Manikarnika
-
ఏది గొప్పది... స్వర్గమా! కాశీనా!!!
ముత్తుస్వామి దీక్షితార్ గొప్ప వాగ్గేయకారులు. పుస్తకం పట్టి శాస్త్రాధ్యయనం చేయక పోయినా గంగానదీతీరాన గురు శుశ్రూష చేస్తూ చాలా ధర్మసూక్ష్మాలను తెలుసుకున్నారు. తదనంతర కాలంలో ఆయన గంగాదేవి గొప్పదనాన్ని కీర్తిస్తూ చేసిన కీర్తనలో ఆయన విషయగాఢత మనకు బోధపడుతుంది. ‘‘...అక్రూర పూజితే అఖిల జనానందే/సకలతీర్థమూలే...’’ అన్నారు. అన్ని తీర్థాలూ గంగానదిలోనే ఉన్నాయన్నారు. ఎందుకలా...!!! తీర్థయాత్ర చేసివచ్చాం అంటారు గానీ భగవత్ దర్శన యాత్ర చేసివచ్చాం అనరు. తీర్థయాత్ర అంటే.. మజ్జనం అంటే.. స్నానం. తీర్థంలో స్నానం చేస్తారు. వేదాలకు భాష్యం చెబుతూ పెద్దలు ఒక మాటన్నారు. అంగీరసాది మహర్షులు ఊర్థ్వలోకాలకు వెడుతూ... వెళ్ళేముందు తమ తమ నియమాలను, తపోదీక్షను, తపఃఫలితాన్ని నీటిలో కొన్నిచోట్ల నిక్షేపించి వెళ్ళారు. అవి ఎక్కడ నిక్షేపింపబడ్డాయో అవి తీర్థములు. అటువంటి తీర్థాల్లోకెల్లా గొప్ప తీర్థమేది... అంటే మణికర్ణిక. అది ఎక్కడుంది... గంగానదిలో! మణికర్ణికా వైభవం అంతా ఇంతా కాదు. ‘మణికర్ణికాష్టకమ్’ అని శంకరాచార్యులవారు ఒక అష్టకం చేశారు. ఆయన ఒక నదిని గురించి చెప్పడమే చాలా గొప్ప. సాధారణంగా ఆయన క్షేత్ర ప్రసక్తి తీసుకురారు. అటువంటిది గంగాష్టకమ్, నర్మదాష్టకమ్, యమునాష్టకమ్ చేశారు. ఒక్క మణికర్ణిక మీద ఒక అష్టకమ్ చేశారు. తీర్థం ఎంత గొప్పదో చెప్పడానికి ఆయన ఒక శ్లోకంలో అద్భుతమైన వర్ణన చేశారు. ‘‘కాశీ ధన్యతమా విముక్తనగరీ సాలంకృతా గంగయా/ తత్రేయం మణికర్ణికా సుఖకరీ ముక్తిర్హి తత్కింకరీ / స్వర్లోకస్తులితః సహైవ విబుధైః కాశ్యా సమం బ్రహ్మణా/ కాశీ క్షోణితలే స్థితా గురుతరా స్వర్గో లఘుత్వం గతః’’. కాశీ చాలా చాలా గొప్ప నగరం. అసలు కాశీ ఒకసారి వెడితే చాలు.. అనుకుంటాం. కాశీ అంటేనే ప్రకాశం. కాశీ విముక్తనగరి. అంత గొప్పది కాశీ .... ఆ కాశీకి మళ్ళీ అలంకారం గంగానది. తత్రేయం మణికర్ణికా. అక్కడ మణికర్ణికా తీర్థం కూడా ఉంది. దీనికున్న గొప్పదనం ఏమిటంటే – ‘‘మధ్యాహ్నే మణికర్ణికాస్నపనజం పుణ్యం న వక్తుం క్షమః/ స్వీయైరబ్ధ శతైశ్చతుర్ముఖధరో వేదార్థ దీక్షాగురుః/యోగాభ్యాసబలేన చంద్రశిఖరస్తత్పుణ్య పారంగత/స్త్వత్తీరే ప్రకరోతి సుప్తపురుషం నారాయణం వా శివమ్’’... మధ్యాహ్నం 12 గంటలవేళ మణికర్ణికాతీర్థంలో స్నానం చేస్తున్న వారికోసం శివకేశవ రూపాల్లో పరబ్రహ్మం పోట్లాడుకుంటుందట... నే తీసుకువెడతా అంటే నే తీసుకువెడతా అని.. ‘నీయందు ఎవరయినా స్నానం చేస్తే వారికి మోక్షం ఇస్తాను’ అని ముక్తిదేవత ఒక సేవకురాలిలాగా చేతులు కట్టుకుని నిలబడి ఉంటుందట. ఇంతమంది దేవతలతో కూడుకున్న స్వర్గలోకం గొప్పదా? కాశీపట్టణం గొప్పదా ? అని ఒకప్పుడు బ్రహ్మగారికి సందేహం వచ్చిందట. పెద్ద త్రాసు సృష్టించి ఒక పళ్ళెంలో స్వర్గలోకాన్ని మరో పళ్ళెంలో కాశీపట్టణాన్ని, గంగానదిని, మణికర్ణికా తీర్థాన్ని ఉంచాడట...‘‘ కాశీ క్షోణితలే స్థితా గురుతరా స్వర్గో లఘుత్వం గతః’’ కాశీ బరువుకు అది ఉంచిన పళ్ళెం కిందికి దిగితే.. స్వర్గలోకం ఉన్న పళ్ళెం పైకి తేలిపోయిందట. అటువంటి కాశీ పట్టణం ఉన్న ఈ దేశం గొప్పది, ఇక్కడ పుట్టడం కూడా గొప్ప అదృష్టం కదూ! బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ప్రతి భారతీయుడిలో దేశభక్తిని రగిలించే సినిమాలు ఇవే
సినిమా అనేది వినోదాన్ని మాత్రమే కాదు పంచుతుందనుకుంటే పొరపాటే.. కొన్ని సనిమాలు యువకుల్లో దేశభక్తిని రగిలించింది. అందుకు తగినట్లుగానే కొందరు హీరోలు,దర్శకులు కథలను ఎంచుకుంటుంటారు. ఇలా వారు భారీ విజయాలను కూడా సొంతం చేసుకున్నారు. మన హీరోలు స్వాతంత్ర సమర యోధులుగా, దేశాన్ని రక్షించే వీరులుగా కనిపించి ఆకట్టుకున్నారు. అలాంటి సినిమాలపై 77వ స్వాతంత్య్రం సందర్భంగంగా కొన్నింటిపై ఫోకస్ చేయండి. గాంధీ (1982) 1982లో వచ్చిన గాంధీ సినిమా రిచర్డ్ అటెన్ బరో తీశారు. అస్కార్ అవార్డు పొందిన సినిమా ఇది. బెన్ కింగ్ స్లే గాంధీగా నటించారు. భారత స్వతంత్ర పోరాటాన్ని, గాంధీ జీవితాన్ని తెరకెక్కించిన మొదటి సినిమా ఇదే. గాంధీజీ పై చాలా సినిమాలు వచ్చాయి. కానీ 1982లో తెరకెక్కిన గాంధీ సినిమా మాత్రం ప్రత్యేకం. అయితే దానికి ప్రత్యేకమయిన కారణం కూడా ఉంది. ఈ సినిమాను రూపొందించింది ఇంగ్లాండ్‌లో పుట్టిపెరిగిన రిచర్డ్ అటెన్‌బరో అనే ఫిల్మ్ మేకర్. ఆ సినిమాకి ఆయనే ప్రొడ్యూసర్ కూడా. ఇక ఆ సినిమాలో గాంధీగా నటించింది కూడా బ్రిటిష్ యాక్టర్ అయిన బెన్ కింగ్స్లే. ఇలా ఏ దేశం పై అయితే గాంధీజీ తన పోరాటాన్ని సాగించారో వాళ్ళే మళ్ళీ ఆయనపై సినిమా తియ్యడం, దాన్ని ఇంగ్లాండ్‌లో కూడా రిలీజ్ చేస్తే అక్కడ అది ఘనవిజయం సాధించడం అనేది సామాన్యమయిన విషయం కాదు. పైగా ఆ సినిమాలో గాంధీజీ పాత్రను అద్బుతంగా పోషించిన బెన్ కింగ్స్లే కి అకాడెమీ అవార్డు కూడా వచ్చింది. అంటే గాంధీజీ జీవితంలో ఉన్న సారాంశం ఎంత గొప్పది అనేది ఆ సినిమాలో చూపించడం వల్ల, అది అందరి మనసులకు హత్తుకోవడం వల్ల ఆ విజయం సాధ్యమయింది. భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని 582 సినిమా థియేటర్లలో ఆగష్ట్రు 14వ తేదీ నుంచి 24 వరకు 'గాంధీ' చిత్రాన్ని విద్యార్థులకు ఉచితంగా ప్రదర్శించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ (2000) భీంరావ్ రాంజీ అంబేడ్కర్ పాత్రలో మమ్ముట్టి రోల్ ఔట్‌స్టాండింగ్ అనే చెప్పవచ్చు. 2000 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా జబ్బర్ పటేల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మొదట ఆంగ్లంలో నిర్మించబడింది. తరువాత ప్రాంతీయ భాషలలోకి డబ్ చేయబడింది. ఈ చిత్రంలో మమ్ముట్టి డాక్టర్ అంబేడ్కర్ పాత్రను పోషించారు. అతని నటనకు జాతీయ అవార్డును గెలుచుకున్నారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు అంబేద్కర్ యొక్క పోరాటాలను దృశ్యమానం చేసిన జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్రం, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్మించాలని పిలుపునిచ్చింది. నిర్మాణాన్ని ప్రభుత్వ యాజమాన్యంలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించింది. డాక్టర్ అంబేద్కర్గా మమ్ముట్టి నటన మనసుకు హత్తుకునేలా ఉంటుంది. ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ (2002) హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ తోటి సభ్యులతో కలిసి భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన విప్లవకారుడు భగత్ సింగ్ గురించి 2002లో ఈ చిత్రం విడుదల అయింది. ఇందులో అజయ్ దేవగన్ టైటిల్ క్యారెక్టర్‌తో పాటు సుశాంత్ సింగ్ కూడా ఉన్నారు. ఈ సినిమాలో భారత స్వాతంత్రం కోసం పోరాడిన భగత్ సింగ్ జీవిత చరిత్రను పూర్తిగా చూపించారు. 1931 మార్చి 24న అధికారిక విచారణకు ముందు జలియన్ వాలాబాగ్ మారణకాండను చూపినప్పటి నుంచి భగత్ సింగ్ ని ఉరి తీసే వరకు ఈ సినిమాలో చూయించారు. కేవలం 23 ఏళ్ల వయసులోనే దేశం కోసం ఉరికంబానికి ఎలా ఎక్కాడో తెలిపే చిత్రమే ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. లగాన్ (2001) బ్రిటీషు పాలనలో భూమి పన్ను రద్దుకు వ్యతిరేకంగా ఓ గ్రామ ప్రజలు క్రికెట్ ఆడటానికి నిర్ణయించుకుంటారు. అప్పటివరకూ అలవాటు లేని ఆట అది. పన్ను భారం తగ్గాలంటే ఆడి గెలవాల్సిందే. ఆడారు.. గెలిచారు. ఆమిర్ ఖాన్ నటించిన ఈ ‘లగాన్’ చిత్రకథను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. 2001లో ఈ సినిమా విడుదలైంది. అప్పట్లో ఎందరిలోనే దేశభక్తిని రగిలించిన సినిమా ఇది. ఇప్పటికి ఈ సినిమా వచ్చి 20 ఏళ్లు దాటినా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ (2004) నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం ఆధారంగా వచ్చిన Netaji Subhas Chandra Bose: The Forgotten Hero హిందీ చిత్రం 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియన్ ఎపిక్ బయోగ్రాఫికల్ వార్ని సినిమాగా తెరకెక్కించింది. ఇందులో నేతాజీగా సచిన్ ఖేడేకర్ కరెక్ట్‌గా సెట్ అయ్యారు. బ్రిటీష్ ఇండియాలో మహాత్మా గాంధీతో రాజకీయ విబేధాల తర్వాత, బోస్ అరెస్టు, విడుదలయ్యాక జరిగిన కథను వివరించారు. ఈ చిత్రానికి ఇండియన్ ఆడియెన్స్ నుంచి విశేష ఆదరణ దక్కింది. సినిమాకు నేషనల్ ఫిల్మ్ అవార్డు ఫర్ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డును కూడా దక్కింది. అలాగే 70వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంయుక్తంగా సమర్పించిన ఇండిపెండెన్స్ డే ఫిల్మ్ ఫెస్టివల్లో ఆగష్టు 14, 2016న ఈ చిత్రాన్ని ప్రదర్శించడం విశేషం. ఈ సినిమాకు శ్యామ్ బెనెగల్ దర్శకత్వం వహించారు. ఏఆర్ రెహమాన్ దర్శకత్వం వహించారు. ఎమ్ ఎక్స్ ప్లేయర్,యూట్యూబ్‌లో ఈ సినిమా ఉంది. సర్దార్ (1993) 1993లో ఈ చిత్రం విడుదలైంది. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలను ఇండియన్ ఆఫ్ యూనియన్‌లో చేరేలా శ్రమించిన సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జీవితం ఆధారంగా నిర్మించిందే ఈ చిత్రం. ఈ సినిమాలో పరేష్ రావల్ సర్దార్‌గా నటించారు. ఈ సినిమాలో క్విట్ ఇండియా ఉద్యమంలో జరిగిన అల్లర్లతో పాటు నెహ్రుతో సర్దార్కు ఉన్న విబేధాలను చూపుతుంది. సర్దార్ లాంటి వ్యక్తి లేకుండా ఉండి ఉంటే భారత్ ఇప్పటికి కూడా చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేదని చెప్పవచ్చు. యూట్యూబ్‌లో ఈ సినిమాను చూడొచ్చు కేసరి (2019) కేసరి 2019లో విడుదలైన బాలీవుడ్ సినిమా. 1897న భారత్‌లోకి సుమారు 10 వేలకు పైగా ఆఫ్ఘన్ దళాలు ఒక్కసారిగా చొచ్చుకొని వస్తారు. అప్పుడు వారందరినీ కేవలం 21 మంది సిక్కులు మాత్రమే ఎలా అడ్డుకున్నారు. అనేది ఈ సినిమాలో చూపిస్తారు .ఈ దళాల మధ్య 30 గంటల పాటు జరిగిన భీకర పోరాట సన్నివేశాలు మెప్పిస్తాయి. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, పరిణీతి చోప్రా, సుమీత్ సింగ్ బస్రా, రాకేష్ శర్మ, మీర్ సర్వర్, అశ్వథ్ భట్, రామ్ అవానా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. మంగళ్ పాండే: ది రైజింగ్ (2005) మంగళ్ పాండే జీవితం ఆధారంగా 2005లో కేతన్ మెహతా దర్శకత్వంలో మంగళ్ పాండే: ది రైజింగ్ మూవీ వచ్చింది. ఇందులో ఆమీర్ ఖాన్ లీడ్ రోల్లో నటించారు. మంగళ్ పాండే ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో జులై 19, 1827న జన్మించారు. పాండే బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన 34వ బెంగాల్ నేటివ్ ఇన్ఫాంట్రీలో రెజిమెంట్‌లో సిపాయిగా చేరారు. అప్పట్లో అతను తన అసాధారణమైన ప్రతిభ, తెగువతో సైనిక దళ నాయకుడిగా ఎదిగారు. అయితే ఆ కాలంలో బ్రిటిష్ వారు అందించిన తుపాకీ తూటాలను సిపాయిల వీసమెత్తు నచ్చలేదు. ఈ గుండ్లకు ఆవు కొవ్వు, పంది కొవ్వు పూసేవారు. వాటిని పేల్చాలంటే సిపాయిలు నోటితో కొరికి తొక్క తీయాల్సి ఉంటుంది. హిందువులు, ముస్లింల మత విశ్వాసాలకు ఇది విరుద్ధమని భావించిన సిపాయిలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. బ్రిటీషర్లు మొదట జంతువుల కొవ్వును ఉపయోగించలేదని చెప్పారు. కానీ అది కోవ్వేనని పాండే, ఇతర సైనికుల్లో సందేహాలు మరింత బలపడ్డాయి. ఆ సందేహాలే చివరికి బ్రిటిష్ రాజ్యాధిపత్యంపై తిరుగుబాటుకు ఎలా దారితీసింది. పాండే ఉరి శిక్ష సమయంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారు.ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. మణికర్ణిక (2019) 2019లో వచ్చిన ఈ సినిమా ఝాన్సీ లక్ష్మీ భాయ్ జీవిత చరిత్ర ఆదారంగా బాలీవుడ్లో తెరకెక్కించారు. ఇందులో కంగనా రనౌత్ ఝాన్సీగా తన నటనతో భారతీయులను మెప్పించింది.1828లో వారణాసిలో తన పుట్టుకతో కథ మొదలౌతుంది. పరాక్రమానికి మారుపేరుగా లక్ష్మీ భాయ్ జీవిత చరిత్ర ఉంటుంది. ఝాన్సీ రాజు అయిన గంగాధర్ రావుతో ఆమెకు వివాహం అవుతుంది. రాజ్యం గంగాధర్ అన్న అయిన సధాశివ్ బ్రిటీష్ వారితో కలిసి కుట్ర పన్నుతాడు. అందులో భాగంగా గంగాధర్ రావును బ్రిటీష్ వారు చంపేస్తారు. తన భర్తకు ఇచ్చిన మాట కోసం ఝాన్సీ లక్ష్మీ భాయ్‌గా రాజ్యాధికారం అందుకుంటుంది. ఈ క్రమంలో తెల్లవారిపై ఆమె చేసిన దండయాత్ర ఎలా ఉంటుందో చెప్పేదే మణికర్ణిక చిత్రం. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. -
కంగనా రనౌత్ కీలక నిర్ణయం.. ‘మణికర్ణిక’గా నామకరణం
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కీలయ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వెండితెరపై ప్రేక్షకులకు వినోదం పంచిన ఈ ఫైర్‌బ్రాండ్.. త్వరలో డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టనుంది. ఆమెకు జాతియ అవార్డు తెచ్చిపెట్టిన 'మణికర్ణిక' చిత్రంపేరునే కంగనా తన బ్యానర్ కు పెట్టడం విశేషం. అయితే తొలి యత్నంగా మెయిన్ స్ట్రీమ్ మూవీని కాకుండా డిజిటల్ ప్లాట్ ఫామ్ కోసం సినిమాను నిర్మిస్తోంది. నూతన నటీనటులతో క్యూట్ లవ్ స్టోరీగా 'టికు వెడ్స్ షేరు' పేరుతో సినిమా తీయబోతున్నట్టు ట్వీటర్ వేదికగా కంగనా వెల్లడించింది. అలాగే తన ప్రొడక్షన్ హౌస్ లోగోను శనివారం ఆమె ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరు తమకు ఆశీర్వదించాలని ఆమె కోరింది. ‘టికు వెడ్స్ షెరు సినిమాతో మణికర్ణిక ఫిలిమ్స్ డిజిటల్ రంగంలోకి అడుగుపెడుతోంది. ఇది ఒక సెటైరికల్ కామెడీతో కూడిన ప్రేమ కథ. కొత్త రకం వినోదాన్ని ఈ సినిమా ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాక, మా ప్రొడక్షన్ సంస్థ నుంచి కొత్త టాలెంట్‌ని, కొత్త కాన్సెప్ట్‌లని పరిచయం చేస్తాము. సాధారణ సినిమాలు చూసే ప్రేక్షకుల కంటే.. డిజిటల్ సినిమాలు చూసే ప్రేక్షకులు కాస్త పరిణితి చెందిన వాళ్లు అని మా భావన’’ అని కంగనా తెలిపింది. ఇదిలా ఉంటే... కంగనా రనౌత్ నటించిన జయలలిత బయోపిక్ 'తలైవి' విడుదలకు సిద్ధంగా ఉంది. Launching the logo of @ManikarnikaFP with the announcement of our debut in digital space with a quirky love story Tiku weds Sheru .... Need your blessings 🙏 pic.twitter.com/ulaMK62m7l — Kangana Ranaut (@KanganaTeam) May 1, 2021 -
మహర్షి... జెర్సీకి డబుల్ ధమాకా
67వ జాతీయ సినిమా అవార్డుల్లో తెలుగు సినిమా మెరుపులు మెరిపించింది. 2019వ సంవత్సరానికి గాను సోమవారం ఢిల్లీలో ప్రకటించిన ఈ అవార్డుల్లో తెలుగు సినిమా 4 అవార్డులు దక్కించుకుంది. జాతీయ స్థాయిలో సకుటుంబ వినోదం అందించిన బెస్ట్ పాపులర్ ఫిల్మ్‌గా మహేశ్ బాబు నటించిన ‘మహర్షి’ ఎంపికైంది. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నాని నటించిన ‘జెర్సీ’ (దర్శకత్వం గౌతమ్ తిన్ననూరి) అవార్డు గెలిచింది. ‘మహర్షి’ చిత్రానికి నృత్యాలు సమకూర్చిన రాజు సుందరం ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా, ‘జెర్సీ’కి ఎడిటింగ్ చేసిన నవీన్ నూలి ఉత్తమ ఎడిటర్‌గా జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రంగా చారిత్రక కథాంశంతో మోహన్‌లాల్ నటించిన మలయాళ చిత్రం ‘మరక్కర్ – అరేబియన్ కడలింటె సింహం’ (మరక్కర్ – లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ), ఉత్తమ నటిగా కంగనా రనౌత్ (‘మణికర్ణిక’, ‘పంగా’) ఎంపికైతే, ఉత్తమ నటుడి అవార్డును తమిళ నటుడు ధనుష్ (చిత్రం ‘అసురన్’) – హిందీ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ (‘భోన్స్లే’)లకు సంయుక్తంగా ప్రకటించారు. ఉత్తమ దర్శకుడిగా సంజయ్ పూరణ్ సింగ్ చౌహాన్ (హిందీ ‘బహత్తర్ హూరేన్’) ఎంపికయ్యారు. ఉత్తమ తమిళ చిత్రం అవార్డు కూడా వెట్రిమారన్ దర్శకత్వంలోని ‘అసురన్’కే దక్కగా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, తెలుగు నటుడు నవీన్ పొలిశెట్టి నటించిన ‘చిఛోరే’ ఉత్తమ హిందీ చిత్రంగా ఎంపికైంది. సినిమాల నిర్మాణానికి అనుకూలమైన ‘మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్’ అవార్డును సిక్కిమ్ దక్కించుకుంది. ఇటీవల ‘ఉప్పెన’లో అందరినీ ఆకట్టుకున్న తమిళ నటుడు విజయ్ సేతుపతి తమిళ చిత్రం ‘సూపర్ డీలక్స్’తో ఉత్తమ సహాయ నటుడిగా ఎంపికయ్యారు. పార్తీబన్ నటించి, రూపొందించగా, వివిధ దేశ, విదేశీ చలనచిత్రోత్సవాలకు వెళ్ళిన తమిళ చిత్రం ‘ఒత్త సెరుప్పు సైజ్ 7’ (ఒక చెప్పు సైజు 7) స్పెషల్ జ్యూరీ అవార్డును గెలిచింది. అజిత్ నటించిన తమిళ ‘విశ్వాసం’కు ఇమాన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా నిలిచారు. ఈసారి ఆస్కార్‌కు అఫిషియల్ ఇండియన్ ఎంట్రీగా వెళ్ళిన మలయాళ ‘జల్లికట్టు’ సినిమాటోగ్రఫీ విభాగం (గిరీశ్ గంగాధరన్)లో అవార్డు దక్కించుకుంది. కరోనా కారణంగా విడుదల ఆలస్యమైనా, ఉత్తమ చిత్రంగా నిలిచిన మోహన్‌లాల్ ‘మరక్కర్’ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలోనూ అవార్డు సాధించింది. నిజానికి, గత ఏడాది మే నాటికే ఈ 2019 అవార్డుల ప్రదానం జరగాల్సి ఉంది. కానీ, కరోనా విజృంభణ నేపథ్యంలో అవార్డుల ప్రకటన – ప్రదానం ఇప్పటి దాకా ఆలస్యమైంది. జయహో... మలయాళం ఈ 2019 జాతీయ అవార్డుల్లో మలయాళ సినిమా పంట పండింది. ఫీచర్‌ఫిల్మ్ విభాగంలో ఉత్తమ చిత్రం, స్పెషల్ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్స్, గీతరచన, మేకప్, సినిమాటోగ్రఫీ సహా 9 అవార్డులు, నాన్–ఫీచర్‌ఫిల్మ్ విభాగంలో 2 అవార్డులు – మొత్తం 11 జాతీయ అవార్డులు మలయాళ సినిమాకు దక్కడం విశేషం. ఒకటికి రెండు తాజా నేషనల్ అవార్డుల్లో మలయాళ ‘మరక్కర్...’కు 3, మలయాళ ‘హెలెన్’కు 2, తమిళ ‘అసురన్’, ‘ఒత్త సెరుప్పు సైజ్ 7’కు చెరి రెండేసి, హిందీ ‘తాష్కెంట్ ఫైల్స్’కు 2, తెలుగు చిత్రాలు ‘మహర్షి’, ‘జెర్సీ’ లకు చెరి రెండేసి అవార్డులు, మరాఠీ ‘ఆనందీ గోపాల్’కు 2, బెంగాలీ చిత్రం ‘జ్యేష్ఠ పుత్రో’కు 2 అవార్డులు రావడం గమనార్హం. అవార్డు మిస్సయ్యాం అనుకున్నాం – నాని ‘‘గత ఏడాది అంతా కరోనాతో గడిచిపోయింది. అవార్డ్స్ ఫంక్షన్లు ఏమీ లేవు. ‘జెర్సీ’కి అవార్డ్స్ మిస్ అయిపోయాం అనుకున్నాం. కానీ, ఇప్పుడు 67వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో ‘జెర్సీ’కి రెండు అవార్డులు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ‘జెర్సీ’తో పాటు అవార్డులు గెలుచుకున్న ‘మహర్షి’ చిత్ర బృందానికి కూడా కంగ్రాట్స్. జాతీయ అవార్డులు వచ్చిన ప్రతిసారీ వాటిలో మన తెలుగు సినిమాల సంఖ్య పెరగడం సంతోషంగా ఉంది.’’ శిల్పకు ధన్యవాదాలు ‘‘నాకీ అవార్డు రావడానికి కారణం దర్శకుడు కుమారరాజా. అలాగే శిల్ప (‘సూపర్ డీలక్స్’లో సేతుపతి చేసిన ట్రాన్స్‌జెండర్ పాత్ర పేరు). ఏ పాత్ర చేసినా అవార్డులు వస్తాయా? అని ఆలోచించను. శిల్ప రెగ్యులర్ పాత్ర కాదు. అలాగని నన్నేం ఇబ్బంది పెట్టలేదు. ‘నేను శిల్ప’ అనుకుని, లీనమైపో యా. అందుకే, కుమారరాజాకి, శిల్పకి థ్యాంక్స్.’’ – ఉత్తమ సహాయ నటుడు విజయ్ సేతుపతి ఆయనకు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాను ‘‘నేను డైరెక్టర్ కావడానికి ఏడేళ్లు పట్టింది. రాహుల్‌గారు నన్ను నమ్మి ‘మళ్ళీ రావా’కి చాన్స్ ఇచ్చారు. నిర్మాతగా ఆయనకు అది తొలి సినిమా. ఒక కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వడం గ్రేట్. అందుకే ఆయనకు ఫోన్ చేసి ‘థ్యాంక్స్’ చెప్పాను. ‘జెర్సీ’ తీస్తున్నప్పుడు నా మనసులో ఒకటే ఉంది. ‘మంచి సినిమా తీయాలి’... అంతే. నేను రాసిన కథ ప్రేక్షకుల దగ్గరకు వెళ్లాలంటే మంచి నటుడు చేయాలి. నా కథను నానీ, శ్రద్ధా శ్రీనాథ్, బాలనటుడు రోనిత్... ఇలా ఇతర నటీనటులందరూ తమ నటనతో ఎలివేట్ చేశారు. సాంకేతిక నిపుణులు కూడా న్యాయం చేశారు.’’ – ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మాకు ఇది హ్యాపీ మూమెంట్ – ‘దిల్’ రాజు ‘‘మహేశ్ వంటి స్టార్‌ని పెట్టుకుని వాణిజ్య అంశాలు మిస్ అవకుండా సందేశాత్మక చిత్రం తీయడం కష్టమైన పని. టీమ్ అంతా కష్టపడి చేశారు. అవార్డులకు వచ్చే ప్రైజ్ మనీని మంచి కార్యక్రమాలకు విరాళంగా ఇస్తా. మాకిది హ్యాపీ మూమెంట్’’ అన్నారు ‘మహర్షి’ నిర్మాతల్లో ఒకరైన ‘దిల్’ రాజు. ‘‘ఈ కథ విన్నప్పుడు మహేశ్ నా కెరీర్లోనే బెస్ట్ మూవీ అని, విడుదలయ్యాక నేను గర్వపడే సినిమా ‘మహర్షి’ అని ట్వీట్ చేశారు. ‘మహర్షి’కి బీజం వేసింది రచయిత హరి. నాతో పాటు హరి, అహిషోర్ సాల్మన్ రెండేళ్లు కష్టపడ్డారు’’ అన్నారు ‘మహర్షి’ దర్శకుడు వంశీ పైడిపల్లి. -
కంగనాకు ఆ పేరైతే సరిగ్గా సరిపోయేది
కంగనా రనౌత్ అసలు పేరు వార్తలమ్మ అని పెడితే సరిపోయేది. ఒకటీ ఆమె వార్త సృష్టిస్తుంది. లేదా ఆమే వార్త అవుతుంది. ఎప్పుడూ మీడియాలో ఉన్నవాళ్లకే మార్కెట్ అని ఆమె కనిపెట్టింది. పలుచగా ఉండే శరీర స్వభావంతో ఉండే ఈ నటి బొద్దుగా ఉండే జయలలిత పాత్రను పోషించడానికి శారీరకంగా ట్రాన్స్ఫామ్ కావడం, అందుకు శ్రమ పడటం ఆమె వృత్తిగత ప్రతిభను చాటుతుంది. ఆమెను ‘న్యూసెన్స్’ అని అనేవారు కూడా ఈ టాలెంట్‌ను అంగీకరిస్తారు. కంగనా నేడు (మార్చి 23) 35వ ఏట అడుగుపెట్టనుంది. రేపు ‘తలైవి’ ట్రైలర్ కంగనా పుట్టినరోజు సందర్భంగా విడుదల కానుంది. ‘ఈ పాత్ర కోసం 20 కేజీల బరువు పెరిగి కొద్ది నెలల్లో అంత బరువూ తగ్గాను. అయితే సినిమా కోసం ఇదొక్కటే నేను ఎదుర్కొన్న సవాలు కాదు’ అని కంగనా కొన్ని సినిమా స్టిల్స్‌ను పోస్ట్ చేస్తూ వ్యాఖ్యానించింది. ఆ ఫొటోల్లో సినిమా నటిగా జయలలిత చేసిన పాత్రల్లాంటి వాటిలో కంగనా గెటప్స్ ఉన్నాయి. అచ్చు జయలలితను పోలి ఉండటంతో అటు జయలలిత అభిమానులు, ఇటు కంగనా అభిమానులు సంతోషపడుతున్నారు. కంగనా ఎంత ప్రతిభావంతురాలో వివాదాల్లో కూడా అంతే ప్రముఖురాలు. ఏదో ఒక కారణం చేత ఆమె తరచూ వార్తల్లో ఉంటుంది. ‘తలైవి’లో కంగనా రనౌత్ హృతిక్ రోషన్‌తో ప్రేమ వ్యవహారం, ఆ తర్వాత ఇతర హీరోయిన్లపై సూటిపోటి మాటలు, మహారాష్ట్ర ప్రభుత్వంతో పేచీ, కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలికే వ్యాఖ్యలు... ఇవన్నీ ఆమెను న్యూస్‌లో ఉంచుతున్నాయి. అయితే న్యూస్‌లో ఉంచాల్సింది ఆమె నటనా ప్రతిభే అని ఆమె మర్చిపోతున్నట్టుంది. ‘లైఫ్ ఇన్ ఏ మెట్రో’, ‘ఫ్యాషన్’, ‘తనూ వెడ్స్ మను’, ‘క్వీన్’, ‘మణికర్ణిక’ లాంటి మంచి సినిమాల్లో ఆమె పాత్రలు వెలిగాయి. వంద కోట్ల కలెక్షన్లు సాధించడానికి హీరో అక్కర్లేదు అని నిరూపించిందామె. మూడుసార్లు జాతీయ ఉత్తమనటిగా నిలవడం సామాన్య విషయం కాదు. ఇప్పుడు నాలుగో జాతీయ అవార్డును కూడా దక్కించుకుంది. ‘మణికర్ణిక’, ‘పంగా’ చిత్రాల్లోని నటన ఆమెకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు దక్కేలా చేసింది. తల్లిదండ్రుల అభీష్టానికి వ్యతిరేకంగా పద్దెనిమిదేళ్ల వయసులో డెహ్రాడూన్ నుంచి ఒంటరిగా ఢిల్లీ చేరుకుని రకరకాలుగా స్ట్రగుల్ అయి, ముంబై చేరుకుని ఒకరి అండ లేకుండా స్టార్‌గా మారిందామె. ఆమెకు రాజకీయ అభిప్రాయాలు రాజకీయ జీవితం పట్ల ఆసక్తి ఉంటే దానికి ఇంకా టైమ్ ఉందని పరిశీలకులు అనుకోవచ్చు. ఇప్పుడైతే ఆమె నుంచి ఆశిస్తున్నది గొప్ప సినిమాలే. తనలోని గొప్ప నటికి ఆమె ఎక్కువ పని చెప్పాలని ఫ్యాన్స్ కోరుకుంటే వారి కోరిక సబబైనదే అనుకోవచ్చు. ‘మణికర్ణిక’లో కంగనా రనౌత్ నా అవార్డు వాళ్లది కూడా! – కంగనా రనౌత్ ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ, ‘పంగా’ సినిమాల్లో నా నటనకు నేషనల్ అవార్డు వచ్చిందని తెలిసి చాలా సంతోషంగా అనిపించింది. ‘మణికర్ణిక’ సినిమాను నేను డైరెక్ట్ కూడా చేశాను. జ్యూరీ మెంబర్స్‌తో పాటు చిత్రబృందం అందరికీ ధన్యవాదాలు. నా అవార్డు వీరిది కూడా. నా అభిమానులందరికీ ధన్యవాదాలు. మళ్లీ మళ్లీ అవార్డ్స్ తాజాగా ఉత్తమ నటిగా ఎంపికైన కంగనా రనౌత్ గతంలో ఉత్తమ సహాయ నటిగా (చిత్రం ‘ఫ్యాషన్’) ఒకసారి, ఉత్తమ నటిగా రెండు సార్లు (‘క్వీన్’, ‘తను వెడ్స్ మను రిటర్న్స్’) అవార్డులు అందుకున్నారు. ఇప్పుడు ఆమెకిది 4వ నేషనల్ అవార్డు. ధనుష్‌కు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు రావడం ఇది 2వ సారి. గతంలో వచ్చిన ‘ఆడుకాలమ్’కూ, ఇప్పుడు అవార్డు తెచ్చిన ‘అసురన్’కూ – రెండింటికీ దర్శకుడు వెట్రిమారన్ కావడం విశేషం. ఇక, ఉత్తమ నటుడు మనోజ్ బాజ్‌పాయ్‌కి ఇది 3వ జాతీయ అవార్డు. ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా రాజు సుందరంకు ఇది 2వ నేషనల్ అవార్డు. గతంలో ‘జనతా గ్యారేజ్’ (‘ప్రణామం...’ పాటకు), ఇప్పుడు ‘మహర్షి’ – ఇలా ఆయనకు జాతీయ గౌరవం తెచ్చిన రెండు చిత్రాలూ తెలుగువే కావడం విశేషం. -
మరో బాలీవుడ్ చిత్రానికి బాహుబలి రచయిత స్క్రిప్ట్
‘భజరంగీ భాయిజాన్’, ‘మణికర్ణిక’ వంటి బాలీవుడ్ హిట్ చిత్రాలకు కథ అందించిన రచయిత విజయేంద్ర ప్రసాద్ మరోసారి బాలీవుడ్లో ఒక బహుభాషా చిత్రానికి స్క్రిప్ట్ సమకూర్చుతున్నారు. ‘సీత... ది ఇన్కార్నేషన్’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రానికి అలౌకిక్ దేశాయ్ దర్శకత్వం వహించనున్నారు. హ్యూమన్ బీయింగ్ స్డూడియోస్ సంస్థ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించింది. తాజాగా విడుదలైన ‘సీత... ది ఇన్కార్నేషన్’ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీతాదేవి గురించి ఎవరికీ తెలియని విషయాల్ని ఈ సినిమాలో చూపించనున్నారు. మనోజ్ ముంతాషీర్ మాటలు రాస్తున్న ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా స్థాయిలో నిర్మించనున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకి పెద్ద ఎత్తున వీఎఫ్ఎక్స్ చేయనున్నారట. ఇందులో నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని ఇంకా ప్రకటించలేదు. అందుకే సీత పాత్రలో ఎవరు నటించనున్నారు? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే విజయేంద్రప్రసాద్ కథ అందించిన తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్యాన్ ఇండియా మూవీ అక్టోబర్ 13న విడుదల కానుంది. -
మరో పవర్ఫుల్ పాత్ర: ఇందిరాగాంధీగా కంగనా
లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ బాలీవుడ్లో సత్తా చాటుతున్న నటి కంగనా రనౌత్. ఇప్పటికే పలు సినిమాలు చేసి హీరోలకు గట్టి పోటీనిచ్చిన కంగనా ఇప్పుడు మరో పవర్ఫుల్ పాత్రలో కనపించనుంది. దేశ తొలి మహిళా ప్రధానమంత్రి.. ఉక్కు మహిళ (ఐరన్ లేడీ)గా గుర్తింపు పొందిన ఇందిరాగాంధీ పాత్రలో కంగనా నటించనుంది. దానికి సంబంధించిన కథ కూడా సిద్ధమైంది. ఈ క్రమంలోనే కంగనాపై ఫొటోషూట్ చేశారు. ఇందిరాగాంధీ లుక్‌లో కంగనా మెరిశారు. ఇందిరాగాంధీ మాదిరి హెయిర్ స్టైల్, వస్త్రధారణ కంగనాకు సెట్టయ్యింది. ఆమె జీవితంలో ఉన్న ప్రధాన అంశం ఇతివృత్తంగా సినిమా రూపుదిద్దుకుంటుందని మీడియాలో వార్తలను నిజం చేస్తూ కంగనా ప్రకటించింది. తన స్నేహితుడు సాయి కబీర్‌తో కలిసి రాజకీయ నేపథ్యం ఉన్న కథలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందని కంగనా సంతోషం వ్యక్తం చేసింది. మణికర్ణిక తీసిన బృందమే ఈ సినిమాకు పని చేస్తున్నట్లు తెలిపింది. అయితే ఇది జీవిత చరిత్ర కాదని.. ఇందిరాగాంధీ జీవితంలో జరిగిన ప్రధాన ఘట్టం నేపథ్యంలో సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే కథ సిద్ధమైందని.. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాకు సంబంధించి ఫొటోషూట్ కూడా పూర్తయ్యింది. ఒక పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో భాగంగా సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, మొరార్జీ దేశాయ్, లాల్‌బహదూర్ శాస్త్రిలు కూడా కనిపించనున్నారు. మరి వారి పాత్రల్లో ఎవరూ నటిస్తున్నారో ఇంకా తెలియదు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తీస్తున్న ‘తలైవి’ సినిమాలో జయలలిత పాత్రలో కంగనా నటిస్తున్న విషయం తెలిసిందే. అంతకుముందు ‘మణికర్ణిక’ సినిమాలో ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో నటించి మెప్పించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తీస్తున్న ‘తలైవి’ సినిమాలో జయలలిత పాత్రలో కంగనా నటిస్తున్న విషయం తెలిసిందే. జయలిలత పాత్రకు సంబంధించిన పోస్టర్స్ కూడా విడుదలయ్యాయి. అంతకుముందు ‘మణికర్ణిక’ సినిమాలో ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో కంగనా నటించి మెప్పించింది. Kangana will essay the role of former Prime Minister Indira Gandhi in an upcoming political drama. "The script is in final stages. It is not a biopic but it is a grand period film that will help my generation to understand (the) socio-political landscape of current India." pic.twitter.com/0Ln3Pwtwa0 — Kangana Ranaut Daily (@KanganaDaily) January 29, 2021 -
మణికర్ణిక రిటర్న్స్
ఝాన్సీ లక్ష్మీభాయ్గా కంగనా రనౌత్ బాక్సాఫీస్ మీద కత్తి దూసిన చిత్రం ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’. ఈ సినిమాకి క్రిష్ దర్శకుడు. అయితే కొంత భాగాన్ని డైరెక్ట్ చేశారు కంగన. తాజాగా ‘మణికర్ణిక’ చిత్రానికి సీక్వెల్‌ను ప్రకటించారు. ‘మణికర్ణిక రిటర్న్స్: ది లెజెండ్ ఆఫ్ దిడ్డ’ అనే టైటిల్‌తో ఈ సీక్వెల్ రూపొందనుంది. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో, ప్రపంచస్థాయి గ్రాఫిక్స్‌తో ఉంటుందని చిత్రబృందం ప్రకటించింది. కశ్మీరీ రాణి దిడ్డ కథతో ఈ సీక్వెల్ తెరకెక్కనుంది. కంగన టైటిల్ రోల్లో కనిపిస్తారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ ఆరంభమవుతుంది. -
సోనూ ఉండుంటే ఆ సినిమా మరోస్థాయిలో ఉండేది
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ముందుగా బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సదాశివ్ పాత్రలో నటించేందుకు అంగీకరించగా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాక మధ్యలో సినిమా నుంచి తప్పుకున్నాడు. తాజాగా ఈ సినిమాలో ఆయన పాత్రకు సంబంధించిన ఓ ఫొటోను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. దర్శకుడు క్రిష్‌తో కలిసి తన సిక్స్ ప్యాక్‌తో కండల వీరుడిగా, గంభీరంగా నడుస్తున్న సోనూ గెటప్ అభిమానుల్ని తెగ ఆకట్టుకుంటోంది. దీనికి 'జీవితంలో మంచి కోసం నడవండి... ఏదో ఒక రోజు మీరు సాధిస్తారు' అనే క్యాప్షన్‌తో ఫొటో షేర్ చేశారు. ఈ ఫొటో చూసిన ప్రేక్షకులు సోనూ సినిమాలో నటించి ఉంటే మణికర్ణిక మరో స్థాయిలో ఉండేదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి తప్పుకోవడంపై అప్పట్లో కొన్ని రూమర్స్ వినిపించాయి. చిత్రంలో మార్పులు చేయాలని, సోనూసూద్ పాత్రను తగ్గించాలని కంగనా వాదించడంతో క్రిష్ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆ తరువాత కంగన స్క్రిప్టులో మార్పులు చేశారనే ప్రచారం జరిగింది. (సోనూసూద్‌కి ఐరాస అవార్డ్) View this post on Instagram Walk towards the good in life and one day you will arrive ❣️#throwback A post shared by Sonu Sood (@sonu_sood) on Oct 4, 2020 at 7:43am PDT -
నేను తప్పు చేశానా : కంగన ఫైర్!
ముంబై : వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లోకెక్కారు. తన అప్‌మింగ్ మూవీ ప్రమోషన్లో పాల్గొన్న ఓ జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తనను విమర్శించాడంటూ అతడిపై ఫైర్ అయ్యారు. కంగనా- రాజ్‌కుమార్ రావు సినిమా జడ్జిమెంటల్ హై క్యా సినిమా సాంగ్ రిలీజ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే... కంగనా ప్రధాన పాత్రలో తెరకెక్కిన మణికర్ణిక సినిమాను వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కంగనా పూర్తిగా దేశభక్తురాలిగా మారి ఈ సినిమాను తెరకెక్కించిందని సదరు జర్నలిస్టు విమర్శించారు. అదే విధంగా పాకిస్తాన్లో షోలు నిర్వహించే భారతీయ ముస్లిం నటీమణులను వ్యతిరేకించే కంగనా... తన మణికర్ణిక సినిమాను మాత్రం అక్కడ రిలీజ్ చేయడం విశేషం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ క్రమంలో తాజా మూవీ ప్రమోషన్‌కు వచ్చిన అతడిపై కంగన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ నా మణికర్ణిక సినిమా గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడావు. ఆ సినిమా తెరకెక్కించి తప్పు చేశానా? జాతీయవాదిగా నాపై ముద్ర వేశావు కదూ. గతంలో నీకు వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను. అప్పుడు బాగా మెచ్చుకున్నావు. మరి తర్వాత ఏమైంది’ అంటూ ఫైర్ అయ్యారు. ఈ పరిణామంతో కంగుతిన్న సదరు జర్నలిస్టు తను కంగన నటనను విమర్శించినందుకే తనపై ఇలా కక్ష గట్టిందని వాపోయాడు. Great to see journos standing up to #FarziNationalists like #Kangana. Questioning them or flop #Manikarnika makes you question Nationalism?🤨 Not only did @JustinJRao stand his ground - he shut the MC trying to silence him. Kudos to @ektaravikapoor for allowing journo to finish. pic.twitter.com/Vuf7ZbAXj9 — The DeshBhakt (@akashbanerjee) July 8, 2019 -
పబ్లిక్‌గా ముద్దిచ్చిన నటి.. వీడియో వైరల్
హిందీ టీవీ రంగంలో నటిగా పాపులరైన అంకిత లొకాండె.. మణికర్ణికతో సినీరంగంలోకి అడుగుపెట్టి, ఎంట్రీ చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. మణికర్ణికలో కంగనాకు సపోర్టుగా జల్కరి బాయి పాత్రలో ఒదిగిపోయి మంచి మార్కులు కొట్టేసింది. పవిత్ర రిష్తా టీవీ షో చేసే సమయంలో బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో చాలా కాలం రిలేషన్షిప్లో ఉన్న ఈ బ్యూటీ ఆ తర్వాత 2016లో అతడితో విడిపోయింది. సుశాంత్ టీవీ రంగం నుంచి సినిమా రంగం వైపు అడుగులు వేసే క్రమంలో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. అయితే ఇటీవల అంకిత, ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త విక్కీ జైన్‌తో రిలేషన్షిప్లో ఉన్నట్టు, త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలొచ్చాయి. ఈ విషయమై అంకిత కొన్ని రోజుల క్రితమే క్లారిటీ ఇచ్చారు. 'విక్కీ చాలా మంచి వ్యక్తి. నేను అతనితో ప్రేమలో ఉన్నా. సమయం వచ్చినపుడు అన్ని విషయాలు వెల్లడిస్తాను. ఒక వేళ పెళ్లి చేసుకుంటే మీ అందరిని పిలిచే పెళ్లి చేసుకుంటా. ప్రస్తుతానికైతే అలాంటి ప్లాన్లేవీ లేవు. నా ఫోకస్ అంతా పని మీదే ఉంది' అంటూ చెప్పుకొచ్చారు. ఇటీవల అంకిత, విక్కీ జైన్ ఓ కామన్ ఫ్రెండ్ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరూ ఆడిపాడారు. ఈ జంట మ్యూజిక్‌ని ఆస్వాధిస్తుండగా ఒక్కసారిగా విక్కీని దగ్గరకు తీసుకుని అందరు చూస్తుండగానే అంకిత ముద్దు ఇచ్చింది. దీనికి సంబంధించి వీడియోను నటుడు అర్జున్ బిజ్లానీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
‘ఆమెతో నాకు పోటీ ఏంటి.. చిరాగ్గా?’
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనసులో ఉన్నది ఉన్నట్లు కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతారు కంగనా. ముఖ్యంగా బాలీవుడ్లో ఉన్న బంధుప్రీతి గురించి విమర్శలు చేయడంలో ముందు వరుసలో ఉంటారు కంగనా. తాజాగా ఈ ‘క్వీన్’ భామ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలియా భట్ ఓ సగటు హీరోయిన్ అని.. ఆమెతో తనకు పోటీ ఏంటని ప్రశ్నించారు. ఇంగ్లీష్ మ్యాగజైన్ ఒకటి 2019లో ఇప్పటి వరకూ వచ్చిన చిత్రాల్లో ఉత్తమ హీరోయిన్ ఎవరనే అంశం గురించి ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్‌లో కంగనా మణికర్ణిక సినిమాతో పోటీపడగా.. అలియా భట్ గల్లీ బాయ్ సినిమాతో కంగనాకు పోటీగా నిలిచారు. అయితే ఈ ఓటింగ్‌లో కంగనానే ఉత్తమ హీరోయిన్గా గెలిచినట్లు సదరు మీడియా ప్రకటించింది. ఈ విషయాన్ని కంగనా దగ్గర ప్రస్తావించగా... ‘నాకు పోటీగా అలియా ఉందనే విషయం తల్చుకుంటేనే నాకు చాలా చిరాగ్గా ఉంది. గల్లీ బాయ్ చిత్రంలో ఆమె నటన సగటు హీరోయిన్ యాక్టింగ్లానే ఉంది. మిగతా సినిమాల్లో ఎలా నటించిందో ఈ చిత్రంలోనూ అలానే యాక్ట్ చేసింది. కానీ మణికర్ణిక చిత్రంలో నేను మహిళా సాధికారితను తెలిపేలా.. మంచి నటన కనబరిచాను. అలాంటిది నాతో అలియా పోటీపడటం నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి మీడియా ఇలాంటి సినీ స్టార్ల పిల్లలను ప్రోత్సాహించడం మానుకుంటే మంచిది. లేదంటే మన పరిశ్రమ ప్రమాణాలు ఎన్నటికి మెరుగవ్వవు’ అని తెలిపారు. -
‘అందుకే ఆ సినిమా వదులుకున్నా’
ముంబై : బాలీవుడ్ ‘క్వీన్’, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. తనకు తొలి అవకాశం ఇచ్చిన అనురాగ్ బసుకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన దర్శకత్వంలో తెరకెక్కనున్న ఇమాలి మూవీ నుంచి తప్పుకొంటున్నట్లు పేర్కొన్న కంగన.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రకాశ్ కోవెలమూడి- ‘మెంటల్ హై క్యా’, అశ్వినీ అయ్యర్- పంగా సినిమాలతో పాటుగా జయలలిత బయెపిక్‌లో నటిస్తున్నారు. ఈ క్రమంలో గ్యాంగ్‌స్టర్ సినిమాతో తనను వెండితెరకు పరిచయం చేసిన..అనురాగ్ మూవీ నుంచి తప్పుకోవడానికి గల కారణాలు కంగన వెల్లడించారు. ‘గతేడాది పంగా, ఇమాలీ సినిమాలు చేస్తున్నట్లు ప్రకటించాను. అనురాగ్ బసు రూపొందించాల్సిన ఇమాలీ 2018లోనే సెట్స్‌పైకి రావాల్సింది. కానీ అప్పుడు నేను మణికర్ణిక రీషూట్ కారణంగా దర్శకత్వ బాధ్యతల్లో మునిగిపోయాను. భవిష్యత్తులో కూడా డైరెక్టర్‌గా రాణించాలనుకుంటున్నా. అందుకే ఈ సినిమా నుంచి తప్పుకొన్నా. ఈ నిర్ణయం కారణంగా ఎంతో బాధపడ్డాను. అయితే నా పరిస్థితిని.. నా మెంటార్ అనురాగ్ బసు అర్థం చేసుకున్నారు. మేము భవిష్యత్తులో కచ్చితంగా కలిసి పనిచేస్తాం’ అని కంగన చెప్పుకొచ్చారు. అదే విధంగా తన దర్శకత్వంలో తెరకెక్కిన మణికర్ణిక అద్భుత విజయం సాధించడంతో మహిళా సాధికారతపై మరిన్ని సినిమాలు తీయాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇక మణికర్ణిక సినిమా కారణంగా టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్, కంగనాల మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. -
‘సల్మాన్ చాన్స్ ఇస్తా అన్నాడు’
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎక్కువగా వివాదాలతో ఎలా వార్తల్లో నిలుస్తుంటారో, అదే స్థాయిలో తన మంచి మనసును కూడా చాటుకుంటుంటాడు సల్లూభాయ్. గతంలో చాల మంది నటులకు సాయం చేసిన సల్మాన్ తాజాగా లెజెండరీ కొరియోగ్రాఫర్‌కు సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. 2015లో రిలీజ్ అయిన తనూ వెడ్స్ మను తరువాత చాలా కాలం సినిమాలకు దూరమైన సరోజ్ ఖాన్ ఇటీవల మణికర్ణిక, కలంక్ సినిమాకు పని చేశారు. ప్రస్తుతం ఈ లెజెండరీ కొరియోగ్రాఫర్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఇటీవల సల్మాన్ ను కలిసి సరోజ్ ఖాన్ ఇదే విషయాన్ని సల్మాన్‌తో ప్రస్థావించటంతో త్వరలో మనం కలిసి పని చేద్దాం అంటూ మాట ఇచ్చారట. ఈ విషయాన్ని సరోజ్ ఖాన్ తన ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేశారు. ‘చాలా కాలం తరువాత సల్మాన్‌ను కలవటం ఆనందంగా ఉంది. నీకు ఎప్పుడూ దేవుడి ఆశీస్సులు ఉంటాయి’ అంటూ కామెంట్ చేశారు సరోజ్ ఖాన్. View this post on Instagram It was a pleasure meeting you after so long @beingsalmankhan ! God bless you always my darling! ❣️ A post shared by Saroj Khan (@sarojkhanofficial) on Mar 28, 2019 at 4:35am PDT -
కలెక్షన్స్‌లో దూసుకుపోతున్న బాలీవుడ్ మూవీలు
ఈ ఏడాది బాలీవుడ్ మూవీలు ఫుల్ స్వింగ్ మీదున్నాయి. ఇండియన్ ఆర్మీ సాహసాలు, నాటి వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి తెగువ, గల్లీ నుంచి వచ్చిన కుర్రాడు సాధించిన విజయాల నేపథ్యంలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. నిలకడ వసూళ్లతో రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. భారత ఆర్మీ చేపట్టిన సర్జికల్‌స్ట్రైక్ ఆధారంగా తెరకెక్కిన యూరీ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి.. 200కోట్లను కలెక్ట్ చేసి దాటేసి 250కోట్లకు పరుగెడుతోంది. వికాస్కౌశల్, యామీ గౌతమ్ లాంటి చిన్న నటులతో తెరకెక్కించిన ఈ మూవీ.. ఇప్పటికీ హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇక కంగనా రనౌత్ నటించిన మణికర్ణిక వివాదాల నడుమ భారీగా కలెక్షన్లను కొల్లగొడుతోంది. ఇప్పటికే ఈ మూవీ వంద కోట్లను కలెక్ట్ చేసింది. గతేడాది చివర్లో ‘సింబా’గా వచ్చిన రణ్వీర్ సింగ్.. దాదాపు 250కోట్లు కొల్లగొట్టాడు. మళ్లీ చిన్న గ్యాప్‌తో.. ‘గల్లీబాయ్’గా వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసేస్తున్నాడు. వారం రోజుల్లోనే ఈ సినిమా వందకోట్లను కలెక్ట్ చేసేస్తుందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. -
‘అలాంటి వారిని గాడిద మీద ఊరేగించాలి’
ఇక మీదట శాంతి, అహింస అని ఎవరైనా మాట్లాడితే వారిని గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగించాలి అంటున్నారు నటి కంగనా రనౌత్. గురువారం పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కుదిపేసింది. ఈ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ అమానవీయ చర్యను ప్రపంచదేశాలన్ని ముక్తకంఠంతో ఖండించాయి. బాలీవుడ్ కూడా ఉగ్రచర్యలను తీవ్రంగా విమర్శించింది. ఈ నేపథ్యంలో హీరోయిన్ కంగనా రనౌత్ కూడా ఉగ్రదాడిని ఖండించారు. జవాన్ల మృతికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా కంగనా మాట్లాడుతూ.. ‘పాక్ మన దేశ భద్రతనే కాకుండా మన మర్యాదను కూడా గేళి చేసింది. మనకు హాని కలిగించడమే కాక అవమానించింది కూడా. ఇందుకు తగిన సమాధానం చెప్పాలి. ఈ పరిస్థితుల్లో మనం మౌనంగా ఉండకూడదు. మన సహనాన్ని వారు చేతకానితనంగా భావిస్తున్నారు. ఫలితంగా ఈ రోజు దేశం రక్తమోడుతోంది. మన బిడ్డలను చంపి మనల్ని సవాలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఎవరైనా శాంతి, అహింస అంటే అలాంటి వారి ముఖానికి నల్లరంగు పూసి.. గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగించాలి. నడి వీధిలో నిల్చోబెట్టి చెంప పగలకొట్టాలం’టూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జవాన్ల మృతికి సంతాపంగా కంగనా మణికర్ణిక సక్సెస్ మీట్ కార్యక్రమాన్నికూడా వాయిదా వేశారు. -
‘తన బయోపిక్కు తానే డైరెక్టర్’
బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ మరో సంచలనానికి తెరతీసారు. ఇటీవల ఝాన్సీ లక్ష్మీబాయి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన మణికర్ణిక సినిమాతో ఎన్నో వివాదాలకు కేంద్రబింధువైన కంగనా త్వరలో మరోసారి మెగాఫోన్ పట్టేందుకు రెడీ అవుతున్నారు. మణికర్ణిక సినిమాలోని కొంత భాగానికి దర్శకత్వం వహించిన అనుభవంతో తన బయోపిక్‌ను తానే డైరెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు కంగనా. ఈ విషయాన్ని కంగనా స్వయంగా వెల్లడించారు. అంతేకాదు కంగనా బయోపిక్కు బాహుబలి, మణికర్ణిక సినిమాలకు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ కథ అంధించనున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమాలో తన జీవితంలోని ఎత్తు పల్లాలను చూపించబోతున్నట్టుగా తెలిపారు కంగనా. బాలీవుడ్ తో ఎలాంటి సంబంధాలు లేకపోయినా ఓ మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఎన్నో విజయాలు సాధించిన ఓ విజేత కథగా తన బయోపిక్ రూపొందించబోతున్నట్టుగా తెలిపారు. -
‘కంగనా ఓ రాక్‌స్టార్’
ప్రస్తుతం బాలీవుడ్లో మణికర్ణిక వివాదంతో పాటు.. తన సహ నటులపై కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. నెపోటిజమ్ గురించి మాట్లాడినందునే ఇండస్ట్రీ అంతా తనకు వ్యతిరేకంగా ఉందని కంగనా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కంగనా నటనను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. ట్విటర్ వేదికగా అనుపమ్ ఖేర్ నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనిథింగ్’ సెషన్లో ఒక నెటిజన్ ‘బాలీవుడ్లో కంగనా మణికర్ణిక సినిమాకు ఎవరు మద్దతు తెలపడం లేదు.. మీరు ఆమెకు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేయండం’టూ అనుపమ్‌ను కోరాడు. #KanganaRanaut is a ROCKSTAR. She is brilliant. I applaud her courage and performances. She is also the real example of #WomenEmpowerment.:) https://t.co/WeFgWsdiSW — Anupam Kher (@AnupamPKher) February 9, 2019 దాంతో అనుపమ్ ‘కంగనా ఓ రాక్ స్టార్. తనకు చాలా ప్రతిభ ఉంది. నేను తన ధైర్యాన్ని, నటనను ప్రశంసిస్తున్నాను. మహిళా సాధికారితకు తను నిలువెత్తు నిదర్శనం’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం అనుపమ్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. ఇదిలా ఉండగా బంధుప్రీతి గురించి మాట్లాడినందునే బాలీవుడ్ మొత్తం గ్యాంగ్‌లా మారి తనను వ్యతిరేకిస్తున్నారంటూ కంగనా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అలియా భట్, ఆమిర్ ఖాన్ చిత్రాలు ‘దంగల్’, ‘రాజీ’ మూవీ ప్రమోషన్లకు తాను హాజరయ్యానని.. కానీ నేడు ధీర వనిత లక్ష్మీబాయి కథతో ముందుకు వస్తే తనకు ఎవరూ సహకరించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కంగనా వ్యాఖ్యలపై ఆలియా స్పందించడం.. క్షమాపణ చెప్పేందుకు కూడా సిద్ధపడటం వంటి సంఘటనలు తెలిసిందే. -
‘కంగనాకు క్షమాపణ చెప్పేందుకు సిద్ధం’
ముంబై : బాలీవుడ్ మొత్తం గ్యాంగ్‌లా ఏర్పడి తనకు వ్యతిరేకంగా మారారంటూ హీరోయిన్ కంగనా రనౌత్ విమర్శించారు. ప్రణాళిక ప్రకారమే తన ‘మణికర్ణిక’ సినిమాకు మద్దతుగా నిలవలేందంటూ ‘క్వీన్’ చిందులు తొక్కారు. నెపోటిజమ్‌కు వ్యతిరేకంగా తాను మాట్లాడినందు వల్లే ఇలా కక్ష గట్టారని ఆరోపించారు. ఈ క్రమంలో అలియా భట్, ఆమిర్ ఖాన్ల పేర్లు ప్రస్తావించిన కంగనా.. ‘అలియా భట్ నాకు ‘రాజీ’ ట్రైలర్ పంపించారు. తనకు సపోర్ట్ చేయమన్నారు. అలాగే ఆమిర్ కూడా ‘దంగల్’ మూవీ ప్రమోషన్లో పాల్గొనమన్నారు. ఈ రెండు సినిమాలు సందేశాత్మకమైనవి గనుక వాటికి అండగా నిలిచాను. ప్రస్తుతం నేను ధీర వనిత లక్ష్మీబాయి కథతో ముందుకు వస్తే నాకు ఎవరూ సహకరించడం లేదు’ అంటూ గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కంగనా వ్యాఖ్యలపై స్పందించిన అలియా భట్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... ‘ తను(కంగన) నన్ను ద్వేషిస్తున్నారని అనుకోవడం లేదు. తనను కావాలని అప్సెట్ చేయలేదు. కాస్త బిజీగా ఉన్నందు వల్లే ఇలా జరిగింది. ఈ విషయమై తనకు వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పేందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను. తనలా మాట్లాడటానికి చాలా ధైర్యం కావాలి. ఒక వ్యక్తిగా, గొప్ప నటిగా తన పట్ల నాకు ఆరాధనా భావం ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా ప్రస్తుతం రణ్వీర్ సింగ్‌తో కలిసి నటించిన గల్లీ బాయ్ సినిమా ప్రమోషన్లతో అలియా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. -
దర్శకుడి పేరు లేకుండానే రిలీజ్ చేస్తారా.?
ప్రస్తుతం సౌత్, నార్త్ ఇండస్ట్రీలలో వివాదాస్పదంగా మారిన సినిమా మణికర్ణి. ఈ సినిమాకు ముందుగా క్రిష్ దర్శకత్వం వహించటం ప్రధా పాత్రధారి కంగనాతో వివాదం కారణంగా క్రిష్ తప్పుకోవటంతో కంగనానే దర్శకత్వ బాధ్యతలు తీసుకోవటంతో సినిమా టైటిల్స్‌లో దర్శకులుగా కంగనా, క్రిష్ పేర్లు కనిపించాయి. అయితే మేజర్ పార్ట్ డైరెక్ట్ చేసిన తనకే ఎక్కువ క్రెడిట్ దక్కాలంటూ సోషల్ మీడియా వేదిక గొడవపడుతున్నారు. అలాంటి పరిస్థితే ఓ సౌత్ సినిమాకు కూడా ఏర్పడింది. బాలీవుడ్ సూపర్ హిట్ క్వీన్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న సౌత్ సినిమా దట్ ఈజ్ మహాలక్ష్మీ. ఈసినిమాకు ముందుకు షో ఫేం నీలకంఠ దర్శకత్వం వహించాడు. తరువాత లీడ్ యాక్టర్ తమన్నాతో వివాదం కారణంగా నీలకంఠ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవటంతో మిగతా భాగానికి అ! ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. మరి ఈ ఇద్దరిలో సినిమాకు దర్శకుడిగా క్రెడిట్ ఎవరికి ఇస్తారు. ఇద్దరికీ క్రెడిట్ ఇచ్చేట్టయితే ముందుగా ఎవరి పేరు వేస్తారు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన దట్ ఈజ్ మహాలక్ష్మీ టీం పోస్టర్లు, టీజర్లను దర్శకుడి పేరు లేకుండానే రిలీజ్ చేసింది. మరి సినిమా విషయంలో కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతారా లేక మరో వివాదానికి తెరతీస్తారా చూడాలి. -
‘క్రిష్ చేయని పనికి క్రెడిట్ అడుగుతున్నారు’
మణికర్ణిక సినిమా వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే సోషల్ మీడియా వేదిక క్రిష్, చిత్ర యూనిట్‌పై ముఖ్యంగా కంగనా రనౌత్‌పై ఆరోపణలు గుప్పిస్తుంటే, కంగనా కూడా అదే స్థాయిలో ఎదురుదాడి చేస్తోంది. పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ వివాదంపై స్పందిస్తున్నారు. కొందరు కంగనాను తప్పు పడుతుండగా, మరికొందరు క్రిష్ తీరును విమర్శిస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై స్పందించిన చిత్ర నిర్మాత కమల్ జైన్.. క్రిష్ వాదనను తప్పు పట్టారు. దర్శకురాలిగా కంగనా పేరు ముందు వేయటం అనేది నిర్మాణ సంస్థ నిర్ణయం అన్నారు. అంతేకాదు.. క్రిష్, తన వాదన సరైనదే అని భావిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చిన తెలిపారు. ఆయన, తను చేయని పనికి క్రెడిట్ కావాలని కోరటం సరైన పద్దతి కాదన్నారు. సినిమా సక్సెస్ సాధించిన తరువాత క్రిష్ తనకు క్రెడిట్ కావాలని వాదిస్తున్నారని విమర్శించారు. -
‘మణికర్ణిక’ వివాదంపై తమన్నా.!
ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలను కుదిపేస్తున్న వివాదం మణికర్ణిక. క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమైన ఈ సినిమాకు తరువాత కంగనా దర్శకత్వ బాధ్యతలు తీసుకోవటంతో వివాదం మొదలైంది. కంగనా తన పాత్రను ఎలివేట్ చేసుకునేందుకు ఇతర పాత్రలను తగ్గించిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ వివాదంలో కొంతమంది క్రిష్‌కు మద్దతు తెలుపుతుండగా మరికొందరు కంగనానే కరెక్ట్ అంటున్నారు. తాజాగా ఈ వివాదంపై మిల్కీబ్యూటీ తమన్నా స్పదించారు. ‘నటనపరంగా కంగనాకు వంక పెట్టడానికి లేదు. ఆమె ఎంత గొప్ప నటో అందరికీ తెలిసి విషయమే. క్రియేటివ్ పీపుల్ ఆలోచనలు వేరుగా ఉంటాయి. అయితే ఎవరి ఆలోచన ఎలా ఉన్నా ఫైనల్‌గా అవి సినిమాకు మంచి చేసేవిగా ఉండాలి. ప్రతీ ఒక్కరు సినిమా సక్సెస్ కోసమే పనిచేయా’లన్నారు. అయితే ఈ వివాదంలో ఎవరిది తప్పన్న విషయాన్ని సూటిగా చెప్పేందుకు తమన్నా ఇష్టపడలేదు. -
నా పాత్రను తగ్గించేశారు
‘మణికర్ణిక’ చిత్రం మంచి కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో కంగనా రనౌత్ నటనను ప్రేక్షకులు అభినందిస్తున్నా, ఆమె ప్రవర్తనను మాత్రం తోటి టెక్నీషియన్స్ విమర్శిస్తున్నారు. దర్శకత్వం విషయంలో క్రిష్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ‘నా పాత్రను నిర్దాక్షిణ్యంగా తగ్గించేశారని అందులో నటించిన హీరోయిన్ మిస్తీ చక్రవర్తి ఆరోపించారు. ‘‘మణికర్ణిక’ సినిమాలో నా పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందని, మంచి సన్నివేశాలున్నాయని క్రిష్‌గారు నాతో చెప్పారు. అలానే అద్భుతమైన సన్నివేశాలు చిత్రీకరించారు కూడా. కానీ, అవన్నీ సినిమాలో కనిపించలేదు. సినిమా పూర్తయ్యాక మళ్లీ కొన్ని సన్నివేశాలు షూట్ చేయడానికి కంగనా నన్ను డేట్స్ అడిగారు. అప్పుడు తీసిన సన్నివేశాలను మొదట షూట్ చేసినవాటి స్థానంలో చేర్చారు. ఒకవేళ కంగనానే దర్శకురాలని ముందే తెలిసుంటే ఈ సినిమా చేసుండేదాన్ని కాదు’’ అని పేర్కొన్నారు మిస్తీ. -
‘కంగనా రియల్ డైరెక్టర్ కాదు’
మణికర్ణిక సినిమాపై విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కుతున్న చిత్ర నటీనటులు నుంచి మాత్రం విమర్శలే వినిపిస్తున్నాయి. దర్శకుడు క్రిష్.. కంగనా తీరుపై విరుచుకుపడ్డారు. సోనూ సూద్ పాత్రను తగ్గించాలన్న నిర్ణయం కంగనా తీసుకోవటం పాటు మరిన్ని మార్పులకు ఒత్తిడి చేయటంతోనే తాను ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టుగా క్రిష్ తెలిపారు. సోనూసూద్ కూడా తన పాత్రను ముందు చెప్పినట్టుగా తెరకెక్కించకపోవటంతోనే ప్రాజెక్ట్ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని తెలిపాడు. తాజా మణికర్ణిక సినిమాలో కీలక పాత్రలో నటించిన మిస్తీ చక్రవర్తి, కంగనా తీరుపై స్పందించారు. ‘క్రిష్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న తరువాత అబద్దాలు చెప్పి కంగనా, కమల్ జైన్‌ను నా డేట్స్ అడిగారు. సినిమాలో నీది కీలక పాత్ర సినిమా అంత నువ్ కనిపిస్తావు. అందుకే మరిన్ని డేట్స్ అవసరం పడ్డాయని చెప్పారు. కానీ క్రిష్ తీసిన సన్నివేశాలను కూడా కట్ చేసి, నా పాత్రను కొన్ని సీన్స్‌కే పరిమితం చేశార’ని తెలిపారు మిస్తీ. అంతేకాదు కంగనా తన పాత్రను మరింతగా ఎలివేట్ చేసేందుకు ఇతర పాత్రల నిడివిని తగ్గించారని ఆరోపించారు. అంతేకాదు కంగనా నిజమైన డైరెక్టర్ కాదని, డైరెక్టర్ తన సినిమాలో ప్రతీ పాత్రను ప్రేమిస్తారని.. కానీ కంగనా కేవలం తన పాత్రను మాత్రమే దృష్టిలో పెట్టుకొని సినిమాలో మార్పులు చేశారని తెలిపారు. -
ఈ సీన్ ‘మణికర్ణిక’లో ఉంటే.. అదిరిపోయేది!
మణికర్ణిక విడుదలై ఒకవైపు పాజిటివ్ టాక్‌ను సంపాదించి.. కలెక్షన్లలో పుంజుకుంటుంటే.. మరోవైపు వివాదాలు కూడా వస్తున్నాయి. సినిమాలో మణికర్ణిక పాత్రలో నటించిన కంగనాకు ప్రశంసలు వస్తున్నాయి కానీ డైరెక్షన్ క్రెడిట్ పూర్తిగా తన అకౌంట్లో వేసుకోవడం మాత్రం దర్శకుడు క్రిష్‌కు మింగుడు పడటం లేదు. ఈ వివాదంపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మణికర్ణిక విడుదలైన సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో క్రిష్ మాట్లాడుతూ.. తాను తీసిన సినిమా బంగారంలా ఉంటే ప్రస్తుతం చూస్తున్న సినిమా వెండిలా ఉందని.. కంగనా, సోనూసూద్ నటించిన పాత్రను తగ్గించాలని పట్టుబట్టిందన్నారు. కానీ తాను వినిపించుకోలేదని, కథలో తనకు ఇష్టవచ్చిన మార్పులు చేసిందని కంగనాపై ఆరోపణలు చేశారు. తాను ఈ సినిమా కోసం ఎంతో పరిశోధించానని, చరిత్రను వక్రీకరించడం తనకు ఇష్టం లేదన్నారు. అయితే క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాక.. తన పాత్రను తగ్గిస్తామని చెప్పేసరికి సోనూసూద్ కూడా ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. అయితే ఈ వివాదం ఇలా కొనసాగుతుంటే.. సోనూసూద్‌పై షూట్ చేసిన ఓ సన్నివేశం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సినిమా ఎండింగ్ వరకు ఆయన పాత్ర ఉంటుందని, సోనూసూద్‌పై తీసిన సన్నివేశాలు ఎంతో బాగుంటాయని క్రిష్ చెప్పడం.. ఒళ్లు గగుర్పొడిచే ఈ సీన్ లీక్ అవ్వడం చూస్తే.. కంగనా కావాలనే సోనూసూద్ పాత్రను తగ్గించినట్లుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సోనూసూద్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నాక.. మహ్మద్ జీషన్ తో రీ షూట్ చేసింది. ఆ పాత్రను పూర్తిగా మార్చేయడంతో పెద్దగా ప్రాముఖ్యత లేకుండాపోయింది.