Korumutla srinivasulu
-
అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో సామాజిక సాధికార యాత్ర
-
అన్ని వర్గాల అభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారు: ఎమ్మెల్యే కొరుముట్ల
-
వయస్సు తక్కువ అనుభవం ఎక్కువ అనేదానికి నిదర్శనం బద్వేల్ తీర్పు
-
ఏపీ చరిత్రలో నేడు కొత్త శకానికి నాంది
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరు అద్భుతమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కొనియాడారు. ఇచ్చిన ప్రతిమాటను సీఎం నిలబెట్టుకుంటున్నారని చెప్పారు. మాజీ సీఎం చంద్రబాబు గ్రాఫిక్స్‌తోనే అంతా అయిపోయినట్లుగా చూపించారని విమర్శించారు. ఆయన హయంలో 108 వాహనాలు మూలన పడ్డాయని దుయ్యబట్టారు. (సీఎం జగన్ కృషి.. సుదీర్ఘ స్వప్నం సాకారం) అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 108, 104 వాహనాలను తీసుకురావాలనే గొప్ప ఆలోచన సీఎం జగన్‌దేనని చెప్పారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు ఇకనైనా హుందాగా వ్యవహరించాలని సూచించారు. ‘ఏపీ చరిత్రలో నేడు కొత్త శకానికి నాంది పలికిన రోజు. ఏపీ ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే మా లక్ష్యం. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మాది చేతల ప్రభుత్వమని నిరూపిస్తున్నాం’ అని ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు సీఎం వైఎస్ జగన్ పాలనను ప్రశంసించారు. (1.15 లక్షల మందికి కొత్తగా పెన్షన్) ‘పేద ప్రాణాలను కాపాడేందుకు దివంగతనేత వైఎస్సార్ నాడు 108 అంబులెన్స్‌లను ప్రారంభించారు. ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ నేడు వాటిని అపర సంజీవినిలుగా రూపుదిద్దారు. పేదల ప్రాణాలకు భరోసా కల్పించేలా ఆరోగ్య వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు’ అని ఎమ్మెల్యే జోగిరమేష్ కొనియాడారు. -
అపర సంజీవినిలుగా రూపుదిద్దారు
-
కుప్పంలోనే చర్చ పెడదాం.. బాబూ సిద్ధమా?
సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏడాది పాలన చూసి చంద్రబాబు కళ్లు బైర్లు కమ్మాయని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. జగనన్న పాలనలో మంచి వర్షాలు పడి రాష్ట్రం సుభిక్షంగా, రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. కానీ బాబు తమ పాలనే గొప్పగా ఉన్నట్లు చెప్పుకోవడం సిగ్గు చేటని విమర్శించారు. చంద్రబాబు, టీడీపీ నేతలు పంచభూతాలను దోచుకున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ కార్యక్రమాల అమలుపై కుప్పంలో చంద్రబాబుతో చర్చకు తాను సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. బహిరంగ చర్చను కుప్పం నియోజకవర్గం నుంచే మొదలు పెడదామని తెలిపారు. ఎవరిది విధ్వంసపాలనో, ఎవరిది సంక్షేమపాలనో కూడా తెలుసుకుందామని, తానే స్వయంగా కుప్పం వస్తానని చంద్రబాబు కూడా రావాలని గడికోట సవాల్ చేశారు. బాబు రాలేకుంటే లోకేష్‌ను బహిరంగ చర్చకు పంపాలని సూచించారు. ధైర్యం ఉంటే చంద్రబాబు ఈ సవాలును స్వీకరించాలన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ► సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఏడాదిలో సుమారు నాలుగుకోట్ల మంది ఖాతాల్లో రూ.40 వేల కోట్లుకుపైగా జమ చేసింది. ► కేవలం రూ. వందకోట్లతో ఖజానాను వదిలి వెళ్లినా కూడా ఏడాది కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను సీఎం వైఎస్ జగన్ అమలు చేశారు. ► బాబును ప్రజలు తిరస్కరించినా ఇంకా బుద్ధి రాలేదు. భవిష్యత్తులో టీడీపీ గుర్తింపు కూడా రద్దవుతుంది. ప్రజలు బాబు గుర్తింపునే రద్దు చేస్తారు. బాలకృష్ణ మానసిక స్థితిపై అనుమానాలు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మానసిక పరిస్థితిపై అనుమానాలున్నాయని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్నట్లు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు వెల్లడించారు. బాలకృష్ణ వాస్తవాలు తెలుసుకోకుండా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని, ఆయన మానసిక పరిస్థితి బాగోలేదని గతంలోనే డాక్టర్లు చెప్పారన్నారు. ఆయన ఎమ్మెల్యేగా అనర్హుడన్నారు. -
బాలకృష్ణ మానసిక స్థితి సరిగా లేదు
-
బాలకృష్ణ వాస్తవాలు తెలుసుకోవాలి..
సాక్షి, తాడేపల్లి: టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తీరుపై ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. బాలకృష్ణ వాస్తవాలు తెలుసుకోకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృష్ణ మానసిక పరిస్థితి బాగోలేదని గతంలో డాక్టర్లు చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఆయన మానసిక పరిస్థితిపై అనుమానాలు ఉన్నాయని, దీనిపై ప్రభుత్వానికి లేఖ రాస్తున్నానని తెలిపారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ..‘బాలకృష్ణ ఎమ్మెల్యేగా అనర్హుడు. ఆయన వ్యవహార శైలితో హిందూపురం ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్టీఆర్ కుమారుడిగా బాలకృష్ణపై అందరికీ అభిమానం ఉంది. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును బాలకృష్ణ భుజాన మోస్తున్నారు. చంద్రబాబు చచ్చిన పాము వంటివాడు. ఏడాదిలోనే దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పేరు తెచ్చుకున్నారు. తొలి ఏడాదిలోనే అద్భుతాలు సృష్టించిన ముఖ్యమంత్రి రానున్న నాలుగేళ్లలో ఇంకా ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తారో టీడీపీ నేతలు గ్రహించాలి. చంద్రబాబు జూమ్ బాబుగా మారిపోయాడు’అని కోరుముట్ల శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. (చదవండి: బాలకృష్ణలో ఆ బాధ కనిపిస్తోంది : ఇక్బాల్) -
విద్వేషాలు రగిల్చే దుష్ట ఆలోచన
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచనలు విద్వేషాలు రగిల్చే విధంగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, విప్ కొరుముట్ల శ్రీనివాసులు ధ్వజమెత్తారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా అదుపు కాకూడదు, విశాఖపట్నంలో గ్యాస్ లీకేజీ సమస్య మరింత పెద్దది కావాలని చంద్రబాబు దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారని దుయ్యబట్టారు. అందు కోసమే హైదరాబాద్‌లో కూర్చుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని, టైంపాస్‌కు లేఖలు రాస్తున్నారని విమర్శించారు. దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో కరోనా నిర్థారణ పరీక్షలు చేస్తూ కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తూ ముఖ్యమంత్రిగా జగన్ మంచి పేరు తెచ్చుకుంటుంటే చంద్రబాబు మాత్రం ఆయనపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. వారు ఇంకా ఏమన్నారంటే... ► కరోనా వల్ల లక్షల మంది చనిపోతే తనకు బాగా పని పెరుగుతుందనే దురాలోచనతో చంద్రబాబు ఉన్నట్లున్నారు. అధికారంలో ఉన్నపుడు ఎవరికీ మంచి చేయని వ్యక్తి ఇపుడు మాత్రం ఉద్యోగులు, పెన్షనర్ల శ్రేయస్సు కోసమంటూ టైంపాస్ లేఖలు రాస్తున్నారు. ► విశాఖపట్టణంలో గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో సీఎం జగన్ స్పందించిన తీరును అందరూ అభినందిస్తుంటే చంద్రబాబు మాత్రం అర్థంలేని విమర్శలు చేస్తున్నారు. సమస్య పరిష్కారం కాకూడదు, ఇంకా సమస్యలు సృష్టించాలి, విద్వేషాలు రగిల్చాలి అనే ఉద్దేశంతోనే చంద్రబాబు టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. ► పది నిమిషాల వీడియో ఫిల్ము, పబ్లిసిటీ పిచ్చి కోసం 29 మందిని గోదావరి పుష్కరాలప్పుడు తొక్కి చంపావు. అపుడు నువ్వు ఏంచేశావో మరిచావా? అదే విశాఖలో జగన్ సానుభూతితో సమస్యను పరిష్కరిస్తే దుర్మార్గంగా మాట్లాడతావా? ► ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛను, రెండోది ఉంటే తొలగింపేనని ఈనాడులో ప్రధానంగా వార్త రాశారు. ఎందుకింత దుర్మార్గంగా వార్తలు రాస్తారు. పత్రికా విలువలంటే ఇవేనా? ఈ జీవో ఏమైనా జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చారా? పత్రికాధిపతులే చిలకజోస్యం, కొంగజపం వంటి చర్చలు పెట్టి బురదచల్లే కార్యక్రమాలు చేస్తుంటే ఇంకా విలువలు ఏముంటాయి? ► వైఎస్ జగన్ సీఎం అయ్యేనాటికి ఖజానాలో రూ 100 కోట్లు మాత్రమే ఉన్నాయని ఆ పత్రికలే రాశాయి. అయినా ఇచ్చిన మాట తప్పకుండా ఆరు నెలల్లో అన్ని హామీలను జగన్ అమలు చేసిన తీరు మీకు కనిపించదా? ► ఏపీ మాదిరిగా అన్ని రాష్ట్రాలూ వ్యవహరిస్తే కరోనాను అదుపు చేయవచ్చని కేంద్ర బృందం ప్రతినిధి మధుమితా దూబే ప్రశంసించారు. అయినా చంద్రబాబు బృందం విమర్శలు చేస్తోంది. -
‘భౌతిక దూరం అంటే బాబు 600 కి.మీ. వెళ్లారు’
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో కరోనా కేసులు పెరగాలన్నదే ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడి ఆలోచన అని ప్రభుత్వచీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. కరోనాపై చంద్రబాబు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోన్నారని ధ్వజమెత్తారు. మంగళవారం తాడేపల్లిలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులతో కలిసి మీడియాతో మాట్లాడారు. కరనా కట్టడికి ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేస్తోందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. కష్టకాలంలో సీఎం జగన్ ప్రజలకు అండగా నిలుస్తున్నారని, దేశంలో ఏ రాష్ట్రంలో జరగనన్ని కరోనా పరీక్షలు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నాయన్నారు. సీఎం జగన్ పనితీరును ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా ప్రశంసిస్తోంటే చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చొని డ్రామాలు ఆడుతున్నారన్నారు. చంద్రబాబుకు ఇంట్లో టైంపాస్ కాక లేఖలు రాస్తున్నారని విమర్శించారు. సమస్యలు పరిష్కరిస్తోంటే చంద్రబాబు బాధపడుతున్నారని, పచ్చమీడియాతో తప్పుడు ప్రచారం చేస్తోన్నారని ఆరోపించారు. (ఈ మూడు ప్రతి నగరవాసికి ఓ అలవాటుగా) ఇక రైల్వే కోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ చంద్రబాబును ప్రజలు ఎప్పుడో తిరస్కరించారన్నారు. భౌతిక దూరం పాటించమంటే చంద్రబాబు 600 కిలోమీటర్ల దూరం వెళ్లారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విశాఖ ఘటనలో గంటల వ్యవధిలోనే ప్రభుత్వ యంత్రాంగం సాధారణ స్థితిని తీసుకువచ్చిందని ప్రశంసించారు. సొంత బంధువులా సీఎం జగన్ బాధిత కుటుంబాలను ఓదార్చారన్నారు. చంద్రబాబు అధికారంలో ఉండి ఉంటే వందకోట్లు పబ్లిసిటి కోసమే ఖర్చు చేసేవారని శ్రీనివాస్ విమర్శించారు. (ఆన్లైన్లో బుకింగ్‌కు సిద్ధం) -
ప్రజల తమవంతుగా ఇళ్లకే పరిమితం కావాలి
-
ఎవరితోనూ సంప్రదింపులు జరపలేదు
-
‘వారు సభ సమయాన్ని వినియోగించుకోలేకపోతున్నారు’
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో టీడీపీ సభ్యులకు కావల్సినంత సమయాన్ని ఇస్తున్నప్పటికీ వారు వినియోగించుకోలేక పోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు విమర్శించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. మండలిలో సంఖ్య బలం ఎక్కువ ఉండటంతో వికేంద్రీకరణ బిల్లుని టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అదేవిధంగా కౌన్సిల్ చైర్మన్ ప్రభుత్వ బిల్లులను సరైనా రీతిలో ప్రవేశపెట్టడం లేదని.. బిల్లుపై చర్చ పెట్టకుండ సాగదీయడం సరికాదన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి అనేది చంద్రబాబుకు అక్కర్లేదా అని సూటిగా ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మౌనంగా ఉంటున్నారని ఆయన తెలిపారు. సీఎం జగన్‌కు రాజధాని రైతుల కృతజ్ఞతలు ఇక ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ.. పెద్దల సభలో చంద్రబాబు పెద్ద తప్పులు చేయిస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు విధానం మారకపోతే చరిత్ర హీనుడుగా మిగిలిపోతాడని ఆయన దుయ్యబట్టారు. అమ్మఒడి పథకం ద్వారా 43 లక్షల తల్లులు ఆనందంగా ఉన్నారని, ప్రతి బిడ్డా చదువుకోవాలనేదే సీఎం జగన్ ఉద్దేశమని ఆయన తెలిపారు. అలాగే ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లా విజయనగరం అని తెలిపారు. విద్యారంగంలో విజయనగరం ముందుకు వెళ్తుందని తాను ఆశిస్తున్నానట్లు పేర్కొన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో కార్మికులకు ఉపాధి కల్పించే ఫ్యాక్టరీలు మూతబడ్డాయని, చంద్రబాబు ప్రభుత్వం విజయనగరం జిల్లాను చిన్న చూపు చూసిందని మండిపడ్డారు. ఈ క్రమంలో జిల్లాకు మెడికల్ కాలేజిని ప్రకటించిన సీఎం జగన్‌కు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. -
వికేంద్రీకరణతో శరవేగంగా రాష్ట్రాభివృద్ధి
రైల్వేకోడూరు: రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుతో రాష్ట్రాభివృద్ధి శరవేగంగా జరుగుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. మూడు రాజధానులకు మద్దతుగా వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరులో ప్రజలు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ విప్ కొరుముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనపై అన్ని వర్గాల ప్రజలు హర్షిస్తున్నారన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు పురోభివృద్ధి సాధిస్తాయని స్పష్టం చేశారు. ర్యాలీ రెండు కిలోమీటర్ల మేర జరిగింది. రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా చేసిన ప్రతిపాదనను స్వాగతిస్తున్నామన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనపై ప్రజలందరూ ముందస్తు సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారన్నారు. విశాఖ ఎందుకు వద్దో చెప్పండి? నెల్లిమర్ల/విజయనగరం పూల్‌బాగ్: రాష్ట్రంలో పాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా ప్రదర్శనలు ఊపందుకుంటున్నాయి. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో వైఎస్సార్సీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంపీ బెల్లాన మాట్లాడుతూ రాజధాని వికేంద్రీకరణతోనే విజయనగరం జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన అనుయాయుల ఆస్తుల విలువ పెంచుకునేందుకే లేనిపోని ఆందోళనలకు దిగుతున్నారని విమర్శించారు. జిల్లాకు చెందిన అశోక్‌గజపతిరాజు కూడా విజయనగరం అభివృద్ధిని విస్మరించి ఇక్కడి ప్రజలకు తీవ్ర అన్యాయం చేయడానికే విశాఖలో రాజధాని వద్దని ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి ఐక్యవేదిక ఆధ్వర్యంలో విజయనగరంలోని కోట జంక్షన్ వద్ద విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. నెల్లిమర్లలో ర్యాలీలో పాల్గొన్న నేతలు,ప్రజలు మూడు రాజధానులకు మద్దతుగా కుప్పంలో భారీ ర్యాలీ కుప్పం: మూడు రాజధానులకు మద్దతుగా ఆదివారం చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ కుప్పం నియోజకవర్గ ఇన్చార్జ్ చంద్రమౌళి తనయుడు భరత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు అమరావతి చుట్టూ వేలాది ఎకరాలు కొనుగోలు చేశారని, వాటి విలువ తగ్గిపోతుందనే భయంతోనే రాద్ధాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సమగ్ర అభివృద్ధే ముద్దు రామచంద్రపురం రూరల్: మూడు రాజధానులకు మద్దతుగా రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో సుమారు రెండు వేల మందితో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరిజిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని వెంకటాయపాలెం, బాపనయ్యచెరువు, నెలపర్తిపాడు, వెలంపాలెం, హసన్‌బాద, ఉండూరు, కాపవరం, కందులపాలెం గ్రామాల్లో ఈ ర్యాలీ సాగింది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి మూడు రాజధానులు కావాల్సిందేనంటూ నినాదాలు చేశారు. యువతరం, మహిళలతో పాటు వృద్ధులు కూడా ఈ ర్యాలీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే వేణు తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఒక్కచోటే అభివృద్ధి వద్దు.. పాలకొండ: ఒక్క రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు అంటూ నినాదాలతో పాలకొండ పట్టణం హోరెత్తింది.. ఆదివారం సాయంత్రం డీసీసీబీ చైర్మన్ పాలవలస విక్రాంత్ ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్దతుగా కోటదుర్గమ్మ ఆలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎన్జీవో సంఘం, పలు ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజలు వేల సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. -
గాంధీజీ కలలను సీఎం జగన్ సాకారం చేశారు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ దేశానికి ఆదర్శమని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కొనియాడారు. గ్రామ సచివాలయ వ్యవస్థపై బుధవారం అసెంబ్లీలో జరిగిన చర్చపై ఆయన మాట్లాడారు. స్థానికంగా ప్రజల సమస్యలు తీర్చేందుకే గ్రామసచివాలయాలను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో గ్రామస్థాయిలోనే ప్రజల సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా 14శాఖల అధికారులు గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉంటారని, ఎప్పుడూ ఏ సమస్య వచ్చినా ప్రజలు వారికి విన్నవించుకోవచ్చునని తెలిపారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజల వద్దకే పాలన వస్తుందన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా అట్టడుగు పల్లెలకు సైతం సీఎం వైఎస్ జగన్ పరిపాలనను తీసుకెళ్లారని కొనియాడారు. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. స్థానికంగా అందుబాటులో ఉండి ప్రజల సమస్యలన్నింటినీ గ్రామసచివాలయాలు పరిష్కరిస్తామని, ఈ వ్యవస్థ ద్వారా మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్యాన్ని సీఎం వైఎస్ జగన్ సాకారం చేశారని కొనియాడారు. రైల్వేకోడూర్ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ.. గత చంద్రబాబు సర్కార్ పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు 34 రకాల సేవలు అందుతున్నాయని తెలిపారు. వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను కూడా సరిదిద్దుతూ ముందుకెళ్తున్నామని చెప్పారు. కులమతాలకు అతీతంగా ప్రజలందిరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నట్టు కోరుముట్ల శ్రీనివాసులు తెలిపారు. -
‘త్వరలోనే రాష్ట్రానికి 2100 మెట్రిక్ టన్నుల ఉల్లి’
సాక్షి, అమరావతి: ఉల్లి సమస్య ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే లేదు దేశ వ్యాప్తంగా ఉందని, కావాలనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉల్లి మీద లొల్లి చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మండిపడ్డారు. మంగళవారం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల ఇబ్బందులను తీర్చడానికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కిలో ఉల్లిని రూ. 25 సరఫరా చేస్తున్నారని తెలిపారు. ఉల్లి ధర నిర్ణయించాల్సింది కేంద్రమేనని, ఆ మాత్రం విషయం కూడా చంద్రబాబుకు తెలియదా అని విమర్శించారు. ఉల్లి అక్రమ నిల్వలు చేస్తున్న వారిపై విజలెన్స్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ విప్ కోరుముట్లు శ్రీనివాస్ మాట్లాడుతూ.. డిసెంబర్12న 2100 మెట్రిక్ టన్నుల ఉల్లిని దిగుబమతి చేస్తున్నామని, రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామని వెల్లడించారు. టీడీపీ ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తుందని, గుడివాడలో సాంబిరెడ్డి మరణాన్ని రాజకీయం చేయటం తగదని అన్నారు. ఇక మరో విప్ కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. మహిళా బిల్లుపై చట్టం చేస్తుంటే టీడీపీ నేతలు గోల గోల చేస్తూ అనవసరపు రాద్దాంతం చేస్తున్నారని అన్నారు. రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అసెంబ్లీలో ఏమి మాట్లాడతరోనని భయపడిన టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారని విమర్శించారు. ఇకనైన చంద్రబాబు వైఖరి మారాలని, టీడీపీ పార్టీలో ఉంటే అవమానాలు పడాల్సీ వస్తుందేమోనని ఆ పార్టీ ఎమ్మెల్యేలకు భయం పట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు. -
బాబు రైతుల భూములు లాక్కున్నప్పుడు ఎక్కడున్నావ్ పవన్?
రైల్వేకోడూరు: పవన్ కళ్యాణ్ ఒక అజ్ఞాని, చేతకాని దద్దమ్మ అని ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరులో రైతు సంక్షేమం.. జనసేన ధ్యేయం పేరిట పవన్ ఎందుకొచ్చాడో ఏమి మాట్లాడుతున్నాడనేది ప్రజలకు అర్థంకాని పరిస్థితి ఏర్పడిందన్నారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబుకు దత్తపుత్రుడిగా ఉన్నాడని, ఆరోజు వేలాది ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా లాక్కుంటే ఏమీ మాట్లాడకుండా ఎక్కడికి పారిపోయావని పవన్‌ను ప్రశ్నించారు. ప్యాకేజీ ఎవరు ఇస్తే వారి మాట మాట్లాడే గుణం మొదటి నుంచి పవన్‌కు ఉందన్నారు. -
అమెరికాలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
వాషింగ్టన్ డీసీ : దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 70వ జయంతి వేడుకలు అమెరికాలో ఘనంగా నిర్వహించారు. వాషింగ్టన్ డీసీ మెట్రో వైఎస్సార్సీపీ ఎన్నారై కమిటీ రిజినల్ ఇంచార్జ్ శశాంక్ రెడ్డి, అడ్వైజర్, గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ రమేష్‌రెడ్డి ఆధ్వరంలో వర్జీనియాలోని హేర్నడోన్లోని తత్వా రెస్టారెంట్లో ఈ వేడుకలు జరిగాయి. అమెరికా పర్యటనలో ఉన్నకోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రజానేత వైఎస్ సేవలను కొనియాడారు. తొలుత మహానేత వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు, అభిమానులు వైఎస్సార్ పేద ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ.. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దేశానికే ఆదర్శవంతమైన పాలనను అందించారని కొనియాడారు. రైతు సంక్షేమం కోసం రుణమాఫీ, పావలా వడ్డీ, పశుక్రాంతి, జలయజ్ఞం, ఉచిత విద్యుత్ వంటి ఎన్నో మహత్తర కార్యక్రమాలు ప్రవేశపెట్టి తాను మరణించే వరకు రైతు సంక్షేమ పథకాలను కొనసాగించారని గుర్తు చేశారు. తండ్రి ఆదర్శాలను తనయుడు సీఎం జగన్మోహన్రెడ్డి మాత్రమే అధిగమించగలరని చెప్పారు. జరిగిన 40 రోజుల పాలనా దానికి ఉదాహరణ అన్నారు. స్థానిక సాఫ్ట్వేర్ మేనేజర్ లోరీ మాట్లాడుతూ... గతంలో వైఎస్సార్ ప్రవేశపెట్టిన అనేక పథకాలు చూసి ఆయన కుటుంబానికి ఆకర్షితురాలైనానని తెలిపారు. సీఎం వైఎస్ జగన్‌కు తన వంతు సాయం చేశానని, భవిష్కత్‌లో కూడా ఆయనకు అండగా ఉంటామన్నారు. మహానేత జయంతి రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్నందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకకి ఇండియా నుంచి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఢిల్లీ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎల్వీఎల్ నాగరాజు, మిమిక్రి రమేష్, సాదక్ కుమార్, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని ఎన్నారై విభాగం సత్కరించింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ అమెరికా రీజినల్ ఇన్ ఛార్జ్ శశాంక్ రెడ్డి, స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్ సాత్విక్ రెడ్డి, సలహాదారు రమేష్ రెడ్డి వల్లూరు, సుజీత్ మారం, సంజీవ్ మహాజనం, అర్జున్ కామిశెట్టి, సునీల్ యాచవరం, రాజీవ్ పాలడుగు, మినాడ్ అన్నవరం, రామ్ రెడ్డి, సతీష్ నరాలతో పాటు పలువురు ఎన్నారైలుపాల్గొన్నారు. -
చంద్రబాబు చిల్లర చేష్టలు మానుకోవాలి
-
‘అక్కడైతే బాబును ఎప్పుడో ఉరితీసేవారు’
సాక్షి, కడప : తన ప్రవర్తన ద్వారా చంద్రబాబు ఓటమి అంగీకరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అభ్యర్థి కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు. మంగళవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ఓటు ఎవరికి వేశామో అని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేయడం హేయమని చర్య అని మండిపడ్డారు. ప్రజలు పాలన మార్పుకు సిద్ధంగా ఉన్నారని.. 140 పైచిలుకు సీట్లతో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రానుందని పేర్కొన్నారు. ఇప్పటికైన చంద్రబాబు చిల్లర చేష్టలు మానుకోవాలని హితవు పలికారు. ‘ 2014లో ఇవే ఈవీఎంలతో గెలిచావు కదా అప్పుడు అనుమానం రాలేదా? వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను కాపీ కొట్టారు. ఇప్పుడేమో ఓటమి భయంతో మతిభ్రమించినట్లు ప్రవర్తిస్తున్నారు. మిమ్మల్ని చూసి పక్క రాష్ట్రాల వాళ్లు నవ్వుకుంటున్నారు. ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే హుందాగా వ్యవహరించండి’ అని కొరుముట్ల శ్రీనివాసులు.. చంద్రబాబు తీరును ఎండగట్టారు. అక్కడైతే ఎప్పుడో ఉరితీసేవారు.. ఎల్లో మీడియా ద్వారా చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టారని వైఎస్సార్ సీపీ కమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఆయన వంటి నాయకుడిని, టీడీపీ వంటి పార్టీని రాష్ట్రంలో గానీ దేశంలో గానీ ఎక్కడా చూడలేదని ఎద్దేవా చేశారు. ఇలాంటి నాయకుడు గల్ఫ్ దేశాల్లో ఉంటే ఎప్పుడో ఉరి తీసేవారని ధ్వజమెత్తారు. చంద్రబాబు గురించి తెలుసుకున్న ప్రజలు పాలనలో మార్పు కోరుకున్నారని.. నవరత్నాలే వైఎస్సార్ సీపీని గెలిపించనున్నాయని పేర్కొన్నారు. ప్రజల సమస్యలు దగ్గర నుంచి గుర్తించిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్ అని.. ఆయన అధికారంలోకి వస్తే కేంద్రంలో ఎవరున్నా ప్రత్యేక హోదా తెచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తారని వ్యాఖ్యానించారు. -
జేసీ.. నోరు అదుపులో పెట్టుకో
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎంత మాత్రం సహించమని, ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు హెచ్చరించారు. అధికార దాహంతో కులాల మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతున్నారని, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని సామాజిక వర్గాలను అభివృద్ధి చేస్తానని చెప్పి అధికారంలోకొచ్చిన టీడీపీ గత నాలుగేళ్లుగా స్వప్రయోజనాలే అజెండాగా పనిచేస్తోందని మండిపడ్డారు. కులాల మధ్య చిచ్చు పెడుతూ.. విభజించి పాలించే వైఖరిని చంద్రబాబు అనుసరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎస్సీల నుంచి లాక్కున్న 2 వేల ఎకరాలను.. విశాఖలోని సీఎం బావమరిది బాలకృష్ణ బంధువుకు కట్టబెట్టలేదా అని ప్రశ్నించారు. తిరుపతిలో ముఖ్యమంత్రి సామాజికవర్గానికి చెందిన గల్లా జయదేవ్ కంపెనీకి, రాజంపేటలో కుసుమకుమారికి.. కోడూరులోనూ సొంత సామాజికవర్గానికే భూములు కేటాయించారని గుర్తు చేశారు. జగ్గయ్యపేటలోనూ టీడీపీ మద్దతుదారులకే భూములిచ్చారన్నారు. జేసీ దివాకర్ అసభ్యంగా మాట్లాడుతుంటే.. ఇది మంచిపద్ధతి కాదని హెచ్చరించాల్సిన సీఎం మౌనం వహించి ఆయన్ని ప్రోత్సహించడం దారుణమన్నారు. దివాకర్‌రెడ్డి ఎప్పుడూ పిచ్చికుక్క తరహాలోనే మాట్లాడతాడన్నారు. కోట్లాది రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేస్తున్న ధర్మపోరాట దీక్షలను కేవలం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిట్టడానికే ఉపయోగించడం బాధాకరమన్నారు. తమ నేత వైఎస్ జగన్‌ను తిట్టడం కోసమే జిల్లాకొక జేసీ దివాకర్ లాంటి వాళ్లను చంద్రబాబు తయారుచేశారని మండిపడ్డారు. జేసీ సోదరులు మాట్లాడే భాష, చర్యలు ప్రజాస్వామ్యంలో ఎవరైనా హర్షించదగినవేనా అని ప్రశ్నించారు. ఇకనైనా వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని సూచించారు. ఇది ప్రజాస్వామ్యమని.. నియంతలా వ్యవహరించడం కుదరదన్నారు. మళ్లీ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక కోస్తామని.. తాము కూడా జేసీ దివాకర్‌రెడ్డిని అనగలమన్నారు. కానీ తమకు సంస్కారం అడ్డొస్తోందన్నారు. వైఎస్ జగన్‌కు కులం, మతం లేదని.. అందుకే ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం వరకు ప్రజలంతా ఆయన్ని అభిమానిస్తున్నారని చెప్పారు. అన్ని కులాలూ ఆయనవేనని.. అన్ని వర్గాలూ ఆయన్ని తమ వాడిగా భావిస్తున్నారన్నారు. చిల్లర రాజకీయాలకు స్వస్తి చెప్పాలని చంద్రబాబుకు సూచించారు. శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న చంద్రబాబు బడుగు, బలహీనవర్గాలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. -
హామీల పై కేంద్రం దొంగనాటకాలు
-
‘ప్రత్యేక హోదా వైఎస్ జగన్‌తోనే సాధ్యం’
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించే శక్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికే ఉందని ఆ పార్టీ మాజీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘వంచనపై గర్జన’ దీక్షలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్ వల్లే చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారని తెలిపారు. హోదా కోసం జననేత వైఎస్ జగన్ అనేక పోరాటాలు చేశారని గుర్తుచేశారు. కేవలం పోలవరానికి ఒక్క గేటు పెట్టి చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వయస్సు పై బడ్డా టీడీపీ నాయకుడు జేసీ దివాకర్‌రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. దివాకర్‌రెడ్డి వైఎస్ జగన్‌ను విమర్శించి మన్నలను పొందాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్‌ను విమర్శిస్తున్నవారికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ‘40 ఏళ్ల అనుభవం... అబద్ధాలు చెప్పడానికేనా’ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా అంశం పక్కబెట్టిన చంద్రబాబు హడావుడిగా శంకుస్థాపనలు చేస్తూ ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారని విమర్శించారు. రాజధాని నిర్మాణాల గ్రాఫిక్స్ చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారిపై చీటింగ్ కేసు పెట్టాలని అన్నారు. నలభయ్యేళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు అబద్ధాలు చెప్పడంలో ఆరితేరారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొంగ నాటకాలు ఆడుతున్నాయని అన్నారు. వైఎస్ జగన్‌పై అవాకులు, చవాకులు పేలుతున్న జేసీ దివాకర్‌రెడ్డి తన పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. లేదంటే ప్రజలే ఆయనకు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. బ్యాకులకు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వారికి చంద్రబాబు కొమ్ముకాస్తున్నారని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మంగంపేట బైరటీస్ గనుల వద్ద తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, వైఎస్ఆర్: కడప జిల్లా మంగంపేట బైరటీస్ గనుల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భూములు కొల్పొయిన బాధితులు పరిహారం కోసం ఆరు గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. వీరికి మధ్దతు తెలిపేందుకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, కడప మేయర్ సురేష్ బాబు ధర్నా ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉధ్రిక్తత నెలకొంది. దీంతో ధర్నా ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. -
బాబూ.. నీకెందుకు ఇంత పైశాచిక ఆనందం?
హైదరాబాద్: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వైఎస్సార్ జిల్లాలో అధర్మ పోరాట సభ నిర్వహించారని రాయచోటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీకాంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. పక్కనున్న ఆరు జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సులు పెట్టి బలవంతంగా జనాన్ని కడపకు తరలించారని ఆరోపించారు. ప్రతిపక్ష నేత సొంత జిల్లాలో ఇష్టమొచ్చినట్లు జగన్‌పై మాట్లాడించారని మండిపడ్డారు. ‘చంద్రబాబూ నీకు ఇంత పైశాచిక ఆనందం ఎందుకు’ అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడికి తెలిసిందల్లా అధర్మం, అన్యాయం మాత్రమేనని దుయ్యబట్టారు. కేవలం జగన్‌ని టార్గెట్ చేసుకునే సభ జరిగిందని, జగన్‌పై టీడీపీ నేతలు ఇష్టానుసారంగా, అసభ్యంగా మాట్లాడారని చెప్పారు. వైఎస్సార్ జిల్లాలో కరవుతో రైతులు ఇబ్బందులు పడుతుంటే ఒక్క మాట మాట్లాడలేదని తప్పుబట్టారు. చంద్రబాబు కేంద్రం ఏం చెబితే అదే నిజం అని చంకలు గుద్దుకుంది నిజం కాదా అని సూటిగా అడిగారు. అప్పుడే ఎందుకు నోరు మెదపలేదని సూటిగా ప్రశ్నించారు. నాలుగేళ్లు ఎందుకు నోరు మూసుకుని కూర్చున్నావని ప్రశ్న లేవనెత్తారు. రాజకీయాలు మాట్లాడటానికే సభ నిర్వహించారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని తిట్టిన నోటితోనే పొగుడుతావ్.. మోదీని పొగిడిన నోటితోనే తిడుతున్నావ్.. ఎన్నిసార్లు యూటర్న్ తీసుకుంటావని ధ్వజమెత్తారు. చంద్రబాబు నీ హయాంలో రాయలసీమ ప్రాజెక్టులకు ఎంత ఖర్చు పెట్టావో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని రాయలసీమ ప్రజలందరూ బహిష్కరించాలని కోరారు. కడప స్టీల్ ప్లాంట్ గురించి చంద్రబాబుకు అవగాహన ఉందా అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు ఎలాగూ వచ్చేసారి సీఎం కాలేరు కాబట్టి ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు రాయలసీమ పేరెత్తే అర్హత లేదని, కడప ప్రజల్ని రౌడీలు, గూండాలు అని సంబోధించిన సీఎం ఎలా కడప జిల్లాకు వస్తారని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు ఏమైనా చేయగల సమర్ధుడని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాస్‌కు నార్కో అనాలసిస్ పరీక్ష చేస్తే నిజాలు వెల్లడవుతాయని అన్నారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ.. చంద్రబాబు ధర్మపోరాటం పేరుతో సభ పెట్టి జగన్‌ని తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. ప్రజల్లో కనీస స్పందన లేదని, జిల్లా ప్రజలు సంస్కారవంతులు కాబట్టి ఎవరూ చంద్రబాబు సభలో చప్పట్లు కొట్టలేదని వివరించారు. చంద్రబాబు డిక్షనరీలో ధర్మం ఎక్కడా లేదు.. కేవలం వెన్నుపోటు, అధర్మం మాత్రమే ఉన్నాయని వ్యాఖ్యానించారు.