Manjula Ghattamaneni
-
'ఆయన లేకుండా తొలిసారి ఇలా'.. మంజుల ఎమోషనల్ పోస్ట్!
ఇటీవలే మంత్ ఆఫ్ మధు చిత్రంతో ప్రేక్షకులను అలరించారు మంజుల ఘట్టమనేని. నటిగా, నిర్మాతగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇవాళ బర్త్ డే జరుకుంటున్న మంజుల తన తండ్రి, సూపర్ స్టార్ కృష్ణను తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. గతేడాది తండ్రితో కలిసి పుట్టిన రోజు జరుపుకున్న ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఆమె తన ఇన్‌స్టాలో రాస్తూ..' ప్రతి పుట్టిన రోజుకు మా నాన్న ఎప్పుడు నా పక్కనే ఉండేవారు. తొలిసారి ఆయన లేకుండా నా బర్త్ డే జరుగుతోంది. ఈ ఫోటోల్లోని క్షణాలు నా జీవితంలో మధుర జ్ఞాపకాలు. నాన్నతో ఉన్న ఈ క్షణాలు నా జీవితాంతం గుర్తుంటాయి.' అంటూ ఎమోషనలైంది. ఈ ఫోటోల్లో కృష్ణతో పాటు మహేశ్ బాబు, నమ్రత, ఆమె భర్త సంజయ్ స్వరూప్ కూడా ఉన్నారు. కాగా.. గతేడాది సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఘట్టమనేని ఫ్యామిలీలో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. మహేశ్ బ్రదర్ రమేష్ బాబు, ఇందిరమ్మ కూడా గతేడాదిలోనే కన్నుమూశారు. View this post on Instagram A post shared by Manjula Ghattamaneni (@manjulaghattamaneni) -
మంజుల ఘట్టమనేని ఇల్లు చూశారా? ఎంత అందంగా ఉందో!
స్టార్ హీరోల కుటుంబాల నుంచి అబ్బాయిలు కథానాయకుడిగా వెండితెరపై రంగప్రవేశం చేస్తుంటారు. అమ్మాయిలు చాలా అరుదుగా వెండితెరపై మెరుస్తుంటారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ రెండో కూతురు మంజుల బాలనటిగా నటించడమే కాకుండా తర్వాతి క్రమంలో నిర్మాతగా, దర్శకురాలిగా కొనసాగింది. శభాష్ గోపి సినిమాలో హీరోయిన్గా నటించిన మంజుల మలయాళంలో సమ్మర్ ఇన్ బెత్లెహామ్, తమిళంలో రాజస్థాన్ మూవీలో నటించింది. తర్వాత షో సినిమాతో నిర్మాతగా మారింది. మహేశ్‌బాబు నాని, పోకిరి, ఏ మాయ చేశావె సినిమాల నిర్మాణంలో పాలుపంచుకుంది. మనసుకు నచ్చింది చిత్రంతో డైరెక్టర్‌గానూ మారింది. ఈ మధ్యే విడుదలైన మంత్ ఆఫ్ మధు సినిమాలోనూ కనిపించింది. పూజతోనే రోజు ప్రారంభం తాజాగా ఈ టాలెంటెడ్ నటి, నిర్మాత తన యూట్యూబ్ ఛానల్లో హోంటూర్ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో మంజుల మాట్లాడుతూ.. 'నేను హోంటూర్ చేస్తున్నాను. మా ఇల్లు చాలా సింపుల్‌గా ఉంటుంది. మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు' అంటూ తన ఇంటిని చూపించింది. దేవుడి పూజతోనే రోజును ప్రారంభిస్తాను అంటూ మొదట పూజగదిని చూపించింది. లివింగ్ ఏరియా, డైనింగ్ రూమ్, కిచెన్ గదులను చూపించింది. తన కూతురి కోసం చిన్నప్పటి నుంచి కొన్న బొమ్మలు, ఆటవస్తువులు అన్నింటినీ చిన్నపాటి గదిలో అందంగా అమర్చింది. ఇంట్లో ఆఫీస్ రూమ్ & బార్ అందరూ కలిసి కబుర్లాడుకునేందుకు ఒక ఫ్యామిలీ రూమ్ కూడా ఉంది. అలాగే కాఫీ బార్‌ను చూపిస్తూ అది తన భర్తకు ఎంతో ఇష్టమని పేర్కొంది. ఇంట్లో ఉన్న పెయింటింగ్స్‌ను చూపిస్తూ దాని ప్రత్యేకతలు కూడా చెప్పుకొచ్చింది. ఇక ఇంట్లోనే ఆఫీస్ రూమ్ ఏర్పాటు చేసుకుంది మంజుల. తనకు పుస్తకాలు చదవడం అంటే ఎంతో ఇష్టమని వీలైతే మీరు కూడా చదవండి అని అభిమానులకు సలహా ఇచ్చింది. ఇంట్లో ఆరు బాల్కనీలు ప్రకృతితో మమేకం అవడం అంటే చాలా ఇష్టమని, అందుకే తన ఇంటికి ఆరు బాల్కనీలు ఉన్నాయంది. ఒక బాల్కనీలో డైనింగ్ టేబుల్ ఉండగా కొన్నిసార్లు అక్కడే రాత్రిపూట భోజనం చేస్తామంది. పెరట్లో చాలా రకాల చెట్లున్నాయంది. జిమ్ ఏరియాలో టేబుల్ టెన్నిస్ కూడా ఏర్పాటు చేసింది. ఇంటిపై భాగంలోనూ చిన్నపాటి గార్డెన్ ఏర్పాటు చేసింది.. మంజుల చెప్పినట్లుగానే తన ఇల్లు చాలా సింపుల్‌గా అలాగే ఎంతో అందంగా ఉంది. చదవండి: అప్పటిలా లేను.. చాలా మారిపోయా: అనసూయ -
నాది, మహేష్ ది లవ్ మ్యారేజ్..!
-
మహేష్ తో సినిమా చేస్తే పరువు తీస్తాడు..!
-
నమ్రతా ఎంత అదృష్టవంతురాలంటే..!
-
మా అన్నయ్య నన్ను చాలా ఏడిపించేవాడు..!
-
జయప్రద అంటే చాలా ఇష్టం..!
-
ఆ కారణంగా నేను హీరోయిన్ కాలేకపోయాను
-
మా నాన్న ప్రేమతో కట్టించుకున్న స్టూడియోస్...!
-
మా చిన్నతనం చాలా రిచ్ గా గడిపాము...!
-
బాలకృష్ణతో నటించే ఛాన్స్ వచ్చింది.. కానీ నో చెప్పాను..
-
ఆ రూపంలో ఇంకా జీవించే ఉన్నారు.. మంజల ఘట్టమనేని ఎమోషనల్ ట్వీట్
సూపర్ స్టార్ కృష్ణ మరణం వారి కుటుంబంతో పాటు అభిమానుల్లో విషాదాన్ని నింపింది. ఇవాళ ఆ నటశేఖరుని పెద్ద కర్మ కార్యక్రమం హైదరాబాద్‌లోని జేఆర్సీ, ఎన్ కన్వెన్షన్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ కుటుంబసభ్యులతో పాటు వేలాది మంది అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల ఘట్టమనేని నాన్నను గుర్తు చేసుకున్నారు. (చదవండి: నాన్న ఎన్నో ఇచ్చారు.. వాటిలో నాకు అదే గొప్పది : మహేశ్ బాబు) కృష్ణను తలుచుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ట్వీట్లో రాస్తూ.. 'మీరు మమ్మల్ని వదిలివెళ్లినా.. మీరు ఇచ్చిన గొప్ప వారసత్వం రూపంలో ఇంకా జీవించే ఉన్నారు. మేము ఎప్పటికీ ప్రేమిస్తునే ఉంటాం నాన్నా' అంటూ పోస్ట్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు రెండు రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు తరలివచ్చారు. You continue to live through the rich legacy you left behind. We love you forever Nana ❤️❤️❤️ pic.twitter.com/Mjw7fdcQ3d — Manjula Ghattamaneni (@ManjulaOfficial) November 27, 2022 -
'అందుకే నాన్న మమ్మల్ని విడిచి వెళ్లారేమో'.. సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె ఎమోషనల్ పోస్ట్
కొద్ది రోజుల సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూసిన సంగతి తెలిసిందే. సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్‌బాబు తల్లి ఘట్టమనేని ఇందిరా దేవి కన్నుమూశారు. ఈ ఏడాదిలోనే కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్ బాబు కూడా మరణించారు. మహేశ్ బాబుకు ఈ ఏడాది తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. టాలీవుడ్ చిత్రసీమ మొత్తం కదలివచ్చి సూపర్‌స్టార్‌కు నివాళులర్పించింది. ఇందిరా దేవికి రమేష్ బాబు, మహేష్ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఐదుగురు సంతానం. తాజాగా ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ, ఇందిరా దేవి పెళ్లిరోజు సందర్భంగా మంజుల ఎమోషనల్ పోస్ట్ చేసింది. (చదవండి: నాన్న.. నువ్వు ప్రపంచానికే సూపర్ స్టార్.. మంజుల ఎమోషనల్ ట్వీట్) మంజుల తన ఇన్‌స్టాలో రాస్తూ..' వారి వివాహబంధం స్వర్గంలో కొనసాగేంత గొప్ప బంధం. అమ్మ వెళ్లిన తర్వాత నాన్న చాలా మిస్ అయ్యారని నేను అనుకుంటున్నా. అందుకేనేమో మమ్మల్ని విడిచి అమ్మ వద్దకే చేరాడు. నిజంగా వారు ఆత్మలు కూడా సహచరులేనేమో. వారి 60 ఏళ్ల వివాహబంధానికి మేం ఐదుగురు పిల్లలం. ఇలాంటి ఉన్నతమైన వ్యక్తులు నా తల్లిదండ్రులు కావడం నిజంగా అదృష్టం. వారి ప్రేమ మాకు ఎల్లప్పుడు అండగా ఉంటుంది. వారిలో కనీసం 10 శాతమైన స్వచ్ఛంగా మారడమే వారికిచ్చే ఉత్తమ బహుమతి అని నేను భావిస్తున్నా.' అంటూ ఎమోషనల్ అయ్యారు మంజుల. అమ్మా, నాన్నకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వారితో కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు . View this post on Instagram A post shared by Manjula Ghattamaneni (@manjulaghattamaneni) -
నాన్న.. నీ ఫోన్ కాల్స్, మాటలు.. మిస్ అవుతున్నా: కృష్ణ కూతురు ఎమోషనల్
తండ్రిని తలచకుంటూ కృష్ణ కూతురు మంజుల ఘట్టమనేని ఎమోషనల్ పోస్ట్ చేసింది.‘ప్రియమైన నాన్న.. మీరు మాకు, ఈ ప్రపంచానికి సూపర్స్టార్వి. ఇంట్లో ఎప్పుడూ సాదాసీదా తండ్రిలాగే వ్యవహరించేవాడివి. ఎలా జీవించాలో మీరు మాకు ఎప్పుడూ ఉపన్యాసాలు ఇవ్వలేదు. మీరు మీ చర్యల ద్వారా మాకు బోధించారు. మీ సరళత, సౌమ్యత, వివేకం, క్రమశిక్షణ, సమయపాలన మరియు దాతృత్వం .. అసమానమైనవి. సినిమాకి, మీ వారసత్వానికి చేసిన సేవలు ఎప్పటికీ బతికే ఉంటాయి. నువ్వే నా బలం, నువ్వే నాకు వెన్నెముక, నువ్వే నా హీరో. నీ ప్రేమ అంతులేని సముద్రం. మాకు అవసరమని మాకు తెలియనప్పుడు కూడా మీరు మాకు కావాల్సినవన్నీ ఇచ్చారు.ఇప్పటికే నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ప్రతి రోజు ఉదయం 11 గంటల పోన్ కాల్స్, సంభాషణలను కోల్పోతున్నాను. మీరు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది. ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటాను నాన్న’అని తన ఇన్‌స్టా ఖాతాలో మంజుల రాసుకొచ్చింది. కాగా, గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణ మంగళవారం తెల్లవారుజామున మరణించిన సంగతి తెలిసిందే. బుధవారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. View this post on Instagram A post shared by Manjula Ghattamaneni (@manjulaghattamaneni) -
నాన్న.. నువ్వు ప్రపంచానికే సూపర్ స్టార్.. మంజుల ఎమోషనల్ ట్వీట్
సూపర్ స్టార్ కృష్ణ మరణం పట్ల ఆయన కూతురు మహేశ్ సోదరి మంజుల ఘట్టమనేని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాన్నను తలుచుకుని ఎమోషనల్ అయ్యారు మంజుల. మీరు టాలీవుడ్‌కు మాత్రమే కాదు.. ప్రపంచానికే సూపర్ స్టార్ అంటూ కొనియాడారు. మా పట్ల మీరు చూపించిన ప్రేమానురాగాలు చిరకాలం మాతోనే ఉంటాయని నాన్నతో ఉన్న క్షణాలను గుర్తు చేసుకున్నారు. తండ్రి మరణాన్ని తలుచుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. (చదవండి: గచ్చిబౌలి స్టేడియానికి కృష్ణ పార్థివదేహం.. ఎందుకు తరలించలేదంటే?) ట్విటర్లో మంజుల రాస్తూ.. ' నాన్నా. మీరు ప్రపంచానికే సూపర్ స్టార్. మా కోసం మీరు చూపించిన ప్రేమ చిరకాలం మాతోనే ఉంటుంది. ఏది ఏమైనా మీరే నా జీవితానికి సూపర్ స్టార్. చిత్రసీమకు మీరు చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయి. ఇప్పటికే నిన్ను చాలా మిస్ అవుతున్నా. లవ్ యూ నాన్న.' ఎమోషనల్ పోస్ట్ చేసింది. Dearest Nana, You are a superstar to the world and for us, at home, you are a loving, simple father who is always there for us, no matter what.Your legacy and immense contribution to cinema continue to live forever. I already miss you terribly. Love you forever Nana ❤ pic.twitter.com/xJ3G8L7iGH — Manjula Ghattamaneni (@ManjulaOfficial) November 15, 2022 -
మహేశ్ సోదరి మంజులకు పిల్లలను కనడం ఇష్టమే లేదట.. కానీ!
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 1993లో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న ఆమె ‘జబ్ ప్యార్ కిసీసే హోతాహై’ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన వాస్తవ్ మూవీ నమ్రత కెరీర్లో తొలి హిట్ సినిమా. దీని తర్వాత నమ్రతకు అవకాశాలు క్యూ కట్టాయి. అలా దాదాపు 20కి పైగా బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. ఇక తెలుగులో ఆమె నటించిన తొలి సినిమా వంశీ. ఈ సినిమా షూటింగ్ టైంలోనే మహేశ్‌తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలా పెద్దల అంగీకారంతో 2005, ఫిబ్రవరి 10న ముంబైలో వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.అయితే వీరి పెళ్లి జరగడానికి మహేశ్ సోదరి మంజుల ముఖ్య పాత్ర వహించారట. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ మంజలతో తనకున్న రిలేషన్‌ను షేర్ చేసుకున్నారు. చదవండి: నమ్రతను ఒప్పుకోని మహేశ్ ఫ్యామిలీ.. అప్పుడు ఏం చేశారంటే.. 'ఓ పార్టీలో అనుకోకుండా మంజులను కలిశాను. అప్పుడు నేను మహేశ్‌ను ప్రేమిస్తున్నట్లు ఆమెకు తెలియదు. ఆ తర్వాత ఒక ఫ్యామిలీ అయ్యాం. తను నా బెస్ట్‌ఫ్రెండ్. అంతేకాదు. మేమిద్దరం ఒకేసారి ప్రెగ్నెన్సీని ధరించడం యాధృచ్చికంగా జరిగింది. నిజానికి మంజులకు పిల్లలను కనడం మొదట్లో ఇష్టమే లేదు. కానీ ఇప్పుడో కూతురు. తల్లిగా ఆమె ఎంతో ఆనందిస్తుంది' అంటూ చెప్పుకొచ్చింది. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పినందుకు తనకెలాంటి బాధ లేదని, స్తుతం తన ఫ్యామిలీని చూసుకోవడంలో బిజీగా ఉన్నానంటూ తెలిపారు. అందుకే ప్రస్తుతానికి సినిమాలు చేసే ఆలోచన లేదు అంటూ చెప్పుకొచ్చింది. చదవండి: అందుకే సావిత్రిపై కృష్ణకుమారికి కోపం..చనిపోయినా వెళ్లలేదు! -
ప్రకృతి వనాన్ని తలపిస్తోన్న సూపర్ స్టార్ ఇల్లు చూశారా?
సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అంత పెద్ద స్టార్ అయినప్పటికీ కృష్ణ బయటకు మాత్రం చాలా సింపుల్‌గా ఉంటారు. అందుకే ఆయనను నటుడిగానే కాదు పర్సనల్‌గా కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు. ఆ సింప్లిసిటీ ఆయనలో మాత్రమే కాదు, ఇంటిని కూడా అన్ని సౌకర్యాలతో చాలా సింపుల్‌గా నిర్మించుకున్నారు కృష్ణ. ఇటీవల కృష్ణ హోంటూర్ వీడియో ప్రోమోను ఆయన కూతురు మంజుల ఘట్టమనేని తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఫుల్ వీడియోను వదిలారు ఆమె. ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే హైదరాబాద్ నగరంలో ఎవరూ ఊహించని రీతిలో కృష్ణ ఇల్లు ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చూట్టూ ఆకుపచ్చని చెట్లు, పక్షుల కిలకిల రాగాలు, రకరకాల పూలు, పండ్ల తోటలతో పూర్తి ప్రకృతమయంగా ఇంటిని నిర్మించుకున్నారు కృష్ణ. ఇంట్లో అడుగడుగునా ఆయన అభిరుచి కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ఇంట్లోకి అడుగుపెట్టగానే పచ్చని వనం, మధ్యలో కృష్ణుడి విగ్రహం.. వాటర్ ఫౌంటెన్ దాని చుట్టూ గులాబీ చెట్లు.. కొబ్బరి చెట్లు, పెరటిలో తులసి, ఆ పక్కనే విజయ నిర్మల గారి విగ్రహం ఇలా ఆహ్లాద వాతావరణాన్ని తలపిస్తోంది. భాగ్య నగరంలో ప్రశాంత వాతావరణాన్ని కలిగించేలా కట్టుకున్న ఇల్లును చూసి ఫిదా అవుతున్నారంతా. మరో విశేషం ఏంటంటే ఇంటి వెనకాలే మామిడి తోట.. ఆకుకూరలు, కూరగాయల చెట్లు కూడా ఉన్నాయి. ఇక కుటుంబమంతా కలిసి సరదాగా గడిపేందుకు గార్డెన్లో, ఇంట్లో స్పెషల్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్, ఇంటి లోపల హోం థియేటర్, స్మిమ్మింగ్ ఫూల్, ఇంట్లోనే పార్టీ చేసుకునేందుకు అన్ని హంగులతో నిర్మించుకున్న హాల్, పిల్లల కోసం ప్లేయింగ్ రూమ్స్ అన్నీ చక్కగా అమర్చి ఉండటంతో ఇది ఇంద్రభవనాన్ని తలపిస్తోంది. లివింగ్ రూంలో ఎక్కడ చూసినా విజయ నిర్మల ఫొటోలు, విగ్రహాలు.. బంగారంతో చేయించిన ఆమె కాళ్లు.. కృష్ణ గెలుచుకున్న పతకాలు ఇలా ఎన్నింటినో చూపిస్తూ ఆసక్తికర అంశాలను షేర్ చేశారు మంజుల. లివింగ్ రూం వరకే చూపించి మొదటి అంతస్తులో నాన్న ఉంటారని, ప్రస్తుతం అక్కడికి నో ఎంట్రీ అని చెప్పారామె. కుదిరితే భవిష్యత్తులో చూపిస్తానన్నారు. మొత్తానికి ఆయన ఇంటిని చూస్తుంటే ఓ సుందరవనాన్ని తలపిస్తోంది. ప్రకృతిమయమైన రిసార్టును చూస్తున్న భావన కలుగుతోంది. ఇలా ఎన్నో విశేషాలతో ఆయన ఇల్లు చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. -
సూపర్ స్టార్ కృష్ణ ఇల్లు చూశారా? వీడియో వైరల్
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీ హోంటూర్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఇప్పటికే మంచు లక్ష్మీ, కమెడియన్ అలీ,కృష్ణం రాజు వంటి ప్రముఖుల హోంటూర్స్ నెట్టింట ఎంత వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మరో సెలబ్రిటీ హోంటూర్ కూడా వచ్చేసింది. ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ హోంటూర్ వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తుంది. ఆయన కుమార్తె మంజుల ఘట్టమనేని స్వయంగా తన యూట్యూబ్ చానెల్లో హోంటూర్కు సంబంధించిన ప్రోమో వీడియోను రిలీజ్ చేసింది. సకల సైకర్యాలతో అందమైన హంగులతో ఇంద్రభవనాన్ని తలపిస్తున్నట్లు ప్రోమోను చూస్తే అర్థమవుతుంది. విజయ నిర్మల విగ్రహం ఇందులో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. త్వరలోనే ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వీడియో రానుంది. -
అలా అడిగేసరికి మహేశ్ స్టూడియో అంతా పరిగెత్తించాడు: కృష్ణ
Special Interview With My Super Star Nanna Promo: సూపర్ స్టార్ కృష్ణ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చేప్పనక్కర్లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త ప్రయోగాలకు నిర్వచనం సూపర్ స్టార్ కృష్ణ అనేంతగా ఆయన గుర్తింపు పొందారు. జేమ్స్ బాండ్ వంటి హాలీవుడ్ తరహా పాత్రలను టాలీవుడ్‌కు పరిచయం చేసి హిట్ కొట్టిన తొలి హీరో. విభిన్న పాత్రలు, కథలతో ప్రేక్షకులు, అభిమానులను ఎంతగానో అలరించిన నిర్మాతగా, దర్శకుడిగా సైతం రాణించి ఎందరో ఆర్టిస్ట్‌లకు దేవుడిగా మారారు. ప్రస్తుతం ఆయన వయసురీత్యా సినిమాలకు దూరమయ్యారు. కనీసం బయట కాలు కూడా పెట్టకుండ ఇంటికే పరిమితం అయ్యారు. చదవండి: చరణ్ కోసం 264 కిమీ నడిచిన ఫ్యాన్, అతడిని కలిసి మురిసిపోయిన మెగా హీరో ఫ్యామిలీ ఫంక్షన్స్ అయితే తప్పా ఆయన మీడియా ముందుకు రారు. ఈ క్రమంలో మరో రెండు రోజుల్లో కృష్ణ బర్త్‌డే రానుంది. మే 31న ఆయన పుట్టిన రోజు సందర్భంగా కృష్ణ పెద్ద కూతురు మంజుల ఘట్టమనేని సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. కాగా మంజులకు సొంతంగా ఓ యూట్యూబ్ చానల్ ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కృష్ణ సినీ కెరీర్, వ్యక్తిగత విషయాలపై స్పెషల్ ఇంటర్య్వూ విత్ మై సూపర్‌స్టార్ నాన్న పేరుతో తండ్రిని ఇంటర్య్వూ చేసింది. తాజాగా ఈ స్పెషల్ ఇంటర్య్వూకు సంబంధించిన ప్రోమోను ఆమె రిలీజ్ చేసింది. ఇందులో మంజుల.. కృష్ణ హీరో ఎలా అయ్యారు, ఆయన సినీరంగం ప్రవేశం ఎలా జరిగింది, మహేశ్‌ను సినిమాల్లోకి ఎలా తీసుకువచ్చారు వంటి ఆసక్తికర విషయాలపై తండ్రితో చర్చించింది. చదవండి: ఓటీటీకి ‘సర్కారు వారి పాట’, అంతకు ముందే స్ట్రీమింగ్? ఈ క్రమంలో మహేశ్‌ను చిన్నప్పడే సూపర్ స్టార్ చేశారు.. ఇది ప్లాన్డ్గా జరిగిందా? అనుకోకుండా జరిగిపోయిందా? అని అడగ్గా.. ఇది అనుకొకుండ జరిగిందని ఆయన సమాధానం ఇచ్చారు. ‘ఓ రోజు షూటింగ్ చూస్తానని స్టూడియోకు వచ్చాడు. షూటింగ్ జరుగుతుంటే దూరం నుంచి చూస్తు అలా నిలబడ్డాడు. దగ్గరి పిలిచి ఒకసారి యాక్ట్ చేయమని అడిగితే లేదు నేను చేయను చేయను అంటూ స్టూడియో అంతా పరిగెత్తించాడు’ అంటూ కృష్ణ చెబుతూ మురిసిపోయారు. అనంతరం మహేశ్‌తో కలిసి పోకిరి,దూకుడు చూశానని, అవి రెండు సినిమాలు లాండ్ మార్క్ అయ్యాయని’ కృష్ణ అన్నారు. ఇలా తనయుడు మహేశ్ బాబు గురించి, తన గురించిన ఎన్నో ఆసక్తికర విషయాలపై చర్చించిన కృష్ణ పూర్తి ఇంటర్య్వూ చూడాలంటే మే 31 వరకు ఆగాల్సిందే. -
రీఎంట్రీ ఇస్తున్న మహేశ్ సోదరి.. ఫస్ట్ లుక్ అవుట్
సూపర్ స్టార్ మహేశ్‌బాబు సోదరి మంజుల ఘట్టమనేని.. సిల్కర్ స్క్రీన్‌పై మరోసారి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. సుమంత్, నైనా గంగూలీ జంటగా తెరకెక్కుతోన్న మళ్లీ మొదలైంది చిత్రం ద్వారా రీఎంట్రీకి సిద్దమయ్యారు. ఇటీవలె విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మంజుల 'డాక్టర్ మిత్ర'-థెరపిస్ట్ పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మూవీ విడుదల తేదీపై ఎగ్జయిటెడ్‌గా ఉన్నట్లు తెలిపారు. ఈ సినిమాలో సుహాసిని మణిరత్నం, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా 1998లో సమ్మర్ ఇన్ బెత్తెహామ్ సినిమాతో తొలిసారి వెండితెరకు కనిపించిన మంజుల ఆ తర్వాత నాని సినిమాతో నిర్మాతగా మారింది. పోకిరి, కావ్యాస్ డైరీ, యే మాయ చేశావే చిత్రాలను నిర్మించి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్‌గా గుర్తింపు పొందింది ఆ తర్వాత 2018లో మనసుకు నచ్చింది సినిమాకు దర్శకత్వం వహించింది. చివరగా 2013లో సేవకుడు చిత్రంలో కనిపించారు. మళ్లీ దాదాపు ఎనిమిదేళ్ల అనంతరంనటిగా వెండితెరపై కనిపించనున్నారు. It was fun and exciting to act in the movie "malli modalaindi" as Dr.Mitra - the therapist. Eagerly looking forward to the movie release.@tgkeerthikumar@iSumanth@NainaGtweets@tej_uppalapati#MalliModalaindi #manjulaghattamaneni pic.twitter.com/L7NluBokIv — Manjula Ghattamaneni (@ManjulaOfficial) August 8, 2021 -
హ్యాపీ బర్త్‌డే నాన్నా: మహేష్ బాబు
సూపర్ స్టార్ కృష్ణ నేడు(సోమవారం)78వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన తనయుడు, హీరో మహేష్ బాబు ట్విటర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 'హ్యాపీ బర్త్‌డే నాన్న. నేను ముందుకెళ్లడానికి ఎప్పుడూ నాకు అత్యుత్తమైన మార్గాన్ని చూపించినందుకు ధన్యవాదాలు. మీరు అనుకునేదాని కంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తుంటాను నాన్న' అంటూ బర్త్‌డే విషెస్‌ను తెలిపారు. ఈ సందర్భంగా తండ్రితో కలిసి ఉన్న ఓ ఫోటోను షేర్ చేశారు. Happy birthday Nanna.. Thank you for always showing me the best way forward.. Love you more than you'll ever know ♥️♥️♥️ pic.twitter.com/Mm3J0OA8by — Mahesh Babu (@urstrulyMahesh) May 30, 2021 కృష్ణ బర్త్‌డే సందర్భంగా కూతురు మంజుల ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ 'హ్యాపీ బర్త్‌డే నాన్న. నా హృదయంలో మీకు చాలా గొప్ప స్థానం ఉంది. నా జీవితంపై మీ ప్రభావం చాలా ఉంది. మీరే నా హీరో, నా రోల్ మోడల్. లవ్ యూ సో మచ్' అంటూ ట్వీట్ చేశారు. Happy birthday day nanna. You have the biggest heart! You are my hero and the greatest influence in my life. You are my role model. I love you soooooo much. pic.twitter.com/WuGTmDVM4B — Manjula Ghattamaneni (@ManjulaOfficial) May 31, 2021 ఇక కృష్ణ అల్లుడు, హీరో సుధీర్‌బాబు కూడా కృష్ణపై తన అభిమానాన్ని చాటుకున్నారు. 'పుట్టినరోజు శుభాకాంక్షలు మావయ్య. సూపర్ హ్యూమన్, సూపర్ స్టార్‌గా రెండు వెర్షన్లలో నేను మీకు పెద్ద అభిమానిని' అంటూ సుధీర్‌బాబు ఎంతో ప్రేమతో విషెస్ తెలిపారు. Happy Birthday Mavayya ❤️ Biggest fan of your both versions, the super human being and the Superstar 😊 #HBDLegendarySSKgaru pic.twitter.com/Q205qy61lp — Sudheer Babu (@isudheerbabu) May 30, 2021 (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మహేష్‌బాబుకు ఈరోజు చాలా స్పెషల్.. ఎందుకో తెలుసా?
సూపర్ స్టార్ మహేష్‌బాబుకు ఫ్యామెలీ మెన్ అన్న సంగతి తెలిసిందే. ఏ మాత్రం సమయం దొరికినా కుటుంబంతో గడపడానికే ప్రయత్నిస్తారు. ప్రస్తుతం ఆయన పరుశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారువారిపాట సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా తొలిసారిగా కీర్తి సురేష్ నటిస్తుంది. కరోనా కారణంగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది. ఇక ఏప్రిల్ 20 మహేష్‌బాబుకు చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే మహేష్ తల్లి ఇందిరా దేవీ పుట్టినరోజు నేడు( మంగళవారం). దీంతో తల్లితో కలిసి దిగిన ఫోటోను మహేష్‌బాబు షేర్ చేస్తూ బర్త్‌డే విషెస్ తెలిపారు. ఇక మహేష్ సోదరి మంజులా సైతం తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 'తన నవ్వులానే తన వ్యక్తిత్వం కూడా ఎంతో స్వచ్చమైనది. మా జీవితంలోని ప్రతీ రోజును గొప్పగా తీర్చదిద్దావు. మన కుటుంబానికి నువ్వే వెన్నముక..లవ్ యూ అమ్మ..హ్యపీ బర్త్ డే అమ్మ' అంటూ మంజులా ట్వీట్ చేసింది. April 20!! A very special day of the most special person in my life... Happy birthday Amma❤️❤️❤️ pic.twitter.com/OuxWEN4q7x — Mahesh Babu (@urstrulyMahesh) April 20, 2020 The charmer that she is,she always wears a smile as beautiful as her personality.💛 She brightens up our day,has always touched our hearts with kindness,goodness,https://t.co/en89wteV3w the woman of the family,she truly is the backbone of it all,we love you.Happy Birthday Amma♥️ pic.twitter.com/nlvBN69p6S — Manjula Ghattamaneni (@ManjulaOfficial) April 20, 2020 చదవండి : హీరోయిన్ అంజలా జవేరీ భర్త 'విలన్' అని మీకు తెలుసా? ఈ జీవితానికి ఇంకేం కావాలి: మంగ్లీ భావోద్వేగం -
మహేశ్ అన్నట్లు ఇవ్వకపోతే లావైపోతాం
ఏదైనా కొత్త ప్రయత్నం మొదలుపెట్టాలంటే ఓ మంచిరోజు చూడాలి. ‘పుట్టినరోజుకి మించిన మంచి రోజు లేదు’ అంటున్నారు మంజుల. దానికి కారణం కూడా చెప్పారు. ఆ విషయంతో పాటు మరెన్నో విశేషాలు పంచుకున్నారు. నేడు తన బర్త్‌డే సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు మంజుల. ► పుట్టినరోజు విశేషాలు చెబుతారా? ఎవరికైనా పుట్టినరోజు అనేది చాలా చాలా మంచిరోజు. ఆ రోజు స్టార్స్ అన్నీ అందరికీ అలైన్మెంట్ (అమరిక)లో ఉన్నట్లుగా ఉంటాయి. అందుకే ఆ రోజు ఏం చేసినా అది సజావుగా జరుగుతుందని నమ్ముతాను. పుట్టినరోజు సందర్భంగా ముఖ్యంగా నేను రెండు నిర్ణయాలు తీసుకున్నాను. ఒకటేంటే.. నా యూ ట్యూబ్ చానల్లో ‘వెయిట్ లాస్’కి సంబంధించిన సిరీస్ చేయాలనుకుంటున్నాను. ఇంకోటి హెల్త్ ప్రొడెక్ట్స్. మనకొచ్చే ఆరోగ్య సమస్యలన్నీ చాలావరకు మనం వాడే నూనెలతోనే వస్తాయి. అందుకే ఆర్గానిక్ ఉత్పత్తులతో కొబ్బరినూనె, శనగనూనె, ఆవనూనె, నెయ్యి.. వంటివన్నీ తయారు చేస్తున్నాం. మా ఉత్పత్తులు 100శాతం యుఎస్‌డిఏ సర్టిఫికెట్తో మార్కెట్లోకి వస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించిన మంచి విషయాలు మనకు తెలిసినప్పుడు అందరితోనూ పంచుకోవాలి. అవన్నీ మన దగ్గరే పెట్టుకుంటే లావైపోతాం. ‘శ్రీమంతుడు’లో మహేశ్ చెప్పాడుగా. నేను ఒకప్పుడు చాలా బరువు పెరిగాను. మళ్లీ మామూలుగా ఎలా అయ్యానో కూడా యూ ట్యూబ్‌లో షేర్ చేసుకున్నాను. ► పుట్టినరోజున స్టార్స్ అన్నీ అనుకూలంగా ఉంటాయనే విషయం ఎలా తెలిసింది? భారతీయ జాతక చక్రం లాగానే ‘కబాలా’ అని ఒకటుంది. చైనీస్, ఫిలిప్పీన్స్ వాళ్లు కబాలాను నమ్ముతారంటారు. ‘సన్ పీరియడ్’ అని ఒకటుంటుందని వాళ్లు చెబుతారు. మనం పుట్టినరోజు నుంచి 52 రోజులపాటు ఆ శక్తి ఉంటుందట. ఆ 52 రోజుల సమయంలో మనం ఏం పట్టుకున్నా బంగారం అవుతుందంటారు. అలాగని మనం కష్టపడకుండా కూర్చుంటే కుదరదు. మన కృషికి స్టార్ పవర్ తోడవుతుంది. ► మీ గత పుట్టినరోజులకు ఇది పాటించి, చేసినవి మీకు కలిసొచ్చాయా? నిజానికి ఈ విషయం నాకు ఏడాది క్రితమే తెలిసింది. నా గత బర్త్‌డేకి వెబ్సైట్, యూట్యూబ్ చానల్, ఆర్గానిక్ ఫుడ్స్.. ఇవన్నీ చేయాలని నిర్ణయం తీసుకున్నాను. అవన్నీ ఆచరణలో పెట్టగలిగాను. ► మీ నాన్నగారికోసం ప్రత్యేకమైన డైట్ ఏమైనా చెప్పారా? నాన్నగారే నాకు చాలా విషయాలు చెప్పారు. ఆయన ఇంట్లో వండిన ఆహారమే తీసుకుంటారు. మొన్నీ మధ్య నాకు కొంచెం ఎలర్జీ అయితే ఆయనతో చెప్పాను. ‘అమ్మూ.. పసుపునీళ్లతో ఆవిరి పట్టు’ అన్నారు. రోజూ పదకొండు గంటలకు ఫోన్ చేసి, ‘ఈరోజు ఆవిరి పట్టావా, లేదా’ అని అడిగేవారు. నాన్న చెప్పిన చిట్కా వర్కవుట్ అయింది. ► ఇప్పుడు కృష్ణగారి ఆరోగ్యం ఎలా ఉంది? ఆ మధ్య కొంచెం డల్‌గా కనబడ్డారు.. ఆయన చాలా బాగున్నారు. ఒక్కోసారి ఎవరికైనా డల్‌గా ఉంటుంది. అది సహజం. అయితే ఇదివరకటిలా నాన్న స్పీడ్‌గా నడవటం లేదు. అది అనారోగ్యం వల్ల కాదు. జాగ్రత్తగా ఉంటున్నారు.. అంతే. మిగతాదంతా మామూలే. రోజూ వాక్ చేస్తారు, యోగా చేస్తారు. నాన్న ఫుల్ ఎనర్జీగా ఉన్నారు. ► విజయనిర్మలగారు చనిపోయాక ఆయన జీవితంలో ఏదైనా మార్పు వచ్చిందా? ఆ బాధ నుంచి బయటపడగలిగారా? నాన్న కచ్చితంగా ఆవిడ్ని మిస్సవుతున్నారు. వాళ్లిద్దరిదీ 50 ఏళ్ల అనుబంధం. ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ చాలా స్ట్రాంగ్. కానీ ఆవిడ పక్కన లేకపోయినా నాన్నగారు ఆ బాధ నుంచి బయటకు రాగలిగారు. బేసిక్‌గా నాన్న కూడా చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ. ► నిజానికి విజయనిర్మలగారు దూరం అయ్యాక కృష్ణగారు మీలో ఎవరి దగ్గరికన్నా వస్తారేమో అనుకున్నాం? ఎప్పటినుంచో ఉంటున్న ఇంట్లో ఆయనకంటూ ఒక సెటప్ తయారు చేసుకున్నారు. ఆ ఇంట్లో అందరూ ఉన్నారు. మా ఇంటికి, నాన్నగారింటికి దూరం రెండు నిమిషాలే. ఓ రకంగా చెప్పాలంటే మేం కలిసి ఉంటున్నట్లే. అలాగే రోజూ మనవళ్లు, మనవరాళ్లను కలుస్తారు. -
దుర్గమ్మ సన్నిధిలో ఎమ్మెల్యే రోజా
సాక్షి, విజయవాడ : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నట్టుగా ఆమె తెలిపారు. మరోవైపు తెలగు రాష్ట్రాల్లో మహిళలు వరలక్ష్మీ వ్రతం పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. లక్ష్మీదేవి నట్టింట్లోకి నడిచిరావాలని, బాధలు, కష్టాలు తొలగిపోవాలని వరలక్ష్మిని కొలుస్తున్నారు. కరోనా నేపథ్యంలో చాలా మంది ఇళ్లలోనే పూజలు చేస్తున్నారు. నిర్మాత, నటి మంజుల ఘట్టమనేని కూడా ఇంట్లోనే వరలక్ష్మీ వత్రం పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె ట్విటర్లో షేర్ చేశారు. లక్ష్మీ దేవి అందరి జీవితాల్లోకి ఆనందం, విజయం, ఆరోగ్యం, సంపద తీసుకురావాలని ఆకాంక్షించారు. హీరోయిన్ ప్రణీత కూడా అందరికి వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు తెలియజేశారు. -
‘గొప్ప యాక్టర్ అవ్వాలని ఎన్నో కలలు కన్నా’
సూపర్‌స్టార్ కృష్ణ కూతురు, మహేష్‌బాబు సోదరిగా సుపరిచితురాలైన ఘట్టమనేని మంజుల ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించారు. ఈ వీడియోల ద్వారా తనలోని మరో కోణాన్ని ఘట్టమనేని అభిమానులకు పరిచయం చేశారు మంజులా. గతంలో తను అనుభవించిన మనసిక వేదన గురించి, డిప్రెషన్‌తో పోరాడిన విషయాల గురించి తన ఛానల్లో మొదటి వీడియోగా పోస్ట్ చేశారు. అయిదు నిమిషాల నిడివి గల ఈ వీడియోలో పదేళ్ల పాటు తను మానసిక ఒత్తిడికి గురైనట్లు, ఆరోగ్య సమస్యల నుంచి ఎలా బయట పడిందో వివరించారు. ఆరోగ్యకరమైన జీవనశైలి అవలంబించడం, సుదీర్ఘ ధ్యానం ద్వారా ఈ సమస్య నుంచి గట్టేక్కినట్లు మంజుల తెలిపారు. (నేను భయపడే ఏకైక వ్యక్తి నువ్వు: అనిల్ కపూర్) ‘ఇప్పటి వరకు మీకు సూపర్ స్టార్ కూతురుగా, మహేష్‌బాబు అక్కగా, నేషనల్ అవార్డు విన్నర్‌గా, బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ ‘పోకిరి’ ప్రోడ్యూసర్‌గా తెలుసు. ఇవన్నీ నాకు ఆనందాన్ని ఇచ్చి, మీకు నన్ను దగ్గరగా చేశాయి. నేను నా జీవితంలో 30 సంవత్సరాలు వ్యక్తిగత అభివృద్ధికి, 20 సంవత్సరాలు ధ్యాన సాధనకు అంకితం చేశాను. 10 వేల గంటల కంటే ఎక్కువగా యోగా ప్రాక్టిస్ చేశాను. నాన్న గారిని చూస్తూ పెరగడం వల్ల ఆయనలా గొప్ప యాక్టర్ అవ్వాలనుకున్నాను. ఆయనే నాకు ఆదర్శం. కృష్ణా గారి అమ్మాయి హీరోలతో నటించడం, రొమాన్స్ చేయడం నాన్న అభిమానులకు నచ్చలేదు. గొప్ప యాక్టర్ అవ్వాలని ఎన్నో కలలు కన్నాను. ఎంతో ప్రయత్నించాను. కానీ అస్సలు కుదరలేదు. చాలా బాధపడ్డాను. దాని నుంచి ఎలా బయటపడాలో అర్థం కాలేదు. (26 ఏళ్ల వయసులో ఆమెను ఇష్టపడ్డాను) ఈ ఒత్తిడి నుంచి బయటకు రావాలని ఓ రోజు నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచి నాకు తెలియకుండానే గాఢమైన ధ్యానంలోకి వెళ్లిపోయాను. అప్పుడు నా ఆలోచనలు, మనసు, నమ్మకాలు నీకు పరిచయమయ్యాయి. ఎవరో చెప్పారని, ఎవరో ఆపారని కాదు. ఈ కమర్షియల్ సినిమాలకు కరెక్టు కాదు. నాకే అర్థమైంది. నిజమైన సంతోషం మనలోనే ఉంది అని. అప్పటి నుంచి ప్రతిక్షణం ప్రేమతో ఉండాలని నిర్ణయించుకున్నాను. ఈ అనుభవం నా జీవితాన్ని పూర్తిగా మార్చింది. ఈ జర్నీలో ‘షో’ సినిమా ద్వారా నా యాక్టింగ్ కలను నిజం చేసుకోగలిగాను. నన్ను నేను మార్చుకున్నాను. ప్రశాంత వాతావరం ఏర్పరుచుకున్నాను. నాన్నతో, అమ్మతో కబుర్లు చెప్పడం చేస్తున్నాను. నా కుటుంబంతో, స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతున్నాను. అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇక నుంచి తన యూట్యూబ్ ఛానల్లో మరిని ఆసక్తికర విషయాల గురించి వివరించనున్నట్లు మంజుల పేర్కొన్నారు.