mallesham
-
సుపారీ ఇచ్చి.. భర్తను హత్య చేయించి
జోగిపేట (అందోల్): వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని సుపారీ ఇచ్చి భర్తను భార్య హత్య చేయించి మృతదేహాన్ని తగలబెట్టించిన ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేటలో శనివారం వెలుగుచూసింది. సంగారెడ్డి డీఎస్పీ రమేశ్‌కుమార్ కథనం ప్రకారం.. జోగిపేటకు చెందిన పాపన్నపేట మల్లేశం(30)కు అందోల్ మండలం మన్ సాన్‌పల్లికి చెందిన కల్పనతో 2015లో వివా హం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. జోగిపేట పట్టణం అందోల్‌లోని డబుల్ బెడ్రూం కాలనీల వద్ద వీరు నివాసం ఉంటున్నారు. కల్పనకు మన్సాన్పల్లికి చెందిన మస్కూరి మహేశ్‌తో పెళ్లికి మందు నుంచీ సంబంధం ఉంది. వివాహం తర్వాత కూడా ఈ బంధాన్ని కొనసాగిస్తోంది. ఈ విషయమై మల్లేశం కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈక్రమంలో భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించి విషయం ప్రియుడు మస్కూరి మహేశ్‌కి వివరించింది. దీంతో మహేశ్.. రంగంపేటకు చెందిన తన మేనబావ ఉసికే అంబాజీకి చెప్పగా, అదే గ్రామానికి చెందిన పాత నేరస్తుడు తలారి మహేశ్‌తో పరిచయం చేయించి, రూ.50 వేలకు హత్య చేసేలా సుపారీ మాట్లాడుకున్నారు. అడ్వాన్సుగా రూ.5 వేలు ఇవ్వగా, పలుమార్లు మరో రూ.30 వేలను అందజేశారు. ఈ విషయంలో తన స్నేహితుడు, గంగారం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ వజ్జరి మహేశ్ సహకారం తీసుకున్నారు. హత్య జరిగిందిలా.. వజ్జరి మహేశ్, మస్కూరి మహేశ్, తలారి మహేశ్.. ఈ ముగ్గురూ ఓ కారు అద్దెకు తీసుకుని శుక్రవారం తెల్లవారుజామున కల్పన ఇంటి వద్దకు వెళ్లి కాపుకాశారు. 5:30 గంటల ప్రాంతంలో మల్లేశం బయటకు రాగానే అతని తలపై బండరాయితో మస్కూరి మహేశ్ బలంగా కొట్టడంతో స్పృహకోల్పోయాడు. వెంటనే అతడిని కారులో వేసుకుని సంగుపేట వైపు వెళ్లారు. మల్లేశం చేతులను కట్టేసి, గొంతు నొక్కడంతో అతను కారులోనే మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం కోనాపూర్ చెరువు వద్ద మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించి నిందితులు పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మల్లేశం భార్య కల్పనను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా.. అసలు విషయాలు వెలుగుచూశాయి. నిందితులు మస్కూరి మహేశ్, కల్పన, తలారి మహేశ్, వజ్జరి మహేశ్, ఉసికే అంబాజీలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కాగా కేసును కేవలం 22గంటల వ్యవధిలో ఛేదించిన జోగిపేట పోలీసులను ఎస్పీ రూపేశ్ అభినందించారు. -
బీజేపీలో దరఖాస్తుల వెల్లువ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో ఎన్నికల సందడి నెలకొంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి ఉన్న వారు మొదటిరోజే ఏకంగా 182 దరఖాస్తులు సమర్పి చారు. ఐతే కొందరు ఒకటికి మించి స్థానాలకు తమ దరఖాస్తులను సమర్పి చడంతో... వాస్తవానికి 63 నియోజకవర్గాలకే అభ్యర్థులు అప్లికేషన్లు ఇచ్చినట్లు భావించాల్సి ఉంటుందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. దర ఖాస్తుల స్వీకరణ నిమిత్తం మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, పార్టీనేతలు సుభాష్చందర్జీ, మల్లేశం గౌడ్లతో రాష్ట్ర పార్టీ కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 4 చోట్ల పోటీకి దరఖాస్తు చేసిన శ్రీవాణి: సికింద్రాబాద్ నుంచి పోటీకి రవిప్రసాద్‌గౌడ్ మొదటగా ఈ కమిటీకి దరఖాస్తు సమర్పి చారు. భద్రాచలం స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి, వేములవాడ సీటుకు కరీంనగర్ మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ అప్లికేషన్ పెట్టుకున్నారు. సరూర్‌నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఏకంగా నాలుగు చోట్ల పోటీకి దరఖాస్తు చేసుకున్నారు. మహేశ్వరం, ఎల్బీనగర్, సనత్‌నగర్, ముషీరాబాద్ నియోజకవర్గాల నుంచి పోటీకి అవకాశమివ్వాలంటూ వేర్వేరు దరఖాస్తులు సమర్పించారు. ఎల్బీనగర్ అసెంబ్లీ టికెట్ కోసం సామా రంగారెడ్డి దరఖాస్తు చేశారు. – కిషన్‌రెడ్డి పరిశీలన కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సోమవారం ఎన్నికల దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించారు. అప్లికేషన్ ఇచ్చి న వారు మీడియాతో మాట్లాడకుండా నేరుగా నియోజకవర్గం వెళ్లి పనిచేసుకోవాలని ఆయన సూచించారు. మీడియా ముందు హంగామా చేసే వారి దరఖాస్తులు పక్కన పెట్టాలని పార్టీనాయకులను ఆయన ఆదేశించారు. ఇదిలా ఉంటే... ఈ నెల 10వ తేదీ వరకు ఆశావాహుల నుంచి బీజేపీ దరఖాస్తులను స్వీకరించనుంది. ఇది ముగిశాక మూడు స్థాయిల్లో అంటే జిల్లా, రాష్ట్ర, జాతీయపార్టీ స్థాయిలలో వడపోత కార్యక్రమం నిర్వహిస్తారని పార్టీ నేతల సమాచారం. – 25 స్థానాలకు ఒక్కో అభ్యర్థితోనే తొలిజాబితా పార్టీ ముఖ్యనేతలు, కచ్చి తంగా గెలిచే అవకాశాలున్న వారిని దాదాపు 25 స్థానాల వరకు కేవలం ఒక్కో అభ్యర్థితోనే తొలిజాబితా సిద్దం చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మిగతా స్థానాల్లో ఒక్కో సీటుకు ముగ్గురు లేదా నలుగురు చొప్పున ప్రతిపాదిత పేర్లతో రఫ్ జాబితా సిద్ధం చేసి రాష్ట్రపార్టీ నుంచి పార్లమెంటరీ బోర్డుకు సమర్పి చవచ్చునని సమాచారం. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ 113మంది అభ్యర్థులను ప్రకటించడంతో ఎక్కడికక్కడ నేతలంతా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌పార్టీ సైతం పోటీచేసేందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఈ నేపథ్యంలో బీజేపీలోనూ ఎన్నికల్లో పోటీకి దరఖాస్తుల ప్రక్రియ మొదటిరోజే వేగం పుంజుకుంది. రాబోయే ఆరు రోజుల్లో (ఈ నెల 10 వరకు) భారీగానే దరఖాస్తులు అందుతాయని పార్టీనాయకులు అంచనా వేస్తున్నారు. -
సిద్ధిపేట జిల్లాలో జెడ్పీటీసీ మల్లేశం దారుణ హత్య
-
సిద్ధిపేట జిల్లాలో జెడ్పీటీసీ శెట్టె మల్లేశంపై గుర్తు తెలియని దుండగులు హత్యాయత్నం
-
టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అనురాగ్ కశ్యప్ మూవీ
‘మల్లేశం’దర్శకుడు రాజ్ రాచకొండ... బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కలిసి నిర్మించిన మలయాళం సినిమా ‘పాక’. తెలుగులో ‘మల్లేశం’ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఆ సినిమాకి దర్శకత్వం వహించిన రాజ్ రాచకొండ ఇప్పుడు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌తో కలిసి ‘పాక - ది రివర్ అఫ్ బ్లడ్’ అనే మలయాళ చిత్రాన్ని నిర్మించారు. మల్లేశం చిత్రానికి సౌండ్ డిజైనర్‌గా పనిచేసిన నితిన్ కోసి దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రం 46వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించటానికి ఎన్నికవ్వడం విశేషం. ఈ సందర్బంగా నిర్మాత రాజ్ రాచకొండ మాట్లాడుతూ.. ‘మల్లేశం చిత్రానికి నా టీం చాలా సహాయం చేసింది. నా టీంతో ఒక చిత్రాన్ని నిర్మించాలి అనుకున్నాను. వాళ్ళు చేసిన నాలుగు కథలలో నాకు పాక కథ బాగా నచ్చింది. ప్రేమ, క్రూరత్వం గురించి భావోద్వేగాలను ప్రదర్శించే లోతైన కథ. తరచూ గొడవలుపడే రెండు కుటుంబాలలోంచి పుట్టుకొచ్చిన ఒక ప్రేమ జంట కథే పాక. మా చిత్రాన్ని ఉత్తర కేరళలోని వయనాడ్‌లో చిత్రీకరించాము. బేసిల్ పౌలోస్, వినీత కోశాయ్, జోస్ కిజక్కన్, అత్తుల్ జాన్, నితిన్ జార్జ్, జోసెఫ్ మాణికల్ వంటి నటీనటులు ప్రధాన పాత్రలు పోచించారు. సెప్టెంబర్ 13న 46వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF)లో ప్రదర్శింపబడుతోంది’ఆయన తెలిపారు. -
వెండితెరపై చేనేత కార్మికుడి విజయగాథ
సాక్షి, భూదాన్‌పోచంపల్లి: ఓ సామాన్య చేనేత కార్మికుడి విజయగాథను వెండితెరపై ఆవిష్కరించడంతో చేనేత కళాకారుడి కష్టాలు, కళానైపుణ్యాలు మరోసారి ప్రపంచానికి చాటిచెప్పినట్లయింది. ఆసుయంత్ర సృష్టికర్త పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవిత విజయగాథను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఆర్. రాజ్ మల్లేశం సినిమా రూపొందించగా, ఇటీవల ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అన్ని వర్గాల ఆదరణ పొందింది. సినిమా ఆసాంతం పోచంపల్లి మండలంలో నిర్మించడం విశేషం. చిత్ర యూనిట్ మూడు నెలల పాటు ఇక్కడే ఉండి రేవనపల్లి, శివారెడ్డిగూడెం, ఇంద్రియాల, జలాల్పురం గ్రామాల్లో నిరంతరాయంగా సినిమా షూటింగ్ చేశారు. చేనేత కార్మికుడి ఇతిబాధలు వాస్తవానికి దగ్గరగా ఉండేందుకు చేనేత కార్మికుల జీవనస్థితిగతులపై ఆధ్యయనం చేసి ఈ సినిమాను కళాత్మకంగా తీర్చిదిద్దారు. ఆత్మహత్యలు వద్దనే సందేశంతో... ప్రస్తుతం చేనేతలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చి కార్మికుడి శ్రమభారం తగ్గించి వస్త్ర ఉత్పత్తి పెంచిన ఆసుయంత్రం రూపకల్పనకు దారితీసిన పరిస్థితులు, కష్టాలను ఎదురీది సాధించిన విజయం, అప్పులబాధ వెంటాడిన ధైర్యంతో సమస్యలను అధిగమించాలని, ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం చూపవని దర్శకుడు చేనేత కార్మికులకు సందేశాన్ని అందించారు. మెరిసిన స్థానికులు.. మల్లేశం సినిమాలో నటించేందుకు ఆసక్తి కల్గిన స్థానికులకు దర్శకుడు అవకాశం కల్పించాడు. పోచంపల్లికి చెందిన తడక రజని హీరో ప్రియదర్శ్‌కు అక్క పాత్రలో నటించింది. అలాగే తడక అతిథి లక్ష్మి, ఈపూరి వరుణ్‌సాయి హీరోకు మేనల్లుడి పాత్రలో నటించి మెప్పించారు. పోచంపల్లిలో పద్మశాలి, చేనేత సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల సన్మానసభను ఏర్పాటుచేసి మల్లేశం చిత్ర యూనిట్‌కు సన్మానించారు. వెండితెరపై చేనేతలు.. ముప్పై ఏళ్ల క్రితమే శ్యామ్‌బెనగల్ దర్శకత్వంలో చేనేత నేపథ్యంలో ‘సుష్మాన్’ సినిమాను నిర్మించారు. మమ్ముట్టి హీరోగా మళయాల సినిమా, క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘వేదం’, నీలకంఠ దర్శకత్వంలో ‘మాయ’, సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘గల్ఫ్’ చిత్రాలు చేనేత కార్మికులను తెరకెక్కించారు. ప్రభుత్వం కూడా ప్రముఖ సినీనటి సమంతను చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. మిస్ ఏషియా ఇంటర్నేషనల్ రష్మిఠాకూర్‌ను ఇక్కత్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ చేనేతకు మరింత ప్రాచుర్యం కల్పిస్తున్నారు. గతేడాది జాతీయ చేనేత దినోత్సవం రోజున పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలతో ఫ్యాషన్‌షో నిర్వహించారు. పోచంపల్లికి చెందిన ప్రముఖ యాంకర్ అనసూయ పలువేదికలో ఇక్కత్ వస్త్రాలను ధరిస్తూ పోచంపల్లికి ఇక్కత్‌ను తనవంతుగా ప్రమోట్ చేస్తుంది. ఎందరికో స్ఫూర్తినిచ్చింది మల్లేశం సినిమా ఎందరికో స్ఫూర్తినిచ్చింది. ఇప్పటి వరకు సామాన్య చేనేత కార్మికుడి సినిమా రాలేదు. మొదటిసారిగా తన విజయగాథను తెరకెక్కించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆసుయంత్రం తయారు చేయడానికి పడిన కష్టాలు, చివరగా చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని చెప్పే సందేశం నచ్చింది. ఈ సినిమా ద్వారా చేనేత కార్మికుడికి గుర్తింపు వచ్చింది. చేనేత దినోత్సవం నిర్వహిస్తూ ప్రధాని మోదీ చేనేత కళాకారులకు గుర్తింపు తీసుకువచ్చారు. – చింతకింది మల్లేశం -
ఎంత బాగా చేసిండ్రు అన్నారు
‘‘ఎంత మంచి పాత్ర చేసినా, ఆ పాత్ర నిడివి ఎంత ఉన్నా ఆ సినిమా ఆడితేనే ఆర్టిస్టుకి గుర్తింపు వస్తుంది. ‘మల్లేశం’ చిత్రం నాకా గుర్తింపును తీసుకు వచ్చింది. ఈ చిత్రాన్ని నా లైఫ్‌లో ఒక టర్నింగ్ పాయింట్‌గా భావిస్తున్నాను’’ అన్నారు ఆనంద చక్రపాణి. ఆసు యంత్ర ఆవిష్కర్త, పద్మశ్రీ అవార్డుగ్రహీత చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మల్లేశం’లో టైటిల్ పాత్రధారి ప్రియదర్శికి తండ్రిగా నటించారు చక్రపాణి. అంతకుముందు కూడా కొన్ని సినిమాలు చేసిన చక్రపాణి తన గురించి పలు విశేషాలు చెప్పారు. ► నటుడిగా ‘దాసి’ నా తొలి చిత్రం. ఆ తర్వాత ఐదారు సినిమాల్లో నటించినప్పటికీ చెప్పుకోదగ్గ గుర్తింపు రాలేదు. ‘మల్లేశం’ సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేసిన ఆర్టిస్టు కమ్ పెయింటర్ లక్ష్మణ్ యేలేగారి ద్వారా ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చింది నాకు. ► ఈ సినిమా ప్రివ్యూ చూసి మల్లేశంగారు.. ‘అన్నా ఎంత బాగా చేసిండ్రు. మా నాయన గుర్తొచ్చారు, ఆయనతో ఉన్న అనుబంధం గుర్తొచ్చింది’ అని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంకా ఈ సినిమాలోని నా నటనను చూసి పలువురు దర్శక–నిర్మాతలు ఇండస్ట్రీకి మంచి నటుడు దొరికాడని కొనియాడారు. నాలో గుమ్మడిని, యస్వీ రంగారావును చూసుకున్నామని కొందరు ఫేస్బుక్లో కామెంట్స్ పెట్టారు. ఏ పాత్ర అయినా చేయగలనని ఈ చిత్రంలో ప్రియదర్శి నిరూపించుకున్నారు. మంచి సినిమాలు తీయాలనే తపన ఉన్న ఈ చిత్రదర్శకుడు రాజు ‘మల్లేశం’ని అద్భుతంగా తెరకెక్కించారు. ► ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్ లేకపోవడం, కాంటాక్ట్ బేస్ సరిగా లేకపోవడానికి తోడు నా ఆర్థిక పరిస్థితులు నన్ను కొంతకాలం ఇండస్ట్రీకి దూరం చేశాయి. అడ్వటైజింగ్ ఫీల్డ్కి షిఫ్ట్ అయ్యాను. కాపీరైటర్‌గా, విజువలైజర్‌గా చేశాను. యాడ్‌ఫిల్మ్ చేసేప్పుడు వాటిలో కొన్నింటికి డైరెక్ట్ చేయడం, స్క్రిప్ట్ రాయడం చేశాను. కానీ సినిమాల పట్ల ఉన్న ప్రేమ నాతో పాటే పెరుగుతూనే ఉంది. నాకు తెలిసిన సర్కిల్లో ఎవరైనా సినిమా చేస్తే ఆ సినిమా డైరెక్షన్, స్క్రిప్ట్ సైడ్ వర్క్ చేయడం లాంటివి చేశాను. ► ప్రస్తుతం క్రాంతిమాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో విజయ్ దేవరకొండకు తండ్రిగా నటిస్తున్నాను. రానా ‘విరాటపర్వం’ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నాను. మరికొన్ని సినిమాలకు చర్చలు జరుగుతున్నాయి. త్వరలో వెల్లడిస్తాను. -
మల్లేశం చూశాను.. హృదయాన్ని హత్తుకుంది : సమంత
సాక్షి, హైదరాబాద్: ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మల్లేశం’ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమాను ప్రముఖ నటి సమంత అక్కినేని చూశారు. వాస్తవికతతో హృదయాన్ని హత్తుకునే కథతో మల్లేశం సినిమా తనకు ఎంతగానో నచ్చినట్టు ట్విటర్లో ఆమె తెలిపారు. ‘మల్లేశం సినిమాను చూశాను. అత్యంత వాస్తవికతతో, హృదయాన్ని హత్తుకునే కథతో తెరకెక్కిన సినిమాల్లో మల్లేశం ఒకటి. తెలంగాణ సంస్కృతిని, తల్లి కోసం ఓ కొడుకు పడే తపనను, ప్రేమను ఎంతో హృద్యంగా ఈ సినిమాలో చూపించారు. ప్రియదర్శి, ఝాన్సీల అభినయం అద్భుతంగా ఉంది’ అంటూ సమంత ట్వీట్ చేశారు. తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఆమె చేనేతగా మద్దతుగా ‘హ్యాండ్లూమ్’ హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు. చేనేత రంగంలో తన తల్లి పడుతున్న కష్టాన్ని చూసి.. ఆమె కష్టాన్ని తొలగించేందుకు ఆసుయంత్రాన్ని రూపొందించిన తెలంగాణ చేనేత వృత్తిదారుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. -
‘మల్లేశం’ సక్సెస్ మీట్
-
అలరించిన ‘మల్లేశం’ యూనిట్
ఖమ్మంమయూరిసెంటర్: చేనేత కార్మికురాలైన తల్లి కష్టాలను చూసి చలించి, ఆ కష్టాలను తీర్చాలనే లక్ష్యంతో ఆసుయంత్రం కనుగొని జాతీయ గుర్తింపు పొంది, పద్మశ్రీ అవార్డు అందుకున్న చింతకింద మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కిన మల్లేశం చిత్ర యూనిట్ సభ్యులు మంగళవారం నగరంలోని సాయిరాం థియేటర్లో ప్రేక్షకులతో కలిసి సినిమాను తిలకించారు. సినీ డైరెక్టర్ రాజు, కథానాయిక అనన్య, హీరో తల్లి పాత్రలో నటించిన ఝాన్సీ, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ప్రేక్షకులను కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందం సభ్యులు మాట్లాడుతూ సినిమా ఘన విజయం సాధించిందని, చింతకింద మల్లేశం జీవిత కథ అందరినీ ఆకట్టుకుంటుందని అన్నారు. ఖమ్మం నగర పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు, పద్మశాలీ సంఘ కుటుంబ సభ్యులకు ఉచితంగా సినిమా టికెట్లను అందజేశారు. సినిమా విజయంతం కావడాన్ని హర్షిస్తూ సంఘం ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం చిత్ర బృందాన్ని సన్మానించారు. కార్యక్రమంలో సంఘం గౌరవ సలహాదారుడు కమర్తపు మురళి తదితరులు పాల్గొన్నారు. -
సందడి చేసిన మల్లేశం చిత్ర యూనిట్
-
మంత్రి తలసానిని కలిసిన మల్లేశం టీమ్
-
‘మల్లేశం’ మూవీ రివ్యూ
-
ఇమేజ్ అన్నది నటులకు శాపం
‘‘నటీనటులను ఎప్పుడూ ఒకే కోణంలో చూడకూడదు. అన్ని పాత్రల్లోనూ చూడాలి. ఫలానా పాత్రలే చేయగలుగుతామనే ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకూడదు. నటీనటులకు ఇమేజ్ అనేది శాపం అని నా అభిప్రాయం. అందుకే కథ నచ్చితే ఏ పాత్ర అయినా చేస్తా’’ అన్నారు ప్రియదర్శి. ఆయన లీడ్ రోల్లో పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మల్లేశం’. సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో రాజ్.ఆర్ దర్శకత్వంలో రాజ్.ఆర్, శ్రీ అధికారి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతున్న సందర్భంగా ప్రియదర్శి చెప్పిన విశేషాలు. ► కమెడియన్, విలన్, హీరో... ఇలా ఏదీ నేను ప్లాన్ చేసుకోలేదు. ఇండస్ట్రీలో ఏదో ఒక పని దొరికితే చాలనుకున్నా. తమ్మారెడ్డి భరద్వాజ, యుగంధర్గారి సంస్థలో యాడ్ ఫిల్మ్స్‌కి అసిస్టెంట్ ప్రొడ్యూసర్‌గా చేశా. ఇండస్ట్రీ అంటే ఏంటి? అనేది అక్కడే నేర్చుకున్నా. ఏడాదిన్నర తర్వాత మానేయాల్సి వచ్చింది. ► నటుడు అవుదామని ఫిక్స్ అయ్యాక పోర్ట్‌ఫోలియో పట్టుకుని స్టూడియోలు తిరగడానికి నేను అంత అందగాణ్ణి కాదు.. అందుకే షార్ట్ ఫిల్మ్స్ చేశా. ‘అనుకోకుండా’ అనే షార్ట్‌ఫిల్మ్‌కి 10 లక్షల వ్యూస్ వచ్చాయి. నాకు అది ‘బాహుబలి’ రేంజ్ అన్నమాట. ఐదేళ్ల పాటు ఎక్కడ ఆడిషన్స్ ఉంటే అక్కడికి వెళ్లా. దాదాపు 200 ఆడిషన్స్ ఇచ్చా. ‘జున్ను’ షార్ట్ ఫిల్మ్ నచ్చడంతో కరీంనగర్‌కి చెందిన వాళ్లు ఓ సినిమా అవకాశం ఇచ్చి, రూ. 5000 డబ్బులు కూడా ఇచ్చారు. కానీ, అది విడుదలవలేదు. మూడు నాలుగు సినిమాల తర్వాత ‘బొమ్మల రామారం’ సినిమాలో విలన్‌గా చేశా. ఆడిషన్స్‌కి వెళ్లి ‘పెళ్లిచూపులు, ఘాజీ’ సినిమాలకు ఎంపికయ్యాను. ‘పెళ్లిచూపులు’ సినిమా నన్ను ఓవర్‌నైట్ స్టార్‌ని చేసింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ► ‘అ’ సినిమా చేస్తున్నప్పుడు రాజ్. ఆర్‌గారు చింతకింది మల్లేశం బయోపిక్ ‘మల్లేశం’లో లీడ్ రోల్ చేస్తావా? అని అడిగారు. కథ బాగా నచ్చడంతో ఓకే అన్నా. పైగా ‘వైఫ్ ఆఫ్ రామ్’ సినిమా చేశాక సీరియస్ పాత్రలు చేయగలం అనే నమ్మకం కుదిరింది. ► మల్లేశం 6వ తరగతి వరకే చదువుకున్నారు. మగ్గం నేసే పనిలో తన తల్లి పడుతున్న కష్టాన్ని చూస్తాడు. మల్లేశం భార్య కూడా కష్టంగా ఉందని మగ్గం పని మానేస్తుంది. దీంతో ఆ పని సులువు కావడానికి 1999లో ‘ఆసు’ యంత్రాన్ని కనుగొన్నారు మల్లేశం. అప్పటికే చాలామంది మగ్గం పనులు మానేసి ఉంటారు. ‘ఆసు’ యంత్రం రావడంతో వారందరూ మళ్లీ మగ్గం పనులు మొదలు పెట్టారు. మగ్గం నేసే ప్రతి ఇంట్లో ‘ఆసు’ యంత్రం ఉండాలన్నది మల్లేశం విజన్. ఆయన సేవల్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2016లో ‘పద్మశ్రీ’ అవార్డు ఇచ్చింది. ► ‘మల్లేశం’ ప్రివ్యూ చూసిన వాళ్లంతా తెరపై ప్రియదర్శి కాదు.. మల్లేశం కనిపించాడని అంటుంటే చాలా సంతోషంగా అనిపించింది. చేనేత వస్త్రాలను ప్రోత్సహించేందుకు మంత్రి కేటీఆర్‌గారు ఎప్పుడూ ముందుంటారు. మా సినిమాని కూడా ఆయన ఎంతో ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమా చేశాక చేనేతల కష్టం ఏంటో తెలిసింది. అప్పటి నుంచి నేను కొనే బట్టల్లో 30 శాతం చేనేత వస్త్రాలు ఉండేలా ప్లాన్ చేసుకున్నా. నా ఫ్రెండ్స్‌కి కూడా చెబుతున్నా. -
మనసును తాకే ‘మల్లేశం’
-
కథలో పవర్ ఉంది
‘‘ఒక సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ఆ సినిమాకు స్టార్ ప్రొడ్యూసరైనా, స్టార్ డైరెక్టరైనా లేదా స్టార్ హీరో అయినా ఉండాలి. ఇవేవీ లేకపోయినా కథలో ఉన్న పవర్ వల్లే ‘మల్లేశం’ సినిమా గురించి అందరూ చర్చించుకుంటున్నారు’’ అని దర్శక–నిర్మాత ఆర్. రాజ్ అన్నారు. పద్మశ్రీ అవార్డుగ్రహీత చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా ఆర్. రాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మల్లేశం’. నటుడు ప్రియదర్శి ‘మల్లేశం’ పాత్రలో నటించారు. శ్రీ అధికారి, రాజ్. ఆర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. ఆర్. రాజ్ మాట్లాడుతూ – ‘‘సినిమాలపై ఆసక్తితో పదకొండేళ్ల క్రితం తమిళంలో ‘సిల నేరంగళిల్’ అనే సినిమాను నిర్మించా. మళ్లీ ఇప్పుడు ‘మల్లేశం’ సినిమాకు దర్శక–నిర్మాతగా వ్యవహరించాను. రెండున్నరేళ్ల క్రితం ‘మల్లేశం’గారి టెక్ టాక్ వీడియోను చూసి ఇన్స్పైర్ అయ్యి. సినిమాగా తీయాలనుకున్నాను. ఈ సినిమా ఎవరూ చూడరు అని కొందరు అభిప్రాయపడ్డారు. అందుకే నేనే నిర్మించాలనుకున్నాను. ఆ తర్వాత కథ కోసం నాలుగు వెర్షన్స్ రెడీ అయ్యాయి. చివరికి నా కథ మల్లేశంగారికి నచ్చడంతో ఈ సినిమాకు కథ కూడా నాదే అయ్యింది. ఒకదశలో ఈ సినిమాకు తరుణ్ భాస్కర్‌ను దర్శకుడిగా అనుకున్నమాట వాస్తవమే. కానీ నా విజన్ వేరుగా ఉంటుంది కదా అని నేనే చేద్దామనుకున్నా. ఇలా ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, డైరెక్షన్, నిర్మాతగా చేశాను. ► మల్లేశంగారి పాత్రలో నాని, శర్వానంద్ ఇలా కొందరిని ఊహించుకున్నాను. కానీ వారి డేట్స్ దొరకవని అర్థమైంది. ఆ తర్వాత ప్రియదర్శిని తీసుకున్నాం. చాలా బాగా చేశాడు. నిజానికి ప్రియదర్శినిలో మంచి యాక్టింగ్ షేడ్స్ ఉన్నాయి. ఇక అనన్యను నేను అసలు హీరోయిన్గా అనుకోలేదు. కాకపోతే ఆ అమ్మాయి ఇన్ఫోసిస్‌లో జాబ్ మానేసి వచ్చి, ఈ రోల్ కోసం ప్రిపేర్ అవుతాను అని చెప్పింది. పద్మ పాత్రలో అనన్య బాగా చేసింది. ఝాన్సీ బాగా నటించారు. ► అక్షయ్ కుమార్ ‘ప్యాడ్‌మ్యాన్’ (తమిళనాడుకు చెందిన అరుణాచలం మురుగనాథన్ బయోపిక్) సినిమా రిలీజ్ టైమ్‌లో కాస్త టెన్షన్ పడ్డాను. ‘ప్యాడ్‌మ్యాన్, మల్లేశం’ ఈ రెండు సినిమాల్లోని హీరోల జర్నీ ఒకేలా ఉంటుంది కదా అనుకుని ‘మల్లేశం’ కథను రాయడం మానేశాను. ఆ తర్వాత ‘ప్యాడ్‌మన్’ సినిమా చూసి నా విజన్ వేరుగా ఉంది కదా అని మళ్లీ సినిమాను స్టార్ట్ చేశాను. ఈ సినిమాను మల్లేశంగారు చూశారు. అక్కడక్కడ కాస్త సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాం. సినిమా చూసినప్పుడు ఆయన కూతురు కన్నీరు పెట్టుకున్నారు. ► నా సినిమాలోని నటీనటుల గౌరవానికి నా వంతు బాధ్యత వహించాలనుకుంటాను. అందుకే కాంట్రాక్ట్‌లో సెక్సువల్ హెరాస్మెంట్ గురించి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాను. ఎవరి కారణంగా అయినా హీరోయిన్ సినిమా నుంచి తప్పుకున్నట్లయితే.. ఆ హీరోయిన్‌కి ఇచ్చిన రెమ్యునరేషన్, కొత్త హీరోయిన్ ఖర్చులను సదరు వ్యక్తే భరించాలనేది ఆ నిబంధనల్లో ఒకటి. -
‘మల్లేశం’ మూవీ రివ్యూ
టైటిల్ : మల్లేశం జానర్ : బయోపిక్ నటీనటులు : అనన్య, ఝాన్సీ, చక్రపాణి తదితరులు సంగీతం : మార్క్ కె.రాబిన్ దర్శకత్వం : రాజ్ ఆర్ నిర్మాత : రాజ్ ఆర్, శ్రీ అధికారి అన్నివేళలా వెండితెరపై బయోపిక్స్ మెరిసిపోతాయా అంటే చెప్పలేము.. అందుకు చాలా కారణాలుంటాయి. వారి జీవితంలో పడిన సంఘర్షణ, వాటిని తెరపై ఆసక్తిగొల్పేలా, గుండెకు హత్తుకునేలా తెరకెక్కించినప్పుడే ప్రేక్షకులు వాటిని ఆదరిస్తారు. చేనేత రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించు కున్న చింతకింది మల్లేశం.. జీవితచరిత్రను ‘మల్లేశం’ గా రూపొందించారు. ఇప్పటివరకు కామెడీ పాత్రలను, హీరో ఫ్రెండ్ పాత్రలను చేస్తూ వచ్చిన ప్రియదర్శి.. మొదటిసారి మల్లేశం పాత్రలో హీరోగా నటించాడు. మరి ‘మల్లేశం’ ప్రియదర్శికి కలిసివచ్చిందా? అసలు మల్లేశం కథేంటో చూద్దాం. కథ : ఈ సినిమా 1980-1990ల మధ్య కాలం జరుగుతుంది. నల్గొండ జిల్లాలోని ఓ కుగ్రామం. ఆ గ్రామస్తుల్లో మల్లేశం కుటుంబం నేతపని చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇంకా ఆ గ్రామంలో చాలా మంది ఇదే వృత్తిలో జీవనం సాగిస్తూ అప్పుల్లో కూరుకుపోతారు. అయితే మల్లేశం చిన్నతనం నుంచి అమ్మ లక్ష్మీ (ఝాన్సీ) ఆసు పనిచేయడంతో చేయి నొప్పిలేస్తుంటుంది. భుజం కూడా పడిపోయేస్థితికి వస్తుంది. ఆ ఊర్లో చాలా మందిది అదే పరిస్థితి. అమ్మ పడే కష్టాలు ఎలాగైనా దూరం చేయాలని చిన్నప్పటీ నుంచే ఏదో ఒకటి ప్రయత్నిస్తుంటారు. మల్లేశం పెద్దయ్యాక ఒక్కొక్క ఆలోచనతో ఆసుయంత్రం వైపు అడుగులు వేస్తాడు. ఆ యంత్రాన్ని తయారుచేయడానికి ఊర్లో అప్పులు చేస్తాడు. ఆసు యంత్రం చేస్తున్న మల్లేశంను ఊర్లో అందరూ ఎగతాళి చేస్తారు. పిచ్చొడు అంటూ గెలీచేస్తారు. ఇలాగే మల్లేశంను వదిలేస్తే.. నిజంగానే పిచ్చొడు అయిపోతాడేమో అని తల్లిదండ్రులు భయపడి పెళ్లి చేస్తే అయినా బాగుపడతాడని భావిస్తారు. ముందు పెళ్లి వద్దని వారించినా.. తను ప్రేమిస్తున్న మరదలు పద్మ(అనన్య) పెళ్లి కూతురు అనే సరికి మల్లేశం పెళ్లికి ఒప్పుకుంటాడు. ఇక పెళ్లి అయినాసరే ఆసుయంత్రం తయారు చేయాలన్న ప్రయత్నాలను కొనసాగిస్తాడు. పద్మ కూడా ఆసుయంత్రం చేయమని ప్రోత్సహిస్తుంది. అయితే ఓసారి ఆసుయంత్రాన్ని పరీక్షించబోతే మోటార్ పేలిపోతుంది. ఇక ఆ విషయం తెలిసి అప్పులోల్లు అందరూ ఇంటి మీదకు వస్తారు. ఈ విషయంపై మొదటిసారి మల్లేశం అమ్మ కూడా మందలిస్తుంది. అయినా సరే ఆసుయంత్రం చేయాల్సిందేనని, అందుకు డబ్బు కావాలని భార్య పద్మను గాజులు, నగలు ఇవ్వమని అడుగుతాడు. అవి తన పుట్టింటి వారు ఇచ్చినవి, తనకు ఇవొక్కటే మిగిలాయని అంటుంది. మాటామాటా పెరిగి గొడవ పెద్దదవుతుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మల్లేశం.. అప్పుల బాధలు తట్టుకోలేక, తల్లి కూడా మందలించడం, భార్య కూడా సాయం చేయకపోవడంతో ఆత్మహత్యయత్నం చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మల్లేశం అసలు ఆసు యంత్రాన్ని ఎలా తయారుచేశాడు? అనేది మిగతా కథ నటీనటులు : గాలిపటం ఎగరడానికి దారం ఎంత అవసరమో.. కథను నడిపించడానికి నటీనటులు అంత అవసరం. తమ నటనతో ప్రేక్షకులను కూడా పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయించాలి. అలాంటి నటులే ఈ సినిమాకు దొరికారు. మల్లేశం పాత్రలో ప్రియదర్శి.. పద్మ పాత్రలో అనన్య.. లక్ష్మీ పాత్రలో ఝాన్సీ.. ఎవరికి వారే అన్నట్లు పోటాపోటీగా నటించారు. ఝాన్సీ తన అనుభవంతో మెప్పిస్తే.. ప్రియదర్శి, అనన్య మాత్రం ప్రేక్షకులను కట్టిపడేశారు. ఇంతవరకు నవ్వించడమే మాత్రమే ప్రియదర్శికి.. తెలుసు అనుకున్న ప్రేక్షకుడి చేత కంటతడిపెట్టిస్తాడు. మల్లేశంకు అవమానాలు ఎదురైతే ప్రేక్షకుడికి కోపం వచ్చేంతలా ఆ పాత్రలో ఒదిగిపోయాడు ప్రియదర్శి. తన నటనకు వంకపెట్టకుండా మల్లేశం పాత్రకు న్యాయం చేశాడు. ఇక అనన్య అయితే కళ్లతోనే ఎన్నో భావాలను పలకించింది. ఆటపట్టించే భార్యగా, ఆటుపోట్లలో తోడుగా నిలిచే ఇల్లాలిగా అందర్నీ మెప్పిస్తుంది. వెండితెరపై అందగానే కనబడటమే కాకుండా, తన హావాభావాలతోనూ పద్మ పాత్రను గుర్తుండేలా చేసింది. ఇక మిగతా నటీనటులు తమ పాత్ర పరిది మేరకు మెప్పించారు. విశ్లేషణ : బయోపిక్ తీయడం అంటేనే కత్తిమీద సాము. ఎన్నో ఆంక్షల మధ్య తీయాల్సి వస్తుంది. పైగా ఆ కథను నడిపించేవాడు సరిగ్గా ఉండాలి. కథకు తగ్గ నటీనటులను ఎంపిక చేసుకోవడంలోనే మొదటి విజయం ఉంటుంది. అందులోనే మల్లేశం దర్శకుడు రాజ్ ఆర్ ప్రతిభ కనపడుతుంది. మొదటిసారి పూర్తిగా తెలంగాణ నేతన్నల సమాజాన్ని తెరపై ఆవిష్కరించాడు. తెలంగాణ యాస అంటే కేవలం నవ్వించిడమే కాదు.. ఏడిస్తుంది, దానికి కూడా అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయని చూపించాడు. చిన్నతనం నుంచే అమ్మ కష్టాలను దూరం చేయాలని ఆలోచన నుంచి.. ఆసు యంత్రం కనిపేట్టే వరకు మల్లేశం జీవితంలో జరిగిన అంతర్మథనం, పడిన కష్టాలు అన్నింటిని ఒక సినిమాలో చూపించడం అసాధ్యం. అయినా దర్శకుడు ఈ విషయంలో సక్సెస్ అయ్యాడు. అప్పుల బాధలు తట్టుకోలేక, ఇంట్లో చీరలు నేయడం మానేసి హైదరాబాద్‌కు వచ్చి జీవనం సాగిస్తాడు మల్లేశం. ఊరి మనుషులు, అక్కడి వాతావరణం తప్ప ఇంకోటి తెలియని మల్లేశం అక్కడ ఎలా జీవనం సాగించాడనే విషయాలు బాగా చూపించాడు. కనీసం పూలు అమ్మడం కూడా రాని మల్లేశంను చూస్తే నవ్వొచ్చినా.. ఆ తరువాత జాలేసేలా చూపించాడు దర్శకుడు. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడిని మల్లేశంతో పాటే ప్రయాణించేలా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అయితే కమర్షియల్ చిత్రాలకు అలవాటుపడ్డ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఏ మేరకు స్వీకరిస్తారో చూడాలి. మార్క కె రాబిన్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. పాటలు సన్నివేశానికి తగ్గట్టుగా వచ్చి వెళ్లిపోతూ ఉంటాయి. అప్పటి పల్లెవాతావరణాన్ని తెరపై సినిమాటోగ్రఫర్ అందంగా చూపించాడు. మల్లేశం జీవితాన్ని గుండెకు హత్తుకునేలా చూపించేందుకు ఎడిటర్ కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ కథ నటీనటులు దర్శకత్వం మైనస్ పాయింట్స్ స్లో నెరేషన్ బండ కళ్యాణ్, సాక్షి వెబ్ డెస్క్. -
‘మల్లేశం’ సినిమా స్పెషల్ ప్రీమియర్ షో
-
మల్లేశం సినిమాకు ప్రభుత్వ సహకారం ఉంటుంది
‘‘ఇంగ్లీష్‌లో నెసెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్’ అనే సామెత ఉంది. కానీ ఈ సినిమాలో ‘మదర్ ఈజ్ నెసెసిటీ ఆఫ్ ఇన్వెన్షన్’ అని చూపించారు. ఎందుకంటే మల్లేశం గారు తన తల్లి కష్టాన్ని చూసి, తన తల్లి సమస్యతో పాటు ఎంతోమంది తల్లుల సమస్యలను తొలగించారు. ఎంతో మంది యంగ్ ఇన్నోవేటర్స్‌కు ఇన్స్పిరేషన్ ఇచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించారు’’ అన్నారు తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మల్లేశం’. రాజ్ దర్శకత్వంలో శ్రీ అధికారి, రాజ్. ఆర్ నిర్మించారు. మల్లేశం పాత్రలో ప్రియదర్శి నటించిన ఈ చిత్రం జూన్ 21న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని శనివారం పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులకు కోసం ప్రదర్శించారు. సినిమా చూసిన తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ– ‘‘సముద్ర గర్భంలో దాగిన బడబాగ్నులెన్నో, సమాజంలో అజ్ఞాత సూర్యులెందరో, గాయపడిన కవి గుండెల్లో రాయబడని కవితలెన్నో అనే ఓ కవిత సినిమాలోని ఎమోషన్ని రెండు గంటలపాటు క్యారీ చేసింది. మనం వెళ్లే దారిలో దారులన్నీ మూసి ఉన్నా ఏదో దారి తెరుచుకుని ఉంటుందనే విషయాన్ని వివరించిందీ చిత్రం. చేనేత కార్మికుల నైపుణ్యానికి పెద్దపీట వేస్తూ వారి కష్ట నష్టాలను ఈ సినిమాలో చూపించారు. ప్రియదర్శి అద్భుతంగా నటించారు. తెలంగాణ యాసను, భాషలోని మాధుర్యాన్ని రైటర్ అశోక్‌కుమార్ చక్కగా రాశారు. ఈ సినిమాకు ప్రభుత్వం నుండి సహకారం అందించాలని గౌరవ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగారితో, గౌరవ ముఖ్యమంత్రిగారితో మాట్లాడతాను. అది ట్యాక్స్ ఎగ్జంప్షన్ అయినా, మరేదైనా నా వంతుగా ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తా. ప్రతి సోమవారం చేనేత వస్త్రాలనే ధరించాలి. చేనేత కార్మిలకు అండగా నిలబడాలనే నినాదంతో యువత ముందుకు అడుగులు వెయ్యాలి’’ అన్నారు. డి. సురేశ్‌బాబు, బి. నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. -
నా కథను నేను చూసుకోవడం నా అదృష్టం
‘‘ఒకరోజు రాజ్‌గారు ఫోన్ చేసి యూ ట్యూబ్‌లో మీరు మాట్లాడింది చూశాను. దానిపై సినిమా తీయాలనుకుంటున్నాను అన్నారు. రెండున్నరేళ్లు కష్టపడి ‘మల్లేశం’ కథను సిద్ధం చేసుకుని, సినిమా తీశారు’’ అని పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం అన్నారు. ఆయన జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మల్లేశం’. ప్రియదర్శి లీడ్ రోల్ చేశారు. రాజ్. ఆర్ దర్శకత్వంలో రాజ్.ఆర్, శ్రీఅధికారి నిర్మించారు. సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో జూన్ 21న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. చింతకింది మల్లేశం మాట్లాడుతూ– ‘‘ప్రపంచానికి మల్లేశం గురించి చెప్పాలనే రాజ్‌గారి సంకల్పం నేరవేరింది. సినిమా చూశాను, ప్రియదర్శిగారు అద్భుతంగా నటించారు. సినిమా చూస్తున్నప్పుడు ఓసారి కళ్లలో నీళ్లు కూడా తిరిగాయి. నా కథను నేను తెరపై చూసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు. రాజ్.ఆర్ మాట్లాడుతూ– ‘‘ఇది ఆర్ట్ ఫిల్మ్ కాదు. కమర్షియల్ మూవీ. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, నానీలను హీరోలుగా అనుకున్నాను. కానీ డేట్స్ సమస్య రావడంతో ప్రియదర్శిని తీసుకున్నాం. తరుణ్ భాస్కర్‌ను ఈ సినిమాను డైరెక్ట్ చేయమని అడిగాను కానీ కుదరలేదు. ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆరో తరగతి డ్రాప్ అవుట్ అయినా ‘పద్మశ్రీ’ అవార్డు అందుకునే స్థాయికి ఎదిగిన మల్లేశంగారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. నాకు సహకరించిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ సిద్ధారెడ్డిగారికి, ఆర్ట్ డైరెక్టర్ లక్ష్మణ్ ఏలే, మహేష్‌లకు థాంక్స్’’ అన్నారు. ‘పల్లెసృజన’ నిర్వాహకులు గణేశం, శ్రీ అధికారి, గాయకుడు గోరెటి వెంకన్న, సంగీత దర్శకుడు మార్క్ కె.రాబిన్స్, దర్శక–నిర్మాత ‘మధుర’ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
మల్లేశం ట్రైలర్‌కు కేటీఆర్ ప్రశంసలు
సాక్షి, హైదరాబాద్ : పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవితకథ ఆధారంగా రూపొందుతున్న మల్లేశం సినిమా ట్రైలర్‌పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. తాను మల్లేశం ట్రైలర్ చూశానని తెలిపారు. ‘ఆసుయంత్రాన్ని ఆవిష్కరించిన గ్రామీణ చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం జీవితం స్ఫూర్తిదాయకం. అద్భుత ఆవిష్కరణతో చింతకింది మల్లేశం పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. మల్లేశం సినిమా బృందానికి శుభాకాంక్షలు’అని కేటీఆర్ తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. -
అదరగొట్టిన ‘మల్లేశం’
హైదరాబాద్: నేత కార్మికుల కథ ప్రధానాంశంగా రూపొందిన చిత్రం ‘మల్లేశం’. పద్మశ్రీ అవార్డుగ్రహీత చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కించారు. నేత కార్మికుల కోసం చింతకింది మల్లేశం చేసిన సేవల చుట్టూ ఈ సినిమా ఉంటుంది. ‘పెళ్లిచూపులు’ ఫేమ్ ప్రియదర్శి టైటిల్ రోల్ చేశారు. రాజ్. ఆర్ దర్శకత్వంలో రాజ్. ఆర్, శ్రీ అధికారి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని జూన్ 21న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన చిత్ర బృందం తాజాగా ‘మల్లేశం’ ట్రైలర్‌ను విడుదల చేసింది. చేనేత కార్మికుడైన మల్లేశం పద్మశ్రీ అవార్డుకు ఎంపిక కావడానికి దారి తీసిన పరిణామాలు ఏమిటి? అవమానాల నుంచి పద్మశ్రీ వరకు ఎలా ఎదిగారు?చేనేత రంగంలో అతడు సాధించిన ఘనత ఏమిటి? అగ్గిపెట్టెలో పట్టేంత చీరలను నేచి ప్రపంచాన్ని ఎలా అబ్బుర పరిచారు? అనే అంశాలతో పాటు చేనేత ప్రాముఖ్యతను దేశవ్యాప్తంగా చాటి చెప్పడానికి ఆయన చేసిన కృషి ఏమిటనే విషయాలు ఫోకస్ చేస్తూ సినిమా సాగుతుంది. అచ్చమైన తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మాత్రమే గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి ఈ సినిమాలో చాలా సీరియస్‌గా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. ప్రియదర్శిని నటుడిగా మరో మెట్టు ఎక్కించేలాగే వుంది ట్రైలర్. ఇక ప్రియదర్శితో పాటు అనన్య, యాంకర్ ఝాన్సీ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ విడుదల చేయనుంది. మార్క్ కె. రాబిన్ స్వరాలందించిన ఈ చిత్రానికి బాలు శాండిల్య సినిమాటోగ్రాఫర్‌గా చేశారు. -
నేత కార్మికుల కోసం..
నేత కార్మికుల కథ ప్రధానాంశంగా రూపొందిన చిత్రం ‘మల్లేశం’. పద్మశ్రీ అవార్డుగ్రహీత చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కించారు. నేత కార్మికుల కోసం చింతకింది మల్లేశం చేసిన సేవల చుట్టూ ఈ సినిమా ఉంటుంది. ‘పెళ్లిచూపులు’ ఫేమ్ ప్రియదర్శి టైటిల్ రోల్ చేశారు. రాజ్. ఆర్ దర్శకత్వంలో రాజ్. ఆర్, శ్రీ అధికారి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని జూన్ 21న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ప్రియదర్శితో పాటు, అనన్య, యాంకర్ ఝాన్సీ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ విడుదల చేయనుంది. త్వరలోనే పాటలను. టీజర్‌ను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నామని చిత్ర దర్శక–నిర్మాతలు తెలిపారు. మార్క్ కె. రాబిన్ స్వరాలందించిన ఈ చిత్రానికి బాలు శాండిల్య సినిమాటోగ్రాఫర్‌గా చేశారు. -
మల్లేశం వచ్చిండు
అగ్గిపెట్టెలో పట్టేంత చిన్న చీరను నేచి, చేనేత రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించు కున్నారు చింతకింది మల్లేశం. పెద్ద చదువులు చదవకపోయినా చేనేత శ్రమజీవుల కోసం ఆయన ఆసు యంత్రాన్ని ఆవిష్కరించారు. ఇందుకుగాను ఆయన్ని ‘పద్మశ్రీ’ అవార్డు వరించింది. తాజాగా చింతకింది మల్లేశం బయోపిక్‌ని ‘మల్లేశం’ పేరుతో తెరకెక్కిస్తున్నారు. టైటిల్ రోల్లో ప్రియదర్శి నటిస్తున్నారు. రాజ్ ఆర్ దర్శకత్వంలో శ్రీ అధికారి, రాజ్ ఆర్ నిర్మిస్తున్నారు. అనన్య, ఝాన్సీ, చక్రపాణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ఈ సందర్భంగా సిరిసిల్ల జిల్లాలో ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. మార్క్ కె.రాబిన్ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రానికి గోరేటి వెంకన్న, చంద్రబోస్ పాటలు రాస్తున్నారు. ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట్ సిద్ధారెడ్డి. -
‘మల్లేశం’ ఫస్ట్ లుక్ విడుదల..
పద్మ శ్రీ చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా మల్లేశం. అగ్గిపెట్టెలో పట్టేంత చిన్న చీరలను కూడా నేచి ప్రపంచాన్ని అబ్బుర పరిచిన వ్యక్తి మల్లేశం. తను సాధించిన విజయాలతో చేనేత ప్రాముఖ్యతను దేశవ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత మల్లేశం సొంతం. ఇలాంటి గొప్ప వ్యక్తి జీవితం ఆధారంగా మల్లేశం సినిమా తెరకెక్కుతుంది. రాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. శ్రీ అధికారి, రాజ్ ఆర్ నిర్మిస్తున్నారు. ఇందులో మల్లేశం పాత్రలో ప్రియదర్శి నటిస్తున్నారు. అనన్య, ఝాన్సీ, చక్రపాణి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. చిత్రయూనిట్ సిరిసిల్ల జిల్లాలో ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేసారు. బాబు శాడిలాస్య ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. లక్ష్మణ్ ఆలే ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న సౌండ్ డిజైనర్ నితిన్ లుకోస్ ఈ చిత్రానికి సౌండ్ డిజైన్ చేస్తున్నారు. మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నారు. పెద్దింటి అశోక్ కుమార్ ఈ చిత్రానికి మాటలు రాస్తున్నారు. ప్రముఖ రచయిత గోరేటి వెంకన్న, చంద్రబోస్ ఈ చిత్రానికి పాటలు రాస్తున్నారు. వెంకట్ సిద్ధిరెడ్డి ఈ చిత్రానికి ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు.