Krishna puskaras
-
కృష్ణమ్మా.. మళ్లీ వస్తాం..
-
కృష్ణమ్మకు మలి హారతి
-
పుష్కర వీడ్కోలు
-
యువక.. మునక..
-
దారులన్నీ కృష్ణమ్మ దరికే..
-
దుర్గమ్మను దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం
విజయవాడ: నగరంలోని కనకదుర్గ అమ్మవారిని ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో చినరాజప్పకు దేవస్థానం ఈవో స్వాగతం పలికారు. అనంతరం బెంజిసర్కిల్‌లో జరుగుతున్న విశ్వశాంతి ఉద్గీద మహామృత్యుంజయ హోమం కార్యక్రమంలో చినరాజప్ప దంపతులు పాల్గొన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం దేవస్థానం చేసిన ఏర్పాట్లు బాగున్నాయన్నారు. కృష్ణా పుష్కరాలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా జరుగుతున్నాయన్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాల ముగింపు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం 12వ రోజుతో కృష్ణా పుష్కరాలు ముగియనున్నాయి. పుష్కరాల ముగింపు సందర్భంగా వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడలోనూ ఏపీ సర్కారు భారీ ఏర్పాట్లను చేసింది. సంగమం ఘాట్ వద్ద సందర్భంగా ప్రత్యేక హారతి కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. వెయ్యిమంది కూచిపుడి కళాకారులతో నృత్య ప్రదర్శన నిర్వహించనున్నారు. మరోవైపు తెలంగాణలోనూ ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. బీచుపల్లి, గొందిమళ్ల, సోమశిల, రంగాపూర్ ఘాట్లలో ప్రత్యేక హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. కృష్ణా పుష్కరాలు అఖరి రోజు కావడంతో పుష్కర ఘాట్ల వద్ద భక్తులు భారీసంఖ్యలో వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన పుష్కరఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. విజయవాడలో సంగమం, పద్మావతి, కృష్ణవేణి, వేదాద్రి ఘాట్లలో భక్తుల రద్దీ పెరిగింది. గుంటూరులో అమరావతి, సీతానగరం ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కర్నూలు జిల్లాలో సంగమేశ్వరం, పాతాళగంగ, లింగాలగట్టు ఘాట్లకు భక్తులు పోటెత్తుతున్నారు. నల్లగొండ జిల్లాలో మట్టపల్లి, వాడపల్లి, నాగార్జున సాగర్ ఘాట్లలో భక్తుల పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో బీచుపల్లి, గొందిమళ్ల, సోమశిల ఘాట్లలో భక్తుల రద్దీ పెరుగుతోంది. -
భానుడి భగభగ.. భక్తులు విలవిల
పుష్కరాలకు ఆదివారం భక్తుల తాకిడితో పాటు ఎండ వేడి కూడా బాగా పెరిగింది. ఘాట్లలో భక్తులు ఎండ తాకిడికి విలవిల్లాడిపోయారు. భానుడి భగభగలను తట్టుకోలేక గొడుగులు, తువ్వాళ్లు, చెట్ల నీడలను ఆశ్రయించారు. అమరావతి ఘాట్‌లో కనిపించిన దృశ్యాలివి. – తాడేపల్లి రూరల్ -
ఇన్నోవా- లారీ ఢీ: ముగ్గురి మృతి
తిరుపతి: తిరుపతి రూరల్ మండలం గాంధీపురం వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఇన్నోవాను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. కృష్ణా పుష్కరాలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలిసింది. మృతులు మదనపల్లెకి చెందిన నాగరాజు, భారతి, కృష్ణమూర్తిగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పుష్కర రూట్లలో భారీ ట్రాఫిక్ జాం
నల్లగొండ/శంషాబాద్: కృష్ణా పుష్కరాలు ముగుస్తున్న సందర్భంగా భక్తుల తాకిడి ఎక్కువవుతోంది. ఆదివారం కావడంతో పుణ్య స్నానాలు ఆచరించడానికి భక్తులు పెద్ద ఎత్తున కృష్ణా తీరానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జాం అవుతోంది. నల్లగొండ జిల్లాలోని మట్టంపల్లి, వాడపల్లి ఘాట్లలో స్నానం ఆచరించడానికి వెళ్తున్న భక్తుల రద్దీ వల్ల నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మాడ్గులపల్లి టోల్‌ప్లాజా వద్ద భారీ ట్రాఫిక్ జాం అయింది. మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద మండలంలోని పాల్మాకుల శివారులోని బెంగళూరు జాతీయ రహదారిపై పుష్కరాలకు వెళ్లే భక్తుల వాహనాలతో భారీ ట్రాఫిక్ జాం అయింది. -
కృష్ణమ్మకు భక్త నీరాజనం!
-
‘శోభా’యమానం!
పుష్కరాలు ఇంకా మూడు రోజులే! మూడొంతులు పూర్తయిన మహా క్రతువు చివరి రోజుల్లో భక్తుల రద్దీ పెరిగే అవకాశం సాక్షి, గుంటూరు : పుష్కరాలు మూడొంతులు పూర్తయ్యాయి. మహాక్రతువు ఇంకా మూడు రోజులే కొనసాగుతుంది. తొమ్మిది రోజుల్లో 45 లక్షల మంది భక్తులు జిల్లాలోని వివిధ ఘాట్లలో పుష్కర స్నానాలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. చివరి రోజుల్లో భక్తుల తాకిడి పెరిగే అవకాశముందని వారు భావిస్తున్నారు. జిల్లాలో ఘాట్లకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రధానంగా అమరావతిలోని పుష్కర ఘాట్లు భక్తుల తాకిడితో కళకళలాడుతున్నాయి. జిల్లాలోని మిగిలిన ఘాట్లలో తొమ్మిదోరోజైన శనివారం భక్తుల తాకిడి కొంత తగ్గింది. వారం రోజులుగా ఎండలు మండిపోతుండటం, ఉష్ణోగ్రతలు వేసవిని తలపించేలా నమోదవుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. అటు అధికారులు, ఇటు పుష్కరాలకు వచ్చిన భక్తులు ఎండ తాకిడికి ఆపసోపాలు పడాల్సి వస్తోంది. అధికారుల పరిశీలన... అమరావతి పుష్కర ఘాట్లను శనివారం పంచాయతీరాజ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్‌రెడ్డి, కలెక్టర్ కాంతిలాల్ దండేతో కలిసి సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తి దుర్గాప్రసాద్ శనివారం అమరావతిలోని పుష్కర ఘాట్‌లో పుణ్యస్నానం చేశారు. రెంటచింతల మండలం సత్రశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను ఆర్డీ డాక్టర్ షాలినీదేవి, డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మజారాణి పరిశీలించి వైద్యులకు పలు సూచనలు చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో భక్తులు నీరసించే అవకాశం ఉందని, అందుకు తగిన మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అనంతరం శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. విజయపురిసౌత్‌లోని ఘాట్‌కు శనివారం భక్తుల రద్దీ పెరిగింది. డ్యామ్‌పై నుంచి రాకపోకలను పోలీసులు సడలించడంతో తెలంగాణ వైపు నుంచి భక్తులు అధిక సంఖ్యలో కష్ణవేణి ఘాట్‌కు రావడంతో రద్దీ పెరిగింది. జిల్లాలోని అమరావతి, సత్రశాల, విజయపురి సౌత్‌లోని ఘాట్, తాళాయపాలెం, సీతానగరం ఘాట్లలో శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. మధ్యాహ్నం నుంచి మాత్రం ఘాట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. కొనసాగుతున్న ఇబ్బందులు... జిల్లాలోని అనేక ఘాట్ల వద్ద పిండప్రదానం చేసే షెడ్లు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ఏర్పాటు చేసిన షెడ్లు సరిపోక భక్తుల ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా కొన్నిచోట్ల అధికారులు తాత్కాలికంగా టెంట్లు వేస్తున్నప్పటికీ అనుకున్న స్థాయిలో భక్తులకు ఉపయోగపడడం లేదు. జిల్లాలో శనివారం 38 నుంచి 40 డిగ్రీ వరకు ఉష్ణోగ్రత నమోదు కావడంతో భక్తులు, అధికారులు అల్లాడిపోయారు. అనేక ఘాట్ల వద్ద నీరు కలుషితం కావడంతో అధికారులు, భక్తులు వందల సంఖ్యలో విషజ్వరాలు, డయేరియా బారిన పడుతున్నారు. అధికారులు పుష్కర ఘాట్ల వద్ద అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ నీరు కలుషితం కాకుండా క్లోరినేషన్ చేయడంలో వైద్య అధికారుల సూచనలను పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
పుష్కర వాహిని.. పుణ్యవేణి
సాక్షి, అమరావతి/ గుంటూరు : శ్రావణ శోభతో పుష్కర కృష్ణమ్మ శుక్రవారం కళకళలాడింది. మహిళలు పుష్కర స్నానా లు చేసి కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. జిల్లాలో ఎనిమిదో రోజు అమరావతి మినహా మిగిలిన ఘాట్లలో భక్తుల రద్దీ కొద్దిమేర తగ్గింది. తాడేపల్లి మండలం సీతానగరం పుష్కరఘాట్‌లో సుమారు 10వేల మంది భక్తులతో కలిసి చినజీయర్ స్వామి పుష్కర స్నానం చేశారు. అనంతరం శుక్రవారం రాత్రి కృష్ణమ్మకు హారతి ఇచ్చారు. జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో ఉన్న పొందుగల, దైద, సత్రశాల, కృష్ణవేణి, అణుపు ఘాట్లను శుక్రవారం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, కలెక్టర్ కాంతిలాల్ దండే సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ తాళ్ళాయపాలెం పుష్కరఘాట్ వద్ద పడవలో తిరిగి ఏర్పాట్లు పరిశీలించారు. ఈ నెల 21న గురజాల నియోజకవర్గంలోని ఘాట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించనున్నట్లు సమాచారం. అమరావతిలో కొనసాగిన రద్దీ.. అమరావతిలో పుష్కర భక్తుల తాకిడి కొనసాగుతూనే ఉంది. పుష్కరాల ఎనిమిదో రోజూ రద్దీ కొనసాగింది. ఘాట్లన్నీ భక్తులతో కళకళలాడాయి. శ్రావణ శుక్రవారం కావడంతో మహిళలు కృష్ణమ్మకు ప్రత్యేకంగా సారె పెట్టి పసుపు, కుంకుమలతో పూజలు చేశారు. అమరావతి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కావడంతో ఎక్కువమంది భక్తులు ఇక్కడే పుణ్య స్నానాలు చేసేందుకు ఆసక్తి చూపారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఎనిమిది రోజుల్లో శుక్రవారం మధ్యాహ్నానికి 29,38,611 మంది పుణ్య స్నానాలు చేసినట్లు అధికారులు అంచనా వేశారు. ఇందులో ఒక్క అమరావతిలోనే 13,53,594 మంది స్నానాలు చేసినట్టు చెబుతున్నారు. శుక్రవారం ఒక్కరోజు మధ్యాహ్నం సమయానికే లక్షా 25 వేల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నారు. కమాండ్ కంట్రోల్ రూం నుంచి సీసీ కెమెరాల ద్వారా ఘాట్లను పరిశీలిస్తూ ఘాట్ ఇన్చార్జిలు, పోలీసులు, దేవదాయ శాఖ, ఆర్టీసీ, రైల్వే అధికారుల సమన్వయంతో భక్తుల సంఖ్యను అంచనా వేస్తున్నారు. ఈ నెల 14న అత్యధికంగా 3,22,500 మంది భక్తులు అమరావతికి వచ్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అమరావతిలోని ధ్యానబుద్ద ఘాట్‌లోనే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. అమరావతిలోనే అధికారుల మకాం.. అమరావతిలో జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, ఇన్చార్జి జేసీ ముంగా వెంకటేశ్వరరావుతో పాటు జిల్లాలోని ఉన్నతాధికారులందరూ ఇక్కడే మకాం వేసి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శానిటేషన్ బాధ్యతను జెడ్పీ సీఈవో వెంకట సుబ్బయ్య, డీపీవో శ్రీదేవిలకు అప్పజెప్పారు. శానిటేషన్ పర్యవేక్షణ బాధ్యతను గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ నాగలక్ష్మికి శుక్రవారం నుంచి అదనపు బాధ్యతగా అప్పగించారు. మత్స్యశాఖ డీడీ బలరాం, డీఎంహెచ్ఓ పద్మజ, ధ్యానబుద్ధ ఘాట్ ఇన్‌ర్జి సబ్‌కలెక్టర్ హిమాంశుక్లా, అమరేశ్వర ఘాట్ ఇన్చార్జి సబ్‌కలెక్టర్ కృత్రికా బాత్రా, రూరల్ ఎస్పీ నారాయణనాయక్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అమరావతి పుష్కర ఘాట్లు, పరిస ర ప్రాంతాల్లో పారిశుధ్యం మెరుగ్గా లేకపోవడంతో గుంటూరు నగరపాలక సంస్థ నుంచి 200మంది పారిశుధ్య కార్మికులను శుక్రవారం అక్కడకు పంపారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు పుష్కర నగర్ల వద్ద బస్సులు దిగి ఉచిత బస్సులు ఎక్కాల్సి రావడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా చట్టిబిడ్డలతో వెళ్లేవారు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు అవస్థల పాలవుతున్నారు. ఆర్టీసీ బస్సులను నేరుగా పుష్కర ఘాట్ల వరకు వెళ్లేలా జిల్లా ఉన్నతాధికారలు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. పుష్కర స్నానాలకు వెళ్తూ జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 10 మంది యాత్రికులు గాయాలపాలయ్యారు. శావల్యాపురం మండలం వైకల్లు గ్రా మానికి చెందిన 12మంది భక్తులు ఆటోలో వెళ్తుండగా ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరికి గాయాలయ్యాయి. గురజాల మండలం జంగమహేశ్వరపురం గ్రామానికి చెందిన పది మంది ఆటోలో సత్రశాల పుష్కరఘాట్‌లో స్నానాలు చేసి వస్తుండగా రెంటచింతల మండలం గోలి గ్రామం వద్ద కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం పుష్కర ఘాట్ వద్ద పనుల్లో నాణ్యత లేక అనేక చోట్ల టైల్స్ ఊడిపోయాయి. ఎండ తీవ్రత కొనసాగుతుండటంతో మధ్యాహ్నం వేళ భక్తుల తాకిడి కనిపించటం లేదు. ప్రయాణాలు చేసేందుకు ప్రజలు సాహసం చేయటం లేదు. -
కృష్ణమ్మ ఆశీర్వచనం
కృష్ణలో స్నానమాచరిస్తే సకల సౌభాగ్యాలూ దక్కుతాయని భక్తుల నమ్మకం.. ఆ తలంపుతో సత్తెనపల్లికి చెందిన చిత్రకారుడు జింకా రామారావు కృష్ణమ్మ ఆశీర్వదిస్తున్నట్లుగా చిత్రం గీసి మంత్రముగ్ధుల్ని చేశారు. పలువురి ప్రశంసలు పొందుతున్నారు. – సత్తెనపల్లి -
తనిఖీలకు జాగిలాలూ సై..
కృష్ణా పుష్కరాల్లో భాగంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ధరణికోట, ధ్యానబుద్ధ, అమరేశ్వర ఘాట్‌ల్లో జాగిలాలు, మెటల్ డిటెక్టర్లతో నిర్విరామంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. – అమరావతి (పట్నంబజారు) -
కృష్ణమ్మకు ‘కళా’భివందనం
-
నిండు చంద్రుడూ వీక్షించెనా..!
-
వైఎస్సార్‌కు పిండ ప్రదానం
అచ్చంపేట: మండలంలోని కస్తల పుష్కర ఘాట్‌లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గురువారం సాయంత్రం పిండప్రదానం చేశారు. ఘాట్‌లో స్నానం చేసి తల్లిదండ్రులు, గురువులు, పితృ సమానులైన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి పిండ ప్రదానం చేశానన్నారు. కస్తల ఘాట్‌లో నీరు స్వచ్ఛంగా ఉన్నాయని, రద్దీ తక్కువగా ఉంటుందని తెలిసి వచ్చానన్నారు. అనంతరం ఆయన శివాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట గ్రామపార్టీ కన్వీనర్ చెన్నమల్లు రవి, పార్టీ నాయకులు శ్రీనివాసరెడ్డి, జాన్‌పీరా, వైఎస్సార్ సీపి అభిమానులు ఉన్నారు. -
కృష్ణమ్మ సన్నిధిలో భక్తజనం
-
హారతి గైకొనుమా..
-
అరకొర భక్తులతో వెలవెల
కళతప్పిన పెనుమూడి ఘాట్ భక్తుల సంఖ్య కన్నా అధికారుల సంఖ్యే ఎక్కువ రేపల్లె: పుష్కరాల సందర్భంగా మండలంలో ఎనిమిది పుష్కరఘాట్లలో ఐదో రోజు మంగళవారం పెనుమూడి, మోర్తోట పుష్కరఘాట్లలో నామమాత్రంగా తరలి వచ్చారు. దీంతో ఆ యా ఘాట్లు వెలవెలపోయాయి. మిగిలిన రావిఅనంతవరం, పెనుమూడి వీఐపీ, మైనేనివారిపాలెం, గంగడిపాలెం, చెన్నుపల్లివారిపాలెం, రాజుకాల్వ పుష్కరఘాట్లలో నామమాత్రంగా కూడా భక్తులు కనిపించలేదు. ఘాట్లలో భక్తుల సంఖ్య కన్నా రెవెన్యూ, పోలీసు, పంచాయతీ, ఆరోగ్య, అగ్నిమాపక సిబ్బం దితో పాటు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు అధిక శాతం లో కనిపించారు. దీంతో ఘాట్లు బోసిపోతున్నాయి. శ్రావణ మంగళవారం కావటంతో పితృదేవతలకు తర్పణాలు వదిలేం దుకు భక్తులు ఆసక్తి చూపరని, దీంతో భక్తుల సంఖ్య కనిపించలేదని అధికార వర్గాల నుంచి వినిపిస్తోంది. మహిళల ప్రత్యేక పూజలు.. కృష్ణా పుష్కరాలలో భాగంగా 5వరోజు మండలంలోని మోర్తోట, పెనుమూడి పుష్కరఘాట్ల వద్ద మహిళలు పుణ్యస్నానాలను ఆచరించారు. పసుపు, కుంకుమ, పువ్వులను సమర్పించి నమస్కారాలు చేశారు. -
పుష్కర హేల.. ఆనంద డోల
-
సేవకులే.. సైనికులై..
-
పుష్కరాలపై మరింత ప్రచారం
రంగంలోకి దిగిన సీఆర్డీఏ జాతీయ రహదారులపై స్వాగతబోర్డులు రూ.25 లక్షలతో ఏర్పాటు మంగళగిరి: పుష్కరాలకు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆర్భాటంగా ప్రచారం నిర్వహించినా ప్రభుత్వ పెద్దలు అనుకున్న స్థాయిలో ప్రజల నుంచి స్పందన కొరవడడంతో మరింత ప్రచారానికి ప్రజాధనాన్ని వృ«థా చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. సెలవు రోజులైన శని, ఆదివారాలలోను పుష్కరాలకు ఆశించిన స్థాయిలో జనస్పందన కనిపించలేదు. దీంతో రానున్న రోజుల్లో ప్రజల నుంచి స్పందన కరువవుతుందని భావించిన ప్రభుత్వ పెద్దలు సీఆర్డీఏ(రాజధాని ప్రాధికారిక అభివృద్ధి సంస్థ) పేరుతో స్వాగతద్వారాలు ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో హుటాహుటిన రంగంలోకి దిగిన అధికారులు ఆదివారం జాతీయ రహదారిపై ద్వారాలను ఏర్పాటు పనులు ప్రారంభించారు. విజయవాడకు చేరుకునే జాతీయ రహదారుల వెంట సుమారు నాలుగు వందల ద్వారాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. ఒక్కో ద్వారం ఖర్చు రూ.40 వేలకు పైగా అవుతోంది. మొత్తం ద్వారాలకు సుమారు రూ.25 లక్షల ప్రజాధనం వృధా చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుష్కరాలు ప్రారంభమైన మూడు రోజుల తర్వాత జాతీయ రహదారులపై స్వాగత ద్వారాలు ఏర్పాటు చేయాలని సీఆర్డీఏ అధికారులకు ఎందుకు ఆసక్తి కలిగిందో అంతుచిక్కడం లేదు. ఇప్పటికే అవసరం లేని చోట్ల, నీరు లేని చోట్ల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసి ఘాట్లు నిర్మించి విమర్శలపాలయిన ప్రభుత్వం మాత్రం ప్రచారంలో వెనక్కి తగ్గకపోవడం విశేషం. గుంటూరు, మచిలీపట్నం, ఏలూరు, హైదరాబాద్‌ల నుంచి విజయవాడకు చేరుకునే రహదారులలో ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. -
కృష్ణవేణి తరంగిణిలో పవిత్ర స్నానం