ్ వ్యాఖ్యానించారు. విభజన హామీల అమలు కోసం ఓ వేదిక ఏర్పాటు చేయాలనే ఆలోచన చేసిన జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను అభినందిస్తున్నట్లు చెప్పారు. గురువారం హైదరాబాద్ బేగంపేటలోని లోక్‌సత్తా కార్యాలయంలో జేపీతో సుమారు గంటపాటు పవన్‌కల్యాణ్ సమావేశం అయ్యారు. అనంతరం జేపీ విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీరు ఏరుదాటాక తెప్ప తగలేసిన మాదిరిగా ఉందని విమర్శించారు. విభజన హామీలను చట్టంలో చేర్చాక, పార్లమెంట్లో లోతైన చర్చ జరిగాక కూడా ఇలా వ్యవహరించటం చాలా ప్రమాదకరమైన పరిణామమని చెప్పారు. దీనివల్ల ప్రభుత్వాలు, పార్టీలు, పార్లమెంట్‌పై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుందని హెచ్చరించారు. దేశ ప్రధాని, హోంశాఖ మంత్రి పార్లమెంట్ సాక్షిగా రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు చట్టంలో లేవని, తమ ఇష్టం అనడం ధర్మం కాదన్నారు.విభజన హామీల అమలుకు సంబంధించి ఏం చేస్తే కేంద్రంలో కదలిక వస్తుందనే అంశాలపై జేపీతో చర్చించినట్లు పవన్‌కల్యాణ్ చెప్పారు. -
పన్నుల రేట్లు తగ్గే సంస్కరణలు తేవాలి
జయప్రకాష్‌నారాయణ డిమాండ్ సాక్షి, అమరావతి: చలామణీలో ఉన్న పెద్ద నోట్లను తక్షణం రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న చర్య నల్లధనాన్ని, నకిలీ నోట్లను నిరోధించడంలో ముందడుగే కానీ, మళ్లీ అవినీతి జరగకుండా చేస్తూ ప్రజలకు సమర్థ పాలన అందించడానికి మాత్రం సరిపోదని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్‌నారాయణ ఒక ప్రకటన ద్వారా అభిప్రాయపడ్డారు. పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ రాజకీయ గిమ్మిక్కుగా మిగిలిపోకూడదంటే.. ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళన, పన్నుల తగ్గింపుతోపాటు ప్రజల పన్నుల డబ్బును నేతల విలాసాలకు, ఉద్యోగుల జీత భత్యాలు భారీ పెంపునకు కాకుండా ప్రజల సేవలకు సద్వినియోగం చేసే సంస్కరణలను చేపట్టాలని సూచించారు. పన్ను రేటు తగ్గింపునకు చర్యలు చేపట్టాలని సూచించారు. అమరావతిలో ఉండే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయాన్ని రూ.10 కోట్లతో వృధాగా అలకరించడం, ప్రత్యేక విమానాల్లో ప్రయాణించడం వంటి వాటి కోసమా ప్రజలు పన్నులు చెల్లించేది అని ప్రశ్నించారు.