Land occupation
-
టీడీపీ నేత భూ కబ్జా.. జేసీబీలతో గుట్టను తవ్వి పది ఎకరాలు..
సాక్షి, వైఎస్సార్: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో పచ్చ నేతలు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూములపై కన్నేసిన కొందరు టీడీపీ నేతలు దర్జాగా కబ్జాలకు పాల్పడుతున్నారు. టీడీపీ నేత ఏకంగా గుట్ట పక్కనే ఉన్న పది ఎకరాలు భూమిని కబ్జా చేయడం చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం.. వైఎస్సార్ జిల్లాలోని వేంపల్లి పాములూరు గుట్టలో పది ఎకరాల భూమిని టీడీపీ నాయకుడు శేషారెడ్డి కబ్జా చేశాడు. అనంతరం, తన భూమి అన్నట్టుగా జేసీబీలు, ట్రాక్టర్లు పెట్టి గుట్ట వద్ద భూమిని చదును చేయించాడు. ఈ క్రమంలో 40 ఏళ్లుగా తాను ఆ భూమిని వాడుకుంటున్నట్టు చెప్పాడు.ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఎంఆర్వో హరినాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు ఆ భూమి వాడకం ఉన్నట్టు రికార్డుల్లో లేదన్నారు. తర్వాత.. పాములూరు గుట్ట వద్దకు వెళ్లి జేసీబీ ట్రాక్టర్లను వెనక్కి పంపించారు. దీంతో, భూమి కబ్జా విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
మల్లా రెడ్డిపై భూ కబ్జా కేసు నమోదు
-
HYD: మాజీ ఐఏఎస్ భన్వర్‌లాల్ ఇంటిని ఖాళీ చేసిన ఐపీఎస్ నవీన్ కుమార్
సాక్షి, హైదరాబాద్: మాజీ ఐఏఎస్ అధికారి భన్వర్‌లాల్ ఇంటిని ప్రస్తుతం ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ఖాళీ చేయించారు. తన ఇల్లుని ఆక్రమించేందుకు నకిలీ పత్రాలు సృష్టించారని, ఐపీఎస్ అధికారి నవీన్‌పై భన్వర్‌లాల్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. భన్వర్‌లాల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు చర్యలు చేపట్టారు. ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్‌ను సెంట్రల్ క్రైం స్టేషన్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సీసీఎస్ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. దీంతో వివాదాస్పదంగా మారిన ఇంటిని నవీన్ ఖాళీ చేసి వెళ్లిపోయారు. చదవండి: హైదరాబాద్: రిటైర్డ్ IASకు ప్రజెంట్ IPS టోకరా! కేసు వివరాలు ఏంటంటే.? IAS అధికారిగా సుదీర్ఘ కాలం రెండు తెలుగు రాష్ట్రాల్లో పని చేసిన భన్వర్‌లాల్ 2017లో రిటైరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా ఆయన సుపరిచితుడు. జూబ్లీహిల్స్‌లో భన్వర్‌లాల్‌కు ఓ భవంతి ఉంది. 2014లో ఈ ఇంటికి సంబంధించి ఓర్సు సాంబశివరావు అనే వ్యక్తితో అద్దె ఒప్పందం చేసుకున్నారు. దీని కాల పరిధి అయిదు సంవత్సరాలు. ఈ రెంటల్ అగ్రిమెంట్ ప్రకారం భన్వర్‌లాల్ జూబ్లిహిల్స్‌లోని తన నివాసాన్ని సాంబశివరావుకు ఐదేళ్ల కోసం అద్దెకు ఇచ్చారు. 2019లో ఈ ఒప్పందం ముగిసినా.. ఇంటిని తనకు తిరిగి ఇవ్వలేదన్నది భన్వర్ లాల్ ఆరోపణ. భన్వర్ లాల్ కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారు? 2019 తర్వాత ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. 2019లో సాంబశివరావు స్థానంలో ఇంట్లోకి IPS అధికారి నవీన్‌కుమార్ దిగారు. ఆ తర్వాత కొన్ని డాక్యుమెంట్లు తెరమీదికి వచ్చాయి. ఈ డాక్యుమెంట్లు తమ ఆస్తులకు సంబంధించి ఒరిజినల్ తరహాలో రూపొందించిన నకిలీ పత్రాలని భన్వర్‌లాల్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పత్రాలను ఓర్సు సాంబశివరావు, ఆయన భార్య రూపా డింపుల్ కలిసి తయారు చేశారని, వీటికి IPS అధికారి నవీన్‌కుమార్ సహకరించారన్నది భన్వర్ లాల్ ఆరోపణ. పోలీసులు ఏం చేశారు? భన్వర్‌లాల్ ఆరోపణలతో రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు.. డాక్యుమెంట్లను విచారించి అవి ఫేక్ అని తేల్చారు. డిసెంబర్ 22న ఓర్సు సాంబశివరావు, ఆయన భార్య రూపా డింపుల్ ఇద్దరినీ అరెస్ట్ చేశారు. విషయం తెలిసిన ఐపీఎస్ అధికారి నవీన్‌కుమార్ ఆ రోజు నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. భన్వర్ లాల్ ఇంటిని కబ్జా చేసేందుకు జరిగిన కుట్రలో భాగంగానే నవీన్ కుమార్ సహకారంతో నకిలీ డాక్యుమెంట్లను రూపొందించి భన్వర్‌లాల్ సంతకాన్ని ఫోర్జరీ చేశారని అనుమానిస్తున్నారు. IPS అధికారి నవీన్‌కుమార్ ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీలో జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పోలీస్ అకాడమీలో గత ఆరేళ్లుగా తన సేవలను కొనసాగిస్తున్న నవీన్ కుమార్.. గతంలో వికారాబాద్‌లో ఎస్పీగా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో డీసీపీగా విధులు నిర్వహించారు. ఆయన ఆచూకీని తెలుసుకున్న పోలీసులు ఇవ్వాళ అదుపులోకి తీసుకున్నారు.గత నెల 17 న భన్వర్ లాల్ భార్య మనీలాల్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అరెస్టులు ఈ నెలలో జరిగాయి. -
సర్కారీ జాగా.. వేశాడు పాగా.. నాడు రామోజీ.. నేడు అధికారపార్టీ నేత
సాక్షి, హైదరాబాద్: కంచె చేను మేసిన చందంగా ప్రజాప్రతినిధే సర్కారు భూమిని కబ్జా చేశాడు. పట్టా భూమి కొనుగోలు చేసి..పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో పాగా వేశాడు. రూ.2 కోట్ల విలువైన ఈ భూమికి ఏకంగా ప్రహరీ కూడా ఏర్పాటు చేసి.. తన ఆధీనంలోకి తీసుకున్నాడు. పలుకుబడి కలిగిన ఆ ప్రజాప్రతినిధి ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారం తెలిసినా రెవెన్యూ అధికారులు అటువైపు వెళ్లేందుకు సాహసించడంలేదు. శంషాబాద్ మండలం పాల్మాకుల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 13లో 32 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 28 ఎకరాలను పేద రైతులకు ప్రభుత్వం అసైన్డ్ చేసింది. అక్రమంగా నిర్మించిన ప్రహరీ నాలుగు ఎకరాలు మాత్రం ఖాళీగానే ఉంది. ఈ భూమిని ఆనుకుని పట్టా (సర్వేనం.28) భూములున్నాయి. ఈ భూమిలో కొంత మేర కొనుగోలు చేసిన ప్రజాప్రతినిధి కన్ను పక్కనే ఉన్న సర్కారు భూమిపై పడింది. పట్టా భూమి చుట్టూ ప్రహరీ నిర్మించిన ఆయన పనిలో పనిగా హద్దు రాళ్లను తొలగించి సర్కారు భూమిని కూడా తన ఖాతాలో కలిపేసుకున్నాడు. దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ.రెండు కోట్లు ఉంది. ఆక్రమించిన ప్రభుత్వ భూమిలో పెద్ద గుట్ట కూడా ఉంది. ఈ బండరాళ్లను పగలగొట్టి గ్రానైట్ రాళ్లుగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు. ఆక్రమణలను అడ్డుకుంటాం ప్రభుత్వం పేదలకు అసైన్డ్ చేయగా మిగిలిన ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురైన విషయం ఇప్పటి వరకు మా దృష్టికి రాలేదు. ఆర్ఐని క్షేత్రస్థాయి పరిశీలనకు పంపుతాం. ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు తేలితే..స్వా«దీనం చేసుకుని హెచ్చరిక బోర్డులు నాటుతాం. ఆక్రమణ దారులపై చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్, శంషాబాద్ నాడు రామోజీ.. నేడు అధికారపార్టీ నేత సర్వే నంబరు 13 సర్కారు భూముల పక్కనే మార్గదర్శి చిట్‌ఫండ్ యజమాని రామోజీరావు భూములు ఉన్నాయి. నాలుగు ఎకరాలను తన భూమిలో కలిపేసి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. 2011లో ‘సాక్షి’ ఈ భూ కబ్జాపై వరస కథనాలు ప్రచురించడంతో రెవెన్యూ అధికారులు సర్వే చేసి కబ్జాను నిర్దారించారు. దీంతో ఆక్రమణదారులు అప్పట్లో ఈ నాలుగు ఎకరాలను వదిలేసి లోపలి వైపు కడీలు పాతారు. అప్పటి నుంచి ఖాళీగా ఉన్న ఈ సర్కారు భూమిపై ఇప్పుడు స్థానిక ప్రజాప్రతినిధి కన్నుపడింది. చదవండి: ఐబీఎస్ కాలేజ్ ర్యాగింగ్ ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు -
కలెక్టర్ ఆరోపణలు అసత్యం: ఈటల జమున
సాక్షి, హైదరాబాద్: ధరణిలో నమోదైన తర్వాతే భూములు కొన్నామని ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున అన్నారు. రాజకీయ అక్కసుతోనే ఆయనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈటల భూ వ్యవహారంపై మెదక్ జిల్లా కలెక్టర్ ప్రెస్‌మీట్‌పై ఆమె స్పందిస్తూ.. న్యాయ సలహా తీసుకున్న తర్వాతే భూములు కొన్నామని పేర్కొన్నారు. భూములకు సంబంధించిన అంశం కోర్టు పరిధిలో ఉంది. ప్రెస్‌మీట్ ఎలా పెడతారు. ప్రెస్‌మీట్ పెట్టడానికే కలెక్టర్లు ఉన్నారా అని ఈటల జమున ప్రశ్నించారు. చదవండి: గోవాలో ఎంజాయ్ చేస్తున్న ఖమ్మం ఎమ్మెల్సీ ఓటర్లు, వీడియో వైరల్ ‘‘సర్వే నెంబర్ 81లో మాకు ఉన్నది 5 ఎకరాల 30 గుంటలే. సర్వే నెంబర్ 130లో మూడు ఎకరాలు ఉంది.. కానీ కలెక్టర్ మాత్రం 70 ఎకరాలు ఆక్రమించారని అసత్యాలు చెబుతున్నారు. మేము ఎవరి దగ్గర భూమి గుంజుకుని రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. టీఆర్ఎస్ కండువా కప్పుకొని కలెక్టర్లు పని చేస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. ‘‘2018లో మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. అన్ని రకాల అనుమతులు వచ్చాకే షెడ్స్ నిర్మించాం. మొన్నటి వరకు ధరణిలో ఉన్న భూమిని ఇప్పుడు ప్రైవేటు భూమిగా చూపిస్తున్నారు. చాలా మంది రాజకీయ నాయకులకు హ్యాచరీస్ ఉన్నాయి. మరి వాటి దగ్గర పొల్యూషన్ రాదా. పొల్యూషన్ సర్టిఫికెట్ కావాలని ఇప్పుడు అడుగుతున్నారు. ఈటల రాజేందర్‌ను రోడ్డు మీద వేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రాజకీయ కక్ష సాధింపు మానుకోవాలని ఈటల జమున హితవు పలికారు. -
టీడీపీ కార్పొరేటర్ భూ దందాలకు అదుపే లేదు
దొండపర్తి(విశాఖ దక్షిణ): భూఆక్రమణలపై ఒకవైపు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంటే.. మరోవైపు టీడీపీ నేతలు అడ్డూ అదుపూ లేకుండా భూఆక్రమణలతో చెలరేగిపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవహరించిన మాదిరిగానే ఇప్పడు కూడా భూ దందాలు సాగిస్తున్నారు. ఒకవైపు వారి కబంద హస్తాల్లో ఉన్న భూములను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నా.. తమ పంథాను మార్చుకోవడం లేదు. తాజాగా 87వ వార్డు టీడీపీ కార్పొరేటర్ బొండా జగన్ భూఆక్రమణలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. గాజువాక ప్రాంతంలో ఆర్కార్డుల పేరుతో కబ్జాలకు తెరలేపారు. ఈయన వ్యవహారంపై ఇప్పటికే వడ్లపూడి, కణితి కాలనీ, అప్పికొండ ప్రాంతవాసులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. కోర్టులో ఉన్నప్పటికీ.. వడ్లపూడి ప్రాంతంలో ఆర్‌హెచ్ కాలనీ సెక్టార్–2లో 526, 527 ప్లాట్ నెంబర్ల వివాదం 2012 నుంచి గాజువాక జూనియర్ కోర్టు, హైకోర్టులో నడుస్తోంది. ఈ వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ.. గత ప్రభుత్వ హయాంలో వివాదమున్న ఇరువర్గాలను బెదిరించి ఆ ప్లాట్లకు నకిలీ పత్రాలు సృష్టించి బొండా జగన్ అతని సోదరుడు సూరిబాబు బినామీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసినట్లు స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అందులో 526 నంబర్ ప్లాట్‌ను కొద్ది నెలల క్రితం రూ.30 లక్షలకు విక్రయించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమార్కులకు అండగా.. భూఆక్రమణలకు పాల్పడడమే కాకుండా ఆక్రమణదారులకు కూడా టీడీపీ కార్పొరేటర్ బొండా జగన్ అండదండలు అందిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వడ్లపూడి ఆర్‌హెచ్ కాలనీ, అప్పికొండ కాలనీ సెక్టార్–2లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇరోతు గంగరాజు అనే వ్యక్తి 24 అడుగుల రోడ్డును కబ్జా చేసి ఇంటి నిర్మాణం పూర్తి చేశారు. ఈ నిర్మాణంపై అధికారులు చర్యలు తీసుకోకుండా జగన్ ఒత్తిడి చేశారని స్థానికులు ఇప్పుడు రెవెన్యూ, జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అప్పికొండ ప్రాంతంలో ప్లాట్ నెంబర్ 1799 పక్కన ఉన్న 24 అడుగుల రోడ్డును ఆనుకొని ఉన్న స్థలానికి నకిలీ పత్రాలు సృష్టించిన బొండా జగన్ ఓ వ్యక్తికి రూ.15 లక్షలకు విక్రయించగా.. ప్రస్తుతం అందులో ఇంటి నిర్మాణం చేస్తున్నట్లు స్థానికులు అధికారులకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. కణితి కాలనీ కళింగ వీధి చివర వాటర్ ట్యాంక్ పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో స్టీల్‌ప్లాంట్ నిర్వాసితుల పేరుతో ఇద్దరు వ్యక్తులు దొంగ పట్టాలతో రేకుల షెడ్డులు నిర్మించారు. ఆ నిర్మాణాలను రెవెన్యూ సిబ్బంది ఇప్పటికే రెండు సార్లు తొలగించారు. దీంతో కార్పొరేటర్ జగన్ వారితో ఒప్పందం చేసుకొని మళ్లీ నిర్మాణాలకు సిద్ధమవుతున్నారని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఎన్నికల్లో డబ్బులు సాయం చేసినందుకు గాను వడ్లపూడి మెయిన్ రోడ్డులో ఉన్న ఎస్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ వెనుక గల ఆర్ నెంబర్ భూముల్లో ఇటీవల రేకుల షెడ్డు నిర్మాణం చేసినట్లు అక్కడి వారు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదులపై అధికారులు విచారణకు సిద్ధమవుతున్నారు. ఆక్రమణలపై చర్యలు తీసుకుంటాం భూఆక్రమణలపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. కణితి కాలనీలో వచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే రెండు సార్లు నిర్మాణాలు తొలగించాం. మరోసారి నిర్మాణం చేపడితే వారిపై కేసులు పెడతాం. ఇప్పటికే ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ జరుపుతాం. – లోకేశ్వరరావు, గాజువాక తహసీల్దార్ -
ఈటలపై ఆరోపణలు.. దేవరయాంజాల్‌లో చురుగ్గా విచారణ
సాక్షి, మేడ్చల్ జిల్లా: హైదరాబాద్ నగర శివారులోని దేవరయాంజాల్ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ భూముల ఆక్రమణపై ఐఏఎస్ ఉన్నత స్థాయి కమిటీ విచారణ చురుగ్గా సాగుతోంది. మూడో రోజైన బుధవారం ఆలయ భూముల్లో అక్రమంగా నిర్మించినట్లు ఆరోపణలున్న నిర్మాణాలను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం.రఘునందన్‌రావు నేతృత్వంలోని ఐఏఎస్ అధికారుల కమిటీ పరిశీలించింది. ఆలయ భూముల కబ్జాలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తోపాటు పలువురి ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం విచారణకు నలుగురు ఐఏఎస్‌లతో కూడిన కమిటీని నియమించింది. దీంతో మూడు రోజులుగా ఆలయ భూము ల్లో వెలసిన నిర్మాణాలతోపాటు భూముల వివరాలను కమిటీ బృందం సేకరిస్తోంది. కష్టంగా వివరాల సేకరణ దేవరయాంజాల్‌లోని ఆలయ భూములకు సంబంధించి 91 సర్వే నంబర్ల పరిధిలో 39 మందికి సంబంధించి 178కి పైగా వాణిజ్య కట్టడాలు ఉన్నాయి. అయితే, ఇందులో 129కి మాత్రమే ఏడాదికి రూ.1.02 కోట్ల ఆస్తి వన్ను రూపేణా తూముకుంట మున్సిపాలిటికి చెల్లిస్తున్నట్లు తేలింది. ఆలయానికి సంబంధించి దాదాపు 200 ఎకరాల్లో కమర్షియల్ షెడ్లు ఉండగా, మరో 800 ఎకరాల భూములు వ్యవసాయ భూమిగా ఉన్నట్లు తెలుస్తోంది. గోదాములు, కమర్షియల్ షెడ్లతోపాటు ప్రహరీతో నిర్మించిన భూములు వందలాది ఎకరాలుగా ఉండ టం వల్ల వీటికి సంబంధించిన యజమానుల వివరాలు తెలుసుకునేందుకు సమ యం పడుతోంది. బినామీలతోపాటు 2, 3 తరాలకు చెందిన వారు యజమానులుగా ఉన్నట్లు వెల్లడవుతుండటం.. పైగా కొందరు మరణించటం వంటి వాటి వల్ల ఆ వివరాల సేకరణ కష్టంగా మారుతోంది. డీజీపీఎస్ టెక్నాలజీతో సర్వే ఆలయ భూములు, అందులోని నిర్మాణాలకు సంబంధించిన వివరాలు పక్కాగా సేకరించేందుకు కమిటీ బృందం అధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తోంది. గోదాములు, స్థలం (భూమి) లోకేషన్ ఆధారంగా డీజీపీఎస్ సర్వే చేస్తోంది. దీంతో అంగుళం కూడా తప్పిపోకుండా వివరాలు పక్కాగా ఉంటాయని అధికారులు అంటున్నారు. ఆలయానికి సంబంధించిన 1,531ఎకరాలల్లో 178కి పైగా నిర్మాణాలు ఉండటం వల్ల సర్వే పూర్తి కావడానికి రెండు రోజులు పట్టవచ్చునని సమాచారం. పత్రాలు చూపుతున్న రైతులు ఆలయ భూముల్లో సర్వే చేస్తున్న తహసీల్దార్ల బృందాలకు రైతులు పట్టాదారు పాసుపుస్తకాలతోపాటు పాత రికార్డులు, పత్రాలు చూపిస్తున్నారు. సర్వే నంబర్లు 671, 674, 676, 714లలో పలు నిర్మాణాలు చేపట్టిన రైతులు 25 ఎకరాలకు సంబంధించిన రికార్డులను విచారణ బృందం అధికారి రఘునందన్‌రావుకు చూపించారు. 715, 717, 718 సర్వే నంబర్లలో 16 ఎకరాలున్న యాజమాని కూడా పత్రాలను అందజేశారు. చదవండి: ఈటలపై భూకబ్జా ఆరోపణలు: వివరాలు వెల్లడించిన కలెక్టర్ Etela Rajender: ఈటలకు షాకిచ్చేందుకు ‘కెప్టెన్’ రెడీ! -
న్యాయం చేయండి: నిజాం మనవరాలు షఫియా షకీన
సాక్షి, హిమాయత్‌నగర్: మా తాత, నిజాం నవాబు వలేషాన్ ప్రిన్స్ మౌజామ్ జా బహుదూర్‌కు చెందిన ‘ప్రిన్స్ మౌజామ్ జా బహుదూర్ ట్రస్ట్’ స్థలాన్ని అన్యాయంగా ట్రస్టీ చైర్మన్ జాఫర్ జావెద్ కబ్జా చేశారని ఆ నవాబు ముని మనవరాలు, నిజాం నవాబ్ హుస్సేన్ అలీఖాన్ కుమార్తె ప్రిన్సెస్ షఫియా షకీన ఆరోపించారు. ట్రస్టుకు చెందిన స్థలాన్ని లీజుకు ఇవ్వడం కానీ, అమ్మడానికి కానీ వీలు లేదన్నారు. ట్రస్టులో నాకు భాగస్వామ్యం ఉన్నప్పటికీ నాకు ఏ మాత్రం చెప్పకుండా దానిని కబ్జా చేసి నాపై దౌర్జాన్యానికి తెగబడుతున్నారని ఆమె పేర్కొన్నారు. గురువారం బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్లో ఆమె భర్త మహ్మద్ అజారుద్దీన్ హైదర్, కుమారుడు హుస్సేన్ హైదర్‌లతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. బంజారాహిల్స్ రోడ్ నెం.3లో 24.10 ఎకరాల్లో మా స్థలం ఉందని, మా తాత గారు 1949లో చనిపోయేప్పుడు ట్రస్టును ఏర్పాటు చేసి నాతో పాటు మరో 13 మందికి ట్రస్ట్ భాగస్వామ్యాన్ని అప్పగించారన్నారు. ప్రస్తుతం ఈ స్థలంలో ముఫకంజా కాలేజీని స్థాపించి సొమ్ము చేసుకుంటున్నారని, ప్రభుత్వం దీనిపై సమగ్ర విచారణ జరిపి కబ్జా కోరల్లో ఉన్న సదరు స్థలాన్ని కాపాడి, తమతో పాటు ట్రస్టు సభ్యులకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. -
జగన్నాథుడి భూమి గుట్టు అధికారులకే ఎరుక!
సాక్షి, చెన్నూర్: జగతి మెచ్చిన దేవుడు.. కొరికేలు తీర్చే కల్పతరువు.. ఆపద్బంధువైన జగన్నాథుడి భూమిని కొందరు అప్పనంగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. మరోపక్క రికార్డుల్లోనూ స్వామిపేరున ఉన్న భూమి శ్రీరామబంటుగా పేరుగాంచిన హనుమంతుడి పేరిట మారడం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. చెన్నూర్‌లోని జగన్నాథాలయం పేరున ఉన్న భూమి రికార్డుల్లో మాత్రం ఇదే పట్టణంలోని గోదావరితీరా హనుమాన్ పేరిట మారడంలో అధికారుల తప్పిదమా..? లేక ఇందులో ఏదైనా మతలబు ఉందా..? అని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. దేవుడి భూమికే ఎసరు పెట్టాలని చూస్తున్నారని ఆల య కమిటీ మాజీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ఆ భూమి ఎలా వచ్చింది..? పట్టణంలో జగన్నాథాలయానికి ఓ చరిత్రే ఉంది. అలాంటి పూర్వకాలపు ఆలయానికి స్థానికంగా కొంత మాన్యాలు ఉండాలనే ఉద్దేశంతో అప్పటి రెవెన్యూ అధికారులు పట్టణ శివా రులోని 869/21 సర్వేనంబర్‌లోగల ప్రభుత్వ భూమి నాలు గెకరాలను 1972లో కేటాయించారు. ఆ భూమిని అప్పటి జగన్నాథాలయ ట్రస్ట్ చైర్మన్‌గా ఉన్న వానమామలై వరదాచార్యులకు ఆయన పేరిట పట్టా చేసి అప్పగించారు. వరదాచార్యులు చనిపోయిన అనంతరం ఆయన సతీమణి వైదే హి పేరిట మారింది. అయితే ఆ భూమి మీదుగా జాతీయ ర హదారి నిర్మాణం కావడంతో సుమారు 20 గుంటల భూమి కోల్పోయింది. మిగిలిన 3.20 ఎకరాల భూమికి హక్కు పత్రాలను రెవెన్యూ అధికారులు అప్పుడే వైదేహికి అందించారు. ఆమె మరణానంతరం కుమారుడు రవీంద్రచారి పేరిటకు మారగా.. ఆయన గిఫ్ట్‌డీడ్ పేరుతో 2014లో జగన్నాథాలయం పేరిట భూమిని మార్పించారు. సుమారు 48 ఏళ్లుగా జగన్నాథాలయం పేరుతో భూమి ఉన్నట్లు గతేడాది అప్పటి తహసీల్దార్ 1–బీ సైతం అందించారు. తాజాగా సదరు భూమికి సంబంధించిన రికార్డును పరిశీలిస్తే గోదావరితీరా హనుమాన్ మందిర్ పేరిట మారినట్లు చూపిస్తోంది. ఈ అంశంలో అసలు రికార్డుల్లో పొరపాటు జరిగిందా..? ఎవరైన కావాలనే పేరు మార్పించారా..? అనే కోణంలో అధికారులు సమగ్ర విచారణ జరిపి జగన్నాథాలయం భూమిని ఆలయ అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులకు అప్పగించాలని కమిటీ సభ్యులు పేర్కొంటున్నారు. రెవెన్యూ లీలాలు.. జగన్నాథాలయం భూమి రికార్డులను పరిశీలిస్తే రెవెన్యూ అ ధికారుల లీలలు వెలుగులోకి వచ్చాయి. గతేడాది రికార్డు ప్ర కారం 869/21 సర్వే నంబర్లో 3.20 ఎకరాల భూమి ఆల యం పేరిటే ఉంది. ప్రస్తుత రికార్డు ప్రకారం గోదావరి తీరా హనుమాన్ పేరున ఉంది. ఏడాది కాలంలోనే ఆలయం పే రు మారడంలోని ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇందులో ఎవరి హస్తం ఉందో..? జగన్నాథాలయం పేరిట ఉన్న భూమిని హనుమాన్ ఆలయం పేరిట మార్చాలని ఎవరు ఫిర్యాదు చేశారో అంతుచిక్కడం లేదు. ఏదేమైనా.. దేవుడిమాన్యాలు అన్యాక్రాంతం కాకుండా కాపాడి, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులే రికార్డులు మారిస్తే ఎవరికి చెప్పేదని పలువురు పేర్కొంటున్నారు. ఆలయానికి ఇస్తే మంచిదే.. జగన్నాథాలయానికి కేటాయించిన భూమిని కాపాడాలి. గతంలో కొంతభూమిని అధికారులు చూపించారు. అక్కడ బోర్డులు వేశాం. ప్రస్తుతం ఆ బోర్డులు సైతం లేకుండాపోయాయి. రికార్డులు పరిశీలించి అధికారులు భూమిని ఆలయానికి ఇస్తే మంచిదే. – దామెర మోహనాచార్యులు, జగన్నాథాలయ వంశపారంపర్య అర్చకులు, చెన్నూర్ -
టీడీపీ ఇన్సైడర్ ట్రేడింగ్
-
ప్రభుత్వ భూములపై దృష్టి సారించిన యంత్రాంగం
సాక్షి, యాదాద్రి: జిల్లాలో ప్రభుత్వ భూములెన్ని.. వివిధ అవసరాల నిమిత్తం ఎంత అసైన్డ్ చేశారు.. ప్రస్తుతం ఉన్నదెంత.. లేకపోతే ఎటుపోయింది.. లెక్క తేల్చే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ప్రభుత్వ భూముల వివరాలపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక కోరడంతో ఆ మేరకు చర్యలు చేపట్టారు. ప్రధానంగా హైదరాబాద్ శివారులో గల మండలాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. వీటితో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ ఆక్రమణకు గురయ్యాయి. దీంతో లెక్కలు తేల్చేందుకు అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. వెంచర్లుగా మారిన ప్రభుత్వ భూములు వ్యవసాయం, గృహ, సామూహిక ప్రజా అవసరాలు, ప్రభుత్వ అవసరాలకోసం ప్రభుత్వ భూములను అసైన్ చేశారు. ఇందులో వ్యవ సాయ భూములు పెద్ద ఎత్తున ఆక్రమణకు గురవడమే కాకుండా క్రయవిక్రయాలు జరిగాయి. జిల్లాలో వైటీడీఏ, బస్వాపురం, గంధమల్ల రిజర్వాయర్ల కోసం పెద్ద ఎత్తున భూసేకరణ జరుగుతోంది. పునరావాసం కింద బాధితులకు తిరిగి ప్రభుత్వం భూములను ఇవ్వాల్సి ఉంది. మరో వైపు ఇప్పటికే అసైన్ చేసిన భూములు కొన్ని క్రయవిక్రయాలు జరిగాయి. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. రియల్ఎస్టేట్ వ్యాపారం ముసుగులో భారీగా ప్రభుత్వ అసెన్ భూములు కొల్లగొట్టారు. ఆక్రమణలను అడ్డగించేవారు లేకపోవడంతో కోట్లాది రూపాయల విలువగల భూములను రియల్టర్లు గుట్టుచప్పుడు కాకుండా కబ్జా చేసి విక్రయించారు. హెచ్ఎండీఏ పరిధిలో ఐదు మండలాలు ఉన్నాయి. ఆయా మండలాల్లో గల ప్రభుత్వ అసైన్డ్ భూములను రియల్టర్లు కబ్జా చేసి ఓపెన్ప్లాట్ల వ్యాపారం చేశారు. నిరోధించాల్సిన యంత్రాంగ చూసి చూడనట్లు వ్యవహరించడంతో ఆక్రమాలు యథేచ్ఛగా జరిగిపోయాయి. ప్రభుత్వం గతంలో భూముల లెక్కలు తేల్చడానికి సర్వే చేపడితే వందకోట్ల రూపాయలు విలువ చేసే భూములు కబ్జా, ,క్రయవిక్రయాలు జరిగినట్లు తేలింది. క్షేత్రస్థాయిలో సరైన రక్షణ లేకపోవడంతో జిల్లాలోని 17 మండలాల్లో కబ్జాదారులు ప్రభుత్వ భూములపై కన్నేసి అందినకాడికి ఆక్రమించి అమ్ముకున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.100కోట్లకు పైగా విలువ చేసే 3,370 ఎకరాల భూములను ఆక్రమణకు గురైనట్లు తెలుస్తోంది. రూ.కోట్లల్లో డిమాండ్ హెచ్ఎండీఏ, మూసీ పరివాహక ప్రాంతం, యాదాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధి రెండు జాతీయ రహదారులు ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎకరం భూమి ధర రూ.కోట్లకు చేరింది. చౌటుప్పల్ డివిజన్లో పరిధిలో 33.608, భువనగిరి డివిజన్లో 49.604 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. చౌటుప్పల్ డివిజన్లో 14,140.32 ఎకరాల భూమిని, భువనగిరి డివిజన్లో 23693 ఎకరాల భూమిని రైతులకు అసైన్డ్ చేశారు. సగానికి పైనే అన్యాక్రాంతం ప్రభుత్వం అసైన్డ్ చేసిన భూములు సగానికి పైగా అన్యాక్రాంతమయ్యాయి. ఆభూముల పక్కనే గల భూములను కబ్జాదారులు యథేచ్ఛగా ఆక్రమించారు. గతంలో నిర్వహించిన ప్రభుత్వ భూముల సర్వేలో భూ ఆక్రమణలు బయటపడ్డాయి. ఈమేరకు అధికారులు ప్రభుత్వానికి నివేదికను పంపారు. రాజకీయ వత్తిడులు, కొందరు ఉన్నతాధికారులప్రమేయంతో ఖబ్జాభూములపై నివేదికలన ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే కేసులు నమోదు అసైన్ చేసిన భూ ముల క్రయవిక్రయాలు జరిగితే పీఓటీ కేసులు నమోదు చేస్తాం. అలాగే ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం హైదరాబాద్ శివారులో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను సేకరిస్తోంది. ప్రభుత్వం లెక్కలు తీస్తున్న జిల్లాలో యాదాద్రి భువనగిరి జిల్లా లేదు. ఇక్కడ బస్వాపురం రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న వారికి ప్రభుత్వ భూములు అవసరం ఉన్నాయి. –రమేశ్, జాయింట్ కలెక్టర్ ప్రభుత్వ భూముల వివరాలు ఎకరాల్లో మండలం మొత్తం ఏరియా వ్యవసాయానికి కేటాయింపు ఆలేరు 3794.08 1457.22 ఆత్మకూరు 8512.05 4302.09 భువనగిరి 8450.05 3341.19 బీబీనగర్ 5544.21 1884.07 బి.రామారం 6698.16 1831.06 మోత్కూర్ 8997.10 4426.23 రాజాపేట 4358.17 2346.34 తుర్కపల్లి 10920.03 4078.29 యాదగిరిగుట్ట 4618.22 1938.24 చౌటుప్పల్ 8057.33 2748.14 పోచంపల్లి 6707.15 5767.74 గుండాల 6094.06 2492.07 రామన్నపేట 7561.02 2830.26 వలిగొండ 7351.345 3218.03 మొత్తం 97665.18 39664.08 -
టీడీపీ నేత కుటుంబరావు భూ కబ్జా
-
రహదారి మాయం..!
మెదక్ మున్సిపల్ మాస్టర్ ప్లాన్–92కే ఎసరు పెట్టారు.. రహ‘దారులు’ మాయం చేశారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో రూపొందించిన ప్రణాళికలో పేర్కొన్న ప్రతిపాదిత రోడ్డు స్థలాల్లో యథేచ్ఛగా అక్రమ భవనాలు నిర్మించారు. ముడుపుల వల.. ప్రజాప్రతినిధుల అండతో మాస్టర్‌ప్లాన్ మార్పు, భవనాల క్రమబద్ధీకరణకు యత్నిస్తున్నారు. రూ.లక్షల మేర చేతులు మారిన ఈ వ్యవహారంలో బల్దియా ఉన్నతాధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, మెదక్ : రానున్న కాలంలో ప్రజావసరాలకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం మాస్టర్ ప్లాన్ రూపొందించి.. అందుకనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతుంది. ఇందులో భాగంగా ప్రతిపాదించిన రోడ్ల స్థలాలు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం.. అధికారుల పట్టింపులేని తనం వెరసి అక్రమ నిర్మాణాలకు నెలవుగా మారాయి. మెదక్ మున్సిపాలిటీ పరిధిలో ఈ దందా మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్లు సాగుతోంది. ప్రధానంగా పట్టణం నడిబొడ్డున ఉన్న గంగినేని థియేటర్ పక్కన కెనాల్ మీదుగా పంప్‌హౌస్‌కు వెళ్లే దారితోపాటు అజాంపూర్‌లో మాస్టర్ ప్లాన్ ప్రతిపాదిత రోడ్డు స్థలంలో అక్రమ కట్టడాలు వెలిశాయి. వీటి నిర్మాణాలు ప్రారంభమైన సమయంలోనే పలువురు స్థానికులు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. సుమారు రెండేళ్లవుతున్నా.. ఎవరూ పట్టించుకోకపోవడంతో అజాంపూర్‌లో మాస్టర్‌ప్లాన్ ప్రతిపాదిత రోడ్డుకు అడ్డంగా ఒక భవన నిర్మాణం పూర్తి అయింది. దీన్నే ఓ ప్రభుత్వ శాఖ అద్దెకు తీసుకుని కార్యకలాపాలు కొనసాగిస్తుండడం గమనార్హం. ఇక పంప్‌హౌస్ దారిలో మాస్టర్‌ప్లాన్ ప్రతిపాదిత రోడ్డు స్థలంలో సైతం రెండంతస్తుల భవన నిర్మాణం పూర్తయింది. రెండేళ్లుగా చోద్యం.. మాస్టర్‌ప్లాన్ ప్రతిపాదిత రోడ్డు స్థలాల్లో అక్రమ నిర్మాణాలకు సంబంధించి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అజాంపూర్‌లో ఓ భవన నిర్మాణం పూర్తయిన తర్వాత మాస్టర్‌ప్లాన్‌ను మార్చేందుకు ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. గతంలో మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో అజెండాలో పెట్టారు. అయితే.. అప్పుడు డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో పాటు పలువురు సభ్యులు వ్యతిరేకించగా దుమారం చెలరేగింది. దీంతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నట్లు తెలిసింది. మరోవైపు మెదక్ ప్రధాన రహదారి సమీపంలోని గంగినేని థియేటర్ నుంచి పంప్ హౌస్‌కు వెళ్లే రూట్లో కెనాల్‌ను ఆనుకుని 50 అడుగుల దారిని నిర్మించాలని మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచారు. ఇందులో కెనాల్ నుంచి బండ్ 20 మీటర్లు ఉండగా.. మిగతా స్థలాన్ని మాస్టర్ ప్లాన్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో కెనాల్‌ను ఆనుకుని ఉన్న స్థలంలో ఒకరు గతంలోనే రెండంతస్తుల భవన నిర్మాణం మొదలుపెట్టారు. ప్రస్తుతం భవన నిర్మాణం పూర్తయింది. అయితే సదరు భవన యజమాని గతంలో భవన క్రమబద్ధీకరణ కోసం ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోగా.. అధికారులు తిరస్కరించారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా మాస్టర్‌ప్లాన్ ప్రతిపాదిత రోడ్డు స్థలాల్లో యథేచ్ఛగా నిర్మాణాలు సాగినా.. రెండేళ్లుగా అధికారులెవ్వరూ పట్టించుకోకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమ్యామ్యాలు రూ.10 లక్షలపైనే ? మెదక్ పట్టణం నడిబొడ్డున మాస్టర్‌ప్లాన్ ప్రతిపాదిత రోడ్డు స్థలాల్లో అక్రమ కట్టడాల తతంగంలో భారీ ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు తెలుస్తోంది. థియేటర్ సమీపంలోని భవనానికి సంబంధించి మున్సిపాలిటీ పాలకవర్గంలోని పలువురు తాజా, మాజీ ప్రజాప్రతినిధులు, బల్దియాలోని కింది స్థాయి సిబ్బందికి కలిసి సుమారు రూ.10 లక్షలు ముట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పిల్లర్ల నిర్మాణ సమయంలోనే ఫిర్యాదులు రాగా.. నిర్మాణాన్ని నిలిపేసినట్లు అధికారులు చెప్పారు. కానీ.. ప్రస్తుతం భవన నిర్మాణం పూర్తయింది. అంటే ఇన్నాళ్లుగా చాటుమాటుగా పనులు కొనసాగినట్లు చెప్పవచ్చు. ప్రజాప్రతినిధుల అండతో మున్సిపల్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించినట్లు తెలుస్తోంది. అజాంపూర్‌కు సంబంధించి మాస్టర్ ప్లాన్ మార్చేందుకు జరిగి న యత్నంలో సైతం పెద్ద ఎత్తున డబ్బులు చేతు లు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా దృష్టి సారించాలి.. ఇవే కాకుండా.. మున్సిపల్ మాస్టర్‌ప్లాన్–92లో ప్రతిపాదించిన పట్టణ పరిధిలోని పలు రోడ్డు స్థలాలను పలువురు కబ్జా చేయగా.. కొందరు అక్రమంగా ఇళ్లు నిర్మిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి.. అక్రమ కట్టడాలకు కళ్లెం వేయాలి. భవిష్యత్ అవసరాలను గుర్తెరిగి అక్రమార్కులపై కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నోటీసులు జారీ చేస్తాం.. మాస్టర్ ప్లాన్ రహదారిలో కట్టడాలు నిర్మాణం నిషేధం. ఎవరైనా ఉల్లంఘిస్తేకఠిన చర్యలు తీసుకుంటాం. అజాంపూర్, పంప్‌హౌస్ దారికి సంబంధించి అక్రమ ని ర్మాణదారులకు నోటీసులు రెడీ చేయాలని టౌన్‌ప్లానింగ్ అధికారులను ఆదేశించా. – సమ్మయ్య, మున్సిపల్ కమిషనర్ -
తెలుగు తమ్ముళ్ల స్వాధీనంలో వందల ఎకరాలు
తిరుమలేశుని కైంకర్యాల కోసం దాతలు హథీరాంజీ మఠానికి కానుకగా సమర్పించిన భూములను భూ రాబందులు తన్నుకుపోయాయి. ఒకప్పుడు మఠం అధీనంలో వేలాది ఎకరాల భూములు ఉండేవి. అవి ప్రస్తుతం వందల ఎకరాలకు చేరుకున్నాయి. కొంతమంది బడా బాబులు లీజు పేరుతో ఈ భూములను తీసుకుని వేల కోట్లకు ఇతరులకు అమ్మేశారు. మిగిలిన భూములను గత ఐదేళ్ల కాలంలో తెలుగు దేశం పార్టీ నాయకులు గుర్తించి కబ్జా చేశారు. అపార్టుమెంట్లు నిర్మించారు. సాక్షి, తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీవేంకటేశ్వరస్వామికి పరమభక్తుడు హథీరాంజీ బాబా కొన్ని దశాబ్దాల క్రితమే శ్రీవారి సేవలో తరించారు. టీటీడీ ఏర్పాటుకాక ముందే హథీరాంజీ మఠం ఆధ్వర్యంలోనే శ్రీవారి కైంకర్యాలు జరిగేవి. హథీరాం జీ మఠం ద్వారా నైవేద్యాలు శ్రీవారికి సమర్పించిన తర్వాతనే మిగిలిన కైంకర్యాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల్లో కూడా ఇదే తంతు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలో ధూపదీప నైవేద్యాలు, ఇతర మౌలిక సౌకర్యాల కల్పన కోసం గతంలో తిరుపతి పరిసర ప్రాంతాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో వేల ఎకరాల భూములను దాతలు కానుకగా సమర్పించారు. కొన్నివేల కోట్ల విలువ చేసే ఈ భూములు హారతి కర్పూరంలా కరిగిపోయాయి. ►జిల్లాలో హథీరాంజీ మఠం భూములు సుమారు 1,628.71 ఎకరాలు ఉన్నట్టు ప్రాథమిక అంచనా ►లీజుకు ఇచ్చినవి 463.17 ఎకరాలు ►న్యాయస్థానంలో పలు వ్యాజ్యాలలో ఉన్నవి 326.17 ఎకరాలు ►ఆక్రమణకు గురైనవి 446.75 ఎకరాలు ►ప్రస్తుతం మఠం ఆధీనంలో ఉన్నవి 154.17 ఎకరాలు మఠం భూముల ఆక్రమణలో తెలుగుతమ్ముళ్లదే హవా గత ఐదేళ్లలో సుమారు 500 ఎకరాలకు పైగా తెలుగు తమ్ముళ్లు హథీరాంజీ భూములను ఆక్రమించుకుని పెద్దపెద్ద భవనాలు నిర్మించారు. ఇందులో తిరుపతి చెందిన పలువురు టీడీపీ బడా నాయకులు ఉన్నారు. సాక్షాత్తు తిరుపతి మాజీ ఎమ్మెల్యే సైతం 7 ఎకరాల మఠం భూములను ఆక్రమించుకుని బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. గత ప్రభుత్వం మఠం భూముల విషయంలో తెలుగు తమ్ముళ్లకు వత్తాసు పాడుతూ వచ్చింది. దేవదాయ, ధర్మాదాయ శాఖ సైతం మఠం భూముల విషయంలో పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో గత పది సంవత్సరాల్లో వేల ఎకరాల మఠం భూములు అన్యాక్రాంతానికి గురయ్యాయి. తిరుపతి పరిసర ప్రాంతాల్లోని పద్మావతీ నగర్, తిరుచానూరు, ముత్యాలరెడ్డిపల్లి, బైరాగిపట్టెడ వంటి ప్రాంతాల్లోని మఠం భూములు రెండు మూడు చేతులు మారినట్టు సమాచారం. విచారణ చేపడుతున్నాం హథీరాంజీ మఠం భూములు వేల ఎకరాలు ఆక్రమణకు గురైనట్టు మా దృష్టికి వచ్చింది. దీనిపై ప్రత్యేక బృందంతో విచారణ చేపట్టి సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. దేవదాయశాఖ, హథీరాంజీ మఠం అధికారులతో, రెవెన్యూ సిబ్బందితో మరోమారు సమావేశమై మఠం భూములను గుర్తిస్తాం. దీంతోపాటు లీజుకు ఇచ్చిన భూముల విషయంలోనూ సమగ్ర విచారణ జరుపుతాం. దురాక్రమణకు గురైన భూములను గుర్తించి స్వాధీనం చేసుకుంటాం. కబ్జాదారులు ఎంతటివారైనా వదిలే ప్రసక్తే లేదు. – వి.కనకనరసారెడ్డి, ఆర్డీవో, తిరుపతి -
మరీ ఇంత బరితెగింపా?
సాక్షి, చిత్తూరు : దీపం ఉన్నప్పుడే ఇల్లు ఎలా చక్కబెట్టుకోవాలనేది ప్రత్యక్షంగా చూడాలంటే చిత్తూరు నగరానికి రావాల్సిందే. అధికారంలో ఉండగానే ముందుచూపుతో దాదాపు రూ.5 కోట్ల విలువైన మునిసిపల్ స్థలాన్ని కొట్టేయాలని ప్లాన్చేశారు. ఇంకేముంది.. దీనికి కార్పొరేషన్లో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు తోడవ్వడంతో చకాచకా పనికానిచ్చేశారు. చిత్తూరు నగరంలోని కొత్త బస్టాండును ఆనుకుని ఉన్న రూ.5 కోట్లు విలువ చేసే కార్పొరేషన్‌కు చెందిన 3,500 అడుగుల స్థలంలో భవన నిర్మాణ పనులు చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. పక్కాగా ప్రణాళిక 20 ఏళ్ల క్రితం ఉద్యోగుల యూనియన్ కార్యాలయం కోసం ఆర్టీసీ బస్టాండులో స్థలాన్ని కేటాయించారు. దీన్ని తనకు లీజుకు ఇస్తే భవనం నిర్మించి, మొదటి అంతస్తును యూనియన్ కార్యకలాపాలకు, మిగిలిన దాన్ని తాము వాణిజ్య సముదాయంగా వినియోగిస్తామనే ప్రతిపాదనను టీడీపీ నేత కార్పొరేషన్‌లోని తనకు అనుకూలంగా ఉన్న ఉద్యోగి వద్ద చెప్పారు. వెనువెంటనే అప్పటివరకు ఉన్న ఉద్యోగ సంఘ అధ్యక్షుడిని మార్చేసి కొత్త వ్యక్తిని ఆ పీఠంపై కూర్చోబెట్టారు. ముందుగా అనుకున్నట్లు తనవద్ద డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తికి రూ.5 కోట్ల విలువ చేసే స్థలాన్ని 25 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేలా యూనియన్‌లో ఓ అజెండాను ప్రవేశపెట్టి తీర్మానం చేశారు. ఆర్నెల్ల క్రితం జరిగిన ఈ వ్యవహారం ఎవరికీ తెలియకుండా చాలా రహస్యంగానే ఉంచగలిగారు. ఆ హక్కు ఉందా? మునిసిపల్ స్థలాన్ని యూనియన్‌కు కేటాయించినా కమిషనర్ స్థాయి అధికారి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసివ్వాలి. కానీ ఇప్పటివరకు ఆ స్థలం యూనియన్ పేరిట రిజిస్ట్రేషన్ కాలేదు. మూడేళ్లు, అయిదేళ్లు పాటు ఎవరికైనా స్థలా న్ని అద్దెకు ఇవ్వొచ్చు తప్ప 25 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వ డం, రిజిస్ట్రేషన్ చేసివ్వడం చట్టరీత్యా నేరం. కమిషనర్ అనుమతి లేకుండా మునిసిపల్ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసిచ్చినందుకు ఉద్యోగులను సస్పెండ్ చేసి, చట్టరీత్యా చర్యలు తీసుకునే అధికారం కమిషనర్‌కు ఉంటుంది. ప్రభుత్వం మారడంతో వెలుగులోకి.. రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, ఇటీవల ఉద్యోగులతో స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సమావేశం నిర్వహించినప్పుడు ధైర్యం చేసిన ఉద్యోగులు కార్పొరేషన్ స్థలం కబ్జా అవుతున్న విషయంపై నోరు విప్పారు. స్థలా న్ని ఎవరికీ లీజుకుగానీ, రిజిస్ట్రేషన్‌గానీ చేసివ్వొద్దంటూ ఎమ్మెల్యే మునిసిపల్ అధికారులను ఆదేశించారు. దీంతో వారం క్రితం కొత్త యూనియన్ను ఎన్నుకోవడానికి సమావేశం పెట్టడం, స్థలం లీజుకు ఇవ్వడం చెల్లదంటూ అందరూ ముక్తకంఠంతో ప్రశ్నించారు. అయితే ఇద్దరు మునిసిపల్ ఉద్యోగులు మాత్రం ఖాళీ స్థలంలో పనులు త్వరగా పూర్తిచేయాలని టీడీపీ నేతకు సూచించడంతో ప్రస్తుతం ఇక్కడ భవనం నిర్మించడానికి మట్టిని కూడా తీసుకొచ్చి సిద్ధమవుతున్నారు. క్రిమినల్ కేసు పెట్టిస్తా ఇది మునిసిపాలిటీ స్థలం. దీన్ని యూనియన్‌కు ఇచ్చినట్లు రిజిస్ట్రేషన్ పత్రాలు ఏవీ నాకు చూపించలేదు. ఈ స్థలాన్ని ఎవరూ ఎవరికీ లీజుకు ఇవ్వడం.. రిజిస్ట్రేషన్ చేసివ్వడం కుదరదు. ఒకవేళ ఎవరైనా లీజుకు తీసుకుని ఇక్కడ నిర్మాణాలు చేపడితే అతనితో పాటు కార్పొరేషన్ స్థలాన్ని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసిచ్చినందుకు ఉద్యోగ సంఘ నాయకులపై క్రిమినల్ కేసు పెట్టమని పోలీసులకు ఫిర్యాదు చేస్తా. – చల్లా ఓబులేసు, కమిషనర్, చిత్తూరు నగర పాలక సంస్థ -
దేవుడి భూమిలోనూ అక్రమంగా.
సాక్షి, పాలకొల్లు(పశ్చిమ గోదావరి): భూమి యజమాని తన స్థలంలో మట్టిని తవ్వుకోవాలన్నా అధికారుల అనుమతులు తప్పనిసరి. అలాంటిది దేవస్థానం భూమిని కౌలుకు తీసుకున్న ఓ కౌలు రైతు ఆ భూమిలో మట్టిని దర్జాగా బయటకు తరలించేస్తుండటం గమనార్హం. పంచారామక్షేత్రాల్లో ప్రసిద్ధి గాంచిన పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి దేవస్థానం భూమి అనేక చోట్ల ఉంది. స్వామివారి పేరున సుమారు 57.30 ఎకరాల భూమి ఉంది. అందులో సుమారు ఆరు ఎకరాలు సబ్బేవారి పేట శివారు ప్రాంతంలో ఉంది. దానిని ఓ రైతు కౌలుకు పాడుకున్నాడు. ఇంకా సంవత్సరంన్నర కౌలు గడువు ఉన్నట్లు సమాచారం. ఈ ఆరు ఎకరాల్లో మట్టిని నాలుగు రోజుల నుంచి తవ్వేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దేవుని భూమిని కౌలుకు తీసుకుని పంటను పండించుకోవాలి గాని ఇలా మట్టి అమ్మేసుకుంటారా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగు రోజుల క్రితం మట్టిని తవ్వుతుండగా దేవస్థానం సిబ్భంది వచ్చి రైతును హెచ్చరించి వెళ్లారని వారు వెళ్లిన తరువాత మళ్లీ తవ్వడం మొదలు పెట్టాడని స్థానికులు తెలిపారు. కాని రెండోసారి దేవస్థానం అధికారులు గాని సిబ్బంది గాని ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదని చెబుతున్నారు. రూ. ఏడు లక్షలు స్వాహా ఎకరాకు సుమారు 300 నుంచి 350 ట్రాక్టర్ల చొప్పున సుమారు నాలుగు ఎకరాల్లో సుమారు 1200 నుంచి 1400 ట్రాక్టర్ల మట్టిని అక్రమంగా తరలించినట్టు సమాచారం. ఒక్కో ట్రాక్టర్ మట్టి రూ.500 వరకూ విక్రయిస్తున్నారు. అంటే సుమారు ఇప్పటి వరకు రూ. ఏడు లక్షల వరకు మట్టిని స్వాహా చేసేశారు. దీనిపై దేవస్థానం అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. మట్టి తవ్వాలంటే అనుమతులు ఉండాలి ఏభూమిలో అయినా మట్టిని తవ్వాలంటే ముందుగా అనుమతులు తీసుకోవాలి. భూమి వివరాలతో పాటు మట్టిని ఎందుకు విక్రయిస్తున్నారో తెలిపే విదంగా ఒక దరఖాస్తును తహసీల్దార్ కార్యాలయంలో అందజేయాలి. దానిని మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్‌కు సిఫార్సు చేస్తాం. దాంతో మైనింగ్ సర్వేయర్, రెవెన్యూ సిబ్బంది కలిసి భూమిని సర్వే చేసి ఎన్ని క్యూబిక్ మీటర్లు తవ్వాలో అంచనాలు వేస్తారు. అంచనాలు వేసిన క్యూబిక్ మీటర్లకు సీనరేజి చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. క్షీరారామలింగేశ్వరస్వామి దేవస్థానానికి సంబంధించిన భూమిలో మట్టి తవ్వకానికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. – ఎస్. నరసింహారావు, తహసీల్దార్, పాలకొల్లు -
అయ్యా కాల్మొక్త.. కనికరిచండి
సాక్షి, మహబూబ్‌నగర్ న్యూటౌన్ : అయ్యా.. నీ కాల్మొక్త.. నా భూమిని ఖబ్జా చేసిండ్రు.. అడిగితే కొడుతుండ్రు.. 30 ఏళ్ల కిందట ఎకరాకు రూ.16 వేల చొప్పున 5 ఎకరాలు భూమి కొన్నా.. నా భూమి పక్కనే ఉన్న తిమ్మారెడ్డి అనే దొర ఈ మధ్య పొలంలో ఖడీలు పాతిండు. ఇదేంటంటే కొట్టిండు.. ఊరి పెద్దమనుషులు కూడా ఆయనకే మద్దతు చెప్తున్నరు.. జర నాకు నాయం చెప్పండి.. అంటూ మహబూబ్‌నగర్ మండలం బొక్కలోనిపల్లికి చెందిన చిన్నబాలప్ప అధికారులకు తన గోడును వెళ్లబోసుకున్నాడు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు తమ ఫిర్యాదులు, వినతులను అధికారులకు అందజేసి వేడుకున్నారు. జాయింట్ కలెక్టర్ ఎస్.వెంకట్రావు, డీఆర్వో వెంకటేశ్వర్లు, సర్వే ల్యాండ్ ఏడీ శ్యాంసుదర్‌రెడ్డి, సోషల్ వెల్ఫేర్ డిడి ఉదయ్‌కుమార్ వినతులు స్వీకరించారు. ఎక్కువగా భూ కబ్జాలు, రైతుబంధు చెక్కు, పాస్‌బుక్కులు, హాస్టళ్లలో పిల్లలకు సీట్లు ఇప్పించాలని, పెన్షన్లు, ట్రైసైకిళ్లు అందించాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం 66 దరఖాస్తులు అందించగా హెల్ప్‌డెస్క్ ద్వారా ఉచితంగా సేవలందించారు. ఉన్నతాధికారులు వచ్చిన వినతులను శాఖల వారీగా విభజించి పరిష్కరించాలని ఆయా శాఖల మండల అధికా రులను ఆదేశించారు. పాస్‌బుక్కులు, చెక్కులు రాలె భూప్రక్షాళన సర్వే చేసి ఆర్వోఆర్ 1బి ఇచ్చారు. రైతుబంధు పథకంలో అందరికిలాగే మాకు కూడా పాస్‌పుస్తకాలు, చెక్కులు వస్తాయని అనుకున్నాం. కానీ ఇంతవరకు రాలేదు. ఎందుకని అడిగితే సరిగ్గా సమాధానం చెప్తలేరు. సర్వే నెం.67లో మొత్తం 14.10 ఎకరాల భూమికి సంబంధించి రైతుబంధు పథకం పట్టాదారు పాస్‌పుస్తకాలు, చెక్కులు ఇప్పించాలని కోరుతూ మహబూబ్‌నగర్ మండలం వెంకటాపూర్ గ్రామ పరిధిలోని అవతలిగడ్డతాండకు చెందిన కె.చంద్రు నాయక్ తన కుటుంబ సభ్యులతో వచ్చి గోడును చెప్పుకున్నాడు. -
దర్జాగా కబ్జా
► అధికార పార్టీ నేత అనుచరుడి భూ ఆక్రమణ ► అక్రమంగా ఆన్లైన్లో పేర్లు మార్చిన వైనం ► తహసీల్దార్‌ను ఆశ్రయించిన బాధిత రైతులు రుద్రవరం (కర్నూలు సీక్యాంప్ ): దాదాపు ఐదు దశాబ్దాలుగా ఇద్దరు నిరు పేదలు సాగు చేసుకుంటున్న భూములు తమవి అంటూ రాత్రికి రాత్రే కబ్జా చేశాడు ఓ అధికారి పార్టీ నేత అనుచరుడు. అధికారుల అండతో ఆన్లైన్లో పేరు మార్చి దర్జాగా కబ్జాకు పాల్పడ్డాడు. కర్నూలు మండల పరిధిలోని రుద్రవరం సర్వే నంబర్లో 474–1లో 2 ఎకరాలు, 473–2ఎలో 2.50 ఎకరాలను రుద్రవరం గ్రామానికి చెందిన మాదిగ పక్కీరన్న, మాదిగ నరసింహులు పెద్దల ఆస్తిగా సాగు చేసుకుంటున్నారు. ఈ పొలాలకు వారి పేరు మీద పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయి. ఇటీవల అధికార పార్టీ నేత అనుచరుడు శ్రీనివాసరెడ్డి రైతు నరసింహులు పొలంలో ఎకరా 18 సెంట్లు, పక్కీరన్న పొలంలో 25 సెంట్లు తన పేరు మీద ఆన్లైన్లో పేరు మార్పించాడు. పేదల భూములు శ్రీనివాసరెడ్డికి ఆన్లైన్ కావడంలో వీఆర్వో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. దాదాపు రూ.2 లక్షల వరకు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. కేసీ కెనాల్ నష్టపరిహారం వస్తుందని పథకం ప్రకారం రెండు నెలలు క్రితం పక్కీరయ్య పొలం పాస్‌పుస్తకాలను వీఆర్ఓ తన దగ్గర ఉంచుకున్నాడు. ఈ సమయంలో ఆన్లైన్లో శ్రీనివాస్‌రెడ్డి పేరును వీఆర్వో దగ్గరుండి నమోదు చేయించాడని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. ఇటీవల శ్రీనివాసరెడ్డి పీఏ రైతుల దగ్గరకు వచ్చి ఆ స్థలం తమ యజమానిదని, ఖాళీ చేయాలని హుకుం జారీ చేశాడు. ఉలిక్కిపడిన రైతులు మీసేవా కేంద్రానికి వెళ్లి ఆన్లైన్ పరిశీలించగా వారి సర్వేనెంబర్లు 474–1 , 473–2ఎ కొంత భూమి శ్రీనివాసులు రెడ్డి పేరు మీద నమోదు కావడంతో ఆందోళన చెందారు. ప్రస్తుతం ఈ స్థలంలో శ్రీనివాసరెడ్డి ట్రిప్పర్లు, లారీలను ఉంచాడు. ఈ మేరకు బాధిత రైతులు తహసీల్దార్ టీవీ.రమేష్‌బాబుకు ఫిర్యాదు చేశారు. బాధితుల వాదన విన్న తహసీల్దార్ ఆర్ఐతో విచారణ జరిపించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. నగర శివారుపై అధికార నేత చూపు: అధికార పార్టీ నేత చూపు నగర శివారు ప్రాంతాలైన బి.తాండ్రపాడు, మునగాలపాడు, పసుపల, రుద్రవరం, నందనపల్లె వంటి ప్రాంతాలపై పడింది. లిటిగేషన్ భూములు కనిపిస్తే చాలు తన అనుచరులను అక్కడ దింపి భూములను కబ్జాకు గురిచేస్తున్నారు. ఎవరైన అడ్డవస్తే ఏదో కొంత ముట్ట జెప్పడం, తమ మాట వినని వాళ్లను అధికారంతో బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారుల అండతో ఈ వ్యవహారం మంచి ఫలితాలు ఇవ్వడంతో ఇక శివారు భూములను దర్జాగా కబ్జా చేయడమే పనిగా పెట్టుకున్నారు. న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుంటాం: ఈ పొలం మా తాతలు, తండ్రుల కాలం నుంచి మాకు సంక్రమించింది. మేము అమ్మకుండానే వేరే వాళ్లకు ఆన్లైన్లో పొలం ఎలా వెళుతుంది. మా పొలం మేము ఎవ్వరికి అమ్మలేదు. మా పొలం మాకు దక్కకపోతే కలెక్టర్ ఎదుట మా కుటుంబం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటాం. -మాదిగ పక్కీరయ్య, నరసింహులు -
దర్జాగా కబ్జా..!
రాఘవాపురంలో 24 ఎకరాలు భూమి ఆక్రమణ సీఎం కేసీఆర్‌కు బాధితుడి ఫిర్యాదు రంగంలోకి దిగిన పోలీసులు.. 15 మంది అరెస్ట్.. ఆరుగురు పరారీలో.. సాక్షి, యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ భూ కుంభకోణం వెలుగుచూసింది. అధికారులు, రాజకీయ నాయకులు రికార్డులను తారుమారు చేసి ఎన్ఆర్ఐకి చెం దిన 24ఎకరాల భూమిని కబ్జా చేశారు. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న మండలాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే భూములను రాజకీయ నేతలు, అధికారులు కలిసి అక్రమిస్తున్నారనడానికి ఈ ఘటనే నిదర్శనం. కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో గ్యాంగ్‌స్టర్ నయీమ్ పేరుతో జరిగిన భూ అక్రమణ దందాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని హయత్‌నగర్‌లో భూ దాన్ బోర్డు మాజీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డిని శుక్రవారం హయత్‌నగర్ పోలీస్‌లు అరెస్ట్ చేశారు. తాజాగా బీబీనగర్ మండలం రాఘవాపురంలో సుమారు రూ.10 కోట్లు వి లువచేసే 24ఎకరాల భూమి(ఎకరం రూ.35 లక్షలు) స్థా నిక ఎంపీపీ భర్త టీఆర్ఎస్ నేత గోలి పింగల్‌రెడ్డి, మరో 22మంది కలిసి అక్రమంచిన ఘటన వెలుగుచూసింది. ఏం జరిగిందంటే..: బీబీనగర్ మండలం రాఘవాపురం లో హైదరాబాద్‌లోని నల్లకుంటకు చెందిన సీహెచ్ వెంకటేశ్వర్లు, పి.నాగేశ్వర్రావు మరో 11మందికి సంబంధించి న సర్వే నెంబర్ 567లోని 12ఎకరాల 22 గుంటలు, 569 లోని 9ఎకరాల 19గుంటలు, 583లోని 2ఎకరాలు మొ త్తం 24ఎకరాల ఒక గుంట భూమిని 1992లో ఎన్ఆర్ఐ దీపక్‌కాంత్‌వ్యాస్ కొన్నేళ్ల క్రితం కొనుగోలు చేశాడు. అలా గే తన భార్య శ్వేతవ్యాస్ పేరుమీద 586 సర్వే నెంబర్లోని 2ఎకరాల 6 గుంటలు, తన సోదరుడు విమల్కాంత్ వ్యా స్ పేరుపై 583సర్వేనెంబర్‌లోని 2ఎకరాల భూమి కొన్నా డు. 586, 583 సర్వే నెంబర్ల భూములు జస్తీ పార్వతీదేవి నుంచి కొనుగోలు చేసి పాస్‌బుక్‌లు, టైటిల్ డీడీలు పొందాడు. అనంతరం దీపక్ యూఎస్ఏ వెళ్లిపోయాడు. నకిలీ పాస్‌బుక్‌లు, స్టాంప్‌లతో.. దీపక్‌కాంత్‌కు చెందిన రెండు గుంటలు తక్కువ 24 ఎకరాలను బీబీనగర్‌కు చెందిన కొమ్మిడి వంశీకృష్ణారెడ్డి, భట్టగూడెంకు చెందిన వ్యక్తి జొన్నవాడ మహిపాల్‌రెడ్డి కబ్జా చే శాడు. 2007నుంచి ఈసర్వే నెంబర్లలోని భూములు రెవె న్యూ రికార్డుల్లో పట్టాదారులుగా దీపక్‌కాంత్ వ్యాస్ ఉండ గా కబ్జాలో మాత్రం వంశీధర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి పేర్లు వస్తున్నారుు. మరో దీపక్‌కాంత్‌ను సృష్టించారు కబ్జాదారులు భూ యజమానికి దీపక్‌కాంత్‌వ్యాస్‌కు బదులుగా కొత్త దీపక్‌కాంత్‌ను సృష్టించారు. అధికారులను మచ్చిక చేసుకుని రెవెన్యూ రికార్డుల్లోని దీపక్‌కాంత్ ఆధార్‌కార్డును తీసుకొని నకిలీ ఆధార్‌కార్డు, నకిలీ పాస్‌బుక్ తయారు చేశారు. ఈ పాస్‌బుక్‌లో దీపక్‌కాంత్‌కు బదులుగా గుర్తుతెలియని వ్యక్తి ఫొటో పెట్టి నకిలీపాస్బుక్లు పొందారు. మే 18, 2016న దీపక్‌కాంత్ హైదరాబాద్‌లో ని గడ్డి అన్నారంకు చెందిన బండారు జితేందర్‌కుమార్, హైదరాబాద్ హబ్సిగూడకు చెందిన జిల్లాల రవీం దర్‌రెడ్డి, మలిపెద్ది అరవింద్‌రెడ్డికి జీపీఏ చేసినట్లు రి కార్డులు సృష్టించి సేల్‌డీడీ కోసం బీబీనగర్ తహాసీల్దార్ కార్యాలయంలో ఆర్జీ చేశారు. కాగా రెవెన్యూ రికార్డుల్లో పట్టదారు, కబ్జదారుల పేర్లు వేర్వేరుగా వస్తుండడంతో తహసీల్దార్ సెల్ డీడీ చేయడానికి నిరాకరించారు. దీంతో ఇది అక్కడికే ఆగిపోయింది. ఆతర్వాత దీపక్‌కాంత్‌వ్యాస్‌కు సం బంధించిన మ ద్యవర్తికి భూమి కబ్జా అరుున విషయం తెలిసింది. మధ్య వర్తిని మచ్చిక చేసుకోవడాదనికి కబ్జాదారులు రూ.50లక్షల ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం. 24ఎకరాల భూమి విలువ సుమారు రూ.10 కోట్ల వరకు పలుకుతుండడంతో మధ్యవర్తి అక్రమార్కులకు సహకరించలేదు. భూమి కబ్జా అయిన విషయాన్ని దీపక్‌కాంత్ వ్యాస్‌కు మధ్యవర్తి సమాచారం చేరవేశాడు. కాగా దీపక్‌కాంత్ భూమికి సంబంధించిన పట్టాదారు పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్ పోయాయి.దీపక్ కాంత్ తన భూమికబ్జా జరిగిన విషయం, పట్టాదారు పాస్‌పుస్తకా లు పోయిన విషయాన్ని సెప్టెంబర్‌లో ముఖ్య్యమంత్రి కే సీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాడు. వెంటనే స్పందించిన సీఎం విచారణ జరపాలని డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి సూచించారు. ఈ మేరకు డిప్యూటీ సీ ఎం అక్టోబర్ 13న బీబీనగర్ తహసీల్దార్ అశోక్‌రెడ్డిని త న కార్యాలయానికి పిలిపించి జరిగిన విషయాన్ని తెలుసుకుని కబ్జాదారులకు నోటీస్‌లు ఇవ్వాలని ఆదేశించారు. నిజమైన భూమి యజమాని దీపక్ కాంత్ వ్యాస్‌కు పట్టాదారు, టైటిల్ డీడ్ డూప్లికేట్ ఇవ్వాలని ఆదేశించారు.అరుుతే సేల్ డీడ్ కోసం ఈ సంవత్సరం మే 18న దరఖాస్తు చేసుకున్న కబ్జాదారులైన వంశీకృష్ణారెడ్డి, మహిపాల్‌రెడ్డికి నవంబర్ 17న తహసీల్దార్ నోటీస్‌లు ఇచ్చారు. వీరిలో మహిపాల్‌రెడ్డి ఇటీవల మృతి చెందాడు. అయితే వెంటనే ఆ భూమితో మాకెలాంటి సంబంధంలేదని కబ్జాదారులు బీబీనగర్ తహసీల్దార్‌కు లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చా రు. తహసీల్దార్ విచారణ అనంతరం జరిగిన తప్పును గుర్తించి దీపక్‌కాంత్ వ్యాస్‌కు డూప్లికేట్ పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్లు ఇచ్చారు. కబ్జా విషయాన్ని దీపక్‌కాంత్ రాచకొండ పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీస్ క మిషనర్ ఇన్సపెక్టర్ నవీన్‌కుమార్‌ను విచారణాధికారిగా నియమించారు. దీంతో భూకబ్జాతోపాటుఅందులో ఉన్న వారందరిపై కేసు నమోదు చేశారు. వెంచర్‌చేసి అమ్మకానికి పెట్టారు బీబీనగర్ చెందిన టీఆర్ఎస్ నాయకుడు గోలిపింగల్రెడ్డి, పంజాల పెంటయ్య, కొమ్మిడి మల్లారెడ్డి, బిజిలియాదగిరి, బుయ్యసాంబయ్య, కొర్ని మహేష్, బానోతు లక్ష్మణ్‌లతోపాటు మొత్తం 21 మంది కలిసి భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుని వెంచర్ ప్రారంభించారు. అమ్మకానికి పెట్టిన సమయంలో విషయం బయటపడింది. గుట్టు చప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్..! బీబీనగర్ తహసీల్దార్‌కార్యాలయం, భువనగిరి ఆర్డీవో కార్యాలయం రబ్బర్ స్టాంప్‌లను తయారు చేశారు. భూ యజమానికి సంబంధించిన నకిలీ ఆధార్‌కార్డు, పాస్‌బుక్‌లను శంకర్ అనే వ్యక్తి ఫోటో పెట్టి తయారు చేశారు. బీబీనగర్‌లో సబ్‌రిజిస్టార్ కార్యాలయం ఉన్నా గుట్టు చ ప్పుడు కాకుండా పనికానిచ్చేందుకు చౌటుప్పల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌ను ఎంచుకున్నారు. అక్కడి అధికారులు సిబ్బం ది, డాక్యుమెంట్ రైటర్ సహకారంతో పని పూర్తి చేశారు. 15 మంది అరెస్ట్ : భూ ఆక్రమణలో ప్రేమయం ఉన్న 21 మందిలో శనివారం పోలీసులు 15 మంది అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఆరుగురు ప రారీలో ఉన్నట్లు సీపీ మహేష్ భగవత్ తెలిపారు. -
ఎంపీ కుమారుల భూమి రిజిస్ట్రేషన్ రద్దు
హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప భూ ఆక్రమణలపై జిల్లా కలెక్టర్ శశిధర్ స్పందించారు. రికార్డులు తారుమారు చేసిన బూదిలి గ్రామ వీఆర్ఓ నరసింహమూర్తిని సస్పెండ్ చేస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఎంపీ నిమ్మల కిష్టప్ప కుమారులు చేయించిన భూమి రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాధితులకే భూములు అప్పగిస్తూ కలెక్టర్ శశిధర్ ఉత్తర్వులు ఇచ్చారు. (చదవండి - నిమ్మల భూ కిరికిరి) బాధిత రైతు మల్లేశప్ప జిల్లా కలెక్టర్, ఎస్పీని మీ కోసం కార్యక్రమంలో కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని విన్నవించుకున్నాడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈనెల 18న స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో 2011లో భూమి కొనుగోలు చేసిన వ్యక్తులతో పాటు బాధిత రైతు మల్లేశప్ప తహశీల్దార్ ఎదుట హాజరై తన వాంగ్మూలంతో పాటు భూములకు సంబంధించిన పక్కా రికార్డులను సమర్పించారు. -
పేదల జోలికొస్తే ఖబడ్దార్ !
ఒక్క ఇటుక రాయి కదిలించినా {పజా ఉద్యమాలు తప్పవు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హెచ్చరిక తిరుపతిరూరల్: ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు నాల్కల ధోరణి అవలంభిస్తున్నారు. ఏళ్ల తరబడి నివసిస్తున్న పేదల గూడును కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పేదల జోలికి వస్తే ఖబడ్దార్’’ అంటూ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అవిలాల ధనలక్ష్మి నగర్లో పేదలు నిర్వహించిన సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మఠం భూముల్లో పేదలు నివసిస్తున్న ఇళ్లను కూల్చివేస్తామని ప్రకటించడంపై మండిపడ్డారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మఠం భూముల ఆక్రమణ తొలగించాలని ముఖ్యమంత్రి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత ఎన్నికల్లో మఠం, డీకేటీ భూముల్లో నివసిస్తున్న పేదల ఇళ్లను క్రమబద్ధీకరిస్తామని ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పేదల ఇళ్లను కూల్చివేస్తామని ప్రకటించడం దారుణమన్నారు. పేదల ఇళ్లకు చెందిన ఒక్క ఇటుక రాయిని కదిలించినా ప్రజా ఉద్యమాలను ప్రభుత్వం ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. గూడుకోసం పేదలుచేసే పోరాటాలకు తాను ముందుంటానని హామీ ఇచ్చారు. నిరుపేదలు నివసిస్తున్న ఇళ్లను కూల్చితే వారి ఘోష చంద్రబాబుకు తగులుతుందని అవిలాల సర్పంచ్ కుమారిలోకనాధరెడ్డి అన్నారు. పేదల ఇళ్లను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు సెల్వం, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
10వేల ఎకరాలు హాంఫట్!
* విలువ రూ.20 వేల కోట్ల పైనే! * సర్వేలో విస్మయపరిచే నిజాలు * నగర శివార్లలోనే ఏకంగా 8 వేల ఎకరాలు అన్యాక్రాంతం * ప్రాథమిక నివేదిక సమర్పించిన రంగారెడ్డి జిల్లా యంత్రాంగం సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: ప్రభుత్వ భూములకు రెక్కలొచ్చాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.20 వేల కోట్ల విలువైన సర్కారీ భూములు కబ్జాదారుల కబంధహస్తాల్లో చిక్కుకుపోయాయి. భూముల ఆక్రమణలపై రంగారెడ్డి జిల్లా యంత్రాంగం జరిపిన సర్వేలో విస్మయకర నిజాలు వెలుగు చూశాయి. ప్రభుత్వ భూముల్లో ఎంతమంది పాగా వేశారో లెక్క తీయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో రంగంలోకి దిగిన అధికారగణం.. జిల్లాలో 10,366.14 ఎకరాల భూమి అన్యాక్రాంతమైనట్లు గుర్తించింది. మరికొన్ని మండలాల నుంచి సమాచారం రావాల్సి ఉండడంతో ఈ గణాంకాలు పెరిగే అవకాశం లేకపోలేదు. పరిశ్రమలకు, వివిధ సంస్థలకు బదలాయించిన స్థలాలతోపాటు ఇంకా ఎవరికీ కేటాయించని భూముల వివరాలను పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలోనే 64,671.39 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు నిర్ధారించిన రెవెన్యూ యంత్రాంగం.. ఇందులో కేవలం 3,395.07 ఎకరాలు మాత్రమే వివాదరహితంగా ఉందని తేల్చింది. పోరంబోకు, సీలింగ్, కారీజ్ ఖాతాలుగా వర్గీకరించిన భూములు అక్రమార్కుల చెరల్లో చిక్కుకున్నాయని పసిగట్టిన యంత్రాంగం.. గ్రామీణ ప్రాంతాల్లో వీటిని సాగుకు వినియోగించుకుంటున్నట్లు గుర్తించింది. నగర శివార్లలో మాత్రం ల్యాండ్ మాఫియా గుప్పిట్లో వేలాది ఎకరాలు మగ్గుతున్నట్లు లెక్క తేల్చింది. అయితే, ఈ భూముల హక్కుల కోసం కోర్టుల్లో కేసులు నడుస్తుండడంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటోంది. మల్కాజిగిరిలో 6,248 ఎకరాలు హాంఫట్ స్థిరాస్తి రంగం పుంజుకోవడంతో శివార్లలోని విలువైన స్థలాలు కైంకర్యమవుతున్నాయి. మరీ ముఖ్యంగా మల్కాజిగిరి, సరూర్‌నగర్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 7,783 ఎకరాలు ఆక్రమణకు గురైంది. రాజేంద్రనగర్ డివిజన్లో 2,127 ఎకరాల మేర ఆక్రమించినట్లు జిల్లా యంత్రాంగం తేల్చింది. ఇక్కడ ఎకరా సగటున రూ.3 కోట్లు పైమాటే. ఈ లెక్కన ఈ మూడు డివిజన్లలోనే సుమారు రూ.15 వేల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమైనట్లు అంచనా. బాలానగర్ మండలంలో 537.28, శేరిలింగంపల్లి 850.20, రాజేంద్రనగర్ 345, శంషాబాద్ 394, కుత్బుల్లాపూర్ 1913, ఉప్పల్ 121, శామీర్‌పేట 2993, మల్కాజిగిరి 162, మేడ్చల్ 340 ఎకరాలు కబ్జా అయినట్లు తేలింది. దీంట్లో అధికశాతం వ్యవసాయేతర భూములు కావడంతో వీటి విలువ రూ.కోట్లలో పలుకుతోంది. రెవెన్యూ అధికారులు భూ ఆక్రమణలపై క్షేత్రస్థాయిలో సర్వే జరపడమే కాకుండా రికార్డులను కూడా పరిశీలిస్తుండడంతో కబ్జా చిట్టా మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. 18,476 మంది కబ్జాదారులు! జిల్లావ్యాప్తంగా ఆక్రమణకు గురైన పది వేల ఎకరాల్లో 18,476 మంది పాగా వేసినట్లు అధికార యంత్రాంగం తేల్చింది. ఇందులో అధికంగా మల్కాజిగిరి డివిజన్ పరిధిలో 17,590 మంది కబ్జాదారులు ఉన్నట్లు గుర్తించింది. చిన్నచిన్న బిట్లుగా ఉన్న స్థలాలపై కన్నేసిన అక్రమార్కులు.. వాటిని సొంతం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. స్థానిక రెవెన్యూ సిబ్బంది అండదండలు కూడా ఉండడంతో రికార్డులు తారుమారు చేయడం ద్వారా స్థలాల హక్కుల కోసం కోర్టుకెక్కుతున్నారు. ఇంటిదొంగలు హస్తం ఉండడంతో ఈ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం ప్రభుత్వానికి తలకుమించిన భారంగా పరిణమించింది. ఆక్రమణదారుల్లో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, బడాబాబులు ఉండడంతో అన్యాక్రాంతమవుతున్న జాగాలపై పట్టు బిగించలేకపోతోంది. ల్యాండ్ బ్యాంక్ సిద్ధం! ఐటీ కంపెనీలు, బహుళ జాతి సంస్థల పెట్టుబడులను ప్రోత్సహించేలా నూతన పారిశ్రామిక విధానాన్ని తేవాలని భావిస్తున్న ప్రభుత్వం.. అందుకనుగుణంగా కంపెనీల స్థాపనకు ల్యాండ్ బ్యాంక్‌ను సిద్ధం చేసింది. గతంలో టీఐఐసీ, హెచ్ఎండీఏ, రాజీవ్ స్వగృహ, దిల్ తదితర సంస్థలకు బదలాయించిన భూముల్లో వినియోగంలోకిరాని భూములతోపాటు, పారిశ్రామిక అవసరాలకు పోను అట్టిపెట్టుకున్న భూముల వివరాలను కూడా సేకరించింది. ఈ నేపథ్యంలో తాజాగా 30 వేల ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసింది. అగ్రశ్రేణి సంస్థలు, ఫార్మా రంగం కంపెనీలు రాజధాని శివార్లలోనే పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపే అవకాశం ఉండడంతో అక్ర మార్కుల చేతుల్లోని భూములను కూడా రాబట్టుకునే దిశగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో భాగంగా ప్రభుత్వ భూముల వివరాలు, ఆక్రమణలకు సంబంధించి సర్వే నంబర్ల వారీగా వివరాలను సేకరిస్తోంది. -
వేయండి పాగా!
అనంతపురం సిటీ : అనంతపురం నగర పాలక సంస్థకు చెందిన రూ.కోట్ల విలువైన భూమిపై కబ్జాదారులు కన్నేశారు. అడిగేవారు లేకపోవడంతో కొద్దికొద్దిగా ఆక్రమించేస్తున్నారు. ఇప్పటికే పదెకరాలకు పైగా కాజేశారు. నగర పాలక సంస్థ అనుమతి లేకుండానే రెవెన్యూ శాఖ కూడా ఇందులో పట్టాలిచ్చేస్తోంది. ఇప్పటికే 41 ఎకరాల భూమిని పట్టాల రూపంలో పంచిపెట్టింది. అందులో ఇళ్లు కూడా కట్టేశారు. ఇంకొన్నేళ్లు ఇదే నిర్లక్ష్యం కొనసాగితే మొత్తం భూమి చేజారిపోయే పరిస్థితి కన్పిస్తోంది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. నగర పాలక సంస్థకు పండమేరు నీటి సరఫరా ప్రాజెక్టు కింద సర్వే నెంబరు 134లో 16.71 ఎకరాలు, 135లో 10.46 ఎకరాలు, 136-1లో 7.35 ఎకరాలు, 136-2లో 142.45 ఎకరాలు కలిపి మొత్తం 176.97 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ ఎంత తక్కువన్నా ఎకరా రూ.40 లక్షలకు పైగా పలుకుతోంది. అంటే మొత్తం భూమి విలువ రూ.70 కోట్లకు పైగా ఉంటుంది. ఇంతటి విలువైన భూమి కబ్జాదారుల చేతుల్లోకి వెళుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అనంత నగర అభివృద్ధి కమిటీ పేరిట ఏర్పడిన సంఘాల ప్రతినిధులు కూడా స్పందించడం లేదు. నగర పాలక సంస్థ ప్రమేయం, అనుమతి లేకుండానే 41 ఎకరాల్లో రెవెన్యూ అధికారులు పట్టాలిచ్చారు. ఇందులో ఇందిరమ్మ ఇళ్లకు 18 ఎకరాలు, పోస్టల్ కాలనీకి 10 ఎకరాలు, కళాకారుల కాలనీకి 8 ఎకరాలు, స్వర్ణకారులకు 5 ఎకరాలు కేటాయించారు. సందట్లో సడేమియా అన్నట్లు కబ్జాదారులు కూడా ప్రతాపం చూపుతున్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా హద్దుల వెంబడి కొద్ది కొద్దిగా ఆక్రమిస్తూ వస్తున్నారు. ఇప్పటికే పదెకరాల మేర ఆక్రమించారు. 2013, మార్చిలో ఇక్కడ 30 ఎకరాల మేర భూమిని కొందరు ఆక్రమించి.. పేదల నుంచి డబ్బు తీసుకుని గుడిసెలు వేయించారు. దీన్ని అప్పటి కమిషనర్ నీలకంఠారెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. మార్చి 28న భారీ పోలీసు బందోబస్తుతో వెళ్లి ఆక్రమణలను దగ్గరుండి తొలగింపజేశారు. అయితే.. ఇప్పటికీ కబ్జాదారులకు ఈ భూమిపై కన్ను ఉంది. అదను కోసం ఎదురు చూస్తున్నారు. పట్టాలివ్వగా, ఆక్రమణకు గురికాగా..ప్రస్తుతం125 ఎకరాల వరకు మిగిలింది. దీన్నైనా కాపాడుకునేందుకు కనీసం ప్రహరీ నిర్మించాల్సిన అవసరముంది. చర్యలు తీసుకుంటాం పండమేరు వద్ద ఉన్న భూమి ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటాం. హద్దులను గుర్తించి కంచె ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలిస్తాం. ఆ భూమిలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఆ దిశగా పరిశీలిస్తాం. - మదమంచి స్వరూప, మేయర్ -
కాంతులనీ భ్రాంతే
పరిశ్రమల స్థాపనేదీ? ఏడేళ్లయినా నత్తనడకే.. నిబంధనలకు తిలోదకాలు స్థలాన్ని లీజుకు ఇస్తున్న కంపెనీలు! అయినా చర్యలు శూన్యం ఉపాధిలేదు.. భూమి లేదు నీరుగారుతున్న లక్ష్యం అంత ఉపాధి..ఇంత లాభం..జీవనరూపురేఖలే మారిపోతాయి..అని గత పాలకులు అరచేతిలో వైకుంఠం చూపించారు. వేల ఎకరాల భూమిని ఏపీఐఐసీకి అప్పనంగా కట్టబెట్టారు. ఏడేళ్లు గడిచింది. ఒక్కసారి సమీక్షిస్తే కాంతులన్నీ భ్రాంతియేనని తేలింది. 60 పరిశ్రమల కోసం స్థలం కేటాయిస్తే కేవలం 14 మాత్రమే ఏర్పాటయ్యాయి. కొన్ని కంపెనీలు నిబంధనలకు తిలోదకాలు పలికాయి. వాటికి కేటాయించిన స్థలాన్ని ఇతర కంపెనీలకు లీజుకు ఇస్తున్నాయి. అయినా వారిపై ఎలాంటి చర్యలు చేపట్టడంలేదు. జీవనోపాధి దొరుకుతుందనుకున్న స్థానికుల ఆశలు ఆవిరయ్యాయి. ఉన్న భూమి పాయే.. ఉద్యోగం దొరక దాయే అని ఆవేద న చెందుతున్నారు. పూర్తిస్థాయిలో పరిశ్రమల స్థాపన కూడా జరుగకపోవడంతో లక్ష్యం నీరుగారుతోంది. ఇవన్నీ ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్టు లో వెలుగుచూశాయి. గజ్వేల్: నియోజకవర్గంలోని తూప్రాన్ మండలం కాళ్లకల్, ముప్పిరెడ్డిపల్లి, జీడిపల్లి, కూచారం గ్రామాల్లోని పేదల భూములపై ఏపీఐఐసీ దృష్టి పడింది. ఆయా గ్రామాల్లోని 148, 354, 355, 342 సర్వే నెంబర్లలో పరిశ్రమల స్థాపన కోసం 820 ఎకరాల భూమిని సుమారు 400 మంది రైతు ల వద్ద 2006లో సేకరించింది. ఆయా గ్రామాల్లో ‘రియల్’భూం ప్రకారం ఎకరా రూ. 60 లక్షలకుపైగానే పలుకుతుండగా ఏపీఐఐసీ మాత్రం ఎకరాకు కేవలం రూ. 5లక్ష లు మాత్రమే పరిహారంగా చెల్లించి భూములను స్వాధీ నం చేసుకున్నది. భూముల స్వాధీన ప్రక్రియ సందర్భం గా నిర్వాసితులకు పరిశ్రమల్లో ఉపాధి కల్పిస్తామని హామీ సైతం ఇచ్చారు. ఇలా సేకరించిన భూమిని ఏపీఐఐసీ 60 సంస్థలకు పరిశ్రమల స్థాపన కొరకు రూ. 5లక్షల నుండి ఆపైన ధరకు ధారాదత్తం చేసింది. ఈ 60 పరిశ్రమల ద్వారా సుమారు రూ.2000 కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని ఆశించారు. కానీ ఇందులో 25శాతం పెట్టుబడులు కూడా ఇంకా రాకపోవడం ఆందోళనకరం. 60 పరిశ్రమల స్థాపన పూర్తయితే ప్రత్యక్షంగా సుమారు 10వేలు, పరోక్షంగా మరో 10వేల మందికి ఉపాధి కల్పించే లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ సీన్ రివర్సయింది. భూముల సేకరణ ప్రక్రియ పూర్తయి ఏడేళ్లు కావస్తున్నా కేవలం ఇప్పటి వరకు సుమారు 14 పరిశ్రమలు మాత్రమే ఉత్పత్తిని ప్రారంభించాయి. మరో ఆరు ఇటీవలే పూర్తయ్యాయి. మిగతా పరిశ్రమల వ్యవహారం చడీచప్పుడు లేకుండా తయారైంది. ఫలితంగా 20 వేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధికల్పన లక్ష్యం నీరుగారిపోతోంది. ములుగు మండలంలో.... ములుగు మండలం బయెటెక్ కంపెనీల స్థాపన కో సం ఆ మండలంలోని కర్కపట్లలోని 321 సర్వే నెంబర్లో ఏపీఐఐసీ 521ఎకరాల పేదల భూములను సేకరించింది. దామరకుంట లోని 440 సర్వే నెంబర్లోని 120 ఎకరాలను సైతం సేకరించారు. ఇందులో ఇప్పటివరకు 32 సంస్థలకుపైగా పరిశ్రమల స్థాపన కోసం 400 ఎకరాలకుపైగా కేటాయించారు. వీటిలో నాలుగు పరిశ్రమలు మాత్రమే ఉత్పత్తిని ప్రా రంభించాయి. మిగతా పరిశ్రమల స్థాపన ప్రశ్నార్థకంగానే మిగిలి పోయింది. ఈ పరిశ్రమలు పూర్తయితే సుమారు 5వేల మందికి ప్రత్యక్షంగా, మరో 4వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించేది. నిబంధనలకు తూట్లు భూముల స్వాధీన ప్రక్రియ పూర్తయిన తర్వాత రెండేళ్లలోపు పరిశ్రమలను స్థాపించకపోతే ఆ యజమానులకు నోటీసులు ఇచ్చి భూములను వాపస్ తీసుకోవాలనే ని బంధన ఉంది. అయినా ఏపీఐఐసీ మాత్రం పట్టింపు లేని ధోరణిని ప్రదర్శిస్తోంది. భూములు పొందిన యాజమాన్యాలు ప్రతియేటా ఏదో కారణం చూపుతూ అనుమతిని రెన్యూవల్ చేసుకుంటున్నాయి. ప్రధానంగా తూప్రాన్, ములుగు మండలాలు హెచ్ఎండీఏ(హైద్రాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ) పరిధిలోకి రావడం వల్ల పరిశ్రమల నిర్మాణానికి సంబంధించిన అనుమతుల్లో జాప్యం, విద్యుత్ కోతలు, గతంలో ఉద్యమాల ప్రభావం, బ్యాంకు రుణాలు వంటి కారణాలను యాజమాన్యాలు సాకుగా చూపుతూ కాలయాపన చేస్తున్నాయి. ఎంఎల్ఆర్ కంపెనీ భూమి స్వాధీనం... తూప్రాన్ మండలంలోని ఆటోమోటీవ్ పార్కులో ఎంఎల్ఆర్ కంపెనీ పరిశ్రమల స్థాపన కోసం 225 ఎకరాల భూమి పొందింది. తొలుత ఈ కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకమైనదని, పరిశ్రమ స్థాపిం చగానే వేలాది మందికి ఉపా ధి అవకాశాలు లభిస్తాయని అంతా భావించారు. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ఏడేళ్లుగా పరిశ్రమల స్థాపనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఈ కంపెనీ నుండి ఎట్టకేలకు ఇటీవల 100 ఎకరాలు, మరో రెండుమూడు కంపెనీల నుంచి కూడా సుమారు మరో 60ఎకరాల వరకు భూమిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ విషయంలో ఏపీఐఐసీ సకాలంలో స్వాధీనం చేసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రౌండ్ రిపోర్టుకు వెళ్లిన ‘సాక్షి’ ప్రతినిధితో కాళ్లకల్ భూనిర్వాసితులు తమ గోడును వెల్లబోసుకున్నారు. భూముల అమ్మకానికి యత్నం..? ఏపీఐఐసీ వద్ద అతితక్కువ ధరకు భూములను పొంది పరిశ్రమల స్థాపనలో విఫలమైన కంపెనీలు కొన్ని అక్రమంగా ఆ భూ ములను అధిక ధరలకు అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా తూప్రాన్ మండలంలోని ఆటోమోటివ్ పార్కులో కొన్ని యాజమాన్యాలు ఇలాంటి ప్రయత్నానికి పాల్పడినట్లు తెలుస్తున్నది. మరికొన్ని కంపెనీలు తాము పొందిన భూముల్లో కొంత భాగం పరిశ్రమ స్థాపించినట్లుగా పనులు చేపట్టి చాలా భాగం ఇతర కంపెనీలకు లీజుకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కేసీఆర్‌పైనే ఆశలు... గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్ మండలం, ములుగు మండలాల్లోని పారిశ్రామిక వాడల్లో పరిశ్రమల స్థాపనను వేగవంతం చేసే దిశగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ చూపాలని నిరుద్యోగ యువత కోరుకుంటున్నారు. ఈ వ్యవహారంపై వెంటనే సమీక్ష నిర్వహించాలని ఆశిస్తున్నారు. భూమి పోయి... ఉపాధి లేక... తూప్రాన్ మండలంలోని ఆటోమోటివ్ పార్కులో భూములను కోల్పోయిన సుమారు 400 మందికిపైగా నిర్వాసితులు ఉపాధి లేక అల్లాడుతున్నారు. భూ సేకరణ సందర్భంగా వీరి కుటుంబంలో ఒకరి కంపెనీల్లో ఉద్యోగం ఇస్తామని, 200 గజాల స్థలంలో సొంత ఇంటిని నిర్మించి ఇస్తామని ఇచ్చిన హామీలు ఇప్పటివరకు కూడా ఆచరణకు నోచుకోలేదు. మరోవైపు ఉపాధి కల్పన కోసం ఇక్కడ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామన్న మాట కూడా నీటి మూటగానే మారింది. ములుగు మండలంలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. పనులు ప్రారంభించని పరిశ్రమలకు నోటీసులు... తూప్రాన్ మండలంలోని ఆటోమోటీవ్ పార్క్‌లో పనులు ప్రారంభించని సుమారు 40 పరిశ్రమలు, ములుగు మండలం కర్కపట్ల బయోటెక్ పార్క్‌లో పనులు ప్రారంభించని 28 సంస్థలకు ఇటీవల నోటీసులు జారీ చేశాం. ఇక ఆ సంస్థలను ఉపేక్షించేది లేదు. వారిచ్చే వివరణను ప్రభుత్వానికి నివేదించి భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి చర్యలు చేపడతాం. -ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నాగేశ్వర్రావు రోడ్ల మీద తిరుగుతున్న.. మా తండ్రి మల్లయ్య పేరిట ఉన్న మూడున్నర ఎకరాల భూమి పరిశ్రమల కోసం తీసుకుండ్రు. ఇందులో రెండెకరాలకు మాత్రమే రూ. 1 0లక్షలు పరిహారం ఇచ్చిండ్రు. మిగతా ఎకరంన్నర రికార్డుకు లేదని చేతులెత్తేసిండ్రు. భూమిపోయి, నష్టపరిహారం సరిగ్గా రాక ఎంతో నష్టపోయినం. ఇప్పుడు పనిలేక రోడ్లమీద తిరుగుతున్న. ఉద్యోగాలు ఇస్తమన్నరు. ఒక్కరు గూడ దానిగురించి పట్టించుకుంటలేదు. బొల్లబోయిన పెంటయ్య(కాళ్లకల్ భూనిర్వాసితుడు) అన్యాయం చేసిండ్రు... మా తండ్రి నర్సింహులు పేరుమీద ఉన్న రెండెకరాల భూమి తీసుకుండ్రు. అందులో ఎకరంన్నరకే రూ. 7.5లక్షల పరిహారం కట్టించిండ్రు. మిగతా అద్దెకరం రికార్డుకు లేక ఇయ్యమని చెప్పిండ్రు. భూమి పోయినందుకన్నా ఉద్యోగమొస్తదని అనుకున్నం. కానీ అన్యాయమైపోయినం. -నాగమల్లయ్య (కాళ్లకల్ భూనిర్వాసితుడు) బతుకులను ఆగం జేసిండ్రు... అరచేతిలో వైకుంఠం చూపిండ్రు. పెద్దపెద్ద పరిశ్రమలు వస్తయ్. మీకు ఉపాధికి డోక ఉండది. భూములియ్యుండ్రి అని నమ్మబలికిండ్రు. భూములిచ్చిన్నంక పట్టించుకోలేదు. -నర్సింహ( తూప్రాన్ భూనిర్వాసితులసంఘం అధ్యక్షుడు) -
భూ బకాసురులు
జిల్లాలో వేలాది ఎకరాలు ఆక్రమణ న్యాయస్థానాల్లో 900 భూవివాదాల కేసులు రికార్డులు ట్యాంపరింగ్ జరిగినట్టు అనుమానం సబ్రిజిస్ట్రార్ల పాత్రపై విచారణ వచ్చే వారం ‘రెవెన్యూ’ ప్రత్యేక సమావేశం విశాఖ రూరల్: ప్రభుత్వ భూముల సర్వేలో అ నేక అక్రమాలు బయటపడుతున్నాయి. వేలాది ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు ఉన్నతాధికారు ల పరిశీలనలో వెల్లడైంది. రూ.వేల కోట్లు విలువైన భూములకు సంబంధించిన వివాదాలు న్యాయస్థానాల్లో నలుగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 900 భూ వివాదాల కేసులు జిల్లా, హైకోర్టులో ఏళ్ల తరబడి నడుస్తున్నట్లు లెక్కతేలాయి. వీటిలో చాలా కేసులకు సంబంధించి రికార్డులు ట్యాంపరింగ్ జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటిపై వచ్చే వారంలో సమీక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెల రోజులుగా జిల్లాలో ప్రభుత్వ భూ ముల సర్వే జరుగుతోంది. ప్రభుత్వ భూము లు, ఇతర శాఖలకు కేటాయించినవి, ఆక్రమణకు గురైనవి, కోర్టు వివాదాల్లో ఉన్నవి.. ఇలా నాలుగు కేటగిరీల కింద సర్వే చేపడుతున్నారు. కోర్టు వివాదాల్లో 900 కేసులు కోర్టు వివాదాల్లో ఉన్న భూముల వ్యవహారాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్, జేసీ ప్రవీణ్‌కుమార్‌లు విస్తుపోయారు. ఏళ్ల తరబడి న్యాయస్థానాల్లో కేసులు నలుగుతున్నా వాటి పరిష్కారానికి కనీస చర్యలు లేవన్న విషయాన్ని గుర్తించారు. దాదాపు 900 కేసులు జిల్లా కోర్టు, హైకోర్టుల్లో ఉన్నట్టు లెక్క తేల్చారు. దసపల్లా లేఅవుట్, క్లోవర్ అసోసియేట్స్, డచ లేఅవుట్, కిర్లంపూడి లేఅవుట్, నడుపూర్, తాజాగా సర్వే నెంబర్ 152 ఇలా విశాఖ పరిధిలోనే కాకుండా గ్రామీణ ప్రాం తాల్లో కూడా కోట్లు విలువైన వేలాది ఎకరాల భూ వివాదాలు కోర్టుల్లో ఉన్నాయి. వీటిలో చాలా వరకు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించ డం, పక్క సర్వే నంబర్లతో భూములు కొట్టేయడానికి ప్రయత్నించడం, భూములు ఆక్రమించి రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం.. ఇలా అనేక అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. వివాదాల్లో ఉన్న చాలా భూములకు సంబంధించి అక్రమాలు జరిగినట్లు రికార్డుల ద్వారా స్పష్టం గా తెలుస్తున్నా.. వాటిని సక్రమంగా కోర్టుకు సమర్పించడం లేదు. ఫలితంగా కేసులు కోర్టుల్లో దీర్ఘకాలంగా నడుస్తూనే ఉన్నాయి. అధికారులు పాత్రపై అనుమానాలు చాలా భూముల కేసుల్లో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూముల రికార్డులు ట్యాంపరింగ్ జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. తాజాగా సర్వే నెంబర్ 152/4 వ్యవహార మే నిదర్శనం. నడుపూర్‌లో పక్క భూముల సర్వే నంబర్‌తో కోట్లు విలువ చేసే భూములు కాజేయడానికి ప్రైవేటు వ్యక్తులు కోర్టులో కేసు వేశారు. తప్పుడు సర్వే నంబర్ వేసిన విషయా న్ని కోర్టుకు విన్నవిస్తే కేసు వేగంగా పరిష్కారమవుతుంది. అయినప్పటికీ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇలా చాలా వివాదాలకు సంబంధించి రెవెన్యూ సిబ్బంది సక్రమం గా స్పందించ డం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిబ్బందే ప్రైవేటు వ్యక్తులతో చేతులు కలిపి ఈ అక్రమాలకు సహకరిస్తున్నారన్న వా ర్తలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోయా యి. రికార్డుల్లో ప్రభుత్వ భూమి అని ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లు ఎలా చేపట్టారన్న విషయంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. వీటిపై విచారణకు సైతం ఆదేశాలు జారీ చేశారు. మొత్తం కేసుల విషయాలన్నింటిపై వచ్చే వారంలో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.