manifesto released
-
వికసిత భారత్ లక్ష్యంగా ‘సంకల్ప పత్రం’ విడుదల చేసిన బీజేపీ.. 24 కీలక అంశాలతో సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టో .. ఇంకా ఇతర అప్డేట్స్
-
#BJPManifesto: బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ‘సంకల్ప్ పత్ర’ పేరుతో బీజేపీ మేనిఫెస్టోను ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ రిలీజ్ చేశారు. రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది బృందం మేనిఫెస్టోను రూపొందించింది. 14 అంశాలతో మేనిఫెస్టోను రూపొందించారు. మేనిఫెస్టో విడుదల సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఉత్తమ మేనిఫెస్టో తయారు చేసిన రాజ్‌నాథ్ సింగ్‌కు అభినందనలు. నేడు ఎంతో మంచి రోజు. పలు రాష్ట్రాల్లో పండుగలు జరుపుకుంటున్నారు. గత పదేళ్లలో దేశాభివృద్ధి కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం. యువత, పేద, మహిళ వర్గాలపై ఎంతో ఫోకస్ చేశాం. పెద్ద సంఖ్యలో ఉద్యోగ కల్పన చేపట్టాం. బీజేపీ సంకల్ప పత్రం యువత ఆకాంక్షను ప్రతిబింబిస్తుంది అని వ్యాఖ్యలు చేశారు. ‘‘మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీగా పూర్తయ్యే గ్యారెంటీ. 70 ఏళ్లు పైబడిన వారికి ఉచిత వైద్యం అందిస్తాం. పేదల జీవితాలు మార్చడమే మోదీ ఇచ్చే గ్యారెంటీ. ఇచ్చిన ప్రతీ హామీని బీజేపీ నెరవేరుస్తుంది. ముద్ర రుణాల పరిమితి రూ.20 లక్షలకు పెంపు. ముద్ర పథకం ద్వారా కోట్ల మందికి ఉపాధి దక్కింది. మహిళలను లక్షాధికారులుగా చేయడమే మా లక్ష్యం. వ్యవసాయంలో టెక్నాలజీని పోత్సహిస్తున్నాం’’ అని ప్రధాని వివరించారు. పేదలు, రైతులు, మహిళలు, యువత అభివృద్ధి మా లక్ష్యం. పేదలకు ఇంటింటికి పైప్ ద్వారా గ్యాస్ కనెక్షన్ ఇస్తాం. సూర్య ఘర్ పథకం కింద ఉచితంగా విద్యుత్తు సరఫరా, ఇంటి పైకప్పు నుంచి సౌర విద్యుత్ ఉత్పత్తితో ఆదాయం అందుతుంది. మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేస్తాం. ఐదేళ్లపాటు 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తాము. చిల్లర వర్తకులకు గ్యారెంటీ లేకుండా 50 వేల రూపాయల రుణాలు. ముద్ర పథకం కింద 20 లక్షల రూపాయల రుణం పెంపు. 10 కోట్ల మంది రైతులకు పిఎం కిసాన్ పథకం కొనసాగింపు. మూడు కోట్ల మంది మహిళలకు ఉచితంగా ఇల్లు నిర్మిస్తాం. తమిళ భాషకు విశ్వ వ్యాప్తి కల్పిస్తాము అని హామీ ఇచ్చారు. #WATCH | BJP 'Sankalp Patra'/manifesto release: Prime Minister Narendra Modi says, "...The benefits under PM-Kisan Samman Nidhi will continue for the 10 crore farmers of the country even in the time to come. With the vision of 'Sahkarita Se Samriddhi', the BJP will introduce… pic.twitter.com/svSpv0qhod — ANI (@ANI) April 14, 2024 సంకల్ప్ పత్ర్‌లో 2025వ ఏడాదిని జన్‌జాతీయ గౌవర్ సంవత్సరంగా బీజేపీ పేర్కొంది. మేనిఫెస్టోలోని అంశాలు.. విశ్వబంధు, సురక్షిత భారత్, సమృద్ధ భారత్, సాంకేతిక వికాసం, సుస్థిర భారత్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, స్వచ్చ భారత్, అత్యుత్తమ శిక్షణ, క్రీడా వికాసం, సంతులిత అభివృద్ధి, ప్రపంచస్థాయి మౌలిక వసతులు, ఈజ్ ఆఫ్ లివింగ్, సాంస్కృతిక వికాసం, సుపరిపాలన. BJP election manifesto - 'Sankalp Patra': 2025 to be declared as 'Janjatiya Gaurav Year'. #LokSabhaElection — ANI (@ANI) April 14, 2024 ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం పురోగమిస్తోంది. సామాజిన న్యాయం కోసం అంబేద్కర్ పోరాడారు. దేశాభివృద్ధే బీజేపీ లక్ష్యమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. వచ్చే ఐదేళ్లు దేశానికి ఎలా సేవ చేస్తామో మా మేనిఫెస్టో ఆవిష్కరిస్తుంది. మేము ఏం చెప్పామో అది చేసి చూపించాం. త్రిపుల్ తలాక్ రద్దు, ఆర్టికల్ 370 రద్దు చేశాం.. రామ మందిర నిర్మాణం ఇప్పుడు సాకారమైంది. నాలుగు కోట్ల పక్కా ఇళ్లు నిర్మించామని అన్నారు. #WATCH | Bharatiya Janata Party (BJP) releases its election manifesto - 'Sankalp Patra' for the ensuing Lok Sabha polls in the presence of Prime Minister Narendra Modi, Home Minister Amit Shah, Defence Minister Rajnath Singh and party President JP Nadda.#LokSabhaElection pic.twitter.com/WVB8Km1NWJ — ANI (@ANI) April 14, 2024 #WATCH | BJP national president JP Nadda felicitates Prime Minister Narendra Modi at the party Headquarters in Delhi. PM Modi will shortly release the party's 'Sankalp Patra' for the upcoming Lok Sabha elections #LokSabhaElections2024 pic.twitter.com/wX77iT2jJx — ANI (@ANI) April 14, 2024 -
‘పాంచ్ న్యాయ్-పచ్చీస్ గ్యారంటీస్’ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
Live Updates.. ► ‘పాంచ్ న్యాయ్-పచ్చీస్ గ్యారంటీస్’ పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలైంది. 48 పేజీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు. ►మేనిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో 25 గ్యారంటీలు. ► పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని. రైల్వేల ప్రైవేటీకరణను నిలిపివేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. ►అలాగే, బీజేపీ ప్రభుత్వం తెచ్చిన అగ్నివీర్‌ను రద్దు చేస్తామన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ మీద విచారణ. పెగాసెస్,రాఫెల్‌పై విచారణ. ►అనంతరం, మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. కిసాన్ న్యాయ్ పేరుతో రైతులను ఆదుకుంటాం. దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ చేస్తాం. విద్యార్థులకు ఏడాదికి రూ.లక్ష అందిస్తాము. పేద మహిలకు ఏడాదికి రూ.లక్ష ఇస్తాము. కనీస మద్దతు ధర చట్టం తీసుకోస్తామని చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఐదు గ్యారంటీలు 1. యువతకు జాబ్ గ్యారంటీ, ఏడాదికి లక్ష జీతం 2. ప్రతీ మహిళకు ఏడాదికి లక్ష రూపాయల సాయం 3. కులగణన 4. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దినసరి వేతనం నాలుగు వందలకు పెంపు 5. స్వామి నాథన్ సిఫారసుల మేరకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత. మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు హిస్సేదారి న్యాయ్: 1. సామాజిక, ఆర్థిక కుల గణన 2. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ల కల్పనపై 50% సీలింగ్ తొలగింపు 3. ఎస్సీ, ఎస్టీ, సబ్ ప్లాన్ కోసం స్పెషల్ బడ్జెట్ 4. జల్ జంగల్ జమీన్‌పై చట్టబద్ధహక్కులు 5. గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను షెడ్యూల్డ్ ఏరియాలో గుర్తింపు కిసాన్ న్యాయ్ : 1. స్వామినాథన్ ఫార్ములా ప్రకారం పంటలకు గిట్టుబాటు ధర చట్టబద్ధత 2. రుణమాఫీ కమిషన్ ఏర్పాటు 3. పంట నష్టపోయిన 30 రోజుల్లో బీమా పరిహారం చెల్లింపు గ్యారెంటీ 4. రైతులు లబ్ధి పొందేలా ఎగుమతి దిగుమతి విధానం 5. వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ మినహాయింపు శ్రామిక్ న్యాయ్ : 1. రైట్ టు హెల్త్ చట్టం 2. రోజుకు 400 రూపాయల కనీస వేతనం- ఉపాధి హామీ పథకంలో సైతం 3. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం అమలు 4. అసంఘటిత రంగ కార్మికులకు జీవిత బీమా, యాక్సిడెంట్ బీమా 5. ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాలు నిలుపుదల యువ న్యాయ్: 1. కేంద్రాన్ని ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాల భర్తీ 2. యువతకు ఏడాది అప్రెంటిస్ట్ షిప్ - ఏడాదికి లక్ష రూపాయలు నెలకు రూ.8500 చెల్లింపు 3. పేపర్ లీక్ అరికట్టేందుకు కఠినమైన చట్టం 4. గిగ్ వర్కర్ల సామాజిక భద్రతకు చర్యలు 5. యువత స్టార్టప్ కోసం ఐదు వేల కోట్ల నిధి కేటాయింపు నారీ న్యాయ్: 1. ప్రతీ పేద కుటుంబంలోని ఒక మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు 2. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు 3. ఆశ, అంగన్వాడీ మిడ్ డే మీల్ వర్కర్స్కు డబుల్ శాలరీ కాంట్రిబ్యూషన్ 4. మహిళల హక్కుల రక్షణ కోసం అధికారి మైత్రి ఏర్పాటు 5. వర్కింగ్ విమెన్ కోసం సావిత్రిబాయి పూలే పేరుతో రెట్టింపు హాస్టల్స్ ►కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, చిదంబరం, ఇతర కాంగ్రెస్ నేతలు మేనిఫెస్టును విడుదల చేశారు. ►ఇక, శనివారం రాజస్థాన్‌లోని జైపూర్, తెలంగాణలోని హైదరాబాద్ నగరాల్లో మెగా ర్యాలీలు నిర్వహించనున్నారు. జైపూర్‌లో జరిగే మెగా ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ మేనిఫెస్టోను ఆవిష్కరించి ప్రసంగించనున్నారు. ఇక హైదరాబాద్‌లో జరిగే మెగా ర్యాలీలో రాహుల్ గాంధీ మేనిఫెస్టోను లాంచ్ చేసి ప్రసంగించనున్నారు. #WATCH | Congress Party releases its manifesto for the 2024 Lok Sabha elections, at AICC headquarters in Delhi. #LokSabhaElections2024 pic.twitter.com/lNZETTLDLY — ANI (@ANI) April 5, 2024 -
బీఎస్పీ బహుజన భరోసా!
సాక్షి, హైదరాబాద్, పెద్దపల్లి రూరల్: బహుజన భరోసా పేరుతో బహుజన్ సమాజ్ పార్టీ మేనిఫెస్టోను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ విడుదల చేశారు. మంగళవారం హైదరా బాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పార్టీ నాయకుల సమ క్షంలో పది ప్రధాన హామీలతో కూడిన మేనిఫెస్టో ను ప్రకటించారు. 3.91 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు బహుజన భరోసా ఆవిష్కరిస్తున్న ట్లు ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ ఒక కుటుంబం పాలైందని, ఈ రాష్ట్రాన్ని అందరి తెలంగాణగా మార్చేందుకే బహుజన భరోసా ప్రకటిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో తొమ్మిదిన్నరేళ్లు అధికారం చెలాయించిన బీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ లను నెరవేర్చకుండా మేనిఫెస్టోల పేరుతో మరో సారి అంకెల గారడీ చేసిందని విమర్శించారు. గ్రూ ప్ పరీక్షలు రాసి ఉద్యోగం రాదని తెలిసి ఆత్మ హత్యకు పాల్పడ్డ యువతి ప్రవల్లిక వ్యక్తిత్వాన్ని కించపరిచేలా తప్పుడు మాటలు మాట్లాడారని విమర్శించారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ తెలంగా ణ ఎలా ఉండాలని మేధావులు, రిటైర్డ్ అధికారు లు, అన్నివర్గాల ప్రజలతో చర్చించి బహుజన భరో సా పేరుతో మేనిఫెస్టో రూపొందించినట్లు ప్రవీణ్ తెలిపారు. ఇది ప్రొవిజనల్ మేనిఫెస్టో మాత్రమే నని, తెలంగాణ ప్రజలు ఇంకా ఏమైనా కోరుకుంటే వారి ఆకాంక్షల మేరకు వాటిని కూడా పొందుపరు స్తామని చెప్పారు. కాగా, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ని బీఎస్పీ కార్యాలయంలో కాల్వశ్రీరాంపూర్ మండలానికి చెందిన మాజీ మావోయిస్టు నిదానపురం కొమురయ్య బీఎస్పీలో చేరారు. ఆయనకు ప్రవీణ్‌కుమార్ బీఎస్పీ కండువా కప్పి ఆహ్వానించారు. అదేవిధంగా పెద్దపల్లి పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నేత మర్రిపల్లి సతీశ్ బీఎస్పీలో చేరారు. మేనిఫెస్టోలో బీఎస్పీ ఇచ్చిన 10 ప్రధాన హామీలు.. 1. ‘కాన్షీ’ యువ సర్కార్: యువతకు ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు. మహిళలకు 5 లక్షల ఉద్యో గాలు. షాడో మంత్రులుగా విద్యార్థి నాయ కులు. 2. పూలే విద్యా దీవెన: మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్, ప్రతి మండలం నుంచి ఏటా 100 మంది విద్యార్థులకు విదేశీ విద్య, డేటా, ఏఐ, కోడింగ్ లో శిక్షణ. 3. బహుజన రైతు ధీమా: ప్రతి పంట కనీస మద్దతు ధరతో కొనుగోలు. రైతులకు విత్తు నుంచి విక్రయం వరకు కచ్చితమైన ప్రభుత్వ రాయితీ. ధరణి పోర్టల్ రద్దు. 4. చాకలి ఐలమ్మ మహిళా జ్యోతి: మహిళా కార్మికులు, మహిళా రైతులకు ఉచిత వాషింగ్ మెషీన్, స్మార్ట్ ఫోన్, డ్రైవింగ్‌లో శిక్షణ. అంగన్ వాడీ, ఆశా వర్కర్ల ఉద్యోగులు క్రమబద్దీకరణ. మహిళా సంఘాలకు ఏటా రూ. 1 లక్ష 5. భీం రక్షా కేంద్రాలు: వృద్ధులకు హాస్టల్, ఆహారం, ఉచిత వైద్య సేవలు. రక్షా కేంద్రాల్లో వికలాంగులకు, ఒంటరి మహిళలకు తోడ్పాటు. 6. బ్లూ జాబ్ కార్డ్: పల్లె, పట్టణాల్లో 150 రోజుల ఉపాధి హామీ, రోజు కూలి రూ. 350 కి పెంపు. కూలీలకు ఉచిత రవాణా, ఆరోగ్య, జీవిత భీమా 7. నూరేళ్ల ఆరోగ్య ధీమా: ప్రతి కుటుంబానికి రూ.15 లక్షల ఆరోగ్య బీమా ప్యాకేజీ. ఏటా రూ. 25,000 కోట్లతో పౌష్టికాహార, ఆహార బడ్జెట్ 8. వలస కార్మికుల సంక్షేమ నిధి: రూ. 5,000 కోట్ల నిధితో గల్ఫ్ కార్మికులకు సంక్షేమ బోర్డు. వలస కార్మికులకు వసతి, కార్మికులు, లారీ, టాక్సీ డ్రైవర్లకు 600 సబ్సిడీ క్యాంటీన్లు. 9. షేక్ బందగీ గృహ భరోసా: ఇల్లు లేని వారికి 550 చదరపు గజాల ఇంటి స్థలం, ఇల్లు కట్టుకునే వారికి రూ. 6 లక్షలు సహాయం. ఇంటి పునర్నిర్మా ణానికి రూ.1 లక్ష సహాయం. 10. దొడ్డి కొమురయ్య భూమి హక్కు: భూమిలేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి, మహిళల పేరిట పట్టా. -
Congress Manifesto: అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్‌పై నిషేధం!
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. అందులో భాగంగానే ఎన్నికల వేళ పార్టీ మేనిఫెస్టోలో ఆకర్షనీయంగా పలు పథకాలను, హామీలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా గ్యారెంటీ కార్డు పేరుతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. మైనార్టీ వర్గాల మద్య ద్వేషాన్ని ప్రొత్సహించే వ్యక్తులు, సంస్థలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, బజరంగ్దళ్, పీఎఫ్ఐ వంటి సంస్థలపై నిషేధం విధించడంతోపాటు చట్ట ప్రకారం నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నట్టు స్పష్టం చేశారు. మరోవైపు.. 2006 నుండి సర్వీస్‌లో చేరిన పెన్షన్ పొందే ప్రభుత్వ ఉద్యోగులకు OPS పొడిగింపును కాంగ్రెస్ పరిశీలిస్తోందన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను ఒక సంవత్సరంలోగా భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. మేనిఫోస్టో వివరాలు ఇవే.. ► గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్. ►గృహలక్ష్మి కింద ప్రతి ఇంటికి గృహిణికి నెలకు రూ. వేలు. ► అన్న భాగ్య పథకం కింద ప్రతీ వ్యక్తికి 10కిలోల బియ్యం. ► శక్తి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. ► యువనిధి నిరుద్యోగ భృతి కింద రూ.3వేలు(రెండేళ్లపాటు) అందజేత. ► డిప్లొమా చేసిన వారికి రూ.1500. We believe that law and Constitution is sacrosanct and can not be violated by individuals and Organisations like Bajrang Dal, PFI or others promoting enmity or hatred, whether among majority or minority communities. We will take decisive action as per law including imposing a ban… pic.twitter.com/oCHfTmi5zs — ANI (@ANI) May 2, 2023 #KarnatakaElections2023 | Congress in its manifesto announces that its govt will provide 200 units of free electricity. Rs 2,000 every month to each and every woman head of the family. Rs 3,000 per month for two years to unemployed graduates and Rs 1,500 per month to… pic.twitter.com/yW2LLKQlHK — ANI (@ANI) May 2, 2023 ఇది కూడా చదవండి: Karnataka assembly elections 2023: 3 ఉచిత సిలిండర్లు -
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
-
లక్ష ఉద్యోగాలు.. మహిళలకు నెలకి రూ.1,500: కాంగ్రెస్ హామీల వర్షం
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో ప్రచార జోరు పెంచాయి రాజకీయ పార్టీలు. ఓటర్లను ఆకట్టుకునేందుకు తాయిలాలు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో హిమాచల్ ప్రదేశ్‌కు భారీగా ఆఫర్లు ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. తాము అధికారంలోకి వస్తే.. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, రూ.680 కోట్లతో స్టార్టప్ ఫండ్, లక్ష ఉద్యోగాలు, ఓపీఎస్ పునరుద్ధరణ 18-60 ఏళ్ల మహిళలకు నెలకి రూ.1,500 వంటివి వాటితో మేనిఫెస్టో విడుదల చేసింది హస్తం పార్టీ. నవంబర్ 12న జరగనున్న ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేస్తామని, ఎన్నికైన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయిస్తారని ప్రకటించింది. ఈ సందర్భంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ పార్టీ పోల్ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ ధాని రామ్ శైండిల్. ప్రజల అంచనాలను అందుకోవడంలో బీజేపీ విఫలమైందన్నారు. ఐదేళ్ల క్రితం ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. ‘ఇది కేవలం మెనిఫెస్టో కాదు, హిమాచల్ ప్రదేశ్ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం రూపొందించిన పత్రం.’ అని పేర్కొన్నారు. రాష్ట్ర ఏఐసీసీ ఇంఛార్జి రాజీవ్ శుక్లా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ సహా పార్టీ సీనియర్ నేతల సమక్షంలో ఎన్నికల హామీ పత్రాన్ని విడుదల చేసేంది కంగ్రెస్. కేంద్రంపై విమర్శలు గుప్పించారు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్. పాత పింఛన్ విధానాన్ని పునరుద్దరించి ప్రజల సొమ్మును తిరిగి ఇచ్చేయాలంటూ కేంద్రానికి లేఖ రాశామని, అందుకు వారు తిరస్కరించారని గుర్తు చేశారు. మరోమారు కేంద్రానికి లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. పాత పింఛన్ విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన న్యాయ సలహాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: Gujarat Election 2022: ఎన్నికల ముందు బీజేపీకి మాజీ మంత్రి షాక్..! -
బీజేపీ బంపర్ ఆఫర్.. ఉచితంగా స్కూటీలు, లాప్ ట్యాప్స్
ఇంపాల్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి కమలం నేతలు ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఎన్నికల సందర్భంగా గెలుపే లక్ష్యంగా బంపర్ ఆఫర్లతో ప్రజలపై హామీల వర్షం కురిస్తున్నారు. ముణిపూర్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ గురువారం మేనిఫెస్టోను విడుదల చేసింది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టోలో మణిపూర్ ప్రజలకు వరాలు ప్రకటించారు. ఈ సందర్బంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. సీఎం బీరేన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతోందని ప్రశంసించారు. రాష్ట్రంలో మత్తు పదార్దాలను అరికట్టడంతో సీఎం విజయవంతమయ్యారని కొనియాడారు. మేనిఫెస్టోలోని అంశాలు.. - వృద్ధాప్య పింఛన్ రూ. 200 నుంచి రూ. 1000కి పెంపు. - ఉన్నత విద్య కోసం విద్యార్థినులకు రూ. 25 వేల ఆర్థిక సాయం. - 12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ ఉచిత ల్యాప్‌టాప్‌లు. - ప్రతిభ కనబరినచిన విద్యార్థినులకు ఉచితంగా స్కూటీలు. - ఉచితంగా ఏడాదికి రెండు ఎల్పీజీ సిలిండర్లు. - మత్స్యకారులకు రూ.5 లక్షల వరకు ఉచిత బీమా. - పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి ఏడాదికి అందించే ఆర్థిక సాయం రూ. 6 వేల నుంచి రూ. 8 వేలకు పెంపు. -మహిళలు, యువత, రైతులకు సాధికారత కల్పించడం. - పీజీ, సాంకేతిక విద్య అభ్యసిస్తున్న రైతుల పిల్లలకు స్కాలర్షిప్లు. - సాంస్కృతిక వారసత్వం, స్థానిక ప్రజల హక్కుల పరిరక్షణ. - ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఏర్పాటు. -
కాపీ కొట్టడానికి తెలివి ఉండాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ మేనిఫెస్టోపై ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ వ్యంగాస్త్రాలు సంధించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఫొటోలను జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ ఫొటోలను వాడటం ప్రశంసలుగా భావిస్తున్నామన్నారు. కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలని బీజేపీ నాయకులను ఉద్దేశించి కేటీఆర్ ట్వీట్ చేశారు. బల్దియాలో అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామని మేనిఫెస్టోలో బీజేపీ ముఖ్యంగా తెలిపింది. గ్రేటర్ పరిధిలో అందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని, లక్ష మందికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద సామాన్యుని సొంతటి కలను నెరవేరుస్తామని పెర్కొంది. విద్యార్ధులకు ఉచితంగా ట్యాబ్స్, ఫ్రీ వైఫై సదుపాయాన్ని ఇస్తామంది. మహిళలకు బస్సులు, మెట్రోలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని బీజేపీ హామీనిచ్చింది. Dear BJP manifesto writers, Glad that you chose pictures of the work done by TRS Govt in your GHMC manifesto We will take this as a compliment to our work But let me remind you what they say in Hyderabad नकल मारने को भी अकल चाहिए। 😀 కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలె https://t.co/guN76K5N7n — KTR (@KTRTRS) November 26, 2020 -
జీహెచ్ఎంసీ ఎన్నికలు: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వరద బాధిత ప్రతి కుటుంబానికి రూ.50వేలు, పూర్తిగా దెబ్బతిన్న పూర్తిగా దెబ్బతిన్న గృహలకు రూ. 5లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న వాటికి రూ.2.5లక్షల చొప్పున సహాయం చేస్తామని కాంగ్రెస్ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ వెల్లడించారు. తెలంగాణ కాంగ్రెస్ గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను మంగళవారం విడుదల చేసింది. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ మేనిఫెస్టోను వెల్లడించారు. భారీ వర్షాలు, వరదలతో చనిపోయిన ప్రతివ్యక్తి కుటుంబానికి రూ. 25లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇస్తామని హామీ ఇచ్చారు.(చదవండి: జీహెచ్ఎంసీ ఎన్నికలు.. టీఆర్ఎస్ వరాల జల్లు) ఎన్నికల మేనిఫెస్టోను వివరిస్తూ... ఎన్‌డిఎంఎ మార్గదర్శకాలను అమలు చేస్తామని, హైదరాబాద్‌కు విపత్తు నిర్వహణ ప్రణాళిక రూపొందించి క్రమం తప్పకుండా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తామని, డాప్లర్ వెదర్ రాడార్ టెక్నాలజీ సాహయంతో వర్షాన్ని, అదే విధంగా వర్షపాతాన్ని ముందే అంచనావేసి ప్రజలని అప్రమత్తం చేసి ధన, ప్రాణ నష్టాలని నివారించేదుకు తగు సదుపాయాలు, వనరులు సమకూరుస్తామని హామీలో పేర్కొన్నారు. ఆర్‌డబ్ల్యూఏలతో పాటు చెరువులు సంరక్షణ అథారిటీని ఏర్పాటు చేసి అవి కబ్జాలకు గురికాకుండా, అన్యాక్రాంతం కాకుండా చేస్తామని, నాలాల పూడిక పనుల్ని ఎప్పటికప్పుడు చేపట్టి, రిటైనింగ్వాల్స్ , ఫెన్సింగ్ నిర్మాణాలు చేపడతామని హామీ ఇచ్చారు. జపాన్, హాంకాంగ్ దేశాలలో ఏ విధంగానైతే విజయవంతంగా వరద నీటిని నిలువ చేసిందుకు, క్రమబద్ధీకరించేందుకు అతిపెద్ద అండర్ గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ సదుపాయాలను అనుసరించి ఇక్కడ కూడా అండర్ గ్రౌండ్ వాటర్ స్టోరేజి ట్యాంకులను ఏర్పాటు చేసి వరద నీటిని నిరోధించడం, క్రమబద్దీకరించేలా చూస్తామని వరద రహిత హైదరాబాద్ ని నిర్మిస్తామని తెలిపారు. అందరికీ అందుబాటులో వైద్య సేవలు: కోవిడ్-19 చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో చేరుస్తాం. గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ ఇతర ఆసుపత్రులని ప్రత్యేకంగా మెరుగుపరుస్తామని, అన్ని ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా వైద్య పరీక్షలు, ఉచిత ఔషదాలు అందజేస్తామని, ప్రతి 100 దవాఖానాలకు ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని శ్రవణ్ వెల్లడించారు ఉచిత రవాణా సదుపాయం: మహిళలకు, విద్యార్ధులకు, దివ్యాగులకు, వృద్దులకు ఆర్టీసి బస్సులు, మెట్రో, ఎంఎంటిఎస్ లలో నగరంలో ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తాం. ఆర్టీసి బస్సుల సంఖ్యను పెంచుతాం, జీహెచ్ఎంసీ పరిధిలోని చివరి కిలోమీటర్ వరకు ఆర్టీసి బస్సుల సేవలు విస్తరిస్తాం. విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి కార్పోరేట్, ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీల యాజమాన్యాలు విచ్చలవిడిగా వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రిస్తాం. అన్ని ప్రభుత్వ బడుల్లో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తాం. 150 డివిజన్లు అన్నింటిలో విద్యార్థులకు రీడింగ్ రూమ్‌లు, ఈ-లైబ్రరీలు, ఉచిత ఇంటర్నెట్ సదుపాయాలు కలిస్తామని వివరించారు. అర్హత గల వారికి గృహాలు: అర్హత కలిగిన ఇళ్లులేని వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తాం. ఇంటి జాగా వున్న కుటుంబాలకు ఇల్లు కట్టుకోవడానికి ఎనిమిది లక్షల రూపాయిలు, సింగెల్ బెడ్ రూమ్ ఇల్లు అదనపు గది నిర్మాణానికి రూ. నాలుగు లక్షల అందిస్తాం. ఆస్తి పన్నులో రాయితీ: ఆస్తి పన్ను హేతుబద్దీకరణ. స్వల్ప, మధ్య ఆదాయ వర్గాలకు మేలు చేసేందుకు రూ. 50,000 వరకు ఆస్తి పన్నులో రాయితీ ఇస్తాం. గ్రేటర్ పరిధిలో 100యూనిట్లులోపు విద్యుత్‌ను ఉపయోగించుకునే గృహ వినియోగదారులకు విద్యుత్ రాయితీ ఇస్తాం. లాక్ డౌన్ కాలంలో జీహెచ్ఎంసీ పరిధిలో వున్నవారికి ఆస్తి పన్ను, మోటారు వాహన పన్ను కరెంట్ బిల్లు రద్దు చేయడం చేస్తామని, ఒకవేళ ఇప్పటికే చెల్లింది వుంటే ఆ మొత్తాన్ని తదుపరి బిల్లుకు సర్దుబాటు చేస్తామని హామీ ఇస్తున్నట్లు వెల్లడించారు. క్షురకులు, రజకులు, వడ్రంగులు, విశ్వకర్మలకు చెందిన దుకాణాలకు ఆస్తి పన్నుతో పాటు విద్యుత్ బిల్లుల్ని మాఫీ చేస్తామని, ఈ వర్గాల వారికి జీహెచ్ఏంసి పరంగా అవసరమైన అన్ని అనుమతులు ఉచితంగా ఇస్తాం. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్, ధరణి రద్దు: ఎటువంటి రుసుము వసూలు చేయకుండానే ఎల్ఆర్ఎస్, బిఆర్ఎస్ అమలునకు కృషి చేస్తాం. ధరణి పోర్టల్ రద్దుకు కృషి చేస్తాం ఉచితంగా మంచినీటి సరఫరా: 30,000 లీటర్ల వరకు ఉచితంగా మంచినీటి సరఫరా, ఉచితంగా వాటర్ కనెక్షన్ ఇస్తామని వెల్లడించారు. ఇతర ముఖ్య హామీలు: మురికివాడల అభివృద్ధి అథారిటీ ఏర్పాటు చేస్తాం. సఫాయి కర్మచారీలు, వారి కుటుంబాలకు రూ.20 లక్షల బీమా సదుపాయం కల్పిస్తాం. కేబుల్ టీవీ ఆపరేటర్లకు స్తంభాల ఫీజు మాఫీ చేస్తాం. కొవిడ్ వల్ల దెబ్బతిన్న రంగాలకు నిరుద్యోగ అలవెన్స్‌లు ఇస్తాం. అన్నపూర్ణ క్యాంటీన్ల సంఖ్య పెంచుతాం. సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్లకు పన్ను మినహాయింపు ఇస్తాం. మాల్స్, మల్టీప్లెక్స్‌ల్లో సినిమా టికెట్ల ధరల నియంత్రణలోకి తెస్తాం. వీధి వ్యాపారులకు ఆరోగ్య, ప్రమాద బీమాకి హామీ ఇస్తున్నట్లు దాసోజు వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలో చెరువులు రక్షణ అథారిటీ ఏర్పాటు చేసి కబ్జాదారుల చెర నుండి చెరువులని పరిరక్షిస్తాం. నాలా ఆక్రమణలను తొలగించడానికి కిర్లోస్కర్ కమిటీ చేసిన సిఫారసులని అమలు చేస్తాం. హెచ్‌డీఏ పరిధిలోని డ్రైనేజీని 500 కిలోమీటర్లకు పెంచుతాం. జీవో 68ని రద్దు చేసి హోర్డింగ్‌లపై అధికార పార్టీ గుత్తాధిపత్యాన్ని తొలగించి వాటిపై ఆధారపడిన కుటుంబాల వారిని రక్షిస్తాం. 74వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తి అమలు జరిగేందుకు జీహెచ్ఎంసీ మేయర్, కార్పోటర్లందరినీ అన్ని విధాలుగా సాధికారుల్ని చేస్తామని, జీహెచ్ఎంసీలో అవినీతి పారద్రోలి, జవాబుదారీతనాన్ని పెంచడానికి లోక్‌పాల్ వ్యవస్థను అమలు చేస్తాం. జీహెచ్ఎంసీ మేయర్, కార్పోరేటర్లు, అధికారులును ఈ వ్యవస్థలోకి తెస్తామని వివరించారు. -
రైతులకు వడ్డీ లేని రుణాలు
చండీగఢ్: మళ్లీ అధికారంలోకి వస్తే రైతులకు తనఖా లేకుండా రూ. 3 లక్షల వరకు వడ్డీలేని పంట రుణం, షెడ్యూల్ కులాల వారికి రూ. 3 లక్షల వరకు షరతుల్లేని రుణం ఇస్తామని బీజేపీ ప్రకటించింది. త్వరలో జరగనున్న హరియాణా అసెంబ్లీ ఎన్నికలకోసం ఆ పార్టీ ఆదివారం మేనిఫెస్టో విడుదల చేసింది. ‘ఇది పూర్తి నిబద్ధతలో రూపొందించిన పత్రం. సమాజంలోని అన్ని వర్గాలు ప్రయోజనం పొందేలా మేనిఫెస్టోను తయారు చేశాం’అని బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా చండీగఢ్‌లో ప్రకటించారు. సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ మాట్లాడుతూ, అవినీతి రహిత పాలన ఇవ్వాలన్న వాగ్దానాన్ని తాము నెరవేర్చామని, భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని అన్నారు. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు.. ► రైతులకు 3 లక్షల వరకు వడ్డీ లేని పంట రుణం ► కర్షకుపంటలకు కనీస మద్దతు ధర. కిసాన్ కళ్యాణ్ ప్రధీకరణకోసం వెయ్యి కోట్ల బడ్జెట్ ► యువజన అభివృద్ధి, స్వయం ఉపాధి మంత్రిత్వ శాఖ ఏర్పాటు. రూ. 500 కోట్లతో 25 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ ► ఐదెకరాల లోపు ఉన్న 14 లక్షల మంది రైతులకు రూ. 3 వేల వృద్ధాప్య పెన్షన్. ► విద్యార్థులకు ఉన్నత విద్యకోసం షరతులు లేని రుణాలు ► విద్యార్థినుల కోసం పింక్ బస్సు సేవలు. వారి ఆత్మరక్షణ కోసం ప్రత్యేక శిక్షణ. -
ఉద్యోగాల్లో మహిళలకు 33% కోటా
చండీగఢ్: హరియాణా ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మహిళలపైనే దృష్టి సారించింది. శుక్రవారం విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో తాము అధికారంలోకి వస్తే మహిళలకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు, రైతులకు రుణ మాఫీ హామీలను ప్రకటించింది. ఈ మేనిఫెస్టోను సంకల్పయాత్రగా అభివర్ణించిన ఆ పార్టీ హరియాణా రోడ్‌వే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం కోటా అమలు చేస్తామంది. రైతులకు రుణమాఫీ, ఎస్సీ విద్యార్థులు, అత్యంత వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఏడాదికి 12 వేల రూపాయల స్కాలర్ షిప్, పదకొండు, పన్నెండు తరగతులకు ఏడాదికి 15 వేల రూపాయలు స్కాలర్ షిప్ ఇస్తామని హరియాణా కాంగ్రెస్ చీఫ్ కుమారి సెల్జా వెల్లడించారు. షెడ్యూల్డ్ కులాల కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. -
ఆ పార్టీ మ్యానిఫెస్టోలో బంపర్ ఆఫర్లు
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల సీజన్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు పలు పార్టీలు వరాలు, హామీలు గుప్పించడం సహజమే. ఢిల్లీ ఓటర్లకు సంజి విరాసత్ పార్టీ తన మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఓటర్లకు కిక్ ఇచ్చేలా ఉన్నాయి. తాము అధికారంలోకి వస్తే మద్యంపై 50 శాతం డిస్కౌంట్ ఇవ్వడంతో పాటు ముస్లింలకు ఈద్ రోజు ఉచితంగా మేకల పంపిణీ, మహిళలకు ఉచితంగా బంగారం వంటి పలు హామీలను ఆ పార్టీ తన మ్యానిఫెస్టోలో పొందుపరిచింది. సంజి విరాసత్ పార్టీ అభ్యర్థి అమిత్ శర్మ ఈ హామీలతో ఏకంగా పోస్టర్లను రూపొందించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అమిత్ శర్మ ఆ పార్టీ తరపున ఈశాన్య ఢిల్లీ నుంచి బరిలో నిలిచారు. ఇక ఆ పార్టీ తన మ్యానిఫెస్టోలో మద్యంపై రాయితీ, ఉచిత మేక పధకంతో పాటు పీహెచ్డీ వరకూ ఉచిత విద్య, ఢిల్లీ విద్యార్థులకు మెట్రో, బస్సుల్లో ఉచిత ప్రయాణం, ప్రైవేట్ స్కూల్స్‌లోనూ ఉచిత విద్య, యువతుల వివాహానికి రూ 2.5 లక్షల నగదు సాయం, నిరుద్యోగ యువతకు రూ 10,000 భృతి, వృద్ధులకు, వికలాంగులకు రూ 5000 పెన్షన్ వంటి పలు హామీలను గుప్పించింది. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్ధానాలకు మే 12న ఆరో విడతలో పోలింగ్ జరగనుంది. -
రామ మందిరం నిర్మిస్తాం
న్యూఢిల్లీ: స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తిచేసుకునే 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారత్’ కలను సాకారం చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఆ పార్టీ సోమవారం 75 వాగ్దానాలతో లోక్‌సభ ఎన్నికలకు మేనిఫెస్టోను ప్రకటించింది. 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకునే 2022 నాటికి ఈ లక్ష్యాలన్ని సాధించాలని ధ్యేయంగా పెట్టుకున్నట్లు తెలిపింది. త్వరితగతిన రామమందిర నిర్మాణం, ఉగ్రవాదంపై ఉక్కుపాదం, వచ్చే మూడేళ్లలో రైతుల ఆదాయాన్ని మూడింతలు చేయడం తదితరాలను మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రస్తావించింది. కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దుచేస్తామని హామీ ఇచ్చింది. మేనిఫెస్టో ముఖ్యాంశాలు సాంస్కృతిక వ్యవహారాలపై.. అయోధ్యలో త్వరితగతిన రామ మందిర నిర్మాణానికి రాజ్యాంగ నిబంధలకు లోబడి అన్ని చర్యలు తీసుకుంటాం. సంప్రదాయాలు, మత విశ్వాసాలకు రాజ్యాంగపర రక్షణ కల్పించేందుకు కృషిచేస్తాం. శబరిమల వివాదంలో మతాచారాలకు సంబంధించిన విషయాల్ని సుప్రీంకోర్టు ముందు సమగ్రంగా అందుబాటులో ఉంచుతాం. ఉమ్మడి పౌర స్మృతి ముసాయిదా రూపకల్పనకు కట్టుబడి ఉన్నాం. అన్ని లిఖిత, అలిఖిత భాషలు, యాసలపై అధ్యయనానికి జాతీయస్థాయి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేస్తాం. జమ్మూ కశ్మీర్‌పై.. ఆర్టికల్ 370 రద్దుకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటిస్తున్నాం. బయటి వారెవరూ కశ్మీర్లో ఆస్తులు కొనుగోలు చేయకుండా నిరోధిస్తున్న ఆర్టికల్ 35ఏను కూడా తొలగిస్తాం. ఈ ఆర్టికల్ స్థానికేతరులు, మహిళలపై వివక్షాపూరితంగా ఉంది. ఆర్థిక వ్యవస్థపై.. 2030 నాటికి భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేస్తాం. 2025 నాటికి మన ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు, 2032 నాటికి 10 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుస్తాం. రక్షణ, భద్రతపై.. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేలా సాయుధ బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తాం. రక్షణ కొనుగోళ్ల ప్రక్రియను వేగిరం చేస్తాం. దశల వారీగా ఎన్ఆర్సీ(నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్)ని వేర్వేరు ప్రాంతాల్లో అమలు చేస్తాం. రాష్ట్రాల సంస్కృతులు, ఆచారాలను గౌరవిస్తూ పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదిస్తాం. వ్యవసాయంపై.. 2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్య సాధనకు కట్టుబడి ఉన్నాం. ప్రస్తుతం 2 హెక్టార్లలోపు భూమి ఉన్న రైతులకే అందుతున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సాయాన్ని రైతులందరికీ విస్తారిస్తాం. చిన్న, సన్నకారు రైతులకు పింఛన్ పథకాన్ని తెస్తాం. సకాలంలో చెల్లిస్తే రూ.లక్ష వరకు తీసుకునే రుణాలపై వడ్డీ కట్టనక్కర్లేదు. గ్రామీణాభివృద్ధిపై.. వచ్చే ఐదేళ్లలో గ్రామీణాభివృద్ధికి రూ. 25 లక్షల కోట్లు వెచ్చిస్తాం. సొంతిళ్లు లేని వారికి 2022 నాటికి పక్కా ఇళ్లు ఉండేలా చూస్తాం. 2024 నాటికి ప్రతి ఇంటికీ పైపుల ద్వారా తాగునీరు సరఫరా చేస్తాం. స్టార్టప్‌లపై.. ఎలాంటి హామీ లేకుండానే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రూ.50 లక్షల వరకు రుణ సదుపాయం పొందేలా కొత్త పథకం తెస్తాం. పురుషులు తీసుకునే రుణ మొత్తంలో 50 శాతానికి, మహిళలు పొందే రుణాల్లో 25 శాతానికి ప్రభుత్వమే హామీదారుగా ఉంటుంది. నియంత్రణ సంబంధిత నిబంధనలను సరళీకరించి స్టార్టప్‌ల స్థాపనను సులభతరం చేస్తాం. మౌలిక రంగంపై.. గ్యాస్ గ్రిడ్లు, వాటర్ గ్రిడ్లు, ఐ–వేస్, ప్రాంతీయ విమానాశ్రయాల నిర్మాణం, జాతీయ రహదారుల వెంట కనీస సదుపాయాల కల్పనతో తదుపరి తరం మౌలిక వసతులు నిర్మిస్తాం. ఇతర హామీలు ► దేశవ్యాప్తంగా కొత్తగా 75 మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాలల స్థాపన ► ప్రతి గ్రామంలో ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ ► 2022 నాటికి అన్ని రైల్వే ట్రాక్‌ల విద్యుదీకరణ పూర్తి ► స్టెంట్లు, కృత్రిమ మోకాలి చిప్పలు లాంటి అత్యవసర వైద్య ఉపకరణాలతో ప్రత్యేక జాబితా. వాటి ధరల నిర్ధారణకు ప్రత్యేక విధానం జాతీయవాదమే స్ఫూర్తి జాతీయవాద స్ఫూర్తి, సుపరిపాలన అనే మంత్రంతో దేశాన్ని 2047(స్వాతంత్య్ర శతాబ్ది వేడుకల ఏడాది) నాటికి అభివృద్ధి చెందిన భారత్‌గా మారుస్తామని మోదీ అన్నారు. పౌరులందరికీ ఆత్మ గౌరవం, భద్రత, అభివృద్ధి అందించే శక్తిమంతమైన దేశ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని మేనిఫెస్టో ముందుమాటలో పేర్కొన్నారు. ఐదేళ్ల ఎన్డీయే పాలనలో చారిత్రక నిర్ణయాలు ఎన్నో తీసుకున్నామని, అన్ని వర్గాలకు న్యాయం చేశామని అమిత్ షా అన్నారు. జాతీయవాదానికి, ఉగ్రవాదంపై శూన్య సహనశీల వైఖరికి బీజేపీ కట్టుబడి ఉందని మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రాజ్‌నాథ్ తెలిపారు. వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా మేనిఫెస్టో రూపొందించామని జైట్లీ అన్నారు. 370 రద్దుపై కన్నెర్ర జెండా ఎవరెగరేస్తారో చూస్తా: ఫరూక్ ‘370 అధికరణం రద్దు చేస్తామని వాళ్లు మాట్లాడుతున్నారు. అలా మీరు చేస్తే, కశ్మీర్లో మీ పాలనకు చట్టబద్ధత లేనట్లే. వారు ఆ పని ఎలా చేస్తారో చేయని వ్వండి. ఇక్కడ జాతీయ జెండా ఎగురవేస్తారో చూస్తా. హృదయాలను కలపండి, ముక్కలు కానివ్వకండి’ అని నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఫరూక్ అబ్దుల్లా అన్నారు. నిప్పుతో ఆడుకోవద్దు: మెహబూబా ఆర్టికల్ 370 రాష్ట్రాన్ని దేశంతో కలిపే వారధి వంటింది. దానిని తెంపితే రాష్ట్రంపై భారత్‌కు చట్టబద్ధ హక్కు ఉండదు. కశ్మీర్ ఒక బాంబులా ఉంది. దానికి నిప్పు అంటిస్తే అంతటా అంటుకుంటుంది. కశ్మీర్‌తోపాటు భారత్ కూడా మిగలదు’ అని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు. మేనిఫెస్టోపై స్పందనలు అది వంచనా పత్రం: కాంగ్రెస్ 2014లో ఇచ్చిన హామీలనే తాజాగా తన మేనిఫెస్టోలో బీజేపీ చేర్చిందని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. నిండా అబద్ధాలు, వంచనతో కూడిన మేనిఫెస్టో బదులు క్షమాపణ పత్రం విడుదల చేస్తే బాగుండేదని చురకలు అంటించింది. తమ మేనిఫెస్టోలో న్యాయం ఉంటే, బీజేపీ మేనిఫెస్టోలో అబద్దాలున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ అన్నారు. మేనిఫెస్టోపై బెంగాల్ సీఎం మమతా స్పందిస్తూ ‘మోదీ ప్రధానిగా ఎన్నికైతే అసలైన పౌరులు శరణార్థులుగా మారుతారు’ అని హెచ్చరించారు. అది బీజేపీ గిమ్మిక్కు: ఎన్సీపీ బీజేపీ మేనిఫెస్టో ఒక జిమ్మిక్కు అని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) పేర్కొంది. 2014 ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలయిందీ వెల్లడించాలని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అన్నారు. ‘కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణం రద్దు, మందిర నిర్మాణం వంటి వాటిపై ఏళ్లుగా చెబుతున్న బీజేపీ ఇప్పటికీ నెరవేర్చలేదు’ అని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీకి అర్హత లేదు: మాయావతి ఎన్నికల హామీలను విస్మరించిన బీజేపీ, ప్రధాని మోదీకి తాజాగా మరో మేనిఫెస్టో విడుదల చేసే నైతిక అర్హత లేదని బీఎస్పీ అధినేత్రి మాయావతి పేర్కొన్నారు. ఇందుకు బదులుగా ఆ పార్టీ గత హామీలు ఏమేరకు అమలయ్యాయో తెలిపే నివేదిక ఇస్తే బాగుండేదన్నారు. స్వాగతించిన శివసేన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను ఎన్డీఏ భాగస్వామి పార్టీ శివసేన స్వాగతించింది. మందిరం నిర్మించేందుకు, ఉమ్మడి పౌర స్మృతి అమలు చేసేందుకు గట్టిగా ప్రయత్నం చేస్తామని తెలిపింది. -
బీజేపీ మ్యానిఫెస్టో : మందిర్.. మర్చంట్.. కిసాన్
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలకు అన్ని వర్గాలను ఆకట్టుకునేలా వరాల జల్లుతో బీజేపీ తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి రాజ్‌నాధ్ సింగ్ సోమవారం పార్టీ సంకల్ప పత్రం ఆవిష్కరించారు. బీజేపీ తన మ్యానిఫెస్టోలో రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు వంటి గత హామీలను ప్రస్తావిస్తూనే రైతులు, చిరువ్యాపారులను ఆకట్టుకునేందుకు పలు వాగ్దానాలు చేసింది. చిన్న, సన్నకారు రైతులకు పెన్షన్‌తో పాటు వడ్డీ లేకుండా వ్యవసాయ రుణాలు అందిస్తామని హామీ ఇచ్చింది. రైతులందరికీ ఏటా రూ 6000 నగదు సాయం ప్రకటించింది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ ఐదేళ్లలో అద్భుత పాలనను అందించారని ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ చీఫ్ అమిత్ షా అన్నారు. అభివృద్ధిలో దేశం దూసుకెళుతోందని, తమ హయాంలో 12 లక్షల కోట్ల స్కామ్‌లను వెలుగులోకి తెచ్చామని చెప్పారు. ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తిగా భారత్ సత్తా చాటుతోందన్నారు. మ్యానిఫెస్టోలో ముఖ్యాంశాలు రామమందిర నిర్మాణానికి కట్టుబడి ఉంటాం జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చిన్న, సన్నకారు రైతులకు పెన్షన్లు రైతులకు ఏటా రూ 6000 నగదు సాయం రైతులకు వడ్డీ లేకుండా రుణాలు 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు వ్యవసాయం, గ్రామీణ రంగాల్లో రూ 25 లక్షల కోట్ల పెట్టుబడులకు హామీ కిసాన్ సమ్మాన్ యోజన విస్తరణ ప్రపంచంలోని మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్ధల్లో భారత్‌ను ఒకటిగా తీర్చిదిద్దడం ఉగ్రవాదంపై రాజీలేని పోరు మౌలిక రంగంలో 100 లక్షల కోట్ల పెట్టుబడులు చిన్న వ్యాపారులకు రూ 10 లక్షల ప్రమాద బీమా 2022 నాటికి హైవేలను రెట్టింపు చేయడం జాతీయ వర్తక సంక్షేమ బోర్డు ఏర్పాటు గుర్తింపు పొందిన వ్యాపారులకు క్రెడిట్ కార్డులు అందరికీ విద్య -
నేను విన్నాను.. నేనున్నాను
సాక్షి, గుంటూరు : రాజన్న రాజ్య స్థాపనే లక్ష్యంగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఎన్నికల ప్రణాళికను ప్రకటించారు. తాడేపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టోలో అన్నివర్గాల వారికి వరాల జల్లు కురిపించారు. అన్నదాతలకు పెట్టుబడి సాయం, ఉచిత బోర్లు, 9 గంటల విద్యుత్‌తో అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. అందరికీ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. కేజీ నుంచి పీజీ వరకు చదువులకు ప్రాధాన్యమిచ్చారు. అవ్వాతాతలకు పింఛన్లు పెంచి బతుకుపై భరోసా ఇచ్చారు. నవయుగ సాకారానికి నాంది పలుకుతూ.. సమున్నత ఆశయంతో ప్రతి ఒక్కరికీ మేలు కలిగించే విధంగా.. మనసా, వాచా, కర్మేణా మేనిఫెస్టోను అమలు చేస్తానని జననేత వైఎస్ జగన్ స్పష్టం చేయడంపై జిల్లాలో అన్నివర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. సమసమాజ స్థాపనే లక్ష్యం.. అన్నదాతకు అండగా.. అక్కచెల్లెమ్మలకు చేయూతగా, విద్య, వైద్య రంగాలకు పెద్ద పీట వేస్తూ అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇస్తూ.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నాటి సంక్షేమ పాలన అందించే దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారు. తాడేపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగిన ఉగాది వేడుకల్లో మేనిఫెస్టోను ఆవిష్కరించారు. మేనిఫెస్టోపై అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. అన్నదాతకు భరోసా ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయం సంవత్సరానికి రూ.12,500 చొప్పున కింద రూ.50 వేలు, అందిస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు. ఈ పథకం వల్ల జిల్లాలో 7.20 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రైతులకు ఉచితంగా బోర్లు, పగలే 9 గంటల నిరంతర విద్యుత్, ధరల స్థిరీకరణకు రూ.3 వేల కోట్లతో నిధి, ప్రమాదవశాత్తు మృతిచెందిన రైతు కుటుంబానికి రూ.7 లక్షల బీమా, పాడి రైతులకు చేయూత, ఇలా అనేక విధాలుగా అన్నదాతను ఆదుకుంటామని వైఎస్సార్ సీపీ మ్యానిఫెస్టో ద్వారా హామీ ఇచ్చారు. అక్కాచెల్లెమ్మలకు అండగా.. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకి రుణాలు, 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు దశల వారీగా కార్పొరేషన్ల ద్వారా రూ.75 వేలు అందిస్తామని, పొదుపు సంఘాల రుణం మొత్తాన్ని నాలుగు దఫాల్లో నేరుగా వారి చేతికే అందిస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించారు. ఈ పథకాల ద్వారా జిల్లాలోని 20 లక్షల మంది మహిళలకు ఏదో రకంగా లబ్ధిచేకూరనుంది. విద్య, వైద్యానికి పెద్ద పీట తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పిల్లలకు చదువులన్నీ ఉచితమని, బిడ్డలను బడికి పంపితే తల్లికి సంవత్సరానికి రూ.15 వేలు, ఫీజు రీయింబ ర్స్మెంట్తోపాటు విద్యార్థికి ఏటా వసతి కోసం రూ.20 వేలు అందిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటు చేసి ఫీజులను నియంత్రిస్తామని ప్రకటించారు. వైద్య ఖర్చులు రూ.1000 దాటితే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొస్తామని, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల్లో చికిత్స చేయిం చుకున్నా ఉచితమేనని, నెలకు రూ.40 వేల వేతనం పొందే ఉద్యోగులకు వైద్య సేవలు అందిస్తామని జగన్ తెలిపారు. ఈ పథకాల వల్ల జిల్లాలోని లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. బడుగు, బలహీన వర్గాలకు చేయూత జిల్లాలో 30 లక్షల మందికి పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారు ఉన్నారు. బీసీల అభ్యున్నతికి రూ.15 వేల కోట్ల చొప్పున ఐదేళ్లల్లో రూ.70 వేల కోట్లు ప్రత్యేక ఉప ప్రణాళిక ద్వారా ఖర్చు చేస్తామని జగన్ చెప్పారు. నామినేటెడ్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు.బీసీ చెల్లెమ్మలకు ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న పెళ్లికానుకను రూ.35 వేల నుంచి రూ.50 వేలకు పెంచుతామని జగన్ చెప్పారు. ఉద్యోగులకు భరోసా జిల్లాలో ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఉద్యోగులు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కలుపుకొని లక్ష మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. వారందరినీ వైఎస్సార్ సీపీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని వైఎస్ జగన్ మ్యానిఫెస్టో ద్వారా భరోసా ఇచ్చారు. సీపీఎస్ రద్దు చేస్తామని, ఉద్యోగులు కోరుకున్న విధంగా 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) అంది స్తామని, పోలీసు శాఖలో ఉద్యోగులకు వారానికి ఒక రోజు సెలవు ఉండేలా చూస్తానని, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. -
రైతుకు రుణ విముక్తి
న్యూఢిల్లీ: నిరుద్యోగులు, పేదలు, మహిళలు, రైతుల ఓట్లే లక్ష్యంగా ఆకర్షణీయ తాయిలాలతో కాంగ్రెస్ తన మేనిఫెస్టోను ప్రకటించింది. అధికారంలోకి వస్తే ఏటా వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడతామని, ఓ మోస్తరు రేటుతో జీఎస్టీలో ఒకే రేటును అమల్లోకి తెస్తామని హామీ ఇచ్చింది. రైతులకు రుణమాఫీ కాకుండా, నేరుగా రుణాల నుంచే విముక్తి కల్పిస్తామని వాగ్దానం చేసింది. అధ్యక్షుడు రాహుల్ ప్రతిపాదించిన కనీస ఆదాయ హామీ పథకం ‘న్యాయ్’కు జాబితాలో పెద్దపీట వేసింది. ‘మేము నెరవేరుస్తాం’ పేరిట రూపొందించిన 55 పేజీల ఈ మేనిఫెస్టో పత్రాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీయే చైర్పర్సన్ సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్æ, చిదంబరం తదితరులు ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. ► కోట్లాది మందికి గొంతుక: రాహుల్ ఐదేళ్ల పాలనలో బీజేపీ దేశవ్యాప్తంగా విద్వేషం, విభజన రేఖల్ని విస్తరించిందని మేనిఫెస్టో విడుదల సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రజలను సమైక్యపరచడానికి కాంగ్రెస్ పాటుపడుతుందని తెలిపారు. తమ మేనిఫెస్టో ఫలానా వ్యక్తి మనోగతం కాదని, కోట్లాది ప్రజలకు గొంతుక అని పేర్కొన్నారు. దేశ ప్రజల స్వేచ్ఛ, మర్యాద, ఆత్మగౌరవం, అభివృద్ధికి అలుపెరగకుండా కృషిచేస్తున్న ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని చాటిచెప్పేలా మేనిఫెస్టో రూపొందించామని చెప్పారు. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు ఆయా రంగాల వారీగా.. ► వ్యవసాయం పంటలకు మెరుగైన మద్దతు ధరలు కల్పించడంతో పాటు పెట్టుబడి ఖర్చులు తగ్గిస్తాం. వ్యవస్థాగత రుణ పరపతి సౌకర్యం రైతులందరికీ అందుబాటులో ఉండేలా చూస్తాం. ఈ చర్యలతో రైతు ‘రుణమాఫీ’ నుంచి రైతుకు ‘రుణాల నుంచి విముక్తి’ కల్పించే దిశగా సాగుతాం. ఏటా సాధారణ బడ్జెట్‌తో పాటు వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడతాం. ► విద్య, వైద్యం విద్య, వైద్యానికి జీడీపీలో 6 శాతం నిధులు కేటాయిస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 12 తరగతుల వరకు ఉచిత, నిర్బంధ విద్యను అమలుచేస్తాం. ప్రభుత్వ ఆసుపత్రులను పరిపుష్టం చేసి పేదలకు నాణ్యమైన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తెస్తాం. ఆరోగ్య సంరక్షణ హక్కు చట్టం రూపొందించి ప్రతి పౌరుడికి ఉచితంగా వైద్య పరీక్షలు చేయిస్తాం. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల నెట్వర్క్ ద్వారా పేదలకు ఉచితంగా ఓపీ సేవలు, ఔషధాలు, వైద్యం అందిస్తాం. ► న్యాయ్ దేశంలో అత్యంత నిరుపేదలైన 20 శాతం కుటుంబాలకు కనీస ఆదాయ హామీ కింద ఏటా రూ.72 వేలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తాం. పేదరికంపై నిజమైన సర్జికల్ స్ట్రైక్స్ ఇదే కాబోతోంది. ఈ పథకం కోసం తొలి ఏడాది జీడీపీలో 1 శాతం, రెండో ఏడాది 2 శాతం ఖర్చు చేస్తాం. ► ఏపీకి ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తాం. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను పునరుద్ధరిస్తాం. వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును ఉపసంహరించుకుంటాం. పుదుచ్చేరికి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇస్తాం. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ సంపూర్ణ అధికారాల్ని కేవలం మూడింటి(రెవెన్యూ, పోలీస్, శాంతిభద్రతలు)కే పరిమితం చేస్తూ చట్ట సవరణ చేస్తాం. ► ఉపాధి ప్రభుత్వ రంగంలో 34 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. అందులో 4 లక్షల ఖాళీల్ని 2020 మార్చి నాటికే నింపుతాం. మరో 20 లక్షల ఖాళీల్ని భర్తీచేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచిస్తాం. ప్రతి గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల్లో కొత్తగా 10 లక్షల సేవా మిత్ర ఉద్యోగాల్ని సృష్టిస్తాం. ఉద్యోగ కల్పనతో పాటు మహిళలకు ఎక్కువ అవకాశాలు కల్పించే ప్రైవేట్ సంస్థలకు ప్రోత్సాహకాలిస్తాం. ► జీఎస్టీ సంస్కరణలు ఒకే ఒక మోస్తారు రేటు ఉండేలా వస్తు, సేవల పన్ను జీఎస్టీలో సమూల మార్పులు తెస్తాం. ఎగుమతులు, అత్యవసర వస్తువులు, సేవలకు పన్ను మినహాయింపునిస్తాం. జీఎస్టీ ఆదాయంలో పంచాయతీలు, మునిసిపాలిటీలకు వాటా కేటాయిస్తాం. రిజర్వ్ బ్యాంకు విధుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా చూస్తాం. ► గ్రామీణాభివృద్ధి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిదినాలను 150 రోజులకు పెంచుతాం. 250 మంది జనాభా ఉన్న గ్రామాలన్నింటిని పక్కా రోడ్లతో అనుసంధానిస్తాం. ఇళ్లు, సొంత భూమిలేని ప్రతి కుటుంబం సొంతిళ్లు కలిగి ఉండేలా ప్రత్యేక చట్టం తెస్తాం. ► మహిళా సాధికారత చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కొత్తగా కొలువుదీరబోయే లోక్‌సభ తొలి సమావేశంలోనే ఆమోదం తెలుపుతాం. అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పస్తాం. ► విద్వేష నేరాల కట్టడి మూక హత్యలు, విద్వేష నేరాల నియంత్రణకు పార్లమెంట్ తొలి సెషన్లోనే నూతన చట్టం తెస్తాం. బాధితులకు పరిహారం చెల్లించడంతో పాటు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు, ఇతర ఉన్నతాధికారుల్ని బాధ్యుల్ని చేసేలా నిబంధనలు రూపొందిస్తాం. దేశాన్ని ముక్కలు చేస్తుంది: బీజేపీ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ఆచరణీయ సాధ్యం కాదని, అది ప్రమాదకరంగా, దేశాన్ని ముక్కలుగా విడగొట్టేలా ఉందని బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాల్ని బట్టి చూస్తే ఆ పార్టీకి ఒక్క ఓటు కూడా పొందే అర్హత లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఐదు రాష్ట్రాల్లో కనీసం కంటితుడుపుగానైనా రుణమాఫీని అమలుచేయలేదని మండిపడ్డారు. జమ్మూ కశ్మీర్‌కు సంబంధించి మేనిఫెస్టోలో చేర్చిన భాగాల్ని రాహుల్ సన్నిహితులు(2016లో జేఎన్‌యూలో జాతి వ్యతిరేక నినాదాలు చేసిన వారిని ఉద్దేశించి) రచించారేమోనని సందేహం వ్యక్తం చేశారు. దేశద్రోహం చట్టాన్ని రద్దుచేస్తామని ప్రకటించడంపై స్పందిస్తూ..జిహాదీలు, మావోయిస్టుల చెప్పుచేతల్లో కాంగ్రెస్ ఉండటం ఇకపై నేరం కాబోదని ఎద్దేవా చేశారు. న్యాయ్ పథకం అమలుకు కాంగ్రెస్ నేతలు పరస్పరం విరుద్ధ వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఈ పథకానికి నిధుల సమీకరణ కోసం కొందరేమో పన్నులు పెంచాలని సూచించారని, మరి కొందరు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని అన్నారని తెలిపారు. వయనాడ్ నుంచే పోటీ ఎందుకంటే... మోదీ దక్షిణాదిపై విద్వేషం పెంచుకున్నట్లు అక్కడి ప్రజలు భావిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. దక్షిణ భారత ప్రజలకు మద్దతుగా ఉన్నానని తెలిపేందుకే వయనాడ్ నుంచి పోటీచేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తమని కలుపుకుపోవడం లేదని, కీలక నిర్ణయాల్లో తమ అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని దక్షిణాది ప్రజలు భావిస్తున్నట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీతో పాటు వయనాడ్‌లో కూడా రాహుల్ పోటీచేస్తున్నట్లు కాంగ్రెస్ ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. పొత్తులకు సిద్ధమే: దేశవ్యాప్తంగా పొత్తులకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని రాహుల్ చెప్పారు. ఢిల్లీలో ఆప్‌తో పొత్తుపై సందిగ్ధత నెలకొనడంపై ఓ విలేకరి ప్రశ్నించినపుడు ఆయన ఇలా స్పందించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ ఇతర పార్టీలతో కలసి పనిచేయడం లేదన్న వార్తల్ని తోసిపుచ్చారు. మహారాష్ట్ర, బిహార్, జార్ఖండ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో భావసారూప్య పార్టీలతో ముందస్తు అవగాహన కుదుర్చుకున్న సంగతిని ప్రస్తావించారు. అనంతరం ఆప్ స్పందిస్తూ పొత్తు కుదుర్చుకునేందుకు ఉన్న అవకాశాలపై కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతామని వెల్లడించింది. -
భారీ వరాలు.. కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఇదే!
సాక్షి, న్యూఢిల్లీ : దేశ ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతూ లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మంగళవారం తన ఎన్నికల ప్రణాళికను వెల్లడించింది. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేతలు చిదంబరం తదితరుల సమక్షంలో పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఏడాదికి పైగా మ్యానిఫెస్టో రూపకల్పనకు కసరత్తు చేశామని రాహుల్ పేర్కొన్నారు. గతంలో చెప్పిన మేరకు అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పునరుద్ఘాటించారు. ఉపాధి, పేదరిక నిర్మూలన, విద్య, వైద్యం, వ్యవసాయ రంగ పునరుద్ధరణపై మ్యానిఫెస్టో ప్రత్యేకంగా దృష్టిసారించిందని చెప్పారు. మ్యానిఫెస్టో వాస్తవ అంశాలనే ప్రతిపాదించామని అన్నారు. దేశవ్యాప్తంగా ఐదు కోట్ల నిరుపేద కుటుంబాలకు ఏటా రూ 72,000 కోట్ల నగదు సాయం తమ ఎన్నికల ప్రణాళికలో అత్యంత కీలకమని రాహుల్ చెప్పుకొచ్చారు. విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ పీ చిదంబరం మాట్లాడుతూ మ్యానిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు దేశంలో కోట్లాది మంది గొంతుకను ప్రతిబింబిస్తాయని అన్నారు. ఎన్నికల ప్రణాళిక కసరత్తును చేపట్టేముందు వివిధ వర్గాలతో విస్తృత సంప్రదింపులు చేపట్టామని చెప్పారు. రైతులు, యువత, మహిళలు, పరిశ్రమలు, మైనారిటీలు, విద్య, వైద్యం, జాతీయ భద్రత, విదేశాంగ విధానం వంటి కీలకాంశాలను తమ ప్రణాళికలో పొందుపరిచామని తెలిపారు. మ్యానిఫెస్టోలో ప్రధాన హామీలివే.. పేదలకు కనీస ఆదాయ హామీ పధకం నిరుపేద కుటుంబాలకు ఏటా రూ 72వేల ఆర్ధిక సాయం ప్రత్యేకంగా కిసాన్ బడ్జెట్ ఏడాదిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ ఉపాధి హామీ పధకం 100 రోజుల నుంచి 150 రోజులకు విస్తరణ విద్యారంగానికి బడ్జెట్లో ఆరు శాతం నిధులు ప్రభుత్వ వైద్య సేవల విస్తరణ యువతకు మూడేళ్లపాటు అనుమతులు లేకుండా వ్యాపారం చేసుకునే వెసులుబాటు -
రసవత్తరంగా మారిన మా ఎన్నికలు
-
అందుకే ఎన్నికలకు వెళ్తున్నాం
‘‘శివాజీ రాజా కంటే నేనే సీనియర్. అయితే తన మనసులో మాటని అర్థం చేసుకోవడంతో పాటు ‘మా’ బాగుండాలనే ఉద్దేశంతో గత పర్యాయం ‘మా’ అధ్యక్షుడిగా ఉండమని శివాజీరాజాకి నేనే చెప్పా. అయితే గత ఏడాది వచ్చిన వివాదాలు, కొన్ని సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఏకగ్రీవం కాకుండా ఎన్నికలకు వెళ్తున్నాం’’ అని నటుడు నరేశ్ అన్నారు. నరేశ్ అధ్యక్షుడిగా, రాజశేఖర్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా, జీవితా రాజశేఖర్ ప్రధాన కార్యదర్శిగా ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్యానల్ మంగళవారం హైదరాబాద్‌లో తమ మేనిఫెస్టోని ప్రకటించింది. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ– ‘‘మా’ అన్నది ఒక ఆర్గనైజేషన్. దీన్ని రాజకీయ పార్టీగానో, వ్యాపార సంస్థగానో నడపదలచుకోలేదు. సభ్యుల మధ్య ఆలోచనా విధానాల్లో తేడాలున్నప్పుడు ఎన్నికలు తప్పవు. మా ప్యానల్ విజయం సాధిస్తే పారదర్శకత, జవాబుదారీతనంతో పని చేసి, ‘మా’ ప్రతిష్టను పెంపొందిస్తాం’’ అన్నారు. ‘‘మా’ కమిటీలోని వారందరితో పని చేయించే బాధ్యత నాది’’ అన్నారు రాజశేఖర్. ‘‘చిరంజీవిగారు ఓ ప్యానల్‌కి మద్దతు ఇస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. అందరూ మన కుటుంబ సభ్యులే.. ఏ ప్యానల్ విజయం సాధించినా మద్దతు ఇస్తాను’’ అని మేం కలిసినప్పుడు అన్నారు అని జీవితా రాజశేఖర్ చెప్పారు. -
రిటైర్మెంట్ @ 61
సాక్షి, హైదరాబాద్ : సంక్షేమ ఎజెండాతో టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతామని పేర్కొంది. ఈ హామీతో నిరుద్యోగుల్లో అసంతృప్తి తలెత్తకుండా నియామక వయోపరిమితిని మూడేళ్లు పెంచనున్నట్లు తెలిపింది. పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు సబబైన, సముచితమైన రీతిలో వేతన సవరణపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో ఆదివారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో టీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రకటించింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కె.కేశవరావు కలసి మేనిఫెస్టో విడుదల చేశారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన వందలాది ప్రతిపాదనలను పరిశీలించి మేనిఫెస్టోను రూపొందించినట్లు కె.కేశవరావు తెలిపారు. 15 పేజీలతో రూపొందించిన ఈ మేనిఫెస్టోలో టీఆర్ఎస్ నాలుగేళ్ల మూడు నెలల పరిపాలన విషయాలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలన్నింటినీ మరింత విస్తృత పరుస్తూ, కొనసాగిస్తామని స్పష్టం చేసింది. అభివృద్ధి యజ్ఞానికి అండగా నిలవండి.. ‘ఉద్యమ కార్యాచరణలో, ప్రభుత్వ నిర్వహణలో టీఆర్ఎస్ ప్రదర్శించిన చిత్తశుద్ధి ప్రజల మన్ననలు పొందింది. నిన్నటి దాకా అస్తిత్వానికే నోచుకోని తెలంగాణ నేడొక ఆదర్శ రాష్ట్రంగా ప్రశంసలు పొందుతున్నది. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు అడుగడుగునా అవరోధాలు కల్పించాయి. తమ అల్పమైన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించాయి. అబద్ధపు ప్రచారాలతో, నిరాధారమైన విమర్శలతో అధికార యంత్రాంగంలో ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకు ప్రయత్నించాయి. కోర్టుల్లో కేసులు వేసి, ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోవడానికి కుట్రలు చేశాయి. ప్రగతి నిరోధకుల ఆగడాలకు అడ్డుకట్ట వేయడం కోసం వారిని ప్రజా న్యాయస్థానంలో నెలబెట్టాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఎన్నికల సమరంలో దూకింది. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. మీ తీర్పే శిరోధార్యం. తెలంగాణ ప్రజలే అధిష్టానంగా ఎవరికీ తలవంచకుండా, ఏ ఒత్తిళ్లకు లొంగకుండా తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీలేని వైఖరి అవలంబించే ఒకే ఒక పార్టీ టీఆర్ఎస్ మాత్రమే. చిత్తశుద్ధితో కేసీఆర్ తలపెట్టిన అభివృద్ధి యజ్ఞం కొనసాగేందుకు మరోసారి మద్దతుగా నిలవాలని తెలంగాణ ప్రజలను సవినయంగా కోరుతున్నాం. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాల ప్రజలకు సమాన న్యాయం, సమాన అభివృద్ధి లభించేందుకు, తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజల బతుకులు పండించే బంగారు తెలంగాణ నిర్మాణం కోసం సాగుతున్న మహోన్నత కృషికి అండదండలు ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాం’అని టీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. సంపద పెంచుతున్నాం.. ప్రజలకు పంచుతున్నాం ‘2014 ఎన్నికల సందర్భంగా ప్రకటించిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడంతో పాటు, మేనిఫెస్టోలో ప్రకటించకున్నా సరే, ప్రజలకు అవసరమని భావించిన ప్రభుత్వం అనేక కొత్త పథకాలను ప్రవేశ పెట్టింది. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్, కేసీఆర్ కిట్స్, కంటి వెలుగు లాంటి 76 కొత్త పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోంది. రాష్ట్రంలో స్థిరమైన పరిపాలన అందిస్తూ రాజకీయ అవినీతిని తుద ముట్టించడం ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదాయ వృద్ధిరేటును గణనీయంగా పెంచింది. మొదటి నాలుగేళ్లలో రాష్ట్రం 17.17 శాతం సగటు వార్షిక ఆదాయ వృద్ధిరేటు సాధించింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో కూడా ఇప్పటి వరకు 19.83 వృద్ధిరేటు సాధించింది. పెరిగిన సంపదను పేదలకు పంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పథకాలను రూపొందించింది. ఆదాయ వృద్ధిరేటు ఇలాగే కొనసాగాలంటే రాజకీయ స్థిరత్వాన్ని అందించే టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉంది. రాబోయే రోజుల్లో కూడా ప్రస్తుతం ప్రకటిస్తున్న హామీల అమలుకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజల అవసరాలు, ఆకాంక్షలు, వివిధ వర్గాల డిమాండ్లు ఎప్పటికప్పుడు పరిగణనలోకి తీసుకుంటూ నూతన పథకాలను అమల్లోకి తెస్తాం’అని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో హామీలు.. - వికలాంగుల పెన్షన్లను రూ.1,500 నుంచి రూ.3,016 వరకు పెంచుతాం. మిగిలిన అన్నిరకాల ఆసరా పెన్షన్లు రూ.1,000 నుంచి రూ.2,016 వరకు పెంపు. బీడీ కార్మికుల పీఎఫ్ కటాఫ్ తేదీ 2018 వరకు పొడిగింపు. - వృద్ధాప్య పెన్షన్ అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గింపు. - నిరుద్యోగ సోదరులకు నెలకు రూ.3,016 భృతి చెల్లింపు. - డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పథకాన్ని ప్రస్తుత పద్ధతిలో కొనసాగిస్తూనే, సొంతస్థలం ఉండి, అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు అందజేయడం. - రైతుబంధు కింద ఏడాదికి ఎకరాకు అందిస్తున్న సాయాన్ని రూ.8 వేల నుంచి రూ.10 వేలకు పెంపు. - రైతులకు రూ.1 లక్ష వరకున్న పంట రుణాలు మాఫీ. - రెతు సమన్వయ సమితి సభ్యులకు గౌరవ భృతి చెల్లింపు. - ఎస్సీ, ఎస్టీ వర్గాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక పథకాలు రూపొందించేందుకు నియమించిన కమిటీ ఇచ్చే నివేదికను ప్రభుత్వం అమలు చేస్తుంది. - చట్టసభల్లో బీసీలకు 33 శాతం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు కోసం ప్రభుత్వం పోరాడుతుంది. - ఎస్టీలకు 12 శాతం, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మా నం చేసింది. ఈ రిజర్వేషన్లు అమలు చేయడం కోసం కేంద్రంతో రాజీలేని పోరాటం చేస్తుంది. - ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీ తీర్మానం చేసి, కేంద్రానికి పంపాం. కేంద్రం నుంచి ఆమోదం వచ్చేందుకు టీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. - వివిధ కులాల కేటగిరీ మార్పు కోసం వచ్చిన విజ్ఞాపనలను సానుభూతితో పరిశీలిస్తుంది. - రెడ్డి కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్‌తో పాటు ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాల సంక్షేమానికి కార్పొరేషన్లు ఏర్పాటు. - వివిధ సామాజిక వర్గాల నుంచి కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని వచ్చిన డిమాండ్లను రాబోయే టీఆర్ఎస్ ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుంది. - అగ్ర కులాల్లోని పేదల అభ్యున్నతికి ప్రత్యేక పథకాలు అమలు.. - టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పుతుంది. ఐకేపీ ఉద్యోగులను పర్మినెంటు చేసి, ఈ యూనిట్ల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలతో కలిపి ఐకేపీ ఉద్యోగులకు అప్పగిస్తుంది. ఈ యూనిట్లు తయారు చేసే ఆహార పదార్థాలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెస్తుంది. - కంటి వెలుగు పథకం తరహాలోనే ప్రజలందరికీ ఇతర ఆరోగ్య పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తుంది. ప్రతీ వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ రికార్డు చేసి, రాష్ట్ర హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తుంది. - ప్రభుత్వ ఉద్యోగులకు సబబైన, సముచితమైన రీతిలో వేతన సవరణ చేస్తుంది. - ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంపు. దీనికి సమాంతరంగా నిరుద్యోగులకు ఎక్కువ అవకాశాలు కల్పించేందుకు ఉద్యోగాల నియామక వయో పరిమితి మూడేళ్లు పెంపు. - పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు.. - అటవీ ప్రాంతాల్లోని గిరిజన, గిరిజనేతర రైతుల భూ వివాదాలను పరిష్కరించి యాజమాన్య హక్కులు కల్పిస్తుంది. పోడు భూముల విషయంలో నెలకొన్న వివాదాల పరిష్కారం. వారికి ఇతర రైతులకు అందిస్తున్న ప్రయోజనాలు వర్తింపు. - బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించడానికి చర్యలు.. - సింగరేణి భూముల్లో ఇళ్లు కట్టుకున్న వారికి పట్టాలు.. - హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. వీటిని మరింత ముమ్మరం చేస్తాం. -
సకలజనులకు సరికొత్త వరాలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. సకలజనులను ఆకట్టుకునేందుకు సమగ్ర కసరత్తు చేసింది. ‘సమూల మార్పు కోసం.. సమగ్ర ప్రణాళిక’పేరుతో మంగళవారం ఇక్కడ గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. 35 అంశాలతో రూపొందించిన కాంగ్రెస్ మేనిఫెస్టో.. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు హామీల జల్లు కురిపించింది. రూ.2 లక్షల ఏకకాల రైతు రుణమాఫీ, రైతుబంధు విస్తరణ, నిరుద్యోగభృతి వంటి హామీలిచ్చింది. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పోషించిన పాత్రపై ప్రత్యేకంగా ఓ పేరా కేటాయించింది. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లుభట్టి విక్రమార్క, పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, కో చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితర ముఖ్యులు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో వారు లేకుండానే మేనిఫెస్టోను విడుదల చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని కీలకాంశాలు... - రాజ్యాంగ సంస్థల స్వేచ్ఛను కాపాడటం, సచివాలయం నుంచే పాలన, ప్రజలకు అందుబాటులో ముఖ్యమంత్రి, మంత్రులు, సీఎం కార్యాలయంలో పీపుల్స్ గ్రీవెన్స్‌సెల్ ఏర్పాటు - రాష్ట్ర గీతంగా ‘జయ జయహే తెలంగాణ’ - అన్ని జిల్లాకేంద్రాల్లో అమరవీరుల స్థూపాలు, 1969, 2009 తదనంతర రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు సముచిత గౌరవం, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం, ఉద్యమ కేసుల ఎత్తివేత, ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో ఉద్యమకారులకు ప్రాధాన్యం - ఒకేదఫాలో రూ.2 లక్షల రైతు రుణమాఫీ, సహకార సంఘాల దీర్ఘకాలిక రుణాలపై వడ్డీభారం ప్రభుత్వానిదే, రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రైతుబంధు పథకం విస్తరణ, రైతులు, రైతుకూలీలు, కౌలు రైతులకు లబ్ధి కలిగేలా పెట్టుబడి సాయం, ఎకరానికి రూ.4 వేల నుంచి రూ.5 వేలకు సాయం పెంపు, రైతు సంక్షేమానికి ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్, ‘రైతు సంక్షేమ వ్యవసాయ అభివృద్ధి శాఖ’గా వ్యవసాయశాఖ పేరు మార్పు. ఆత్మహత్య చేసుకున్న రైతుకుటుంబాలకు ఆర్థికసాయం, వ్యవసాయ పంపుసెట్లపై రూ.83 కోట్ల విద్యుత్ సర్వీస్ చార్జీల ఎత్తివేత, 17 పంటలకు మద్దతు ధర - నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి, 20 వేల పోస్టులతో మెగా డీఎస్సీ, పాతపద్ధతిలోనే డీఎస్సీ నిర్వహణ, ప్రభుత్వ ఉద్యోగాల వార్షిక క్యాలెండర్ ద్వారా గ్రూప్–1, 2, 3, డిపార్ట్మెంటల్ పరీక్షల నిర్వహణ, సంవత్సరంలోపే ప్రభుత్వశాఖల్లోని లక్ష ఉద్యోగాల భర్తీ, రెగ్యులర్‌గా డీఎస్సీలు, డిగ్రీ పర్సంటేజీతో నిమిత్తం లేకుండా బీఈడీ, డీఈడీ, టెట్ అర్హతలున్నవారికి డీఎస్సీ అవకాశం, 1994, 1996, 1998, 2008 డీఎస్సీ నోటిఫికేషన్ల ద్వారా ఎంపికైన బీఈడీ అభ్యర్థులకు తగిన న్యాయం - రాష్ట్ర ఆదాయంలో 20 శాతం నిధులు విద్యారంగానికి ఖర్చు, అన్ని స్థాయిల విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్ - ఆరోగ్యశ్రీ పథకం కింద అన్ని రకాల వ్యాధులకు రూ.5 లక్షల వర్తింపు, ప్రతి మండలానికి 20–30 పడకల ఆసుపత్రి, ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి - సొంత స్థలం ఉంటే కొత్త ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షలు, ఇందిరమ్మ ఇళ్ల పాతబకాయిల చెల్లింపు, పాత ఇందిరమ్మ ఇళ్లకు అదనపు గది కోసం రూ.2 లక్షలు, సబ్సిడీ ధరలో సిమెంటు - ఎస్సీ వర్గీకరణ త్వరితగతిన అమలుకు చర్యలు, ఎస్సీల్లోని అన్ని కులాల కోసం 3 ప్రత్యేక కార్పొరేషన్లు, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పకడ్బందీ అమలు, అర్హులైన ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. - కోయగోండులు, లంబాడీలు, ఇతర ఎస్టీ ఉపకులాల కోసం మూడు ప్రత్యేక కార్పొరేషన్లు, గిరిజనుల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు - మైనార్టీలకు సబ్‌ప్లాన్, ఇమామ్‌ల గౌరవ వేతనం రూ.6వేలకు పెంపు, వక్ఫ్ భూముల పరిరక్షణకు చర్యలు, రెండో అధికార భాషగా ఉర్దూకు ప్రాధాన్యత - ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, ఆన్లైన్ మార్కెటింగ్‌లో పనిచేస్తున్న కార్మికులకు చట్టబద్ధత - బీసీ సంక్షేమ శాఖ మూడుగా విభజన. బీసీ, ఎం బీసీ, సంచారజాతుల కోసం ప్రత్యేక శాఖల ఏర్పా టు, బీసీ సబ్‌ప్లాన్ కోసం చర్యలు, తొలగించిన 26 కులాలను బీసీ జాబితాలో చేర్చడం, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల వర్గీకరణ, రెడ్డి, కమ్మ, వైశ్య, బ్రాహ్మణ, వెలమ కులాలకు కార్పొరేషన్లు - పేదల వివాహాలకు ఆర్థిక సాయంగా రూ.1,50,116, మహిళాసంఘాల రుణపరిమితి రూ.10 లక్షలకు పెంపు, రూ.50 వేల వరకు రుణమాఫీ, అభయహస్తం పింఛన్ రూ.1000కి పెంపు. - సీసీఎస్ విధానం రద్దు, కొత్త పీఆర్సీ ద్వారా 01–07–2018 నుంచి ఆర్థిక ప్రయోజనాల అమలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి 60 ఏళ్లకు పెంపు, ఆంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు తిరిగి రాష్ట్రానికి.. - రూ.300 కోట్లతో న్యాయవాదుల సంక్షేమనిధి, రూ.200 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమనిధి, 58 ఏళ్ల వయసు నిండిన జర్నలిస్టులకు పింఛన్, మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారంతోపాటు రూ.5 వేల ఆర్థిక సాయం, సెంట్రల్ వేజ్‌బోర్డు తరహాలో స్టేట్ వేజ్‌బోర్డు, అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు, మెరుగైన వైద్యం అందేలా చర్యలు - గల్ఫ్ కార్మికుల సంక్షేమనిధికి ఏటా రూ.500 కోట్లు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.300 నుంచి రూ.500 వరకు స్కాలర్షిప్, ట్రాన్స్జెండర్లకు రాజ్యాంగపరమైన హక్కులు, రూ.3 వేల పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు, 58 ఏళ్లు నిండిన వృద్ధులకు నెలకు రూ.2 వేల పింఛన్, 70 ఏళ్లు పైబడినవారికి రూ.3 వేలు - కోటి ఎకరాలకు సాగునీరు, సెజ్‌ల కోసం తెలంగాణవ్యాప్తంగా 50 వేల ఎకరాల కేటాయింపు, జీహెచ్ఎంసీని స్థానిక ప్రభుత్వంగా గుర్తించి అధికారాల బదలాయింపు, పోలీసులకు వారాంతపు సెలవు, వైన్‌షాపులు, పబ్బుల నియంత్రణ, ఆదాయపరిమితిని బట్టి అన్నిమతాల ప్రార్థనా మందిరాలకు ఉచిత విద్యుత్ -
టీటీడీపీ మేనిఫెస్టో ఇదే
సాక్షి, హైదరాబాద్ : నామినేషన్ల పర్వం ముగియడంతో రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలు ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా మహాకూటమిలో భాగమైన తెలంగాణ టీడీపీ తమ మేనిఫెస్టోను బుధవారం విడుదల చేసింది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఈ మేనిఫెస్టోను ప్రకటించారు. ప్రజాకూటమి అధికారంలోకి వస్తే ఏటా ఉద్యోగ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని, ప్రగతి భవన్‌ను ప్రజాస్పత్రిగా మారుస్తామన్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తమ మేనిఫేస్టో రూపకల్పనకు స్ఫూర్తి అని ఈ సందర్భంగా టీడీపీ నేతలు తెలిపారు. గతం, వర్తమానం, భవిష్యత్తు అంశాలను పరిగణనలోకి తీసుకుని మేనిఫేస్టో రూపొందించామని వెల్లడించారు. మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు రూ.2లక్షల వరకు రైతులకు రుణమాఫీ, దీన్ని కౌలు రైతులకు కూడా వర్తింపు. అన్నా క్యాంటీన్ల ద్వారా రూ.5లకే భోజనం, ఇంటర్ నుంచే విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు పంపిణీ. విభజన బిల్లులో అంశాల అమలుకు కేంద్రంపై ఒత్తిడి. అమరవీరుల కుటుంబాల్లో ఇంటికో ఉద్యోగం, ఇల్లు, వారి సంక్షేమానికి ప్రాధాన్యత. అన్ని జిల్లాల్లో పూలే, అంబేడ్కర్ నాలెడ్జ్ కేంద్రాలు, హైద్రాబాద్ ధర్నా చౌక్ పునరుద్దరణ, లోకాయుక్త ఏర్పాటు, లోకాయుక్త పరిధిలోకి ప్రజాప్రతినిధులు, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు భృతి బెల్ట్ షాపుల రద్దు, విద్యారంగానికి బడ్జెట్లో అదనంగా రూ.5వేల కోట్లు కేటాయింపు, అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే లక్ష ఉద్యోగాలు, ప్రొఫెసర్ జయశంకర్ పేరిటి విద్యా సంస్థలు ఏర్పాటు పేద యువతుల వివాహానికి రూ.1.50 లక్షల ఆర్థికసాయం, ఎస్సీ వర్గీకరణ, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, బీసీలకు సబ్‌ప్లాన్, ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు. 58 ఏళ్లు నిండిన అనాథలు, వితంతువులు, వృద్ధులకు నెలకు రూ.2వేల పింఛన్. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల సంక్షేమానికి చర్యలు. పక్కా ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల సాయం, ప్రతి ఇంటికీ మంచినీరు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, దివ్యాంగులకు రూ.3వేలు పించన్. -
సీబీఐ అంటే వారికి భయం
భోపాల్: బయటకు వెల్లడించలేని రహస్యాలు చాలా ఉన్న వారే సీబీఐ అంటే భయపడతారని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. తమ రాష్ట్రాల్లో సోదాలు, దర్యాప్తులు చేపట్టకుండా ఏపీ, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు సీబీఐకిచ్చిన సాధారణ అనుమతిని వెనక్కి తీసుకోవడంపై ఆయన పైవిధంగా స్పందించారు. అలాగే, తమ ప్రభుత్వం చేపట్టిన నోట్లరద్దు రాజకీయ చర్య కాదు, నైతికతకు సంబంధించినదని సమర్థించుకున్నారు. ఈ నెల 28వ తేదీన మధ్యప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికలకుగాను శనివారం బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వెల్లడించకూడని ఎన్నో రహస్యాలు ఉన్న వారే తమ రాష్ట్రాలకు సీబీఐ రావద్దంటారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫలానా కేసుకు సంబంధించి అని చెప్పలేను. భవిష్యత్‌లో అలాంటి అవకాశం ఉందనే భయంతో తీసుకున్న చర్య అది’ అని అన్నారు. ‘మన సమాఖ్య వ్యవస్థలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఆరోపణలతోపాటు, రాష్ట్రాలు, కోర్టులు అప్పగించిన కొన్ని తీవ్రమైన కేసులను సీబీఐ విచారిస్తుంది. సీబీఐని అడ్డుకున్నంత మాత్రాన పశ్చిమబెంగాల్లో నర్మద, శారదా చిట్ ఫండ్ స్కాంలపై దర్యాప్తు ముగిసినట్లేనని చెప్పలేను’ అని అన్నారు. వివాదాస్పద నోట్ల రద్దును సమర్థించిన అరుణ్ జైట్లీ ఇది రాజకీయాలకు సంబంధించింది కాదు ‘అత్యంత నైతికమైన’ చర్యగా పేర్కొన్నారు. ఏడాదికి 10 లక్షల ఉద్యోగాలు ఏడాదికి పది లక్షల ఉద్యోగాలు, విద్యార్థినులకు స్కూటీల పంపిణీ వంటి అంశాలతో శనివారం మధ్యప్రదేశ్ బీజేపీ మేనిఫెస్టో ‘సమృద్ధ మధ్యప్రదేశ్ దృష్టి పత్ర’తో పాటు మహిళలకు ప్రత్యేకంగా ‘నారీ శక్తి సంకల్ప పత్ర’ ను విడుదల చేసింది. రైతులకు రూ.40వేల కోట్ల రుణాల పంపిణీ, వచ్చే ఐదేళ్లలో 80 లక్షల హెక్టార్ల భూమిని సాగు యోగ్యం చేయడం, ఆహార శుద్ధి పరిశ్రమకు ప్రత్యేకంగా యూనివర్సిటీ ఏర్పాటు వంటివి ఇందులో ఉన్నాయి. అందరికీ పని కల్పించడంతోపాటు ఏడాదికి 10 లక్షల ఉద్యోగాలను కల్పించనున్నట్లు పేర్కొంది. మహిళల కోసం.. పాఠశాలల్లో శానిటరీ నాప్కిన్ల తయారీ మిషన్ల ఏర్పాటు, 12వ తరగతి పరీక్షల్లో 75శాతం మార్కులు సాధించే వారికి స్కూటీల పంపిణీవంటివి ఉన్నాయి. -
తెలంగాణ ప్రజల పార్టీ మేనిఫెస్టో విడుదల
హైదరాబాద్: తెలంగాణ ప్రజల పార్టీ మేనిఫె స్టోను, ఎన్నికల గుర్తు టార్చ్‌లైట్ లోగోను ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రిటైర్డ్ జస్టిస్ బి.చంద్రకుమార్ ఆదివారం ఇక్కడ ఆవిష్కరించారు. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సాంబశివగౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ ‘అందరికీ అభివృద్ధి– అందరికీ ఆత్మగౌరవం’ అనేది తమ నినాదమని, తమ పార్టీ అధికారంలోకి రాగానే అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం అందజేస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని, ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ, ప్రైవేటుపరంగా ఉద్యోగ అవకాశాలు కలిగేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబా ల్లోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని లేదా ఐదు ఎకరాల భూమిని ఇస్తామని పేర్కొన్నారు. బీసీని సీఎంగా, మహిళను ఉప ముఖ్య మంత్రి చేస్తామని తెలిపారు. సంపూర్ణ మద్యపాన నిషేధానికి కృషి చేస్తామని వెల్లడించారు. అనంతరం తెలంగాణ పాలిటెక్నిక్ జేఏసీ కన్వీనర్ మురళీధర్గుప్తాను పార్టీ ఉపాధ్యక్షుడి గా నియమించారు. ఈ సందర్భంగా పలు సామాజికవర్గాల నేతలు ఆ పార్టీలో చేరారు. కార్యక్రమంలో టీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు నల్లగొండ అంజి తదితరులు పాల్గొన్నారు.